వధూవరులకు ఆశీర్వాదం
ప్రొద్దుటూరు : మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి, రమాదేవిల కుమార్తె కృష్ణ కావ్య.. బండి మునిరెడ్డి, సౌజన్యల కుమారుడు వినీత్ రెడ్డిల వివాహం హైదరాబాద్ శంకర్‌పల్లిలోని కె.కన్వెన్షన్‌లో గురువారం వైభవంగా జరిగింది. వివాహానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగనహోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సతీమణిి సమతా రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే సినీ నటులు, మాజీ మంత్రి రోజా, శ్యామల, మాజీ మంత్రులు అంజాద్ బాషా, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరు నాగేశ్వరరావు, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు, వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ భాస్కర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరా, అన్నమాచార్య విద్యాసంస్థల చైర్మన్ సి.గంగిరెడ్డి, బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రులు హరీష్ రావు, పొన్నాల లక్షుమయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పలువురు తెలంగాణ ఎమ్మెల్సీలు, తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మార్చి 5న ప్రొద్దుటూరులో జరగనున్న కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిల రెసిప్షన్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగనహోహన్‌రెడ్డి హాజర కానున్నారని ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి తనపై ఉన్న అభిమానంతో జగన్ కుటుంబ సభ్యులు నూతన వధూవరులను ఆశీర్వదించడం ఆనందంగా ఉందన్నారు.


