
వైఎస్‌ఆర్ జిల్లా,సాక్షి: కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థ కార్పొరేషన్‌లో కాంట్రాక్టులు చేసిందంటూ అభియోగాలు మోపింది ప్రభుత్వం.
అయితే, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయలేదనే అక్కసుతో సురేష్ బాబును తొలగింపునకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం కార్పోరేషన్‌లో కాంట్రాక్టులనే అభియోగం మోపి సురేష్ బాబును పదవి నుంచి తొలగించింది.
కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్‌సీసీ నేతలు మండిపడుతున్నారు. నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.