స్టీల్‌ప్లాంట్‌ కార్మిక నాయకులకు బెదిరింపులు | Threats to Visakha Steel Plant labor leaders: Andhra pradesh | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ కార్మిక నాయకులకు బెదిరింపులు

Feb 17 2026 4:32 AM | Updated on Feb 17 2026 4:59 AM

Threats to Visakha Steel Plant labor leaders: Andhra pradesh

సమ్మెలో పాల్గొన్న 146 మంది నేతలకు వార్నింగ్‌ లెటర్లు 

ఉక్కునగరం: ఈ నెల 12న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న స్టీల్‌ప్లాంట్‌ కార్మిక నాయకులకు యాజమాన్యం వార్నింగ్‌ లెటర్లు జారీ చేసింది. దేశవ్యాప్త కార్మిక సమస్యలు, లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 12న దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది. ఈ సమ్మెలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కూడా కొంతమంది పాల్గొన్నా­రు.

ఈ కారణంతో 146 మంది కార్మిక నాయ­కులు, కార్మికులకు యాజమాన్యం వార్నింగ్‌ లె­టర్లు అందజేసింది. సమ్మెలోని అంశాలు రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ వద్ద సయోధ్య దశలో ఉ­న్నందున సమ్మె చట్ట వ్యతిరేకమన్నారు. ఇకపై అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్నా­రు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన లేబర్‌ కోడ్‌­లను అమలు చేయడం ద్వారా కార్మిక నాయకులకు వార్నింగ్‌ లెటర్లు ఇవ్వడంపై స్టీల్‌ప్లాంట్‌ కార్మిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement