వేగవంతంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండడంతో ఏర్పాట్లలో వేగం పెంచాలని టీటీడీ సివిల్ విభాగం ఈఈ సుమతి పేర్కొన్నారు. గురువారం ఒంటిమిట్ట రామాలయం, సీతారాముల కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ సివిల్ విభా గం అధికారులు, గుత్తేదారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రామాలయం ఆవరణలో జరుగుతున్న తాత్కాలిక నిత్యాన్నదానం ఏర్పాట్లు, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సివిల్ విభాగం డీఈ నాగరాజు పాల్గొన్నారు.
104 డ్రైవర్ ఆత్మహత్య
కొండాపురం : అనారోగ్యం తాళలేక 104 డ్రైవర్ ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండాపురంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు కొండాపురానికి చెందిన తిప్పిరిపాటి రాజేష్(42) 15 రోజులనుంచి అనారోగ్యంతో భాధపడుతున్నాడు. చికిత్స చేయించినప్పటికీ అరోగ్యం కుదుటపడలేదు.ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది ఇంటిలో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కొండాపురం ఎస్‌ఐ జయరాములు చెప్పారు. కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
లాడ్జీలు, హోటళ్లలో
నిబంధనలు పాటించాలి
కడప అర్బన్ : జిల్లా పరిధిలో ఉన్న అన్ని లాడ్జిలు, హోటల్లు, షాపింగ్ మాల్స్‌లలో నిబంధనలు వర్తించేలా సంబంధిత యాజమాన్యం చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శరత్ బాబు తెలిపారు. రాజంపేట పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో లాడ్జీలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఎన్‌ఓసి లేకపోవడం, నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందన్నారు. వైయస్సార్ కడప జిల్లాలో లాడ్జీలు, హోటల్లు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్‌లో నిబంధనలను పాటించకపోయినా, ఎన్ ఓ సి లేకపోయినా వెంటనే అగ్నిమాపక శాఖ వారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో ఎన్‌ఓసీలు లేవని గుర్తిస్తే వారికి నోటీసులు ఇస్తామన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. వివరాల కోసం జిల్లాలోని అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో, కడప, ప్రొద్దుటూరు జిల్లా సహాయక అగ్నిమాపక కేంద్రాల్లోనేరుగా కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదిం చవచ్చునన్నారు. వివరాలుకు 99499 91068 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
నియామకం
కడప కోటిరెడ్డిసర్కిల్ : భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా బత్తల పవన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవలను గుర్తించి నాపై నమ్మకంతో పదవి ఇచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులుకు కృతజ్ఞతలు తెలిపారు.
వేగవంతంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు


