జగనన్న 2.0లో వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం: ఆర్కే రోజా | YSRCP Women Wing State Level Meeting Updates | Sakshi
Sakshi News home page

జగనన్న 2.0లో వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం: ఆర్కే రోజా

May 13 2025 9:00 AM | Updated on May 13 2025 1:07 PM

YSRCP Women Wing State Level Meeting Updates

సాక్షి, తాడేపల్లి: నేడు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, అప్పిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి  ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతుందని.. ఈ పాలనను అంతమొందించే వరకు మహిళలు పని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌ ప్రతి మహిళ గర్వపడేలా పాలించారు. మహిళలకు ఇచ్చిన హామీలు జగనన్న కులం, మతం, పార్టీ చూడకుండా అమలు చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ మహిళలనే కాదు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళలను కూడా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు.

‘‘పాకిస్తాన్ ఉగ్రవాదుల పై సోఫియా ఖురేషి, ఒమిక సింగ్‌ల పోరాటం అందరికి ఆదర్శం. వైఎస్సార్‌ కాంగ్రెస్ మహిళలు కూడా వారిలానే టీడీపీ ఉన్మాదులపై పోరాడాలి. టీడీపీ రాష్ట్రంలో పోలీసులు, సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. పార్టీ నాయకులు, మహిళ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ కేసులకు, వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ రెచ్చిపోతున్న వారికి అంబేద్కర్ రాజ్యాంగంతో శిక్షిస్తాం. మహిళలు వేధించిన వాళ్ళందరి పేర్లు బ్లూ బుక్‌లో రాస్తాం. జగనన్న 2.0 లో తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం’’ అని ఆర్కే రోజా అన్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement