
తాడేపల్లి: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి:’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
‘‘మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్ చేశాం. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్లని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కాని, మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూశాం, కాబట్టే అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా, చివరకు టీడీపీ వాళ్ల సమస్యలనూ తీర్చాం.
..జగనన్నకు చెబుదాం నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
👉స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
👉తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి పెట్టి, లాగేసుకునే ప్రయత్నంచేస్తోంది
👉అయినా సరే మెజార్టీ వైయస్సార్‌సీపీ ఉండడంతే ఎన్నికను ఆపుతున్నారు:
👉పోలీసులు వైయస్సార్‌సీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు, టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు
👉సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు
👉కుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే
👉రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదు
👉ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బి-ఫాం మీద గెలిచినప్పుడు, సంఖ్యాబలంలేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసం
👉పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు
👉యలమంచిలిలో మన వాళ్లు గట్టిగా నిలబడి గెలుపును సాధించుకున్నారు
👉ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది
👉కాని చంద్రబాబుగారి పరిపాలనలో నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది
👉మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు
👉జగన్ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు
👉కాని వాటన్నింటినీ తుంగలో తొక్కాడు
👉కాని, మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త మనం అమలు చేసిన మేనిఫెస్టోతో ప్రతి ఇంటికీ వెళ్లాడు
👉గడపగడపకూ కార్యక్రమం కింద మూడుసార్లు ప్రతి ఇంటికీ వెళ్లారు:
👉99శాతం హామీలను అమలు చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో వైయస్సార్‌సీపీ మాత్రమే
👉మనం చేసిన మంచి ఎక్కడకూ పోదు
👉10 శాతం ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారు
👉ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్‌బాల్ తన్నినట్టు ఈ ప్రభుత్వాన్ని తంతారు
👉వైఎస్సార్‌సీపీ మాదిరిగా ప్రతి ఇంటికీ వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా?
👉హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉంది
👉మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు మాత్రమే అని చంద్రబాబుగారు నిరూపించారు
👉పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు
👉ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు
👉రూ.3600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు
👉ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు
👉వైద్యంకోసం అప్పులు పాలు అయ్యే పరిస్థితి
👉ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడంలేదు
👉ప్రభుత్వం రంగంలో వైయస్సార్‌సీపీ తీసుకొచ్చిన కాలేజీలను చంద్రబాబు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు:

👉కొత్తగా మూడు పోర్టులు నిర్మాణం ప్రారంభించాం
👉శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లాం
👉ఇప్పుడు ఆమూడు పోర్టులను కమీషన్లకోసం అమ్మేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు
👉ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నడిపించాం
👉ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు పెట్టాం
👉బోగాపురం ఎయిర్‌పోర్టుకు గత చంద్రబాబు హయాంలో అనుమతులు లేవు, భూసేకరణ లేదు
👉మనం అన్నీచేసి 30శాతం పనులు చేశాం
👉రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పనులు కేవలం వైయస్సార్‌సీపీ హయాంలోనే జరిగాయి
👉ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి
👉వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నాడు
👉ప్రజలను వెన్నుపోటు పొడిచాడు
👉ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చాడు
👉రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు
👉ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నాడు
👉చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు
👉తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు
👉గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు
👉పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు
👉ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను
👉జగన్ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది
👉కోవిడ్ కారణంగా ఐదేళ్లపాలనలో అనుకున్నంతమేర సరిగ్గా చేయలేకపోయాం
👉ఇవాళ మీ కష్టాలను చూస్తున్నాను
👉రేపు కచ్చితంగా వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ ఒన్
👉అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి
👉కొడతానంటే.. కొట్టమనండి
👉కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి
👉కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం
👉రిటైర్డ్ అయిన వారినీ లాక్కుని వస్తాం
👉దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం
👉అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం
👉మనకూ టైం వస్తుంది
👉చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి
👉చంద్రబాబు దుర్మార్గపు పాలనవల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోంది
👉మహిళలను అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు
👉ఒక కేసులో బెయిల్ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు
👉ఇలా కేసులు మీదు కేసులు పెడుతన్నారు
👉వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారు
👉దళితుడైన ఎంపీ నందిగం సురేష్ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు
👉సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు
👉తనను, తన కుటుంబ సభ్యులను తిడితే, ఎందుకు తిట్టావన్నందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు
👉చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు మహావృక్షం అవుతుందని మరిచిపోవద్దు
👉రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాటాలు చేద్దాం
👉వచ్చేది మన ప్రభుత్వమే
👉మంచి రోజులు కచ్చితంగా వస్తాయి