
నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈ నెల 15 నుంచి జూన్ 30 వరకు వేసవి సెలవులను ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటికే పరీక్షలు ముగియడంతో పీయూసీ ద్వితీయ, ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాల విద్యార్థులు క్యాంపస్‌లను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు.
పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో వారు మాత్రమే క్యాంపస్‌ల్లో ఉన్నారు. ట్రిపుల్ ఐటీల సిబ్బందికి ఈ నెల 18 నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.