సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట | Relief For Mp Mithun Reddy In Supreme Court In Liquor Policy Case | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట

May 13 2025 11:18 AM | Updated on May 13 2025 12:20 PM

Relief For Mp Mithun Reddy In Supreme Court In Liquor Policy Case

ఢిల్లీ: మద్యం విధానం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు హితవు పలికింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

‘‘గత విచారణ సందర్భంగా ఈ కేసులో ఆధారాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలి. దర్యాప్తు అధికారి సేకరించిన మెటీరియల్ హైకోర్టు చూడాలి. ఈ కేసులో పిటీషనర్ పాత్రకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదు. అరెస్ట్‌కు సహేతుక కారణాలు చూపించాలి. మెకానికల్ అరెస్టులు సరికాదు. కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని యోచన సరికాదు’’ అని సుప్రీంకోర్టు తెలిపింది.

‘‘పార్లమెంట్ సభ్యుడి పరువు ప్రతిష్టలను పరిగణలోకి తీసుకోవాలి. తాజాగా మరోసారి పిటిషన్ హైకోర్టు విచారణ చేయాలి. ఏపీ హైకోర్టు తగిన అఫిడవిట్ దాఖలు చేయాలి. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంలో MP మిథున్‌రెడ్డికి ఊరట

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement