
తాడేపల్లి: హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శక్తిమంతుడు, సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీరాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
శక్తిమంతుడు, సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీ రాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.#HanumanJayanti
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025