breaking news
Kadapa Mayor suresh babu
-
కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
వైఎస్ఆర్ జిల్లా,సాక్షి: కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థ కార్పొరేషన్లో కాంట్రాక్టులు చేసిందంటూ అభియోగాలు మోపింది ప్రభుత్వం. అయితే, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయలేదనే అక్కసుతో సురేష్ బాబును తొలగింపునకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం కార్పోరేషన్లో కాంట్రాక్టులనే అభియోగం మోపి సురేష్ బాబును పదవి నుంచి తొలగించింది. కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్సీసీ నేతలు మండిపడుతున్నారు. నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ చేస్తోంది: సురేష్‌బాబు
-
‘దస్తగిరి బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు’
కడప(వైఎస్సార్ జిల్లా): వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ చేస్తోందని కడప మేయర్, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సురేష్‌బాబు ఆరోపించారు. కేవలం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు సీబీఐ కుట్ర చేస్తోందని సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరికి సీబీఐ మద్దతు ఇస్తోందన్న సురేష్ బాబు.. అప్రూవర్ పేరుతో సీబీఐ మద్దతు ఇవ్వడంతో అతను బెయిల్‌పై బయట తిరుగుతున్నాడన్నాడన్నారు. శుక్రవారం సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ..‘విచారణను వీడియో రూపంగా, న్యాయవాది సమక్షంలో చేయాలని మాత్రమే ఎంపీ కోరారు. దీనిపై కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. అభూత కల్పనలు ప్రచురితం చేయడం, లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు ప్రసారాలు చేయడం బాధాకరం. విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్ ఇతర కుటుంబ సభ్యులు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఒకరికి సహాయం చేసే గుణం వైఎస్ కుటుంబానిది, అంతే కాని విచారణ తప్పించుకుని తిరగడం లేదు. సీబీఐ అంటే మంచి నమ్మకం ఉంది.. అలాంటి మంచి నమ్మకం కోల్పోకుండా విచారణ చేయాలి. ఒక్క అబద్ధాన్ని పదే పదే నిజం అని చెప్పడం ప్రసారాలు చేయడం ఏంటి’ అని ప్రశ్నించారు. -
టీడీపీ నేతలకు సలాం కొట్టిన అధికారులు
కడప : కడపలో శనివారం జరిగిన 'అమృత్' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రోటకాల్ ఉల్లంఘించి టీడీపీ నేతలకు అధికారులు సలాం కొట్టారు. వేదికపై టీడీపీ నేతలను కూర్చోబెట్టడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజద్ బాషా కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.