
విజయవాడ: ఈ నెల 19 నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మొత్తం 3,62, 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాలతో పాటు హైదరాబాద్ లో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు నిన్న(గురువారం, మే 15వ తేదీ) విడుదలయ్యాయి. మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను కూడా తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.
మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను కూడా తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.
ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా మరియు బీఎస్సీ (గణిత శాస్త్రం) విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి BE / BTech / B.Pharmacy కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండవ సంవత్సరంలో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు, త్వరలో ప్రారంభమయ్యే AP ECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా తగిన సీట్లను పొందవచ్చు.