డీజీపీ అపాయింట్‌మెంట్‌ కోరిన వైఎస్సార్‌సీపీ | Ysrcp Writes Letter To Dgp Seeking Appointment | Sakshi
Sakshi News home page

అక్రమ అరెస్ట్‌లు.. వేధింపులు.. డీజీపీ అపాయింట్‌మెంట్‌ కోరిన వైఎస్సార్‌సీపీ

May 12 2025 7:07 PM | Updated on May 12 2025 7:27 PM

Ysrcp Writes Letter To Dgp Seeking Appointment

లేఖ రాసిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దాంతో పాటు, యథేచ్ఛగా సాగుతున్న పోలీసుల అక్రమ అరెస్టులు, వేధింపులపై వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి రాసిన లేఖను పార్టీ ప్రతినిధులు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.

మాజీ మంత్రి విడదల రజినిపై సీఐ దౌర్జన్యంగా వ్యవహరించిన నేపథ్యంలో, రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న శాంతి భద్రతలు, విపక్షంపై సాగుతున్న పోలీసులు వేధింపులు, అక్రమ అరెస్టులు.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదంగా మారుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంకా అవన్నీ కచ్చితంగా పౌరుల హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. వీటన్నింటిపై వినతి పత్రం సమర్పించేందుకు డీజీపీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని తమ లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement