హమ్మయ్య.. ఇన్నాళ్లకు న్యాయం చేశాడు! | Most Expensive Player Cameron Green Shines Half Century Vs Gujarat | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. ఇన్నాళ్లకు న్యాయం చేశాడు!

Apr 17 2026 9:35 PM | Updated on Apr 17 2026 9:50 PM

Most Expensive Player Cameron Green Shines Half Century Vs Gujarat

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఆట‌గాడు కామెరున్ గ్రీన్ ఎట్ట‌కేల‌కు మెరిశాడు. సీజ‌న్‌లో కామెరున్ గ్రీన్ తొలి హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అర్థ‌సెంచ‌రీ సాధించిన గ్రీన్ మొత్తంగా 55 బంతుల్లో 79 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు ఉన్నాయి. 

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. గ్రీన్‌ దంచికొడుతున్న సమయంలో కేకేఆర్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఇన్నింగ్స్‌ ఆఖరి వరకు బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ చివరి రెండు ఓవర్లలో తనకే స్ట్రైక్ వచ్చినప్పటికీ పరుగులు చేయడంలో విఫల మయ్యాడు.

ఇక గ‌తేడాది జ‌రిగిన వేలంలో గ్రీన్‌ను కేకేఆర్ రూ. 25 కోట్ల రికార్డు ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. అధిక ధ‌ర‌కు అమ్ముడైన గ్రీన్ ఈ సీజ‌న్‌లో మాత్రం ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ ఆడ‌లేదు. దీంతో అత‌డిపై విమ‌ర్శ‌లు పెరిగిపోయాయి. 23 కోట్లు దండ‌గంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో గ్రీన్‌ను ఏకిపారేశారు. 

అభిమానుల మాట‌లు గ్రీన్ మ‌నుసుకు తగిలాయేమో కానీ గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో చివ‌రిదాకా నిల‌బ‌డి కేకేఆర్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఈ సీజ‌న్‌లో గ్రీన్ ఐదు మ్యాచ్‌ల్లో వ‌రుసగా 18, 2, 4, 32, 0 ప‌రుగులు సాధించాడు. 

 

Advertisement
 
Advertisement
Advertisement