Amaravati
-
హనుమాన్ జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి: హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శక్తిమంతుడు, సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీరాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.శక్తిమంతుడు, సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీ రాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.#HanumanJayanti— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025 -
స్కూల్ సిలబస్‌లో యోగా
సాక్షి, అమరావతి: యోగా ప్రాముఖ్యత తెలిపేలా స్కూల్ సిలబస్‌లో ఒక పాఠం పెడతామని సీఎం చంద్రబాబు చెప్పారు. స్కూళ్లు మొదలవగానే రోజూ గంటసేపు విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు. యోగాపై ప్రజల్లో చైతన్యం తెచ్చిన వలంటీర్లకు జూన్ 21న ప్రధాని సభలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. బుధవారం నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర–2025 నిర్వహిస్తామన్నారు. -
వృథా లైన్లతో ‘సంతోషం’!
సాక్షి, అమరావతి: విద్యుత్ శాఖలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది. అవసరమైన పనుల కాంట్రాక్టులను అయిన వారికి ఇచ్చి కమీషన్లు దండుకునే స్థాయి నుంచి కమిషన్ల కోసమే అవసరమే లేని పనులు చేసే స్థాయికి దోపిడీ చేరింది. ఇప్పటికే డైరెక్టర్ల నియామకం, ఉద్యోగుల బదిలీల్లో భారీగా దండుకున్న కూటమి నేతలు తమ కమీషన్లతో పాటు విద్యుత్ శాఖలో ఓ అధికారిని ‘సంతోష’పెట్టడానికి అక్కర్లేని పనులకు తెరతీశారు. పదవీ కాలం ముగిసినా, మరి కొన్నాళ్లు అదే పదవిలో కొనసాగడానికి ఓ ఉన్నతాధికారికి కూటమి ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. అందుకు ప్రతిఫలంగా పరస్పరం లబ్ధి పొందేందుకు ఇలాంటి వృధా పనులకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రూ.342.96 కోట్ల వ్యయంతో 33 కేవీ విద్యుత్ లైన్ల పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. టెండర్ దరఖాస్తు దాఖలుకు శుక్రవారంతో గడువు ముగిసింది. ఈ నెల 20న టెండర్లు తెరవనున్నారు. అయితే ఈ టెండర్ల వెనుక భారీ కుంభకోణానికి కూటమి ప్రభుత్వం, ఏపీఎస్పీడీసీఎల్లోని ఉన్నతాధికారితో కలిసి తెరతీసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.కడప డివిజన్లో 28 కిలోమీటర్లు, రాయచోటి డివిజన్లో 25 కిలోమీటర్లు, ప్రొద్దుటూరు డివిజన్లో 52.5 కిలోమీటర్లు చొప్పున మొత్తం 105.5 కిలోమీటర్లు 9 టవర్లతో కలిపి 157 చదరపు మీటర్ల మేర అల్యూమినియం కండక్టర్‌తో 33 కేవీ లైన్‌ను బలోపేతం చేయడం ఈ పని ఉద్దేశం. ఈ రకమైన ప్రాజెక్టులను 2019–24 మధ్య అనంతపురం, ప్రొద్దుటూరు, కడపలలో మెస్సర్స్ సన్ షైన్ ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ద్వారా కేవలం రూ.100 కోట్లతోనే పూర్తి చేశారు. అలాంటిది ఏపీఎస్పీడీసీఎల్ ఇప్పుడు రూ.342.96 కోట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రుణంగా తీసుకుని మరీ చేస్తామంటోంది. ఈ భారం అంతిమంగా రాష్ట్ర ప్రజలపైనే విద్యుత్ బిల్లుల రూపంలో పడుతుంది. ఇప్పటికే రూ.30 వేల కోట్ల అప్పులు చేసిన ఏపీఎస్పీడీఎల్కు ఇది అదనపు భారం కానుంది. అసలు ఆ అవసరమే లేదు.. ప్రస్తుతం ఉన్న లైన్ల స్థానంలోనే కొత్త లైన్లు వేయనున్నట్లు డిస్కం ప్రతిపాదనలో స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ లైన్లలో కొత్తవి వేయాల్సిన అవసరమే ప్రస్తుతం లేదని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత విద్యుత్ లోడ్లను తీర్చడానికి తగినంత సామర్ధ్యం గల 33 కేవీ లైన్లు ఇప్పటికే ప్రతిపాదిత ప్రాంతాల్లో ఉన్నాయని చెబుతున్నారు. పైగా ప్రస్తుత ఫీడర్లే తక్కువ లోడ్‌లో నడుస్తున్నాయని, మరింత డిమాండ్ పెరిగినా కూడా అవి ఆ లోడ్‌ను తట్టుకోగలవని స్పష్టం చేస్తున్నారు. ఇదే అంచనా వ్యయంతో గతంలో ఇదే డిస్కం టెండర్లు పిలవగా గత ప్రభుత్వం ఆ టెండర్‌ను రద్దు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అంచనా వ్యయం కూడా లేకుండా నేరుగా టెండర్లు పిలిచేశారు. ఏపీఎస్పీడీసీఎల్కు చెందిన ఓ ఉన్నతాధికారికి చెందిన సంస్థకు లబ్ధి చేకూర్చడం కోసం, తద్వారా కొందరు నేతలకు కమిషన్లు దక్కడం కోసం ఈ అనవసర వృధా టెండర్లు పిలిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రూ.343 కోట్లను పట్టణాల్లో అవసరమైన చోట 33/11కేవీ సబ్స్టేషన్ల నిర్మాణానికి, ఇప్పటికే ఓవర్ లోడ్‌ను మోస్తున్న 11 కేవీ ఫీడర్లను విభజించడానికి ఖర్చు చేసి ఉంటే కనీసం విద్యుత్ కోతలైనా తప్పి నాణ్యమైన విద్యుత్ అందడానికి అవకాశం ఉండేదని నిపుణులు చెబుతున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ ప్రతిపాదించిన పనులు» 3,957 ఎం 6 టైపు టవర్లు. ఒక్కోదానికి రూ.4.5 లక్షల చొప్పున మొత్తం రూ.177.5 కోట్లు » 1,460 ఎం 9 టవర్లు. ఒక్కోదానికి రూ.5.06 లక్షల చొప్పున మొత్తం రూ.74 కోట్లు » 12.5 మీటర్ల స్పన్ స్తంభాలు 119. ఒక్కోదానికి రూ.26 వేలు చొప్పున మొత్తం రూ.32 లక్షలు » 11 మీటర్ల స్పన్ స్తంభాలు 1782. ఒక్కోదానికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.2.7 కోట్లు » 295.71 కిలోమీటర్ల మేర 100 చదరపు మిల్లీ మీటర్ల ఏఏఏ కండక్టర్. కిలోమీటర్‌కు ఖర్చు రూ.88 వేల చొప్పున మొత్తం రూ.2.61 కోట్లు » 1,475 కిలోమీటర్ల మేర 157 చదరపు మిల్లీ మీటర్ల ఏఏఏ కండక్టర్. కిలోమీటర్‌కు ఖర్చు రూ.1.42 లక్షల చొప్పున మొత్తం రూ.21 కోట్లు. » ఇంటర్ లింకింగ్ లైన్లను టవర్లు లేకుండా తక్కువ ఖర్చుతో పీఎస్సీసీ పోల్స్‌తోనే ఏర్పాటు చేయొచ్చని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. -
సొమ్ము సర్కారుది.. సోకు కాంట్రాక్టరుది..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీకి బరితెగించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని గండికోట పర్యాటక ప్రాంతంలో 3.94 ఎకరాల్లో రూ.5.04 కోట్లతో ‘టెంట్ సిటీ’ నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా.. కాంట్రాక్టు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించింది. అయితే, టీడీపీ కూటమి పెద్దలకు చెందిన అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధిచేకూర్చేందుకు టెండర్ పద్ధతినే మార్చేసింది. పైకి నీతి ఆయోగ్ నమూనాను అనుసరిస్తున్నామనే రీతిలో బిల్డప్ ఇస్తూ లోపాయికారిగా నచ్చిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో సదరు కాంట్రాక్టరు పైసా పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణాలు చేసుకుని వచ్చిన ఆదాయాన్ని అనుభవించేలా నిబంధనలుండటం కొసమెరుపు!ఎక్కడాలేని రీతిలో టెండర్..ఏపీటీడీసీ టెంట్ సిటీ నిర్మాణానికి పిలిచిన టెండర్లను పరిశీలిస్తే లోగుట్టు ఇట్టే అర్థమవుతుంది. ఎక్కడైనా అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం భూ కేటాయింపులు చేసి ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులతో నిర్మాణాలు చేస్తే వాటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద గుర్తిస్తారు. ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల్లో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో నిర్మాణాలు చేయిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు, డిజైన్లకు లోబడి నిర్మాణాలుంటే కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లిస్తుంది. మరో పద్ధతిలో.. అప్పటికే ఉన్న ఆస్తుల నిర్వహణకు లీజు ప్రాతిపదికపైన ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కిందకి వస్తుంది. కానీ, టెంట్ సిటీకి కోసం ఏపీటీడీసీ పిలిచిన టెండర్లలో మాత్రం భూమి ప్రభుత్వానిది.. నిర్మాణ పెట్టుబడీ ప్రభుత్వానిదే.. కట్టేది కాంట్రాక్టరు. పైగా.. 33 ఏళ్ల పాటు దీనిని అనుభవించేది కూడా సదరు కాంట్రాక్టరే! దేశంలో ఎక్కడాలేని రీతిలో ఏపీటీడీసీ తీసుకొచ్చిన కొత్త తరహా టెండర్ ఇది! స్థానిక టీడీపీ కూటమి ప్రజాప్రతినిధికి చెందిన హోటల్ రంగంలోని వ్యక్తులకు ఈ టెంట్ సిటీని కట్టబెట్టేందుకు అనుభవంతో పనిలేకుండా తెలివిగా నిబంధనలు రూపొందించారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, ఈ టెంట్ సిటీ నిర్వహణ ప్రారంభమైన 11 ఏళ్ల తర్వాతే లీజు రెంట్ పెంపు నిర్ణయం కొసమెరుపు. -
ఉపాధ్యాయుల బదిలీలు షురూ
సాక్షి, అమరావతి: రాష్ట్ర పాఠశాల విద్యా శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఆన్లైన్ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి అనంతరం ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. వివిధ విభాగాల టీచర్ల బదిలీ షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు మొత్తం ప్రక్రియను వచ్చే నెల 11వ తేదీ నాటికి పూర్తి చేయాలని విద్యా శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంతకు ముందు 2023 జూన్‌లో టీచర్ల బదిలీలు జరిగాయి. రెండేళ్ల తర్వాత మొదటిసారి ‘టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ –2025’ ప్రకారం ఉపాధ్యాయుల బదిలీలు చేపడుతున్నారు. ఇకపై ఏటా మే నెలలో క్రమం తప్పకుండా ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక పాఠశాలలో ఒక సంవత్సరం 9 నెలలు (మొత్తం 21 నెలలు) సర్వీసు దాటిన ఉపాధ్యాయులంతా ఏటా జరిగే బదిలీలకు అర్హులవుతారు. ఐదు అకడమిక్ సంవత్సరాలు పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు పూర్తయిన మిగతా టీచర్లను ఖచ్చితంగా బదిలీ చేస్తారు. ఒకవేళ వీరిలో ఎవరైనా దరఖాస్తు చేయకుంటే, మొత్తం బదిలీ పక్రియ పూర్తయ్యాక మిగిలిన ఖాళీల్లోకి వీరిని పంపిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.మొత్తం బదిలీల ప్రక్రియ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://cse.ap.gov.in ద్వారానే కొనసాగుతుందని వెల్లడించింది. బదిలీలు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్య పాఠశాలలకు జరుగుతాయి. బదిలీల చట్టం–2025లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఉపాధ్యాయుల ఎన్టైటిల్ పాయింట్లు గుణించి సీనియారిటీ జాబితా తయారు చేస్తారు. వీరిలో ప్రిఫరెన్షియల్ కేటగిరీ కిందకు వచ్చే వారికి తొలి ప్రాధాన్యతతో బదిలీకి అవకాశం కల్పిస్తారు. ప్రస్తుత బదిలీల్లో దరఖాస్తు నుంచి బదిలీ ఆర్డర్ వరకు అన్ని ప్రక్రియలూ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతాయి. ఫిర్యాదులు కూడా ఆన్లైన్ గ్రీవెన్స్ ద్వారానే స్వీకరిస్తారు. కమిషనరేట్ వెబ్సైట్ https://cse.ap.gov.in లో అభ్యర్థి తన లాగిన్‌తో బదిలీ కోరుకునే పాఠశాలల జాబితా ఎంచుకోవాలి. బదిలీ ఉత్తర్వులు పొందిన 3 రోజుల్లోగా ఆయా కమిటీలకు ఫిర్యాదు చేయాలి, వీటిని 15 రోజుల్లో పరిష్కారించాలి. కాగా, ఉపాధ్యాయ బదిలీల నిర్వహణలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు.ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ ఇలా..1. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రధానోపాధ్యాయులకు మే 22 వరకు స్కూల్ అసిస్టెంట్లకు ఈనెల 24 ఎస్జీటీలకు ఈనెల 27వ తేదీ 2. ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాల ప్రకటనప్రధానోపాధ్యాయులకు మే 24స్కూల్ అసిస్టెంట్లకు మే 26, 27 ఎస్జీటీలకు మే 31 3. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణప్రధానోపాధ్యాయులకు మే 25 స్కూల్ అసిస్టెంట్లు మే 28ఎస్జీటీలకు మే 28 నుంచి జూన్ 1 వరకు4. ఫైనల్ సీనియార్టీ జాబితా, ఖాళీల ప్రదర్శనప్రధానోపాధ్యాయులకు మే 27స్కూల్ అసిస్టెంట్లకు మే 31ఎస్జీటీలకు జూన్ 6 5. బదిలీల ఆప్షన్స్హెచ్ఎంలకు మే 28స్కూల్ అసిస్టెంట్లకు జూన్ 1, 2 ఎస్జీటీలకు జూన్ 7–10 6. బదిలీ ఉత్తర్వుల విడుదలహెచ్ఎంలకు మే 30స్కూల్ అసిస్టెంట్లకు జూన్ 4 ఎస్జీటీలకు జూన్ 11 7. పదోన్నతులు» స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ 2 హెచ్ఎంగా మే 30న వెబ్ ఆప్షన్స్, పదోన్నతి పొందిన ఉత్తర్వులు మే 31 విడుదల» ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా జూన్ 6న వెబ్ ఆప్షన్స్, జూన్ 7న పదోన్నతి ఉత్తర్వులు జారీ -
డ్యాన్స్ బేబీ డ్యాన్స్
అద్భుతమా, అసంబద్ధమా? ఏమిటిది! నియంత్రణ లేని కదలికలకు నియమబద్ధమైన కదలికలతో చికిత్సా?! ‘పార్కిన్సన్స్’ డిసీజ్ అంటే నడక అదుపు తప్పటం, చేతులు కదలకపోవటం, కాళ్లు మెదలకపోవటం, తల వణకడం, ఉన్నట్లుండి అదిరి పడటం, నాడీ వ్యవస్థకు, ఇంద్రియాలకు మధ్య సమన్వయం గాడి తప్పటం!! దేహం ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు నృత్యం చెయ్యటం ఎంత దుర్లభం! పైగా దుర్లభమే దుర్భరానికి చికిత్స అవటం ఇంకెంత విడ్డూరం! అయితే ఇది విడ్డూరమేమీ కాదు, ప్రయోగాత్మకంగా నిర్థారణ విషయమే అంటోంది ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డ్యాన్స్ మూవ్మెంట్ థెరపీ’ (ఐ.ఎ.డి.ఎం.టి).పార్కిన్సన్లో ఏ కదలికా లయబద్ధంగా ఉండదు. డాన్స్‌లో లయబద్ధంగా లేని ఒక్క కదలికా ఉండదు. కానీ ఐ.ఎ.డి.ఎం.టి. పార్కిన్సన్స్ వ్యాధిని నయం చేయటానికి, వ్యాధిగ్రస్తుల్ని శక్తిమంతం చేయటానికి భారతీయ నృత్య రీతుల్ని ఒక చికిత్సా విధానంగా ఉపయోగిస్తోంది. విశాలమైన ఒక నిశ్శబ్దపు గది, వెనుక నుంచి మంద్రస్థాయిలో వినిపించే తబలా బీట్ వంటి ఒక సంగీత వాద్యం ఈ చికిత్సలో ముఖ్య భాగంగా ఉంటాయి. స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా వృద్ధులు అంతా కలిసి ఆ గదిలో ఉంటారు. అందరూ కూడా పార్కిన్సన్స్ బాధితులే. మనసును తాకుతున్న నేపథ్య ధ్వనికి అనుగుణంగా వాళ్ల చేతులు మబ్బుల్లా తేలుతాయి. చేతి వేళ్లు మృదువైన హావభావాలు అవుతాయి. పాదాలు లయకు అనుగుణంగా కదులుతాయి. గొప్ప పారవశ్యంతో మదిలోంచి జనించే ఉద్దేశపూర్వకమైన ఆంగికం (అవయవాల కదలిక)తో వారు ఒక మహా విజయాన్ని సాధిస్తారు. పార్కిన్సన్స్లో ప్రమేయం లేని కదలికలు మాత్రమే ఉంటాయి కనుక ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని కదలించటం అన్నది మహా విజయమే.తప్పిన పట్టు తిరిగి వచ్చేస్తోంది‘‘ఇక్కడికి వచ్చిన వారు కొన్ని నెలల క్రితం వరకు కూడా పడిపోతామేమో అనే భయం లేకుండా నడవలేకపోయిన వారే. కానీ వారిని ఈ నృత్య చికిత్స ఎంతగానో మెరుగు పరిచింది’’ అంటారు ఐ.ఎ.డి.ఎం.టి. అధ్యక్షురాలు, ‘డ్రామా థెరపీ ఇండియా’ వ్యవస్థాపకురాలు అన్షుమా క్షేత్రపాల్. పార్కిన్సన్స్లో నాడీ వ్యవస్థ–శరీరావయవాల పరస్పర చర్యల మధ్య సమన్వయం (మోటార్ కంట్రోల్) దెబ్బతింటుంది. మానసికంగానూ పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు పట్టుతప్పుతారు. ఈ స్థితిలో వారికొక ఉనికిని, వ్యక్తీకరణ శక్తిని, మునుపటి ఆనందకరమైన జీవితంలోకి మార్గాన్ని నృత్య చికిత్స ఏర్పరుస్తుందని అన్షుమా చెబుతున్నారు. ఈ సంస్థల శాఖలు ముంబై, పుణే, బెంగళూరులలో ఉన్నాయి. నృత్యం తెచ్చే మార్పేమిటి?పార్కిన్సన్స్ మెదడు క్రియాశీలతను, డోపమైన్ కేంద్రమైన ‘బేసల్ గాంగ్లియా’ను ప్రభావితం చేస్తుంది. దాంతో స్వచ్ఛంద కదలికలు కష్టతరం అవుతాయి. కానీ మెదడు మాత్రం ‘లయ’లకు స్పందిస్తుందని అన్షుమా అంటున్నారు. ‘‘సంగీతాన్ని వింటున్నప్పుడు మెదడులో దెబ్బతినని సర్క్యూట్లు (పార్కిన్సన్స్ వల్ల దెబ్బతిన్నవి కాకుండా) వేర్వేరు నాడీ రహదారుల ద్వారా కదలికలను తెస్తాయి. నాడీ శాస్త్రపరంగా, ఈ నృత్య చికిత్స బలాల్లో ఒకటి రిథమిక్ ఆడిటరీ స్టిమ్యులేషన్ (ఆర్.ఎ.ఎస్.) ఉద్దీపన చెందటం. దీనివల్ల అవయవ సమన్వయం ఏర్పడుతుంది. డోపమైన్, ఎండార్ఫిన్ లు, సెరోటోనిన్ల వంటి న్యూరో ట్రాన్సిమీటర్ హార్మోన్లు పెరుగుతాయి. దాంతో కదలికలు మాత్రమే కాదు, మానసిక స్థితీ మెరుగుపడుతుంది’’ అని ఆమె అంటున్నారు. గర్బా నృత్యంపై తొలి ప్రయోగం గుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’పై 2024లో ప్రయోగాత్మకంగా జరిగిన అధ్యయనంలో పార్కిన్సన్స్ రోగులపై ఈ డ్యాన్స్ చక్కటి ప్రభావం చూపినట్లు వెల్లడైంది. పార్కిన్సన్స్కు చికిత్సగా నృత్య రీతుల్ని ఆశ్రయించటం 2009లో ముంబైలోని ‘పార్కిన్సన్స్ డిసీ జ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ సొసైటీ ’ ప్రయత్నాలతో మొదలైంది.అదే సమయంలో ఆర్జెంటీనాలో టాంగో, సల్సా డ్యాన్సులు పార్కిన్సన్స్కు చికిత్స గా ఉపయోగపడతాయా అన్న దానిపై అధ్యయనం జరుగుతోంది. ఆ స్ఫూర్తితో 2010లో మన దగ్గర శా స్త్రీయ నృత్యాల చికిత్సా తరగతులు వారానికి రెండుసార్లు 3 నెలల పాటు ముంబైలో జరిగాయి. ప్రస్తుతం దేశంలోని అనేక కమ్యూనిటీ సెంటర్లు భరతనాట్యం, గర్బా, కూడియట్టంలతో చికిత్స చేస్తున్నాయి. పార్కిన్సన్స్ లక్షణాలు – కారణాలుప్రధానంగా ఇవి శారీరకమైనవి. వణుకు, బిగదీసుకుపోవటం, కదలికలు నెమ్మదించటం, భంగిమలో అస్థిరత వంటివి కనిపిస్తాయి. క్రమంగా ఆందోళన, కుంగుబాటు మొదలౌతుంది. ఎవ్వరితోనూ కలవలేక, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి అపారమైన దుఃఖం మిగులుతుంది. మెదడులో డోపమైన్ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు సక్రమంగా పని చెయ్యకపోవటం లేదా నశించటం పార్కిన్సన్స్కు ప్రధాన కారణం. మనిషి తను కదలాలనుకున్నట్లు కదలటానికి డోపమైన్ అవసరం. డోపమైన్ లోపించటం వల్ల కదలికలు అస్తవ్యస్తం అవుతాయి. మెదడులో డోపమైన్ ఉత్పత్తి తగ్గటానికి గల కారణాలపై పరిశోధకులింకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఒక కారణం మాత్రం వృద్ధాప్యం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లలో సుమారు ఒక శాతం మందికి పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలున్నాయని అంచనా. డోపమైన్‌ను భర్తీ చేసే మందులు, మెదడు ఉద్దీపన వంటి వైద్య చికిత్సలలో పురోగతి సాధించినప్పటికీ ఫలితాలైతే అనుకున్నంతగా లేవు. రోగులు తమకు తామే వైద్యులుసాధారణ వైద్యంలా ఈ ‘డ్యాన్స్ మూవ్మెంట్ థెరపీ’ ఎవరో సూచించేది కాదు. ఎవరికి వారుగా అనుసరించేది. ఎలా కదలాలన్నదీ ఎవరూ చెప్పరు. కదిలే మార్గాలను ఎవరికి వారే అన్వేషించేలా మాత్రం ప్రోత్సహిస్తారు. నడక లేదా భంగిమను సరిదిద్దుతారు. శ్వాసపై నియంత్రణ కల్పిస్తారు.ఊహాశక్తిని, వ్యక్తీకరణను లయబద్ధం చేస్తారు. చికిత్సలో పాల్గొనే వారిలో కొంతమంది కూర్చుని నృత్యం చేస్తారు. మరికొందరు స్థిరంగా నిలబడతారు. కొందరు మరింత స్వేచ్ఛగా కదులుతారు. మొత్తానికి వాళ్లంతా రోగుల్లా కాకుండా, దేన్నో సృష్టిస్తున్నట్లుగా ఉంటారు. -
తీగ కింద.. అవినీతిపైన
సాక్షి, అమరావతి: ఖజానాకు ధర్మకర్తగా వ్యవహరించాల్సిన వారే ప్రజాధనాన్ని అస్మదీయులకు దోచిపెడుతున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూగర్భ విద్యుత్ (అండర్ గ్రౌండ్ కేబుల్) లైన్ పనుల టెండర్లలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. నిబంధనల్ని తుంగలో తొక్కి కాంట్రాక్టు విలువ కంటే 8.98 శాతం అధిక ధర కోట్ చేసిన సంస్థకు రూ.1,082.44 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. 8.99 శాతం అధిక ధర కోట్ చేసిన మరో సంస్థకు రూ.390.06 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఈ రెండు టెండర్లలో సీఎం చంద్రబాబు సన్నిహితులకు రూ.114.68 కోట్లు దోచిపెడుతున్నారు. టెండర్ల వివరాలివీ రాజధాని ప్రాంతంలో ఎన్–10 రహదారి నుంచి ఎన్–13–ఈ–11 రహదారుల జంక్షన్ వరకూ 220 కేవీ ఎక్స్ట్రా హైవోల్టేజీ (ఈహెచ్‌వీ) లైన్‌ను అండర్ గ్రౌండ్(భూగర్భంలో)లో వేసేందుకు సంబంధించిన మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఒక ప్యాకేజీ కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు రాజధానిలో ఏపీ ట్రాన్స్‌కో 18 కి.మీ. పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ (డైరెక్ట్ కరెంట్) లైన్స్‌లో మిగిలిన పనులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 20 కి.మీ. పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ లైన్స్‌లో మిగిలిన పనుల పూర్తికి రూ.283.57 కోట్ల అంచనా వ్యయంతో మరో ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 220 కేవీ ఈహెచ్‌వీ అండర్ గ్రౌండ్ లైన్లో పనుల పూర్తికి పిలిచిన టెండర్లలో కాంట్రాక్టు విలువ కంటే 8.98 శాతం అధిక ధరకు అంటే రూ.1,082.44 కోట్లకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ ఎల్–1గా నిలిచింది. ఏపీ ట్రాన్స్‌కో, పీజీసీఐఎల్ 400 కేవీ డీసీ లైన్స్‌లో మిగిలిన పనుల పూర్తికి పిలిచిన టెండర్లోనూ కాంట్రాక్టు విలువ కంటే 8.99 శాతం అధిక ధరకు కోట్ చేసిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్(జేవీ) ఎల్–1గా నిలిచింది. జీవో 133 ప్రకారం ఈ రెండు టెండర్లు రద్దు చేయాలి. కానీ.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 11న జరిగిన సీఆర్డీఏ అథారిటీ 45వ సమావేశంలో ఆ రెండు టెండర్లకు ఆమోదముద్ర వేశారు. దాంతో ఆ రెండు సంస్థలకు ఆ పనులను కట్టబెట్టేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్ 20న అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం.. కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధిక మొత్తాన్ని కాంట్రాక్టర్లు కోట్ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్ పిలవాలి. రెండుసార్లు టెండర్ పిలిచినా అదే పరిస్థితి పునరావృతమైతే ప్రభుత్వానికి నివేదించాలి. ప్రభుత్వం ఏర్పాటుచేసే కమిటీ ఆ టెండర్‌పై తగిన నిర్ణయం తీసుకుంటుంది.ఖజానాపైరూ. 114.68 కోట్ల భారంబీఎస్సార్ ఇన్ఫ్రా టెక్ సంస్థ బలుసు శ్రీనివాసరావుకు చెందినది. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అందువల్లే నిబంధనలను తుంగలో తొక్కి 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఆ సంస్థకు పనులు కట్టబెట్టారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఖజానాపై అదనంగా రూ.89.19 కోట్ల భారం పడుతుంది. ఇక పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్(జేవీ)కి సంబంధించి కొల్లిపర రామచంద్రరావు కూడా సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. అందుకే ఆ సంస్థ 8.99 శాతం అధిక ధరకు కోట్ చేసినా టెండర్ ఆమోదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఖజానాపై అదనంగా రూ.25.49 కోట్ల భారం పడుతుంది. ఈ రెండు ప్యాకేజీల పను ల్లో నిబంధనలను తుంగలో తొక్కడం వల్ల ఖజానాపై అదనంగా రూ.114.68 కోట్ల భారం పడుతుంది. ఆ మేరకు తన సన్నిహితులకు సీఎం చంద్రబాబు ప్రయోజనం చేకూర్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా కమీషన్లు చేతులు మారుతాయనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. -
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ)/సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి వల్ల రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం వల్ల ఇప్పటికే నైరుతి రుతుపవనాల కదలిక జోరుగా ఉంది.రానున్న మూడు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిప్రాంతాల్లో గంటకు 40 –50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాను 2 రోజులుగా వర్షాలు వీడటం లేదుమచిలీపట్నంతోపాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాజాగా రాత్రి 8 గంటల సమయంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జోరు వాన కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. » గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మే నెల 21 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.8 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. » ప్రకాశం జిల్లాలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గిద్దలూరు, మార్కాపురం, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఉరుము లు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. అత్యధికంగా దోర్నాల మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తీగలేరు పొంగిపొర్లడంతో మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. » శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో బుధవారం జోరు వాన కురిసింది. నెల్లూరులోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. -
కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/తిరువూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్‌ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కలిశారు. చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొందామని.. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారంటూ కౌన్సిలర్లను అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, తిరువూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, మోదుగు ప్రసాద్, ఇనపనూరి చిన్నారి, పాలం రమాదేవి, గుమ్మా వెంకటేశ్వరి, పరసా సత్యనారాయణ, వెలుగోటి విజయలక్ష్మి, షేక్ నదియా, రామవరపు మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, సీనియర్ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, తిరువూరు మండలాధ్యక్షుడు తాళ్లూరి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు -
స్లీపర్ సెల్స్ సంగతి తేల్చండి
సాక్షి, అమరావతి: పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్లీపర్ సెల్స్‌ను గుర్తించే విషయంలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది. రాష్ట్రంలో స్లీపర్స్ సెల్స్‌కు సంబంధించి తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని తేల్చిచెప్పింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.స్లీపర్ సెల్స్ ఉన్నా పట్టించుకోవడం లేదుపహల్గాం ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్ సెల్స్ రహస్యంగా పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నారని హైకోర్టు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఎ.శివకుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. వీరిలో 1,200 మంది ఏపీలోని నంద్యాల, గుంటూరు, వైఎస్సార్ తదితర జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నివేదికలిచ్చినా రాష్ట్ర హోంశాఖ, డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ హరినాథ్ ఇటీవల విచారణ జరిపారు. గౌతమి తరఫున కోనపల్లి నర్సిరెడ్డి, శివకుమార్ తరఫున బూదాటి జ్ఞానేంద్ర కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పహల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్టు, వారంతా పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాయని న్యాయవాది నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో పోలీసు యంత్రాంగం ఈ హెచ్చరికలను పట్టించుకోవడం లేదన్నారు. ఉగ్రమూకలకు సహకరిస్తున్న వారి విషయంలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.ఎన్ఐఏకు నోటీసులుఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని, స్లీపర్స్ సెల్స్ విషయంలో విచారణ జరిపి నివేదికను తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించారు. బాంబు పేలుళ్లు సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, తెలంగాణకు చెందిన సమీర్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. -
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్‌వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్‌గా..పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది. -
తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్ జగన్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరువూరు కౌన్సిలర్లు బుధవారం కలిశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం గురించి వైఎస్ జగన్‌కు కౌన్సిలర్లు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును పార్టీ నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందన్న వైఎస్ జగన్.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు. -
రాజ్యాంగ రక్షణలేని ‘స్థానికత’!
కూటమి ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన నిబంధనలు సవరిస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యాంగంలోని అంశాలను సైతం జీవోలతో మార్చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ను గందరగోళంలోకి నెట్టివేస్తోంది. ఇటీవల ఉన్నత విద్యలోని 8 సెట్ల ద్వారా భర్తీ చేసే వృత్తివిద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో ఇప్పటి వరకు అమలవుతున్న 15శాతం అన్ రిజర్వ్డ్ (నాన్ లోకల్), జనరల్ కోటా సీట్ల విషయంలో స్థానికతను సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి నాన్‌లోకల్ కోటా ఉండదని, 100శాతం సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తామని వెల్లడించింది. దీంతో రాష్ట్రపతి ఉత్తర్వుల(ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్)ను సాధారణ జీవోలతో ఎలా సవరిస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తెలంగాణ నుంచి ఎవరైనా న్యాయ స్థానాలను ఆశ్రయిస్తే ఇక్కడ 15 శాతం నాన్ లోకల్ కోటా సీట్లు ఇవ్వాల్సిందేనని విద్యావేత్తలు చెబుతున్నారు. -సాక్షి, అమరావతికూటమి ప్రభుత్వ కాలయాపన..భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ ప్రకారం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రజల హక్కులను కాపాడటానికి, ముఖ్యంగా ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో 85 శాతం సీట్లు లోకల్, 15శాతం సీట్లు అన్రిజర్వ్డ్(నాన్‌లోకల్) విద్యార్థులతో భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఉస్మానియా, ఆంధ్ర(ఏయూ), శ్రీ వెంకటేశ్వర(ఎస్వీయూ) రీజియన్ల వారీగా స్థానికతను ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవారు. ఉస్మానియా పరిధిలో నాన్ లోకల్ కింద 15శాతం ఏయూ, ఎస్వీయూ విద్యార్థులకు, ఏయూ, ఎస్వీయూ పరిధిలో 15శాతం తెలంగాణ విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా దీనిని పదేళ్లు పొడిగించారు. గతేడాది జూన్ 2వ తేదీతో పదేళ్ల గడువు ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం నాన్‌లోకల్ 15శాతం సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.గత జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిపాటు ఐఏఎస్ అధికారుల కమిటీ పేరుతో కాలయాపన చేసింది. తీరా ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు చట్టం ముందు నిలవలేని జీవోలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్లు గడువు ముగియడంతో అందులోని అంశాలన్నీ ఆటోమెటిక్‌గా సీజ్ అవుతాయని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీలో సవరణ చేయకుండా స్థానికత మార్పునకు చట్టంలో ఎటువంటి విలువ ఉండదని విద్యావేత్తలు చెబుతున్నారు. రాజ్యాంగ సవరణతోనే స్థానికతకు రక్షణ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.కొన్ని కోర్సులకేనా స్థానికత..కూటమి ప్రభుత్వం స్థానికత అంశం ఉన్నత విద్యకు, అందులోనూ కొన్ని కోర్సులకే పరిమితం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో కేవలం సంప్రదాయ, సాంకేతిక వర్సిటీల్లో వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మాత్రమే నాన్‌లోకల్ కోటాను మార్పు చేస్తూ జీవోలు ఇచ్చింది. మిగిలిన ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య యూనివర్సిటీలతో పాటు ప్రత్యేక విశ్వవిద్యాలయాలుగా రూపాంతరం చెందిన పద్మావతి, ద్రవిడియన్, ఆర్కిటెక్చర్, కస్లర్, ఉర్దూ, ఆర్జీయూకేటీ, వేదిక్ వంటి వాటిల్లో ప్రవేశాలకు నాన్‌లోకల్ కోటాను ఎలా సర్దుబాటు చేస్తారనేది వెల్లడించలేదు. దీంతో ఆయా వర్సిటీల అధికారులు అడ్మిషన్ల నిర్వహణకు తలలు పట్టుకుంటున్నారు. వీటితోపాటు విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నాన్‌లోకల్ కోటా నిర్ణయించకుండా ప్రవేశాలు చేపట్టడం అసాధ్యమని నిపుణులు చెబతున్నారు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో అనేక కోర్సుల్లో ప్రవేశాలు జాప్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఫలించిన ఉపాధ్యాయుల చర్చలు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీల అంశంపై విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలమయ్యాయి. ఉపాధ్యాయులు లేవనెత్తిన కొన్ని డిమాండ్లకు అధికారులు అంగీకరించినట్టు ఉపాధ్యాయుల సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలపై బుధవారం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో బుధవారం తలపెట్టిన జిల్లా విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడిని రద్దు చేసినట్టు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెల్లడించారు. వాస్తవానికి 9 ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సోమవారం జరిగిన చర్చల్లో కీలకమైన డిమాండ్లపై డైరెక్టరేట్ నుంచి సానుకూలత రాకపోవడంతో చర్చలను బహిష్కరించారు. అయితే, మంగళవారం ఉదయం మరోసారి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌తో చర్చలు జరపగా, ఉపాధ్యాయులు సూచించిన కొన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించినట్టు ఐక్యవేదిక నేతలు వెల్లడించారు. ప్రభుత్వం అంగీకరించిన అంశాలు ఇవే..» ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు నిర్వహిస్తారు. » ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని 1:49గా మార్చారు. 49 మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో సెక్షన్ ఏర్పాటు చేస్తారు.» ఫౌండేషన్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 దాటిన తర్వాత రెండో పోస్టు కేటాయిస్తారు.» ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ప్రాథమిక పాఠశాలలను విడిగా (యూడైస్‌తో సహా) నిర్వహిస్తారు.» పనిభారం ఎక్కువయ్యే సందర్భంలో ఆయా సబ్జెక్టుల అవసరం మేరకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్/ సర్ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు. » ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయులు వారి సొంత మేనేజ్మెంట్కు అప్పగింత » స్టడీ లీవ్‌లో ఉన్న ఉపాధ్యాయుల్లో ఈ ఏడాది ఆగస్టు 31లోపు విధుల్లో చేరేవారి స్థానాలను బదిలీల్లో చూపరు.» ప్రస్తుత బదిలీల్లో బ్లాకింగ్ విధానం ఉండదు. అన్ని స్థానాలను చూపిస్తారు. » మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 1,382 మంది ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంగా పదోన్నతి కల్పిస్తారు.» రెండుసార్లు పునర్విభజన(రీ అపోర్షన్మెంట్)కు గురయ్యే ఉపాధ్యాయులకు 7 పాయింట్లు ఇస్తారు. » ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు. » బదిలీల అనంతరం జూలై లేదా ఆగస్టులో ఎంఈవో, ప్రధానోపాధ్యాయుల పరస్పర బదిలీపై నిర్ణయం తీసుకుంటారు.» మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 120 దాటితే పీఎస్హెచ్ఎంను అదనంగా (1+5) కేటాయిస్తారు.» సమాంతర తెలుగు మాధ్యమం అంశంపై విద్యాశాఖ మంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం.నేడు బదిలీలకు షెడ్యూల్!ఉపాధ్యాయ సంఘాల సమస్యలు పరిష్కారం కావడంతో బదిలీలకు మార్గం సుగమమైంది. బుధవారం పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయనుంది. తొలుత ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా ప్రకటించి, దానిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ సీనియారిటీ జాబితా విడుదల చేసి స్కూళ్లలో స్థానాల ఎంపికకు (ఆప్షన్స్) అవకాశం కల్పిస్తారు. తొలుత హెచ్ఎంల బదిలీలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు చేపడతారు. అనంతరం బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ జూన్ 2 నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. -
మీ పాలనలో రైతులకు మేలు జరిగిందయ్యా!
సాక్షి, అమరావతి: ‘మీ పాలనలో రైతులందరికీ మేలు జరిగిందయ్యా. మీ హయాంలో రైతుల కష్టాలు తెలుసుకుని అన్నదాతకు అండగా నిలిచి.. మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎలాంటి సాయం అందకపోగా ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. రైతులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేయాల్సి వస్తోంది. అయినా పట్టించుకోవడం లేదయ్యా’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొడగట్లపల్లికి చెందిన రైతు మెర్ల సత్యనారాయణ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట వాపోయారు.మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు మెర్ల సత్యనారాయణ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంత రైతులు ఎకరాకు 55–60 బస్తాల ధాన్యం పండించారని ఆ రైతు వివరించారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులంతా నిరసనలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయారు.ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్లాల్లోనే ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. అన్నదాతకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో రైతు సత్యనారాయణ సంతోషంతో తాను పండించిన వరి కంకులను ఆయనకు బహూకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జి పిల్లి సూర్యప్రకాష్ కలిశారు. -
ఎన్నికల కమిషన్ ఆదేశాలన్నా లెక్క లేదా?
ఎవరినీ వదలం.. పౌరుల రక్షణ పోలీసుల బాధ్యత. దీనినుంచి వారు తప్పించుకోలేరు. సంక్షేమ రాజ్యంలో పోలీసుల బాధ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వ్యవహారంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరినీ విడిచిపెట్టం.- హైకోర్టు ఆగ్రహంసాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలన్నా లెక్క లేదా..? వాటిని కూడా అమలు చేయరా? ఎన్నికలో పాల్గొనే వైఎస్సార్సీపీ వార్డు సభ్యులకు తగిన భద్రత కల్పించాలని ఆదేశించినా పట్టించుకోరా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయకపోవడంలో ఔచిత్యం ఏమిటని నిలదీసింది. పోలీసుల సమర్థత ముఖ్యంగా ఏపీ పోలీసుల సమర్థత గురించి తమకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. వారు ఎంత సమర్థులో అందరికీ తెలుసని.. వారి గురించి ప్రత్యేకంగా తమకు చెప్పాల్సిన అవసరం లేదంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా హైకోర్టును ఆశ్రయించిన ఇద్దరితో పాటు 11 మంది కౌన్సిలర్లకు తగిన భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. కౌన్సిలర్లు ఉన్న ప్రదేశం నుంచి పోలింగ్ కేంద్రం వరకు వారికి భద్రత కల్పించాలని సూచించింది. తమ ఆదేశాల అమలు విషయమై నివేదిక సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.భద్రత కోసం కోర్టుకు వెళ్లిన వైఎస్సార్సీపీ వార్డు సభ్యులుతిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారందరికీ తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు మోదుగు ప్రసాద్, గుమ్మా వెంకటేశ్వరి హైకోర్టులో సోమవారం అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ లక్ష్మణరావు మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పాపుడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తిరువూరులో చైర్మన్ ఎన్నిక ఈ నెల 19న ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. కౌన్సిలర్లు ఓటు వేసేందుకు వెళ్తుండగా, అధికార టీడీపీ నేతలు అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. చైర్మన్‌గా పోటీ చేస్తున్న వ్యక్తిని సీఐ, డీఎస్పీ తీసుకెళ్లడంతో ఎన్నిక మంగళవారానికి వాయిదా పడిందన్నారు. వార్డు సభ్యులకు భద్రత కల్పించేలా చూడాలంటూ తాము ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. శాంతిభద్రతల సమస్యతో వార్డు సభ్యులు వారి నివాసాల్లో ఉండలేని పరిస్థితి వచ్చిందని.. చాలామంది హోటళ్లలో తలదాచుకుంటున్నారని చెప్పారు. తమ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో చెప్పి వారికి భద్రత కల్పించాలని కోరామన్నారు. ఈ వినతిపత్రాన్ని ఎన్నికల సంఘం విజయవాడ పోలీస్ కమిషనర్, ఎన్నికల అధికారి, కలెక్టర్, డీజీపీ తదితరులందరికీ పంపిందని శశిధర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ వార్డు సభ్యులకు భద్రత కల్పించాలని ఆదేశించిందన్నారు. కానీ, వీటిని పోలీసులు అమలు చేయలేదని.. వార్డు సభ్యులు ఇళ్లకు తిరిగి వస్తేనే భద్రత కల్పిస్తామని సీఐ, డీఎస్పీ చెబుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతిని న్యాయమూర్తి వివరణ కోరారు. భద్రత కోసం ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇస్తే సరిపోదని, పోలీసులకు కూడా ఇవ్వాలని ఆమె తెలిపారు. పోలీసులకు ఎందుకు వినతిపత్రం ఇవ్వలేదని శశిధర్‌రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసే వార్డు సభ్యుడిని తిరువూరు సీఐ తీసుకెళ్లారని, అందుకే ఆయనకు వినతిపత్రం ఇవ్వలేదని శశిధర్ సమాధానం ఇచ్చారు. ‘‘సీఐ పేరు ఏమిటి?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా, సీఐ గిరిబాబు, డీఎస్పీ ప్రసాదరావు అని శశిధర్ తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఇరుపక్షాలు కోర్టులతో ఆడుకోవద్దని స్పష్టం చేశారు. పోలీసులు తప్పు చేస్తే కోర్టు ధిక్కారం కింద తీవ్రంగా శిక్షిస్తామని, వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. న్యాయస్థానాల్లో షోలు చేయవద్దని హితవు పలికారు.వార్డు సభ్యులు ఎక్కడున్నారో స్పష్టంగా చెప్పాంఈ సమయంలో శశిధర్‌రెడ్డి స్పందిస్తూ, తాము అవాస్తవాలు చెప్పడం లేదన్నారు. వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపత్రంలో స్పష్టంగా చెప్పామని, వాటిని పరిగణనలోకి తీసుకుని హోటల్లో ఉన్న కౌన్సిలర్లు, ఇంటి వద్ద ఉన్న వార్డు సభ్యులకు పోలింగ్ కేంద్రం వరకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించిందని తెలిపారు. (ఈసీ ఆదేశాలను చదివి వినిపించారు).పోలీసులకు తెలియదంటేమేం నమ్మాలా?వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలియదని జయంతి చెప్పారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మాట ఓ సామాన్యుడు చెబితే నమ్ముతామని, తమకు తెలియదని పోలీసులు చెబితే ఎలాగని ప్రశ్నించారు. పోలీసులు తెలియదంటే నమ్మేస్తామని అనుకుంటున్నారా? అంటూ నిలదీశారు. వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉంటే అక్కడినుంచి పోలింగ్ కేంద్రం వరకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు సరిపోవా? అంటూ ప్రశ్నించారు.భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాంఎన్నికల సంఘం తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, వైఎస్సార్సీపీ వినతిపత్రాన్ని పోలీసు కమిషనర్, ఎన్నికల అధికారి, కలెక్టర్, డీజీపీ తదితరులందరికీ పంపి భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉంటే అక్కడినుంచి పోలింగ్ కేంద్రం వరకు వారికి భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమయంలో పోలీసులు ఏవైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో మెజారిటీ లేకపోయినా పదవి కోసం దిగజారిపోతున్నారని మండిపడ్డారు. కోరం లేకుండా చేసి.. గెలిచినట్లు ప్రకటించుకున్నారని తప్పును ఎత్తి చూపారు. ఈ రోజు తిరువూరు.. నిన్న, మొన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. ఎక్కడైనా అదే రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఈ రోజు చేస్తున్న రాజకీయంలో కనీసం ఒక శాతం కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో అన్నీ మనం గెలిచాం. కేవలం రెండు మున్సిపాలిటీల్లో ఓడిపోయాం. తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు 16 మంది కౌన్సిలర్లు ఉంటే, టీడీపీకి 18 మంది ఉన్నారు. ఇద్దరిని లాగుదామని, మన ఎమ్మెల్యే అంటే, నేను వద్దన్నాను. ఎమ్మెల్యేను హౌజ్ అరెస్టు చేయించి, చైర్మన్ ఎన్నిక నిర్వహించాను. అదీ మనం చేసిన విలువలతో కూడిన రాజకీయం. ‘నాడు జగనన్నకు చెబుదాం’, ‘స్పందన’ అనే కార్యక్రమాల ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా, నేరుగా సీఎంఓ ఫాలోఅప్ చేసేది. అప్పుడు ఎక్కువ సమస్యలు టీడీపీ వారివే పరిష్కారమయ్యాయి’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటిస్తారా? ⇒ ఆ రోజు కులం, మతం, రాజకీయం చూడకుండా మనం పాలించాం. అదే ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం రాజకీయం చేస్తున్నాం. ⇒ తిరువూరులో 20 మంది కౌన్సిలర్లలో 17 మంది వైఎస్సార్సీపీ, మిగతా ముగ్గురు టీడీపీ. అయితే బలవంతంగా ఐదుగురిని లాగారు. అయినా ఆ ఎన్నికలో మనమే గెలవాలి. ఎందుకంటే మన బలం 12. టీడీపీకి కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి బలం లేకపోయినా, పదవి కోసం దారుణంగా వ్యవహరిస్తున్నారు. లేదంటే పోలీసుల సహాయంతో ఎన్నిక జరగకుండా చూస్తున్నారు. మన నాయకులను హౌజ్ అరెస్టు చేశారు. టీడీపీ వారందరినీ రోడ్ల మీదకు వదిలారు. ఈరోజు హైకోర్టులో హౌజ్ మోషన్ మూవ్ చేశాం. పోలీసు బందోబస్తు కోరాం. ⇒ నరసరావుపేటలో మొత్తం 17 గెలిచాం. కానీ వారిలో కొందరిని లాక్కున్నారు. దీంతో మనకు 13 మంది సభ్యులు ఉండగా, టీడీపీకి కేవలం ముగ్గురే ఉన్నారు. ఒకరు చనిపోయారు. కోరం లేకపోయినా గెలిచామని ప్రకటించుకున్నారు. ⇒ కారంపూడిలో మొత్తం 14 వైఎస్సార్సీపీ గెలిస్తే, ఆరుగురిని లాగారు. అయినా అక్కడ మన బలం ఎనిమిది కాగా, టీడీపీకి ఆరుగురు మాత్రమే ఉన్నారు. అయినా కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటించారు. చివరకు కుప్పం మున్సిపాలిటీ, రామకుప్పంలోనూ అదే పరిస్థితి. ⇒ రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో వైఎస్సార్సీపీ 9 గెలిస్తే, టీడీపీ 1 గెలిచింది. అయినా ఎంపీపీ ఎన్నికలో అక్రమాలు. ఒక పార్టీ మీద గెలిచినప్పుడు, వారిని లాక్కోవడం ఏమిటి? సీఎంగా ఉన్న వ్యక్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా పోలీసులను పెట్టి భయపెట్టడం ఏమిటి? మన పార్టీ నుంచి ముగ్గురిని లాక్కున్నారు. అయినా మనకు ఇంకా ఆరుగురు ఉన్నారు. మనదే మెజారిటీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. అయినా దౌర్జన్యం చేసి, కోరం లేదని చెప్పి, ఎన్నిక గెల్చే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో వైఎస్సార్సీపీ 14, టీడీపీ నాలుగు స్థానాల్లో నెగ్గింది. ఒకరిని లాక్కున్నారు. మిగతా వారు గట్టిగా నిలబడడంతో ఏం చేయలేక వదిలేశారు. ఇలా ప్రజాస్వామ్యం ఖూనీ అయిన పరిస్థితుల్లో మనం ఏకం అవుతున్నాం.వైఎస్సార్సీపీలో చేరిన విశాఖ టీడీపీ కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్సాక్షి, అమరావతి: విశాఖపట్నం 41వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మంగళవారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ వాసుపల్లి గణేశ్ పాల్గొన్నారు. -
వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ రూరల్‌లో 7.5, కృష్ణా జిల్లా ఘంటశాలలో 7.1, కాకినాడలో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడ జిల్లా కరపలో 6.5 సెం.మీ వర్షం పడింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా కటికపల్లిలో 5.3 సెంటీమీటర్లు, కోనసీమ జిల్లా మండపేటలో 4.8, కాకినాడ జిల్లా ఆర్యావటంలో 4.6, మధ్యకొంపలులో 4.4 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది. 4, 5 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో నైరుతి రుతుపవనాలు 4, 5 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఏర్పడిందని పేర్కొంది. -
హామీలు గాలికి.. కుట్రలు తెరపైకి..: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకపోగా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని.. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెడ్‌బుక్ కుట్రలతో విధ్వంసం సృష్టిస్తున్నారని, బరితెగించి యథేచ్ఛగా కేసుల మీద కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనం అయ్యాయన్నారు. అయితే ఈ అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ శ్రేణులకు తేల్చి చెప్పారు. జైళ్లకు పంపినా సరే.. ‘చంద్రబాబూ.. నిన్ను ఎదుర్కొంటాం’ అని ధైర్యంగా, గట్టిగా నిలబడగలిగినప్పుడే రాష్ట్రంలో రాజకీయం చేయగలమని స్పష్టం చేశారు.ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ వన్ అని, వచ్చేది మన ప్రభుత్వమేనని, జగన్ 2.0లో కార్యకర్తలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత ⇒ ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నామో నా కంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే.. కేసులు వేసినా భయపడకూడదు. జైళ్లకు పంపినా, చంద్రబాబూ.. నిన్ను ఎదుర్కొంటాం అని గట్టిగా అంటేనే రాజకీయాల్లో ఉండగలం. రాజకీయాలు చేయగలం. అదే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఈరోజు రాజకీయాలు అలా తయారయ్యాయి. ⇒ మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏడాది తర్వాత కొంత వస్తుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు ఆయన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చాడు. జగన్ ఇచ్చినవన్నీ ఇవ్వడమే కాకుండా, ఇంకా మూడు ఎక్కువ ఇస్తానన్నాడు. కానీ, ఏదీ నిలబెట్టుకోలేదు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అందుకే ఆయన ప్రభుత్వంపై అంత వ్యతిరేకత వచ్చింది.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తలు ఏ ఒక్క ఇంటికీ ధైర్యంగా పోలేరు. వారు ఏ ఇంటి తలుపు తట్టినా.. పిల్లవాడి స్థాయి నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి పోయి ఏం చెప్పారు? బాండ్లు అన్నాడు. ఇంకా ఏమేం చెప్పారు? ఇంటింటికీ వెళ్లి, చిన్న పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, అదే ఇంట్లో ఆ పిల్లల అమ్మ కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లోనే అమ్మమ్మలు కనబడితే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్ల యువకుడు కనబడితే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.26 వేలు ఇస్తామని చెప్పారు. ఆ మాటలు ఇంకా వారిని వెంటాడుతాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు సీఎం హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే, దాన్ని అమలు చేయని వ్యక్తి సీఎంగా ఉన్నాడు.వ్యవస్థలన్నీ నిర్వీర్యం ⇒ రాష్రంలో విద్యా రంగం నిర్వీర్యం అయింది. ఇంగ్లిష్ మీడియం లేదు. గోరుముద్ద నామమాత్రం అయింది. నాడు–నేడు లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. మనం అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చాం. ఇవాళ అది లేదు. నిరుపేదల ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని వదిలేసింది. ఆ బిల్లులు దాదాపు రూ.3,600 కోట్లు ఇవ్వడం లేదు. ఆరోగ్య ఆసరా అమలులోనే లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక పోవడంతో వైద్యానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ⇒ ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. దళారులు వచ్చారు. ఆర్బీకే వ్యవస్థను నాశనం చేశారు. ఉచిత ఇన్సూ్యరెన్స్ లేదు. పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదు.మనం బాగు చేస్తే.. బాబు చెడగొడుతున్నాడు ⇒ మనం 17 మెడికల్ కాలేజీలు కడితే, ఈరోజు వాటిని అమ్మేస్తున్నారు. ఏదైనా జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంటే, అక్కడ అన్ని వైద్య సదుపాయాలు, ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నట్లు. దానివల్ల ఆ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను మోసం చేయలేవు.⇒ మనం మూలపేట (శ్రీకాకుళం జిల్లా)తోపాటు మూడు పోర్టులు కట్టడం మొదలు పెట్టాం. వాటిలో 30 శాతం పనులు పూర్తి చేస్తే, కమీషన్ల కోసం చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడు.⇒ ఉత్తరాంధ్రలో ట్రైబల్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజ్, ఐటీడీఏ పరిధిలో ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం మొదలు పెడితే, ఈ పెద్దమనిషి మొత్తం వదిలేశాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కోసం మనం భూసేకరణ చేశాం. 30 శాతం పనులు చేశాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ అభివృద్ధి అయినా జరిగింది అంటే కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే.⇒ చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ఆయన ఎక్కడా మాట నిలబెట్టుకోలేదు. అలా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అందుకే తనను ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పాలన సాగిస్తున్నాడు. అందులో భాగంగా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎవరు మాట్లాడినా, వారి గొంతు నొక్కుతున్నారు. నిలదీస్తున్న గొంతులను నలిపేస్తున్నారు.రాష్ట్రంలో తొలిసారిగా మాన్యుఫ్యాక్చర్ విట్నెస్ సృష్టిస్తుండటాన్ని చూస్తున్నాం. అంటే నేరంతో ఒక మనిషికి సంబంధం లేకపోయినా, వారికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకుని అప్రూవర్ అంటున్నారు. ఆయనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. ఆ మనిషితో, ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు. ఈ మనిషిని అరెస్టు చేస్తున్నారు. అలా ఒక మాన్యుఫ్యాక్చర్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు. చరిత్రలో గతంలో ఏనాడూ ఇలాంటివి జరగలేదు. ఒక తప్పుడు సంప్రదాయానికి ఈ పెద్దమనిషి చంద్రబాబు ఈరోజు బీజం వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పాత కేసులు తిరగ తోడుతున్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థులు, చురుగ్గా పని చేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులను ఇరికిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. - వైఎస్ జగన్‌మన ప్రభుత్వ హయాంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఇంటింటికీ వెళ్లగలిగాడు. మేనిఫెస్టో చూపి, జగన్ ఏం చేశాడో చూపి టిక్ పెట్టమని అడిగాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. మూడు సార్లు ప్రతి ఇంటికీ వెళ్లి, ఎన్నికల ముందు ఏమేం చేశామో చెప్పాం. వాటిని చూపాం. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అయినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కారణం కేవలం 10 శాతం మంది వారి మాటలు నమ్మి, మనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నామంటే.. చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రజలు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. - వైఎస్ జగన్‌ఉధృతంగా పోరాడుదాం.. రాబోయేది మన ప్రభుత్వమే⇒ ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. మంగళగిరికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. అలాగే సుధారాణిని నెలల తరబడి శ్రీకాకుళం నుంచి అన్ని స్టేషన్లు తిప్పారు. బెయిల్ రాకుండా చూశారు. మాజీ ఎమ్మెల్యే వంశీపై 11 కేసులు పెట్టారు. ఒకదాంట్లో బెయిల్ వస్తే.. మరో కేసు.. రెండు నెలలుగా జైల్లోనే ఉంచారు. ఒక దాని తర్వాత మరో కేసు పెడుతున్నారు.⇒ ఇంకొకరు మాజీ ఎంపీ నందిగం సురేష్. దళితుడు. నెలల తరబడి జైల్లో పెట్టారు. బెయిల్ మీద బయటకు వస్తే, మరో కేసులో ఇరికించి, జైలుకు పంపారు. వాళ్ల ఇంటి దగ్గరకొచ్చి ఒక మనిషి తిట్టాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తే, మరో కేసు పెట్టి, జైలుకు పంపారు.⇒ ఈ రోజు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు పెట్టారు. అది ఒక వృక్షమై, రెండింతలు పెరిగి, వాళ్లనే తన్నే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడుదాం. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇంకా చూస్తుండగానే మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. చీకటి తర్వాత వెలుగు తప్పదు. మనం తప్పకుండా గెలుస్తాం. అందుకే రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాడాలి. ఈలోగా గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్యమబాట పట్టి, ప్రభుత్వ తప్పులను ప్రజల్లో ఎండగట్టాలి. అందుకే ఈ సమావేశాల నిర్వహణ. ఈ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలది చాలా గొప్ప పాత్ర.వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ వన్ ⇒ ప్రతి కార్యకర్తకు చెబుతున్నా. మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, వారి పేరు రాసుకోండి. అది ఏ బుక్ అయినా సరే. వారి పేరు మాత్రం కచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం వచ్చాక, ఈరోజు మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. ఆ మనిషి రిటైర్ అయినా, దేశం వదిలి పోయినా లాక్కొస్తాం. ఎవ్వరినీ వదిలి పెట్టం. సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తాం. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కొట్టించుకోండి. ఫరవాలేదు. నీ టైమ్ బాగుంది.. కొట్టు అనండి. ఆ తర్వాత మన టైమ్ వస్తుంది. అప్పుడు మనం కొడతాం. ఇవాళ వారు నాటుతున్న విత్తనం రేపు రెండింతలు అవుతుంది.⇒ ఈరోజు నేను మీ అన్నగా, మీ బిడ్డగా ఒకటే చెబుతున్నా. జగన్ 2.0లో పరిస్థితి ఇలా ఉండదు. పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రోజు కార్యకర్తల కష్టాలు చూశాను. స్వయంగా చెబుతున్నాను. గతంలో మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్. దాంతో మనం యుద్ధం చేశాం. అందువల్ల అనుకున్న మేరకు కార్యకర్తలకు చేయలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నాను. రేపు ఈ పరిస్థితి ఉండదు. వైఎస్సార్సీపీకి కార్యకర్తనే నంబర్ వన్. -
బియ్యం బండి ఆగింది.. మీ రేషన్ మీరే తెచ్చుకోండి
సాక్షి, అమరావతి: పనులు మానుకుని రోజంతా రేషన్ డిపోల దగ్గర పడిగాపులు.. బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు.. ఎండైనా, వానైనా అరుగులపై కూలబడి అవస్థలు.. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి! వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూరా మద్యపుటేరులు పారిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఇప్పటికే రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా, తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రజల అవస్థలను తొలగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్’ను చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించింది. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడేసింది. ఇకపై మీ రేషన్.. మీరే తెచ్చుకోండి..! అంటూ ప్రజలను నిలువునా మోసం చేసింది. బాబు ఆగమనం.. రాష్ట్రం తిరోగమనం! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో.. దేశం మెచ్చిన ఎండీయూ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అండ్ కో ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతోంది. మొన్న... 2.66 లక్షల వలంటీర్ల కుటుంబాలు.. నేడు 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో పది వేల మంది హెల్పర్ల కుటుంబాలను నడిరోడ్డు పైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు సాంత్వన చేకూరుస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు. మళ్లీ కూలి మానుకునే దుస్థితి.. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారులకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజే రేషన్ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తుంటే.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సహాయంతో రేషన్ డోర్ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎండీయూలపై నేర ముద్ర.. గతంలో చౌక దుకాణాలపై కేసుల్లేవా! ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్ స్ట్రాటజీ! అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్ అక్రమ రవాణాకు కేరాఫ్ అంటూఎండీయూ వ్యవస్థపై గోబెల్స్ ప్రచారం సాగించారు. రేషన్ అక్రమ రవాణా మొత్తం ఎండీయూల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతిహీనంగా మాట్లాడారు. వాస్తవానికి ఎండీయూ ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 90 శాతం రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండీయూలకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండీయూలపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండీయూ వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం మీడియా ముఖంగా చెప్పారు. అంటే దాదాపు 9 వేల వాహనాలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్టే కదా? పోనీ గతంలో చౌక ధరల దుకాణదారులపై రేషన్ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకొల్లలుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న? ఇక రేషన్ డీలర్ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు కచ్చితంగా ఆలస్యం అవుతాయి. కానీ ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్వో ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దే సరుకులు పొందేలా గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండీయూ వాహన ఆపరేటర్ల పోస్టు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. ఈ పరిస్థితుల్లో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ చేరవేసింది. ఆసక్తి చూపిన ఎనిమిది రాష్ట్రాలు.. రేషన్ పంపిణీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్’ వ్యవస్థను తీసుకొచ్చింది. నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్(అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోరి్టఫైడ్ బియ్యాన్ని నేరుగా సరఫరా చేసింది. దీంతో అంగన్వాడీలు, పాఠశాలలకు వ్యయ ప్రయాసలు తొలగిపోయాయి. గోదావరి వరదలు, విజయవాడ వరదలు లాంటి విపత్తుల సమయంలోనూ ఎండీయూలే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ ప్రభుత్వ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ వినియోగం పారదర్శకంగా 90 శాతానికిపైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి.అధికారంలోకి రాగానే అడ్డుకున్న కూటమి ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఎండీయూ వ్యవస్థ ద్వారా సమర్థంగా నాణ్యమైన బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ను చేరవేస్తోంది. కల్తీకి ఆస్కారం లేకుండా, కచ్చితమైన తూకంతో ప్రజల సమక్షంలో బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చేలా వెసులుబాటు ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కేవలం ప్రజల దగ్గరకే ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీని నిలిపివేసింది. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు. పేదల ఇంటికి రేషన్ వద్దు... మద్యం ముద్దుపేదల ఇంటికి రేషన్ వద్దు గానీ మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కారు చర్యలున్నాయి. బెల్ట్ షాపులతో ప్రతీ గ్రామంలో మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటివద్దకే రేషన్‌ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది.2027 వరకు ఒప్పందం గడువు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండీయూ అసోసియేషన్లు, చౌక ధరల దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధివిధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండీయూ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్వోసీ ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండీయూలను కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు. రోడ్డుపై వదిలేస్తాం అంటే ఊరుకోముఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్ చేశారు. 2027 జనవరి వరకు సమయం ఉంది. ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. మాకేమైనా దానధర్మం చేస్తున్నారా? మేం పని చేయలేదా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై వదిలేస్తామంటే చూస్తూ ఊరుకోం. బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏం ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలి. – రౌతు సూర్యనారాయణ, ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాంఇంటి ముందుకే రేషన్ వాహనం రావడం వల్ల ఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాం. ఐదేళ్లు ప్రశాంతంగా ఇంటి ముందుకే వచ్చాయి. ఇప్పుడు వాహనాలు రావంటే మాలాంటోళ్లం ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి నుంచి రేషన్ షాపు అర కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం నడిచి వెళ్లి క్యూలో నిలబడాలి. డీలర్ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వేలిముద్రలు పడకపోతే గంటల తరబడి నిలబడాలి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం వస్తుంది? – దారుకుమల్లి వెంకటసుబ్బమ్మ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా గిరిజనులకు ఎంతోమేలు జరిగింది గతంలో గిరిజనులంతా నిత్యావసరాలు పొందేందుకు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలతో ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాల పంపిణీని ప్రారంభించి గిరిజనులకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న మినుములూరు డీఆర్ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. –పాలికి లక్కు, గిరిజనుడు, గుర్రగరువు గ్రామం, మినుములూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా మాగ్రామంలో రేషన్ షాపు లేదు మా గ్రామంలో రేషన్ షాపు లేదు. మూడు కి.మీ. దూరంలో ఉన్న బురాందొడ్డికి వెళ్లి బియ్యం, ఇతర రేషన్ సరుకులు తెచ్చుకునేవాళ్లం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు రేషన్ కష్టాలు తొలిగాయి. ఇంటి దగ్గరకే రేషన్ బండి వచ్చింది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే మళ్లీ బియ్యం సంచి నెత్తిన మోయాల్సిందే. చంద్రబాబు పుణ్యమా అని పాత కష్టాలు పునరావృతమవుతున్నాయి. – రహేలమ్మ, బ్యాతోలి గ్రామం, సీబెళగల్ మండలం, కర్నూలు జిల్లా -
రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటికే రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. జూన్ 1వతేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అనంతరం ఈ వివరాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, కె.పార్థ్దసార«థి మీడియాకు వెల్లడించారు. 9,260 మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ నిలుపుదల చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.రేషన్ దుకాణాల్లో సీసీ కెమేరాలు అమర్చి పీడీఎస్ పంపిణీ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోతుందన్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రేషన్ దుకాణాల ద్వారా కిరాణాæ సరుకులు విక్రయించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరాకు గత ప్రభుత్వం రూ.1,860 కోట్లు వ్యయం చేసిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా పది శాతం డబ్బులు చెల్లించిన వాహనాల లబ్ధిదారులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా వాటిని ఉచితంగా బదిలీ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. వాహనాలకు సంబంధించి ఇంకా రూ.188 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉందని, దీనిపై బ్యాంకర్లతో చర్చించి వన్‌టైమ్ సెటిల్మెంట్ చేస్తామన్నారు. దీపం పథకం కింద మూడు సిలిండర్ల సబ్సిడీ డబ్బులను ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..» ఈ నెల 15న సీఎం అధ్యక్షతన ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం. » భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి మరో 500 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదం. » వైఎస్సార్ కడప జిల్లా కె.బొమ్మపల్లిలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎకరం రూ.5 లక్షల చొప్పున 41.99 ఎకరాల ప్రభుత్వ భూమి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం. శ్రీసత్యసాయి జిల్లా పెద్దకొల్ల గ్రామంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎకరం రూ.5 లక్షలు చొప్పున 12.87 ఎకరాలు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు బదిలీకి ఆమోదం. » నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురంలో పారిశ్రామిక పార్కు స్థాపనకు 615.98 ఎకరాల భూమి ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయించేందుకు ఆమోదం.» పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఘర్షణల్లో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు చట్ట నిబంధనలు సవరించేందుకు ఆమోదం. » చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలు... చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుంచి రొంపిచర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం.» గనుల శాఖలో వివిధ బాండ్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. » హైకోర్టులో 245 పోస్టుల కల్పనకు న్యాయ శాఖ ప్రతిపాదనకు ఆమోదం. » అమరావతిలో ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ సంస్థ ఏర్పాటుకు ఆమోదం. » ఏలూరు సమీపంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం.» సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా 1,136 ఎస్జీటీ, 1,124 పాఠశాల సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్న అదనపు పోస్టులుగా మార్చుతూ జారీ చేసిన జీవోకు ఆమోదం. -
కొత్త సాంప్రదాయం.. టీడీపీ కార్యకర్తకు ఉద్యోగం
విజయవాడ: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తమ పార్టీకి చెందిన వారికే వర్తింపు చేయాలని, ఇది ఏ స్థాయి అధికారి అయినా గుర్తుపెట్టుకుని వ్యవహరించాలని గతంలో బహిరంగంగా ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఉద్యోగాలు కూడా టీడీపీ కార్యకర్తలకే ఇస్తామనే విషయాన్ని తాజాగా బహిర్గతం చేశారు. ఓ టీడీపీ కార్యకర్తకు ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేబినెట్ సాక్షిగా నిలవడం గమనార్హం. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా నిర్ణయం తీసుకోవడం చెడు సాంప్రదాయానికే తెరలేపినట్లే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత కక్షలతో చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త హత్యగావించబడితే, ఆయన కుమారుడికి ఇప్పుడు శాశ్వత ఉద్యోగం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు.2022లో వెల్దుర్ది మండలం గుండ్లపాడుకు చెందిన చంద్రయ్య హత్యగావించబడ్డాడు. అయితే రెండు కుటుంబాల నడుమ చోటు చేసుకున్న విభేదాల కారణంగా చంద్రయ్యను హత్య చేసింది మరో కుటుంబం. ఈ హత్యకు రెండు కుటుంబాల మధ్య కక్ష అని అప్పట్లోనే పోలీసులు సైతం ప్రకటించారు. ఇక్కడ చంద్రయ్య కుటుంబం కూడా ఒక కుటుంబంపైనే ఫిర్యాదు చేసింది కూడా. అంటే ఇదంతా వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంటే, మరి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: AP: మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే.. డోర్ డెలివరీకి మంగళం -
AP: మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే.. డోర్ డెలివరీకి మంగళం
విజయవాడ: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీకి మంగళం పాడింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్‌ను డోర్ డెలివరీని నిలిపివేస్తూ చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోగా, అందులో రేషన్ డోర్ డెలివరీని నిలిపివేయడం ఒకటి. ఫలితంగా ఎండీయూ ఆనరేటర్లను రోడ్డున పడేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో 9260 రేషన్ డెలివరీ వాహనాలు నిలిచిపోనున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే రేషన్ షాపుల నుండి సరఫరా చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే..రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసే అంశాన్ని ఎండీయూ ఆపరేటర్లు గతంలో వ్యతిరేకించినా దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఎండీయూ ఆపరేటర్లపై జాలి లేకుండా వ్యవహరించడమే కాకుండా మళ్లీ ప్రజలు పాత పద్ధతిలో షాపుల వద్ద క్యూ లో ఉండి తీసుకునే విధానానికే ప్రభుత్వం మళ్లీ మొగ్గుచూపింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో రేషన్‌ను ఇప్పటివరకూ డోర్ డెలివరీ ద్వారా ప్రజలు ఇంటి వద్దనే పొందుతుండగా మళ్లీ వెనకటి రోజుల గుర్తు చేయడానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. దాంతో ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు తప్పదనే సంకేతాన్ని, సందేశాన్ని కేబినెట్ సాక్షిగా ఇచ్చేశారు చంద్రబాబు. ఇప్పటికే 2.50 లక్షల వాలంటీర్లను తీసేసిన ప్రభుత్వం.. తాజాగా ఎండీయూ ఆపరేటర్లు, రేషన్ వాహనాలు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చేసింది. -
మీడియాకు పీపుల్స్ స్టార్ పాఠాలు
పీపుల్ స్టార్ నారాయణమూర్తి ఏ అంశాన్ని అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఆయనకు ముఖస్తుతి.. డబ్బా కొట్టడం.. చెంచాగిరి అసలు తెలియదు.. చిన్నపిల్లలు పెద్దవాళ్లు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు.. డబ్బున్న వాళ్ళు పేదలు అనే తేడా లేకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉంటూనే తన మనసులో ఉన్న భావాలను స్పష్టంగా వెల్లడించగలిగే ధైర్యం కలిగిన ఒకే ఒక్క సినీ నటుడు నారాయణమూర్తి.ఆయన ఎవరిని అయినా మంచి చేసుకోవడం కోసమో మచ్చిక చేసుకోవడం కోసమో మాట్లాడరు. కెరీర్ కోసము.. సినీ అవకాశాల కోసం భజన చేయడం అసలు ఉండదు.. అలాంటి నారాయణమూర్తి ఓ సభలో మీడియా తీరతెన్నులను తూర్పారబట్టారు. సమాజంలో మీడియా బాధ్యతను.. సమాజ మనుగడలో మీడియా పాత్రను దాన్ని ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూనే ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు పోతున్న పోకడలను ఈ పీపుల్స్ స్టార్ పెద్దల సమక్షంలోనే ఎండగట్టారు.కొన్ని పత్రికలు, కొంతమంది కోసం.. కొన్ని మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీల కోసం పనిచేస్తూ తన బాధ్యతను విస్మరిస్తున్నాయని.. తమకు నచ్చిన నాయకుడు ఎలా వ్యవహరిస్తున్న ఎంత దుర్మార్గంగా పాలిస్తున్నా ఆయన కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని, ఈ వైఖరి అంతిమంగా సమాజానికి ఎనలేని కీడు చేస్తోందని నారాయణమూర్తి దుయ్యబట్టారు.మీడియా సంస్థలు తమ బాధ్యతను విస్మరించి కొన్ని పార్టీలకు ఊడిగం చేస్తూ మనుగడ సాగిస్తున్నాయని ఇలాంటి సంస్థల వలన సమాజానికి ఏం లాభం అని ఆయన మాజీ చీఫ్ జస్టిస్ రమణ వంటి పెద్దల సమక్షంలోనే దులిపి ఆరేశారు. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న కొన్ని మీడియా సంస్థలను నేరుగా తాకాయని పాత్రికేయులు విశ్లేషకులు అంటున్నారు. నారాయణమూర్తి మాట్లాడింది నూటికి నూరు శాతం నిజం అని.. చంద్రబాబుని కొన్ని మీడియా సంస్థలు వెనకేసుకు వస్తూ ఆయన తప్పులను కాపాడుతూ సమాజానికి నష్టం చేస్తున్నాయని.. విషయాన్ని నారాయణమూర్తి నిర్భయంగా బయటపెట్టారని ఎప్పటికీ సోషల్ మీడియాలో పోస్టింగులు మొదలయ్యాయి.ఇంగ్లీష్ మీడియం చదవాలండిదీంతోపాటు నారాయణమూర్తి ఇంకేమన్నారంటే పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవాలని ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించాలని అప్పుడే ఉన్నత స్థానాలకు చేరగలుగుతారని అన్నారు. వేదికపై ఉన్న మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను చూపిస్తూ ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగులోనే సాగిన ఆ తర్వాత ఆంగ్లంలో ప్రారంభించిన సంపాదించి న్యాయ స్థానాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఈ అంశం కూడా గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియాని ప్రవేశపెట్టిన అంశాన్ని పాత్రికేయులు ప్రజలు గుర్తు చేసుకున్నారు.ఆనాడు వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు మరికొందరు నాయకులు అడ్డుకున్నారని.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాని వ్యతిరేకించారని తద్వారా పేద పిల్లలకు ఆంగ్ల అందకుండా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. నేడు పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి కూడా ఆంగ్ల విద్య ప్రాధాన్యాన్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఆనాటి వైఎస్ జగన్ పాలనను గుర్తుచేస్తుంది అని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి నిక్కచ్చిగా మాట్లాడే నారాయణమూర్తి పలు అంశాల్లో అటు పక్షపాత మీడియాకు.. ఆంగ్ల మీడియం వద్దన్న నాయకులకు చురకల్లా తగిలాయని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న -
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ: సుదర్శన్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్‌తో పాటు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయలేదని ఆ పార్టీ లీగల్ సెల్ సీనియర్ నాయకుడు జల్లా సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్లను ఎన్నిక జరిగే ప్రాంతానికి వెళ్లనివ్వకుండా మార్గమధ్యలోనే కూటమి పార్టీలకు చెందిన గుండాలు అడ్డుకుని దౌర్జన్యం చేశారని అన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన పోలీసులు కూటమి నేతలకు అండగా నిలబడి, వైఎస్సార్సీపీ నేతలనే అరెస్ట్ చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఖూనీ అవుతోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం విజయవాడ నుంచి తరలివెళుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై మరోసారి కూటమి పార్టీలకు చెందిన గుండాలు దౌర్జన్యం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది. నిన్న కౌన్సిలర్లు ఎన్నికకు హాజరుకాకుండా కూటమి పార్టీలకు చెందిన వారు ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో అందరూ చూశారు. దీనితో ఈ రోజుకు ఎన్నికను వాయిదా వేశారు. ఏ విధంగా అయినా సరే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఈ రోజు కూడా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు హాజరుకాకుండా అడ్డుకోవడాలని, తమకున్న కొద్దిపాటి సభ్యుల నుంచే చైర్మన్‌ను ఎన్నుకోవాలని కూటమి పార్టీలు కుట్ర పన్నాయి.దీనిని అర్థం చేసుకున్న వైఎస్సార్సీపీ నిన్ననే ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఎన్నికకు హాజరయ్యేందుకు రక్షణ కల్పించాలని కోరిన మీదట, ఎన్నికల కమిషన్ డీజీపీతో పాటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలంటూ మెమో కూడా జారీ చేసింది. దీనిలో భాగంగానే వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎక్కడి నుంచి ఏ మార్గంలో తిరువూరు మున్సిపల్ కార్యాలయం వరకు వెడతారో పూర్తి వివరాలను సంబంధిత పోలీస్ అధికారులకు అందచేశాం.రక్షణ కల్పించాల్సిన పోలీసులే దౌర్జన్యానికి కొమ్ముకాశారునిన్న కూటమి పార్టీలు చేసిన దౌర్జన్యానికి భయపడి పలువురు కౌన్సిలర్లు విజయవాడ రామవరప్పాడులోని ఒక హోటల్లో తలదాచుకున్నారు. నిన్న టీడీపీ నేతలు కిడ్నాప్‌కు ప్రయత్నించడంతో మరో మహిళా కౌన్సిలర్ తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఇంట్లో ఆశ్రయం పొందారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి భద్రత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఈ మొత్తం అంశంపై కోర్ట్‌లో హౌస్ మోషన్ కింద పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. రాత్రి ఫైల్ చేసిన పిటీషన్‌ను ఈ రోజు పదిగంటలకు కోర్ట్ విచారణకు స్వీకరించింది. ఈ సందర్బంగా కోర్ట్ ఎదుట ప్రభుత్వం తరుఫు న్యాయవాది మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు పూర్తి రక్షణ కల్పించడం జరిగిందని చెప్పారు. అయితే ఏ అధికారి పర్యవేక్షణలో రక్షణ కల్పించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు రక్షణ కల్పించారని, ఒక ఏసీపీ స్థాయి అధికారిని నియమించి, ఆయన ద్వారా కోర్టుకు నివేదిక సమర్పించాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కోర్టులో ఈ అంశం విచారణలో ఉందని తెలిసి కూడా ఏ కొండూరు మండలం పడమట మాధవరం గ్రామం వద్ద కూటమి పార్టీలకు చెందిన వారు వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లను అడ్డుకున్నారు. కూటమి నేతల దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, నాయకుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్లను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో భయాందోళనలకు గురైన వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎన్నిక జరిగే ప్రదేశంకు వెళ్ళకుండానే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెనుదిరిగారు.వీరు సమావేశంకు వెడితే కూటమి పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఓడిపోతారు. అందుకే రెండోసారి కూడా ఎన్నిక జరగకుండా అధికారబలాన్ని ఉపయోగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. చట్టంలోని లొసుగును అడ్డం పెట్టుకుని మూడోసారి కోరం లేకపోయినా ఎన్నిక జరపవచ్చని చూపుతూ వారికి ఉన్న తక్కువ మంది కౌన్సిలర్ల నుంచే చైర్మన్‌ను ఎన్నుకోవాలన్నదే వారి లక్ష్యం. ఇలాంటి చర్యలను చూస్తే ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉందా అనే సందేహం కలుగుతోంది. న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగానే పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడం చూస్తూంటే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఖూనీ అయ్యిందని అర్థమవుతోంది. ఈ జరిగిన మొత్తం వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోతున్నాం. దీనికి బాధ్యులైన అధికారులపై న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుంది. -
మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం: వైఎస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి:’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.‘‘మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్ చేశాం. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్లని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కాని, మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూశాం, కాబట్టే అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా, చివరకు టీడీపీ వాళ్ల సమస్యలనూ తీర్చాం...జగనన్నకు చెబుదాం నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..👉స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు👉తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి పెట్టి, లాగేసుకునే ప్రయత్నంచేస్తోంది👉అయినా సరే మెజార్టీ వైయస్సార్సీపీ ఉండడంతే ఎన్నికను ఆపుతున్నారు:👉పోలీసులు వైయస్సార్సీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు, టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు👉సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు👉కుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే👉రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదు👉ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బి-ఫాం మీద గెలిచినప్పుడు, సంఖ్యాబలంలేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసం👉పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు👉యలమంచిలిలో మన వాళ్లు గట్టిగా నిలబడి గెలుపును సాధించుకున్నారు👉ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది👉కాని చంద్రబాబుగారి పరిపాలనలో నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది👉మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు👉జగన్ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు👉కాని వాటన్నింటినీ తుంగలో తొక్కాడు 👉కాని, మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త మనం అమలు చేసిన మేనిఫెస్టోతో ప్రతి ఇంటికీ వెళ్లాడు👉గడపగడపకూ కార్యక్రమం కింద మూడుసార్లు ప్రతి ఇంటికీ వెళ్లారు:👉99శాతం హామీలను అమలు చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో వైయస్సార్సీపీ మాత్రమే👉మనం చేసిన మంచి ఎక్కడకూ పోదు👉10 శాతం ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారు👉ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్‌బాల్ తన్నినట్టు ఈ ప్రభుత్వాన్ని తంతారు👉వైఎస్సార్సీపీ మాదిరిగా ప్రతి ఇంటికీ వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా?👉హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉంది👉మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు మాత్రమే అని చంద్రబాబుగారు నిరూపించారు👉పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు👉ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు👉రూ.3600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు👉ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు👉వైద్యంకోసం అప్పులు పాలు అయ్యే పరిస్థితి👉ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడంలేదు👉ప్రభుత్వం రంగంలో వైయస్సార్సీపీ తీసుకొచ్చిన కాలేజీలను చంద్రబాబు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు:👉కొత్తగా మూడు పోర్టులు నిర్మాణం ప్రారంభించాం👉శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లాం👉ఇప్పుడు ఆమూడు పోర్టులను కమీషన్లకోసం అమ్మేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు👉ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నడిపించాం👉ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు పెట్టాం👉బోగాపురం ఎయిర్‌పోర్టుకు గత చంద్రబాబు హయాంలో అనుమతులు లేవు, భూసేకరణ లేదు👉మనం అన్నీచేసి 30శాతం పనులు చేశాం👉రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పనులు కేవలం వైయస్సార్సీపీ హయాంలోనే జరిగాయి👉ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి👉వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నాడు👉ప్రజలను వెన్నుపోటు పొడిచాడు👉ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చాడు👉రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు👉ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నాడు👉చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు👉తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు 👉గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు👉పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు👉ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను👉జగన్ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది👉కోవిడ్ కారణంగా ఐదేళ్లపాలనలో అనుకున్నంతమేర సరిగ్గా చేయలేకపోయాం👉ఇవాళ మీ కష్టాలను చూస్తున్నాను 👉రేపు కచ్చితంగా వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ ఒన్👉అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి👉కొడతానంటే.. కొట్టమనండి👉కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి👉కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం👉రిటైర్డ్ అయిన వారినీ లాక్కుని వస్తాం👉దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం👉అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం👉మనకూ టైం వస్తుంది👉చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి👉చంద్రబాబు దుర్మార్గపు పాలనవల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోంది👉మహిళలను అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు👉ఒక కేసులో బెయిల్ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు👉ఇలా కేసులు మీదు కేసులు పెడుతన్నారు👉వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారు👉దళితుడైన ఎంపీ నందిగం సురేష్ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు👉సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు👉తనను, తన కుటుంబ సభ్యులను తిడితే, ఎందుకు తిట్టావన్నందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు👉చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు మహావృక్షం అవుతుందని మరిచిపోవద్దు👉రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాటాలు చేద్దాం👉వచ్చేది మన ప్రభుత్వమే👉మంచి రోజులు కచ్చితంగా వస్తాయి -
చదువులకు ‘ప్రేమ్’తో..
మనదేశంలో ఆడపిల్లలు చదువుకోవాలంటే ప్రధాన సమస్య డబ్బు. ప్రాథమిక విద్య పూర్తి కాగానే.. ఆర్థిక స్థోమత లేక, పెళ్లీడు రాగానే పెళ్లిచేసి పంపించేస్తే సరిపోతుందని.. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. అయినా ఇప్పటికీ లక్షల మంది బాలికలు బడికి పోవడం లేదు. అలాంటి అమ్మాయిల ఉన్నత విద్యకు చేయూత ఇచ్చేందుకు అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ (Azim Premji Foundation) ముందుకొచ్చింది. వచ్చే మూడేళ్లలో ఏటా రూ.750 కోట్ల చొప్పున బాలికల కాలేజీ చదువుల కోసం భారీ ఎత్తున రూ.2,250 కోట్లు వెచ్చించనుంది.అజిమ్ ప్రేమ్ జీ..దేశంలోని అపర కుబేరుల్లో ఒకరు. ఆయన స్థాపించిన విప్రో కంపెనీ అంటే విలువలకు పెట్టిందిపేరు. అజిమ్ ప్రేమ్‌జీ అనగానే దాతృత్వం గుర్తుకొస్తుంది. 2019లో విప్రో కంపెనీలో తన వాటా 7.6 బిలియన్ డాలర్లను తన అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 2023 జనవరి వరకు సేవా కార్యక్రమాల ద్వారా రూ.2,40,000 కోట్లు ఖర్చు చేసినట్లు అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ వెల్లడించింది.కరోనా సమయంలో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, ఇతర సాయం కోసం సుమారు రూ.2,000 కోట్లు ఖర్చు చేశారు. కర్ణాటకలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు 2024 నుంచి.. వారంలో నాలుగు రోజులు ఉచితంగా కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. దీనిద్వారా 55 లక్షల విద్యార్థులకు గుడ్లు అందించేందుకు ఏడాదికి రూ.800 కోట్ల వ్యయం చేస్తున్నారు. చెప్పుకొంటూ పోతే ఈ జాబితా పెద్దదే. ఇంత దొడ్డ మనసున్న ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2.5 లక్షల మందికి.. అజిమ్ ప్రేమ్‌జీ స్కాలర్షిప్ పథకం ద్వారా ఎంపికైన మొత్తం 2,50,000 మంది అమ్మాయిలకు సంవత్సరానికి రూ.30వేల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు. అంటే సంవత్సరానికి రూ.750 కోట్లు.. మూడేళ్లకు రూ.2250 కోట్లు మేర బాలికల ఉన్నత విద్య కోసం అజిమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ వెచ్చించనుంది. తద్వారా దేశంలో∙లాభాపేక్షలేని సంస్థ ద్వారా అమలవుతున్న భారీ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ – డీబీటీ) గా ఇది నిలవనుంది.అజిమ్ ప్రేమ్‌జీ స్కాలర్షిప్ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి, 12వ తరగతి పూర్తి చేసుకున్న అమ్మాయిలు అజిమ్ ప్రేమ్‌జీ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీ లేదా యూనివర్సిటీలో రెగ్యులర్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో చేరిన అమ్మాయిలు కూడా దరఖాస్తుకు అర్హులే. ఇలా ఆయా కోర్సులో చేరి స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులకు కోర్సు పూర్తయ్యే వరకూ ఏటా రూ.30వేల ఉపకారవేతనం అందుతుంది. ఇలా మూడేళ్ల డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు పూర్తి చేసుకునే వరకూ ప్రతి విద్యార్థినికి మొత్తం రూ.90వేల ఉపకార వేతనం లభిస్తుంది. ప్రతి ఏటా సెపె్టంబర్లో ఈ స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు అవసరమైన పత్రాలు.. పదో తరగతి, 12వ తరగతి మార్కుల పత్రాలు, డిగ్రీ లేదా డిప్లొమా కాలేజీలో అడ్మిషన్ లెటర్/బోనఫైడ్ సర్టీఫికెట్, ఫీజు రిసిఫ్ట్, పాస్‌పోర్టు ఫొటోలు.ప్రేమ్‌జీ ఫౌండేషన్విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్‌జీ ఆధ్వర్యంలో 2001లో అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఏర్పాటైంది. దాతృత్వ కార్యక్రమాల ద్వారా దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాలనే ఆశయంతో ఏర్పాటు చేసిన లాభాపేక్షలేని సంస్థ ఇది. ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, జీవనోపాధి తదితర రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ‘బాలికలు ఉన్నత విద్యను పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో అజిమ్ ప్రేమ్‌జీ స్కాలర్షిప్లను ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ పూర్తిచేసిన బాలికలు ఈ ఉపకార వేతనం పొందేందుకు అర్హులు. ఉన్నత విద్యను పూర్తిచేసుకోవడంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే బాలికలు అజిమ్ ప్రేమ్‌జీ స్కాలర్షిప్ ద్వారా వారు తమ చదువులు కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. ఉన్నత విద్యావంతులైన మహిళలు తమ జీవితంలో సాధికారతను సాధించగలరు’అంటారు అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సీఈవో అనురాగ్ బెహరా.https://azimpremjifoundation.org/ఉన్నత విద్యలో చేరేది మూడొంతులే..ఆర్థిక సర్వే 2024–25 ప్రకారం దేశంలోని 15 లక్షల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 25 కోట్ల మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో సగం మంది ప్రభుత్వ బడుల్లోనే చదువుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో సగటు చేరికలు (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) 93 శాతం ఉంటే.. ఆరో తరగతికి వచ్చేసరికి అది 77.4 శాతానికి డిపోతోంది. కేవలం 56.2 శాతం మంది మాత్రమే 12వ తరగతి పూర్తి చేసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా కేవలం మూడోవంతు మంది కాలేజీ విద్యలో చేరుతున్నారు. కాలేజీల్లో చేరే వారిలో బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య తక్కువే. దీనికి ప్రధాన కారణం ఆర్థిక వెనుకబాటుతనం. విప్రో సామాజిక బాధ్యత విప్రో కంపెనీ సామాజిక బాధ్యత కింద భారీ ఎత్తున అనేక కార్యక్రమాలు చేపడుతోంది. విప్రో వార్షిక నివేదిక 2023–24 ప్రకారం.. 2023–24లో ఆ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమాల కోసం రూ.17,900 కోట్లకుపైగా వెచ్చించింది. దీనిద్వారా విద్య, వైద్యం, డిజిటల్ స్కిల్లింగ్ వంటి అంశాల్లో 17 దేశాల్లోని 45 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 2020–21 నుంచి 2023–24 వరకు.. మనదేశంలో విద్యా రంగంలో 29 లక్షల మంది లబ్ధి పొందారు. ఇదే సమయంలో.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విభాగంలో 38 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. -
దక్షిణ కోస్తా, సీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఆవరించి ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాగా, పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటే సూచనలున్నాయని కూడా పేర్కొన్నారు. -
లోకేశ్‌కి ప్రమోషన్!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో అపరిమిత అధికారాలు చెలాయిస్తున్న తన కుమారుడు, మంత్రి లోకేశ్‌కి మరింత ప్రాధాన్యత కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనధికారికంగా అన్ని వ్యవహారాల్లో ఆయన మాటే శాసనంగా నడుస్తున్నా, అధికారికంగా సీఎం, డిప్యూటీ సీఎం తర్వాతే ఉన్నారు. దీంతో తనకు మరింత ప్రాధాన్యత కల్పించాలని లోకేశ్ చాలారోజుల నుంచి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన అభీష్టానికి అనుగుణంగానే కొందరు టీడీపీ నేతలు లోకేశ్‌ను సీఎం చేయాలని, పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని, మరికొందరు డిప్యూటీ సీఎం పదవి కేటాయించాలని తరచూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌ని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహానాడులో ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రకరకాల డిమాండ్లు.. చివరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి? కొద్ది నెలల క్రితం లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే వాదన పార్టీలో గట్టిగా వినిపించింది. ఆ సమయంలోనే దావోస్ పర్యటనలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ లోకేశ్ తమ భావి ముఖ్యమంత్రి అని ప్రకటించి విమర్శలపాలయ్యారు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో లోకేశ్‌కి ఏడాదిలోనే కొత్త పదవి ఇచ్చే విషయంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన కోరిక నెరవేరలేదని తెలుస్తోంది. కానీ పార్టీ పదవి అనేది ఆ పార్టీ సొంత వ్యవహారం కాబట్టి అందులోనే కీలక పదవి ఇవ్వడం ద్వారా మరింత ప్రాధాన్యత కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తద్వారా తన తర్వాత తన కుమారుడే అని అధికారికంగా చెప్పినట్లవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. కడపలో ఈ నెల 27 నుంచి జరిగే మహానాడులో లోకేశ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. తద్వారా ఆయన ప్రాధాన్యత మరింత పెరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.పార్టీ కమిటీల్లోనూ భారీ మార్పులు.. సీనియర్లకు చెక్ఈ మహానాడులో పార్టీ పొలిట్‌బ్యూరో, అన్ని కమిటీల్లో భారీ మార్పులు చేయనున్నారు. చంద్రబాబు సమకాలీకులుగా ఉన్న నేతలను పక్కన పెట్టి తనకు అనుకూలంగా ఉండే వారిని ఈ కమిటీల్లోకి తీసుకునేందుకు లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో 25 మంది ఉండగా, వారిలో చాలామంది పాతవారే. యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నక్కా ఆనంద్‌బాబు, గల్లా జయదేవ్, పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్ వంటి సీనియర్లు ఉన్నారు.వారిలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నా ఏమాత్రం ప్రాధాన్యత లభించడంలేదు. యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయలేదు. కాకినాడ సెజ్ వ్యవహారంలో ఆయన చంద్రబాబుకు లేఖ రాయడంతో పార్టీ శ్రేణులతో ఆయన్ను తీవ్ర స్థాయిలో అవమానించేలా ప్రెస్మీట్లు పెట్టి తిట్టించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయించారు. అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్, గోరంట్ల, సోమిరెడ్డి, కళా, చినరాజప్ప వంటి వారికి చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా కష్టంగా మారింది.వీరందరినీ పొలిట్‌బ్యూరో నుంచి తప్పించి కొత్త వారిని నియమించనున్నట్లు సమాచారం. పార్టీ కమిటీల్లోనూ కొత్త వారికి అవకాశం కల్పిస్తామని లోకేశ్ పదేపదే చెబుతున్నారు. ఇందుకోసమే ఇటీవల వరుసగా మూడుసార్లు పార్టీ పదవిలో ఉన్నవారిని ఆ పదవుల్లో కొనసాగించకూడదని పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేయించారు. దీంతో సీనియర్లకు చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుండడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ కోసం అహరి్నశలూ కష్టపడితే లోకేశ్ కోసం చంద్రబాబు తమను అవమానిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. -
సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 సెక్షన్ 30 కింద తుది విచారణ (ట్రయల్) సందర్భంగా ఏ వాంగ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.హైకోర్టు అభిప్రాయంతో తాము ఎంతమాత్రం ఏకీభవించలేమని స్పష్టం చేసింది. సహ నిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో పరిగణనలోకి తీసుకోవడానికే వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చింది సాక్షా? లేక నిందితుడా? లేక నిందితుడిగా మారే వ్యక్తా? అన్న విషయాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో 161 వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి నిందితుడు కాకపోవచ్చు.. ఆ తరువాత నిందితుడు కావొచ్చని పేర్కొంది. నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని తెలిపింది. రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలు చూపారు.. ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కృష్ణమోహన్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, వికాట్ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బొర్జూర్ పారీ్థవాలా, జస్టిస్ మహాదేవన్‌ల ధర్మాసనం వాటిని కొట్టేసింది.దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదంటూ పిటిషన్లు కొట్టేసింది. ఇదే సమయంలో మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలను చూపారని, ఇందుకు ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పునకు సంబంధించిన కాపీ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పులో ధర్మాసనం నిందితుల వాంగ్మూలాల గురించి పూర్తిస్థాయిలో చర్చించింది. కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలానికి ఆమోద యోగ్యత లేదు... ‘భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 24 ప్రకారం సహ నిందితుడిపై మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు.. ఆ వాంగ్మూలాన్ని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యంగా రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ వాంగ్మూలం భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నదై ఉండకూడదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలాన్ని నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి వీల్లేదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలం భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 25 ప్రకారం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా కేసు ట్రయల్ సందర్భంగా పరిశీలించాల్సి ఉంటుంది. నిందితులందరినీ ఉమ్మడిగా విచారించినప్పుడు (జాయింట్ ట్రయల్) మాత్రమే సహ నిందితుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారిని ఒకే కేసులో, ఒకే కోర్టులో కలిపి విచారిస్తున్న సమయంలోనే వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యమవుతుంది.సెక్షన్ 30 కింద అభియోగాలు నమోదు కానప్పుడు, నిందితులను విచారణకు హాజరుపరచనప్పుడు భారతీయ సాక్ష్యాల చట్టం వర్తించదు. ఈ నేపథ్యంలో నిందితుల వాంగ్మూలాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోజాలవు. ఒకవేళ సహ నిందితుల వాంగ్మూలాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చని అనుకున్నా కేవలం నేరాంగీకార వాంగ్మూలమే కాకుండా సహ నిందితుడిపై ఉన్న ఇతర స్వతంత్ర సాక్ష్యాలను కూడా కోర్టు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. సెక్షన్ 25 ప్రకారం కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలాలకు ఆమోద యోగ్యత లేనందున ఆ వాంగ్మూలాలను సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించరాదు. సెక్షన్ 26 ప్రకారం మేజి్రస్టేట్ సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు‘నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. ఇదే విషయాన్ని సాహిబ్ సింగ్‌తో పాటు పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.2022లో ఇంద్రేష్ కుమార్ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదని, అయితే బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు, చెప్పింది. ఈ కేసులో పూర్వాపరాల ఆధారంగా ఆ తీర్పునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు కేవలం సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలకే వర్తిస్తుంది గానీ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు కాదు. ఆ తీర్పులో ఎక్కడా కూడా నిందితులు పోలీసులకిచ్చిన వాంగ్మూలాలను బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పలేదు. సెక్షన్ 161 కింద ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలానికి, ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా ఉంది.పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని విస్మరించవచ్చు. నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడకూడదన్న న్యాయ సూత్రానికి ఓ మినహాయింపు ఉంది. నిందితుడి వాంగ్మూలం నేరాన్ని రుజువు చేసేదే కాక, అది విశ్వసించేదిగా, ఆధార సహితంగా ఉన్నప్పుడు ఆ వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడొచ్చు. అయితే నిందితుడి వాంగ్మూలమొక్కటే సరిపోదు. సహ నిందితుడి పాత్రను రుజువు చేసేందుకు ఇతర సాక్ష్యాలు కూడా కావాల్సి ఉంటుంది. ఆ సాక్ష్యాలు నిందితుడి వాంగ్మూలానికి మద్దతునిచ్చేవిగా ఉండాలి. అందువల్ల సహ నిందితుడికి వ్యతిరేకంగా ముఖ్యంగా పోలీసు అధికారి ముందు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. - సుప్రీంకోర్టుకేవలం సహ నిందితుని కన్ఫెషన్ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి బెయిల్‌పై నిర్ణయం తీసుకోరాదని తన జడ్జిమెంట్‌లో పలు పేరాల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందులోని కొన్ని ...34. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం, ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా అలాగే మరొకరిని కూడా దోషిగా సూచిస్తూ చేసిన అంగీకారాన్ని (కన్ఫెషన్), వారు ఇద్దరూ ఒకే సమయంలో ఒకే కేసులో సంయుక్తంగా విచారణకు లోనవుతున్నప్పుడు, ఆ కోర్టు ఆ అంగీకారాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అయితే, ఈ అంగీకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మరొకరిని శిక్షించకూడదు. దానిని మిగతా ఆధారాలతో కలిపి పరిశీలించాలి.39. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30పై హైకోర్టు తనదైన అర్థాన్ని కలిగి ఉంది. సెక్షన్ 30 కింద అంగీకరించదగినదిగా (కన్ఫెషన్) ఉన్న విషయం, ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ పిటిషన్ పరిశీలన సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, హైకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు. మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్న అభిప్రాయం ఏమిటంటే– అటువంటి ఒప్పుకోలు ఏదైనా ఉన్నా, అది ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ ఇచ్చే దశలో పరిగణనలోకి తీసుకోరాదు. దీనికి ప్రధాన కారణాలు ఇవే:(1) ఒక సహ–ఆరోపితుడిపై ఒప్పుకోలు (కన్ఫెషన్) ఆధారంగా నిర్ణయం తీసుకోవాలంటే, ఆ ఒప్పుకోలు చేసిన వ్యక్తిపై ముందు నేరం నిరూపితమవ్వాలి. అది సెక్షన్ 24 వీగిపోకూడదు. లేదా సెక్షన్ 25 ప్రకారం చట్టవిరుద్ధంగా ఉండకూడదు. ఇది పూర్తిగా కోర్టు విచారణ సమయంలోనే తేలుతుంది. కేసు నిరూపణ కోసం విశ్వసనీయ, బలమైన సాక్ష్యాలు కోర్టులో ఉంచాల్సి ఉంటుంది, తద్వారా నేరం స్పష్టంగా నిరూపితం కావాలి. ‘దీపక్ భాయ్ జగదీష్ చంద్ర పటేల్ (వర్సెస్) స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ అదర్స్ (2019) 16 ఎస్సీసీ 547’లో అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని చెప్పింది. పోలీసు అధికారుల ముందు ఇచ్చిన ఒప్పుకోలు, కోర్టులో సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదు. సెక్షన్ 30 ప్రకారం పరిగణనలోకి తీసుకునే స్టేట్మెంట్ సరైనదై ఉండాలి, చట్టబద్ధమైనదై ఉండాలి. ఇది ఈ సెక్షన్ మూల లక్ష్యం.49. (10) ముందస్తు (యాంటిసిపేటరీ) లేదా సాధారణ (రెగ్యులర్) బెయిల్ విచారణకు సంబంధించి కోర్టు సీఆర్పీసీ 161 ప్రకారం పోలీసుల ముందు ఒక వ్యక్తి ఇచ్చిన ప్రకటనను పరిశీలించే ముందు, ఆ వ్యక్తి వాస్తవంగా సాక్షినా, నిందితుడా, లేక భవిష్యత్తులో నిందితుడిగా మారే అవకాశం ఉన్నవాడా అనే విషయాన్ని మొదట తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే 161‑సెక్షన్ ప్రకటన‑ సమయంలో ఆ వ్యక్తి నిందితుడి జాబితాలో లేకపోయినా, దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో తర్వాత అతను నిందితుడిగా చేర్చబడే పరిస్థితులు ఏర్పడవచ్చు.ఈ నేపథ్యంలో, మొదట సాక్షిగా ఉన్న వ్యక్తి తర్వాత నిందితుడిగా మారవచ్చన్న భావాన్ని కోర్టులు ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎఫ్ఐఆర్లో పేరు లేదని మాత్రమే కారణం చెప్పుకుని ఆ వ్యక్తి ప్రకటనపై ఆధారపడితే, అతన్ని నిందితుడిగా చేర్చే దశ వచ్చే వరకు ఆ ప్రకటనను నమ్ముకునే అసంబద్ధ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే, రికార్డుల ప్రకారం ఆ వ్యక్తిని నిందితుడిగా చేర్చే అవకాశముందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తే, దర్యాప్తు ఏ విధంగానూ ప్రభావితం కాకుండా కోర్టులు ఏ విధమైన అభిప్రాయాన్ని ప్రకటించకుండా జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము. -
నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ఆహ్వానించారు. వారితోపాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. -
బాబు ప్రభుత్వ ‘చావు’ తెలివి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలకు మరింతగా బరితెగిస్తోంది. ఎంతగా అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సహజ మరణాలు, వృద్ధాప్య, అనారోగ్యసమస్యలతో మరణాలనూ వక్రీకరిస్తూ అక్రమ కేసుల నమోదుకు తెగబడుతోంది. 2022, మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 16 మంది మరణించారు. కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో వారు మరణించారు.వీటిపై అప్పట్లోనే ఎల్లో మీడియా సహకారంతో అప్పటి ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేసింది. కల్తీసారా తాగి మరణించారని దుష్ప్రచారం చేసింది. అప్పట్లోనే విచారణ చేపట్టిన అధికారులు ఆ 16 మంది అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే మరణించారని నిర్ధారించారు. కాగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మరణాలపై విచారణ పేరుతో కొత్త కుట్రకు తెరతీయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ వత్తాసు⇒ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుమరో అక్రమ కేసుకు తెరతీయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వత్తాసు పలికారు. మూడేళ్ల క్రితం నాటి సహజ మరణాలపై తాజాగా ఆయన సందేహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. ఆ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. కల్తీ సారా వల్లే ఆ మరణాలు సంభవించాయని ఎఫ్ఎస్ఎల్ వెల్లడించిందని కూడా ఆయన ఏకపక్షంగా ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. విచారణతో నిమిత్తం లేకుండా ఏకంగా డీజీపీనే ఏకపక్షంగా కల్తీ సారా అని చెప్పేయడం విడ్డూరంగా ఉంది.అంటే రాబోయే నివేదిక ఎలా రూపొందించాలన్నది కూడా ఆయన పోలీసు అధికారులకు పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక తాము అనుకున్నట్టుగా డీజీపీ ద్వారా నివేదిక రాగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ మరణాలపై దర్యాప్తునకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిశోర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగం అధిపతి కె.ఉమామహేశ్వరరావుతో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2022లో జంగారెడ్డిగూడెంలో 16మంది మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అప్పటి అధికారులు చేపట్టిన విచారణలో లోపాలు ఉంటే గుర్తించాలని, తదుపరి తీసుకోవాల్సిన న్యాయ, పరిపాలన, సాంకేతికపరమైన చర్యలను సూచించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే 16 మంది మృతి⇒ ఆనాడే అధికారుల దర్యాప్తులో వెల్లడిజంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో 16మంది మృతిపై అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటి పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్‌వో బి. రవి నేతృత్వంలో రెవెన్యూ, వైద్య అధికారులు మరణించిన 16 మంది నివాసాలకు వెళ్లి విచారణ చేశారు. మృతుల బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు.వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. వైద్య నివేదికలు పరిశీలించారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నిర్ధారించారు. వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం వ్యసనం ఉందని కూడా తేల్చారు. వారు కూడా జంగారెడ్డిగూడెంలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారి మరణానికీ కేవలం మద్యంపానం ఒక్కటే కారణం కాదు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం ఆ 16 మంది మృతికి కారణాలు ఇవీ...నాటి ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ విచారణలోనూ అదే వెల్లడిఆయనే ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మరణాలపై పోలీసు విచారణ కూడా నిర్వహించింది. అప్పటి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆ విచారణ నిర్వహించారు. ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అప్పటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైమావతి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, డీఎంహెచ్‌వో బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీకృష్ణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి, సూపరింటెండెంట్ బి.అరుణ కుమారి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులతో సమీక్షించారు.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నివేదించారు. అప్పుడు దర్యాప్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు కూడా. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అక్రమ కేసు నమోదుకు సిద్ధపడుతుండటం కేవలం రాజకీయ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది. -
నేడు విద్యుత్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, అమరావతి: విద్యుత్ శాఖ ఉద్యోగులు మంగళవారం దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక, ఉపాధి చట్టాలను ఏకీకృతం చేసి కేవలం నాలుగు కోడ్ (నియమావళి)లుగా రూపొందించి రాష్ట్రాల్లో అమలు చేయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే పలు రాష్ట్రాల్లో అమల్లోకి కూడా తీసుకువచ్చింది.దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ ఉద్యోగుల, కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఇంజనీర్స్ జాతీయ సమన్వయ ఐక్య కమిటీ (ఎస్‌సీసీఓఈఈఈ) ఏర్పాటైంది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు ఈ కమిటీ పిలుపునిచి్చంది. రాష్ట్రంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ దీనికి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు, నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. -
ప్రజాస్వామ్యానికి.. టీడీపీ పాతర
సాక్షి, అమరావతి/నెట్వర్క్: గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ సహా వివిధ మున్సిపల్ చైర్పర్సన్లు, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, 20 పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవుల కోసం సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ.. అక్రమాల జాతర నడిపించారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి మంగళవారానికి వాయిదా వేశారు. నరసరావుపేట, కారంపూడిలో దొడ్డిదారిన.. నరసరావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రెండుసార్లు ఎన్నిక నిర్వహించగా కోరం లేక వాయిదా పడింది. మూడోసారి సోమవారం ఎన్నిక నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి టీడీపీ తరఫున ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులకు నిరసనగా ప్రత్యేక సమావేశాన్ని వైఎస్సార్సీపీ బహిష్కరించింది.మూడోసారి నిర్వహిస్తున్న ఎన్నిక సమావేశం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి ప్రత్యేక అధికారాన్ని వినియోగించి.. సమావేశానికి ఎన్నికైన ముగ్గురు ఎంపీటీసీల్లో కొత్తపాలెం ఎంపీటీసీ వంపుగుడి సువార్తమ్మ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. కాగా.. కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా టీడీపీ బలపరిచిన గాడిపర్తి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇక్కడ 14 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుని దాడులు చేశారు. భయానక వాతావరణం సృష్టించి టీడీపీ ఈ పదవిని తన ఖాతాలో వేసుకుంది. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడి.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల రాజకీయం చేసింది. పదవులు, డబ్బు ఎరగా వేసి.. వినని వారిని కేసులతో భయపెట్టి తమ వైపు ఓటు వేయించుకుంది. గాండ్లపెంట మండలంలో టీడీపీకి కేవలం ఒక్క ఎంపీటీసీ మాత్రమే ఉండగా.. డబ్బులు ఎరవేసి ముగ్గురు ఎంపీటీసీలను తనవైపు తిప్పుకుంది. పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఎంపీపీ పదవి కట్టబెట్టింది. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళా అభ్యర్థి లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి కుట్రలకు బలైంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబీ నాయన ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి టీడీపీ వైపు తిప్పుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో రాంబార్కి శరత్ ఎన్నికయ్యారు. గ్రేటర్ విశాఖలో జనసేనకు ఝలక్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేన పారీ్టకి టీడీపీ కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. ఈ పదవి జనసేనకు ప్రకటించడంతో పలువురు టీడీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకాకుండా షాకిచ్చారు. గత నెల 28న నిర్వహించిన మేయర్ ఎన్నికకు 74 మంది సభ్యులు హాజరుకాగా.. సోమవారం నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు కేవలం 54 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నిక ప్రత్యేక సమావేశానికి 56 మంది సభ్యులు హాజరుకావాలి. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. యలమంచిలి ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం రెండు నెలలపాటు అధికార పార్టీ అక్రమ కేసులు, తీవ్రస్థాయి బెదిరింపులు, మానసిక వేధింపుల్ని తట్టుకుని వైఎస్సార్సీపీలోనే కొనసాగిన ఎంపీటీసీ ఇనుకొండ ధనలక్ష్మి పశి్చమ గోదావరి జిల్లా యలమంచిలి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీకి బలం లేకపోయినప్పటికీ అత్తిలి ఎంపీపీ స్థానాన్ని, కైకలూరు వైస్ ఎంపీపీ స్థానాన్ని బెదిరింపులతో దక్కించుకుంది. అత్తిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చిల్లర రాజకీయాలకు తెగబడ్డారు. ఆపార్టీ తీవ్రస్థాయి బెదిరింపులతో కొందరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను టీడీపీలో చేర్చుకుని అత్తిలి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ జయకేతనం ప్రకాశం జిల్లా మార్కాపురం, త్రిపురాంతకం మండల ఉపాధ్యక్షుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మార్కాపురం వైస్ ఎంపీపీ–2గా కుందురు మల్లారెడ్డి, త్రిపురాంతకం వైస్ ఎంపీపీగా పాటిబండ్ల కృష్ణ ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా వైఎస్సార్సీపీకి చెందిన ఎనుముల సోమశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె రెండో వైస్ ఎంపీపీగా చెర్లోపల్లె వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అనసూయమ్మ ఎన్నికయ్యారు. -
ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని తొమ్మిది ఉపాధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో.. ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ఐక్యవేదిక నేతలు మీడియాకు వెల్లడించారు. నిజానికి.. విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని సర్కారు బలహీనపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.దీంతో.. ఉపాధ్యాయుల సర్దుబాటు, పాఠశాలల రేషనలైజేషన్, ఉపాధ్యాయుల బదిలీ చట్టంలోని పలు అంశాలపై సోమవారం గుంటూరు జిల్లా ఆత్మకూరులోని విద్యాభవన్‌లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో మొత్తం 19 డిమాండ్లను విద్యాశాఖ ముందుంచామని.. కొన్ని అంశాలపైనే సానుకూల స్పందన వచ్చిందని.. కీలక అంశమైన ఇంగ్లిష్‌కు సమాంతరంగా తెలుగు, ఇతర మైనర్ మీడియంలను కొనసాగించి స్టాఫ్ పాటర్న్‌ను కొనసాగించాలన్న డిమాండ్‌ను అంగీకరించలేదని నేతలు తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో 1 : 35 నిష్పత్తిని అమలుచేయాలని.. 45 మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్ ఏర్పాటుపైనా స్పష్టత రాలేదన్నారు.అలాగే.. మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాస్త్రీయమైందని వారన్నారు. ఫౌండేషన్ స్కూళ్లల్లో 1 : 20 నిష్పత్తిలో ఉపాధ్యాయుల కేటాయింపునకు చర్చల్లో అంగీకరించారని, అయితే ఇది జీఓ–117లో ఉన్న అంశమేనన్నారు. ఇక స్టడీ లీవ్‌లో ఉండి రెండు నెలల్లో సర్వీసులో చేరే ఉపాధ్యాయుల పోస్టులను బదిలీల్లో ఖాళీగా చూపబోమని చెప్పడం.. కేవలం 1,400 మంది ఎస్జీటీలకు మాత్రమే పదోన్నతులిచ్చి హెచ్ఎంలుగా నియమిస్తామడంలో అర్థంలేదని నేతలు తెలిపారు. మరోవైపు.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఇప్పటికే రావడంతో అందులో మార్పులు సాధ్యంకాదని అధికారులు తేల్చిచెప్పడంతో ఉపాధ్యాయులు గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈనెల 21న డీఈఓ కార్యాలయల ముట్టడికి సిన్నద్ధమవుతున్నారు.మంత్రి జోక్యం చేసుకోవాలి..ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయ బదిలీలు, పాఠశాలలు పునర్వ్యవస్థీకరణపై ఉపాధ్యాయ సంఘాలతో సోమవారం జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి లోకేశ్ జోక్యం చేసుకోవాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ కోరారు. -
ఆధ్యాత్మిక నగరంలో అ‘సుర’పానం తెల్లార్లు తాగిస్తున్నారు
తిరుపతి మంగళం: తిరుపతి పేరు చెప్పగానే.. ఆధ్యాత్మిక సౌరభాలే గుర్తొస్తాయి. భక్తుల గోవింద నామాలు చెవుల్లో మార్మోగుతాయి. నుదిటిన మూడు నామాలు ధరించి.. వేయి నామాల వాడిని కొలిచే భక్తులే అన్ని మూలలా కనిపిస్తారు. ఇదంతా ఏడాది క్రితం మాట. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు తిరుపతిలో ఏ మూలకు వెళ్లినా అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం షాపులు, బార్లన్నీ బార్లా తెరిచే ఉంటున్నాయి. వాటిలోంచి తూలుతూ.. తుళ్లుతూ.. పడుతూ.. లేస్తూ వచ్చేవారే కనిపిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి లీలామహల్ వద్ద బడి వైన్స్‌లో అర్ధరాత్రి 12.04 గంటలకు మద్యం విక్రయాలు దర్జాగా సాగిపోగా.. మందుబాబుల సందడి చేయడం కనిపించింది. ఐఎస్ మహల్ సమీపంలో హారిక బార్లో అర్ధరాత్రి 12.19 గంటలకు సైతం మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.అర్ధరాత్రి 1.11 గంటలకు డీబీఆర్ రోడ్డులోని బడి వైన్స్‌లో అక్కడి సిబ్బంది యథేచ్ఛగా మద్యం అమ్ముతూ కనిపించారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో నైన్ స్టార్ మద్యం షాపు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు సైతం తెరిచి ఉండగా.. అక్కడ దర్జాగా మద్యం సేవిస్తున్న వారే కంటపడ్డారు. ఉదయం 5.14 ఎమ్మార్ పల్లి వైకుంఠపురంలో విక్టరీ వైన్స్‌లో జంకు లేకుండా మద్యం విక్రయాలు చేస్తుండగా.. డీఆర్ మహల్ రోడ్డులోని టీవీఎస్ షోరూం ఎదురుగా గల çహరి వైన్స్లోను.. ఉదయం 5.37 గంటలకు కేకే మద్యం షాపులో మందుబాబులు తాపీగా మద్యం తాగుతూ కనిపించారు. ఉదయం 6 గంటలకు గ్రూప్ థియేటర్స్ సమీపంలోని ఎస్వీ బార్, 6.03 గంటలకు దేవేంద్ర థియేటర్ రోడ్డులోని విక్టరీ వైన్స్, 6.09 గంటలకు జయశ్యాం థియేటర్ రోడ్డులోని మద్యం దుకాణం, ఉదయం 6.13 గంటలకు జీవకోనలోని రాజీవ్‌గాంధీ కాలనీలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.మద్యానికి చిరునామాగా..ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నిద్ర లేవగానే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ఇక్కడి ప్రజలు మొక్కుతుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తిరుపతి విచ్చేస్తుంటారు. అంతటి విశిష్టత కలిగిన నగరాన్ని కాస్తా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మద్యానికి చిరునామాగా మార్చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణలతో మార్మోగాల్సిన ఆధ్యాత్మిక నగరం మందుబాబుల ఆగడాలు, రచ్చలతో దద్దరిల్లుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పవిత్ర క్షేత్రంలో 24 గంటలూ మద్యం విక్రయిస్తూ ఏరులై పారిస్తున్నారు.తిరుపతి నగర ప్రజలతో పాటు శ్రీవారి భక్తులకు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్కపోవచ్చు కానీ.. చంద్రబాబు పుణ్యమా అని మద్యం మాత్రం నిత్యం దొరుకుతోంది. కూటమి పాలనతో మద్యం దుకాణాల్లో రేయింబవళ్లు మద్యం విక్రయాలు సాగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, పార్టీ నాయకులు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ తిరుపతి నగరంలో పర్యటన జరిపారు. ఏ మూలకు వెళ్లినా మద్యం షాపులు, బార్లలో మద్యం విక్రయాలు జరుపుతుండటాన్ని గమనించారు. మద్యం బాటిళ్లు పగులగొట్టి నిరసనఆదివారం ఉదయం 5 గంటల నుంచే తిరుపతి రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న నైన్ స్టార్ లిక్కర్ షాపులో మద్యం విక్రయిస్తుండగా.. మహిళలు, పార్టీ శ్రేణులతో కలిసి ఆ షాపును భూమన అభినయ్‌రెడ్డి పరిశీలించారు. ఆ సమయంలో స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఆ షాపులో మద్యం సేవిస్తూ కనిపించగా.. ఎవరు మీరు అని అభినయ్ ప్రశ్నించారు. కొంతమంది హైదారాబాద్, కర్నూలు, వరంగల్ ప్రాంతాల నుంచి వచ్చామని చెప్పారు. ‘శ్రీవారి మొక్కు కన్నా చంద్రన్న చుక్కే మీకు ముందుగా అందిస్తున్నారా?’ అని అభినయ్ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న నైన్ స్టార్ షాపులో పార్టీ శ్రేణులతో కలిసి మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి అక్కడే పగులగొట్టి నిరసన తెలిపారు.కూటమి పాలనలో విచ్చలవిడిగా మద్యంఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తూ ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఒక్క మద్యం దుకాణంలో కూడా నిబంధనలు పాటించడం లేదని, 24 గంటలూ మద్యం విక్రయిస్తున్నా ఎక్సైజ్, పోలీసు అధికారులు మద్యం దుకాణదారులకు కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక శోభను పెంపొందించాల్సింది పోయి మద్యాన్ని పొంగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎక్కడ చూసినా మద్యం మత్తులో ప్రజలు తూలుతున్నారన్నారు. కూలీనాలి చేయగా వచ్చిన కాస్త డబ్బులను మద్యానికే తగలేస్తున్నారని, దాంతో పేద కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.విచ్చలవిడి మద్యం అమ్మకాలపై ఎవరైనా ఎక్సైజ్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్లను మద్యం దుకాణదారులకు ఇస్తున్నారన్నారు. దాంతో మద్యం దుకాణదారులు ఫిర్యాదు చేసిన వారి ఇంటిపైకి వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు.. ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్సార్సీపీ పాలనలో లిక్కర్ స్కామ్‌లు అంటూ అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నారని అభినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోన్రెడ్డిపై కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులే తప్ప వైఎస్సార్సీపీ పాలనలో ఎలాంటి స్కామ్‌లు జరగలేదని స్పష్టం చేశారు. మద్యం విక్రయాలతో దోచుకోవడం, దాచుకోవడం చంద్రబాబు నైజమన్నారు.వైఎస్సార్సీపీ పాలనలో నిబంధనల ప్రకారమే మద్యం విక్రయాలు జరిగేలా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కచ్చితమైన చర్యలు చేపట్టారన్నారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో ఇలాంటి అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా చంద్రబాబు అరాచకాలను గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పే రోజలు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. -
నేడు స్థానిక సంస్థల ఎన్నికలు
సాక్షి, అమరావతి: గ్రేటర్ విశాఖపట్నంతోపాటు మరో నాలుగు మున్సిపాలిటీలు, రాష్ట్రవ్యాప్తంగా 40 మండలాల్లోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసేందుకు సోమవారం మరో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవితోపాటు బొబ్బిలి(విజయనగ రం), ఆదోని (కర్నూలు), తిరువూరు (ఎన్టీఆర్), కదిరి (శ్రీ సత్యసాయి) మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు, కదిరి మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకోసం జీవీఎంసీ కార్పొరేషన్, ఆయా మున్సిపాలిటీల్లో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కదిరి మున్సిపాలిటీలో ముందుగా చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించి, ఆ తర్వాత వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ జిల్లా కలెక్టరుకు సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇలా... శ్రీ సత్యసాయి జిల్లా గండ్లపెంట, రామగిరి మండలాలతోపాటు పశి్చమ గోదావరి జిల్లా యలమంచిలి, అత్తిలి మండలాల్లో ఎంపీపీ పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. అత్తిలి(పశి్చమ గోదావరి), కారంపూడి, నరసరావుపేట(పల్నాడు), దగదర్తి(ఎస్పీఎస్ఆర్ నెల్లూరు), సర్వకోట(శ్రీకాకుళం), వి.మాడుగల(అనకాపల్లి), దేవరాపల్లి(అనకాపల్లి), కైకలూరు (ఏలూరు), పిట్టలవానిపాలెం(బాపట్ల), దుగ్గిరాల(గుంటూరు), మార్కాపురం, త్రిపురాంతకం (ప్రకాశం), తవనంపల్లి(చిత్తూరు), కంబదూర్ (అనంతపురం) మండలాల్లో వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.కొత్తవలస (విజయనగరం), చోడవరం (అనకాపల్లి), కడియం (తూర్పు గోదావరి) మండలాల్లో మండల కో–ఆపె్టడ్ పదవులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 19 మండలాల్లోని 20 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. పల్నాడు జిల్లాలోనే అత్యధికంగా ఆరు మండలాల్లోని ఏడు పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు ఉన్నాయి. ఎక్కడైనా ఎన్నిక వాయిదా పడితే తిరిగి ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నిక కమిషనర్ ఆదేశించారు. -
విత్తు.. సర్కారు ప్రణాళిక చిత్తు
గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారునాకు నాలుగెకరాలు సొంత భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేస్తున్నా. గతంలో ఈ పాటికే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు. విత్తనాలు పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడు లేడు. బయట మార్కెట్లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు. – బోయ ఓబులేసు, ఉదిరిపికొండ, కూడేరు మండలం, అనంతపురం జిల్లా⇒ ఇతని పేరు బొంతల హరీష్. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లె గ్రామం. సొంతంగా మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు.. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నాడు. 15 ఏళ్లుగా వేరుశనగ పంట వేస్తున్నాడు. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనం కావాలి. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.12 వేలకు పైగానే ఉంది. ఐదెకరాలకు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఇతనికి లేదు. గత ఖరీఫ్‌లో మే మొదటి వారంలోనే విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇచ్చారు. గతేడాది ఈపాటికే విత్తుకోవడం పూర్తయింది.పంట ఏపుగా ఎదిగినా కోతకొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఐదెకరాలకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రూ.60 వేలకుపైగా నష్టపోయాడు. రబీలో పంట వేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వర్షాలు పడుతుండడంతో అదును దాటిపోకుండా విత్తుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లినా రిజి్రస్టేషన్ చేసుకోవడం లేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది.సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. అదును సమయంలో వారికి పెట్టుబడి సాయం అందించకపోగా, సబ్సిడీ విత్తనాలు సైతం ఇవ్వకుండా కష్టాలపాలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్నా, విత్తన సరఫరా మొదలు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి గతేడాది మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది సబ్సిడీ విత్తన పంపిణీలోనూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాదాపు ఆరు రకాల సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపి వేయడమే కాకుండా, మిగిలిన సబ్సిడీ విత్తనాల పంపిణీలోనూ అడ్డగోలుగా కోత పెట్టింది. గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ విత్తన సరఫరా చేయలేమని ఓ వైపు కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది సబ్సిడీ విత్తనాలు రైతులకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏటా వ్యవసాయ సీజన్‌కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఎవరికి ఏ మేరకు విత్తనం కావాలో ముందుగానే ఆర్డర్ తీసుకుని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం రూ.13,500 కాకుండా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సబ్సిడీ విత్తనం లేదు.. పెట్టుబడి సాయమూ లేదని ఊరూరా అన్నదాతలు బావురుమంటున్నారు. ఇంకా ఖరారు కాని సబ్సిడీలు ⇒ ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 40% సబ్సిడీపై వేరుశనగ, 30% సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50% సబ్సిడీపై కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి చిరుధాన్యపు విత్తనాలను సరఫరా చేస్తుంటారు. ⇒ వరి విత్తనాలను మాత్రం జాతీయ ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో కిలోకి రూ.10, ఇతర జిల్లాల్లో రూ.5 చొప్పున రాయితీతో సరఫరా చేస్తారు. ఏజెన్సీ జిల్లాలో మాత్రం 90% సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్ధేశించిన సాగు లక్ష్యాలకనుగుణంగా జిల్లాల వారీగా ఇండెంట్ సేకరిస్తారు. ⇒ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఉత్పత్తి అయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన విత్తనాల కోసం టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఇలా సేకరించిన విత్తనాలను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లలో సర్టీఫై చేసి, సీజన్‌కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రైతులకు అందుబాటులో ఉంచేవారు. సాధారణంగా ఏటా ఏప్రిల్‌లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ పూర్తి చేసేవారు. ⇒ షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేసేవారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్కరంటే ఒక్క రైతు కూడా తమకు విత్తనం సకాలంలో అందలేదన్న మాట విని్పంచకుండా సరఫరా చేశారు. ఈ ఏడాది అదును ముంచుకొస్తున్నప్పటికీ విత్తన పంపిణీ షెడ్యూల్ కాదు కదా.. కనీసం సబ్సిడీలను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. సబ్సిడీ విత్తనంలో అడ్డగోలుగా కోత ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తుగా చేసిన ఏర్పాట్ల ఫలితంగా 2024–25 ఖరీఫ్‌లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు అందుబాటులో ఉండింది. వరి 2.29 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 3.16 లక్షల క్వింటాళ్లు, 94 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 15 వేల క్వింటాళ్ల అపరాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే సర్టీఫై చేసి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచగలిగారు. ⇒ ప్రస్తుత ఖరీఫ్–2025 సీజన్ కోసం జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం తొలుత 6,31,952 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఏపీ సీడ్స్ అంచనా వేసింది. ప్రధానంగా 2.37 లక్షల క్వింటాళ్ల వరి, 2.95 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 12 వేల క్వింటాళ్ల కందులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సబ్సిడీ విత్తనాన్ని కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కేవలం 5.18 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. ⇒ ఇందులో 2.15 క్వింటాళ్ల విత్తనం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా, మిగిలిన విత్తనాన్ని టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చివరికి 4.65 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు ఉండవన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా గతంలో దాదాపు 16 రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 10 రకాలకే పరిమితం చేశారు. ఈ లెక్కన 3 లక్షల క్వింటాళ్లకు మించి విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.⇒ పిల్లిపెసర సహా సామెలు, ఊదలు, అలసందలు, రాజ్మా, ఉలవల సరఫరా నిలిపివేశారు. మిగిలిన వాటికి కూడా అడ్డగోలుగా కోత వేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట కోసం గతంలో ఏటా దాదాపు 3.80 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనం అందుబాటులో ఉంచేవారు. అలాంటిది ఈ ఏడాది తొలుత 2.95 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఆ తర్వాత ప్రభుత్వాదేశాలతో 1.95 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం ⇒ గతంలో ఏటా క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే టెండర్ల ద్వారా విత్తనాలకు అవసరమైన మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించడమే కాకుండా ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు విడుదల చేసేవారు. దీంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏనాడు విత్తన సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడ లేదు. 2024–25 ఖరీఫ్ సీజన్లో 6.63 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయగా, అందుకు సంబంధించిన సబ్సిడీ రూ.328.75 కోట్లు ప్రభుత్వం కంపెనీలకు చెల్లించలేదు.⇒ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.213.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా ఈ మేరకు పలుమార్లు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలు.. వేరుశనగ, వరి, శనగ, ఉలవలు, రాజ్మా తదితర విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన 12 కంపెనీలు గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ ఈ ఏడాది విత్తన సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యంత్రాంగం ఉంది.⇒ అతికష్టమ్మీద ఒత్తిడి తీసుకురాగా జీలుగు.. జనుము (పచ్చిరొట్ట) విత్తనాలు కేవలం 23 వేల క్వింటాళ్లు (25%) జిల్లాలకు సరఫరా చేయగలిగారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఈ పాటికే ప్రారంభం కావాల్సిన వేరుశనగ విత్తనం పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. మిగిలిన విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ⇒ ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ చేతకాని తనం వల్ల నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిరప, పత్తి విత్తనాల్లో నకిలీలకు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 40 కంపెనీలతో ఒప్పందం చేసుకుని, కల్తీలకు ఆస్కారం లేని రీతిలో రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. గత సీజన్ నుంచి నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.విత్తనోత్పత్తికీ రాంరాం ⇒ సాధారణంగా సాగు విస్తీర్ణంలో 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం రబీ సీజన్లో జిల్లాల వారీగా గుర్తించిన రైతులకు విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని ఇచ్చి విత్తన సాగును ప్రోత్సహిస్తారు. మరొకవైపు ఏపీ సీడ్స్‌లో వాటాదారులుగా ఉన్న రైతులకు బ్రీడర్స్, ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చి వారి ద్వారా విత్తనోత్పత్తి చేసి, ఆ విత్తనాన్ని ఖరీఫ్ సీజన్లో రైతుల డిమాండ్ మేరకు సేకరిస్తారు. ⇒ సాధారణంగా ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనంలో 50 శాతం ఈ విధంగా సేకరిస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే విత్తనం ఉత్పత్తి చేస్తారో ఆ రైతుల నుంచే ఈ–క్రాప్ ప్రామాణికంగా సేకరించేవారు. నిర్ధేశిత గడువులోగా వారికి బహిరంగ మార్కెట్ ధర కంటే 20–30 శాతం అదనంగా చెల్లించేవారు. ఈ వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో సైతం ప్రదర్శించేవారు. ⇒ దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గడిచిన ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 9 నెలలు గడిచినా చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులెవ్వరూ తమ విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. బహిరంగ మార్కెట్ ధరలకే అమ్ముకుంటున్నారు. దీంతో ఏపీ సీడ్స్ పూర్తిగా టెండర్ల ద్వారానే విత్తనం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుపు⇒ విత్తన పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాసిన లేఖే నిదర్శనం. ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఖరీఫ్–2025 సీజన్‌కు కనీసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనం తక్కువ కాకుండా కేటాయించాల్సి ఉండగా, కేవలం 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ శాఖ కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? సబ్సిడీపై వేరుశనక్కాయల విత్తనాల గురించి సచివాలయానికి వెళ్లి అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటున్నారు. పదెకరాల్లో సేద్యం చేసుకున్నా.. వర్షాలు పడుతున్నాయి.. త్వరలో విత్తుకోవాల్సి ఉందని చెప్పినా వినిపించుకునే వారే లేరు. మాది రైతు ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అంటున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? రైతు సేవా కేంద్రాల్లో మా పేర్లు కూడా నమోదు చేసుకోకపోవడం దారుణం. దీంతో విత్తనాలు అధిక ధరకు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. – మునిరెడ్డి, బొందిమడుగుల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అన్ని విధాలుగా మోసం చేల్లో దుక్కి దున్నాం. ఇంత వరకు శనగ విత్తనాలు రాలేదు. సచివాలయంలో అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్ రాలేదంటున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈపాటికే శనక్కాయల విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అదును దాటిపోతుంది. ఇంకెప్పుడు విత్తుకోవాలి? పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. రైతులను అన్ని విధాలుగా ముంచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 90 శాతం సబ్సిడీపై శనక్కాయల విత్తనం ఇవ్వాలి. – రమణారెడ్డి, పొడరాగపల్లి, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా కౌలురైతులకు నూరు శాతం సబ్సిడీతో సర్టీఫైడ్ విత్తనాలివ్వాలిఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్ సాక్షి, అమరావతి: కౌలురైతులకు నాణ్యమైన, సర్టీఫై చేసిన విత్తనాలను నూరు శాతం సబ్సిడీపై అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేట్ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారని, పైగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది సీజన్‌కు ముందు విత్తనాలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి : భారత్ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈరోజు (మే18 వ తేదీ) హెచ్డీ దేవెగౌడ 92వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దేవెగౌడ నాయకత్వం భవిష్యత్తు తరాలకు, దేశ సేవకు స్పూర్తిదాయకంగా నిలవాలన్నారు వైఎస్ జగన్. On the occasion of the 92nd birthday of Shri @H_D_Devegowda Ji, former Prime Minister of India ,I extend my heartfelt wishes to him for a healthy and joyful year ahead. May his wisdom and leadership continue to guide us in the service of our Nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
బాబు సర్కార్ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్ అరెస్ట్
గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను దూషించిన రాజు.. సురేష్‌ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడు.నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడు. ఎందుకు వీరంగం సృష్టిస్తున్నావంటూ రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, నందిగామ సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజు తమ కారులపై దాడి చేసి తమ కుటుంబ సభ్యులను దూషించాడని.. నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో నందిగం సురేష్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగం సురేష్‌ని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. -
దటీజ్ ది ‘పవర్’ ఆఫ్ జగన్
సాక్షి, అమరావతి: సమర్థుడైన నాయకుడి పాలనలో వ్యవస్థలు ఎంతగా అభివృద్ధి చెందుతాయన్నది చెప్పడానికి ఇదొక నిదర్శనం. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకువచ్చిన వినూత్న విధానాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కం) నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి.ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపింది. కానీ, గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో మొత్తం రూ.4,434.51 కోట్ల నిర్వహణ ఖర్చులు ఆదా అయ్యేలా చేసింది. ఈ మేరకు డిస్కంలు దాఖలు చేసిన ట్రూ డౌన్ పిటిషన్ల వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తన వెబ్సైట్ ద్వారా వెల్లడించింది.డిస్కంల మిగులు ఇలా.. 2019–20 నుంచి 2023–24 వరకూ ఏపీఈపీడీసీఎల్ నిర్వహణా వ్యయాల ఆదా రూ.1,974.75 కోట్లు ఏపీసీపీడీసీఎల్ 2020–21 నుంచి 2023–24 వరకూ వ్యయ ఆదా రూ.1,400 కోట్లు. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లు. ఇందులో కొంత మొత్తాలను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు సర్దుబాటు చేసుకున్నాయి. అంటే వాటి రెవెన్యూ గ్యాప్‌ను భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. ఈ విధంగా ఏపీఈపీడీసీఎల్ రూ.1,800 కోట్లు కలపగా, మిగిలిన రూ.174.75 కోట్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా ఏపీసీపీడీసీఎల్‌లో రూ.478.91 కోట్లు ఇప్పటికే 2024–25 ఏఆర్‌ఆర్‌లో కలిపారు. ఇంకా రూ.921.09 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం రూ.1,095.84 కోట్లు ప్రజలకు తిరిగి ఇచ్చేయాలా... లేక మరో ఏఆర్‌ఆర్‌లో సర్దుబాటు చేయాలా.. అనేది ఏపీఈఆర్సీ నిర్ణయిస్తుంది.ట్రాన్స్‌కో ఆదా ఇది.. 2019–20 నుంచి 2023–24 మధ్య ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లను వినియోగించుకోవడంలోనూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) రూ.1,059.76 కోట్లు మిగిల్చాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఈఆర్సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కంలు వినియోగించాయి. ఇది ఏపీఈపీడీసీఎల్‌లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌లో రూ. 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్‌ఆర్‌లో సర్దుబాటు చేశారు. ఈ లెక్కన గత ప్రభుత్వ చర్యల కారణంగా కూటమి ప్రభుత్వంపై రూ.4,434.51 కోట్ల భారం తగ్గింది.దక్షిణ డిస్కంలో భిన్నం.. కానీ.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) మాత్రం రూ.3,346 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీని అనుమతి కోరింది. ఇందులోనూ 2024–25 ఏఆర్‌ఆర్‌లో రూ.2వేల కోట్లు సర్దుబాటు చేసేశారు. అంటే అప్పటికి డిస్కంకు ఆ మేరకు లాభం చేకూరినట్టే. ఇక మిగిలింది రూ.1,346 కోట్లు. డిస్కం దాఖలు చేసిన వడ్డీలను ఏపీఈఆర్సీ యథాతథంగా ఆమోదించదు. అందువల్ల ఈ ట్రూ అప్ కూడా తగ్గే అవకాశం ఉందని ఏపీఈఆర్సీ వెల్లడించింది. -
టీచర్ల తిరుగుబావుటా!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను రద్దుచేసి చంద్రబాబు కొత్తగా అమలుచేస్తున్న విధానాలు బూమరాంగ్ అవుతున్నాయి. సర్కారు ఏకపక్ష విధానాలతో ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల పునర్విభజన, టీచర్ల సర్దుబాటు తీరుపై వారు రగిలిపోతున్నారు. ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిలోను.. స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల్లో నియమించడంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంలో.. దాదాపు ఎనిమిది నెలలుగా ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వారం వారం సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.ఇలా ఇప్పటివరకు 34 సమావేశాలు నిర్వహించి వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న విద్యాశాఖ.. వారి సూచనలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఉపాధ్యాయుల సర్దుబాటు అంశానికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో వారు రగిలిపోతున్నారు. అంతేగాక.. జీఓ–117 రద్దు మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశాలకు, కొత్తగా తీసుకొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు అసలు పొంతనలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. మిగులుగా 10వేల మంది ఉపాధ్యాయులు..ప్రభుత్వోద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందుకనుగుణంగా మార్చిలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’ తీసుకొచ్చింది. దీంతోపాటు ఇటీవల మూడు జీఓలు విడుదలచేసి పాఠశాలల పునర్విభజన, ఉపాధ్యాయుల పంపిణీ ఎలా ఉంటుందో పేర్కొంది. ప్రభుత్వ నూతన విధానాలతో రాష్ట్రంలో తొమ్మిది రకాల పాఠశాలల ఏర్పాటుతో పాటు, ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తి అస్తవ్యస్తంగా మారింది. 10 వేల మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఏర్పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ముందుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్ణయించి శుక్రవారం గుర్తింపు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసింది. కానీ, గతంలో జరిగిన సమావేశాల్లో తాము సూచించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.ఆది నుంచీ విభజించు– పాలించు విధానం..ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 43 సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో తొమ్మిది గుర్తింపు సంఘాలు కాగా, మరో 34 రిజిస్టర్డ్ సంఘాలున్నాయి. వీటిలో 1,78,984 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉన్నారు. అయితే, గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులతో సఖ్యతగా ఉన్నట్లు చెప్పుకునేందుకు గతేడాది సెప్టెంబరులో విద్యా సంబంధ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాలకు కేవలం గుర్తింపు సంఘాల నాయకులను మాత్రమే ప్రభుత్వం ఆహ్వానించి, రిజిస్టర్డ్ సంఘాలను దూరం పెట్టింది. ఈ ఎనిమిది నెలల్లో రిజిస్టర్డ్ సంఘాలతో కేవలం రెండు సమావేశాలను మాత్రమే నిర్వహించింది. కానీ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో.. గుర్తింపు సంఘాల నుంచి శుక్రవారం మళ్లీ నిరసన సెగ తగలడంతో రిజిస్ట్ర్డ్ సంఘాలను మచ్చిక చేసుకునేందుకు వచ్చే బుధవారం ఆ సంఘాలతో చర్చలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించి వాటిని ఆహ్వానించింది. కానీ, ఈ సంఘాల నేతలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు.ఉపాధ్యాయుల సర్దుబాటుపై తీవ్ర విమర్శలు..ఇక గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ–117 ప్రకారం.. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1 : 20గా ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయుల సర్దుబాటు, కేటాయింపులో ఏకీకృత విధానం లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో తొమ్మిది రకాల స్కూళ్లను ఏర్పాటుచేయడం ఒక ఎత్తయితే, చాలా పాఠశాలలను విలీనం చేయడంతో విద్యార్థులు బడులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. హైసూ్కళ్లల్లో 3–4 తరగతులున్నా సబ్జెక్టు టీచర్ విధానం రద్దుచేయడం, యూపీ స్కూళ్లల్లోను ఉన్నత తరగతులకు ఎస్జీటీలనే కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.కొన్ని ప్రైమరీ స్కూళ్లల్లో టీచర్–విద్యార్థుల నిష్పత్తి 1 : 30గా ఉంటే మరికొని్నంటిలో 1 : 5గా ఉంది. ఈ సర్దుబాటు క్రమంలో ఉపాధ్యాయులు భారీగా మిగులుగా ఏర్పడుతున్నారు. దీంతో.. స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలుగా నియమించడం, మరికొందరిని క్లస్టర్ పూల్‌లోను, ఇంకొందరిని హెచ్ఓడీ పూల్‌లోను పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒకరకంగా ఇది ఉపాధ్యాయులను గాలిలో పెట్టడమేనని వారంటున్నారు. ఇప్పటికే జిల్లాల్లో డీఈఓ పూల్ ఉండగా, దీనికి ఇవి అదనంగా జతచేయడం గమనార్హం. మెరుగైన ఫలితాల కోసం గత ప్రభుత్వం 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధన అమలుచేస్తే ఇప్పుడు తొలగించడమేంటని, యూపీ స్కూళ్లల్లో సైతం స్కూల్ అసిస్టెంట్లను తొలగించి మిగులు చూపడం ఎందుకని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈనెల 21న డీఈఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాయి. -
రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట
సాక్షి, అమరావతి/సాక్షి,నెట్వర్క్: ఎన్నికల హామీలు అమలుచేయకపోవడం.. రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు మరోసారి తెరతీశారని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్టని.. దాని అమలులో భాగంగానే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైనా కక్ష సాధిస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి, సాకే శైలజానాథ్, అంబటి రాంబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, వరుదు కళ్యాణి, మార్గాని భరత్‌రాం శనివారం వేర్వేరుచోట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని వారు హెచ్చరించారు. ఎవరెవరు ఏమన్నారంటే..ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిటైర్డ్ అధికారులను అక్రమంగా అరెస్టుచేసింది. వైఎస్ జగన్‌ను బలహీనపరచాలనే దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా అసలు జరగని మద్యం స్కాంలో రిటైర్డ్ అధికారులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్టుచేయడం విడ్డూరం. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపిన చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి లిక్కర్ స్కాంలో అసలు దోషి బాబే..లిక్కర్ స్కాంలో అసలు దోషి చంద్రబాబే. ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన, సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టుచేశారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కాం జరిగింది. అందులో చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుచేసి, వాటి యజమానులకు దాదాపు రూ.1,300 కోట్ల లాభం చేకూర్చారు.2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కాం జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కాంలో ఇలాంటిది ఉందా? ఇక మద్యం షాపులను ప్రభుత్వం నడిపిస్తే ఆదాయం వస్తుందా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆదాయం వస్తుందో టీడీపీ నేతలు చెప్పాలి. ఏపీలో ఉన్న అన్ని డిస్టిలరీలకు అనుమతులిచ్చింది చంద్రబాబే. అంతేకాక.. 69 శాతానికి పైగా ఆర్డర్లు నాలుగైదు డిస్టిలరీలకే ఇచ్చారు. ఇదంతా స్కాం కాదా? పైగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నడిపే మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. – సాకే శైలజానాథ్, మాజీమంత్రి జైలు అధికారుల మార్పులో బాబు కుట్ర..విజయవాడ జైలు అధికారులను హఠాత్తుగా మార్చడం వెనుక చంద్రబాబు భారీ కుట్ర ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో అరెస్టయిన వారంతా విజయవాడ జైలులో ఉన్నందున వారిని వేధించేందుకే తాము చెప్పినట్లు నడుచుకునే అధికారులను అక్కడ నియమించారు. ఒకవైపు సంబంధంలేని అంశాల్లో కొందరు ప్రభుత్వాధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులతో వారిని జైలులో హింసించాలన్నదే చంద్రబాబు కుతంత్రంగా కనిపిస్తోంది. 2018–19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.16,900 కోట్లు అయితే.. 2023–24లో అది రూ.24,700 కోట్లు. నిజంగా, చంద్రబాబు చెబుతున్నట్లుగా వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఎలా పెరిగింది? వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గి ఆదాయం పెరిగింది. అదే ఇప్పుడు బాబు హయాంలో లిక్కర్ సేల్స్ పెరిగి ఆదాయం తగ్గింది. దీని మతలబు ఏమిటో చంద్రబాబే చెప్పాలి. ఈ తగ్గిన ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతోంది? ఇది స్కాం కాదా? – మార్గాని భరత్, వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ అణిచివేయాలనుకుంటే మరింత బలోపేతమవుతాం..వైఎస్సార్సీపీని అణిచివేయాలని చూస్తే మరింత బలోపేతమవుతాం. గతంలో ఒకసారి వైఎస్సార్సీపీని అణగదొక్కాలని కాంగ్రెస్‌తో చంద్రబాబు జట్టు కట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చిఏడాదైనా ఎన్నికల హామీలను అమలుచేయడంపై చంద్రబాబు దృష్టిపెట్టలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమయ్యారు. వైఎస్ జగన్ బలహీనపరిచేందుకు లిక్కర్ స్కామ్ సృష్టించారు. – అంబటి రాంబాబు, మాజీ మంత్రిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు..చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోవడంతోపాటు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దుచేసి, మద్యం షాపులు, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకి దమ్ముంటే ఆయనపై నమోదైన ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్ధం కావాలి.– ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుబాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజకీయ అరాచకం ఎక్కువైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకులపైనే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. కొందరు అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. సర్వీస్‌లో ఉన్న వారినే కాకుండా రిటైర్డ్ అధికారులనూ అరెస్టు చేస్తున్నారు. ఒక్క ఆధారం లేకపోయినా లిక్కర్ స్కాం జరిగిందంటూ తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చివరకు హైకోర్టు న్యాయమూర్తులు అక్షింతలు వేసినా సిగ్గులేకుండా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది. వైఎస్ జగన్‌ను నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు లిక్కర్ స్కాం రూ.10వేల కోట్లు..మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందంటూ అనవసర యాగీ చేస్తున్న టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పడంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి బ్రాందీ షాపు నుంచి పోలీస్‌స్టేషన్‌కు, ఎక్సైజ్ స్టేషన్‌కు మామూళ్లు అందుతున్నాయని, తమ ప్రభుత్వంలో మామూళ్ల ప్రస్తావనే లేదన్నారు. ప్రస్తుతం ప్రతి మద్యం షాపు యజమాని ఎక్సైజ్ శాఖకు రూ.70 వేలు, పోలీస్‌స్టేషన్‌కు రూ.30 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా చెల్లిస్తున్నారని, కిందిస్థాయి నుంచి అమరావతి వరకు ఎవరి వాటా వారికి చేరుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తద్వారా నెలకు సుమారు రూ.100 కోట్ల వరకు మద్యం మామూళ్లు యువరాజు లోకేశ్‌కు అందుతున్నాయని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,200 కోట్ల అవినీతి జరుగుతోందన్నారు. ఇక డిస్టలరీల నుంచి నేరుగా చంద్రబాబుకు ఏడాదికి రూ.1,000 కోట్లు అందుతోందన్నారు. నక్కలు, తోడేళ్లు కలిసి రూ.1,000 కోట్లు తింటే.. సింహం ఏకంగా రూ.1,000 కోట్లు ఆర్జిస్తోందన్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి రూ.10వేల కోట్లకు పైగా అవినీతి జరుగుతుంటే.. జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని చెబుతున్నారన్నారు.ఇదే అత్త కోడలికి సుద్దులు చెప్పడం అని రాచమల్లు ఎద్దేవా చేశారు. ఆరు పథకాలను అమలుచేయలేని చంద్రబాబు 60 కేసులు పెట్టి 60 మందిని జైలుకు పంపాడని, ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నాడన్నారు. మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానిది అంతా దోపిడీ అని, ఐదేళ్లలో రూ.10వేల కోట్ల అవినీతి జరుగుతుందని, టీడీపీ నేతలకు దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. – మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి..అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరపడ్డాయి. రాజ«దాని పేరుతో కూటమి ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటోంది. హామీల అమలును విస్మరించి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. – ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేరాష్ట్రంలో శాంతిలేదు..రాష్ట్రంలో ఎక్కడా శాంతి లేదు.. ప్రజలకు భద్రత అసలు లేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. శనివారం అనంతపురం జిల్లా రాప్తాడులో దంపతులను టీడీపీ రౌడీమూకలు చంపినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయి. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ -
బాబుకు ఈనాడు నిత్య సన్మానం పాత్రికేయానికి తీరని అవమానం
సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండన్న చందంగా తయారైంది ఎల్లో మీడియా. ప్రజలు ఏమనుకుంటారన్న సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు కోసం ఎంతగా బరితెగించడానికైనా సై అంటోంది. వలువలూడదీసుకుని పచ్చి అబద్ధాలను అచ్చేస్తోంది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు హక్కుగా అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ–సెకీ)తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వరకు అన్ని విధాలుగా ఆమోదం లభించింది. అయినా గత ప్రభుత్వంపై బుదర జల్లాలి.. జగన్‌పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం గక్కాలి.. అనే అజెండాతో అర్థం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ కరపత్రం ఈనాడు, ఎల్లో మీడియా అసత్య కథనాలను వండివారుస్తూనే ఉంది. తాజాగా సెకీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించడాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ముడిపెట్టి ఈనాడు పచ్చి అబద్ధాలతో శనివారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది.ఎప్పుడో 2021లో జరిగిన ఒప్పందానికి 2023లో సీఎండీగా చేరిన అధికారికి సంబంధం ఏమిటనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారుడు రాతలతో తన నైజాన్ని చాటుకుంది. ‘సెకీ’తో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆరి్ధక భారం పడుతుందని, అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎఎస్‌టీఎస్)ల నుంచి మినహాయింపు లభించదని ఇప్పటికే అనేక సార్లు అసత్య కథనాలను రాసి భంగపడ్డ టీడీపీ కరపత్రం ఇప్పుడు అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చాలని చూస్తోంది. యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్‌ను అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు.. అంతకు దాదాపు రెట్టింపు ధర యూనిట్ రూ.4.60తో చంద్రబాబు ప్రభుత్వం యాక్సిస్ అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం కళ్లున్న గుడ్డి వాడిలా నటిస్తోంది. ముడుపులకు ఆస్కారం ఎక్కడ? ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత చూసి, యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్‌ను అందిస్తామంటూ 2021 సెపె్టంబర్ 15న సెకీ లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాల (కమర్షియల్ ఆపరేషన్ డేట్)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచి్చందని ఆ లేఖలో సెకీ స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి చార్జీలు వర్తించవని లేఖలో వివరంగా చెప్పింది. రెండు నెలల సుదీర్ఘ చర్చలు, సమగ్ర అధ్యయనం తర్వాత సెకీతో గత ప్రభుత్వం, డిస్కంలు మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. రాష్ట్ర మంత్రి మండలితో పాటు ఏపీఈఆర్సీ ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే ఈ ఒప్పందం జరిగింది. ⇒ సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. ఈ ధర అప్పటికి ఎనీ్టపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ప్రస్తుతం చంద్రబాబు కుదుర్చుకున్న రూ.4.60 కన్నా రూ.2.11 తక్కువ. ⇒ ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 ఖర్చు అవుతోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్లు సెకీ విద్యుత్ వల్ల ఆదా అవుతుంది. కానీ ఈ ఒప్పందంలో ముడుపుల వ్యవహారం వల్లే సెకీ సీఎండీని కేంద్రం తప్పించిందంటూ ఈనాడు వక్ర భాష్యం చెప్పింది. ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేటు సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా..? ఇంత చిన్న లాజిక్ కూడా ఈనాడుకు తెలియదా? ⇒ అదీకాక 2021లో ఒప్పందం జరిగినప్పుడు గుప్తా సెకీ సీఎండీనే కాదు. ఆయన ఆ పదవి చేపట్టిందే 2023 జూన్‌లో. ఈనెల 10న ఆయ న్ను పదవి నుంచి తొలగించారు. అంటే సెకీ ఒప్పందం జరిగినప్పుడు ఆయన పదవిలోనే లేరు. అలాంటిది ఆ ఒప్పందంతో ఆయనకు ఎలా ముడిపెడతారనే కనీస జ్ఞానం కూడా టీడీపీ కరపత్రానికి లేకుండా పోయిందని విద్యుత్ రంగ నిపుణులు విస్తుపోతున్నారు. బురదజల్లడమే పని⇒ ఈ ఒప్పందంలో రైతుల పట్ల జగన్‌కు నిబద్ధత తప్ప స్వప్రయోజనం అనేది మచ్చుకైనా కనిపించదు. అయితే ఈ ఒప్పందంలో ఏ మాత్రం ప్రమేయం లేని అదానీ నుంచి లంచాలందాయంటూ గత ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దానికి జగన్‌కు ముడిపెట్టి అత్యుత్సాహంతో విష ప్రచారం చేస్తూ.. పుంఖానుపుంఖాలుగా అసత్యాలు వండి వార్చింది టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని భయపడుతున్న ఈనాడు.. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తోంది. దానికి అనుబంధంగానే సెకీ చైర్మన్ తొలగింపునూ ఈ ఒప్పందానికి ముడి పెడుతూ కుట్రలు పన్నుతోంది. దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా చిత్రీకరిస్తోంది. ⇒ గతేడాది నవంబర్‌లో గౌతమ్ అదానీ, ఇతర కార్యనిర్వాహకులపై లంచం తీసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగం మోపినప్పుడు, వాటికి ఎలాంటి ఆధారాలు లేనందున సెకీ ఆ ఆరోపణలపై ఎలాంటి విచారణ చేపట్టదని గుప్తా ప్రకటించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఖండించారు. గతేడాది నవంబర్ 6న, నకిలీ పత్రాలను సమరి్పంచారనే ఆరోపణలతో రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు బిఇఎస్‌ఎస్‌ను మూడు సంవత్సరాల పాటు టెండర్లలో పాల్గొనకుండా సెకీ నిషేధించింది. ⇒ కానీ ఢిల్లీ హైకోర్టు ఆదేశం తర్వాత ఆ నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది మేలో, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు సన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (సీపీఏ)పై సెకీ సంతకం చేసింది. దీనికి తప్పుడు ధృవపత్రాలను సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతోనే కేంద్రం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న గుప్తాను ఉన్నపళంగా తొలగించిందంటూ జాతీయ మీడియా ఇప్పటికే అనేక కథనాల్లో వెల్లడించింది. ఈ వాస్తవాన్ని ఈనాడు నిస్సిగ్గుగా దాస్తోంది. అది జర్నలిజమా? లేక బ్రోకరిజమా? ఈనాడుపై వైఎస్సార్సీపీ మండిపాటు‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్యాలను ఖండిస్తూ ‘ఎక్స్’లో ఆ పార్టీ ఈ మేరకు పోస్టు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2021 డిసెంబర్లో జరిగిందని, 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తాను నియమించారని తెలిపింది. అలాంటప్పుడు ఏపీ–సెకీ ఒప్పందానికి ఏం సంబంధం ఉంటుందని ఆ పార్టీ ప్రశ్నించింది.‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాక ముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణల నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా ఐదారు రోజుల క్రితమే జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ నిస్సిగ్గుగా ఎల్లో పత్రిక ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. ఈనాడుకు ధైర్యం ఉంటే సెకీతో ఒప్పందాన్ని రద్దు చేయమని మీ గ్యాంగ్ లీడర్ చంద్రబాబుకు చెప్పు. ఈనాడులో రూ.1.90కే యూనిట్ సౌర విద్యుత్ వస్తుందని రాశారు. మరలాంటప్పుడు మొన్న యాక్సిస్‌తో రూ.4.60కి కొనుగోలు చేస్తూ ఎందుకు ఒప్పందం చేసుకున్నావని దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు. లేదా తప్పుడు రాతలు రాసినందుకు ప్రజల్ని క్షమాపణలు కోరాలి’ అంటూ ఈనాడు రాసిన ఫేక్ న్యూస్ కథనాన్ని జత చేసి, శనివారం ఎక్స్ పోస్ట్‌లో వైఎస్సార్సీపీ నిలదీసింది. -
జనరేషన్ కష్టాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలు ప్రజలకు గుదిబండగా మారాయి. వివాహ రిజిస్ట్రేషన్ సర్టీఫికెట్ తప్పనిసరి చేయడంతో తరాలతో సంబంధం లేకుండా ఎప్పుడో పెళ్లయిన వారూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. కొత్త కార్డుల దరఖాస్తుకు గడువు 15 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలతోపాటు ఇంత వరకు రేషన్‌కార్డు లేని వారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడంతో మొదలయ్యే ప్రక్రియ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్టీఫికెట్ వచ్చే వరకు ప్రహసనంగా మారుతోంది. స్లాట్ విధానంలో లోపాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్‌లో లోపాల వల్ల మ్యారేజ్ సర్టీఫికెట్ కోసం వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ఒకే సమయానికి ఎక్కువ మందికి స్లాట్ ఇవ్వడం వల్ల పిల్లాపాపలతో గంటల తరబడి కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. మండే ఎండలతో నరకం చవి చూడాల్సిన దుస్థితి నెలకొంది. వాస్తవానికి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఒక సమయానికి.. ఒక స్లాట్ విధానమే అమలులో ఉంది. కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌కు మాత్రం ఒకే సమయానికి ఎంతమందికి కావాలంటే అంతమందికి అధికారులు స్లాట్ ఇస్తున్నారు.ఈ–సైన్ సైట్లో నమోదు, భార్యాభర్తలు, ముగ్గురు సాక్షుల ఫింగర్ప్రింట్ల సేకరణ తదితర పనుల వల్ల ప్రక్రియ బాగా ఆలస్యమవుతోంది. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.2,500 నుంచి రూ.4,000 వంతున దరఖాస్తుదారుల నుంచి వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మంగళవారం ఒక్క రోజే కాకినాడ జిల్లా రిజి్రస్టార్ కార్యాలయానికి సుమారు 70 మంది మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు కోసం దరఖాస్తులతో తరలివచ్చారు. ఇక్కడ ఈ పని అంతా చేసేది ఒకే ఒక సీనియర్ అసిస్టెంట్ కావడంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పలేదు. కాకినాడ జిల్లాలోని సర్పవరం, ప్రత్తిపాడు, తాళ్లరేవు, సామర్లకోట, తుని తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలూ రోజూ మ్యారేజ్ సర్టీఫికేట్ల కోసం వచ్చేవారితో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లోనే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఈ–సైన్ లేకపోవడంతో పది నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తయిపోయేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భార్యాభర్తలు, ముగ్గురు సాక్షులు, ఈ–సైన్ చేయాల్సి రావడంతో కష్టాలు తప్పడం లేదు.రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులపై ఒత్తిడి మ్యారేజ్ సర్టీఫికెట్ కోసం రోజూ జనం పోటెత్తడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉద్యోగులపైనా ఒత్తిడి పెరుగుతోంది. సిబ్బంది అంతంతమాత్రంగా ఉండడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఇలాంటి ఒత్తిళ్లతోనే ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శివరాం మృతి చెందడాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు లేదా, రిజి్రస్టార్ కార్యాలయాల్లోనూ మ్యారేజ్ సర్టీఫికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.సాయంత్రం వరకు పడిగాపులే రేషన్ కార్డు కోసం పెళ్లి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ముందు రోజు స్లాట్ బుక్ చేసుకున్నాను. పనులు అన్ని మానుకుని ఉదయమే 11 గంటలకు కాకినాడ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చాను. అప్పటికే పదుల సంఖ్యలో అర్జీదారులు ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడాల్సి వచ్చింది. – కుంది కరుణ, జగన్నాథపురం, కాకినాడ -
రాజకీయ ప్రేరేపిత కేసే..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధరలను పెంచలేదు.. మద్యం ఉత్పత్తులపై పన్నులనే పెంచారు. గత టీడీపీ ప్రభుత్వంలో కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలను గణనీయంగా తగ్గించింది. కానీ, పన్నులను పెంచడంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరిగింది. దాంతోనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది. మరి ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగితే ఇక ప్రభుత్వ ఖజానాకు నష్టం ఎక్కడ వాటిల్లింది..? కుంభకోణం ఎక్కడ జరిగింది..? అంటే ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్ల నష్టం వాటిల్లిందని సిట్ చెబుతున్నది అంతా అవాస్తవమే కదా? సాక్షి, అమరావతి: ‘సిట్ నమోదు చేసింది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే అక్రమ కేసు పెట్టింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అవినీతిపై నమోదైన కేసులను కప్పిపుచ్చేందుకే ఈ కేసును నమోదు చేసింది’ అని మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ ఏసీబీ న్యాయస్థానానికి వివరించారు. 2019–24 మధ్య మద్యం విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్లు నష్టం వాటిల్లిందన్న సిట్ అభియోగానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని స్పష్టం చేశారు.అందుకు సంబంధించి న్యాయస్థానానికి కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని గుర్తు చేశారు. దీన్నిబట్టి స్కామ్ అనేది ఒక కట్టుకథ అని స్పష్టం చేశారు. సీఐడీ కేసును ఆ దర్యాప్తు సంస్థ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డిల తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శనివారం వాదనలు వినిపించారు. వారిద్దరిని సిట్ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని నిబంధనలను ఉటంకిస్తూ వివరించారు. అంశాల వారీగా శ్రీరామ్ వినిపించిన వాదనలు ఇలా ఉన్నాయి... చంద్రబాబు ప్రభుత్వం 5 డిస్టిలరీల నుంచే 69% మద్యం కొనుగోళ్లు చేసింది చంద్రబాబు అవినీతి కేసులను కప్పిపుచ్చేందుకే సిట్ ఈ అక్రమ కేసు నమోదు చేసింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. దీనివెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని.. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారిస్తూ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి.ఆ ఐదేళ్లలో ప్రభుత్వ మద్యం విధానం ద్వారా పాల్పడిన అవినీతిని ఇప్పటికే సీఐడీ నిర్ధారించి చంద్రబాబుతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 5 డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేసినట్లు అప్పటి సిట్ తన రిమాండ్ రిపోర్టులోనే పేర్కొంది. మంత్రి మండలికి తెలియకుండా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా ఈ అక్రమ కేసు నమోదు చేయించారు. అంతెందుకు ఇప్పుడు అడ్డగోలుగా వేధిస్తున్న సిట్ రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో కూడా 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే 54 శాతం మద్యం కొనుగోళ్లు చేసిందని పేర్కొనడం నిజం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా ఆదాయం పెరిగింది 2019–24లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఏ ప్రాతిపదికన నిర్ధారించామన్నది సిట్ చెప్పడమే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. 2014–19 మధ్య కంటే 2019–24 మధ్య రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగింది. 2018–19లో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.16 వేల కోట్లు ఉంటే 2023–24లో రూ.24 వేల కోట్లకు చేరుకుంది. ఇక కుంభకోణంపై సిట్ వద్ద ఒక్క ఆధారం కూడా లేదు. కనీసం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలోనూ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బెవరేజెస్ కార్పొరేషన్ రికార్డుల్లో కూడా అటువంటి సమాచారం ఏమీ లేదు. ఉంటే సిట్ చూపించి ఉండేది కదా. కేవలం సిట్ అధికారులు తాము బెదిరించి తీసుకున్న కొందరు డిస్టిలరీల ప్రతినిధుల వాంగ్మూలాలను మాత్రమే చూపిస్తున్నారు. ఆ డిస్టిలరీలన్నీ 2014–19లో అప్పటి ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందినవే. అవే డిస్టిలరీలను తర్వాతి ప్రభుత్వం 2019–24లోనూ కొనసాగించింది. సీఐడీ కేసును పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు? అసలు ఈ కేసు రాజకీయ ప్రేరేపితం. కేసు నమోదు నుంచి సీఐడీకి అప్పగించడం, సిట్ ఏర్పాటు అంతా చట్టానికి విరుద్ధంగా సాగుతోంది. ఈ కేసును సీఐడీ డీజీ పర్యవేక్షిస్తారు అని సిట్‌ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా గుర్తించింది. కానీ, సిట్‌లో ఉన్న సభ్యుల్లో అత్యున్నత అధికారి విజయవాడ పోలీస్ కమిషనర్. మిగిలిన సభ్యులు ఆయన కంటే జూనియర్లు. మరి వీరందరూ సీఐడీ పరిధిలోకి వస్తారా? తాము సీఐడీ పరిధిలోకి వస్తామని వారిని న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించమనండి. వారు అలా అఫిడవిట్ సమరి్పస్తే తదనుగుణంగా మేం తదుపరి చర్యలు చేపడతాం. సీఐడీ పరిధిలోకి రాని పోలీస్ అధికారులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారు? అంటే ఈ కేసు దర్యాప్తే పూర్తి నిబంధనలను విరుద్ధంగా సాగుతోంది. సిట్ కేసు ఈ న్యాయస్థానం పరిధిలోకి రాదు సిట్ నమోదు చేసిన ఈ కేసు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పరిధిలోకి రాదు. ఏసీబీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులను విచారించేందుకు ప్రత్యేక చట్టం ద్వారా ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. సీఐడీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులు కూడా ఈ న్యాయస్థానం పరిధిలోకి వస్తాయని చట్టం చేశారు. కానీ, సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా గుర్తిస్తూ ఈ ప్రభుత్వం జీవో ఇచి్చంది. సిట్ నమోదు చేసే కేసులు అసలు ఈ న్యాయస్థానం పరిధిలోకి రానే రావు. ప్రతి ఒక్కరికి 17ఏ కింద ముందస్తు అనుమతి తీసుకోలేదు ఈ కేసులో నిందితులు ప్రతి ఒక్కరిపై దర్యాప్తునకు 17ఏ కింద ముందే అనుమతి తీసుకోవాలి. మొత్తంగా అందరిపై ఒకేసారి 17ఏ కింద అనుమతి తీసుకున్నామని.. కేరళ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ సిట్ చెబుతున్నది సరికాదు. ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. (ఈ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిందని సిట్ న్యాయవాదులు చేసిన వాదనను న్యాయవాది శ్రీరామ్ తోసిపుచ్చారు). 2023లో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సంబంధించి 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే అంశంపై సుప్రీంకోర్టు చెప్పినదాన్ని ప్రస్తుతం సిట్ న్యాయవాదులు వక్రీకరిస్తున్నారు.స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 2018 కంటే ముందే జరిగింది కాబట్టి 17ఏ వర్తించదు. 2018కు ముందు జరిగిన కేసులకు 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ధర్మాసనానికి నివేదించారు. అంతేగానీ, 2018 ఆ తర్వాత నమోదయ్యే కేసుల్లో నిందితులు ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద దర్యాప్తునకు అనుమతి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఆ ప్రకారం సీఎంవోలో కార్యదర్శిగా చేసిన కె.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు. వారిపై కేసులకు విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాల్సిందే. ఈ నిబంధనను సిట్ ఉల్లంఘించింది కాబట్టి ఇది అక్రమ అరెస్టే అవుతుంది. హడావుడిగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది ముందస్తు బెయిల్ ఇవ్వనంత మాత్రాన నిందితులను హడావుడిగా అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. అరెస్టుకు ఉన్న అధికారాన్ని పోలీసులు దుర్వినియోగం చేయొద్దని ఇటీవలే స్పష్టం చేసింది. కచి్చతమైన ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయాలని చెప్పింది. కానీ, ఈ అక్రమ కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సిట్ స్పష్టమైన ఆధారాలేమీ చూపలేకపోయింది. కనీసం న్యాయస్థానానికి కూడా సమర్పించనే లేదు. ఇక ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దేశం విడిచివెళ్లే అవకాశం ఉంది కాబట్టి అరెస్టు చేస్తున్నామని సిట్ చెప్పడం పూర్తిగా అవాస్తవం. నిందితులుగా చేర్చకముందే వారికి వ్యతిరేకంగా సిట్ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను శుక్రవారం రాత్రి అరెస్టు చేసే క్రమంలో సిట్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారు. అరెస్టుకు ప్రాతిపదిక, కారణాలను నిందితులకు తెలపాలి. కానీ, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వారి కారు డ్రైవర్‌కు చెప్పామని రిమాండ్ నివేదికలోనే సిట్ అధికారులు పేర్కొన్నారు. నిందితులకు తెలపాలన్న నిబంధనను సిట్ అధికారులు కావాలనే ఉల్లంఘించారు. కాపీ పేస్ట్ కుట్ర.. అదే సిట్ రిమాండ్ నివేదిక రెడ్‌బుక్ కుట్రనే సిట్ తన దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ విషయాన్ని వెల్లడించింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతోనే రిమాండ్ నివేదిక రూపొందించిందని స్పష్టమైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఇతర నిందితుల రిమాండ్ నివేదికల్లో పేర్కొన్న కట్టుకథనే కాపీ పేస్ట్ చేసింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఈ కేసు దర్యాప్తు పేరిట డిస్టిలరీల ప్రతినిధులు, ఇతర సాక్షులను తాము బెదిరించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలనే అరెస్టుకు ప్రాతిపదికగా చూపించడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. 20 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం సిట్ అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డికి న్యాయస్థానం ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. వారిద్దరిని సిట్ అధికారులు శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించింది. వారికి ప్రత్యేక వసతులు కలి్పంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. శ్రీధర్‌రెడ్డికి ముగిసిన కస్టడీ విజయవాడ లీగల్: మద్యం కుంభకోణం ఆరోపణలపై అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వున్న శ్రీధర్‌రెడ్డి మూడు రోజుల కస్టడీ శనివారంతో ముగిసింది. పోలీసులు ఆయనకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి, ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. -
‘ఆడబిడ్డ నిధి’కి సమాధి
సాక్షి ప్రతినిధి కర్నూలు/ సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ‘ఆడబిడ్డ నిధి’ని ఇవ్వలేమని, ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఏడాది పాటు ఊరిస్తూ వచ్చి తీరా మోసం చేశారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళల ఆశలపై నీళ్లు చల్లారు. తన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిపోతోందని, పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని.. అందువల్ల ఈ నిధి అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తానని మరోమారు ప్రతినబూనారు. ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టెక్కకపోతే పీ–4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని కర్నూలు సభలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలు విన్న మహిళలు ఒకరి మోహం మరొకరు చూసుకుంటూ నిశ్చేష్టులయ్యారు. బాబు వ్యాఖ్యలు వైరల్ కావడంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.ఎక్కడ నలుగురు మహిళలు కలిసినా కూటమి ప్రభుత్వ మోసం గురించి చర్చించుకుంటున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభకు వేలాదిగా డ్వాక్రా మహిళలను తరలించారు. వీరందరి సమక్షంలోనే ‘ఆడబిడ్డి నిధి’ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ చర్యలతో పేదల ఆదాయం బాగా పెరిగిందని, పేదలు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు.ఒకవేళ అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు ఆడబిడ్డ నిధిని పీ4 (పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టనర్షిప్)కు అనుసంధానం చేసే ఆలోచన చేస్తానని చెప్పారు. ఈ లెక్కన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువు ఐదేళ్లు మాత్రమే. 2029లో తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలి. అప్పటి వరకు ఈ పథకం అమలు చేయరంటే పూర్తిగా ఎగనామం పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరి ఏడాది అవుతోంది. ఏడాదిలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.నాడు ఇంటింటా ఈ నిధి గురించి ప్రచారం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మహాశక్తి ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. కూటమి నేతలు ఇల్లిల్లూ తిరిగి ఈ మేరకు ప్రచారం చేశారు. దీంతో ఆశపడి మహిళలు ఆ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే అవసరమే లేదని చంద్రబాబు నిర్భీతిగా ప్రకటించేయడం పరిశీలకులను సైతం విస్తుగొలుపుతోంది.1.80 కోట్ల మందికి ఎగనామం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాలి. అంటే ఏడాదికి రూ.32,400 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. గత బడ్జెట్లో ఈ పథకం ఊసే లేదు. ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. మొన్నటి బడ్జెట్లోనూ ఆ విషయమే లేదు. అంటే ఇప్పటి వరకు రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.32 వేల చొప్పున 1.80 కోట్ల మందికి రూ.64,800 కోట్లు కేటాయించాలి. అది జరగలేదు. దీన్నిబట్టి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని స్పష్టమైంది. ఈ విషయాన్నే ఇప్పుడు సీఎం చంద్రబాబు బహిరంగంగా స్పష్టం చేశారు.జగన్ చేశారు.. చంద్రబాబు చేతులెత్తేశారు 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కాంక్షతో చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ పథకానికి పేరు మార్చి, నిధులు పెంచి అమలు చేస్తానని నమ్మబలికారు. అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో, రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో.. వైఎస్సార్ చేయూతను ఆడబిడ్డ నిధి పేరుతో హామీ ఇచ్చారు. ‘చేయూత’ ద్వారా జగన్ ప్రభుత్వం 45–59 ఏళ్ల వయస్సున్న వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఏటా వారి ఖాతాల్లో జమ చేసి.. మాట నిలుపుకుంది. ఇదే పథకానికి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.1,800 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అంటే జగన్మోహన్రెడ్డి కంటే రూ.750 తక్కువే ఇస్తామన్నారు. సూపర్ సిక్స్‌లో అన్ని పథకాల కంటే అత్యధిక బడ్జెట్ కేటాయించాల్సిన పథకం ఇదే. అత్యంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నదీ ఈ పథకానికే. ఇలాంటి పథకాన్ని అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేసి రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారు.బలవంతంగా దుకాణాల మూసివేత కర్నూలు నగరంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో శనివారం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉదయం 12 గంటలకు సీఎం రానున్న నేపథ్యంలో 9 గంటలకే షాపులన్నీ మూయించారు. దీంతో సీ క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు యజమానులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో పరదాల మాటున సీఎం పర్యటనలు అని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు.. ఇప్పుడు ఏకంగా తమ పర్యటనలకు దుకాణాలనే మూసి వేస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం సభకు పలు ప్రాంతాల నుంచి పొదుపు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. పర్యటన ఆలస్యం కావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది రేకుల షేడ్లలో, బంద్ చేసిన షాపుల నీడలో తల దాచుకోవాల్సి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేపట్టక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నాడు ఆడ బిడ్డ నిధి హామీ ఇలాతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ... ఒక్కొక్కరికీ నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం.– 2024 మార్చి 13వ తేదీన టీడీపీ నిర్వహించిన ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్‌లో పేర్ల నమోదు కార్యక్రమంలో చంద్రబాబు (చంద్రబాబు మాట్లాడినట్టు ‘ఈనాడు’ దినపత్రిక క్లిపింగ్)⇒ రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం.– 2024 ఏప్రిల్ 30న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ (మే 1వ తేదీ ఈనాడు క్లిప్లింగ్)⇒ భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. – రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ–జనసేన నాయకులు ఇంటింటా కరపత్రాల ప్రచారంబకాయిలతో కలిపి ఇవ్వాలిచంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిచేందుకు లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇన్నాళ్లూ నిధులు లేవు.. సంపద సృష్టించే మంత్రం ఉంటే చెవిలో చెప్పండి అన్నారు. ఇప్పుడు సంపద సృష్టించేశాం అంటున్నారు. పేదలు బాగా సంపాదిస్తున్నారట! ఇంకా నాలుగేళ్లకు పేదరికం పోకపోతే ఆడబిడ్డ నిధిని పీ4కు లింక్ చేస్తానని చెబుతున్నారు. పీ4 అంటే ప్రైవేటు వ్యక్తులు. వారికి ప్రభుత్వ పథకంతో ఏం సంబంధం? దీన్నిబట్టి పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లే. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలి. ఇప్పటికే ఏడాది పూర్తయినందున బకాయిలతో కలిపి ఇవ్వాలి. – వి.భారతి, ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి, కర్నూలుప్రజలు మోసపోయారని తెలుస్తోంది2029లోపు పేదరికాన్ని నిర్మూలిస్తా.. అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు పీ4కు ఆడబిడ్డి నిధిని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పడం సరికాదు. అంటే 2029 లోపు ఆడబిడ్డ నిధి అమలు చేయరా? మీకు ఇచ్చిన గడువే 2028 వరకు. 2029లో ఎన్నికలకు వెళ్లాలి. ఆడబిడ్డ నిధి అనేది ప్రభుత్వ పథకం. పీ4 అనేది పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తులు చేసే సాయం. ఈ రెండిటిని కలపడం అంటే ఎలా? 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు మాటలు వింటుంటే మరోమారు ప్రజలు మోసపోయారని తెలుస్తోంది. – ఎం.శిరీష, ఇందిరాగాంధీ నగర్, కర్నూలుబాబువన్నీ బూటకపు హామీలేగత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 ఇస్తానని నమ్మించి మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు పీ–4 స్కీమ్‌తో అనుసంధానం చేస్తానని చెప్పడం చూస్తే ఇదొక మోసపూరిత హామీగా మిగలనుందని అర్థమవుతోంది. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. మహిళలందరం వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతాం. – ఎస్కే మస్తాన్‌బీ, నెల్లూరుఆడబిడ్డ నిధి ఇవ్వరా?కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీగానే ఉండిపోయింది. ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఆడబిడ్డలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సంపద సృష్టించామని చెబుతున్నారుగా.. ఇవ్వండి మరి. మొత్తం బకాయిలతో కలిపి వెంటనే ఇవ్వాలి. – కె.కృష్ణవేణి, దెందులూరు, ఏలూరు జిల్లామాట నిలుపుకోవాలిఅధికారంలోకి రాగానే ఏడాదికి రూ.18,000 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామన్నారు. ఏడాదవుతున్నా దాని ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్ పథకాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. మాట నిలుపుకోకుండా మోసం చేయడం సరికాదు. – డాలు మనీషా, చిన్న కనుమళ్ల, ప్రకాశం జిల్లా ఈ పథకం అమలు కాదికఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంకా పేదరికం ఉంటే పీ4 ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. దీని ప్రకారం దాతలు ముందుకు వస్తే వారికి నచ్చిన వ్యక్తులకే అమలు చేస్తారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇక ఈ పథకం అమలు కాదనిపిస్తోంది. – కర్రి వెంకటలక్ష్మి, సామర్లకోట, కాకినాడ జిల్లామరోసారి మోసం చేస్తున్నారుఅధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 చొçప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పథకం అమలు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఇది చాలా అన్యాయం. పీ4తో ఆడ బిడ్డ నిధిని అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూస్తే మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని తెలుస్తోంది. – సూరెడ్డి హైమావతి, మెంటాడ, విజయనగరం జిల్లాప్రభుత్వంపై నమ్మకం పోయింది కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలతో ఈ పథకం అమలయ్యే సూచనలే కనిపించడం లేదు. ఇలా చేయడం సరికాదు. ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. – పి యేసమ్మ, ప్రకాష్ నగర్, కడప -
Nara Lokesh: మనల్ని ఎవడ్రా ఆపేది.. చినబాబు పెద్ద ప్లాన్!
ఆల్రెడీ ఐదేళ్ల క్రితమే మంత్రి పదవి చేసేసారు.. పైగా ఈ ఐదేళ్ళలో బోలెడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది.. క్యాడర్ తో కలిశారు..కలుస్తున్నారు.. పార్టీలో పెద్దరికం కూడా చేస్తున్నారు.. పైగా పాదయాత్ర పేరిట మరిన్ని మార్కులు.. ఇవన్నీ సరిపోవా ఏమి.. గమ్మున మా చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు మీద కుటుంబం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో మే 27.. 28.. 29 తేదీల్లో కడపలో నిర్వహించే మహానాడులో చినబాబు స్టేచర్ పెరిగిపోవాలి.. లేదంటే ఇంట్లో గొడవలు అవుతాయి.. గిన్నెలు గాల్లోకి లేస్తాయి అనే అల్టిమేటం రావడంతో చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వక తప్పడంలేదు. పోనీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం వంటి పదవులు ఇవ్వాలంటే అటు బీజేపీ ఒప్పుకోవాలి.. పవన్ ఊ కొట్టాలి.. ఇవన్నీ అయ్యేది కాదు.. కూటమి ప్రభుత్వంలో ఇంకో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కేంద్రంలోని బిజెపి పెద్దలు సుతరామూ ఒప్పుకోవడం లేదు.వాస్తవానికి ప్రభుత్వంలో పార్టీలో లోకేష్ ఇప్పుడు నంబర్ టూ గా ఉంటున్నారు.. పేరుకే చంద్రబాబు కానీ పదవులు.. ప్రాజెక్టులు.. పంచాయతీలు అన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఎలివేషన్ ఉండాల్సిందే అనే డిమాండ్ కూడా క్యాడర్ నుంచి వచ్చేలా లోకేష్ ప్లాన్లు వేస్తున్నారు. వీలైనప్పుడల్లా కొందరితో చంద్రబాబుకు రికమెండ్ చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు కడప మహానాడులో చినబాబుకు పెద్దపదవిని కట్టబెట్టేపనిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్..లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే పదవుల్లో ఆయన్ను కూర్చోబెట్టి ఇక పవన్ కళ్యాణ్ కు సరిసమాన హోదా ఇవ్వడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది.. అనే ట్యాగ్ లైన్ మీద హడావుడి చేసే జనసేన నాయకులకు.. క్యాడర్ కు లోకేష్ ఇప్పుడు పోటీగా నిలబడతారని అంటున్నారు.. అప్పుడు లోకేష్ కూడా పవన్ కు సమానమైన హోదా.. గుర్తింపు వస్తుందని. అప్పుడు ఆయన్ను ఎవరూ ఆపలేరని క్యాడర్ సంబరపడుతోంది. -సిమ్మాదిరప్పన్న -
‘ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు.. అరెస్టుకు ఆధారాల్లేవ్’
విజయవాడ: రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుకు ఆధారాల్లేవని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పష్టం చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పై ఈరోజు(శనివారం) విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.. ఈ కేసుకు సంబంధించి కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల తరఫున న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు ‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ సక్రమం కాదు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఇద్దరి అరెస్ట్‌కు అధారాల్లేవ్. కోర్టుకు కూడా అరెస్ట్ కు సంబంధించిన ఆధారాలు ఏవీ ఇవ్వలేదు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చట్ట విరుద్ధం. సిట్ కు ఈ కేసు విచారించే అర్హత లేదు.అసలు రూ. 3200 కోట్లు స్కామ్ కి అసలు ఆధారాలు ఏవి?, రూ. 3200 కోట్లు స్కామ్ ఆధారాలు కోర్టుకి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ సొంత కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్న సమాచారం కూడా ఇవ్వలేదు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్ ఆదాయం పెరిగింది. లిక్కర్ వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. మరి రూ. 3200 కోట్లు స్కామ్ ఎక్కడ జరిగింది?, రూ. 16 వేల కోట్ల నుండి రూ. 24 వేల కోట్లకు ఆదాయ పెరిగింది. మరి ప్రభుత్వంకి నష్టం ఎక్కడొచ్చింది. అరెస్ట్ కారణాలను కూడా కాపీ పేస్ట్ చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది’ అని శ్రీరామ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు: సుప్రీంకోర్టు -
‘చంద్రబాబు.. లిక్కర్ స్కామ్‌కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’
తాడేపల్లి: నాణ్యమైన మద్యం, తక్కువ ధరలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాన్ని మోసం చేశారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. విమర్శించారు. దేశంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు కూటమి ప్రభుత్వం పెట్టింది పేరని ఎద్దేవా చేశారు శైలజానాథ్,ఈ రోజు(శనివారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. మద్యం వ్యాపారంలో చంద్రబాబు ఎక్స్ పర్ట్. అని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు చేసిన అన్ని వ్యవహారాలు ప్రజలు మర్చిపోతారనే భావనలో ఉంటారు. చంద్రబాబు ప్రభుత్వం లోనే డిస్టలరీలకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు వ్యవహారం గురువింది గింజ సమేతలా ఉంటుంది. నూతన పాలసీ విధానంలో మద్యం అమ్మకాలు ప్రైవేటుకి ఇవ్వడంలో కూడా అవకతవకలు జరిగాయి. టీడీపీ స్థానిక నాయకులకు భాగస్వామ్యం ఉంది. రండి చూపిస్తాం... బెల్ట్ షాప్ లు లేని గ్రామం లేదు.. మేము చూపిస్తాం. అసలు మద్యం స్కాం అనేది ఇప్పుడు మీ ప్రభుత్వం లోనే నడుస్తోంది. మీ ప్రభుత్వ హయాంలో రోజు రెవెన్యూ లోటు కనిపిస్తుంది.మీరు సంవత్సర కాలంలో ఏం చేశారు?, లిక్కర్ కేసులో ఉన్న ఆధారాలు ఏంటి?, భయాన్ని క్రియట్ చేసి రాజ్యం నడుపుదాం అనుకుంటున్నారా?, చంద్రబాబు ఎన్నికల్లో గెలుపుకోసం ఏమైనా ప్రకటనలు చేస్తారని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగించాలి. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు?, ఇప్పటికైనా కక్ష పూరిత వేధింపులు ఆపండి. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. మీ సీనియర్లతో చర్చించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోండి. మీ సచ్చీలతను నిరూపించుకోండి. చంద్రబాబు.. లిక్కర్ స్కామ్ కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’ అంటూ ధ్వజమెత్తారు శైలజానాథ్. -
ఆ అరెస్ట్‌ల వెనుక కుట్ర కోణం: అంబటి
సాక్షి, గుంటూరు: కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తే బెదిరిపోయేది లేదని.. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు.‘‘రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పని చేశారని ధనుంజయ రెడ్డి , కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వైఎస్ జగన్‌ను అక్రమ కేసులతో జైలులో పెట్టి, ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైఎస్సార్సీపీ నేతలను, గత ప్రభుత్వ హయాంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారు. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుంది. అమ్మ ఒడి వంటి పథకాలను ప్రజలు అడగకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. ధనుంజయ రెడ్డి,కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
మరోసారి బయటపడ్డ ఈనాడు పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: మరోసారి ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలు బయటపడ్డాయి. సెకీ సీఎండీ రామేశ్వరగుప్తాను కేంద్రం తొలగించిన వార్తపై ఈనాడు వక్రభాష్యం చెప్పింది. వైఎస్ జగన్ హయాంలో ఏపీలో జరిగిన విద్యుత్ ఒప్పందాలే తొలగింపునకు కారణం అంటూ ఈనాడు అబద్ధాలు రాసింది.2023లో జూన్‌లో సెకీ సీఎండీగా రామేశ్వర్ పదవి చేపట్టగా.. రామేశ్వర్ గుప్తా ఛైర్మన్ కాకముందే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. రామేశ్వర్ గుప్తా సెకీలో లేనప్పుడు ఒప్పందాలు జరిగితే.. ఆయన తొలగింపునకు ఏపీతో జరిగిన ఒప్పందాలే కారణమంటూ ఈనాడు అబద్ధాలు అచ్చేసింది.2021 డిసెంబర్లోనే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని ఈనాడు ఒప్పుకుంది. అబద్ధం వండివార్చాలనే తాపత్రయంలో కనీసం వాస్తవాలు ఏంటో తెలుసుకోని ఈనాడు.. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయింది.ఈనాడు పిచ్చిరాతలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా?. ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబర్లో ఒప్పందం జరిగింది. 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తా నియమితులయ్యారు. 2023లో ఛైర్మన్ అయిన రామేశ్వర్ గుప్తాకు 2021 నాటి ఏపీ-సెకీ ఒప్పందానికి ఏం సంబంధం’’ అంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.🚨 #BanYellowMediaSaveAPఏమిటీ రాక్షసత్వం. వైయస్.జగన్మోహన్రెడ్డిగారి వ్యక్తిత్వ హననంకోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? “ఈనాడూ’’ మీది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబరులో ఒప్పందం. 2023లో సెకీ… pic.twitter.com/CJzt414GJH— YSR Congress Party (@YSRCParty) May 17, 2025 ‘‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాకముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణలు నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా 5-6 రోజులుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ-సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ.. నిస్సిగ్గుగా ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. -
ఏపీ ఈఏపీసెట్‌కు 3.62 లక్షల దరఖాస్తులు
సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2025కు 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నారని సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ చెప్పారు. కాకినాడలోని జేఎన్టీయూలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,80,597, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీకి, 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో 145, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఒక్కోటి చొప్పున ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఏపీ ఈఏపీసెట్ పరీక్ష కేటాయించిన తేదీన వేరే జాతీయ స్థాయి పరీక్ష ఉంటే ఆధారాలతో హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలని, ఆ వివరాలను పరిశీలించి, పరీక్ష తేదీ మారుస్తామని చెప్పారు. ఉర్దూ మీడియం ఎంచుకున్న అభ్యర్థులు కర్నూలు రీజినల్ సెంటర్లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. దివ్యాంగులకు సహాయకులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తులో ఏమైనా తప్పులు నమోదు చేస్తే పరీక్ష రాసిన తర్వాత హెల్ప్‌లైన్ సెంటర్ ద్వారా మార్చుకోవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి గంటన్నర ముందుగా అనుమతిస్తామన్నారు.అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు నిర్దేశించిన గుర్తింపు కార్డు, నలుపు లేదా నీలం రంగు బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. బయోమెట్రిక్‌కు ఆటంకం లేకుండా చేతులపై మెహందీ వంటివి పెట్టుకోవద్దని, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌పై పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ ఉంటుందని, ముందు రోజే వెళ్లి చూసుకోవాలన్నారు. హాల్‌టికెట్లను ఏపీ ఈఏపీసెట్ వెబ్సైట్ నుంచి, మన మిత్ర వాట్సాప్ యాప్(నంబర్ 9552300009) ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 0884–2359599, 0884–2342499 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించాలని ప్రొఫెసర్ ప్రసాద్ సూచించారు. ఈ సమావేశంలో సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు, రెక్టార్ కేవీ రమణ, ఓఎస్డీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.వైఎస్ జగన్ చొరవతో ప్రైవేట్ వర్సిటీల్లో సీట్లు..పేదింటి బిడ్డలు ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ ఉచితంగా చదువుకునే వెసులుబాటును కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఈఏపీసెట్‌లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఏడాదికి రూ.4లక్షల నుంచి రూ.5లక్షల ఫీజులు ఉండే ప్రైవేట్ వర్సిటీల్లో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రైవేటు కళాశాలల్లోనే కాకుండా ప్రైవేటు వర్సిటీల్లోనూ అమలు చేశారు.విట్, ఏపీ ఎస్ఆర్ఎం, ఎంబీయూ, సెంచూరియన్ వంటి ప్రైవేట్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందేలా చేశారు. మరోవైపు పేద పిల్లలకు మేలు చేసే గత ప్రభుత్వ విధానాలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. విచ్చలవిడిగా ఇంజినీరింగ్ కళాశాలలను డీమ్డ్ వర్సిటీలుగా మార్చుకునేందుకు అనుమతులు ఇవ్వడంతోపాటు ప్రైవేటు వర్సిటీలుగా మార్చుకునేందుకు తోడ్పాటును అందించింది. తద్వారా విలువైన కన్వీనర్ కోటా సీట్లను కోల్పోవాల్సి వస్తోంది.సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే..విభజన చట్టం ప్రకారం పదేళ్లు గడువు ముగియడంతో 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ రిజర్వుడు కోటాలో తెలంగాణ విద్యార్థులకు కేటాయించే 15 శాతం సీట్లను కూడా ఏపీ విద్యార్థులకు ఇస్తారు. రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం 1.81లక్షల ఇంజినీరింగ్ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతిచ్చింది. ఇందులో రాష్ట్ర యూనివర్సిటీ క్యాంపస్‌లు 245 , ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,71,079 సీట్లు, ఆర్జీయూకేటీ, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లో 10,653 సీట్లు ఉన్నాయి.మౌలిక వసతుల ఆధారంగా కళాశాలలు సొంతంగా సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు ఏఐసీటీఈ కల్పించింది. దీంతో ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా కళాశాలలు సంప్రదాయ ఇంజినీరింగ్ కోర్సులను పక్కనపెట్టి విద్యార్థులను ఆకర్షించేందుకు కంప్యూటర్ ఆధారిత కోర్సులకే అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. 2024–25లో కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే ఏకంగా 99,494 సీట్లు ఉండటం గమనార్హం. కాగా కన్వీనర్ కోటాలో 1.36లక్షల సీట్లు ఉన్నాయి. -
స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓలు
సాక్షి, అమరావతి: పది వేల పైబడి జనాభా లేదా ఏడాదికి రూ.కోటికి పైబడి వార్షికాదాయం ఉండే గ్రామ పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించి, వాటికి డిప్యూటీ ఎంపీడీవోలను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో మండలం పరిధిలో ఉండే అన్ని గ్రామ పంచాయతీల కార్యకలాపాలను పర్యవేక్షించే మండల స్థాయి అధికారి ఈవోపీఆర్ అండ్ ఆర్డీలను ప్రభుత్వం ఇటీవలే డిప్యూటీ ఎంపీడీవోలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను వాటి వార్షికాదాయం, జనాభా ఆధారంగా పునర్‌వర్గీకరించేందుకు ఈ ఏడాది జనవరిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ పది వేలపైబడి జనాభా ఉండే గ్రామ పంచాయతీలు, లేదంటే ఏడాదికి రూ.కోటికి పైబడి వార్షికాదాయం ఉండే పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించాలని, గిరిజన ప్రాంతాల్లో ఐదు వేల పైబడి జనాభా ఉండే పంచాయతీని స్పెషల్ గ్రేడ్‌గా గుర్తించాలని ప్రతిపాదించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో దాదాపు 300 గ్రామ పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు అర్హమైనవిగా గుర్తించింది. వీటిల్లో ప్రస్తుత పంచాయతీ కార్యదర్శుల స్థానంలో డిప్యూటీ ఎంపీడీవోలను నియమించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మూడు గ్రేడుల్లో విలీనం.. గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణకు ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీలను మినహాయించి మిగిలిన గ్రామ పంచాయతీల మొత్తాన్ని గ్రేడ్ –1, 2, 3 పంచాయతీలుగా వర్గీకరిస్తూ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులను గతంలో ఐదు గ్రేడ్లుగా వర్గీకరించారు. ఇప్పుడు తాజా మార్పులకు వీలుగా వీరిని గ్రేడ్ –1, గ్రేడ్ –2, గ్రేడ్ –3 పంచాయతీ కార్యదర్శులుగా వర్గీకరించి విలీనం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ «కమిషనర్ కార్యాలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆన్ని జిల్లాల నుంచి తగిన ప్రతిపాదనలు పంపాలంటూ కలెక్టర్లకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ సూచించింది. -
లెక్చరర్ పోస్టుల రాత పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: పాలనాపరమైన కారణాలతో జూన్‌లో జరగాల్సిన పలు లెక్చరర్ పోస్టుల రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులతో పాటు టీటీడీ డిగ్రీ, ఓరియంటల్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. వారికి మరో అవకాశం గ్రూప్–2 మెయిన్స్‌కు అర్హత సాధించినవారిలో యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎఫ్ఆర్వో పరీక్షలు రాసేవారికి ధ్రువపత్రాల పరిశీలన కోసం ఏపీపీఎస్సీ జూలై 10 వరకు అదనపు అవకాశం కల్పించింది. తదుపరి తేదీ కోసం అభ్యర్థులు కమిషన్‌ను సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. ప్రశ్నాపత్రాల తయారీ వేతనం పెంపు ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాలు తయారు చేసే నిపుణులకు చెల్లించే వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రం, కీ తయారీలో ప్రతి ప్రశ్నకి రూ.150 ఇస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.200కి, జవాబు పత్రాల వేల్యూయేషన్ కోసం ఒక్కో స్క్రిప్్టకి రూ.100 ఇస్తుండగా, దాన్ని రూ.300కి పెంచారు. -
బెయిల్..రిమాండ్..ఆపై మరో కేసు
విజయవాడలీగల్ /నూజివీడు/గన్నవరం : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఆయనపై ఇప్పటికే పదికిపైగా తప్పుడు కేసులు నమోదు చేసింది. వీటిల్లో కొన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి ఎక్కడ బయటికి వచ్చేస్తారోననే అక్కసుతో మరిన్ని కేసులను తెరమీదకు తీసుకువస్తూ వేధిస్తోంది. అయినా న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం సాగిస్తోన్న వంశీమోహన్ ఒక్కో సమస్య సాలెగూడును ఛేదించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. తాజాగా శుక్రవారం అటు విజయవాడ, ఇటు నూజివీడు కోర్టుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు గుట్టుచప్పుడు కాకుండా నమోదైన కేసే ఇందుకు అద్దం పడుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడికేసులో బెయిల్ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఎ71గా ఉన్న మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్‌కు 12వ అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వున్న వంశీ తరపున దేవి సత్యశ్రీ,, ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇదే కేసులో ఎ81గా ఉన్న లక్ష్మీపతికీ బెయిల్ మంజూరైంది. రెండువారాల రిమాండ్ వల్లభనేని వంశీకి నూజివీడులోని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు శుక్రవారం 14 రోజుల రిమాండ్ విధించింది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని నమోదైన కేసుపై హనుమాన్‌జంక్షన్ పోలీసులు వంశీతో పాటు ఇదే కేసులో ఉన్న ఓలుపల్లి మోహన రంగారావులను నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరికీ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.శ్రావణి రిమాండ్ విధించారు. ఈ కేసులో వల్లభనేని వంశీ ఏ10 కాగా, ఓలుపల్లి మోహన రంగారావు ఏ7గా ఉన్నారు. అనంతరం వంశీని పోలీసులు విజయవాడలోని జిల్లా సబ్‌జైలుకు తరలించారు. వంశీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయగా, దానిపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. తాజాగా మరో కేసు..ఆపై గోప్యత తాజాగా గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుపై వల్లభనేని వంశీమోహన్‌తో పాటు ఇంకొంత మందిపై గన్నవరం పోలీసులు గురువారం మరొక అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు బయటకు రాకుండా పోలీసులు అత్యంత గోప్యతను పాటిస్తుండడం గమనార్హం. వివరాలిలా వున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రావెల్ తవ్వకాలపై మూడు నెలలు క్రితం సమర్పించిన నివేదిక ఆధారంగా ఆ శాఖ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇందులో ప్రధాన నిందితులుగా వల్లభనేని వంశీమోహన్‌ను చేర్చారు.ఆయనతోపాటు ఓలుపల్లి మోహన్‌రంగా, పడమట సురేశ్, కైలే శివకుమార్‌తో పాటు మరో 10 మందిపై పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఆరోపణలు, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ రావడంతో వంశీ మోహన్ బయటకు వస్తారనే సమయంలో తాజాగా మైనింగ్ కేసును బనాయించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోంది. -
అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి
సాక్షి, అమరావతి: అసమర్థ విధానాలతో కూటమి ప్రభుత్వం టీచర్లలో అలజడి సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. ‘విద్యార్థి, ఉపాధ్యాయుల రేషియోలో అశాస్త్రీయ విధానం కారణంగా దాదాపు 10 వేల మంది స్కూల్ అసిస్టెంట్లను సర్‌ప్లస్‌గా చూపే పరిస్థితి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకువచి్చన సంస్కరణలను కక్షతోనే నిర్విర్యం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా రంగాన్ని బతికించాలంటూ వీధుల్లోకి వచ్చి పోరాడే దుస్థితి తెచ్చారు. 117 జీఓను రద్దు చేస్తూ, దానికి బదులుగా తెచ్చిన 19, 20, 21 జీవోల వల్ల ప్రైమరీ స్కూళ్లకు ఎటువంటి మేలు జరగడం లేదు. ఇదివరకు ఉన్న ఆరు రకాల స్కూళ్లను నాలుగింటికి తగ్గిస్తామని చెప్పి.. తొమ్మిదికి పెంచారు.ఉపాధ్యాయుల్లో అయోమయ పరిస్థితి. వైఎస్ జగన్ టీచర్లకు పదోన్నతులు ఇస్తే, కూటమి ప్రభుత్వం వారికి డిమోషన్స్ ఇస్తోంది. ఒకవైపు మిగులు టీచర్లను చూపుతూ, మరోవైపు డీఎస్సీలో కొత్త టీచర్ పోస్ట్‌లను ఎలా భర్తీ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీలో పోస్ట్‌లను తగ్గించేందుకే ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల రేషియోను 1-53 కాకుండా 1-40 ప్రకారం తీసుకోవాలి. సెకండ్ సెక్షన్ కూడా హైసూ్కల్‌కు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి. సబ్జెక్ట్ టీచర్లను పక్కకు పెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలి’. -
‘స్థానిక’ సంస్థలకు శఠగోపం
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలను ఉద్ధరిస్తామని మాయ మాటలు చెప్పిన టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. పైగా.. వాటిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఆ సంస్థలకు హక్కుగా రావాల్సిన నిధుల్ని సైతం ఇవ్వకుండా వాటిని మళ్లిస్తున్నారు. గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన వాటాలో పైసా కూడా ఇవ్వకుండా నిలిపివేశారు.ఫలితంగా.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. పైగా.. సబ్ రిజి్రస్టార్లు ఎవరూ స్థానిక సంస్థల వాటా నిధులు విడుదల చెయ్యొద్దని మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఎవరైనా తమకు తెలీకుండా నిధులు విడుదల చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా 11 నెలలుగా టీడీపీ కూటమి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయంలో చిల్లిగవ్వ కూడా స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు.రూ.2 వేల కోట్లు విడుదల చేయలేదునిజానికి.. ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్ డ్యూటీ కింద 6.5 శాతం చెల్లిస్తారు. అందులో 5 శాతం ప్రభుత్వానికి, 1.5 శాతం స్థానిక సంస్థలకు వెళ్తుంది. ప్రతినెలా ఆ మొత్తాన్ని ఆయా స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ల శాఖ చెల్లించాలి. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం మొత్తం 6.5 శాతం స్టాంప్ డ్యూటీని తీసేసుకుని ఇతర అవసరాలకు వినియోగించుకుంటోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా స్థూల ఆదాయం రూ.9 వేల కోట్లు వచ్చింది. ఇందులో స్థానిక సంస్థల వాటా 1.5 శాతం అంటే సుమారు రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి వుంది.కానీ, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పంచాయతీలు నిధుల్లేక అల్లాడుతున్నాయి. ఎందుకంటే.. వాటికి ఇదే ప్రధాన ఆదాయ వనరు. దీంతో అనేక స్థానిక సంస్థల్లో ఇప్పుడు పారిశుధ్య కారి్మకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. రోడ్లు, డ్రెయిన్ల వంటి కనీస మౌలిక సదుపాయాల మరమ్మతులూ చేయించలేకపోతున్నారు. స్థానిక సంస్థల నిర్వహణకు సైతం తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.ఆదాయం తగ్గిపోయినట్లు కనపడుతుందని..నిజానికి.. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆదాయం తగ్గినట్లు చూపిస్తే ఇబ్బంది వస్తుందనే భయంతో స్టాంప్ డ్యూటీ వాటా గురించి అసలు ఎక్కడా మాట్లాడడంలేదు. సాధారణంగా.. స్టాంప్ డ్యూటీ కింద వచ్చిన మొత్తంలో స్థానిక సంస్థలు, ఇతర ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే రిజిస్ట్రేషన్ల ఆదాయంగా చూపిస్తారు.అంటే.. స్థూల ఆదాయంలో ఖర్చులు, ఇతర శాఖలకు ఇవ్వాల్సిన వాటిని తీసివేసి నికర ఆదాయాన్ని చూపిస్తారు. అందులో స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన వాటా కూడా ఉంటుంది.అయితే, గత ఆర్థిక సంవత్సరం స్థూల ఆదాయం భారీగా తగ్గిపోవడంతో స్థానిక సంస్థలకు వాటి వాటా నిధులు ఇవ్వడంలేదు. ఇస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇంకా తగ్గిపోయినట్లు కనబడుతుందనే కారణంతో విడుదల చేయడంలేదని అధికారులు చెబుతున్నారు.నోరు మెదపని పవన్.. అయితే, తమకు రావాల్సిన నిధులు ఇవ్వాలని పలుచోట్ల సర్పంచ్‌లు, మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజి్రస్టార్ల వద్దకు వచ్చి అడుగుతున్నారు. కొందరైతే ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తున్నారు. తమ వాటా విడుదల చెయ్యొద్దని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలుంటే చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి వచ్చింది మౌఖిక ఆదేశాలు కావడంతో సబ్ రిజిస్ట్రార్లు మిన్నకుండి పోతున్నారు.ఈ వ్యవహారం తన శాఖకు సంబంధించినదైనా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నోరు మెదపడంలేదు. పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన నిధులను ప్రభుత్వం ఇవ్వకుండా దారి మళ్లిస్తున్నా ఆయన చోద్యం చూస్తుండడంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలకు అన్యాయం జరగనివ్వనని కాకినాడలో సర్పంచ్‌లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఆయన అనేక హామీలు గుప్పించారు. కానీ, ఇప్పుడు తన శాఖకు రావల్సిన నిధులను రాబట్టుకోవాల్సిన ఆయన ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై వారు రగిలిపోతున్నారు. -
ఆయనపై కేసులున్నాయని మీరెలా చెబుతున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని మీరెలా చెబుతారు.. అంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాల కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కాకాణి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని, గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ–4గా చేర్చారు. దీంతో ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ.. ఆయన మే 13న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసేనని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం.. ‘హైకోర్టు డివిజన్ బెంచ్ వద్దే తేల్చుకోవచ్చు కదా.. దీనికోసం ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు.. అని అడిగింది.హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును జూన్ 16కు వాయిదా వేసిందని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని దవే బదులిచ్చారు. కాగా.. తనపై గతంలో ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని గోవర్దన్ రెడ్డి కోర్టును తప్పుదారి పట్టించేలా పిటిషన్లో పేర్కొన్నారని ఏపీ ప్రభుత్వం తరఫున ప్రేరణ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. ‘ఆయన మీద కేసులు ఉన్నాయని మీరు ఎలా చెబుతున్నారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయినా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున అరెస్టు నుంచి కాకాణికి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. -
రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు
ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు..పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు.. పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తాం.థర్డ్ డిగ్రీ ఉపయోగించినా.. బెదిరించినా.. ఒత్తిడి చేసినా.. ప్రలోభపెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహ నిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులను అనుసరిస్తోంది. పిటిషనర్లు, ఇతర సహ నిందితుల విషయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభపెట్టడం చెయ్యడానికి వీల్లేదు. సాక్షి, అమరావతి: ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, రాజకీయ దురుద్దేశాల కారణంతో.. నిందితులను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయకుండా దర్యాప్తు అధికారిని నిరోధించలేమని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.\మద్యం వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెబుతూ, వారి పిటిషన్లను కొట్టివేసింది. పిటిషనర్లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదని ఏపీ సీఐడీ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదంది. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలని ఆదేశించింది. పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే, కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. సీఐడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారు మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ పార్థివాలా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ప్రభుత్వం మారగానే కేసు నమోదైందని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దర్యాప్తునకు పిటిషనర్లు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 13 గంటల చొప్పున వీరిని దర్యాప్తు అధికారి ప్రశి్నంచారన్నారు. ఎలాంటి అక్రమాల్లేవనీ సీసీఐ తేల్చింది... కొత్త మద్యం కంపెనీలకు అవకాశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోందని.. కానీ, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తేల్చిందని అభిషేక్ మను సింఘ్వీ, వికాస్ సింగ్ పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఇప్పుడు చేస్తున్న ప్రతి ఆరోపణ.. గతంలో సీసీఐకి చేసిన ఫిర్యాదులో ఉన్నవేనని గుర్తు చేశారు. నాటి ఫిర్యాదును సీసీఐ క్షుణ్నంగా పరిశీలించి క్లీన్చిట్ ఇచ్చిందని వివరించారు.ఈ మేరకు సీసీఐ ఉత్తర్వులను వారు ధర్మాసనం ముందు ఉంచారు. అక్రమాలే లేవని తేలిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చేసిందని, రాజకీయ కక్ష సాధింపులకు ఈ కేసు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ కేసులో సాక్షులను సీఐడీ పలు రకాలుగా భయపెడుతోందన్నారు. కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇవ్వకుంటే నిందితులుగా చేర్చేందుకు కూడా వెనుకాడడం లేదని తెలిపారు. వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలు ఏమీ చూపడం లేదని నివేదించారు. పిటిషనర్లకు మద్యం వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని, వారు కేవలం ప్రభుత్వ అధికారులుగా సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. ఇదే నేరం అంటూ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పారదర్శక విధానాన్ని పూర్తిగా మార్చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ, ఇదో భారీ కుంభకోణమన్నారు. గతంలో మద్యం కొనుగోళ్లు చాలా పారదర్శకంగా జరిగేవని, గత ప్రభుత్వ హయాంలో దానిని పూర్తిగా మార్చేశారన్నారు. కీలక స్థానాల్లో కావాల్సిన వ్యక్తులను నియమించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ దురుద్దేశాలను, ప్రాథమిక ఆధారాలను ఎలా సమతుల్యం చేస్తారని ప్రశ్నించింది. దీంతో ఇది విచారణకు స్వీకరించదగ్గ నేరమే కాదని వికాస్ సింగ్ సమాధానం ఇచ్చారు.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అలాగైతే ఎఫ్ఐఆర్ కొట్టివేతకు పిటిషన్ దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఆ పని కచి్చతంగా చేస్తామని వికాస్ తెలిపారు. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు ప్రభుత్వాధికారులుగా పదవీ విరమణ చేశారని, వారు ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని అన్నారు. ఆ అవసరం కూడా వారికి లేదన్నారు. కావాలంటే పాస్‌పోర్ట్ జప్తునకు ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. అలాంటప్పుడు దేశం విడిచివెళ్లిపోతారన్న ఆందోళన అనవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈసీఆర్ నమోదు చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్లు కొట్టేసింది. బెయిల్ పిటిషన్ దాఖలుకు గోవిందప్పకు అనుమతి వికాట్ సంస్థ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు వివరించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌కు అనుమతి కోరగా.. ధర్మాసనం అనుమతిచ్చింది. బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే కేసు పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో దవే స్పందిస్తూ, ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే గోవిందప్పను అరెస్ట్ చేశారన్నారు. ఇది ఏమాత్రం సహేతుకం కాదని, ఇలా అరెస్ట్ చేయడం తగదంటూ ఇదే కోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించాలంటూ సంబంధిత తీర్పు కాపీని ధర్మాసనం ముందు ఉంచారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ అవసరం లేదని, తాము బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు హెచ్చరికలు ఇవీ... రాష్ట్ర ప్రభుత్వానికి... ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేం. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలు ఉంటే, వాటికి న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సీఐడీ అధికారులకు..పిటిషనర్లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదు. ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదు. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి.రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై... పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే, కింది కోర్టులు కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలి. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలి. -
ఈ అరెస్టులు అప్రజాస్వామికం: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని.. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు.చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తాయి. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపడం లేదు. కాని.. బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించారు. మరి ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా వల్ల నష్టం వచ్చిందన్నారు. మరి ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడంలేదు?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కక్ష రాజకీయాలు తార స్థాయికి.. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ఇప్పటికే టార్గెట్‌చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌కు మంచివి కావు. చంద్రబాబు కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి...పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి. అణచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు.. మేరుగ నాగార్జునధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య అని.. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోంది. ఈ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని మేరుగ నాగార్జున హెచ్చరించారు.చంద్రబాబువి కక్ష రాజకీయాలు: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుమాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. ఈ అరెస్టులు అప్రజాస్వామికం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. విపక్ష పార్టీ నేతలతో పాటు ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను.వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ధనుంజయ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు. ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. తగిన న్యాయ సహాయం అందిస్తాం.పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తిరుపతి ఎంపీ గురుమూర్తిచంద్రబాబువి కక్ష రాజకీయాలు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. -
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్
విజయవాడ: మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు కక్ష పూరితమని.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను అరెస్టు చేసే సంస్కృతి సరికాదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.కాగా, మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది.సిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు.ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. -
ఈ నెల 19 నుంచి ఏపీ ఈఏపీ సెట్
విజయవాడ: ఈ నెల 19 నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మొత్తం 3,62, 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాలతో పాటు హైదరాబాద్ లో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.కాగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు నిన్న(గురువారం, మే 15వ తేదీ) విడుదలయ్యాయి. మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను కూడా తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను కూడా తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా మరియు బీఎస్సీ (గణిత శాస్త్రం) విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి BE / BTech / B.Pharmacy కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండవ సంవత్సరంలో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు, త్వరలో ప్రారంభమయ్యే AP ECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా తగిన సీట్లను పొందవచ్చు. -
పరిటాల శ్రీరామ్‌కు అరెస్టు వారెంట్
సాక్షి, అనంతపురం: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2023 అనంతపురం రెండో పట్టణ స్టేషన్లో పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంపై ఏజేఎఫ్సీఎం కోర్టు సీరియస్ అయ్యింది. పరిటాల శ్రీరామ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. -
ఆధి‘పచ్చ’ పోరు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. తమ మాటే వినాలని అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. పోస్టింగ్‌లు, కాంట్రాక్టులు, ఇతర పనుల్లో తమ మాటే నెగ్గాలని ఎవరికి వారు పట్టుబడుతుండడంతో వారి మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఈ విభేదాలు మరింత ముదిరిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. పలుచోట్ల ఎంపీల పెత్తనం ఎక్కువ కావడంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లోకేశ్ అండతో ‘చిన్ని’కిచినికి గాలివాన..!విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తాను లోకేశ్ మనిషినంటూ నియోజకవర్గాల్లో అన్నింటికీ తనకు వాటా ఉండాలని పట్టుబట్టి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇసుక ర్యాంపులు, మద్యం షాపులు, కాంట్రాక్టుల కోసం ఎక్కడికక్కడ తన మనుషులను పెట్టి వారితో వ్యవహారాలు నడిపిస్తున్నారు. విజయవాడ నగరంతోపాటు నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో చిన్నచిన్న విషయాల్లోనూ వేలు పెడుతుండడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనను వ్యతిరేకిస్తే లోకేశ్‌తో ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో ఎవరూ బయటపడడం లేదని, కేశినేని చిన్ని తీరు అన్యాయంగా ఉందని వాపోతున్నారు.మా‘లావు’ చిక్కులునర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటూ తన మాటే నెగ్గాలని పట్టుబడుతుండడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నిచోట్లా ప్రత్యేకంగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారితో పనులు చేయించేందుకు యత్నిస్తుండడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలోనే గురజాల, నర్సరావుపేట సీట్లను తాను చెప్పిన వారికి ఇప్పించేందుకు యత్నించినా గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, నర్సరావుపేటలో అరవింద్‌బాబు సీట్లు తెచ్చుకుని గెలిచారు. ఆ తర్వాత కూడా వారితో లావు విభేదాలు కొనసాగిసూ్తనే ఉన్నారు.నర్సరావుపేటలో జనసేన ఇన్చార్జిని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించిన మర్రి రాజశేఖర్‌ను చేరదీయడంతో ఆయన వర్గం రగులుతోంది. మాచర్లలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని పక్కనపెట్టి తన మనుషులతోనే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తనకు మంత్రి పదవి రాకుండా లావు అడ్డుకున్నారనే కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు లావు శ్రీకృష్ణదేవరాయలుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.సిఫార్సుల ‘పెమ్మసాని’గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరులోని తెనాలి, తాడికొండ నియోజవర్గాల్లో బదిలీలు, పనులకు ఆయన ప్రత్యేకంగా సిఫారసు లేఖలు ఇస్తుండడంతో ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెనాలిలో ఒక విద్యుత్ ఏఈ పోస్టు కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వేర్వేరు వ్యక్తులను సిఫారసు చేస్తూ లేఖలు ఇవ్వడంతో ఎవరి చెప్పినట్లు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు.తగ్గ‘వేమిరెడ్డి’!నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు జిల్లా అంతా తనదేనంటూ అన్నింట్లో జోక్యం చేసుకోవడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఆయనకు సీఎం తనయుడు లోకేశ్ అండ ఉండడంతో మైనింగ్ వ్యవహారాల్లో ఆయన చెప్పినట్లే జరుగుతోంది. మైనింగ్ డీడీగా తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుని తాను చెప్పినట్లు వినేలా చేసుకున్నారు. దీంతో ఆయన తమ మాట కూడా వినకుండా ఎంపీ ఏది చెబితే అది చేస్తున్నారని ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. సర్వేపల్లి, వెంకటగిరి, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎంపీకి ఏమాత్రం పొసగడంలేదు. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించిన అక్రమ మైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి విజిలెన్స్ దాడులు చేయించినట్లు సమాచారం.విశాఖలో ‘భరత్’నాట్యమే!విశాఖపట్నం ఎంపీ భరత్ సీఎం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అన్ని విషయాలూ తనకు తెలియాలని, తనకు చెప్పి చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యవహారాలు, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)కి చెందిన పనులకు సంబంధించి ఆయన పెత్తనం చేస్తుండడంతో ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారు. భరత్ వ్యవహార శైలిపై భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడుతున్నట్లు సమాచారం. అన్ని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటుండడంతో మిగిలిన ఎమ్మెల్యేలు పైకి ఏమీ మాట్లాడకపోయినా అంతర్గతంగా రగిలిపోతున్నారు. -
జూన్ 5న తొలకరి పలకరింపు!
సాక్షి, విశాఖపట్నం: వచ్చే నెల మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. జూన్ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయని, 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు – కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతోపాటు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోకి విస్తరించాయి. 3–4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, అండమాన్‌లోని మిగిలిన ప్రాంతాలతోపాటు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో భిన్న వాతావరణంఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాసేపు మబ్బులు, కాసేపు వడగాలులు, కాసేపు ఈదురుగాలుతో వాతావరణం దోబూచులాడింది. ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మరికొని్నచోట్ల ఓ మోస్తరు వానలు పడ్డాయి. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో వాయువ్య, నైరుతి దిశగా వీస్తున్న గాలుల వల్ల ఈ భిన్న వాతావరణం నెలకొందని నిపుణులు చెబుతున్నారు. నేడు, రేపూ ఎండా, వాన దోబూచులాటే..!శుక్ర, శనివారాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగే సూచనలు ఉన్నాయని పేర్కొంటున్నారు. శుక్రవారం రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడేందుకు అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం ఉత్తరాంధ్రలో 10 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో నిడమర్రు, అమలాపురంలో 54 మిమీ, కాజులూరులో 42, కె.కోటపాడులో 41, ఉంగుటూరులో 35, కరపలో 32.2, పిఠాపురంలో 31.7 మిమీ వర్షపాతం నమోదైంది.పలమనేరులో భారీ వర్షంపలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో దద్దరిల్లింది. ఈదురు గాలుల వల్ల పలుచోట్ల మామిడి నేల రాలింది. కోతకొచి్చన టమాట పంట దెబ్బతింది. తీగపంటలైన కాకర, బీర, బీన్స్, రాగి పంటలు నేలవాలాయి. కొన్ని చోట్ల అరటిపంటకు నష్టం వాటిల్లింది. నడిమిదొడ్డిపల్లిలో కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. -
డీఎస్సీకి 5.67 లక్షల దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ–2025కి దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. రాత్రి 8 గంటల వరకు 3,53,598 మంది అభ్యర్థులు 5,67,067 దరఖాస్తులు సమర్పించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అర్ధరాత్రి గడువు ముగిసే సమయానికి మరో 20వేల వరకు దరఖాస్తులు అందవచ్చని అంచనా. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ–2025 పేరుతో 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్ 20 నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది. నోటిఫికేషన్లో ఊహించని కఠిన నిబంధనలు విధించింది. దీంతో దాదాపు 7లక్షల మందికి పైగా అభ్యర్థులు అనర్హులయ్యారు. ఈ కఠిన నిబంధనలతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని గుర్తించిన విద్యాశాఖ... రిజర్వుడు అభ్యర్థుల అర్హత మార్కులను 40శాతానికి తగ్గించి, టెట్‌లో వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డీఎస్సీకి అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది. అయితే, ఇదే టెట్‌లో జనరల్ అభ్యర్థులకు 45శాతం మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్సీటీఈ గెజిట్‌కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో దాదాపు 3 లక్షల మంది డీఈడీ, బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.సీబీఎస్ఈ అభ్యర్థులకు తీవ్ర అన్యాయంపదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి, డీఈడీ, టెట్ పూర్తి చేసినవారికీ కూటమి ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్ఈ విద్యార్థులకు పదో తరగతిలో మొదటి భాష ఇంగ్లిష్ ఉంటుంది. రెండో భాషగా తెలుగు/హిందీ/ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే, మొదటి భాషగా తెలుగు ఉంటేనే ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకునేలా నిబంధన పెట్టడంతో సీబీఎస్ఈ అభ్యర్థులు నష్టపోయారు. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఈ మీడియం నిబంధన లేకపోవడంతో సీబీఎస్ఈ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వారు చెల్లించిన ఫీజు సైతం తిరిగి ఇవ్వకుండా మెగా డీఎస్సీ–2025కి వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. అయితే, మొదటి లాంగ్వేజ్‌గా తెలుగు కచ్చితమనే నిబంధన పెట్టడంతో 15వేల నుంచి 20వేల మంది అర్హులైన అభ్యర్థులు అనర్హులుగా మారారు. -
ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నేటి (శుక్రవారం) నుంచి జూన్ 2 వరకు ఇందుకు అవకాశం కల్పిస్తూ, ప్రస్తుతమున్న నిషేధాన్ని సడలిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మే 31 నాటికి ఒక స్టేషన్లో ఐదేళ్లు నిరంతరాయంగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలి. వీరేకాక.. » వ్యక్తిగతంగా అభ్యర్థన చేసుకునే వారు కూడా ఈ బదిలీలకు అర్హులు. » మే 31, 2026 లేదా అంతకుముందు పదవీ విరమణచేసే ఉద్యోగులను పరిపాలన కారణాలు లేదా వారి అభ్యర్థన అయితే తప్ప బదిలీ చేయరు. » దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు, మానసిక వికలాంగ పిల్లలున్న వారు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న కేంద్రానికి బదిలీ కోరుకుంటే ప్రాధాన్య™నివ్వాలి. » ఇక గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు, నిబంధనల ప్రకారం ధృవీకరించబడిన 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులు, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వైద్య కారణాలపై (స్వీయ లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లలకు సంబంధించిన) బదిలీ కోరుకునే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. » కారుణ్య కారణాలపై నియమితులైన వితంతువుల బదిలీలకూ ప్రాధాన్యత ఇవ్వాలి. » దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు బదిలీల నుండి మినహాయింపు పొందుతారు. వారు అభ్యర్థించినప్పుడు ఖాళీ లభ్యతకు లోబడి వారు ఎంచుకున్న ప్రదేశానికి బదిలీ చెయ్యొచ్చు. » భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వోద్యోగులైతే, వారిద్దరినీ ఒకే స్టేషన్లో లేదా దగ్గరగా ఉన్న స్టేషన్లలో బదిలీ చేయడానికి ప్రయత్నించాలి.నోటిఫైడ్ ఏజెన్సీల్లో ఇలా..ఇక నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను వారు కోరుకున్న స్టేషన్లకు బదిలీ చేయాలి. 50 ఏళ్ల కన్నా తక్కువ వయస్సుగల ఉద్యోగులను ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయాలి. ఇప్పటివరకు ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేయని ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయాలి. జూన్ 3 నుంచి బదిలీలపై తిరిగి నిషేధం అమల్లోకి వస్తుంది. -
పాత ప్రాజెక్టులకే కొత్త పూత..!
సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించలేక గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను తాము సాధించినట్లు చెప్పుకోవడానికి కూటమి సర్కారు విఫలయత్నం చేస్తోంది. పాత ఒప్పందాలు, ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి విస్తరణ చేపట్టిన వాటిని కొత్త ప్రాజెక్టులుగా పేర్కొంటూ గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 6వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. వివిధ రంగాలకు చెందిన మొత్తం రూ.33,720 కోట్ల విలువైన 19 ప్రాజెక్టుల ద్వారా 34,621 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ప్రాజెక్టుల్లో అత్యధికం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచి్చనవే కావడం గమనార్హం. ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. » జపాన్‌కు చెందిన ఏటీసీ టైర్స్ (యకహోమా) రూ.3,079 కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి ఈ ప్రతిపాదనకు 2020 నవంబరులో అప్పటి సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమవగా 2022 ఆగస్టులో వైఎస్ జగన్ ఈ పరిశ్రమను ప్రారంభించారు. తొలి దశలో రూ.1,750 కోట్లు పెట్టిన ఏటీసీ టైర్స్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అప్పుడే రెండో దశను కూడా ప్రకటించింది. కానీ, ఈ విస్తరణ ప్రతిపాదనను కూటమి సర్కారు నిస్సిగ్గుగా ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంది. » పీఎల్ఐ కింద డైకిన్ సంస్థ శ్రీ సిటీలో దక్షిణాదిలోనే అతిపెద్ద ఎయిర్ కండిషన్ తయారీ యూనిట్ నిర్మాణాన్ని 2022లో మొదలుపెట్టింది. 2023 నవంబరులో ఉత్పత్తి కూడా ప్రారంభించింది. రూ.1,000 కోట్లతో 75 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేసిన డైకిన్ విస్తరణ కోసం 2024లో మరో 33 ఎకరాలను కొనుగోలు చేసింది. దీన్ని కూడా కూటమి సర్కారు తన ఖాతాలో వేసుకుంది.»డీఆర్డీవోతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నవంబరులో రక్షణ శాఖ అప్పటి కార్యదర్శి గిరిధర్ నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేశారు. అదే రోజు మచిలీపట్నంలో జరిగిన బీఈఎల్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇదేదో కొత్తగా వచ్చినట్లు ఇప్పుడు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.» దక్కన్ ఫైన్ కెమికల్స్‌కు తూర్పుగోదావరి జిల్లా కేశవరం వద్ద ఎప్పటినుంచో ప్రత్యేక రసాయనాల తయారీ యూనిట్ ఉంది. ఏలూరు జిల్లా వట్టిగుడిపాడులో మోహన్ స్పిన్‌టెక్ 2007లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలోనే యూనిట్ నెలకొల్పింది. రామభద్ర ఇండస్ట్రీస్ 2006లో తణుకు కేంద్రంగా ఏర్పాటైంది. ఈ కంపెనీల విస్తరణ ప్రాజెక్టులకు తాజాగా ఎస్ఐపీబీ ఓకే చెప్పింది. ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ: చంద్రబాబు ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. ప్రతి ప్రాజెక్టు పురోగతి పరిశీలనకు డాష్ బోర్డ్ తీసుకురావాలి. టూరిజంలో హోటళ్లు, రూముల కొరత ఉంది. కొత్తగా 50 వేల రూమ్‌లు అందుబాటులోకి తీసుకురావాలి. కారవాన్స్‌కు సంబంధించిన పాలసీని కూడా సిద్ధం చేసి అమల్లోకి తేవడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచాలి. టెంట్లు (గుడారాలు) ఏర్పాటు ప్రారంభించాలి. వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టకుండా చిన్నచిన్న ప్లాంట్ల ద్వారా సర్క్యులర్ ఎకానమీగా మార్చాలి’ అని సూచించారు. -
దిగజారిన ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, అమలాపురం/అయినవిల్లి: రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 45 రోజులవుతున్నా ఇప్పటికీ అరకొరగానే జరుగుతున్నాయి. రైతులు పలుచోట్ల రోడ్ల మీదకొచ్చి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందే తప్ప ఆశించిన మేర కొనడంలేదు. దీంతో అన్నదాతల వేదన అరణ్యరోదనగా మారుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,64,854 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరగగా, 5,86,616 మెట్రక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అంటే.. ఎకరాకు సగటున 47 బస్తాలు (బస్తా 75 కేజీలు). కానీ, తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో 50–60 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఇలా చూస్తే దిగుబడి కనీసం ఏడు లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి ఉంటుందని అంచనా. పోనీ అధికారులు లెక్కగట్టిన విధంగా పండిన ధాన్యాన్ని అయినా కొన్నారా అంటే అదీ లేదు. రోడ్డెక్కుతున్న అన్నదాతలు..జిల్లాలో ఏర్పాటుచేసిన 334 కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే ప్రభుత్వం తొలుత అనుమతిచ్చింది. దీంతో ఆయా కేంద్రాల టార్గెట్లను జిల్లా యంత్రాంగం కుదించింది. రైతుల వద్ద సగం ధాన్యం ఉన్నా సరే ఆయా కేంద్రాలలో టార్గెట్లు అయిపోయాయంటూ కొనుగోళ్లు నిలిపేశారు. దీంతో.. రైతులు మిల్లర్లు, దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో.. ఇదే అదనుగా వారు సాధారణ రకం బస్తా (75 కేజీలు) మద్దతు ధర రూ.1,720 ఉండగా వారు రూ.1,400, రూ.1,500కు కొనుగోలు చేశారు. బొండాల రకం (ఎంటీయూ–2636, ఒడిశా, టాటా బొండాలు) ఇటు ప్రభుత్వ కేంద్రాల్లోనూ.. అటు మిల్లర్లు కొనుగోలు చేయలేదు.ఇది జిల్లా వ్యాప్తంగా రైతుల ఆగ్రహానికి దారితీసింది. మండపేట, రాజోలు, అమలాపురం వంటి ప్రాంతాల్లో పండించిన ధాన్యంతో రైతులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. తాజాగా.. గురువారం అయినవిల్లి మండల రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో.. ధాన్యం కొనుగోలుపై వైఎస్సార్ïÜపీ పలు సందర్భాల్లో రైతులకు అండగా నిలిచింది. జిల్లా కేంద్రమైన అమలాపురంలో రైతు నిరసన దీక్షలకు దిగింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చి అదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయినా.. జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగానే సాగుతోంది. ఇంకా కళ్లాల్లోనే ధాన్యం..ఇక జిల్లాలో ఇప్పటివరకు (గురువారం) కేవలం 1,90,335.760 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. ఇందులో సాధారణ రకం 1,90,039.480 మెట్రిక్ టన్నులు కాగా.. గ్రేడ్–ఏ రకం 296.280 మెట్రిక్ టన్నులు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం చూస్తే ఇంకా 1,09,960.52 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.270 కోట్లు చెల్లించగా, ఇంకా రూ.167 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిల్లర్లు, దళారులు కలిపి మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఉంటారని అంచనా. అంటే.. మొత్తమ్మీద ఇప్పటివరకు సుమారు 3,90,335.760 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు కేంద్రాలు, దళారులు, మిల్లర్లకు చేరింది. వ్యవసాయ శాఖ చెప్పిన దిగుబడి గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నా మరో 1,96,280.24 మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాల్లో ఉందని అంచనా. మరోవైపు.. మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యానికి బస్తాకు రూ.220 నుంచి రూ.320 వరకు రైతులు నష్టపోయారు. పంట పండినా కూడా నష్టాలు చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.ధాన్యం ట్రాక్టర్లతో రైతుల నిరసనప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందని.. ఆరుగాలం కష్టపడిన పంటను కొనుగోలు చేయడంలేదంటూ అయినవిల్లి రైతులు ధాన్యం ట్రాక్టర్లతో కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. మండలానికి చెందిన రైతుల ధాన్యం నాలుగు రోజులుగా కొనుగోలు చేయడంలేదు. దీంతో గురువారం వారు ధాన్యం ట్రాక్టర్లతో నేరుగా ముక్తేశ్వరం సెంటరుకు చేరుకుని ధర్నా చేశారు. అనంతరం.. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ముక్తేశ్వరం సెంటర్లోనూ 20 ట్రాక్టర్లతో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి మద్దతు ధరను అందించిందని గుర్తుచేశారు. అలాగే, రైతులకు రైతుభరోసా అందించి ఆదుకున్నారన్నారు. అనంతరం.. డీఆర్వో రాజకుమారి రైతులతో చర్చలు జరిపారు. ధాన్యం కొనుగోలు చేయిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. ఇక రైతుల ఆందోళనకు పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావుతోపాటు పలువురు మద్దతుగా నిలిచారు. -
కరెంటుకు కటకట్‌లే!
సాక్షి, అమరావతి: ప్రజలేమైపోయినా ప్రభుత్వానికి అక్కర్లేదు. విద్యుత్ అవసరాలపై ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులను అప్రమత్తం చేయాల్సిన మంత్రికి కనీస అవగాహన లేక ఆ పనే చేయడం లేదు. మే నెలలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 260 మిలియన్ యూనిట్లు ఉంటుందని తెలిసినా.. ఆ మేరకు విద్యుత్ సమకూర్చుకునే ప్రయత్నాలు జరగడం లేదు. విద్యుత్ లోటు ఏర్పడితే పరిస్థితి ఏమిటనే ఆలోచన చేయడం లేదు. ఫలితంగా విద్యుత్ కోతలు మొదలుపెట్టి.. దానికి ‘మెయింటెనెన్స్’ అనే పేరు తగిలించి తప్పించుకుంటున్నారు. వ్యవసాయ అవసరాలకు 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాల్సిందిపోయి.. 7 గంటలు మించి ఇవ్వలేమంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. మరోపక్క ఈ ఏడాది మే నుంచి జూన్ వరకు విద్యుత్ డిమాండ్ భారీగా ఉంటుందని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) హెచ్చరించడం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పుడే విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేక కోతలు విధిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుత మే, వచ్చే జూన్ నెలల్లో ఇంకెంతగా బాధిస్తుందోననే ఆందోళన మొదలైంది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.ఇప్పటికైనా మేలుకోండి ఈ ఏడాది మే నుంచి జూన్ మధ్య రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతుందని ఎన్ఎల్డీసీ అన్ని రాష్ట్రాలను తాజాగా హెచ్చరించింది. ఈ ఏడాది మార్చిలోనే తొలిసారిగా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అప్పుడు కూడా మన పాలకులు, అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. మే, జూన్ నెలల మధ్య దేశవ్యాప్తంగా 15 గిగావాట్ల నుంచి 20 గిగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, సౌర విద్యుత్ అందుబాటులో లేని ఉదయం, రాత్రి వేళ(పీక్ అవర్స్)ల్లో అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని వెల్లడించింది. పీక్ డిమాండ్ రోజుకి 270 గిగావాట్లుగా నమోదవుతుందని ఎన్ఎల్డీసీ అంచనా వేసింది. ఇది గతేడాది 240 గిగావాట్లు మాత్రమే. అంటే 30 గిగావాట్లు ఈ ఏడాది పెరగడమనేది భారీ మార్పే. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అందుబాటులో బొగ్గు, ఇతర ముడిసరుకు అందుబాటులో లేకుండాపోతుందని తెలిపింది.రాష్ట్రంలో వేధిస్తున్న విద్యుత్ కోతలుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం అందించడంపై దృష్టి సారించలేదు. వేసవి ప్రారంభం నుంచీ అనధికార విద్యుత్ కోతలు మొదలుపెట్టారు. రైతులకు 9 గంటలు విద్యుత్ అందించడం లేదు. కనీసం 7 గంటలు కూడా ఇవ్వలేమని బహిరంగంగానే చెబుతున్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు సబ్స్టేషన్ల వార్షిక మరమ్మతులు, విద్యుత్ లైన్ల తనిఖీలు చేపడుతున్నామంటూ అధికారులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు. లైన్ల మరమ్మతుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా డిస్కంల వారీగా నిత్యం పగలు 3 గంటలు, రాత్రి 2 గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. సబ్‌స్టేషన్ నిర్వహణ అని చెబితే ఇక ఆ రోజంతా విద్యుత్ సరఫరా ఉండటం లేదు.బొగ్గు ఏదీ?!థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఆ మేరకు నిల్వలు ఉండటం లేదు. వీటీపీఎస్‌కు రోజుకి 41,500 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి చేయగలం. కానీ.. ఇక్కడ ప్రస్తుతం ఉన్న 4,13,707 మెట్రిక్ టన్నులతో 9 రోజులకు మించి విద్యుత్ ఉత్పత్తి చేయలేం. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో 35,760 మెట్రిక్ టన్నులు ఒక్క రోజుకు మాత్రమే సరిపోతాయి. కృష్ణపట్నంలో 1,65,181 మెట్రిక్ టన్నులతో 5 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేయగలం. ఈ నిల్వలను ఇప్పటికే పెంచుకుని ఉండాల్సింది. వేసవికి ముందే ఆ పని చేయకపోవడం వల్ల ఇంకా బొగ్గు కొరత వస్తే ఈ మాత్రం నిల్వలు కూడా ఉండవు. అప్పుడు బహిరంగ మార్కెట్‌పైనే ఆధారపడాలి. అధిక ధర చెల్లించి విద్యుత్ కొనాలి. అందుకోసం కూడా ముందుగానే షార్ట్‌టెర్మ్ టెండర్లు దాఖలు చేయాలి. ఆ భారం తిరిగి ప్రజలపైనే చార్జీల రూపంలో పడుతుంది.ఇంకా పెరిగితే కష్టమేరాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి 239.228 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన 224.509 మిలియన్ యూనిట్లతో పోల్చితే 6.56 శాతం ఎక్కువ. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ను సరిపెట్టడానికి ఏపీ జెన్కో థర్మల్ నుంచి 86.275 మిలియన్ యూనిట్లను సమకూరుస్తోంది. జెన్కో హైడల్ నుంచి కేవలం 5.361 మిలియన్ యూనిట్లే వస్తోంది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు 34.174 మిలియన్ యూనిట్లు, పవన విద్యుత్ ప్లాంట్లు 18.610 మిలియన్ యూనిట్లు, సౌర విద్యుత్ కేంద్రాలు 23.850 మిలియన్ యూనిట్లు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు 41.069 మిలియన్ యూనిట్లు, ఇతరులు 4.279 మిలియన్ యూనిట్లు సమకూరుస్తున్నారు. అయినప్పటికీ సరిపోకపోవడంతో బహిరంగ మార్కెట్ నుంచి 25.610 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు డిమాండ్‌ను ఎదుర్కోవడం ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనేనా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
విచారణ పేరుతో వేధింపులు
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేస్తోంది. గురువారం 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది. రిటైర్డ్ అధికారులైన వారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.15 గంటల వరకు విచారణ పేరుతో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచడం గమనార్హం. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సిట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. తొలిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారిని విచారించిన సిట్ అధికారులు మరుసటి రోజు గురువారం కూడా రావాలని పేర్కొన్నారు. దీంతో వారిద్దరూ వరుసగా రెండో రోజు గురువారం కూడా విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.మళ్లీ మళ్లీ.. అవే ప్రశ్నలుసిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు. ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.వెళ్లిపోవచ్చంటూ.. మళ్లీ రప్పించి..ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల సమయంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నుంచి సెల్ ఫోన్లు తీసుకుని విచారణ ముగిసిందని, వెళ్లవచ్చని సిట్ అధికారులు చెప్పారు. అయితే బయటకు వెళుతున్న వారిని మరోసారి వెనక్కి రప్పించారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు మరోసారి విచారిస్తారని, వేచి ఉండాలని సూచించారు. అయితే రాజశేఖర్‌బాబు పనుల మీద బయటకు వెళ్లినందున ఆయన వచ్చే వరకు వేచి ఉండాలంటూ మరో గంటన్నరకుపైగా కాలహరణం చేశారు. వారిద్దరినీ మానసికంగా, శారీరకంగా వేధించడమే లక్ష్యంగా వ్యవహరించారు. సిట్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఎట్టకేలకు రాత్రి 11.15 గంటల సమయంలో విచారణ ముగిసిందంటూ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు పంపించేశారు. ఇలా ఉద్దేశపూర్వకంగా వేధించాలని ముందుగానే రూపొందించుకున్న ప్రణాళికను అమలు చేశారు. శుక్రవారం కూడా మళ్లీ విచారణకు రావాలని వారికి సిట్ అధికారులు సూచించారు.సిట్ తీరు దారుణందర్యాప్తు పేరుతో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ వేధింపులకు గురి చేస్తోంది.రాజ్యాంగం, న్యాయస్థానాల తీర్పులు అంటే ఏమాత్రం లెక్కలేనట్లు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సీనియర్ సిటిజన్లు అయిన వారిద్దరినీ 12 గంటలకు పైగా విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుట్రకు తార్కాణం. పౌరుల స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓ నిందితుడి పట్ల సిట్ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇంటికి వెళ్లి విచారించాలని, సాయంత్రం 5 గంటల తరువాత విచారించవద్దని ఆదేశించింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. సిట్ అధికారులు రాజకీయ పార్టీ నేతల్లా వ్యవహరించడం సరికాదు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతాం. – మనోహర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడురాజకీయ వేధింపులు...రాజకీయ కారణాలతోనే ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ వేధిస్తోంది. కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళతాం. – మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాశ్, వైఎస్సార్సీపీ నేతలు మద్యం విధానంపై కేసు... ముందస్తు బెయిల్‌పై నేడు ‘సుప్రీం’ విచారణ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఇప్పటికే అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌పైనా తేలుస్తామన్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానానికి సంబంధించి అక్రమ కేసు ఎదుర్కొంటున్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారించనుంది. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్టు చేయరాదని ఆదేశిస్తూ ఈ నెల 13న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు నేడు మరోసారి విచారణకు రానున్నాయి. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పటికే స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మరింత మురికిగా మార్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు..ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని తెలిసి కూడా అదే రోజు తెల్లవారుజామున బాలాజీ గోవిందప్పను ఆగమేఘాలపై అరెస్ట్ చేశారని గత విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది సిద్ధార్థ్ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామని, దర్యాప్తు సంస్థ తీరును పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. తదుపరి విచారణలో బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తేలుస్తామని ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేయగా... జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
భారత్ మామిడి డాలర్ల ‘పంట’!
సాక్షి, అమరావతి: అమెరికాకు భారత్ మామిడి ఎగుమతుల పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే), నేపాల్, అమెరికా, కువైట్, ఒమన్, ఖతార్, కెనడా ఉన్నాయి. ఐదేళ్ల క్రితం భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో అట్టడుగునున్న అమెరికా, అనూహ్యంగా ప్రస్తుతం నాలుగో స్థానానికి ఎగబాకింది. సమీప భవిష్యత్‌లో రెండో స్థానానికి మారుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాకు రూ.100 కోట్లకు చేరిన మామిడి ఎగుమతులుప్రపంచ వ్యాప్తంగా చూస్తే మెక్సికో, నెదర్లాండ్స్, బ్రెజిల్ తర్వాత మామిడి ఎగుమతుల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా మామిడి పండ్లు ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటిస్థానంలో ఉన్న మెక్సికో మొన్నటి వరకు అమెరికా మామిడి మార్కెట్‌ను శాసించింది. మెక్సికో తర్వాత బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ వంటి దేశాలు అమెరికాకు ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నాయి. అలాంటిది నేడు భారతదేశం అమెరికాకు ప్రధాన మామిడి ఎగుమతిదారుగా అవతరిస్తోంది. 2020– 21లో తొలిసారి అమెరికా విమానమెక్కిన మన మామిడి పండ్లు, గడిచిన ఐదేళ్లలో అగ్రరాజ్యానికి ప్రీతిపాత్రమైపోయాయి. 2020–21లో కేవలం రూ.లక్ష విలువైన 1.45 టన్నుల మామిడి ఎగుమతి జరగ్గా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో తొలి పది నెలల్లోనే (2024 ఏప్రిల్–2025 జనవరి) దాదాపు రూ.100 కోట్ల విలువైన 2,137 టన్నుల మామిడి పండ్లు అగ్రరాజ్యానికి ఎగుమతయ్యాయి.సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే..ఇక విదేశాలకు ఎగుమతయ్యే మామిడిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయి. అయితే ఏపీలో సాగయ్యే బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, హిమాయుద్దీన్ వంటి రకాల్లో ఎక్కువగా బంగినపల్లి, తోతాపురి రకాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. విదేశాలకు ఎగుమతి అయ్యే మామిడిలో 60 శాతానికి పైగా ఏపీకి చెందినవే. అయితే ఏపీ రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడిని ముంబై మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముంబై నుంచి ఎగుమతి అయ్యే మామిడిలో దాదాపు 80 శాతం ఏపీకి చెందినవేనని చెబుతున్నారు. ఏటా సగటున 2.5 లక్షల టన్నులకుపైగా మామిడి గుజ్జు విదేశాలకు ఎగుమతి అవుతోంది.అమెరికాకు కొత్త రుచి.. ‘కేసర్ ’భారతదేశంలో సాగయ్యే మామిడి రకాల్లో అల్ఫోన్సో, కేసర్, బంగినపల్లి, తోతాపురి, చౌసా, దసేరి ప్రధానమైనవి. అయితే, అమెరికాకు ఎగుమతులలో కేసర్, అల్ఫోన్సో రకాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 2024లో అమెరికాకు ఎగుమతైన మామిడిలో ‘కేసర్’ది అగ్రస్థానం. ఆ తర్వాత జాబితాలో ‘అల్ఫోన్సో’ ఉంది. అంతకుముందు అమెరికా వినియోగదారులకు ఇష్టమైన అల్ఫోన్సోను కేసర్ అధిగమించడం గమనార్హం. కేసర్ మామిడి రకం గుజరాత్‌లోని జునాగఢ్, అమరేలీ జిల్లాలలో ప్రధానంగా సాగవుతోంది. ఇది 1930ల్లో గుజరాత్‌లోని ఒక రైతు ద్వారా అభివృద్ధి చేసిన రకం ఇవి అమితమైన తీపి, రుచి, రసవంతమైన గుజ్జు, దీర్ఘకాల షెల్ఫ్ లైఫ్ కలిగి ఉండడంతో పాటు అల్ఫోన్సో కంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. -
తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష
సాక్షి,పల్నాడు: మూడు హత్య కేసుల్లో నిందితుడైన తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2023 మే 5న నరసరావుపేటలో సలీమా అనే మహిళను తన్నీరు అంకమ్మరావు దారుణంగా హత్య చేశాడు.అయితే ఈ హత్యపై గురువారం నరసరావుపేట కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం,అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట కోర్టు చరిత్రలో తొలిసారి న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ప్రస్తుతం మరో హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అంకమ్మరావు..నరసరావుపేటలో మూడు హత్యలు చేశాడు. జులాయిగా తిరుగుతూ మూడు హత్యలకి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. -
AP ECET 2025: ఏపీ ఈసెట్ ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి.. sakshieducation.com ద్వారా ఫలితాలను పొందవచ్చు.ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా మరియు బీఎస్సీ (గణిత శాస్త్రం) విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి BE / BTech / B.Pharmacy కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండవ సంవత్సరంలో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు, త్వరలో ప్రారంభమయ్యే AP ECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా తగిన సీట్లను పొందవచ్చు.మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను కూడా తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.AP ECET Results Direct Linkక్లిక్👉 ఏపీ ఈసెట్ రిజల్ట్ -
కిలో చికెన్‌కు రూ.20 కమిషన్ ఇవ్వాల్సిందే.. ఆళ్లగడ్డలో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సాక్షి, నంద్యాల: చంద్రబాబు రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టిస్తుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు.ఇటీవల,నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కిలో చికెన్‌కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ హుకుం జారీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు తామేం తక్కువేం తినలేదంటూ టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అఖిల ప్రియ మహిళా అనుచరులు రెచ్చిపోతున్నారు.చికెన్ కోళ్లను తమవద్దే కొనాలంటూ వ్యాపారస్తులకు హూకుం జారీ చేస్తున్నారు. చికెన్ కోళ్లను తమ వద్ద కొనుగోలు చేయకపోతే చికెన్ సెంటర్లను మూసేస్తామని బెదిరిస్తున్నారు. కేజీ చికెన్ మీద రూ.20 రూపాయిలు కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు.ఈ క్రమంలో తాము చిరు వ్యాపారులమని, కమిషన్లు ఇచ్చుకుంటూ పోతే..తమ కుటుంబ పోషణ భారమవుతుందటూ చికెన్ షాపు వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల ఆగడాలపై వ్యాపారస్తులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. కేజీకి రూ.20 రూపాయలు కమిషన్ ఇవ్వాలని, కోళ్లను తమ దగ్గరే కొనుగోలు చేయాలంటూ టీడీపీ నేతల ఆగడాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల బెదిరింపులు దౌర్జన్యాలు భరించలేక జిల్లా ఎస్పీని కలిసిని ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమరి చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీఆర్ఎస్–2025 ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్ఎస్) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ , డిగ్రీ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్ఎస్ సెట్, ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్ ఫలితాలు బుధవారం ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో విడుదల చేశారు. అన్ని విభాగాల్లో 7,190 సీట్లకు 62,047 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. ఐదో తరగతిలో 3920 సీట్లకు 14061 మంది పోటీ పడగా, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అలాగే, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 1425 సీట్లకు 41,215 మంది, డిగ్రీ మొదటి సంవత్సరంలో 220 సీట్లకు 1,018 మంది పోటీపడ్డారు. పరీక్ష రాసిన అందరికీ ర్యాంకులు ప్రకటించారు.ఫలితాలను విద్యార్థి ఐడీ ద్వారా https:// aprs.apcfss.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని ఏపీఆర్ఈఐ సొసైటీ కార్యదర్శి వీఎన్ మస్తానయ్య తెలిపారు. పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల జాబితాతో పాటు జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. టాపర్లు వీరే..ప్రవేశ పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఐదో తరగతిలో వజ్రపు శశికుమార్ (శృంగవరపుకోట, విజయనగరం జిల్లా), ఆరో తరగతి గొల్లంగి మౌనిక (రాళ్లపాడు, శ్రీకాకుళం జిల్లా), ఏడో తరగతిలో కర్రా తనీశి శ్రీవర్షిణి (భోగాపురం, అనకాపల్లి జిల్లా), ఎనిమిదో తరగతి వల్లూరి రిచా (చిన్నయగూడెం, తూర్పు గోదావరి జిల్లా) అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.ఇంటర్మీడియట్లో..» ఎంపీసీ– బాలినేని కళ్యాణ్ రామ్ (సింగివలస, విశాఖ జిల్లా) » బైపీసీ– బొడ్డుపల్లి మనోజ్ కుమార్ (కంతేరు, రాజమండ్రి రూరల్) » ఎంఈసీ/సీఈసీ– మాదివాడ వేదాశ్రిత (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా)»ఈఈటీ– దగరి సాయి చరణ్ (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా)» సీజీటీ– సరికి చరణ్ (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా) డిగ్రీలో..» బీఏ– కోటకొండ విజయుడు (మునగాల, కర్నూలు జిల్లా)»బీకామ్– చిన్నబసప్పగారి బసవరాజు (భైరవాని తిప్ప, అనంతపురం జిల్లా)»బీఎస్సీ (కెమిస్ట్రీ)– అడపా విజయ్ (నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా)» బీఎస్సీ (డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్)– కల్వటాల కిరీటి (ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా)» బీ.ఎస్సీ (జువాలజీ)– వంతల శ్రీకాంత్ (గాడేపల్లి, అల్లూరి సీతారామరాజు) -
పీత కూడా... ప్రైవేటే!
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వ నిర్ణయంతో పీతల సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే ప్రైవేట్ హేచరీలు నాసిరకం వనామీ రొయ్యల సీడ్ అందించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పీతల హేచరీని అటకెక్కించి... ప్రైవేట్ హేచరీకి ఇటీవల కేబినేట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలు, కాకినాడ జిల్లా తాళ్లరేవు, కాకినాడ, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో రైతులు 2వేల ఎకరాల్లో పచ్చపీత (మండపీత– సిల్లా సెరాట) సాగు చేస్తున్నారు. ఈ పీతలకు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్‌లో డిమాండ్ అధికంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పీత సైజు, బరువును బట్టి కేజీ రూ.1,100 నుంచి రూ.1,500 వరకు ఉంటోంది. స్థానికంగా రూ.600 నుంచి రూ.900 వరకు ఉంది. పచ్చ పీత సీడ్ స్థానికంగా అందుబాటులో లేదు. చెన్నైలో ఉన్న దేశంలోని ఒకే ఒక్క హేచరీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఒక్కో పీత పిల్ల ధర రూ.12 వరకు ఉండగా, రవాణా, ఎగుమతి ఖర్చులు అదనం. బుక్ చేసిన ఆరు నెలలకు పీత పిల్లలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హేచరీ ఏర్పాటుకు చర్యలుపచ్చపీత సాగును ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా కాట్రేనికోన మండలం చిర్రయానాంలో రాష్ట్రంలోనే తొలి (దేశంలో రెండోది) హేచరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో ఐదు ఎకరాల్లో పీతల హేచరీ నిర్మాణం కోసం ఎన్ఎస్డీబీ నిధులు రూ.2.75 కోట్లు మంజూరు చేసింది. పర్యావరణం, అటవీ శాఖతోపాటు అన్ని అనుమతులు సాధించింది. అప్పట్లో మూడు నుంచి ఆరు నెలల్లో పీతల హేచరీ నిర్మాణ పనులు పూర్తి చేసి పిల్లలను స్థానిక రైతులతోపాటు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు. ఈ హేచరీలో ఏడాదికి 1.5 మిలియన్ పిల్లల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేశారు. కూటమి రాగానే ప్రైవేట్ దిశగా రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ టి.డోలాశంకర్ ఇటీవల జిల్లా మత్స్యశాఖ జేడీ ఎన్.శ్రీనివాస్‌తో కలిసి చిర్రయానంలో పర్యటించి పచ్చపీతల హేచరీకి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారి ఎంవీ ప్రసాదరావు, యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి ప్రోగ్రామ్ ప్రతినిధి డాక్టర్ సుదీప్ (ఢిల్లీ), బీఎస్ ప్రాజెక్టు స్టేట్ మేనేజర్ ఎన్.ఉషా కూడా ఇక్కడికి వచ్చారు. దీంతో ప్రభుత్వ హేచరీ ఏర్పాటు చేస్తారని, తమ కష్టాలు తీరతాయని పీతల సాగుదారులు ఆశించారు. కానీ, గత గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇక్కడ సేకరించిన ఐదు ఎకరాల భూమిని ఫ్లూటస్ ఆక్వా సంస్థకు కేటాయించాలని నిర్ణయించారు. పెద్దాపురానికి చెందిన ఒక టీడీపీ నేత ఒత్తిడితో ఆ స్థలంలో పీతల హేచరీ ఏర్పాటుకు ఫ్లూటస్ ఆక్వా సంస్థకు అనుతిచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ హేచరీ వల్ల వనామీ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమకు కూడా తప్పవని పీతల సాగుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
‘అప్పే’.. ఏమీ లేదు!
మహమ్మారులు ప్రబలలేదు.. ప్రకృతి విపత్తులు ముంచెత్తలేదు.. ఆర్థిక సంక్షోభం లాంటివి తలెత్తలేదు..సంక్షేమ పథకాలు ఇచ్చింది కూడా లేదు.. కానీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. రాబడులు పడిపోతుండగా.. గ్రాంట్లు కొడిగడుతున్నాయి. సంపద పెంచేస్తా.. అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పనిచేయలేకపోగా ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు. కాగ్ వెలువరించిన నివేదిక ఆధారంగా వెల్లడైన వాస్తవాలు.. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ ఏలుబడిలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఓపక్క రెవెన్యూ రాబడి తగ్గుతూ ఇంకోపక్క రాష్ట్ర అప్పులు భారీగా పెరుగుతున్నట్లు తేలింది. మార్చి నెలతో ముగిసిన 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రాబడులు, వ్యయాల లెక్కలను కాగ్ బుధవారం వెల్లడించింది. వీటిని గమనిస్తే.. సంపద సృష్టించడం దేవుడెరుగు.. అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను కూడా ఆవిరి చేసేస్తున్నారని స్పష్టమవుతోంది. అంతకుముందు వచ్చిన దానిని కూడా నిలబెట్టలేకపోయారని అర్థమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం కక్షసాధింపులు, రెడ్‌బుక్ వేధింపులపైనే దృష్టిపెట్టి పాలనను గాలికి వదిలేయడమేనని తెలుస్తోంది. సహజంగా ఎలాంటి సంక్షోభాలూ లేకుంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకు మించిన ఆదాయం వస్తుంది. కానీ, రాష్ట్రంలో 2023–24లో వచ్చిన ఆదాయం 2024–25లో రాకపోగా రూ.5,520 కోట్లు తగ్గినట్టు కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. మరోపక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు తేల్చాయి. అంటే, సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు తేలుతోంది.అమ్మకం పన్ను తగ్గిందంటే..» అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం 2024–25లో తగ్గిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అమ్మకం పన్ను రాబడి రూ.1,053 కోట్లు పడిపోయింది. దీని అర్థం ప్రజల కొనుగోలు శక్తి తగ్గడమేనని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులేక కొనుగోలు శక్తి తగ్గిపోవడం.. అమ్మకం పన్ను ద్వారా రాబడి పడిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాలు కూడా తెలిపాయి.» స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా కుదేలైంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పురోగతి లేదని స్పష్టమవుతోంది. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్ ఆదాయం రూ.705 కోట్లు తగ్గిపోయింది.» పన్నేతర ఆదాయం కూడా తిరోగమనంలో ఉందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. అంతకుముందు ఆర్థిక ఏడాదిలో పోల్చితే 2024–25లో ఇది రూ.842 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి.» కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లోనూ భారీగా తగ్గుదల నమోదైంది. 2023–24తో పోల్చితే 2024–25లో గ్రాంట్లు రూ.14,563 కోట్లు తగ్గిపోయాయి.» బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. తెచ్చిన అప్పును ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై పెట్టాలని ఇటీవల చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతి వాక్యాలు పలికారు. అయితే, 2023–24తో పోల్చితే 2024–25లో మూలధన వ్యయం రూ.4,413 కోట్లు తగ్గిపోయింది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనపైనా పెట్టలేదు.. సూపర్ సిక్స్ హామీలనూ అమలు చేయలేదు.అంతా బడాయి» విద్య, వైద్యం, పౌష్టికాహారం, సంక్షేమానికి సంబంధించి సామాజిక రంగ వ్యయం కూడా అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో రూ.4,696 కోట్లు తగ్గినట్లు కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు తేల్చింది.» కాగ్ గణాంకాలనే చూస్తే 2023–24 కన్నా 2024–25లో రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయినట్లు తేలుతోంది. అయినా రాష్ట్ర వృద్ధి రేటు పెరిగి పోతోందని.. అదే సంపద అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నారు.» ఇదంతా కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికే తప్ప.. రాష్ట్ర సంపద సృష్టికి కాదని స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
సమీకరణకు భూములిచ్చే ప్రసక్తి లేదు
తాడికొండ: భూసమీకరణకు భూములిచ్చే ప్రసక్తే లేదని రాజధాని గ్రామాల్లోని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో మంగళ, బుధవారాల్లో జరిగిన గ్రామ సభల్లో రైతులతో పాటు టీడీపీ నాయకులు సైతం భూముల సమీకరణకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. గతంలో భూములిచ్చిన వారి పరిస్థితి చూస్తే తమకు భయమేస్తోందని, పూలింగ్ కోసమని తీసుకుని పదేళ్లుగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. హరిశ్చంద్రపురానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు ఈ విధానాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని కుండబద్దలు కొట్టారు. ‘ఇంతకుముందు నమ్మి భూములిచ్చిన రైతులకు రూ.63 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు కదా. చేసి చూపించండి అప్పుడు చూద్దాం. తలాతోక లేకుండా సమీకరణ పేరుతో మా భూములను తీసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు’ అని తేల్చిచెప్పారు. మరికొందరు రైతులు మాట్లాడుతూ రైల్వే లైన్, అంతర్గత రోడ్లకు అయితే కొంత సానుకూలంగా ఉంటాం కానీ.. పూలింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. అసలు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మకం ఏమిటని, కేంద్రం రాజధానిపై స్పష్టమైన గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిం చారు. ప్రభుత్వాలు మారితే తమ పరిస్థితి ఏంటని ప్రశి్నంచారు. ఎమ్మెల్యేకు షాకిచ్చిన రైతులువడ్డమాను గ్రామ సభలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందని రైతులకు చెబుతుండగా.. రైతులు ఆయనకు షాకిచ్చారు. ‘మీరు 10 సంవత్సరాల క్రితం గెలిచారు. మళ్లీ ఇప్పుడు గెలిచారు. వడ్డమానులో పుష్కరాలకు ఒకసారి రోడ్డు వేస్తారు. మనిషి దిగిపోయేంతగా గుంతలు పడి వెళ్లేందుకు కూడా ఇప్పుడు మార్గం లేదు. 2029 వరకు అవకాశం ఉంది. తొలివిడతలో రైతులు ఇచ్చి న భూములను అభివృద్ధి చేసి చూపించండి. ఇప్పటికే ఏడాది పూర్తయింది. చివరి ఏడాది తీసేస్తే మూడేళ్లు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈలోగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఇతర ప్రభుత్వ భవనాలు కట్టండి. రైతుల భూముల అభివృద్ధి చేయండి. ఇప్పుడైతే భూసమీకరణకు మేం వ్యతిరేకం. మొదట భూములిచ్చిన రైతులకు సంతృప్తి కలిగించి.. మా వద్దకు వస్తే అప్పుడు ఆలోచిస్తాం’అని రైతులు తెగేసి చెప్పారు. గ్రామ సభల్లో ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ కె.సుజాత, ఎంపీడీవో కానూరి శిల్ప పాల్గొన్నారు. -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల ఎండలతోపాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైనా 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లు అనిపించింది. వడగాలులు కూడా ఎక్కువగా ఉండడంతో జనం బయట తిరిగేందుకు జంకుతున్నారు. బుధవారం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా కాకానిలో 42.7 డిగ్రీలు, బాపట్ల జిల్లా కొమ్మలపాడులో 42 డిగ్రీలు, నెల్లూరు జిల్లా దగదర్తిలో 41.7, నంద్యాల జిల్లా బొల్లవరంలో 41.6 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 33 ప్రాంతాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా జగ్గిలి»ొంతులో 5.3. సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లాలోని రాగోలులో 4.9 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 4.7, ఏలూరు జిల్లా పూళ్లలో 4.4, శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేటలో 3.8, ఆముదాలవలసలో 3.5, ఏలూరులో 3.4, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో ఇదేతరహా అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. -
మద్యం విధానంతో సంబంధమే లేదు
సాక్షి, అమరావతి: మద్యం విధానం రూపకల్పనలో గానీ, అమలుతో గానీ తమకు ఏమాత్రం సంబంధం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి విస్పష్టంగా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులో వీరిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిని విడివిడిగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు విచారించారు. చెరో 60 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అన్ని ప్రశ్నలకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డి దీటుగా సమాధానం ఇస్తూ తమపై నమోదు చేసింది అక్రమ కేసేనని తేల్చిచెప్పారు. మద్యం విధానం రూపొందించడం, అమలుతో తమకు ఏమాత్రం సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. డిస్టిలరీలతో వ్యవహారాలన్నీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీనే పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఈ కేసులో సాక్షులు కొందరు మీ పేర్లు చెప్పారని సిట్ అధికారులు పేర్కొనగా, తాము కూడా ఏమాత్రం సంబంధం లేనివారి పేర్లను చెబితే వారినీ నిందితులుగా చేరుస్తారా అని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఎదురు ప్రశ్నించడంతో సిట్ అధికారులు మౌనం దాల్చారు. రాజ్ కేసిరెడ్డితో గానీ డిస్టిలరీల ప్రతినిధులతో గానీ తాము ఎలాంటి అధికారిక, అనధికారిక వ్యవహారాలు నిర్వహించలేదని అన్నారు. తమపై నమోదు చేసింది పూర్తిగా అక్రమ కేసని న్యాయ పోరాటం ద్వారా ఆ విషయాన్ని నిరూపిస్తామని తేల్చిచెప్పారు. కాగా, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను గురువారం కూడా విచారణకు రావాలని సిట్ అధికారులు కోరారు. -
హ్యాపీ నెస్ట్.. రూ.315 కోట్లు లాస్ట్!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన తొలి రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ ప్రాజెక్టులో ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ఖజానాకు ఇప్పటికే రూ.315.60 కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మాణ సమయంలో ధరల సర్దుబాటు, డిజైన్ల మార్పు తదితరాల వల్ల నిర్మాణ వ్యయం మరింతగా పెరగడం.. తద్వారా మరింత నష్టం తథ్యమని అధికార వర్గాలు, బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. ఆ భారాన్ని ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న 1,200 మందిపై మోపబోమని, రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఇప్పటికే సెలవిచ్చారు. అంటే.. 1,200 మంది ఎన్నారైలు, బడా బాబుల ఫ్లాట్ల కోసం రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే రూ.315.60 కోట్ల భారం మోపారన్నది స్పష్టమవుతోంది. రాజధాని ప్రాంతంలో నేలపాడు వద్ద హ్యాపీ నెస్ట్ పేరుతో 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తులతో నిర్మించే 12 టవర్లలో 1,200 ఫాట్లను చదరపు అడుగు రూ.3,492 చొప్పున 2018లోనే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) విక్రయించింది. ఈ మేరకు ఎన్నారైలు, బడా బాబులు అడ్వాన్సులు ఇచ్చి ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. హ్యాపీ నెస్ట్‌లో మొత్తం 21,52,349 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతాన్ని విక్రయించడం ద్వారా సీఆర్డీఏ రూ.751.60 కోట్లు సమీకరించింది. ఆ రియల్ వెంచర్ నిర్మాణ పనులను అప్పట్లో రూ.658.45 కోట్లకు (చదరపు అడుగు నిర్మాణ వ్యయం సగటున రూ.3,059.26 చొప్పున) కాంట్రాక్టు సంస్థ షాపూర్జీ పల్లోంజీకి 2018 డిసెంబర్ 31న సీఆర్డీఏ అప్పగించింది. తద్వారా ఆ ఒక్క ప్రాజెక్టు ద్వారానే రూ.93.15 కోట్ల లాభం వచి్చందని అప్పట్లో గొప్పగా చెప్పుకుంది. » చంద్రబాబు కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం వల్ల వ్యయం పెరిగిందని.. ఆ భారాన్ని ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారిపై మోపబోమని, దాన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి నారాయణ ఇప్పటికే తేల్చి చెప్పారు. తద్వారా ఆ నష్టాన్ని ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుల ద్వారా పూడ్చుకోనున్నారన్నది స్పష్టమవుతోంది. » నిజానికి 2018–19 నాటికి.. ఇప్పటికి నిర్మాణ సామగ్రి, సిమెంటు, స్టీలు వంటి వాటి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఇసుక కూడా ఉచితమే. ఈ నేపథ్యంలో ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి అవకాశమే లేదు. కానీ.. గతేడాది సెపె్టంబరు 18న రూ.770.94 కోట్ల అంచనా వ్యయంతో హ్యాపీ నెస్ట్‌కు సీఆర్డీఏ మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.112.49 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత ఆ టెండర్‌నూ రద్దు చేసింది. » మళ్లీ గతేడాది డిసెంబర్ 22న రూ.818.03 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. మూడు నెలల్లోనే అంచనా వ్యయాన్ని రూ.47.09 కోట్ల మేర పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 4.68 శాతం అధిక ధరకు అంటే రూ.856.31 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది. పైగా జీఎస్టీ, నాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.153.05 కోట్లను అదనంగా చెల్లిస్తామని పేర్కొంది. ఈ లెక్కన రూ.1,009.36 కోట్లకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. » ఇక రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ.4 కోట్ల చొప్పున 2016–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఆ లెక్కన హ్యాపీ నెస్ట్ రియల్ వెంచర్‌కు కేటాయించిన 14.46 ఎకరాల భూమి విలువ రూ.57.84 కోట్లు. దీన్ని కూడా కలుపుకుంటే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు వ్యయం రూ.1,067.20 కోట్లకు చేరుతుంది. ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.751.60 కోట్లు. అంటే.. హ్యాపీ నెస్ట్ ద్వారా ఇప్పటికే రూ.315.60 కోట్లు నష్టం వచి్చనట్లు స్పష్టమవుతోంది. నిర్మాణ సమయంలో పడే అదనపు భారం వల్ల ఆ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ఆ భారం ప్రజలపైనే పడుతుందని బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. »సర్కారు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన అమరావతి తన నిర్మాణానికి అవసరమైన నిధులను తానే సమీకరించుకుంటుందని (సెల్ఫ్ ఫైనాన్స్ సస్టెయినబుల్ కేపిటల్) సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ చెబుతున్నదంతా సెల్ఫ్ డబ్బా, పచ్చి అబద్ధాలేనన్నది ‘హ్యాపీ నెస్ట్’తో తేలిపోయిందని రియల్టర్లు, బిల్డర్లు విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
లిక్కర్ మాఫియా డాన్ 'చంద్రబాబే'
సాక్షి, అమరావతి: దొంగే.. ‘దొంగా...దొంగా!’ అని అరుస్తున్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు!! మద్యం విధానం ముసుగులో కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఆయన తన దోపిడీని కప్పిపుచ్చేందుకు అక్రమ కేసు కుట్రకు తెరతీశారు. మద్యం కుంభకోణంలో గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి తన పన్నాగానికి పదును పెడుతున్నారు. టీడీపీ వీర విధేయులతో నియమించిన సిట్ ద్వారా కుతంత్రానికి పాల్పడుతున్నారు. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలో అంతర్భాగాలుగా మారుతున్నాయి. గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో దాఖలు చేసిన కేసును ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొట్టివేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ అవే అవాస్తవ ఆరోపణలతో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం రెడ్‌బుక్ కుతంత్రమేనన్నది స్పష్టమవుతోంది. అసలు మద్యం మాఫియా డాన్ చంద్రబాబే అని నిరూపించే వాస్తవాలు ఇవిగో ఇలా ఉన్నాయి... సూత్రధారి, లబ్ధిదారు బాబే... రూ.25 వేల కోట్ల లూటీపై ఆధారాలతో సీఐడీ కేసు 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్ ద్వారా చంద్రబాబు యథేచ్చగా దోపిడీకి గేట్లు తెరిచారు. మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూమ్‌లు, 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులుగా పారించారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, డీకే ఆదికేశవులు, ఎస్పీవై రెడ్డి కుటుంబాలకు చెందిన 14 కొత్త డిస్టిలరీలకు అనుమతినిచ్చారు. మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేశారు. అంతేకాదు తమ అస్మదీయులకు చెందిన నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేశారు. చీప్ లిక్కర్లో బ్రాండ్లకు ఎలాంటి వాల్యూ లేదని ఊరూపేరూలేని దాదాపు 200 మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్, లెజెండ్, టీఐ మాన్షన్ హౌస్, హై ఓల్టేజ్ వంటివి వాటిలో కొన్ని. వీటిని గతంలో సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. మంత్రిమండలికి కూడా తెలియకుండా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ చీకటి జీవోలు జారీ చేసిన నోట్ ఫైళ్లపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర సంతకాలు చేసిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. టీడీపీ హయాంలో మద్యం దోపిడీకి పాల్పడ్డారని రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ సైతం స్పష్టం చేసింది. చంద్రబాబు మద్యం దోపిడీని సీఐడీ ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులపై సీఐడీ 2023లో ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇక స్కిల్ స్కామ్‌లో అరెస్టై 52 రోజులు రిమాండ్‌లో ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం, ఇసుక దోపిడీ కుంభకోణం కేసుల్లో కూడా చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసుల దర్యాప్తును అటకెక్కించింది. చంద్రబాబుపై మద్యం దోపిడీ కేసుతోపాటు ఇతర కేసులు న్యాయస్థానం విచారణలోనే ఉన్నాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 నుంచి మళ్లీ ప్రైవేటు మద్యం సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరచింది. యథేచ్చగా అదే దోపిడీ సాగిస్తోంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే... 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెట్టిన 43 వేల బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. రాష్ట్రంలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు ఇక కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? ఇక మద్యం విధానానికి సంబంధించి ఏ ఒక్క ఫైలుపై కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకాలు చేయలేదు. ఆ వ్యవహారాలన్నీ బెవరేజెస్ కార్పొరేషనే సమర్థంగా పర్యవేక్షించింది. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో అధికారులు, సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసు కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. 2014–19 మధ్య మద్యం విధానం ముసుగులో తాను చేసిన కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రస్తుతం చంద్రబాబు ఈ అక్రమ కేసు కుట్రకు తెరతీశారన్నది సుస్పష్టం.విక్రయాలు పెంచిందెవరు? మద్యం అమ్మకాలు పెరిగిన కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. గతంలో చంద్రబాబు హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు ప్రతి ఏటా భారీగా పెరగ్గా... అనంతరం వైఎస్ జగన్ హయాంలో 2019–24లో అమ్మకాలు ప్రతి ఏటా గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది చంద్రబాబు సర్కారుకేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విధానం తేల్చిచెప్పిన కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన అభియోగాలనే గతంలో టీడీపీ దు్రష్పచారం చేసింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ద్వందంగా తిరస్కరించడం గమనార్హం. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ సీసీఐకి 2021లో ఫిర్యాదు చేయించింది. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. దీనిపై విచారించిన సీసీఐ 2022 సెపె్టంబరు 19న విస్పష్టమైన తీర్పు ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని.. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. సీసీఐ తిరస్కరించిన ఆరోపణలతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది స్పష్టమవుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
మిగులు టీచర్ల దిగులు
సాక్షి, అమరావతి: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, సర్దుబాటులో టీచర్లు భారీగా ప్రభావితమవుతున్నారు. వీరిలో అత్యధికులు స్కూల్ అసిస్టెంట్లే ఉన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవో–117 ద్వారా 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ బోధన అందించేందుకు సీనియర్ ఎస్జీటీల్లో అర్హులైన దాదాపు 7,500 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడంతో పాటు 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేసింది. అంతేగాక.. ఉపాధ్యాయ, విద్యార్థులు నిష్పత్తిని సైతం భారీగా పెంచడంతో అంతేస్థాయిలో స్కూల్ అసిస్టెంట్ల మిగులు ఏర్పడింది. మిగులు టీచర్లను వివిధ రకాలుగా సర్దుబాటు చేయగా, ఇంకా 6,428 మంది గాలిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగాను, హెచ్‌వోడీ పూల్‌లోను ఉంచారు. అయితే, వీరిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటుపై విడుదల చేసిన ఉత్తర్వుల్లో 2,754 మందిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా ప్రకటించారు. మరో 3,674 మందిని హెచ్‌వోడీ పూల్‌లో ఉంచారు. నిన్న 1,902.. నేడు 1772 మంది రాష్ట్రంలో సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్, తత్సమాన 2,754 పోస్టులను క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా కొత్తగా మార్పు చేశారు. వీరిని ఆయా క్లస్టర్లలోని సర్వీస్ ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు వీరిని ఉపయోగించుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,815 క్లస్టర్లు ఉండగా, కేటాయించిన పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వీరిని ఎలా ఉపయోగించుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. సర్దుబాటు ఉత్తర్వుల మేరకు జిల్లాల్లోని మిగులు పోస్టులను ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, క్లస్టర్ లెవెల్ మొబిలైజ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్, హెచ్‌వోడీ క్యాడర్, మున్సిపాలిటీ మేనేజ్మెంట్లకు బదలాయిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్దుబాటు అనంతరం ఇంకా 8 జిల్లాల్లో 1,772 పోస్టులు మిగులుగా ప్రకటించారు. ఇందులో 362 స్కూల్ అసిస్టెంట్లు, మరో 1,410 ఎస్జీటీలు ఉన్నారు. వీరు మంగళవారం హెచ్‌వోడీ పూల్‌కు అప్పగించిన 1,902 మందికి అదనం. వీరి వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో పంపాలని డీఈవోలకు ఆదేశాలు అందినట్టు సమాచారం. పాఠశాల స్థాయిలో అవసరానికి అనుగుణంగా వృత్తి బోధకులు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీత ఉపాధ్యాయ పోస్టులను కేటాయించాలని, 2024–25 విద్యా సంవత్సరంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లల నమోదు ఆధారంగా అవసరమైన పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మారిన పోస్టుల వివరాల మేరకు క్యాడర్ స్ట్రెంగ్త్‌ను అప్డేట్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల పునర్ నిర్మాణానికి అనుగుణంగా పాఠశాల పేర్లను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ‘స్పెషల్’ టీచర్ల మాటేంటి? ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో సుమారు 700 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వీరినే సర్దుబాటు చేయాలని డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇటీవల ప్రభుత్వం 2,260 రెగ్యులర్ టీచర్ పోస్టులను స్పెషల్ టీచర్ పోస్టులుగా మార్చింది. ఇందులో1,136 ఎస్జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే, కొత్త పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. వాస్తవానికి జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ప్రతి పాఠశాలలోను స్పెషల్ టీచర్లను నియమించాలి. అలాగే, కేంద్ర ప్రభుత్వం 2022లో జారీచేసిన గెజిట్, రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) నిబంధనల ప్రకారం ప్రాథమిక తరగతుల్లో ప్రతి 10 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఒక స్పెషల్ టీచర్‌ను, ఉన్నత పాఠశాలల్లో 15 మందికి ఒక టీచర్ చొప్పున నియమించాలి. కొత్త పోస్టుల భర్తీ ఊసెత్తకుండా ఉన్న పోస్టులనే సర్దుబాటు చేయాలనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
రిమాండ్ నివేదిక సాక్షిగా.. బాబు భేతాళ కుట్రే...!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్ ద్వారా సాగిస్తున్న కుతంత్రం న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు, ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగుచూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాలు, అభూత కల్పనలతో రూపొందించిన నివేదికలనే సిట్ తన రిమాండ్ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ అక్రమ కేసులో సిట్ తాజాగా అరెస్టు చేసిన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. కర్ణాటకలో మంగళవారం అరెస్టు చేసిన ఆయన్ను సిట్ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్ చేస్తూ ఈ కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అరెస్టు అక్రమమని, చట్ట విరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణలో అరెస్టుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని ప్రకటించింది.బాలాజీ గోవిందప్పతో సిట్ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమరి్పంచిన మెమోలో పేర్కొన్న భాగం గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్‌చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని.. ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండటం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని ట్యాంపర్ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలన్నది సిట్ లక్ష్యమన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది. ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే... అంతకుముందే తెల్లవారు జామునే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. సిట్‌లో సభ్యుడుకాని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. సిట్ పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది.అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలా..!ఆ నివేదిక కుట్రే... ఇదిగో సాక్ష్యం...ఇక నిందితుల అరెస్టు, విచారణతో నిమిత్తం లేకుండానే టీడీపీ కార్యాలయంలోనే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు కారణాలను వెల్లడిస్తూ... నిందితుడు పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్ నివేదికలో కృష్ణమోహన్‌రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు..? అంటే నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులోనే రిమాండ్ నివేదికలు రూపొందించి.. వాటిని కాపీ, పేస్ట్ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది.ఎవరినైనా ఇరికిస్తాం..!బాలాజీ గోవిందప్ప వైఎస్ జగన్ దగ్గర పనిచేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు. కానీ ఆయన వైఎస్ జగన్ సంస్థల్లో పని చేయట్లేదు. 12 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో మెజార్టీ వాటాను వికాట్ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్ మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రలకు పాల్పడ్డారని రిపోర్టులో రాశారు. ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్ అక్కౌంటెంట్ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సలపని పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్‌టైమ్ ఫైనాన్స్ డైరెక్టర్‌నే ఇలా టార్గెట్ చేసి అక్రమ కేసులో, జరగని కుంభకోణంలో ఇరికించారంటే.. ఇక దేశంలో ఎవరినైనా కేసుల్లో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కారు పంపింది. దీన్నిబట్టి భేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి. -
‘ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి? ’
తాడేపల్లి : రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలుదారు రైతులనైతే చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కారుమూరి.. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.‘జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేశారు. పంట నష్టం వచ్చినా అందుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. చంద్రబాబు వచ్చాక కౌలుదారీ కార్డులు తొలగించారు. ఖరీఫ్ సీజన్ కి మరో 15 రోజులే సమయం ఉంది. ఈలోపు కౌలుదారులకు కూడా న్యాయం చేయాలి. 80% మంది ఉన్న కౌలు రైతుల మేలు గురించి పట్టించుకోకపోవడం దారుణం. జగన హయాంలో తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేశారు. కౌలు రైతుకు కూడా కార్డులు ఇస్తే ఎక్కడ ప్రభుత్వ మేలు చేయాల్సి వస్తుందోనని చంద్రబాబు ఇవ్వటం లేదు. 32 లక్షల మంది కౌలు రైతులు చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి?, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. వ్యవసాయం దండగ అనే ఆలోచనలోనే ఇంకా చంద్రబాబు ఉన్నారు. అమరావతి మీద చూపే ప్రేమ రైతుల మీద కూడా చూపించండి. పొగాకుకు ధరల్లేక రైతులు కన్నీళ్ళు పెడుతుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో రూ.18 వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.10వేలు కూడా లేదురైతులను వదిలేసి అమరావతి, భ్రమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నారు. పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. వారి తరపున పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. అందరూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు. -
‘రాష్ట్రంలో విద్యకు చంద్ర గ్రహణం పట్టించారు’
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలనతో రాష్ట్రానికి రాహు కాలం పట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్యను విధ్వంసం చేసి చంద్రగ్రహణం పట్టించారని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. ప్రీ హైస్కూల్స్, శాటిలైట్ స్కూల్స్ వంటి రీఫామ్స్ తెచ్చారు. వాటి వలన 25 వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ వచ్చాయి. జీవో 117 తో జగన్ తెచ్చిన మార్పులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.చంద్రబాబు తెచ్చిన 9 రకాల వ్యవస్థల వలన విద్యారంగం నాశనం అయింది. దీని వలన టీచర్ల మధ్య కూడా వైషమ్యాలు తెచ్చారు. చివరికి 26 వేల స్కూళ్లు దెబ్బతినబోతున్నాయి. ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ స్కూళ్ల మీద విరక్తి కలిగేలా చేస్తున్నారు. జగన్ మీద ఉన్న కోపాన్ని స్కూళ్ల మీద చూపిస్తూ వాటిని నాశనం చేస్తున్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు. -
కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
వైఎస్ఆర్ జిల్లా,సాక్షి: కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థ కార్పొరేషన్లో కాంట్రాక్టులు చేసిందంటూ అభియోగాలు మోపింది ప్రభుత్వం. అయితే, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయలేదనే అక్కసుతో సురేష్ బాబును తొలగింపునకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం కార్పోరేషన్లో కాంట్రాక్టులనే అభియోగం మోపి సురేష్ బాబును పదవి నుంచి తొలగించింది. కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్సీసీ నేతలు మండిపడుతున్నారు. నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తీరంలో కొత్త మొలక!
సాక్షి, అమలాపురం: సముద్ర నాచు (సీ వీడ్) సాగు మరోసారి తెరపైకి వచ్చింది. గతంలోనూ ఈ సాగు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇటీవల కాలంలో గుజరాత్ సముద్ర నాచు (Seaweed) తయారీ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఈ సాగు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం సాగుతోంది. దీనిలో భాగంగా కోనసీమ జిల్లా ఈ సాగుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించడంతో శాస్త్రవేత్తలు, మత్స్యశాఖ అధికారులు ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మామిడికుదురు మండలంలో ఒక ఔత్సాహిక రైతు సాగు ప్రారంభించారు. తీరంలో ఈ సాగు విజయవంతం అయితే ఆక్వాకు ప్రత్యామ్నాయ సాగుగా మారడంతోపాటు ఆక్వా వల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని తగ్గుతుంది. సముద్రపు నాచు సాగుకు గతంలో ఒకసారి మంచి గుర్తింపు వచ్చింది. అయినా పాత పద్ధతిలో సాగు చేయడం వల్ల అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. ఈ సాగు విజయవంతం అయితే తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు, మహిళలకు, ఆక్వా రైతులకు స్థిరమైన ఆదాయం ఇచ్చేలా మారనుంది. మరీ ముఖ్యంగా కష్టాల వనామీ వంటి పంటలకు ప్రత్యామ్నాయం కానుంది.జిల్లాలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి ఐ.పోలవరం మండలం భైరవపాలెం వరకు సుమారు 90 కిలోమీటర్ల తీరం ఉంది. ఏడు మండలాల్లో తీర ప్రాంతం ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా కన్నా కోనసీమలోనే ఆక్వాసాగు అధికం. సముద్ర నాచు సాగు చేపట్టేందుకు అనువైన స్థలం, వాతావరణం ఇక్కడ ఉంది. మామిడికుదురు మండలం గొల్లపల్లి, కరవాకల మధ్య ఈ సాగును ఒకరు మొదలు పెట్టారు. అతి విలువైనది సముద్ర నాచు చాలా విలువైనది. జపాన్, చైనాలో దీనిని ఆహారంగా తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నాచు పోషకాల నిధిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మందులు, ఎరువులు, పశువుల దాణాగా ఉపయోగిస్తున్నారు. బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్ కూడా తయారు చేస్తున్నారు. నాచు రకాలు సముద్ర నాచులో గ్రేసిలేరియా, కప్పాఫైకస్, ఉల్వా, సర్గాస్సమ్ అనే రకాలు ముఖ్యమైనవి. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, మట్టి రంగుల్లో ఉంటాయి. వీటిలో కప్పాఫైకస్ అల్వారెజీ రకం ఒకటి. దీని ద్వారా కేరాజినన్ అనే పదార్థాన్ని సేకరిస్తారు. ఇది ఆహార పదార్థాలు, ఔషధాలు, సౌందర్య సాధనాలలో వాడతారు. అలాగే గ్రేసిలేరియా ఎడ్యులిస్ రకం నుంచి అగర్ అనే పదార్థాన్ని సేకరిస్తారు. ఇది మైక్రో బయాలజీ, ఆహార పరిశ్రమ, ఔషధాల తయారీలో విస్తతంగా ఉపయోగిస్తారు. ఈ రెండు జాతులు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం కానున్నాయి. జిల్లాలో ఈ ప్రాజెక్టులకు గ్రీన్ క్లైమేట్ ఫండ్, నాబార్డ్ నిధులు అందిస్తాయని జిల్లా యంత్రాంగం చెబుతోంది.కోనసీమ అనుకూలం సముద్రపు నాచు సాగు పైలట్ ప్రాజెక్టును కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. తొలుత మలికిపురం మండలం తూర్పుపాలెంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తరువాత జిల్లాలో అనువైన స్థలాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం ఉంది. దీనిలో భాగంగా ఇటీవల సముద్రపు నాచు సాగులో నిపుణులు, సీఎస్ఐఆర్, సీఎస్ఎంసీఆర్ఐ, మండపం, తమిళనాడు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బృందం కోనసీమలోని పలు మండలాల్లోని తీర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించింది. జిల్లాలో కాట్రేనికోన మండలంలోని కొత్తపాలెం, పల్లం, నీళ్లరేవు, చిర్రయానం, గచ్చకాయల పోర, ఉప్పలగుప్తం మండలంలోని ఎన్.కొత్తపల్లి, ఎస్.యానం, వాసాలతిప్ప, మామిడికుదురు మండలం గోగన్నమఠం, కరవాక, గొల్లపాలెం, మలికిపురం మండలం తూర్పుపాలెం, సఖినేటిపల్లి మండలంలోని చింతల మోరి, కేశవదాసుపాలెం, అంతర్వేది, గొంది, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, కొమరగిరిపట్నం, ఓడలరేవు, రెబ్బనపల్లి తదితర గ్రామాలలో సముద్రపు నాచు సాగుకు అనువైన ప్రదేశాలను నిపుణుల బృందం పరిశీలించింది. వనామీకి ప్రత్యామ్నాయం సముద్ర నాచు సాగు విజయవంతం అయితే వనామీ సాగుకు ప్రత్యామ్నాయంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్ర నాచు నిలకడైన ఆదాయమని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. సముద్ర నాచు సాగుకు నాలుగు అడుగుల నీరు అవసరం. పంట దిగుబడి వచ్చేందుకు 45 నుంచి 60 రోజులు పట్టనుంది. ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే ఏడాదికి నాలుగైదు పంటలు పండించే అవకాశముంది. ప్రస్తుత మార్కెట్లో కేజీ రూ.25 వరకు ధర ఉండగా, ఎకరాకు రూ.40 వేలకు తక్కువ కాకుండా ఆదాయం వస్తుందని అంచనా. పైలట్ ప్రాజెక్టుగా.. సముద్ర నాచు సాగుకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసిన తర్వాత డీఆర్డీఏ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టుల్లో సాగు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, సంప్రదాయ మత్స్యకారులు, యువకులలో ఔత్సాహికులను గుర్తించి వారికి సముద్రపు నాచు సాగులో శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా సాగు విజయవంతం చేస్తాం. – ఆర్.మహేష్ కుమార్, కలెక్టర్ -
లం.. ముం.. చంపేస్తా నిన్ను
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘లం.. ముం.. చంపేస్తా నిన్ను. చెప్పిన మాట విని ఆ పొలం వదిలేయండి. మీ వల్ల ఊళ్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. లేదంటే వాళ్లు చంపేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనే చంపేస్తా’ అంటూ కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు ఓ మహిళా రైతుపై చేయి చేసుకుని రెచ్చిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కేజే రెడ్డికి వకాల్తా పుచ్చుకుని బరితెగించారు. సభ్య సమాజం తల దించుకునేలా బాధిత కుటుంబాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడు. సంఘటన వివరాలను బాధితులు మంగళవారం రాత్రి కర్నూలులో మీడియాకు వివరించారు.కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన నాగన్నకు 12.84 ఎకరాల భూమి ఉంది. అయితే ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో నిషేధిత భూముల జాబితాలో పెట్టారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేజే రెడ్డి ఈ భూములపై కన్నేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల ఇలాంటి భూములున్న వారిని బెదిరించి ఇప్పటికే 50 ఎకరాల మేర ఆక్రమించుకున్నారు. కాళ్లావేళ్లా పడిన వారికి ఎకరాకు రూ.50–60 వేలు ఇచ్చారు. ఇలా అప్పనంగా భూములు ఇచ్చేందుకు నాగన్న కుటుంబం నిరాకరించింది. దీంతో పోలీసులను అడ్డు పెట్టుకుని వారిపై తప్పుడు కేసులు పెట్టించారు. నాగన్న కుమారులు ఇద్దరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారు.ఈ క్రమంలో వారు ఎస్పీకి అర్జీ పెట్టుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలిసి.. కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు, ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయ.. నాగన్న, ఆయన భార్య, ఇద్దరు కుమారులను మంగళవారం రాత్రి కర్నూలులోని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ‘మాపైనే ఫిర్యాదు చేస్తారా.. మీకెంత ధైర్యం.. ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు’ అంటూ తీవ్రంగా బెదిరించారు.60 ఏళ్లుగా ఈ పొలం చేస్తున్నామని, ఇప్పుడు ఉన్నట్లుండి కేజేరెడ్డికి ఇచ్చేయాలని చెప్పడం న్యాయం కాదని నాగన్న భార్య వాపోయారు. దీంతో సీఐ ఆమెపై ఊగిపోతూ బూతులు తిట్టారు. లం.. ముం.. చంపేస్తానంటూ ఊగిపోయారు. చెంప దెబ్బ కూడా కొట్టారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన దౌర్జన్యాన్ని నాగన్న కుటుంబం మీడియాకు వివరించింది. తమకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ, డీఐజీని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి, పోలీసులకు భయపడి కొంత కాలంగా ఊళ్లో ఉండటం లేదని, డోన్ సమీపంలోని కొచ్చెరువులో ఉంటున్నామని తెలిపారు. -
మహిళలకు వైఎస్ జగన్ చేసిన మేలు ఎవరూ చేయలేదు
సాక్షి, అమరావతి: మహిళలకు దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత మేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు తనతో పాటు అడుగులు వేయాలని, నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని వైఎస్ జగన్ నమ్మారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వైపు దేశం మొత్తం తిరిగిచూసిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ. కూటమి పాలనలో మహిళలని కూడా చూడకుండా కేసులు పెడుతున్నారని, ప్రభుత్వంలో ఉన్నవారి ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. సంయమనం, క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉంటుందనే సందేశం ఇవ్వాలని సూచించారు. పార్టీ ఇతర అనుబంధ సంఘాల తరహాలోనే మహిళా విభాగం కూడా జిల్లా స్థాయిలో సమావేశం కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి నిర్దేశించారు.జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని కలుపుకొంటూ ముందుకెళ్లాలన్నారు. పనిచేసే క్రమంలో అడ్డంకులు సహజమని, పార్టీలోని నాయకుల సహకారంతో వాటిని తొలగించుకోవాలని సూచించారు. అపోహలతో పార్టీకి దూరమైన వర్గాలకు మళ్లీ దగ్గర కావాలని చెప్పారు. ఈ కష్ట కాలంలోనూ పార్టీలో పది పదవులకు వందమంది పోటీకి వస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏ పార్టీలోనూ ఇలా జరగదని, వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చెక్కుచెదరకపోగా మరింత పెరిగింది అనేందుకు నిదర్శనం ఇదేనని వివరించారు. మహిళలను నిలువునా మోసం చేసిన కూటమి: వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వం మహిళలను నిలువునా మోసం చేసిందని వరుదు కళ్యాణి అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు సంక్షేమం కింద ఒక్క రూపాయి కూడా అందడం లేదని, మహిళా లోకం కుమిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు జగనన్న పాలనలో జరిగిన లబ్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని, సమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అంటే గంజాయి, బెల్ట్ షాప్‌లు, పర్మిట్ రూమ్‌లు, పేకాట క్లబ్‌లు, డ్రగ్స్, మహిళలపై అఘాయిత్యాలు అని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలకు బదులు సూపర్ స్కామ్స్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్రలకు, ప్రజా నాయకుడైన జగనన్నకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నడుంబిగించాలి మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారా వారి నరకాసుర పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అవమానాలు, అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, వేధింపులు ఇవే సూపర్ సిక్స్ అని అన్నారు. వైఎస్సార్సీపీలోని ప్రతి మహిళా సత్యభామలా మారి ఈ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మహిళా లోకాన్నే మోసం చేసిందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ మహిళా నేతలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... వైఎస్ జగన్ ఐదేళ్లూ పరిపాలన మీదే దృష్టిపెట్టారని, మేనిఫెస్టోలో చెప్పినవాటితో పాటు, చెప్పని హామీలనూ నెరవేర్చారని అన్నారు. ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ... కూటమి నాయకుడి మనసులో మెదిలితే చాలు మన మీద తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. సమావేశంలో అనుబంధ విభాగాల ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్లు, మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ మాజీ చైర్ పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు. -
కౌలుదారులకు గుర్తింపేది
వ్యవసాయ రంగంలో 70–80 శాతం కౌలుదారులే ఉన్నారు. వీరికి సాగు హక్కు కార్డుల (సీసీఆర్సీ) జారీ కోసం ఏటా ఏప్రిల్, మే నెలల్లో సీసీఆర్సీ మేళాలు నిర్వహించేవారు. ఖరీఫ్ సాగు ప్రారంభంలోనే ప్రతి కౌలుదారునికి భూ యజమాని అనుమతితో సాగు హక్కు కార్డులు జారీ చేసేవారు. ఈ ఏడాది మరో 15 రోజుల్లో తొలకరి సాగు మొదలవుతున్నప్పటికీ ఇప్పటివరకు కార్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విత్తనాల నుంచి రుణాల వరకు, పెట్టుబడి సాయం నుంచి పెట్టుబడి రాయితీ వరకు అందుతాయో లేదోననే ఆందోళన కౌలు రైతుల్లో నెలకొంది. – సాక్షి, అమరావతి32 లక్షల మంది కౌలుదారులురాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులుండగా, వారిలో సొంత భూమి సెంటు కూడా లేని కౌలుదారుల సంఖ్య 10లక్షల పైమాటే. బ్యాంకుల ఆంక్షలతో రుణాలకు దూరమయ్యే వీరు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి రూ.3, రూ.5 వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేసేవారు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ భూ యజమానుల హక్కులకు భంగం కలగని రీతిలో కౌలుదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తీసుకొచ్చిన సీసీఆర్సీ–2019 చట్టం ద్వారా వాస్తవ సాగుదారులకు 11 నెలల కాల పరిమితితో ఏటా సీసీఆర్సీలు జారీ చేసేవారు. ఇందుకోసం ఖరీఫ్ ప్రారంభానికి ముందుగానే సీసీఆర్సీ మేళాలు నిర్వహించేవారు. ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య 25.94 లక్షల మందికి కార్డులు జారీ చేసింది. వీటి ప్రామాణికంగానే పంట రుణాలతోపాటు వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు అందించడంతోపాటు కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కళ్లాల నుంచే కొనుగోలు చేసింది. గడచిన ఐదేళ్లలో 6.78 లక్షల మందికి రూ.8,345 కోట్ల పంట రుణాలిచ్చింది. 5.57 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కౌలుదారులకు రూ.751.42 కోట్లను రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా అందించింది. 3.55 లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.42 లక్షల మందికి రూ.253.56 కోట్ల పంట నష్టపరిహారం అందించింది.అన్నదాత సుఖీభవకు దూరం అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. తొలివిడత సాయం ఈ నెలాఖరులో జమ చేస్తామంది. కౌలు కార్డుల జారీ ప్రక్రియ ఇంకా మొదలు కాకపోవడంతో కార్డుల ప్రామాణికంగా పెట్టుబడి సాయం ఏవిధంగా అందిస్తారని కౌలు రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం అందించే పీఎం కిసాన్ సాయానికి కౌలు రైతులు దూరమయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ,13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించేది. కానీ.. కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలేమీ చేపట్టడం లేదు. ఏడాది గడిచినా..సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌలు రైతులు ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 2024–25 సీజన్లో 10 లక్షల మంది కౌలుదారులకు కార్డులు జారీ లక్ష్యంగా నిర్దేశించింది. 9.13 లక్షల మంది కౌలుదారులకు కార్డులు జారీ చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వీరికి పెట్టుబడి సాయంతో పాటు ఏ ఒక్కరికీ బీమా పరిహారం, నష్టపరిహారం వంటివేమీ అందలేదు. మరోవైపు సీసీఆర్సీ చట్టం స్థానంలో కొత్త కౌలుచట్టం తెస్తామంటూ కూటమి ఇచ్చిన హామీ ఏడాది గడిచినా కార్యరూపం దాల్చలేదు. పాత కౌలుచట్టం ప్రకారమే ఈ ఏడాది కూడా 10 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయాలని నిర్ణయించారు. అయితే, భూ యజమానులు సమ్మతి తెలిపేందుకు ముందుకు రాలేదు. వారిని ఒప్పించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది విఫలమవుతున్నారు. కొత్త కార్డుల జారీ మాట దేవుడెరుగు.. ఉన్న కార్డులను సైతం రెన్యువల్ చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో సీజన్ ముంచుకొస్తున్నప్పటికీ సీసీఆర్సీ జారీ అడుగు ముందుకు పడటం లేదు.కౌలుదారులకు మొండిచేయి కార్డుల జారీలో జాప్యం వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఆర్సీ చట్టం–2019 స్థానంలో తెస్తామన్న కొత్త చట్టానికి అతీగతీ లేదు. గతేడాది వర్షాకాల సమావేశాల్లోనే తెస్తామన్న ఈ బిల్లు ఏ దశలో ఉందో కూడా చెప్పడం లేదు. సీజన్ ముంచుకొస్తున్నా ఏ ఒక్కరికీ కార్డు జారీ చేయలేదు. కౌలుదారులకు రుణాలు అందడం లేదు. అన్నదాత సుఖీభవ సాయం కూడా వీరికి అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. – పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం -
బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి తేలుస్తాం
సాక్షి, అమరావతి: మద్యం కేసులో వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈమేరకు స్పందించింది. గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధా్దర్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమవుతుందని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ హితవు పలికింది. కాగా అగర్వాల్ వాదనను బాలాజీ గోవిందప్ప తరఫు న్యాయవాది సిద్ధా్దర్థ దవే తీవ్రంగా వ్యతిరేకించారు. తమ వ్యాజ్యం నిరర్థకం కాదన్నారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని తెలిసి కూడా అరెస్ట్ చేశారన్నారు. దర్యాప్తు సంస్థ తీరును ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. సిద్ధార్థ దవేదీనిపై ధర్మాసనం స్పందిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తదుపరి విచారణ సమయంలో తేలుస్తామని ప్రకటించింది. అయితే మీరు (సుప్రీంకోర్టు) ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే కింది కోర్టులో బాలాజీ గోవిందప్ప.. ఏసీబీ రిమాండ్ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తారని సిద్ధా్దర్థ అగర్వాల్ పేర్కొన్నారు. అరెస్ట్ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రిమాండ్‌కు ఇవ్వవద్దని అడుగుతారన్నారు. అగర్వాల్ వాదనపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మీరు మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇద్దరికీ ఊరట..ఇదే సమయంలో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. తదుపరి విచారణ వరకు వీరిద్దరిని అరెస్టు చేయరాదని ఏసీబీని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని వారిద్దరినీ ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అదే రోజు గోవిందప్ప అరెస్ట్‌తో సహా అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించింది.ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలతో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఏసీబీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుకి సైతం నిరాకరించింది. ఈ నేపథ్యంలో వారు ముగ్గురూ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.సమావేశాల్లో పాల్గొంటే నిందితుడిని చేసేస్తారా...?ధనుంజయరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వికాశ్సింగ్, కృష్ణమోహన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. హైకోర్టు కనీస స్థాయిలో కూడా తమ వాదనలు వినలేదని వికాశ్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తమకు హైకోర్టు అవకాశం ఇచ్చి ఉంటే పిటిషనర్లపై ఏసీబీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని నిరూపించేవారిమన్నారు.కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన నిందితునిగా చేర్చడం సరికాదన్నారు. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో ఇదే సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని ఆ తీర్పులో పేర్కొన్నారని వికాశ్ సింగ్ నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రముఖ మద్యం తయారీ కంపెనీలను పక్కకు నెట్టేసి ఎవరికీ తెలియని కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేశారన్నారు. బాలాజీ గోవిందప్ప అక్రమ అరెస్టుకర్ణాటకలో అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలింపుసాక్షి,అమరావతి: వికాట్ గ్రూప్ భారత దేశ వ్యవహారాల డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా యలందూర్లో అక్రమంగా అరెస్టు చేశారు. ప్రకృతి వైద్యం చేయించుకుంటున్న గోవిందప్పను అదుపులోకి తీసుకుని అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొస్తున్నారు. బుధవారం ఉదయం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తారని తెలుస్తోంది. అనంతరం బాలాజీ గోవిందప్పను న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో సోదాల పేరుతో వేధింపులు కేసు దర్యాప్తు పేరిట హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నివాసాల్లో సోదాల పేరిట సిట్ అధికారులు హల్చల్ సృష్టించి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. సిట్ బృందాలు హైదరాబాద్‌లో బాలాజీ గోవిందప్ప నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను హడలెత్తించారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలకు ప్రశ్నలతో వేధించారు.ఇంట్లో పత్రాల తనిఖీ పేరిట మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు హల్చల్ చేశారు. కృష్ణమోహన్‌రెడ్డి నివాసంలోనూ సిట్ అధికారులు సోదాల పేరిట వేధింపులకు పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి దాటేవరకు సోదాలు చేస్తూనే ఉన్నారు. మరో ప్రాంతంలో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డిని పిలిపించి మరీ ఆయనకు సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ధనుంజయ్‌రెడ్డి నివాసంలోనూ సోదాల పేరిట సిట్ అధికారులు అదే రీతిలో బెదిరింపులకు పాల్పడ్డారు. -
రైలు ప్రయాణం ‘ఉక్క’రబిక్కిరి
సాక్షి, నెట్వర్క్ : వేసవి తాపం దృష్ట్యా ప్రయాణం అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. రైలు ప్రయాణం అంటే మరీ బెంబేలెత్తిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైన నమోదవుతుండడంతో జనరల్ బోగీల్లో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. పేద, అల్పాదాయ వర్గాలు ప్రయాణించే ఈ బోగీలను ఇటీవల కేంద్రం భారీగా తగ్గించడంతో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రయాణికులు ఊపిరి ఆడక నరకం అనుభవిస్తున్నారు. కిటికీల్లో నుంచి వస్తున్న వడగాడ్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, చిన్నారులు వడదెబ్బకు గురవుతున్నారు. రిజర్వేషన్ బోగీల్లోనూ ఇదే దుస్థితి. దీంతో చార్జీ ఎక్కువగా ఉన్నా.. ఏసీ కోచ్‌లు, ఎకానమీ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికే అత్యధికులు మొగ్గుచూపుతున్నారు. రద్దీ పెరుగుదలతో ఏసీ కోచ్‌లు నెల, నెలన్నర ముందే నిండిపోతున్నాయి. ఏ రైలు చూసినా వెయిటింగ్ లిస్టు చూపిస్తున్నాయి. రద్దీ పెరిగిన నేపథ్యంలో ఏసీ కోచ్‌ల పెంపునకు రైల్వే శాఖ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఏసీ కోచ్‌లు, ఎకానమీ కోచ్‌లతోపాటు సాధారణ బోగీలు మరింత పెంచితే ఉపశమనంగా ఉంటుందని చెబుతున్నారు. ఆధ్యాత్మిక యాత్రలలో ఆపసోపాలు పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు వచ్చాయి. దీంతో పిల్లలతో చాలామంది ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు వెళ్తుంటారు. బస్సు కంటే రైలు ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి మీదుగా రోజూ 90 నుంచి వంద రైళ్లు నడుస్తుంటాయి. సుమారు రెండు లక్షల మంది ప్రయాణిస్తుంటారని సమాచారం. వీరంతా వేసవి తాపానికి అల్లాడుతున్నారు. జనరల్‌తోపాటు ఏసీ బోగీలు పెంచాలని కోరుతున్నారు.సీట్లు, బెర్త్‌లు దొరకడం లేదువేసవి సెలవుల దృష్ట్యా బోగీలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రిజర్వేషన్ చేసుకుందామన్నా.. సీట్లు, బెర్త్‌లు దొరకడం లేదు. సాధారణ బోగీల సామర్థ్యం 90 మంది అయితే 200 మంది వరకు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. స్లీపర్ కోచ్ సామర్థ్యం 72. డిమాండ్ పెరగడంతో ఏసీ కోచ్‌లలోనూ సీట్లు దొరకడం లేదు. చాంతాడంత వెయిటింగ్ లిస్టు చూపిస్తుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, హౌరా, భువనేశ్వర్ వెళ్లే రైళ్లకు ఏసీ కోచ్‌లలో కనీసం నెల రోజుల వరకు సీట్లు లేవు. స్లీపర్ కోచ్‌ల సంగతి ఇక చెప్పక్కర్లేదు. ముఖ్యంగా విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్‌నుమా, గరీభ్‌రథ్, గోదావరి తదితర పలు ఎక్స్‌ప్రెస్‌లలో ఏసీ కోచ్‌లలో ఖాళీలు లేవు. రెండేళ్ల క్రితం నుంచి థర్డ్ ఏసీ ఎకానమీ రైళ్లలో గతంలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ.. ఇలా మూడు రకాల ఏసీ కోచ్‌లు మాత్రమే ఉండేవి. పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం కొత్తగా థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లనుప్రవేశపెట్టింది. సాధారణ థర్డ్ ఏసీ కోచ్‌లోని ఓ కూపేలో 8 బెర్త్‌లుంటే, ఎకానమీ ఏసీ కోచ్‌లో తొమ్మిదుంటాయి. కూపేల వైశాల్యం కూడా తగ్గించడం వల్ల ఇలాంటి ఓ కోచ్‌లో అదనంగా మరో కూపే ఉంటోంది. అంటే ఈ కూపే ద్వారా అదనంగా తొమ్మిది బెర్తులు అందుబాటులో ఉంటాయన్నమాట. సాధారణ థర్డ్ ఏసీ కోచ్ కంటే ఎకానమీ కోచ్ టికెట్ ధర తక్కువగా ఉంటుంది. అందుకే అల్పాదాయ వర్గాలు ఈ ఎకానమీ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు.ఖర్చయినా ఏసీనే బెటర్ ఉక్కబోత, సౌకర్యాల లేమి, గాలి ఆడని పరిస్థితితో స్లీపర్ క్లాస్ ప్రయాణం నరకంగా మారింది. మా పిల్లలు ఇద్దరూ విశాఖలో ఉంటారు. వారి దగ్గరకు ప్రతినెలా మా భార్యాభర్తల్లో ఎవరో ఒకరం వెళ్లి వస్తుంటాం. ఈ క్రమంలో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించలేక, ఖర్చు ఎక్కువైనా వందేభారత్, థర్డ్ ఏసీల్లో వెళ్లాల్సి వస్తుంది. – బండి వెంకటేశ్వరరావు, రైల్వే ప్రయాణికుడు, ఏలూరు కిటికీ తెరిస్తే వడగాలి, మూస్తే ఉక్కపోత ఎండలు భయంకరంగా ఉన్నాయి. గద్వాల నుంచి కర్నూలుకు ప్రయాణం చేయాలంటేనే ఇబ్బందిగా ఉంది. కిటికీలు తెరిస్తే వడగాలి, మూస్తే ఉక్కపోత. నరకం చూస్తున్నా. – రామన్న, గద్వాల ఊపిరి ఆడడం లేదునా పేరు విజయ్. నేను చెన్నైలో రైలెక్కాను. బోగీలన్నీ కిక్కిరిశాయి. కిటికీలో నుంచి వేడిగాలులు వస్తున్నాయి. కూర్చుని ప్రయాణించడమే కష్టంగా ఉంది. ఇక నిలుచుని ప్రయాణించేవారి దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఊపిరి ఆడడం లేదు. ఏసీ, జనరల్ బోగీల సంఖ్య పెంచాలి. –విజయ్, కడప ఏసీ బోగీలు పెంచాలివేసవి తాపం దృష్ట్యా సాధారణ, స్లీపర్ బోగీల్లో ప్రయాణించలేని దుస్థితి నెలకొంది. ఊపిరి ఆడడం లేదు. ఏసీ బోగీల్లో సీట్లు దొరకడం లేదు. రైల్వే శాఖ ఎండా కాలం ఏసీ బోగీలు పెంచాలి. – దల్లి మహేశ్వరరెడ్డి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, విశాఖపట్నం స్లీపర్ బోగీలో నరకంకసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనం కోసం ఏడాదిలో కనీసం రెండు, మూడుసార్లు గుంతకల్లుకు రైలులో వస్తుంటాం. స్లీపర్, జనరల్ బోగీల్లో ప్రయాణించాలంటే నరకంగా ఉంది. వేడి సెగలకు తట్టుకోలేకపోతున్నాం. – లక్ష్మీదేవి, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా చాలా కష్టంగా ఉందితమిళనాడులోని కోయంబత్తూరులో తెల్లవారుజామున డిబ్రుఘర్–కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. ఎండవేడి బాగా ఉంది. వడగాడ్పులకు ప్రాణం పోయినంత పనవుతోంది. చొక్కా తీసేసి బనీన్ మీద కూర్చున్నా.. ఉండలేకపోతున్నా. – లక్కీజర్, బిహార్ -
ఆదాయం భారీగా పెంచాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని, మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను మరింతగా అన్వేషించాలన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన ఆదాయార్జన శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నా, పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. మద్యం సరఫరా, అమ్మకాల ట్రాకింగ్ పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తీసుకొచ్చి, రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే.. ఏపీలో ఎందుకు తక్కువగా ఉందని ప్రశి్నంచారు. రాష్ట్రంలోని ఎర్ర చందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో అమ్మేలా కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక ఇవ్వాలని చెప్పారు. ‘2025–26 సంవత్సరానికి రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,34,208 కోట్లు ఆర్జించాలన్నది లక్ష్యం. ఇది గత ఏడాది కన్నా 29 శాతం అధికం’ అని సీఎం చెప్పారు. -
ఆధారాలు లేకుండా అరెస్టులా..?
‘‘అరెస్ట్ అనేది.. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అరెస్ట్ అన్నది.. వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల అరెస్ట్ విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది..’’– సుప్రీంకోర్టు ధర్మాసనం..సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని పేర్కొంది. కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్ట్‌లు చేయడం తగదంది. ‘ఏదైనా కేసులో అరెస్టు చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేసి తీరాలన్న ఆలోచన ఎంతమాత్రం సరికాదు. ఇలాంటి యాంత్రిక అరెస్ట్‌లు సబబు కాదు...’ అని గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణకు స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలని పునరుద్ఘాటించింది.హైకోర్టు తీర్పును రద్దు చేసిన ‘సుప్రీం’...మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పును పరిశీలిస్తే.. ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. మిథున్‌రెడ్డి పరువు, ప్రతిష్టలను కూడా కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్ధీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు తీర్పుపై సుప్రీంకు మిథున్‌రెడ్డి...గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మి«థున్‌రెడ్డి తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ గత నెల 3న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ పార్ధీవాలా ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.దర్యాప్తునకు సహకరిస్తున్నారు...మిథున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, రంజిత్ కుమార్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ ఇప్పటికే దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరయ్యారని తెలిపారు. మద్యం కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చామని రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పును ఆక్షేపించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. తీర్పు వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయబోమన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని ధర్మాసనం రికార్డ్ చేసింది. -
మద్యం అమ్మకాల ఆదాయం భారీగా పెంచండి!
విజయవాడ: ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోవడంతో దాన్ని సరిచేసుకునే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి చంద్రబాబు దగ్గర ఉన్న ప్రధానం ఆయుధం మద్యం. ఇప్పుడు దానిపైనే మరోసారి పడ్డారు చంద్రబాబు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం భారీగా పెంచాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు చంద్రబాబు.మద్యం ద్వారా అమ్మకాల ద్వారా రూ. 33, 882 కోట్లు ఆదాయం తేవాలని టార్గెట్ నిర్దేశించారు. అదే సమయంలో ఎర్రచందనం అమ్మకంతో కూడా ఆదాయం పెంచాలన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై కూడా భారీగా ప్రభుత్వ ఆదాయం పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా అమ్మాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అధికారలతో కమిటీ వేయాలన్నారు.29 శాతం పెంచాలంటూ..!చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిపోవడంతో కేంద్ర నుండి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం తగ్గినట్లు అధికారులు అంగీకరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి మే 11 వరకూ రూ. 5,500 కోట్ల మైనస్ ఆదాయం ఉందని అధికారులు తెలిపారు. దాంతో ఆదాయాన్ని 29 శాతం ఆదాయం పెంచాలంటూ అధికారులకు టార్గెట్ పెట్టారు చంద్రబాబు. అయితే 29 శాతం ఆదాయం ఎలా పెంచాలని అధికారులకు తలలు పట్టుకుంటున్నారు. -
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్
విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. సత్యవర్థన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా గత ఫిబ్రవరిలో వంశీని అరెస్ట్ చేశారు. తాజాగా వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రూ. 50 వేలతో పాటు రెండు షురీటిలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వంశీతో పాటు మరో నలుగురకి బెయిల్ వచ్చింది. సత్యవర్డన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. ఈ రోజు(మంగళవారం) కోర్టుకు హాజరయ్యారు. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిసన్ పై విచారణ చేపట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
‘రూ. 300 కూలి కోసం పనికి వెళితే వేధించారు’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దాపురించిందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ధ్వజమెత్తారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం.. ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జగన్మోహన్ రావు.. ‘ చందర్లపాడు లో ఉపాధి హామీ కూలి చేసే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక పురుగులు మందు తాగింది. రూ. 300 కూలి కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది అని పనికి వెళితే వేధించారు. ఆమె మాట్లాడిన వీడియో ఉన్నా... అనుమానాస్పద మృతి గా కేసు కట్టడం దారుణం. ఆమె భర్త చేత కడుపు నొప్పి అని ఫిర్యాదు చేయించడం బాధాకరం. కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా..?, ఆమె మరణ వాంగ్మూలంకి విలువ లేదా?, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను ప్రశ్నించినందుకు ఆమె ను వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనుల్లో ఇలానే అక్రమాలు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ప్రమేయంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంత ఘోరంగా వేధించి చంపేస్తే కేసును తారుమారు చేస్తున్నారు. గతంలో కూడా కాకినాడలో మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ ని డబ్బులు ఇమ్మని వేధించారు. ఉపాధి పనుల్లో ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఎందుకని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఉపాధి కూలీలు వైఎస్సార్ సీపీకి చెందినవారైతే పనులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. -
సుప్రీంకోర్టులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఊరట
ఢిల్లీ: ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా కేసు దర్యాప్తుకు హాజరుకావాలని, అధికారులకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట
ఢిల్లీ: మద్యం విధానం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు హితవు పలికింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.‘‘గత విచారణ సందర్భంగా ఈ కేసులో ఆధారాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలి. దర్యాప్తు అధికారి సేకరించిన మెటీరియల్ హైకోర్టు చూడాలి. ఈ కేసులో పిటీషనర్ పాత్రకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదు. అరెస్ట్‌కు సహేతుక కారణాలు చూపించాలి. మెకానికల్ అరెస్టులు సరికాదు. కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని యోచన సరికాదు’’ అని సుప్రీంకోర్టు తెలిపింది.‘‘పార్లమెంట్ సభ్యుడి పరువు ప్రతిష్టలను పరిగణలోకి తీసుకోవాలి. తాజాగా మరోసారి పిటిషన్ హైకోర్టు విచారణ చేయాలి. ఏపీ హైకోర్టు తగిన అఫిడవిట్ దాఖలు చేయాలి. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
జగనన్న 2.0లో వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: నేడు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, అప్పిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతుందని.. ఈ పాలనను అంతమొందించే వరకు మహిళలు పని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ప్రతి మహిళ గర్వపడేలా పాలించారు. మహిళలకు ఇచ్చిన హామీలు జగనన్న కులం, మతం, పార్టీ చూడకుండా అమలు చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ మహిళలనే కాదు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళలను కూడా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు.‘‘పాకిస్తాన్ ఉగ్రవాదుల పై సోఫియా ఖురేషి, ఒమిక సింగ్‌ల పోరాటం అందరికి ఆదర్శం. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళలు కూడా వారిలానే టీడీపీ ఉన్మాదులపై పోరాడాలి. టీడీపీ రాష్ట్రంలో పోలీసులు, సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. పార్టీ నాయకులు, మహిళ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ కేసులకు, వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ రెచ్చిపోతున్న వారికి అంబేద్కర్ రాజ్యాంగంతో శిక్షిస్తాం. మహిళలు వేధించిన వాళ్ళందరి పేర్లు బ్లూ బుక్‌లో రాస్తాం. జగనన్న 2.0 లో తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం’’ అని ఆర్కే రోజా అన్నారు. -
గురుకుల సిబ్బందికి జీతాల్లేవ్!
సాక్షి, అమరావతి: ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల(ఏపీఆర్ఎస్ అండ్ జేసీ) పరిస్థితి తీసికట్టుగా మారింది. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా కూటమి సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆర్థిక కష్టాలు పడుతున్నారు. విద్యా సంవత్సరమంతా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు జీతాలు ఇవ్వకపోవడంతో పాటు విద్యార్థులకు డైట్ చార్జీలను సైతం చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 నెలల క్రితం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్వో) ఇచ్చినా.. నిధులు విడుదల కాకపోవడంతో అధికారులు దిక్కులు చూస్తున్నారు.రెసిడెన్షియల్ స్కూళ్లలో సదుపాయాల కల్పనకు ఇచ్చిన బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని రెండు నెలల వేతనంగా సర్దుబాటు చేసినా.. ఇంకా 8 నెలల వేతనాలు అందలేదు. ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని రెసిడెన్షియల్ కాలేజీలకు నాలుగైదు నెలలకు బడ్జెట్ విడుదల చేస్తుండగా.. మైనార్టీ కాలేజీలకు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు ఒక్క నెల వేతనం గాని, విద్యార్థులకు చెల్లించే డైట్ చార్జీలు గాని విడుదల చేయలేదు. నాగార్జున సాగర్‌లోని డిగ్రీ కాలేజీ సిబ్బందికీ 7 నెలలుగా వేతనాలు నిలివేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకే తరహా స్కూళ్లకు వేర్వేరు బడ్జెట్లు నిరుపేద విద్యార్థులకు పూర్తిస్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీని ఏర్పాటు చేశారు. దీనికింద 50 రెసిడెన్షియల్ స్కూళ్లు, 11 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ (నాగార్జునసాగర్) నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పేరుకు ఒకే సొసైటీ కింద కొనసాగుతున్నా స్కూళ్ల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ, జూనియర్ కాలేజీలకు ఇంటర్మిడియట్ బోర్డు, డిగ్రీ కాలేజీకి ఉన్నత విద్యశాఖ నిధులిస్తున్నాయి. మైనార్టీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 6 రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమైన బడ్జెట్‌ను మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయిస్తోంది. విద్యా సంవత్సరం పూర్తయినా.. సిబ్బంది వేతనాలకు రూ.15 లక్షలు, విద్యార్థుల డైట్ చార్జీలకు రూ.30 లక్షలు కలిపి ప్రతి స్కూల్‌కు రూ.45 లక్షలు ఇవ్వాలి. అయితే, 50 స్కూళ్లలో 6 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లకు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి సిబ్బందికి వేతనాలు, విద్యార్థులకు డైట్ చార్జీలు విడుదల చేయలేదు. ఏప్రిల్ నెలతో విద్యా సంవత్సరం పూర్తయింది. అయినా గత 10 నెలలుగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. విద్యాసంవత్సరం మొత్తానికి రూ.4.50 కోట్లు నిధులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. మరోపక్క 11 రెసిడెన్షియల్ జూనియర్, ఒక డిగ్రీ కాలేజీలకు నవంబర్ నుంచి వేతనాలు, డైట్ చార్జీల చెల్లింపుల్ని నిలిపివేశారు. జూనియర్ కాలేజీలకు నెలకు రూ.1.20 కోట్ల చొప్పున రూ.7.20 కోట్లు, డిగ్రీ కాలేజీకి రూ.30 లక్షల చొప్పున రూ.1.80 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మైనార్టీ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు అన్నింటికీ కలిపి రూ.13.50 కోట్లు చెల్లించాలి. అద్దెలూ అంతే వీటిలో కొన్ని స్కూళ్లు, కాలేజీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వేతనాల కోసం సిబ్బంది నుంచి ఒత్తిడి వస్తుండటంతో మూడు నెలలకోసారి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందేగాని నిధులు మాత్రం ఇవ్వడం లేదు. మరోపక్క భవనాల అద్దె చెల్లించకపోవడంతో యాజమాన్యాల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో చేసేది లేక భవనాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లపై కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరికి ఇది అద్దం పడుతోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. వేతనాలు లేకుండా బతికేదెలా అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. -
3 రోజులకో స్టార్టప్
సాక్షి, అమరావతి: ఆవిష్కరణల దిశగా గొప్ప ముందడుగు వేయడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ చరిత్ర సృష్టిస్తోంది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ), స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ సంయుక్తంగా 2024–25లో ఏకంగా 104 స్టార్టప్‌లను అభివృద్ధి చేయడం విశేషం. ఈ స్టార్టప్‌లలో సగానికిపైగా ఐఐటీ మద్రాస్ కమ్యూనిటీ సభ్యులైన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు స్థాపించారు. మిగిలిన వాటిని బయట వ్యక్తులకు ప్రోత్సాహకం అందించడం ద్వారా ప్రారంభించారు. ఇది ఐఐటీ మద్రాస్‌లోని స్టార్టప్ అనుకూల వ్యవస్థను బలంగా చాటుతోంది. 12 ఏళ్లుగా ఐఐటీ మద్రాస్ శక్తివంతమైన డీప్‌టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిరి్మస్తోంది. ఇప్పటివరకు రూ.50,000 కోట్లకుపైగా సమష్టి విలువ కలిగిన 457 స్టార్టప్‌లు, 2 యూనికార్న్‌లను అందించింది.‘స్టార్టప్ మిషన్’ విజయవంతం.. గతేడాది ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ నిర్దేశించిన ‘స్టార్టప్ 100 మిషన్’ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇది ఏడాదికి సగటున 60 స్టార్టప్‌ల నుంచి 104కు చేరుకోవడం చరిత్రాత్మక విషయం. దీనికి తోడు ఐఐటీ మద్రాస్ ఏడాదిలో ఏకంగా 417 పేటెంట్లను దాఖలు చేసింది. అంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ పేటెంట్లు దాఖలైనట్లు లెక్క. ఈ స్టార్టప్‌ల్లో తయారీ, రోబోటిక్స్, ఆటోమోటివ్ మెటీరియల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్‌టెక్, స్పేస్, ఫార్మా, క్వాంటం టెక్నాలజీ, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఐఓటీ, అగ్రిటెక్, కృత్రిమ మేధ వంటి ముఖ్యమైన డీప్ టెక్ రంగాల్లో సేవలందిస్తున్నాయి. ఇక్కడే ఇన్‌బౌండ్ ఏరోస్పేస్, మ్యాటరైజ్ వంటి నవ కంపెనీలకు ఐఐటీఎంఐసీ నుంచి తిరుగులేని సహకారం లభించడంతోనే సాధ్యపడింది. -
వీరజవాన్ కుటుంబానికి నేడు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, పుట్టపర్తి: జమ్మూ కశ్మీర్లో ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించనున్నారు.ఆయన బెంగళూరు నుంచి ఉదయం 11.30 గంటలకు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుంటారు. మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శించి, తిరిగి బెంగళూరుకు పయనమవుతారు. -
బాబే సూత్రధారి.. ‘ముఖ్య’నేత సమర్పించు.. మందు ‘పాత్రలు’!
సాక్షి, అమరావతి: మద్యం మాఫియా డాన్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్‌బుక్ కుట్రను రక్తి కట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేసుకుని ప్రలోభపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకుని అబద్ధపు వాంగ్మూలాలతో రోజుకో భేతాళ కథను తెరపైకి తెస్తున్నారు. కట్టు కథలు అల్లుతూ, బేతాళ కథలను సృష్టిస్తూ వాటిని వారితో పలికిస్తున్నారు. అవే కల్పిత కథలను రిమాండ్ రిపోర్టులో పొందుపరుస్తున్నారు. దానిపై తాము సంతకం చేయలేదని నిందితులే స్వయంగా న్యాయమూర్తుల ఎదుట వెల్లడిస్తున్నారంటే బాబు భేతాళ కథలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చారు. తాను అబద్ధాలు చెప్పలేనని, ఇంత దారుణమైన రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయలేదని రాజ్ కేసిరెడ్డి స్వయంగా చెప్పారు. అదే విషయాన్ని న్యాయస్థానంలోనూ వెల్లడించారు. సిట్ అధికారుల వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలపై మూడుసార్లు కోర్టుకు మొర పెట్టుకున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి చివరకు తమ దారికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు సాగనంపారు. రెడ్‌బుక్ అరాచకాలు, బెదిరింపులను డిస్టిలరీల యజమానులు సైతం న్యాయస్థానానికి నివేదించారు. చంద్రబాబు సూత్రధారిగా ఆడిస్తున్న ఈ కపట నాటకంలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూష, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి పావులుగా మారారు. బెదిరించడం.. వెంటాడి వెంటాడి వేధించడం.. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించడం దాకా అంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయి బెయిల్‌పై ఉన్న చంద్రబాబు.. గత ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక మద్యం విధానంపై దుష్ప్రచారం సాగిస్తూ అవే అంశాలను పాత్రధారులతో పలికిస్తున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సాగించిన మద్యం దందాను మించి ఇప్పుడు 2024లో నూతన విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసుకున్నారు. టీడీపీ సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానంపై అక్రమ కేసుతో కుయుక్తులకు పదును పెడుతున్న వైనం ఇదిగో ఇలా ఉంది... సిట్ వేధింపులపై మూడుసార్లు కోర్టుకు.. చివరికి తలొగ్గడంతో కేంద్ర సర్వీసులకు చంద్రబాబు రెడ్‌బుక్ కుట్రలో మొదటి పాత్రధారి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి. తమ కుట్రకు అనుగుణంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం ఆయన్ను తీవ్రంగా బెదిరించింది. అందుకు మొదట్లో ససేమిరా అన్న వాసుదేవరెడ్డి మూడుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తనను బెదిరిస్తున్నట్లు కోర్టుకు మొర పెట్టుకున్నారు. అయినా సరే సిట్ అధికారులు వెనక్కి తగ్గకుండా వేధించారు. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయనను డెప్యుటేషన్ కాలపరిమితి ముగిసినా రిలీవ్ చేయలేదు. చివరికి సిట్ వేధింపులకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. చంద్రబాబు కుట్రకు అనుగుణంగా.. సిట్ అధికారులు చెప్పమన్నట్లుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కుట్ర నాటకంలో తాను ఇచ్చిన పాత్రకు వాసుదేవరెడ్డి న్యాయం చేశారని చంద్రబాబు సంతృప్తి చెందారు. అంతే.. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయడం... ఢిల్లీలో కేంద్ర సర్వీసులో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ ఇద్దరూ.. కీలు బొమ్మలే బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషను సైతం చంద్రబాబు తన కుట్ర నాటకంలో పాత్రధారులుగా చేశారు. వారిని కూడా సిట్ అధికారులు భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకున్నారు. దాంతో సిట్ అధికారులు చెప్పినట్టుగా సత్యప్రసాద్, అనూష అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు.రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అనంతరం చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టారు. అది మరెవరో కాదు.. మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీ అధినేత ఆయన్ను విశ్వసించి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరో మూడున్నరేళ్లు పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికలు వస్తే రాజ్యసభ సీటును తిరిగి గెలుచుకునేంత ఎమ్మెల్యేల బలం వైఎస్సార్సీపీకి లేదని తెలిసి కూడా రాజీనామా చేయడం గమనార్హం. అంటే రాజ్యసభలో టీడీపీ కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై టీడీపీ కూటమి సర్కారు బనాయించిన అక్రమ కేసుకు ఆయన వంతపాడటం అసలు కుట్రను బట్టబయలు చేసింది. కాకినాడ పోర్టులో వాటాల బదిలీపై కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక మద్యం అక్రమ కేసు గురించి మాట్లాడారంటే దీని వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెరపైకి టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిరెడ్‌బుక్ కపట నాటకంలో చంద్రబాబు తాజాగా టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచి, వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు కావడం గమనార్హం. అందుకే ఎస్పీవై రెడ్డి కుటుంబ డిస్టిలరీకి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డి టీడీపీ కూటమిలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు సిట్ కుట్ర పన్నుతుండటం గమనార్హం. విజయవాడ ఎంపీ వ్యాపార భాగస్వామి రాజ్ కేసిరెడ్డి ఈ కుట్రలకు మరింత పదును పెడుతూ ఈ కేసులో రాజ్ కేసిరెడ్డిని ఏ 1గా చూపించారు. ఆయన ఎవరో కాదు.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామే! ఇద్దరి కంపెనీల చిరునామా, మెయిల్ ఐడీ కూడా ఒకటే కావడం గమనార్హం. అమెరికా, దుబాయ్ సహా వివిధ దేశాలకు అక్రమ నిధులు తరలించేందుకు వారిద్దరూ భాగస్వాములుగా ఏర్పాటు చేసుకున్న కంపెనీల వివరాలను చిన్ని అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల స్వయంగా వెల్లడించడం తెలిసిందే. ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకిలక్ష్మి, రాజ్ కేసిరెడ్డి ప్రైడ్ ఇన్ఫ్రా ఎల్‌ఎల్‌పీతోపాటు ఇతర వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నట్లు కేశినేని నాని స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం తెలిసిందే. ఆ అధికారులకేం సంబంధం..? చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో నిందితులుగా చేర్చడం కుట్రలకు పరాకాష్ట. ధనుంజయ్‌రెడ్డి సీఎంవోలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలను ఏనాడూ పర్యవేక్షించలేదు. ఇక ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డికి ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయినా సరే వారిని నిందితులుగా చేర్చడం విడ్డూరంగా ఉంది. సీఐడీ చేతులెత్తేయడంతో.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కేసును సీఐడీకి అప్పగించింది. మూడు నెలలపాటు దర్యాప్తు చేసిన సీఐడీ ఎలాంటి అక్రమాలూ లేవని చేతులెత్తేసింది. అయినా సరే ఇది ఎల్లో మీడియాకు పట్టదు. తరువాత టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. రోజుకో కట్టుకథ అల్లుతూ అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకుంది. కమీషన్లు టీడీపీ పెద్దలకే తెలుసు..! మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు పాలనలో 2014–19లో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున జరగగా... అనంతరం వైఎస్ జగన్ హయాంలో 2019–24 మధ్య అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది టీడీపీ పెద్దలకేనని స్పష్టమవుతోంది.సిట్ వేధింపులపై కోర్టుకు డిస్టిలరీల ప్రతినిధులుదర్యాప్తు పేరిట సిట్ అధికారులు తమను వేధిస్తుండటంపై పలు డిస్టిలరీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సిట్ అధికారులు తమను హింసిస్తున్నారని వాపోయారు. దాంతో డిస్టిలరీల ప్రతినిధులను వారి నివాసాల్లోనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరి తెగిస్తోందో చెప్పేందుకు ఈ ఉదంతమే తార్కాణం. మిథున్‌రెడ్డి సవాల్‌పై స్పందించని సర్కారు చంద్రబాబు తాను ప్రవేశపెట్టిన పాత్రధారుల ద్వారా వైఎస్సార్సీపీ కీలక నేతలపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మాత్రం స్పందించలేదు. తన నివాసంలో సమావేశమయ్యామని విజయసాయిరెడ్డి పేర్కొనటాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. అదే నిజమైతే గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిరూపించాలని మిథున్‌రెడ్డి సవాల్ చేస్తే కూటమి ప్రభుత్వం నోరు విప్పలేదు.మద్యం దోపిడీ వ్యవస్థీకృతం..రాచబాట పరిచిన టీడీపీ సర్కారు మద్యం విధానం ముసుగులో 2014–19 మధ్య భారీ దోపిడీకి కుట్ర పన్నింది చంద్రబాబు ప్రభుత్వమే. అందుకు అవసరమైన అన్ని దోపిడీ మార్గాలను పొందుపరిచింది చంద్రబాబే. భారీగా నల్లధనం వరద పారించేందుకు అవసరమైన దొంగదారులన్నిటికీ తమ ప్రభుత్వ విధానంలో స్థానం కల్పించారు. అందుకే 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. అవన్నీ యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, డీకే ఆదికేశవులు తదితర టీడీపీ నేతలకు చెందినవే కావడం గమనార్హం. బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు భారీగా పెంచి డిస్టిలరీల నుంచి కమీషన్లు కొల్లగొట్టింది. ఊరూపేరూలేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది స్వయానా చంద్రబాబే. క్షేత్రస్థాయిలో మద్యం విక్రయించే మొత్తం 4,380 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్‌కు అడ్డగోలుగా కట్టబెట్టారు. వాటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్ రూమ్‌లకు అనుమతినిచ్చారు. అంతేకాదు.. ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎంఆర్పీ కంటే బాటిల్‌పై రూ.15 నుంచి రూ.25 అధిక ధరకు మద్యం విక్రయించారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. అంటే మద్యం దోపిడీదారు చంద్రబాబే అన్నది నిగ్గు తేలుతోంది. వైఎస్సార్సీపీ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై బురద జల్లుతుండటం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది స్పష్టం. మద్యం విధానం ముసుగులో 2014–19లో చేసిన దోపిడీని చంద్రబాబు ఇప్పుడు మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం.. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల కోసం సిట్ దర్యాప్తు ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధింపులకు తెగబడుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934కి తగ్గించింది. చంద్రబాబు సర్కారు అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటైన 43 వేల బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. కొత్తగా ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సు మంజూరు చేయలేదు. ఇలా విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితేనే డిస్టిలరీలు లాభాలు గడించి కమీషన్లకు ఆస్కారం ఉంటుంది. మరి వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? మద్యం అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో తాను ఎంపిక చేసుకున్న పాత్రధారుల ద్వారా చంద్రబాబు అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అక్రమ కేసు కుట్రలు మరోస్థాయికి..అందుకే బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చిన వైనం వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు భేతాళ కుట్రకు పరాకాష్ట. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ వ్యవహారాలతో అసలు ఏమాత్రం సంబంధమే లేదు. వికాట్ అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ కంపెనీ. 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతీయ సంస్థ. యూరప్‌లో టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా ఉంది. సిమెంట్ రంగంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వికాట్ కంపెనీకి అనుబంధ సంస్థ భారతీ సిమెంట్స్. అటువంటి అంతర్జాతీయ కంపెనీకి భారత్‌లో ఆపరేషన్ల ఫైనాన్స్ డైరెక్టర్‌గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఆ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండరు. బాలాజీ గోవిందప్ప వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్. వికాట్ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన నిరంతరం తలమునకలై ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధమే లేని ఆయనకు ఐఏఎస్‌లతోగానీ ఇతర ప్రభుత్వ అధికారులతోగానీ ఎలాంటి సంబంధంగానీ, పరిచయంగానీ లేనే లేవు. ఇక రాజ్ కేసిరెడ్డితో కనీసం పరిచయం ఉండే ఆస్కారమే లేదు. పక్కా కుతంత్రంతోనే బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చారు. తద్వారా ఈ అక్రమ కేసు కుట్రను మరో స్థాయికి తీసుకువెళ్లాలన్నదే చంద్రబాబు పన్నాగం. భారతీ సిమెంట్స్‌ను ఏనాడో టేకోవర్ చేసిన వికాట్.. భారతీ సిమెంట్ కంపెనీలో మెజార్టీ వాటా వికాట్ కంపెనీకే ఉంది. మైనార్టీ వాటా మాత్రమే వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి ఉంది. కాబట్టి కంపెనీ సర్వసభ్య సమావేశ వివరాలు తెలియచేయడం, కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు వివరించడం, త్రైమాసిక ఫలితాల ముందుగానీ తరువాతగానీ తెలియజేయడం.. భారతీ సిమెంట్స్‌పై కొనసాగుతున్న సీబీఐ అక్రమ కేసుల పురోగతి వివరాలు వివరించేందుకు వైఎస్ జగన్ కుటుంబాన్ని ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. వైఎస్ జగన్ కుటుంబం వికాట్ కంపెనీలో వాటాదారు కావడంతోపాటు నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలన్నీ వివరిస్తారు. ఓ కంపెనీ తన వాటాదారులకు ఈ అంశాలను వివరించడం సర్వసాధారణ వ్యవహారం. రిలయన్స్ లాంటి కంపెనీలు కూడా తమ కంపెనీల్లో ఎక్కువ షేర్లు ఉన్నవారికి సంస్థకు సంబంధించిన పరిణామాలను తరచూ వివరిస్తూ ఉంటాయి. ఈ అంశాలను వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం పక్కా కుట్రే. వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీ సిమెంట్స్‌ను అప్రతిష్ట పాలు చేయడం, అందులో మైనార్టీ వాటాదారుగా మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పన్నిన భేతాళ కుట్రే ఇది. బాబు కుట్రలకు ఎల్లో మీడియా భజనచంద్రబాబు కుట్రలకు ఎల్లో మీడియా కోరస్ పాడుతోంది. వైఎస్ జగన్ కుటుంబానికి బాలాజీ గోవిందప్ప ఆర్థిక సలహాలు ఇస్తుంటారని దుష్ప్రచారం చేస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫ్లెక్సీ డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడులపై వైఎస్ జగన్ కుటుంబం బాలాజీ గోవిందప్ప సలహాలను ఎందుకు తీసుకుంటారు? వైఎస్ జగన్ కుటుంబానికి దశాబ్దాలుగా పవర్ ప్రాజెక్టులు, మీడియా, రియల్ ఎస్టేట్ లాంటి సొంత కంపెనీలున్నాయి. తమకు మెజార్టీ వాటా ఉన్న ఆ కంపెనీల ద్వారా ఏటా దాదాపు రూ.150 కోట్ల లాభం ప్రకటిస్తున్నారు. ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు, సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది ఆడిటర్లు, ఫైనాన్స్ డైరెక్టర్లు ఉన్నారు. ఆర్థిక సలహాల కోసం వారిని సంప్రదిస్తారు. అంతేగానీ తాను మైనార్టీ వాటాదారుగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌ను ఎందుకు సంప్రదిస్తారు? ఈ దుష్ప్రచారం అంతా కేవలం చంద్రబాబు భేతాళ కుట్రే. వాస్తవాలతో నిమిత్తంలేని ఎల్లో మీడియా ఇందులో తరిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్ జగన్ కుటుంబంపై దుష్ప్రచార కుతంత్రానికి వత్తాసు పలుకుతోంది. -
మార్గదర్శులను గుర్తించకుంటే జీతాలు కట్!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలపై చేతులెత్తేసి పీ–4 పేరుతో వంచిస్తున్న కూటమి సర్కారు ఆ బాధ్యత నుంచి సైతం తప్పుకుంటోంది! ‘జీరో పావర్టీ పీ–4’ కార్యక్రమం మార్గదర్శులను గుర్తించే బాధ్యతను గ్రామస్థాయిలో చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శుల నెత్తిన పెట్టి చేతులు దులుపుకొంటోంది. లేదంటే జీతాలు కట్ అంటూ బెదిరిస్తోంది. రాష్ట్రంలో 20 శాతం పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తెచ్చి 2029 నాటికి జీరో పేదరికం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.పేదలకు సాయం చేసేవారిని మార్గదర్శులుగా, లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబాలుగా ప్రకటించారు. ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతను చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శులపై పెట్టారు. ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరు మార్గదర్శులను గుర్తించని పక్షంలో పంచాయతీ కార్యదర్శి జీతాలను నిలిపివేస్తామంటూ పలు జిల్లాల్లో అధికారులు హెచ్చరిక నోటీసులు జారీ చేస్తున్నారు. ఎంపీడీవోలు జారీ చేస్తున్న ఈ నోటీసులతో ఉద్యోగులు విస్తుపోతున్నారు. ప్రభుత్వం తాను నిర్వర్తించాల్సిన బాధ్యతను చిరుద్యోగులపై మోపడం ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక సాయంతో కూడుకున్న వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శి చెబితే దాతలు ముందుకొస్తారా అని మండిపడుతున్నారు.రెండు నెలలు సర్వే హడావుడి..పీ–4 కార్యక్రమం పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో జనవరి–ఫిబ్రవరిలో రెండు నెలలు పాటు ఇంటింటి సర్వేలంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. ఇక మార్చి ఉగాది రోజున అమరావతిలో బహిరంగ సభ నిర్వహించి అన్ని నియోజకవర్గాల నుంచి పొదుపు మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ప్రత్యేక బస్సుల్లో తరలించింది. మరోవైపు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సొసైటీని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున పీ–4 సమన్వయకర్తలను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఖజానా నుంచి ఏడాదికి రూ.12.60 కోట్లు వారికి వేతనాల రూపంలో చెల్లించేందుకు సిద్ధమైంది.హామీలపై మభ్యపుచ్చేందుకే..పీ–4 కార్యక్రమం ద్వారా 30 లక్షల పేద కుటుంబాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా ఐదు లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వారి జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వం కృషి చేయాలి. ఒకవైపు ఇప్పటికే అమలవుతున్న పథకాలను నిలిపివేసి పేదల పొట్టగొడుతూ మరోవైపు పీ–4 పేరుతో మభ్యపుచ్చే యత్నాలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల దత్తత పేరిట హడావుడి చేయడం మినహా ఒరగబెట్టిందేమీ లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
ఆ డాక్టర్ల ఆవేదన.. అరణ్య రోదన
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఏలుబడిలో రాష్ట్రంలో చిరుద్యోగుల ఆవేదన అరణ్య రోదనగా మారింది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లలో పనిచేస్తున్న డాక్టర్లు తాజాగా ఈ జాబితాలో చేరారు. ఉద్యోగ భద్రత, వేతనాలు పెంపు వంటి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని 15 రోజులుగా సమ్మె చేస్తున్న డాక్టర్ల ఆవేదనను ప్రభుత్వం లెక్కచేయడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు షురూ..! పైగా డాక్టర్లపై తీవ్ర కక్ష సాధింపు చర్యలకూ ప్రభుత్వం దిగుతోంది. ఇందులో ఏప్రిల్‌నెల వేతనాల నిలుపుదల ఒకటి. మరోవైపు దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా రాష్ట్రంలో డాక్టర్లు రోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగి్నషన్ సిస్టమ్) వేయాలని తాజాగా ఆదేశించింది. ఎవరికీ లేనట్టుగా డాక్టర్లు వారు పనిచేస్తున్న గ్రామాల్లోనే నివాసం ఉంటున్నారన్న నిర్ధారణ కోసం రోజు రాత్రి ఎనిమిది గంటలకు ‘మొబైల్’ ఎఫ్ఆర్ఎస్ వేయాలని నిర్దేశించడం జరిగింది. దీనితోపాటు ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేల ఇన్సెంటివ్లో రూ.5 వేలు పనిచేస్తున్న గ్రామాల్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం మెలిక పెట్టింది. నిర్దేశించిన హెల్త్ ఇండికేటర్స్‌లో వీరి పనితీరు ప్రాతిపదికన మిగిలిన రూ.10 వేల ఇన్సెంటివ్ను చెల్లించడం జరుగుతోంది.సానుకూలంగా స్పందించాలి ప్రజలు పడుతున్న అవస్థలు, మా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. మాతో చర్చించి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలి. – బి. సందీప్ కుమార్, జనరల్ సెక్రటరీ, ఏపీ సీహెచ్‌వో అసోసియేషన్ ఇళ్లు గడవడం కష్టంగా ఉంది.. సమ్మె చేస్తున్నామని మా వేతనం ఆపేశారు. ఇల్లుగడవడం కష్టమై, అనేక అగచాట్లు పడుతున్నాం. రాష్ట్రం మొత్తం పనిచేస్తున్న 10,032 మంది డాక్టర్లలో 8,700 మంది వరకూ మహిళలే ఉన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా సమ్మెలో పాల్గొంటున్నారు. – ఎం. అనుపమ, అధ్యక్షురాలు, ఏపీ సీహెచ్‌వో అసోసియేషన్, పల్నాడు జిల్లా -
దళితులకు.. ‘దేశం’ వర్గం దండన
కందుకూరు: అధికార టీడీపీ పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడిచేయడమే కాక వారు గ్రామంలోకి రాకుండా.. వారికి తాగునీరు, వ్యవసాయ, ఉపాధి పనులు లేకుండా, చివరికి.. పాల కేంద్రంలో వారు పాలు కూడా పోయనీయకుండా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామంలో మైకులో బహిరంగంగా కూడా ప్రకటించారు. దీంతో.. బాధితులు రెండ్రోజులుగా అల్లాడిపోతున్నారు. పైగా.. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దప్పళంపాడు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడ్రోజుల క్రితం గ్రామంలో అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని యువకులు ఈలలు వేసుకుంటూ వెళ్లారు.ఇది చేసింది గ్రామానికి చెందిన దళిత యువకులేనని భావించిన గ్రామస్తులు మరుసటి రోజు గ్రామంలోకి వచ్చిన జడా చక్రి, చెరుకూరి కార్తీక్ (నాని) అనే యువకులపై దాడిచేసి కొట్టారు. దీంతో వారు జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పారు. దళితులంతా కలిసి తమ యువకులను ఎందుకు కొట్టారంటూ గ్రామస్తులను ప్రశ్నించారు. ఈ విషయం ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఎవరు గొడవ చేశారో వారిని పట్టుకుని నిలదీయాలేగానీ అకారణంగా తమ పిల్లలను పట్టుకుని కులం పేరుతో తిడుతూ ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ఇది ఆ గ్రామ టీడీపీ పెత్తందార్లకు కోపాన్ని తెప్పించింది. అంతే.. రెండ్రోజులుగా దళితులను గ్రామం నుంచి పూర్తిగా సాంఘిక బహిష్కరణ చేశారు. మాదిగపల్లెకు చెందిన వారెవరూ గ్రామంలోకి రావద్దంటూ, గ్రామంలో ఎవరూ వారికి తాగునీరు ఇవ్వొదని.. పొలాల్లోకి కూడా రానీయకూడదంటూ దేవాలయంపై ఉండే మైక్‌లో ప్రకటించారు.ఆర్వో ప్లాంట్ మూసివేత.. పొలాల్లో పనులకూ నో ఎంట్రీ..ఈ ప్రకటన నేపథ్యంలో.. గ్రామంలోని ఆర్వోప్లాంట్ వద్ద దళితులెవరూ నీరు పట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. ఇది తెలీక నీరు పట్టుకోవడానికి వెళ్తున్న యువకులను గ్రామస్తులు ఆపి బలవంతంగా వెనక్కి పంపారు. పైగా.. ఆర్వో ప్లాంట్‌ను పూర్తిగా మూసేశారు. అదే సమయంలో పక్క గ్రామాలకు కూడా ఫోన్‌చేసి దప్పళంపాడుకు చెందిన మాదిగలు ఎవరైనా నీరుకోసం వస్తే వారికి ఇవ్వొద్దని బెదిరించారు. దీంతో బాధితులు రెండ్రోజులుగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. వీరెవరూ పాల కేంద్రంలో పాలు పోయకుండా కూడా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆదివారం రాత్రి కొందరు దళిత మహిళలు పాలుపోయడానికి కేంద్రానికి వెళ్లగా.. ‘మీ పాలు తీసుకోం, మా వద్దకు రావొద్దు’ అని తేల్చిచెప్పారు. ఇక పొలాల్లో పనులకు దళితులు ఎవర్ని రానివ్వొద్దంటూ కట్టుబాటు పెట్టారు.మీకు ఉపాధి పనులూ లేవు.. రావద్దు..ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులకు కూడా దళితులను రానివ్వకుండా గ్రామంలోని పెత్తందారులు అడ్డుకుంటున్నారు. పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్ పైడి ప్రసాద్ ఉపాధి పనులకు వెళ్లిన మహిళలను పనులకు రావొద్దంటూ వెనక్కి పంపారు. మాదిగోళ్లు ఎవరికీ ఉపాధి పనులులేవు.. ఎవరూ పనులకు రావద్దంటూ హుకుం జారీచేశారు. దీంతో చేసేదేమీ లేక పనులకు వెళ్లిన మహిళలు ఉసూరుమంటూ ఇంటికి తిరిగొచ్చారు. ఇలా.. రెండ్రోజులుగా దప్పళంపాడు పెత్తందారులు అంతా కలిసి మాదిగపల్లెను అష్టదిగ్బంధం చేశారు.సబ్‌కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితులు..ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలీక బాధితులందరూ సోమవారం సబ్‌కలెక్టర్ తిరుమణి శ్రీపూజను ఆశ్రయించి తమ ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. ఆమె స్పందిస్తూ.. తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేస్తానని, యథావిధిగా ఆర్వో ప్లాంట్ వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాలని, అన్ని పనులు చేసుకోవాలని సూచించారు. ఉపాధి పనులకు రానీయకపోతే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే మంగళవారం గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం.. దళితులంతా కలిసి డీఎస్పీ బాలసుబ్రమణ్యంను కలిసి ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.చంపేస్తామని బెదిరిస్తున్నారు..ఈ గొడవ జరిగిన తరువాత ఉపాధి పనులకు వెళ్తే.. మాదిగోళ్లు ఎవరికీ పనులులేవు, రావొద్దంటూ ఫీల్డ్ ఆఫీసర్ చెప్పాడు. నన్ను పనిలోకి రానీయలేదు. ఇంకేమీ చేయలేక ఇంటికొచ్చేశాను. రెండ్రోజులుగా కులం పేరుతో తిడుతూ.. ‘చంపేస్తాం, మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’.. అంటూ బెదిరిస్తున్నారు. – అంగలకుర్తి ప్రభావతి, దళిత మహిళకేంద్రంలో పాలు పోయించుకోలేదు.. ఆదివారం రాత్రి పాలు పోసేందుకు గ్రామంలోని పాల కేంద్రం వద్దకు పాలు తీసుకెళ్లాను. మీ పాలు మేం తీసుకోం. మాదిగలు పాలుపోయడానికి రావొద్దంటూ కేంద్రం నుంచి వెనక్కి పంపించేశారు. దీంతో చేసేదేమి లేక ఇంటికొచ్చేశాను. – కంకిపాటి మేరి, దళిత మహిళమంచినీళ్లు తెచ్చుకోకుండా ప్లాంట్ ఆపేశారు..రెండ్రోజులుగా పూర్తిగా మంచినీళ్లు ఆపేశారు. ఆర్వో ప్లాంట్ వద్దకు రానీయకుండా ట్రాక్టరు అడ్డుపెట్టి అడ్డుకుంటున్నారు. అదేమని అడిగితే.. ‘ప్లాంట్ మాది, మీకు నీళ్లులేవు’.. అంటూ చెబుతున్నారు. అంతేకాక.. చుట్టుపక్కల గ్రామాలకు ఫోన్‌చేసి మాదిగోళ్లు వస్తే ఎవరూ నీళ్లు ఇవ్వొద్దంటూ చెబుతున్నారు. నీళ్లులేక రెండ్రోజులుగా అల్లాడుతున్నాం.– చెరుకూరి ఏసు, దళితుడు -
డీజీపీ అపాయింట్మెంట్ కోరిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దాంతో పాటు, యథేచ్ఛగా సాగుతున్న పోలీసుల అక్రమ అరెస్టులు, వేధింపులపై వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి రాసిన లేఖను పార్టీ ప్రతినిధులు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.మాజీ మంత్రి విడదల రజినిపై సీఐ దౌర్జన్యంగా వ్యవహరించిన నేపథ్యంలో, రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న శాంతి భద్రతలు, విపక్షంపై సాగుతున్న పోలీసులు వేధింపులు, అక్రమ అరెస్టులు.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదంగా మారుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంకా అవన్నీ కచ్చితంగా పౌరుల హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. వీటన్నింటిపై వినతి పత్రం సమర్పించేందుకు డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలని తమ లేఖలో కోరారు. -
కక్ష సాధింపు కోసమేనా పోలీసులు?.. ఇది దేనికి సంకేతం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ.. రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతిభద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఉదాహరణలతో సహా సమావేశంలో ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని పలువురు నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనంను ప్రజలు ముందు పెట్టేందుకు వైఎస్సార్సీపీ ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణ అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఎన్ని సార్లు డీజీపీ అపాయింట్మెంట్ కోరినా స్పందించపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ సీరియస్‌గా తీసుకుంటోందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, వేమారెడ్డి, పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ఎగనామం.. పెద్ద సార్లకు అందలం
సాక్షి, అమరావతి: అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్నట్టుగా తయారైంది ఆర్టీసీలో పదోన్నతుల వ్యవహారం. దాదాపు 47 వేల మంది ఆర్టీసీ సాధారణ ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కేవలం వందలోపు ఉండే ఉన్నతాధికారులకు మాత్రం అత్యంత సరళతర విధానంలో పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతుల కోసం మెరిట్ రేటింగ్ రిపోర్ట్స్ (ఎంఆర్ఆర్) విధానం అమలులో ఉండేది.దీన్ని కాదని ప్రభుత్వ ఇతర శాఖల ఉద్యోగుల పదోన్నతుల కోసం అమలు చేస్తున్న ‘యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ (ఏసీఆర్) విధానాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ విధానాన్ని ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పని విధానానికి, ఆర్టీసీలో పని విధానానికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఎంతో తీవ్రమైన అంశాలకే మెమోలు జారీ చేస్తారు. కానీ ఆర్టీసీలో చిన్న చిన్న అంశాలకు కూడా మెమోలు ఇస్తారు. ఆర్టీసీ బస్సుల సమయ పాలన, ట్రాఫిక్ ఇబ్బందులు ఇతరత్రా అంశాల దృష్ట్యా ఈ విధానాన్ని పాటిస్తుంటారు. కానీ ఆ మెమోలను ఉద్యోగుల పనితీరుకు ప్రతికూల అంశంగా పరిగణించరు. సర్వసాధారణ అంశంగానే చూస్తారు. ఈ లెక్కన ఎంఆర్ఆర్ విధానంలో పదోన్నతుల కల్పనకు ఈ మెమోలు ప్రతిబంధకం కావు. కానీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీఆర్ విధానంలో మాత్రం ఆ మెమోలను తీవ్రంగా పరిగణిస్తారు.తద్వారా ఉద్యోగుల పనితీరు సరిగా లేదని పదోన్నతులు, ఇతర ప్రోత్సాహకాలను నిరాకరిస్తారు. అందుకే ఆర్టీసీ ఉద్యోగులు ఏసీఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమకు ఎంఆర్ఆర్ విధానంలోనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం నిర్వహించిన డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీ (డీపీసీ) సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు కొత్తగా ఏసీఆర్ విధానంలోనే పదోన్నతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఏసీఆర్ నివేదికలు రూపొందించనందున ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులను వాయిదా వేశారు.ఉన్నతాధికారులకు మాత్రం ఎంఆర్ఆర్!రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఆర్టీసీలో ఆరు కేటగిరీల ఉన్నతాధికారులకు మాత్రం గతంలో అనుసరించిన ఎంఆర్ఆర్ విధానంలోనే పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ఆర్టీసీ అత్యున్నత అధికారులైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీజనల్ మేనేజర్లు సీనియర్ స్కేల్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్లు, డిప్యూటీ అకౌంట్స్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు ఎంఆర్ఆర్ విధానంలోనే పదోన్నతులు కల్పించేందుకు అనుమతినిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కింది స్థాయిలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు మొదలైన వారికి కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీఆర్ విధానంలోనే పదోన్నతులు కల్పిస్తామని స్పష్టం చేసింది. తద్వారా 47 వేల మంది ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు భంగం వాటిల్లనుంది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'పాత'రేయడం మేలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఇంధన వనరులు దొరకడం లేదు. ఇప్పుడున్న వనరులు కూడా కొన్నేళ్లకు తరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు ఇంధన వనరులతోపాటు స్వచ్ఛమైన వాతావరణాన్ని కూడా అందించడం కోసం ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.పాత వాహనాలను వదిలేసి విద్యుత్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని పెంచడం ద్వారా ఆయా దేశాలు, ముఖ్యంగా మన దేశం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(టీఈఆర్ఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 10 లక్షల మంది, అంతకన్నా ఎక్కువ జనాభా గల నగరాలు 44 ఉన్నాయి. ఈ నగరాల్లో పాత వాహనాల స్థానంలో ఈవీలను ఉపయోగించడం వల్ల 2035 నాటికి విదేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటున్న చమురు ఖర్చులో రూ.9.17 లక్షల కోట్లను తగ్గించవచ్చని టీఈఆర్ఐ నివేదిక స్పష్టం చేసింది.⇒ 49 లక్షలు: దేశంలో 2024 నాటికి 10 లక్షలు జనాభా గల 44 నగరాల్లో ఉన్న పాత వాహనాలు. 2030 నాటికి ఈ సంఖ్య 75లక్షలకు పెరుగుతుంది ⇒37 శాతం: నగరాల్లో వాయు కాలుష్యంలో పాత వాహనాల నుంచి వచ్చే వాటా⇒రూ.9.17 లక్షల కోట్లు: 44 నగరాల్లో పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకొస్తే 2035 నాటికి తగ్గనున్న ఇంధన దిగుమతి ఖర్చు⇒ 3.7 లక్షలు: పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకురావడం వల్ల 2035 నాటికి లభించే కొత్త ఉద్యోగాలు టీఈఆర్ఐ అధ్యయనం ఇంకా ఏం చెప్పిందంటే...⇒ మన దేశంలోని పెద్ద నగరాల్లో వాయు కాలుష్యానికి పాత వాహనాలు ప్రధాన కారణమవుతున్నాయి. నగరాల్లోని వాయు కాలుష్యంలో పాత వాహనాల వాటా 37 శాతం. నగరాల్లో 2035 నాటికి పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకురావడం వల్ల కర్బన ఉద్గారాలు బాగా తగ్గుతాయి. గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. ⇒ కనీసం 10 లక్షల జనాభా గల 44 నగరాల్లో 2024లో పాత వాహనాల సంఖ్య 4.9 మిలియన్ (49 లక్షలు). ఆ సంఖ్య 2030 నాటికి 7.5 మిలియన్ (75 లక్షలు)కు పెరుగుతుంది. ⇒ ఈ నగరాల్లోని పాత వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మారడం వల్ల 2035 నాటికి రోజూ 11.5 టన్నుల (పరి్టక్యులర్ మీటర్ 2.5) వాయు కాలుష్య కణాలను నివారించవచ్చు. 61 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చు.⇒ 2035 నాటికి 51 బిలియన్ లీటర్లకు పైగా పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది. చమురు దిగుమతి ఖర్చు రూ.9.17 లక్షల కోట్లు మిగులుతుంది. ⇒ ముఖ్యంగా పాత డీజిల్ బస్సులు అతిపెద్ద కాలుష్య కారకాలని టీఈఆర్ఐ అధ్యయనం తెలిపింది. పాత బస్సులను నిలిపేస్తే పీఎం 2.5 ఉద్గారాలు 50శాతం, నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు 80శాతం తగ్గే అవకాశం ఉంది. ⇒ పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకొచ్చేందుకు 44 నగరాల్లో 45వేల కంటే ఎక్కువ పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు, 130 వాహన స్క్రాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ⇒ పాత వాహనాల్లో సగం సీఎన్జీకి మార్చితే సుమారు 2,655 కొత్త సీఎన్జీ స్టేషన్లు అవసరమవుతాయి.⇒ ఈ విధంగా చేస్తే 2035 నాటికి విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో దాదాపు 3.7 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. -
అమానుషం.. అమానవీయం
తిరుపతి మంగళం/నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట)/ సాలూరు/ బద్వేలుఅర్బన్/సాక్షి, నరస రావుపేట/ పెదకూరపా డు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విడదల రజని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానుషం, అమానవీయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు సైతం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ మెప్పు పొందేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు.చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు.. మాజీ మంత్రి, బీసీ నేత అని కూడా చూడకుండా విడదల రజని పట్ల ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. సీఐ గారూ.. సీఐ గారూ.. అని ఆమె పదే పదే గౌరవంగా మాట్లాడుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆమెను కారు నుంచి కిందకు లాగేయడం ఎంత దుర్మార్గం.. అని ప్రశ్నించారు. ఇటీవల గుంటూరు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలి పట్ల కూడా అర్ధరాత్రి పోలీసులు దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కూటమి నాయకుల బెదిరింపులకు, కక్ష సాధింపులకు, కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నా భయపడేది లేదని రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నంబూరు శంకరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని, కార్యకర్తలకు తామంతా అండగా ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన కీచకపర్వాన్ని తలపిస్తోందని వైఎస్సారీసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ మహిళా నేతలతో కలసి నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేలా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజని పట్ల పోలీసుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మహిళ మంత్రి విడదల రజని పట్ల పోలీసుల తీరు సరికాదని ఖండించారు.కొందరు పోలీసు అధికారులు సభ్యత, సంస్కారాలు మరచి వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ అన్న కనీస గౌరవ మర్యాద లేకుండా సీఐ అనుచితంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
గోదా‘వర్రీ’!
జీవ నది గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. మానవ తప్పిదాల వల్ల గోదావరి జలాలు కలుషితమయ్యాయని.. ఈ నీటిని నేరుగా తాగడం శ్రేయస్కరం కాదని కేంద్ర జల సంఘం–కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం వెల్లడించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల కంటే గోదావరి జలాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపింది.సాక్షి, అమరావతి: గోదావరి నీటిని శుద్ధి చేయకుండా నేరుగా తాగడం శ్రేయస్కరం కాదా? నదీ జలాల్లో కాలుష్యం తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుందా? మానవ తప్పిదాల వల్లే గోదావరి కాలుష్య కాసారంగా మారిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)– కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) అధ్యయన నివేదిక. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాల కంటే గోదావరి జలాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు ఆ రెండు సంస్థల సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది.పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద సముద్రమట్టానికి 1,067 మీటర్ల ఎత్తులో జన్మించిన గోదావరి ప్రధాన పాయ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా 1,465 కి.మీ.ల దూరం ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి ప్రధాన పాయలో ఎడమ వైపు నుంచి పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి.. కుడి వైపు నుంచి ప్రవర, మంజీర, మానేరు ప్రధాన ఉప నదులు కలుస్తాయి. గోదావరి నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో గోదావరి బేసిన్ 9.5 శాతం. దేశంలో అతి పెద్ద నదుల్లో గోదావరి రెండో స్థానంలో ఉంది.జల కాలుష్యానికి ప్రధాన కారణాలు ఇవీ...⇒ గోదావరి బేసిన్లో భారీ ఎత్తున పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. సాగు భూమి విస్తీర్ణమూ ఎక్కువే. ⇒ పారిశ్రామిక వ్యర్థాలను, వ్యర్థ జలాలను యథేచ్ఛగా గోదావరితోపాటు ఉప నదులు, వంకలు, వాగుల్లోకి వదిలేస్తున్నారు. ⇒ పంటల సాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. వర్షపు నీటితో రసాయన ఎరువులు, క్రిమిసంహారక ముందులు కలిసి గోదావరిని కలుషితం చేస్తున్నాయి.⇒ గోదావరి బేసిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగునీటిని శుద్ధి చేయకుండా యథేచ్ఛగా వదిలేస్తుండటం వల్ల ఆ జలాలు వర్షపు నీటితో కలిసి గోదావరిలోకి చేరుతున్నాయి.⇒ పశ్చిమ కనుమల్లో భారీ ఎత్తున అడవులను నరికివేస్తుండటంతో భూమి కోతకు గురవుతోంది. అడ్డగోలుగా గనులను తవ్వేస్తుండటం వల్ల వర్షపు నీటి ద్వారా కాలుష్యం గోదావరికి చేరుతోంది.⇒ వీటన్నింటినీ పరిశీలిస్తే కేవలం మానవ తప్పిదాల వల్లే గోదావరి నది కాలుష్య కాసారంగా మారినట్లు స్పష్టమవుతోంది.నేరుగా తాగితే రోగాలే..బీఐఎస్ ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో ఫీకల్ కోలీఫామ్(ప్రమాదకర బ్యాక్టీరియా) ఆనవాళ్లు ఉండకూడదు. కానీ, గోదావరి జలాల్లో ఫీకల్ కోలీఫామ్ మిల్లీలీటర్‌కు మూడు నుంచి నాలుగు వరకూ ఉన్నట్లు మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఇక టోటల్ కోలీఫామ్(బ్యాక్టీరియా) లీటర్ నీటిలో 50 లోపు ఉండొచ్చు. గోదావరి జలాల్లో మాత్రం లీటర్ నీటిలో 64 నుంచి 120 బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది.బీఐఎస్ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో ఘనవ్యర్థాలు(టీడీఎస్) 0.5 గ్రాములు కలిసి ఉన్నప్పటికీ ఆ నీటిని తాగవచ్చు. గోదావరి జలాల్లో లీటర్ నీటిలో నరసాపురం, ఎదుర్లంక వద్ద 24.344 నుంచి 31.428 గ్రాముల మేర ఘనవ్యర్థాలు కరిగినట్లు పరీక్షల్లో వెల్లడైంది. సంప్రదాయ పద్ధతుల్లో గోదావరి జలాలను శుద్ధి చేయకుండా తాగితే కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.బీఐఎస్ ప్రమాణాల మేరకు తాగునీటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు1.పీహెచ్ 6.5 నుంచి 8.5 శాతం లోపు ఉండొచ్చు (పీహెచ్ 7 ఉంటే స్వచ్ఛమైన నీటి కింద లెక్క)2.డిజాల్వ్డ్ ఆక్సిజన్ (డీవో) లీటర్ నీటిలో 6 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి3.బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) లీటర్ నీటికి 2 మిల్లీ గ్రాముల్లోపు ఉండొచ్చు4.టోటల్ కోలీఫామ్ (బ్యాక్టీరియా) 100 మిల్లీ లీటర్ల నీటిలో 50లోపు ఉండొచ్చు5.ఫీకల్ కోలీఫామ్(ఎఫ్‌సీ) అనేది ప్రమాదకర బ్యాక్టీరియా. ఇది 100 మిల్లీలీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు6.టీడీఎస్(టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్) లీటర్ నీటికి 500 మిల్లీగ్రాములలోపు ఉండొచ్చు -
భానుడి భగభగ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఆదివారం 144కు పైగా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబోంతులో అత్యధికంగా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా ఓజిలి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేటలో 41.8 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, చిత్తూరు జిల్లా పిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.సోమవారం కూడా పలుచోట్ల 42 డిగ్రీల నుంచి 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. మరోవైపు అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
‘ఆసరా’కు ఎసరు.. బాలింతలకు కొసరు
సాక్షి, అమరావతి: ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం అందిస్తాం’.. అంటూ ఎన్నికలకు ముందు ఎన్నో సాధ్యంకాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటీ అమలుచేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే రూ.ఐదు వేల ఆసరా సాయానికీ మంగళం పాడేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో బాలింతకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. కానీ, గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండికొట్టి ఏకంగా రూ.5 వేలు చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ.. కేవలం రూ.వందలు విలువచేసే సబ్బు, పౌడర్ డబ్బాలతో కూడిన బేబీ కిట్ ఇస్తామంటూ ప్రకటించింది.ఐదేళ్లలో 15 లక్షల మందికి అన్యాయం..రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద మూడు లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో రూ.5 వేలు చొప్పున బ్యాంకులో జమచేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంతో ఏటా మూడు లక్షల చొప్పున లెక్కేసినా 2024–29 మధ్య ఐదేళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోతుంది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఐదేళ్లలో కనిష్టంగా రూ.750 కోట్లను పేద, మధ్యతరగతి బాలింతలు నష్టపోతున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మొదటి ఏడాదిలో రూ.5 వేలు చొప్పున ఇప్పటికే బాలింతలకు దాదాపు రూ.150 కోట్ల మేర కోల్పోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సక్రమంగా తమకు ఆసరా సాయం అంది ఉండేదని వీరు చెబుతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో పేదింటి మహిళలకు నష్టం చేకూర్చి కేవలం రూ.వందలు విలువచేసే కిట్లు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు.కిట్ల కొనుగోలులోనూ లూటీ తంతు?ఇక ఆస్పత్రులకు మందుల సరఫరా.. అత్యవసర వైద్యసేవల కల్పన.. రోగనిర్ధారణ.. ఇలా వివిధ రకాల కాంట్రాక్టులను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అవినీతిమయంగా మార్చేశారు. అయినవాళ్లు, పెద్ద మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇదే తంతు బేబీ కిట్ల కొనుగోలులోనూ చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే బేబీ కిట్లు సరఫరా చేసే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఓ అమాత్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆ అమాత్యుడి సిఫార్సుతో వీరు వైద్యశాఖను సంప్రదించినట్లు సమాచారం. -
రేపు కల్లి తండాకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాలో పర్యటించనున్నారు.ఉదయం 11.30 గంటలకు కల్లి తండాలోని వీర జవాన్ మురళీ నాయక్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరుతారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల ఇప్పటికే సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్... కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. -
ఎల్లుండి కల్లితండాకు వైఎస్ జగన్
తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎల్లుండి(మంగళవారం, మే 13వ తేదీ)కల్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. దీనిలో భాగంగా 13వ తేదీన కల్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందగా, ఈరోజు(ఆదివారం) సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిన్న(శనివారం) బెంగళూరు నుంచి కల్లి తండాకు వీర జవాన్ మురళీ నాయక్ పార్ధివదేహాన్ని తరలించగా, నేడు అంత్యక్రియలు నిర్వహించారు. -
Mother's Day: మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి. ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.. అమ్మ’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Happy Mother’s Day to all the incredible mothers. Your love, strength, and sacrifice are immeasurable. Today, we honor you for all that you do.Happy Mother’s Day Amma!#MothersDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 11, 2025 -
కొనేవారేరీ..!
పెండలం ధర ప్రస్తుతం పూర్తిగా పతనమై, కిలో రూ.4 పలుకుతోంది. దుంపను తవ్వడానికి కిలోకు రూ.3 వరకూ ఖర్చవుతోందని, ప్రస్తుత పరిస్థితిలో దుంప తవ్వితే కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు రూ.2 లక్షల వరకూ నష్టం వస్తోందని చెబుతున్నారు. ధర బాగుంటే ఎకరాకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం వస్తుందని అంటున్నారు.దేవరపల్లి: భూమి నుంచి తవ్వి తీసే సమయం దాటిపోతున్నా.. కొనే నాథుడు లేక పెండలం దుంపలు చేలల్లోనే ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత రెండేళ్లూ మార్కెట్లో పెండలం దుంపలకు మంచి గిరాకీ ఉండేది. గణనీయంగా దిగుబడులు వచ్చేవి. మార్కెట్లో గిట్టుబాటు ధర పలికేది. దీంతో రైతులకు నాలుగు డబ్బులు మిగిలేవి. దీంతో చిన్న, సన్నకారు రైతులు ఉన్న కొద్దిపాటి భూములతో పాటు కౌలుకు తీసుకుని ఈ ఏడాది పెండలం సాగు చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల, కురుకూరుతో పాటు కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో సుమారు 1,200 ఎకరాల్లో పెండలం సాగు జరుగుతోంది. పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లోని రైతులు సుమారు 30 ఏళ్లుగా పెండలం సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ రెండు గ్రామాల్లోనూ సుమారు 600 ఎకరాల నల్లరేగడి భూముల్లో వాణిజ్య పంటగా పెండలం సాగు జరుగుతోంది. పల్లంట్ల దుంపకు డిమాండ్ పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో పండే పెండలం దుంపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడి దుంప మంచి సైజుతో పాటు నాణ్యత ఉంటుంది. 2 నుంచి 5 కిలోల దుంప తయారవుతుంది. కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి పెండలం దుంప కొనుగోలు చేసి, ఒడిశాకు ఎగుమతి చేస్తారు. ఒడిశాలో పెండలాన్ని వివాహాలకు ఎక్కువగా వినియోగిస్తారని, ప్రతి ఇంటికీ 10 నుంచి 20 కిలోల దుంపలు సారెగా పంచి పెడతారని రైతులు చెప్పారు. ఈ ప్రాంతంలో పండిన ప్రతి కిలో దుంప అక్కడికే వెళ్తుందని తెలిపారు. అయితే, ఈ ఏడాది ఒడిశాలో రైతులు పెండలం సాగు చేయడంతో పాటు అక్కడ వినియోగం తగ్గడం వల్ల డిమాండ్ తగ్గినట్లు సమాచారం. చేలల్లోనే ఎండిపోతూ.. తీగ జాతి పంట అయిన పెండలం దుంప భూమిలోనే తయారవుతుంది. ఏటా జూన్, జూలై నెలల్లో పెండలం సాగు ఆరంభిస్తూండగా.. జనవరి నుంచి మే నెలాఖరు వరకూ దిగుబడి వస్తుంది. ఒక్కో దుంప 2 నుంచి 5 కిలోల వరకూ బరువుంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది దిగుబడులు బాగున్నాయని, ధర 10 టన్నులకు రూ.40 వేలకు పడిపోయిందని, అయినప్పటికీ అడుగుతున్న నాథుడే లేడని రైతులు వాపోతున్నారు. దీంతో, దుంప చేలల్లోనే ఎండిపోతోందని ఆవేదన చెందుతున్నారు. ఇటీవలి వర్షాలకు దుంప చివర కుళ్లిపోతోందని, అక్కడక్కడ మొలకలు వస్తున్నాయని, దీనివలన ధర మరింత పతనమవుతుందని చెబుతున్నారు. కుళ్లిన దుంపలను శుభ్రం చేయడానికి దుంపకు రూ.2 ఖర్చవుతుంది. మరో రెండు నెలల్లో కొత్త పంట వేసే సమయం వస్తోంది. ఈ తరుణంలో భూమిలో ఉన్న పంటను చూసి రైతులు దిగులు చెందుతున్నారు. కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ పెండలం ధరల పతనంతో కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక్కో రైతు 5 నుంచి 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పెండలం దుంప సాగు చేశారు. ఎకరా కౌలు రూ.50 వేలు కాగా, పెట్టుబడి మరో రూ.లక్ష వరకూ అయ్యింది. ప్రస్తుత పరిస్థితిలో కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.భూమిలోనే ఉండిపోతోంది నేను 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పెండలం సాగు చేశాను. కౌలు రూ.5 లక్షలు, పెట్టుబడి రూ.10 లక్షలు అయ్యింది. సాధారణంగా తయారైన దుంపను ఫిబ్రవరి నుంచి మే నెలలోగా భూమి నుంచి తవ్వి, మార్కెట్‌కు పంపాల్సి ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ కిలో దుంప కూడా తీయలేదు. తయారైన దుంప భూమిలోనే ఉండిపోతోంది. ఇటీవలి వర్షాలకు దుంప కుళ్లిపోయి, మొలకలు వస్తున్నాయి. పరిస్థితి అర్ధం కావడం లేదు. గత రెండేళ్లూ పెండలం ధర లాభదాయకంగా ఉంది. 2023 పంట కాలంలో 10 టన్నుల దుంప రూ.5 లక్షలు పలికింది. గత ఏడాది రూ.45 వేలు పలికినప్పటికీ కొద్దిపాటి లాభంతో ఒడ్డున పడ్డాం. – నూతలపాటి వెంకట రమణ, రైతు, పల్లంట్ల నిండా మునిగిపోయాందుంప ధర దారుణంగా పతనమైంది. గత ఏడాది 10 టన్నుల ధర రూ.45 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.40 వేలు పలుకుతోంది. అయినప్పటికీ అమ్ముదామంటే కొనే వారే కనిపించడం లేదు. వ్యాపారులు రావడం లేదు. ఎక్కడి దుంపలు అక్కడే భూమిలో ఉండిపోయాయి. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. నేను 4 ఎకరాల్లో పెండలం సాగు చేశాను. ఇప్పటి వరకూ కేజీ దుంప కూడా బోణీ కాలేదు. పెండలం రైతు నిండా మునిగిపోయాడు. – కూచిపూడి గంగాధర్, రైతు, పల్లంట్ల -
లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని మధ్య తరగతి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు డిమాండ్ చేసింది. విజయవాడలో శనివారం ఈ సదస్సు జరిగింది. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం రూ.26 వేలు, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్మెంట్ చేపట్టాలని సదస్సు డిమాండ్ చేసింది. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాల రద్దుతో పాటు ఇతర డిమాండ్లతో ఈ నెల 20న దేశ వ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్పొరేట్‌కు వత్తాసు పలికేందుకే లేబర్ కోడ్.. మధ్యతరగతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వినర్ ఆర్.అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరపకుండా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను దొడ్డిదారిన తీసుకుకొచి్చందన్నారు. లేబర్ కోడ్ అమల్లోకి వస్తే ఇప్పుడున్న అనేక హక్కులను కార్మికులు, ఉద్యోగులు, కోల్పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు వై.శ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూ్యరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి.కిశోర్‌కుమార్, బెఫీ నాయకుడు ఎస్.వి.రమణ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్.కృష్ణబాలాజీ, విద్యుత్ సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్.రాజు, బ్యాంక్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు నర్సింహం, బీమా ఉద్యోగ సంఘం నాయకుడు కళాధర్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
తగ్గనున్న వరి, గోధుమ, మొక్కజొన్న దిగుబడి
సాక్షి, అమరావతి: దేశంలో వాతావరణ మార్పులు వరి, గోధుమ, మొక్కజొన్న దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అధ్యయనంలో తేలింది. అధ్యయన వివరాలను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భూసారం, వర్షపాతం, పంట దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావం అంచనా కోసం ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. అధ్యయనంలో కొన్ని ముఖ్యాంశాలు.. » వాతావారణ మార్పులతో ఖరీఫ్‌లో వర్షపాతం 2050 నాటికి 10.1 శాతం వరకు పెరగవచ్చు. 2080 నాటికి 18.9 శాతం పెరిగే అవకాశం ఉంది. రబీల్లో కూడా 2050 నాటికి 17 శాతం, 2080 నాటికి 26 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అసమాన, భారీ వర్షపాతాలు దిగుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. » లవణీయతకు (నీటిలో కరిగిన ఉప్పు శాతం) లోనయ్యే భూముల విస్తీర్ణం 2030 నాటికి 6.7 మిలియన్ హెక్టార్ల నుండి 11 మిలియన్ హెక్టార్ల మేర పెరుగుతుంది. » వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోకపోతే వర్షాధారిత వరి దిగుబడి 2050 నాటికి 20 శాతం, 2080కి 47 శాతం మేర తగ్గుతుంది. నీటి పారుదల ఆధారిత వరి దిగుబడి 2050 నాటికి 3.5 శాతం, 2080 నాటికి 5 శాతం మేర పడిపోతుంది. గోధుమ దిగుబడి కూడా 2050 నాటికి 19.3 శాతం, 2080 నాటికి ఏకంగా 40 శాతం మేర తగ్గుతుంది. ఖరీఫ్ మొక్కజొన్న దిగుబడి 2050 నాటికి 19 శాతం వరకు, 2080 నాటికి 20 శాతం వరకు తగ్గుతుంది. తగిన చర్యలు తీసుకుంటున్నాం: వ్యవసాయ శాఖవాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ రంగంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ సాంకేతికత అభివృద్ధి, పంట వైవిధ్య, భూసార పరిరక్షణ, సమగ్ర నీటి లభ్యతా చర్యలు చేపట్టినట్లు వివరించింది. 76 ప్రోటోటైప్ ఇంటిగ్రేటెడ్ ఫారి్మంగ్ సిస్టమ్ నమూనాలను ఐసీఏఆర్ అభివృద్ధి చేసినట్లు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. -
ట్రిపుల్ ఐటీలకు జూన్ 30 వరకు వేసవి సెలవులు
నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈ నెల 15 నుంచి జూన్ 30 వరకు వేసవి సెలవులను ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటికే పరీక్షలు ముగియడంతో పీయూసీ ద్వితీయ, ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాల విద్యార్థులు క్యాంపస్‌లను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు.పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో వారు మాత్రమే క్యాంపస్‌ల్లో ఉన్నారు. ట్రిపుల్ ఐటీల సిబ్బందికి ఈ నెల 18 నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. -
మన వెలుగులు భద్రం
సాక్షి, అమరావతి: యుద్ధంలో సైబర్ దాడులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయనేది రష్యా–ఉక్రెయిన్ యుద్ధం రుజువు చేసింది. ఒక దేశాన్ని చావుదెబ్బ కొట్టాలంటే ఆయుధాలతో కాకుండా సైన్స్, టెక్నాలజీతో సాధ్యమవుతుందని అనేక దేశాల్లో జరుగుతున్న పరిణామాలతో నిరూపితమైంది. మన దేశంలోనూ పవర్ గ్రిడ్లకు సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ సైబర్ దాడికి పాల్పడి భారతదేశ విద్యుత్ గ్రిడ్‌లో 70 శాతం నిలిపివేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దానిని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. సైబర్ దాడి అనేది పూర్తిగా అవాస్తవమంటూ పీఐబీ ఫ్యాక్ట్–చెక్‌లో ట్వీట్ చేసింది. అయితే విద్యుత్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇంధనరంగ నిపుణులు అంటున్నారు. పవర్ ఐలాండ్ సిస్టమ్‌తో పరిష్కారంపవర్ ఐలాండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం కేంద్రం నిర్ణయించింది. సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్(సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్థల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. సీఈఏ గతేడాది విద్యుత్ రంగంలో సైబర్ సెక్యూరిటీపై కొత్త నిబంధనల్ని తెచ్చింది. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్త్రన్, నార్త్ ఈస్త్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్ల కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి పవర్ ఐలాండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఈఏ ప్రతిపాదించింది. పవర్ ఐలాండ్ సిస్టమ్ అనేది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరుచేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీని వల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాటురాష్ట్ర విద్యుత్ రంగంలో కచ్చితంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఐఎస్ఓ)ను నియమించాలి. భారత పౌరసత్వం కలిగిన సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులను సీఐఎస్‌ఓగా నియమించాలి. వారు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అలాగే ప్రతి విద్యుత్ సంస్థ సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్(సీసీఎంపీ)ని అభివృద్ధి చేసుకోవాలి. విద్యుత్ రంగంలోని కంప్యూటర్లలో సాఫ్ట్వేర్లు హ్యాకింగ్‌కు గురికాకుండా అడ్వాన్స్ ఫైర్‌వాల్స్, డిటెక్షన్ సిస్టమ్(డీఎస్), ప్రివెన్షన్ సిస్టమ్(పీఎస్)ను తయారు చేయాలి. ట్రస్టెడ్ వెండర్ సిస్టమ్‌ను కూడా కచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా మాల్వేర్ కంప్యూటర్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వీటన్నిటిపైనా ఐటీ, టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సీఈఏ వెల్లడించింది. కానీ ఇవన్నీ ఇంకా పూర్తి ఆచరణలోకి రాలేదు.గత ప్రభుత్వం పటిష్ట చర్యలు కేవలం పవర్ గ్రిడ్లే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు కూడా అంతర్గత సమాచార రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్ర ఇంధనశాఖ అనుసరించిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది.దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ఫిజికల్ పొజిషన్ ఎలా ఉందనేది ఈ జీఐఎస్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా గ్రిడ్ భద్రతకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. -
పేదల ‘ఉపాధి’పై దెబ్బ
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. 27 లక్షల శ్రామికుల కుటుంబాలకు రూ.800 కోట్ల మేర కూలీ డబ్బులు బకాయిలుండటంతో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పథకం కింద పని చేసే దాదాపు 15 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది మూడు నెలలుగా వేతనాలు అందక విలవిల్లాడిపోతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరకని ప్రస్తుత వేసవి రోజుల్లో ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవించే పేదల పరిస్థితి దయనీయంగా తయారైంది.నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేసే శ్రామికులకు గరిష్టంగా 15 రోజుల లోపే వారి పనికి సంబంధించిన కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 లక్షల పేద కుటుంబాలకు సంబంధించిన 39 లక్షల మంది పేదలకు నెల రోజులుగా చేసిన పనులకు కూలీ డబ్బులు చెల్లించ లేదు. ఇలాగైతే ఎలా అంటూ వ్యవసాయ కారి్మక సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు.. మెటీరియల్ కేటగిరిలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తదితర పనులు చేసిన వారికి రూ.2,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఉపాధి హామీ పథకం కార్యక్రమాల పర్యవేక్షణకు మండల కంప్యూటర్ సెంటర్ల(ఎంసీసీ)లో పని చేసే టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏ) మొదలు రాష్ట్ర స్థాయి కార్యాలయంలో పనిచేసే దాదాపు ఏడు వేల మంది వివిధ స్థాయిల ఎఫ్‌టీఈ ఉద్యోగుల వరకు ఫిబ్రవరి నెల వేతనం ఇప్పటి వరకు చెల్లించలేదని ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. గ్రామ స్థాయిలో ఉపాధి హామీ పథకం పనులను నిత్యం పర్యవేక్షించే ఫీల్డు అసిస్టెంట్లకు, రాష్ట్ర స్థాయి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే కొన్ని కేటగిరీల ఉద్యోగులు 8 వేల మందికి మార్చి నెల నుంచి వేతనం ఇవ్వలేదు. మొత్తంగా 15 వేల మందికి జీతాలు ఇవ్వక పోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. మితిమీరిన అధికార పార్టీ నేతల ఆగడాలు గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు పనులు కల్పించే ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం మితిమీరిపోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే అప్పటిదాకా గ్రామాల్లో ఉపాధి పథకం ఫీల్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిలో అత్యధికులను ఏకపక్షంగా తొలగించి, ఆ స్థానాల్లో కూటమి పార్టీల సానుభూతిపరులను నియమించారు. గ్రామాల్లో పార్టీల వారీగా పనులు కేటాయిస్తున్నారని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి.కేవలం అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారికి మాత్రమే పనులు కల్పించాలని ఒత్తిళ్లు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు, ప్రభుత్వం సైతం కొత్తగా గ్రూపుల వారీగా మాత్రమే పనులు కల్పించాలని నిర్ణయం తీసుకోవడంతో కొన్ని గ్రూపులకు పనులు కేటాయించడం లేదని విమర్శలున్నాయి. కొద్ది రోజుల కిత్రం.. అనకాపల్లి జిల్లా మామిడపాలెం గ్రామంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాదాపు 350 మంది కూలీలకు స్థానిక సిబ్బంది పనులు కల్పించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్ఎల్ పురం గ్రామానికి చెందిన 300 మంది కూలీలు తమకు పనుల కల్పనలో రాజకీయ పక్షపాతం చూపుతున్నారని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. పనుల కల్పనలో ఘోరంగా విఫలం⇒ 2024 ఏప్రిల్ నెలలో అప్పటి ప్రభుత్వం పేదలకు 5.98 కోట్ల పని దినాల్లో పనులు కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల 30 రోజులతో పాటు మే నెలలో పది రోజులు కలుపుకుని.. మొత్తం 40 రోజుల్లో కూటమి ప్రభుత్వం కేటాయించిన పని దినాలు కేవలం 4.41 కోట్లు మాత్రమే. ఎక్కువ డిమాండ్ ఉండే మే నెలలో రోజుకు 25 లక్షల పని దినాలకు మించి పనులు కల్పించడం లేదు. శనివారం దాదాపు 30 లక్షల మంది పేదలు ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ పెట్టుకుంటే కేవలం 23 లక్షల మందికి మాత్రమే పనులు కల్పించారు. ⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం శ్రామికుల ఆదాయం సైతం పడిపోయినట్టు స్వచ్ఛంద సంస్థ ‘లిబ్టెక్ ఇండియా’ ఓ నివేదిక విడుదల చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన ఒక్కో పేద కుటుంబం ఏడాది మొత్తంలో రూ.13,484 చొప్పున ఆదాయం పొందింది. అదే 2024–25 ఆర్థిక ఏడాదిలో రోజు వేతన రేటు రూ.272 నుంచి రూ.300కు పెరిగినప్పటికీ సగటున ఓ కుటుంబానికి రూ.13,190 మాత్రమే పొందినట్టు ఆ సంస్థ పేర్కొంది. పెరిగిన ధరల ప్రకారం చూస్తే.. ఒక్కో కుటుంబం సగటున రూ.1531 చొప్పున నష్టపోయిందని వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 25.55 కోట్ల పేదలు పనులు పొందగా, 2024–25లో ఆ సంఖ్య 24.22 కోట్లకు పరిమితమైంది. ⇒ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వంద పని దినాల పాటు పనులు పొందిన కుటుంబాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2023–24 ఏడాదిలో 6.87 లక్షల కుటుంబాలు వంద పని దినాల్లో పనులు పొందగా, 2024–25లో 5.1 లక్షల కుటుంబాలు మాత్రమే ఆ మేరకు పనులు పొందాయి. -
వావ్.. మైగ్రేట్ ‘వే’
సాక్షి, అమరావతి: గగనతలాన ఎగిరే పక్షులు సుదూర ప్రాంతాలకు వలస పోతుంటాయి. ఇవి వేల కిలోమీటర్లు ప్రయాణించడం ఓ అద్భుతం. అత్యంత కఠిన వాతావరణాల్లోనూ లెక్కలేనన్ని ముప్పులను తప్పించుకుంటూ ఇవి దేశాలు, ఖండాలను ఎలా దాటతాయో అందరికీ ఆశ్చర్యకరమే.. అయితే విమానాలు, వాహనాల పయనానికి నిర్దిష్ట మార్గాలున్నట్టే పక్షులకు వలస దారులు ఉంటాయని మీకు తెలుసా? అవును వాటికీ కచ్చితమైన దారులు ఉంటాయి. వాటిని ఫ్లైవేస్ అంటారు. ఆహారం, ఆశ్రయం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా పక్షులు ఈ మార్గాలను నిర్దేశించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వలస పక్షులకు సంబంధించి మూడు సూపర్ ఫ్లైవేస్ ఉన్నాయి. అవి ఏమిటీ? వాటి ప్రత్యేకతలేంటంటే..1.ఆఫ్రికన్–యూరేషియన్ ఫ్లైవేపక్షుల వలసకు ఉన్న ప్రధాన మార్గాల్లో ఆఫ్రికన్–యూరేషియన్ ఫ్లైవే ఒకటి. ప్రపంచంలోనే గొప్ప ఫ్లైవేగా దీన్ని అభివర్ణిస్తారు. ఆఫ్రికా, యూరప్, ఆసియా ఖండాల్లోని 50కిపైగా దేశాల మీదుగా ఈ ఫ్లైవే ఉంటుంది. ఆర్కిటిక్ నుంచి దక్షిణాఫ్రికా వరకు మూడు ప్రధాన మార్గాలు ఈ ఫ్లైవేకు అనుసంధానమై ఉంటాయి. గగనతలాన అత్యంత కఠిన పరిస్థితుల మధ్య లక్షల సంఖ్యలోని పక్షులు ఈ ఫ్లైవేలో ప్రయాణిస్తాయి. ఈ మార్గంలో ప్రయాణించే పక్షుల్లో పది శాతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2.తూర్పు ఆసియా–ఆస్ట్రేలియన్ ఫ్లైవే.. ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో పక్షులు తిరిగే దారి ఇది. అలాస్కా నుంచి ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు 37 దేశాల మీదుగా ఈ ఫ్లైవే ఉంటుంది. 600 పక్షి జాతులు ఈ దారిన ప్రయాణిస్తాయి.3.సెంట్రల్ ఆసియా ఫ్లైవే.. ప్రపంచంలోనే అతిచిన్న ఫ్లైవే ఇది. అయినప్పటికీ ఈ మార్గాన్ని 600 కంటే ఎక్కువ వలస పక్షి జాతులు ఉపయోగిస్తున్నాయి. ఇది ఉత్తరాన శీతల సైబీరియా నుంచి ఉష్ణమండల మాల్దీవుల వరకు 30 దేశాల మీదుగా సాగుతుంది. ఈ ఫ్లైవేలో వెళ్ళే కొన్ని పక్షులు తమ జీవితకాలంలో అనేకసార్లు హిమాలయాలను దాటతాయి. ఈ మార్గంలో ప్రయాణించే పక్షి జాతుల్లో 48 శాతం ముప్పును ఎదుర్కొంటున్నాయి. బార్–హెడ్ గూస్ తన జీవితకాలంలో పలుమార్లు హిమాలయాలను (ఎవరెస్ట్ శిఖరంపై సహా) దాటతాయి. రోసీ స్టార్లింగ్స్, అమూర్ ఫాల్కన్స్, ఫ్లెమింగో వంటి పక్షులు సెంట్రల్ ఆసియా ఫ్లైవే ద్వారా శీతాకాలంలో భారతదేశానికి వస్తాయి. ఈ మార్గంలో ఎక్కువగా చిత్తడి నేలలు, సరస్సులు, అడవులు ఉండడంతో వాటికి స్టాప్ఓవర్ పాయింట్ల ఉన్నాయి. అక్కడ ఆగి ఆహార సేకరణ, విశ్రాంతి తీసుకోవడం చేస్తాయి.4.అమెరికాస్ ఫ్లైవే.. ప్రపంచంలో ఎక్కువ పక్షి జాతులు తిరిగే ఫ్లైవే ఇది. 2 వేల కంటె ఎక్కువ విభిన్న పక్షి జాతులు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. దక్షిణ అర్జెంటీనాలోని టియెర్రా డెల్ ఫ్యూగో నుంచి ఉత్తరాన ఆర్కిటిక్ సర్కిల్ వరకు విస్తరించి ఉన్న ఈ ఫ్లైవేలో 35 దేశాలను దాటే మూడు వలస మార్గాలు ఉన్నాయి. ఈ రూటులో 3 అంగుళాల పొడవు ఉంటే రూఫస్ హమ్మింగ్‌బర్డ్ 3 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.విహంగాలు ఎగిరే మార్గాల్లో ఇంకొన్ని 1. ఆసియన్–ఈస్ట్ ఆఫ్రికన్ ఫ్లైవే: దక్షిణ ఆసియా (ముఖ్యంగా భారత ఉపఖండం) నుంచి తూర్పు ఆఫ్రికా 2. వెస్ట్ పసిఫిక్ ఫ్లైవే : ఉత్తర ఆసియా (సైబీరియా, జపాన్) నుంచి దక్షిణ పసిఫిక్ ద్వీపాలు, ఆస్ట్రేలియా 3. పసిఫిక్ అమెరికాస్ ఫ్లైవే : ఉత్తర అమెరికా (అలాస్కా, కెనడా) నుంచి దక్షిణ అమెరికా (చిలీ, అర్జెంటీనా) పసిఫిక్ తీరం వెంబడి ఉంది4. సెంట్రల్ అమెరికాస్ ఫ్లైవే : ఉత్తర అమెరికా (కెనడా, యుఎస్) నుంచి సెంట్రల్ అమెరికా,ఉత్తర దక్షిణ అమెరికా 5.అట్లాంటిక్ అమెరికాస్ ఫ్లైవే : తూర్పు ఉత్తర అమెరికా నుంచి కరేబియన్ దీవులు, దక్షిణ అమెరికా యొక్క అట్లాంటిక్ తీరం వరకు ఉంటుంది6. మిస్సిసిపి అమెరికాస్ ఫ్లైవే : ఉత్తర అమెరికా మధ్య భాగం (మిస్సిసిపి నది లోయ) నుంచి సెంట్రల్, దక్షిణ అమెరికా వరకు మార్గాలున్నాయి. సహజసిద్ధ శక్తిసామర్థ్యాలు ⇒ పక్షులు భూమ్మీదున్న అయస్కాంత క్షేత్రాలను గుర్తించడానికి తమ మెదడులోని ప్రత్యేక కణాలను ఉపయోగిస్తాయి. ఇవి వాటికి ఒక సహజ దిక్సూచిలా పనిచేస్తాయి. పగటి వేళల్లో సూర్యుడి స్థానం ఆధారంగా తమ దిశను నిర్ణయించుకుంటాయి. సూర్యుడి కదలికలను అనుసరిస్తూ మార్గాన్ని నిర్దేశించుకుంటాయి. రాత్రి సమయాల్లో నక్షత్రాల స్థానాలను బట్టి దిశను గుర్తిస్తాయి.⇒ పర్వతాలు, నదులు, తీరప్రాంతాలు వంటి భౌగోళిక లక్షణాలను పక్షులు గుర్తుపెట్టుకుని వాటి ఆధారంగా మార్గాన్ని నిర్ధారించుకుంటాయి. కొన్ని పక్షులు గాలి దిశ, ఉష్ణోగ్రత, వాతావరణ మార్పులను అనుసరించి ఎగురుతాయి. రోసీ స్టార్లింగ్స్ అనే పక్షిజాతి వాతావరణ సూచనలను ఆధారంగా తమ ప్రయాణ సమయాన్ని నిర్ణయించుకుంటుంది.⇒ బార్–హెడెడ్ గూస్ పక్షి జాతి హిమాలయాలను దాటేటప్పుడు 8 వేల మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువ. వాటి శరీరం అంత తీవ్రమైన పరిస్థితులనూ తట్టుకునేందుకు అనువుగా ఉంటుంది.⇒ పక్షులు ప్రయాణ మార్గాలను జన్యుపరంగా లేదా అనుభవం ద్వారా గుర్తుంచుకుంటాయి. అమూర్ ఫాల్కన్స్ పక్షి జాతి సైబీరియా నుంచి ఆఫ్రికాకు 22 వేల నుంచి 30 వేల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించి కచ్చితమైన గమ్యస్థానాలకు చేరుకుంటాయి.⇒ ఆవాసాలు చెదిరిపోవడం, వాతావరణ మార్పులు, కాంతి కాలుష్యం, గాలి టర్బైన్లు, ఎత్తైన భవనాల వల్ల విహంగాలు అప్పుడప్పుడు గందరగోళానికి గురవుతాయి. -
ఎన్నికల హామీల అమలు ఎప్పుడు?
తిరుపతి సిటీ: ‘కూటమి పార్టీలు అధికార దాహంతో ఎన్నికల్లో గెలుపు కోసం హామీలను గుప్పించాయి. గత ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలకే పేర్లు మార్చి ప్రజలకు అందిస్తామని చెప్పాయి. అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై దృష్టిసారించడం లేదు. అసలు ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. సీఎం చంద్రబాబుకు హంగూ ఆర్భాటాలే తప్ప అభివృద్ధిపై దృష్టిలేదు’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఏడాది అయినా.. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కూటమి సర్కారు కాలయాపన చేస్తోందే కానీ, అభివృద్ధిపై దృష్టిసారించడం లేదని విమర్శించారు.రాష్ట్రంలో ఫాసిస్టు ధోరణి పాలన సాగుతోందని, కార్పొరేట్, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యం తీరు మారిపోయిందని... ఈ రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో చిన్నచూపు తగదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పేదల విద్యకు నిలయాలుగా, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు సంపన్నుల విద్యకు కేంద్రం కావడం దారుణమని, వైద్యంలో సైతం ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు, కార్పొరేట్ ఆసుపత్రులు ధనికులకు అన్నట్లున్నాయని అన్నారు. తిరుపతిలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న రాఘవులు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన, ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే.. ⇒ పత్రికలు, జర్నలిస్టులపైన దాడులు, బెదిరింపులు, నిరాధారమైన కేసులు పెట్టడం దారుణం. తప్పులను ఎత్తిచూపుతూ ప్రభుత్వాలను మేల్కొలిపే జర్నలిజంపై దాడులు చేయడం బాధాకరం. ప్రశ్నించే గళంపై కక్షసాధింపు చర్యలను సమాజం హర్షించదు. పత్రికా హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు. న్యూస్ పోర్టల్‌ను బ్లాక్ చేయడం వంటివి ప్రజా వ్యతిరేక చర్యలు. ఇవి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.⇒ ఆర్థిక వనరుల మెరుగుదలకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టకపోవడం విచారకరం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారన్న మాటే తప్ప నిధులు రాబట్టలేకపోతున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, రాయితీలంటూ ఉత్త మాటలే తప్ప ఆచరణ లేదు. విద్య, వైద్యం ప్రైవేటీకరణతో పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలలు, వైద్యం చేయించుకునే ఆస్పత్రులను పట్టించుకునే పరిస్థితి కరువైంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల మత విద్వేషాలను రెచ్చగొట్టేలా దారుణంగా వ్యాఖ్యలు చేశారు. భూసేకరణే తప్ప అమరావతి పూర్తిపై దృష్టి లేదుమోదీ దగ్గర మెప్పు పొందండం, ప్రజలకు ఏదో చేసేస్తున్నామన్న ఆర్భాటం, హంగు తప్ప అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టి లేదు. అమరావతి పునర్నిర్మాణం అంటూ మరో 40 వేల ఎకరాలు సేకరిస్తున్నారు. ప్రజల నుంచి భూ సేకరణే తప్ప అమరావతిని పూర్తి చేయడంపై ధ్యాస లేదు. అమరావతి రాజధానిగా పార్లమెంటులో చట్టం చేసేందుకు ప్రయత్నించడంతో నాలుగేళ్లలో అయినా పూర్తి చేస్తారో.. లేదోననే అనుమానం ప్రజలకు కలుగుతోంది. చంద్రబాబు తన పాలనకు హంగూ ఆర్భాటాలు చేసుకోవడమే తప్ప అభివృద్ధి సాధించే రీతిలో అడుగులు పడడం లేదు. -
ఏడాది కావస్తున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు
సాక్షి అమరావతి/అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్థిక అంశాలు అటుంచితే ఆర్థికేతర అంశమైన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని నియమించలేదని, మూడు పెండింగ్ డీఏల్లో ఒక్కటీ ఇవ్వలేదని, ఉద్యోగులకు నాయకులుగా సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు.ప్రభుత్వం పీఆర్సీని నియమించకపోవడం, డీఏలు ప్రకటించకపోవడంతో ఉద్యోగులు అభద్రతాభావంలో ఉన్నారన్నారు. పీఆర్సీ ప్రక్రియ ఎంత ఆలస్యం అయితే ఉద్యోగులకు అంత నష్టమన్నారు. ఇక 2024 జనవరి, జూన్, 2025 జనవరికి సంబంధించి మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ నెల దాటితే మరో డీఏ కలుస్తుందన్నారు. ఇప్పటికీ ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో రెవెన్యూ కార్యాలయాల నిర్వహణ భారాన్ని తహసీల్దార్లు భరించాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ప్రొటోకాల్‌కు రూ.లక్షలు ఖర్చు అవుతున్నాయని, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రభుత్వం లీగల్ చార్జీలూ ఇవ్వకపోవడంతో కోర్టు కేసులకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదు? ఆక్రమణల తొలగింపు, ఇసుక దందా, రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో తహసీల్దార్లు బలవుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో గుంటూరులో ఆక్రమణల తొలగింపు అంశంలో అప్పటి తహసీల్దారు తాతా మోహన్‌రావుపై కోర్టు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆయనకు తహసీల్దారుగా డిమోషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆయన పనిచేశారన్నారు. అలాంటప్పుడు ఈ కేసులో ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. పైవారు చెప్పిన పని చేసినందుకు ఆ అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిర్ణయాన్ని ఉన్నతాధికారులు నోటితో చెబితే కాకుండా లిఖితపూర్వంగా ఆదేశాలిస్తేనే అమలు చేయాలని తహసీల్దార్లకు చెబుతున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగులు సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటరాజేష్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోనూ విలేకరులతో మాట్లాడిన బొప్పరాజు ఇంతకాలమైనా సర్కారు పీఆర్సీని ఎందుకు నియమించలేకపోయిందని, ఒక్క డీఏ కూడా ఇవ్వలేదేమని ప్రశ్నించారు. -
మిగులుపై గుబులు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు గుబులు రేపుతోంది. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ మేరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. అయితే, గత ప్రభుత్వంలో చేసిన జీవో 117ను రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా విడుదల చేసిన పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ నిబంధనలతో రాష్ట్రంలో వేలాది మంది ఉపాధ్యాయులు మిగులు (సర్ప్లస్) ఏర్పడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల మేరకు ప్రస్తుతం ఉపాధ్యాయులు పని చేస్తున్న పాఠశాలలోనే ఎనిమిదేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ నిలకడలేని కొత్త నిబంధనలతో మిగులు సమస్య ఏర్పడింది. 2023లో ఉపాధ్యాయ బదిలీల్లో ఈ సమస్య లేదని, జీవో నంబర్ 47 ప్రకారం మిగులు ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపులో సమన్యాయం పాటించి న్యాయం చేశారని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. జీవో నంబర్ 117 అమల్లో భాగంగా మిగులు ఉపాధ్యాయులకు పాత పాఠశాలలో పనిచేసిన కాలాన్ని, కొత్త పాఠశాలలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకొని (పాత, కొత్త స్టేషన్) రేషనలైజేషన్ పాయింట్లు కేటాయించారు. కానీ, ఇటీవల విద్యా శాఖ విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో అనేక లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పాత పాఠశాలలో పనిచేసిన కాలానికి ఇచ్చే పాయింట్లు కోరుకుంటే వారికి ప్రస్తుత రేషనలైజేషన్ పాయింట్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్టు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన బదిలీలలో మిగులు ఉపాధ్యాయులకు పాత, కొత్త స్టేషన్ల (పాఠశాల)లో పని చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఎనిమిదేళ్ల వరకు సర్వీసు పాయింట్లు కేటాయించారు. దీనికి అదనంగా రేషనలైజేషన్ పాయింట్లు కూడా ఇచ్చి న్యాయం చేశారు. అంతేగాక సర్ప్లస్ ఉపాధ్యాయులకు స్పెషల్ పాయింట్లు (స్పౌజ్ వంటివి) ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మిగులు ఉపాధ్యాయులకు నష్టం జరగలేదు.ఇప్పుడంతా గందరగోళంజీవో 117 రద్దులో భాగంగా చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. పాఠశాలల మెర్జింగ్, సబ్జెక్టు టీచర్ల తొలగింపుతో పాటు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని పెంచడంతో దాదాపు 10 వేల మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులు (సర్ ప్లస్) ఏర్పడుతున్నారు. విద్యాశాఖ కొత్త నిబంధనలతో సర్ ప్లస్ అయిన ఈ ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇందులో భాగంగా వారిని ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలల కంటే మెరుగైన స్థానాలకు బదిలీ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రక్రియ నడుస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పాఠశాలలో పని చేసిన కాలానికి ఇచ్చే స్టేషన్ పాయింట్లను కోరుకునే వారికి రేషనలైజేషన్ పాయింట్లు ఇచ్చేది లేదని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. కొత్త పాఠశాలలో పని చేసిన కాలానికి స్టేషన్ పాయింట్లు కోరుకున్న వారికి మాత్రమే రేషనలైజేషన్ పాయింట్లు ఇస్తామనడంతో మిగులు టీచర్లకు అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం కొత్త పాఠశాలల్లో రెండు నుంచి నాలుగేళ్ల సర్వీసు గలవారే మిగులుగా మారుతున్నారు. వీరు పాత పాఠశాలలో ఎనిమిది నుంచి పదేళ్ల కాలం పని చేశారు. ప్రస్తుత బదిలీల్లో వీరే నష్టపోతున్నట్టు తెలుస్తోంది. 2023లో ఇచ్చినట్టుగా పాత, కొత్త పాఠశాలల సర్వీసును పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఎనిమిదేళ్లకు స్టేషన్ పాయింట్లు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. తమను ప్రభుత్వమే బలవంతంగా బదిలీ చేస్తున్నందున న్యాయం చేయాలని మిగులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉపాధ్యాయ చర్చల్లో కొందరికే ప్రాధాన్యంబదిలీలు, పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై విద్యా శాఖ గత ఎనిమిది నెలలుగా ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతోంది. అయితే, ఇందులో కేవలం 9 గుర్తింపు సంఘాలకే ప్రాతినిధ్యం కల్పించారు. కీలకమైన 34 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలను దూరం పెట్టారు. దీంతో రిజిస్టర్డ్ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉపాధ్యాయ సమస్యలపై నిర్వహించే సమావేశాల్లో అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలేగానీ, కొందరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ఏంటని ఆ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం సమావేశాల్లో ఐదు నెలల క్రితం ఒకసారి అవకాశం కల్పించారు. తాజాగా శనివారం నిర్వహించిన సమావేశానికి మాత్రమే గుర్తింపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. అయితే, అన్ని ప్రక్రియలూ పూర్తయ్యాక నిర్వహించిన ఈ సమావేశంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
వారిపై చర్యలు తప్పవు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: తన వ్యక్తిగత జీవితం, వైఎస్సార్సీపీ శ్రేణులపై కిరాక్ ఆర్పీ, సీమరాజు సోషల్ మీడియాలో పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వాటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తనపై కూడా చేసిన సోషల్ మీడియాలో పోస్టులపై ఫిర్యాదులు చేశాను. మొదట ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు.. న్యాయస్థానాల ద్వారా పోరాటంతో నాలుగు కేసులను రిజిస్టర్ చేశారు. మరొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘ఈ నెల 18వ తేదీన ఆ కేసుపై స్వయంగా నేనే హైకోర్టులో వాదనలు వినిపించనున్నాను. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. మహిళలను ఉదయం ఆరు లోపు అదుపులోకి తీసుకోకూడదని చట్టం చెబుతోంది. కానీ రాజకీయ ఒత్తిడికి గురై పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవు. కాంతేరులో దళిత ఆడబిడ్డను బలవంతంగా లాక్కెళ్లారు. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గం.‘‘గుంటూరు సీఐడి కార్యాలయానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే.. ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటే వైఎస్సార్సీపీ శ్రేణులకు పోలీసులు రాచ మర్యాదలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైన్యం తగ్గడం లేదు.. మరింతగా పెరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
జవాన్ వీర మరణంపై వైఎస్సార్సీపీ సంతాపం
సాక్షి, తాడేపల్లి: జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్సీపీ సంతాపం తెలిపింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు, నేతలు హాజరయ్యారు.భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు.మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం: వైఎస్ జగన్యుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బాధాకరం అన్నారు.ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమన ప్రభుత్వం!
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజల కంచాల్లోని కూడు లాగేశారు.. ప్రతి ఇంటికీ బాబు మోసం" ఇది వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ. ఈ వార్త ప్రజలకు అందిన రోజే మరో సమాచారం వచ్చింది. జీఎస్టీ ఆదాయం వసూళ్లు దేశమంతటా పైపైకి వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నేల చూపులు చూస్తున్నట్లు ఆ కథనం చెప్పింది. జగన్ వ్యాఖ్యలకు, జీఎస్టీకి ఏమి సంబంధం? అంటే.. జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేసేది. లబ్దిదారుడికి నేరుగా నగదు అందేలా ఆ పథకాలుండేవి.ఆ డబ్బుతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి వారు వస్తు, సేవల కొనుగోళ్లు చేసేవారు. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు సాగి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరేది. అందువల్లే ఆ రోజుల్లో ఒకవైపు పేదరికం తగ్గినట్లు గణాంకాలు తెలిపాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇల్లు గడవడమే కష్టమవుతోందని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా దేశం అంతటా 12 శాతం వరకు జీఎస్టీ వృద్దిరేటు ఉంటే, ఏపీలో మాత్రం ఏప్రిల్ లో మైనస్ 3.4 శాతంగా మాత్రమే ఉంది. అందువల్లే జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పేదల తింటున్న కడును కూటమి పెద్దలు లాగేశారని ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కొనసాగించడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రజలకు అందిస్తామని పదే, పదే ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్‌ను తొలుత మహానాడులో ప్రకటించినప్పుడు తమ్ముళ్లూ అదిరిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించే వారు. అందుకు వారంతా ఔను, ఔనని చప్పట్లు కొట్టారు. జనం కూడా ఆశపడ్డారు. తీరా అధికారం వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాలుక మడత వేయడం ఆరంభించారు. అదిరిపోవడం జనం వంతైంది.ఇదేమి ఖర్మ.. పాలిచ్చే గేదెను వదలుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని ప్రచారం చేశారని, అది నమ్మి జనం ఓట్లు వేశాక, పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంటిలో నాలుగువేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవని, కూటమి వచ్చి కంచం లాగేసిందని కొద్ది రోజుల క్రితం పార్టీ సమావవేశంలో ధ్వజమెత్తారు. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది.జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద రూ.15 వేలు ఇస్తే వారికి ఆర్ధిక వెసులుబాటు వచ్చేది. చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర తదితర స్కీముల కింద వచ్చే డబ్బు వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉపయోగపడేవి. ఇప్పుడు అవేవీ రాలేదు. చంద్రబాబు తాను ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఇస్తానని నమ్మబలికారు. రైతులకు రూ.20 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు లారీ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇలా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారు. దాంతో జనం కూడా జగన్ చెప్పినట్లు చంద్రబాబు తమ నోటికాడ కూటిని తమ నోటికాడ కూటిని లాగేశారని అనుకుంటున్నారు.జగన్ కాని, వైసీపీ నేతలు కాని చేస్తున్న ఈ విమర్శలను కూటమి పెద్దలు ఎవరూ ఖండించలేకపోతున్నారు. కాకపోతే జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏవో పడికట్టు పదాలతో పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తుంటారు. ఈ విషయంలో కూడా వారిలో ఒక స్పష్టత, కనిపించదు. జగన్ ప్రభుత్వం రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, రూ.పది లక్షల కోట్లు అని మరోసారి, రూ.13 లక్షల కోట్లు అని వేరొకసారి, అది రూ.14 లక్షల కోట్లు అని ఇంకోసారి చంద్రబాబు, పవన్ లు చెప్పిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పు అంతా కలిపి రూ.ఆరు లక్షల కోట్టేనని తేలింది. అందులో సగం 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అప్పులు చేయరు కాబోలు.. కొత్తగా సంపద సృష్టిస్తారేమోలే అనుకున్న వారందరికి మతిపోయేలా చేశారు. ఏకంగా రికార్డు స్థాయిలో అన్నీ కలిపి రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. స్కీములు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు చేపట్టకుండా ఈ అప్పు ఏమి చేశారన్నది మిస్టరీ. దానిపై ప్రభుత్వం ఇంతవరకు వివరణ పత్రం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సర్కార్‌గా గుర్తింపు పొందుతోంది.ఇంత అప్పు చేసి కూడా చంద్రబాబు తరచు తమకు అప్పులు పుట్టడం లేదని, సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పండని కామెంట్లు చేస్తుంటే ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. తన పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎపిలో ప్రతి ఇంటిని బాబు మోసం చేశారని అన్నారు.అది కూడా నిజమే అనుకోవాలి. జగన్ టైమ్ లో ఏదో రకంగా 87 శాతం కుటుంబాలకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప మరేమీ అందడం లేదు. ప్రజలకు సూపర్ సిక్స్ అందకపోగా, రాక్షస రాజ్యం నడుపుతున్నారని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, తమకు బలం లేకపోయినా మున్సిపాల్టీ, మండల పరిషత్‌లను దౌర్జన్యంగా కైవసం చేసుకుంటున్నారని జగన్ అన్నారు. ఇందులో కూడా వాస్తవం ఉంది.సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా, భయపెట్టో, ప్రలోభపెట్టో తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెనుపోటే. కొన్నిచోట్ల మాత్రం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ధైర్యంగా అధికార కూటమి అరాచకాలను అడ్డుకున్నారు. అలాంటి వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారిని అభినందించారు. జీఎస్టీ వసూళ్ల గురించి వచ్చిన డేటా విశ్లేషిస్తే, కూటమి సర్కార్ వచ్చిన ఈ పదినెలల్లో రెండు నెలలు తప్ప, మిగిలిన అన్ని నెలలు మైనస్ గ్రోత్ రేట్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇది ఏపీకి మంచి పరిణామం కాదు.గత ఏప్రిల్‌లో తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, కేరళలో ఐదు శాతం, చివరికి ఒడిశాలో కూడా ఐదు శాతం వృద్ది రేటు చూపితే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం మైనస్ 3.4 శాతంగానే ఉంది. అయినా దీన్ని కనిపించకుండా చేసేందుకు ఎల్లో మీడియా పాట్లు పడింది. కొద్ది రోజుల క్రితం జీఎస్డీపీలో నెంబర్ 2 వచ్చేశామంట ఒక అంకెను ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ఈ జీఎస్టీ లెక్కలతో ఏపీ ప్రభుత్వం చెప్పేవి బూటకపు లెక్కలని తేటతెల్లమవుతోంది! - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భారతీయుల రూటే.. సపరేటు
సాక్షి, అమరావతి : ఋగ్వేదంలోనే యోగా గురించి ప్రస్తావించాం. సింధు లోయ నాగరికతలోనే టాయిలెట్లను వినియోగించాం. గూస్బెర్రీ వంటి మొక్కల సారాన్ని వినియోగించి షాంపూలు తయారు చేశాం.. ‘సున్నా’కు విలువ కనిపెట్టి ప్రపంచానికి అందించాం. ఇలా విశ్వజగతికి భారతీయులు ఆది నుంచి నాయకులుగానే పరిచయమయ్యారు. నేటికీ అదే విధంగా ఉండేందుకు, గ్లోబల్ లీడర్లుగా పిలిపించుకునేందుకు భారతీయులు ఇష్టపడుతున్నారు. అందుకోసమే కష్టాన్నీ సంతోషంగా స్వీకరిస్తున్నారు. ప్రపంచ ప్రముఖ కార్యనిర్వాహక పరిశోధన సంస్థ అయిన అమ్రోప్ నిర్వహించిన అధ్యయనంలో భారత్ ప్రజల తాజా మనోగతం ఆవిష్కృతమైంది. గ్లోబల్ సౌత్ దేశాలైన భారత్, చైనా, బ్రెజిల్‌తోపాటు పాశ్చాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్‌లో పని వైఖరిపై అమ్రోప్ తాజాగా అధ్యయనం జరిపింది. కష్టించి పనిచేయడం వల్లనే గుర్తింపు లభిస్తుందని, జీవితం సంతృప్తికరంగా ఉంటుందని, ఆశయం నెరవేరుతుందని భారతీయులు నమ్ముతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ సర్వేలో 20 ఏళ్లు నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల బ్యాచిలర్ డిగ్రీ, అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న 8 వేల మంది నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి దేశం నుంచి వెయ్యి మంది సర్వేలో పాల్గొన్నారు. అధ్యయనంలోని ముఖ్యాంశాలు:» భారతీయుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. 92 శాతం మంది పని చేయడంలోనే సంతోషం ఉందని అంటున్నారు. » 73% మంది మంచి ఉద్యోగం, జీవితం ఉండాలని కోరుకుంటున్నారు. »75% మంది కష్టపడి పనిచేయడం సాధారణంగా మనిషి ధర్మమని నమ్ముతున్నారు.» 42% మంది వారానికి 40 గంటలకు మించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఫ్రాన్స్‌లో 16 శాతంగా ఉంది.» 76 శాతం మంది భారతీయ నిపుణులు ఒక కంపెనీని నడిపించాలని లేదా తామే సొంతంగా ఒక సంస్థను నిర్వహించాలని కోరుకుంటున్నారు. జర్మనీలో ఇలాంటి వారు 36% కాగా, అమెరికాలో 49% మంది ఉన్నారు. » తామేంటో నిరూపించుకునేలా పనిచేయాలని 73% మంది భారతీయులు అనుకుంటున్నారు. జర్మనీలో ఇలాంటి వారి సంఖ్య 41 శాతం మాత్రమే ఉంది. »మన దేశంలో 84 శాతం మందికి చదువు, వ్యాపారం, ఉద్యోగం వంటి మంచి కెరీర్ ముఖ్యంగా భావిస్తున్నారు. »పాశ్చాత్య దేశాల్లో మాత్రం 62% మంది తాము కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొనడం గమనార్హం. » రాజకీయ నాయకుడిగా ఉండేందుకు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ఇష్టపడటం లేదు. -
సై‘బరి’ తెగింపు
‘విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్‌కు ఓ వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ వచ్చాయి. వెంటనే ఓ ఆగంతకుడి నుంచి కాల్ వచ్చింది. పొరపాటున మీ నంబర్‌కు నాకు సంబంధించిన కోడ్, ఓటీపీ వచ్చిందని, దయచేసి దాన్ని తనకు చెప్పాలని ఆగంతకుడు అభ్యర్ధించాడు. ఫోన్లలో ఇలాంటి పొరపాటు మెసేజ్‌లు రావడం సహజమేనని నమ్మి. ఆ ఆగంతకుడికి ఆ వ్యక్తి కోడ్, ఓటీపీ చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే గుడ్‌మార్నింగ్ మెసేజ్ తన స్నేహితులకు పంపేందుకు ఆ వ్యక్తి విఫలయత్నం చేశాడు. 12 గంటల పాటు తన వాట్సాప్‌కు ఎలాంటి మెసేజ్‌లు, ఫొటోలు రావడం లేదని, తన నుంచి ఎవరికీ మెసేజ్‌లు వెళ్లడం లేదని గ్రహించాడు. ఎట్టకేలకు తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయిందని గ్రహించి హుటాహుటిన సైబర్ పోలీస్ స్టేషన్‌కు పరుగు పెట్టాడు’.విజయవాడస్పోర్ట్స్: డిజిటల్ అరెస్ట్, జాబ్‌ఫ్రాడ్, హనీ ట్రాప్, ఫిషింగ్, డేటా బ్రీచ్ తదితర వందకుపైగా స్కామ్‌లతో ప్రజలను ఆరి్ధక దోపిడీ చేసిన సైబర్ నేరగాళ్లు.., తాజాగా రూటు మార్చారు. ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్తో వ్యక్తిగత సమాచార మార్పిడికి రక్షణగా ఉన్న వాట్సాప్పైనా కేటుగాళ్లు కన్నేశారు. వాస్తవ ఖాతాదారులను బురిడీ కొట్టించి హ్యాక్ చేస్తూ సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారు. ఒకే నంబర్‌తో వేర్వేరు ఫోన్లలో ఎన్నైనా వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసుకునే వెసులుబాటును సైబర్ నేరస్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ‘‘ నేరగాళ్లు వారి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న వాట్సాప్‌కు మీ నంబర్ ఇస్తారు. దీంతో వాట్సాప్ సంస్థ నుంచి మీ మొబైల్‌కు వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ వస్తుంది. ఈ రెండూ తెలుసుకునేందుకు మిమ్మల్ని ఫోన్లో సంప్రదిస్తారు. పొరపాటున కోడ్, ఓటీపీ మీ నంబర్‌కు వచ్చిందని, దాన్ని కాస్త చెప్పాలని అభ్యర్థిస్తారు. కోచ్, ఓటీపీ వారికి చెప్పగానే మీ వాట్సాప్ ఖాతా వారి ఫోన్లో ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిజెప్పీరింగ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తారు. మీ వాట్సాప్ వచ్చే అన్ని మెసేజ్, ఫోటోలు పూర్తిగా వారి ఫోన్‌కు వెళ్లేలా సెట్టింగ్స్ చేసి హ్యాక్ చేస్తారు. వాట్సాప్ సంభాషణ పూర్తిగా వారి ఆ«దీనంలోకి తీసుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలు, వ్యక్తిగత హననానికి, ఆర్థిక దోపిడీకి పాల్పడతారు. హ్యాకింగ్‌తో అపరిమితమైన నేరాలువాట్సాప్లో చాటింగ్, గ్రూప్‌ల ఆధారంగా ఆ వాట్సాప్ వినియోగించే వ్యక్తి మనస్తత్వాన్ని నేరగాళ్లు అంచనా వేస్తున్నారు. ఏయే గ్రూప్‌లకు మెసేజ్‌లు పార్వాడ్ చేస్తున్నారో.., ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నారో.., ఎలాంటి సంభాషణలు చేస్తున్నారో.., క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీని ఆధారంగా స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు, వ్యాపార భాగస్వాములను వాట్సాప్ ద్వారా డబ్బులు అభ్యర్థిస్తారు. వాస్తవ ఖాతాదారుడికి తెలియకుండానే అతని పేరుతో చాటింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. వాట్సాప్ బ్యాంకింగ్ వ్యాలెట్‌లో ఉన్న నగదునూ లూటీ చేస్తారు. డీపీ (డిస్ప్లే పిక్చర్) ఫొటోను మారి్ఫంగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరిస్తారు. వాట్సాప్ కాంటాక్ట్, గ్రూప్‌లలో ఉన్న మహిళల డీపీలను మారి్ఫంగ్ చేస్తారు. మహిళలకు అసభ్య మెసేజ్‌లు పంపి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. డేటింగ్, బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను వినియోగించడమే కాకుండా గ్రూప్‌లలో ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటారు. వాట్సాప్ గ్రూప్లలోకి, వ్యక్తిగత నంబర్లకు ఏపీకే ఫైల్స్, మాల్వేర్లను పంపిస్తారు. పొరపాటున వాటిని క్లిక్ చేసిన వ్యక్తుల అకౌంట్లను హ్యాక్ చేస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫి, పోర్న్ వీడియోలను, న్యూడ్ ఫొటోలను వాట్సాప్ అకౌంట్ ద్వారా ఇతరులకు షేర్ చేస్తారు. స్త్రీ/పురుషు వ్యభిచారుల(మేల్ ఎస్కార్ట్ సర్వీస్, ఫిమేల్ ఎస్కార్ట్ సర్వీస్) వివరాలను ఇతరులకు షేర్ చేసేందుకు ఈ వాట్సాప్‌ను వినియోగిస్తారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచార మారి్పడికి హ్యాక్ చేసిన అకౌంట్లను వినియోగిస్తారు. వాట్సాప్ చానల్ ద్వారా సంఘ వ్యతిరేక, అసభ్య సమాచార మార్పిడి చేసి కేసుల్లో ఇరికిస్తారు.లా ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండికీ ప్యాడ్ ఫోన్ వినియోగించే వారు సైబర్ నేరస్తుల ట్రాప్‌లో అత్యధికంగా పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ఉన్నత విద్యావంతులూ బాధితులుగా ఉన్నారు. వాట్సాప్ మాత్రమే కాకుండా ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ ఖాతాలకు సంబంధించిన వెరిఫికేషన్ కోడ్, ఓటీపీలను ఇతరులకు చెప్పడం, షేర్ చేయడం చేయరాదు. సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ హ్యాకింగ్‌కు గురైతే వెంటనే లా ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. గూగుల్లోకి వెళ్లి లా ఎన్ఫోర్స్మెంట్ అని టైప్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో ‘మీరు పోలీసా’ అని అడుగుతుంది, ‘నో’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయగానే కొత్త ఫారం ఓపెన్ అవుతుంది. అందులోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, ఇష్యూష్ ఆప్షన్లో హ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేస్తే ఫిర్యాదు ఆన్లైన్లో రికార్డవుతుంది. ఫిర్యాదు చేయడంలో ఏమైనా సందేహాలుంటే సైబర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి. –శ్రీరామచంద్రమూర్తి రాళ్లపల్లి, ఎస్ఐ, సైబర్ క్రైం, ఎన్టీఆర్ జిల్లా -
మిగిలింది విభజనే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు అంచెల పాఠశాల విధానం స్థానంలో ఇకపై తొమ్మిది రకాల బడులు రానున్నాయి. స్కూల్ అసిస్టెంట్ల బోధన వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6–10 తరగతులకు మాత్రమే పరిమితం కానుంది. ఈ మేరకు మార్పులతో ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు తెలిసింది. గత విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక పరిశీలనలు, ప్రయోగాలు చేసి, ఐదు నెలల క్రితం జీవో 117 ఉపసంహరణ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఐదు రకాల పాఠశాలలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అయితే తాజాగా అవి తొమ్మిది రకాలకు పెంచారని సమాచారం. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లోని 3–5 తరగతులను వెనక్కి తెచ్చి మోడల్ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్) ఏర్పాటు చేయాలనుకున్నా అది పూర్తి స్థాయిలో సాధ్యపడలేదు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలపై ఒత్తిడి తెచ్చి స్కూళ్లను విలీనం చేసినా, రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల స్కూళ్లను మాతమ్రే గుర్తించగలిగారు. మరోపక్క హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేస్తామని తీవ్రంగా ప్రయత్నించగా ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 900 ఉన్నత పాఠశాలల్లో 3–5 తరగతులను అక్కడే ఉంచి 1, 2 తరగతులు అదే పాఠశాలలకు చేర్చనున్నారు. ఇదే స్కూల్లో 1–5 తరగతులకు ప్రత్యేక ప్రైమరీ విభాగం ఏర్పాటు చేస్తారు. ఈ తరగతులకు ఒకరు లేదా ఇద్దరు ఎస్జీటీలను ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. అంటే 3–5 తరగతులు హైస్కూల్లో ఉన్నా, సబ్జెక్టు టీచర్ల బోధన రద్దు చేశారు. ప్రస్తుతం ఉన్న హైస్కూల్ ప్లస్ ఉపసంహరణ పైనా విద్యాశాఖ వెనక్కి తగ్గింది. 294 బాలికల హైస్కూల్ ప్లస్ పాఠశాలలను కొనసాగించనున్నారు. కో–ఎడ్యుకేషన్ కింద ఉన్న 210 హైస్కూల్ ప్లస్‌లను ఇంటర్మీడియట్ విభాగానికి అప్పచెబుతామని చెబుతున్నా పూర్తి స్థాయి విధివిధానాలను వెల్లడించలేదు. కాగా, జీవో 117ను రద్దు చేయాలన్న పట్టుదలతో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉపాధ్యాయులు, విద్యావేత్తల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా ప్రభుత్వం బడుల విభజనకే మొగ్గు చూపుతోంది. విద్యా సంవత్సరమంతా గందరగోళం » కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. టీచర్ల సర్దుబాటు పేరుతో దాదాపు 7 నెలలు గడిపింది. తర్వాత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపుతున్నామని తీర్మానించింది. » పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల పాఠశాలల్లో ఈ తరగతుల విద్యార్థులను పంచాయతీ కేంద్ర పాఠశాలలో కలిపారు. వీటిల్లో 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులుంటే మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా లేకుంటే బేసిక్ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేస్తూ ప్రధానోపాధ్యాయుల నుంచి నివేదికలు తీసుకున్నారు. » ఈ క్రమంలో బడుల విలీనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అయినప్పటికీ కొత్త నిబంధనల మేరకు హైసూ్కళ్లలోని స్కూల్ అసిస్టెంట్లను ప్రతి జిల్లాలో వందల సంఖ్యలో మిగులుగా చూపించారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో విద్యాశాఖ పాఠశాలల పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. » హైస్కూళ్లలో ఉన్న 3–5 తరగతుల విద్యార్థులు 45 మంది ఉంటే వారితో మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చాలని, అంతకంటే తక్కువ విద్యార్థులు ఉంటే హైస్కూళ్లల్లో యథాతథంగా ఉంచి, ఆయా ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2 తరగతులను కూడా హైసూ్కళ్లలో విలీనం చేస్తోంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో పాఠశాల పునర్ వ్యవస్థీకరణ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఫలితాలు వస్తున్న తరుణంలో ప్రయోగాలు » గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్ఈపీ–2020 అమలులో భాగంగా పలు విద్యా సంస్కరణలను అమలు చేసింది. 2022 జూన్‌లో జీవో 117 ద్వారా 6 అంచెల స్కూలింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను ఒక కి.మీ దూరంలోని హైసూ్కళ్లకు తరలించి సబ్జెక్టు టీచర్ బోధన అమలు చేసింది. » ప్రాథమిక తరగతులకు సబ్జెక్టు టీచర్ల బోధన విజయవంతంగా కొనసాగుతున్న తరుణంలో రెండేళ్లు పూర్తి కాకుండానే కూటమి ప్రభుత్వం జీవో 117ను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. పాఠశాలలను ఐదు రకాలుగా పునర్ వ్యవస్థీకరిస్తున్నట్టు ఈ ఏడాది జనవరిలో మార్గదర్శకాలు విడుదల చేసింది. » ఇందులో శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్ స్కూళ్లను యథాతథంగా ఉంచారు. ఫౌండేషన్ స్కూల్ ప్లస్‌ను బేసిక్ ప్రైమరీ స్కూళ్లుగా పేరు మార్చారు. ప్రీహైసూ్కళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా, 3–10 తరగతులున్న హైస్కూళ్లను 6–10 తరగతులకు పరిమితం చేసి, 3–5 తరగతులను తిరిగి మోడల్ ప్రైమరీ స్కూళ్లకు తెచ్చే ప్రయత్నం చేశారు. » 1, 2 తరగతులను పూర్తిగా అంగన్వాడీలకు అప్పగించి, 3–5 తరగతులను మోడల్ స్కూళ్లలో ఉంచాలని ఒకసారి, హైసూ్కళ్లలోనే ప్రత్యేకంగా ఉంచి ఎస్జీటీలతో బోధన అందించాలని మరోసారి నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా 3–5 తరగతులున్న కొన్ని హైసూ్కళ్లలో 1, 2 తరగతులను కూడా తరలించి ప్రైమరీ సెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. -
అమరుడా.. నీకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ/గోరంట్ల/కర్నూలు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్ భారత ప్రజానీకం ఈ వీర జవాన్‌కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ దంపతులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్‌లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్‌కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు మురళీ నాయక్ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్‌పోర్టుకు వర్పింన ఆయన.. అక్కడే మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరచిపోదు ‘సైనికుడు మురళీనాయక్ అమరుడవ్వడం చాలా బాధగా ఉంది. వీరోచిత పోరాటంలో తనువు చాలించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. మురళీ నాయక్ భారతమాత నుదుటిన అద్దిన సింధూరమని ఏపీ ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో చనిపోవాలనేవాడుమురళీ నాయక్ చిట్టచివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళీకి సూచించారు. అంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీ నాయక్‌కు చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది. ఒక్క రోజైనా భారత సైన్యంలో పనిచేసి.. మిలటరీ దుస్తులతో చనిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతుండేవాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫాంతోనే వీర మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.నీ త్యాగాన్ని మరువలేంవైఎస్ జగన్ దిగ్భ్రాంతియుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బా«ధాకరం అన్నారు. ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. -
మళ్లించేశారు
సాక్షి, అమరావతి: వరుసగా రెండోసారి పోలవరం నిధులను కూటమి ప్రభుత్వం మళ్లించేసింది..! ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురైనా తీరు మార్చుకోలేదు..! రెండు నెలల కిందట విడుదలైన మలి విడత నిధులను కూడా వాడేసింది..! కేంద్రం లెక్కలు అడుగుతుండడంతో అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది..! ఇలా పదేపదే నిధులను మళ్లించడం.. నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూ సేకరణలో జాప్యానికి కారణం అవుతోందని అధికారులు వాపోతున్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా.. నిధుల సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకు మార్చి 12న కేంద్ర ప్రభుత్వం రెండో విడత అడ్వాన్స్‌గా రూ.2,704.81 కోట్లు ఇచ్చింది. వీటిని తక్షణమే ఎస్ఎన్ఏ(సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమ చేయాలని సూచించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే ఎస్ఎన్ఏ ఖాతాలో వేసింది. మిగతా రూ.2,504.81 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించేసిందనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, ఎస్‌ఎన్‌ఏకు జమ చేసినట్లుగా రసీదు పంపాలంటూ పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) నుంచి రోజూ ఒత్తిడి వస్తుండడంతో జల వనరుల శాఖ అధికారులు బెంబేలెత్తుతున్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో..పోలవరం నిధుల తిరిగి చెల్లింపు (రీయింబర్స్మెంట్) ప్రక్రియలో జాప్యంతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందని, అడ్వాన్సులు ఇచ్చి ప్రాజెక్టు పనులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. దీనికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. తదనంతరం.. పోలవరం పనులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.459.68 కోట్లను రీయింబర్స్ చేస్తూ.. రూ.2,348 కోట్లను తొలి విడత అడ్వాన్స్‌గా (మొత్తం రూ.2807.68 కోట్లు) విడుదల చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ 2024 అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చింది. అదే రోజున రాష్ట్ర ఖజానాలో జమ చేసింది. వీటిని ఎస్ఎన్ఏ ఖాతాలో వేసి.. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర కేబినెట్ నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేశాక.. వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) పంపితే మిగతా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. రెండో విడత అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.2,704.81 కోట్ల విషయంలోనూ ఇదే నిబంధనలు పెట్టింది. కానీ, కూటమి ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే జమ చేసి, మిగతా నిధులను మళ్లించేసింది.నాడు గగ్గోలు.. నేడు అడ్వాన్స్‌లే మళ్లింపుగతంలో పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేసేది. అంటే.. కేంద్రం తిరిగిచ్చేది రాష్ట్ర ప్రభుత్వ నిధులే. వాటిని పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినియోగించింది. అయినా సరే, పోలవరం నిధులను మళ్లించేశారంటూ సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఏకంగా అడ్వాన్స్‌గా ఇచ్చిన నిధులను మళ్లించేయడం గమనార్హం. దీంతో కూటమి ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇది రెండోసారి.. కేంద్రం గత ఏడాది అక్టోబరు 9న తొలి విడత అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.2,348 కోట్లను కూడా కూటమి ప్రభుత్వం మళ్లించేసింది. అయితే, కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనవరి రెండో వారంలో వాటిని ఎస్ఎన్ఏ ఖాతాలో వేసింది. కేంద్రం మరోసారి అసహనం.. దాదాపు రెండు నెలల క్రితం విడుదల చేసిన అడ్వాన్స్ నిధులను ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద పీపీఏ, కేంద్ర జలశక్తి శాఖ అసహనం వ్యక్తం చేస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. నిర్వాసితులకు, సేకరించాల్సిన భూమికి పరిహారం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్స్ నిధులను ఇలా వాడేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
ఖజానాకు రూ.91.55 కోట్లు గండి
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో మరోసారి లాలూ‘ఛీ’పర్వం బట్టబయలైంది. ముఖ్య నేత ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ల సిండికేట్‌లోని సంస్థలు అధిక ధరలకు పనులు దక్కించుకున్నాయి. కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కవడంతో కేవలం ఆరు ప్యాకేజీల టెండర్లలోనే ప్రభుత్వ ఖజానాపై రూ.91.55 కోట్ల మేర భారం పడింది. ఈ సంస్థలు 4.41, 4.40, 4.39 శాతం అధిక ధరకు పనులను పొందడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. » గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టైప్–1, టైప్–2, క్లాస్–4 ఉద్యోగులకు నివాసాలు, మౌలిక సదుపాయాల కల్పన పనులకు నాలుగు ప్యాకేజీల కింద రూ.1,659.30 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఈ–13, ఈ–15 రహదారుల పొడిగింపు పనులకు రూ.454.78 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) నిర్వహించిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. » మొత్తం టెండర్ల అంచనా వ్యయం రూ.2,114.08 కోట్లు కాగా.. రూ.2,205.63 కోట్లకు సిండికేట్‌లోని మూడు కాంట్రాక్టు సంస్థలకు తలా రెండు ప్యాకేజీల చొప్పున ప్రభుత్వం పనులను అప్పగించింది. షాపూర్జీ పల్లోంజీ (రూ.709.12 కోట్లు), ఎల్అండ్టీ (రూ.1023.18 కోట్లు), మేఘా (రూ.473.33 కోట్లు) సంస్థలకు పనులను కట్టబెట్టింది. అధిక ధరలకు అప్పగించడంతో ఈ 6 ప్యాకేజీల పనుల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.91.55 కోట్ల భారం పడింది. » ఆరు ప్యాకేజీల పనుల టెండర్లను ఆమోదిస్తూ, వాటిని కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడానికి అనుమతిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. » పనులు అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నాక కాంట్రాక్టు విలువలో పది శాతం ( రూ.220.56 కోట్లు) మేర మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పనున్నారు. ఇందులో ఎనిమిది శాతం ముఖ్య నేత.. రెండు శాతం కాంట్రాక్టు సంస్థలు పంచుకోవడం బహిరంగ రహస్యమని కాంట్రê క్టు వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఇవీ.. » నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు నేలపాడు వద్ద ఎస్+12 విధానంలో 12 టవర్లలో 1,140 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిన పనుల పూర్తికి రూ.495.31 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించారు. టెండర్లలో 4.40 శాతం అధికం (రూ.517.10 కోట్లు) కోట్ చేసి ఎల్అండ్టీ ఎల్–1గా నిలిచి పనులను దక్కించుకుంది. » గెజిటెడ్ ఆఫీసర్లు, టైప్–1, టైప్–2, క్లాస్–4 అధికారులకు ఎస్+12 విధానంలో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిన పనుల పూర్తికి రూ.492.77 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించారు. 4.39 శాతం అధిక ధరకు (రూ.514.40 కోట్లు) టెండర్లు కోట్ చేసిన షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఎల్–1గా వచ్చి పనులను దక్కించుకుంది. » నేలపాడు వద్ద నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు ఎస్+12 విధానంలో 9 టవర్లలో 855 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిపోయిన పనుల పూర్తికి రూ.484.69 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచారు. 4.41 శాతం అధిక ధరకు (రూ.506.06 కోట్లకు) కోట్ చేసి ఎల్–1గా నిలిచి ఎల్అండ్టీ సంస్థ పనులను చేజిక్కించుకుంది. » టైప్–1, టైప్–2 గెజిటెడ్ ఆఫీసర్లు, గ్రూప్–డి ఆఫీసర్లకు ఎస్+12 విధానంలో 14 టవర్లలో నిరి్మస్తున్న 1,440 ఫ్లాట్లకు తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ సీవరేజీ సిస్టమ్, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేపట్టిన పనుల్లో మిగిలినవాటిని పూర్తి చేయడానికి రూ.186.53 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి పిలిచిన టెండర్లలో 4.39 శాతం అధిక ధరకు (రూ.194.72 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా షాపూర్జీ పల్లోంజీ సంస్థ పనులను దక్కించుకుంది. » ఈ–13 రహదారిని ఎన్‌హెచ్–16 వరకు పొడిగించేందుకు 7.29 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల నిర్మాణానికి రూ.384.78 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లలో 4.10 శాతం అధిక ధరకు (రూ.400.55 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచి మేఘా సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీవరేజీ వంటి పన్నుల రూపంలో అదనంగా రూ.81.92 కోట్లు ఏడీసీఎల్ ఇవ్వనుంది. దీంతో కాంట్రాక్టు విలువ రూ.482.47 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన కి.మీ.కు రూ.66.18 కోట్ల చొప్పున రోడ్డు నిర్మాణ పనులను అప్పగించినట్లు స్పష్టమవుతోంది. కాగా.. ఇదే పద్ధతిలో జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల వ్యయంతోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తుండడం గమనార్హం. » ఈ–15 రహదారిని పొడిగించే పనులకు రూ.70 కోట్ల వ్యయంతో నిర్వహించిన టెండర్లలో 3.98 శాతం అధిక ధరకు (రూ.72.78 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచిన మేఘా సంస్థ వాటిని దక్కించుకుంది. -
‘పట్టాదార్’పై పంతం!
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో రైతులు విలవిల్లాడుతున్నారు. గత ప్రభుత్వంపై అక్కసుతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల జారీని నిలిపి వేయడంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాటిపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉందనే కారణంతోపాటు లేనిపోని నిందలు మోపి 11 నెలలుగా పాస్ పుస్తకాలను జారీ చేయడం లేదు. గత ప్రభుత్వం ఇచి్చన లక్షలాది పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి ఇస్తామని వాటిని వెనక్కి తీసుకుంది. దీంతో రైతులు బ్యాంకులు, ఇతర అవసరమైన చోట వాటి గురించి చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. పాస్ పుస్తకాలు లేవనే కారణంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. తనకు భూమి ఉందని నిరూపించుకునే ఏకైక ఆధారమైన పాస్ పుస్తకం తమ దగ్గర లేక రైతులు కష్టాలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భూముల రీ సర్వేను ప్రారంభించి 2024 ఏప్రిల్ నాటికి 8 వేలకుపైగా గ్రామాల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అత్యాధునికంగా డ్రోన్లతో భూమిని కొలిచి జియో కో–ఆర్డినేట్స్‌తో హద్దులు నిర్ధారించింది. ఆ హద్దుల్లో ప్రభుత్వ ఖర్చుతోనే రాళ్లు పాతించింది. అనంతరం క్యూఆర్ కోడ్‌తో రైతులకు పాస్ పుస్తకాలు జారీ చేసింది. ప్రతి రైతుకు ఆధార్ నంబర్ తరహాలో ఒక యూనిక్ ఐడీని కేటాయించింది. రికార్డుల్లోగానీ, భూమిపైగానీ ఎటువంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి చెప్పేలా చర్యలు తీసుకుంది. తద్వారా స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో రీ సర్వే చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ సర్వే విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్ల రాయితీ ప్రకటించింది. వైఎస్ జగన్ హయాంలో జరిగిన భూ సంస్కరణలను వ్యతిరేకించి, కూటమి నేతలు అభాండాలు మోపారు. ఇటీవల అదే కూటమి ప్రభుత్వం ఆ సొమ్మును స్వీకరించడం విశేషం. కొత్తవి ఎప్పుడిస్తారో తెలీదట! » కూటమి ప్రభుత్వం రీ సర్వేను కొనసాగించినా పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఉందనే కారణంతో 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తయిన భూములకు సంబంధించిన పుస్తకాలను రైతులకు పంచలేదు. పంచిన వాటిని కూడా వీఆర్ఓల ద్వారా వెనక్కి తీసుకుంది. వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.15 కోట్లతో టెండర్ పిలిచింది. » చెన్నైకి చెందిన కంపెనీకి టెండర్ ఖరారు చేసినా ఇప్పటి వరకు ముద్రణ ఏ స్థాయిలో ఉందో కూడా బయటకు తెలియనీయడం లేదు. అవి ఎప్పుడు వస్తాయో తమకు తెలియదని తహశీల్దార్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులు కూడా సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. » పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు కేటాయించారు. కానీ.. పాస్‌పుస్తకాలు లేకపోవడంతో భూముల అమ్మకాలు కూడా జరగడం లేదు. » కొనుగోలు చేసేవాళ్లు రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్నా, పాస్ పుస్తకాలు లేవనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే అడంగల్‌లో పేరు మారుతుంది తప్ప పుస్తకం రావడం లేదు. మరోవైపు రీ సర్వే జరగని గ్రామాల్లోనూ పాస్ పుస్తకాలు జారీ కావడం లేదు. దీంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. -
గ్రామీణ వైద్యానికి గ్రహణం
తాళం వేసి ఉన్న ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని సోమవారప్పాడు విలేజ్ క్లినిక్ ఇది. సుమారు 6 వేల మంది ప్రజలకు వైద్య సేవలు అందించేది. 340 మంది బీపీ బాధితులు, 420 మంది షుగర్ పీడితులు, మంచానికే పరిమితం అయిన ఆరుగురు రోగులు ఈ గ్రామంలో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో నిత్యం 20 మంది ఈ క్లినిక్‌కు వస్తుంటారు. కొన్నాళ్లుగా మూతబడటంతో జ్వరం, దగ్గు, బీపీ, షుగర్ సమస్యలకు మాత్రల కోసం వచ్చిన వారంతా ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) గత నెలలో మొరాయించడంతో పీహెచ్సీలో పార్కింగ్‌కే పరిమితం అయింది. షెడ్యూల్ ప్రకారం అది రోజూ ఒక గ్రామానికి వెళ్లాలి. పీహెచ్సీ వైద్యుడు రోజంతా గ్రామంలోనే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందించాలి. వైద్యుడు వెళ్లేందుకు వాహనం లేకపోవడంతో పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిలిచిపోయింది. సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం పట్ల అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ప్రభుత్వ వైద్య రంగాన్ని అస్తవ్యస్తం చేసి పేదలకు సేవలను దూరం చేస్తోంది. ‘పీపీపీ’ పేరుతో ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం దగ్గర నుంచి ఆరోగ్యశ్రీని బీమా విధానం అంటూ దళారుల చేతిలో పెట్టడం దాకా ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో పేదలకు వైద్య చికిత్సలు పొందడం పెనుభారంగా మారుతోంది. గత ప్రభుత్వంలో ఠంఛన్‌గా పీహెచ్సీ వైద్యులతో గ్రామాలకు వెళ్లిన 104 ఎంఎంయూలు మూలనపడ్డాయి. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నీరుగారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విలేజ్ క్లినిక్స్‌కు తాళాలు వేసి ఉండటం దయనీయ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. మొక్కుబడిగా ఫ్యామిలీ డాక్టర్.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా డాక్టర్లు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కారు ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని మొక్కుబడి తంతులా నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటి నుంచి 104 వాహనాల నిర్వహణను గాలికి వదిలేసింది. మందుల సరఫరా నిలిపేసింది. వాస్తవానికి పీహెచ్సీ పరిధిలోని అన్ని విలేజ్ క్లినిక్‌లను వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శించాలి. రోజంతా గ్రామంలోనే అందుబాటులో ఉండాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీలు చూసి, మధ్యాహ్నం నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జి అయిన రోగులు, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఇళ్లకు వెళ్లి ఆరోగ్యంపై వాకబు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలను సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారం వారం సమీక్షలు నిర్వహించేవారు ఇప్పుడా పరిస్థితులు లేవు. ప్రభుత్వమే ప్రజారోగ్యాన్ని తేలిగ్గా తీసుకోవడంతో జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. బీపీ పరిశీలించే దిక్కులేదు.. ఒకవైపు పీహెచ్సీ వైద్యులు గ్రామాలకు రాకపోవడం.. మరోవైపు విలేజ్ క్లినిక్స్‌లో ఉండే వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో పల్లెల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విలేజ్ క్లినిక్స్‌లో సేవలు అందించడం కోసం ప్రత్యేకంగా నియమితులైన ఈ వైద్యులు కొద్ది వారాలుగా సమ్మె బాట పట్టడంతో బీపీ, షుగర్ బాధితులు 5–10 కి.మీ. దూరంలో ఉండే పీహెచ్‌సీలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రివెంటివ్ కేర్‌లో అత్యంత కీలకమైన సిబ్బంది విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నా సర్కారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మందులు నిల్.. జబ్బులపై ఆరా లేదు బీపీ, షుగర్, ఊబకాయం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. లేదంటే గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. గత ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సచివాలయాలవారీగా బీపీ, షుగర్, ఇతర జబ్బుల బాధితుల వివరాలను నమోదు చేసి ఫ్యామిలీ డాక్టర్ యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. వైద్యుడు గ్రామానికి వెళ్లగానే యాప్‌లోని వివరాల ఆధారంగా వాకబు చేసేవారు. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యను గుర్తిస్తే వెంటనే పెద్దాసుపత్రికి రెఫర్ చేసి వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానం అస్తవ్యస్తంగా మారడంతో జబ్బుల గురించి వాకబు చేసే దిక్కు లేకుండా పోయింది. బీపీ, షుగర్, గుండె, మెదడు సంబంధిత కాంబినేషన్ మందులు 104లో అందుబాటులో ఉండటం లేదు. చిన్న చిన్న సమస్యలకు మందులతో పాటు దగ్గు, జలుబు, జ్వరం సిరప్లు ఎంఎంయూల్లో లభించడం లేదు. గత ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి విలేజ్ క్లినిక్స్‌కు 105 రకాల మందులు, 14 రకాల టెస్టింగ్ కిట్స్‌ను సరఫరా చేసింది. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా స్పెషలిస్ట్ వైద్యులే గ్రామాలు, వార్డు స్థాయిలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. కూటమి సర్కారు పాలనలో స్పెషలిస్ట్ వైద్య సేవల ఊసే లేకుండా పోయింది. భరోసా కరువు...గత ప్రభుత్వం ‘ఆరోగ్య సురక్ష’లో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను సచివాలయాలవారీగా ఆన్లైన్లో పొందుపరిచింది. దాని ఆధారంగా విలేజ్ క్లినిక్‌లోని వైద్యులు ప్రతి నెలా క్యాన్సర్, గుండె, మెదడు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు అవసరమయ్యే ఖరీదైన మందులను ఆన్లైన్లో ఇండెంట్ పెట్టేవారు. ఏపీఎంఎస్ఐడీసీ వాటిని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పోస్టల్ ద్వారా గ్రామాలకు చేరవేసేది. సీహెచ్‌వో/ఏఎన్ఎంలు ఆ మందుల పార్శిళ్లను బాధితుల ఇంటి వద్దకు చేరవేసి ఎలా వాడాలో వివరించేవారు. జూన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మందులను గ్రామాలకు పంపడం లేదు. దీంతో వ్యాధిగ్రస్తులకు భరోసా కరువైంది. బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్, కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల బాధితులు ఖరీదైన మందులు కొనాలంటే ప్రతి నెలా రూ.వేలల్లో ఖర్చు అవుతుంది. పేద కుటుంబాలకు ఇది పెనుభారమే. మోతాదు ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడకుంటే జబ్బు ముదిరి, తిరగబెట్టి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతుంటాయి.తాళం వేశారు.. నాకు బీపీ, షుగర్ సమస్యలున్నాయి. ఇంటి పక్కనే ఆస్పత్రి (విలేజ్ క్లినిక్) ఉండటంతో క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుని మందులు వాడే దాన్ని. ఇప్పుడు విలేజ్ క్లినిక్‌కు తాళం వేశారు. – సావిత్రి, వృద్ధురాలు, సోమవారప్పాడు, ఏలూరు జిల్లాఇప్పుడే చూస్తున్నాం.. మా వీధిలో ఉండే విలేజ్ క్లినిక్‌కు తాళం వేయడంతో బీపీ చెక్ చేయించుకోవాలన్నా పీహెచ్సీ వరకూ వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఎప్పుడూ విలేజ్ క్లినిక్‌కు తాళం వేసిన దాఖలాలు లేవు. ఇప్పుడే చూస్తున్నాం. –వెంకాయమ్మ, సోమవారప్పాడు, ఏలూరు జిల్లాఆ పద్ధతి బాగుంది... గత ప్రభుత్వంలో డాక్టర్లు ఇంటివద్దకే వచ్చి మంచం నుంచి లేవలేని వాళ్లకు పరీక్షలు చేసి మందులు ఇచ్చేవారు. ఆ పద్ధతి బాగుంది. ఇప్పుడు ఆ విధానం సరిగా నడవడం లేదు. 104లో మందులు ఉండటం లేదు. ఆస్పత్రులకు వెళ్లి రావాలంటే ఇబ్బంది పడుతున్నాం. డెంగీ, మలేరియా, విష జ్వరాలు సోకుతున్నా పట్టించుకోవడం లేదు. – పెద్దన్న, కోటపాడు, నంద్యాల జిల్లా -
వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత విషయంలో.. కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: జెడ్ ప్లస్ భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, సీఆర్పీఎఫ్ డీజీ, ఎన్ఎస్జీ డీజీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. జెడ్ ప్లస్ భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించే విషయంలో తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర భద్రతా సంస్థలైన సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీలతో తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి వాదనలు విన్నారు. వైఎస్ జగన్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, నిర్దిష్ట ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా వైఎస్ జగన్‌కు ఉన్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపు చేసి జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. జగన్‌కు ఉన్న ప్రాణహానిని, ఆయనపై గతంలో జరిగిన హత్యాయత్నాన్ని పరిగణనలోకి తీసుకుని జెడ్ ప్లస్ భద్రత కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఎలాంటి నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైఎస్ జగన్ భద్రతను భారీగా కుదించేశారని, ఇటీవల పలు సందర్భాల్లోనూ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని చెప్పారు. పర్యటనలు, పరామర్శలకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని నాగిరెడ్డి వివరించారు. భద్రత విషయంలో వైఎస్ జగన్ గతంలో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు మళ్లీ పిటిషన్ వేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు స్పందిస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. -
ఈ నెల 13న కల్లితండాకు వైఎస్ జగన్
తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 13వ తేదీన కల్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా 13వ తేదీన కల్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ద దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందారు. -
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ
అమరావతి: తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్దరించేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు(శుక్రవారం) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తన భద్రత విషయంలో వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్న కారణంగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత పునరుద్దరించేలా వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగ్గా, వైఎస్ జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.‘‘వైఎస్ జగన్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. కావాలనే జగన్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే భద్రతకు సంబంధించిన అంశంపై ఒక రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉంది’అని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. -
తెలుగు జవాన్ వీర మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు. మురళీనాయక్ కుటుంబీకులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు.భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.Deeply pained by the martyrdom of our brave Telugu Jawan, Murali Nayak, from Penukonda, Satyasai district, in the India-Pakistan battlefield in J&K.His supreme sacrifice for the nation will forever inspire us.My heartfelt condolences to his family.We stand with them in this… pic.twitter.com/HfoFixNnZd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 9, 2025దేశ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉర్సాకు పెట్టుపోతలు పూర్తయినట్టేనా?
కంపెనీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీల్లాంటివి ఇవ్వడం సహజమే కానీ.. ఓ స్టార్టప్ కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నం మాత్రం కని విని ఎరగనిదే! ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండు నెలల వయసున్న ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో సుమారు 60 ఎకరాల భూమిని ధారాదత్తం చేసింది. ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ తోసిరాజంటోంది అక్కడి ప్రభుత్వం. ఉర్సా వ్యవస్థాపకుల గత చరిత్ర.. వారి వెనుక ఉన్న పెద్దల సంగతి అన్నింటిలోనూ పలు అనుమానాలున్నా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రభుత్వం భూమిని కట్టబెట్టేందుకే సై అనింది.పెందుర్తి విజయకుమార్, అబ్బూరి సతీష్ అనే ఇద్దరు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు మొదట వార్తలొచ్చినా.. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్లుగా కొత్త కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయి. అమెరికా వాసి తాళ్లూరి జయశేఖర్ అనే వ్యక్తి ఉర్సా తరఫున ఆన్లైన్లో మీడియా సమావేశం నిర్వహించి తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అయితే అనుకూల మీడియాతోనే నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పలు అంశాలకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ కంపెనీ సుమారు రూ.5600 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెబుతున్నారు.తొలుత రూ.200 కోట్లు వచ్చిస్తారట. ఆర్థిక సహకారం అందించే వారెవ్వరన్నది వారి కోరిక మేరకు రహస్యంగా ఉంచారట. ఈయనకు బీజేపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌కూ బంధుత్వం కూడా ఉందట. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేరు ఈ వివాదంలోకి రావడం, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానినే ఆరోపణలు సంధించడం సంచలనంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటటన్నది ఇంకా స్పష్టత రానప్పటికీ, డీల్ వెనుక చాలా ప్రముఖుల హస్తమే ఉండవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. పరిశ్రమల ముసుగులో ఎవరికి పడితే వారికి, ఇష్టారీతిన భూములు కట్టబెడితే అది ఏపీకి తీరని నష్టం చేస్తుంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక ఎలాగైనే చేయవచ్చులే అనుకుంటే అనుకోవచ్చు. కాని పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండకపోవచ్చు.విశాఖలో ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు ఎకరా కేవలం 99 పైసలకే కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. టీసీఎస్‌కు 21 ఎకరాలు ఇస్తే, ఊరు పేరు లేని ఈ ఉర్సా కంపెనీకి అరవై ఎకరాలా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. విశాఖలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది కనుక తమకు నచ్చిన వారికి పందారం చేస్తున్న నేతలు అమరావతిలో ఇచ్చి ఉండవచ్చు కదా అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఉర్సా కంపెనీకి భూమి ఇస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఎవరికి అర్థం కాలేదు. డిజిటల్ మీడియా దీనిపై పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలకే ఇస్తున్నారన్న అభిప్రాయం కలిగింది.అప్పుడు కేవలం టీసీఎస్‌కు ఇచ్చిన భూమి విలువ చెప్పి ఈ ఉర్సా కంపెనీకి ఎంతకు ఇచ్చింది ప్రభుత్వం వెల్లడించలేదు. వివాదం చెలరేగిన తర్వాత ఉర్సా కంపెనీ డైరెక్టర్‌గా చెప్పుకున్న జయశేఖర్ తమకు ఎకరం రూ.ఏభై లక్షల చొప్పున ఇచ్చారని వెల్లడించారు. ఆ రకంగా చూసినా ఈ కంపెనీకి కేవలం రూ.మూడు వేల కోట్ల విలువైన భూమిని రూ.30 కోట్లకే ఇచ్చినట్లవుతుంది. అసలు ప్రభుత్వం భూమి అమ్మకం కాకుండా, లీజు పద్దతిలో ఇచ్చి ఉంటే, ఏదో కొంత ఎక్కువ, తక్కువకు భూమి కేటాయించారులే అని సరి పెట్టుకోవచ్చు.ఏ మాత్రం అనుభవం లేని సంస్థలకు భూములు అమ్మేస్తే, తదుపరి ఈ సంస్థలు ఆశించిన రీతిలో పని చేయకపోయినా, మూతపడినా, ఆ భూమి మాత్రం వారి సొంతం అవుతుంది. అప్పుడు వారికి భారీ లాభం చేకూరుతుంది కదా అన్నది మేధావుల భావన. దీనికి ప్రభుత్వం నుంచి ఎవరూ సమాధానం ఇస్తున్నట్లుగా లేదు. విశేషం ఏమిటంటే ఈ ఉర్సా కంపెనీ హైదరాబాద్‌లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ అడ్రస్ లో రిజిస్టర్ చేయడం. దీనికి ఒక వెబ్సైట్ కాని, ఇతరత్రా సిబ్బంది తదితర హంగు ఆర్భాటాలేవీ లేవు. ఆ తర్వాత ఏదో వెబ్‌సైట్‌ను చూపించినా, దాని అనుమతి ఒక ఏడాదికే ఉన్నట్లు తెలిసింది. అందులో ఉన్న వివరాలపై కూడా అనేక సందేహాలు వచ్చాయి.మాజీ ఎంపీ కేశినేని నాని అయితే ఈ కంపెనీ టీపీపీ ఎంపీ కేశినేని చిన్ని బినామీ సంస్థ అని ఆరోపించారు. అబ్బూరి సతీష్, ఈయన వ్యాపార భాగస్వాములని, ఒక ప్రాపర్టీ సంస్థను స్థాపించి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. విశాఖలో భూమి కొట్టేయడానికే ఈ ప్లాన్ అని ఆయన అన్నారు. దీన్ని చిన్ని ఆయన మద్దతుదారులు కొందరు ఖండించినప్పటికీ, అసలు ఉర్సా కంపెనీ సామర్ధ్యం, అమెరికాలో ఈ సంస్థ కట్టిన పన్ను, అనుభవం తదితర వివరాలు బయటకు వచ్చాక, ఇది ఎవరికో బినామీనే అన్న అనుమానాలు బలపడ్డాయి. సతీష్ అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి. పెందుర్తి విజయకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నారని వైసీపీ సంయుక్త కార్యదర్శి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌కు వీరికి ఉన్న స్నేహ సంబంధాలపై కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన దీనిపై వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు.ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెడతామని అంటే పరిశ్రమల శాఖ అన్ని విషయాలను పరిశీలించాలి. అవేవి చూడకుండా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించి, ఆ పైన మంత్రివర్గం ఓకే చేయడం కచ్చితంగా సందేహాలకు తావిస్తుంది. ఒక వైపు గత ప్రభుత్వ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అధికంగా ఆర్డర్లు, మరికొన్నిటికి తక్కువ ఆర్డర్లు ఇవ్వడంతో రూ.మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం పిచ్చి కేసు పెడుతోంది. మరో వైపు ఒక్క డీల్లోనే రూ.మూడు వేల కోట్ల భూమి స్కామ్ కు ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖను కారుచౌకగా అమ్మేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశంలో కూడా గగ్గోలుగా చెప్పుకుంటున్నారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి బోగస్ కంపెనీలకు భూములు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లో బిల్లీరావు అనే వ్యక్తి సంస్థకు 400 ఎకరాల భూమిని విక్రయించడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అలాగే సదస్సులు పెట్టి పలు బోగస్ ఒప్పందాలు చేసుకున్నారన్న అప్రతిష్ట కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చింది. ఏది ఏమైనా ఉర్సా కంపెనీకి అరవై ఎకరాల భూమి కేటాయింపును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా?లేక ఇదే రీతిలో ముందుకు సాగుతుందా అన్నది చర్చ.కాని ప్రభుత్వం తీరు చూస్తే ఈ అడ్డగోలు తతంగాన్ని కొనసాగించేలానే కనిపిస్తోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.