ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం.. పంచదార్ల నో మైనింగ్‌ జోన్‌ | Government declares Panchadharla a no mining zone | Sakshi
Sakshi News home page

ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం.. పంచదార్ల నో మైనింగ్‌ జోన్‌

Jul 23 2026 12:08 AM | Updated on Jul 23 2026 12:25 AM

Government declares Panchadharla a no mining zone

సాక్షి, అనకాపల్లి: అక్రమమైనింగ్‌ వ్యవహారంలో వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్మపోరాటానికి కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్లను నోమైనింగ్‌ జోన్‌గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  పర్యావరణ నిబంధనలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. మైనింగ్‌ సంస్థ ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఎస్టాబ్లిష్మెంట్ ఆపరేషన్ తక్షణమే రద్దు చేయాలని తెలిపింది. పంచదార్ల సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించింది.

మరోవైపు పంచదార్లను నోమైనింగ్‌ జోన్‌గా చేపట్టాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. లేకుంటే పెద్దఎత్తున పోరాటం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వైఎస్సార్సీపీ హెచ్చరికల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గి పంచదార్లను నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement