
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాలో పర్యటించనున్నారు.
ఉదయం 11.30 గంటలకు కల్లి తండాలోని వీర జవాన్ మురళీ నాయక్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరుతారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల ఇప్పటికే సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్... కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
