Tirupati (25)
-
దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
ప్రయాణికులకు అలర్ట్: ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు
విజయవాడ: నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి,తిరుపతి (07257) ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి, చర్లపల్లి (07258) ఈ నెల 9 నుంచి 30 వరకు, కాజీపేట, తిరుపతి (07253) ఈ నెల 6 నుంచి 25 వరకు, తిరుపతి, కాజీపేట (07254) ఈ నెల 7 నుంచి 25 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.తెనాలి మార్గంలో .. తెనాలి స్టేషన్ యార్డ్‌లో జరుగుతున్న ట్రాఫిక్ బ్లాక్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 4న రద్దు చేశారు. అందులో గుంటూరు, రేపల్లె (67249/67250), గుంటూరు, రేపల్లె (67223/67224), తెనాలి,రేపల్లె (67231/67232), తెనాలి,రేపల్లె (67233/67234), విజయవాడ, తెనాలి (67221) రైళ్లు ఉన్నాయి. -
ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి
జూనియర్ ఎన్టీఆర్ సాయం చేస్తానని మాట తప్పారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బాబు ఆస్పత్రి చికిత్స కోసం ఆర్థికసాయం చేయలేదంటూ మహిళ మాట్లాడిన వీడియో నెట్టింట వైరలైంది. ఆమె చేసిన కామెంట్స్‌తో ఎన్టీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆరోగ్యంపై ఎన్టీఆర్ టీమ్ ఆరా తీసింది.క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్‌ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు ఎన్టీఆర్ టీమ్.. అంతేకాదు అతని చికిత్సకు అయిన ఖర్చును మొత్తం చెల్లించారు. దీంతో తమను ఆదుకున్న ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా కౌశిక్ తల్లి ధన్యవాదాలు తెలిపింది.(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)థాంక్యూ ఎన్టీఆర్ సార్.. కౌశిక్ తల్లిఅయితే తాను ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆమె తెలిపింది. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నా కుమారుడు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడని పేర్కొంది. ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్నామని ఆమె వెల్లడించింది. మా కుటుంబం అంతా ఎన్టీఆర్‌కు అభిమానులు అని.. నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
సినిమా షూటింగ్లో అపశ్రుతి
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి హైదరాబాద్: యువ నటుడు నాని నటిస్తున్న సినిమా షూటింగ్లో అపశ్రుతి చోటు చేసుకుంది. షూటింగ్ స్పాట్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పత్తిలికాయ తిరుపతి (25) కొండాపూర్‌లోని సిద్దానగర్లో నివసిస్తూ సినిమా షూటింగ్ వాహన క్లీనర్‌గా, లైట్వున్గా పనిచేస్తున్నాడు. శ్రీదేవి మూవీస్ పతాకంపై యువ హీరో నాని, సురభి థామస్‌లు జంటగా కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ గత రెండు రోజులుగా సంఘీనగర్లోని సంఘీనగర్ సర్పంచ్, సంఘీ స్పిన్నర్స్ యజమాని అమిత్సంఘీ గెస్ట్‌హౌస్‌లో జరుగుతోంది. శనివారం ఉదయం 8.30 గంటలకు షూటింగ్ ప్రారంభం కాగానే బస్సును శుభ్రపరుస్తుండగా తిరుపతి అకస్మాత్తుగా కిందపడిపోయాడు. ఫిట్స్ వచ్చాయనే అనుమానంతో తోటి కార్మికులు అతని చేతిలో తాళాలు ఉంచి హయత్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా తిరుపతి షార్ట్ సర్క్యూట్ కారణంగానే మృతి చెందాడని, షూటింగ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి సొంత గ్రామానికి తరలించే ప్రయత్నం చేశారని వదంతులు పుట్టాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న మృతుని బంధువులు తిరుపతికి ఇప్పటివరకు ఎలాంటి ఫిట్స్ రాలేదని, ఆరోగ్యంగా ఉన్నాడని.. హఠాత్తుగా ఎలా చనిపోయాడని ప్రశ్నిస్తున్నారు. షూటింగ్‌కు అనుమతులు లేవు అమిత్సంఘీ గెస్ట్‌హౌస్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవని హయత్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారణాలు తెలుసుకుంటామని అన్నారు. అనుమతులు లేకుండా షూటింగ్ నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.