state level meeting
-
జగనన్న 2.0లో వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: నేడు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, అప్పిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతుందని.. ఈ పాలనను అంతమొందించే వరకు మహిళలు పని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ప్రతి మహిళ గర్వపడేలా పాలించారు. మహిళలకు ఇచ్చిన హామీలు జగనన్న కులం, మతం, పార్టీ చూడకుండా అమలు చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ మహిళలనే కాదు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళలను కూడా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు.‘‘పాకిస్తాన్ ఉగ్రవాదుల పై సోఫియా ఖురేషి, ఒమిక సింగ్‌ల పోరాటం అందరికి ఆదర్శం. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళలు కూడా వారిలానే టీడీపీ ఉన్మాదులపై పోరాడాలి. టీడీపీ రాష్ట్రంలో పోలీసులు, సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. పార్టీ నాయకులు, మహిళ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ కేసులకు, వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ రెచ్చిపోతున్న వారికి అంబేద్కర్ రాజ్యాంగంతో శిక్షిస్తాం. మహిళలు వేధించిన వాళ్ళందరి పేర్లు బ్లూ బుక్‌లో రాస్తాం. జగనన్న 2.0 లో తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం’’ అని ఆర్కే రోజా అన్నారు. -
పాలన విజయవాడ నుంచే సాగాలి : విశాఖ ఎంపీ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పాలన విజయవాడ నుంచే కొనసాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాజధానిగా ఉంది... ఈ నేపథ్యంలో మరో రాష్ట్ర రాజధాని నుంచి పాలన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.హరిబాబు మాట్లాడారు. ఈ సమావేశానికి బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు భారీగా కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా గ్రామ, మండల, జిల్లా, కార్పొరేషన్ స్థాయి అధ్యక్ష ఎన్నికలపై నాయకులు ఈ సందర్భంగా భారీ కసరత్తు చేయనున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడ్ని డిసెంబర్ రెండవ వారంలో ఎన్నుకోనున్నారు. ఆ అంశంపై కూడా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. -
నేడు బెజవాడలో బీజేపీ రాష్ట్రస్థాయి భేటీ
విజయవాడ : బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. గ్రామ, మండల, జిల్లా, కార్పొరేషన్ స్థాయి అధ్యక్ష ఎన్నికలపై ఈ సమావేశంలో ఆ పార్టీ నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆ పార్టీ కేంద్ర నాయకులతోపాటు రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు కార్యకర్తలు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. అలాగే డిసెంబర్ రెండో వారంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరీ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుల్లో ఒకరిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై కూడా ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరగనుంది. అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబుపై తీవ్ర పని ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని బీజేపీ అగ్రనాయకత్వాన్ని హరిబాబు కోరినట్లు సమాచారం. అదికాక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు ఇప్పటికే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్టస్థాయి భేటీ నేడు
సాక్షి, హైదరాబాద్: విభజన రాజకీయాలు, సమైక్య ఉద్యమ సెగల నేపథ్యంలో సోమవారం జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంస్థాగత విషయాలు, తదుపరి పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇందులో చర్చిస్తారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తరువాత జరుగుతున్న తొలి విస్తృతస్థాయి సమావేశం ఇదే కనుక అనేక ప్రధానమైన అంశాలు ఇందులో చర్చకు వస్తాయి. గతంలో సెప్టెంబర్ 21న జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఒక నెల రోజుల ఆందోళన కార్యక్రమానికి పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడమేకాక, ఇప్పటికీ చురుగ్గా ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఢిల్లీలో ఓ వైపు విభజన ప్రక్రియ వేగవంతంగా సాగుతున్న తరుణంలో సోమవారం జరగనున్న ఈ సమావేశంలో అధ్యక్ష హోదాలో జగన్.. రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిస్థితులపై కీలకోపన్యాసం చేస్తారు. మరో నెలన్నర రోజుల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించబోతున్నందున పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన తన ఉపన్యాసంలో దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. విభజన రాజకీయాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా గాలికి వదలి వేసింది, టీడీపీతో కుమ్మక్కయి ఎలా రాజకీయాలు చేస్తున్నదీ సమావేశంలో చర్చించడంతో పాటుగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై ఒక నిర్ణయం తీసుకుంటారు. 9.30 గంటలకే.. రాష్ట్ర స్థాయి సమావేశంలో ఉదయం 9.30 గంటల నుంచే నేతల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. పది గంటలకు సమావేశం మొదలవుతుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లో గల ఖాజా మాన్షన్ ఫంక్ష న్ హాలులో సమావేశం జరుగుతుందని సంస్థాగత వ్యవహారాల పార్టీ కో-ఆర్డినేటర్ పి.ఎన్.వి. ప్రసాద్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్‌కు సమీపంలో గల ఈ హాలుకు సకాలంలో ప్రతినిధులు చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీజీసీ, సీఈసీ సభ్యులు, లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలు, పార్టీ జిల్లా కన్వీనర్లు, రాష్ట్ర అధికార ప్రతి నిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర కన్వీనర్లు, పార్టీ ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు పాల్గొనాల్సి ఉంటుంది. 23న సాంస్కృతిక ప్రచార కమిటీ సమావేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చించడం కోసం ఈ నెల 23, 24 తేదీల్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని పార్టీ సాంస్కృతిక, ప్రచార కమిటీ విభాగాలు నిర్ణయించాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ప్రచార, సాంస్కృతిక విభాగాల కన్వీనర్లు టీఎస్ విజయ్‌చందర్, వంగపండు ఉషలతో పాటు పలువురు నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 23, 24 తేదీల్లో మరోసారి సమావేశమై పలు నిర్ణయాలు తీసుకోవాలని నేతలు భావించారు.