
సాక్షి, అమరావతి: విద్యుత్ శాఖ ఉద్యోగులు మంగళవారం దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక, ఉపాధి చట్టాలను ఏకీకృతం చేసి కేవలం నాలుగు కోడ్ (నియమావళి)లుగా రూపొందించి రాష్ట్రాల్లో అమలు చేయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే పలు రాష్ట్రాల్లో అమల్లోకి కూడా తీసుకువచ్చింది.
దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ ఉద్యోగుల, కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఇంజనీర్స్ జాతీయ సమన్వయ ఐక్య కమిటీ (ఎస్‌సీసీఓఈఈఈ) ఏర్పాటైంది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు ఈ కమిటీ పిలుపునిచి్చంది. రాష్ట్రంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ దీనికి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు, నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు.