
సాక్షి, అమరావతి: మరోసారి ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలు బయటపడ్డాయి. సెకీ సీఎండీ రామేశ్వరగుప్తాను కేంద్రం తొలగించిన వార్తపై ఈనాడు వక్రభాష్యం చెప్పింది. వైఎస్ జగన్ హయాంలో ఏపీలో జరిగిన విద్యుత్ ఒప్పందాలే తొలగింపునకు కారణం అంటూ ఈనాడు అబద్ధాలు రాసింది.
2023లో జూన్‌లో సెకీ సీఎండీగా రామేశ్వర్ పదవి చేపట్టగా.. రామేశ్వర్ గుప్తా ఛైర్మన్ కాకముందే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. రామేశ్వర్ గుప్తా సెకీలో లేనప్పుడు ఒప్పందాలు జరిగితే.. ఆయన తొలగింపునకు ఏపీతో జరిగిన ఒప్పందాలే కారణమంటూ ఈనాడు అబద్ధాలు అచ్చేసింది.
2021 డిసెంబర్‌లోనే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని ఈనాడు ఒప్పుకుంది. అబద్ధం వండివార్చాలనే తాపత్రయంలో కనీసం వాస్తవాలు ఏంటో తెలుసుకోని ఈనాడు.. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయింది.

ఈనాడు పిచ్చిరాతలపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా?. ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబర్‌లో ఒప్పందం జరిగింది. 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తా నియమితులయ్యారు. 2023లో ఛైర్మన్ అయిన రామేశ్వర్ గుప్తాకు 2021 నాటి ఏపీ-సెకీ ఒప్పందానికి ఏం సంబంధం’’ అంటూ వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.
🚨 #BanYellowMediaSaveAP
ఏమిటీ రాక్షసత్వం. వైయస్.జగన్మోహన్రెడ్డిగారి వ్యక్తిత్వ హననంకోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? “ఈనాడూ’’ మీది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?
విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబరులో ఒప్పందం.
2023లో సెకీ… pic.twitter.com/CJzt414GJH— YSR Congress Party (@YSRCParty) May 17, 2025
‘‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాకముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణలు నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా 5-6 రోజులుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ-సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ.. నిస్సిగ్గుగా ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది’’ అని వైఎస్సార్‌సీపీ మండిపడింది.