దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా | Ys Jagan Serious On Attack Incident On Dalit Student In Tirupati | Sakshi
Sakshi News home page

దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న

May 18 2025 5:22 PM | Updated on May 19 2025 3:52 AM

Ys Jagan Serious On Attack Incident On Dalit Student In Tirupati

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ

రాష్ట్రంలో దళితులకు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాలకు రక్షణ లేకుండాపోయింది 

పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించారు 

అధికార పార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్నారు 

రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించని పరిస్థితి

ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా 

సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్‌ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్‌ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.

దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.

పోలీస్‌స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement