నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan Key Meeting With Local Body Representatives On May 20th, More Details Inside | Sakshi
Sakshi News home page

నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ

May 20 2025 5:03 AM | Updated on May 20 2025 10:56 AM

YS Jagan to meet local body representatives on may 20

సాక్షి, అమరావతి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజాప్రతినిధులతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ఆహ్వానించారు. వారితోపాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు.

	ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

Advertisement
 
Advertisement
Advertisement