
ఢిల్లీ: ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా కేసు దర్యాప్తుకు హాజరుకావాలని, అధికారులకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.