Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ 3 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ సీజన్‌లో అతడి సిక్సర్ల సంఖ్య 40కి చేరుకుంది.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మొదటి స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ 2024 సీజన్‌లో ఓవరాల్‌గా కొట్టిన సిక్సర్ల సంఖ్య 42. అయితే ఈ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌లు పూర్తవ్వలేదు. దీంతో మిగిలిన మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి వైభవ్ ఇంకా ఎన్ని సిక్సర్లు కొడుతాడో చూడాలి.
ఇప్పటికైతే వైభవ్ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (2025 సీజన్‌లో 39 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (2016 సీజన్‌లో 38 సిక్సర్లు, 2024 సీజన్‌లో 38 సిక్సర్లు), సూర్యకుమార్ (2025 సీజన్‌లో 38 సిక్సర్లు), రిషబ్ పంత్ (2024 సీజన్‌లో 37 సిక్సర్లు) ఉన్నారు.
👉ఒక ఐపీఎల్ సీజన్‌లో తొలి పవర్ ప్లే (1-6 ఓవర్లు) అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో వైభవ్ సూర్యవంశీ 30 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ ( 29 సిక్సర్లు, 2024 సీజన్), అభిషేక్ శర్మ (27 సిక్సర్లు, 2026 సీజన్*), జయసూర్య (22 సిక్సర్లు, 2008 సీజన్), ట్రావిస్ హెడ్ (22 సిక్సర్లు, 2024 సీజన్), జైస్వాల్ (22 సిక్సర్లు, 2025 సీజన్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
👉 ఐపీఎల్ సీజన్‌లో ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ప్రారంభించడం వైభవ్ సూర్యవంశీకి ఇది ఏడోసారి. ఈ సీజన్‌లో ఇది నాలుగోసారి కావడం విశేషం.
👉 ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్‌రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.
MAKING IT A HABIT 🤩
🎥 Just Vaibhav Sooryavanshi with yet another high-intent knock 🙌
Updates ▶️ https://t.co/t7CEEL9Bzp#TATAIPL | #KhelBindaas | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/LYEfiG4wnZ— IndianPremierLeague (@IPL) May 9, 2026


