మార్చి 1న సీమ ఎత్తిపోతలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

మార్చి 1న సీమ ఎత్తిపోతలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Feb 27 2026 7:36 AM | Updated on Feb 27 2026 7:36 AM

మార్చి 1న సీమ ఎత్తిపోతలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

మార్చి 1న సీమ ఎత్తిపోతలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

కడప కార్పొరేషన్‌ : రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ మార్చి 1వ తేదిన గ్రేటర్‌ రాయలసీమ ప్రజాప్రతినిధులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీజిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం నగర శివార్లలోని రామాంజనేయపురంలో ఉన్న మేడా కల్యాణ మండపంలో సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను చేపట్టారని, కూటమి ప్రభుత్వం వచ్చాక తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మకై ్క ఆ ప్రాజెక్టును ఆపి వేశారన్నారు. ఈ ప్రాజెక్టు ఆగిపోవడం వల్ల గ్రేటర్‌ రాయలసీమలోని పది జిల్లాలకు సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 1వ తేది ఉదయం 10 గంటలకు మేడా కల్యాణ మండపంలో వైఎస్సార్‌ కడపజిల్లా, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, మార్కాపురం జిల్లాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజినల్‌ కో ఆర్డినేటర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు హాజరవుతున్నారన్నారు. ఈ సమావేశానికి గ్రేటర్‌ రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్‌ సీపీ పీఏసీ, సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పాకా సురేష్‌, డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు సీహెచ్‌ వినోద్‌కుమార్‌, శ్రీరంజన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, బండ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement