ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్‌ | Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్‌కు సజ్జల వార్నింగ్‌

May 9 2025 1:40 PM | Updated on May 9 2025 3:17 PM

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu Govt

సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.

‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన‌ మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.

‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.

రోజులు దగ్గర పడ్డాయి.. బాబు సర్కారుకు సజ్జల వార్నింగ్

‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement