సర్వీసు మొదలుకొని సరెండర్‌ దాకా.. | - | Sakshi
Sakshi News home page

సర్వీసు మొదలుకొని సరెండర్‌ దాకా..

Feb 27 2026 7:36 AM | Updated on Feb 27 2026 7:36 AM

సర్వీసు మొదలుకొని సరెండర్‌ దాకా..

సర్వీసు మొదలుకొని సరెండర్‌ దాకా..

కడప కార్పొరేషన్‌ : కడప నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన మనోజ్‌రెడ్డి వ్యవహారం ఆయన సర్వీసులో చేరడం మొదలుకొని ప్రభుత్వం సరెండర్‌ చేసే వరకు వివాదంగానే ముగిసిందని చెప్పవచ్చు. బుధవారం ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ సీఎస్‌ విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ జీఏడీలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. బుధవారం హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి సీఎస్‌ జీవో ఆర్‌టీ నంబర్‌ 471 ద్వారా రాష్ట్రంలోని 26 మంది ఆర్‌డీఓ కేడర్‌ కలిగిన అధికారులందరికీ ప్రభుత్వం సరెండర్‌ చేసినా మనోజ్‌రెడ్డి తీరు వారిలో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. 2018 గ్రూప్‌–1 రిక్రూట్‌మెంట్‌ మూల్యాంకనంలో అక్రమాలకు ఆస్కారం ఇచ్చారని, నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ... కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాము అన్ని విధాలుగా అర్హులైనప్పటికీ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని వారు కోర్టుకు నివేధించారు. వారి అభ్యర్థనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం దీనిపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ సజావుగా సాగేందుకు అప్పట్లో ఏపీపీఎస్‌సీ ద్వారా గ్రూప్‌–1కు ఎంపికై వివిధ హోదాల్లో ఉన్న 125 మంది అధికారులను నాన్‌ ఫోకల్‌ పోస్టులకు బదిలీ చేయాలని కూడా ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14న అడిషనల్‌ డీజీ రవిశం కర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఈనెల 21వ తేది ‘కమిషనర్‌ మనోజ్‌రెడ్డికి పదవీ గండం’శీర్షికన ‘సాక్షి’ఈ విషయాలపై ముందే వార్త ప్రచురించింది. గ్రూప్‌–1 మూల్యాంకన ఎంపికై న అభ్యర్థుల జవాబుపత్రాల ట్యాంపరింగ్‌ జరిగిందా లేదా అని ఫోరెన్సిక్‌ నిపుణులతో పరిశీలన చేపట్టిన తర్వాత సిట్‌ మార్చి 17, 2026 లోపు దర్యాప్తు నివేదిక అందజేయనుంది. కాగా గతంలో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గ్రూప్‌–1 మెయిన్స్‌ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వగా, డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది.

వివాదాలకు మారుపేరుగా నిలిచి..

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప నగరపాలక సంస్థకు కమిషనర్‌గా వచ్చిన మనోజ్‌రెడ్డి ఆది నుంచి వివాదాలకు మారుపేరుగా నిలిచారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ ఆమె చెప్పినట్టల్లా చేశారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ నిబంధనలను, మున్సిపల్‌ చట్టాలను తుంగలో తొక్కారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేషన్లోని కౌన్సిల్‌ హాలులో నగర ప్రథమ పౌరుడైన మేయర్‌ విచక్షణ మేరకు ఏర్పాటు చేయాల్సిన కుర్చీలను ఆయనకు కనీస సమాచారం ఇవ్వకుండా... మేయర్‌తో సమానంగా కడప ఎమ్మెల్యేకు కుర్చీ ఏర్పాటు చేశారు. మేయర్‌ నిర్ణయించిన ప్రదేశంలో కాకుండా కౌన్సిల్‌ హాలులో ఏకపక్షంగా సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ప్రయత్నించారు. కాన్ఫరెన్స్‌ హాలులో సర్వసభ్య సమావేశం నిర్వహించి మేయర్‌, మెజార్టీ కార్పొరేటర్లు తీర్మాణించిన అంశాలను ఆమోదించకుండా మొండికేశారు. ఆ సమావేశమే చెల్లదని వాదించారు. చివరకు పాలకవర్గ సభ్యులు స్టాండింగ్‌ కౌన్సిల్‌ ద్వారా, హైకోర్టు ద్వారా వాటిని ఆమోదించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రతి విషయంలోనూ పాలకవర్గ సభ్యులను అవమానాలకు గురిచేయడం ద్వారా అప్రజాస్వామ్యంగా వ్యవహరించి అప్రతిష్ట మూటగట్టుకున్నారు. చివరకు ప్రభుత్వం సరెండర్‌ చేయడంతో ఆయనే అవమానకర రీతిలో వెనుదిరగా ల్సి వచ్చింది. ఆయన్ను సరెండర్‌ చేయ ఠిడం పట్ల పలు పార్టీలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.

మనోజ్‌రెడ్డి వ్యవహారం వివాదాస్పదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement