
‘ఎక్స్’లో విడుదల చేసిన మంత్రి లోకేశ్
7190 సీట్లకు 62047 మంది పోటీ
త్వరలో ప్రవేశాల షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఎస్) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ , డిగ్రీ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్‌ఎస్ సెట్, ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ సెట్ ఫలితాలు బుధవారం ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో విడుదల చేశారు. అన్ని విభాగాల్లో 7,190 సీట్లకు 62,047 మంది విద్యార్థులు పోటీ పడ్డారు.
ఐదో తరగతిలో 3920 సీట్లకు 14061 మంది పోటీ పడగా, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అలాగే, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 1425 సీట్లకు 41,215 మంది, డిగ్రీ మొదటి సంవత్సరంలో 220 సీట్లకు 1,018 మంది పోటీపడ్డారు. పరీక్ష రాసిన అందరికీ ర్యాంకులు ప్రకటించారు.
ఫలితాలను విద్యార్థి ఐడీ ద్వారా https:// aprs.apcfss.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని ఏపీఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి వీఎన్ మస్తానయ్య తెలిపారు. పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల జాబితాతో పాటు జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
టాపర్లు వీరే..
ప్రవేశ పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఐదో తరగతిలో వజ్రపు శశికుమార్ (శృంగవరపుకోట, విజయనగరం జిల్లా), ఆరో తరగతి గొల్లంగి మౌనిక (రాళ్లపాడు, శ్రీకాకుళం జిల్లా), ఏడో తరగతిలో కర్రా తనీశి శ్రీవర్షిణి (భోగాపురం, అనకాపల్లి జిల్లా), ఎనిమిదో తరగతి వల్లూరి రిచా (చిన్నయగూడెం, తూర్పు గోదావరి జిల్లా) అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.
ఇంటర్మీడియట్‌లో..
» ఎంపీసీ– బాలినేని కళ్యాణ్ రామ్ (సింగివలస, విశాఖ జిల్లా)
» బైపీసీ– బొడ్డుపల్లి మనోజ్ కుమార్ (కంతేరు, రాజమండ్రి రూరల్)
» ఎంఈసీ/సీఈసీ– మాదివాడ వేదాశ్రిత (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా)
»ఈఈటీ– దగరి సాయి చరణ్ (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా)
» సీజీటీ– సరికి చరణ్ (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా)
డిగ్రీలో..
» బీఏ– కోటకొండ విజయుడు (మునగాల, కర్నూలు జిల్లా)
»బీకామ్– చిన్నబసప్పగారి బసవరాజు (భైరవాని తిప్ప, అనంతపురం జిల్లా)
»బీఎస్సీ (కెమిస్ట్రీ)– అడపా విజయ్ (నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా)
» బీఎస్సీ (డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్)– కల్వటాల కిరీటి (ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా)
» బీ.ఎస్సీ (జువాలజీ)– వంతల శ్రీకాంత్ (గాడేపల్లి, అల్లూరి సీతారామరాజు)