
సాక్షి,పల్నాడు: మూడు హత్య కేసుల్లో నిందితుడైన తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2023 మే 5న నరసరావుపేటలో సలీమా అనే మహిళను తన్నీరు అంకమ్మరావు దారుణంగా హత్య చేశాడు.
అయితే ఈ హత్యపై గురువారం నరసరావుపేట కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం,అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట కోర్టు చరిత్రలో తొలిసారి న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.
ప్రస్తుతం మరో హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అంకమ్మరావు..నరసరావుపేటలో మూడు హత్యలు చేశాడు. జులాయిగా తిరుగుతూ మూడు హత్యలకి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది.