
విజయవాడ: ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోవడంతో దాన్ని సరిచేసుకునే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి చంద్రబాబు దగ్గర ఉన్న ప్రధానం ఆయుధం మద్యం. ఇప్పుడు దానిపైనే మరోసారి పడ్డారు చంద్రబాబు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం భారీగా పెంచాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు చంద్రబాబు.
మద్యం ద్వారా అమ్మకాల ద్వారా రూ. 33, 882 కోట్లు ఆదాయం తేవాలని టార్గెట్ నిర్దేశించారు. అదే సమయంలో ఎర్రచందనం అమ్మకంతో కూడా ఆదాయం పెంచాలన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై కూడా భారీగా ప్రభుత్వ ఆదాయం పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా అమ్మాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అధికారలతో కమిటీ వేయాలన్నారు.
29 శాతం పెంచాలంటూ..!
చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిపోవడంతో కేంద్ర నుండి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం తగ్గినట్లు అధికారులు అంగీకరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి మే 11 వరకూ రూ. 5,500 కోట్ల మైనస్ ఆదాయం ఉందని అధికారులు తెలిపారు. దాంతో ఆదాయాన్ని 29 శాతం ఆదాయం పెంచాలంటూ అధికారులకు టార్గెట్ పెట్టారు చంద్రబాబు. అయితే 29 శాతం ఆదాయం ఎలా పెంచాలని అధికారులకు తలలు పట్టుకుంటున్నారు.