
విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. సత్యవర్థన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
దీనిలో భాగంగా గత ఫిబ్రవరిలో వంశీని అరెస్ట్ చేశారు. తాజాగా వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రూ. 50 వేలతో పాటు రెండు షురీటిలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వంశీతో పాటు మరో నలుగురకి బెయిల్ వచ్చింది. సత్యవర్డన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. ఈ రోజు(మంగళవారం) కోర్టుకు హాజరయ్యారు. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిసన్ పై విచారణ చేపట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
