AP ECET 2025: ఏపీ ఈసెట్‌ ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే | Ap Ecet 2025 Results Release | Sakshi
Sakshi News home page

AP ECET 2025: ఏపీ ఈసెట్‌ ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

May 15 2025 5:46 PM | Updated on May 15 2025 6:27 PM

Ap Ecet 2025 Results Release

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి.. sakshieducation.com ద్వారా ఫలితాలను పొందవచ్చు.

ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా మరియు బీఎస్సీ (గణిత శాస్త్రం) విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి BE / BTech / B.Pharmacy కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండవ సంవత్సరంలో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు, త్వరలో ప్రారంభమయ్యే AP ECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా తగిన సీట్లను పొందవచ్చు.

మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను కూడా తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.

AP ECET Results Direct Link

క్లిక్‌👉 ఏపీ ఈసెట్‌ రిజల్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement