ఎల్లుండి కల్లితండాకు వైఎస్ జగన్ | YSRCP President YS Jagan Mohan Reddy To kali thanda On May 13th | Sakshi
Sakshi News home page

ఎల్లుండి కల్లితండాకు వైఎస్ జగన్

May 11 2025 6:33 PM | Updated on May 13 2025 3:23 PM

YSRCP President YS Jagan Mohan Reddy To kali thanda On May 13th

తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ మురళీ నాయక్‌ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎల్లుండి(మంగళవారం, మే 13వ తేదీ)కల్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన సంగతి తెలిసిందే.  

ఇప్పటికే వీర జవాన్ మురళీ నాయక్  కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్‌. దీనిలో భాగంగా 13వ తేదీన కల్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.

కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్  దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందగా, ఈరోజు(ఆదివారం) సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిన్న(శనివారం) బెంగళూరు నుంచి కల్లి తండాకు వీర జవాన్‌ మురళీ నాయక్ పార్ధివదేహాన్ని తరలించగా, నేడు అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement