breaking news
Sakshi Guest Column
-
పరిహారం ‘అణు’వంతేనా?
భారత రూపాంతరీకరణకు ఉద్దేశించిన ‘అణు శక్తి స్థిర వినియోగ–పురోగతి బిల్లు (శాంతి) 2025’కు పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది అణు శక్తికి సంబంధించి మూడు కీలక అంశాలపై చిరకాలంగా ఉన్న చర్చను మళ్ళీ రేకెత్తించింది. అవి: అణుశక్తి అభివృద్ధి–నియంత్రణ; ప్రమాదాలు సంభవించినపుడు సివిల్ లయబిలిటీ; అణు శక్తి ఉత్పాదనలో ప్రైవేటు భాగస్వామ్యం. అటామిక్ ఎనర్జీ చట్టం (1962), సివిల్ లయబిలిటీ–న్యూక్లియర్ డ్యామేజ్ చట్టం (2010) స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తెచ్చారు. అణుశక్తి అభివృద్ధి –వినియోగానికి 1962 నాటి చట్టం వీలు కల్పిస్తే, అణు ప్రమాదాలు సంభవించిన పక్షంలో బాధ్యత వహించడం, పరిహారం చెల్లించడా నికి సంబంధించి ఒక చట్రాన్ని 2010 నాటి చట్టం అందించింది. స్వతంత్ర నియంత్రణకు సుముఖం కాదా?విద్యుదుత్పాదనకు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్) అందుబాటులోకి రావడం, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యు దుత్పాదన గడించాలనే ఆశావహ లక్ష్యసాధనకు ప్రైవేటు రంగ భాగస్వామ్యం అవసరమవడం అనే రెండు కారణాల రీత్యా కొత్త చట్టం అవసరమైందని ప్రభుత్వం వివరించింది. అణు విద్యుదుత్పాదనలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెర వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... నియంత్రణ, లయబిలిటీ చట్రాలు రెండూ అత్యంత ముఖ్యమైనవిగా పరిణమించాయి. అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. నియంత్రణకు సంబంధించి కొత్త చట్టం యథాతథ స్థితినే కొనసాగించింది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) గతంలో మాదిరిగానే పని చేస్తుంది. అణుశక్తి అభివృద్ధి మొగ్గ తొడుగుతున్న 1960లలో, రేడియేషన్ సదుపాయాలలో రేడియేషన్ సురక్షణను అమలుపరచేందుకు, అటా మిక్ ఎనర్జీ శాఖ (డీఏఈ)కు వెలుపల డైరెక్టరేట్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (డీఆర్పీ) ఏర్పాటు చేశారు. హోమీ భాభా తర్వాత అణుశక్తి శాఖ బాధ్యతలు చేపట్టిన విక్రమ్ సారాభాయ్, స్వతంత్ర అణుశక్తి నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారుగానీ, ఆ భావన అమలుకు నోచుకోక ముందే, ఆయన కన్నుమూశారు. ఆయన వారసుడు హోమి ఎన్.సేత్నా ఏఈఆర్ఏ ఆలోచనను పక్కనపెట్టి, డీఆర్పీని కొనసాగించాలని నిర్ణయించారు. రాజా రామన్న 1983లో నియంత్రణ సంస్థ (ఏఈఆర్బీ)కు పచ్చ జెండా ఊపారు. కానీ, అది ఇతర రంగాలలోని అదే రకమైన సంస్థలలాగా పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినది కాదు. ఈ 2025 చట్టం కూడా ప్రస్తుత ఏఈఆర్బీ చట్రాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచనకు అణుశక్తి వ్యవస్థ సానుకూలంగా లేదని స్పష్టమవుతోంది. అణుశక్తి శాఖ పరిధిలోనే ఏఈఆర్బీ పనిచేస్తున్నప్పటికీ, గతంలో అది నీళ్ళు నమలకుండా పనిచేసిన దాఖలాలు లేకపోలేదు. వివిధ సందర్భాలలో నియమాల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించినపుడు ఏఈఆర్బీ–ముఖ్యంగా ఎ. గోపాలకృష్ణన్ అధ్యక్షుడిగా ఉన్నపుడు– విద్యుదుత్పాదన కేంద్రాలు, ఇతర సంస్థలపై ఆంక్షల రూపంలో కొరడా ఝళిపించింది. పరిహారానికి పరిమితులా?ఇపుడు ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరుస్తున్నారు కనుక, నిజాయతీగా పనిచేసే, సాంకేతికంగా బలోపేతమైన స్వతంత్ర వ్యవస్థ అవసరం ఉంది. దేశ పురోగతి ముసుగులోనే అయినప్పటికీ, ఏఈఆర్బీ యథాతథ స్థితిని కొనసాగించడం శుభ సూచకం కాదు. ప్రైవేటు రంగాన్ని అనుమతించిన అంతరిక్ష రంగంలో కూడా ప్రభుత్వం స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడానికి బదులుగా ఇన్–స్పేస్ పేరుతో, ఏ ఎండకా గొడుగు పట్టే సంస్థనే సృష్టించింది. ఒక విధానాన్ని ప్రోత్సహించే, నియంత్రించే రెండూ ఒకే చూరు కింద ఉండకూడదన్నది మూలసూత్రం కావాలి. అణు దుర్ఘటనలు సంభవిస్తే కలిగే నష్టానికి లయబిలిటీ విషయంలో నియంత్రణ సంస్థ ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రశ్న. నియంత్రణ కఠినంగా లేకపోతే, ప్రమాదాలకు తావు ఇచ్చినట్లు అవుతుంది. లయబిలిటీకి సంబంధించి అంతర్జాతీయంగా పాటించే నియమాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. జాతీయ చట్టాలు కూడా వాటికి అనుగుణంగా రూపొందాలి. అణు ప్రమాదం సంభవించిన చోట మూడవ పక్షానికి పరిహారం చెల్లించే బాధ్యత న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఆపరేటర్ పైనే ఉంటుందని అంతర్జాతీయ కట్టుబాట్లు చాలా వరకు నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ కిందనే లెక్క. కానీ, ఇతర సదుపాయాలున్న న్యూక్లియర్ సైట్ వద్ద కూడా దుర్ఘటన సంభవించవచ్చు. లయబిలిటీని అనేక అంశాలు నిర్ణయిస్తాయి. ప్రస్తుత చట్టంలో పరిహారంపై రూ. 3,000 కోట్ల పరిమితి విధించడం, దాన్ని న్యూక్లియర్ ప్లాంట్ ప్రదేశంతో ముడిపెట్టడం అసంబద్ధం. చిన్న రియాక్టర్లకు (150 మెగావాట్ల నుంచి 750 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం ఉన్నవి) లయబిలిటీని మరీ తక్కువగా రూ. 300 కోట్లుగా నిర్ణయించారు. ఇక 150 మెగావాట్ల కన్నా తక్కువ సామర్థ్యం ఉన్నవాటికి కేవలం రూ. 100 కోట్లనే నిర్ణయించారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ప్రోత్సహిస్తున్న సంస్థలను మచ్చిక చేసుకునేందుకే అలా నిర్ణయించారని తేటతెల్లమవుతోంది. హెచ్చు సామర్థ్యమున్న భారీ అణు విద్యుదుత్పాదన కేంద్రాలను నెలకొల్పేందుకు పెద్ద మొత్తాలలో పెట్టుబడులు అవసరమవుతాయి. అవి నిర్మాణం పూర్తి చేసుకుని, ఉత్పాదన ప్రారంభించేందుకు సమయం కూడా ఎక్కువ పడుతుంది. అణు విపత్తులలో లయబిలిటీ చట్రాన్ని సడలించడం ద్వారా, మాడ్యులర్ రియాక్టర్ల వల్ల పెద్ద నష్టం ఉండ బోదని ఆ పరిశ్రమ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. లయబిలిటీలను వర్గీకరించడం ద్వారా కొత్త చట్టం ఆ పరిశ్రమను సంతృప్తి పరచింది. భోపాల్ దుర్ఘటన పాఠాలు నేర్చుకున్నామా?అణు రియాక్టర్ల వద్ద (అణు ఇంధన వలయ సదుపాయాలతో కూడుకుని) తలెత్తే ప్రమాదాలను కొత్త చట్టం నిర్వచించి, లయబిలి టీలను కూడా నిర్ణయించింది. కానీ, ‘అణు సదుపాయాలు’గా నిర్వ చించిన చోట్ల ప్రమాదాలు సంభవిస్తే, లేదా అణు ధార్మికత వెలు వడితే ఏమిటన్న దానిపై మౌనం వహించింది. అలాంటి పరిస రాలలో ఏదైనా సంభవిస్తే ఆ నష్టాలకు పరిహారం చెల్లించే బాధ్యత ఎవరిది? ‘న్యూక్లియర్ డ్యామేజీ’ అనే దానికి మాత్రం చట్టంలో విçస్తృతార్థం ఇచ్చారు. ప్రాణ నష్టం, గాయపడటం, ఆస్తి నష్టం, ఆర్థిక నష్టం, అణు ప్రమాదం వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు అయ్యే వ్యయం అంటూ దానిలో చాలా వాటిని చేర్చారు. కానీ, లయబిలిటీ పరిమితిని మాత్రం రూ. 100 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లుగా పేర్కొన్నారు. 2010లో సంభవించిన సముద్ర ప్రమాదానికి గానూ బ్రిటిష్ పెట్రోలియం సంస్థ 65 బిలియన్ డాలర్లు చెల్లించింది. అదే భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీకవడాన్ని ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ఉపద్రవంగా చెబుతారు. కానీ దాని బాధితుల్లో పరిహారం కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకా ఉన్నారు. పర్యావరణ నష్టానికి ఎవరూ చెల్లించింది ఏమీ లేదు. మళ్లీ మధ్యవర్తిత్వం నెరపే ప్రయత్నమూ లేదు. అణుశక్తి విషయంలో అడుగు ముందుకేసే ముందు గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పెంపొందించే పని, నియంత్రణ ఒకే చూరు కింద సంసారం చేయకూడదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ కామెంటేటర్ -
ఉపాధి పెంపునకు అవకాశాలెన్ని?
ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి భారత్‌లో అభివృద్ధికి నూతన మార్గాలుగా రూపొందినప్పటికీ ఉపాధి సృష్టి, సమానత్వ సాధనలో వ్యత్యాసాలు పెరగడానికీ కారణమయ్యాయి. ఆధునిక ఆర్థిక వృద్ధి లక్ష్యసాధనలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల మధ్య వనరుల పునఃపంపిణీ ప్రక్రియను నిర్మాణాత్మక మార్పుగా భావిస్తాం. చారిత్రకంగా, వివిధ దేశాలు ఈ నిర్మాణాత్మక మార్పులో భాగంగా రెండు దశలను చవి చూశాయి. వ్యవసాయ రంగం నుండి తయారీ; తయారీ రంగం నుండి సేవా రంగానికి శ్రామికుల బదిలీ. తక్కువ ఉత్పాదకతతో కూడిన ప్రాథమిక కార్యకలాపాల నుండి ఆధునిక, అధిక ఉత్పాదకతతో కూడిన రంగాల వైపు శ్రామిక, మూలధన, సాంకేతికత లాంటి వనరుల బదిలీ; ఉపాధి పంపిణీ, విలువ జోడించిన పంపిణీ, అంతిమ వినియోగ పంపిణీలో తయారీ, సేవా రంగాల వాటా అధికంగా ఉండటం; భౌతిక, మూల ధన కల్పన; గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వల సలు; జనన, మరణ రేట్లలో తగ్గుదల లాంటి అంశాలను ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పునకు సూచికలుగా భావిస్తాం. భారత ఆర్థిక వ్యవస్థలో 2011–12 తదుపరి కాలంలో ఈ నిర్మాణాత్మక మార్పులలో తగ్గుదలను గమనించవచ్చు.ఎందుకీ మందగమనం?గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తి ఏడు రెట్లు పెరిగినప్పటికీ, ఉపాధిలో పెరుగుదల కనీసం రెట్టింపు కాలేదు. శ్రామిక మార్కెట్లో దృఢత్వం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, సమగ్ర ఆర్థిక విధానాలు అమలు చేయక పోవడం, ఆహారానికి సంబంధించి సాపేక్ష ధరలలో పెరుగుదల, పరపతి వృద్ధి తక్కువగా ఉండటం, తూర్పు ఆసియాలో మాదిరి వ్యవసాయ రంగం నుండి ఇతర రంగాల వైపు శ్రామికుల బదిలీలు తక్కువగా ఉండటం, తక్కువ వేతనంతో కూడిన నిర్మాణ రంగం, అసంఘటిత రంగంలో ఉపాధిలో తక్కువ నైపుణ్యత కల్గిన అధిక శ్రామిక శక్తి కేంద్రీకృతం కావడం లాంటి అంశాలు భారత్‌లో నిర్మాణాత్మక మార్పు ప్రక్రియ నెమ్మదించడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. సంస్కరణల అమలు కాలంలో నిర్మాణాత్మక మార్పు వేగంగా ఉండగలదని భావించినప్పటికీ సప్లయ్ వైపు వ్యవసాయ రంగాన్ని తయారీ రంగం అధిగమించినప్పటికీ, డిమాండ్ వైపు తయారీ రంగం వ్యవసాయ రంగాన్ని అధిగమించలేక పోయింది. తయారీ రంగ ఉత్పత్తి కార్యకలాపాలు ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అవుతున్నప్పటికీ గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ఉపాధి వృద్ధిలో ఆశించిన పెరుగుదల సంభవించలేదు.యువతలో ఉపాధిభారత్ మొత్తం జనాభాలో 15–29 వయో వర్గ జనాభా 27 శాతం కాగా, మొత్తం శ్రామిక శక్తిలో వీరి వాటా 26.9 శాతం. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం, యువతలో నిరుద్యోగిత 2000 సంవత్సరంలో 5.7 శాతం నుండి 2023లో 10 శాతానికి పెరిగింది. పారిశ్రామిక, సేవా రంగాలతో పోల్చినప్పుడు వ్యవసాయ రంగంపై ఆధారపడిన యువత తక్కువ. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2022లో యువతలో నిరుద్యోగిత భారత్‌లో 23.2 శాతం కాగా మొత్తం నిరుద్యోగం 7 శాతంగా అంచనా. అంత ర్జాతీయ శ్రామిక సంస్థ అంచనా ప్రకారం, 2023లో భారత్‌లోని మొత్తం గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 42.3 శాతం. నియంత్రణతో కూడిన శ్రామిక చట్టాల వల్ల సంఘటిత రంగంలో ఉపాధి తగ్గుదల, సేవారంగ ఆధారిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం, ఆటోమేషన్ కారణంగా ఉపాధి క్షీణించటం; ఐటీ, ఇంజినీరింగ్, ఆటోమొబైల్ లాంటి రంగాలలో అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్రీకృతం కావడం, వివిధ అంశాలలో లింగ సంబంధిత అసమానతలు, నాణ్యతతో కూడిన శిక్షణ కొరత, నూతన సాంకే తికతకు అనుగుణంగా తగిన నైపుణ్యత శ్రామికులలో లేకపోవడం వంటివి నిరుద్యోగం పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. వివిధ దేశాల అనుభవాలుమానవ మూల ధనం, సేవలు, నవకల్పనలపై అధిక పెట్టు బడుల ద్వారా సింగపూర్ శ్రమ సాంద్రత ఆర్థిక వ్యవస్థ నుండి నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ స్థితి అధిక వేతనాలు, ఉపాధి నాణ్యత పెరుగుదలకు దారి తీసింది. వృత్తి విద్య, శిక్షణకు జర్మనీ ప్రాధాన్యమిచ్చిన నేపథ్యంలో ఆధునిక తయారీ, అధిక నైపుణ్యత అవసరమైన సేవలలో ఉపాధి అవకాశాలు పెరి గాయి. చైనాలో నిర్మాణాత్మక మార్పులు కొన్ని కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి కావడానికీ, పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాల పెరుగుదలకూ, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య లింకేజెస్ పెరగడానికీ దోహదపడ్డాయి. మలేషియాలో నిర్మాణాత్మక మార్పుల కారణంగా ప్రాథమిక వస్తువులపై ఆధారపడటం తగ్గి తయారీ, సేవలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో మలేషియా అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆదాయ స్థిరీకరణ సాధించింది. దక్షిణ కొరియా, తైవాన్ నిర్మాణాత్మక మార్పుల కారణంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల నుండి పారి శ్రామిక పవర్ హౌసెస్‌గా రూపాంతరం చెందాయి. తక్కువ ఉత్పా దకతతో కూడిన వ్యవసాయ రంగం నుండి అధిక ఉత్పాదకతతో కూడిన తయారీ రంగానికి శ్రామికుల బదిలీ ఆయా దేశాల ఆర్థిక సామర్థ్య పెరుగుదలకు దారి తీసింది.యువతలో ఉపాధి పెంపునకు చర్యలుభారత్లో ముఖ్య ఆర్థిక రంగాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం 2030 నాటికి యువతలో ఉపాధి వృద్ధి అధికంగా వ్యవ సాయం, దాని అనుబంధ రంగాలలో ఉంటుంది. ఈ రంగం నైపుణ్యత లేని, తక్కువ నైపుణ్యత కల్గిన శ్రామిక శక్తికి ఉపాధినందిస్తుంది. ప్రస్తుత ఉపాధి వృద్ధిని కొనసాగించడంతో పాటు, పెరుగు తున్న ఉపాధి డిమాండ్‌ను తీర్చాలంటే 2030 నాటికి ప్రతి సంవత్సరం 78.5 లక్షల మందికి వ్యవసాయేతర రంగాలలో ఉపాధి కల్పించాలి. యువతలో ఆర్థిక అవకాశాలు మెరుగుపర్చడానికి ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్, ఆంట్రప్రెన్యూర్‌షిప్‌పై ఆసక్తి కనబరచే విధంగా వారిని ప్రోత్సహించాలి. 2022–23లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 13.4 శాతంగా నమోదైంది. ఉపాధి సామర్థ్య రంగాలైన డిజిటల్ సర్వీసులు, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, ఈ–కామర్స్; చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలి. ఉన్నత విద్యలో పరిశ్రమల లింకేజ్‌ను పటిష్టపరచడం ద్వారా, ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా కరికులంలో మార్పులు చేయాలి. నియంత్రణల సడలింపు ద్వారా ప్రైవేటు రంగ అభివృద్ధికి తీసుకొనే చర్యలు యువతలో ఉపాధి అవకాశాలను విస్తృతపరచ గలవు. కృత్రిమ మేధ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి సాంకేతికమైన నవ కల్పనలు యువతలో ఉపాధి క్షీణతకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో బ్లూ కలర్ ఉపాధి సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. శ్రమ సాంద్రత పరిశ్రమలను ప్రోత్సహించే విధానాల ద్వారా తయారీ రంగాన్ని పటిష్ట పరచాలి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్చార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్.. జగన్ విజయానికి సూచిక
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు సంస్థలకు ఇవ్వడాన్ని మేం సహించం... దీనివెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉన్నది. ఎంతో కష్టపడి మేం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని చేతగాని చంద్రబాబు ప్రభుత్వం నడపలేక ప్రయివేటుకు ఇచ్చేస్తున్నది. దీన్ని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతును కూడా కూడగట్టాం. కోటికిపైగా సంతకాలు సేకరించాం.. .. మళ్ళీ చెబుతున్నాం.. మా మాట కాదని ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తె మాత్రం తీవ్ర పరిణామాలు తప్పదు. మేం అధికారంలోకి వస్తే మళ్ళీ కాలేజీలు వెనక్కి తీసుకోవడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటాం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన ప్రకటన లాంటి హెచ్చరిక ప్రయివేటు మెడికల్ కాలేజీల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించింది. అందుకేనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు.. కార్పొరేట్ సంస్థలు ఏవీ పెద్దగా ఈ అంశంలో ముందుకు రాలేదు.వాస్తవానికి మార్కాపురం.. మదనపల్లి, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నది. అంటే మొత్తం నాలుగు కాలేజీలకు గాను ఒకటే దరఖాస్తు వచ్చింది. మిగతా మూడు కాలేజీలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.ఈ పరిణామం చూస్తుంటే వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం అయన చేసి తీరతారన్న నమ్మకం, మళ్ళీ అయన వస్తే కాలేజీలు వెనక్కి తీసుకుంటారన్న భయం కలగలిపి వారిని ఈ బిడ్డింగ్ నుంచి వెనకడుగు వేసేలా చేసిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తెలుగుదేశం ప్రభుత్వం పని తీరు.. వివిధ వర్గాల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటున్న మెడికల్ వ్యాపారవేత్తలు ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ ఎప్పుడు ఏ పర్యటన చేపట్టినా వెల్లువెత్తుతున్న జనాభిమానం ఒకవైపు.. అటు రైతులు,, మహిళలు.. విద్యార్థులు.. యువత వంటి వర్గాల్లో జగన్ పట్ల పెరుగుతున్న సానుకూలత, అదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతలను క్రోడీకరించి మెడికల్ వ్యాపారులు పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత వస్తే రానున్న మూడేళ్ళలో ఇది మరింత పెరగడం తధ్యమని, అది కూటమి ఓటమిని, వైఎస్ జగన్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని భావించిన బిడ్డర్లు ఇక ఈ అంశం జోలికి పోకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ గెలుపు తథ్యం, అదే జరిగితే కోట్లు పెట్టుబడి పెట్టి తెచ్చుకున్న ఈ కాలేజీలను ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటే భారీగా నష్టపోతామన్న భయంతోనే వారు వెనకడుగు వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి మెడికల్ వ్యాపారులు ముందు చూపుతో వేసిన వెనకడుగు.. వైఎస్ జగన్ విజయానికి సూచనే అని తేల్చేశారు.:::సిమ్మాదిరప్పన్న -
నేపాల్ దారి అగమ్యగోచరం
నేపాల్‌లో బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ 1990లో ఏర్పడిన 35 సంవత్సరాల తర్వాత, రాచరిక వ్యవస్థ పూర్తిగా 2008లో రద్దయిన 17 సంవత్సరాలకు, ఆ దేశ భవిష్యత్తు ‘అగమ్యగోచరమేనా?’ అనే ప్రశ్న వేసుకోవలసి రావటం నిజంగానే విచిత్రమైన పరిస్థితి. గత సెప్టెంబర్ నాటి జెన్–జీ భూకంపం సృష్టించిన స్థితిగతులు, రేకెత్తించిన ప్రశ్నల కారణంగా దేశం ఈ దశలోకి ప్రవేశించింది.2008 వరకు ఒకవైపు రాచరికాన్ని, మరొకవైపు ప్రజాస్వామిక పార్టీల ద్వంద్వ పాలనను, 2008లో రాచరికం రద్దు తర్వాత నుంచి మధ్యేమార్గ పార్టీలు, సాధారణ కమ్యూనిస్టులు, మావోయిస్టుల పాలనను చూసిన యువతరం, దానికి మద్దతుగా నిలిచిన సమాజం కలిసి అగ్నిపర్వత విస్ఫోటనం వంటి తిరుగుబాటు చేశాయి. అనగా అది ప్రస్తుత తరపు తిరుగుబాటు. మరి ఈ తరం గడిచిపోయి మరొక 15–20 సంవత్సరాలకు కొత్త తరం ఉనికిలోకి వచ్చే సమ యానికి పరిస్థితి ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారణమైన పరి స్థితులు అప్పటికి మారుతాయా? మారగలవన్న హామీని ఇపుడున్న రాజకీయ పార్టీలు యువతరానికి, ప్రజలకు ఇవ్వగలవా?కనీసం ప్రశ్నించుకోని వైనంఈ ప్రశ్నలను ఇంతే సూటిగా అన్ని ప్రధాన పార్టీల నాయ కులను నేను అడిగాను. ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, ఏ ఒక్క పార్టీ కూడా సెప్టెంబర్ పరిణామాల అనంతర కాలంలో ఈ ప్రశ్నలను తనకు తాను వేసుకోలేదు. ప్రశ్నలు వేయగానే అందరిలో కన్పించిన మొదటి స్పందన నా వైపు శూన్యంగా చూడటం. కొద్దిసేపటికి తేరు కుని స్పష్టాస్పష్టంగా కొద్ది మాటలేవో చెప్పటం. ప్రస్తుతం మిత వాదులు, మధ్యేమార్గీయుల నుంచి మావోయిస్టుల వరకు అందరూ తమను తాము కూడదీసుకోవటం, పార్టీలలో తలెత్తిన అంతర్గత సంక్షోభాలను, చీలిక అవకాశాలను నియంత్రించటం, చీలినవారు ఇతరులతో కలిసి కొత్త పార్టీలు ఏర్పాటు చేయటం, మార్చి 5న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడటం వంటి పనులలో తలమునకలై ఉన్నారు.మరొకవైపు చూడగా, తిరిగి అధికారంలోకి రావాలనే కోరికలో నైతే ఎటువంటి మార్పు లేదు. తిరుగుబాటు తరాన్ని ఎట్లా చల్లబరచటం, వీలైనన్ని జెన్–జీ గ్రూపులను తమ వైపు ఏ విధంగా ఆకర్షించటం, ప్రజలలో తమ పార్టీలకు ఉండిన సంప్రదాయికమైన నెట్వర్క్ ఇటీవలి పరిణామాల వల్ల చెదిరి పోకుండా తిరిగి ఎట్లా కూడదీయటమన్నవి అందరి ప్రాధాన్యాలుగా మారాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా అందరి నోటినుంచి దాదాపు ప్రతిరోజూ కొన్ని మాటలు నిత్య పారాయణం వలె వినవస్తున్నాయి. అవి: జెన్–జీ ఆలోచనలూ, మావీ ఒకటే; వారి డిమాండ్లన్నీ సమంజసమైనవే; వారూ, మేమూ కలిసి పని చేయాలని భావిస్తున్నాము. అందరి మాటల సారాంశం స్థూలంగా ఇదే. ఇటువంటి మొక్కుబడి మాటలు బయటకు మాట్లాడటం తప్ప, తమవైపు నుంచి గతంలో జరిగిన తప్పులు, భవిష్యత్తులో జరగవలసిన మార్పుల గురించి అంతర్గతంగా ఏ పార్టీ కూడా ఒక పద్ధతిలో చర్చించలేదని ఆ యా పార్టీల సీనియర్ నాయకులే నాతో స్వయంగా చెప్పారు.రాజకీయ శూన్యంజెన్–జీ గ్రూపులు కొన్ని ఇటీవలి వారాలలో వేర్వేరు పార్టీలతో చేరినా, అసలు పార్టీ నాయకులు, వారి తీరు, ఒకవేళ గెలిచినట్లయితే పరిపాలన ఎంతవరకు మారవచ్చుననే ప్రశ్నపై ఆ యువకులలో పూర్తి ఆశాభావం కన్పించటం లేదు. ఏ పార్టీతో చేరని గ్రూపులే ఎక్కువ. వాటి గురించి చెప్పనక్కర లేదు. అవి తమ వాదనలు, ఒత్తిడులు యథావిధిగా కొనసాగిస్తున్నాయి. విషయం ఏమంటే, ఆ నాయకులు ఏమి చెప్తున్నా ఇప్పటికీ తిరిగి విశ్వాసం కలగటం లేదు. అందుకే ఇటీవలి ఒపీనియన్ పోల్‌లో ఏ నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. ఇందులోని విచారకర స్థితి ఏమంటే, స్వయంగా జెన్–జీ గ్రూపులు ఏకమై ఒక దేశవ్యాప్త పార్టీని ఏర్పాటు చేయటంగానీ, లేదా ఇపుడున్న పార్టీలకు భిన్నంగా ప్రజల విశ్వాసాన్ని పొందగల ఒక కొత్త పార్టీగానీ ముందుకు రాకపోవటం వల్ల రాజకీయంగా అతి పెద్ద శూన్యం కనిపిస్తున్నది. మొదటినుంచి గల పార్టీలు విశ్వాసాన్ని కోల్పోయి, అటువంటి కొత్త ప్రత్యా మ్నాయాలూ ఏర్పడనపుడు, సమస్యలూ, అసంతృప్తులూ అదే విధంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, నేపాల్ దేశ భవిష్యత్తు ఏమిటి? ఆ స్థితి అగమ్యగోచరంగా తోస్తున్నదనటం అందు వల్లనే!పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానంగా కొద్దిమంది నాయకులు మాత్రం నాతో కొన్ని మాటలు అన్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి: అన్ని పార్టీల అగ్రనాయకత్వాలు కూడా జెన్–జీకి, ప్రజలకు మూర్తీభవించిన విలన్లుగా కనిపిస్తున్నందున అందరూ అధ్యక్ష పదవుల నుంచి వైదొలగి ఇతరులకు నాయకత్వం అప్పగించాలి. కొత్త కార్యవర్గాలలో యువకులకు భారీగా అవకా శాలు కల్పించాలి. నాయకులంతా అవినీతిని, బంధుప్రీతిని పూర్తిగా వదలుకోవాలి. అధికారంలోకి వచ్చినట్లయితే పారదర్శక పాలన, సమర్థవంతమైన పాలన, సమర్థులూ నిజాయితీపరులైన వారికి అధికారంలో స్థానం, వేగవంతమైన, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, యువతకు ఉపాధి అవకాశాలు అనే వాటిపై చిత్తశుద్ధి చూపగలమని ప్రకటించి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించాలి. అదే విధంగా వ్యవహరించాలి. లేని పక్షంలో ప్రస్తుత జెన్–జీ తరంగానీ, లేదా కొత్త తరం గానీ ఇంతకన్న తీవ్రమైన తిరుగుబాటు చేయగలదు. రాజకీయ పార్టీలకు ఇది చివరి అవకాశం వంటిది.కోల్పోయిన విశ్వాసంవీరు ఇట్లా అంటున్నట్లు బయట వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలతో నేను ప్రస్తావించాను. వారిలో ఒక్కరు కూడా ఆ మాటలను నమ్మలేదు. గతంలో పలుమార్లు ఈ తరహా మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. మరి భవిష్యత్తేమిటి? అది వారికీ అగమ్య గోచరంగానే ఉంది. నిజానికి రాచరిక వ్యవస్థలోనే బహుళ పార్టీల ప్రజాస్వామిక పార్లమెంటరీ వ్యవస్థ కోసం 30 ఏళ్లపాటు తీవ్రమైన ఉద్యమాలు జరిపి సాధించిన నేపాలీ కాంగ్రెస్, సాధారణ కమ్యూనిస్టులూ సక్రమంగా పాలించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. తర్వాత మావోయిస్టులు దశాబ్దంపాటు భీకరమైన పోరాటం సాగించి, కేవలం ప్రభుత్వానికి అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఇండియా ఆధునిక ఆయుధాలు సమకూర్చటం వల్ల, చివరి దశలో వెనుకకు తగ్గారు. అయినా ఇతరులతో కలిసి 2008 నుంచి 2025 వరకు 17 సంవత్సరాలలో 12 సంవత్సరాలు వామ పక్షాలే పాలించాయి. వీరి పాలన సవ్యంగా సాగినా ఈ విపత్తు ఎదురయేది కాదు. ఆ విధంగా మొత్తం అందరూ కలిసి 47 సంవత్సరాల పాటు విఫలమై, అందరికందరూ విశ్వాసాన్ని కోల్పోయినందునే, ప్రత్యామ్నాయ సృష్టి అయినా జరగనందునే, నేపాల్ భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వెనిజులా ముడిచమురుపై డేగకన్ను
అమెరికా చరిత్రలో అతిపెద్ద మిలిటరీ ఖర్చు బిల్లును 2026 సంవత్సరానికి గానూ 90,100 కోట్ల డాలర్లతో ప్రతినిధుల సభ ఆమో దించింది. లాటిన్ అమెరికాలో సరికొత్త యుద్ధానికి ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలో, ఈ వ్యయ బిల్లు ఆమోదం కోసం డెమోక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడం గమనార్హం. ఇప్పటికే జూలైలో కేటాయించిన 15,600 కోట్ల డాలర్ల అనుబంధ సైనిక వ్యయ నిధులతో కలిపితే, 2026లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహించడానికి అమెరికా మొత్తం లక్షా 5,700 కోట్ల డాలర్లను వెచ్చించనుంది. ‘ఆపరేషన్ దక్షిణ గోళం’ పేరిట కరేబి యన్ ప్రాంతానికి ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లు, యుద్ధనౌకలను తరలించడం... 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత అతిపెద్ద సైనిక మోహరింపుగా పరిగణించవచ్చు. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను అణచివేసే ఇఎ18జి వార్జెట్లు ఇప్పటికే ప్యూర్టోరికో చేరు కున్నాయి.అమెరికా చూపు ఇప్పుడు వెనిజులాలోని అపారమైన ముడి చమురు నిల్వలపై పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా 20 శాతం ముడిచమురు నిల్వలు (సుమారు 30,000 కోట్ల బారెల్స్) ఈ చిన్న దక్షిణ అమెరికా దేశంలోనే ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. గతంలో అధ్యక్షుడు ఛావెజ్ చమురు పరిశ్రమలను జాతీయం చేసి, 2005లో భూసంస్కరణల ద్వారా సామాన్య రైతాంగాన్ని భూస్వాముల నుండి విముక్తి చేశారు. అదే ఏడాది 13 లాటిన్ అమెరికా దేశాలు కలిసి వాణిజ్య సమాఖ్యగా ఏర్పడి స్వల్ప ధరలకే ముడిచమురును అమ్ముకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. 2008లో బ్యాంకులను జాతీయం చేయడం, రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా ఆయిల్ కంపెనీల ఆధిపత్యాన్ని వెనిజులా తగ్గించింది. ఇవన్నీ అమెరికాకు మింగుడుపడని అంశా లుగా మారాయి.ప్రస్తుతం ‘మాదక ద్రవ్యాల ఉగ్రవాదం’ ముసుగులో మదూరో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వాషింగ్టన్ కుయుక్తులు పన్నుతోంది. ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే సంస్థతో వెనిజులా నాయకత్వానికి సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపిస్తుండగా, అధ్యక్షుడు మదూరో, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ వాదనలను తిరస్క రిస్తున్నారు. వెనిజులా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ బహిరంగంగా ప్రకటించారు.యుద్ధ తంత్రాన్ని అమెరికా మరింత క్రూరంగా మార్చి, నేరుగా భూభాగంలోకి సైన్యాన్ని పంపకుండా క్షిపణులు, డ్రోన్ల సహాయంతో దాడులు చేసే వ్యూహంలో ఉంది. ఇటీవల డ్రోన్ల దాడిలో కొందరు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం దీనికి నిదర్శనం. ఆయుధ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తోంది.గత నాలుగేళ్లలో ఉక్రెయిన్‌కు 17,000 కోట్ల విలువైన ఆయుధాలను, ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధ సామగ్రిని సరఫరా చేస్తూ అమెరికా తన యుద్ధ దాహాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమా సియాలో చమురు ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్‌ను అంగరక్షకుడిగా వాడుకున్నట్లే, ఇప్పుడు దక్షిణ అమెరికాలోని వెనిజులాలో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. 1946 నుండి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు సుమారు 35,000 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించిన అమెరికా, ఇప్పుడు సహజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా వెనిజులాపై దాడికి సిద్ధమవు తోంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ సాగుతున్న ఈ యుద్ధ క్రీడలో వెనిజులా ఇప్పుడు బలిపీఠంపై ఉంది.– జమిందార్ బుడ్డిగఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
మయన్మార్‌లో ఎన్నికల తంతు
ఆంగ్ సాన్ సూకీ ఎన్నికల విజయాన్ని మయన్మార్ సైన్యం దుర్మార్గంగా చేజిక్కించుకుని దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడా సైనిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వ హించ తలపెట్టింది. ఇవి డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి వరకు జరుగుతాయి. ఈ ఎన్నికల ద్వారా తమ పాల నకు చట్టబద్ధత సాధించాలని సైన్యం విఫలయత్నం చేస్తోంది. కానీ దేశంలో ఇప్పటికే నెలకొని ఉన్న అరాచక పరిస్థితి ఈ ఎన్నికలతో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.ప్రధాన రాజకీయ పార్టీ ఎన్ఎల్డీ (నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ) సహా అనేక పక్షాలు సైనిక పాలకులు ప్రకటించిన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మయన్మార్ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతిరూప మైన సూకీని జైల్లో పెట్టిన సైనిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేసింది. అందుకు నిరసన ప్రకటిస్తూ, కొత్త చట్టం కింద రాజకీయ పార్టీగా నమోదయ్యేందుకు ఆమె పార్టీ ఎన్ఎల్డీ నిరాకరించింది. దీంతో సైనిక పాలకులు ఆ పార్టీని రద్దు చేశారు. 2020 ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. సైనిక ప్రభుత్వం 2008లో ప్రకటించిన రాజ్యాంగం ప్రకారం, జాతీయ పార్లమెంటు ఉభయసభల్లోని 476 స్థానాల్లో 25 శాతం సీట్లు సైన్యానికి రిజర్వు అయ్యాయి. సైన్యం అనుకూల జాతీయవాద పార్టీ యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యూఎస్డీపీ) ఆ ఎన్నికల్లో చావుదెబ్బ దెబ్బతింది. అయిదేళ్ల క్రితం ఆరంభమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేస్తాననీ, అందుకు వీలుగా రాజ్యాంగాన్ని సంస్క రిస్తాననీ 2020 ఎన్నికల్లో సూకీ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. కాబట్టి, పగ్గాలు చేపట్టిన వెంటనే సూకీ సైన్యం తోక కత్తిరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సమయంలో సైన్యం తిరుగుబాటు చేసింది. అధికారం హస్తగతం చేసుకుంది.అదుపు సాధించని సైన్యంవేల మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులను సైనిక ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. సొంత పౌరుల మీద బాంబులు కురిపించింది. గ్రామాలకు గ్రామాలను తగలబెట్టింది. సూకీని ఎక్కడ నిర్బంధించారో కూడా కచ్చితంగా తెలియదు. ఇంత చేసి కూడా సైన్యం దేశం మీద పట్టు సాధించలేకపోయింది. అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్య అనుకూల పౌరసేనలు, సాయుధ పోరాట సంస్థలు సైనికులతో పోరు సలుపుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యపడేది కాదు.‘స్ప్రింగ్ రివల్యూషన్’ పేరిట మయన్మార్‌లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం సైన్యాన్ని పూర్తిగా ధిక్కరించాలని నిర్ణయించింది. ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ (ఎన్‌యూజీ)కి అనుబంధంగా పనిచేసే ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్’ వంటి సాయుధ ప్రతిఘటన సంస్థలు ఇందులో భాగం అయ్యాయి. ఎన్‌యుజి తానే దేశానికి నిజమైన ప్రభుత్వం అని ప్రకటించుకుంది. అజ్ఞాతం నుంచో ప్రవాసం నుంచో పనిచేస్తున్న నాయకులు దీన్ని నడుపుతున్నారు. ఏమైనప్పటికీ, మెజారిటీ స్థానాల్లో సైన్యం అనుకూల యూఎస్డీపీ నెగ్గుతుంది. ఇది సైనిక పాలకులకు మద్దతు ఇస్తుంది.భారత్‌కు భద్రతా సమస్యభారత్ ఈ ఎన్నికల కోసం ఈవీఎంలు సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విష యాన్ని ప్రస్తావించకుండా ఒక ప్రకటన చేసింది: ‘ప్రజాస్వామ్యం దిశగా మయన్మార్ పరివర్తనకు ఇండియా మద్దతు ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు అన్ని రాజకీయ వర్గాల భాగస్వామ్యం కీలకం. మయన్మార్‌లో శాంతి, చర్చలు, సాధారణ పరిస్థితుల పున రుద్ధరణకు తోడ్పడే అన్ని యత్నాలకూ ఇండియా ఇకమీదట కూడా మద్దతిస్తుంది’.చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేదనీ, ఇవి స్వేచ్ఛగా, సమ్మిళితంగా జరిగే ఎన్నికలు కావనీ ఇండియాకు తెలుసు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించక పోయినా, కనీసం అక్కడి హింసాకాండకు ఒక రాజకీయ పరిష్కారం చూపించగలిగినా చాలు. నాలుగు ఈశాన్య రాష్ట్రాల వెంబడి మయన్మార్‌తో ఇండియాకు 1,643 కి.మీ. సరిహద్దు రేఖ ఉంది. ఆ దేశంలో ఏం జరిగినా దాని ప్రభావం మన మీద పడుతుంది.సైనిక తిరుగుబాటు అనంతరం వ్యతిరేక వర్గానికి చెందిన వేల మంది సైనికులు శరణార్థులుగా మిజోరం రాష్ట్రంలోకి పారిపోయి వచ్చారు. చిన్ రాష్ట్రం మీద సైనిక పాలకులు బాంబులు కురిపించి నప్పుడు మిజోరంలోని సరిహద్దు గ్రామీణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయవలసి వచ్చింది. అంతేకాదు, ప్రజాస్వామ్య అను కూల గ్రూపులతో పోరాడేందుకు మయన్మార్ సైన్యం సగాయింగ్ ప్రాంతం (మయన్మార్) లోని ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటు గ్రూపులతో కలసి పనిచేస్తోంది. ఇది ఇండియాకు భద్రత సమస్య. ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టు కూడా మయన్మార్ అలజడుల కారణంగా అసంపూర్తిగా మిగిలి పోయింది.పాలు పోని ఇండియాసూటిగా చెప్పాలంటే, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ కారుల్లో మన పట్ల ఉన్న గౌరవాభిమానాలను పణంగా పెట్టి క్రూరు లైన ఆ దేశ సైనిక పాలకులతో ఇండియా సంబంధాలు నెరపింది. తద్వారా ఎంత ప్రయోజనం పొందగలిగింది? మణిపూర్ అశాంతికి మయన్మార్ చొరబాటుదారులే కారణమని నిందిస్తూ కూడా ఇలాంటి విధానం ఎందుకు అనుసరిస్తోంది? తాజాగా, మయన్మార్ సరిహద్దుల వెంబడి ఇండియా దృఢమైన కంచె నిర్మిస్తోంది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో డ్యూరాండ్ లైన్ వెంబడి కంచె నిర్మించడం ద్వారా వేలాది కుటుంబాలను, గ్రామాలను, తెగలను వేరు చేసిన బ్రిటిష్ పాలకుల తప్పిదాన్నే ఇండియా పునరావృతం చేస్తోంది. చైనా మాత్రం తన సొంత మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజె క్టులను కాపాడుకునేందుకు తెగల ప్రజలను ఉపయోగించుకుంది. అందుకు ప్రతిగా సైనిక పాలకులకు ఆయుధాలను సమకూర్చింది. ఎట్టకేలకు, ఇండియా ఇప్పుడు మేల్కొంది. ప్రజాస్యామ్య అను కూల ఉద్యమ గ్రూపులతో మంతనాలు జరుపుతోంది. దేశం నుంచి ఆర్భాటం లేకుండా పనిచేసుకోడానికి వారికి అనుమతించింది. ఎన్ని కల ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలిసిన విషయమే. పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యేందుకు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్వహించిన రెఫరెండం లాంటిదే ఈ ఎన్నికల తంతు. ఇండియాకు ఎదురవు తున్న సవాళ్లు, ఆ దేశంలో పెరుగుతున్న చైనా ప్రభావం ఇలాగే కొన సాగుతాయి. ‘యాక్ట్ ఈస్ట్’ అనేది కలగానే మిగిలిపోనుంది.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజల సొమ్ము పంచడమే బాబు సంస్కరణలా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందించింది. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షణలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ పత్రిక ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రజానీకం, ఆర్థిక నిపుణులు కొందరు అంటున్నది ఏమిటంటే.. ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెడుతున్నందుకే ఈ అవార్డు అని! పైగా మీడియా సంస్థలు అధికారంలో ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నాయంటే ప్రజలు సందేహించే పరిస్థితులున్నాయి. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే.. సీఎం లేదా ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న నేతలకు ఇలా అవార్డులు ఇస్తూంటారన్న విమర్శ ఉండనే ఉంది. అంతేకాదు.. ఈ మీడియా సంస్థలు ప్రభుత్వాల నుంచి భారీ ఎత్తున ప్రకటనలు తీసుకుని ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతూండటం గమనార్హం. ఎకనమిక్ టైమ్స్ అలా ఇచ్చిందా? లేదా? అన్నదానికి జోలికి వెళ్లడం లేదు. కాని ఈ పత్రిక గ్రూపు నిర్వహించిన ఒక సదస్సుకు ఏపీ ప్రభుత్వం రూ.కోటిన్నరతో పాటు రూ.27 లక్షలు జీఎస్టీగా చెల్లించడం విమర్శలకు కారణమవుతోంది. ఈ అవార్డు ఎంపిక కమిటీలో చాలామంది ప్రముఖులే ఉన్నారు. ఆయా సందర్భాల్లో వీరు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన విషయం బహిరంగమే. ఓకే కానీ... ఏ కొలమానాల ప్రకారం చంద్రబాబును ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నది ప్రశ్న. ఎందుకంటే.. 18 నెలల అధికార అవధిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా వచ్చిన పరిశ్రమలేవీ లేవు. మంత్రి లోకేశ్ వంటి వారు.. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తోనే బోలెడన్ని పరిశ్రమలు వచ్చేస్తాయని గొప్పలు చెప్పుకున్నా వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగానే ఉంది. కూటమి సర్కారు విశాఖపట్నంతోపాటు మరికొన్ని చోట్ల కొన్ని కంపెనీలకు ఎకర భూమి రూ.99 పైసలకే లీజు లేదా గంపగుత్తగా ఇస్తున్నా అవే కంపెనీలు హైదరాబాద్‌లో వందల కోట్ల రూపాయలతో భూములు కొంటున్నాయి. రహేజా వంటి సంస్థలకు అంత తక్కువ ధరకు భూములిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం ఆశ్చర్యపోయింది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ, వేల కోట్ల లాభాలు ఆర్జించే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు.. ఊరు పేరూ లేని ఉర్సా అనే కంపెనీలు ఈ చౌక బేరంతో లబ్ధి పొందాయి. చంద్రబాబు సన్నిహితుడిగా చెప్పే లూలూ మాల్ అధిపతి అహ్మదాబాద్‌లో రూ.519 కోట్లు పెట్టి భూమి కొనుక్కుంటే విశాఖ, విజయవాడలలో కాణీ ఖర్చు లేకుండా పలు రాయితీలతో భూమి పొందారు. విజయవాడలో వందల కోట్ల రూపాలయ విలువైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించేశారు. గూగుల్ డేటా సెంటర్ అని ప్రచారం చేసిన అదాని డేటా సెంటర్‌కు భూములు కేటాయించడమే కాకుండా ఏకంగా రూ.22 వేల కోట్ల విలువైన రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చేసింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు చూస్తే ఆ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక చంద్రబాబు ప్రభుత్వమే ఆ సంస్థలలో ప్రజల సొమ్మును ఎదురు పెట్టుబడిగా పెడుతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ కంపెనీలకు ఇస్తున్న భూములు ఏకంగా 66 ఏళ్ల వరకు వారి అధీనంలోనే ఉంటాయి. అవి కల్పించే ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుందో చెప్పలేం కాని, ఆ భూములవల్ల వారికి కలిగే ప్రయోజనం మాత్రం జాక్ పాట్ వంటిదే. పరిశ్రమలకు భూమి, రాయితీలు ఇవ్వడం కొత్త కాదు.కాని ప్రభుత్వానికి బొత్తిగా ఆదాయం రాకుండా ప్రైవేటువారికే మేలు కలిగేలా ,వారికే సంపద సమకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ అవే వ్యాపార సంస్కరణలు ఈ మీడియా సంస్థలు డప్పు కొడితే ఏమి చేయగలం? ఇవే కాదు.. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చి వందల కోట్ల విలువైన భూములు కేటాయించి, నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల సంపదను సృష్టిస్తే, వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి సంపదగా మార్చేస్తున్నారు. అయితే ఇది కూడా వ్యాపార సంస్కరణ అనే ఆ అవార్డు కమిటీ భావించిందేమో.ఆంధ్రప్రదేశ్ ప్రాథమికంగా వ్యవసాయాధార రాష్ట్రం. కాని అక్కడ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఫలితంగా పలుమార్లు రైతులు తమ పంటలను పారబోస్తున్నారు. చాలా సందర్భాల్లో వ్యాపారులకు ఈ పంటలు కారుచౌకగా దొరుకుతున్నాయి.రైతులేమో నష్టాల్లో కూరుకుపోతున్నారు. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల సంక్షేమం కాంక్షించి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరు కార్చేయడంతో నష్టం మరింత ఎక్కువగా ఉంటోంది. యూరియా కొరతను అదనుగా చేసుకున్న వ్యాపారులు అందినంత దండుకున్నారు. ఆ రకంగా వారికి చంద్రబాబు అంటే మక్కువ ఏర్పడిందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విద్య, వైద్య సామాజిక రంగాలలో జగన్ సంస్కరణలు తేగా, ఇప్పుడు కూటమి సర్కార్ ప్రజలను ప్రైవేటు సంస్థల దోపిడీకి వదలి వేసే విధానాలు తీసుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయకుండా మొత్తం ప్రైవేటు బీమా కంపెనీల చేతిలో పెట్టడానికి ప్రభుత్వం సిద్దం అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, వలంటీర్లను ప్రవేశపెట్టి జగన్ పాలన సంస్కరణలు తెచ్చి ప్రజలకు పౌరసేవలను వారి ఇంటివద్దే అందిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని ఏ రకంగా చూసినా పేదల వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల విధానాలుగానే కనిపిస్తాయి. జగన్ టైమ్‌లో సెకీ ద్వారా తక్కువ ధరకు విద్యుత్ తీసుకోవాలని ఒప్పందం చేసుకుంటే అది అధిక ధర అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అదానితో భేటీ అయిన వెంటనే దానికి ఓకే చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాక సోలార్ పవర్‌ను యూనిట్‌కు రూ.మూడు కంటే ఎక్కువ ధరకు కొనడానికి సిద్దపడుతున్నారు. ఇక రెడ్ బుక్ అరాచకాలతో పరిశ్రమలను కూడా వదలి పెట్టడం లేదు. ఒక మోసకారి నటిని అడ్డం పెట్టుకుని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై కూడా కేసు పెట్టే యత్నం జరిగింది. చిత్రంగా ఆయన కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి వాటా ఉన్న భారతి సిమెంట్తోసహా మరో రెండు సిమెంట్ కంపెనీల లీజును కక్షపూరితంగా రద్దు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇది ఏ రకంగా వ్యాపార సంస్కరణ అవుతుంది? ఏది ఏమైనా చంద్రబాబుకు ఎకనమిక్స్ టైమ్స్ అవార్డు ఇచ్చినందుకు ఏపీ ప్రజలు సంతోషిస్తారా? భయపడతారా? అన్నది చెప్పలేం. ఇలాంటి బిజినెస్ అవార్డుల ఉత్సాహంతో మరింతగా పెట్టుబడిదారులు, వ్యాపారులకు అణాకు, బేడాకు విలువైన రైతుల, ప్రభుత్వ భూములను కట్టబెట్టకుండా ఉంటే అదే పదివేలు అన్నది జనాభిప్రాయంగా ఉంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఐదు ముక్కల్లో జగన్ మార్కు అభివృద్ధి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ తీసుకొచ్చిన పెట్టుబడులు, ఆయన హయాంలో ఏర్పాటైన పారిశ్రామిక సంస్థల గురించి జరిగిన ప్రచారం ఒకటి.. అసలు వాస్తవం ఇంకోటి. ఐదేళ్ల పదవీ కాలంలో తొలి రెండేళ్లు కోవిడ్-19తోనే సరిపోయింది. రాష్ట్ర విభజన తరువాత వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కొరత కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు అడ్డంకి కానే కాలేదు. అన్ని ఇబ్బందులను అధిగమించి కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో అందరి ప్రశంసలు అందుకుంది జగన్ ప్రభుత్వం. అదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి జగన్ ఒక్కటొక్కటిగా పునాదులు వేస్తూ పోయారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల గురించి స్థూలంగా ఐదు ముక్కల్లో...1. భారీ పెట్టుబడులు..ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఐదేళ్ల కాలంలో ఆమోదం తెలిపిన పెట్టుబడులు ఏకంగా రూ.1.44 లక్షల కోట్లు. అంతేకాదు.. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో 17.5 గిగావాట్ల విద్యుదుత్పత్తికి అనుమతులు ఇవ్వడం ద్వారా రికార్డు సృష్టించింది. మిగిలిన రాష్ట్రాలు సౌర, పవన విద్యుత్తులకు మాత్రమే పరిమితమైతే.. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్‌లో పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాజెక్టు ఏర్పాటైంది. గ్రీన్కో సంస్థ సుమారు రూ.28 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు సంప్రదాయేతర ఇంధన రంగంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కోల్ ఇండియా, ఏఎం గ్రీన్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కారణంగా గ్రీన్ అల్యూమినియం, హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్తు సరఫరా సాధ్యమైంది. ఎకోరెన్ గ్రూపు రూ.11 వేల కోట్లు అకార్డ్ గ్రూపు రూ.పదివేల కోట్లు, సెంచురీ ప్లైబోర్డ్స్ రూ.2600 కోట్లతో, ఆంధ్ర పేపర్ మిల్లు రూ.3400 కోట్లు, ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ రూ.1087 కోట్లు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొత్త ప్లాంట్ల ఏర్పాటు, విస్తరణలకు పెట్టుబడులుగా పెట్టింది కూడా జగన్ హయాంలోనే!2. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. 2023లో విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 340 వరకూ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి మొత్తం విలువ రూ.13 లక్షల కోట్లు. సుమారు 20 రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఏర్పడింది. ఇదే సమ్మిట్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వర్చువల్ పద్ధతిలో రూ.3841 కోట్ల విలువైన పరిశ్రమలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిద్వారా సుమారు తొమ్మిదివేల ఉపాధి అవకాశాలు దక్కాయి. దేశ వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్), కృష్ణ ఎల్లా (భారత్ బయోటెక్), జి.మోహన్ రావు (జీఎంఆర్ గ్రూపు), నవీన్ జిందల్ (జిందల్ స్టీల్ అండ్ పవర్), అదానీ గ్రూపు ప్రతినిధులు ఇతర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం గమనార్హం.3. పోర్టులు.. ఇతర మౌలిక సదుపాయాలు..సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని రాష్ట్రాభివృద్ధికి మెట్టుగా మార్చాలని వై.ఎస్.జగన్ సంకల్పించారు. ఇందుకు తగ్గట్టుగానే ఆయన హాయంలో మచలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం పడింది. రికార్డు సమయంలో మచలీపట్నం పోర్టు పూర్తయ్యి 2023 మే నెలలో ప్రారంభమైంది కూడా. వీటితోపాటు అప్పటికే ఉన్న వైజాగ్, కృష్ణపట్నం, గంగవరం నౌకాశ్రయాల ఆధునికీకరణ, విస్తరణ కూడా చేపట్టారు. ఫలితంగా 2022లో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఉన్నత స్థానానికి చేరుకోగలిగింది. ఆ ఏడాది దేశీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 38 శాతం! నౌకాశ్రయాల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో పలు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి కూడా వై.ఎస్.జగన్ శ్రీకారం చుట్టారు. పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ ఎగుమతులు కేంద్రంగా విశాఖ - చెన్నై కారిడార్ ఏర్పాటైతే.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ జిల్లాలను బెంగళూరు- చెన్నై కారిడార్లతో కలిపే ప్రయత్నం జరిగింది.4. పారిశ్రామిక విధానం..సంక్షేమం పునాదిగా.. పారిశ్రమలే చోదక శక్తిగా జగన్ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 65 శాతానికి కారణమవుతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, పెట్రోకెమికల్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులు ఇచ్చేపద్ధతిని మొదలుపెట్టారు. వీటన్నింటి కారణంగానే ఆంధ్రప్రదేశ్ 2019-2024 మధ్యకాలంలో వరుసగా మూడేళ్లు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకోగలిగింది. సంక్షేమ పథకాలకు పారిశ్రామిక ప్రగతికి ముడిపెట్టిన జగన్ రాష్ట్రానికి వస్తున్న కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసేందుకు పలు స్కిల డెవలప్మెంట్ కోర్సులను అమలు చేశారు. అపారెల్ పార్క్, ఆటో క్లస్టర్లను గ్రామీణ యువత, మహిళలకు నైపుణ్యాలను అందించే పథకాలకు జోడించారు. వీరిలో అత్యధికులు అమ్మ ఒడి, ఎస్‌హెచ్‌జీ గ్రూపు లబ్ధిదారులే.5. పండుగలా వ్యవసాయం..2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం పండుగల మారింది. రైతు భరోసా ద్వారా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఏటా రూ.13,500 పంపిణీ చేయడం మాత్రమే కాదు.. ఉచిత బోర్‌వెల్స్, సాగునీటి ప్రాజెక్టులు, పంట బీమా పథకాలు రైతు కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఎప్పటికప్పుడు రైతు అవసరాలను గమనించి తీర్చేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పదివేలకుపైగా రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. వలసలు తగ్గాయి. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు కూడా రైతు పురోగతిలో తమ వంత పాత్ర పోషించాయి. పండ్లు, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2023-24 సంవత్సరానికి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022లో ఆంధ్రప్రదేశ్ నుంచి 774 కోట్ల డాలర్ల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
అనితర సాధ్యుడు
ధరిత్రిలో చరిత్ర సృష్టించేవాళ్ళు కొందరే ఉంటారు. వారి వల్ల కాలానికి ఓ గుర్తింపు వస్తుంది. కాలం కలకాలం వారిని గుర్తుంచుకుంటుంది. సమ కాలీన భారత రాజకీయ చరిత్రలో పదహారేళ్ల క్రితం ఓ ఉత్తుంగ తరంగం ఎగిసింది. హిమాలయ శృంగ సమా నమై నిలిచింది. ఆ తరంగం పేరే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. మన మాజీ ముఖ్యమంత్రి. ప్రజలు ముద్దుగా, గౌరవంగా, ఆత్మీయంగా పిలుచుకునేది ‘జగన్’ అని! ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఒక కఠోర శ్రమ, ఒక నిరంతర దీక్ష, ఒక పట్టుదల, ఒక ఆత్మీయం – జగన్. అలజడి, ఆందోళన, తిరుగుబాటు ఆయన తత్త్వం. బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు జగన్. ఓ 36 ఏళ్ల యువకుడు, రాజకీయ పసిబాలుడు సమాజపు అట్టడుగు దేశ రాజకీయ చరిత్రను తిరగరాయడం ఆశ్చర్యం. అది జగన్‌కే చెల్లింది. 125 సంవత్స రాల కాంగ్రెస్ పార్టీని కదిపి, కుదిపి, ధిక్కరించి, ఛీత్కరించి తన అసామాన్య, అసాధారణ పోరాటంతో ఆ పార్టీ ఊపిరి తీసేసి రాష్ట్రంలో, దేశంలో లేకుండా చేయటం అన్నది మాటలు కాదు. మహామహులకు సాధ్యం కాని పని జగన్మోహన్ రెడ్డి చేయడం జగత్తు చూసి ముక్కున వేలేసుకుంది.ప్రియమైన వారసుడుమహానేత, తెలుగు రాష్ట్ర ప్రజల భాగ్యవిధాత అయిన తండ్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హఠాత్తుగా అందర్నీ వీడి పోతే... ఆ బాధ భరిస్తూ, ఆ అనంత శోకాన్ని ఎదలో మోస్తూ, తండ్రి ఆశయ సాధన కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, జనం కోసం నిలబడిన ధీరోదాత్తుడు జగన్. తండ్రి ఆశయం కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి ముందుకు వచ్చిన అసలు సిసలు యుద్ధవీరుడు. తండ్రి ఆస్తులకు కాదు, ఆశయాల కోసం నిలబడాలి అని ప్రజల పక్షం వహించి, లోకంలో ఆశయం కోసం ఎలా ఉండాలో పోరాటం చేసి చూపిన యోధుడు.పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రత్యర్థులు ప్రతి క్షణం వెనక్కి లాగుతున్నా, ప్రజల కోసం అడుగులు వేసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జగన్. ఆయన పట్ల ప్రజలు అపార అభిమానం, నమ్మకం పెంచుకుంటున్న పరిస్థితిని పసిగట్టి జగన్‌ను అణిచివేయాలని ఎన్ని కుట్రలు పన్నారో అందరికీ తెలిసిందే.మహానేత మరణాన్ని భరించలేక ఆంధ్ర రాష్ట్రం అల్లాడి పోయింది. దాదాపు 673 మంది ప్రజలు ఆత్మహత్య చేసు కున్నారు. తన తండ్రి కోసం తనువులు వీడిన ఆ కుటుంబాలను పలకరించాలని, పరామర్శించాలని జగన్ సంకల్పించారు. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదు. ఆ యువకుడు కదిలితే అతని వెంట కోట్లాది జనం నడుస్తారని వారికి తెలుసు. అది ఇష్టం లేక ఆ కుటుంబాలను ఒక చోటికి పిలిచి మాట్లాడమని ఆదేశించింది అప్పటి కాంగ్రెస్ అధిష్టానం. చెప్పుడు మాటలకు తలవొగ్గి జగన్మోహన్రెడ్డికి గిరి గీయాలి అని ప్రయత్నించింది సోనియా గాంధీ.బాధిత కుటుంబాలను తన దగ్గరకు పిలిపించుకోవడం న్యాయం కాదనీ, తానే వారి దగ్గరికి వెళ్లి పలకరించడం భార తీయ ధర్మం, సంప్రదాయం అనీ ఆయన చెప్పినా అంగీకరించ లేదు సోనియా గాంధీ. అన్యాయాన్ని, అధర్మాన్ని అంగీకరించి తలవంచడం తెలి యని జగన్, ఆమె మాట కాదన్నాడు. ఆ అభాగ్యుల చెంతకు తనే స్వయంగా వెళ్ళటానికి నిర్ణయించి అడుగు ముందుకు వేశాడు. అది అభిమాన జనప్రవాహంతో ఓదార్పు యాత్రగా మారింది. ఆ యువకుడిని, తమ ప్రియమైన డాక్టర్ వై.ఎస్. రాజ శేఖర రెడ్డి కుమారుడిని చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు, ప్రజా సముద్రం కదిలింది. జగన్ మాట్లాడుతూఉంటే, ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, ఆదరంగా భుజంమీద చేయి వేస్తూ ఉంటే, చేయి ఊపి దగ్గరికి పిలుస్తూ ఉంటే, ‘నేను ఉన్నాను’ అని నమ్మకం ఇస్తూ ఉంటే, ఆంధ్ర ప్రజలు ఆప్యాయ తతో పొంగిపోయారు. కాపాడే నేత కళ్ళ ముందు కనిపిస్తున్నా డని ఆనందపడ్డారు. అతడే తమ నాయకుడు, పరిపాలకుడు కావాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి మారుగా తనయుడు తమ కష్టాలు తీరుస్తాడని త్రికరణ శుద్ధిగా నమ్మారు.అవిశ్రాంత యోధుడుజగన్ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి, ప్రత్య ర్థులకు, సోనియా గాంధీకి, చంద్రబాబుకు కన్ను కుట్టింది, వెన్ను జలదరించింది. అతని ముందు నిలబడలేమని అర్థమైంది. ఆనాడు అభిమన్యుడి మీదికి కుట్రతో ఉరికిన కురు మూకల మాదిరి ప్రత్యర్థులు సోనియాగాంధీ, చంద్రబాబు కుయుక్తులు పన్నారు, కుతంత్రాలు చేశారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకున్నా, పరిపాలనలో పాలుపంచు కోకున్నా సీబీఐని ఉసిగొల్పారు. దాని ఫలితం అనేకమైన అబద్ధపు కేసులు పెట్టి, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం బెయిలు కూడా రాకుండా అక్రమ నిర్బంధం చేశారు. మానసికంగా కుంగదీయాలని అనేక ప్రయత్నాలు చేశారు.అన్ని రోజుల పాటు జైలులో అనంత ఏకాంతంలో ఉన్నా జగన్ మనోబలం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలకు సేవ చేయా లన్న పట్టుదలలో వెనుకంజ వేయలేదు. తాత నుండి ఆత్మస్థైర్యం, తండ్రి నుండి మనోబలం, తల్లి నుండి సహనం సహజంగా అతనికి అబ్బిన గుణాలు. చెక్కుచెదరని అసాధారణ సాధనతో, మనో నిబ్బరం సడలని బలంతో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చాడు. మరొకరైతే చెదిరి బెదిరి విలువలకు తిలోద కాలు ఇచ్చి, కాడె పారేసి కదలి వెళ్లిపోయేవారు. ఎన్ని దాడులు, ఎన్ని విమర్శలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ప్రచారాలు, ఎంత వైషమ్యం, ఎంత విషం తమ పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా నిత్యం ప్రత్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసత్యాన్ని సత్యం అని చెబుతూనే ఉన్నారు. జగన్మోహనుడు ఏ మాత్రం జంక లేదు. ఏ మాత్రం తొణకలేదు. ఒక్కడుగా, ఒకే ఒక్కడుగా జనాన్ని నమ్మి కదన రంగంలోకి కొదమ సింహంలా ఉరికాడు. ఆత్మీయులను ఆదరిస్తూ 2014 ఎన్నికల రంగంలోకి ఏకాకిగా అడుగుపెట్టాడు. ప్రజలలో అదే ఆదరణ, అదే నమ్మకం.అబద్ధం చెప్పలేను, మోసం చేయలేను, అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వలేను అని విలువలకై నిలబడ్డాడు. ప్రత్యర్థులు, చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. అధికారం వస్తే చాలని అబద్ధాల కుప్పలు ప్రజల ముందు పోశారు. ఆనాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అని ఒకే ఒక అబద్ధం జగన్ చెప్పి ఉంటే అధికారం దక్కేది. మోసం చేయను అని నిలబడినందుకు అధికారం కోల్పోవలసి వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యం కోల్పోలేదు, ప్రజల పక్షాన నిలబడటం మానలేదు. ఆయనకు కావాల్సింది అధి కారం కాదు, జన క్షేమం. చంద్రబాబు బృందం జగన్ మీద మరింత అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది. అయినా చంద్ర బాబు ప్రభుత్వం మీద జగన్ పోరాటం ఏమాత్రం ఆపలేదు. ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షం నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత యుద్ధం చేస్తూనే ఉన్నారు. తన శాసన సభ్యుల్ని నిస్సిగ్గుగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్నా ధైర్యం కోల్పోలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం, పేదల కోసం గళం ఎత్తుతూనే ఉన్నాడు.సహృదయ నాయకుడుజనం కోసం జగన్ జరిపిన సుదీర్ఘ పాదయాత్ర మరొక చరిత్ర. తండ్రిలాగే తాను జనం మధ్యకు వెళ్లాలనీ, కష్టజీవుల కన్నీటి కథలు తెలుసుకోవాలనీ, రైతుల గోడు వినాలనీ, నిరుద్యోగుల, ఉద్యోగుల, ఆడపడుచుల బాధలు వినాలనీ, ఓదార్చాలనీ, ధైర్యం చెప్పాలనీ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు జగన్. సెక్యూరిటీ వారు వద్దన్నా, ఆత్మీయులు ప్రేమగా వారించినా కాదని ప్రజల కోసం ఎండనకా, వాననకా అడుగులు వేశాడు. కాళ్లు బొబ్బలు ఎక్కాయి, హఠాత్తుగా ఆరోగ్యం సహకరించలేదు, హత్యా ప్రయత్నం జరిగింది, ప్రతీప శక్తులు హేళన చేశాయి. ఏవీ ఆయన లెక్కలోకి తీసుకోలేదు. దీక్ష, పట్టుదల, పేదల పట్ల ప్రేమ, సేవ చేయాలన్న ఆశయం ఆయనను నడిపించాయి. ప్రతిరోజూ ఇరవై వేల మందిని కలుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ, ధైర్యం ఇస్తూ కదిలాయి ఆయన పాదాలు. ఆ పాదస్పర్శకు నేలతల్లి పులకించింది. ఆయన మాటల ఓదార్పుకు జనంలో ఆశ చిగురించింది.పేదలు, వృద్ధులు, రోగగ్రస్థులు, ఎందరో ఆయనకు గోడు వినిపించుకున్నారు. పుండ్లతో శరీరం కుళ్ళి రసి కారుతూ దగ్గరకు వెళ్ళటానికి జుగుప్స కలిగించే వారిని సైతం ఆలింగనం చేసుకొని అక్కున చేర్చుకున్న అమృత హృదయం జగన్ మోహన్ రెడ్డి గారిది. ముగ్గుబుట్ట వంటి తలా, ముడ తలు దేరిన దేహం, కాంతి లేని కళ్ళతో దీనంగా, హీనంగా, దైన్యాతిదైన్యంగా ఆదరణ కోసం, ఆత్మీయత కోసం, సహాయం కోసం, సానుభూతి కోసం ఎదురుచూస్తున్న నిర్భాగ్య సోదర సోదరీమణుల్ని ఆప్యాయంగా, ప్రేమగా, అత్యంత సన్నిహి తంగా దగ్గరకు తీసుకున్న మొదటి, ఆఖరి రాజకీయ నాయకుడు నిస్సందేహంగా జగనే! అంతరంగంలో అపారమైన ప్రేమ, దయ, జాలి ఉంటే తప్ప అది సాధ్యపడదు.అపూర్వమైన సంస్కారం ఆయనది. తనకన్నా చిన్నవారిని, నౌకర్లను, డ్రైవర్లను, సెక్యూరిటీ వారిని అందరినీ ‘అన్నా’ అని పిలిచే సహృదయత ఆయనది. ఎదుటివారికి ఆయన ఇచ్చే గౌరవం మరే రాజకీయ నాయకుడూ ఇవ్వడు. పాదయాత్రతో మరింత ఎదిగాడు. ప్రజల మనసులలో నమ్మకం పెంచాడు. వారికి ఏం కావాలో, తనేం చేయాలో నిర్ణయించుకున్నాడు. పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాడు. నిర్ణయించుకుంటే అడుగు వెనక్కి వేయని తత్వం. చేయాలనుకున్నది చేసి తీరే పట్టుదల. కన్నీటి కథలకు, వెతలకు, కరిగిన ఆయన హృదయం తీసుకున్న కఠిన నిర్ణయం పేదల పక్షపాతం.ఒకే ఒక్కడు2019 ఎన్నికలు వచ్చాయి. ఒక్కడే ఒకే దీక్షతో నారాయణ ధనుర్ముక్త బాణంలా జనంలోకి వచ్చాడు. పర్జన్య గర్జన్యం వంటి ఆయన వాక్కు హామీ అందరూ ఆదరించారు. 151 సీట్లతో ఎవరి అండా లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేను అధికారిని కాను, సేవకుడిని అని ఆ క్షణమే చాటాడు. తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే తన శాసనాలనీ, తన మ్యానిఫెస్టో తన ఖురాను, బైబిలు, భగవద్గీత అనీ, కడుపు నిండని పేద తన దేవుడనీ నమ్మి పరిపాలన సాగించాడు.తను ఇచ్చిన వాగ్దానాలలో దాదాపు అన్నిటినీ నెరవేర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవాడు మూడు పూటలా భోజనం చేయడానికి ఆయన ప్రథమ ప్రాధాన్య మిచ్చాడు. వారి ఇంటి ముంగిటకే తీసుకువెళ్లి రేషన్ అందించాడు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రభు త్వాన్ని వారి ఇంటి పక్కన నిలిపాడు. వాలంటీర్లుగా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. వారి ద్వారా వృద్ధులు, వికలాంగులు, పేదలు, విధవలకు పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేశాడు. ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ కావడం మనందరి గర్వకారణం, అదృష్టం. రెండు సంవత్సరాలు కరోనాతో దేశం స్తంభించిపోయింది. ఆర్థికపరంగా అన్ని వ్యవస్థలూ అతలాకుతలమయ్యాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఏ పథకమూ ఆగలేదు. ఏ నిరుపేదా ఆకలితో ఉండలేదు. అనేక పట్టణాలలో అభాగ్యు లకు రెండు పూటలా ఆహార పొట్లాలు అందించాడు. అందరికీ వైద్యం అందింది. ఈనాటి పాలకులు, సనాతన ధర్మ రక్షణ పరులు ఇళ్లల్లో ముడుచుకుని మూలన పడుకుంటే ప్రజలకు చేరువగా జగన్ ఉన్నాడు.ప్రమాదంలో మరణించిన వారికి దేశంలోనే మొదటి సారిగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించిన మొదటి ముఖ్యమంత్రి జగనే. తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి మరిన్ని రోగాలకు ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకున్న ఆరోగ్యదాత జగన్. పేదల కోసం ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా, లక్షల ఇళ్లు నిర్మించాడు. పేద విద్యార్థులకు ఆర్థికసహాయం పథకం మరింత మెరుగు పరిచాడు. ప్రతి పేద పిల్లవాడూ చదువుకోవాలనీ, తద్వారా జీవన ప్రమాణం పెంచుకోవాలనీ ప్రభుత్వ పాఠశాలల్ని వేల కోట్లతో ఆధునీకరించాడు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాడు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెట్టాడు. పిల్లలను స్కూల్‌కు పంపితే చాలు... ఆ తల్లుల అకౌంట్లలో ఏటా రూ. 15 వేలు వేళకు ఇస్తూ, ‘అమ్మ ఒడి’ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఆధునిక లాప్‌టాప్‌లు, ఆరోగ్యకరమైన ఆహారం, యూనిఫాం అందించి, పెను మార్పులు తీసుకురావడానికి కారణమయ్యాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులను చేర్చడానికి తల్లిదండ్రులు పోటీపడ్డారన్న మాట, కొన్ని పాఠశాలల్లో సీట్లు దొరకని మాట అక్షరాలా నిజం. ప్రజలు కొనియాడిన సత్యం.ధీరోదాత్తుడుదేశం మొత్తం మీద అతి తక్కువ కోవిడ్ మరణాలు జరి గింది మన రాష్ట్రంలోనే అన్నది జగమెరిగిన విషయం. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం చేతిలోనే ఉండాలని 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. సీట్ల సంఖ్య పెంచాడు. హైందవ ధర్మ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానాల అభివృద్ధికి అపారమైన కృషి చేసింది జగనే. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని, అరాచకాలను నేడు వారు జగన్ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతని కూటమి అనేక అబద్ధాలు ఆడాయి. జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామనీ, ఉచితాలు అందజేస్తామనీ, అసత్య ప్రచారాలు చేశాయి. ప్రజ లను ఆశపెట్టాయి, భ్రమలు కల్పించాయి. సాధ్యం కాని హామీలు అమలు పరుస్తామని అరచి, మోసం చేసి ప్రజల నోళ్లు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. నిజానికి జగన్ పథకా లకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేసుకున్నారు తప్ప మరేమీ కాదు. కొత్త పథకం ఒక్కటీ లేదు. ఇప్పుడు ఏమీ అమలపరచలేక దీనికి కారణం జగన్ అని ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రాఫిక్ మాయాజాలంతో చిటికెల పందిళ్లు వేస్తున్నాయి. మూడు నెలలకే ప్రజలు అసలు నిజం గ్రహించారు. ఓ మహా నాయకుడిని మాయ మాటల వల్ల ఓడించి ఓడిపోయామని బాధపడుతున్నారు. అన్ని వర్గాల వారూ విలపిస్తున్నారు.గతంలో ఓడిపోయిన చంద్రబాబు మూడు సంవత్సరాలు మూలన ముక్కుతూ కూర్చుంటే – ఓటమిని, ప్రజల తీర్పును, హుందాగా స్వీకరించిన జగన్ వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల కలంగా, గళంగా, బలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తున్నారు, ప్రజలను మేల్కొల్పుతున్నారు. ఐదు సంవత్సరాల పాలనలో రెండేళ్లు కరోనాకు పోయినా, అద్భుతాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజల హృదయాలలో, పేదల మనసులలో, సుస్థిర స్థానం సంపాదించుకున్న పాలకుడు. నేత అన్న పదానికి అర్థం చెప్పిన ప్రజా సేవకుడు. ఓటమికి కుంగని ధీరోదాత్తుడు. ప్రజా హృదయ గోవర్ధనమెత్తిన గోపాలుడు. వక్రబుద్ధులు, కుట్రలు, కుతంత్రాలు ఎదిరించి జనుల కోసం స్థిరంగా నిలబడిన జననేత, అజేయుడు, అనితర సాధ్యుడు, సున్నిత మనస్కుడు, పేదల పక్షపాతి, ఆరోగ్య విద్యాదాత, ఆపన్నులకు వర ప్రదాత, సహాయానికి సహస్ర హస్తుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు, భవిష్యత్ భాగ్యప్రదాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడికి, ఆలోచనాపరుడికి అనుచరుడిగా ఉండటం, ఆయనతో కలిసి నడవడం నాకు ఇష్టం, ఆనందం, సంబరం... సమున్నత గర్వం.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
దీపం వివాదం ఓట్లు తెచ్చేనా?
2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ వ్యూహరచనలో ఇప్పటికీ హిందూత్వమే అగ్ర భాగాన ఉంది. తిరుప్పరన్ కుండ్రంలో దీపం వివాదం అంతర్లీనంగా ఈ అంశాన్నే ప్రతిబింబిస్తోంది.బిహార్‌లో ఇటీవల ఘన విజయం సాధించిన బీజేపీ, 2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పెను సవాళ్ళనే ఎదుర్కొంటోంది. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం వహిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల ప్రాభవం కనిపించదు. తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే), పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈసారి కూడా తమ సత్తా చాటవచ్చని భావిస్తున్నారు. తమిళనాట డీఎంకేతో సర్దుబాటు చేసుకుని, సంతృప్తి చెందేందుకే కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కానీ, బెంగాల్లో దానికి ఆ మాత్రం ఊతం కూడా లభించడం లేదు. అందులోనూ బిహార్‌లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ను తోడు తీసుకెళ్ళేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. మరోపక్క బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ సమరానికి సై అంటోంది. ఒంటరిగానే సై!అయితే, బెంగాల్లో 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాలతో, ఇక ఆ తూర్పు రాష్ట్రాన్ని ‘జయించడం’ తనకు చిటికెలో పనిగా బీజేపీ భావించింది. తీరా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. మొత్తం 294 స్థానాల్లో 200 కైవసం చేసు కోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, 77 సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ, పోలైన ఓట్లలో 38 శాతం గడించి, ముఖ్య ప్రతిపక్షంగా అవతరించినందుకు కొంత సంతృప్తి చెందింది. ఈ గణాంకాలు అంత ప్రోత్సాహకరంగా లేకపోయినా, బిహార్‌లో విజయఢంకా మోగించాక ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాల యంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘‘గంగా నది బిహార్ నుంచి బెంగాల్లోకి ప్రవహిస్తుంది’’ అని ప్రకటించారు. అది ఏదో ప్రాసంగికంగా దొర్లిన విషయంలా లేదు. బెంగాల్ విపుల ప్రణాళికపై కార్యాచరణకు హోమ్ మంత్రి అమిత్ షా అప్పటికే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ వ్యూహరచనలో హిందూత్వమే ఇప్పటికీ అగ్ర భాగాన ఉంది. కానీ, పశ్చిమ బెంగాల్, తమిళ నాడుల్లో అది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. దీప ప్రజ్వలన వివాదంతిరుప్పరన్ కుండ్రంలో దీపం వెలిగించడానికి సంబంధించి ఇటీవల రేగిన వివాదం అంతర్లీనంగా ఆ అంశాన్నే ప్రతిబింబించింది. తమిళులు ‘మురుగా!’ అంటూ విపరీతంగా ఆరాధించే సుబ్ర హ్మణ్య స్వామికి చెందిన ఆరు పవిత్ర క్షేత్రాలలో తిరుప్పరన్ కుండ్రం ఒకటి. అక్కడి ఆలయానికి కొద్ది మీటర్ల దూరంలోనే సుల్తాన్ సికందర్ ఔలియా దర్గా ఉంది. చెదురుమదురు ఘర్షణలను మినహా యిస్తే అక్కడ కార్తీక దీపోత్సవం శాంతియుతంగానే సాగిపోయింది. కాకపోతే, దర్గాకు కేవలం 15 మీటర్ల దూరంలో ఉన్న దీపత్తూన్గా పిలిచే ప్రాచీన స్తంభంపై దీపం వెలిగించేందుకు కోర్టు ఉత్తర్వు తెచ్చుకోవలసి వచ్చింది. దీపాన్ని వెలిగించే కార్యక్రమానికి అను మతి కోరుతూ మద్రాసు హైకోర్టులోని మదురై ధర్మాసనం ముందు ఈసారి పిటిషన్ దాఖలైంది. కోర్టు దీపారాధనకు అనుమతించడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలు సంబరం చేసుకున్నాయి. కానీ, జిల్లా పాలనా యంత్రాంగం వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేయడంతో, పోలీసులు వాటిని అమలుపరచవలసి వచ్చింది. ‘‘ఆశించిన ఫలితం సాధించడానికి హిందువులలో చైతన్యాన్ని రేకెత్తిస్తే చాలు’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్య అవసరమైతే ఘర్షణకు దిగవలసిందని పరోక్షంగా సూచించి నట్లయింది. తమిళనాడు సాంస్కృతిక, మత సమ్మేళనాన్ని అర్థం చేసుకోవడంలో బీజేపీకి ‘ప్రాథమికమైన లోపం’ ఉందని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. ‘‘తమిళ నాడు ప్రజానీకానికి దైవభక్తి ఎక్కువ. కానీ, మతాన్ని రాజకీయా లతో మిళితం చేసి చూడరు’’ అని ఆయన అన్నారు. చిన్నాచితక ప్రాంతాల్లో తప్పించి బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు తమిళ నాడులో పటిష్ఠమైన స్థానిక వ్యవస్థలు లేవు. అయినా, అవి దీపారా ధనపై వివాదాన్ని నిలకడగా కొనసాగించగలిగితే, ఓటర్ల మనసును కొంత వరకు పట్టుకోవచ్చు. కానీ, తమిళనాడు రాజకీ యాలు చాలావరకు ద్రావిడ కళగం నాయకుడు పెరియార్ ఇ.వి. రామస్వామి సిద్ధాంతాలతో ప్రభావితమైనవి. ఆయన చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమంలో ముస్లింలను కూడా దళితులుగా చిత్రించడం ఒక కీలకమైన అంశం. హిందూయిజంలో అంతర్లీనంగా ఉన్న కుల అణచివేత నుంచి తప్పించుకునేందుకు దళితులు ఇస్లాంలోకి మారారన్నది ఆయన సిద్ధాంతాలలో ఒకటి.ఓటుబ్యాంకుకు దెబ్బపశ్చిమ బెంగాల్లో టీఎంసీ వరుసగా మూడు విడతలుగా అధికారంలో ఉంది. ఆరోపణల తీవ్రతతో ఈసారి టీఎంసీ దుర్బల మైనదిగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధేయులు పాల్పడినట్లుగా చెబుతున్న అవినీతి వాటిలో ప్రధానమైనది. అలాగే, కోల్‌కతాలో ఒక యువ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వీధులకెక్కాయి. పాలక పార్టీకి చెందిన గూండాలు, దళారీలకు తృణమో పణమో చెల్లిస్తేనే పనులు అవుతాయనీ, రక్షణ లభిస్తుందనీ ప్రజలు చెబుతున్న దృష్టాంతాలున్నాయి. దాంతో, తాము వామపక్ష కూటమి పాలన నాటి రోజుల్లోకే తిరిగి వెళ్ళినట్లుందని వారు అంటున్నారు. అయితే, అక్రమ వలసదారుల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఒక రకంగా తానే చిక్కుల్లో పడింది. పశ్చిమ బెంగాల్లో ముస్లిం వలస దారుల కన్నా హిందూ వలసదారుల సంఖ్యే ఎక్కువగా ఉందని డేటా సూచిస్తోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితాల సునిశిత సవరణ (సర్) బీజేపీ ఓటు బ్యాంకు లోపల కూడా ఆందో ళనను రేకెత్తించింది. బెంగాలీ భాషను ఢిల్లీ పోలీసులు ‘బంగ్లాదేశీ భాష’గా పేర్కొంటూ మరింత అపకీర్తిని తెచ్చిపెట్టారు. హిందూ పూజారులకు నెలసరి జీతాలు చెల్లించడం, దుర్గా ఉత్సవాలను నిర్వహించడం వంటి చర్యల ద్వారా తనను ‘హిందు వుల ఆప్తురాలు’గా చిత్రించుకునేందుకు మమత గట్టిగానే కృషి చేస్తున్నారు. కానీ, హిందూత్వపై బీజేపీతో పోటీ పడటం ప్రతి పక్షా లకు ఇప్పటికీ కష్టమవుతోందని ఇతర రాష్ట్రాల్లోని అనుభవాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు బలమైన ప్రాంతీయ గుర్తింపుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిని ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చడానికి లేదు. అక్కడి ఓటర్లు హిందూత్వతో సునాయాసంగా మమేకమవుతారు. హిందూత్వ థీమ్‌లోకి భాష, సంస్కృతులను కూడా బీజేపీ ఈసారి అంతర్లీనం చేయ గలుగుతుందా? అన్నదే ప్రశ్న. వ్యాసకర్త: రాధికా రామశేషన్సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దేవుడా... అలసిపోయావా?
అంతర్యామి అలసితి సొలసితి...అంటూ అన్నమయ్య నీరసంగా ఆపసోపలు పడుతూ పాడారే కానీ...ఇపుడు ఆ దేముడికే అలసట వచ్చిపడుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి క్షణం తీరిక దొరకట్లేదు. వేళాపాళ లేకుండా భక్తాదులు వచ్చి వాకిట నిలబడుతుండటంతో వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన పెనుబాధ్యత స్వామి వారి భుజస్కందాలపై ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అయినా భక్తులు దర్శనమీయాల్సిందే....మా మొర ఆలకించాల్సిందే అంటూ మొండికేస్తున్నారు. పైగా వడ్డీకాసుల వాడి చెంత ఉత్త చేతులతో ఎలాగూ పోలేరు...పాలకమ్మన్యులు పోనివ్వరు కూడా. పోనీ రాత్రి బాగా పొద్దుపోయాక కాసింత నడుం వాలుద్దామన్నా...కళ్ళు మూసి తెరిచేలోగా సుప్రభాత సేవలు షురూ అయిపోతున్నాయి. అంతలోనే అర్చకులు, భక్తులు కమలాకుచ చూచుక కుంకుమ...అంటూ శ్లోకాలు అందుకుం టున్నారు. స్వామివారు బిక్కమొగం వేసుకుని తన ఇరు దేవేరులను చూస్తూ భక్తులకు విసుగు కనిపించనీయకుండా ప్రసన్నచిత్తులై దర్శనమీవాలి. ఒక్కసారి గమనించండి దేముడికి ఎంత కష్టం వచ్చిందో.అందుకే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఏంటసలు మీ తీరు...భక్తి సరే...భగవంతుడి మాటేంటి? స్వామి వారిని కనీసం నిద్రకూడా పోనివ్వరా? అనేక దంతం భక్తానాం అంటారా సరే..మరి కోట్లాది మంది భక్తులు నిరంతరం స్వామి చెంత నిలుచునుంటే...దేముడికి కాసింత పర్సనల్ స్పేస్ అక్కర్లేదా? కాసులకు కక్కుర్తిపడి గర్భగుడి తలుపులు వేళలు పాటించకుండా తెరిచేస్తారా? ఇది మీరు దేముడికి చేస్తున్న అపచారం కాదా? అంటూ బృందావన్ లోని బంకీ బిహారీ ఆలయ వ్యవహారంపై మండిపడింది. శక్తి కొద్ది భక్తి అన్నారు కానీ కరెన్సీ కొద్ది భక్తి అనలేదు కదా...మరి డబ్బున్న భక్తుల కోసం ఆ దేముడ్ని ఎందుకండీ ఇబ్బంది పెడతారు అంటూ సుప్రీం సీరియస్ అయ్యింది.బంకీ బిహారీ జీ ఆలయంలో పాలకుల తీరుతెన్ను చూసి మండిపోయిన ఓ భక్తాగ్రేసరుడు సుప్రీం చెంతకు చేరాడు. నాస్వామిని వీళ్ళందరూ రాచి రంపాన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దర్శన వేళలతోపాటు ఆలయ సంప్రదాయాల్లో తెచ్చిన మార్పుల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో ...సుప్రీం స్పందించక తప్పలేదు. ఆలయవేళల్లో మార్పు చేయడంతోపాటు దెహ్రి వంటి పలు ముఖ్యమైన ఆచారాలను బంద్ చేశారని పిటిషనర్ వాపోయారు. పోనీలే కనీసం ఓ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడని బంకీ బిహారీజీ అమందానంద కందళిత హృదయారవిందులై ఉప్పొంగి పోయుంటారుఈ సమస్య ఒక బంకీ బిహారీజీ...వేంకటేశ్వస్వామీ...సింహాద్రి అప్నన్న సామిలదే కాదు. అసలే మనకు ముప్పది మూడు కోట్ల దేముళ్ళు. కానీ కొందరికే భక్త పరంపర హెచ్చుగా ఉంటుంది. దాన్ని మనం తర్కించలేం. భక్తుని కష్టాలు భగవంతుడికే తెలుసంటారు...మరి భగవంతుడి కష్టాలు భక్తులకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతసేపూ సేవలకు సొమ్ముకట్టామా....కాయకొట్టామా....ముడుపులు వేశామా...కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ స్వామి ముందుంచామా....ఇదే తప్ప...అరె స్వామివారికి మనవల్ల ఎంత మనస్తాపం కలుగుతుంది...అసలు వారికి విశ్రాంతి దొరుకుతోందా అని ఎప్పుడైనా అనుకున్నామా? ఇదేం చోద్యం దేముడికి రెస్ట్ కూడా ఉంటుందా అని కొందరు ఎగతాళి చేస్తుంటారు...మరి ఆ స్లీపింగ్ స్లాటే లేకుంటే...ఉయ్యాల సేవలు...నిద్రపుచ్చే పాటలు ఎలా వచ్చాయండి? అని మరికొందరు లా పాయింటు లేవదీసి మరీ వాదిస్తుంటారు.ఇక తిరుమల వేంకటేశ్వరుడు...వారి భక్తిసామ్రాజ్యం ఎంత సువిస్తారమో....అక్కడ రాజకీయాలు అంతకన్నా విస్తారం. గత వైకుంఠఏకాదశి పుణ్యదినం కోసం ఎందరు భక్తులు టికెట్ల రద్దీలో చితికి ప్రాణాలు వదిలేశారో మనకు తెలుసు కదా. అదే సమయంలో గరికపాటివారి వ్యంగ్య ప్రసంగం తెగ వైరల్ కాలేదూ. అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది...ముక్తి ప్రాప్తమవుతుందని అశేష ఆస్తికమహాశయుల ప్రగాఢ నమ్మిక. అయితే శక్తి లేనివారిలో భక్తులుండరా? నీ కొండకు నీవే రప్పించుకో...ఆపదమొక్కలు మాతో ఇప్పించుకో అని ఘంటసాల ఎంత ఆర్డ్రంగా పాడారు. భక్తుడు రావాలా...లేదా తనే ఆతని వద్దకు వెళ్లాలా అని డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. కానీ మన సర్కారు మహత్తరంగా...ప్రచారాలు చేసి మీకు మోక్షం దక్కాలన్నా...పున్నెం రావాలన్నా తెల్లారు జాము ఉత్తర దర్శనం తప్పని సరి అది ఈరోజే అంటూ ఊదరగొట్టినందుకే కదా తొక్కిసలాట...మరణాలు సంభవించింది. దీని పై సర్కారు స్పందన ఉండదు....కానీ లడ్డూలో కల్తీ అంటూ రాజకీయం చేయడానికి సిద్ధం. సాక్షాత్తు సుప్రీం కోర్టే సర్కారును నిలదీసి...తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రచారాలు ఎలా చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తన మహాప్రసాదం...భక్తులు భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించే లడ్డూపైన వివాదలు పుట్టించడం గమనించిన ఆ దేవదేవుడి మనసు ఎంత వ్యాకులత చెంది ఉంటుందో కదా. అయినా ఆలయాల్లో రాజకీయాలేంటి అని స్వామివారు చిరాకుపడ్డా ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తిరుమల ఆ దశను దాటిపోయింది. అక్కడ ప్రతీది రాజకీయమే. దర్శనంతో మొదలు లడ్డూ దాకా...భక్తుని మొదలు పాలక మండలి దాకా అంతా రాజకీయమే. ఇంత జరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదంటే అది స్వామివారి వైభవం...వైభోగం అంతే. ఒక తిరుపతే కాదు దేశంలో ఏ ఆలయమైనా భక్తులతో కిటకిటలాడుతునే ఉంటుంది. ఈ దేశంలో మనుషులతో కిక్కిరిసి కనిపించేవి రెండే రెండు...ఇకటి ఆలయం...రెండోది ఆసుపత్రి.ఏది ఏమైనా సుప్రీం జోక్యంతో అయినా బంకీ బిహారీ జీ ...తిరుపతి వెంకన్నలకు కాసింత ఊరట లభిస్తే అదే పదివేలు.:::ఆర్ఎం -
‘‘బాబుగోరు.. మీరు గుడ్డో గుడ్డూ’’
ఏది ఏమైనా బాబుగోరు మీరన్నా...మీ పాలన అన్నా చెవి కోసుకుంటా. అసలు మీలా పాలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? నాకైతే డౌటనుమానమే. గత ఎన్నికల్లో మీరు గొప్ప మనసు చేస్కొని మమ్మల్ని మీతో కలవనివ్వబట్టే కదా ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టా ...సెంటర్ లో మన సర్కారు నిలబెట్టా. మేం కూటమి అంటున్నామే కానీ అదంతా మీ చలవ కాకపోతే మరేందనుకుంటున్నారు. మీరు మాతో జట్టుకట్టబట్టే కదా ఈ పుణ్యం పురుషార్థం మాకు దక్కింది. అయినా బాబుగోరు మీ గొప్పతనం మీకు తెల్వదు... ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికక్కెడికో తీసుకెళ్లి పోతున్నారంటే నిజం నన్ను నమ్మండి..అసలు మీకున్న విజను...మీకున్న లిజను ఎవరికుంది చెప్పండి? కానీ విజన్ లేని వారికి ఏం తెలిసొస్తుంది చెప్పండి. ఒక్కోసారి వీరంతా ఎందుకొచ్చారా రాజకీయాల్లోకి అనిపించేస్తుందంటే నమ్మండి సుమండీ. అయినా కోటిజన్మల పుణ్యఫలం వల్లే కదా మీ స్నేహం మాకు దక్కింది. మీరాదరి మేమీ దరిని ఉన్నా....చెగువీరాను పూనిన ఆ అద్భుత వ్యక్తే కదా మనల్ని కలిపింది..లేదంటే మేమెంత ఒంటరి పక్షులమైపోయేవాళ్ళమో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుందంటే నమ్మండి సుమండి..అయినా ఎవరెవరో ఏదో అంటుంటారు...మనం అదంతా పట్టించుకోరాదు బాబుగోరు. అలా పట్టించుకుంటే రాజకీయాల్లో ఉండగలమా? అయినా నా చాదస్తం గానీ మీకు ఇవన్నీ కొట్టినపిండేగా. నిజమే అప్పుడెప్పుడో పాత ఎన్నికలప్పుడు మమ్మల్ని మీరు మనసారా దూషించారు. కానీ మీ తిట్లే మాకు దీవెనలని అనుకోలేదూ..అయినా బాబుగోరు మమ్మల్ని మీరు అప్పుడెంత దూషించారో...ఆ క్షణాన కాస్త కోపం వచ్చినా...మళ్ళీ మాతో కలవాలని మీరు పదే పదే కలవరించారు చూడండీ...అదీ మీ గొప్పతనం. మన మధ్య స్నేహబంధం నాగార్జునా సిమెంట్ కన్నా దృఢమైంది. కాకుంటే ఇన్నిసార్లు మీరు ఇన్నేసి మాటలన్నా...మళ్ళీ లటుక్కున వచ్చి మమ్మల్ని అతుక్కుపోయారు చూడండి...అబ్బబ్బా ఏమన్నా పొలిటికల్ విజనా మీది. .ఇక మీ సైనికుని గురించి ఏం చెప్పమంటారు...ఎంతని చెప్పమంటారు? ఇపుడు వారు మాకూ ఆంతరంగికులై పోయారు. అసలు వారిని మీరు బలే తయారు చేశారు బాబుగోరు. ఏ ఇజాలు తెలీకపోయినా...నిజాలు రాకపోయినా పర్వాలేదు పైకి మాత్రం గంభీరంగా ఎస్వీరంగారావులాగా తలూపుకొంటూ తిరుగుతుండాలి. ఆయన అచ్చం అలానే చేస్తున్నారాయే. మమ్మల్ని కలవక ముందు చెగువీరా అన్నారా...ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో... అని పాటలు కూడా పాడేశారా...ఇపుడు చూడండి నుదుటిపై ఇంతేసి బొట్టు పెట్టుకుని , కాషాయం చుట్టుకుని...నా ధర్మం...నేచూస్తా...నే కాస్తా అంటూ ఎర్రజెండా పట్టుకున్నోరిలా రంకెలు వేస్తున్నారు. అసలు మీ ట్రైనింగ్ ఇక్కడే కనిపిస్తోంది. నేను మారాను అని చెప్పకుండానే చేసి చూపిస్తున్నారు. జనాలు ఎలాగూ నమ్మరనుకోండి ...అది మా సిలబస్ కాదు కదా. చూశారా ఇదీ కదా సేవ..సారీ స్నేహధర్మమంటే..గత ఎన్నికల్లో మీతో కలిసి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నానని బలే ప్రచారంలో పెట్టారు బాబుగోరు. అయినా అన్నామో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక...దాందేముంది లేండి...ఆ ప్రచారం వల్ల మీరు కుషీ అయితే అదే పదివేలు. గిట్టని వారు అది అబద్దమంటారని పీల్ కాకండి బాబుగోరు. మనం మనం బాగుంటే చాలు కదా...ఏదో మీ తృప్తి కోసం అలా అన్నారే అనుకోండి...మరీ అంత ప్రచారంలో పెడితే ఎలా? వదిలేయండి బాబుగోరు...మీ విజన్ కు అది ఆనదు గాక ఆనదు. అదేదో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మెడికల్ కళాశాలలు ప్రైవేటు వద్దంటూ కోటి సంతకాలు చేయిస్తున్నారటగా... నిరసనలు కూడా చేస్తున్నారటగా...జనాలూ వస్తున్నారటగా...ఆ మీరు బెదరుతారా ఏంది? అయినా ప్రైవేటైజేషన్ అంటే మీకు ఎంత ప్రేమో మాకు తెలీదా ఏంటి? మేం కూడా విశాఖ ఉక్కును ఎవరికైనా అప్పగిద్దామనే కదా అనుకుంటున్నది....కానీ గట్టిగా అనరాదు వేరెవరూ వినరాదు...మన సర్కారుకు ఇంకా బోల్డంత టైముంది ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది...ఇదే కదా బాబుగోరు మీ మనసులో మాట....అరే మా మనసులోనూ ఇదే. కానీయండి అలా ముందుకెళదాం..సివారఖరికి మేము చెప్పొచ్చేదేంటంటే.. ప్రతిపక్షాలు కదా కాస్త ఘాటుగానే వ్యవహరిస్తుంటాయి. కానీ మనం కూడా తక్కువేం కాదుగా అంతకంతకు నాటుగానే ఉంటున్నాం. మీరు మాత్రం తగ్గేదేలా అన్నట్లుండండి. విజన్ అంటూ ఊదరగొట్టండి. అసలు జనాలు మీరు ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేక బిక్కమొగం వేసుకోవాలి. వారు తేరుకునేలోగా మన పుణ్యకాలం ఎలాగూ పూర్తయిపోతుంది. మరి ఆతర్వాతో అంటారా...సినబాబు చూసుకుంటారు లెండి. మన ప్యూచరేంటి అంటారా? నందో రాజో భవిష్యతి అనుకుని గ్లాసు నీళ్లు గటగటా తాగేయడమే. సరే మరి నేనుంటా మీరలాగే ముందుకు వెళ్ళిపోతూనే ఉండండేం.. పొరపాటున కూడా ఆగకండి.::ఆర్ఎం -
సంప్రదాయ ఫార్మసీలు నిలబడాలి!
ఈ–ఫార్మసీ తుపాను ఇప్పుడు సంప్రదాయ ఫార్మసీ రంగానికి ఒక ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నది. కరోనా సంక్షోభం తర్వాత వాయువేగంతో విస్తరిస్తున్న ఈ–ఫార్మసీలు, కార్పొరేట్ల భారీ పెట్టుబడులతో సంప్రదాయ ఫార్మసీల మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఔషధ మార్కెట్‌పై గుత్తాధిపత్యం కోసం అనేక కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఈ–ఫార్మసీ రంగంలోకి దిగుతున్నాయి. 2021 జూన్‌లో టాటా గ్రూప్‌కు చెందిన ‘టాటా డిజిటల్’ సుమారు రూ. 1,500 కోట్లతో ‘1ఎమ్జీ’ అనే ఈ–ఫార్మసీ స్టార్టప్‌లో 65% వాటాను కొనుగోలు చేసి, ఈ ప్రక్రియకు పునాదులు వేసింది. 2024లో సుమారు రూ. 28 వేల కోట్లుగా ఉన్న భారతదేశ ఆన్ లైన్ ఫార్మసీ మార్కెట్ విలువ 2025–2033 కాలానికి 16.65% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ను నమోదు చేస్తుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సంప్రదాయ ఫార్మసీల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలున్నాయి. ఆన్ లైన్ ఔషధాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తమిళనాడు డ్రగ్గిస్ట్స్ అండ్ కెమిస్ట్స్ అసోసియేషన్ 2018లో దాఖలు చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు తొలుత అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, తరువాత ఆన్లైన్ విక్రయాలకు లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ‘ఈ–ఫార్మసీ డ్రాఫ్ట్ రూల్స్–2018’ని రూపొందించింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో నమోదైన కేసులోనూ ఇదే డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం కార్యకలాపాలను నిర్వహిస్తామని ఈ–ఫార్మసీలు హామీ ఇవ్వడంతో నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు వివిధ హైకోర్టుల్లో ఇచ్చిన తీర్పులను సమర్థిస్తూ ఆన్లైన్ విక్రయాలకు అనుమతించింది. రాబోయే ఈ–ఫార్మసీల నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి చాలా ఈ–ఫార్మసీ సంస్థలు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన షెడ్యూల్–ఎక్స్ (నార్కోటిక్, సైకోట్రోపిక్, ట్రాంక్విలైజర్లు, ఔషధాలు) మాత్రం అమ్మడం లేదు. షెడ్యూల్–హెచ్ మందులను కేవలం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతున్నాయి. ముసాయిదాలో చెప్పినట్టు ఎలక్ట్రానిక్ కాపీని నిల్వ చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రేపు రాబోయే చట్టం ఈ–ఫార్మసీలకు మరింత సాధికారతను ప్రసాదించబోతుందన్నది సుస్పష్టం. ప్రజలు కూడా ఆన్లైన్ మందుల కొనుగోలుకు మద్దతునిస్తున్నారన్న విషయం అనేక పరిశోధన పత్రాలు రూఢి చేస్తున్నాయి.కరోనా మహమ్మారి తదనంతర కాలంలో ప్రజలకు విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగంలోకి రావడం, 30 నిమిషాల్లో హోం డెలివరీ వంటి సేవలు, ఈ–ఫార్మసీలోకి పెద్ద కార్పొరేట్లు ప్రవేశించడం, సంప్రదాయ ఫార్మసీల కన్నా ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం వంటి అంశాలు అటు మిలీనియల్స్నూ, ఇటు జెనరేషన్ జెడ్నూ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సంప్రదాయ ఫార్మసీలు ఆన్లైన్ బాట పట్టకపోతే వాటి మనుగడకు తీవ్రమైన ముప్పు తప్పదని అనేక నివేదికలు చెబుతున్నాయి. రిటైల్ ఫార్మసీలు–కస్టమర్లకు అనుసంధానంగా నడుస్తున్న ఈ–ఫార్మా మార్కెట్ ప్లేస్ కంపెనీలకు ప్రభుత్వాలు మద్దతుగా నిలిస్తే మళ్లీ రిటైల్ ఫార్మసీ రంగం భద్రంగా ఉంటుంది. లేదంటే దేశంలో ఉన్న దాదాపు 10 లక్షల ఫార్మసీలలో పనిచేస్తున్న కోటిమందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది.– శ్రీపాద రమణ ‘ ఔషధ రంగ నిపుణులు -
క్రైస్తవానికి పునాది లౌకికవాదం!
సమాజం లార్వా నుండి ప్యూపా రూపంలోకి, అటునుండి సీతాకోక చిలుకలా మారే ఒక నిరంతర ప్రక్రియలో ఉంటుంది. సమాజ గతి చలనం ఎన్ని సంస్కృతులు, ఎన్ని జాతులు, మతాలు, ఖండాలు ఏర్పడినా... అది ఒక సమూహంగా మనడానికి గతి మార్గాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇందులో కొన్ని ప్రయోగాలు ఉంటాయి. కొన్ని అనుభవ రీత్యా నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. కొన్ని శాస్త్రీయ పరిణామాలు ఉంటాయి. వీటన్నిటికీ కావాల్సిన ఫౌండేషన్ – ఒక బేసిక్ సోషల్ ఫ్యాబ్రిక్. అది సమాజం మొత్తానికీ ఉమ్మడిగా సమ్మతమైన మోరల్ కోడ్, సోషల్ కోడ్! ఇది వ్యక్తిగత అభిరుచులు, నమ్మకాలు, హక్కులకు అతీతంగా సామూహిక ప్రయోజనాల మీద నిలబడి ఉండాలి. లేనప్పుడు– వ్యక్తిగత హక్కులు, సామూహిక నిబంధనలకు లోనై– ఒక ఘర్షణ పూరితమైన, ఒక తిరోగమన సమాజానికి దారి తీస్తుంది. ఈ కోడ్ – సమానత్వం, సౌభ్రాతృత్వంతో సమ్మిళితమైన స్వేచ్ఛ కలిగి ఉండాలి. స్వేచ్ఛ పరిమాణం ఎంత అన్నది మరో ప్రశ్న. తిరిగి అది ‘ర్యాడికల్ ఇండివిడ్యువలిజం’ను ప్రేరేపిస్తే అది మరో తిరోగమన రూపాన్ని తీసుకుంటుంది. ఈ బ్యాలన్స్ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇప్పటికీ ఎవాల్వ్ అవుతూ ఉంది. అయితే – ఎంతో విపరీతమైన ఘర్షణ రూపంలో కొన్ని తిరోగమన సమాజాలలో ఎంతో రక్తపాతం తర్వాత వస్తుంది. అందుకే వీటన్నిటికీ కావాల్సిన సత్తా ఉండే సోషల్, మోరల్ ఫ్యాబ్రిక్– ఒక మతమే! మతం అంటే ‘కల్ట్’లా ఉండటం కాదు. రోజుకు ఎన్ని సార్లు పూజించాలి, ఏం బట్టలు కట్టాలి, మీసాలు ఎలా పెంచాలి... ఇలాంటి ‘రూల్స్’ మతాన్ని పోషించడం మొదలు పెడితే అది ‘కల్ట్’ అవుతుంది. ఆ ‘కల్ట్’ ఒక మూస పోసిన విధానంలో మను షులను సామాజిక సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు అతీతంగా తయారు చేస్తుంది. అటు నుండి ఒక పిడివాదం మొదలవుతుంది. అది ఒక ఫండమెంట లిజానికి దారి తీస్తుంది. దైవ విశ్వాసాలకు, సోషల్ లాజిక్కు సరిగ్గా కుట్లు వేసి అందంగా తీర్చగలిగేదే ఆదరించదగ్గ మతం అవుతుంది. దేవుడు ఒక సామాజిక అవసరం.ఒక మతానికి కావాల్సిన లిట్మస్ టెస్ట్ అంబేడ్కర్ చెప్తాడు: ‘మతం అన్నది ముఖ్యంగా నియమ సూత్రాలకు సంబంధించినది అయి ఉండాలి. ఎప్పుడైతే అది నిబంధనల చుట్టూ తిరుగుతుందో మతానికి ఉండాల్సిన సారమైన (సామాజిక) బాధ్యతను చంపేస్తుంది’ (‘కుల నిర్మూలన’ నుండి). మత ప్రాతిపదిక మీదనే–అంబే డ్కర్ ప్రగతి వాద కోణంలో మాట్లాడితే– దేవుడు ఈ ‘లిట్మస్ టెస్ట్’కు నిలబడలేని మనిషి/ ఆత్మ/ శక్తి అయితే ఆ దేవుడు నీతిమంతుడు కాలేడు. సమాజంలో ఒకరి అభిప్రాయాలకు, నమ్మకాలలో ఎన్ని తేడా, తారతమ్యాలు ఉన్నా... కలిసి ఒక సామూహిక ప్రయోజనాన్ని పండించడం కోసం ప్రజలు నడవడం ఈ రోజు సమాజానికి కావాల్సిన అత్యవసరమైన అంశం. యేసు క్రీస్తు యోహాను సువార్త గ్రంథంలో ఇలా అంటాడు: ‘నేను మీకు ఒక కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను – మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు కూడ ఒకరిని మరొకరు ప్రేమించవలెను.’ అదే రకంగా మార్కు సువార్త గ్రంథంలో ‘నీవు నీ పొరుగువానిని నీలాగునే ప్రేమింపవలెను’ అంటాడు. ఇది సింపుల్‌గా కనిపించవచ్చు. కానీ చాలా డెప్త్ ఉన్న స్టేట్మెంట్. ఇక్కడ పొరుగు క్రైస్తవుడిని ప్రేమించ మని యేసు క్రీస్తు చెప్పలేదు. లేదా నాస్తికుడిని ప్రేమించవద్దు అని చెప్పలేదు. హంతకుడు, దొంగ ఎవరైనా సరే వాళ్ళను ప్రేమించవద్దు అని చెప్పలేదు. పది మంది కుష్టువాళ్ళను బాగు చేస్తే అందులో ఒక కుష్టువాడు మాత్రమే జీసస్‌ను ఫాలో అవుతాడు. ఆయన ‘ముందుగా నన్ను ఫాలో అయితేనే నిను బాగుపరుస్తా’ అనే కండి షన్ పెట్టి బాగుపరచలేదు. జీసస్ విధానం పూర్తిగా పక్షపాత రహితం, రాజకీయ స్వార్థాల నుండి దూరం, అందరినీ చేరదీసే స్వభావం, విశ్వమానవతా దృష్టి కలిగినది. ఆ అర్థంలో ఆయన ఆచరణలో ‘లౌకికత’ ఉంటుంది. ముగింపుగా – క్రిస్టియానిటీ ఎదగడానికి ప్రభుత్వ చట్టాలు అవసరం లేదు. క్రిస్టియానిటీ యుద్ధాలు చేసి ఎదగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే– క్రిస్టియానిటీకి మూలం సెక్యులరిజం!– పి. విక్టర్ విజయ్ కుమార్ ‘ రచయిత, విమర్శకుడు(క్రిస్మస్ ఆగమన కాలం సందర్భంగా) -
ఓపెన్ చెరసాల కాదు... అది ఉత్తమ కళాశాల!
నేను 1983లో నాగార్జున సాగర్‌లోని ఏపీ గురుకుల జూనియర్ కళాశాలలో సీటు దొరికిందని తెలిసి ఎంతో సంతోషించాను. రాష్ట్రంలో అప్పటికి అదొక్కటే ఆ తరహా కళాశాల. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎప్పుడూ నెంబర్ వన్. అందువల్ల ఒక వైపు ఆనందం. ఇంకోవైపు కించిత్ గర్వం. అలా ఆ మూల ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లె సాలూరు నుండి పల్నాడు చివర నాగార్జునసాగర్‌కి పయనం సాగింది. అంతవరకూ తాడికొండ గురుకుల పాఠశాలలో గడిపిన మూడేళ్ల రోజుల్ని ‘సెంట్రల్ జైలు’గా భావించిన నేను, ‘ఇంతకు మించి ఏముంటుంది లే, బహుశా ఓపెన్ జైలులా ఉండొచ్చ’ని అనుకుంటూ కాలేజీలో అడుగుపెట్టాను.అయితే వారంలోనే అది ఓపెన్ చెరసాల కాదు, ఉత్తమ భవి ష్యత్ తయారీశాల అని అర్థమై గొప్ప ఊరట కలిగింది. ఆదివారంతో బాటు, పండగ సెలవొస్తే చాలు... విజయపురి సౌత్‌లో రామ కృష్ణ థియేటర్, అందులోంచి ఆట మొదలవ్వడానికి ముందు విని పించే ‘నమో వేంకటేశా ’పాట తెచ్చిన ఉత్సాహం, భాను వీడియో అంటూ బస్టాండ్ దగ్గర ఉన్న వీడియో థియేటర్, డ్యామ్‌కి అటు చివర మూడు కిలోమీటర్ల దూరంలోని హిల్ కాలనీ వరకూ క్రమం తప్పని పాదయాత్ర... అన్నీ నిన్నమొన్నటి విషయాల్లాగానే ఉన్నాయి. ఇక, మా సీనియర్లు ఎవ్వరూ ర్యాగింగ్ చెయ్యలేదు... కాకపోతే అందరినీ ‘సర్’ అని పిలవాలి. మా బోటనీ సర్ ఎప్పుడూ ‘ఇలాగే చదువు, నువ్వు డాక్టర్ అయిపోయినట్టే’ అంటూ ప్రోత్సహించే వారు. అభిమానం కనబడేది. రెండుసార్లూ టీచర్స్ డేకి నేను బోటనీ క్లాస్ తీసుకున్నాను (పిల్లలతో ఆ రోజు చెప్పించేవారు). క్లాస్ లాస్ట్‌లో ఆయన్ని అనుకరిస్తూ గొంతు మార్చి కామెడీ చేస్తే ఒక్కడు కూడా నవ్వలేదు. ఏమిటా అని చూస్తే ఆయన ఎప్పుడు వచ్చి కూర్చున్నారో తెలియదు కానీ లాస్ట్ బెంచ్ నుండి లేచి వచ్చారు. బిక్కచచ్చిన నన్ను ‘వెరీ గుడ్’ అంటూ కదిలిపోయారు. ఇంకోసారి ఇంగ్లీష్ సర్ దివాకర్ గారు బోర్డు వైపు తిరిగి క్లాస్ చెప్తుంటే ఏదో చిన్నతనపు అల్లరి చేశాం. ఆయన చూడలేదనుకున్నాం. కానీ ముద్దా యిలందరినీ లేపారు. నన్నులేపి ‘చేసిందంతా చేసి, ఎంత అమాయ కపు మొహం పెట్టావు రా నాయనా’ అని నవ్వేశారు. చాలా చిక్కని స్నేహాలు. అరమరికలు లేనివి. ఇంట్లోంచి తెచ్చు కున్న ఊరగాయలు, జంతికలు ఉమ్మడి ఆస్తి. కలిసి పోటీగా చదువు కోవడం, ఒకరి డౌట్లు ఒకరు తీర్చుకోవడం మాత్రమే కాదు... ఆట లైనా, పాటలైనా, షికార్లయినా, జట్లుగానే! రష్యా, ఉక్రెయిన్ స్థాయిలో గొడవపడినా రెండో రోజుకి సంధి కుదిరిపోవాల్సిందే. ఒక సారి సెలవులు ఇచ్చిన టైమ్‌కి వరదలు. ట్రైన్లు లేక బస్సుల్లో బయ లుదేరాం. అవి కూడా డైరెక్ట్‌గా లేవు. ఉత్తరాంధ్ర వాళ్ళం నలుగురం కలిసి రాజమండ్రి చేరుకున్నాం. ఎవరి దగ్గరా డబ్బులు మిగల్లేదు. అయినా భయం లేదు. అందులో రవిది వైజాగ్. ధైర్యం చెప్పాడు. ‘నా చేతికి వాచీ ఉందిరా, ఏం ఫరవాలేదు’ అని. బస్టాండ్‌లో ఒకా యన్ని పరిచయం చేసుకుని, పరిస్థితి చెప్పి మా నలుగురికీ టికెట్స్ తీయమని చెప్పాడు. తన వాచీ ఉంచుకుంటే, తర్వాత రోజు కలిసి డబ్బులిచ్చి రిటర్న్ తీసుకుంటానన్నాడు. ఆయన ‘అదేమీ వద్దులే ’ అని చెప్పి మాకు టికెట్స్ తీసి ఇచ్చాడు. మేం వైజాగ్‌లో రవి ఇంటికి చేరిపోయి, వారి ఆతిథ్యం పొంది, మరుసటిరోజు మా ఇళ్లకు చేరాం.ఇలా చెప్తూ పోతే బోలెడు. నా పేరు అచ్చులో చూసుకోవడం మొదటిసారి అక్కడే. ‘ఆశాజీవులు’ అని కవిత రాస్తే ఆ సంవత్సరం మేగజైన్లో అచ్చయింది. చదువుతో బాటు అందమైన అనుభవాలు, స్నేహాలు, జీవిత పాఠాలు మిగిల్చిన మా ‘ఏపీ గురుకుల జూనియర్ కళాశాల’ మా అందరికీ ఉన్నతి కలుగ జేసిన మేధా తయారీ శాల.– డా‘‘ డి.వి.జి. శంకరరావు ‘ పార్వతీపురం మాజీ ఎంపీ(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాల ఆరంభమై రేపటికి 50 ఏళ్ళు) -
‘ఆత్మనిర్భరత’కు రష్యాయే ఆలంబన
భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు – విక్రేతకు మధ్య ఉండే వాటి కన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్‌వేర్ సమీకరించు కున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞా నాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.ఉక్రెయిన్‌పై యుద్ధం 2022లో మొద లెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల న్యూఢిల్లీకి రెండు రోజుల పర్యటనపై వచ్చి వెళ్ళడం ఇదే మొదటి సారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆతిథేయిగా వ్యవహరించిన ఈ శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య చెక్కు చెదరకుండా నిలిచిన వ్యూహాత్మక భాగ స్వామ్యం ప్రాధాన్యాన్ని తెలియజేసింది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో శ్రీకారం చుట్టుకున్న సహకారాన్ని ఉభయ దేశాలు కొన్ని దశాబ్దాలుగా పెంపొందించుకుంటూ వస్తున్నాయి.ఉక్రెయిన్‌పై యుద్ధానికిగాను రష్యా అధ్యక్షుడిని ఏకాకిని చేయా లని అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు కోరు కోవడంతో ఈ సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన ఆసక్తి వ్యక్తమైంది. ఉక్రెయిన్‌పై యుద్ధ నేరాలకు సంబంధించి అంత ర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌కు అరెస్టు వారంట్లు జారీ చేసింది. అయినా ఘనంగా, సంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పల కాలన్న భారత్ నిర్ణయంలో స్వీయ వ్యూహాత్మక ప్రాధాన్యముంది.రష్యా నుంచి చమురు దిగుమతులను, రక్షణ సామగ్రి కొను గోళ్ళను తగ్గించుకోవాలని అమెరికా నుంచి మనపై ఒత్తిడి పెరుగు తున్న నేపథ్యంలో ఈ పర్యటన చోటుచేసుకుంది. తమ సంబంధాలు ‘బాహ్య ఒత్తిడులకు లోబడేవి కావు’ అని రెండు పక్షాలూ పునరు ద్ఘాటించాయి. ఉభయ సేనల మధ్య సాంకేతిక సహకారం ఒక ముఖ్య అంశంగా కొనసాగుతోందని సంయుక్త ప్రకటనలో నామ మాత్రంగా ప్రస్తావించి వదిలేశారు. రష్యా నుంచి వచ్చిన ఆయు ధాలు, ఇతర రక్షణ సామగ్రి నిర్వహణకు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య క్రమం కింద టెక్నాలజీ బదలీ ద్వారా భారతదేశంలోనే స్పేర్ పార్టులు, పరికరాలు, చిన్నాచితక వస్తువులు, ఇతర ఉత్పత్తులను సంయుక్తంగా తయారు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. భారత సాయుధ దళాల అవసరాలు తీర్చేందుకు సంయుక్త సంస్థలను నెలకొల్పాలని నిర్ణయించారు.భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు–విక్రేతకు మధ్య ఉండే వాటికన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్ వేర్ (మొదటి మిగ్ పోరాట విమానం, పెత్య/కమోర్త తరగతి నౌకలు, ట్యాంకులను) సమీకరించుకున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞానాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.ఆ విధంగా సోవియట్/రష్యా మూలాలున్న పరికరాలలో చాలా భాగం భారతదేశంలో ‘తయారైనట్లు’ పైకి కనిపించినప్పటికీ, అది చాలా వరకు దిగుమతి చేసుకున్న కిట్లు/కాంపొనెంట్ల కూర్పు నకు మాత్రమే పరిమితమైంది. ఆయుధాల ఫ్యాక్టరీలలో, లేదా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్.ఎ.ఎల్)లో సాగింది ప్రాథమికంగా విడి భాగాల అసెంబ్లింగ్ కలాపం మాత్రమే. రివర్స్–ఇంజనీరింగ్ లేదా దేశీయ డిజైన్ చేపట్టేందుకు జరిగిన కృషి అతి స్వల్పం లేదా అసలు ఏమీ లేదనే చెప్పాలి.చైనాతో పోల్చుకుంటే, డిజైన్ డొమైన్‌లోకి దిగడంలో అశక్తత /విముఖత కనిపిస్తుంది. సోవియట్ హయాం నాటి సైనిక సామగ్రిని చైనా ఎంతో విజయవంతంగా రివర్స్–ఇంజనీరింగ్ చేసి విజయం సాధించింది. సుఖోయ్ ఎస్ యు–27 ఫ్లాంకర్ ను ఆధారం చేసుకుని అది షెన్యాంగ్ జె–11యుద్ధ జెట్ విమానాన్ని అభివృద్ధి చేసింది. లైసెన్సు పొందిన ఉత్పత్తి ఒప్పందం కింద పీపుల్స్ లిబ రేషన్ ఆర్మీ 1990లలో రష్యా నుంచి సు–27 ఎస్కే యుద్ధ విమా నాలను సమీకరించింది. తర్వాత, రష్యా సరఫరా చేసిన కిట్లను ఉపయోగించుకుని, 2000ల మధ్య నాటికి ఆ విమాన రివర్స్–ఇంజ నీరింగ్‌లో సఫలమై జె–11ఎ విమానాలుగా తయారు చేసింది.సు–27 సోవియట్ యూనియన్‌లో 1970లలో డిజైన్ అయి, 1985లో సర్వీసులో ప్రవేశించింది. ఈ సోవియట్ టెక్నాలజీని మక్కికి మక్కి కాపీ కొట్టి చైనా జె–11 తయారు చేసుకుంది. డిజైన్‌లో సాధించిన ఈ పురోగతితో చైనా దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించుకుంది. స్వయం సమృద్ధిని సమీకరించుకుంది. తర్వాత, ఇదే యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ (అదే పెద్ద కొనుగోలు దారు)కు విక్రయించింది.భారత్ మొదటి సుఖోయ్ సు–30ని 1997లో సమీకరించుకుంది. కానీ, దేశంలో అప్పట్లో ఉన్న పరిస్థితుల రీత్యా, దిగుమతు లపై ఆధారపడడం కొనసాగింది. యుద్ధ విమాన (రఫేల్) ప్రత్యా మ్నాయ సరఫరాదారుగా ఫ్రాన్స్ ముందుకొచ్చింది. పుతిన్ పర్యట నతో ఐదవ తరం సు–57 యుద్ధ విమానాలపై మళ్ళీ ఆసక్తి రేగుతోంది. భారత్ సోర్స్ కోడ్ యాక్సెస్‌ను, స్టెల్త్ ఉన్నతీకరణలను కోరుతోంది. దీన్ని సమీకరించుకోవడం వల్ల దేశీయ ‘తేజస్’కు ఏమైనా ఊతం చేకురుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కొన్ని నవీన రంగాలలో అమూల్యమైన సాంకేతిక పరిజ్ఞాన సహాయాన్ని మాస్కో (సోవి యట్ యూనియన్‌గా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా) భారతదేశానికి సమకూర్చిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. క్షిపణులు, అణుశక్తి చోదిత జలాంతర్గత ప్రొపల్షన్ (ఐ.ఎన్.ఎస్. అరిహంత్) అందుకు నిదర్శనం. ఇక సంయుక్త రంగ బ్రహ్మోస్‌ది దిగ్విజయ మైన గాథ. తేలిక రకం బ్రహ్మోస్‌ను తయారు చేయడం ప్రస్తుత సమావేశ చర్చనీయాంశాలలో చేరింది. ప్రధాన సైనిక సామగ్రి డిజైన్, తయారీ పరిజ్ఞానం ఒక దేశాని కుండే వజ్ర వైడూర్యాల లాంటివి. ఇది అలమారాలో పెట్టి అమ్మే పరిజ్ఞానం కాదు. అందు కనే, భారత–రష్యాల మధ్య సైనిక సరఫరాలలో ఎంత పటిష్ఠమైన బంధం ఉన్నా డిజైన్ పరిజ్ఞానాన్ని పంచుకోవడమన్నది లేదు.ఆత్మనిర్భరతను వీలైనంత త్వరగా, పటిష్ఠంగా ముందుకు తీసుకెళ్ళే దృఢ నిశ్చయాన్ని భారత్ కనబరిస్తే పుతిన్ పర్యటన తద నంతర ఫలాలపై ఆశ పెట్టుకోవచ్చు. నిజంగానే, రెండు దేశాలు రక్షణ రంగ పరిశోధన–అభివృద్ధిలో, వస్తూత్పత్తిలో సహకారముంటే మరింత ప్రగతిని సాధించవచ్చు. కానీ, ఈ విషయంలో భారత్ తొలగించుకోవలసిన సాలెగూళ్ళు చాలానే ఉంటాయి.మాస్కోకి కూడా ఢిల్లీతో గాఢమైన సైనిక సహకారం విషయంలో కొన్ని లక్ష్మణ రేఖలున్నాయి. అది బీజింగ్ సందేహాలను కూడా తీర్చవలసి ఉంటుంది. అదే మాదిరిగా, భారత్ కూడా రష్యాతో కలసి అడుగులేయడంలో అమెరికా పెడుతున్న తంపులను గుర్తెరిగి ప్రవర్తించవలసి ఉంటుంది. పుతిన్ పర్యటన ద్వైపాక్షిక స్నేహ సంబంధానికి మెరుగులు దిద్దింది. కానీ, రెండు దేశాలకూ కొత్త సవాళ్ళు కూడా ముందుకొచ్చి నిలుస్తున్నాయి. సి. ఉదయ భాస్కర్,వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ -
సంక్షోభంలో నేపాల్ పార్టీలు
జెన్–జీ అనూహ్యమైన తిరుగుబాటు ఉధృతితో నేపాల్ రాజకీయ పార్టీలు అన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయంటే అతిశ యోక్తి కాదు. పార్టీల నాయకత్వం, సిద్ధాంతాలు, జెన్–జీ రేకెత్తించిన ప్రశ్నలు, వారంటే ఇంకా కొనసాగుతున్న భయం – ఇట్లా అనేక విషయాలు ఒక్కుమ్మడిగా తుఫాను వలె కమ్ముకు రావటంతో పార్టీ అగ్రస్థాయి నాయకత్వాలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఏమి చేయాలనే స్పష్టత లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జెన్–జీ ఆందోళన సెప్టెంబర్ ఆరంభంలో జరిగి, మార్చిలో పార్లమెంటు ఎన్నికలకు మరో మూడు నెలలే మిగిలి ఉండగా ఇదీ పరిస్థితి.ఒక్కో పార్టీ... ఒక్కో సమస్యఅన్నింటికన్న పెద్దది అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా తొలగిపోవాలంటూ జాతీయ కౌన్సిల్ సభ్యు లలో 54 శాతం మంది నోటీసు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి గగన్ థాపా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తూ, దేవుబా తప్పుకోనట్లయితే పార్టీని చీల్చగలమని హెచ్చరించారు. రెండవ పెద్దది అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ ఎంఎల్) అధ్యక్షుడు, ఉద్యమ కారణంగా పదవీభ్రష్టుడైన ప్రధానమంత్రి కె.పి. ఓలీ రాజీ నామా చేయాలని పట్టుబడుతున్న అసమ్మతి వర్గం, పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి తీరాలని ఒత్తిడి చేసి ఒప్పించింది. మూడవ పెద్దది అయిన మావోయిస్ట్ సెంటర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్ ఉరఫ్ ప్రచండ, తనంతట తానే రాజీనామా చేసి, పార్టీని సైతం రద్దుపరచి, కొన్ని ఇతర వామ పక్షాలతో ఐక్యమై, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌ను ప్రారంభించారు. దానికి ఆయన సమన్వయకర్త మాత్రమే! ఆ తర్వాతది అయిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్య క్షుడు, ప్రచండ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండిన రాబీ లమీ ఛానే, ఒక కుంభకోణం కేసులో కోర్టు ఆదేశాలపై అరెస్టయి ఇటీవలే జైలుకు వెళ్లారు. తన పార్టీ స్తబ్ధతలో ఉంది. ప్రచండ తర్వాతి స్థానంలో ఉండి ప్రధానిగా కూడా పనిచేసి, తర్వాత నయాశక్తి పార్టీ ప్రారంభించిన జెఎన్యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి, రాచరికం పతనం తర్వాత ప్రజాస్వామిక రాజ్యాంగ రచనకు ఆధ్వర్యం వహించిన డా‘‘ బాబూరాం భట్టరాయ్, తమ పార్టీని రద్దు చేసి, మరికొందరితో కలిసి ప్రగతిశీల్ లోక్ తాంత్రిక్ పార్టీని నెలకొల్పారు. దానికి ఆయన ‘పార్టీ పేట్రన్’ మాత్రమే! రాచరికం తిరిగి రావాలి, లేదా కానిస్టిట్యూషనల్ మోనార్కీ కావాలనే హిందూవాద రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీ (ఆర్పీపీ)లో నాయకత్వ సమస్యలైతే తలెత్తలేదుగానీ, జెన్–జీ ఉద్యమ కారణంగా తెలిసీ తెలియని సవాళ్లు ఏవి ఎదురు కాగలవోనన్న అయోమయం వారిని ఆవరించింది.జెన్–జీ నేర్పిన పాఠాలేమిటి?ఇదంతా నాయకత్వాలు, పార్టీ నిర్మాణాల పరిస్థితి కాగా, ఎన్నికల సమయానికి మరిన్ని పార్టీలు, లేదా ఇప్పటికే గల పార్టీలలో మరిన్ని చీలికలు, పునరేకీకరణలు, ఐక్య సంఘటనల ఆవిర్భావం జరిగినా ఆశ్చర్యపడనక్కర లేదు. వాస్తవానికి ఎన్నికలలో పోటీ చేయదలచుకునే పార్టీల రిజిస్ట్రేషన్ తొలి గడువు ముగిసినప్పటికీ, ఎన్నికల కమిషన్ ఆ గడువును పొడిగిస్తున్నది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన విషయం, జెన్–జీ గ్రూపులు కొన్నికొన్ని కలిసి ఇప్పటికే మూడు పార్టీలను ప్రారంభించాయి. మరి రెండింటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెన్–జీలంతా కలిసి ఒకే పార్టీగా ఏర్పడక పోవటం పట్ల ప్రజలలో తగినంత నిరాశ కనిపిస్తున్నది.ఆందోళన నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు అన్నింటికన్న ముఖ్య మైన విషయాలు కొన్నున్నాయి. యువతరం ఆగ్రహం, ఆందోళన రాజకీయ పార్టీలకు ఇచ్చిన షాక్ ఎంత తీవ్రమైనది? దానినిబట్టి వారు తమ సిద్ధాంతాలు, విధానాలు, వ్యక్తిగత వ్యవహరణలలోని లోపాలను చిత్తశుద్ధితో గుర్తించి సమీక్షించుకున్నారా? లేక కొంత కాలానికి అంతా సమసిపోయి పాత పద్ధతులలో వ్యవహారాలు సాగించవచ్చుననుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు తటస్థులైన పరిశీలకులకు తోచటం అట్లుంచి, నేపాల్ సామాజికుల నుంచి కూడా విన్న నేను, వివిధ పార్టీల నాయకులను కలిసినపుడు, ప్రశ్నలు వేసి వారి ఆలోచనలను గ్రహించేందుకు ప్రయత్నించాను.వారి సమాధానాలను బట్టి, మిశ్రమాభిప్రాయాలు కలిగాయి. వాస్తవానికి యువతరం లేవనెత్తిన విషయాల తీవ్రత, రెండు రోజుల పాటు అగ్నిపర్వతం వలె బద్దలైన నిరసనల తీవ్రతలను బట్టి పార్టీ లలో మిశ్రమాభిప్రాయాలకు ఆస్కారం ఉండకూడదు. కానీ, కనిపించిందేమిటి? కొందరు నిజంగానే తమ వైఫల్యాలను గుర్తించారు. మావోయిస్టుల సాయుధ ఉద్యమం ఫలితంగా రాచరిక వ్యవస్థ 2008లో రద్దయి, పూర్తి స్థాయిలో ఆధునిక పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థ, కొత్త రాజ్యాంగం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి గత 17 సంవత్సరాలుగా పరిపాలనలు సవ్యంగా సాగి ఉంటే, ఈ రోజున జెన్–జీకి గానీ, ప్రజలకు గానీ ఇంతటి అసంతృప్తికి అవ కాశం ఉండేది కాదని ఈ వర్గం అరమరికలు లేకుండా అంగీకరించింది. అవినీతి పోవటం, సమర్థమైన పారదర్శక పాలన, సామాజిక న్యాయంతో కూడిన వేగవంతమైన అభివృద్ధి అనే మూడు తప్పని సరి అనీ, అది జరగాలన్నదే జెన్–జీ తమకు నేర్పిన పాఠమనీ ఈ వర్గం అభిప్రాయపడుతున్నది. వేర్వేరు పార్టీలకు చెందిన వేర్వేరు నాయకుల మాటలు వేరైనా, వారి నుంచి సారాంశం ఇదే!అదే మొండి ధోరణిఇందుకు భిన్నమైన పరిస్థితి కూడా మరొకవైపు గమనించాను. వారు, 2008 నుంచి అభివృద్ధి తగినంత చేశామని లెక్కలు చెప్తు న్నారు. ఆ లెక్కలు నిజమే అయినా సమస్య ఏమంటే, 2008 తర్వాత ప్రజల ఆకాంక్షలకు, చదువులూ, నైపుణ్యాలూ గణనీయంగా పెరుగు తున్న యువతరం అవసరాలకు, నిజాయితీగా పరిపాలిస్తే సాధించ గలిగిన వాటికి పొంతన కుదరటం లేదు. ఇది చాలదన్నట్లు మావోయిస్టులు, ఇతర కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీల విచ్చలవిడి అవి నీతి! ఈ రెండవ వర్గం ప్రచారం, జెన్–జీ ఆందోళన వెనుక విదేశీ ఎన్జీఓలు ఉన్నాయని! తమకు గల పార్టీ యంత్రాంగం, డబ్బు బలంతో తిరిగి అధికారానికి రాగలమన్నది వీరి నమ్మకం. ఆందోళ నల వల్ల అధికారం కోల్పోయిన మాజీ ప్రధాని ఓలీ ఈ ధోరణికి ప్రతినిధి కావటం విశేషం. ఆయన నేర రికార్డు గల వ్యక్తి ఆధ్వర్యాన ప్రైవేట్ సైన్యం ఒకటి తయారు చేసి పెట్టుకున్నారు. ప్రజల వైపు నుంచి చూసినపుడు, ఇటీవల జరిగిన ఒక ఒపీనియన్ పోల్‌లో ఏ ఒక్క నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. మార్చి ఎన్నికలలో ఏమయేదీ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. 2008 నుంచి 17 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారిన తీవ్ర అస్థిరతల రికార్డు ఇప్పటికే ఉండగా, రాగల కాలంలో ఏమి జరగవచ్చునో ఊహించటం కూడా కష్టమే.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దిక్కుతోచని ఉక్రెయిన్
నెలలు గడుస్తున్నా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విరమణకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసహనం కట్టలు తెంచుకున్నట్టు కనబడుతోంది. మధ్యవర్తిగా తన ప్రతిపాదనలకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్తోపాటు, దానికి దన్నుగా నిలబడిన యూరప్ దేశాలను కూడా ఆయన తూర్పార బడుతున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతున్నదనీ, యూరప్ దేశాలు బలహీనంగా మారి క్షీణదశకు చేరుకున్నాయనీ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. వైరి పక్షాలు ఎటూ నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి. మధ్యవర్తిత్వం వహించే దేశం ఓపిగ్గా వాస్తవ పరిస్థితులను అర్థం చేయించి ఏదోమేరకు తగ్గేలా చేయటం అవసరం. కానీ అలా చేయాలంటే మధ్యవర్తిత్వం వహించే దేశానికి విశ్వసనీయత, ప్రతిష్ఠ ఉండాలి. ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాకు ఆ రెండూ తగ్గాయి. ఏ విషయంలోనూ ఆయన నిలకడగా లేకపోవటం, ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తూ అయోమయాన్ని సృష్టించటం కారణం. జో బైడెన్ హయాంలో అమెరికా ప్రాపకంతోనే యూరప్ దేశాలు ఉక్రెయిన్ను రష్యాపైకి ఉసిగొల్పాయి. కానీ ట్రంప్ వచ్చాక అంతా తలకిందులయి యూరప్ దేశాలకు దిక్కుతోచడం లేదు. అంతేకాదు, ఇటీవల జాతీయ భద్రతా వ్యూహం పేరిట అమెరికా విడుదల చేసిన విధాన పత్రం కూడా వాటికి మింగుడుపడటం లేదు. అట్లాస్ మాదిరిగా ఒంటరిగా భూగోళాన్ని మోయటం ఇకపై ఉండబోదనీ, యూరప్ స్వీయరక్షణ బాధ్యత చూసుకోవాలనీ ఆ పత్రం స్పష్టం చేసింది. ప్రపంచాధిపత్యం కోసం పోటీపడటం పర్యవసానంగా అమెరికా బలహీనపడిందనీ, అందుకే పాత విధానానికి అవసరమైన దిద్దుబాట్లు తప్పనిసరనీ తేల్చింది. ఇప్పటికి ఎనిమిది యుద్ధాలు ఆపానని తరచు చెప్పే ట్రంప్ జాబితాలో నిజానికి ఇప్పటికైతే ఉక్రెయిన్ లేదు. కానీ ఆయన అధికార పగ్గాలు చేపట్టిననాడే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని శపథం చేశారు. 2014కు ముందున్న సరిహద్దుల సంగతి ఉక్రెయిన్ మర్చిపోవాలని చెబుతూ వచ్చారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ భూభాగాన్ని వదులుకోవటానికి ససేమిరా అంటున్నారు. నిజానికి 2022లో ఉక్రెయిన్‌కూ, ఆయనకు మద్దతునిస్తున్న యూరప్ దేశాలకూ బంగారం లాంటి అవకాశం వచ్చింది. టర్కీ మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో రష్యా తనకు తానే రాజీకి సిద్ధపడింది. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటాననీ, నాటోలో చేరబోననీ హామీ ఇస్తే దురాక్రమించిన భూభాగం నుంచి వైదొలగుతామని రష్యా ప్రతినిధి బృందం ప్రతిపాదించింది. యూరప్ నుంచి కూడా దీనిపై హామీ కావాలని కోరింది. అప్పటికి రష్యా పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టి కొన్ని నెలలు మాత్రమే అయింది. కానీ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటీన ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి రాజీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని నచ్చజెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాతోనే జాన్సన్ ఈ సైంధవపాత్ర పోషించారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండికేస్తున్నారు. ఆయనకు శాంతియుత పరిష్కారం ఆలోచనే లేదు. ఆధిపత్య స్థాపనే లక్ష్యం. భారత్ వచ్చేముందు ఈ సంగతి నిర్మొహమాటంగా చెప్పారు. ‘ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వైదొలగితే సరే... లేదా దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటాం’ అని ఆయన ప్రకటించారు. వైరిపక్షాలు చర్చలంటూ మొదలుపెడితే వాటి వైఖరులు ఏదోమేరకు చల్లారుతాయి. కానీ ఆ చర్చలు ఫలించాలంటే తొలుత కాల్పుల విరమణ పాటించాలి. రష్యా, ఉక్రెయిన్ రెండూ అందుకు సిద్ధపడటం లేదు. యుద్ధ వాతావరణంలో చర్చలు ప్రశాంతంగా సాగబోవన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి రష్యా ప్రతిపాదనలకు అంగీకరించమంటూ ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో అమెరికాతో నేరుగా మాట్లాడే ధైర్యంలేని యూరప్ దేశాలు... ట్రంప్‌ను ఖాతరు చేయొద్దని ఉక్రెయిన్‌కు నూరిపోస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నుకుంటే, అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారితే ఏమవుతుందో ఉక్రెయిన్ ఈ దశలోనైనా గుర్తెరగాలి. దీన్నుంచి బయటపడాలంటే సొంత గొంతు వినిపించటం ప్రారంభించాలి. -
ముంబై కల… అమరావతి గిమ్మిక్
అమరావతిలో 15 బ్యాంకులు, రెండు బీమా సంస్థల కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్‌లు కేంద్రం తమకు సహకరిస్తోందని చంకలు గుద్దుకుంటున్నారు. పైగా ఈ చిన్న విషయంతోనే అమరావతి ముంబై అయిపోతుందన్నంత బిల్డప్ కూడా ఇచ్చేశారు. నిన్నమొన్నటివరకూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అన్నవాళ్లు కాస్తా ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇలా రోజుకో మాట మారిస్తే నమ్మేదెలా?.. ఇంతకి ఏమిటి వీరి బలహీనత?.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారుకు చిత్తశుద్ది ఉంటే, ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ కొత్తగా వస్తువన్నవి అని నమ్ముతూంటే అవి విశాఖలో పెరిగేలా చేస్తే ఏపీకి సత్వర ప్రయోజనం కలిగేది కదా! అని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ విలువలు పెంచడానికి, ధరలు పెరిగాయన్న కృత్రిమ భావన కల్పించడానికి తంటాలు పడుతున్న ప్రభుత్వ పెద్దలు దీనిని ఒక గిమ్మిక్కుగా మార్చారన్న అనుమానం కలుగుతుంది. తాజా ప్రచారం ప్రకారం మరికొన్ని సంస్థలను కూడా విశాఖ అమరావతికి తరలిస్తున్నారట. స్టాక్ ఎక్చేంజ్ బోర్డు ఆఫీస్‌ను గతంలో విశాఖలో ఏర్పాటు చేయాలని తలపెట్టగా ఇప్పుడు అమరావతికి మార్చే యోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫీస్‌ను వైజాగ్‌లో ప్రతిపాదిస్తే అమరావతికి మార్చారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, బిట్స్ పిలాని క్యాంపస్, ఏఐ, స్కిల్ యూనివర్శిటీలరె కూడా అమరావతికి మారుస్తారట. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్, కర్నూలు నుంచి లా యూనివర్శిటీ తిరుపతి నుంచి హెచ్సీఎల్లను తరలించారు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ నుంచి ఒక కార్యాలయం ఇక్కడకు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ అసమానతలు,విద్వేషాలు పెరగవా అని కొంతమంది విజ్ఞులు బాదపడుతున్నారు. కొత్త ప్రభుత్వ సంస్థలను అమరావతిలో స్థాపించవచ్చు.గతంలో అనేక ప్రైవేటు పరిశ్రమలు అమరావతికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయని అన్నారు.అలా జరిగితే అందరికి ప్రయోజనంగా ఉంటుంది. వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు. దాని ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి దక్కాలి.అలాకాకుండా అప్పులు భారం అందరిపై పడి, ఆర్థిక లాభం మాత్రం అమరావతి ప్రాంతంలోని కొందరికే లభిస్తే అది సమస్యలకు దారి తీయవచ్చు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమరావతిలో పెడుతున్న బ్యాంకు ఆఫీసులు అన్ని విజయవాడలో ఇప్పటికే పనిచేస్తున్నాయట. వాటినే అమరావతికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నమాట. కాకపోతే దానికి ఫైనాన్షియల్ స్ట్రీట్ అని ఒక పేరు తగిలిస్తారన్నమాట. నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలు అన్నీ ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఆయా చోట్ల వివిధ బ్యాంకులకు రీజినల్ ఆఫీసులు కూడా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో అన్ని బ్యాంకులు ఓకే చోట ఉండడం వల్ల కలిసివచ్చేది ఏమీ ఉండదు. వికేంద్రీకరిస్తే అందరికి సమన్యాయం జరుగుతున్నట్లు అవుతుంది.అందుకు భిన్నంగా ఇతర చోట్ల నుంచి తీసుకు వచ్చి వాటిని అమరావతిలో పెడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.కాకపోతే ప్రభుత్వ సొమ్ము కాబట్టి కోట్ల రూపాయలకు వారికి భూమిని కేటాయించామని చెప్పుకోవచ్చేమో!. విశాఖలో ప్రైవేటు సంస్థలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు పందారం కావిస్తూ, అమరావతిలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించాలి. ఒకప్పుడు అమరావతిలో ఐటీ మొదలు అనేక సంస్థలు వస్తున్నాయని ఊదరగొట్టారు.నవ నగరాల పేరుతో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో అందుబాటులో ఉన్న ఏభైవేల ఎకరాలు సరిపోదని, అలా అయితే మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కొత్తగా మరో నలభైవేల ఎకరాల భూముల సమీకరణకు సిద్దం అవుతున్నారు. నిర్మలా సీతారామన్ కు ఈ విషయాలన్నీ తెలుసో ,లేదో కాని ఆమె ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో కూరగాయలు బాగా పండుతాయని, వాటికి ప్రోసెసింగ్ యూనిట్లు పెట్టడం, ఎగుమతికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు నెలకొల్పడం వంటివి చేయాలని సూచించారు. కాని ఇప్పటికే రాజధాని పేరుతో భూములన్నిటిని చంద్రబాబు ప్రభుత్వం దున్నివేయించింది. వేలాది ఎకరాలలో పంటలు లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవిలా మారినట్టు పలు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె గమనించి సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది. బ్యాంకులు వారు రైతులకు సహకరించాలని చెబుతూనే కమర్షియల్ గా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అంటే ఎవరికి ఎలాంటి రాయితీలు ఇవ్వవలసిన అవసరం లేదని తేల్చేశారన్నమాట. పోనీ అమరావతికి ఏమైనా కొత్తగా నిధులు ఇస్తున్నారా అంటే అదేమి చెప్పలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్రం రూ.15 వేల కోట్ల ఇచ్చి సహకరిస్తోందని అన్నారు. కాని అది రుణమా?లేక గ్రాంటా అన్నది చెప్పినట్లు కనిపించలేదు. నిజంగానే అది గ్రాంట్ అయితే నిర్మలా సీతారామన్ ప్రస్తావించకుండా ఉంటారా?.. బడ్జెట్ లో ఏపీకి బలమైన మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారని ఆమె తెలిపారు. కాని అది ఏ రూపంలో ఇంతవరకు ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఏపీకి ఆర్థిక భారం అవుతుంది. అలాంటప్పుడు అది సాయం ఎలా అవుతుంది?. కేంద్రం నుంచి సుమారు రూ.36 వేల కోట్ల సాయం వస్తుందని ఏపీ బడ్జెట్లో పెడితే ఇప్పటికి కేవలం ఐదువేల కోట్ల లోపే అందిందట. దీని గురించి ఆమె ఏమైనా హామీ ఇస్తే బాగుండేది కదా!. రాష్ట్రం సుమారు రూ.45 వేల కోట్ల భారీ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అది తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సాయపడి ఉంటే అందరు అభినందించేవారు. అవేవి చేయకపోయినా చంద్రబాబు, తదితరులు మెచ్చుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలోని వారికి ఇబ్బంది లేదనుకోవాలి. నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబుకు లేని క్రెడిట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఆయన చేసిన పనులు చెప్పి పొగిడితే తప్పు లేదు. కాని హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం అయనే చేసినట్లు నిర్మలా వ్యాఖ్యానించడం అందరిని విస్తుపరచింది. హైదరాబాద్‌లో ఈ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ది అంతా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంతా తానే నిర్మించానన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. ఈ మధ్య ఆయన ఒక స్పీచ్ ఇస్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తానే వేసినట్లు చెప్పుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దానికింద ఒక అధికారి గతంలో ఈ రింగ్ రోడ్డును వైఎస్సార్ ఎలా అభివృద్ది చేసింది వివరిస్తున్న దృశ్యం కనిపించింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డు నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిందని తెలిపే వీడియో కూడా వచ్చింది. అయినా చంద్రబాబు ఎందుకో అసత్యాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ కూడా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ను చంద్రబాబుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగిన అభివృద్దిని కూడా తన ఖాతాలో వేసుకుని ఏపీలో ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది ఆయన ఉద్దేశం అన్నది కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్‌ను అంతగా అభివృద్ది చేసి ఉంటే మరి ఏపీలో విశాఖ,విజయవాడ,తిరుపతి వంటి నగరాలను ఎందుకు వృద్ది చేయలేకపోయారు?.. ఇకపై ముంబై ఆర్ధిక నగరం కాదట.అమరావతి అట. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.ఈ రకంగా మాట్లాడడం నవ్వులపాలయ్యే అంశమా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. ముంబై ఎక్కడ?అమరావతి ఎక్కడ? అర్థం ఉండాలి కదా మాట్లాడడానికి!. విమానాశ్రయం పేరుతో, స్పోర్ట్స్ సిటీ పేరుతో రకరకాలుగా వేల ఎకరాల అదనపు భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్దమవుతున్న తీరు అమరావతి రైతుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది. వారిని మభ్య పెడుతూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రసంగాలు చేస్తే ఏమి ఉపయోగం?.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అంతుచిక్కని అగ్నిశిఖల ముప్పు
దీర్ఘకాలంగా సుప్తావస్థలో ఉన్న ఇథియోపియా ఉత్తర ప్రాంతంలోని హేలీ గబ్బి అగ్నిపర్వతం అసాధారణ రీతిలో బద్దలైన ఘటన అనూహ్యంగా ఆందోళనలోకి నెట్టింది. పేలుడుతో అత్యంత భారీగా రేగిన ధూళి మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమన్, ఒమన్ సహా చివరకు పాకిస్తాన్ ఉత్తర ప్రాంతం నుంచి భారతదేశం వైపు కమ్ముకొస్తూ ఉండడం మన ఆందోళనకు కారణం. ఎదుట ఉన్నదేదీ కనిపించనివ్వని ఆ భారీ దుమ్ము ధూళి ఏకంగా కొన్ని వందల కిలో మీటర్లు ప్రయాణించి వివిధ ఖండాలకు విస్తరించింది. ఇప్పటికే భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా అనేక దేశాల విమాన ప్రయాణ సర్వీసులకు చిక్కులు తెచ్చింది.ఏం జరిగింది?ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు ఈశాన్యాన 800 కి.మీల దూరంలో అఫార్ ప్రాంతంలో ఉందీ హేలీ గబ్బి అగ్నిపర్వతం. ముఖ్యంగా భూ ఉపరితలంపై కదిలే పెద్ద శిలల పొరల మీద ఉంది. తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ జోన్ కిందకొచ్చే ఆ ప్రాంతంలో అటు ఆఫ్రికన్, ఇటు అరేబియన్ భూ ఫలకాలు ఘర్షించుకుంటూ, ఏటా 0.4 నుంచి 0.6 అంగుళాల మేర పరస్పర వ్యతిరేక దిశలో కదులుతుంటాయి. 12 వేల ఏళ్ళుగా గమ్మునున్నట్టు తోచిన సదరు వాల్కనో ఈ నవంబర్ 23న విస్ఫోటనం చెంది, అనేక గంటలు నిప్పులు విరజిమ్మింది. ఆ ఘటనలో ఎవరూ మరణించలేదు కానీ, ఆ ప్రాంత ప్రజలు, జీవజాలంపై సుదీర్ఘ ప్రభావం ఉండనుంది. ముందస్తు హెచ్చరికలు లేవా?ఇథియోపియాలో దాదాపు 50 అగ్నిపర్వతాలున్నాయి. వాటిలో అనేకం కొన్ని వేల ఏళ్ళుగా నిద్రాణంగా ఉన్నాయి. నిజానికి, ఈ జూలైలోనే దగ్గరలోని ఎర్తా ఆలె అగ్నిపర్వతం బద్దలైంది. భూగర్భంలో 30 కిలోమీటర్ల కింద అంతశ్శిలాద్రవం చొచ్చుకుపో యింది. భూగర్భ కదలికలతో హేలీ గబ్బి సైతం విస్ఫోటనం చెందే ప్రమాదం ఉందని సూచనలు అందాయి. గత ఆదివారం అదే జరిగింది. భారీ శబ్దంతో అగ్నిపర్వతం పేలినప్పుడు 14 కి.మీ.ల మేర ఆకాశంలోకి ధూళి మేఘాలు విస్తరించాయి. పర్వతాలంత ఎత్తున గగన భాగాన్ని కప్పేసిన ఆ బూడిద పర్యాటక ప్రాంతాలైన చుట్టుపక్కలి పర్వతప్రాంత గ్రామాలను చుట్టేసింది. దట్టమైన పొగ, గాఢాంధకారంతో గాలి పీల్చడానికైనా లేదు. తాజా ఘటనను బట్టి ఆ అగ్ని పర్వత ప్రాంతం గురించి లోతైన అధ్యయనం జర గనే లేదనీ, ఆ లోటు పూరించాల్సి ఉందనీ తేలింది.ఎంత కష్టం... ఎంత నష్టం...అగ్నిపర్వత భస్మ మేఘాల్లో కరకైన కణాలుంటాయి. లక్షల టన్నుల ఆ కణాలు లోపలికి చొచ్చుకుపోయి విమానాల ఇంజన్లను చెడగొడతాయి. విమానయానం ప్రమాదకరమవుతుంది. 1982లో బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం ఇలానే భస్మ మేఘం గుండా వెళ్ళి 4 ఇంజన్లూ ఆగిపోయాయి. కష్టపడి పావుగంటలో పైలట్లు 3 ఇంజన్లను పునరుద్ధరించేసరికి జనం బతికిపోయారు. మునుపు 2010లో ఐస్‌ల్యాండ్‌లో ఓ అగ్నిపర్వతం కొద్ది నెలలు నిరంతరం విస్ఫోటనం చెంది, 11 కి.మీ.ల మేర బూడిదను విరజిమ్మింది. బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలను ఈ భస్మ మేఘాలు తాకాయి. బ్రిటన్ 6 రోజులు వైమానిక మార్గాన్ని మూసేయాల్సి వచ్చింది. 95 వేల విమా నాలు రద్దయ్యాయి. యూరప్‌లో అనేక దేశాలు గగన తలాన్ని మూసేశాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద వైమానిక షట్‌డౌన్ అదే! రోజూ 12 లక్షల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. బ్రిటన్ 145 కోట్ల డాలర్లు నష్టపోయింది.గతిని మార్చేసిన గతం...అగ్నిపర్వత విస్ఫోటనాలంటే ఆషామాషీ కాదు. అవి మానవాళి చరిత్రనే మార్చేసిన ఘట్టాలున్నాయి. 1783 నాటి లకీ విస్ఫోటనంతో యూరప్‌లో వాన రాకడే మారింది. ఫ్రాన్స్‌లో ఆకలి మంటలు రేగి, ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసింది. ఆ తర్వాత మూడు దశాబ్దాలకు ఇండొనేసియాలోని తంబోరాలో విస్ఫో టనం యూరప్‌లో ఎడతెగని వానలు సహా కొన్నేళ్ళు ప్రపంచ పర్యావరణాన్నే మార్చేసింది. వర్షంతో చిత్తడిగా మారిన నేల వల్లే వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓటమి పాలయ్యారట. ఏమైనా, ఇప్పుడు హేలీ గబ్బి దెబ్బకు ఆఫ్రికాలోని అతి పెద్ద వైమానిక కేంద్రాల్లో ఒకటైన ఇథియో పియా సహా అనేక ఖండాల్లో విమాన సర్వీసులు ఇరుకున పడ్డాయి. 4 వేల కి.మీ.ల దూరంలో ఉన్న రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌లకు ఈ ధూమం విస్తరించింది. విమాన సర్వీసులు అనేకం రద్దయ్యాయి. కొద్ది రోజుల్లో ఈ ధూళి తగ్గినా, ఆ మేఘాల్లోని హానికారక వాయువులతో జాగ్రత్త పడక తప్పదు. -
‘పరిష్కారం’ దారులు తెరవాలి!
ఏది సమస్య? ఏది పరిష్కారం? మధ్య భారతంలో ముఖ్యంగా అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సాగుతున్న వామపక్ష ఉద్యమాలు–తీవ్రవాదం, హింస –ప్రతిహింస విషయంలో ఇటీవలి పరిణా మాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. హింస ఆగటం లేదు, శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. మౌలిక సమస్యను పరిష్కరించకుండా జరిపే ప్రక్రియ అర్థంలేని గమ్యం వైపు సాగుతోందన్నది ఈ ఆందోళనకు కారణం. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన ‘హిడ్మా’ మరణానంతరం చర్చ తీవ్రస్థాయికి చేరింది.వచ్చే (2026) మార్చి మాసాంతానికి నక్సలైట్లను సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. హింస ఏదైనా హింసే! చావులు ఎటువైపున జరిగినా క్షోభ తప్ప దనేది జనాభిప్రాయం! కూంబింగ్ ఆపితే ఆయుధాలు వీడుతామనే కొత్త మాట మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి తాజాగా మొదలైంది. మధ్య భారతంలోని మూడు (ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహా రాష్ట్ర) రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేరకు లేఖలు రాసినట్టు వార్తలొస్తున్నాయి.ఇదే అదనుగా, ఆయుధాల అంశం బెట్టు చేయ కుండా కేంద్రం చొరవ తీసుకోవాలి. చర్చలతో శాంతి సాధనకు యత్నిస్తూనే, నక్సలైట్ల ఎజెండా అంశాల్ని పరిష్కరించాలి. నక్సలైట్లు లేవనెత్తే సమస్యల్ని ‘సామాజికార్థికాంశం’గా చూడకుండా, ‘నక్స లైట్ల’నే శాంతిభద్రతల సమస్యగా ప్రభుత్వాలు పరిగణించడం వల్ల పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. ‘హిడ్మా’ ఎందుకు హీరో అయ్యాడు?వరుస ప్రభుత్వాల వైఫల్యం దృష్ట్యా సమస్యల పరిష్కారానికి ఆయన నిలబడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులను, సాయుధ బలగా లను, రాజ్యాన్ని ఎదిరించాడు. ఉద్యమం వల్ల లభించిన పుష్కల అవకాశాలతో ఇంటికో, తల్లికో, తనకో, తన వారికో ఏదీ చేసుకో కుండా ఆదివాసీల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన త్యాగానికి మరణానంతరమూ విశేష ఆదరణ లభించింది. ఇపుడు హిడ్మాను హతమార్చారు. రేపు మిగతా నక్సలైట్లను లొంగదీసు కోవడమో, చంపడమో చేస్తారు.అది, కొంత మేరకే సమాధానం. మౌలికమైన ప్రజల సమస్యకు పరిష్కారం కాదు. నక్షత్రాల స్థానాలు –కదలికల ఆధారంగా రూపొందించే పంచాంగాలను బట్టి ముహూ ర్తాలు, శకునాలు చెబుతారు. ఆవేశంతో ఎవరో పంచాంగాలు చింపేయడమో, కాల్చేయడమో చేసినంత మాత్రాన అంతా అయి పోతుందా? నక్షత్రాలుంటాయి కదా. అవి కదా మూలం! ఉద్యమకారుల్ని చంపేయడం, ఉద్యమాల్ని అణచివేయడం కాకుండా, ఉద్యమాలు తలెత్తడానికి కారణమవుతున్న మౌలికాంశాల్ని సరిదిద్దడం ద్వారా ఉద్రిక్తతల్ని, అశాంతిని నిర్మూలించాలి. ఇదే విషయాన్ని అత్యున్నత నిపుణుల కమిటీ 2008లోనే చెప్పింది.అజిత్ దోవల్ సభ్యుడే!మధ్య భారతంలోని ఛత్తీస్‌గఢ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు కలిసిన అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో వామపక్ష హింసను రూపుమాపి, అభివృద్ధికి దోహద పడాలంటే ఏం చేయాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం జరిపించింది. అశాంతి స్థానే శాంతి వెల్లివిరియాలంటే కేంద్రం, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనీ, నక్సలైట్ల నిర్మూలన మాత్రమే ఇందుకు పరిష్కారం కాదనీ ఈ నిపుణుల కమిటీ 2008లోనే నివేదించింది.నక్సలైట్ల హింసకు విరుగుడుగా స్థానిక ఆదివాసీ యువకులతో ‘ఎదురుదాడుల’ కోసం ప్రభుత్వ బలగాలు ఏర్పాటు చేసిన సాయుధ ‘సాల్వాజుడుం’ను 2011లో సుప్రీంకోర్టు నిషేధించడానికి మూడేళ్లు ముందరే, ‘ఆ వ్యూహం, అటువంటి ఆచరణ తప్పు’ అని ఈ కమిటీ నిర్ద్వంద్వంగా చెప్పింది. నివేదికను రూపొందించిన డ్రాఫ్టింగ్ సబ్ కమిటీలో తెలుగు వాడైన దివంగత హక్కుల కార్యకర్త, న్యాయవాది కె. బాలగోపాల్ కీలకపాత్ర పోషించారు.కేంద్ర ప్రణాళికా సంఘం 2006లో, డి. బంధోపాధ్యాయ (కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్) అధ్యక్షతన 16 మంది సభ్యులతో ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ‘అసంతృప్తి, అశాంతి, తీవ్రవాదం– అభివృద్ధికి అవరోధం’ అంశంపై అధ్య యనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. ‘నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి సవాళ్లు’ పేరిట ఇచ్చిన సుమారు 90 పేజీల నివేదిక ఇది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల ప్రతిపాదనలతో, 20 పేజీల మేర ఇందులో ‘నిర్దిష్ట సిఫారసులు’న్నాయి. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ ‘జాతీయ భద్రతా సలహాదారు’ అజిత్ దోవల్ (మాజీ కేంద్ర నిఘా సంస్థ) ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ (పౌర స్పందన వేదిక కన్వీనర్), ఐపీఎస్‌లు సహా పలు ఇతర రంగాల వారు సభ్యులుగా ఉన్నారు.ఉద్యమాలకు తావీయొద్దు!అటవీ, అదివాసీ ప్రాంతాల్లో, బడుగు–బలహీనవర్గాల్లో ప్రజా సమస్యల్ని ప్రభుత్వమే పరిష్కరిస్తూ, జన బాహుళ్యంలోకి నక్సలైట్లు చొరబడే, వారి మద్దతు కూడగట్టే ఆస్కారం లేకుండా చేయాలని నిపుణుల కమిటీ కేంద్రానికి సూచించింది. దేశంలో వామపక్ష తీవ్ర వాదం ఒక దశలో, ‘ముఖాముఖి యుద్ధ’ పరిస్థితికి వెళ్లింది. యుద్ధంలో వలెనే, ఎవరికి వారు వ్యూహ–ప్రతివ్యూహాలతో ఎదుటి వారి బలహీనతల్ని సొమ్ముచేసుకునే ఎత్తుగడలూ పన్నారు. పాలనా వైఫల్యాలు, సంక్షేమాభివృద్ధి లేమి, హక్కుల హననం, సహజ వనరుల దోపిడీ వంటి పరిస్థితుల్ని సానుకూలంగా మలచుకొని నక్స లైట్లు ప్రజల మద్దతు కూడగట్టారు.కొన్నిచోట్ల ప్రభుత్వ సాయుధ బలగాలను మించి బలోపేతమయ్యారు. నక్సలైట్లలో గ్రూపులు, అనైక్యత, సిద్ధాంత క్షీణత, స్వార్థ–లంపెన్ శక్తుల ప్రవేశం... వంటి పరిస్థితుల్ని పోలీసు, మిలిటరీ, ప్యారా మిలిటరీ బలగాలు తమకు అనుకూలంగా మలచుకొని ఆధిపత్యం సాధించాయి. ఈ ఆధిపత్య పోరులో హింస పెరిగి, అశాంతి తీవ్రంగా ప్రబలింది. దీనిపై అధ్యయనం తర్వాత నిపుణుల కమిటీ అయిదు ఛాప్టర్లుగా నివేదిక ఇచ్చింది. ‘పెసా’, భూగరిష్ఠ పరిమితి వంటి ప్రస్తుత చట్టాల పకడ్బందీ అమలు, జీవనోపాధుల కల్పన, సాంఘిక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల లోపరహిత అమలు.. ‘సాల్వా జుడుం’ వంటి రాజ్యాంగేతర సాయుధ దళాలు కాకుండా రాజ్యం తన బాధ్యతను రాజ్యాంగ పరిధిలో నిర్వహించడం, మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుల్ని సత్వరం పరిష్కరించడం, పాలనను మానవీకరించి ఆదివాసీల సమస్యలు, ఫిర్యాదుల్ని ఎప్పటి కప్పుడు పరిష్కరించడం వంటి చర్యల్ని చేపట్టాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రజలకు దన్నుగా నక్సల్స్ చేస్తున్న పనుల్ని ప్రభు త్వమే ముందు చేసి వారికి జనహృదయాల్లో తావు లేకుండా చేయా లని కమిటీ సూచించింది. ఇవన్నీ చిత్తశుద్ధితో చేపడితే, అసమాన తలు కొంతైనా తొలగి ఉద్యమాలకు తావులేని వాతావరణం ఉంటుందని ప్రభుత్వాలు గ్రహించాలి.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్ -
చంద్రన్న దిగిపోవాలి.. జగనన్న రావాలి
వ్యవసాయం వద్దంటారు.. సేద్యం ముద్దంటారు. యూరియా వేస్తె క్యాన్సర్.. వరి వేస్తె షుగర్. ఓటుకు ముందోమాట.. గెలిచాక ఇంకోమాట.. ప్రపంచంలో మొత్తం. ఊసరవెల్లులు ఎన్ని రంగులు మారుస్తాయో చెప్పలేం కానీ రాజకీయ ఊసరవెల్లి చంద్రబాబు మాత్రం పూటకోమాట మారుస్తారు. రైతులతో అవసరం ఉంటే ఒకమాట.. గెలిచేందుకు వారి సాయం కావాలంటే ఒకమాట.. గెలిచాక ఇంకో మాట.. సేద్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేస్తున్న తరుణంలో ఇంకోమాట.. పంటలు గిట్టుబాటు ధర ఇవ్వలేనప్పుడు .. ప్రజలకు మొహం చూపలేని పరిస్థితుల్లో ఇంకోమాట.. రైతుల పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో వారికి సమాధానం ఇవ్వలేని తరుణంలో ఇంకోమాట.. ఇలా గంటగంటకూ మాటలు మారుస్తూ మాయలు చేసే చంద్రబాబు పాలనలో రైతులు నిలువునా మునిగిపోయారు. చేలకు పురుగుపడితే ఏదో మందు కొట్టి ఆపొచ్చు.. కానీ ప్రభుత్వమే పురుగులా మరి వ్యవసాయాన్ని తొలిచేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. .. కాపుగాయాల్సినవాళ్ళే కాల్చేస్తుంటే రైతు ఎవరికీ చెప్పుకుంటాడు.. యేమని చెప్పుకుంటాడు. వ్యవసాయం.. పంటలసాగుపై చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు..ప్రాజెక్టులు కడితే డబ్బులు దండగ.. ఐటీని ప్రమోట్ చేయాలి..వ్యవసాయం దండగ..వరి పండిచొద్దు.. బియ్యం తింటే డయాబెటిస్ వస్తుంది..ఉచిత విద్యుత్ ఇస్తే రైతులు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి..యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది..ఎరువుల వినియోగం తగ్గించాలి.. దీని వల్ల భూసారం తగ్గుతోంది.. చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు, ఉండబోదు( మాట తడబాటు )..వ్యవసాయంలో ఉపాధి లేదు.. సేవా రంగమే భేష్వ్యవసాయం వల్ల ఆదాయం అంతంత మాత్రమే..1995-2004 (మొదటి ముఖ్యమంత్రి కాలం) వ్యవసాయం "భారం" (దండగ/శిక్ష) అని పేర్కొన్నారు. 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. తన పాలనలో రైతులను ప్రాధాన్యత ఇవ్వలేదని తర్వాత (2012) అంగీకరించారు. రైతులకు 87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చి రూ.15 వేల కోట్లు కూడా చేయలేదు. 1999లో రైతుల ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వడం వల్ల మరిన్ని ఆత్మహత్యలు పెరుగుతాయని చంద్రబాబు కామెంట్ చేసారు. తన పుస్తకం మనసులో మాటలో (Manasulo Maata) ఈ వ్యాఖ్య ఉంది. 1995-2004 మధ్య 25,000 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శలున్నాయి. 2012, జనవరి 21 నెల్లూరు, కందుకూరులో TDP సభలో మాట్లాడిన చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో రైతులను "విస్మరించాను, తప్పు చేశాను" అని క్షమాపణ చెప్పారు..తిరిగి.. 2014, డిసెంబర్ 24న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు కేవలం కరువు కారణంగా కాదు, "ప్రేమ విషాదం, రుణాలు, కుటుంబ సమస్యలు" కారణం అన్నారు.. ఇది తీవ్ర విమర్శలకు కారణమైంది. 2025, సెప్టెంబర్ 15-16 న కేబినెట్ సమావేశంలో యూరియా అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమయంలో యూరియా లభించక రైతులు అల్లాడిపోతున్న తరుణంలో తన చేతగాని తనాన్ని తప్పించుకోవడానికి ఇలా మాట్లాడారు. 2025, నవంబర్ 12-13న "నీళ్లు ఉన్నందుకే వరి పండిస్తే, ఎవరూ మీ వరిని తినరు" అని చంద్రబాబు చెప్పారు. వరి పంటలకు బదులు ఇతర పంటలు పండించాలని సూచించారు.పైవన్నీ చంద్రబాబు నోటినుంచి వెలువడిన ముత్యాల మాటాలు కొన్ని మచ్చుకు. ఇక ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గెలిచాక మొక్కజొన్న, మామిడి.. అరటి.. పొగాకు.. మిర్చి రైతులు నిట్టనిలువునా మునిగిపోయారు. పండిద్దాం అంటే ఎరువులు దొరకవు.. పంటలు పండించాక అమ్ముదాం అంటే ధర దక్కదు.. ఆనాడు మామిడి రైతులు కిలో ఐదారు రూపాయలకు సైతం అమ్ముకోలేక వీధుల్లో పళ్ళను పారబోశారు.. నేడు అరటి రైతులు గెలలను పశువులకు వేస్తున్నారు.. అవి కూడా సయించక తినకపోవడంతో కొందరు రైతులు ఏకంగా అరటి తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం సాగదు .. రైతు ఏడ్చిన రాష్టం ముందుకు నడవదు అనే సామెత ఏపీలో అక్షరాలా నిజమవుతోంది. నేడు కిలో అరటి కాయలు అర్ధరూపాయికి అమ్మాలంటే కన్నీళ్లొస్తున్నాయంటూ రైతులు పొలం గట్టున కూర్చుని ఏడుస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కూడా అకాల వర్షాలకు అరటి పంటను నష్టపోయిన దాదాపు 670 మంది రైతులకు వైయస్ జగన్ హెక్టారుకు రూ. 20 వేలు చొప్పున సొంత డబ్బులు అందించి వారిని నిలబెట్టారు.. నాయకుడికి నయవంచకుడికి ఉన్న తేడాను వైఎస్ జగన్ తన మంచి మనసుతో చాటుకున్నారు.. ప్రజలకు కష్టం వస్తే జగనన్న.. ఆపద వస్తే జగనన్న.. కన్నీరొస్తే తుడవడానికి జగనన్న ఉండాలి.. ఆయనే రావాలి.. అదీ ప్రజల ప్రస్తుత పరిస్థితి..:::సిమ్మాదిరప్పన్న -
‘శ్రమదోపిడీ లేని భారత్’ కావాలి!
2026 మార్చ్ 31 నాటికి, ‘నక్సలిజం లేని భారత్‌ని ఏర్పాటు చేస్తాము’– అని, దేశ ప్రధానీ, హోమ్ మంత్రీ కూడా పదే పదే ప్రకటిస్తున్నారు. నక్సలైట్లు ‘లొంగే వరకూ, లేదా పట్టుబడేవరకూ, లేదా నిర్మూలనం అయ్యేవరకూ, తమ ప్రభుత్వం నిద్రపోదు’ అని కూడా ప్రక టించారు. అందుకోసం అనేక రకాల పేర్లతో, పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఆ పేర్లలో ఒకటి ‘కోబ్రా’ (నాగు బాము) దళం, ఇంకోటి ‘గ్రే హౌండ్స్’ (వేట కుక్కల) దళం. ‘గ్రే హౌండ్స్’ అనేవి ఒక జాతి కుక్కలు. ప్రాచీన ఈజిప్టులో, వేటల కెళ్ళినప్పుడు, జంతువుల్ని పట్టెయ్యడానికి, ఆ కుక్కల్ని ఉపయోగించేవారట!ఇప్పుడు, నక్సలైట్లని పట్టుకోవడానికి, పోలీసు దళాల్ని అదే పేరుతో ఏర్పాటు చేసి ఉపయోగిస్తున్నారు! నిన్న గాక మొన్న, ఈ పేరుగలిగిన పోలీసు దళం వాళ్ళే, ఆదివాసీల తరఫున పోరాడు తున్న నక్సలైట్ల నాయకుల్ని చాలా మందిని చంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చదివాక, నాకు వచ్చిన ఆలోచనలు కొన్ని ఇవి:పరస్పర శత్రుత్వం వెనక...(1) నేను తెలుగులో, 1978లో, పరిచయం చేసిన ‘అంకుల్ టామ్స్ కేబిన్’ (‘టామ్ మామ ఇల్లు’) అనే ఒక ఇంగ్లీషు నవలలో చదివిన ఒక ‘వ్యాపార ప్రకటన’ ఈ సందర్భంలోనే కాదు, ఎప్పుడూ గుర్తే వస్తుంది. అమెరికాలో, నీగ్రోల బానిసత్వం కొనసాగుతున్న కాలంలో, బానిసలుగా ఉండటం ఇష్టం లేని శ్రామికులు పారిపోతే, వారిని వెతికి పట్టుకోవడానికి, వారి యజమానులు నిజం వేట కుక్కల్ని వాడేవారు. వాటికి సంబంధించినదే ఆ వ్యాపార ప్రకటన! దాని హెడ్డింగు: ‘నీగ్రో కుక్కలు!’ ఆ ప్రకటనలో ఇలా వుంది:‘‘నగర వాసులందరికీ, ఈ క్రింద సంతకం చేసిన వ్యక్తి విన్నవించుకొనేదే మనగా– ‘నేను మన్రో రోడ్డులో తూర్పున రెండున్నరమైళ్ళ దూరాన నివసిస్తున్నాను. నా దగ్గిర, నీగ్రోల్ని పట్టుకోడానికి చాలా మంచి కుక్కలు ఉన్నాయి! పారిపోయిన నీగ్రోల్ని పట్టుకోవాలని కోరే వ్యక్తులు నాకు ఒక్క పిలుపు ఇస్తే చాలు. నేను వేటకెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయాలలో నా నివాసంలోనే ఉంటాను. నేను లేక పోయినా, నా నివాసం దగ్గర నా సమాచారం మీకు అందుతుంది. నీగ్రోని పట్టుకున్న కుక్క కోసం– 25 డాలర్లు. నీగ్రోని పట్టుకోక పోతే 5 డాలర్లు మాత్రమే’. – ఇట్లు, గాఫ్. ఫిబ్రవరి 17, 1852.’’ – ఇదీ ఆ ప్రకటన!ఎంత ఆశ్చర్యం! అక్కడ, ఆ నాడు, 170 ఏళ్ళనాడు, స్వేచ్ఛ కోసం పారిపోయిన బానిసల్ని పట్టుకోవడానికి, ఆ నాటి బానిస యజమానులు వేటకుక్కల్ని ఉపయోగించారు. ఈనాడు, ఉద్యమ కారులు తప్పించుకుంటూ, ఉద్యమాన్ని నిలబెట్టుకోవడానికి, భద్రమైన స్థలాలకు వెళ్తూ వుంటే, ఈ ప్రభుత్వ పాలకులు, వేట కుక్కల పేరుతో వున్న పోలీసుల దళాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఆ పోలీసుల గురించి, కవి చెరబండరాజు, ఒక పాటలో ఇలా చెప్పాడు: ‘‘మాలోని మనిషివే! మా మనిషివే నీవు!/ పొట్ట కూటికి నీవు పోలీసువైనావు!’’ నిజానికి పోలీసులంటే ఎవరు? వారూ మానవులే! శ్రామిక కుటుంబాలనించీ వచ్చిన వారే! సైనికుల లాగే, యజమానులు ఆజ్ఞాపించే ‘బలప్రయోగం’ అనే శ్రమ చేస్తూ, వచ్చిన జీతాలతో బతుకుతారు.ఈ పోలీసుల గురించి, మార్క్స్ మాటల్లో చెప్పాలంటే, ‘‘తప్పుడు సామాజిక సంబంధాల కారణంగా దోపిడీ సమాజానికి అవసరమైన అనుత్పాదక శ్రామి కులు.’’ అంటే, ‘శ్రమ దోపిడీ’ అనే తప్పుడు సామాజిక సంబంధాల వల్లే, సమాజంలో వర్గాలూ, వర్గాల మధ్య ఘర్షణలూ తలెత్తు తాయి! వాటిని నివారించడానికీ, శ్రమ దోపిడీని సాఫీగా సాగ నివ్వడానికీ నిరంకుశ ప్రభుత్వాలు, సాయుధ భటులతో అణిచి వేయడం అన్నది బానిస యజమానుల కాలం నించీ వస్తున్నదే! ఆనాటి సాయుధ భటులకు బదులుగా ఈ నాడున్నది ‘పోలీసులు’! పత్రికల్లో, ఈ వార్తలు చదివే పాఠకులు గ్రహించ వలిసింది ఏమిటంటే: ఆ నాడైనా, ఈ నాడైనా, పాలకులు, ప్రజల్లోనే వున్న రెండు భాగాలను, (వృత్తి ధర్మం పేరుతో, ఇటు పోలీసులనూ; శాంతి భద్రతల పేరుతో, అటు శ్రమ దోపిడీని అడ్డుకునే నక్సలైటు ఉద్యమకారులనూ) శత్రువులుగా నిలబెట్టి, పరస్పరం సంఘర్షించు కునేలా చేస్తారు!ఆ సంఘర్షణలో, ప్రాణాలు పోగొట్టుకునేది ఇటు పోలీసులూ, అటు ఉద్యమకారులూనూ. ఇరు పక్షాల కుటుంబాలూ ఎంతో క్షోభని అనుభవిస్తాయి! బిరుదులతోనూ, ఎవార్డులతోనూ, రివార్డులతోనూ, ఆ క్షోభని తగ్గించలేరు! అందుచేత, సమాజం బాగుపడాలని కోరుకునే ఎవ్వరైనా అనుకోవలిసింది: ‘నక్సలిజం లేని భారత్ కాదు, శ్రమ దోపిడీ లేని భారత్’ కావాలి!– అని.విమర్శకు అతీతులా?(2) ‘మరి నక్సలైట్లు అనుసరించే రాజకీయ పంథాని విమర్శించవద్దా’ అని ఎవరైనా అడగవచ్చును. తప్పులున్నప్పుడు, తప్పకుండా విమర్శించవలిసిందే! ‘మావోయిస్టులూ! మీ అంతిమ లక్ష్యం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, మంచిదే! కానీ ఎన్నెన్నో పోరా టాల తర్వాత, తప్పనిసరిగా చెయ్యవలిసి వచ్చే ‘ఆయుధాల’ పోరా టాన్ని, ప్రారంభంలోనే మొదలు పెడితే, మీది ‘వామపక్ష బాలా రిష్టమే’ అవుతుంది – అని విమర్శించవలిసిందే! దీన్ని బట్టి రాజ కీయంగా, నక్సలైట్లు ఇంకా శైశవ దశలోనే వున్నారనుకోవాలి. ఒక హిందీ కవి శిశువుల గురించి ఇలా చెపుతాడు: ‘శిశువు పడుతూ, పడుతూ, నడవడం నేర్చుకున్నాడు! శిశువు ఏడుస్తూ, ఏడుస్తూ, నవ్వడం నేర్చుకున్నాడు!’ (‘శిశూ నే గిర్ గిర్ కర్, చల్నా సీఖా! రో రోకర్, హస్నా సీఖా!). భవిష్యత్తులో ఈ ఉద్యమకారులు కూడా శిశువుల లాగే నేర్చుకుంటారని ఆశించాలి.ఏం మారిందని?(3) ఇంకో వార్త! లొంగిపోకుండా తప్పించుకు తిరిగే ఉద్యమ కారులకు, వారి తలకి కొంత వెలకట్టి, వారిని పట్టిచ్చిన వారికి కొన్ని లక్షల బహుమతీ, ఒక ఉద్యోగమూ ఇస్తామని ప్రభుత్వ ప్రక టనలు కూడా వున్నాయి. (‘ది ఎకనామిక్ టైమ్స్’, 16–4–2024). ఇలాంటి ప్రకటనలు, అమెరికాలో బానిసత్వం వున్న రోజుల్లో (1619–1865), కూడా వున్నట్టు, ‘అంకుల్ టామ్స్ కేబిన్’ నవల చెపుతుంది. ఆ ప్రకటన హెడ్డింగు: ‘25 డాలర్ల బహుమానం!’ ప్రకటన ఇలా వుంది: ‘‘అక్టోబర్ 17న బానిస ఒకడు పారిపోయాడు.పేరు యాలెన్. వయస్సు 23 సం.లు. ఎత్తు 6 అడుగులు. రంగు ములాటో. కుక్క పీకిన మచ్చలుంటాయి. లావెల్ పాంటూ, కాటన్ షర్టూ ఒంటి మీద ఉన్నాయి. బాగా చదవలేడు. చిన్న చిన్న పదాలు రాస్తాడు. చిన్న చిన్న లెక్కలు చేస్తాడు. మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఉంటాడు. తొందరగా మాట్లాడుతాడు. జైల్లో పెట్టి, నాకు తెల్పండి. ఇట్లు – చీతం, నవంబరు 6, 1852.’’ అంటే, యజమానుల కోసం పనిచేసే ప్రభుత్వాల చర్యల్లో అప్పటికీ, ఇప్పటికీ ఏదైనా తేడా వుందా? ఎప్పుడో, 175 ఏళ్ళ నాడే, ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’లో చెప్పినట్టు, ‘‘ప్రభుత్వం అనేది, పెట్టు బడిదారీ వర్గపు ఉమ్మడి వ్యవహారాలను నిర్వహించే కమిటీ మాత్రమే!’’రంగనాయకమ్మ వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి -
ఓట్ల పర్యాటకాన్ని ఆపేయాలి!
బిహార్‌లో పేరు నమోదు చేయించుకుని అక్కడ ఓటు వేసేందుకు ఢిల్లీ, హరియాణా లాంటి రాష్ట్రాల నుంచి వేలాది ఓటర్లు తరలివెళ్లినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఢిల్లీ జాబితా నుంచి తన పేరు కొట్టేయించుకుని, బిహార్‌లో నమోదు చేసుకున్నారంటూ ఇందుకు ఉదాహరణగా మార్మోగింది. ఇది నిజ మైతే, ఇది చట్టవిరుద్ధమైన ఆచారం.మీ ‘సాధారణ నివాస స్థలం’ ఏదో అక్కడే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలి. భారత ఎన్నికల చట్టాలు ఈ విష యాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయి. మీ ఇల్లు, సొంతూరి మీద మీ ప్రేమ... ఇవేవీ ఓటు హక్కు పొందడానికి అర్హతలు కావు. మీరు వాస్తవంగా నివసిస్తున్న చోటు మాత్రమే మీ సాధారణ నివాసం అవుతుంది.సాధారణ నివాసమే ప్రాతిపదికప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 19 ప్రకారం, ఒక వ్యక్తికి తను ‘సాధారణ నివాసి’గా ఉన్న నియోజక వర్గంలో మాత్రమే ఓటరుగా నమోదు చేయించుకోవడానికి అర్హత ఉంటుంది. 17, 18 సెక్షన్లు మరో రెండు నిబంధనలను జత చేశాయి. మీరు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నమోదు కాలేరు. ఒకే నియోజకవర్గంలోనూ ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదు అయ్యే వీల్లేదు. ఈ రెండు నిబంధనలూ మార్చడానికి వీల్లేనివి (నాన్–నెగోషియబుల్). ‘సాధారణ నివాసి’ అంటే ఏమిటో సెక్షన్ 20 వివరిస్తుంది. సొంత ఆస్తి ఉన్నంత మాత్రాన ఒక ప్రదేశంలో సాధారణ నివాసి కాలేరని ఇది స్పష్టం చేస్తోంది. సాధారణ నివాసం అనేది వాస్తవ ఆధారితంగా ఉంటుంది. నిరంతరం అక్కడే ఉంటున్నారా, లేదా అన్నది ప్రధానం అంటే, మీరు స్వతహాగా అక్కడ ఉంటారు, మున్ముందు కూడా అక్కడే ఉండాలనుకుంటారు. తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నా నివాస హోదా మారదు. చివరిగా, మార్పులు చేర్పులకు సంబంధించి ఏవి తప్పుడు ప్రకటనలు అవుతాయో సెక్షన్ 31 చెబుతోంది.కొత్త ప్రాంతంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వేరే చోట అప్పటికే తన పేరు నమోదై ఉన్నదనే వాస్తవం దాచిపెట్టడం క్రిమినల్ నేరం. దీనికి ఏడాది వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే వీలుంది. పని నిమిత్తమో, పర్యటనల నిమిత్తమో వేరే ప్రదేశానికి వెళ్లి తాత్కాలికంగా చిరునామాలో లేనంత మాత్రాన అక్కడి ఓటు హక్కు పోదు. అది కొన్ని వారాలు లేనందున పోయేదీ కాదు, పోలింగ్ ముందు అక్కడకు రాగానే వచ్చేదీ కాదు! ఆరు నెలల వ్యవధిని సాధారణ నివాసం కింద భారత ఎన్నికల సంఘం పరిగణిస్తుంది.వ్యూహాత్మక తరలింపులను ఆపాలి!ఓటర్లను బస్సుల్లో తరలించి వలస వెళ్లిన వారంటూ వారి పేర్లను జాబితాల్లో నమోదు చేయడం, తర్వాత ఢిల్లీ లేదా హరి యాణాలో మళ్లీ నమోదు చేయించాలని ప్లాన్ చేయడం ప్రజా ప్రాతి నిధ్యాన్ని పక్కదారి పట్టించడమే! ఆ ప్రాంతంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, నీటి సరఫరా, రోడ్లు, పోలీసు వ్యవస్థలను వినియో గించుకునే సాధారణ నివాసుల అభిమతం నియోజకవర్గ ప్రాతి నిధ్యంలో ప్రతిబింబిస్తుందని రాజ్యాంగం తలుస్తోంది. జరుగుతున్న ఈ తరలింపుల ప్రహసనం అందుకు భిన్నం.వాస్తవంగా వలస వెళ్లిన కార్మికుల, విద్యార్థుల ఓట్ల నమోదును కష్టతరం చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు చేయ వలసిందల్లా నిజమైన వలసల నుంచి వ్యూహాత్మక తరలింపులను వేరు చేయాలి. ఈ దిశగా అనుసరించదగిన అయిదు మార్గాలు: (1) నోటీసు ఇచ్చి విచారణ జరిపిన తర్వాత ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో సాధారణ నివాసం ఉండటం లేదని తేలితే ఆ వ్యక్తి పేరు జాబితా నుంచి తొలగించడానికి చట్టం ఇప్పటికే వీలు కల్పిస్తోంది. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇరుగు పొరుగువారి ప్రకటనలను తప్పనిసరిగా రికార్డ్ చేయాలి. ఇంట్లో ఉంటున్నదీ లేనిదీ ధ్రువీకరించాలి. సంతకం చేసి నివేదికలు సమ ర్పించాలి. ఈఆర్ఓలు ప్రతి కేసుపై దృష్టి సారించాలి.(2) క్రాస్–స్టేట్ డూప్లికేషన్ నివారణ: వేరొక రాష్ట్ర ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్న వ్యక్తుల నుంచి వచ్చే ఫారం6 దరఖాస్తులను ఆటోమేటిక్‌గా గుర్తించేట్లు ఈఆర్ఓ–నెట్లో తగు ఏర్పాట్లు ఉండాలి. అటువంటి అభ్యర్థనల్ని ఆమోదించే ముందు గట్టి రుజువులు (ఇటీవలి అద్దె ఒప్పందాలు, ఉపాధి/విద్య సర్టిఫి కెట్లు, యుటిలిటీ బిల్లులు) తీసుకోవాలి.(3) నేర నిరోధకత: తెలిసీ తప్పుడు ప్రకటన (‘‘నేను మరె క్కడా నమోదు కాలేదు’’) చేస్తూ ఫారమ్ 6ను దాఖలు చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం నేరం. వేళ్ల సంఖ్యలో కేసులు ఎంపిక చేసి కఠిన శిక్షలు పడేట్లు చేస్తే, అవే వేలాది హెచ్చ రికలుగా పని చేస్తాయి. లక్ష్యం సామూహిక శిక్ష కాదు, ఉద్దేశ పూర్వకంగా తప్పుదారి పట్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలియజెప్పడం!(4) ఎన్నికల అనంతరం ఆడిటింగ్: పోలింగ్ అనంతరం మూడు నెలలు గడిచాక, సున్నిత ప్రాంతాలలో ‘కొత్త ఓటర్ల‘శాంపిల్ తీసుకుని విశ్లేషించాలి. వారిలో చాలా మంది సంబంధిత ప్రాంతంలో ఎప్పుడూ లేరని తేలితే అది చర్య తీసుకోదగిన సాక్ష్యం అవుతుంది. (5) నిజమైన వలసదారుకు రక్షణ: పేదలు, నిజంగా నివా సాలు మారేవారు, వేరే ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉండేవారు తమకు అందుబాటులో ఉండే పత్రాల ద్వారా తమ ఓటు నమోదు చేయించుకోవడాన్ని సులభతరం చేయాలి. బీఎల్ఓ నిర్ధారించిన స్వీయ ధ్రువీకరణ నివాస పత్రం, యజమాని లేదా సంస్థ ఇచ్చే ధ్రువీకరణ పత్రం వంటి వాటిని అంగీకరించాలి. చివరి మాటవిస్తృత చర్చకు దారితీసిన ప్రొఫెసర్ మాటేమిటి? అతడు నిజంగా ఢిల్లీలో సాధారణ నివాసం ఉండకుండా బిహార్‌కు వెళ్లి అక్కడే వాస్తవంగా నివసిస్తూ ఉంటే, బిహార్‌లో అతడి ఓటు హక్కు నమోదు చట్టబద్ధమైనదే. అయితే, అది ఢిల్లీలో తొలగించబడి ఉండాలి. నివాసం మార్చకుండా, ఢిల్లీ జాబితాలో పేరు కొట్టేయించుకుని, బిహార్‌లో ఓటు వేయడానికి అక్కడ నమోదు చేసుకుని ఉంటే, తర్వాత ఢిల్లీ ఓటరుగా మళ్లీ నమోదు చేయించుకోవాలని ప్లాన్ చేస్తే తీవ్ర చర్యలు తీసుకోవాలి. రూల్ ఒక చిన్న వాక్యంగా చెప్పగలిగినంత సరళమైనది.మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు వేయండి. మీ తాత ముత్తాతల ఇల్లు తాళం పడిన చోట కాదు! మీ పార్టీ మిమ్మల్ని ఒక వారం పాటు ఉండమని కోరుకున్న చోట కాదు!! పోలింగ్ రోజున సుఖప్రదంగా ఉండే చోట కాదు!! సాధారణ నివాసం అనేది ఆఖరికి విద్యార్థులు, సీజనల్ కార్మికులు, నిరాశ్రయులకు కూడా ఓటరుగా నమోదు చేసుకునే వీలు కల్పిస్తుంది. ఎన్నికల ‘పర్యాటకం’ ఎప్పటికీ మంచి ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి పర్యాటకానికి ద్వారాలు మూసేయాలి.ఎస్.వై. ఖురేషి వ్యాసకర్త కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ -
ఎన్కౌంటర్ లేవనెత్తుతున్న ప్రశ్నలు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే, మరొక నలుగురు సహచరులతో సహా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జి మామిడి వలస దగ్గర అడవుల్లో నవంబర్ 18న జరిగిన ఎన్కౌంటర్లో మరణించారని పోలీ సులు ప్రకటించారు. ఉద్యమ జీవితంలో హిడ్మా కార్యకలాపాలపై చర్చ జరుగు తున్నది. హిడ్మా అంతంతో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కొన్ని సామా జిక పరిణామాలకు అంతం ఉండదు. ఒక రూపంలో అంతమైనదను కున్నది మరొక రూపంలో ప్రారంభమవుతుంది. ఒక అంతం అనేక ప్రశ్నలను లేవనెత్తి కొత్త ప్రారంభాలకు దారి తీస్తుంది. ఉద్దేశపూర్వక హత్యమొట్టమొదటి ప్రశ్న. అది నిజమైన ఎన్‌కౌంటరేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో 1969లో మొదలైన ఎన్కౌంటర్ కథనాల్లో నూటికి తొంభైæ అబద్ధాలని ఇప్పటికే సమాజానికి తేటతెల్లమ యింది. ఎన్కౌంటర్ అంటే అనుకోకుండా ఎదురుపడటం అనే భాషాపరమైన అర్థాన్ని తలకిందులు చేసి, పట్టుకొని ఉద్దేశపూర్వ కంగా చంపడం అనే అర్థాన్ని పోలీసులు స్థిరపరిచారు. ‘ఎన్కౌంటర్ చేస్తాం’ అని పోలీసులే అనడం, కొన్ని సందర్భాలలో బాధితులు కూడా ‘నేరస్థులను’ ఎన్కౌంటర్ చేయమని కోరడం చూస్తే ఆ మాట సంతరించుకున్న కొత్త అర్థం స్పష్టమవుతుంది.ఛత్తీస్‌గఢ్‌లో 2024 జనవరి 1న మొదలై వరుసగా కొనసాగు తున్న మావోయిస్టు నిర్మూలనా కార్యక్రమం నుంచి తప్పించుకోవ డానికి, లేదా ఆరోగ్య కారణాల కోసం కొందరు మావోయిస్టులు ఇతర చోట్ల తలదాచుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో విజయ వాడతో సహా కొన్ని పట్టణాలలో పెద్ద ఎత్తున మావోయిస్టుల అరెస్టులు జరిగాయి. అందులో భాగంగానే హిడ్మానూ, ఇతరులనూ పట్టుకుని, వారిని రెండు విడతలుగా కాల్చి చంపారని బలమైన అనుమానాలున్నాయి.‘హిడ్మా లొంగిపోయినా వదలం, చంపుతాం’ అని ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు గతంలో అన్నారు. కేంద్ర, రాష్ట్ర హోమ్ మంత్రులు, పోలీసు అధికారులు హిడ్మా పేరు పెట్టి మరీ హెచ్చ రికలు జారీ చేశారు. ఎన్నో హింసాత్మక ఘటనలు స్వయంగా హిడ్మా తన చేతులతో జరిపినట్టు కథనాలు ప్రచారంలో పెట్టారు. వ్యవస్థ మార్పునకు సాయుధ పోరాటం అనివార్యమనే విశ్వాసంతో, దీర్ఘ కాలిక ప్రజాయుద్ధం జరుపుతున్న, సమష్టి నిర్ణయాలతో నడిచే ఒక పార్టీ నాయకత్వంలో జరిగిన ఘటనలను అలా ఒక వ్యక్తికి కుదించడం, ఆ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడానికి, ఎప్పుడైనా భవి ష్యత్తులో ఆయనను చంపితే సమర్థన సమకూర్చుకోవడానికి మాత్రమే! అందువల్ల హిడ్మాది నిజమైన ఎన్కౌంటర్ కన్నా ఎక్కు వగా ఉద్దేశపూర్వక హత్య కావడానికే అవకాశం ఉంది. దేశ ప్రజల సమస్యరెండో ప్రశ్న. మరి అలా పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉందా? ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే, ప్రత్యేకించి అందులోని అధికరణం 21 పేర్కొన్న జీవించే స్వేచ్ఛ పట్ల గౌరవం ఉంటే ఆ అధికారం ఉండదు. చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరొక రకంగా మనిషి ప్రాణాలు తీసే హక్కు రాజ్యానికి లేదని, పౌరులందరికీ జీవించే హక్కు ఉందని చెప్పే ఆ అధికరణాన్ని ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఉల్లంఘి స్తూనే ఉన్నాయి. చట్టం నిర్దేశించిన పద్ధతి అంటే సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో విచారణ జరిపి, సహేతుకమైన సందేహాలకు తావులేని రీతిలో శిక్ష విధించడం. ఇక్కడ సాక్ష్యాధారాలు లేవు, విచా రణ లేదు, సహేతుకమైన సందేహాలు లెక్కలేనన్ని ఉన్నాయి. శిక్ష, అదీ తిరిగి మార్చడానికి వీలులేని మరణశిక్ష మాత్రం అమలైంది.మూడో ప్రశ్న. హిడ్మా మీద ప్రత్యేకంగా, ఆదివాసుల మీద మొత్తంగా ఈ దాడి ఎందుకు? సుక్మా జిల్లా మారుమూల గ్రామం పువ్వర్తిలో పుట్టి పెరిగిన ఆదివాసి యువకుడు హిడ్మా మీద ఎక్కు పెట్టిన ఈ దాడి, గతం నుంచీ ఆదివాసుల మీద మొత్తంగా సాగు తున్న దాడులలో భాగమే. దండకారణ్య ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న అపార ఖనిజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే పథకంలో భాగంగా, పాలకులు ఆదివాసులను భయోత్పాతంలో ముంచి, వారి ఆవాసాల నుంచి బేదఖలు చేయదలచు కున్నారు. ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులను నిర్మూలించి, అడవిలో, కొండల్లో ఉన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహం రెండు మూడు దశాబ్దాలుగా సాగుతున్నది. దానికి అడ్డుగా ఉన్నారనే హిడ్మాను, జల్ జంగల్ జమీన్ ఆకాంక్షను, విప్లవోద్య మాన్ని నిర్మూలించదలచారు. అంటే ఇది ఆదివాసుల సమస్యో, మావోయిస్టుల సమస్యో కాదు, ఈ దేశ ప్రజల సమస్య, ఈ దేశ భవిష్యత్తు సమస్య. పోరాట ధార ఆగేదా?నాలుగో ప్రశ్న. హిడ్మా విషయంలో ప్రభుత్వ ప్రచారం గెలి చిందా, ఓడిందా? హిడ్మాను ఎంత భయంకరుడిగా చూపడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వచ్చినా, ఆయన హత్య తర్వాత వెల్లు వెత్తుతున్న నిరసన, పువ్వర్తిలో ఆయన అంత్యక్రియలకు వేలాది మంది హాజరై ఘన నివాళి అర్పించడం ఆయన ఆదివాసుల హృద యాల్లో ఎటువంటి స్థానం సంపాదించాడో చూపుతున్నది. ఆదివా సుల గూడాలు తగుల బెడుతూ, విచ్చలవిడిగా హత్యలు, అత్యాచా రాలు చేసిన సాల్వా జుడుమ్ దుర్మార్గాన్ని క్రియాశీలంగా ఎదు ర్కొన్న నాయకులలో ఒకరుగా ఆదివాసులలో ఆయనకు చెరగని స్థానం ఉంది. దాదాపుగా అన్ని ఆదివాసీ సమూహాల భాషలూ ధారాళంగా మాట్లాడుతూ వారికి తలలో నాలుక అయ్యాడు గనుక ఆయన పట్ల అపార గౌరవం ఉంది.ఐదో ప్రశ్న. హిడ్మా అంతంతో ఉద్యమం అంతమవుతుందా? ఆదివాసులకు నవంబర్ 18 వరకూ సజీవంగా నాయకత్వం వహించిన మాడ్వి హిడ్మా, ఆనాటి నుంచీ వందలాది ఆదివాసీ అమర పోరాట యోధుల చారిత్రక జాబితాలో చేరాడు. కానూ, సిద్ధూ, వీరనారాయణ సింగ్, బిర్సా ముండా, తిలక్ మాంఝీ, రాంజీ గోండు, గుండాధుర్, కొమురం భీమ్ వంటి ఉత్తేజకర, స్ఫూర్తి దాయక జాబితా అది. వాళ్లకు, వాళ్ల స్ఫూర్తికి మరణం లేదు. మొదట బ్రిటిష్ వలసవాదుల మీద, మైదాన ప్రాంతాల దోపిడీదారుల మీద, భూస్వాముల మీద, ఆ తర్వాత ‘అభివృద్ధి’ పేరుతో జల్ జంగల్ జమీన్ కొల్లగొట్టి తమను నిర్వాసితులను చేసిన ప్రభుత్వాల మీద ఆదివాసుల పోరాటాలు మూడు శతాబ్దాలుగా జరుగుతున్నాయి. దోపిడీ, పీడనలు ఉన్నంతవరకూ ఆ పోరాట ధారకు అంతం ఉండదు. ఎన్. వేణుగోపాల్వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు – ‘వీక్షణం’ ఎడిటర్ -
నితీశ్ కుమార్ (బిహార్ సీఎం) రాయని డైరీ
ఈ ప్రాణబంధం ఏమిటో అర్థం కాకుండా ఉంది. 74 ఏళ్ల వయసులో 10వ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా, నా 26వ ఏట తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన రోజు నాలో ఉన్నప్పటి ఆ కొత్త లోతైన ఆనందపు అనుభూతే నేటికీ పరవళ్లు తొక్కుతూ ఉంది! ఆ మాటే విజయ్ చౌధరీతో అన్నాను.‘‘పరవళ్లు తొక్కటం మంచి విషయం నితీశ్‌జీ. అయితే, ఆ పరవళ్లు పక్కనున్న వాళ్ల కాళ్లను తొక్కేస్తున్నాయేమో కాస్త గమనించుకుంటూ ఉండాలి’’ అన్నారాయన, నవ్వుతూ. ‘‘అయ్యో, సారీ విజయ్! మీ కాలును తొక్కేశానా?’’ అన్నాను నవ్వుతూ.‘‘లేదు నితీశ్‌జీ, మీరు నా కాలును తొక్కలేదు. గాంధీ మైదాన్ వేదిక పైన మీ పక్కనున్న మోదీజీ కాలును తొక్కినంత పని చేశారు! మీకై మీరు మీ చేత్తో ఆయన చేతిని గాల్లోకి లేపకుండా, ఆయనకై ఆయనే ఆయన చేత్తో మీ చేతిని గాల్లోకి లేపేవరకు మీరు ఆగవలసింది’’ అన్నారు విజయ్.మోదీజీ చేతిని పట్టుకుని బలవంతంగా పైకెత్తటం అంటే మోదీజీ కాలును చూసు కోకుండా తొక్కేయటమేనని ఆయన బలంగా విశ్వసిస్తున్నట్లు నాకు అర్థమైంది.వయసులో ఏడేళ్లు చిన్నవాడే అయినా, సూక్ష్మాన్ని పట్టుకోవటంలో నా కంటే పెద్దవాడు విజయ్ కుమార్ చౌధరీ. పార్టీలో విజయ్ నా సన్నిహితుడు, మంత్రి వర్గ సహచరుడు. విజయ్‌లాగే రామచంద్ర ప్రసాద్ సింగ్ అనే మరొక సన్నిహితుడు కూడా ఉండేవారు. ఆయన నా ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా! ఇప్పుడు లేరు.విజయ్ నాకు లెఫ్ట్‌లో ఉంటే, రామచంద్ర నాకు రైట్లో ఉండేవారు. రెండేళ్ల క్రితం కేంద్ర మంత్రి పదవి కోసం రామచంద్ర రైటిస్టుగా మారి, బీజేపీలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి కూడా వెళ్లిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ సొంత పార్టీని కూడా తీసుకెళ్లి ప్రశాంత్ కిశోర్ పార్టీలో కలిపేసుకున్నారు. చివరికి ఆయన ఏమయ్యారో తెలీదు! లెఫ్ట్–వింగ్‌లోని వాళ్లు రైట్–వింగ్‌లోకి వెళ్లటంలో తప్పేమీ లేదు. కానీ, రైట్ టైమ్‌లో వెళ్లాలి. రైట్ టైమ్‌లో వెనక్కి వచ్చేయాలి. అది తెలుసుకున్నట్లు లేరు రామచంద్ర. తొలిసారి నేను 2000లో ఎన్డీయేతో కలిశాను. మాటా మాటా వచ్చి, ఏడు రోజుల తర్వాత ఎన్డీయేలోంచి వచ్చేశాను. రెండోసారి 2005లో ఎన్డీయేలోకి వెళ్లాను. 2013లో ఎన్డీయే నుంచి బయటికి వచ్చాను. 2017లో మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లాను. తిరిగి 2022లో ఎన్డీయేలోంచి వచ్చేశాను. 2024లో మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లాను.అవసరమైతే ఇప్పటికిప్పుడైనా, ఎన్డీయేలోంచి బయటికి వచ్చేయగలను నేను. ప్రజల కోసం ఎన్నిసార్లైనా వెళ్లి, ఎన్నిసార్లైనా వెనక్కు వచ్చేయాల్సిందే. ఎంత మందితో ఎన్ని మాటలైనా అనిపించుకోవలసిందే!శరద్ యాదవ్ నన్ను ‘ఫాల్తూ’ మనిషి అనేవారు. లాలూజీ నన్ను ‘పల్టూ రామ్’ అని అంటుంటారు. మీడియా నన్ను ‘సుశాసన్ బాబు’ అంటుంది. ఈ పేర్లేవీ నన్ను పైనుంచి పడేసేవీ, రథమెక్కించి ఊరేగించేవీ కాదు. ప్రజా జీవితం ఒక పేరుతో ముగిసిపోయేదీ, ఒక టెర్మ్తో తీరిపోయేదీ కాదు.‘నితీశ్‌జీ... కేబినెట్లో ఉప ముఖ్యమంత్రులు ఇద్దరే ఎందుకు ఉండాలి? నలుగురు ఉండొచ్చు కదా అని మనవాళ్లు అడుగు తున్నారు’’ అన్నారు విజయ్. ఇప్పుడున్న ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు బీజేపీ వాళ్లు. జేడీయు నుంచి కూడా ఇద్దరు ఉండాలని పట్టుబడితే... ‘మొత్తం నలుగురూ మీవాళ్లనే ఉప ముఖ్యమంత్రులుగా ఉండ నివ్వండి. సీఎం పోస్టు ఒక్కటీ మాకు ఇవ్వండి’ అని మోదీజీ అనొచ్చు. బీజేపీకి వచ్చినవి 89. జేడీయూకు వచ్చినవి 85.ఇరవై ఏళ్లుగా బిహార్‌లో బీజేపీ పవర్లో లేదు. ఇరవై ఏళ్లుగా బిహార్‌లో బీజేపీ లేకుండా పవరూ లేదు! ‘‘ఇప్పుడు కాదులే విజయ్’’ అన్నాను.‘మరెప్పుడు?’ అన్నట్లేం చూడలేదు విజయ్.-మాధవ్ శింగరాజు -
అడవిలోకి రానురానంటూ మొరాయింపు
ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారని అంటారు. బిర్యానీ రుచిమరిగాక ముక్క లేకపోతె ముద్ద దిగనివాళ్లుంటారు. రోజూ పెగ్గు లేకుంటే నిద్రపట్టని బాబులు ఎందరో! చాకోలెట్లకు అలవాటు పడి .. అది ఇస్తే తప్ప బడికి వెళ్ళను అని మొరాయించిన స్కూలు పిల్లలు కోకొల్లలు.. చెరువుగట్టున కుప్పలుగా దొరికే చేపలకు అలవాటు పడి ఇంకోచోటుకు కదలని కొంగలు కూడా కుప్పలు తెప్పలు.. ఇదంతా ఒకెత్తు. అడవిలో ఠీవీగా నడుస్తూ అమాయకంగా కదిలే జింకలు, లేడి పిల్లలను ఒక్క జంపింగుతో పట్టుకుని తుప్పల్లోకి ఈడ్చుకెళ్లే చిరుతలు ఇప్పుడు బద్ధకిష్టులుగా మారిపోయాయి. ఒళ్ళు విరుచుకుని ‘‘అబ్బా మటన్ వద్దమ్మా.. నాకు నచ్చడం లేదు’’ అని వెక్కి రిస్తున్నాయి. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుగా మారాయి. మాంసం వద్దు.. తియ్యని చెరుకు గడలు ముద్దు అంటూ చేరుకుతోటల్లో అల్లరి చేస్తున్నాయి. ఎలా వచ్చాయో.. ఎక్కణ్ణుంచి వచ్చాయో కానీ అడవుల్లోంచి దారితప్పిన కొన్ని చిరుతలు(డజనుకు పైనే ఉన్నాయి) పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఊళ్లలోకి వచ్చేసాయి. అక్కడి చెరకు తోటల్లో తిష్టవేసి మెల్లగా చెరకు తీపి రుచిమరిగాయి. రోజూ చెరుకుగడలు తింటూ అదే తోటల్లో నివాసం ఉంటూ. ఇక అడవుల్లోకి పోవడం ఎందుకు.. ఇక్కడే ఉందాం.. చెరుకు తిందాం అనే స్థితికి వచ్చేశాయి. కొన్నాళ్లుగా వేటను సైతం మర్చిపోయిన ఈ చిరుతలు ఇంకా చెంతకు తోటల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వీటిని మళ్ళీ అడవుల్లోకి పంపడానికి ఫారెస్ట్ అధికారులు తిప్పలు పడుతూ.. ఏదోలా పట్టుకుని ఇక ఇవి అడవికి పనికిరావని నిర్ధారించుకుని జూ పార్కులకు తరలిస్తున్నారు. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుటైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, బీజ్నోర్ నుంచి హరిద్వార్ వరకూ ఉన్న చెరుకు పొలాలు చిరుతల శాశ్వత ఆశ్రయాలుగా మారిపోయాయి. గత నాలుగేళ్లలో బీజ్నోర్‌లో పట్టుబడ్డ వాటిల్లో 40 చిరుతలను తిరిగి అడవుల్లోకి పంపలేక అక్కడే వదిలేశారు. ఉత్తరాఖండ్‌లో 2021 తర్వాత 96 చిరుతలను రక్షించారు. వాస్తవానికి ఈ చిరుతలు ఫారెస్ట్ అధికారులు ఏదోలా పట్టుకుని రికార్డు ఉంది. రాజాజీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచినా, రేడియో కాలర్లు పెట్టిన చిరుతలు మళ్లీ 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి అదే చెరుకు పొలాలకు తిరిగి చేరుతున్నాయి.ఒకప్పుడు అడవుల్లో.. చిత్తడి నేలల్లో కనిపించే చిరుతల పాదముద్రలు ఇప్పుడు పొలాల్లో కనిపిస్తున్నాయి. ఏళ్ళ తరబడి చెరకు తినడం.. వేటను మర్చిపోవడంతో ఇప్పుడు చిరుతలు ఒబేసిటీతో ఉన్నాయని అధికారులు అంటున్నారు. చిరుతల నడుము వెడల్పైపోవడం, వేట చేయకపోవడంతో గోళ్లు పదును కోల్పోవడం, వాటిలో వేట స్వభావం మందగించడాం వంటివి అధికారులు గుర్తించారు.చిరుతలు తరుముతున్న పులులువాస్తవానికి పులి తానూ తిరుగాడే అటవీ ప్రాంతంలో వేరే క్రూరజీవిని ఉండనివ్వదు. ఇక రాజాజీ, అమంగఢ్ వంటి రిజర్వుల్లో పెరుగుతున్న పులుల జనాభా చిరుతలను అడవుల నుంచి బయటకు గెంటేస్తోంది. అమంగఢ్లో పులుల సంఖ్య పదేళ్లలోనే 12 నుంచి 34కి పెరిగింది. ఈ పెరుగుదల చిరుతలు అక్కణ్ణుంచి వేరేచోటకు వెళ్లిపోవడానికి కారణమైంది.చెరుకుతోటలు ఎందుకు మేలంటే?చిరుతలు తిరుగుతున్నా శబ్దం బయటకు వినిపించదు. అదక్కడ ఉన్నట్లు ఎవరికీ కనిపించదు. జనావాసాలకు దూరంగా పొలాల్లో సురక్షితమైన ఆవాసం దొరికినట్లు చిరుతలు భావించడం.. నిత్యం తినడానికి తియ్యని చెరకు గడలు లభిస్తుండడం వలన చిరుతలు వాటికి అలవాటుపడిపోయి ఇక అక్కణ్ణుంచి కదలడం లేదు. ఇక 2023 జనవరి నుంచి ఇప్పటివరకు, బీజ్నోర్ జిల్లాలో మాత్రమే 35 మంది చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలావరకు ఘటనలు ఊళ్లలో.. చెరకు పొలాల్లో ఈ చిరుత దాడులు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 80 గ్రామాలను “అత్యంత ప్రమాదకర ప్రాంతాలు”గా గుర్తించారు. అంతేకాకుండా నిత్యం చెరకు తినడం.. అక్కడే నివాసం ఉండడంతో వాటి బరువు కూడా దాదాపు 85 కిలోలకు చేరుకుందని మాజీ బీజ్నోర్ DFO సలీల్ శుక్లా అన్నారు. .. వాటిని అడవుల్లో వదిలేస్తున్నా.. మళ్ళీ వచ్చేస్తున్నాయని అయన అన్నారు..:::సిమ్మాదిరప్పన్న -
శాస్త్ర స్వతంత్రతకు గొడ్డలిపెట్టు
నూరేళ్ల కింద పి.సి.మహాలనోబిస్ స్థాపించిన ఐఎస్ఐని కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. సంస్థ ప్రెసిడెంట్, డైరెక్టర్, అకడెమిక్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎన్నికల ద్వారా కాకుండా, నేరుగా నియమించే ప్రయత్నం చేస్తోంది. ఇది వ్యవస్థల నిర్మాణాన్ని, స్వాతంత్య్రాన్ని బలి చేయడమే.దేశ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో అనూహ్యమైన, విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీజే అబ్దుల్ కలామ్ లాంటి శాస్త్రవేత్తను తమ ‘ఫెలో’గా చేర్చుకునేందుకు నిరాకరించిన జాతీయ సైన్స్ అకాడమీ ఇప్పుడు పారిశ్రా మిక వేత్త ముకేశ్ అంబానీకి ఆ హోదా కల్పించింది. ఇప్పటివరకూ ఈ సభ్యత్వం విద్య, పరిశోధన రంగాల్లో అద్భుత మైన రాణింపు ఉన్న వారికి మాత్రమే దక్కేది.ఢిల్లీలోని ఓ అగ్రశ్రేణి సంస్థ ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేక పోయినా కేవలం అక్కడి ప్రభుత్వ కోరిక తీర్చేందుకు వాయు కాలు ష్యాన్ని తగ్గిస్తామన్న మిషతో కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం చేసింది. వనరులు లేకపోవడం కారణంగా సైకిల్‌పై రాకెట్లు మోసు కెళ్లారని దేశ అంతరిక్ష రంగానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ని ఓ కేంద్ర మంత్రి అగౌరవపరిచారు. ఎందుకు? అంత రిక్ష రంగంలో సాధించిన ఘనతలన్నింటికీ 2014 తరువాత మోదీ ప్రభుత్వం అందించిన సహకారమే కారణమన్న వాదనకు బలం చేకూర్చేందుకు! ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివని అనిపించవచ్చు గానీ... శాస్త్ర పరిశోధన సంస్థలు ఒక్కటొక్కటిగా తమ స్వతంత్రతను కోల్పోతున్నాయనేందుకు మచ్చుతునకలు. కొన్నింటిని బలవంతంగా లొంగదీసుకుంటే... మిగిలినవి స్వచ్ఛందంగా చేతులెత్తేశాయి.ప్రధాని మాటనే కాదన్న ఇస్రోప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాన్ని కూడా కాదనే ధైర్యం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కనబరచడం గతకాలపు మాట గానే మిగిలిపోనుంది. 1980లో సోవియట్ యూనియన్ ప్రయోగంలో భారతీయ వ్యోమగామిని భాగం చేయాలని ఇందిర కోరితే, ‘ఇస్రో’ దాన్ని తన బలమైన వాదనతో తిరస్కరించింది. ధిక్కారం కాదది. దేశ ప్రజలకు మరింత ఎక్కువ ఉపయోగపడే ఉపగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నందున మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు వనరులను ఖర్చు చేయలేమని చెప్పడం! ప్రధాని ఇందిర కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఆ దశలోనే ఇందిర భారత వ్యోమ గామిని అంతరిక్షంలో పెట్టే బాధ్యతను భారతీయ వాయుసేనకు అప్పగించింది. దీని ఫలితమే 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లడం! కాగితంపై ‘ఇస్రో’ ఇప్పటికీ స్వతంత్ర సంస్థే. కానీ సంస్థ వ్యవస్థాపకుడిని కేంద్ర మంత్రి ఒకరు అగౌరవపరిచినా సరిదిద్దలేని స్థితికి చేరింది. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) పరిస్థితి కూడా ఇంతే. దశాబ్దాలుగా ఆర్థిక సాయం పొందుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అదుపాజ్ఞల్లోకి చేరింది మాత్రం ఇటీవలే. జన్యు మార్పిడి ఆహారం వివాదం 2010లో పతాక స్థాయిలో ఉన్నప్పటికీ ఈ సంస్థ రెండు ఇతర సైన్స్ అకాడమీలతో కలిసి ప్రభుత్వ అభి లాషకు భిన్నంగా స్పష్టమైన వైఖరి కనబరిచింది. జన్యుమార్పిడి పంటల భద్రత, మానవ ఆరోగ్యంపై వాటి ప్రభావాలపై క్షుణ్ణమైన అధ్యయనం జరిగి తీరాల్సిందేనని భీష్మించింది.2018లో కేంద్ర మంత్రి ఒకరు డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఎగతాళి చేసిన సందర్భంలో కూడా ఐఎన్ఎస్ఏ, ఇతర సంస్థలు దాన్ని తీవ్రంగా ఖండించాయి. బోధనాంశాల నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొల గించాలన్న మంత్రిగారి ఆలోచనను తప్పుబట్టాయి. ఈ రెండు సందర్భాల్లోనూ ఈ సంస్థలు సైద్ధాంతిక వైఖరికి కట్టుబడ్డాయి. తమ స్వతంత్రతపై దాడిని సమర్థంగా ఎదుర్కొన్నాయి.శాస్త్రవేత్తలు కానివారికి సభ్యత్వమా?ప్రస్తుతానికి వస్తే.... శాస్త్రవేత్తలు కాని పారిశ్రామికవేత్తలకు కూడా సభ్యత్వం ఇవ్వడం అవసరమని ఐఎన్ఎస్ఏ ఒక అంచనాకు వచ్చింది. సభ్యత్వం ఇవ్వడం కాకుండా... పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు కలిసి పనిచేసేందుకు అనువైన కార్యక్రమాలను రూపొందించి ఉంటే, వేదికలను ఏర్పాటు చేసి ఉంటే మరింత మెరుగ్గా ఉండేది. ప్రపంచంలో ఏ శాస్త్ర పరిశోధన సంస్థ కూడా తమ రంగంలో తగిన అర్హతలు లేనివారికి సభ్యత్వం కట్టబెట్టదు. సత్యేన్ బోస్, మేఘనాథ్ సాహా, హోమీ జహంగీర్ భాభా, శాంతి స్వరూప్ భట్నాగర్ వంటి దిగ్గజ శాస్త్రవేత్తల పక్కన ఇప్పుడు అంబానీకి చోటు కల్పిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా అన్ని సైన్స్ అకాడమీలకు మార్గదర్శకంగా భావించే సంస్థ లండన్‌లోని ‘ద రాయల్ సొసైటీ’. ఇది కూడా శాస్త్రవేత్తలు కానివారు, అంటే పారిశ్రామిక రంగంలో పరిశోధనలు చేసేవారికి సభ్యత్వం ఇస్తుంది. అయితే, ఆ యా రంగాల్లో జ్ఞానాభివృద్ధికి వారు తగినంత కృషి చేసి ఉండాలి. ఈ నేపథ్యంలోనే కొందరు పారిశ్రామిక వేత్తలకు ఐఎన్ఎస్ఏ సభ్యత్వం ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. కన్ను ఇప్పుడు గణాంక సంస్థపై..కేంద్రం దృష్టి ప్రస్తుతం కోల్‌కతాలోని ఐఎస్ఐ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్)పై ఉంది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ వందేళ్ల క్రితం స్థాపించిన ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యక్ష అధీనంలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. గణితం, గణాంక శాస్త్రం, అప్లైడ్ సైన్సెస్‌లో ఎన్నదగ్గ పరిశోధనలు చేసిన సంస్థ ఇది. పరిపాలన వ్యవహారాలన్నీ తనంతట తాను నిర్వహించుకుంటుంది. లాభాపేక్ష లేని సంస్థ. అలాంటి ఐఎస్ఐ సొసైటీని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఒక బోర్డుకు అప్పగించాలని కొత్త బిల్లు ప్రతిపాదిస్తోంది. సంస్థ ప్రెసి డెంట్, డైరెక్టర్, అకడెమిక్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎన్నికల ద్వారా కాకుండా, నేరుగా నియమించే ప్రయత్నం చేస్తోంది.ఐఎస్ఐకి చెందిన స్థిరచరాస్తులన్నింటినీ కూడా ఈ బోర్డు తన స్వాధీనంలోకి తీసుకుంటుందని బిల్లు స్పష్టం చేస్తూండటం గమనార్హం. ఇది విద్యా సంస్థల స్వతంత్రతపై దాడే! వ్యవస్థల నిర్మాణాన్ని, స్వాతంత్య్రాన్ని బలి చేయడమే!! సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి ఏదో గుప్తమైన ఆలోచన కాదు. బోధనాంశాలపై చర్చలు జరిపి మరింత ప్రభావశీలం చేసేందుకు అవకాశం కల్పించేది. విద్యా ప్రమాణాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.అలాంటి ఈ వ్యవస్థకు బదులుగా ఢిల్లీ బ్యూరోక్రాట్ల అజమాయిషీ పెట్టడం బోధనాంశాల నాణ్యత, స్వతంత్రతకు గొడ్డలిపెట్టు. 1959 నాటి చట్టం పరిధిలో పనిచేసే ఐఎస్ఐ సొంతంగా డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేయగలదు. కొత్త బిల్లులో ఈ అంశం ప్రస్తావన లేదు. ఐఎస్ఐకి బదులుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనే పట్టాలిస్తుందన్న అను మానాలు కలుగుతున్నాయి. తద్వారా ఇది దేశంలోని అనేక ఇతర విద్యాసంస్థల్లో ఒకటిగా మాత్రమే మారిపోనుంది. విద్యావేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా స్వేచ్ఛగా ఆలోచించేందుకు అకడమిక్ ఫ్రీడమ్ అన్నది ఎంతో కీలకం.ప్రశ్నించడం, భయం, విమర్శలకు బెదరకుండా భావాలను వ్యక్తం చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. పరిశోధనలు, బోధన తాలూకూ సమగ్రతను కాపాడుతుంది. పొలిటికల్, బ్యూరోక్రటిక్, కార్పొరేట్ సంస్థల ప్రమేయం, ప్రభావాలను తొలగించేందుకు వ్యవస్థాగతమైన స్వాతంత్య్రం అవసరం. ఇది కాదని... పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రమన్నట్టు వ్యవహరిస్తే... శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న స్థానానికే చేటు కలిగే ప్రమాదం ఉంది.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
నిఠారీ కేసులో బాధితులకే శిక్ష!
ఇరవై ఏళ్ల నాటి నిఠారీ వరుస హత్యల కేసులో నిర్దోషి త్వాల తీర్పు భారత నేర దర్యాప్తు వ్యవస్థలోని వైఫల్యాలను బట్టబయలు చేసింది. 16 మంది మహిళలు, పిల్లల హత్య కేసులో నిందితుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 11న చెప్పిన తీర్పుతో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే!యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ నోయిడా(ఉత్తరప్రదేశ్)లోని నిఠారీ గ్రామంలో డ్రైనేజీలో మానవ అవశేషాలు బయటపడి దాదాపు ఇరవై ఏళ్లు గడచిన తర్వాత కూడా, ఏ ఒక్కరూ దోషిగా నిర్ధారణ కాలేదు. 16 మంది మహిళలు, పిల్లల ‘నిఠారీ’ హత్య కేసులో నింది తుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ‘నేర న్యాయ’ వ్యవస్థలోని దారుణ వైఫల్యాలను బట్టబయలు చేసింది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే.కీలక ఆధారాలు లేకపోవడం వల్లే... 2006 చివర్లో నిఠారీ గ్రామ సమీపాన 31వ సెక్టార్లో మురుగు కాల్వల పూడిక తీస్తుంటే దిగ్భ్రాంతికరమైన దారుణాలు వెలుగు చూశాయి. అంతకంటే ముందు, డి–5, డి–6 ఇళ్ల మధ్య ఒక చెయ్యి కనబడింది. క్రికెట్ ఆడుతున్న కుర్రాడు దాన్ని చూశాడు. అదే ఏడాది డిసెంబర్లో ఈ బంగ్లాల వెలుపల ఉన్న డ్రెయిన్‌లో మట్టి తొలగించడంతో అక్కడ అనేక పుర్రెలు, ఎముకలు, పీలికలైన పిల్లల దుస్తులు, చిన్ని చిన్ని చెప్పులు దొరికాయి.డి–5 ఇంట్లో పనిచేసే సురేంద్ర కోలీ అనే వ్యక్తి, ఇంటి యజమాని, వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పంఢేర్ ఈ మారణకాండకు బాధ్యులని పోలీసులు అనుమానించారు. పోలీసుల కథనం ప్రకారం – పిల్లలను, ఆడవారిని కోలీ ప్రలోభపెట్టి ఇంటికి రప్పించే వాడు. తర్వాత వారిని హత్య చేసేవాడు. కొన్నిసార్లు హతుల శరీర భాగాలను తిన్నాడు కూడా! ఈ అకృత్యాల్లో పంఢేర్ భాగస్వామి. భయానకమైన ఈ హత్యల కేసులో స్థానిక పోలీసుల విచారణ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ దర్యాప్తులో భాగంగా ఇంటి మేడ పై భాగంలో నీళ్ల ట్యాంకు కింద దాచిన ఓ కత్తిని పోలీసులు ‘స్వాధీనం’ చేసుకున్నారు.ఇది, ఇంకా అనేక వస్తువులు వారికి దొరికాయి. ఇవే వారి దర్యాప్తులో ‘కీలక ఆధారాలు’. వీటి ఆధారంగా వారు రూపొందించిన కథనాలను కోర్టులు విశ్వసించలేదు. దీంతో 2007 జనవరిలో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు. సీబీఐ సైతం స్థానిక పోలీసులు చేసిన తప్పిదాలనే పునరా వృతం చేసింది. కొన్ని వారాల తరబడి కస్టడీలో ఉంచి రికార్డు చేసిన కోలీ నేరాంగీకార పత్రం మీదే సీబీఐ అధికారులు ఆధారపడ్డారు. వారు రికవర్ చేసిన ఆధారాలు నమ్మదగినవిగా లేవు. కోలీ, పంఢేర్ ప్రమేయాన్ని నిరూపించగల సరైన ఫోరెన్సిక్ లింకులను కూడా సంపాదించలేక పోయారు.స్థానిక పోలీసుల మీద ఆధారపడకుండా మళ్లీ మొదటి నుంచి సొంత దర్వాప్తు చేయడంలో సీబీఐ విఫలమైంది. నేరాంగీకారాలు, రికవరీలు, ఆధారాలను అటూయిటూ చేసి... మోపిన 13 కేసుల్లోనూ వాటినే కోర్టుల ముందుంచారు. కాబట్టే, పై కోర్టులు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి వాటన్నిటినీ కొట్టేశాయి. నేరాంగీకార పత్రాలు, నేరాలకు సంబంధించిన రికవ రీలు అన్నీ అంతకు ముందు కొట్టేసిన ఇతర కేసుల్లో ఉన్నట్లే ఏ మాత్రం తేడా లేకుండా ఈ కేసులోనూ ఉన్నాయని సుప్రీంకోర్టు తాజాగా నవంబర్ 11 నాటి తీర్పులో గుర్తించింది.మరి నేరస్థులు ఎవరు?తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రుల విషయానికి వస్తే, వారి పాత గాయాలు ఈ తీర్పుతో మళ్లీ రేగాయి. 2005లో తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది ఈ బాధితులే! డి–5 ఇంటి ముందు తొలుతగా నిరసన చేసింది వీరే. న్యాయస్థానంలో చివరి దాకా పోరా డింది కూడా వీరే. చివరకు కోర్టు తీర్పుతో తమ పిల్లలను ఎవరూ చంపలేదన్న ‘న్యాయపరమైన వాస్తవం’ వారిని వెక్కిరిస్తోంది. ఏళ్ల తరబడి సుదీర్ఘంగా దర్యాప్తు జరిగినప్పటికీ, నిజమైన ద్రోహులెవరో నిరూపణ కాకపోవడం పట్ల న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసి వారి బాధను గుర్తించింది. నిర్లక్ష్యం వహించి, అసాధారణ జాప్యం చేసి నిజనిర్ధారణ ప్రక్రియ పట్ల విశ్వాసం సన్న గిల్లేలా చేశాయంటూ దర్యాప్తు సంస్థలను తప్పు పట్టింది. అవయ వాలతో వ్యాపారం చేసే ముఠాల ప్రమేయం వంటి కొత్త కోణాల నుంచి దర్యాప్తు చేపట్టలేక పోయాయని నిందించింది.నిఠారీ కేసు నిర్దోషిత్వాల తీర్పులు భారత నేర దర్యాప్తు వ్యవస్థకు సోకిన రోగం లక్షణాలను కళ్లకు కట్టాయి. ప్రతి స్థాయి లోనూ వ్యవస్థ విఫలమైంది. స్థానిక పోలీసులు క్రైమ్ సీన్‌ను పరిరక్షించలేకపోయారు. సరైన ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించలేక పోయారు. ఈ లోపాలను చక్కదిద్దడంలో సీబీఐ విఫలమైంది. కొత్త కోణాలను గుర్తించలేక పోయింది. న్యాయ పరీక్షకు నిలబడేలా పకడ్బందీ వాదనలు చేయడంలో ప్రాసిక్యూటర్లు విఫలమయ్యారు. బాధితుల ఘోర విషాదాన్ని వ్యవస్థల ప్రహసనంగా మార్చి, ప్రభుత్వం వారికి తీవ్రమైన నిరాశ కలిగించింది.సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కోలీ జైలు నుంచి బయటకు వచ్చాడు. పంఢేర్ ఇప్పటికే నేర విముక్తుడు. న్యాయస్థానం చట్టాలకు లోబడి వ్యవహరించింది. తిరుగులేని రుజువులు ఉంటే తప్ప కోర్టు శిక్ష విధించలేదు. తమ పిల్లల మసకబారిన పాత ఫొటోలను పట్టు కుని ఆ తల్లిదండ్రులు క్షోభపడుతూ ఉంటే, న్యాయం అమూర్తంగా మారిపోయింది. నిఠారీలో చట్టం తన చివరి మాటను చెప్పేసింది. ఇక మిగిలింది నిశ్శబ్దమే! అది చెవులు పగిలిపోయేంత కఠోరంగా ఉంది.-ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త లీగల్ అంశాల జర్నలిస్ట్(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పంజరం లేని పెంపుడు చిలక
వివిధ రంగాల్లోకి కృత్రిమ మేధ (ఏఐ) చొచ్చుకొస్తున్న వేళ... సురక్షితంగా, బాధ్యతాయుతంగా దాన్ని వినియోగించేందుకు వీలుగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఇటీవల ‘భారత ఏఐ గవర్నన్స్ గైడ్‌లైన్స్’ను ప్రకటించింది. ఇంతకీ ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడున్న చట్టాల పరిధిలోనే ఏఐతో వచ్చే ఇక్కట్లను సైతం ఎదుర్కోవాలని చూస్తున్న ఈ మార్గదర్శకాల వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏఐని మరీ పంజరంలో చిలకగా చేయకూడదన్న మాట నిజమే కానీ, డేటా ప్రైవసీ సహా అనేకఅంశాలపై ఆందోళన తీరేదెలా?ఇప్పుడేం జరిగింది?శరవేగంతో దూసుకొస్తున్న ఏఐ టెక్నాలజీల విష యంలో ప్రపంచ దేశాలన్నీ హడావిడిగా చట్టాలు చేసేస్తుంటే, మన దేశంలో ప్రత్యేకమైన చట్టమంటూ ఇంకా ఏమీ లేదు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలనుకుంటున్న ప్రభుత్వం ఈ పరిస్థి తుల్లో ఆచరణాత్మక దృక్పథంతో ఒక అడుగు వేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ‘ఇండియా ఏఐ గవర్నన్స్ గైడ్‌లైన్స్’ నివేదికను తయారుచేసి, అందించింది. ఏఐపై నియంత్రణ కన్నా సమన్వయా నికి ప్రాధాన్యమివ్వడం 66 పేజీల ఈ బ్లూ ప్రింట్ ప్రత్యేకత.ఏఐతో ఒనగూడే లాభాలనూ, ఎదురయ్యే కష్టనష్టాలనూ సమతూకం చేస్తూ దేశ పరిస్థితులకు తగ్గట్టు ఇందులో మార్గదర్శకాలను సిద్ధం చేశారు. ఏఐపై అతిగా కట్టుదిట్టాలు పెట్టి, సృజనశీలురనూ, మదుపరులనూ ఇరుకునపెట్టరాదనే భావనతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. నిజానికి, గతంలోనే ఓ సబ్ కమిటీ ఒక ముసాయిదా సిద్ధం చేసింది. అయితే, ఆ తర్వాత సదరు సబ్ కమిటీతో సంబంధం లేకుండా మొన్న జూలైలో మంత్రిత్వ శాఖ వేసిన కమిటీ తాజా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఈ పత్రం ఏం చెబుతోంది?ఇవాళ ప్రపంచంలోనే ఛాట్ జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎంలు)ను అమెరికా తర్వాత అత్యధికంగా వాడుతున్న దేశం మనదే. ఏఐలో ప్రపంచ ఆధిపత్యం సంపాదించాలని అమె రికా, చైనాలు తహతహలాడుతుంటే, భారత్ మాత్రం సమూల మార్పు తెచ్చే ఈ టెక్నాలజీలను ప్రజల జీవితాలను మార్చేందుకు ఎలా వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘ఏఐ గవ ర్నెన్స్ గూపు’ను ఏర్పాటు చేయాలన్నది ఈ మార్గ దర్శకాల్లో ఓ సూచన.ఆ గ్రూపునకు అండగా ‘టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ’, అలాగే ‘ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్’ ఉంటాయి. అయితే, ప్రభుత్వ అధికారులు ఏఐ సిస్టమ్స్‌ను వాడినప్పుడు ఏం చేయాలన్న దానిపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం సంగతి అటుంచితే, ప్రైవేట్ రంగం భారతీయ చట్టాలన్నిటినీ పాటిస్తూ, స్వచ్ఛందంగా నియమాలు పెట్టుకొని, పారదర్శకంగా వ్యవహరించాలనీ, బాధితుల సమస్యను పరిష్కరించే వ్యవ స్థలు ఏర్పాటు చేసుకోవాలనీ మార్గదర్శకాలు సూచించాయి. ఏఐతో చేసిన కంటెంట్ విషయంలో యూట్యూబ్, ఇన్‌స్టా లాంటివి ఇకపై ఆ మాట స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీ రూల్స్‌లో ఇప్పటికే ఈ సవరణ ముసాయిదా తెచ్చారు.రానున్న రోజుల్లో ఏం జరగనుంది?ఏఐ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే వరుసగా ప్రపంచ సదస్సులు జరుగుతున్నాయి. బ్లెట్చెలీ పార్క్ (బ్రిటన్), సియోల్, ప్యారిస్‌లలో జరిగిన గత సదస్సుల అనంతరం రానున్న నాలుగో సదస్సు వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాల రూపకల్పన కీలకమైంది. ఏఐని నియంత్రించడం కష్టమైపోతోందని ప్రపంచ దేశా లన్నీ కిందా మీదా అవుతున్న పరిస్థితుల్లో మన దేశం ఇలా ఆగి, ఆలోచించే వైఖరిని అవలంబించడం మంచిదే. అర్థం చేసుకోదగినదే. భవిష్యత్తులో అవస రాన్ని బట్టి ఏఐపై నియంత్రణ, లేదా చట్టాన్ని చేస్తా మంటూ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి సైతం చెప్పడాన్ని ఆ కోణం నుంచి చూడాలి.అయితే, ఏఐ సృష్టి వీడి యోలతో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ రాజకీయ నేతల మొదలు రంగుల లోకపు తారల దాకా అందరినీ బాధితుల్ని చేస్తున్న డీప్ ఫేక్ మహ మ్మారిపై చర్యలు తక్షణావసరం. ఈ విషయంలో విధాన నిర్ణేతలపై ఇప్పటికే చాలా ఒత్తిడి వస్తోందని మర్చిపోలేం. ఏఐపై అతిగా రూల్స్ పెట్టిన యూరో పియన్ యూనియన్, మార్కెట్ శక్తులకే అంతా వది లేసి స్వచ్ఛంద నియమాలతో ఈ రంగం పెంపొందా లని భావిస్తున్న అమెరికా... ఈ రెంటితో పోలిస్తే, భారత మధ్యేమార్గ ధోరణి ప్రశంసనీయమే కానీ ఫలితాలిస్తుందా అన్నది చూడాలి. -
బంగ్లా సంక్షోభంలో భారత వైఖరి?
షేక్ హసీనాకు విధించిన మరణదండన తీర్పుపై ఇండియా ఏ వైఖరి అనుసరించినా చిక్కే! భారత్ ఒకవేళ బంగ్లాదేశ్ ఆంతరంగిక రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే, నిజంగా చేసుకున్నా లేదా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చినా అక్కడి తాత్కాలిక ప్రభుత్వ ప్రాపగాండాకు గొప్ప వరంలా అందివస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలలో మరింత విషం నింపినట్లు అవుతుంది.బంగ్లాదేశ్ చరిత్ర మరో మలుపు తిరుగు తోంది. ఉద్వాసనకు గురైన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆమె దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ సోమ వారం నాడు మరణ దండన విధించింది. హసీనాపై విచారణ రాజకీయ దురుద్దేశా లతోనే సాగిందని ఆమె మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆమెకు మరణ దండన విధించడంతో అదొక భద్రతా, దౌత్యపరమైన విస్ఫో టనంగా పరిణమించింది. భారత్‌తో సహా పాశ్చాత్య దేశాలు ఈ ప్రాంతంలో సుస్థిరతను కోరుకుంటున్నాయి. కానీ ట్రైబ్యునల్ తీర్పుపై ఏ వైఖరి అనుసరించినా చిక్కులు తెచ్చిపెట్టేదిగానే ఉంది.రెండు వర్గాలుగా బంగ్లాదేశీయులుబంగ్లాదేశ్తో వచ్చిన చిక్కేమిటంటే, ప్రజానీకం రెండు శిబిరా లుగా చీలిపోయి ఉంటున్నారు. ఒక వర్గం ఉదారవాద ఇస్లాంకు అనుకూలం. ఉపఖండం స్వాతంత్య్రాన్ని గడించుకోక ముందు నుంచీ ఈ వర్గంవారు దక్షిణాసియాలోని మిగిలిన దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటూ, ప్రజా కృషక్ పార్టీ వంటి పార్టీల వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. వారు 1947 తర్వాత, అవామీ లీగ్, వామపక్షాలకు మద్దతు ఇస్తున్నారు. రెండవ వర్గం ఇస్లామిక్ దేశంగా మారాలని కోరుకుంటోంది.వీరు గతంలో ముస్లిం లీగ్‌కు మద్దతు ఇచ్చారు. తర్వాత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి, జనరల్ హుస్సేన్ ఎర్షాద్కు చెందిన ‘జాతీయ పార్టీ’ వంటి కొన్ని పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. మూడవ వర్గం కూడా ఒకటుంది. అది షరియాను కోరుతూ, ఇస్లాం మతాచారాలను తు.చ. తప్పకుండా పాటించాలని డిమాండ్ చేస్తోంది. అది జమాత్–ఇస్లామీ బంగ్లాదేశ్ మద్దతుదారు. అయితే, బంగ్లాదేశ్‌లో అత్యధిక ప్రజానీకం ఈ సైద్ధాంతిక ఘర్షణల్లో తటస్థంగానే ఉంటూ, ప్రభుత్వ మార్పునకు వీలు కల్పిస్తూంటారు.ఇండియాపై తక్షణ ప్రభావంభౌగోళిక అంశాలు, ప్రజా వర్గాల కారణంగా బంగ్లాదేశ్ ప్రభావం మనపై ఉంటుందని మొదట అర్థం చేసుకోవాలి. భారత్– బంగ్లాదేశ్ సరిహద్దు నిడివి ఎక్కువ. బంగ్లా వైపు నుంచి ఉగ్ర వాదులు సులభంగా భారత్‌లోకి ప్రవేశించడం, ఇక్కడి నేరస్థులకు ఆయుధాలు చేరవేయడం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. అలాగే పోరాటాలకు దిగేవారు, శరణార్థులు భారత్ లోనికి ప్రవేశించేందుకు ఢాకాలోని అస్థిర పరిస్థితులు పురికొల్పవచ్చు.రెండు-పాకిస్తాన్‌తో ముడిపడిన కుట్రదారులు, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న పాత్రధారుల మధ్య జరిగిన సమావేశాలకూ, ఢిల్లీ ఎర్రకోట ఘటన దర్యాప్తులో నిగ్గుదేలుతున్న అంశాలకూ మధ్య నున్న సంబంధం ఒక ఆందోళనకర ధోరణిని సూచిస్తోంది. ఉగ్ర వాదులు, వారిని పోషిస్తున్న వ్యవస్థల సంబంధీకులు బంగ్లాదేశ్‌ను కేవలం దేశీయ రంగస్థలంగా చూడటం లేదు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగపడే రహస్య స్థావరంగా చూస్తున్నారు. దాంతో ఢాకాలో అస్థిరత న్యూఢిల్లీకి ప్రత్యక్ష జాతీయ భద్రతా సమస్యగా పరిణమిస్తోంది.మూడు– రాజకీయ దృక్కోణం దౌత్యపరమైన ఒత్తిడిని సృష్టి స్తోంది. భారతదేశం ఒకవేళ ఢాకా ఆంతరంగిక రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే, నిజంగా జోక్యం చేసుకున్నా లేదా జోక్యం చేసు కున్నట్లు ఆరోపణలు వచ్చినా అక్కడి తాత్కాలిక ప్రభుత్వ ప్రాపగాండాకు గొప్ప వరంలా అందివస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలలో మరింత విషం నింపినట్లు అవుతుంది. సరిహద్దు నిర్వహణ, కౌంటర్ టెర్రరిజంపై సహకారాన్ని బలహీనపరుస్తుంది. నీతి నియమాల సూత్రాలు, వివేకం– రెండింటిలో దేనితో నడుద్దామనుకున్నా భారతదేశానికున్న అవకాశాలు సవాళ్ళతో నిండినవే! ఏం చేయగలం? ప్రాంతీయ పెత్తందారుగా వ్యవహరిస్తోందని ఢాకా భాష్యం చెప్పడానికి వీలున్న చర్యల జోలికి పోకుండానే, తన జాతీయ భద్ర తను, పౌరులను భారత్ పరిరక్షించుకోవాల్సి ఉంది. సరిహద్దులో చొరబాట్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను భారత్ వేగ వంతం చేయాలి. సరిహద్దుకు ఆనుకుని ఉన్న జిల్లాలలో మానవతా చర్యలను చేపట్టేందుకు సమాయత్తమవ్వాలి. అత్యవసర మందు లను, గుడారాలను, జన ప్రవాహాన్ని తట్టుకుని చట్టాన్ని అమలు చేయగల విభాగాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి. దాతలను రంగంలోకి దింపడానికి సిద్ధమై, ఐరాస సంస్థలతో సమన్వయంతో పని చేయాలి.సైనిక దళాలను మోహరిస్తే, పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉంది. ఆత్మరక్షణ, పౌర రక్షణ ఏర్పాట్లు చేసుకోవ డంలో తప్పు లేదు. అవి అత్యవసరం కూడా! సరిహద్దుకు ఆవల నున్న ఉగ్రవాద తండాల కదలికలపై సాంకేతిక, కార్యనిర్వహణా పరమైన, జ్యుడీషియల్ మార్గాల ద్వారా ఒక కన్ను వేసి ఉంచి, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడాన్ని న్యూఢిల్లీ తీవ్రం చేయాలి. అవి నిక్కచ్చిగా కౌంటర్ టెర్రరిజం చర్యలవుతాయి కానీ, రాజకీయ జోక్యం కిందకు రావు.సుస్థిరతను అందించగల సామర్థ్యమున్న బంగ్లాదేశీ మధ్య వర్తితో ప్రైవేటుగా చర్చలు జరిపేందుకు సిద్ధమై ఉండాలి. అది రాజ కీయంగా అసౌకర్యమైనదే. కానీ, రాజకీయ సంబంధాలు అట్టడు గుకు చేరిన సమయంలో కూడా (సరిహద్దుల నిర్వహణ, కౌంటర్ టెర్రరిజం, విద్యుత్తు, వర్తక వాణిజ్యాల వంటి) అంశాల ఆధారిత చర్చలు కొనసాగాలి. దక్షిణాసియా అస్థిరత సరిహద్దులను దాటి ఎలాంటి పర్యవసానాలకు కారణం కాగలదో అమెరికా, ఐరోపా దేశాలకు, ‘క్వాడ్’ భాగస్వాములకు న్యూఢిల్లీ నివేదించాలి. ఉద్రిక్తత లను సడలింపజేసేందుకు అంతర్జాతీయంగా ఒత్తిడి తేవడం, పౌరుల హక్కులను గౌరవించేలా మాట తీసుకోవడం మంచిది. ఢాకాలో రాజకీయ ఏకాభిప్రాయ సాధనకు ఎంతో కొంత ప్రయత్నించినా కూడా అది హింసను నిరోధించగల ఉత్తమ కవచంగా పనిచేస్తుంది. గౌరవప్రదమైన ప్రాంతీయ ప్రముఖులు, బహుళ పక్షీయ మధ్యవర్తులతో సమ్మిళిత రాజకీయ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్స హించేందుకు భారత్ ప్రయత్నించవచ్చు. తద్వారా, ఎన్నికల నిర్వహణకు, చట్టబద్ధ పాలనకు అనువైన పరిస్థితులు ఏర్పడేటట్లు చేసినట్లు అవుతుంది. అవి కొరవడితే, అణచివేతలు, తిరుగుబాటు కార్యకలాపాలు పునరావృతమవుతూనే ఉంటాయి.-జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త పీటీఐ తూర్పు ప్రాంత విభాగ మాజీ అధిపతి -
ఎమోషనల్ మగాడే అసలైన వాడు!
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకో ప్రశ్న. మీరెప్పుడైనా మనసారా ఏడ్చారా? మీ భయాలను ఓపెన్ గా చెప్పగలిగారా? మీ బలహీనతలను ఒప్పుకోగలిగారా? చాలామంది నుంచి ‘నో’ అనే సమాధానమే వస్తుందని తెలుసు. ఎందుకంటే మన సమాజంలో మగబిడ్డ పుట్టిన వెంటనే అతని చుట్టూ ఒక మేట్రిక్స్ నిర్మితమవుతుంది. మేట్రిక్స్ అంటే మరేదో అనుకోకండి, ఒక ఫ్రేమ్ వర్క్.‘‘నువ్వు మగపిల్లాడివి ఏడవకూడదు. ధైర్యంగా ఉండాలి. భయపడకూడదు. బాధపడకూడదు, తట్టుకోవాలి’’ అని పుట్టినప్పటినుంచీ చెప్తుంటారు. ఇలాంటి మాటలన్నీ కలిసి అతను ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఒక ఫ్రేమ్ వర్క్ ను నిర్మిస్తాయి. అది కంటికి కనిపించని జైలులా మారుతుంది. దాని లోపల ఉన్నాడని కూడా తెలీదు. కానీ అతని డెసిషన్స్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అన్నింటినీ అది నియంత్రిస్తుంటుంది.కానీ చాలామందికి అది తెలియదు. తెలిసిన వాళ్లు కూడా బయటకు రావడానికి భయపడతారు. కానీ నిజమేమిటంటే... దాన్ని బద్దలు కొట్టినప్పుడే మగాడు నిజమైన మనిషి అవుతాడు.1. BREAKమగాడు, మగతనం అనే మేట్రిక్స్‌ను బద్దలుకొట్టకపోతే పురుషుడు సంపూర్ణంగా జీవించలేడు. జస్ట్ మగాడిగా తన పాత్రను పోషిస్తుంటాడంతే. ఈ మేట్రిక్స్ మగాడి మనసుకు మూడు పెద్ద నష్టాలు చేస్తుంది:1. ఏమైనా జరిగినప్పుడు ‘ఇది చిన్నవిషయమే’ బాధపడకూడదు అనిపిస్తుంది. ఏడవాలనిపించినా... ‘అలా చేస్తే ఏమనుకుంటారో?’ ‘బలహీనంగా కనిపిస్తానేమో?’ అని ఏడుపును మనసులోనే నొక్కేసుకుంటారు. తమ ఎమోషన్స్ ను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయలేరు. భావాలను చెప్పడం నేరం అనిపిస్తుంది.2. ఒక పురుషుడు ‘I need help’ అని ఓపెన్ గా అడగలేడు. ఎందుకంటే చిన్నప్పటినుంచీ అతనికి నీ పనులు నువ్వే చేసుకోవాలని చెప్పారు. అందుకే సహాయం అడగడానికి సిగ్గనిపిస్తుంది. 3. చుట్టూ జనాలు ఉన్నా, లోపల మాత్రం ఒంటరితనం పెరుగుతుంది. ఇది depression, anger issues, burnout, relationship breakdowns కి నేరుగా దారి తీస్తుంది.ఇది బలం కాదు బ్రో, ఇదో కనిపించని జైలు. ఇదే మగాడు అనే మేట్రిక్స్.2. BUILDఈ మేట్రిక్స్ నుంచి బయటపడినప్పుడు పురుషుడు తనను తానే తిరిగి నిర్మించుకుంటాడు. ఒక పురుషుడు మేట్రిక్స్‌ను ప్రశ్నించే రోజే అతని అసలు వ్యక్తిత్వం పుట్టే రోజు. అప్పుడే అతను మొదటిసారి తనతో నిజాయితీగా మాట్లాడడం మొదలుపెడతాడు.“నాకు కూడా బాధ ఉంటుంది.”“నాకు కూడా భయం ఉంటుంది.”“నాకు కూడా ప్రేమ, వినేవాళ్లు కావాలి.”అని ఒప్పుకోవడం మొదలుపెడతాడు. ఇది బలహీనత కాదు. ఇది అవగాహనా స్థాయి పెరగటం. దీనివల్ల మగాడిలో కొత్త వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది.1. Emotion Awareness: ఏం ఫీల్ అవుతున్నాను? ఎందుకు? అని ప్రశ్నించుకుంటాడు. ఈ ప్రశ్న ఒక వ్యక్తిని బలంగా మారుస్తుంది, బలహీనంగా కాదు.2. Healthy Expression: బాధను చెప్పగలగడం అనేది మానసిక బలమని, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదని గుర్తిస్తాడు. 3. Boundaries: నేను మగాణ్ని కాబట్టి ప్రతి పని నేనే చేయాలి అనే మేట్రిక్స్ నుండి బయటపడతాడు. 4. Genuine Relationships: జస్ట్ మగాడనే పాత్రను పోషించడం కాకుండా, నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం వల్ల నటించే బంధాలు కాకుండా నిజమన బంధాలు మొదలవుతాయి.3. BEYONDమేట్రిక్స్ బద్దలైనప్పుడు మగాడు లిమిట్స్ దాటి వెళ్తాడు. మగతనం కొత్తరూపు తీసుకుంటుంది. ఈ కొత్త మగాడు Emotionally Intelligent. అతను మాట్లాడతాడు.అతను వింటాడు.అతను పంచుకుంటాడు.ఈ కొత్త పురుషుడు Strong + Softఅతని బలం అరవడం కాదు.అతని సున్నితత్వం బలహీనత కాదు.కొత్త మగాడు Balanced.అతను తనను తాను కోల్పోకుండా కుటుంబం, పని, సంబంధాలను నడపగలడు.కొత్త పురుషుడు Human. ఫీలింగ్స్, ఫియర్స్, నీడ్స్ అన్నీ అతని భాగమే అని అంగీకరిస్తాడు.అతను మగాడనే ఒక మూసలో కాకుండా పూర్తి మనిషిగా జీవిస్తాడు.Break the ‘Man’ Matrix.Build your true self.Go Beyond your limits.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
జుట్టు నెరిసిందా? అయితే అదృష్టవంతులే!!
జుట్టు నేరుస్తోందని.. మిమ్మల్ని ఎవరూ చూడడం లేదని ఫీలవకండి. వయసు పెరుగుతోందని అసలు సిగ్గుపడకండి. పైపెచ్చు జుట్టు తెల్లబడుతున్నందుకు సంతోషించండి అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు . జుట్టు నెరవడం ఏమాత్రం సిగ్గుపడే విషయం కాదని .. అది వారి ఆరోగ్యానికి హేతువని పరిశోధనల్లో తేలింది. ఇకపై తెల్లజుట్టు వచ్చిందని, తమకు వృద్ధాప్యం వచ్చిందని ఏమాత్రం చింతించవలసిన పనిలేదని భరోసా ఇస్తున్నారు. టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాల ద్వారా ఒక ఆసక్తికరమైన అంశాన్ని కనుగొన్నారు. నల్లని జుట్టు తెల్లగా మారడం వెనుక ఒక గొప్ప ప్రక్రియ ఉందని.. అది మన ఆరోగ్యానికి భద్రతను.. భరోసాను కలిగిస్తుందని.. ఈ క్రమంలో తెల్లజుట్టును అందరూ ఆహ్వానించాలని అంటున్నారు. మానవుల శరీరంలో మొదలయ్యే కేన్సర్‌కు దారితీసే ప్రమాదకర కణాలను మన శరీరం నాశనం చేసి మనలను ప్రాణహాని నుంచి కాపాడుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా శరీరంలోని జుట్టు రంగును కోల్పోయి తెల్లగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?మన చర్మానికి, జుట్టుకు కణాలు మెలనోసైట్ స్టెమ్ సెల్స్ కారణంగా ఆ రంగు వస్తుంది. ఈ కణాలు ఎక్కువగా జుట్టు కుదుళ్ళలో ఉంటాయి. ఇవి ఎప్పటికపుడు అంతరించిపోతూ నిరంతరం కొత్త కణాలు పుడుతూ చర్మానికి, జుట్టుకు రంగును అందిస్తుంటాయి. అయితే.. డీఎన్ఏకు క్యాన్సర్ కణాలు ఏర్పడడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైతే ఈ స్టెమ్ సెల్స్ వెంటనే ఉత్తేజితం అయిపోతాయి. సరిహద్దుల్లోని సైనికుల మాదిరి ఎలర్ట్ అయిపోయి శరీరాన్ని రక్షించే బాధ్యత తీసుకుంటాయి. అవి స్వతంత్రంగా.. అంటే ఆటోమాటిగ్గా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయి తమను తాము నిర్మూలించుకుంటాయి. ఈ ఫైటింగ్ ప్రక్రియలో ఆ సెల్స్ ఆత్మార్పణ చేసుకుని మన శరీరాన్ని కాపాడుతాయి అన్నమాట దీంతో నల్లని జుట్టు కాస్తా తెల్లగా మారిపోతుందని పరిశోధనల్లో వెల్లడైంది. అంటే, జుట్టు బూడిదగా మారడం అనేది కేన్సర్‌కి దారితీసే కణాలను శరీరం త్యజించిన ఫలితమనే అర్థం.అంతిమంగా ఈ పరిశోధన ఏమి చెబుతుందంటే 'బూడిద జుట్టు ఉండటం కేన్సర్‌కి రక్షణ అనేది నేరుగా చెప్పలేము, కానీ అది శరీరం కణాలను పరిశుభ్రం చేసే సహజ జీవ క్రియను సూచిస్తుంది. తద్వారా శరీరంలోని మృతకణాలు అంతరించి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.' అనేది ఈ పరిశోధన సారాంశం.:::సిమ్మాదిరప్పన్న -
టీడీపీ ఎంపీ చిన్నికి మద్దెల దరువు..
ఏదోలా చంద్రబాబు.. లోకేష్‌ల ఆశీస్సులతో టిక్కెట్ తెచ్చుకుని ఎంపీగా అయితే గెలిచాడు కానీ గెలిచిన నాటి నుంచి సుఖం లేదు నిద్ర లేదు ప్రశాంతత లేదు అన్నట్లుగా తయారైంది కేశినేని చిన్ని (శివనాథ్) పరిస్థితి. ఎటు చూసినా ఆయన గౌరవం తగ్గించే పరిణామాలు జరుగుతున్నాయి తప్ప ఆయన్ను తన పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా గౌరవంగా చూడడం లేదు. ఇదేలా ఉంటుండగానే తన సొంత అన్న మాజీ ఎంపీ కేసినేని నాని ఏకంగా తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయడం చిన్నికి మరింత పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఏకంగా తనపై ధ్వజం ఎత్తడం రూ.ఐదు కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చానని చెప్పడం దీంతోపాటు.. గంజాయి, లిక్కర్, మైనింగ్ వంటి ఇతరత్రా అక్రమ వ్యాపారాలన్నీ తన అనుచరులే చేస్తున్నారని చెప్పడం వంటి పరిణామాలు పార్టీలో కేశినేని చిన్ని పరపతిని గణనీయంగా తగ్గించాయి. అసలు చిన్ని ఎవరు అంటే పేకాట డెన్ నడిపే పెద్ద జూదరి అంటూ పోలికపూడి శ్రీనివాస్ చేసిన కామెంట్ చిన్ని గౌరవాన్ని నేలమట్టం చేసింది.తెలుగుదేశం పార్టీలో లోకేష్, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన విజయవాడ ఎంపీ, కమ్మ సామాజికవర్గానికి చెందిన కేశినేని చిన్నిని పొలిటికల్ గా టచ్ చేయాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. కానీ చిన్నిని పూచికపుల్ల మాదిరి తీసిపారేసిన కొలికపూడి పార్టీలో సంచలనం రేపారు. దీంతో ఇద్దరినీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుకావాలి ఆదేశించిన అధిష్టానం మంగళవారం సాయంత్రం ఆ ఇద్దరి నుంచి వివరణలు వాంగ్మూలాలు తీసుకుని బయటకు పంపించింది. అయితే ఆ ఇద్దరు కూడా తాము పార్టీకి విధేయులం అని.. తమకు పార్టీ ఒక దేవాలయం అయితే చంద్రబాబు.. లోకేష్ తమపాలిట దేవుళ్ళు అంటూ ఒకే స్క్రిప్ట్ చదవడంతో క్రమశిక్షణ సంఘం ఇదెక్కడి కోరస్ రా దేవుడా అని తలపట్టుకుంది.ఇదిలా ఉండగా చిన్నిపై సొంత అన్న, మాజీ ఎంపీ నాని తుపాకీ ఎక్కుబెట్టారు. చిన్నికి చెందిన కంపెనీలు పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాయని మనీ తీవ్రమైన ఆర్థిక నేరాలు వెనుక చిన్ని హస్తం ఉందని ఆరోపిస్తూ నాని ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆర్థిక నేరాలన్నింటిపైన విస్తృతంగా దర్యాప్తు చేసి చిన్ని ప్రమేయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని నాని చేసిన ఫిర్యాదు ఇప్పుడు తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. తనపై సొంత అన్నయ్య ఇలా ఫిర్యాదు చేయాలని చిన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని ఏమీ చేయలేని పరిస్థితి.. దీంతో అటు కొలికపూడి శ్రీనివాస్ ఇటు సొంత అన్న నాని ఒకేసారి ఎటాక్ చేయడంతో ఎంపీ శివనాథ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?
చేతివాటం అని కొంత మంది ఏదో చులకనగా తేలికపాటి పదాలతో అంటూ ఉంటారు గానీ.. నిజానికి ‘హస్తలాఘవం’ అని గౌరవప్రదంగా అంటే ఆ విద్యలో ఉన్న కళాకౌశలానికి తగిన గుర్తింపు దక్కినట్టు అవుతుంది. అవును మరి.. ‘పిక్ పాకెట్’ లేదా ‘జేబు కత్తిరించుట’ అని చవకబారు భాషలో అనేసినంత మాత్రాన ఆ విద్యలో ఉన్న గొప్పదనం మరుగున పడిపోతుందా?. రెండు వైపులా పదును ఉండి.. పట్టుకున్న చేతినికూడా గాయపరచగల బ్లేడు వంటి చిన్న ఆయుధాన్ని, చాలా ఒడుపుగా రెండువేళ్ల మధ్యలో ఇరికించి పట్టుకుని.. ఎంతో టేలెంట్తో.. రోడ్డు మీద కనిపించిన వారి జేబును డబ్బులు లేదా మనీ పర్సు ఉన్నంత మేర మాత్రమే కత్తిరించడం ఆ విద్యలో మాస్టర్ డిగ్రీ అని చెప్పాల్సిందే. ఆ మాటకొస్తే జేబులు కత్తిరించడం మాత్రమేనా ఏమిటి? దుకాణాల్లో యజమానికి తెలియకుండా సరుకులు కొట్టేయడాలు, సూపర్ మార్కెట్లలో సీసీ కెమెరాల కనుగప్పి సరుకుల్ని మాయచేయడాలూ లాంటి వ్యవహారాలు అనేకం మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని చీప్‌గా చోరీలు అనకూడదు.. ‘కళాకౌశల ప్రదర్శన’ అని అనాలి. అందుకే మనం పొదుగుతున్న పిట్టకు తెలియకుండా గూట్లో గుడ్డును కొట్టేసే మహామహుల్ని గురించి కథలు తయారుచేసుకుని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి చౌర్యం అనేది ఒక ఆర్టు.. చతుష్షష్ఠి కళలలో ఎన్నదగిన ఆర్టు. ఆ పనిచేసేవాళ్లు సదరు ఆర్టుని పెర్ఫార్మ్ చేస్తున్న కళాకారులు! మనకు అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. ఎవరో ఇద్దరు ఆడవాళ్లు బంగారం దుకాణానికి వస్తారు. మంచిగా మాటలు చెబుతూ నగల బేరం ప్రారంభిస్తారు. కొత్త కొత్త డిజైన్లు చూపించమని షాప్ కుర్రాడిని పురమాయిస్తారు. అతను వెనుదిరిగి మరో డిజైన్ అందుకుని చూపించేలోగా, ఆ బల్ల మీద ఉన్న వాటిని ఎంతో ఒడుపుగా తమ దుస్తుల మధ్యలోకి చేరవేస్తారు. కొన్ని క్షణాల వ్యవధిలో వీసమెత్తు తేడా రాకుండా ఎంతో పకడ్బందీగా ఈ కళను ప్రదర్శించాలంటే చాలా చాలా టేలెంట్ ఉండాలి. కానీ మనమేమో దానిని దొంగతనం అంటాం. నాలుగు తగిలించి పంపిస్తాం లేదా పోలీసులకు పట్టిస్తాం. Gujaratis are giving India a bad name internationally. Look at this Gujarati woman who stole 3 jeans, 7 tops, and 5 pairs of underwear from a shop in US. She was later caught with all the items, and her phone wallpaper had an image of Modi.pic.twitter.com/InTIuIzdxt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) September 7, 2025తమ కళకు, టేలెంట్కు ఇక్కడ స్వదేశంలో అనుకున్న రీతిలో గౌరవం దక్కడం లేదని బాధపడుతున్నవారు ఏం చేయాలి, సాధారణంగా ఏం చేస్తుంటారు?. ఫరెగ్జాంపుల్ ఇంజినీరింగ్, మెడిసిన్ చదివిన వాళ్లు తమ ప్రతిభ మరింతగా రాణించాలంటే.. తమ విద్యతో మరింతగా ఆర్జించాలంటే అమెరికాకు వెళుతున్నారు కదా?. అదేమాదిరిగా మనం చోరకళాకారులు కూడా అమెరికాకు వెళుతున్నారు. అక్కడ తమ హస్తలాఘవాన్ని, కళాప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. కానీ తమాషా ఏంటంటే.. వారి ఆర్టుకు అమెరికాలో కూడా గౌరవం దక్కడం లేదు. డిపార్టుమెంటల్ స్టోర్సులో, సూపర్ మార్కెట్లలో ఏదో తమకు తోచిన రీతిలో చేతివాటం ప్రదర్శిస్తే.. పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టేస్తున్నారు. మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ ఇదే పాట ఆమె కూడా పాడింది గానీ.. పోలీసులు కరుణించలేదు. ఆ పప్పులన్నీ ఉడకవని తేల్చేసి కటకటాల వెనక్కు పంపారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఇలాగే చోర కళాప్రదర్శనచేసి దొరికిపోయారు. అమెరికాలో ఈ కళను ‘షాప్ లిఫ్టింగ్’ అని వ్యవహరిస్తారట. అనగా.. స్టోర్సులో వస్తువులు పుచ్చుకుని డబ్బులివ్వకుండా జారుకునే విద్యకు అక్కడి పేరు అది! చదువుకోవడానికి అమెరికా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు న్యూజెర్సీలో ఇదే షాప్ లిఫ్టింగ్ కళను పెర్ఫార్మ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ వీడియో గత ఏడాదంతా మహా వైరల్ అయింది. చూడబోతే మన దేశంలో మాదిరిగానే అమెరికాలో కూడా కళకు సరైన గౌరవం లేదని అనిపిస్తోంది కదా!.గౌరవం లేకపోతే పాయె.. కానీ, ఈ సమస్య అక్కడితో ఆగడం లేదు. భారతదేశానికి చెందిన ఇలాంటి చోరకళాకారులు అడపాదడపా దొరికిపోతుండడం.. అమెరికాకు వెళ్లదలచుకునే వారి వీసాల ప్రక్రియ మీద కూడా ప్రభావం చూపిస్తోందట. చిన్న చిన్న చేతివాటానికి సంబంధించిన కేసులు ఉన్నా సరే.. అలాంటి వారు అమెరికాలో అడుగుపెట్టకుండా వీసాలు నిరాకరించాలని.. భారత్ లోని యూఎస్ ఎంబసీ ఆలోచిస్తున్నదట. వారి జైలుకు పోవడం సరే.. వారి దెబ్బకు మామూలు వాళ్లు కూడా అమెరికాకు వెళ్లాలంటే.. మనల్ని అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ఇంటి దొంగలు ఇంట్లోనే ఉంటే కొంచెం పరువు దక్కుతుంది బజారున పడి దొంగతనాలు చేస్తే పరువు కూడా బజారుకెక్కుతుంది. చోరకళ అందరికీ అబ్బే విద్య కాదని వారు వాదించవచ్చు గానీ. ఈ అమాయక సమాజం దానిని నేరంగా పరిగణిస్తున్నప్పుడు.. వారు ప్రదర్శించకుండా మౌనంగా ఉండడమే మంచిది. ఏమంటారు?. -ఎం.రాజేశ్వరి👉ఇదీ చదవండి: ‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’ -
మాట మీద నిలబడటం కొందరికే సాధ్యం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహాభారతంలోని కర్ణుడి పాత్ర చాలా ఇష్టమట. చేతికి ఎముక లేనట్టుగా దానం చేసే లక్షణం కర్ణుడిది. మిత్రధర్మం కోసం ప్రాణత్యాగమూ చేసి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో కర్ణుడి పాత్ర అంత వాస్తవికమైంది కాదనే చెప్పాలి. పైగా రేవంత్ ఏ రాజకీయ ధుర్యోధనుడితో ప్రస్తుతం మిత్ర సంబంధం ఉందన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు. రాజకీయ నేతలు తమని తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు కానీ ఆయన మాదిరిగా మాటమీద నిలబడే వారు చాలా అరుదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా సీఎం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహకరించినందుకు సినీ కార్మికులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మరీ ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలో సినీ జూనియర్ ఆర్టిస్టులు వేలమంది నివసిస్తూంటారు. వారి ఓట్లు దక్కించుకునేందుకు రేవంత్ ఈ మాట అన్నారేమో మరి!. ఎందుకంటే కార్మికుల సమ్మె ఎప్పుడో పరిష్కారమైతే ఇప్పుడు సన్మాన సభ ఏమిటో?.. అయితే ఈ సందర్భంగా రేవంత్ ఇంకో హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఆదాయంలో ఇరవై శాతం చెల్లిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని ప్రకటించారు. ధరల పెంపు నిర్మాతలు, హీరోలకు ఆదాయం తెస్తుందని, కార్మికులకు దక్కేది ఏమీ ఉండదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చెవులకు ఈ హామీ వినసొంపుగా ఉండొచ్చు. కానీ అది ఆచరణ సాధ్యమా?.. ఎందుకంటే... ప్రతి సినిమాకూ ఓ సంక్షేమ నిధి అంటూ ఏదీ ఉండదు. అందరికీ కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఎంతివ్వాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడొచ్చు. రేవంత్ మాట్లాడుతూ.. నిజమే కానీ టిక్కెట్ ధరలు అన్ని సినిమాలకూ పెరగవు. టిక్కెట్ ధరలు పెంచిన తరువాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలి? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టిక్కెట్ రేట్ పెంచిన వెంటనే అందులో 20 శాతం వేరుచేసి కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా?అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనపై నిర్మాతలతో చర్చించి ఆ తరువాత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.కొంతకాలం క్రితం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి, ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. హీరో అల్లు అర్జున్ జైలు పాలయ్యారు కూడా. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత షరా మామూలే. యధావిధిగా బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. బీజేపీ కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా సినిమా బెనిఫిట్ షోతోపాటు టిక్కెట్ రేట్ల పెంపునకూ ఓకే అన్నారు. గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి!. రేవంత్‌కు కర్ణుడి పాత్ర నిజంగానే అంత ఇష్టమైతే ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇంకో సంగతి చెప్పాలి. దానగుణంలో గొప్పవాడైన కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్న సంగతి మర్చిపోరాదు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడికి అనుయాయిగా కర్ణుడు కూడా అపకీర్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి. సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు.ఆలోచన బాగానే ఉంది కాని అందుకు అవసరమైన మూడు నాలుగెకరాల స్థలం ఈ మహానగరంలో ఎక్కడి నుంచి తెస్తారు? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు. కాని,కార్మిక సంఘాలు ఎలా వెదుకుతాయో చెప్పలేము. హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకు వచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలన్న ఆకాంక్ష కూడా మెచ్చుకోతగ్గదే. అయితే.. చంద్రబాబుతోపాటు రేవంత్ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న మీడియా సంస్థకు సొంతంగా ఒక స్టూడియో ఇప్పటికే ఉంది. దీనికి పోటీగా మరిన్ని వస్తాయంటే వారు ఊరకుంటారా? అయితే రామోజీ ఫిలిం సిటీకే హాలీవుడ్‌ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో పరిశ్రమ అభివృద్దికి వ్యూహారచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా, ఇంతకుముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా.. గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు?ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలను చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరగడం!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సూటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఒక స్పష్టమైన తేడా ఉంది. చంద్రబాబు దాదాపు రోజు ఎక్కడో చోట ఉపన్యాసం ఇస్తుంటారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన అలవాటు అది. ఆయన ఏ ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేయగలరు. కాని జగన్ అందుకు పూర్తి భిన్నంగానే ఉంటారు. రోజూ మీడియాలో కనిపించాలన్న తాపత్రయం వైఎస్ జగన్‌కు ఉండదు. పక్షానికో, నెలకో మీడియాతో మాట్లాడినా లేదంటే ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆ సందర్భంగా ఏమి చెప్పదలిచినా అత్యధిక శాతం ఆధారాలతో సహా తన వాదన వినిపిస్తారు. జగన్ చెప్పే విషయాలను ఖండించలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఏవేవో ఇతర పిచ్చి విమర్శలు చేస్తుంటారు. మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇది గత ఏడాదిన్నరగా సాగుతున్న వ్యవహారమే!. కొద్ది రోజుల క్రితం జగన్ మీడియా సమావేశంపెట్టి కొన్ని అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. ఆ సందర్భంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన గూగుల్ డాటా సెంటర్.. దాని మూలం ఎక్కడ నుంచి వచ్చింది?.. తన హయాంలో వచ్చిన ఆదాని డేటా సెంటర్ కు దీనికి ఉన్న లింక్ ఏమిటి?.. విశాఖకు తన హయాంలో జరిగిన మంచి ఏమిటి?.. తదితర విషయాలపై సాక్ష్యాధారాలు చూపిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గూగుల్ డాటా సెంటర్ ను స్వాగతించిన తీరు ఆసక్తికరంగా ఉంది. దాని వల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందా? రాదా? అనేదానితో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా ఆయన స్వాగతించడం విశేషం. అదే సమయంలో.. తాను తీసుకు వచ్చిన అదాని డాటా సెంటర్‌కు కొనసాగింపే ఈ గూగుల్ డాటా సెంటర్ అని సశాస్త్రీయంగా రుజువు చేశారాయన. అక్టోబర్ మొదటివారంలో గూగుల్ సంస్థ ఎపి ప్రభుత్వ ఐటి కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ అదానీ సంస్థలకు భూములు కేటాయించాలని కోరిన విషయాన్ని జగన్ బహిర్గతం చేశారు. అంతవరకు ఇదేదో గూగుల్ సంస్థ నేరుగా వచ్చి పెట్టుబడులు పెడుతున్నదని భ్రమించినవారికి నిజం ఏమిటో తెలిసినట్లైంది. అదానీ డాటా సెంటర్‌కు తన హయాంలో జీవో ఇచ్చి శంకుస్థాపన చేసిన వైనం, అలాగే సీ సబ్ కేబుల్ ను సింగపూర్ నుంచి తీసుకు రావడానికి ఆ దేశప్రభుత్వంతో తన హయాంలో జరిగిన సంప్రదింపుల లేఖలుమొదలైన వాటన్నింటిని ప్రజలకు చూపించారు. ఇప్పుడు రూ. 87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నది ఆ అదానీ గ్రూపేనని.. మొత్తం నిర్మాణం పూర్తి అయిన తర్వాత గూగుల్ దానిని లీజుకు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ..చంద్రబాబు మాత్రం అదానీ పట్ల కనీస కృతజ్ఞత చూపలేదని, అదానీ పేరు చెబితే తనకు(జగన్‌కు) ఎక్కడ పేరు వస్తుందోననే అలా చేశారని వివరించారు. నిజంగానే అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అదానీకి ప్రాదాన్యత ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్తపడడం అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ నేతలు ఈ గూగుల్ డేటా సెంటర్ ను చంద్రబాబు, లోకేష్ లు సాదించారన్న ప్రచారం చేస్తున్న తరుణంలో దానిని జగన్ పటాపంచలు చేసినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమి చేశారన్నదానితో సంబంధం లేకుండా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. విశాఖ డేటా సెంటర్ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు తప్ప ఎక్కడా చంద్రబాబు, లోకేష్‌ల పేర్లు ప్రస్తావించకపోవడం గమనించాల్సిన అంశం. ఇది ఆ ఇద్దరికీ నిరాశ కలిగించి ఉండొచ్చు. ఒక వేళ సుందర్ పిచాయ్ వీరికి నేరుగా లేఖ రాసి ఉంటే గనుక.. ఎల్లో మీడియా భూమ్యాకాశాలు దద్దరిల్లేలా హోరెత్తించి ఉండేవేమో!. ఇదే సందర్భంలో.. జగన్ చాలా స్పష్టంగా డాటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని, ఎకో సిస్టమ్ అభివృద్ది అవుతుందని, అందుకే ఆ సమయంలో తాము అదానీని డాటా సెంటర్‌తో పాటు ఐటీ బిజినెస్ పార్క్, రీక్రియేషన్ సెంటర్ తదితర సంస్థలు ఏర్పాటు చేసి 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న షరతు పెట్టామని చెప్పారు. దీనికి సంబంధించిన జీవోలను కూడా ఆయన చూపించారు. తన హయాంలో 300 మెగావాట్ల డాటా సెంటర్‌కు ప్లాన్ చేస్తే.. దాని కొనసాగింపుగా ఇప్పుడు వెయ్యి మెగావాట్ల సెంటర్ ను ప్లాన్ చేశారని వివరించారు. అలా డాటా సెంటర్ క్రెడిట్‌ను చంద్రబాబు చోరి చేశారని జగన్ ఎత్తిపొడిచారు. అయితే.. ఇప్పటిదాకా దీనికి నేరుగా ప్రభుత్వ పక్షాన ఎవరూ సమాధానం ఇవ్వలేకపోయారు!. జగన్ ఏదో ఈ డాటా సెంటర్‌కు అడ్డుపడుతున్నారన్న ప్రచారం చేయాలని తలపెట్టిన టీడీపీకి.. ఆ పార్టీ అనుకూల మీడియాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ కూడా. దీనికి తోడు హైదరాబాద్ కు సంబందించి చంద్రబాబు నిత్యం చేసుకునే ప్రచారాన్ని కూడా ఆయన పూర్వపక్షం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం నుంచి హైదరాబాద్ తో చంద్రబాబుకు సంబందం ఎక్కడ ఉందని, ఈ కాలంలో జరిగిన అభివృద్దికి వైఎస్ఆర్, కేసీఆర్ కారణమని స్పష్టం చేశారు. అలాగే తొలుత నేదురుమల్లి జనార్దనరెడ్డి హయాంలో రాజీవవ్ గాంధీ సైబర్ టవర్స్ కు శంకుస్థాపన చేసిన ఫోటోను, తదుపరి ప్రైవేటు సంస్థ ద్వారా ఒక భవనం కట్టించి దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టి,మొత్తం నగరాన్ని తానే కట్టించానని బిల్డప్ ఇస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటిలో ఏ ఒక్కదానిని ఖండించలేని నిస్సహాయ స్థితి చంద్రబాబు బృందానిదే అని చెప్పాలి. దానికి కారణం జగన్ ఏమి చెప్పినా సాక్ష్యాధారాలతో సహా మాట్లాడడమే. మరో వైపు మంత్రి లోకేష్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.86 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. జగన్ మాదిరి ఎక్కడా ఆధారాలు ప్రదర్శించలేదు. అందుకే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక వ్యాఖ్య చేశారు. గూగుల్ కంపెనీతో ఆ మేరకు ప్రకటన ఇప్పిస్తే తాము లోకేష్ కు సన్మానం చేస్తామని ప్రకటించారు. లోకేష్ సలహాదారులు ఎవరో కాని, బాగా అబద్దాలు చెప్పించారనిపిస్తుంది. దాని వల్ల ఆయన ప్రతిష్టకు నష్టం అని కూడా వారు భావించినట్లు లేదు. తీరా చూస్తే అసలు గూగుల్‌కు ప్రపంచం అంతా కలిపి 1.83 వేల మంది ఉద్యోగులు ఉంటే.. ఒక్క విశాఖ పట్నంలోనే అంతమంది ఎలా వస్తారన్న సింపుల్ కొశ్చెన్ కు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు. జగన్ టైంలో అదానీకి ప్రధానంగా భూమి మాత్రమే సమకూర్చితే.. ఇతర రాయితీలు భారీ ఎత్తున ఇవ్వలేదు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 22వేల కోట్ల మేర రాయితీలు, అది కూడా కేవలం 200 ఉద్యోగాల కల్పించబోతున్న సంస్థకు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సందర్భంలో ఎల్లోమీడియా పచ్చి అబద్దాలను ప్రచారం చేసే యత్నం చేసింది. విశాఖపై సాక్షి పత్రిక విషం చిమ్మిందని నీచమైన అసత్యాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళే యత్నం చేసింది. నిజానికి గతంలో జగన్ విశాఖకు ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఆ నగరంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎన్ని దారుణమైన కధనాలు రాసింది పాత పత్రికలు, అప్పటి వీడియోలు చూస్తే తెలుస్తుంది. అసలు అదానీకి మొత్తం కొండ అంతా రాసిచ్చేశారని డాటా సెంటర్ ఏర్పాటు నేపధ్యంలో విషం చిమ్మింది ఎల్లో మీడియా. అంతేకాదు.. ఆ రోజుల్లో విశాఖ వద్ద సముద్ర మట్టం పెరుగుతోందని, చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా ఆ సందర్భంలో అబద్దాలను సృష్టించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. సముద్రం తీరాన భోగాపురం, మూల పేట వరకు రోడ్డు వేయాలని సంకల్పిస్తే.. ఇళ్లకు నష్టం జరుగుతుందని ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేశారు.ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారు. గూగుల్ డాటా సెంటర్ అనండి.. మరొకటనండి.. ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించరు. అలాగని, దానివల్ల వచ్చే సమస్యల గురించి ప్రశ్నించడం తప్పని కూటమి ప్రభుత్వం అంటున్నా.. ఎల్లో మీడియా ఏడుపు లంఖించుకున్నా.. అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కచ్చితంగా ఎలాంటి సందేహాలు ఉన్నా, నివృత్తి చేసి ముందుకు వెళితే మంచిదని చెప్పాలి. నకిలీ మద్యం మాఫియా, ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిన వైనం, పంటలకు గిట్టుబాటు దరలు లేక రైతులు పడుతున్న పాట్ల గురించి కూడా ఇలాగే ఆదారాలతో జగన్ ప్రసంగించారు. జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇచ్చే పరిస్తితి లేనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏదో విధంగా ఎదురుదాడి చేసి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకుంది. అదానీ డాటా సెంటర్ కు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలకు.. చంద్రబాబు లేదంటే లోకేష్‌లు నేరుగా పాయింట్ వైజ్ జవాబు ఇచ్చి ఉంటే అర్దవంతంగా ఉండేది. ఆ పని చేయలేకపోతున్నారు కాబట్టే పాలన సామర్ధ్యంలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధవంతం అనిపిస్తాయి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో నకిలీ మద్యం.. ప్రమాదకరం కాదంట!
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ఎల్లోమీడియా వింత పోకడలకు పోతోంది. ల్యాబ్ నివేదికలపై చిత్ర విచిత్రమైన కథనాలు ప్రచురిస్తోంది. మద్యపానం ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని ప్రచారం చేయాల్సిన బాధ్యతాయుతమైన మీడియా సంస్థ, కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గత ఎన్నికల సమయంలోనే నాణ్యమైన మద్యమిస్తామని జనాన్ని మభ్యపెట్టిన విషయం ఒకసారి గుర్తుచేసుకోవాలిక్కడ. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా తాము గెలిస్తే రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని నిస్సిగ్గు ప్రచారం కూడా చేసుకుందీ కూటమి. అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచిన మద్యం దుకాణాలను కాస్తా ప్రైవేటకు అప్పగించేసింది. ఈ బాధ్యతారహితమైన నిర్ణయమే నకిలీ మద్యం దందాకు, కుంభకోణానికి దారితీసిందన్నది అంచనా. గత ప్రభుత్వం మాదిరిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా విక్రయాలు జరపకపోవడం, విచ్చలవిడిగా పర్మిట్ రూములను అనుమతించడం, బెల్ట్‌షాపుల అణచివేతకు చర్యలు తీసుకోకపోవడం వంటి ఇతర కారణాలు కూడా మార్కెట్లో అసలుకు, నకిలీకి మధ్య తేడా తెలియని స్థితికి నెట్టింది. ఇదే ఛాన్సుగా భావించిన కొందరు టీడీపీ నేతలు ఫ్యాక్టరీ పెట్టిమరీ నకిలీ మద్యాన్ని తయారు చేసి పంపిణీ చేయడం మొదలుపెట్టారు. సరుకు నిల్వలకు ప్రత్యేక ఏర్పాట్లు, హైదరాబాద్ నుంచి సరఫరా వంటి అనేకాకనేక అక్రమాలకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువు వద్ద నకిలీ ప్లాంట్, ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఒక డంప్ బయటపడ్డాయి. తరువాతి కాలంలో ఎక్సైజ్ పోలీసులు కొందరిని పట్టుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నకిలీ మద్యంతో చాలామంది అనారోగ్యానికి గురై ఉండవచ్చునని, మృత్యువాత పడి ఉండవచ్చునని అనుమానాలు ఉన్నాయి. నకిలీ మద్యం కుంభకోణాన్ని కాస్తా వైసీపీవైపు తిప్పేందుకు అధికార టీడీపీ విఫలయత్నం చేసింది. సొంతపార్టీ నేతలే పలువురు కీలక సూత్ర, పాత్రధారులుగా స్పష్టం కావడంతో రోజుకో కొత్త కథతో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. ములకలచెరువుతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లభించిన నకిలీ మద్యం శాంపిళ్లను పరీక్షల కోసం పంపగా.. వచ్చిన ఫలితాలను మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా నకిలీ మద్యం తయారు చేశారని, ప్రమాదకరం కాకపోయినా మంచిది కాదని లాబ్ అధికారులు నివేదించారని తెలుగుదేశం మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది. ఒక సమాచారం.. ప్రకారం.. నీళ్లు, స్పిరిట్, రంగు ,రుచి రసాయనాలతో నకిలీ మద్యం తయారైందని గుంటూరు లాబ్ నివేదిక ఇచ్చిందట. వారికి అందిన 45 శాంపిల్స్ నకిలీ మద్యమేనని తేల్చిందట. అండర్ ఫ్రూఫ్, ఓర్ ఫ్రూఫ్లలో భారీ వత్యాసం ఉందని కనుగొన్నారు. లాబ్ రిపోర్టు తీవ్రత తగ్గించి చూపడానికి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. బార్లు, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ ల ముసుగులో నకిలీ మద్యం దందా సాగుతోందని ఆయన అన్నారు. ఈ 16 నెలల్లో వైన్ షాపుల ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపులు, రూ.99 రూపాయల ధర కలిగిన లిక్కర్ సేల్స్ వివరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం ఆదాయంపై విపరీతంగా ఆధారపడ్డ రాష్ట్ర ప్రభుత్వం నకిలీమద్యం పేరెత్తితే కేసులు బనాయించేందుకు సిద్ధమవుతోంది. దుగ్గిరాల మండలంలో పెరిగిపోతున్న బెల్ట్ షాపుల గురించి లేఖద్వారా తెలియజేసినందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ చిర్రుబుర్రులాడారట. ఆ కోపంతో ఆయన తన భర్త దాసరి వీరయ్యపై అక్రమంగా హత్యకేసు బనాయించారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ వాపోతున్నారు. పేర్ని నాని మరో సంచలన విషయం చెప్పారు. బార్ల యజమానులకు ప్రభుత్వం నిర్దిశించిన ఫీజ్ కట్టాలంటే విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర నగరాలలో రోజుకు మూడు లక్షల రూపాయల మద్యం అమ్మాల్సి ఉంటుందట. ఇందుకోసం ప్రభుత్వం నుంచి నెలకు రూ.80 లక్షల విలువైన సరుకు కొనాలట. ఈ బార్లవారు నెలకు ఎంత సరుకు కొంటున్నారో వివరాలు బయటపెట్టగలరా అని పేర్ని నాని సవాల్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించాలంటే ఆ వివరాలు వెల్లడించాలి. బార్లలో అమ్మే మద్యంలో పదిశాతం కూడా ప్రభుత్వం వద్ద కొన్నది కాదని ఆయన ఆరోపించారు. ఇది నిజమే అయితే సంచలనమే అని చెప్పాలి. 500 బార్ల నుంచి నెలనెలా రూ.5 కోట్లు అడ్వాన్స్ గా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది నకిలీ మద్యం కన్నా భారీ కుంభకోణం అని ఆయన అంటున్నారు. గతంలో ఎల్లో మీడియా.. నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చిన మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయిస్తేనే నాసిరకం మద్యం అని, పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రచారం చేసింది. చంద్రబాబు అయితే ఏకంగా 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మితే దానిపై ఫేక్ ప్రచారం జరుగుతోందని ఎదురుదాడి చేస్తున్నారు. పోలీసులను ప్రయోగించి కేసులు పెడుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాపై పోలీసులతో వెంటాడుతున్నారు. సాక్షిని, సోషల్ మీడియాను అణచివేస్తే నకిలీ మద్యం సమస్యను కప్పిపుచ్చవచ్చని భ్రమ పడుతున్నారు. దానికి ఎల్లో మీడియా నకిలీ మద్యం ప్రమాదకరం కాదంటూ వంతపాడుతూ సమాజానికి ద్రోహం చేస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. భ్రాంతి కాకూడదు!
హైదరాబాద్‌లో భూమి ధరలు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. ఎకరా భూమి ఏకంగా రూ.177 కోట్లు పలికిందంటే ఆశ్చర్యమేస్తోంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవన్న వార్తలొస్తున్న వేళ ఒక కంపెనీ ఇంత మొత్తం పెట్టిందంటటే నమ్మశక్యం కాదు. వేలం పాటలో కొన్నమాటైతే వాస్తవం. అయితే కొనుగోలు ధర పూర్తిగా చెల్లించినప్పుడే ఈ విలువ ధృవీకరణ అవుతోంది.తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నది దుష్ప్రచారమేనని వాస్తవం లేదని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.2800 కోట్ల విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగితే, అది రూ.4804 కోట్లు అని రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఇదే ఆధారమని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే జనాభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కాస్త బాగున్న రోజుల్లో బుక్ అయిన ఇళ్లు, అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుండవచ్చని, ప్రస్తుతం బుకింగ్ ఎంత మేరకన్నది కూడా చూడాలంటున్నారు వారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణతోపాటు దేశాద్యంతం కూడా మందగతిలోనే ఉందని వారు చెబుతున్నారు.కొన్ని రోజుల క్రితం తెలంగాణ పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ రాయదుర్గ్‌లోని 7.67 ఎకరాల భూమిని వేలానికి పెడితే ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1350 కోట్లకు దక్కించుకుంది. పెస్టీజ్ రియాల్టీ ఇంకో 11 ఎకరాలను ఎకరాకు రూ.141.5 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.2913 కోట్ల ఆదాయం దక్కిందన్నమాట. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల రూపంలో ఇంకో రూ.225 కోట్లు కూడా రానున్నాయి. అయితే గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే.. వేలం పాడిన ఈ సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేంతవరకూ కొనసాగుతాయా అన్న అనుమానం వస్తుంది. 2023లో కోకాపేటలో ఎకరాకు రూ.100.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అప్పటితో పోలిస్తే ధర సుమారు 76 శాతం పెరిగిందన్నమాట. హైదరాబాద్ సాధిస్తున్న సుస్థిరాభివృద్ధి, గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మారడం, మౌలిక వసతులు తదితరాలు ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని టీజీఐఐసీ ఎండీ శశాంక అభిప్రాయపడ్డారు. ఇవన్నీ వాస్తవమైతే ఫర్వాలేదు కానీ.. బలవంతంగా మార్కెట్‌ను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం బెడిసికొడుతుందని రియల్ ఎస్టేట్ రంగం అనుభవజ్ఞులు చెబుతున్నారు.ఎకరా భూమికి రూ.177 కోట్లు, రూ.141.5 కోట్లు పెట్టి కొన్న కంపెనీలు నిర్మాణాలు పూర్తయిన తరువాత ఎంత కాదన్నా అన్ని ఖర్చులు కలుపుకుని చదరపు అడుగు రూ.30 - 40 వేల కు అమ్ముకోవాల్సి వస్తుందని కొందరు బిల్డర్ల అంచనా. అయితే ఆ ప్రాంతంలో ఎఫ్ఎస్ఏ ఎక్కువ కాబట్టి ఏభై, అరవై అంతస్థుల నిర్మాణానికి కూడా అనుమతులు లభిస్తాయని... ఆ రకంగా చదరపు అడుగుకు రూ.10 - 20 వేలకు అమ్ముకున్నా గిట్టుబాటు అవుతుందని మరికొందరి అంచనా. మరీ ఎక్కువ ధర పెడితే కంపెనీలు కూడా కొనుగోలుకు ఆలోచిస్తాయని చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడిపై ఒక శాతం కూడా గిట్టుబాటు కాదనుకుంటే ఎందరు కొనుగోలు చేస్తారు అని ఒక ప్రముఖ బిల్డర్ ప్రశ్నించారు.కోకాపేటలో పక్కనే 50 - 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో దాని ధర రూ.వంద కోట్లయితే తనదీ అంతే పలుకుతుందన్న అంచనాతో గతంలో ఒక కంపెనీ వేలంలో పాల్గొందని సమాచారం. అయితే ఆ అంచనాలు తారుమారు కావడంతో ఆ కంపెనీ తన డిపాజిట్‌ను వదులుకుంది మినహా ఎకరాకు రూ.వంద కోట్లు చెల్లించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుత వేలం పాటలలో పాల్గొన్న కంపెనీలలో ఒక రాజకీయ నేత భాగస్వామిగా ఉన్నారు. ఇటీవలే రియల్ ఎస్టేట్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడియన ఆయన కంపెనీనే ఇంత భారీ మొత్తానికి వేలం పాటలో పాల్గొనడం వెనుక మతలబు ఏమిటన్నది ప్రశ్న. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా మాంద్యం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లేవు. అమెరికా ప్రభుత్వ విధానాలు, ప్రత్యేకించి ట్రంప్ సుంకాలు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఏఐ కారణంగా ఐటీ రంగం అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు గతంలో మాదిరిగా రుణాలపై అపార్టుమెంట్లు కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. పైగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలు, అపార్ట్మెంట్లు కొనుగోలుదారులు, అద్దెదారుల కోసం వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నంతలో హైదరాబాద్ కాస్తో, కూస్తో బెటర్‌గా ఉండవచ్చేమో కాని, ఈ స్థాయిలో ధరపెట్టి కొనుగోలు చేసేంతగా ఉండకపోవచ్చని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఇంకో సంగతి గుర్తు చేసుకోవాలి. హెచ్ఎండీయే ఇటీవలే హైదరాబాద్ శివార్లలో 103 ప్లాట్లను వేలం వేస్తే, మూడు మాత్రమే అమ్ముడుపోయాయి. వేలం ద్వారా రూ.500 కోట్లు వస్తాయని ఆశిస్తే, రూ.38 కోట్లే వచ్చాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఎకరం రూ.177 కోట్లకు కొనేంత మార్పు వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చివరి రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మరింతగా దిగజారిందన్న అపప్రథ ఉంది. దీనిని కప్పిపుచ్చడానికి రేవంత్ ప్రభుత్వం ఏదో మాయాజాలం చేసి ఉండాలని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు ప్రముఖ సంస్థలపై ఒత్తిడి తెచ్చి, ఇతరత్రా మేలు చేస్తామని ఆఫర్ ఇచ్చి ఈ స్థాయిలో ధర పలికేలా చేశారన్నది కొందరి అనుమానం. ఈ రెండు కంపెనీలు గడువులోపు డబ్బును చెల్లిస్తే రేవంత్ ప్రభుత్వ విశ్వసనీయత, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అమాంతంగా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఫ్యూచర్ సిటీపై కూడా పడుతుంది. అక్కడ కూడా లావాదేవీలు పుంజుకుంటాయి. రీజినల్ రింగ్ రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ - విజయవాడ రోడ్లు విస్తరణ, కొత్తగా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే వంటివి కూడా కార్యాచరణకు వచ్చినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. ఇంతకాలం నేచురల్ గా గ్రోత్ ఉండడం వల్ల భూముల ధరలు పెరిగాయి. అయితే ఇవీ మరీ పెరిగిపోతే మధ్య తరగతికి అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబును రక్షించేందుకేనా ‘ఉచిత’ సలహా?
ప్రజాకర్షక పథకాలు, వారసత్వ రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సమయం సందర్భం వెనుక ఉద్దేశం ఏమిటా? అనేదీ చర్చనీయాంశంగా మారింది. ఉచితాల గురించి ఆయన గతంలోనూ కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ.. సంక్షేమ పథకాలను రాజకీయం కోసం వాడుకుంటున్న వారికి మద్దతిచ్చి విమర్శలకు గురయ్యేవారు. అలాంటిది తాజాగా.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘స్వర్ణ భారతి ట్రస్టు’లో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణాల వంటివి మహిళలకు కాకుండా దివ్యాంగులకైతే అమలు చేయవచ్చునని, ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావిస్తూ ఐదేళ్లలో ఎంత అప్పు చేస్తారన్న దానిపై స్పష్టత ఉండాలని, అప్పులను ఎలా తీర్చుతారో కూడా ప్రజలకు తెలియ చేయాలని ఆయన సూచించారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ది చేస్తే పేదరికం తగ్గుతుందని, ఉచితాల వల్ల కాదని అన్నారు(Venkaiah Naidu Shocking Comments On CBN Govt). వెంకయ్య నాయుడు వ్యాఖ్యలలో తప్పేమీ లేదు కానీ.. ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏపీ సర్కారును సంక్షోభం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేక చంద్రబాబుతో కాస్త తేడా వచ్చిందా అన్న అనుమానం వస్తుంది. అయితే వెంకయ్య నాయుడు, చంద్రబాబు, లోకేశ్‌లు ఇటీవలే ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. దీన్నిబట్టి ఊస్తే పొరపచ్చాలు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఇదీ చదవండి: అడ్డగోలు ఉచితాలెందుకు? ఏపీ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలుఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అలవిగాని హామీలను అమలు చేయలేక నానా పిల్లిమొగ్గలు వేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్‌సహా సుమారు 150 వరకూ వాగ్ధానాలిచ్చిన కూటమి నేతలు ఏడాదిపాటు వాటి అమలును ఎగవేసి ఆ తరువాత కూడా అరకొరగా కొన్నింటిని మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించాయి. అది కూడా ప్రజల నిరసన నుంచి తప్పించుకునేందుకు మాత్రమే. ఎన్నికల సమయంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి షరతుల్లేకుండా తిరగవచ్చని ఊరించిన చంద్రబాబు అధికారం వచ్చిన తరువాత మాత్రం ఏసీ బస్సుల్లో ఎక్క కూడదని, సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ అనుమతించమని, పదహారు రకాల బస్సు సర్వీసుల్లో ఐదింటిలో మాత్రమే ఉచిత స్కీము అమలు మొదలుపెట్టారు. అంతేకాకుండా.. బస్సు సర్వీసులను బాగా తగ్గించి నడుపుతూండటంతో ఉచిత స్కీము ఉన్నా లేనట్టుగా మారిపోయింది. మరోవైపు ఈ స్కీము వల్ల ఆటోలు నడుపుకునే వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆందోళనకు దిగడంతో రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. ప్రచారం సమయంలో 13 లక్షల మంది ఆటోల వారు ఉన్నారని చెప్పి, మూడు లక్షల మందికే ఈ సాయం ఇచ్చారు. రోజుకు వెయ్యి నుంచి రెండువేల వరకు సంపాదించుకునే తమకు ఇప్పుడు రూ.200 నుంచి రూ.500 రావడమే గగనం అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున ఇస్తే ఏ అవసరం తీరుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవే. కాకపోతే ఎన్నికల మానిఫెస్టో ప్రకటించినప్పుడే ఈ కామెంట్లు చేసి ఉంటే అంతా మెచ్చుకునేవారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టీడీపీ, జనసేనలు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలను ఎలా మోసం చేయబోతున్నారో వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి దాదాపు రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని లెక్కగట్టి మరీ చెప్పారు. అయినా అప్పట్లో వెంకయ్య నాయుడు వంటివారు దానిపై కూటమి నేతలను ప్రశ్నించలేదు. పరోక్షంగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ద్వారా చంద్రబాబు సర్కారుకు వాటి నుంచి బయటపడడానికి ఒక మార్గం చూపుతున్నారా? అనే సందేహం వస్తుంది. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేశారు. 1996 ఎన్నికల సమయంలో మద్య నిషేధం, కిలో రెండు రూపాయల బియ్యం పథకం వంటి వాటిని అమలు చేస్తామని ప్రచారం చేసిన ఆయన తదుపరి ఆ స్కాముల వల్ల నష్టం జరుగుతోందని, ప్రజాభిప్రాయం సేకరణ తంతును నిర్వహించి వాటన్నిటిని రివర్స్ చేశారు. గత టర్మ్‌లో రైతులకు పూర్తిగా రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు కాని చేయలేకపోయారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం మీడియాను, వెంకయ్య వంటివారితో ముందుగా ప్రచారం చేయించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టామని చెప్పి, స్కీములకు ఎగనామం పెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరగుతోందా? అనే సందేహం పలువురిలో కలుగుతోంది. ఎందుకంటే.. టీడీపీ మీడియా కూడా కొన్నాళ్ల క్రితం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చింది. ఇదే మీడియా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అద్భుతం అంటూ ప్రచారం చేసేది. అధికారం వచ్చాక చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా ప్రజలను మాయ చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది. ఆ విన్యాసాలలో వెంకయ్య నాయుడు వంటివారు భాగస్వాములు కారాదని అంతా కోరుకుంటారు. విద్య, వైద్యానికి సంబంధించి జగన్ చేసిన కృషి కళ్లకు కనబడుతున్న విషయమే. అయినా వెంకయ్య నాయుడు ఎన్నడూ మెచ్చుకోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఎవరిమీదో ప్రేమతో కాకుండా, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాట్లాడితే మంచి విలువ వస్తుంది. వెంకయ్య ఆ పని చేశారా అన్నది ప్రశ్న. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాని తెలుగుదేశంలోని వారసత్వ రాజకీయాల గురించి ఎందుకు ఆయన ప్రస్తావించరన్న సంశయం వస్తుంది. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న విధానం గురించి తన అబిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది. ఈ పదిహేడు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన రూ.2.10 లక్షల కోట్ల రుణం గురించి కూడా వెంకయ్య కామెంట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు. ఈ మధ్యకాలంలో బీహారు ఎన్నికల నేపథ్యంలో 75 లక్షల మంది మహిళలకు రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. దానికి ప్రదాని మోదీ బటన్ నొక్కారు. 2014లో బీజేపీలో వెంకయ్య నాయుడుకు ముఖ్య భూమికే ఉండేది. అయినా ఆ పార్టీ చేసిన వాగ్ధానాలతో ఎన్ని ప్రజాకర్షక విధానాలు ఉన్నాయో ఆయనకు తెలియవా? అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో.. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకు వచ్చి రూ.15 లక్షల చొప్పున పంచుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసేవారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ విషయాలన్ని పలుమార్లు ప్రస్తావించేవారు. ఆ తర్వాత కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు కూడా మంత్రి. పార్టీ ఫిరాయింపులపై కూడా వెంకయ్య నాయుడు స్పందించారు. కాని ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసిన తీరు కూడా విమర్శలకు గురైంది. ఎన్డీయేకి దూరమైన సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో ఎంత వేగంగా అనర్హత వేటు వేసింది కూడా చర్చనీయాంశమైంది. 2014 టర్మ్‌లో ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న అంశం గురించి కూడా వెంకయ్య పల్లెత్తు మాట అన్నట్టు లేదు. చేతిలో అధికారం ఉన్నప్పుడు గట్టిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఆయన మాటకు విలువ వచ్చేది. మరో సంగతి కూడా చెప్పాలి. ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా తన పరపతి ఉపయోగించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాజీ కుదర్చిన వారిలో ఉన్నారని చెబుతారు. తాజాగా ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్లు, అందులో టీడీపీ నేతల పాత్రపై కూడా వెంకయ్య నాయుడు గట్టిగా మాట్లాడి ఉంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చినవారై ఉండేవారేమో కదా!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన గ్రహణమేమిటో?
ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? ఒకపక్క నకిలీ మద్యం.. ఇంకోపక్క కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అవుతోంది. ప్రభుత్వానికేమో ఏదీ పట్టదాయె! అధికార పార్టీ తన దందాల్లో బిజీ!. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద నకిలీ మద్యం ప్లాంట్‌ను గుర్తించడం తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు అద్దం పడుతోంది. అలాగే ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కూడా. రాష్ట్రంలో అనకాపల్లి, పాలకొల్లు, గూడూరుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ ఒకటి బయటపడింది. వీటి పుణ్యమా అని ఏపీలో కల్తీ మద్యం ఏరులైపారుతోందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది. ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియని పరిస్థితి. కల్తీ మద్యం అమ్మకాలకు ఒక నెట్ వర్క్.. తెలుగుదేశం నేతల అండ ఉండవచ్చని తెలుస్తోంది(AP Spurious Liquor Racket). జగన్ టైమ్‌లో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా ఇప్పుడు నిమ్మకు నీరెత్తితే ఒట్టు. పైగా నిందితులు వైసీపీ వారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టింది. తంబళ్లపల్లెలో టీడీపీ పక్షాన పోటీ చేసిన జయచంద్రా రెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని, ఆయనే టీడీపీలోకి పంపించారని చిత్రమైన ప్రచారం ఆరంభించింది. చంద్రబాబును కాపాడేందుకా? అన్నట్టు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవదన్నారని కథనాలు వండి వార్చింది. అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతం వరకు ఓకే గాని, అన్ని కోణాల్లో అనడంలోనే మతలబు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు మంత్రులకూ సంబంధం ఉన్న ఈ కేసు నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. పైకి తూతూ మంత్రంగా తంబళ్లపల్లె ఇన్‌ఛార్జి జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరికీ చంద్రబాబు, లోకేశ్‌లకు ఉన్న దగ్గరి సంబంధాలు, కలిసి దిగిన ఫొటోలిప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఈ క్రమంలో వేలాది దుకాణాలను దక్కించుకున్న టీడీపీ నేతలు ఇతరులకు దక్కకుండా ఎమ్మెల్యేల చేత భయపెట్టించిన వార్తలూ మనం చూశాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు కాస్తా మినీబార్లుగా మారాయి. వీటికి లెక్కకు మిక్కిలి బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉండగా..రాష్ట్రం మొత్తమ్మీద వీటి సంఖ్య లక్షకు మించిపోయాయని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియానే అంచనా వేస్తోంది. ఈ బెల్ట్ షాపులతోపాటు అనుమతి కలిగిన మద్యం దుకాణాలకూ కల్తీమద్యం సరఫరా అయి ఉంటుందన్నది కొందరి అనుమానం. ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు కొంతమందికి లైసెన్స్డ్ వైన్ షాపులు కూడా ఉండటం గమనార్హం.అప్పట్లో చంద్రబాబు నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని నిరాధారంగా ఆరోపిస్తే(Chandrababu AP Spurious Liquor Racket Drama).. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా చిలువలు వలువలు చేసింది. టీడీపీ నేతలు స్వయంగా విషపూరిత మద్యం సరఫరా వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్‌కే రంగులు, ఎస్సెన్స్‌లు కలిపి, గుర్తింపు పొందిన బ్రాండ్ల బాటిళ్లలో నింపి మార్కెట్ లోకి వదలుతున్నట్లు వెల్లడవుతోంది. నాణ్యమైన మద్యం రూ.99 రూపాయలకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన కూటమి నేతలిప్పుడు ఏకంగా విషం ఇస్తున్నారని వీటి బారినపడి ఎన్నివేల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అకాల మృత్యువుకు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా(Kutami Prabhutvam Fake Liquor) వర్ధిల్లుతోందని, ప్రజలకు ఉపాధి, మేలు కలిగించే పరిశ్రమలు ఏవీ రావడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఒక కల్పిత స్కామ్ ను సృష్టించి ఎవరెవరిపైనో దాడులు చేస్తూ, పలువురు ప్రముఖులపై కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్, ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు.ములకల చెరువు నకిలీ మద్యం దందా విలువ సుమారు రూ.6,000 కోట్లంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులకు వెయ్యి లీటర్లకుపైగా స్పిరిట్, వేల బాటిళ్ల నకిలీ మద్యం పట్టుబడడం, జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే అన్ని రకాల యంత్ర సామాగ్రీ, హంగులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటే.. పై స్థాయి నుంచి గట్టి మద్దతే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జనార్ధనరావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లెకు వెళ్లి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరి అండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులను తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డైరీలోని వివరాలు, పేర్లు ఎవరివి? సూత్రధారులు ఎవరు? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? అన్న అంశాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఎందుకు నియమించలేదు?.. ఒక వేళ నిజంగానే సిట్ ను ఏర్పాటు చేసినా, వారికి స్వేచ్చ ఉంటుందా?.. మరో వైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మరణించారు. సుమారు వంద మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో 24 మంది అంతుపట్టని వ్యాధితో మృతి చెందారు. దీనికీ కలుషిత నీరే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంచినీరు దొరుకుతుందో లేదో కాని, మద్యం విచ్చలవిడిగా పారుతోంది. దానికి తోడు విషపూరితమైన నకిలీ బ్రాండ్లు అడ్డూ, ఆపు లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . ఫలితంగా అనేక అనర్ధాలు సమాజంలో ఏర్పడుతున్నాయి.అందువల్లే ఏపీకి ఏమైంది? అని ఆందోళన చెందాల్సి వస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలివితక్కువ కథ(నా)లకు కేరాఫ్‌గా..
మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ, లోక్‌సభలో వైఎస్సార్ పార్టీ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావడం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థకు చెంపపెట్టే. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా జరిగిన ఈ అక్రమ అరెస్ట్ ప్రత్యేక అధికారుల బృందం (సిట్)తోపాటు, కల్పిత కథలతో మద్యం కేసంటూ శివాలెత్తిన ఎల్లోమీడియాకూ పెద్ద హెచ్చరికగా కూడా చూడొచ్చు. ఎల్లోమీడియా కథనాలు చదివితే అర్థమయ్యేది ఒక్కటే. జర్నలిజానికి, నైతిక విలువలకు ఎప్పుడో పాతరేశారు అని. ఇంతకీ ఏసీబీ కోర్టు ఏమంది? మద్యం కేసులో మిథున్ రెడ్డి పాత్రను, మాస్టర్‌మైండ్ అనేందుకూ ప్రాథమిక ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది. ముడుపుల వసూళ్ల ఆరోపణలకు, నేరపూరిత కుట్రకూ ఆధారాలెక్కడని ప్రశ్నించింది. సహ నిందితుల వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత ఉండదని తేల్చింది. ఒట్టి ఆరోపణల ఆధారంగా పౌరుల బెయిల్ హక్కును నిరాకరించలేమని వ్యాఖ్యానించింది. జర్నలిజానికి విలువిచ్చే ఏ మీడియా సంస్థ అయినా.. మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, బెయిల్ వచ్చిన సందర్భంలోనూ వార్తకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అరెస్ట్‌ను పతాక శీర్షికలకు చేర్చి బెయిల్ వార్తను అప్రధాన్యంగా మొక్కుబడిగా ఇవ్వడాన్ని బట్టే వీరి నైజం ఏమిటన్నది అర్థమైపోతుంది. ఈ క్రమంలో వారు కోర్టు వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోలేదు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు అటు ఎల్లోమీడియా, ఇటు పోలీసులు అధికారుల వద్ద కూడా సమాధానాలు లేవు. దీన్నిబట్టి చూస్తే జగన్ హయాంలో స్కాముల కోసం ఎల్లోమీడియా భూతద్దం వేసి చూసినా ఏమీ దొరకలేదన్నది స్పష్టమైంది. అందుకే ఒక మద్యం కేసు కట్టుకథ సృష్టించారు. డిస్టిలరీ కంపెనీలు ముడుపులు ఇచ్చాయంటూ చిత్రమైన కథ అల్లారు. ముడుపులు ఇవ్వాల్సి వచ్చిందని, ఇచ్చామని కంపెనీలు కదా ఫిర్యాద చేయాల్సింది? కానీ ఈ కేసులో ఎవరో దారినపోయే దానయ్య ఫిర్యాదు ఇస్తే రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఆఘమేఘాల మీద విచారణకు ఆదేశించడం. హుటాహుటిన సిట్ ఏర్పాటు జరిపోయాయి. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం అన్నమాట. పైగా ఇదే కేసులో నిందితుడు అంటూనే సిట్ విజయసాయిరెడ్డి జోలికి అస్సలు వెళ్లకపోవడం అనుమానాలను ధ్రువీకరిస్తుంది. గత ఆగస్టులో సిట్ వేసిన ఛార్జ్‌షీట్‌పై న్యాయస్థానం 21 అభ్యంతరాలను లేవనెత్తింది. దారిమళ్లాయని చెబుతున్న రూ.3,500 కోట్ల వివరాలు ఎక్కడ అనడం ఒకటైతే... సిట్ అధికారులు న్యాయస్థానం నుంచి ఏమి అభ్యర్థిస్తున్నారో చెప్పాలని అడగడమే విశేషం. ఛార్జ్షీట్లోని లోపాలను తాము అడిగిన విధంగా కూడా సరిదిద్దలేదని న్యాయస్థానం పోలీసులు ఇచ్చిన జవాబుపై వ్యాఖ్యానించడం గమనార్హం. తర్వాత రోజుల్లో ఈ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. ఛార్జ్‌షీట్ సక్రమంగా లేకుండా రిమాండును అరవై లేదా తొంభై రోజులకు మించి పొడిగించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. సిట్ కప్పగెంతులు ఎప్పటికప్పుడు బయటపడుతున్నా ఎల్లో మీడియా మాత్రం ఏదో కొత్త విషయం కనిపెట్టినట్లు కథనాలు వండుతూ ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేసింది. తేదీలతో నిమిత్తం లేకుండా ఈనాడులో వచ్చిన కొన్ని స్టోరీలను చూద్దాం. ‘‘మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు, ‘‘డొల్ల కంపెనీలు, హవాలా ద్వారా రూ.400 కోట్ల తరలింపు’’ - మరికొన్ని మొత్తాలు యూకే, దుబాయి, అమెరికాకు తరలింపు.. ‘‘హవాలా ఏజెంట్ల విచారణలో సిట్‌కు కీలక అధారాలు లభ్యం’’ ..అని ఒక రోజు రాశారు. మరి ఆ తర్వాత అది ఏమైపోయిందో తెలియదు. అలాంటి అభియోగాలతో వారు చెబుతున్న బిగ్ బాస్ పై కేసు పెట్టలేదే! అంటే తప్పుడు ప్రచారం కోసం అల్లిన కథేనని తెలియడం లేదూ! మద్యం ముడుపుల సొమ్ము విదేశాలకు తరలింపు అని పెద్ద హెడింగ్ పెట్టి ఈడీ సోదాలలో కీలక ఆధారాలు లభ్యం అని కొద్ది రోజుల క్రితం రాశారు. ఆ తర్వాత ఆ కథ ఏమైందో తెలియదు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై స్టోరీ ఇస్తూ డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు అన్నారు. దీన్ని చెవిరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సవాల్ చేశారు. ఆ వార్తను కప్పిపుచ్చారు. మిథున్ రెడ్డి అరెస్టు అయినప్పుడు భారీ కథనం ఇస్తూ బిగ్ బాస్ తరపున దోపిడీకి కుట్ర, అమలులో ప్రధాన పాత్ర, ముడుపుల వసూళ్ల నెట్ వర్క్ రూపొందించింది ఆయనే అని ఈ పత్రిక పేర్కొంది. సిట్ ఆధారాలు సేకరించిందని కూడా రాసేసింది. మరి అది నిజమే అయితే ఆ ఆధారాలేమిటో కోర్టు ముందుకు ఎందుకు ఉంచలేకపోయారో ఇప్పుడు రాయాలి కదా! ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు స్వయంగా తేల్చి చెప్పింది. మద్యం స్కామ్ ఛార్జ్‌షీట్‌లో పలుచోట్ల జగన్ పేరు ప్రస్తావించారని ఈ పత్రిక తెలిపింది. కల్పిత కథలో ఆయననే టార్గెట్‌గా పెట్టుకున్నప్పుడు ఆ పేరు రాయకుండా ఎలా ఉంటారు. కాని ఏ చిన్న ఆధారం ఉన్నా ఈ పాటికి అరెస్టు అంటూ హడావుడి చేసేవారు కదా!. గతంలో ఓటుకు నోటు కేసులో ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు 33 సార్లు ప్రస్తావించారు. అయినా ఆయన నిందితుడు కాకుండా ఎలా తప్పించుకున్నారో ఈ మీడియా ఎన్నడూ రాయలేదు. ఆ సన్నివేశం అంతా చూసిన ఓపెన్ కేసే అనే సంగతి తెలిసిందే. ఇప్పుడేమో కల్పిత స్కామ్ పేరుతో కథ నడుపుతున్నారు. మద్యం కేసులో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి అంటూ ఇంకో రోజు ప్రచారం చేశారు. సిట్ కు ఆధారాలు దొరికపోయాయని కూడా సంబరపడ్డారు. ఇప్పటికీ అదేమీ తేలలేదు. పదహారు డిస్టిలరీల ముడుపులే రూ.1677 కోట్లు అని సిట్ వీరికి చెప్పిందట. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ కంపెనీలు బ్రాండ్ ప్రమోషన్ పేరుతో పలు సంస్థల ఖాతాలలోకి మళ్లించి, నగదు విత్ డ్రా చేయించి ఆ మొత్తాన్ని ముడుపులుగా చెల్లించి, తర్వాత వైకాపా ముఠా ఈ డబ్బును స్థిరాస్తి రంగంలోకి, డొల్ల కంపెనీలలోను పెట్టేదట. హవాలా ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరేది అని సిట్ తేల్చిందట. ఇది చదువుతుంటే ఇంత తెలివితక్కువగా కథలు సృష్టిస్తారా అనిపించదా! .. బ్యాంకు ఖాతాల నుంచి ఇంత భారీ మొత్తాలలో విత్ డ్రా చేస్తే పట్టుకోవడం పోలీసులకు చేతకాదా?. మరి ఆ డబ్బు గురించి ఛార్జ్‌షీట్‌లో ఏమైనా రాశారా??.. అంటే అదీ ఉన్నట్లు లేదు. ఈనాడుతోపాటు ఆంధ్రజ్యోతి కలిసే ఈ కల్పిత గాథలను సృష్టించాయన్న అభిప్రాయం ఉంది. పోలీసులు వీరికి అండగా నిలుస్తూ వారి పాత్ర వారు పోషించారనుకోవాలి. ఉదాహరణకు.. బాక్సులు బద్దలు-లిక్కర్ స్కామ్ సొమ్ము-రూ.11 కోట్లు సీజ్ అని ఒక రోజు గోలగోల చేశారు. ఇదెలా అని అనుకుంటుండగానే, ఈ కేసులో నిందితుడు అయిన రాజ్ కెసిరెడ్డి ఆ డబ్బు తనది కాదని, ఆ నోట్లపై నంబర్లు రికార్డు చేయండని అనగానే సిట్ అధికారులు జారుకున్నారు. ఆ డబ్బును కోర్టులో జమ చేయలేకపోయారు. పైగా బ్యాంకులో జమ చేసేసినట్లు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఆ డబ్బు విడిగా ఉంచారో, లేదో తెలియదు. అలాగే వెంకటేష్ నాయుడు కథ మరొకటి. గుట్టలు, గుట్టలుగా నోట్ల కట్టలు.. దోచుకున్న సొమ్ముతో దొరికేశారు.. సిట్ కు చిక్కిన వీడియో అని ఈ ఎల్లో మీడియా హడావుడి చేసింది. తీరా చూస్తే తమ వద్ద ఎలాంటి వీడియో లేదని, వెంకటేష్ నాయుడి ఫోన్‌ను తెరవనే లేదని సిట్ కోర్టుకు చెప్పింది. ఈ వార్తను మాత్రం తమ పాఠకులకు పూర్తిగా తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. పైగా వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ తదితరులతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటపడడంతో తేలుకుట్టిన దొంగల మాదిరి గప్ చుప్ అయిపోయారు. ఈ కేసులో ఏ ప్రముఖుడిని అరెస్టు చేస్తే అతనే కీలకమని సూత్రధారి అని, ముడుపుల వసూళ్లు అతని ద్వారానే జరిగాయని అందరిమీద రాస్తూ వచ్చారు. అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి డేటా పోయిందని, అదేదో మూడు లక్షల జీబీలు ఉంటుందని, కోట్ల పేజీలతో సమానం అంటూ ఒక కథను ఈనాడు అల్లింది. అది చూసి జనం నవ్వుకున్నారు. ఆ తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ తమ వద్ద నుంచి ఎలాంటి సమాచారం పోలేదని చెప్పడంతో ఈ మీడియా పరువు మరోసారి పోయింది. ఇలా ఒకటి కాదు..గత ఏడాది కాలంలో ఏదో రకంగా వైసీపీని, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బంది పెట్టడం కోసం రకరకాల విన్యాసాలను అటు చంద్రబాబు సర్కార్ పోలీసులు, ఇటు ఎల్లో మీడియా ఎడతెగని పాట్లు పడుతూనే ఉంది. ఎటు తిరిగి మిథున్ రెడ్డి తదితరులను కొన్నాళ్లపాటు జైలులో ఉంచి శునకానందం పొందడడం తప్ప, సాధించింది ఏమీ లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మిథున్ రెడ్డి బెయిల్‌పై విడుదల అయ్యాక మీడియాతో మాట్లాడుతూ తనను జైలులో టెర్రరిస్టు మాదిరి చూశారని ఆవేదన చెందారు. అయినప్పటికీ ఈ తప్పుడు కేసులకు భయపడేది లేదని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఎపి లిక్కర్ స్కామ్ అన్నది ఒక ఊహాజనిత కథ అని ఎప్పటికప్పుడు అర్థం అవుతూనే ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇదేం కవరింగు బాబూ.. మరీ ఇంత అధ్వానమా?
‘‘విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్.. ప్రజలకు తగ్గనున్న వెయ్యి కోట్ల భారం’’.. ఈనాడు పత్రికలో వచ్చిన ఒక కథనం.‘‘సమర్థత, అనుభవం.. ఫలితమే ఛార్జీల తగ్గింపు’’.. ఆంధ్రజ్యోతి ఇచ్చిన వార్త‘‘ఈఆర్సీ సీరియస్.. సర్కార్‌కు షాక్ - దాదాపు వెయ్యి కోట్ల అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలు’’.. సాక్షి దినపత్రిక ఇచ్చిన వార్తపైవాటిల్లో సత్యమేది? అసత్యమేది? అనే సంశయం పాఠకులకు రావచ్చు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎలివేషన్ ఇవ్వడానికి నిరంతరం పాటు పడుతుంటాయన్న సంగతి తెలిసిందే. కాకపోతే ప్రభుత్వానికి నెగిటివ్‌గా ఇవ్వాల్సిన వార్తను అలా ఇవ్వకపోతే మానే.. ప్రజలకు పచ్చి అబద్దపు సమాచారం ఇవ్వడానికి ఎక్కడా సిగ్గు పడకపోవడం ఈ రెండు మీడియా సంస్థల ప్రత్యేకతగా మారిపోయింది. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వ తీరుపై నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసి ఛార్జీలు తగ్గించాలని, ప్రజల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తే, దానిని వక్రీకరించి అదేదో ప్రభుత్వం ప్రజలపై దయతో తగ్గించినట్లుగా కథనాలు ఇవ్వడం పాఠకులను, ప్రజలను మోసం చేయడమే!. ఈ విషయాన్ని సాక్షి మీడియా బహిర్గతం చేసింది. సోషల్ మీడియాలోనూ సమాచారం విస్తారంగా వచ్చింది. దాంతో ప్రభుత్వం పరువుతోపాటు, టీడీపీకి మద్దతిచ్చి అసత్యాలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థల బాగోతం మరోసారి బట్టబయలమైంది. సాక్షి, సోషల్ మీడియా లేకపోతే ప్రజలు టీడీపీ మీడియా వండి వార్చిన అసత్యాలనే నమ్మాల్సి వచ్చేది. అసలు విషయం ఏమిటి! 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.15,485 కోట్ల అదనపు బాదుడుకు ఈఆర్సీ అనుమతి కోరడం, ఈఆర్సీ యూనిట్‌కు రూ.5.27లకు కొనుగోలుకు ఓకే చేస్తే డిస్కంలు రూ.5.84 నుంచి రూ.5.89 వరకు కొన్నది వాస్తవం. ఫలితంగా ప్రభుత్వం ప్రజల నుంచి అదనంగా రూ.2787 కోట్ల విద్యుత్ ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరింది. కాని ఈఆర్సీ రూ.1863 కోట్ల అదనపు వసూలుకు అంగీకరించింది. అయినా ప్రభుత్వం, డిస్కమ్ ఏదైనా అనండి.. ఈఆర్సీ ఆదేశాన్ని కాదని రూ.2787 కోట్లు వసూలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఈఆర్సీ అదనంగా వసూలు చేసిన రూ.923 కోట్లు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం యూనిట్‌కు పదమూడు పైసలు తగ్గుతుంది. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అదనపు బాదుడు బాదకుండా, విద్యుత్ ఛార్జీలను ఎంతో కొంత తగ్గించి ఉంటే అప్పుడు నిజంగానే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. ఆయన సమర్థుడు అని భుజకీర్తులు తగిలించినా బాగానే ఉండేది. అలాకాకుండా.. ఎప్పటి మాదిరే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలనుకోవడమే ఇందులో మతలబు. అసలు కూటమి సర్కార్ ప్రజలపై అదనపు భారం ఎందుకు మోపింది? ఇప్పుడు ఎందుకు ఈఆర్సీ తగ్గింపు ఆదేశాలు ఇచ్చింది చెప్పకుండా అదేదో తమ చంద్రబాబు నిర్ణయం అన్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడమే శోచనీయం. కూటమి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సుమారు రూ. 19 వేల కోట్ల భారం వేశారని లెక్కలతో సహా వార్తలు వస్తున్నాయి. ఇది ఏపాటి సమర్ధత అవుతుందో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా వారే చెప్పాలి! పోనీ అదెందుకు! డిస్కంలు మరో రూ.12771 కోట్ల అదనపు వసూలుకు ఈఆర్సీని అనుమతి కోరాయి కదా.. దానిని ఉపసంహరించుకుంటామని చంద్రబాబు కాని, ఆయన తరపున ఎల్లో మీడియా కాని ప్రకటిస్తాయా? అని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పొగడరా! పొగడరా! అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అని పొగిడాడట వెనుకటి ఒకడు. అలాగే ఈ ఎల్లోమీడియా ఎంతకైనా దిగజారుతున్నాయి. జగన్ టైమ్‌లో విద్యుత్ రంగాన్ని ఎంత సమర్థంగా నిర్వహించినా, అప్పట్లో ఇంకేముంది ఛార్జీలు పెంచేశారు అంటూ ప్రచారం చేసిన ఈ మీడియా ఇప్పుడు వేల కోట్ల అదనపు భారాలు ప్రజలపై కూటమి మోపుతున్నా ,దానిని కప్పిపుచ్చడానికి యత్నిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్న డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తదుపరి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసింది. ఆ తర్వాత దానిని కూడా తన క్రెడిట్ లో వేసుకోవడానికి ఆయన ఏమి చెప్పారంటే, తాను తెచ్చిన సంస్కరణల వల్లే అది సాధ్యమైందని ప్రచారం చేసుకున్నారు.అలా ఉంటుంది చంద్రబాబు తెలివి. ఈసారి కూడా అదే తరహాలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఆయన చేసిన యత్నం వికటించి ప్రజలకు వాస్తవం తెలిసిపోయిందని అనుకోవాలి.నకిలీ వార్తల వెల్లువ అంటూ ఈనాడు దినపత్రిక(Eenadu Fke News) ఈ మధ్య ఒక సంపాదకీయం రాసింది. అందులో నకిలీ వార్తల గురించి గుండెలు బాదుకుంది. మంచిదే కాని తానేమి చేస్తున్నది మర్చిపోయి ఎదుటి వారిపై నిందించే రీతిలో ఆ సంపాదకీయం రాసుకుని ఆత్మవంచన చేసుకుందని చెప్పాలి. 'ఎన్నికలలో గెలిస్తే ప్రజా సంక్షేమానికి, సమ్మిళిత ప్రగతికి, ఎలాంటి కృషి చేస్తామో చెబుతూ ఓట్లు అడగడం నైతిక నిష్ట కలిగిన నాయకుల పద్దతి. అలాంటివారు అరుదైపోయి అబద్ధాలతో అధికారాన్ని గుప్పిట పడదామనుకునే జగత్ కిలాడీలతో రాజకీయాలు భ్రష్టు పడుతుండడం నేటి భారతం దుర్గతి. దానికి తగ్గట్లే పార్టీల నిర్వహణలోని ప్రధాన స్రవంతి మీడియా సంస్థల్లో కొన్ని బూటకపు వార్తా కథనాలను విచ్చలవిడిగా జనం మీదకు వదులుతున్నాయి. వ్యక్తిత్వ హననాలకు తెగపడుతున్నాయి. ఇలాంటి పెడపోకడలను అడ్డుకోకపోతే నకిలీ వార్తా సంస్థలను జవాబుదారి చేయకపోతే కపట నేతల స్వార్ధ ప్రయోజనాలకు ప్రజాస్వామ్యం బలి పశువు అవుతుంది"అ ని రాశారు. ఇది చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ కూడా ఏ మాత్రం చిత్తశుద్ది లేకుండా ఎడిటోరియల్ రాశారని తెలిసిపోవడం లేదా!. ఒక పక్క తప్పుడు వార్తలనండి, నకిలీ వార్తలనండి వారే ఇష్టానుసారంగా పాఠకులపై రుద్దుతో పార్టీల మీడియా ఏదో చేస్తోందంటూ నిస్సిగ్గుగా రాసిందనిపించదా! విద్యుత్ ఛార్జీల విషయంలో జరిగిందేమిటి.ఎల్లో మీడియా రాసిందేమిటి? దానిని నకిలీ అంటారా? తప్పుడు వార్తలు అంటారా! కూటమి సర్కార్ కరెంటు ఛార్జీలు పెంచిందా? లేదా? అదనపు వసూళ్లకు పాల్పడ్డారా? లేదా? అన్నది చెప్పకుండా కథలు రాయడం టీడీపీ మీడియాది జగత్ కిలాడి తనం అవుతుందా? లేదా అన్నది వారే ఆలోచించుకోవాలి. అలాగే వీరు చెప్పే నీతిసూత్రం ప్రకారం టీడీపీ, జనసేన కూటమి నేతలే జగత్ కిలాడీలు అవ్వాలి కదా! ఆ మాటను ఎందుకు నేరుగా రాయలేకపోయారు!. ఎంతసేపు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఈనాడు మీడియా సుద్దులు చెప్పడం ఆశ్చర్యమే. అబద్దాలతో అధికారం గుప్పిట పెడదామనుకుంటున్నారట. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం కూటమి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిలో ఎన్ని నెరవేర్చారు? అవి అబద్దపు హామీలా? కాదా? అన్నదానిపై ఎన్నడైనా ఒక్క వార్త ఇచ్చారా? ఎన్నికలకు ముందు ఎన్ని రకాల అసత్యాలను ప్రచారం చేశారో ఈనాడు వంటి ఎల్లో మీడియాకు గుర్తు లేదేమో కాని, కాస్త రెగ్యులర్ గా ఫాలో అయ్యే పాఠకులందరికి తెలియకుండా ఉంటుందా! ఈనాడు మీడియా ఒక్కసారి తమను తాము అద్దంలో చూసుకుని ,ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకుంటే వారికే తెలుస్తుంది ఎవరు నకిలీ వార్తలు రాస్తున్నారో,ఎవరు తప్పుడు కధనాలు ఇస్తున్నారో!.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ వ్యాఖ్యలతో ఏపీ అన్నపూర్ణ బ్రాండ్ ఇమేజ్‌కు గట్టి దెబ్బ!
రాష్ట్రం పరువు పోవాలని ఏ ముఖ్యమంత్రైనా కోరుకుంటాడా? రైతుల ప్రతిష్ట దెబ్బతినాలని ఆకాంక్షిస్తాడా? మిగిలిన రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఈ రెండు కాంక్షిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు చిత్ర, విచిత్రమైన ప్రకటనలతో ప్రజలను తరచూ గందరగోళంలోకి నెట్టేసే చంద్రబాబు నాయుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రైతులు పండించే ధాన్యం తినేందుకు, ఎగుమతి చేసేందుకూ పనికి రాదని తేల్చేశారు. ఇందుకు ఆధారాలున్నాయా? లేదా? అన్నది వేరు సంగతి కానీ.. ఇలా చెబితే రైతులకు అన్యాయం జరగదా? అన్న ఆలోచన కూడా చేయలేకపోయారు ఘనత వహించిన సీఎంగారు. ఎగుమతులకు పనికి రాదని సీఎం స్వయంగా అంటే.. కొనుగోళ్లకు ఏ దేశం ముందుకొస్తుంది?. ఇలా మాట్లాడటం ద్వారా సీఎం ఇక్కడి ధాన్యాన్ని విస్తృతంగా వాడే రాష్ట్ర ప్రజలందరిలో అనుమానాన్ని సృష్టించినట్లు అవ్వదా!. దీంతో ఈ ఆరోపణ కూడా తిరుమల ప్రసాదంలో కల్తీ చందంగా అనుచితమైపోయిందని తేలుతోంది. కోనసీమలో వరి సాగు సమస్యలపై కొన్నేళ్ల క్రితం క్రాప్ హాలిడే ప్రకటిస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి వరి వేయడం మంచిది కాదని చెబుతున్నారు. పైగా అధిక యూరియాతో పండించిన పంటలు తినడం వల్ల కేన్సర్ వస్తుందని అంటున్నారు. ఎంత బాధ్యతారహిత ప్రకటన ఇది!!.ఎరువుల విచ్చలవిడి వాడకం సరికాదనడం వేరు కేన్సర్ వస్తుందనడం వేరు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా పేరుంది. దశాబ్దాలుగా వరి సాగు జరుగుతోంది. ఒకపక్క రికార్డు స్థాయి వది దిగుబడులపై పొరుగున ఉన్న తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబరంగా చెప్పుకుంటూంటే... మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేశామని సంబరంగా చెబుతూంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పూర్తి నిరుత్సాహకరమైన వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలోనూ యూరియా కొరత(Urea Crisis In Telangana) వచ్చింది కానీ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కేంద్ర స్థాయిలో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారు. అవసరానికి తగినంత రాకపోయి ఉండవచ్చు. అది వేరు సంగతి. అంతమాత్రాన తెలంగాణలో ఎవరూ వరి వేయద్దని అనలేదు. కేన్సర్ బూచిని చూపలేదు. ఏపీలో యూరియా కొరత(AP Urea Crisis) సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన వరదరాజులరెడ్డి స్వయంగా శాసనసభలో యూరియా కొరతపై మాట్లాడారు. ఒకదశలో అసలు యూరియా కొరత లేదని చంద్రబాబు సోషల్ మీడియాపైన, వైసీపీపైనా మండిపడ్డారు. ఆ తర్వాత కలెక్టర్ల సమావేశంలో పంపిణీలో విఫలం అయ్యామని, వచ్చేసారి రైతుల ఇళ్లవద్దకే సరఫరా చేస్తామని, తాజాగా పొలాల వద్దే అందచేస్తామని అంటున్నారు. కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పటికీ, అవసరమైన మేర యూరియాను తెప్పించుకోలేకో, వచ్చిన యూరియాను క్రమబద్దంగా పంపిణీ చేయలేకో, బ్లాక్ మార్కెట్‌ను, టీడీపీ నేతల దందాను అరికట్టలేకో తెలియదు కాని, మొత్తం నెపాన్ని రైతులపై నెట్టే యత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పిఠాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న యూరియా లారీలను పోలీసులు పట్టుకున్నారు. అదను దాటిపోతున్నా యూరియా అవసరమైన మేర అందడం లేదని రైతులు వాపోతున్న దృశ్యాలు పలు చోట్ల కనిపిస్తున్నాయి. ఈ దశలో ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన ముఖ్యమంత్రి అసలు మన వరి పంటపైనే తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అత్యంత శోచనీయం. మనం పండిస్తున్న వరి మద్యం తయారీకి తప్ప దేనికి పనికి రాదని అన్నారు. ఇప్పుడు జనం అంతా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న బియ్యాన్ని వాడుతున్నారా? రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం ఏపీలో పండిందా? కాదా? నిజంగానే అది తినడానికి యోగ్యమైనది కాకపోతే ఎందుకు పంపిణీ చేస్తున్నారు? ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడే దృష్టి మరల్చే వ్యూహాలు అమలు చేస్తూంటుంది. దానికి కూడా హద్దు ఉంటుంది. మొత్తం రాష్ట్రం పరువు ,ఇమేజీ పోయే విధంగా ఉండరాదు. యూరియా కొరత ఏర్పడినప్పుడే కేన్సర్ సమస్య గుర్తుకు వచ్చిందా? ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పాలి? ఆ ఎరువు వాడకం తగ్గించాలని సీజన్ కు కనీసం ఆరు నెలల ముందు చెప్పాలి కదా? అంతా వరి వేసేసిన తర్వాత అది వద్దని, అది తినడానికి పనికి రాదని అంటే రైతులు ఏమి చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నుందుకు తమకు తగిన శాస్తి జరిగినట్లు రైతులు భావించరా? కొన్ని జిల్లాలలో మాత్రమే తప్పనిసరి పరిస్థితిలో వరిని రెండు పంటలుగా వేస్తారు. మిగిలిన చోట్ల రెండో పంటగా అపరాలు వేస్తారు. వరి వద్దని ఉద్యాన పంటలు వేయాలని చెబితే అది ఇప్పటికిప్పుడు అవుతుందా? పైగా ఇప్పుడు ఉద్యాన పంటల వారు ఎన్ని బాధలు పడుతున్నారో చూడడం లేదా? మామిడి, బొప్పాయి తదితర రైతులు గిట్టుబాటు ధరలు లేక ఎన్ని పాట్లు పడుతున్నారు! పోనీ మెట్ట పంటలు వేద్దామనుకుంటే మిర్చి, పొగాకు వంటి పంటలకు ధర లేక ఎంత ఆందోళన జరిగింది. మాజీ సీఎం జగన్ ఆయా పంటల రైతుల వద్దకు వెళ్లేవరకు ప్రభుత్వంలో చలనం కనిపించిందా?. ఉల్లి, టమోటా రైతులు పడుతున్న పాట్ల మాటేమిటి?. అమరావతికి లక్షల కోట్లు అప్పులు చేసి ఖర్చు చేసే ప్రభుత్వం రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు మూడు, నాలుగువేల కోట్లు వెచ్చించ లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దానికి బదులు ఇవ్వడం లేదు. ఆయా పంటలు ఎంత సాగు అవుతాయన్న దానిపై వ్యవసాయ శాఖకు అంచనాలు, లెక్కలు ఉంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని ,నిజంగానే ఆ పంటల వల్ల రైతులకు లాభం రాదనుకుంటే ప్రత్యామ్నాయాలతో సహా ప్రభుత్వం సాగు సీజన్‌కు కొన్ని నెలల ముందు సూచనలు చేయాలి కదా!. అవేమీ చేయకుండా, ఇప్పటికిప్పుడు వరికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రైతులకు అన్యాయం చేయడం అవుతుంది.వరి పంట కొనుగోలుకు కూడా సమస్య వస్తుందని ఇప్పుడే చంద్రబాబు చెబుతున్నారంటే, రైతులకు ధాన్యం అమ్మకాలలో మున్ముందు ఎన్ని కష్టాలు వస్తాయో ఊహించుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు వాటిని ఎంతవరకు నెరవేర్చారు. 2014 టరమ్‌లో రైతుల రుణాలన్నిటిని మాఫీ చేస్తామని ఊదరగొట్టి, తీరా ప్రభుత్వం వచ్చాక ఆరో వంతు రుణాలు కూడా మాఫీ చేయలేదు.ఈసారి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద రైతుకు ఇస్తామని చెప్పి ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది రూ.ఐదువేలు మాత్రం ఇచ్చారు. అయినా రైతులకు ఏదో చాలా చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు.రైతులకు ఇవ్వవలసిన ఇన్ పుట్ సబ్సిడీ. బీమా సదుపాయం తదితర అంశాలలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏమి చేసిందో తెలియదు. జగన్ తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే ఎంతో గొప్ప వ్యవసాయదారులు ఉన్న రాష్ట్రంగా పేరొందిన ఏపీ రైతుల ప్రతిష్ట దెబ్బతినేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడే మాట్లాడడం దారుణం అని చెప్పక తప్పదు. ఇది ఒక రకంగా ఏపీ బ్రాండ్ ఇమేజీని తనకుతానే దెబ్బతీయడం అని, వ్యవసాయాన్ని విధ్వంసం చేయడమేనని నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలతో ఏకీభవించకతప్పదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: బిల్డప్ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు! -
చంద్రబాబు నీతులు చెబుతుంటే..
చెత్త రాజకీయాలను ఊడ్చేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రకటన స్వాగతించదగ్గది. కాకపోతే దీన్ని తన సొంతపార్టీతో మొదలుపెట్టడం అవసరం. క్రిమినల్ కేసులున్న నేతలను పక్కన కూర్చొబెట్టుకుని మరీ నేర చరితులు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పగల సమర్థుడు చంద్రబాబు. అందుకే ఆయన చేసే ప్రకటనలకు ఆ పార్టీలోనే విలువ లేకుండా పోతోంది. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూంటారు. చంద్రబాబు స్వయంగా ఈ మాటలు చెప్పడం ఇంకో విశేషం.... ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల వసూళ్లకు హద్దూ లేకుండా ఉందని వారికి తానే వార్నింగ్ ఇస్తానంటూ సుమారు 35 మంది ని పిలిచి మాట్లాడానని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కొన్నాళ్ల క్రితం వెల్లడించినట్లు ఎల్లో మీడియానే ప్రచారం చేసింది. మరి వీరంతా ఆ చెత్త రాజకీయాలలో భాగమా? కాదా?. రాజకీయ ప్రత్యర్థి వైసీపీ వారిని విమర్శించడానికి ఇలాంటి పడికట్టు పదాలు వాడుతుంటారు. కాని అవి తన పార్టీ వారికే తగులుతున్న విషయాన్ని మర్చిపోతుంటారు. అసలు చెత్త రాజకీయం అంటే ఏమిటి?.. ప్రజలకు మేలు చేయనిది.. సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద వాదంతో వ్యవహరించేదని కదా చెత్త రాజకీయం(Dirty Politics) అంటే!. అవకాశవాద రాజకీయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఎవరుంటారు? ఎదుటి వారిపై కేసులు ఉన్నాయని అంటారు కాని తన మీద ఉన్న కేసుల గురించి చెప్పరు. మాచర్లలో జరిగిన స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ పరిసరాలలో పారిశుధ్యం పనులు చేపట్టడం కద్దు. కానీ మాచర్ల పర్యటనలో అలా జరగలేదు. చివరకు చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను పారిశుధ్య కార్మికులతో కలిసి చంద్రబాబు ఊడ్చారట. అధికారుల నిర్లక్ష్యమా? లేక చంద్రబాబు షో ప్రయత్నమా? తెలియదు.చెత్త ఊడ్చడాన్ని తప్పుపట్టనక్కరలేదు కానీ ఆ సందర్భంలోనే నోటికొచ్చిన మాటలు మాట్లాడేశారు(Chandrababu Dirty Politics Comments). మాచర్ల సభలో వేదికపైన ఉన్న కొందరు నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్న విషయం అందరికీ తెలుసు. స్థానిక వైసీపీ నేతలు(YSRCP) పలువురిని అక్రమ కేసుల్లో అరెస్టు చేయించారు కూడా. మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ పెట్టిన కేసుల తీరుపై హైకోర్టు స్వయంగా మండిపడింది కదా!. టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడి హత్యలు చేసుకుంటే ఆ కేసును మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కదా?. అయినా ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని ఎలా అనగలిగారు? రాయలసీమలో ఆయన ముఠాలు లేకుండా చేశారట!!. టీడీపీలోకి ముఠా నాయకులను ఏరికోరి చేర్చుకున్న విషయం పల్నాడు ప్రాంత ప్రజలకు తెలియకపోవచ్చు. కాని ఆ రాయలసీమ వారికి తెలిదా! కర్నూలు జిల్లాలో ఇద్దరు ఫ్యాక్షనిష్టు రాజకీయ నేతలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీ చేసి గొడవలు లేకుండా చూడడానికి ప్రయత్నిస్తే, దానిని చంద్రబాబు ఎంత తీవ్రంగా తప్పుపట్టారో ఇప్పటి తరం వారికి తెలిసి ఉండదు. ఇప్పటికీ టీడీపీలో ఎంతమంది ఫ్యాక్షనిస్టు నేతలు పెత్తనం చేస్తున్నారో, ఎందరు ఎమ్మెల్యేలు అయ్యారో ఆయనకు తెలియదా!. రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని కూడా చంద్రబాబు అన్నారు. మంచిదే. కానీ ఆయన చెప్పేది వేరు.. చేసేది వేరు అని ఎప్పటి నుంచో ఉన్న అనుభవం. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లో ఒక రౌడీషీటర్‌ను పార్టీలో చేర్చుకోవడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ వెరపు కూడా పోయినట్లు ఉంది. టీడీపీ నేతలు రౌడియిజం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. అంతెందుకు గతంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ను రౌడీ అని, పేకాట క్లబ్‌లు నడుపుతారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేశ్‌లు కర్నూలు జిల్లా ఆలూరు వెళ్లి మరీ ఆరోపించి వచ్చారు. సీన్ కట్ చేస్తే ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోతే, చంద్రబాబు అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. దీనిని ఏమంటారో?.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు గతంలో ఏమి అన్నారో, అలాగే కోటంరెడ్డి కూడా చంద్రబాబు ను ఏమని విమర్శించారో వారిద్దరు మర్చిపోయి ఉండవచ్చు. ఇప్పుడు కోటంరెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యే ఎలా అయ్యారు? కోటంరెడ్డి ఇప్పుడు దౌర్జన్యాలు చేసే వ్యక్తిగా కాకుండా మంచి వ్యక్తిగా మారిపోయారా?. హత్య కేసులో ఉన్న ఒక రౌడీషీటర్‌కు పెరోల్ ఇవ్వాలని కోటంరెడ్డి, మరో ఎమ్మెల్యే సునీల్ కుమార్‌లు లేఖ రాయడం గురించి ఏమంటారు??. మాచర్ల ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు ఉన్నాయి???.. చంద్రబాబు తరచు చంద్రయ్య అనే ఒక చిన్న టీడీపీ నేత హత్య గురించి ప్రచారం చేస్తుంటారు. వ్యక్తిగత గొడవలు జరిగితే దానికి రాజకీయం పులిమి చంద్రబాబు హడావుడి చేశారన్నది అప్పట్లో వచ్చిన విమర్శ. చంద్రయ్య కుమారుడికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి చంద్రబాబు మరో చెడ్డ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు తమ సొంత కార్యకర్తలకు ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చని ఈయన చర్య సూచిస్తోంది. దేశం మొత్తం మీద క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలు 45 శాతమైతే.. టీడీపీలో అది 86 శాతం. ఆంధ్రప్రదేశ్‌లోని 134 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 115 మందిపై క్రిమినల్ కేసులు, 82 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇది చెత్త కిందకు వస్తుందా? ఆణిముత్యం కిందకు వస్తుందా? అన్నదాని గురించి చంద్రబాబు చెప్పి, తదుపరి ఎదుటి వారిపై విమర్శలు చేస్తే బాగుంటుంది. ఇదే సమావేశంలో ఆయన స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. కాని దానివల్ల వచ్చిన బెనిఫిట్ ఏమిటో ఆయనే ఒక సందర్భంలో తెలిపారు. ఒక నెల రోజులలో 5.4 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, తద్వారా వారికి రూ.200 కోట్లు ఆదా అయ్యాందని తెలిపారు. దాని ప్రకారం ఒక్కో మహిళకు నెలకు 40 రూపాయలు ఆదా అయితే.. అదేదో పెద్ద ఘనతగా చెప్పుకున్నారన్నమాట. అసెంబ్లీలోనేమో అప్పులు చేసి సంక్షేమం అమలు చేయరాదని అంటారు. బయట సభలలో మాత్రం మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేసినట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఆడబిడ్డ నిధి తదితర అనేక హామీలు పెండింగులో ఉంటే వాటిని ఆయన ప్రస్తావించరు. త్వరలో సంజీవని కార్యక్రమం నిర్వహిస్తామని, ఇళ్ల వద్దకే డాక్టర్లను పంపిస్తామని చంద్రబాబు ప్రకటించడం స్వాగతించదగిందే. కాకపోతే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకే డాక్టర్లను పంపించడం, టెలిమెడిసిన్ వంటి పలు స్కీములను అమలు చేసింది. వాటిని ఈ ఏడాదిన్నర కాలం ఆపడం ఎందుకు? దానికి పేరు మార్చి ఇప్పుడు తామే అమలు చేస్తున్నామన్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఎందుకు? ప్రజలకు ఈ ఏడాది కాలంలో వైద్య సేవలు సరిగా అందనట్లే కదా! రూ.300 కోట్లు వ్యయం చేసి ఒక రోజు యోగాంధ్ర నిర్వహించి యోగా గేమ్ ఛేంజర్ అన్నట్లుగా గతంలో చెప్పారు. ఇప్పుడేమో సంజీవని గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు. ఆరోగ్య బీమా పేరుతో ఆరోగ్యశ్రీని నీరుకార్చుతున్నారన్న విమర్శల నేపధ్యంలో సంజీవనిని తెరపైకి తెస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటికరణపై వస్తున్న నిరసనలను డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరగుతుండవచ్చు. ముందుగా తమ ప్రభుత్వంలో తీసుకు వస్తున్న విధానాలలోని చెత్తను, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న చెత్తను తొలగించాక, ఎదుటి వారి గురించి మాట్లాడితే మంచిదని విశ్లేషకులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు చెప్పడం అర్థవంతంగానే ఉంది కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
AP Assembly: ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని..
ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తేందుకు ప్రతిపక్ష నేతకు తగినన్ని అవకాశాలు కల్పించడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయాలపై పెద్దగా నమ్మకం లేనివారి మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే.. తమ గొంతు వినిపించేందుకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి వస్తామన్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలపై వీరు అస్సలు నోరు మెదపడం లేదు. పైగా.. ప్రతిపక్షానికి సమయం ఇవ్వడం వల్ల అధికార పక్షానికీ మేలు జరుగుతుంది. వారి విమర్శలను తిప్పికొట్టేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకూ అవకాశం వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఈ అవకాశాలన్నింటినీ తోసిపుచ్చుతున్నారు. 2024 ఎన్నికల తరువాత 11 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్సీపీ అసెంబ్లీకి హాజరు కాని విషయం ప్రజలందరికీ తెలిసిందే. తమ గొంతులు నొక్కేస్తూ, అవమానిస్తున్న కారణంగా అసెంబ్లీకి రామని ఆ పార్టీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు అధికార పార్టీ స్వోత్కర్షలతో నిస్సారంగా సాగుతున్నాయి. ప్రతిపక్షానికి సంఖ్యాబలం ఆధారంగా కాకుండా... చర్చనీయ అంశం ఆధారంగా తగిన సమయమిస్తామని స్పీకర్ లేదంటే సీఎం భరోసా ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. అప్పుడు బాధ్యత వైసీపీది అయ్యేది. టీడీపీ ఆ పని చేయలేదు. మరోవైపు.. ప్రతిపక్ష హోదాపై వైసీపీ(YSRCP Opposition Status Demand) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన నోటీసుకూ స్పీకర్ ఇప్పటివరకూ స్పందించలేదు. సభలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మాట్లాడే అవకాశం ఉంటుందని చెబుతున్న మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గతాన్ని మరచిపోయారు. 1972లో సీపీఐకి కేవలం ఏడుగురే సభ్యులుంటే సీపీఎంకు ఒకే ఒక్క సభ్యుడు ఉండే వారు. అయినా ఆయా పార్టీల నేతలు మాట్లాడేందుకు తగిన సమయం లభించేది. 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 మందే సభ్యులతో ప్రతిపక్ష హోదా రాలేదు. కాంగ్రెస్ నేత పీజేఆర్ తదితరులు సమయం కోసం పోరాడాల్సి వచ్చేది. దాంతో వారు కోరినట్లు ఆనాటి స్పీకర్ యనమలకు కొంత టైమ్ కేటాయించక తప్పేది కాదు. 2004లో సీపీఐ (ఎంఎల్) తరఫున గుమ్మడి నరసయ్య ఒక్కరే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయినా ఆయన గౌరవానికి ఏమాత్రం విఘాతం కలగకుండా చర్చల్లో పాల్గొనేందుకు తగినంత సమయం కేటాయించేవారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పూర్తిగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం విమర్శలను భరించే స్థితిలో లేదు. దీంతో వైసీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష హోదా(Opposition Status) ఇవ్వడానికి పదిశాతం సభ్యులు ఉండాలన్నది ఒక సంప్రదాయం మాత్రమే. కాబట్టి వైసీపీకి ఆ హోదా ఇచ్చి ఉంటే హుందాగా ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నా 70 స్థానాలున్న అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మీడియా సమావేశాల ద్వారా జగన్ తన గళాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నప్పటికీ అసెంబ్లీలోనూ తగిన అవకాశాలిస్తామని స్పీకర్ చెప్పలేకపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ వైఫల్యాలలు మరింత స్పష్టమవుతాయో అన్న భయం కాబోలు!. 1994లో అఖండ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు(NT Rama Rao) ప్రభుత్వాన్ని 1995లో ఆయన అల్లుడైన చంద్రబాబు కూల్చివేశారు. ఆ టైమ్‌లో ఎన్టీఆర్ తన వెంట ఉన్న 35 మంది సభ్యులతో విశ్వాసపరీక్ష కోసం అసెంబ్లీకి వచ్చారు. చంద్రబాబు వెన్నుపోటుపై మాట్లాడేందుకు శతథా ప్రయత్నించారు. కానీ అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడే మాట మాటకూ మైక్ కట్ చేసిన అందరికీ తెలుసు. దాంతో ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే ఎన్టీఆర్ కారణంగానే తనకు స్పీకర్ పదవి దక్కిందన్న విషయమూ యనమల మరచిపోయారు. సొంత మామ, టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్తోనే ఇలా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ అవకాశం ఇస్తారన్నది వట్టిమాటే. అందుకే మాట్లాడేందుకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి అంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇక సభ్యుల గైర్హాజరి కూడా కొత్తగా జరుగుతున్నది కాదు. 1989-94 మధ్య ఆనాటి ప్రతిపక్ష నేత ఎన్టీ రామారావు దాదాపు రెండేళ్లు సభలోకి రాలేదు. ఒక సందర్భంలో తనను ఇతర సభ్యులతో కలిసి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019-2024 టర్మ్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరిపై ఎవరో అనుచితంగా మాట్లాడారంటూ లేని ఆరోపణలు చేసి సుమారు రెండేళ్లు సభకు గైర్హాజరయ్యారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు 23 యంది వైసీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినందుకు, వారిపై ఫిరాయింపు చట్టం అమలు చేయనందుకు నిరసనగా జగన్ కూడా తన ఎమ్మెల్యేలతో కలిసి సభను సుమారు రెండేళ్లు బహిష్కరించారు. ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే చంద్రబాబు సభలో వైసీపీ సభ్యులు హాజరు కాకపోవడాన్ని ప్రస్తావించి, వారి ఖర్మ అని అనడం. ఆయన బహిష్కరించిన్పుడు కూడా ఇదే వ్యాఖ్య వర్తిస్తుంది కదా! జీఎస్టీ లాంటి బ్రహ్మాండమైన సంస్కరణలు వస్తుంటే వైసీపీ అసెంబ్లికి రాలేదని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు ఇవి అర్థం కావని అనడం చిత్రం. జగన్ మీడియా సమావేశంలో(Jagan Press Meet) అడిగే ప్రశ్నలకే జవాబు చెప్పలేక నీళ్లు నములుతున్న చంద్రబాబు, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి నిలదీస్తే మాత్రం స్పందిస్తారా? ఏదో రకంగా జగన్‌ను, వైసీపీని దూషించి అవమానించాలన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ సభకు రాకపోవడాన్ని తప్పు పట్టే చంద్రబాబు తాను, అంతకుముందు ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు కదా అనే దాని గురించి మాట్లాడరు. అప్పుడు వారిపై ఆనాటి స్పీకర్లు అనర్హత వేటు వేయలేదు. ఇప్పుడు మాత్రం అనర్హత వేటు అంటూ బెదిరించే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీని ఈ సభలో చంద్రబాబు తెగ పొగిడారు. మరి ఇదే సభలో మోడీని గతంలో చంద్రబాబు నానా మాటలు అన్నారు కదా! దాని గురించి ఏమి చెబుతారు? సభలోకి వచ్చి వైసీపీ సభ్యులు ప్రశ్నిస్తే అది చంద్రబాబుకు, టీడీపీకి ఇరకాటంగా ఉంటుంది. శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున అక్కడ గట్టిగానే నిలదీస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలకు మంత్రులు బదులు చెప్పలేక తంటాలు పడుతున్నారు. అదే ప్రకారం ప్రశ్నిస్తారన్న భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండా ఉంటేనే బెటర్ అన్న భావన కూటమిలో ఉందనిపిస్తుంది. సభలోకి వైసీపీ సభ్యులు వెళ్లినా మాట్లాడడానికి తగు అవకాశం ఇవ్వడానికి సిద్దంగా లేరు. ప్రజాస్వామ్య స్పూర్తి లేని చంద్రబాబు నాయకత్వంలో ఇంతకన్నా ఏమి ఆశించగలం!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: హిట్టా.. ఫట్టా.. ప్రజలకు తెలుసులే బాబూ! -
బీహార్‌లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్‌గా ఉండే బీహార్‌లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. 2025 అక్టోబర్/నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుండి 31 శాతం ఓట్లతో, బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్/మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్‌లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వలంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడయ్యింది. ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.బీహార్‌లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11 వేలు మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్ లో గతంలో వలే మరోసారి ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్‌లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ‘ఇండియా’ (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010),ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈ సారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీయేకు కలిసివస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సీడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈ సారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు. ఎన్డీయేకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ పీడీఏ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్‌లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న అగ్రవర్ణాల్లో 3 శాతం బ్రాహ్మణులు, 3.4 శాతం రాజ్‌పుత్‌లు, 2.8 శాతం భూమిహార్లు, 0.6 శాతం కాయస్తులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్ లో 14.2 శాతం ఉన్న యాదవ్‌లు ఆర్జేడీ వెంట ఉన్నా మతం ఆధారంగా మిథిలా, సీమంచల్ లో బీజేపీకి కొంత యాదవ్‌ల మద్దతు లభిస్తోంది. 2.8 శాతం ఉన్న కుర్మీలు, 4.2 శాతం ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీశ్ వెంట ఉన్నా, ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36 శాతం ఉన్న ఈబీసీలు జేడీ(యూ), బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో నిశాద్ సామాజికవర్గం ఉప కులాలు ప్రాంతాలవారీగా ఎన్డీయే, వీఐపీ వైపు ఉన్నారు. 19.65 శాతం ఉన్న షెడ్యుల్ కులాలు, 5 శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల వైపు, 5 శాతమున్న పాశ్వాన్ లు ఎల్జీపీ (ఆర్వీ) వైపు ఉండగా 3 శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68 శాతం ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్ లో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాఘట్ బంధన్ కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. బీహార్‌లో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచినా కిషన్‌గంజ్ లోక్ సభ నియోజవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది. గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఏఐఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమంచల్ లో ముస్లిం యువత భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఏఐఎంఐఎంకు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది. ‘ఇండియా’ గ్రూపులో చేర్చుకోవాలని ఏఐఎంఐఎం కోరుతున్నా కాంగ్రెస్, ఆర్జేడీ నుండి ఆశించన స్పందన రాలేదు. కిషన్‌గంజ్‌తో పాటు పూర్ణియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా ఏఐఎంఐఎం 1 నుండి 3 స్థానాల్లో గెలవవచ్చని మూడ్ సర్వేలో తేలింది.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు బీహార్‌లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళల కోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద రూ.10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీయే మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబెల్స్ కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. ఎన్డీయే హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్ లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్డీయే మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్నపార్టీలైన హెచ్ ఏఎమ్, ఆర్ ఎల్ ఎమ్ ఎన్డీయే కూటమిలో, వీఐపీ, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది. 30 నుండి 31 శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీ (యు) ఈబీసీ సామాజికవర్గంలో బలంగా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్డీయేలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు, ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యతిస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి. ఎన్డీయేలో బీజేపీ, నితీశ్, చిరాగ్ మధ్య విభేదాలొస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్‌మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే కాదు. పార్టీలు హామీలిస్తున్న సంక్షేమాలు కుల రాజకీయాలను దాటగలవా? యువత ఆశలు విధేయతలను అధిగమించగలదా? ప్రశ్నలకు సమాధానం పోటా పోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత కిశోర్ సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్ కు చెందిన జేడీ (యు), ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్ లో ఎన్డీయే మెజార్టీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకవపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడినా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. :::ఆర్.దిలీప్ రెడ్డి, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ -
నడ్డా.. ఆత్మవంచనకు పరాకాష్ట!
ఎంతటి అవినీతి చేసినప్పటికీ బీజేపీలో చేరితే అన్నీ వాషింగ్ మెషీన్లో వేసినట్టు అన్నీ మాయమైపోతున్నాయన్నది ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద వినిపిస్తున్న మాట. ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా(JP Nadda) విశాఖపట్నంలో చేసిన ఒక ప్రసంగం ఈ మాటలు నిజమే అన్నట్టుగా ఉన్నాయి!. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నిర్వహించిన ‘సారథ్య యాత్ర’ ముగింపు సభలో నడ్డా మాట్లాడుతూ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని, అసమర్థ, అరాచక పాలన సాగిందని ఆరోపించారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, అభివృద్ధి అడుగంటిందని కూడా వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ మాటలు ఎల్లో మీడియా చెవికి ఇంపుగా తోచాయి. సంబరంగా కథనాలు రాసుకున్నాయి. కానీ.. వీరందరూ గతం మరచిపోయినట్టు ఉన్నారు. 2019కి మొదలు ఇదే జేపీ నడ్డాసహా బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఘోరంగా విమర్శించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ ఏటీఎం మాదిరిగా తమ అక్రమాలకు వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) బహిరంగంగానే విమర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు అయితే మోదీని టెర్రరిస్టులతో పోల్చడం సంచలనం. మోదీ ప్రభుత్వ అవినీతి వల్ల దేశం పరువు పోతోందని, ముస్లింలను బతకనివ్వడం లేదని...ఇలా అనేక ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు నీరు-చెట్టు కింద ఏపీలో రూ.13 వేల కోట్ల అవినీతి జరిగిందని, స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తేవారు. అవసరార్థం.. బహుకృత వేషం అన్నట్టు 2024 ఎన్నికల్లో ఎలాగోలా చేతులు కలిపిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు పరస్పర ప్రశంసలతో మురిసిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని నడ్డా వ్యాఖ్యానించారు. కానీ.. అందుకు తగిన కారణాలు, వాస్తవాలను మాత్రం దాచేశారు. జగన్ ముఖ్యమంత్రిగా(YS Jagan As CM) ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఏ రకమైన ఆరోపణలూ చేయని బీజేపీ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆత్మవంచనకు పరాకాష్ట అని చెప్పాలి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి ర్యాంకు ఇచ్చిన విషయం నడ్డాకు గుర్తు రాలేదనుకోవాలి. చంద్రబాబుతో మళ్లీ జతకట్టాక బీజేపీ కొత్త పాటను ఎత్తుకుంటున్నట్లు ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైంది. యూరియా కోసం అల్లాడుతున్న రైతులు ఇందుకు ఒక తార్కాణం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కనిపించని చెప్పుల క్యూలు, యూరియా కోసం రైతుల గొడవలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి. మామిడి, పొగాకు, టమోటా, ఉల్లి రైతులు ధరలు గిట్టుబాటు కాక ఆందోళనల బాట పట్టడం, నిరాశ, నిస్పృహల్లో తమ ఉత్పత్తిని రోడ్ల పాలు చేయడమూ చూశాం. ఏ సందర్భంలోనూ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సకాలంలో చర్య తీసుకున్న పాపాన పోలేదు.జగన్ టైమ్‌లో సజావుగా నడుస్తున్న విద్యా, వైద్య రంగాలలో ఇప్పుడు అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయ సంకల్పిస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనిపై ప్రజలలో తీవ్ర నిరసన వస్తోంది. పాలనను గాడిలో పెట్టడం అంటే ఇదేనా?.. మద్యం విచ్చలవిడిగా అమ్మడం, వైన్ షాపులు, పక్కన పర్మిట్ రూమ్‌లు, తదుపరి గ్రామాలలో బెల్ట్ షాపులు నడపడమే ప్రభుత్వ విజయమా?.. శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మహిళల మీద పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షతో రెడ్ బుక్ పాలన చేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమంటే?. జర్నలిస్టులను, వాస్తవాలు రాసే మీడియాను, సోషల్ మీడియాను అణచి వేయడమేనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే?. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి కట్టబెట్టడమే మంచి పాలన అవుతుందా? సూపర్ సిక్స్ హామీలు అని, భారీ ఎన్నికల ప్రణాళిక అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి, ఇప్పుడు అరకొర చేసి మిగిలిన వాటికి దాదాపు చేతులు ఎత్తివేయడమే సమర్థతా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అసత్యాన్ని ప్రచారం చేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను గాయపరచడం గొప్ప సంగతా?? హిందూ మతానికి పేటెంట్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇక్కడే తెలుస్తోంది వీరి ద్వంద్వ ప్రమాణాలు. ఎట్టి పరిస్థితిలోను విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమని ప్రచారం చేసి, ఇప్పుడు విభాగాల వారీగా ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం మంచి పనిగా ప్రచారం చేసుకుంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పలు వ్యవస్థలను తెచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే వాటిని ధ్వంసం చేయడం పాలనను గాడిన పెట్టినట్లు అవుతుందా? లేక నాశనం చేసినట్లు అవుతుందా? తన మొత్తం స్పీచ్‌లో ఎక్కువ భాగం ప్రధాని మోడీ పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికే కేటాయించినా, ఏపీకి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని పొగిడిన విషయాలకే ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. టీడీపీతో కూటమిలో ఉండబట్టి మొహమాటానికి పొగిడారా? లేక చిత్తశుద్దితోనే మాట్లాడారా అన్న డౌట్లు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. కేంద్రంలో మాత్రం బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. తదుపరి చంద్రబాబు పీఎస్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో రూ.2,000 మేరకు అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీ ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అవన్ని ఏమయ్యాయో తెలియదు కాని, చంద్రబాబు బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహాంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారు. తన పార్టీ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించారు. చివరికి 2024 నాటికి బీజేపీని బతిమలాడి పొత్తు పెట్టుకోగలిగారు. మరి అంతకుముందు బీజేపీ, టీడీపీలు చేసుకున్న విమర్శల మాటేమిటి? అనే ప్రశ్న సామాన్యులకు రావొచ్చు. కానీ..రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి టీడీపీ బీజేపీ నేతలు మాత్రం ఏమీ ఫీల్ కాలేదు. ఇంత అవకాశవాదపు పొత్తులు కూడా ఉంటాయా? అని అంతా నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో టీఎంసీ సభ్యుడు ఒకరు ప్రసంగిస్తూ చంద్రబాబుపై గతంలో కేంద్రం చేసిన అవినీతి ఆరోపణలు ఆయన తిరిగి బీజేపీతో కలవగానే ఏమైపోయాయని ప్రశ్నించారు. వాషింగ్ పౌడర్‌తో క్లీన్ చేసేశారా? అని ఎద్దేవ చేశారు. ఈ సంగతులేవీ అటు బీజేపీ, ఇటు టీడీపీ కాని ప్రస్తావించవు. పొత్తు తర్వాత మోదీని ఆకాశానికి ఎత్తుతూ ప్రపంచంలోనే గొప్ప నేతగా చంద్రబాబు అభివర్ణిస్తే, చంద్రబాబు అనుభవజ్ఞుడని, తాను సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు పాలన ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని పొగిడారు. ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేనలు కలిసి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికతో తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అప్పట్లో వ్యవహరించింది. అయినా ప్రభుత్వంలో మాత్రం భాగస్వామి అయింది. ఇప్పుడు ఆ హామీలను అరకొరగా అమలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫలానా అభివృద్ది జరిగిందని గట్టిగా చెప్పుకునే పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని నడ్డా చెప్పి ఉండాలి కదా! అవేమీ లేకుండా జనరల్ గా మాట్లాడితే ఏమి ప్రయోజనం? చిత్రం ఏమిటంటే నడ్డా ఈ సభలో కూడా అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు నిజమా? కాదా?అన్నదాని గురించి మాత్రం చెప్పలేదు. అలాగే వారసత్య రాజకీయాలకు వ్యతిరేకం అని ఊదరగొట్టే బిజెపి నేతలు ఎపిలో ఇప్పుడు టిడిపిలో ఉన్నది వారసత్వ రాజకీయమా? కాదా? అప్పట్లో మరి లోకేశ్ రాజకీయ వారసత్వాన్ని మోడీ ఎద్దేవ చేయగా, ఇప్పుడు ఆయనే పిలిచి మరీ ఎందుకు విందులు ఇస్తున్నారో ప్రజలకు వివరణ ఇస్తారా? ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు గత పదిహేనేళ్లలో జరిపిన అవకాశవాద రాజకీయాలు నడ్డాకు గుర్తు లేకపోవచ్చు కాని, ఏపీ ప్రజలు మర్చిపోతారా?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇలా ఎలా??
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాల గొంతు నులిమేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాల అణచివేతకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఒకదాన్ని ఏర్పాటు చేసింది. వీరి సిఫారసులు ఎలా ఉంటాయన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వం తీరుతెన్నులను విమర్శిస్తున్న, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను నకిలీలుగా ముద్రవేసే ప్రయత్నం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏది ఫేక్ ఏది కాదన్నది అందరికంటే బాగా తెలిసింది ప్రజలకే. కానీ ప్రభుత్వం, టీడీపీలు రెండూ తాము చెప్పిన విషయాలే సత్యమని నమ్మించేందుకు, ప్రభుత్వంలో జరుగుతున్న రకరకాల అవినీతి కార్యకలాపాలు బయటకు రాకూడదన్నట్టు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇష్టారీతిన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన బాబు, పవన్‌లు వైసీపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదని ఇప్పటికీ విమర్శిస్తూండటం విచిత్రం. ప్రతిపక్షంలో ఉండగా అన్ని వర్గాలను ప్రభుత్వంపై ఉసిగొల్పేలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు దంచిన ఈ ద్వయం ఇప్పుడు మాత్రం ఎవరైనా గట్టిగా మాట్లాడినా సరే వారి సంగతి చూస్తామని, కొత్త చట్టాలు తెచ్చి అణచివేస్తామని అధికారికంగానే చెప్పుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో యూరియాకు పెద్ద కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయాలనే సామాజిక మాధ్యమాలు బాగా హైలైట్ చేశాయి. దీంతో చంద్రబాబు తెగ ఆవేశపడిపోతున్నారు. సామాజిక మాధ్యమాలే లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆఖరకు ఈ విమర్శ హద్దులు దాటి.. మనుషులా, పశువులా అనే వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆయన రైతుల సమస్యను బహిర్గతం చేస్తున్న సాక్షి మీడియాపై కూడా తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. టీడీపీ అనుబంధ మీడియా సాయంతో సాక్షిలో వచ్చే వార్తలు ఫేక్ అన్న ప్రచారం చేయాలన్నది ఆయన ఉద్దేశం.ప్రతిపక్ష నేత జగన్ కూడా ఏ విమర్శ చేసినా అందులో సహేతుకత ఉండేలా జాగ్రత్తపడతారు. కాగ్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలిచ్చిన సమాచారం ఆధారంగానే టీడీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు, పవన్‌లు అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాల ఆధారంగా రాజకీయాలు చేయడం వీరికి అలవాటే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వీరు చేసిన అసత్యపు అరోపణలు అన్ని ఇన్నీ కావు. హిందూ మతానికి అపచారం జరిగిపోతోందని పదే పదే చెప్పేవారు. ప్రతి చిన్న విషయాన్నీ జగన్‌కు ఆపాదిస్తూండే వారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రసాదం లడ్డూలో కల్తీ ఆరోపణలు కూడా జగన్‌పైకే నెట్టేసే ప్రయత్నం చేసిన విషయం ఇటీవలి పరిణామమే. ఇదే సమయంలో జగన్ మాత్రం హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసే ఆరోపణలు కూడదని బాబు, పవన్‌కు హితవు చెప్పారు. తిరుమలకు అప్రతిష్ట తీసుకురావద్దని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముప్పైవేల మంది మహిళలు మాయమైనట్టు, అందుకు వలంటీర్లు కారణమైనట్టు తనకు కేంద్ర నిఘా వర్గాల వారు చెప్పారని పవన్ చేసిన ఇంకో ఆరోపణ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆయన పూర్తిగా మరచిపోయారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జగన్, ఆయన తల్లి విజయమ్మ తదితరులు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆమె కుమారుడిని ఆపాయ్యంగా దగ్గరకు తీసుకున్న సన్నివేశాన్ని అంతా చూశారు. అయినా మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ దానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఒక వీడియో కూడా ఎడిట్ చేసి టీడీపీ వారు ప్రచారం సాగించారని వైసీపీ ఆరోపించింది. కేంద్రం సూచనల ప్రకారం జగన్ ముఖ్యమంత్రిగా రీసర్వే చేపడితే జగన్ భూములన్నిటిని లాగేసుకుంటారని చంద్రబాబు, పవన్, లోకేశ్‌లు నానా యాగీ చేశారు. తీరా చూస్తే ఏమంది? అధికారంలోకి వచ్చిన తరువాత వారు కూడా అదే రీసర్వే పథకాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం అప్పుల గురించి కూడా ఇంతే. అప్పులతో ఆంధ్రప్రదేశ్ కాస్తా శ్రీలంక మాదిరిగా అల్లకల్లోలమైపోతుందని ఒకసారి.. అప్పులు రూ.14 లక్షల కోట్లు దాటిపోయాయని ఇంకోసారి రకరకాలుగా వ్యాఖ్యానించిన అప్పటి ప్రతిపక్ష నేతలు.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట సవరించుకున్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ స్వయంగా రాష్ట్రం అప్పులు రూ.6.5 లక్షల కోట్లని వెల్లడించారు. కానీ చంద్రబాబు ఆ తర్వాత కూడా జగన్ టైమ్‌లో రూ.పది లక్షల కోట్ల అప్పు అని చెబుతున్నారు. పోనీ అందులో తన 2014 టరమ్ లో చేసిన అప్పు,విభజన నాటి అప్పు కూడా ఉందని చెబుతారా? అంటే అదేమి ఉండదు. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. రెండు లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకువచ్చారు. ఈ వార్తను సాక్షి ఇచ్చింది. దానిని ఖండించే పరిస్థితి కూటమి సర్కార్‌కు లేదు. విశాఖలో జరిగిన సోదాల్లో ఒక కంపెనీలో మాదకద్రవ్యాలు వచ్చాయని, అదంతా వైసీపీ వారికి సంబంధించిందన్నట్టు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎంతగా ప్రచారం చేశాయి? తీరా చూస్తే అవి డ్రగ్స్ కాదని, అక్వా కంపెనీలలో వాడే ఈస్ట్ అని తేలింది. జగన్ టైమ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదంటూ టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సైతం తమ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు తెచ్చినట్లుగా చెప్పడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లు గతంలో చేసిన ఇలాంటి ఆరోపణలు, చెప్పిన అసత్యాలు, చేసిన ఆచారణ సాధ్యంకాని వాగ్దానాలు మొదలైన వాటన్నిటిని ప్రస్తావిస్తూ నాడు-నేడు కింద సోషల్ మీడియాలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఇవి వీరిని బాగా చికాకు పెడుతున్నాయి. తమ ఫేక్ ప్రచారమే తమకు చుట్టుకుంటోందన్నది వారి బాధ కావచ్చు. ఎవరు ఫేక్ ప్రచారం చేసినా తప్పే. అంతేకాదు. సోషల్ మీడియాలో వైసీపీ మహిళా నేతలను, రాజకీయాలతో సంబంధం లేని జగన్ సతీమణి భారతి వంటివారిపై కూడా ఒక వర్గం సోషల్ మీడియా నీచమైన పోస్టులు పెడుతున్నా, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే టీడీపీ వారిపై ఎవరైనా అభ్యంతరకర పోస్టు పెట్టినా వెంటనే స్పందిస్తారు. ఎవరు అలాంటి పోస్టులు పెట్టినా ఒకే రకంగా పోలీసు వ్యవస్థ స్పందిస్తే మంచిది కదా!. చంద్రబాబు,లోకేశ్‌లు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టులో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లు నడుపుతుంటారని, తప్పుడు ప్రచారాలు చేయిస్తుంటారని వైసీపీ తరచుగా ఆరోపిస్తుంటుంది. అయినా ఇతర సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూటమి నేతలు భరించలేకపోతున్నారన్న భావన ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను, సాక్షి మీడియాను తరచు బెదిరిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. కుట్రపూరితంగా జర్నలిస్టులను జైళ్లకు పంపుతున్నారు. అయినా వారి వైఫల్యాలు, స్కామ్‌లు బయటకు వస్తున్నాయి. వాటిని తట్టుకోలేక చంద్రబాబు అసహనంతో ఏకంగా కొత్తగా చట్టాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించిన సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్య తీసుకోవాలని యత్నిస్తే చాలు.. నోటీసులు ఇస్తే చాలు..ఇంకేముంది భావ స్వేచ్ఛను అరికడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలో ఉంటే మాత్రం ఎవరికి భావ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉండకూండా చూడాలని యత్నిస్తున్నారు.ఇలా ప్రతి అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే చంద్రబాబు అసలు రాజకీయం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కనుమరుగు కానున్న ఈశాన్య రుతుపవనాలు?!
అనూహ్యం.. అసాధారణం.. ఆశ్చర్యం.. నైరుతి రుతుపవనాలు ‘సంప్రదాయ’ గతి తప్పాయి. వాతావరణ మార్పు, భూతాపం నేపథ్యంలో అవి దారి తప్పి ఆధునిక ‘పోకడ’ పోతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నడక కొద్దిగా మారింది. భవిష్యత్తులో ఇదే నడత కొనసాగితే మన దేశానికి ముప్పు తప్పదు!!. ఈ నెల తొలి వారంలో భారత వాతావరణ విభాగానికి చెందిన ఓ ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం రుతుపవన గమనంపై వాతావరణ నిపుణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల వరకు వెళ్లి.. గోడకు కొట్టిన బంతిలా వెనక్కు రావాల్సిన రుతుపవనాలు కొంత కట్టు తప్పి టిబెట్ పీఠభూమి ప్రాంతంలోకి ప్రవేశించాయి. హిమాలయాలకు ఆవల ఉండే టిబెట్ పీఠభూమిలో అవపాతం తక్కువ. అందుకే ఈ ప్రదేశం ఎప్పుడూ పొడిగా కనిపిస్తుంది. శీతాకాలంలో హిమపాతం, వసంత రుతువులో పశ్చిమ అలజడుల వల్ల కొద్దిపాటి వర్షపాతం మాత్రమే అక్కడ నమోదవుతాయి. అలాంటి శుష్క టిబెట్ ప్రాంతంలో నైరుతి తేమ గాలులు తాజాగా వానలు కురిపించాయి. నైరుతి రుతుపవనాల తేమగాలులు హిమాలయాల హద్దును దాటేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ మీదుగా టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపుతోందని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన గ్లేసియాలజిస్ట్ మనీష్ మెహతా చెప్పారు. ఇండియాకు ప్రత్యేక వరం.. రుతుపవనాలు! వేసవిలో సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి బయలుదేరే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో భారతదేశమంతటా విస్తరించి జూన్-సెప్టెంబరు నెలల్లో వర్షాలు కురిపిస్తాయి. వాటి ప్రయాణం ఉత్తరానికి వచ్చేటప్పటికి ఎదురుగా హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా, పెట్టని కోటలా అడ్డు నిలుస్తాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకుని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తాయి. తమలో మిగిలివుండే తేమతో హిమాలయ పర్వత శ్రేణుల నుంచి అవి వెనక్కు మరలుతాయి. తిరుగుపయనంలో ఈశాన్య రుతుపవనాల పేరిట అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షిస్తూ మళ్లీ సముద్రం బాట పడతాయి. ప్రయాణంలో వర్షిస్తూ తేమను కోల్పోతూ ఉంటాయి కనుక... నైరుతితో పోలిస్తే మనకు ఈశాన్య రుతుపవనాల వర్షపాతం తక్కువ. రుతుపవన ప్రక్రియ భారతదేశానికి ప్రత్యేకం. దేశంలో సాగునీరు, తాగునీటికి రుతుపవనాలే ఆధారం. భూతాపం, వాతావరణ మార్పు, పశ్చిమ అలజడులు/కల్లోలాలుగా పిలిచే వాతావరణ ప్రక్రియల వల్ల నైరుతి రుతుపవనాలు టిబెట్ వైపు వెళ్లి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఎత్తు తక్కువ ఉండే దారుల గుండా నైరుతి తేమ గాలులు టిబెట్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని అంటున్నారు. అయితే.. నైరుతి రుతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం ఆరంభిస్తే... హిమనీనదాల (గ్లేసియర్స్)లోని మంచు కరుగుదలలో, నదీ ప్రవాహాల తీరుతెన్నుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. నైరుతి కాస్తా తుర్రుమని టిబెట్ పారిపోతే మనకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. భారతదేశంలో వర్షపాతం తగ్గుతుంది. వ్యవసాయం, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతుంది. తాగునీటికి కటకట తప్పదు. రుతుపవనాలనే నమ్ముకుని బతుకుతున్న దేశం మనది. ఏదో ఒక సీజన్లో రుతుపవనాలు ముఖం చాటేసినా తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తారు రైతన్నలు. నైరుతి రుతుపవనాలు భౌగోళికంగా ‘హిమాలయ కంచె’ దూకి ప్రతి సీజన్లోనూ ఆవలి టిబెట్ వైపునకు పూర్తిగా మరలిపోయేట్టయితే... అవి ఇక తిరిగి వెనక్కు రావు! అప్పుడిక ఈశాన్య రుతుపవనాలు అనేవే ఉండవు!! ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా ఆ తేమలేని, బలహీన పవనాలతో కురిసే వర్షాలు, కలిగే ప్రయోజనం నామమాత్రమే. భయపెట్టాలని కాదు గానీ... ఆ దుస్థితి రాకూడదనే ఆశిద్దాం. వాతావరణ మార్పు ప్రభావంతో ఎన్నో వింతలు చూస్తున్నాం. నిరుడు కురిసిన వర్షాలకు సహారా ఎడారి ఇసుక తిన్నెలు సరస్సులను తలపించిన సంగతి మరచిపోతే ఎలా?!(Source: Zee News)::జమ్ముల శ్రీకాంత్ -
హిట్టా? ఫట్టా.. ప్రజలకు తెలుసులే బాబు!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు విచిత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూండటం, సూపర్ సిక్స్ హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై జగన్ విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అదే రోజు ఇంకో సమావేశంలో చంద్రబాబు యథాప్రకారం జగన్ దూషణకు పరిమితమయ్యారు. జగన్ సంధించిన నిర్దిష్ట ప్రశ్నలు ఒక్కదానికి కూడా నేరుగా చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. కూటమి అట్టర్ ఫ్లాఫ్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలా అన్న జగన్ ప్రశ్న వాస్తవానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే.. సూపర్‌సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో జరిపిన హడావుడికి చాలాచోట్ల నుంచి ప్రజలను బలవంతంగా తీసుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. స్కీములు కావాలంటే సభకు రావాల్సిందేనని కొన్ని గ్రామాల్లో చాటింపు వేశారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కొందరు అధికారులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు, ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారు సభకు రాకపోతే రూ.200 జరిమానా పడుతుందని హెచ్చరించారట. ఇక వేల ఆర్టీసీ బస్సులతో జనాన్ని బలవంతంగా తరలించారు. ఈ నేపథ్యంలోనే జగన్ బలవంతపు విజయోత్సవాలు అన్న వ్యాఖ్య అర్ధవంతంగానే ఉందనిపిస్తుంంది. బలవంతపు విజయోత్సవాలు అనేదానికి.. చంద్రబాబు దీనిపై ఎక్కడా స్పందించలేదు. సూపర్ సిక్స్ హిట్ అయినందుకే జనం తరలి వచ్చారన్నట్లుగా బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. సూపర్ సిక్స్ హిట్ అయిందా? లేదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించినప్పుడు జనం ననుంచి పెద్దగా స్పందన రాలేదు. చప్పట్లు కొట్టాలని ఒకటి రెండుసార్లు సార్లు ఆయనే అడిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 👉చంద్రబాబు చేసిన మోసాలు ఇవి అంటూ జగన్ కొన్ని అంశాలను ఉదహరించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా చంద్రబాబూ అని ఆయన అడిగారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోయారు. 👉నిరుద్యోగ యువతకు నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలి కదా! రెండేళ్లకు రూ.72 వేలు బాకీ పడుతున్నావు కదా? అని జగన్ వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమే లేదు. 👉సూపర్ సిక్స్‌తోపాటు టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉన్న ఇతర హామీల మాటేమిటి అని అంటూ ఏభై ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారికి నెలకు రూ.నాలుగు వేల ఫించన్ ఇస్తానన్న వాగ్ధానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదన్న జగన్ వ్యాఖ్యకు చంద్రబాబు నుంచి బదులు లేదు. 👉వృద్ధాప్య ఫించన్‌లో సుమారు 5 లక్షల మందికి కోత పెట్టారని జగన్ చేసిన ఆరోపణపైన చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయారు. సూపర్ సిక్స్ కు సంబంధించి ఎన్నికల ముందు టీడీపీ మీడియాలో ఇచ్చిన ప్రకటనల్లోని అంశాలకు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఇస్తున్న ప్రచార ప్రకటనలలోని తేడాలను చూపించి జగన్ కూటమిని నిలదీశారు. ఆడబిడ్డ నిధి, ఏభై ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను ఇప్పుడు హామీల ప్రచార ప్రకటన నుంచి తొలగించడాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు ఆడతారని అంటూ, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు, ఇప్పుడు చెబుతున్న మాటలతో పోల్చి జగన్ ఆధారసహితంగా విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు ఇచ్చారని, మెహరాజ్ బేగం షేక్ అనే ఆమె కుటుంబానికి 2024 జూన్ నుంచి వివిధ స్కీముల కింద రూ.3.34 లక్షల ఆర్థిక సాయం అందుతుందని చంద్రబాబు సంతకం చేసి ఇచ్చిన బాండ్ ఉందని, ఆ మేరకు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ఇవ్వకపోవడం జనాన్ని మోసం చేయడం కాదా? అని నిలదీశారు. తల్లికి వందనం స్కీమ్ లో కోతలు పెట్టడం, వంట గ్యాస్ సిలిండర్లు గత ఏడాది ఒకటే ఇవ్వడం, ఈ ఏడాది ఇంకా ఇవ్వకపోవడం మొదలైన విషయాలను లేవనెత్తారు. చంద్రబాబు మాత్రం ఈ స్కీములను కొన్నిటిని ప్రస్తావిస్తూ అవన్ని అమలు చేసేసినట్లు, సూపర్ హిట్ అయిపోయినట్లు ప్రజలలో భ్రాంతి కల్పించే యత్నం చేశారు. ఉదాహరణకు అన్నా క్యాంటిన్లలో 5.60 కోట్ల మంది భోజనం చేశారని ఆయన అన్నారు. అవి కాకిలెక్కల్లా కనిపిస్తున్నాయన్నది పలువురి భావన. అయినా అది అమలు చేశారని అనుకున్నా, మిగిలినవాటి సంగతేమిటి? తల్లికి వందనం లో రూ.15 వేలు ఇస్తానని ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది రూ.13 వేలు చొప్పునే ఇచ్చింది వాస్తవమా? కాదా? అందులోను చాలామందికి కోత పడిందా? లేదా? అన్న జగన్ ప్రశ్నకు జవాబు రాలేదు. ఉచిత బస్సు గురించి మీరు ఇచ్చిన హామీ ఏమిటి? ఎక్కడికైనా రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ఆర్టిసి బస్ ప్రయాణం చేయవచ్చని చెప్పారా?లేదా? అని అంటూ, అప్పట్లో చంద్రబాబు దానికి సంబందించి చేసిన ప్రసంగం క్లిప్పింగ్ ను కూడా జగన్ చూపించారు. ఆ విషయానికి చంద్రబాబు బదులు ఇవ్వకుండా, ఫ్రీ బస్ హిట్ అయిందని, ఐదు కోట్ల మంది ప్రయాణాలు చేసేశారని సభలో తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు కేవలం కూటమి ప్రభుత్వమే రైతులకు ఇస్తుందని ఎన్నికలకు ముదు హామీ ఇచ్చి ,ఒక ఏడాది ఇవ్వకుండా, ఈ ఏడాది రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చింది నిజం కాదా అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సమాధానం రాలేదు. తొలివిడతలో రూ.ఏడు వేలు ఇచ్చామని సభలో చెప్పారు. మరి హామీ నెరవేర్చినట్లు అవుతుందా? అందువల్ల ఇది హిట్టా? ఫట్టా అని అంటే ఫట్ కాకపోయినా, రైతులను మోసం చేసినట్లే అవుతుందన్న విశ్లేషణ వస్తుంది. ఇక మెడికల్ కాలేజీల గురించి జగన్ మాట్లాడుతూ తమ హయాంలో 17 కాలేజీలు తెచ్చిన వైనం, అందులో కొన్నిటిని పూర్తి చేసిన సంగతి చెప్పారు. సంబంధిత కాలేజీల భవనాలు,క్లాస్ రూమ్‌ల ఫోటోలను ,వీడియో క్లిప్పింగ్ లను కూడా ఆయన చూపించారు. ఈ అంశంలో చంద్రబాబు ఏకంగా అబద్దం చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీనే ఈ మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పేశారు. కాలేజీలకు భూమి ఇచ్చి శంకుస్థాపన చేస్తే సరిపోతుందా? అని మరోసారి అన్నారు. అయితే సమాచార శాఖ మంత్రి పార్థసారథి క్యాబినెట్ సమావేశం తర్వాత గత ప్రభుత్వం 17 కాలేజీలను కేంద్రం ద్వారా తీసుకు వచ్చిందని వెల్లడించి, అందులో ఏడు పూర్తి అయ్యాయని, పదింటిని పీపీపీ పద్దతిలోకి మార్చుతున్నామని చెప్పారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ను ,చంద్రబాబు అనంత సభలో చెప్పిన అబద్దాన్ని కలిపి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఇలా అసత్యాలు కాకుండా, జగన్ ప్రభుత్వం వీటిని తెచ్చిందని, వాటిని ఎందువల్ల తాము పిపిపి మోడల్ గా మార్చుతున్నామో వివరించి ఉంటే గౌరవంగా ఉండేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం ఏభై సీట్లు ఇస్తే, తమకు వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దుర్మార్గం కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడనే లేదు. యూరియా కొరత లేదని తొలుత కొన్నాళ్లపాటు డబాయించిన చంద్రబాబుఈ సభలో మాత్రం యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పడం గమనించదగ్గ విషయమే. ఏది ఏమైనా జగన్ తనదైన శైలిలో పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే , వాటికి చంద్రబాబు జవాబులు ఇవ్వలేకపోయారు.తమ సూపర్ సిక్స్ హిట్ కాదని కూటమి నేతలకు కూడా తెలుసు. ప్రజలలో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు అనంతపురంలో సూపర్ హిట్ అంటూ సభ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్‌ను ఆ ఒక్క ప్రశ్న అడిగి ఉండాల్సింది!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ తాజాగా ఒక వ్యాఖ్య చేశారు. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదట. కావాలనుకుంటే జగన్‌ను ఎప్పుడో జైలుకు పంపి ఉండేవారట!. జాతీయ టీవీ చానల్ ఏర్పాటు చేసిన సదస్సులో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలలో ఎంతవరకు నిజం ఉందన్నది చర్చనీయాంశం. ఒక్కసారి రెండేళ్లు వెనక్కు వెళదాం.. ..అప్పట్లో లోకేశ్ ప్రతిపక్ష పార్టీ నేత. రాష్ట్రమంతటా యువగళం పేరుతో పడుతూ లేస్తూ ఓ యాత్ర లాంటిది చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని గ్రామాలను చుట్టేసి వచ్చారు కానీ.. తనతోపాటు ఓ ఎర్రటి పుస్తకాన్ని మోసుకెళ్లారాయన. జేబులో ఉంచుకున్నాడా? లేదు.. ఎక్కడికక్కడ సమావేశాల్లో పైకెత్తి అందరికీ చూపించాడు. శత్రువుల జాబితా సిద్ధం చేస్తున్నాని.. వాళ్ల భరతం పడతానని సవాళ్లూ విసిరారు. ఈ క్రమంలో బట్టలిప్పిస్తానని.. అదని ఇదనీ అవాకులు, చెవాకులు చాలానే మాట్లాడారులెండి. ఎన్నికలొచ్చాయి. సూపర్ సిక్స్‌ను నమ్మారో.. ఈవీఎంల గందరగోళమో తెలియదు కానీ..జాతీయ స్థాయి విశ్లేషకులు, ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ తెలుగుదేశం, జనసేన బీజేపీల కూటమి అధికారంలోకైతే వచ్చింది. రాష్ట్రంలో అరాచకానికి, అవ్యవస్థకు నాందీ పడింది కూడా అప్పుడే!.. .. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయో లేదో రెడ్‌బుక్ పేరుతో టీడీపీ రాజ్యాంగం మొదలైంది. ఒకట్రెండు చోట్ల హోర్డింగ్‌లు పెట్టిమరీ తాము వైసీపీ వారిపై కక్ష తీర్చుకోబోతున్నామని ప్రకటించారు కూడా. అందుకు తగ్గట్టుగానే టీడీసీ కార్యకర్తలు వైసీపీ వారి ఇళ్లపై, ఆస్తులపై విరుచుకుపడ్డారు. దాడులు చేశారు. పల్నాడు ప్రాంతంలో కొంతమంది వైసీపీ నేతలు వీరి ఆగడాలను తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. తప్పుడు కేసుల బనాయింపు, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కొత్త కేసు పెట్టడం వంటి కొత్త కొత్త మార్గాలు సృష్టించి మరీ అమలు చేశారు టీడీపీ పెద్దలు. కొందరిని సుదూర ప్రాంతాలలోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి నరకయాతన పెట్టారు. వైసీపీ నేతలపై అక్రమ కేసు బనాయించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చిందంటే ఏపీలో కక్ష రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని దూషించిన టీడీపీ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనం. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలను వేధించినా కేసులే కట్టరు. ఇతర అరాచకాల సంగతి సరేసరి. నేతల పరిస్థితి ఇలా ఉంటే.. సోషల్ మీడియా వారినైతే దారుణంగా హింసించే విధంగా అక్రమ అరెస్టులు సాగించారు. అదే టీడీపీ, జనసేనలకు చెందిన వారు హింసకు పాల్పడినా, అరాచక పోస్టులు పెట్టినా చూడనట్టు వ్యవహరించడం ఇంకో విచిత్రం. నామ్ కా వాస్తే ఒకటి, అరా కేసులు పెట్టినా అవి తూతూ మంత్రం కేసులే. పోలీసు రాజ్యం ఎలా నడపాలో, కక్షలు ఎలా తీర్చుకోవాలో భవిష్యత్తు ప్రభుత్వాలకు కూటమి సర్కార్ తీరు మార్గదర్శకం అయ్యే ప్రమాదం కనిపిస్తుంది.చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఏ రకంగా దూషించారో అందరికి తెలుసు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి, అధికారుల పేర్లు కూడా రెడ్‌బుక్ లో రాస్తున్నామని బెదిరిస్తూ లోకేశ్ ప్రచారం చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ఇంత ఘోరంగా లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మీద చంద్రబాబు పట్టు ఏమీ లేదని, మొత్తం కథ లోకేశే నడిపిస్తున్నారని, పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు ఇస్తూ ఎవరెవరిని హింసించాలో సూచిస్తుంటారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అక్కడక్కడా తిరుగుతూ ప్రసంగాలకే పరిమితం అవుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలన్నిటిని లోకేశ్ హాండిల్ చేస్తున్నారని అంటున్నారు. దానికి తగినట్లే లోకేశ్ ప్రధాని హోం మంత్రులను కలిశారు. జాతీయ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రభుత్వ విధానాలపైన, అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక పద్దతిగా వ్యవహరించవలసిన లోకేశ్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ అసత్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది విమర్శ.. .. రాజ్‌దీప్ సర్దేశాయి నిర్వహించిన సమావేశలో చంద్రబాబును జగన్ జైలులో పెట్టారు కాబట్టి జగన్‌ను జైలుకు పంపుతారా అన్న ప్రశ్నకు లోకేశ్ జవాబిస్తూ, 'అది మా ఎజెండా కాదు. చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. మా ప్రాధాన్యం ఏపీ అభివృద్ది. చట్టాన్ని ఉల్లంఘిస్తే నాతోపాటు ఎవరైనా దాని పర్యవసానం అనుభవించాల్సిందే. నేను తప్పు చేసినా మా నాన్న నన్ను జైలుకు పంపుతారు. మరో ఆలోచన లేదు" అని లోకేష్ చెప్పారట. ఈ వ్యాఖ్యలలో నిజమెంత అన్నది ఆయన ఆత్మకు స్పష్టంగా తెలుసు. కావాలంటే జగన్‌ను ఎప్పుడో జైలుకు పంపేవాళ్లమన్నది అహంభావంతో కూడిన సమాధానం కాక మరేమిటని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. జగన్‌పై కక్షతోనే లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి పలువురిని జైలుపాలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ కేసులో జగన్‌ను కూడా జైలుకు పంపించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజూ తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. దీనిని ప్రతీకార రాజకీయం అనరా? రాజ్ దీప్ సర్దేశాయికు ఏపీలో ఏమి జరుగుతున్నదో తెలియకపోవచ్చు. లోకేశ్ జవాబు విన్నవెంటనే మరి రెడ్‌బుక్ మాటేమిటి అని ప్రశ్నించి ఉండాల్సింది..!! కొద్ది రోజుల క్రితం కడపలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ తాను ఏదీ మర్చిపోలేదని, తన తండ్రిని 53 రోజులు అక్రమంగా నిర్భంధిస్తే కుమారుడిగా మర్చిపోతానా? తప్పు చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది అని లోకేశ్ చెప్పారు. నిజానికి లోకేశ్ ప్రస్తుతానికి మంత్రి మాత్రమే. కాకపోతే సకల శాఖల మంత్రిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది ప్రశ్న. మిగిలిన మంత్రులను డమ్మీలుగా మార్చారా?లోకేశ్ చెప్పే దానినే పరిగణనలోకి తీసుకుంటే తండ్రి మీద వచ్చిన కేసులను నీరు కార్చకుండా చట్టం తన పని తాను చేసుకుపోయేలా వ్యవహరించే ధైర్యం ఉందా? అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా ప్రతీకార రాజకీయాలు, రెడ్‌బుక్ గోల మానుకుని, హుందాగా నడిస్తే మంచిది. లేకుంటే ఆయన ప్రత్యర్థులపై వేస్తున్న ఉచ్చులో తానే పడిపోయే అవకాశం ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది!
‘‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’’ నూటొక్క జిల్లాల అందగాడిగా పేరొందిన సినీ నటుడు, దివంగత నూతన్‌ప్రసాద్ ఒకానొక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. నిజజీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే కానీ.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఊహూ.. మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాల గురించి కానే కాదు. పాక్‌తో యుద్ధం.. లేదా అమెరికాతో టారిఫ్‌ల విషయం అంతకంటే కాదు. దీనికంటే కొంచెం సీరియస్ విషయం. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా. ఏమిటంటారా.. తాజా గణాంకాల ప్రకారం మన సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది!జనాభా తగ్గితే మంచిదే కదా అంటున్నారా? నిజమే కానీ.. అన్నివేళలా కాదు. ఎందుకంటే.. సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉంటే.. దేశం ముసలిదైపోతుంది. వృద్ధుల వైద్యావసరాలు తీర్చడం కష్టమవుతుంది. ఇది కాస్తా ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులు గమనిస్తే మీకీ విషయం అర్థమైపోతుంది. ‘‘మా దేశం రండి. ఉచితంగా ఇల్లిస్తాం. ఉద్యోగం వెతుక్కునేంతవరకూ నెలవారీ భృతి కూడా ఇస్తాం’’ అంటూ కొన్ని యూరోపియన్ దేశాలు ఊరిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా తగ్గిపోతూండటం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన దేశంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది? ఒక్కసారి పరిశీలిద్దాం..1950లలో దేశ సగటు సంతానోత్పత్తి రేటు 6.18. అంటే పిల్లల్ని కనగలిగే వయసులో ఉన్న ఒక్కో మహిళ కనీసం ఆరుగురికి జన్మనిచ్చేదన్నమాట. నిజమే మరి.. మన తాత ముత్తాతల కుటుంబాలు చాలా పెద్దవిగానే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు... బోలెడంత మంది చిన్నాన్నలు, అత్తమ్మలు, మేనమామలు ఉండేవారు. అయితే.. దేశ అవసరాల కోసం అనండి.. ఇంకో కారణం చేతనైనా కానివ్వండి ఈ సంతానోత్పత్తి రేటు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 1.9కి పడిపోయింది. ఏ దేశంలోనైనా జనాభా క్రమేపీ పెరుగుతూ ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చనిపోయే వారికంటే పుట్టే వారు ఎక్కువగా ఉండాలంటే ఒక్కో మహిళ 2.1 మందిని కనాలన్నమాట. తాజాగా అంటే 2023ను బేస్ సంవత్సరంగా పరిగణించి చేసిన సర్వే ప్రకారం కూడా దేశ సంతానోత్పత్తి రేటు 1.9కి మించడం లేదు. అంటే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌కు ఉన్న రికార్డు చెరిగిపోనుందన్నమాట. ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత దేశ జనాభా కూర్పు ఎలా ఉందంటే.. పద్నాలుగేళ్ల లోపువారు 24 శాతం మంది ఉంటే పనిచేసే స్థితిలో ఉన్న వారు (15 - 64) వారు 68 శాతం మంది ఉన్నారు. మిగిలిన ఏడు శాతం మంది 65 ఏళ్లపైబడ్డ వృద్ధులు!అయితే ఏంటి?2050 నాటికి దేశంలో 65 ఏళ్లపైబడ్డ వారు మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటారని అంచనా. అంటే.. సుమారు 19 కోట్ల మంది పని చేసే స్థితిలో ఉండరు. వీరందని పోషణ భారం ఇతరులపై పడనుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వాలు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఫలితంగా ఆయా దేశాల గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా నిర్మానుష్యమైపోయాయి. యువత ఉపాధివేటలో నగరాలకు మళ్లిపోవడం దీనికి కారణం. మన పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. యూరోపియన్ దేశాల మాదిరిగా వృద్ధాప్య సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే మౌలిక సదుపాయాలు (వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు వంటివి)పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకు తగినట్టుగా విధానాలు మార్చాలి. పిల్లల పెంపకం ఒక భారం కాకుండా ఉండేలా తగిన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
రాజా సాబ్.. స్థాయికి తగ్గ మాటలాడండి సార్!
గోవా గవర్నర్‌గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి వయసైపోయినట్టు ఉంది. మంచి మాటతీరు, మర్యాదలతో ఒకప్పుడు అన్ని పార్టీల మన్ననలు పొందిన ఆయన.. ఇటీవల చేసిన ఒక ఉపన్యాసాన్ని గమనిస్తే ఈ అనుమానం రాకమానదు. విశాఖపట్నంలోని రిషికొండపై వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన భవంతుల్లో పిచ్చాసుపత్రి పెట్టాలని ఆయన తన గౌరవాన్ని దిగజార్చుకున్నట్లు అయ్యింది. క్షత్రియ సంక్షేమ సమితి సభ్యుల సన్మానం సందర్భంగా ఆయన నాలుగు మంచి ముక్కలు మాట్లాడి వెళ్లకుండా రిషికొండ భవనాల్లో బస చేయమన్నా నిద్రపట్టదట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుందని వ్యాఖ్యానించారు. అక్కడికి రిషికొండపై ఇప్పుడే భవనాలేవో నిర్మించినట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి. టూరిజం శాఖ భవనాల స్థానంలో చూడముచ్చటైన నిర్మాణాన్ని చేసినందుకు హర్షించాల్సింది పోయి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేశారు. పైగా ఇదో ఉచిత సలహా అంటూ వ్యాఖ్యానించడం ఆయన స్థాయికి తగింది మాత్రం కాదు. ఆయనలో రాచరికం వాసనలు ఇంకా పోనట్టు ఉంది. తమ కోటలను మించిన అద్భుతమైన భవనాలు ఇంకెక్కడ ఉండకూడదన్న అక్కసుతో రిషికొండ భవనాలపై ఈ ఆరోపణలు చేశారేమో అనుకోవలి. చిత్రంగా ఎల్లోమీడియా ఇవే వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించి చంకలు గుద్దుకుంది. అయితే..ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో పెట్టిన విపరీత ఖర్చులపై ఏనాడూ ఆక్షేపణ చెప్పని అశోక్ గజపతి రాజుకు మూడు వేల మంది కూడా లేని సచివాలయ సిబ్బంది కోసం యాభై అంతస్తుల భవనం నిర్మిస్తున్నప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా అక్రమ కేసులు పెడుతూ నిర్బంధిస్తున్నా ఆయనకు పాలకుల సైకోతత్వం అవగతం కాలేదు. రిషికొండ భవనాలను ఎలా వాడుకోవాలన్న విషయంపై అధ్యయనం జరుగుతోందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవలే చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే పవన్ అక్కడకు వెళ్లినప్పుడు ఇంకో రకం డ్రామా జరిగింది. ఫాల్స్ సీలింగ్‌ను ఎవరో కొద్దిగా కోసినట్లు కనిపించింది. ఆ ముక్క గచ్చుమీద కనిపించింది. ఉప ముఖ్యమంత్రి వస్తున్నా.. అక్కడి సిబ్బంది దాన్ని తొలగించలేదు. అంటే నిర్మాణంలో ఏదో లోపం జరిగిందన్న సందేహం ప్రజలలో కలిగించడానికి కుట్ర చేశారని సోషల్ మీడియాలో ఆధారసహితంగా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో అదేదో జగన్ సొంత భవనం అన్నట్లుగా అబద్దపు ప్రచారం చేశారు. అమరావతిలో అనవసరంగా వేల కోట్లు వ్యయం చేస్తూ, విశాఖలో రూ.450 కోట్లతో ఏడు భవనాలు నిర్మించి అందంగా తీర్చిదిద్దితే దానిని వాడుకోవడం చాతకాని ప్రభుత్వంగా మారింది. ఈ తరుణంలో అశోక్ గజపతిరాజు వచ్చి తన వంతు పాత్ర పోషించారనిపిస్తుంది. ఒకప్పుడు అశోక్ కు అంతగా పదవీ వ్యామోహం లేదని భావించే వారు. కాని తన స్థాయికి తగని గోవా గవర్నర్ పదవిని అంగీకరించినప్పుడు ఆయనకు పదవి పిచ్చి పట్టిందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి ఈ పదవి ఇప్పించారో, లేక స్వయంగా పైరవీ చేసుకున్నారో కాని, ఈ చిన్న పదవి తీసుకోవడం ద్వారా ఆయన తన స్థాయిని తానే తగ్గించుకున్నారని కొంతమంది విమర్శించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది.. రాష్ట్రంలోను, కేంద్రంలోను మంత్రిగా పనిచేసిన ఈయనకు అతి చిన్న రాష్ట్రాలలో ఒకటైన గోవాకు గవర్నర్ పదవి ఇవ్వడం అంటేనే పరువు తక్కువ అనే అభిప్రాయం పలువురిలో ఉంది. బీజేపీ నేతలు విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కె.హరిబాబు వంటివారు ఇంతకన్నా పెద్ద రాష్ట్రాల గవర్నర్లుగా నియమితులయ్యారు. కాని వీరందరికన్నా రాజకీయంగా ఎన్నో పదవులు చేసి, సీనియర్ నేతగా ఉన్న అశోక్ కు మొక్కుబడిగా గోవా గవర్నర్ పదవి ఇస్తే పరమానందంగా స్వీకరించారని, దీనిని ఏమంటారని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గవర్నర్ పదవిలో హుందాగా ఉండవలసిన ఈయన రాజకీయ విమర్శలు చేయడం, మాజీ సీఎంను సైకో అని అనడం బహుశా వయసు మీద పడడం వల్ల వచ్చిన సమస్య కావచ్చేమో అన్నది కొందరి అనుమానం. విశేషం ఏమిటంటే ఇదే సభలో ఆయన ప్రతి ఒక్కరు అహం నియంత్రించుకోవాలని హితబోధ చేశారు.అయితే ఆయన మాత్రం అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యారు. అశోక్ గజపతి రాజే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్నిసార్లు అసందర్భ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ మధ్య ఆయన ఒక సభలో మాట్లాడుతూ కనీసం 120 ఏళ్లు జీవించవచ్చని, తాను సంజీవని అనే స్కీమ్ తీసుకు వస్తున్నానని అన్నప్పుడు సభికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బహుశా ఆయన మనసులోని కోరికను ఇలా బయటపెట్టారేమో అని కొందరు వ్యాఖ్యానించారు. ఇదే కాదు.. గతంలో హుద్ హుద్ తుపాను వచ్చిన తర్వాత, సముద్రాన్ని కంట్రోల్ చేశామని అనడం చిత్రం అనిపించింది. అమరావతిలో పది డిగ్రీల వేడి తగ్గించడానికి ఆదేశాలు ఇచ్చానని ఒకసారి, అమరావతిలో ఒలిపింక్స్ నిర్వహిస్తామని ఇంకోసారి ..ఇలా పలురకాలుగా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు తమ వయసును గుర్తు చేస్తున్నారన్నఅభిప్రాయం కలుగుతుంది. ‘‘వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయం ఏమీ రాదని, దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిది’’ అన్న గజపతిరాజు వ్యాఖ్యలకు ఒక పౌరుడి స్పందన ఏమిటంటే... ‘‘అవును నిజమే! 15 నెలల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన కారణంగా ఏపీ ప్రజలు చాలామందికి పిచ్చి ఎక్కిన పరిస్థితి ఉంది, నయం చేసుకోవాలంటే విశాఖలోనే కాదు... రాష్ట్రమంతా పిచ్చి ఆస్పత్రులు పెట్టాలి. మొట్టమొదటగా విజయనగరంలో అలాంటి ఆస్పత్రి ఏర్పాటు చేస్తే మేలు’’ అని!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పబ్లిక్ టాక్: ఆ దొంగలే ఎంతో నయం!
మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్కని మనిషి కరిస్తే కదా వార్త అని మనం అంతా అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అలాంటిదే. దొంగలు దోచుకుంటే అది వార్త కాదు. ఇవాళ్టి రోజుల్లో అయితే దొంగలు దొరికినా కూడా వార్త కాదు. టెక్నాలజీ చాలా మందిని పట్టిచ్చేస్తోంది. కానీ దొంగలు దోచుకున్న సొమ్మును తిరిగి తెచ్చి, దొంగచాటుగా, అప్పగించేసి, లెంపలు వాయించుకుని, క్షమాపణ కోరుతూ ఓ ఉత్తరం కూడా విడిచి వెళ్లారంటే మాత్రం అది వార్తే. ఆ యవ్వారంలో ఏదో కొంత స్ఫూర్తి ఉన్నదని గ్రహించాల్సిందే. ఆ స్ఫూర్తిని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి.. మన రాజకీయ నాయకులందరికీ కానుకలుగా పంపాలని కంకణం కట్టుకోవాల్సిందే. ఇంతకీ ఏమిటీ తమాషా అనుకుంటున్నారా?.. అనగనగా బుక్కరాయసముద్రంలో ముసలమ్మ పుణ్యక్షేత్రం ఉంది. సాధారణంగా గ్రామదేవతలు అత్యంత మహిమాన్వితులుగా స్థానికులు నమ్ముతుంటారు కదా.. అక్కడ కూడా ముసలమ్మ మహిమల్ని అదేవిధంగా నమ్ముతుంటారు. కానీ.. కొన్ని రోజుల కిందట ముసలమ్మ పుణ్యక్షేత్రంలో దొంగలు పడి హుండీ చోరీ చేశారు. ఒకవైపు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈలోగా.. ఆలయ ఆవరణలోనే దోచిన సొమ్మునంతా తెచ్చిపెట్టేసి, దానితో పాటు ఓ ఉత్తరం కూడా పెట్టి.. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు.హుండీ సొమ్ము దొంగిలించిన కాణ్నించీ.. మా యింట్లో పిల్లలకి ఆరోగ్యం బాగా లేదు. ముసలమ్మ సొమ్ము దొంగిలించి తప్పు చేశాం. అందుకే తిరిగి యిచ్చేస్తున్నాం. ఆస్పత్రి ఖర్చులకు అయిన డబ్బు మాత్రం వాడుకున్నాం. క్షమించండి.. అని ఆ ఉత్తరంలో వారు వాక్రుచ్చారు. పోలీసులు తిరగొచ్చిన సొమ్మును లెక్కవేస్తే 1.86 లక్షల రూపాయల దాకా తేలింది. దొంగలెవరో కనిపెట్టాలని వెతుకుతున్నారు.పాపం.. ఆ ముసలమ్మ హుండీ దొంగల పశ్చాత్తామని, పాపభీతిని పక్కన పెడదాం. సొమ్ము తిరిగి ఇవ్వడం ద్వారా వారిలోని స్ఫూర్తిని మాత్రం పట్లించుకుందాం. ఈ వార్త చదివితే.. ఈ దొంగల స్ఫూర్తి మన రాజకీయ నాయకులకు ఉంటే ఎంత బాగుంటుంది కదా.. అని మనకు అనిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారం దక్కింది.. ఉన్న కాడికి దోచెయ్యాలి.. జీవితంలో మళ్లీ అధికారం అనేది మన దాకా వస్తుందో రాదో అన్నట్టుగా దోపిడీ చేస్తున్న కూటమి పార్టీ నాయకుల వ్యవహారం ప్రజలకు కంపరం పుట్టిస్తోంది. పబ్లిక్ టాక్ ఏంటంటే..ఏపీలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోచుకుంటూ ఉంటే.. చేతగాని ప్రేక్షకుడిలాగా చూస్తూ ఊరుకుంటున్న అధినాయకుడు మాత్రం.. అప్పుడప్పుడూ రంకెలు వేస్తూ.. ‘లేస్తే మనిషిని కాదు.. ఖబడ్దార్’ అంటూ ఉంటారు. ఒకవైపు హామీల అమలులో విఫలమై.. ప్రజాసందోహంలో పరువు పోగొట్టుకుంటున్న కూటమి నాయకుల్లో.. మళ్లీ ఎన్నికలంటూ వస్తే మనం ఎటూ గెలవం అనే భయమే వారిని దోపిడీ వైపు ప్రేరేపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి మొబిలిటీ అడ్వాన్సుల ముసుగులో దోచుకున్న వందల వేల కోట్ల రూపాయలు, లిక్కర్ దుకాణాల్ని అయినవారికి కట్టబెట్టి సిండికేట్లుగా దోచుకుంటున్న మొత్తాలు, ఇసుక ఉచితం పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న వాటితో ప్రారంభించి.. అవకాశం ఉన్న ప్రతి వ్యవహారంలోనూ ఆమ్యామ్యాలతో రెచ్చిపోతున్న నాయకుల్లో ఇలాంటి పశ్చాత్తాపం రావాలంటే.. వారికోసం ఎంత పవర్ ఫుల్ దేవుళ్లు... వారికి ఎన్ని ఇక్కట్లు సృష్టించాలో కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నాయకులు దోచుకుంటున్న సొమ్ముల్లో వాడుకున్నది పోగా.. దేవుళ్ల మహిమతో, ముసలమ్మ దొంగల స్ఫూర్తితో మిగిలింది తిరిగి ఇచ్చినా కూడా.. ఒక అమరావతి కాదు కదా.. పది అమరావతిలు, పది పోలవరం డ్యాములు కట్టవచ్చునని ప్రజలు అంటున్నారు.అయినా.. దొంగలకు ఉండే స్ఫూర్తి ఈ నాయకులకు ఎందుకుంటుంది? దొంగలు చాలా గొప్పవాళ్లు కదా? అవసరం కోసం దోచుకునే వారికి ఉండే న్యాయం, బుద్ధి.. అరాచకం కోసం దోచుకునే నాయకుల్లో ఆశించడం కూడా తప్పే కదా.. అని కొందరు పెదవి విరుస్తున్నారు.:::ఎం.రాజేశ్వరి -
ఎద్దు ఈనిందనగానే.. జున్నుపాలు అడిగాడంట!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే అందరు సచివుల కంటె తాను కార్యవాది మంత్రిని అని చాటుకోవడానికి పాపం.. నారా లోకేష్ బాబుకు చాలా అత్యుత్సాహంగా ఉన్నట్టుంది. టెక్నాలజీని వాడడంలో వేగం మాత్రమే కాదు, కార్యకర్తలు తమ కష్టాల్ని చెప్పుకుంటే వాటికి తక్షణం స్పందించడంలో కూడా తనను మించిన వారు లేరని చాటుకోవాలనే ఉబలాటం చాలానే ఉన్నట్టుంది. ఓ కార్యకర్త నారా లోకేష్‌ను ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పెట్టగానే, 20 నిమిషాల్లోగా మంత్రిగారు దానికి రెస్పాన్స్ ఇచ్చారు. సంబంధిత పోలీసుల్ని పనిమీద పురమాయించేశారు. న్యాయం చేయాలని, తనకు అప్ డేట్ చేయాలని ఎక్స్ లో హుకుం విడిచారు. చూడబోతే.. ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయమన్న పెద్దమనిషి ఆత్రుత గురించి మన పెద్దోఆల్లు సామెతలు తయారుచేశారు. కానీ లోకేష్ వ్యవహార సరళిని గమనిస్తే.. ‘ఎద్దు ఈనిందంటే.. సాయంత్రం ఇంటికి జున్నుపాలు పంపు..’ అని అడిగే చందంగా కనిపిస్తున్నారు. Please look into this issue @appolice100. Kindly follow up @officeofNL and keep me updated. https://t.co/558zUiBWA5— Lokesh Nara (@naralokesh) September 4, 2025ఇంతకూ ఈ కామెడీ ఎపిసోడ్ తాలూకు కథా కమామీషూ ఏంటంటే... ‘‘అన్నా @naralokesh గారు. నా పేరు రోజిబాబు. నా జీవనాధారం అయిన ఇన్నోవా కారును YCPకి చెందిన ఒక వ్యక్తి అన్యాయంగా లాక్కుని వెళ్తే గత సంవత్సరంగ నాకు జరిగిన అన్యాయం గురించి గుంటూరులోని నగరపాలెం పోలీసుల చుట్టూ తిరుగుతున్న స్పందన లేదు .దయచేసి నా కారు నాకు ఇప్పించండి.నాకు అదే జీవనాధారం.’’ అంటూ ఎవరో ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. లోకేష్ వెంటనే పోలీసులను ట్యాగ్ చేసి, ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ సంగతేంటో చూడండి.. ఏ సంగతి ఎప్పటికప్పుడు నాకు చెప్పండి’’ అని ట్వీటు వేసేశారు. ఇదంతా సదరు రోజిబాబు ట్వీటు పెట్టిన 20 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఒక మామూలు వ్యక్తి ట్వీటుకు మాననీయ మంత్రి వర్యులు అంత వేగంగా స్పందిస్తే సంతోషించాలి గానీ.. విమర్శ ఎందుకు? అనిపించవచ్చు. అక్కడే ఉంది తమాషా!. సదరు రోజిబాబు.. ట్విటర్ అకౌంటు పెట్టుకున్నదే ఈ సెప్టెంబరు నెలలో.. అనగా ఇవాళ గత రెండురోజుల్లోనో మాత్రమే. ఆయన ఖాతాలో ఉన్నది ఇదొక్కటే ట్వీటు! ఆయన ఇలా పెట్టడమూ వెంటనే మంత్రి స్పందించడమూ.. ఏదో ముందే స్క్రిప్టు ప్రకారం జరిగిన కామెడీ ఎపిసోడ్ లాగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పోస్టు కింద కామెంట్లలో స్పందిస్తున్న నెటిజన్ల జోరు గమనిస్తే... చినబాబుకు బహుశా జ్ఞాననేత్రం తెరచుకోవాల్సిందే! ఆ రోజిబాబు అకౌంటును గంట ముందే క్రియేట్ చేసుకుని పోస్టు పెడితే.. అప్పుడే స్పందనా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏకంగా డీసీఎం పోస్టు నువ్వే తీసుకోరాదా అంటున్నారు. తల్లికి వందనం రాలేదని, ఉద్యోగాలు అడిగినా గానీ స్పందించరు గానీ.. వైసీపీ వాళ్లు కారు లాక్కున్నారనగానే.. ముందూ వెనకా చూసుకోకుండా చర్యలకు పురమాయించడమేనా అని కొందరు అడుగుతున్నారు. మహానాడుకు వచ్చినప్పుడు నా ఫోను పోయింది సార్.. సీకె దిన్నె పోలీసులకు ఫిర్యాదుచేసినా దిక్కులేదు.. తమరు ఇప్పించండి అంటూ దాసరి రామకృష్ణారెడ్డి అనే తెదేపా సీనియర్ కార్యకర్త అంటున్నారు. సుగాలి ప్రీతి తల్లి విలాపం విషయంలో ఈ వేగవంతమైన స్పందన ఎక్కడికెళ్లిందని అంటున్నారు. మొత్తానికి ఒక్క ట్వీటు ద్వారా.. నారా లోకేష్ అభాసు పాలైపోతున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. ఒకరు ఒక ఫిర్యాదు చేస్తే అందులో ఉండే న్యాయబద్ధత గురించి తెలుసుకుని స్పందించడం విజ్ఞుల విధానం. అలా కాకుండా.. నింద వైసీపీ వారి మీద ఉన్నది కదా అని.. చర్యలకు ఉపక్రమిస్తూ రెచ్చిపోయి స్పందిస్తే ఇలా అభాసుపాలు కావల్సిందేనని అంతా అనుకుంటున్నారు. పీఆర్ స్టంటులను, స్ట్రాటజీలను తగలెయ్యా అని జనం ఆడిపోసుకుంటున్నారు. నేరుగా మొరపెట్టుకోవడానికి అవకాశం ఇవ్వరని, వినతిపత్రాలు రాసుకుంటే బుట్టదాఖలు అవుతాయని, ట్వీట్ల రూపంలో అయితే సోషల్ మీడియా క్రేజ్ కోసం స్పందిస్తారని.. పాపం ఆ జోజిబాబుకు కూటమి నేతల మీద ఒక నమ్మకం ఉంటే తాను ఖాతా క్రియేట్ చేసుకుని తొలిపోస్టుగానే ఈ నింద పెట్టడం తప్పేమీ కాదు. కొత్త ఖాతా అయినంత మాత్రాన, ఒకటే పోస్టు ఉన్నంత మాత్రాన మంత్రి స్పందించకూడదని కూడా లేదు. కానీ.. ఇలాంటి నిరాధార నిందలు రోజుకు కొన్ని వేలు కూడా వస్తుంటాయి. నిరాధారంగా వేసే నిందల పట్ల కూడా మహా వేగం స్పందించేస్తే అభాసుపాలు కావాల్సిందే. ఒకవేళ జోజిబాబు ఆరోపణ నిజమే అయితే.. వైసీపీకి చెందిన వ్యక్తి కారు లాక్కోవడానికి ఎలాంటి కారణం ఉన్నదో ముందు తెలుసుకోవాలి. సదరు జోజిబాబు పోలీసుల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతున్నా ఎందుకు పని జరగలేదో తెలుసుకోవాలి. ఒకవేళ అదంతా నిజమే అని తేలితే.. ఏడాదిరోజులుగా పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేస్తారా? ట్రాన్స్ఫర్ చేస్తారా? కూడా లోకేష్ తేల్చి చెప్పాలి. అంతే తప్ప.. వైసీపీ అనే పదం కనపడగానే.. బురద చల్లుడుకు వీలుగా ఉన్నదని ఇలా రెచ్చిపోయి స్పందిస్తే నవ్వులపాలవుతారు. ఎద్దు ఈనిందంటే.. జున్నుపాలు తెమ్మన్నంత మేధావిగా కొత్త సామెతలు పుట్టడానికి కారకులవుతారని చినబాబు తెలుసుకోవాలి.:::ఎం. రాజేశ్వరి -
కాళేశ్వరం తలనొప్పి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే కాదు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందా? శాసనసభలో ఒకలా.. హైకోర్టులో ఇంకోలా వాదనలు వినిపించడం ఈ అనుమానానికి తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఆదివారం హడావుడిగా శాసనసభ పెట్టి సీబీఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ఇప్పటికీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయం తరువాత విచారిస్తామని ప్రభుత్వం సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో హైకోర్టు కేసీఆర్, హరీశ్‌రావులపై తదుపరి చర్యలను నెల పాటు నిలిపివేసింది. ఈ కేసులో ఆడ్వకేట్ జనరల్ వాదన ఆసక్తికరంగా ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు, సీబీఐ విచారణకు సంబంధం లేదని, జాతీయ డామ్ సేఫ్టీ అధారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరామని ఆయన వెల్లడించారు. అదే నిజమైతే కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. పైగా ఈ చర్చ జరిగిన తీరు చూస్తే బీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ రొంపిలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది.శాసనభలో తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను గట్టిగా వినిపించి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసినట్లు అనిపించింది. కాని ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తన వాదనను సమర్థంగా వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందా అనిపించింది. సీఎంతోపాటు పలువురు మంత్రుల ఆరోపణలకు హరీశ్ ధీటుగా ఆధారసహితంగా జవాబిచ్చారు. ఒక దశలో హరీశ్ ప్రసంగం కొనసాగకుండా చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వారు ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని, అది పీసీసీ నివేదిక అంటూ విమర్శలు చేసి వాకౌట్ చేశారు. పిమ్మట మరికొందరు మాట్లాడిన అనంతరం ఈ నివేదికపై తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోవడానికిగాను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెబుతున్నా అది సమర్థనీయంగా అనిపించదు. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా? చిత్తశుద్దితో చేసిందా? అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్టులోకి బాల్ నెట్టి లాభం పొందుదామన్నది కాంగ్రెస్ ప్రయత్నమా? కేంద్రం అనుమతించకపోతే బీజేపీ, బీఆర్ఎస్ల కుమ్మక్కు అని ప్రచారం చేయవచ్చు. అనుమతిస్తే దాని ప్రభావం బీఆర్ఎస్పై ఉండనే ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ల పొత్తు అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో సీబీఐ తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరడం ఏమిటన్నది కొందరి ప్రశ్న. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇదే అంశంపై ఒక ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో అస్త్రాలుగా మారాయని గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. అదే సంస్థను రేవంత్ ఎలా విశ్వసిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. సీబీఐ, ఈడీల కారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కూడా కొన్ని రోజుల క్రితం సీబీఐని విమర్శిస్తూ స్పీచ్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్పై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనిద్వారా రేవంత్ తన చేతిలోని ఆయుధాన్ని బీజేపీకి అప్పగించారా అన్న ప్రశ్న కూడా వస్తోంది.కేంద్రం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది పడవచ్చు. సీబీఐ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు తదితరులను అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ.. ఈలోగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధినేత అసమ్మతి నేతగా మారి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలకు దారి తీసింది. హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌లకే కాళేశ్వరం స్కామ్ సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నుంచి కవితకు పెద్ద మద్దతు అయితే రాలేదు. అందరూ హరీశ్‌రావు వెంబడే నిలబడ్డారు. అయినా సరే.. కవిత వ్యాఖ్యలతో పార్టీకి కొంత నష్టమైతే జరిగింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని భావిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. కేసీఆర్‌కు సానుభూతి వస్తుందనుకుంటే ముందుకు వెళ్లకపోవచ్చు.లేదా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి కూడా యత్నించవచ్చు. ఈ పరిణామాలేవీ తెలంగాణ బీజేపీకి అంతగా రుచించినట్లు అనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేసేది. కాని ఇప్పుడు ఆ పక్షం ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ నేత మహేశ్ రెడ్డి సీబీఐ విచారణను స్వాగతించినట్లు కనిపించలేదు. ఎందుకింత హడావుడిగా ఒకరోజు సమావేశం పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేశారని, ముందుగానే ఈ కేసును సీబీఐకి అప్పగించి ఉండాల్సిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సీబీఐ దర్యాప్తును చేపడితే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈయన పాత్రను కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కమిషన్ విచారణ సందర్భంగా ఈటెల ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్పారు. కమిషన్ మాత్రం దానిని పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. పలువురు ఐఎఎస్ అధికారులు కూడా సీబీఐ విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ ఐదేళ్లు ఈ వ్యవహారం ఒక రాజకీయ రచ్చగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఘోష్ కమిషన్ ఎక్కువ భాగం సాంకేతిక అంశాలకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. అవినీతి జరిగి ఉంటే ఏ రకంగా జరిగిందన్నదానిపై నివేదికలో పెద్దగా పరిశీలన లేదు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన తుమ్మిడి హెట్టి వద్ద నీరు తగినంత ఉన్నా, దానిని మార్చి మేడిపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్చించారన్నది ఘోష్ కమిషన్ వ్యాఖ్య. దానిని హరీశ్ రావు తోసిపుచ్చుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేయలేదని కాదు. ఆ రోజుల్లో కేసీఆర్ తన మాటే శాసనంగా ప్రభుత్వాన్ని నడిపారు. సాంకేతికపరమైన అంశాలను కూడా ఆయనే డీల్ చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. అదే రీతిలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది. ఈ కమిషన్ కొంతమంది అధికారుల జోలికి అసలు వెళ్లకపోవడంపై కూడా విమర్శలు ఉన్నాయి. రేవంత్ కాని, మంత్రులు కాని ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే యత్నం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డను వ్యతిరేకించలేదని రిపోర్టులోని అంశాలను హరీశ్ ఎత్తిచూపారు. ఘోష్ కమిషన్ వద్ద ఉన్న ఈ కమిటీ రిపోర్టును హరీశ్ ఉటంకించడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఆ మీదట.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రిపోర్టు మీరే రాయించి ఉంటారని అనడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్లయింది. అలాగే మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడి హెట్టికి, మేడిగడ్డకు మధ్య గోదావరిలో కలిసే వాగులు, ఏరులు లేవని చేసిన వ్యాఖ్యకు సంబంధించి సమాధానం ఇస్తూ ఎన్ని వాగులు గోదావరిలో కలిసేది ఒక పెద్ద జాబితానే చదివారు. దాంతో జూపల్లి వాదన వీగిపోయింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించడంతో ఆ రోజుల్లో టీఆర్ఎస్లో ఉండి ఆయనేమి మాట్లాడారో, ట్వీట్ చేశారో చూపించారు. జాతీయ డ్యామ్ భద్రత అధారిటీ విచారణ గురించి ఉత్తం చెప్పారు. అసలు ఆ అధారిటీ ని కేంద్రం ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకువచ్చినప్పుడు ఎంపీగా ఉన్న ఉత్తం దానిని వ్యతిరేకించారని, రాష్ట్రాల హక్కులను హరించడమే అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడితే లక్ష కోట్ల దోపిడీ అంటూ రేవంత్, మంత్రులు మాట్లాడినా, అది ఏరకంగా జరిగిందన్నది వివరంగా చెప్పలేదు. ఏదో సాధారణ రాజకీయ విమర్శగానే చేశారు. దానికి హరీశ్ బదులు ఇస్తూ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే ప్రాజెక్టు కాదని, 15 రిజర్వాయిర్లు, కిలోమీటర్ల కొద్ది టన్నెళ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, మొదలైన వాటి జాబితాను వివరించారు. అసలు మొత్తం ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు అయితే, లక్ష కోట్ల దోపిడీ అని ఆరోపించడంలో హేతుబద్దత కనిపించదు. అయితే మేడిగడ్డ వద్ద బారేజీ దెబ్బతింటే అసలు నీరు అందుబాటులో ఉండదని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిరర్థకం అవుతుందని ఉత్తం అనడంలో కొంత అర్థం ఉంది.కాని ఆ బ్యారేజీలు పూర్తిగా దెబ్బతిని ఉంటే ఆ సమస్య వస్తుంది కాని, లేకుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటుంంది.దానిని రిపేరు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించకపోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురి అవుతుంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ఒకవైపు 18 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతూ,మరోవైపు అందుకు విరుద్దంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఈ నిర్మాణం చేసిన కాంట్రాక్టు సంస్థలను ఏ రాజకీయ పార్టీ పెద్దగా తప్పు పట్టకపోవడం గమనించవలసిన అంశమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
న్యాయస్థానం ప్రశ్నలకు జవాబేదీ ఎల్లో ఫెలోస్!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం స్కామ్ పేరుతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమర్పించిన ఛార్జ్‌షీట్‌పై కోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ స్కామ్‌లో రూ.3500 కోట్లు దారి మళ్లాయన్న ఆరోపణపై తగిన సమాచారం ఇవ్వకపోవడం కోర్టు సందేహాల్లో కీలకమైంది. ఛార్జ్షీట్లన్నింటిలోనూ మొత్తం 21 అభ్యంతరాలను వ్యక్తం చేసిన న్యాయస్థానం వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. వారు ఎలాంటి జవాబిస్తారో తెలియదు కానీ.. ఇప్పటివరకూ ప్రజలకు వచ్చిన సందేహాలే న్యాయస్థానం కూడా వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. కోర్టు అభ్యంతరం చేసిన అంశాలలో సాంకేతికమైనవి కూడా ఉన్నాయి. ‘‘రూ.3500 కోట్లు దారి మళ్లాయని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తం వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోయే విధంగా సమర్పించాలి’’ అని కోర్టు స్పష్టం చేసింది. సిట్ అధికారులు నిజంగానే ఆ స్థాయిలో స్కామ్‌ను కనుక్కుని ఉంటే రూ.3500 కోట్ల అవినీతి ఎలా జరిగింది? ఆధారాలు ఏమిటి? డబ్బు ఎలా వక్రమార్గం పట్టింది? వంటి వివరాలు తెలిపి ఉండేవారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో స్కిల్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆయన అరెస్టు అయ్యారు. ఆ సందర్భంలో సీఐడీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఏమిటి? డబ్బు ఎలా దారి మళ్లింది? ఆయా షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది? చివరికి ఆ స్కామ్ డబ్బు టీడీపీ ఖాతాలోకి ఎంత చేరిందన్నదీ వివరిస్తూ కేసు పెట్టారు. పైగా అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్కిల్ స్కామ్‌ను దర్యాప్తు చేసి మనీ లాండరింగ్‌ను గుర్తించింది. పలువురిని అరెస్టు కూడా చేసింది. స్కిల్ స్కామ్ విచారణ పకడ్బందీగా చేశారన్న కోపంతోనే అప్పటి సీఐడీ ఛీఫ్ సంజయ్‌ను ఇప్పుడు ఏదో అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆయన మార్గదర్శి కేసును కూడా హాండిల్ చేశారు. ఆ కోపంతో ఈనాడు మీడియా ఆయనపై కుట్రపూరిత కథనాలు ఇస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మద్యం కేసుకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఎవరికైనా మతి పోవల్సిందే. ఒక రోజు రాసిన దానితో నిమిత్తం లేకుండా మరుసటి రోజు పరస్పర విరుద్దంగా ఏవో కొత్త,కొత్త ఊహాగానాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్‌ను ప్రభుత్వమే సృష్టించి, ఎల్లో మీడియా ద్వారా నిత్యం తప్పుడు స్టోరీలు రాయిస్తూ, వైసీపీ నేతలు, మరికొందరు అధికారులను పోలీసుల చేత అరెస్టు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటుంది. సిట్ కోర్టుకు సమర్పించే ఛార్జ్షీట్లలో కూడా పుక్కిటి పురాణాలు కనిపిస్తున్నాయని కొందరు లాయర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. కోర్టువారు సైతం ఈ అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. పోలీసులు ఏమి కోరుతున్నది కూడా ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా రాయాలని కోర్టు సూచించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎల్లో మీడియా ఒక్కోసారి ఒక్కో రకంగా చేసిన ప్రచారం.. సిట్ అధికారుల లీక్‌లు, ఛార్జ్‌షీట్ లో ఉన్న అంశాలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.సిట్ అధికారులు జూలై నెలాఖరులో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్‌హౌస్‌లో 12 పెట్టెలలో రూ.11 కోట్లు పట్టుకున్నారని అవి మద్యం నోట్ల కట్టలని, నిందితుడైన రాజ్ కెసిరెడ్డి వని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి రాశాయి. మధ్యం స్కామ్‌లో ఇది కీలక పరిణామమని కూడా దబాయించి చెప్పాయి. బాక్సులు బద్దలు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆ రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలపడమే కాకుండా, ఆ నోట్ల నెంబర్లను రికార్డు చేయాలని, ఆ నోట్లపై తన వేలి ముద్రలు ఉన్నాయోమో పరిశీలించాలని కోరారు. అంతే! అటు సిట్.. ఇటు ఎల్లో మీడియా గప్‌చుప్! ఆ అంశంపై కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారని వార్తలు వచ్చాయి. అంతకుముందు ఒక రోజు మద్యం స్కామ్ కు సంబంధించిన 3.58 లక్షల జీబీల డేటాను నాశనం చేసిన వైకాపా ముఠా అంటూ ఈనాడు మీడియా ఏదో పెద్ద పరిశోధన చేసి కనిపెట్టినట్లు ప్రచారం చేసింది. అలాంటిదేమీ జరగలేదని బెవరేజ్ కార్పొరేషన్ సమాధానం చెప్పడంతో ఈనాడు మీడియా పరువు పోయింది. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా అలాంటి పిచ్చి కథనాలను రాస్తూనే ఉంది. మరో నిందితుడు వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్ లో ఒక వీడియో కనిపించిందని, దాని ప్రకారం ఐదు కోట్ల మొత్తం ఓటర్లకు పంచడానికి ఉన్న డబ్బు కట్టల వద్ద అతను ఫోటో దిగాడని అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అందులో అప్పటికే రద్దు అయిన రెండువేల రూపాయల నోట్లకట్ట ఉన్నట్లు కనిపించడంతో వారి ప్రచారం తుస్సు అయింది. అంతేకాక తామసలు వెంకటేష్ సెల్ ఫోన్‌ను ఓపెన్ చేయలేదని ఏకంగా సిట్ అధికారులే న్యాయస్థానానికి చెప్పడంతో ఎల్లో మీడియా కల్పిత కథలెలా ఉంటాయో ప్రజలకు తెలిసిపోయింది. వెంకటేష్ నాయుడు ఒక సినీ నటితో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటో, జగన్‌ను ఎక్కడో కలిసి కరచాలనం చేసిన ఫోటో చూపించి అదిగో మద్యం స్కామ్ లింక్ అని ఎల్లో మీడియా ఊదర గొట్టింది. ఆ తర్వాత అదే వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లను కలిసి సత్కారం చేస్తున్న దృశ్యాల ఫోటోలు వెలుగులోకి రావడంతో టీడీపీ మీడియా అవాక్కయింది. అంతేకాదు రూ.11 కోట్లు దొరికినట్లు చెబుతున్న ఫామ్ హౌస్ యజమానితో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కలిసి ఉన్న ఫోటో కూడా వెలుగు చూసింది. దానికి వివరణ ఇస్తూ అబ్బే అది ఏదో కార్యక్రమంలో తీసుకున్న ఫోటో అని చెప్పే యత్నం చేశారు. మరి జగన్ తో కరచాలనం చేస్తే ఆయనకు లింక్ పెట్టిన ఇదే పత్రిక తనవరకు వచ్చేసరికి అలా తప్పించుకుంటుందన్న మాట. రాధాకృష్ణ గురించి తెలిసిన వారెవ్వరూ ఆ పత్రిక వివరణను నమ్మలేదనుకోండి. వెంకటేష్ సెల్ ఫోన్లో నుంచి సిట్ వీడియోలు రిట్రీవ్ చేసినట్లు కూడా ఎల్లో మీడియా రాస్తే ఆ సిట్ అధికారులేమో దానిని ఖండించారు. సెల్ ఫోన్ లాక్ తీసేందుకు వెంకటేష్ సహకరించలేదని, ఫోన్లో ఏముందో తెలియదని తెలిపారు.దాంతో మరోసారి ఎల్లో మీడియా పరువు పోయింది. అలా అనధికార తప్పుడు సమాచారం ఇచ్చిన మీడియాకు ఆ స్వేచ్ఛ ఉన్నట్లు సిట్ వాదించడం విశేషం. ఈ కేసులో ఎవరిని అరెస్టు చేస్తే వారే కీలకమైనవారని, సూత్రధారులని సిట్ చెప్పడం, ఆ ప్రకారం వీరు రాసేయడం మామూలై పోయింది. కొద్ది రోజుల క్రితం మాజీ ఉప ముఖ్యమంత్రి, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిని సిట్ విచారించింది. ఆయనేమి చెప్పారో కాని, ఎల్లో మీడియా మాత్రం అంతా పైవాళ్లకే తెలుసునని అన్నట్లు భారీ కథనాన్ని ఇచ్చింది.ఆ తర్వాత రోజు నారాయణ స్వామి వాటిని ఖండించి కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ ను సృష్టించారని ఎల్లో మీడియా అభూత కల్పనలు రాస్తోందని, తనకు లేని ల్యాప్‌టాప్‌ను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కోర్టు ప్రస్తావించిన అభ్యంతరాలపై ఎల్లో మీడియా కిక్కురుమనలేదు. సిట్ వేసిన ఛార్జ్షీట్లకు సంబంధించి పలు అభ్యంతరాలను కోర్టువారు లేవనెత్తితే, ఎల్లో మీడియా రాసిన కల్పిత కథనాలపై ఎవరు అభ్యంతరం చెప్పాలి? తాము ఇచ్చే స్టోరీలకు రెండో వర్షన్ లేకుండా ఇష్టారీతిన రాస్తూ ఎల్లో మీడియా జర్నలిజాన్ని నీచమైన స్థాయికి తీసుకువెళ్లడం దురదృష్టకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సుగాలి ప్రీతి కేసు లేదు.. స్టీల్ ప్లాంట్ ఊసులేదు
రాష్ట్రానికి దాదాపు ముప్పైమంది ఎంపీలున్నారు.. మీరంతా ఎందుకున్నట్లు?.. సిగ్గుందా? లజ్జ ఉందా?? మీకసలు పౌరుషం లేదా??? పౌరుషం కావాలంటే కాసింత గొడ్డుకారం తినండి! ఒంటికి రాసుకోండి!!.. అప్పుడైనా మీకు పౌరుషం వస్తుందేమో..!!! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తుంటే ఈ వైఎస్సార్సీపీ వాళ్లెం చేస్తున్నారు? ఇదేనా మీ నైతికత.. ఇదేనా మీ బాధ్యత .. అదే నేను ఉండుంటే ఢిల్లీవాళ్ళు ఇలాగె చెలరేగిపోయేవాల్లా.. ఖచ్చితంగా నేను ఆ ప్రయివేటీకరణంను ఆపేసేవాణ్ని.. ఎన్నికలకు ముందు చిందులు తొక్కిన పవన్.. నేడు ఆ అంశాన్ని మెల్లగా సైడ్ చేసేసారు. విశాఖలో మూడురోజులపాటు పార్టీ నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు అంటూ హడావుడి చేసిన పవన్ తనలోని అసలైన రాజకీయ నాయకున్ని బయటకు తీశారు. ఎప్పట్లానే పదిహేనేళ్ళు మళ్ళా తెలుగుదేశంతో కలిసి సాగుతానని అన్నారు. దానికి కార్యకర్తలు.. నాయకులు తలూపాలని చెప్పేశారు.పదవులు ముఖ్యం కాదని.. సమాజమే ప్రధానమని... దేశోద్ధారణకు పార్టీ ఏర్పాటు చేసానని చెప్పేసారు. తనకు తన అన్న నాగబాబుకు పదవులు వచ్చాయి కాబట్టి అలాగే అంటాడు. కానీ గ్రామ.. మండల స్థాయిల్లో పని చేస్తున్న కార్యకర్తలు.. నాయకుల పరిస్థితి ఏమిటని ? తమను తెలుగుదేశం వాళ్ళు సెకెండ్ గ్రేడ్ పౌరుల్లా చూస్తున్నారని లోలోన జనసైనికులు కుమిలిపోతున్నా ఆ సౌండ్ బయటకు రాకుండా చేతులు అడ్డం పెట్టుకున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఎమోషన్ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కీలక విభాగాలను ప్రయివేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం వేసిన నోటిఫికేషన్ గురించి పవన్ ఎక్కడా కిక్కురుమనలేదు. అసలు ఆ విషయాన్నీ కూడా జనంలోకి రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. మరోవైపు సుగాలీ ప్రీతి హత్య గురించి ఎన్నికలకు ముందు గంగవెర్రులెత్తిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారని, ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ తమకు న్యాయం చేయకపోతే జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే మొదట ఓపెన్ చేసేది సుగాలి ప్రీతి కేసు అని... అప్పట్లో చెప్పిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద కూడా ఎక్కడా ప్రస్తావించకుండా వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూడ్డానికి వెళ్లారు. అందులో సీలింగ్‌కు వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేస్తున్నారు. అటు వేలకోట్ల విలువైన ఉక్కుపరిశ్రమ గురించి మాట్లాడకుండా ఇలాంటి చిల్లర విషయాలు ప్రస్తావిస్తూ ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేస్తూ ఇలా పూటగడిపేస్తున్నారని విశాఖలోని యువత దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి మూడురోజుల పవన్ ప్రోగ్రాం సొంత డబ్బా కొట్టుకోవడానికి .. చంద్రబాబును కాపాడ్డానికి ఉపయోగపడిందని అంటున్నారు..:::సిమ్మాదిరప్పన్న -
ఎర్రకోట పెడుతున్న పరీక్ష!
ఆగస్టు 15 వచ్చిందంటే చాలు ఢిల్లీలోని ఎర్రకోట పూర్వ వైభవాన్ని సంతరించు కున్నట్లు కనిపిస్తుంది. భారతదేశపు తొలి ప్రధాని నెహ్రూ 1947లో ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగుర వేసినప్పటి నుంచి, భారత ప్రధానులకూ, ఎర్రకోటకూ ఒక అవినాభావ సంబంధం ఏర్పడి పోయింది. ఏటా ఆగస్టు 15న ఎర్రకోట పైనుంచి జాతి నుద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఆనవాయితీగా మారింది.ఫ్రాన్స్ ఏటా జూలై 14న జాతీయ దినోత్సవం జరుపుకొంటుంది. ఆ రోజున 1790లో ప్రాన్స్ ప్రజలు బాస్టిల్ జైలును చుట్టుముట్టి దానిలో నిర్బంధించిన ఉద్యమకారులను విడిపించుకున్నారు. ఫ్రాన్స్ జాతీయ జీవనంలో బాస్టిల్కు ఎంత ప్రాధాన్యం ఉందో ఎర్రకోటకీ అంత ప్రాధాన్యం ఉంది. ఎర్ర కోట మన గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి చెబుతుంది.మొఘల్ చక్రవర్తి షాజహాన్ (1592–1666) ఈ కోటను 1639లో ప్రారంభించారు. దానిలోని దీవాన్– ఇ– కాస్ (ప్రత్యేక సభాసదుల హాలు) గోడలపై పర్షియన్లో ‘గర్ ఫిర్దౌస్ బార్ రు–ఏ– జమీన్ అస్త్, హమీన్ అస్తో, హమీన్ అస్తో, హమీన్ అస్త్’ అని రాసి ఉంటుంది. ‘ఈ భూమిపై స్వర్గం ఏదైనా ఉందీ అంటే అది ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది’ అని ఆ మాటలకు అర్థం. అవి ఇండియా గురించిన మాటలుగానే నేను భావిస్తాను. కశ్మీర్‌ను చూశాక షాజహాన్ మొదటిసారి ఆ మాటలను ఉపయోగించినట్లు చెబుతారు.కానీ, ఎర్రకోట కథ అంత స్వర్గతుల్యమై నది ఏమీ కాదు. పైన చెప్పుకున్న మాటలకు పూర్తి విరుద్ధమైన సంగతులు ఎర్రకోటలో చోటుచేసుకున్నాయి. ‘ఈ భూమిపై నరకం ఏదైనా ఉందీ అంటే, అది ఇదే, అది ఇదే’ అనా లనిపిస్తుంది. మరో మొఘల్ చక్రవర్తి ఔరంగ జేబు (1618–1701) తన పెద్ద అన్నయ్య దారా షికో (1615–1659) తలను నరికేయడానికి ముందు గొలుసు లతో బంధించి, ఒక మురికి ఏనుగుపై కూర్చోపెట్టి, ఈ కోట నుంచే తీసుకెళ్ళి చాందినీ చౌక్ అంతటా తిప్పారు.నేటి పరి భాషలో చెప్పాలంటే, షికో సెక్యులర్ కావడమే దానికి కారణం. ఎర్రకోట నుంచి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాల మేరకే స్వేచ్ఛా పిపాసి సాధు సరమద్ (1590–1661), సిక్కుల గురువు తేజ్ బహదూర్ (1621–1675) తలలను వారి మొండాల నుంచి వేరు చేశారు. భారతదేశపు సామాజిక పొందికను ఛిద్రం చేస్తూంటే ఎర్రకోట సాక్షీభూతంగా నిలిచింది. దానిలాగానే, దేశాన్ని కూడా అదే పనిగా చీలికలు పీలికలు చేశారుకానీ, దేశం మళ్ళీ ఏకమవుతూ వచ్చింది.ఔరంగజేబు కాలగర్భంలో కలిసి సుమారు 150 ఏళ్ళు అయిన తర్వాత, బహదూర్ షా జాఫర్ (1775–1862) ఎర్ర కోట యజమాని అయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా, సిపాయిలు 1857లో తిరుగుబాటు చేసినపుడు చివరి మొఘల్ పాలకుడైన జాఫర్ అటు హిందువులు, ఇటు ముస్లింలు ఇద్దరికీ ఇరుసుగా మారారు. తర్వాత, దాదాపు 90 ఏళ్ళు గడి చాక, బ్రిటిష్ భారతీయ సైన్యం లోపల ఎగసిన తిరుగుబాటు ఎర్రకోటలోని గోడల లోపల ప్రతిధ్వనించింది. ఆ తర్వాత, 1945–1946 ప్రాంతంలో, కల్నల్ గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ (సిక్కు), కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ (హిందువు), మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం) భారత మాత ముద్దు బిడ్డలుగా ప్రసిద్ధికెక్కారు.వారు ముగ్గురూ నేతాజీ నేతృత్వంలోని ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి చెందిన వారు. ‘బ్రిటిష్ చక్ర వర్తికి వ్యతిరేకంగా యుద్ధానికి ఎగదోస్తున్నారం’టూ ఆ శౌర్యవంతులను ఎర్రకోటలోనే విచారించారు. ఆ సమయంలో ‘లాల్ ఖిలాసే ఆయీ ఆవాజ్/ ధిల్లాన్, సెహగల్, షానవాజ్’ అంటూ ఎర్రకోట నుంచి ఒక నినాదం మిన్నుముట్టింది. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్చి కూర్చిన ఉద్దండులైన నెహ్రూ వంటి న్యాయవాదులు వారి తరఫున వాదించారు. ముగ్గురికీ దేశ బహిష్కార శిక్ష విధించారు. స్వాతంత్య్రం లభించాక, కొద్ది రోజుల్లోనే వారిని విడుదల చేశారు.‘హిందూ రాష్ట్ర’ లక్ష్య సాధనకు కృషి చేస్తున్న కొందరు... గాంధీజీ హత్య కేసులో నిందితులయ్యారు. వారిని ఎర్రకోట లోనే ప్రత్యేక కోర్టులో విచారించారు. వీరికి ప్రతిగా మరో వర్గం ఉంది. ఆ వర్గంవారు 2000 డిసెంబర్ 22న ఎర్రకోటలోకి చొచ్చు కువచ్చారు. ఆ రోజు కోటలోకి రాగలిగిన ఇద్దరు లష్కర్–ఏ– తోయెబా ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. భారతదేశంలో మత విభజన తేవడమే ఆ టెర్రరిస్టుల లక్ష్యం. ఇలా ఎర్రకోట చారిత్రక చిహ్నం స్థాయిని మించి ఎరుపెక్కింది.అదే సమయంలో, నైతిక శక్తి వాహికగా కూడా మారింది. కనీసం, 2047 ఆగస్టు 15న ఎర్రకోటపై 100వసారి పతాకావిష్కరణ జరుగుతున్నపుడు, ప్రసంగించే ప్రధాని అయినా, ‘స్వర్గం ఇక్కడే ఉంది! నా తోటి భారతీయులారా! ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. మనం పరస్పరం ద్వేషించుకోం, దేనికీ భయపడం, కలసి మెలసి శాంతియుత జీవనం సాగిస్తున్నాం’ అని ప్రకటించగలుగుతారా’?.వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పక్కనే ఉంటూ పవన్ స్థాయిని తగ్గించే పనిలో!
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్ కల్యాణ్ పక్కనే లోకేశ్ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్‌తోపాటు లోకేశ్ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్‌ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్‌తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్‌ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్ ఎత్తుకున్నారు. అంటే.. లోకేశ్‌ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్‌కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్‌కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్‌తోపాటు లోకేశ్ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్‌ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్ లోకేశ్ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్‌లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట. టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్‌లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్‌కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్‌ను తీసుకు రాగలిగారు. పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్‌ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేశ్‌కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్‌బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్‌గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వాళ్ళు అడిగేది ‘జీతాలు’ పెంచమని! ‘లాభాలు’ పంచమని కాదు!
ఒక వారం రోజులుగా, తెలుగు సినిమారంగంలో పనిచేస్తున్న కార్మికులు ‘మా జీతాలు 30 శాతం పెంచాలి’! అనే డిమాండుతో సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేస్తున్న వేలాదిమంది కార్మికులలో, వేరు వేరు శాఖల్లో, రకరకాల శ్రమలు చేసే వాళ్ళున్నారు. మేధా శ్రమలు చేసేవారూ, శారీరక శ్రమలు చేసేవారూ, వాళ్ళల్లోనే నైపుణ్యంగల శ్రమలు చేసేవారూ, నైపుణ్యం లేని శ్రమలు చేసేవారూ, వాళ్ళల్లోనే మురికిని శుభ్రం చేసే శ్రమలు చేసే వారూ... ఇలా! రకరకాల శ్రమలు చేసే వారిని ఏ పేర్లతో పిలుస్తారో, వాళ్ళకి జీతాలు ఎంత తేడాగా ఉంటాయో– అటువంటి వివరాలన్నీ ఇక్కడ అనవసరం. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవలసింది, సమ్మె చేస్తున్న కార్మికులు అడుగుతున్న ‘జీతాల పెంపు’ గురించి! జీతాలు పెంచాలి– అనేవాళ్ళ డిమాండ్ న్యాయమా, కాదా అన్నది తేలాలంటే, ‘జీతం’అంటే ఏమిటో తెలుసుకోవాలి.అసలు ‘జీతం’అనేది ఒక మాయ తెర! దాని వెనక ఒక రహస్యం వుంది. ఈ సంగతి సమ్మె చేస్తున్న కార్మికులకూ తెలియదు, వాళ్ళకి జీతాలు ఇచ్చే యజమానులకూ తెలియదు. ‘జీతం’ అనేది, కార్మికులు చేసే ‘శ్రమ మొత్తానికి’ కాక, వాళ్ళు కేవలం శ్రమ చేసేవారిగా జీవించడానికి సరిపడేది మాత్రమే– అనేదే ఆ రహస్యం! అసలు విషయం, ‘జీతంగా వచ్చేది ఏమిటీ’ అన్నది తెలియాలి! విషయాలు తేలిగ్గా అర్థం కావడానికి ఒక్క కార్మికుణ్ణే తీసుకుందాం.మన ఉదాహరణలో, ‘కాల్షీట్’ అనే పేరుతో నడిచే ‘పనిదినం’ లో, కార్మికుడు 12 గంటలు పని చేసినందుకు, నిర్మాత 1,200 జీతం ఇస్తాడనుకుందాం. కానీ, కార్మికుడు చేసే శ్రమ, యజమానికి ఎంత విలువని ఇస్తుందంటే, ఉదాహరణ తేలిగ్గా వుండడం కోసం 2,400 విలువని ఇస్తుంది. అంటే, కార్మికుడు ఏ రోజు పనిచేసినా ఆ రోజున, యజమానికి 1,200 విలువ గల శ్రమని ‘ఉచితంగా’ ఇస్తున్నాడన్నమాట! జీతాన్ని 30 శాతంగా పెంచినా, అది మొత్తం శ్రమ విలువ అవదు! అదీ తక్కువే! అప్పుడు కూడా, తీసుకునే జీతం కన్నా అదనంగా ఇచ్చే శ్రమ విలువే ‘అదనపు విలువ’. ఇది ‘శ్రమ దోపిడీ’! కానీ, ఈ విషయం, ఇటు కార్మికులకూ తెలియదు; అటు యజమానులకూ తెలియదు! ఇప్పుడు వచ్చిన సమస్య కార్మికుడు యజమానితో అనేది: ‘ఒక రోజుకి నువ్విచ్చే 1,200, మా కుటుంబ పోషణకి చాలడం లేదు. ఇంకో 30 శాతం పెంచు! ఇక నించీ 1,200 కాకుండా, 1,360 ఇవ్వు!’ అని కార్మికుడు అనడం. ‘అలా వీల్లేదు. నాకు అసలే ఖర్చులు బాగా పెరిగిపోయాయి. (హీరో గారికి కోట్లలో ఇవ్వాలి మరి!)’ అంటాడు నిర్మాత! నిజం చెప్పాలంటే, నిర్మాత కార్మికుడికి జీతం 30 శాతం పెంచి, 1,360 ఇచ్చినా, ఆ కార్మికుడి నించీ 70 శాతం విలువ గల శ్రమని ‘ఉచితంగానే’ లాగుతాడు! ఉచితంగా లాగే ఈ అదనపు విలువను, పెట్టుబడిదారీ యజమానులూ, వారి ఆర్థిక శాస్త్రవేత్తలూ ‘లాభం’ అని ముద్దుగా పిల్చుకుంటారు. కార్మికులు ఇచ్చే అదనపు విలువ నించే, సినిమా తీయడానికి ఖర్చు పెట్టిన డబ్బుకి వడ్డీ, షూటింగు చేసే స్టూడియోకి అద్దే, సినిమాని ప్రదర్శించే సినిమా హాళ్ళకి అద్దే, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులూ, చివరికి తనకి మిగిలే ‘లాభమూ’– అన్నీ... కార్మికుల అదనపు విలువనించీ వచ్చేవే!ఈ సమ్మె సందర్భంగా కొందరు మధ్యవర్తులు, ‘నిర్మాత కూడా బాగుండాలి గదా? అతన్ని ఇబ్బంది పెడితే ఎలా? నిర్మాతలుంటేనే గదా, కార్మికులకి పనులు దొరికేది?’ అంటూ, కార్మికులకు సర్ది చెపుతూ, జీతం మరీ అంతగా పెంచమని ఒత్తిడి చెయ్యవద్దని హితవు పలుకుతున్నారు. మన అమాయక సమ్మెకారులు కూడా, ‘అవును! నిర్మాతలు బాగుంటేనే కదా, మాకు పనులు దొరికేది. కాకపోతే, మా బాగు కూడా కొంచెం ఆలోచించమంటున్నాం’ అని అంటారు. అసలు ఆలోచించవలసింది – నిర్మాతలకి పెట్టుబడికి, ఆ మొదటి డబ్బు ఎక్కడిది?– అని! వాళ్ళ తండ్రులదీ, తాతలదీ అంటారా? ఆ తాతలకి అంత డబ్బు కూడటానికి కారణం – ఈనాటి కార్మికుల తాతల్నించీ ఆనాడు లాగిన అదనపు విలువే! (‘‘అదనపు విలువలో ఒక భాగాన్ని ఆదాయంగా పెట్టుబడిదారుడే తన కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటాడు. ఇంకో భాగాన్ని కొత్త పెట్టుబడిగా ఉపయోగించుకుంటాడు’’ అనే విషయాన్ని, మార్క్స్ తన ‘పెట్టుబడి’ అనే పరిశోధనా గ్రంథంలో – రుజువు చేశాడు.) ఇంతకీ, సమ్మె చేస్తున్న, సినిమా రంగంలోని, మన పిచ్చి కార్మికులు ఏ మడుగుతున్నారు? వాళ్ళు అడిగేది జీతాలు పెంచమని! లాభాలు పంచమని కాదు! ఎంత అల్ప సంతోషులు మన కార్మిక జనాలు!వ్యాసకర్త: ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ -
చెప్పేది ఒకటి.. చేసేది ఇంకోటి. బాబు తీరు మారదా?
నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నాటకీయంగా వ్యవహరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్! ప్రజా వ్యతిరేకత వస్తుందనుకుంటే.. ఆ నిర్ణయానికి తానూ అనుకూలం కాదన్న బిల్డప్ ఇస్తారు. ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తున్నట్లు ప్రచారం కల్పిస్తారు. కొన్ని రోజుల క్రితం టీవీ ఛానళ్లలో చంద్రబాబు పేరుతో వచ్చిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఎక్సైజ్ శాఖ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని అన్నట్లు ఛానెళ్ల స్క్రోలింగ్‌లలో కనిపించింది. ఎందుకబ్బా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనుకుంటూ ఉండగానే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు చంద్రబాబు స్టైల్! ప్రజా ఆరోగ్యం ముఖ్యమని అనుకుంటే పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తారా? ఇది ఏపీ ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా మంచిదో చంద్రబాబే చెప్పాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంతంగా మద్యం షాపులను నిర్వహించి బెల్ట్ షాపులు లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం రావడంతోనే మద్యం అమ్మకాలు మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. అదనంగా వెయ్యి దుకాణాలు అనుమతించడంతోపాటు 99 శాతం టీడీపీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలకే దక్కేలా చేసింది. ఇక బెల్ట్ షాపులు సరేసరి. బెల్ట్ షాపు పెడితే తాట తీస్తానని, రూ.ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు కానీ.. ఆచరణలో జరిగింది మాత్రం శూన్యం. అధికార కూటమి స్థానిక ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో వేలాది బెల్ట్ షాపుల నిర్వహణకు వేలం పాటలు కూడా వేశారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు పర్మిట్ రూమ్‌లు తీసుకు వస్తున్నారు. చంద్రబాబు అంతకుముందు చేసిన ప్రకటనేమిటి? ఇప్పుడు జరిగిందేమిటి? ఆదాయం ముఖ్యం కాదంటూనే వాటిని పెంచుకునేలా మద్యం విధానాన్ని తయారు చేశారన్నది వాస్తవం. పర్మిట్ రూమ్‌ల ద్వారా సుమారు 180 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా రూ.26 వేల కోట్ల ఆదాయం వస్తుంటే దానిని రూ.35 వేల కోట్లకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంత ఆదాయం పెరుగుతుందన్నది వేరే విషయం. కాని దీనికి ప్రభుత్వం కాని, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా కాని ఇచ్చిన వాదన చూడండి. ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమం చేసిన ఈనాడు దినపత్రిక ఇప్పుడు మద్యం వ్యాపారానికి అండగా ఉన్నట్లుగా కథనాలు ఇస్తుండడం విశేషం. రోడ్లపై మద్యం తాగకుండా పర్మిట్ రూమ్‌లు తెచ్చారట.బహిరంగ ప్రదేశాలలో మద్యపానంతో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయట. ఈ క్రమంలో 2.7 లక్షల కేసులు నమోదు అయ్యాయట. దానిని నియంత్రించేందుకు పర్మిట్ రూమ్‌లు అనుమతిచ్చేలా నిర్ణయం చేశారట. అంతే తప్ప మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఇవ్వడం వల్ల మరింతగా మద్యపానం చేస్తారని, కుటుంబాలు నాశనం అవుతాయని వీరు రాయడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పర్మిట్ రూమ్‌లకు సంబంధించి హెడింగ్ కూడా పెట్టకుండా జాగ్రత్తపడింది.. కొత్త పాలసీలో 840 బార్లు వస్తున్నాయి. ప్రస్తుతం 3736 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా ఈ పర్మిట్ రూమ్‌లు వస్తున్నాయి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే బహిరంగంగా మద్యం తాగడం వల్ల కేసులు వస్తున్నాయట. ఒకే. అది నిజమే అనుకుందాం. ఆ రకంగా శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు ఒప్పుకున్నట్లే కదా! పోనీ పర్మిట్ రూమ్‌లలో తాగిన మందుబాబులు రోడ్లపైకి వచ్చి మళ్లీ అల్లరి చేయరని ఎలా గ్యారంటీ ఇస్తారో తెలియదు. కాగా రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయంలో కూడా విఫలమైంది. బాటిల్‌పై ఉన్న ధరకన్నా రూ.పది ఇరవై అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కొందరిని పోలీసులు కూడా పట్టుకున్నారు. నాణ్యమైన మద్యం ఇస్తామంటూ చిత్రమైన ప్రచారం చేసిన ఘనత కూడా చంద్రబాబు బృందానిదే. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరమని చెప్పవలసిన ప్రభుత్వం అలా చేయకపోగా, ఇప్పుడేమో ఊరూరికి బార్, వైన్ షాపు, పర్మిట్ రూమ్, బెల్ట్ షాపు అన్న చందంగా వ్యవహరించడం దురదృష్టకరం. మద్యం వల్ల కుటంబాలు నాశనం అవుతాయి. అందులోను మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. తాగిన మైంలోనే మహిళలపై అకృత్యాలు జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మద్యం విషయంలో ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2014-19 మధ్యలోనూ ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నామంటూ ఫైల్ పై సంతకం చేశారు. కాని ఆ తర్వాత మాత్రం వేలాది బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడిచిపోయాయి. అవి సుమారు 40 వేలకు పైగా అప్పట్లో చేరాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటన్నిటిని దాదాపు లేకుండా చేయడమే కాకుండా, షాపులను తగ్గించి, ఊరికి బయట అవి ఉండేలా చర్యలు తీసుకుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యథాప్రకారం మద్యాన్ని విస్తారంగా పారిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన ఎన్.టి.రామారావు తన హామీ ప్రకారం మద్యాన్ని నిషేధించారు. ఆ టైమ్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరైనా అక్రమ మద్య వ్యాపారం చేస్తుంటే, వారిపై సైతం కేసులు పెట్టడానికి వెనుకాడవద్దని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఆయన ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తొలుత తాము మరింత గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఆ తర్వాత అసలు సినిమా చూపించారు. టీడీపీ ఎమ్మల్యేలు ఇష్టం వచ్చినట్లు అక్రమ మద్య వ్యాపారం చేసినా చూసిచూడనట్లు పోయారు. పైగా దీనిపై అసెంబ్లీలో ఒక నివేదిక పెట్టారు. అక్రమ మద్యాన్ని అరికట్టలేక పోతున్నామని ప్రకటించారు.అలా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ తెలిపి కొందరి పేర్లు వెల్లడించడం సంచలనమైంది. తదుపరి మద్య నిషేధం ఉంచాలా ?వద్దా ? అన్నదానిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నిర్వహించారు. ఆ పిమ్మట మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. పైకి తనకు ఇష్టం లేకపోయినా మద్య వ్యాపారాన్ని అనుమతించాల్సి వస్తున్నట్లు పిక్చర్ ఇస్తారన్నమాట. అప్పట్లో మద్యం స్కామ్ లు జరిగాయని విపక్షం ఆరోపించేది. అది వేరే కథ. ఇంకో మాట చెప్పాలి. సంపూర్ణ మద్య నిషేధం చేయాల్సిందే అంటూ ఉద్యమం చేసిన ఈనాడు గ్రూప్ అదినేత రామోజీరావు మద్య నిషేధం ఎత్తివేసిన తర్వాత ఒక సంపాదకీయం రాసేసి చేతులు దులుపుకున్నారు. అందులో కూడా చంద్రబాబును పెద్దగా తప్పు పట్టుకపోవడంపై రామోజీని పలువురు విమర్శించేవారు. రామోజీ ఫిలిం సిటీ, డాల్ఫిన్ హోటల్ తదితర వ్యాపారాలు కలిగిన ఈనాడు మీడియా కూడా చంద్రబాబు మాదిరే డబుల్ గేమ్ ఆడిందన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చేవి. అప్పటి మాదిరే ఇప్పుడు కూడా పర్మిట్ రూమ్‌లు, మద్యం షాపుల దందాను టీడీపీ మీడియా సమర్థిస్తున్న తీరు అసహ్యంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా తనకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డు పెట్టుకుని ఈ రకంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని పారించడం ప్రజల కోణంలో దుర్మార్గమే అవుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు..
ఆంధ్రప్రదేశ్ మంత్రులు లోకేశ్, పి.నారాయణల వ్యాఖ్యలు చూస్తే మతిపోతుంది. ఎవరో ఒకరు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తే సింగపూర్ తమ రాష్ట్రంలో పెట్టుబడులకు తటపటాయిస్తోందని వీరు అంటున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంకో అడుగు ముందుకేసి ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిఐడీ ద్వారా సింగపూర్‌లోని ప్రముఖులు కొందరిని బెదిరించిందీ అని! నవ్విపోదురు గాక అన్నట్టుగా లేవూ ఈ వ్యాఖ్యలు? తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎంతటికైనా సిద్ధపడతారన్నమాట వీళ్లు! కాకపోతే ఆ క్రమంలో తమ అసమర్థతను తామే బయటపెట్టుకున్న విషయాన్ని వారు మరచిపోతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తటపటాయిస్తోందంటే సింగపూర్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విశ్వసనీయతను సందేహిస్తున్నట్లే అవుతుంది కదా?వాస్తవానికి పెట్టుబడిదారులైనా, ప్రభుత్వాలైనా అజ్ఞాత వ్యక్తుల మెయిళ్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. మెయిళ్లలోని విషయాలను విచారించి నిర్ధారించుకోవచ్చు అంతే. ఫిర్యాదులు ఉన్నా లేకపోయినా కూడా ఇది జరుగుతూంటుంది. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పేదాంట్లో నిజానిజాలెంత? అన్నది బేరీజు వేసుకుంటారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత లాభమొస్తుందనుకుంటే పెట్టుబడి పెడతారు లేదంటే లేదు. అంతే. ప్రభుత్వాల తీరుతెన్నులు, ఆయా ప్రాజెక్టుల ప్రయోజనం, పెట్టుబడులు పెడితే వచ్చే లాభనష్టాలు, ప్రభుత్వాలు కల్పించే రాయితీలు, సదుపాయాలు మొదలైన వాటిపై ఆధారపడి ఆయా సంస్థలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ వంటి వారికి తెలియకుండా ఉంటుందా!జగన్ నిర్వాకం వల్ల సింగపూర్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్దరించడానికి వెళుతున్నారని చంద్రబాబు టూర్‌కు ముందే వ్యాఖ్యానించారు. తన పరపతి అంతా ఉపయోగించి అమరావతి ప్రాజెక్టులో సింగపూర్ వారిని మళ్లీ భాగస్వాములను చేస్తామని ప్రచారం చేసుకున్నారు. తీరా అక్కడికెళ్లాక ఏమైంది? అమరావతి ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడం లేదని ఆ దేశ మంత్రి టాన్ సే కుండబద్ధలు కొట్టారు. సాంకేతిక సహకారం మాత్రం అందిస్తామన్నారు. అది కూడా మాట వరసకు అన్నట్లే అనిపిస్తుంది. సింగపూర్ కంపెనీలు కూడా పెద్దగా ఆసక్తి చూపని విషయం ఇప్పటికే స్పష్టమైంది. లేకుంటే టీడీపీ మీడియా ఇప్పటికే ఫలానా కంపెనీ ఇంత పెట్టుబడి పెడుతుంది అంటూ ఊదరగొట్టేది. అది కాకుండా లోకేశ్ చేసిన ఆరోపణలను ప్రముఖంగా ఇచ్చారు. మురళికృష్ణ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వానికి స్థిరత్వం లేదని, ఎప్పుడైనా పడిపోవచ్చని ఫిర్యాదులు చేశారట. ఆ వ్యక్తి రాస్తే సింగపూర్ ప్రభుత్వం ఎలా నమ్ముతుంది! కూటమికి 164 సీట్లు ఉన్న సంగతి ఆ దేశంవారికి తెలియకుండా ఉంటుందా!మరో కోణం చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలపై అభిప్రాయలు చెప్పేందుకు ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ఈ అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవచ్చు లేకపోవచ్చు కూడా. భావ ప్రకటన స్వేచ్ఛ అది. దీని గురించి మంత్రి లోకేశ్‌కు తెలుసో తెలియదో కానీ ఏ మార్గం ద్వారానైనా సరే ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం తప్పు కాదు కానీ.. దుష్ప్రచారం చేయడం తప్పు. అలాంటి తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వాలు కచ్చితంగా చర్య తీసుకుంటాయి. కూటమి నేతలు జగన్ ప్రభుత్వంపై ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారో గుర్తు లేదా? వైసీపీ ప్రభుత్వ అప్పులపై అబద్ధపు ప్రచారం చేయడమే కాకుండా.. రకరకాలుగా కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారే! అయినా ఫలితం లేకపోవడంతో అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి అప్పుల వివరాలు దాచేస్తోందంటూ చిత్రమైన ఆరోపణ కూడా చేశారు. జగన్ ప్రభుత్వం ఈ తాటాకు చప్పుళ్లకు వెరవలేదు సరికదా.. కూటమి నేతల మాదిరిగా బేలగా మాట్లాడనూ లేదు. తాము పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ వారు పుల్లలు పెడుతున్నారన్నట్లుగా లోకేశ్ ఆరోపించారు. మురళీకృష్ణ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీతో సంబంధాలు ఉన్న వాడని ఆరోపించారు. తీరా చూస్తే ఎన్నారై అయిన ఆ వ్యక్తి ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి విజయం కోసం శ్రమించారని, డబ్బు కూడా ఖర్చు చేశాడని తేలింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎదురైనా చేదు అనుభవాలు, లోకేశ్‌ను కలిసేందుకు కూడా సిబ్బంది ముడుపులు అడగటంతో బాధతో సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్ పెట్టాడని తెలిసింది. లోకేశ్ వీటిల్లో నిజానిజాలు నిర్ధారించుకోకుండానే తండ్రి మాదిరిగానే తన వైఫల్యాలను ఇతరులపై నెట్టేసే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు చిలకలూరిపేట వద్ద ఉన్న తన భవనాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సెటిల్ చేసుకోవడానికి రూ.కోటి డిమాండ్ చేశారని మురళీకృష్ణ వాపోతున్నాడు. ఈ అంశంపైనే చంద్రబాబు, లోకేశ్‌లను కలవడానికి ప్రయత్నించి విఫలమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సింగపూర్ కంపెనీలు తమకు వచ్చిన ఫిర్యాదులను చూపించి చంద్రబాబును ప్రశ్నించారంటూ మీడియాలో మరో కథనం వచ్చింది.ఈ వ్యవహారంపై చంద్రబాబు కూడా లోకేశ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ వార్త చెబుతోంది. ఇది నిజమా? కాదా? అన్నది పక్కనబెడితే లోకేశ్ హుందా రాజకీయం చేయకుండా, అసత్య ప్రచారాలకు పూనుకుని దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. మురళీ కృష్ణ ఎవరో తెలిసి కూడా అతని గురించి అబద్ధం చెప్పారన్న భావనకు ఆయన అవకాశం ఇచ్చారనిపిస్తుంది. ఇక మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్య అయితే అర్థం పర్థం లేనిది.గత ప్రభుత్వం సీఐడీ వారిని పంపించి ఎంక్వైరీ చేయించిందని, దానివల్ల ఆ దేశ ప్రభుత్వానికి, ఏపీకి సంబంధాలు దెబ్బతిన్నాయాని, వాటిని మళ్లీ పునరుద్దించడానికి చంద్రబాబు ఆధ్వర్యంలో సింగపూర్ వెళ్లామని అన్నారు. ఇన్ని విద్యా సంస్థలు నడిపే వ్యక్తి ఇలా మాట్లాడడం ఎబ్బెట్టుగా ఉంది. ఒక రాష్ట్రం అధికారులు ఇంకో దేశంలోకి వెళ్లి విచారణ చేయడం సాధ్యమా? కేంద్రంతో సంబంధం లేకుండా చేస్తారా? ఆ మాత్రం పరిజ్ఞానం కూడా ఈయనకు లేదా! ఏదో ఒకటి మాట్లాడి బట్ట కాల్చి మీద వేయడం అంటే ఇదేనేమో! నిజానికి సింగపూర్ ప్రభుత్వం గతంలో ఏపీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కేవలం ఆ దేశ కంపెనీలు అవగాహన కుదుర్చుకున్నాయి. వాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి 1700 ఎకరాల భూమి కేటాయించడమే కాకుండా, ఏపీ ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి రోడ్లు తదితర సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. దానిపై అనేక విమర్శలు వచ్చాయి. అయినా ఆ ప్రాజెక్టు లాభసాటి కాదని భావించి ఆ కంపెనీలు వెనక్కి తగ్గాయని చెబుతారు. మరో సంగతి చెప్పాలి. చంద్రబాబుకు సన్నిహితుడుగా భావించే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసులో జైలుకు వెళ్లింది వాస్తవమా? కాదా? అన్నదాని గురించి చంద్రబాబు, లోకేశ్, నారాయణలు ఎవరూ మాట మాత్రం కూడా ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడ్డారు. ఏది ఏమైనా ఎదుటివారిపైన రాయి వేసే ముందు అది తమకే తగులుతుందేమో అని ఆలోచించుకోవాలి. ఏతావాతా సింగపూర్ నుంచి చంద్రబాబు బృందం రిక్త హస్తాలతోనే తిరిగి వచ్చినట్లేనా? అంటే కూటమి ప్రభుత్వంపై ఆ దేశ ప్రభుత్వానికి, సంస్థలకు నమ్మకం లేనట్లు అనుకోవాలా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
గోడకు కొట్టిన బంతిలా.. తిరగబడ్డ నెల్లూరు!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పి ఉండాలి. వైఎస్సార్సీపీ పార్టీకి కూడా ఇదో అనుభవం అని చెప్పాలి. పోలీసుల వ్యవస్థ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తే ప్రజల్లో వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా తెలియజేసినంది. ఒక నాయకుడి పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు (రోడ్లు) ధ్వంసం చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు కూడా. ప్రజాస్వామ్యాన్ని ఇంతగా పరిహాసం చేసిన సందర్భం కూడా ఇంకోటి ఉండదు. వైఎస్ జగన్ తన మీడియా సమావేశంలో వ్యక్తిగత విమర్శలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, తను ఏ సందర్భంలో టూర్‌కు వచ్చిందీ, పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ కార్యకర్తల విధ్వంస కార్యక్రమాలు వాటి విపరిణామాలపై ఎక్కువ మాట్లాడారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన జమ్మలమడుగు పర్యటనలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ.. అసలు మినహా మిగిలిన సోదంతా వెళ్లబోసుకున్నారు. 👉జైల్లో ఉన్న మాజీ మంత్రి, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు, మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని టీడీపీ మూకలు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన్ను కూడా పలుకరించే ఉద్దేశంతో జగన్ నెల్లూరులో పర్యటనకు సంకల్పించారు. గత నెల మొదటిలోనే ఈ పర్యటన ఖరారైనా హెలిప్యాడ్ కోసం పోలీసులు ఒక అటవీ ప్రాంతాన్ని చూపించడంతో వాయిదా పడింది. ఆ ప్రదేశంలోనే ఒక చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకుని టూర్ తేదీలు నిర్ధారించుకున్నారు. అంతే! ఇక అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ఆయన ప్రోగ్రాంను విఫలం చేయడానికి చాలా శ్రమ పడింది. చంద్రబాబు, లోకేశ్‌లకు వీర విధేయులైన పోలీసు అధికారులను ప్రయోగించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. జగన్ టూర్లో పాల్గొనడానికి వీల్లేదని శాసించే రీతిలో పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు నోటీసులు ఇచ్చారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులే కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారు. జగన్ టూర్లో పాల్గొంటే ఏదో జరిగిపోతుందని, కేసులు పెడతారని ప్రచారం చేశారు. టూర్ జరిగే రోజున ప్రజలు, అభిమానులు ఎవరూ రాకుండా ఉండడం కోసం పోలీసులు జేసీబీలతో రోడ్లపై గోతులు తవ్వారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఎక్కడకక్కడ ఇనుప కంచెలు వేయడం, నెల్లూరు సందులలో నుంచి కూడా జనం రాకుండా చేయాలని యత్నించడం వల్ల ప్రజలు నానాపాట్లు పడ్డారు. చివరికి అంత్యక్రియల కోసం రేవుకు వెళ్లడం కూడా కష్టమైందని నెల్లూరు వాసి ఒకరు తెలిపారు. ఇన్ని నిర్బంధాల మధ్య ప్రజలు జగన్ టూర్‌కు రారేమో అని అందరకూ అనుకున్నారు. కానీ.. వేల మంది జనం పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ రోడ్లపైకి వచ్చి విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ఈ అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. 👉ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి పార్టీని అణగదొక్కాలని అనుకుంటే అది అన్నిసార్లు అయ్యే పని కాదని నెల్లూరు ప్రజలు తెల్చి చెప్పారు. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు సర్కార్ విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. జగన్ ఏ పట్టణానికి వెళ్లినా ఇలా జనం తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారో అర్థం కాక కూటమి నేతలు తల పట్టుకుంటున్నారు. ఒక పక్క జనం వస్తున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూనే ప్రజలు రాలేదని, సాక్షి టీవీలో బంగారు పాళ్యం ప్రోగ్రాం వీడియోలోని సన్నివేశాలు ప్రసారం చేశారని ఒక అసత్య ప్రచారం పెట్టారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి అలా మాట్లాడారంటే జగన్ టూర్‌పై వారు ఎంతగా కలవరపడుతున్నది అర్థం చేసుకోవచ్చు. బంగారుపాళ్యంలో జనం విశేషంగా వచ్చారని వారే స్వయంగా ఒప్పుకున్నట్ల అయ్యిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. ప్రభుత్వం దీనిని పరాభవంగా భావించి మరింత కక్షకు దిగకుండా ఇకనైనా ప్రజస్వామ్య పద్దతిలో జగన్ టూర్లకు సహకరించడం మంచిది. పోలీసులు ఎవరైనా ముఖ్యనేత వస్తుంటే ఆయనకు భద్రతకు కల్పించడం, జనం అధికంగా వస్తున్నారనుకుంటే దానికి తగ్గట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప, జనం ఆ ప్రోగ్రాంకు రాకుండా అడ్డుకోవడమే విధిగా పెట్టుకోరాదని ఈ ఘటన రుజువు చేసింది. 👉బంతిని ఎంత గట్టిగా కొడితే అది అంతగా పైకి లేస్తుందన్న విషయం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. జగన్, చంద్రబాబుల వ్యాఖ్యలను పరిశీలిద్దాం. పాలనలో విఫలం అయినందునే చంద్రబాబు భయంతో తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ విమర్శించారు. తన పార్టీ నేతలను కలవడానికి వస్తే ఇన్ని ఆంక్షలా అని ప్రశ్నించారు. కాకాణి పై ఉన్న పలు అక్రమ కేసుల గురించి ప్రస్తావించి సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు, మీడియా సమావేశం వీడియోను పోస్టు చేసినందుకు కూడా కేసులు పెట్టారని వివరించారు. నిజంగానే ఇది చాలా శోచనీయం. రాజకీయ నేతలకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించాలి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి అమలుకాని వైనం, రైతుల కష్టాలు, ప్రభుత్వంలో అవినీతి, శాంతిభద్రతల వైఫల్యం రెడ్ బుక్ రాజ్యాంగం, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మొదలైన అంశాలను జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు వేసిన రెడ్ బుక్ విత్తు పెరిగి చెట్టు అవుతుందని, భవిష్యత్తులో అది వారికే ప్రమాదం అని హెచ్చరించారు.తమ ప్రభుత్వం వచ్చి తీరుతుందని,ఆ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని కూడా జగన్ పేర్కొన్నారు. జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు ఎక్కడా నేరుగా బదులు ఇచ్చినట్లు కనిపించలేదు. రాజకీయ ముసుగులో కొందరు అరాచకాలు సృష్టించే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో కావాలన్నది ఆయన భావన. తన కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను నానా మాటలు అన్నప్పటికీ, ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అన్నప్పుడు కాని అవేవి అరాచకంగా ఆయనకు కనిపించలేదు. స్వయంగా చంద్రబాబే పలుమార్లు పోలీసులను ధిక్కరించి హెచ్చరికలు చేయడం, టూర్లు సాగించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయి జగన్ టూర్‌ను అరాచకంగా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కోసం జనం వస్తే తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. వివేకా హత్య కేసు గురించి మాట్లాడడం అసందర్భంగా అనిపిస్తుంది. రాజకీయ పాలన చేస్తానని చెప్పడం ద్వారా టీడీపీలో అరాచకాన్ని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. మళ్లీ వస్తా.. అంతు తేలుస్తా అని జగన్ చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు దానిని విశ్వసిస్తుంటే జగన్ టూర్ లకు ఎందుకిన్ని ఆంక్షలు పెట్టడం అన్నదానికి మాత్రం జవాబు ఇవ్వరు. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా తన కుమారుడు, మంత్రి లోకేశ్ అనుభవ రాహిత్యంతో అమలు చేస్తున్న రెడ్ బుక్ వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టడం అవసరం. నెల్లూరు అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ప్రభుత్వానికే మంచిది.లేకుంటే ప్రజలలో ఆయన ప్రభుత్వమే మరింత పలచన అవుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ యాప్‌తో పోలీసు జులుంకు చెక్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలు, ప్రత్యేకించి పోలీసుల ఆగడాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున ప్రత్యేక యాప్ తయారీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ యాప్ సాయంతో తమపై జరుగుతున్న అకృత్యాలను, ఇబ్బంది పెడుతున్న పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించి చెప్పుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీ సర్వర్‌లో భద్రంగా ఉంటాయి. 2029 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయా అధికారులపై చట్టపరంగా చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన రాజకీయ సలహా మండలి సమావేశంలో జగన్ ఈ యాప్ గురించి తెలిపారు. అయితే.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, మోపుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకూ లీగల్సాయం మాత్రం అందిస్తోంది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు జగన్ స్వయంగా భరోసానిస్తున్నారు. జైల్లో ఉన్న నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న.. నెల్లూరు వెళ్లినప్పుడు.. అంతకుముందు పొదిలి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రకరకాల ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని నేరుగా యాప్‌లోనే నమోదు చేసుకునే అవకాశం వస్తుందని అంచనా. తద్వారా ఇలాంటి ఘటనలన్ని సమగ్రంగా అందుబాటులో ఉంటాయన్నమాట. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో హింస విచ్చలవిడిగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గూండాయిజానికి బరి తెగిస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒకవేళ పిర్యాదు తీసుకున్నా కేసులు కట్టడం, కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నది వైఎస్సార్సీపీ ఆవేదన. తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నింటిని నమోదు చేశారు. అదే టీడీపీ ఫిర్యాదులకు మాత్రం వాయు వేగంతో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుపడుతుంటే, కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తాడిపత్రి వెళ్లవద్దని పెద్దారెడ్డికి చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్‌పై పలు కేసులు పెట్టి ఏడు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. పద్నాలుగు కేసులలో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ కొత్త కేసు పెట్టి తీసుకుపోయారు. ఇదేమి ప్రభుత్వం అంటూ కిషోర్ భార్య రోదించినా కూటమి సర్కార్‌కు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒక కార్యకర్త పోలీసులు తన చేతులకు ఎలా బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి వందల కిలోమీటర్లు తిప్పింది ఫేస్బుక్లో వివరిస్తే, అది చదివిన వారి కళ్లు చెమర్చాయి. తప్పు చేస్తే పోలీసులు ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చు. కాని అచ్చంగా టీడీపీ వారి కోసమే పోలీసు వ్యవస్థ అన్నట్లు పని చేయడమే దుర్మార్గం. రాజకీయ సలహామండలి సమావేశంలో జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారిని కూడా అక్రమంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకటికాదు.. అనేక కేసులలో వైఎస్సార్సీపీ కేడర్‌ను, నేతలను వేధిస్తున్న పోలీసు అధికారుల గురించి యాప్‌లో ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కూడా కొంత నిగ్రహం పాటించవచ్చునన్న భావన ఏర్పడుతోంది. పోలీసులు అందరూ ఇలా ఉన్నారని కాదుకాని కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్సార్సీపీ ఫిర్యాదు. అలాంటి వారి వివరాలు యాప్‌లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో యాప్‌లో ఫిర్యాదు చేస్తారా అని టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఎవరైనా మరింత రెచ్చిపోతారా? అన్నది కూడా చూడాలి. వైఎస్సార్సీపీ యాప్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లు ఎలా స్పందిస్తారన్నది చెప్పలేం. 2029లో కూటమి అధికారం కోల్పోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వారు కూడా ఇవే తరహా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోలీసు వర్గాలలో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా, పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను వేధిస్తే, తర్వాత కాలంలో వారు కూడా ఇబ్బంది పడతారని చెప్పడానికి ఈ యాప్ ఉపయోగపడవచ్చు. అంతేకాక వీరి ప్రవర్తనకు సంబంధించి వైఎస్సార్సీపీ యాప్‌లో నమోదైతే ఆ అధికారులకు కూడా అప్రతిష్టే. ఏది ఏమైనా ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు, కేడర్ చేస్తున్న అరాచకాలకు ఈ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అయిపాయె.. రెంటికీ చెడ్డ జనసేనాధిపతి!
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల కష్టం చూస్తే జాలేస్తుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ప్రమోషన్ కోసం వారు చాలా కష్టపడుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే సినిమా చూడాలని ప్రేక్షకులను బతిమలాడుతున్నట్లు ఉంది. కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక షోలు నిర్వహించి జనాన్ని తరలించే యత్నాలు చేయడం, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సినిమా సక్సెస్ చేయాలని కోరడం పవన్ కల్యాణ్‌కు సహజంగానే అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. సినిమాపై ప్రేక్షకుల ఆదరణ విషయంలో సందేహాలు కలిగాయి. మొత్తం పరిణామ క్రమం అంతా పార్టీని డ్యామేజీ చేశాయనిపిస్తోంది.సినిమా బాగుందా? లేదా? అనేదానితో ఇక్కడ నిమిత్తం లేదు. మొదటి వారం కలెక్షన్లు ఎలా ఉన్నాయా? అనేది చర్చనీయాంశం కాదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఈ సినిమా కోసం అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బాగా బిజీగా ఉండే పంచాయతీ రాజ్ శాఖకు మంత్రి అయినప్పటికీ, ఆ విధులను పక్కనబెట్టి సినిమా షూటింగ్లలో పాల్గొనడాన్ని ప్రజలు గమనించారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ కుమార్ వంటివారు చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఏ రకంగా పవన్ తన పదవిని ఈ సినిమా గురించి వాడుకున్నారో తెలియచేస్తూ వీడియోలు విడుదల చేశారు. పవన్ తాను గతంలో ఎప్పుడూ సినిమా విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనలేదని చెప్పారు. కాని హరిహర వీరమల్లు కోసం నాలుగు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ కోసం పవన్‌తోపాటు పార్టీ నేతలంతా కష్టపడాలని నిర్ణయించుకున్నారు అన్నమాట. అయినా.. సినిమా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫంక్షన్ కోసం విశాఖలో యూనివర్శిటీ హాల్‌ను వాడుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో సినిమాల్లో నటించవచ్చా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నటించకూడదన్న చట్టం ఏమీ లేదు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఒకట్రెండు సినిమాలలో నటించారు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నటించిన సినిమా ఫెయిల్ అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నటించిన సినిమా సఫలమైంది. ఎన్టీఆర్ సినిమాలలో నటించడంపై ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేది. టీడీపీ కూడా ఏదో సమాధానం చెప్పేది. అంతే తప్ప ఏ పార్టీ అదేదో వ్యక్తిగత వివాదంగా తీసుకోలేదు. కానీ.. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే తన సినిమా గొడవలోకి వైఎస్సార్సీపీని లాగి విమర్శలు చేశారో, అప్పుడు ఇది రాజకీయ రగడగా మారింది. సినిమాను బాయ్‌కాట్ చేసుకోండని ఒకసారి, ఎవరూ దీనిపై గొడవ పడవద్దని ఇంకోసారి, అవసరమైతే దాడి చేయండని మరోసారి ఇలా రకరకాల ప్రకటనలు చేశారు. తణుకు వంటి కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు రౌడీల మాదిరి అల్లరి చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన వాహనం బాయినెట్ పై ఎక్కి గంతులు వేశారు. వీటిపై అసంతృప్తి చెందిన వైసీపీ అనుకూల సోషల్ మీడియా సీరియస్‌గా తీసుకున్నారు. కొందరు బాయ్‌కాట్ అంటూ ప్రచారం చేశారు. అయినా సినిమా బాగుంటే ఇలాంటివి పెద్దగా పనిచేయవని అంతా భావించారు.ఏపీలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ మరీ రెచ్చగొట్టడం విస్మయం కలిగిస్తుంది. బహుశా వైసీపీ వారు ఎటూ చూడరులే అన్న భావనతో జనసేన, టీడీపీ క్యాడర్‌ను బాగా యాక్టివ్ చేసేందుకు ఈ వ్యూహం అనుసరించారో, ఇంకే కారణమో తెలియదు కాని ఒక రాజకీయ పార్టీ క్యాడర్‌ను తన సినిమాకు తానే దూరం చేసుకున్నట్లయింది. సినిమా పరంగా తనను అభిమానించే వారు ఇతర పార్టీల్లోనూ ఉంటారన్న సాధారణ స్పృహ లేకుండా ఆయన మాట్లాడారు. ఇప్పుడే కాదు. గతంలో కొన్ని సినిమాల విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్లలో పవన్ కల్యాణ్ అతడి వర్గీయులు కొందరు సినీ ప్రముఖులు అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేశారు.. ఉదాహరణకు రిపబ్లిక్, మట్కా, లైలా, భైరవం వంటి సినిమా ఫంక్షన్లలో పవన్ కల్యాణ్.. ఆయన మనుషులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేశారు. ఆ ప్రభావం సినిమాలపై పడి నిర్మాతలు నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నాయకత్వం ముందుగానే ఈ పరిణామాలను ఊహించి కార్యకర్తలతో సినిమా చూడాలని కోరుతూ ర్యాలీలు తీయించింది. ఇలాంటివి గతంలో జరగలేదనే చెప్పాలి. జనసేన మంత్రులు టెలికాన్ఫరెన్స్ పెట్టి సినిమాకు జనాన్ని ఎలా తరలించాలో చెప్పడం, సంబంధిత ఆడియో లీక్ అవడంతో పార్టీ పరువు పోవడమే కాకుండా, సినిమాపై కూడా నెగిటివ్ టాక్‌కు అవకాశం ఏర్పడింది. సినిమా బాగుంటే ఇలా ఎందుకు చేస్తారన్న ప్రశ్న వచ్చింది. దానికి తగినట్లే సినిమా రివ్యూలు కూడా ఆశాజనకంగా రాలేదు. సినిమా మొదటి సగం కాస్త ఫర్వాలేదు కాని, రెండో హాఫ్ ఏవో ఒకటి, రెండు చోట్ల తప్ప, అసలు బాగోలేదని టాక్ వచ్చింది. అంతేకాక ఒకసారి ఇది చరిత్ర అని, మరోసారి ఇది కల్పిత పాత్ర అని ప్రచారం చేశారు. కోహినూర్ వజ్రం పేరుతో సినిమా తీసినా, ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సన్నివేశాలు పెట్టడంపై పలువురు ఆక్షేపించారు. ఒకవైపు సినిమా కథ అంతంత మాత్రంగా ఉండడం, ప్రేక్షకులకు గ్రాఫిక్స్ నచ్చకపోవడం, రాజకీయ దుమారం సృష్టించుకోవడం వంటి కారణాలతో హరిహర వీరమల్లు సినిమా అంతగా సక్సెస్ కాలేదన్న భావన ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి వైసీపీ అభిమానులలో ఒక స్పష్టత ఉండగా, టీడీపీ అభిమానులు మాత్రం దాగుడుమూతలు అడినట్లు అనిపిస్తుంది. నిజంగా టీడీపీ క్యాడర్ అంతా సినిమా చూసి ఉంటే ఈ సినిమా ఇలా ఫెయిల్ అయ్యేది కాదన్న అభిప్రాయం లేకపోలేదు. పైకి శుభాకాంక్షలు చెబుతూ, లోపల మాత్రం సినిమా ఇలా దెబ్బతినడంపై సంతోషం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. జనసేన ర్యాలీలలో టీడీపీ వారు పెద్దగా పాల్గొన్నట్లు కనిపించలేదు. పవన్ సినిమా సక్సెస్ కాకపోతేనే ఆయన టీడీపీని ధిక్కరించకుండా ఉంటారని ఆ పార్టీ వారు భావించి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా అటు వైసీపీని దూరం చేసుకుని, ఇటు టీడీపీ నుంచి సరైన ఆదరణ పొందలేకపోవడంతో పాటు స్వయంకృతాపరాధాల కారణంగా ఈ సినిమా నష్టపోయి ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇకనైనా రాజకీయాలు వేరు..సినిమాలు వేరు అనే సూత్రాన్ని వపన్ చిత్తశుద్దితో పాటిస్తే మంచిదేమో!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జగన్ అడుగులే పిడుగులయ్యాయా?
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అడుగుల శబ్దం ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా ? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళ్తున్నాయా?. ఆయన ధిక్కారం.. ఏనుగు ఘీంకారం అనిస్తోందా?. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్ల కంపమీద కూర్చోబెట్టినట్లు ఉంటుందా?. ఆయన కన్నెర్ర చేస్తుంటే చండ్రనిప్పులు కురుస్తున్నట్లు భయమేస్తోందా?. అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్.. ఇన్ని నిబంధనలు విధిస్తోందా?.. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లడాన్ని ప్రభుత్వం అంగీకరించలేకపోతోంది. ఆయన ఏ ఊరు వెళ్లాలన్నా సవాలక్ష ఆంక్షలతో అష్టదిగ్బంధం చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడి పర్యటనల మీద గతంలో ఎన్నడూ లేనన్ని నిబంధనలు విధించడం అంటే ఆయన్ను చూసి ప్రభుత్వం భయపడుతున్నట్లు కాదా?. చుట్టూ కమ్ముకొస్తున్న ప్రభుత్వ వ్యతిరేక మేఘాలను చెదరగొట్టేందుకు.. ప్రజల గొంతుకు ఆయన మరింత మద్దతు తెలపకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెడుతోందా?. వైఎస్ జగన్‌ను జనంలోకి వెళ్లకుండా ఆపడానికి ఇలా ఆంక్షలు విధిస్తోందా అనే అభిప్రాయాలూ జనంలో వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజలను నమ్మించి గెలిచినా ప్రభుత్వం ఆ దిశగా చేసింది ఏమీ లేదన్న అభిప్రాయాలు జనంలో ఉన్నాయి. పెన్షన్ల పెంపు మినహా మరే హామీ అమలు చేయలేదు. రైతులకు.. యువతకు.. విద్యార్థులకు.. మహిళలకు ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవాళ్లను, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్లను సైతం రాత్రికి రాత్రి పోలీసులు తీసుకెళ్లి అరెస్టులు చేస్తున్నారు. చిత్రహింసలు పెట్టి ప్రభుత్వం చెప్పినట్లు చేస్తూ పెద్దలను సంతృప్తి పరుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ తీరును.. పోలీసులు చేస్తున్న అతిని హైకోర్టు కూడా పలుమార్లు అభిశంసించింది.ఇక, అరటి.. మామిడి.. మిర్చి.. పొగాకు.. రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వారి ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయక.. ఇటు వ్యాపారాలు సిండికేట్ అవడంతో ధర ఘోరంగా పడిపోయి రైతులు నష్టపోయారు. ఇటు సామాజిక.. రైతుల అంశాలతోపాటు ప్రభుత్వ వేధింపులతో నష్టపోతున్న కార్యకర్తలను ఓదార్చేందుకు.. నైతిక మద్దతుగా నిలిచేందుకు వైఎస్ జగన్ ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా అయన కార్యక్రమాలకు ప్రభుత్వం ఎన్నడూ లేని అడ్డంకులు కలిగిస్తోంది. మొన్న పల్నాడు వెళ్లాలనుకున్నపుడు కూడా ఇలాగే నిబంధనల సంకెళ్లు విధించింది. నేడు నెల్లూరులో జైల్లో ఉన్న మాజీ మంత్రి గోవర్థన్ రెడ్డిని పరామర్శించేందుకు సైతం జగన్ వెళ్లబోగా రూల్స్ పేరిట కట్టడి చేస్తోంది.గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న లోకేష్.. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఇష్టానుసారం దూషించలేదా?. నాటి ప్రభుత్వాన్ని.. అధికారులను.. పోలీసులను దునుమాడలేదా?. లోకేష్ అయితే ఏకంగా రాష్ట్రంలో ఆ చివర నుంచి ఈ కొసకు నడుస్తూ అడుగడుక్కీ వైఎస్ జగన్‌ను తిడుతూనే వెళ్లారు. మరి నాడు ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు పెట్టలేదు కదా. మరి నేడు చంద్రబాబు ప్రభుత్వం జగన్‌ను చూసి ఇంతగా ఎందుకు కలవరపడుతోంది. తమ ప్రభుత్వ అసమర్థత.. వైఫల్యాల మీద ప్రజలు జగన్ కలుస్తున్నారని భయమా?. గెలిచినా ఓడినా ప్రజల్లో ఆదరణ తగ్గని జగన్ మళ్ళీ సమాజంలో తిరిగితే ప్రభుత్వ బండారం బట్టబయలు అవుతుందని కలవరమా?.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు, బాధ్యత ప్రతిపక్షానికి ఎప్పటికీ ఉంటుంది.. ఆ హక్కును కాలరాయడం అంటే అది నియంతృత్వమే అవుతుంది. ఇక ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా.. నిబంధనలు విధించినా వాటిని తెంచుకుని వెళ్తాము అంటూ వైఎస్ జగన్, ఆయన కార్యకర్తలు అయితే ముందడుగు వేస్తున్నారు.. -సిమ్మాదిరప్పన్న. -
జగన్ ముందే చెప్పాడు!
‘‘పిల్లలకు మనం ఇచ్చే సంపద చదువే.. పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాద్యమం బోధిస్తేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.’’ ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తరచూ చేసిన వ్యాఖ్యలు. అవిప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. జాతీయ నాయకులు కొందరు కూడా వీటిని ప్రస్తావిస్తున్నారు. జగన్ వల్లే వీరు ఈ విషయాలు చెబుతున్నారనడం లేదు. కాని వీరందరికన్నా ముందు జగన్ మాట్లాడారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నేతలు, ఇతర పార్టీల వారు కూడా చాలామంది జగన్‌పై నానా విమర్శలూ చేశారు. ఒక బీజేపీ నేత ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది కాని తరువాత ఏమైందో తెలియదు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పేదలకు ఆంగ్ల మీడియం కొనసాగేందుకు జగన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంగ్ల మీడియం ప్రస్తావన తేవడంతో జగన్ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత వచ్చింది. 'దేశాభివృద్దికి డబ్బు, భూములు ముఖ్యం కాదు. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకి ముందు నేను కూడా భూములే ముఖ్యం అనుకునేవాడిని. కాని ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యమైన అంశమని కులగణన నిపుణుల కమిటీ అన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం. అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలను వద్దనడం లేదు. ఈ భాషలతోపాటు ఇంగ్లీష్ నేర్పాల్సిన అవసరముందన్నది చారిత్రక వాస్తవం. మన పురోగతిని నిర్దేశించేది ఆంగ్ల భాషే. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ మీడియం వద్దని అంటారు. కానీ వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, కాలేజీలే అని సమాధానం వస్తుంది. ఆ అవకాశాన్ని దేశంలో బలహీన వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎందుకు బీజేపీ నేతలు దక్కనివ్వరు’’ అని రాహుల్ ఢిల్లీలో జరిగిన ఓ మీటింగ్‌లో అన్నారు. రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాలలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కాని ఆయనకు ఆంగ్ల మాద్యమం ప్రాముఖ్యత ఇప్పటికి తెలియడం చిత్రంమే. అది కూడా తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వే నివేదిక వచ్చాక అవగాహన రావడం విశేషం. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా హిందీ భాషను ప్రోత్సహించాలంటూ ఆంగ్ల భాషకు వ్యతిరేకంగా మాట్లాడారు. విద్యా సంస్థలలో ఆంగ్ల మాధ్యమాన్ని ఆయన సమర్థించ లేదు. అమిత్ షాకు జవాబు ఇవ్వడం కోసం రాహుల్ ఈ ప్రకటన చేశారు. సుమారు ఏభై ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆంగ్ల మాధ్యమం అవసరాన్ని గుర్తించిందనుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా, అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ తదితర దేశాలలో భారతీయ విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీష్ మాధ్యమం చాలా అవసరం అన్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఆంగ్లం అనేది భాషా వారధిగా ఉంటోందన్న సంగతి విస్మరించకూడదు. తెలంగాణలో జరిగిన సర్వేలో ఆస్తులు ఉన్నా, చదువు సరిగా లేకపోతే ప్రయోజనం లేదని పలువురు అభిప్రాయపడ్డారని సమాచారం. పేదరికం తగ్గాలంటే చదువే ముఖ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆంగ్ల భాష విద్య మాధ్యమంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు. కాగా మూడు టర్మ్‌లు పాలన చేస్తున్న బీజేపీ పనికట్టుకుని హిందీ గాత్రాన్ని తీసుకు రావడం, అది తమిళనాడులో వివాదంగా మారడంతో కొంత వెనక్కి తగ్గడం జరిగింది. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేనలు హిందీకి కోరస్ పలికి విమర్శలకు గురయ్యాయి. కేవలం బీజేపీ ప్రాపకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లు హిందీని పొగిడారని పలువురు ఎద్దేవ చేశారు. పవన్ హిందీని పెద్దమ్మ భాష అనడంపై నవ్వుకున్నారు. తెలుగు భాషా నిపుణులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో ఈ కూటమి నేతలు అప్పటి సీఎం జగన్‌పై కక్షతో ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదే టైమ్ లో వారి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలోనే ఎందుకు చదువుతున్నారన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేవారు కారు.టీడీపీ భజన చేసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా మురికి వార్తలు రాస్తుండేవి. అదే టైమ్‌లో వారి కుటుంబాల వారంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకునే వారు. ఈ విషయంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం విమర్శలకు గురయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలోనే సినీ ప్రముఖుడు నారాయణ మూర్తి పేదలు అభివృద్దికి ఇంగ్లీష్ విద్య అవసరమని కుండబద్దలు కొట్టడం అందరిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు హిందీ భాష రాజ్యభాష అని వ్యాఖ్యానించి దెబ్బతిన్నారు. ప్రముఖ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు దేశంలో రాజ్యభాష ఏదీ లేదన్న సంగతి గుర్తు చేయాల్సి వచ్చింది. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగడానికి అసిధారవృతం చేశారు. చిన్న వయసు నుంచే పిల్లలకు ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం, టోఫెల్ వంటివాటిలో శిక్షణ ఇవ్వడం, స్కూళ్లను బాగు చేయడం, విద్యా దీవెన, గోరు ముద్ద వంటి స్కీములను అమలు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించారు. వీటి ఫలితంగా పలు స్కూళ్లలో పిల్లలు ఐక్యరాజ్యసమితికి వెళ్లి మాట్లాడే స్థాయికి చేరుకున్నారు. అమ్మ ఒడి స్కీమ్ తెచ్చి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగేలా జగన్ చేశారు . జాతీయ మీడియా హిందీ భాష లో బోధన గురించి ప్రశ్నిస్తే, చాలా స్పష్టంగా హిందీ నేర్చుకుంటే తప్పు కాదని, కాని ఆంగ్ల మీడియం మాత్రం తప్పనిసరి అని, అదే దేశంలోని విద్యార్ధులకు మేలు చేస్తుందని జగన్ చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రచారార్భాటానికి ఇస్తున్న ప్రాముఖ్యత విద్యా వ్యవస్థ బాగుపై పెట్టడం లేదని, తత్ఫలితంగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారన్న వార్తలు వచ్చాయి. అప్పట్లో ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్‌ను సకాలంలో అమలు చేయడం ద్వారా పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్కీమ్ బకాయిలు సుమారు రూ.4200 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా.. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇంగ్లీష్ మీడియం అవసరం అనే విషయం మరోసారి నిర్దారణైంది. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న నేతలందరి కన్నా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ముందుగా గుర్తించి దేశానికి ఒక రకంగా ఆదర్శంగా నిలిచారని చెప్పక తప్పదు. మాతృభాష మన సంస్కతిని కాపాడేదైతే, ఆంగ్ల భాష ప్రపంచంతో పోటీపడేలా చేస్తుందన్న జగన్ కొటేషన్ ను ఎవరైనా అంగీకరించాల్సిందే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అచ్చెన్నాయుడు గుట్టు బయటపెట్టేశాడే!
ఆడబిడ్డ నిధి పేరుతో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యఏపీలో ఐదేళ్ల ఫించన్ సొమ్ముతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు.. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడునేనేదో చేసేస్తానని ఆశ పడుతున్నారు.. ఖజానా ఖాళీగా ఉంది.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు2024 ఎన్నికల సమయంలో వీరు ఈ మాటలు మాట్లాడి ఉంటే వారి చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయి ఉండేది. కానీ అప్పుడేమి బొంకారో గుర్తు చేసుకోండి. చంద్రబాబైతే.. తనకు సంపద సృష్టించడం తెలుసన్నాడు. సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికను అమలు చేసి చూపిస్తామని బల్లగుద్ది మరీ బుకాయించారు. బాబు గారి పుత్రరత్నం లోకేశ్ ఇంకో అడుగు ముందుకేసి.. అన్ని వాగ్దానాల అమలుకు పక్కా ప్లాన్ ఉందని, లెక్కలున్నాయని, తాము చేయలేకపోతే ప్రజలు చొక్కా కాలర్ పట్టుకోవచ్చు.. అని ఛాలెంజ్ కూడా చేశారాయె! ఇక జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మాటలు ఒకసారి గమనించండి.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక అమలుకు తనదీ గ్యారెంటీ అని గొప్పగా భరోసా ఇచ్చారు. అధికారం వచ్చింది.. ఏడాది గడిచింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా తమ మనసులోని మాటలు బయటపెట్టేసుకుంటున్నారు.... ప్రజలను మోసం చేయడానికే హామీలు ఇచ్చామన్నట్టుగా మాట్లాడేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలిచ్చిన వాగ్ధానాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చాలా విస్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే.. తామిచ్చిన నవరత్నాల హామీ అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల వరకు అవుతోందని, దానిని భరించడానికే చాలా కష్టపడవలసి వస్తోందని, కూటమి ఇస్తున్న సూపర్ సిక్స్, తదితర హామీల అమలుకు రూ.1.5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఎలా తెస్తారు? అని! చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజలను మోసం చేస్తున్నారని పదే, పదే చెప్పేవారు. అయినా టీడీపీ, జనసేన నేతలు బుకాయించి, దబాయించి మరీ తమ సూపర్ సిక్స్ అమలు చేసి చూపిస్తామని అనేవారు. తమ వద్ద మంత్రదండం ఉందని చంద్రబాబు అనేవారు. ఇప్పుడేమో ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. వీటితోపాటు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అంటూ మరికొన్ని వాగ్దానాలు కూడా చేశారు. అందులో పరిశ్రమలు స్థాపించే ప్రతి వ్యక్తికి గరిష్టంగా రూ.పది లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అవన్ని అయిపు లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ వీటిపై గట్టిగా నిలదీస్తుండడం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే, పదే కూటమి నేతల ఎన్నికల ప్రణాళికను గుర్తు చేస్తుండడంతో తప్పనిసరి స్థితిలో సుమారు 150 హామీలలో రెండు, మూడింటిని అరకొరగా అమలు చేశారు. ఈ నేపథ్యంలో.. హమీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోయేసరికి ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దానిని ఎలా అధిగమించాలా?అనే ఆలోచనతో రెడ్ బుక్ పాలన ద్వారా వైసీపీ వారిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్నారు. కేసులు పెట్టి కూటమికి మద్దతు ఇచ్చే మురికి మీడియాలో ఆ కేసుల వార్తలనే ప్రముఖంగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ దశలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. ఏదో గుట్టుగా మోసం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే, ఈయన రహస్యాన్ని బట్టబయలు చేశారని అనుకోవాలి.ఆడబిడ్డ నిధి పధకం కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలని అచ్చెన్న ఓపెన్‌గానే చెప్పేశారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఎవరైనా విశ్లేషకులు చెబితే వారిమీద మండిపడేవారు. వైఎస్సార్సీపీ వాళ్లు ‘అదెలా సాధ్యం?’ అని అడిగితే విరుచుకుపడే వారు. చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసి చూపిస్తారని ప్రచారం చేసేవారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా అత్యధికశాతం ‘మాట తప్పడమే’ అని జనానికి తెలిసినా, పవన్ కళ్యాణ్ కూడా జత కలవడం, బీజేపీ మద్దతు ఉండడంతో ఏమో ఈసారి ఏమైనా చేస్తారేమోలే అని ఆశ పడ్డవారు గణనీయంగానే ఉన్నారు. సూపర్ సిక్స్ ఎఫెక్ట్‌తో పాటు ఈవీఎంల మాయాజలం కలిసి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వృద్ధుల ఫించన్‌ను రూ. వెయ్యి పెంచారు. ఈ అదనపు పింఛన్ మొత్తాన్ని అందచేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ వేసుకువెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ 13 నెలల కాలంలో ఆ వ్యయం కోట్లు దాటిపోతుంది. ఇంకోపక్క ఫించన్‌దారులకు లక్షల సంఖ్యలో కోత పెడుతున్న వార్తలు వస్తున్నాయి. ఏడాదికి మూడు గ్యాస్ బండలు ఉచితం అని చెప్పినప్పటికి అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక గ్యాస్ బండ తాలూకూ డబ్బు మాత్రమే కొందరికి అందింది. మిగిలిన హామీలను ఒక ఏడాదిపాటు ఎగవేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. తల్లికి వందనం కింద చదువుకునే విద్యార్ధులకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి ఒక ఏడాదంతా ఇవ్వలేదు. జగన్ విమర్శల ప్రభావంతో ఆ స్కీములో రూ.రెండు వేలు కోతపెట్టి కొంతవరకు అమలు చేసినా, అది కూడా గందరగోళంగానే జరిగినట్లు చెబుతున్నారు. ఇక.. మిగిలిన హామీలేవీ నెరవేర్చక పోవడంతో జనం ఆగ్రహం చెందుతున్నారు. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలందరికి నెలకు1500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి సుమారు రూ.35వేల కోట్లు అవుతుందన్నది ఒక అంచనా. ఆ గణాంకాలను కొందరు నిపుణులు చెప్పకపోలేదు.కాని టీడీపీకి భజన చేసే మురికి మీడియా కూడా జనాన్ని మోసం చేయడానికి అదంతా సాధ్యమేనన్నట్లు ప్రచారం చేసింది. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఇంకోమాట మాట్లాడుతున్నారు. అంతేకాక చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ముందుగానే అనుకున్నామని వెల్లడించారు. అంటే దీని అర్థం చంద్రబాబు మోసం చేయబోతున్నారని తమకు తెలుసునని చెప్పడమే అవుతుంది కదా!. అయినా పథకాలన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అచ్చెన్న ముక్తాయించారు. అంటే గతంలో మాదిరి ఎన్నికల సంవత్సరం చివరిలో ఏదో చేసేశామని చెప్పి జనాన్ని మాయ చేసే అవకాశం ఉందని అనుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, ఫించన్లు ఇవ్వడానికే సరిపోతోందని కూడా అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. చిత్రం ఏమిటంటే ఎన్నికల ప్రణాళికలోని ఆడబిడ్డ నిధి స్కీము తప్ప అన్నిటిని అమలు చేసేశామని మంత్రి ప్రకటించడం. ఇది చంద్రబాబు చెబుతున్న తీరుగానే ఉంది. అది నిజమే అయితే ఎన్నికల మానిఫెస్టో చదువుతూ ఏ ఏ అంశాలు ఎలా అమలు చేస్తున్నది వివరించగలగాలి. కాని ఆ పని చేయరు.అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి బీసీలకు ఏభైఏళ్లకే పింఛన్ తదితర హామీల సంగతేమిటో మంత్రి చెప్పాల్సి ఉంటుంది. 2017లో జగన్ నవరత్నాల స్కీములను ప్రకటించినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసేది. అవి సాధ్యం కాదని అనేది. కాని జగన్ సీఎం అయి అమలు చేసి చూపించారు. అప్పుడు ఏపీ శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతోపాటు మురికి మీడియా విషం చిమ్మేది. కాని అదే సమయంలో టీడీపీ, జనసేన ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్సార్సీపీ ఇచ్చే సంక్షేమం కన్నా రెండు, మూడు రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలికేవారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కూడా సంక్షేమ స్కీముల గురించి పలుమార్లు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఐదేళ్ల పెన్షన్లకు అయ్యే వ్యయంతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని చెబుతున్నారట. దీనిని బట్టి వారి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎన్నికలకు ముందు విద్యార్థులు, మహిళలు ఎవరు కనిపించినా నీకు 15వేలు, నీకు 18 వేలు అంటూ సైకిల్ వేసుకుని వెళ్లి మరీ చెప్పిన నిమ్మల ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు అచ్చం గురువుకు తగ్గ శిష్యులే అనిపించుకుంటున్నారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలంగాణ కాంగ్రెస్‌లో పదేళ్ల లొల్లి!
తెలంగాణకు పదేళ్లు తానే ముఖ్యమంత్రినంటూ ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సహజంగానే కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. చర్చోపచర్చలకు దారితీసింది. అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని కూడా అన్నారు. ఇది కాస్తా తెలంగాణ అధికార పార్టీ రాజకీయాలలో కొత్త వివాదానికి తెరదీసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ '2034 వరకు అంటే.. పదేళ్లపాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటాడు. కేసీఆర్.. ఈ విషయాన్ని డైరీలోనో.. నీ గుండెలపైనో రాసుకో" అని సవాల్ విసిరారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతానని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజలకు, ఒక ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని చెప్పడం వరకు ఓకే. వచ్చే తొమ్మిదేళ్లు కూడా తానే సీఎం అని చెప్పడం తనపై తనకు ఉన్న నమ్మకం కావచ్చు. కానీ కాంగ్రెస్‌లో అలా బహిరంగంగా చెప్పడానికి పార్టీ అధిష్టానం కాని, ఇతర నేతలు కాని ఇష్టపడరు. రాజగోపాలరెడ్డి అభిప్రాయం కూడా అదే. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా సీఎంను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఈ విధానం ఉన్న మాట నిజమే కాని, కేంద్రంలో అధికారం లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా సీఎంల మార్పుపై సంచలన నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా కనబడదు. కర్ణాటక వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చాలని, తనను సీఎంను చేయాలని ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్ కోరుకుంటున్నారు. అయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు ఇందుకు సాహసించడం లేదు. పైగా ఈ ఐదేళ్లు సిద్దరామయ్య కొనసాగవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి అక్కడ ఉండే రాజకీయ, సామాజిక అంశాలు కారణాలు కావచ్చు. అయితే.. సిద్దరామయ్య కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎం అని చెప్పుకోవడం లేదు. కానీ రేవంత్ ధైర్యంగా 2028 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తిరిగి తానే సీఎం అవుతానని చెబుతున్నారు. తన వర్గంలో విశ్వాసం పెంచడానికి ఇది ఉపయోగపడవచ్చు కానీ, పార్టీలోని ఇతర వర్గాలలో ఇది అసహనానికి కారణం అవుతుంది. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అభ్యర్ధులు ఎక్కువే. 2014లో అయితే డజను మంది తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విలీనం కాకుండా అడ్డుపడ్డారు. కేసీఆర్ తనకు సీఎం పదవి ఇస్తే విలీనం చేస్తానని కండిషన్ పెట్టారు. చివరికి ఒంటరిగా పోటీచేసి విజయం సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్లు ఆ పరిస్థితి కొనసాగడంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో మునిగిపోయారు. 2018 ఎన్నికలకు కొద్దికాలం ముందు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తదుపరి వర్కింగ్ అధ్యక్షుడుగా, అనంతరం పీసీసీ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమి పాలైనా, మల్కాజిగిరి ఎంపీగా గెలవడం ఆయనకు కలిసి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పార్టీ నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారు. పార్టీ సీనియర్ నేతలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తదితరులు తొలుత రేవంత్ నాయకత్వానికి సుముఖత చూపలేదు. తప్పని స్థితిలో ఒప్పుకున్నారు. రేవంత్ నియామకంపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటివారు గట్టి విమర్శలే చేసేవారు. ఆయన సోదరుడు రాజగోపాల రెడ్డితో కలిసి తమకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధిస్తామని చెప్పినా అధిష్టానం వారివైపు మొగ్గు చూపలేదు. ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం అప్పటి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్య తీసుకోవడం లేదంటూ రాజగోపాల రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవి కూడా వదలుకున్నారు. తదుపరి ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్లీ 2023 జనరల్ ఎన్నికలు వచ్చేసరికి తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయి మునుగోడు నుంచే పోటీచసి విజయం సాధించారు. ఈయన సోదరుడు, సీనియర్ నేత వెంకట రెడ్డి నల్గొండ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. రాజగోపాలరెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అధిష్టానం కూడా ఆయనను బుజ్జగించే యత్నం చేసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారన్న భావనతో ఆయనకే సీఎం పదవి అప్పగించింది. మల్లు భట్టి సీఎం రేసులో నిలిచినా ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకోక తప్పలేదు. అలాగే ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట రెడ్డి తదితర ఆశావహులు కూడా రాజీపడి రేవంత్ కేబినెట్లో మంత్రులుగా చేరిపోయారు. అయినా వీరిలో కొందరు రేవంత్ పై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ ప్రభుత్వం చేసే తప్పులను, వచ్చే ఆరోపణలను తెలియ చేస్తున్నారట. రేవంత్ కూడా అంతకన్నా తెలివిగా అధిష్టానంతో సంబంధాలు కొనసాగిస్తున్నందున ఇప్పటికైతే ఆయనను కదలించే శక్తి ఇతర కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లు కనిపించదు. కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అది వేరే సంగతి. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఉమ్మడి ఏపీలో పూర్తి టర్మ్ పదవి కాలంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కావడం విశేషం. 2004లో ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొందరు ఇతర నేతలు సీఎం పదవి కోసం పోటీ పడకపోలేదు. కానీ అధిష్టానం వైఎస్ నాయకత్వానికి అంగీకరించక తప్పలేదు. అలాగే 2009లో రెండోసారి గెలిచిన పిమ్మట అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా తనకు సీఎం పదవి కావాలని ప్రకటన చేశారు. అయినా వైఎస్సార్‌కే సీఎం సీటు తిరిగి దక్కింది. 1956 లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి దాదాపు మూడేళ్ల తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్లారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 1962లో నీలం సంజీవరెడ్డి మళ్లీ సీఎం అయ్యారు కాని పూర్తి టర్మ్ ఉండలేదు. 1964లో ముఖ్యమంత్రైన కాసు బ్రహ్మానందరెడ్డి 1967 ఎన్నికల తర్వాత తిరిగి ఆ పదవి చేపట్టినా, పూర్తి కాలం కొనసాగలేకపోయారు. తరువాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆయన 1972లో పదవి వదలు కోవల్సి వచ్చింది. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత సీఎం అయిన జలగం వెంగళరావు 1978 వరకు కొనసాగారు. ఆ తరుణంలో పార్టీలో వచ్చిన చీలికలో 1978లో మర్రి చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ పక్షాన సీఎం అయ్యారు. 1978-83 మధ్య చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటరామి రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డిలు సీఎం పదవులు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించినన టీడీపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి 1989లో కాంగ్రెస్ గెలుపొందడంతో 1989-94 మధ్య చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో ఓటమి పాలైన కాంగ్రెస్ మళ్లీ 2004లో అధికారంలోకి వచ్చాక వై ఎస్ సీఎం అయ్యారు. 2009లో తిరిగి ఆయన ముఖ్యమంత్రయ్యాక అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే వైఎస్సార్ తప్ప ఏ ఒక్క కాంగ్రెస్ సీఎం కూడా పూర్తి టర్మ్ పాలించలేదన్నమాట. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా దెబ్బతినిపోగా, తెలంగాణలో పదేళ్లపాటు అధికాంలోకి రాలేదు. 2023లో రేవంత్ సీఎం అయిన తర్వాత కొంత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడపడానికి యత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి అవడంతో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తులు రేవంత్‌ను ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడుగానే చూస్తుంటారు. ఆయన కూడా అప్పడప్పుడు చంద్రబాబును ప్రశంసించినట్లు మాట్లాడుతుంటారు. నాగర్ కర్నూల్ సభలోనూ చంద్రబాబు ప్రస్తావన తెచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. అప్పుడప్పుడూ వైఎస్ పేరును ప్రస్తావిస్తున్నా, కాంగ్రెస్ వర్గాలకు అంత సంతృప్తి కలిగించే రీతిలో మాట్లాడడం లేదన్న భావన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన వ్యాఖ్యలో నిఖార్సైన కాంగ్రెస్ నేతలు సీఎం చేసిన వ్యాఖ్యలను అంగీకరించరని అన్నారు. సాధారణంగా.. జాతీయ పార్టీలలో హై కమాండ్ దే తుది నిర్ణయం అనే సంగతి తెలిసిందే. అయితే ఇది పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి, ఆయా వ్యక్తుల బలాబలాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. రేవంత్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తనకు ఎక్కువ మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. అందువల్ల అధిష్టానం కూడా తొందరపడే పరిస్థితి ఉండదు. ఆ ధైర్యంతోనే రేవంత్ భవిష్యత్తులో కూడా తానే సీఎం అని చెప్పుకుని ఉండవచ్చు. రేవంత్ పై అసహనం వ్యక్తం చేయడం మినహా, అసమ్మతి ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆంధ్రప్రదేశ్ పోలీసుల రివర్స్ ట్రెండ్!
పోలీసు వ్యవస్థ ఎక్కడైనా నిజాలు రాబట్టేందుకు ప్రయత్నించాలి. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తాము సృష్టించిన అబద్ధాలను నిజాలుగా మార్చేందుకు తంటాలు పడుతోంది. కుట్రలు, కుతంత్రాలకు పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ పేరుతో బహిరంగంగానే ప్రైవేట్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసులు వారి అరాచకాలకు తలూపుతూండటం చూస్తూంటే.. ‘‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. పోలీసు రాజ్యం.. అబద్ధాల రాజ్యం’’ అనే భావన బలపడుతోంది. ఏడాది కాలంగా విపక్ష వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై సాగుతున్న హింసాకాండ, దౌర్జన్యాలు, కేసుల వేధింపులు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అంటే అతిశయోక్తి కాదు. దేశం మొత్తం అత్యవసర పరిస్థితి విధించినా పోలీసులు ఈ స్థాయి అరాచకాలకు పాల్పడలేదు. అందుకే కాబోలు ఎమర్జెన్సీ తరువాత 1977లో కాంగ్రెస్ పార్టీ దేశమంతటా ఘోర పరాజయం చవిచూసినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భారీ విజయం నమోదు చేసుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై కూడా కొన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా, ఎన్నికలపై మాత్రం వాటి ప్రభావం పడలేదు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పెడుతున్న కేసుల తీరు చూస్తే పోలీసులు ఇంత ఘోరంగా కూడా పనిచేస్తారా అన్న ప్రశ్న వస్తుంది. తాజాగా మద్యం స్కామ్ అంటూ ఒక కట్టుకథ సృష్టించి, దాని చుట్టూ రకరకాల పిట్టకథలు చేర్చి తమకు మద్దతిచ్చే మురికి మీడియాలో ప్రముఖంగా రాయిస్తూ వస్తున్నారు. ఆ మురికి మీడియా పత్రికలు, టీవీలు నిస్సిగ్గుగా అసత్యాలను జనంపై రుద్దే యత్నం చేస్తున్నాయి. ఆ క్రమంలో ఆ మురికిని ఆ మీడియా తనకే అంటించుకుంటోంది. మద్యం స్కామ్‌లో ఆరు నెలలుగా ఈ మురికి మీడియా ఇచ్చిన వార్తలు పరిశీలిస్తే ఒకదానికి మరోదానికి పొంతన కనిపించదు. సిట్ అధికారులతో ఎవరిని అరెస్టు చేయాలని భావిస్తే వారిపై తోచిన పిచ్చి కథనాలు రాస్తారు. ఇదంతా ప్రభుత్వం, మురికి మీడియా కలిసి చేస్తున్న విష ప్రచారమే అని అర్థం అవుతూనే ఉంటుంది. ప్రతిసారి ఎవరు ఈ కేసులో అరెస్టు అయితే అతనే కీలక వ్యక్తి అని పబ్లిసిటీ ఇస్తారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. అంతే సూత్రధారి ఈయనే అంటూ వార్తలు ఇచ్చారు. పోలీసుల స్పష్టమైన ఆధారాలు ఉంటే, ఆ వివరాలను బయటపెట్టవచ్చు కానీ అలాకాకుండా మద్యం ముడుపుల డబ్బుతో బంగారం కొనుగోలు చేశారని ఒకసారి రియల్ ఎస్టేట్‌లో వెచ్చించారని ఇంకోసారి, సినిమాలు తీశారనో, ఎలక్ట్రికల్ వెహికిల్ కర్మాగారం నెలకొల్పాలని భావించారనో, టాంజానియాలో ఇంకేదో పెట్టాలని ప్లాన్ చేశారని, దుబాయిలో ఇంకేదో చేశారని, ఓటర్లకు పంచడానికి ఈ డబ్బు వాడారని.. రకరకాల కథనాలు ఇచ్చారు. ఇంకోపక్క.. లిక్కర్ కేసులో ఎంత విచారిస్తున్నా సాక్ష్యాధారాలు దొరకలేదని, కోట్ల పేజీల డేటా ధ్వంసం చేశారని, అయినా దానిని తిరిగి తీస్తున్నారని.. ఏవేవో మతిమాలిన స్టోరీలన్నింటిని జనం మీద వదిలారు. చివరికి పోలీసులు ఏదో తప్పనిసరి తంతుగా చార్జీషీట్ వేశామని అనిపించుకున్నారు. నిందితులను అరెస్టు చేసి తొంభై రోజులు దాటితే ఆటోమాటిక్‌గా డిఫాల్ట్ బెయిల్ వస్తుంది కాబట్టి ,దానిని చెడగొట్టే లక్ష్యంతో ఇలా చేశారన్నది న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. తొలుత అప్పటి బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి మద్యం స్కామ్ కు సంబంధించిన డాక్యుమెంట్లను ధ్వంసం చేయడానికి తీసుకువెళ్లారని, ఆఫీస్ వద్ద ఎవరో దీనిని చూశారని ఒక తప్పుడు కేసు పెట్టారు. తదుపరి ఈ స్కామ్ లో ఆయనను నిందితుడిని చేశారు. తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ వేధిస్తున్నారని ఆయన హైకోర్టుకు కూడా వెళ్లారు. కాని తదుపరి ఏమి జరిగిందో కాని, ఆయన నుంచి బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకుని కేసును ముందుకు తీసుకువెళ్లే యత్నం చేశారు. వాసుదెవ రెడ్డితో పాటు సత్యప్రసాద్ అనే మరో ఉద్యోగిని కూడా ఇందుకు వాడుకున్నారు. వాసుదేవ రెడ్డి చివరికి వీరి వేధింపులు తట్టుకోలేక పోలీసులు అడిగిన వాంగ్మూలం ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌కు వెళ్లిపోయారట. ఇప్పుడు మళ్లీ ఆయనను పట్టుకువచ్చి అప్రూవర్‌గా మార్చాలని యత్నించిన వైనం బయటపడింది. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? అసలు ఏదైనా స్కామ్ జరిగితే దానికి సంబంధించిన నిర్దిష్ట సాక్ష్యాలు మెటీరియల్ రూపంలో కనిపిస్తాయి. ఈ కేసులో అవేమీ ఉన్నట్లు అనిపించవు. ఉదాహరణకు చంద్రబాబుపై గత ప్రభుత్వంలో వచ్చిన స్కిల్ స్కామ్‌లో కొన్ని ఆధారాలు కనిపించాయి. కేబినెట్‌తో సంబంధం లేకుండా చంద్రబాబే నిధులు మంజూరు చేయడం, ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పినా, సీఎం కోరుతున్నారు. కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని అప్పటి సీఎస్ కోరడం వంటివి జరిగాయి. అలాగే స్కిల్ స్కామ్ నిధులు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ అయింది ఈడీ విచారణలో వెల్లడైంది. చివరికి డబ్బు పార్టీ బ్యాంక్ ఖాతాలోకి చేరిందని కూడా ఆ కేసు దర్యాప్తు చేసిన సీఐడీ ఆధారసహితంగా తెలిపింది. దానిని ఇంతవరకు నేరుగా ఖండించలేకపోయారు. ఈడీనే తొలుత కొందరిని అరెస్టు చేసింది. తదుపరి ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. అలాగే 2019లో టీడీపీ ఓటమి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఏ ఇంటిలో సోదాలు చేసి, సుమారు రూ.రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రకటించింది. కానీ ఆ తరువాతి కాలంలో చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ వల్ల ఆ కేసు ముందుకు సాగలేదని అంటారు. అలాగే చంద్రబాబు పై గత ప్రభుత్వం పెట్టిన మద్యం ప్రివిలేజ్ ఫీజ్ రద్దు చేయడం ద్వారా ప్రభుత్వానికి నష్టం వచ్చినట్లు అప్పట్లో స్పష్టమైన ఆధారాలతో తెలిపింది. జగన్ ప్రభుత్వ టైమ్‌లో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే కేసులు పెడితే, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం కక్షపూరితంగా ఏదో ఒక కేసు పెట్టి, తమకు విధేయులుగా పనిచేసే కొందరు అధికారుల ద్వారా అరెస్టుల పర్వం ఆరంభించిందన్నది వైఎస్సార్సీపీ విమర్శ. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలలో ఏర్పడిన తీవ్ర అసంతృప్తిని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తున్నారు. అందువల్లే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులు లొసుగుల మయంగా కనిపిస్తాయి. తాము చెప్పినట్లు వింటే సరి. లేకుంటే అరెస్టు తప్పదని భయపెట్టి కొందరిని లొంగదీసుకుంటున్నారన్న భావన ఉంది. ఉదాహరణకు విజయసాయి రెడ్డి వైఎస్సార్సీపీ సభ్యత్వాన్ని, తన రాజ్యసభ పదవి వదలుకునేలా చేయడం. ఆ తర్వాత మద్యం కేసుకు సంబంధించి ఆయన నుంచి ఒక ప్రకటన తీసుకోవడం, దాని ఆధారంగా కేసు డీల్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. విజయసాయి రెడ్డిని కీలకమైన నిందితులలో ఒకరిగా తొలుత ప్రచారం చేసినా, ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయలేదు. తనపై కేసు ఉండదని అనుకున్నా, పూర్తిగా కేసు పెట్టకపోతే, కథ సజావుగా సాగదని భావించారేమో తెలియదు కాని, ఆయనను కూడా నిందితుడిగానే చూపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయంతో సంబంధం లేని వారిని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలక అధికారులుగా ఉన్నవారిని కూడా వదలకుండా వారనుకున్న జాబితా ప్రకారం అరెస్టుల పర్వం సాగించారు. సిట్ అధికారులు రూ.3500 కోట్లు అని కాకి లెక్క తయారు చేశారు. దానికి అయినా ఆధారాలు ఉన్నాయా అంటే అవి లేవు. అసలు డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకుంటే వారు కదా ఫిర్యాదు చేయవలసింది. వారెవరూ మాట్లాడకపోతే దారినపోయే దానయ్య ఎవరో కంప్లెయింట్ చేస్తే దానిని రెవెన్యూ సెక్రటరీ ముఖేష్ మీనా ఎంటర్టైన్ చేయడం ఏమిటి? ఆ వెంటనే బెవరేజన్ కార్పొరేషన్లో సమచారం సేకరించినట్లు, దర్యాప్తు చేయడానికి సిట్ వేసినట్లు.. ఇలా ఎంతో కథ నడిపించారు. చంద్రబాబు టైమ్‌లో ప్రైవేటు రంగంలో మద్యం వ్యాపారం జరిగితే జగన్ హయాంలో ప్రభుత్వమే షాపులను నిర్వహించింది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అదే సమయంలో మద్యం వినియోగం తగ్గింది. అయినా స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును జగన్ మెడకు చుట్టాలని విశ్వయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ అంటూ మురికి పత్రికలు విష ప్రచారం ఆరంభించాయి. 1999-2004 మధ్య ఒక స్కామ్ లో బిగ్‌బాస్‌కు మూడు కోట్లు చెల్లించామంటూ రాసిన లేఖ కలకలం రేపింది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అంతకుముందు 1985 ప్రాంతంలో చంద్రబాబుకు, ఒక సారాయి బాట్లింగ్ కంపెనీ యజమానికి ఉన్న సంబంధంపై ఆయన తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పుస్తకంలో రాశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన యత్నంలో దొరికిపోయిన సంగతి తెలిసిందే అని వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తుంటారు. ఆ చార్జీషీట్లో చంద్రబాబు ప్రస్తావన ముప్పై సార్లకు పైగా ఉంది. అయినా ఆయనను నిందితుడిగా చేర్చలేదు. అప్పుడు చంద్రబాబు బిగ్ బాస్ అని మురికి మీడియా ఒప్పుకుంటుందా? అసలు ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చింది, ఓట్లకు ఎలా డబ్బు ఇవ్వవచ్చన్నది నేర్పింది చంద్రబాబు అని ఆయన ప్రత్యర్థులు ఏకగ్రీవంగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్‌లో తేలేది ఏమీ ఉండదని, కాని కేసు పేరుతో వైసీపీ నేతలను, కొందరు రిటైర్డ్ అధికారులను వేధించి వికృతానందం పొందడం తప్ప అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థూలంగా చూస్తే ప్రజల దృష్టిలో ఇదంతా ఒక రాజకీయ కక్ష కేసుగా మాత్రమే నమోదు అవుతుంది. చంద్రబాబు, లోకేశ్‌లు ఇలాగే రెడ్ బుక్ పాలన కొనసాగిస్తే, భవిష్యత్తులో వారితోసహా టీడీపీ నేతలు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
CBN: హద్దుల్లేని స్వోత్కర్ష ఎంత కాలం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌లు పెట్టుబడులకు సంబంధించి చేసే ప్రకటనలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతారో.. ఎవరూ ఊహించ లేరు. తాజాగా చంద్రబాబు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని అన్నారు. దాంతోపాటే ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని అని కూడా వక్కాణించారు. రానున్న నాలుగేళ్లలో ఇంకో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తామని కూడా చెప్పారు. నిజమైతే సంతోషపడవచ్చు కానీ.. రాష్ట్రంలో పరిస్థితులు అలా లేవు. ఇండోసోల్ వ్యవహారమే పైన చెప్పుకున్నదానికి ఒక ఉదాహరణ. ఈ కంపెనీ సౌర విద్యుత్తు పరిశ్రమ కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయల వ్యయం కూడా చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తీరు పుణ్యమా అని ఇప్పుడు ఆ కంపెనీ భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ కూడా సాహసిస్తుందా?. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని బృందం తయారు చేసిన టాస్క్‌ఫోర్స్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. అయితే ఇది ఆ సమావేశంలో పాల్గొన్న వారికి కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. చంద్రశేఖరన్ వంటి బిజీ పారిశ్రామికవేత్త ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తయారు చేసేంత తీరిక ఉంటుందా? అన్నది ప్రశ్న. నివేదికకు కాస్త మర్యాద దక్కుతుందని ఆయన పేరు జోడించారేమో తెలియదు! అయినా ఫర్వాలేదు కానీ ఆ నివేదికను పరిశీలించినా, చంద్రబాబు మాటలు చూసినా నేల విడిచి సాము చేసే తీరులోనే ఉన్నట్టు అనిపించక మానదు. 2014-19 మధ్యకాలంలోనూ చంద్రబాబు ఇలాంటి సమావేశాలు బోలెడు పెట్టారు. అదిగో పెట్టుబుడులు.. ఇదిగో అభివృద్ధి అని డాబుసరి కబుర్లు చెప్పేవారు. 2029 నాటికి ఏపీ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవుతుందని, ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్-5లో ఉంటుందని ఏవేవో చెప్పేవారు. అంతేకాదు.ఆయా జిల్లాలలో ఏఏ రంగాలను అభివృద్ది చేస్తారో, ఏ ప్రాజెక్టులు వస్తాయో చెబుతూ అసెంబ్లీలో పెద్ద స్పీచ్ ఇచ్చారు కూడా. అప్పట్లో వైసీపీలో ఉండి.. ఇప్పుడు టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు ప్రకటనలు రియల్ ఎస్టేట్ బ్రోచర్తో పోల్చారు కూడా. చివరకు అయ్యింది కూడా అదే. చంద్రబాబు హామీలేవీ అమలు కాలేదు.2024లో అధికారం దక్కిన తరువాత మరోమారు చంద్రబాబు తన పాత స్టైల్‌ను భుజాలకు ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది తాజా ప్రకటన చూస్తే. గత ఏడాది దావోస్ పర్యటనకు ముందు కూడా నానా ఆర్భాటమూ జరిగింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తాయని టీడీపీ మీడియా ఊదరగొట్టింది. తీరా చూస్తే వచ్చింది హళ్లికి హళ్లి! దీని కవరింగ్ కోసం ‘‘ఏపీ గుడ్‌విల్ పెంచేందుకు వెళ్లాము తప్ప పెట్టుబడుల కోసం కాదు’’ అన్న బుకాయింపులు! దావోస్ పర్యటన వైఫల్యంతో చంద్రబాబు తన రూటు మార్చారు. కొంతకాలం తరువాత రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి అని ప్రకటించారు. ఆ తరువాత ఈ అంకెలు ఐదు లక్షల కోట్లకు, మరికొన్ని నెలలకు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకున్నాయి. మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని శాసనమండలిలోనూ ప్రకటించారు. లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్న చందంగా జవాబు ఇవ్వడం వివాదాస్పదమైంది కూడా. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పాట రూ.పది లక్షల కోట్లకు చేరుకుంది!. పారిశ్రామిక దిగ్గజాలుగా పేరొందిన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకే మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కష్టంగా ఉంటే, ఆ స్థాయిలో పారిశ్రామికీకరణ జరగని ఏపీకి ఏడాదిలోనే రూ.పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చెబితే వెరైనా నమ్ముతారా? సీఐఐ సదస్సుల్లో పాల్గొనే పారిశ్రామికవేత్తలకు ఈ విషయాలు తెలియవా? కనీసం వచ్చిన పెట్టుబడులు ఏ ఏ రంగాలకు చెందినవి, ఏ కంపెనీలు పెడుతున్నాయని చెప్పి ఉంటే కొంతైనా నమ్మకం కలిగేదేమో! అదేమీ చేయరు. తోచిన గణాంకాలు చెప్పడం తప్ప వాటికి ఆధారాలు చూపే అలవాటు లేదు. గతంలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ నోటికి వచ్చిన అంకెను చెబుతుండే వారు. చివరకు ఈ అప్పుల అంకె రూ.14 లక్షల కోట్లకు చేరుకుంది కూడా. కానీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా అప్పులు రూ.ఆరు లక్షల కోట్లేనని ఒప్పుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు వ్యవహార శైలి ఇలా ఉంటుంది!. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్శించాలన్న చిత్తశుద్ధి ఉంటే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రామాయపట్నం వద్ద ఇండోసోల్ రూ.40 వేల కోట్లతో ప్రతిపాదించిన సౌరశక్తి పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చే వారా! ఆ కంపెనీ ఇప్పటికే రూ.1200 కోట్ల వరకూ వ్యయం చేసింది. పంటలు పెద్దగా పండని భూములు ఐదువేల ఎకరాలను ఈ కంపెనీ రూ.500 కోట్లతో సేకరిస్తే... ప్రభుత్వం ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకూ సబబు? భూములివ్వమని భీష్మించుకున్న కరెడు ప్రాంతంలో భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ కంపెనీ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేయడమే అవుతుంది. పైగా ఇండోసోల్ సేకరించిన భూమిని వస్తుందో, రాదో తెలియని బీపీసీఎల్‌కు ఇస్తారట. దీనికి వేరేచోట భూమి కేటాయిస్తే నష్టమేమిటి? ఈ విషయాలు.. దాని వెనుక మతలబులు పారిశ్రామిక వర్గాలకు తెలియకుండా ఉంటాయా?.. రానున్న పాతికేళ్లలో 2.4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని కూడా చంద్రబాబు ఆ సమావేశంలో ప్రకటించారు. ఇది కూడా గతంలో చంద్రబాబు చెప్పిన ‘విజన్-2020’ బాపతు వ్యవహారమే. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ తరచి చూస్తే బాబుగారి డొల్లతనం ఏమిటో బయటపడుతుంది. పాతికేళ్ల క్రితం కుటుంబానికో ఐటి ఫ్రొఫెషనల్ నినాదంతో పని చేశామని చంద్రబాబు చెప్పడం ఇంకో విడ్డూరం. బెంగళూరు, చెన్నై, పూణె వంటి నగరాలు ఐటీకి పెట్టింది పేరుగా ఉన్న ఆ సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ రంగం పురోగమించాలన్న లక్ష్యంతో హైటెక్ సిటీకి శంకుస్థాపన కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత సీఎం పీఠమెక్కిన చంద్రబాబు భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంతే. కానీ.. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని తానే మొదలుపెట్టానని, హైటెక్ సిటీ మొత్తం తన సృష్టి అని మాట్లాడటం అతిశయోక్తి తప్ప ఇంకోటి కాదు. 2004- 2009 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్‌రోడ్డు వంటి అద్భుత మౌలిక సదుపాయాలను కల్పించారు. దీంతో నగరం రూపురేఖలు మరింత మారిపోయాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దానిని సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది.2004లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబుకు హైదరాబాద్‌తో అధికారికంగా సంబంధం లేనట్లే. కానీ.. రెండు దశాబ్దాల తర్వాత కూడా హైదరాబాద్ తనే అభివృద్ది చేశానని చెప్పుకుంటూటారు ఆయన! విభజన తరువాత 2014లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఐటీలో హైదరాబాద్‌ను తానే వృద్ధి చేశానని చెప్పిన మాటలే నిజమైతే 2014- 19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయిలో ఎందుకు ఐటీ పరిశ్రమలను తేలేకపోయారన్నది ప్రశ్న. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలను ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు? స్వోత్కర్ష చంద్రబాబుకు బాగా వచ్చు. మిగిలిన వారు సెల్ఫ్ డబ్బా అని విమర్శించినా పట్టించుకోరు. ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో ఎవరో ఒకరిని తీసుకు వస్తారు. మర్యాద కోసం వారు ఆయనను ఉద్దేశించి ఒక మాట పొగిడితే, దానిని తెలుగుదేశం మీడియాతో హోరెత్తేలా ప్రచారం చేయించుకోగలరు. ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడం కూడా అలాంటి వ్యూహంలో ఒక భాగమే!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు, రేవంత్ దాగుడు మూతలు!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యులని ప్రతీతి. అప్పుడప్పుడూ ఈ ప్రచారాన్ని రేవంత్ తోసిపుచ్చుతున్నట్లు కనిపించినా.. కొన్ని సందర్భాల్లో అది నిజమే అన్నట్టుగానూ ఉంటుంది. విభజన సమస్యలు, ఆస్తుల పంపిణీ, విద్యుత్తు బకాయిల వంటి ముఖ్యమైన అంశాలపై కాకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఏదో పెద్ద విపత్తు అయినట్లు ఇరువురూ ఢిల్లీలో సమావేశం కావడం ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, ఆ తరువాత వచ్చిన వార్తలు, నేతలు చేసిన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. రేవంత్ ఏదో మొహమాటానికి ఢిల్లీ వెళితే.. శిష్యుడిని మేనేజ్ చేద్దామనుకున్న చంద్రబాబు భంగపడ్డట్టుగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో బనకచర్ల ప్రస్తావనే రాలేదని రేవంత్ రెడ్డి ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసినా చంద్రబాబు దీనికి బదులేదీ ఇచ్చినట్టు లేదు. పైగా.. ఏదో కమిటికి ఈ వ్యవహారాన్ని అప్పగించినట్లు చంద్రబాబు తన కేబినెట్ మంత్రి రామానాయుడితో చెప్పించడం రేవంత్‌ను ఇబ్బందిపెట్టే విషయం అయిపోయింది. బదులుగా రేవంత్ మరోసారి తన వాదన వినిపించి ఆత్మరక్షణలో పడితే.. చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా రాయలసీమలో ఒక నీటి విడుదల కార్యక్రమానికి వెళ్లి కూడా బనకచర్ల ప్రస్తావన చేయకపోవడం ద్వారా డిఫెన్స్‌లో పడినట్లు విశ్లేషించుకోవాలి. తద్వారా చంద్రబాబు బనకచర్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించే ఆస్కారం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల గురించి చంద్రబాబు కొన్ని నెలలుగా విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నాయి. నిజానికి బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ చాలా కష్టమని అంతా భావిస్తున్నారు. అందులోను పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించడానికి చంద్రబాబు సర్కార్ అంగీకరించిందన్న వార్తల నేపథ్యంలో ఆ సందేహం మరింతగా బలపడుతోంది. దీనివల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా బనకచర్ల డ్రామాకు తెరతీయగా, రేవంత్ పరోక్షంగా సహకరించారన్న విమర్శలు వస్తున్నాయి. సీఎంల భేటీలో బనకచర్ల ప్రాజెక్టు అజెండాపై తాము అంగీకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అనుమతే లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని కూడా అభిప్రాయపడింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో బనకచర్ల అజెండాలో ఉంటే రేవంత్ వెళతారా? లేదా? అన్న ప్రశ్న వచ్చింది. ఒకవేళ వెళ్లినా బనచర్ల అజెండా అయితే రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బృందం బాయ్ కాట్ చేస్తుందని కూడా లీక్ ఇచ్చారు. ఎలాగైతేనేం కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ సమక్షంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పరం సత్కరించుకున్నారు. కేంద్ర మంత్రిని సన్మానించారు. బాగానే ఉంది. కాని బయటకు వచ్చి సమావేశం వివరాలను చెప్పిన తీరు మాత్రం ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రస్తావన రాలేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును చేపడతామని ఏపీ చెబితే కదా.. తాము ఆపాలని చెప్పాల్సింది అని ఆయన అన్నారు. పైగా ఇదసలు అనధికార సమావేశమని అనడం ఆసక్తికరంగా ఉంది. కేంద్రం ఇలా అనధికార సమావేశాలు పెడుతుందా? కేంద్ర మంత్రి అంత పని లేకుండా ఉంటారా? ఈ మాత్రం దానికి హైదరాబాద్‌లోనో, అమరావతిలోనో భేటీ జరుపుకున్నా సరిపోతుంది కదా? అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే రెండు రాష్ట్రాల నీటి సమస్యలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సీఎంలు పరిష్కరించుకోలేని సమస్యలను అధికారులు తీర్చగలుగుతారా! అనే సందేహం వస్తుంది. అది వేరే విషయం. రేవంత్ వ్యాఖ్యలకు భిన్నంగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. బనకచర్లకు సంబంధించి సాంకేతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని కమిటీ వేయాలని నిర్ణయించినట్లు అన్నారు. అది నిజమా? కాదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేవంత్ చెప్పినదాని ప్రకారం అసలు బనకచర్ల ప్రస్తావనే రాలేదు. కేంద్ర జల్ శక్తి శాఖ పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కూడా బనకచర్ల గురించి ఏమీ తెలపలేదు. దాంతో చంద్రబాబు బృందం ఇన్నాళ్లు చేసిన హడావుడంతా ఒట్టిదేనా అన్న విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్‌లో రేవంత్ చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉందన్న ప్రశ్నను బీఆర్ఎస్ వేస్తోంది. సీఎంల భేటీ అజెండాలో బనకచర్ల అంశం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. అటువంటప్పుడు అజెండాలోని అంశంపై ఎవరూ మాట్లాడలేదా?, తెలుగుదేశం మీడియా ఏపీ ఎడిషన్లలో చంద్రబాబు బనకచర్ల గురించి మాట్లాడారని, తెలంగాణ ఎడిషన్లలో ఆ ఊసే లేదన్నట్లుగా కథనాలు వచ్చాయి. ఒకవేళ చర్చ జరిగి ఉంటే, రేవంత్ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించినట్లవుతుంది. మాట్లాడకుండా ఉండి ఉంటే చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. మరి వీరిద్దరిలో ఎవరు నిజం చెప్పినట్లు? రేవంత్ ప్రకటనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి. అలాగే ఏపీ మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ స్పందించాలి. రేవంత్ రెండో రోజు కూడా దీనిపై కొంత స్పష్టత ఇచ్చినా, చంద్రబాబు నోరు మెదపలేదు. తనకు అనుకూలంగా ఉంటే చంద్రబాబు ఈపాటికి ప్రచారంతో హోరెత్తించే వారు. కాని ఆయన అలా చేయకపోవడం, రాయలసీమ టూర్లో కూడా ప్రస్తావించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాచ్ ఫిక్సింగ్ ఉందన్న అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. దానికి ఇప్పుడు బీజేపీ కూడా తోడైనట్లు అనిపిస్తుంది. కేంద్రమైనా వాస్తవం ఏమిటో వెల్లడిస్తుందా? లేదా? రేవంత్, నిమ్మలతోపాటు కేంద్రం కూడా ఒకే తరహా ప్రకటన చేసి ఉంటే ఈ గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. అలా కాకుండా ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు స్టేట్మెంట్లు ఇవ్వడంతో వారికే తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఇక ఇద్దరు సీఎంలు కూర్చుని అంగీకరించినట్లు చెబుతున్న టెలిమెట్రీ ఏర్పాటు, హైదరాబాద్‌లో గోదావరి బోర్డు, విజయవాడలో కృష్ణా బోర్డు ఉండాలన్న నిర్ణయం, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులకు ఏపీ అంగీకారం వంటివే ప్రధాన చర్చాంశాలై ఉంటే మాత్రం ఇది కాలక్షేపపు సమావేశమే అవుతుందని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అవి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నవే. కాగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లు ఉండాలని, కాని చంద్రబాబు ప్రభుత్వం 41.15 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించిందని అంటున్నారు. ఈ నీటి మట్టానికి పరిమితమైతే బనకచర్ల ప్రాజెక్టుకు నీరు ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. దీనికి కూడా చంద్రబాబు ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కాని అన్నిటికి దబాయించడమే పద్దతిగా పెట్టుకున్న చంద్రబాబు టీమ్ వీటిపై ఎంతవరకు వాస్తవాలు వెల్లడిస్తుందన్నది సందేహమే. ఏతావాతా చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టి మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఆలపించినట్లు టీడీపీ మీడియాలో రాయించుకున్నారా? అన్న భావన కలుగుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కుక్కలకూ ఓ క్రూయిజ్.. వీఐపీ రేంజ్ లగ్జరీ!
ప్రస్తుతం ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలలో క్రూయిజ్ టూరిజం ట్రెండింగ్ నడుస్తోంది. విశాఖపట్నం నుంచి మద్రాస్ అండమాన్ తదితర ప్రాంతాలకు కార్డాలియా అనే లగ్జరీ క్రూయిజ్ నౌక తిరుగుతోంది. దీనికోసం ఇప్పటికే పర్యాటకులు సముద్ర ప్రేమికులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సకల సౌకర్యాలతో కూడిన స్పా, బార్, లగ్జరీ రెస్టారెంట్లు.. రకరకాల రుచులు.. క్యాసినోలు.. వినోదం.. పబ్.. డ్యాన్సులు వంటి కార్యక్రమాలతో అలరించే ఈ కార్డియాలో టికెట్లు కోసం యమగిరాకీ ఉంది. ఒకరోజు ప్రయాణానికి దాదాపు పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. సంపన్నులు తమ కుటుంబాలతో.. స్నేహితుల బృందాలు.. లవర్స్ కూడా ఇందులో వెళ్లడానికి ఆ అనుభూతిని పదిలపరచుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.ఇందులో వింత ఏమీ లేదు.. మనుషులు లగ్జరీ క్రూజ్‌లో వెళ్లడంలో వింత.. విడ్డూరం ఏముంది. అమెరికాలో ఓ నౌకాయన సంస్థ కేవలం శునకాల కోసం ప్రత్యేక ట్రిప్ వేస్తోంది. ఇందులో దాదాపు 250 శునకాలతో పాటు వాటి యజమానులు మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ క్రూజ్‌లో జాగిలాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు సౌకర్యాలు లగ్జరీ సదుపాయాలు కల్పించారుశునకాల వైభోగం చూతము రారండి..నీలి సముద్రంలో పాల నురుగును తలపించే కెరటాలు అలా అలా వింజామరలు ఊపుతుండగా అత్యాధునికమైన క్రూయిజ్ సముద్రంలో వయ్యారంగా కదులుతూ ముందుకు సాగుతుంది. వెచ్చని సూర్యకిరణాలు ఆ క్రూయిజ్ మీద పడి మెరుస్తుండగా నవంబర్ 2025లో ఫ్లోరిడాలోని పోర్ట్ టాంపా బే నుంచి బయలుదేరే ప్రపంచ తొలి లగ్జరీ డాగ్ క్రూయిజ్ కరేబియన్ సముద్రంలో ముందుకు సాగుతుంది. ఇది కేవలం పెంపుడు జంతువులకు అనుకూలమైన సముద్రయానం మాత్రమే కాకుండా మీ మిత్రులకు అణువణువూ ఆనందాన్ని నింపే ప్రయాణం అవుతుంది. మార్గరిటావిల్లే అట్ సీ, క్రూయిజ్ టేల్స్, ఎక్స్పీడియా క్రూయిజ్ వెస్ట్ ఒర్లాండో కలిసి ఈ 6-రోజుల కరేబియన్ సాహసయాత్రను మీ కుక్క పిల్లల కోసం స్వర్గధామంగా రూపొందించారు. కేవలం 250 అదృష్టవంతులైన కుక్కలు మాత్రమే ఈ యాత్రకు పోయే చాన్స్ దక్కించుకుంటాయి.Say hello to Max, the best boy of the sea and land! 🐕Prince Eric’s loyal pup with his big heart and even bigger enthusiasm, Max is here to spread joy, greet new friends, and maybe even chase a seagull or two. 🐾💨 pic.twitter.com/JwMYb54Eya— Disney Magic Kingdoms (@DisneyMKingdoms) July 17, 2025ప్రత్యేక ఆకర్షణలు:కుక్కలకోసం ప్రత్యేకంగా పర్సనలైజ్డ్ బట్లర్లుప్రైవేట్ బాల్కనీ రిలీఫ్ జోన్లుఆన్బోర్డ్ గ్రూమింగ్, జలక్రీడలు.. మసాజ్ సెంటర్లు.. ప్లే స్టేషన్లుఫ్యాన్సీ డ్రస్ పోటీలుకుక్కల స్పా ట్రీట్మెంట్లు, గేమ్స్, ట్రైనింగ్ ఈవెంట్లుమరి కుక్కపిల్లలతో వచ్చే యజమానులకు ఏం ఉండవా అంటే ఎందుకు ఉండవు.. చాలా ఉంటాయి. వారికోసం 13 లాంజ్‌లు, 12 రెస్టారెంట్లు.. డైనింగ్ హాళ్లు, మూడు స్విమ్మింగ్ పూల్స్, అలరించే స్పా, క్యాసినో ఇవన్నీ వాటి యజమానులకోసం సిద్ధం చేస్తున్నారు.ఈ టూరుకు వెళ్ళే కుక్కలకు రూల్స్ ఇవీ..ప్రతి కుక్కకు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించి ఉండాలివాటి ప్రవర్తన సరిగా ఉందన్న సర్టిఫికెట్ కూడా ఉండాలిప్రీ-రిజిస్ట్రేషన్ ఇప్పటికే మొదలైందిసీట్స్ తక్కువ, డిమాండ్ ఎక్కువ.. ముందుగానే బుక్ చేసుకోండి!మీ కుక్కలతోపాటు మీరు క్రూయిజ్‌లో విహరించండి.. సముద్రమంత ఆనందాన్ని సొంతం చేసుకోండి.-సిమ్మాదిరప్పన్న -
నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదా జగనూ..!
ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని చంద్రబాబుకు సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తండావు. మీ నాయన ఆయనకి పాలన అంటే ఏంటో చూపిస్తే,ఇప్పుడు నువ్వు నేర్పించినావు కదా... తండ్రికి మించిన తనయుడువు అయితివి అబ్బా.. ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. అంటూ కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తుంది. అక్కడే కాసేపు నిలబడి ఆ ఫ్లెక్సీలోని పాయింట్లన్నీ ఆమూలాగ్రం చదివేలా చేస్తోంది.. ఆ తండ్రీకొడుకులిద్దరూ కళ్లు మూసుకుని నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా!. నిత్యం నిన్ను అవమానించే వాళ్ళు, నీ ఇమేజ్‌కు డామేజ్ చేసే వాళ్లు కూడా.. కిక్కురు మనకుండా నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా. ఎంత పని చేశావయ్యా జగన్..!! అంటూ అందులో రాసి ఉంది.. .. వాస్తవానికి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు పేదలంటే ఇష్టం ఉండదు!. అదొక అసహ్యమనే భావనలో ఉంటారు వాళ్లు. సర్కారు బడుల్లో, ప్రభుత్వ ఆసుపత్రులు, పథకాలు, సంక్షేమం వగైరా అంటే వారికి అసలు గిట్టదు. కానీ ప్రభుత్వం అంటే ప్రజలు అని.. ప్రజలతో మమేకం కాకుండా పరిపాలన చేసిన అది నిజమైన ప్రభుత్వం కాదు అని వైఎస్ జగన్ నిరూపించారు. ఐదేళ్ల పరిపాలనలో నిత్యం ఆయన ధ్యాస తపన ఆలోచన ప్రజల చుట్టూనే ఉండేది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేయాల్సిందే అని పట్టుబట్టిన ఆయన వాటి జాబితాను తన కార్యాలయ గోడలకు అతికించి నిత్యం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటి అమలుకు ముందడుగు వేస్తూ ఉండేవారు. అయితే.. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేడు చంద్రబాబు కూడా వైయస్ జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు తొలిసారిగా తల్లికి వందనం అంటూ ఓ పథకాన్ని ఇచ్చారు. వాస్తవానికి అది గతంలో జగన్ ‘అమ్మ ఒడి’ పేరిట ఇచ్చిన పథకమే. కానీ దాన్ని తామే కొత్తగా కనిపెట్టినట్లుగా ప్రజలను నమ్మిస్తూ వస్తున్నారు. జగన్ తన పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరిట ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్ మీడియం. సబ్జెక్ట్ టీచర్లు ఇలా రకరకాల కాన్సెప్ట్‌లతో ప్రభుత్వ విద్య విధానంలో నాణ్యత పెంచారు. ఇప్పుడు అదే పాఠశాలల్లో చంద్రబాబు లోకేష్ ఫోటోలు దిగి పిల్లలతో ముచ్చట్లు చెబుతూ అదంతా తమ ఘనతగా పత్రికల్లో రాయించుకుంటున్నారు. ఇలా ఎన్నో అంశాలను సదర్ ఫ్లెక్సీలో పేర్కొన్న రహస్య అభిమాని.. ‘‘ఎంత పని చేసావు జగన్’’ అంటూ జగన్ అభినందిస్తూనే చంద్రబాబు పడుతున్న తిప్పలను హాస్యపూరితంగా వివరించారు.నీ ఒత్తిడి భరించలేక పేద పిల్లలకు చంద్రబాబు తనకి ఇష్టం లేకపోయినా తల్లికి వందనం ఇచ్చాడు. నువ్వు అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న పరిశ్రమలు ప్రాజెక్టులు పథకాలనే చంద్రబాబు లోకేష్ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నువ్వు గతంలో ప్రజలతో మమేకం అయినట్లుగానే ఇప్పుడు చంద్రబాబు కోరికన్నా ముందు నిద్రలేచి టీ స్టాళ్ళు.. చేపల బజార్లు.. సందులు.. గొందుల్లో తిరుగుతూ జనంతో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. ఇవన్నీ గతంలో నువ్వు చేసినవి కాక మరేమిటి జగనూ!. .. నీ పర్యటనలకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని ఆపలేక చంద్రబాబు ఆఖరుకు తన కడుపు మంటను మంత్రుల మీదకు వెళ్ళగకుతున్నారు.. ఇది కూడా నువ్వే చేశావు జగనూ!. కూటమిలోని మూడు పార్టీలకు ఒకరంటే ఒకరికి పసగకపోయినా నీ భయంతో అందరూ చేతులు పట్టుకొని జట్లు పట్టుకొని ఒకరినొకరు పొగుడుకునేలాగా చేశావు.. విడిపోతే ముగ్గురూ అస్సామే అనే పరిస్థితి తీసుకొచ్చావు జగనూ!. నువ్వు ఏ ఊరికి పర్యటనక పోతే అక్కడ ముందుగానే పరిస్థితులు చక్కపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అక్కడి సమస్యలపై ఉరుకున పరుగున స్పందించే ప్రయత్నమూ చేస్తున్నారు.. ఎంత పని చేసావు జగనూ!.నువ్వు ఓడిపోయినా.. రాష్ట్రంలో మీ పరిపాలనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని ఈ తండ్రి కొడుకులు కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావ్.. ఎంత పని చేశావు జగనూ! అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందర్నీ ఆలోచింపజేస్తోంది.::సిమ్మాదిరప్పన్న -
పవన్ @పెద్దమ్మ భాషా పితామహ..
రామాయణాన్ని వాల్మీకి రాశారు.. వేద వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కవిత్రయం అనువదించింది. మను చరిత్రను అల్లసాని పెద్దన రాశారు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు.. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు.. అవన్నీ అందరికీ తెలుసు కానీ పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు చెప్పండి.. షాక్ అయ్యారా.. లేదు మళ్ళీ చదవండి.. పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు?.అదేంది మాతృభాషను అమ్మ భాష అంటారు అది అందరికీ తెలిసిందే. కానీ ఈ పెద్దమ్మ భాష ఏంది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.. ఈరోజే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపెట్టారు.. ఆయన ఎవరితో పొత్తులో ఉంటే ఆ పాట పాడుతారు ఆ గుమ్మం ముందు ఆ ఆట ఆడతారు. ఆయన ఎవరికి తాబేదారుగా ఉంటే ఆ పార్టీ భజన గీతాలు నేరుస్తారు. గతంలో నన్ను మా అమ్మను ఎన్ని రకాలుగా అవమానించారు అంటూ తెలుగుదేశం మీద చిందులు తొక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఇంకో 20 ఏళ్లు చంద్రబాబుకు పాలేరుగా ఉండడానికి సిద్ధం అని ప్రకటించారు.పాచిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీకి మనం తలవంచుతామా అంటూ అటూ ఇటూ తల ఎగరేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుమ్మం ముందు బిస్కెట్లు ఏరుకుంటున్నారు. ఈ ఢిల్లీ వాళ్లకి అహంకారం ఎక్కువ సౌత్ ఇండియా వాళ్ళు అంటేనే వాళ్లకు లెక్కలేదు.. అలాంటి వారితో మనకు పొత్తా.. చెప్పండి చెప్పండి అంటూ ఊగిపోయిన పవన్ మళ్ళీ బీజేపీ పంచన చేరారు. ఉత్తర భారతదేశ పార్టీలు నాయకులకు దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు.. వాళ్లు తమ భాషను నాగరికతను సంస్కృతిని మనపై రుద్దుతున్నారు అంటూ చిందులు తొక్కిన పవన్ తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి ఆయన సరికొత్త భాష్యం చెబుతున్నారు. మాతృభాష తల్లి అయితే హిందీ పెద్దమ్మ భాష అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు.మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో హిందీ అంటేనే ఒప్పుకోవడం లేదు. తమిళులకు తమ మాతృభాషపై ఎనలేని మక్కువ ఉంది హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద చర్చ లేవదీశారు. తమిళులు సాధ్యమైనంత వరకు పార్లమెంట్లో కూడా తమిళంలోనే మాట్లాడతారు. కేరళలో కూడా హిందీ అంటే వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో ప్రజలు కన్నడం అంటే ప్రాణం పెడతారు. ఆంధ్రాలో కూడా హిందీకి ప్రాధాన్యం తక్కువే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయనకు హిందీ పట్ల ప్రేమ పెరిగిందో తన రాజకీయ అవసరాల కోసం ఇలా నటిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ. దీని పెద్దమ్మ భాష అంటూ నెత్తికెత్తుకున్నారు. వాస్తవానికి ఆయన సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని మోస్తూ ఆ ఎపిసోడ్ గడిపేస్తూ ఉంటారు. ఆమధ్య కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం చేస్తున్న నౌకను చూసి సీజ్ ది షిప్ అన్నారు. ఆ తరువాత ఆ అంశాన్ని వదిలేశారు. ఇప్పుడు యథావిధిగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. తిరుమల ప్రసాదంలో కొవ్వుంది అన్నారు.. నాల్రోజులు కాషాయం బట్టలు వేసుకుని హడావుడి చేశారు.. దాన్ని వదిలేశారు. వారాహి డిక్లరేషన్.. సనాతన ధర్మం అన్నారు.. దాన్ని పక్కనబెట్టారు. ఇప్పుడు తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని అంటున్నారు.. మరి ఈ అంశాన్ని ఎప్పుడు వదిలేస్తారో చూడాలి.. సీజన్లను బట్టి ప్రాధాన్యాలు మార్చుకునే పవన్ కళ్యాణ్ ఊసరవెల్లికి సైతం కోచింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు అని ప్రజలు విస్తుపోతున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
జగన్ చరిష్మాను మరింత పెంచుతున్న కూటమి సర్కారు!
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించినట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత.. కచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లుంది. బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ద దేనిమీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డ్‌కు వెళుతున్నారే! ఈ సమస్య ప్రజలలోకి బాగా వెళ్లిపోతుందే! అన్న గొడవ తప్ప, రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు!. పైగా జగన్ టూర్‌ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రూ.260 కోట్లు ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక, ధరలు దారుణంగా పడిపోయి రెండు నెలలుగా రైతులు నానా బాధలు పడుతున్నారు. మామిడి పండ్లతో రైతులు రోజుల కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా!. ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?. కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలకు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక, పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా?అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోంది. టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని, జగన్నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ, తమ అక్కసు తీర్చుకున్నాయి. జగన్‌కు మద్దతుగా కాని, తమ బాధలు చెప్పుకోవడానికి గాని రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం. టమోటాలు, ఇతర ఉత్పత్తులకు సరిగా ధర లేకపోతే రైతులు పలు సందర్భాల్లో కింద పారబోసి నిరసనలు తెలిపిన ఘటనలు ఎన్ని జరగలేదు? అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది! ఎన్ని ఆంక్షలు పెట్టింది!.. ఎక్కడైనా ఇంతమందే రావాలని చెబుతారా? ఒకవేళ స్థలాభావం ఉంటే దానిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, ఐదుగురితోనే మాట్లాడాలని, రైతులను ఆటోలలో ఎక్కించుకోకూడదని, మోటార్ బైక్‌లకు పెట్రోల్ పోయరాదని.. ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున మూడు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. సుమారు రెండువేల మందిని నియమించారట. వీరు జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా, ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాట్లు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా పాతిక చెక్ పోస్టులు పెట్టారట. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనపర్తి వద్ద భద్రతాకారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోకపోతే, మద్దతు దారులను వెంట బెట్టుకుని నడుచుకుంటూ వెళ్లారే? అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే! చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు. అదే.. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే, డ్రైవరుతోపాటు జగన్, ఇతర ప్రయాణీకులపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందింది. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించి జగన్‌కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా! జగన్నాధ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా? అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడినదని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలో డబుల్ టాక్ చేయడం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏమి విలువ పెరుగుతుందో తెలియదు. బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పోలీసులు లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతనిని పరామర్శకు కూడా జగన్ కారు దిగడానికి పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో రూ.16లకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే, ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా? అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు రూ.నాలుగు సబ్సిడీని కేంద్రం భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప, వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వెళ్లుతున్నారు అన్నప్పుడుగాని వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్‌గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా! ఇదే కదా ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా, తన వెంట జనం ఉన్నారని జగన్ పదే, పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. కాని ప్రజాస్వామ్యంలో అణచివేత విధానాల వల్ల ఉపయోగం ఉండదని అనుభవ పూర్వకంగా తెలియ చేసినట్లయింది. బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే, అంతే వేగంగా అది పైకి లేస్తుందన్న సంగతి మరోసారి స్పష్టమైంది. పోలీసులు మెయిన్ రోడ్డుపై ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు, గుట్టలు దాటుకుంటూ, అడవుల గుండా కూడా తరలిరావడం కనిపించింది. కొందరు యువకులు మోటార్ సైకిళ్తపై చిన్న, చిన్న డొంకల ద్వారా తరలివచ్చిన తీరుకు సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షించాయి. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అదే తీరుగా ఉంది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికలలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావన. అందుకే కూటమి సూపర్ సిక్స్‌తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకు రావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. వైయస్సార్సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలి. జగన్‌కు టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను ప్రభుత్వమే రోజురోజుకు మరింతగా పెంచుతున్నందుకు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అయ్యవారిని చేయబోతే కోతి అయిందట!.. తేడా కొట్టిన బాబు స్కెచ్!
పెద్ద వీరుడొచ్చాడు.. అలాంటివాడితో పిల్లాడి బొడ్డు కోయిస్తే పెద్దయ్యాక వీడు కూడా వీరుడవుతాడని భావించిన తల్లిదండ్రులు వేలాదిమంది సమక్షంలో బిడ్డకు బొడ్డుకోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారట. ఆ మహావీరుడు జనాన్ని చూసి కత్తిని రకరకాలుగా తిప్పి.. విన్యాసాలు చేసి ఇదిగో చూడండి బొడ్డు కోస్తున్నాను అని చెప్పి ఇంకేదో కోసేశాడట.. దీంతో తల్లిదండ్రులు అయ్యో దేవుడా ఇదేందీ ఇలా జరిగిందని లోలోన కుమిలిపోతున్నారట.వాస్తవానికి వైఎస్ జగన్ పర్యటనలను ఆపడానికి.. జనం నుంచి ఆయన్ను దూరం చేయడానికి కూటమి నాయకులు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఆయన పర్యటనలను నిర్వీర్యం చేయడం.. ప్రజల్లో జగనుకు ఆదరణ తగ్గిందని చెప్పడం కోసం ఎన్నో పథకాలు వేస్తున్నారు. అయినా సరే మొన్నటి గుంటూరు పర్యటన.. అంతకుముందు కడప ఇలా జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వేలాదిగా తరలివెళ్తున్నారు. దీంతో ఇక లాభం లేదనుకుని మామిడి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వైఎస్ జగన్ మీద ప్రభుత్వం బోలెడు ఆంక్షలు విధించింది.కేవలం 500 మందికి మించకుండా కార్యకర్తలు ఆయన వెంట ఉండాలని రూల్ తెచ్చింది. అంతేకాకుండా ఆ పర్యటనకు రకరకాలుగా కండీషన్లు పెట్టారు.. కండీషన్లు పెడితే జనానికి ఎక్కడో కాలుతుంది.. సరిగ్గా జగన్ పర్యటన విషయంలో కూడా అదే జరిగింది. బంగారుపాళ్యం పర్యటనను భగ్నం చేసేందుకు మూడు నాలుగు జిల్లాల ఎస్పీలు.. 9 మంది అదనపు ఎస్పీలు అంతకు డబుల్ డీఎస్పీలు.. వందలాదిమంది ఎస్సైలు కానిస్టేబుళ్లు కలిసి మొత్తం ఓ రెండు వేల మంది పోలీసులను జగన్ పర్యటనకు మోహరించారు. అదేంది 500 మందికి మించకుండా జనాన్ని రమ్మన్నారు కదా మరి మీరేందుకు రెండు వేల మంది వచ్చారు అని ప్రజలు అడిగే ప్రశ్నలకు పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి కూడా సమాధానం కరువైంది. ఇక పోలీసుల నిర్బంధం పెరిగిన కొద్దీ ప్రజల్లో కసి పెరిగింది. ఎవరో ఎస్సై వచ్చి మమ్మల్ని నియంత్రించడం ఏందీ.. మేము సినిమాకు వెళ్లాలా.. జాతరకు వెళ్లాలా.. జగన్ పర్యటనకు వెళ్లాలా అనేది మా ఇష్టం. మధ్యలో వీళ్ళ జోకుడు ఏమిటన్న ఫీల్ జనంలో మొదలైంది. ఒక్క చినుకుగా ప్రారంభమైన ఈ ఆత్మాభిమానం ఉప్పెనలా మారింది. గ్రామాలు దండుకట్టాయి.. పల్లెలు పరవశించాయి.. ఇంకేముంది మళ్ళీ వింటేజ్ జగన్ ఆవిష్కృతమయ్యారు.ఎక్కడికక్కడ వందలు వేలల్లో ప్రజలు చెట్టూ పుట్టా వాగు వంక దాటుకుని జగన్ వెంట నడిచారు.. మొత్తానికి నిర్బంధం ఎంత ఎక్కువైతే ప్రతిఘటన అంతకు వందింతలు ఉంటుందని ప్రజలు నిరూపించారు. పల్లెల్లో పోలీసుల రుబాబు పెరిగేసరికి అదే మొత్తంలో జగన్ పట్ల అభిమానం ఆదరణ రెట్టింపు అయ్యింది. దీంతో అయ్యవారి బొమ్మ గీయబోతే కోతి బొమ్మ వచ్చిందన్నట్లుగా జగన్ ప్రోగ్రాములు భగ్నం చేయబోగా అది కాస్తా ఎదురుతన్నింది. అన్నిటికి మించి జనాన్ని జగన్ నుంచి విడదీయడం అంత వీజీ కాదని పోలీసులకు ప్రభుత్వానికి అర్థమైంది. మొత్తానికి పోలీసులతోనే జగన్ పర్యటనలు సక్సెస్ అవుతున్నాయి అని ప్రజలు అర్థం చేసుకున్నారు . -సిమ్మాదిరప్పన్న -
బనకచర్ల.. గురు శిష్యుల డ్రామా?
రాజకీయాల్లో కొందరు గాల్లో కత్తులు తిప్పుతూంటారు. అదే యుద్ధమని జనాన్ని నమ్మించే ప్రయత్నమూ జరుగుతూంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల్లో హడావుడి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి గత ఏడాది అధికారంలోకి వచ్చింది మొదలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సుమారు రూ.85 వేల కోట్లతో గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని ప్రతిపాదించారు. కేంద్రం కూడా నిధుల రూపంలో సాయం చేయాలని కోరారు. అయితే.. పలు లిఫ్ట్‌లు, రిజర్వాయర్లు, సొరంగాలతో కూడిన బనకచర్ల ప్రాజెక్టు అంత తేలికగా అయ్యేది కాదన్నది అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వమేమో సాయం సంగతి దేవుడెరుగు... పంపిన ప్రతిపాదననే తిప్పి పంపింది. జలసంఘం ఆమోదం తరువాత పర్యావరణ అనుమతులు కూడా తీసుకుని మాట్లాడమని సూచించింది. ఇదంతా ఒక పార్శ్వమైతే.. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఇంకో రకమైన రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఈ అంవాన్ని పెద్ద వివాదంలా మార్చి వాదోపవాదాలు సాగిస్తున్నాయి. రెండు పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూండటం గమనార్హం. కానీ... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను అంగీకరించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్పష్టం చేస్తూనే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శిస్తున్నారు. వీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తే, దీనికి పోటీగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురు శిష్యులని, అందుకే బనకచర్ల ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని హరీష్ అంటున్నారు. చంద్రబాబు, రేవంత్‌లు హైదరాబాద్‌లో భేటీ అయినప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే చేశారని హరీష్‌రావు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ఉత్తం కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చంద్రబాబు వద్ద బజ్జీలు తిని మరీ ఈ ప్రాజెక్టుకు ఓకే చేసి వచ్చారని అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నీటి వాటాలలో నష్టం జరిగిందని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైనప్పుడు ఇందుకు బీజం పడిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్, జగన్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక భేటీ జరిగిన మాట నిజమే. గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి జూరాలకు తరలించడానికి కేసీఆర్ ప్రతిపాదించగా, దానిని పరిశీలించడానికి జగన్ ఒప్పుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం ఏర్పడడంతో అది ముందుకు సాగలేదు. కేసీఆర్, జగన్‌లు అయినా, చంద్రబాబు, రేవంత్ అయినా సమావేశమైతే ఉభయ రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తదుపరి చంద్రబాబుకు చెప్పే కాంగ్రెస్‌లో చేరారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి, పిమ్మట పీసీసీ అధ్యక్షుడై, ఎన్నికలలో గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు.అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా తెలంగాణ టీడీపీ కూడా సహకరించడం బహిరంగ రహస్యమే.చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్‌తో కూడా స్నేహం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాలలో ఉన్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్‌లు కలిసి కూర్చుని విభజన సమస్యలను చర్చించి పరిష్కారం కనుక్కుని ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.ఏడువేల కోట్ల విద్యుత్ బకాయిలు రావల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో వాటా తెచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించి ఉండాల్సింది. తనను చంద్రబాబు శిష్యుడని చెప్పడాన్ని రేవంత్ అంత ఇష్టపడక పోయినట్లు కనిపిస్తుంటారు. అయినా వారిద్దరి మధ్య సంబంధ, బాంధవ్యాలు బాగానే ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ ఉదాసీనంగా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గోదావరి జలాలలో 1500 టీఎంసీల నీటిని కేటాయించిన తర్వాత ఏపీ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం వాదనగా ఉంది. అయితే తాము వరద జలాలను మాత్రమే వాడుకోదలిచామని, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులపై గతంలో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ తెలంగాణ అడ్డుపడింది. ఇప్పుడు బనకచర్ల విషయంలో కూడా తెలంగాణ గట్టిగా అడ్డుపడుతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ కోణంలో చూస్తే వారికి తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏపీకి ఎంతవరకు సహకరిస్తుందన్నది సందేహమే. ఇక్కడ విశేషం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏమీ లేదని, తెలుగుదేశానికి మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో సహా మరికొందరు ప్రత్యేకంగా సమావేశం పెట్టి ప్రకటన చేశారు. అంతేకాక 18.5 కిలోమీటర్ల వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల తవ్వకాలు రెండున్నర దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయని, అయినా అవి ఒక కొలిక్కి రాలేదని, అలాంటిది ఇప్పుడు ఏకంగా నల్లమల అడవులలో, కొండల్లో 26.5 కీలోమీటర్ల మేర సొరంగం తవ్వకం ఆరంభిస్తే అది ఎప్పటికి పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. తాను ఏమైనా ప్రతిపాదిస్తే, ఎవరూ దాన్ని వ్యతిరేకించరాదని భావిస్తారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే అభివృద్ది వ్యతిరేకులంటూ వారిపై తట్టెడు బురద వేసి ప్రజల మైండ్ ఖరాబు చేస్తుంటారు. ఇందుకు తనకు మద్దతు ఇచ్చే మీడియాను పూర్తిగా వాడుకుంటారు. అందువల్ల ఏపీలో తెలుగుదేశం మినహా ఇతర రాజకీయ పార్టీలేవి ఈ ప్రాజెక్టుపై పెద్దగా స్పందించడం లేదు. ఇదంతా ఏపీలోని కూటమి ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా అని ఆయా రాజకీయ నేతలు భావిస్తున్నారు. సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురుశిష్యులు చంద్రబాబు, రేవంత్ కలిసి ఈ డ్రామా నడుపుతున్నారని, చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు పూర్తిచేసే ఉద్దేశం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కూడా ఇదే తరహా ప్రాజెక్టుకు డీపీఆర్ పంపించింది. ప్రభుత్వం మారడంతో బనకచర్ల ప్రాజెక్టు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం అంత తేలిక కాదన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే ఏకంగా రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుంది. అది అక్కడితో ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్రం దీనికి నిధులు కేటాయించితే పెద్ద విశేషమే. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదు. అయినా కేసీఆర్ రుణాలు తెచ్చి ఆ ప్రాజెక్టును నిర్మించారు. కాని అందులో ఒక భాగం దెబ్బతినడం కేసీఆర్ ప్రభుత్వానికి ఇరకాటమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల వాయిదాలు సరిగా చెల్లించలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బనకచర్లకు రుణాలు వచ్చే అవకాశం ఎంతన్నది చెప్పలేం. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టినా, తెలంగాణకు వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. అయినా రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలు సాగిస్తూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయి. మరో వైపు ఏపీ ప్రభుత్వం తామేదో పెద్ద ప్రాజెక్టును చేపడితే ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం తగ్గించిన అంశాన్ని పక్కన బెట్టి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు భారీ ప్రాజెక్టులపై అంత విశ్వాసం ఉండేది కాదు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తించి, ఇప్పుడు ఆయన కూడా ఆ రాగం ఆలపిస్తున్నారు. అయితే ఆ పాట పాడుతున్నది చిత్తశుద్దితోనా, రాజకీయం కోసమా అన్నదానిపై ఎవరికి కావల్సిన విశ్లేషణ వారు చేసుకోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జన్మ సార్థకత వైఎస్‌కే చెల్లింది!
‘పుట్టిన రోజు పండగే ప్రతి ఒక్కరికి.. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే’’ పాత సినిమా పాట ఇది. కాకపోతే... దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అతికినట్లు సరిపోతుంది ఇది. వచ్చిన అవకాశాలను ప్రజల కోసం వినియోగించిన తీరు గమనిస్తే పుట్టింది ఎందుకో తెలిసిన వ్యక్తులలో వైఎస్సార్ అగ్రభాగాన ఉంటారు. సంపన్న కుటుంబంలో జన్మించినా సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడడం ఆయన ప్రత్యేకత. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మలమడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు. రూపాయి డాక్టర్‌గా సేవలందించి ప్రజల మన్నన చూరగొన్నారు. రాజకీయాలలోనూ ఆయన తన విధానాలను వదులుకోలేదు. ఎన్నో ఎగుడు దిగుడులు చూశారు. సవాళ్లు ఎదుర్కున్నారు. అయినా ఓటమి ఎరుగని నేతగా రికార్డు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు... విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఈ రికార్డు దక్కింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌కు మాత్రమే. ఎమ్మెల్యేగా పోటీచేసినా, ఎంపీగా ఎన్నికల బరిలో దిగినా ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు. 1996లో కడప లోక్‌సభ సీటు నుంచి పోటీచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ గెలవడం ఒక సంచలనం. 1999లోనే ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కాని అప్పట్లో టీడీపీ బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం, కార్గిల్ యుద్ద ప్రభావం, ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కోల్పోయారన్న సానుభూతి వంటి కారణాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేశాయి. ఆ దశలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వైఎస్ నాయకత్వం వహించారు. అప్పట్లోనూ చంద్రబాబు నాయుడు తన సహజశైలిలో వైఎస్ వ్యక్తిత్వ హననం నానా ప్రయత్నాలూ చేశారు. బ్యానర్లు కట్టారని, ఎన్నికల నిబంధనలు సరిగా పాటించలేదని, ర్యాలీలు తీశారన్న చిన్న చిన్న కారణాలపై కూడా కేసులు పెట్టించి వ్యతిరేక ప్రచారం చేసేవారు. వాటిని బూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగేది. ఇందుకు టీడీపీ మీడియా తోడు ఉండనే ఉంది.1999లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా వైఎస్ దానిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. తదుపరి పాదయాత్రను ప్లాన్ చేసుకుని జనంలోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు వ్యతిరేకించాయి. సొంతంగా ఎదగడానికి యత్నిస్తున్నారని, భవిష్యత్తులో సోనియా గాంధీని కూడా ధిక్కరిస్తారని పితూరీలు చెప్పేవారు. అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తూండేది. దాంతో వైఎస్ కొన్నిసార్లు ఇబ్బందులు పడేవారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వద్ద అనారోగ్యానికి గురయ్యారు. సోనియా గాంధీని అక్కడకు తీసుకురావాలని కొంతమంది నేతలు యత్నించారు కాని ఎందువల్లో ఆమె రాలేదు. అయినా వైఎస్ తన పాదయాత్రను వదలి పెట్టలేదు. 2003లో చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ దాడి చేసినప్పుడు వైఎస్ తిరుపతి వెళ్లి పరామర్శ చేసి దాడికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. అప్పట్లో చంద్రబాబు సానుభూతి వస్తుందని ఆశించి శాసనసభను రద్దు చేశారు. కాని వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూశారు. పాదయాత్ర ద్వారా ప్రజలలో వచ్చిన ఆదరణను నిలబెట్టుకునేందుకు వైఎస్ యత్నించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ గ్రూపులను సైతం కలుపుకుని వెళ్లడానికి సిద్దపడ్డారు. అక్కడ నుంచి ఆయన రాష్ట్ర చరిత్రను ,గతిని మార్చేశారని చెప్పాలి. 2004లో కాంగ్రెస్‌ను విజయపథంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కరాదని కొన్ని యత్నాలు జరగకపోలేదు. అయినా ఆయన తొణకలేదు. చివరికి వైఎస్ కాకుండా మరెవరికైనా సీఎం పదవి ఇస్తే ప్రభుత్వం నడవడం కష్టమని తెలుసుకుని, అధిష్టానం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం మొదలు అనేక హామీల అమలుకు కృషి చేశారు. అంతకుముందు ఒకసారి ఎంపీల సమావేశంలోకాని, ఇతరత్రాకాని నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టకపోతే చరిత్ర హీనులవుతారని ఆనాటి పాలకులను రాజశేఖరరెడ్డి హెచ్చరించే వారు. వైఎస్‌కు భయపడి ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాని 2004 వరకు ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఆ సమయంలో వైఎస్ ఒక కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాల వద్ద పూలు పెట్టివచ్చారు. ఆ సంగతులు అన్నిటిని గుర్తుంచుకున్న వైఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే ప్రాజెక్టులపై సమీక్ష చేసి వాటిని ఎలా పరుగు పెట్టించాలా అని ఆలోచన చేశారు. వైఎస్ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు. ఉమ్మడి ఏపీలో ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి. రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు విస్తరణతో సహా హంద్రీ నీవా, గాలేరు-నగరి, గండికోట ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టారు. తెలంగాణలో ఎల్లంపల్లి, కల్వకర్తి, బీమా, ప్రాణహిత-చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోస్తాంద్రలో పోలవరం, పులిచింతల, వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలైవని ఉన్నాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో తెలంగాణ వారితో పాటు ఆంధ్రకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు, నిరసనలు ఎదుర్కున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు తవ్వుతుంటే టీడీపీ ఎన్నో ఆటంకాలు కల్పించింది. అయినా ఆయన ఆగలేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కావల్సిన అనుమతులు తేవడంలో వైఎస్ చూపిన శ్రద్ద నిరుపమానం. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకున్నదంటే ఆ ఘనత ఆయనదే. పులిచింతల నిర్మాణం దశాబ్దాల తరబడి స్తంభించిపోతే వైఎస్సార్ దానిని చేసి చూపించారు. దానిని వ్యతిరేకించే తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఒప్పించి మరీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. ఒక నేత ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావని భావిస్తే, వైఎస్ మాత్రం మనం మొదలుపెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారంటూ విశాల దృక్పథంతో ఆరంభించారు. ఈ రోజు విభజిత ఆంధ్ర ఈ మాత్రమైనా నిలబడిందంటే అది వైఎస్ గొప్పదనమని అంగీకరించక తప్పదు. ఇది మాబోటివాళ్లం ఇప్పుడు చెప్పడం లేదు. 2009 నుంచే చెబుతున్నాం. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం కట్టిన ఒక సీఎం హైదరాబాద్ తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ ప్రచారం లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఒక రూపం తెచ్చారు. అదంతా ఒక ఆధునిక నగరంగా మారిందంటే బీపీ ఆచార్య అనే ఐఎఎస్ అధికారిని నియోగించి వైఎస్ చేసిన కృషే అని చాలామందికి తెలియక పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ప్రచారం చేసుకోలేకపోయింది. టీడీపీ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకతను భరిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మూడువంతులు పూర్తిచేశారు. హైదరాబాద్ దశ, దిశను మార్చిన గొప్ప ప్రాజెక్టు అది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణమే కాకుండా, అక్కడకు వెళ్లడానికి వీలుగా ఎక్స్‌ప్రెస్ వంతెనను 13 కిలోమీటర్ల దూరం నిర్మించడం ద్వారా ఆయనకు ఉన్న విజన్‌ను ప్రజలకు తెలియ చేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన నేతగా, విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టి పేదలకు విద్యాదానం చేసిన వ్యక్తిగా చరిత్రపుటలలోకి ఎక్కారు. 2009లో ఆయనను ఓడించడానికి టీడీపీ ఏకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసిందంటేనే వైఎస్ ఎంత శక్తిమంతుడుగా అవతరించారో అర్థం చేసుకోవచ్చు. పరస్పర విరుద్ద భావాలు కలిగిన టీడీపీ, టీఆర్ఎస్(నేటి బీఆర్ఎస్), సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూటమి కట్టినా 2009లో వైఎస్‌ను ఓడించలేకపోయాయి. మొత్తం బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి రావడానికి కూడా వైఎస్ కారణభూతులయ్యారు. అయినా ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. వైఎస్ జీవించి ఉన్నా, వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌ను సీఎంగా చేసినా ఉమ్మడి ఏపీ భవిష్యత్తు మరోలా ఉండేదని చాలామంది నమ్ముతారు. ఏది ఏమైనా వైఎస్ సీఎంగా చేసింది ఐదేళ్ల మూడునెలల కాలమే అయినా, ఒక శతాబ్దానికి సరిపడా పేరు తెచ్చుకుని గొప్పనేతగా ప్రజల మదిలో నిలిచిపోయారు.వైఎస్ రాజశేఖరరెడ్డికి జయంతి సందర్భంగా ఇదే నివాళి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ మాటల మతలబు ఏమిటి పవన్?
జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లూ మామూలే కానీ.. పవన్ కల్యాణ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌ల ఈ మాటల వెనుక ఏదో నిగూఢ అర్థం ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. 2024 నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గెలిచిన తీరుపై ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి. టీడీపీ ఆర్భాటంగా ప్రకటించి అమలు చేయని సూపర్ సిక్స్ వాగ్ధానాల ప్రభావం కొంత ఉంటే ఉండవచ్చునేమో కానీ.. వైఎస్సార్సీపీకి అనూహ్యంగా తగ్గిన సీట్లు ఈవీఎంల మహిమ వల్లేనని సామాన్యులతోపాటు మేధావులూ బహిరంగంగానే ప్రకటించారు. కూటమి నేతల మాటలిప్పుడు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఏడాది కూటమి పాలనలో జరిగిన పరిణామాలు, కూటమి నేతల దాష్టీకాలు, పోలీసులను అడ్డంపెట్టుకుని తమను వేధిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు చాలా ఆగ్రహంతో ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కొన్నేళ్లు ఓపిక పడితే మళ్లీ అధికారం మనదే అని భరోసా కూడా ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే జగన్‌కు రాష్ట్రం నలుమూలల్లోనూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒకరకమైన పట్టుదలతో ఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఎక్కడ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడో అన్న భయం పట్టుకుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ మధ్యే ఒక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మళ్లీ గెలిచే పరిస్థితిలోకి వచ్చిందన్న అర్థంతో మాట్లాడారు. అలాగే జగన్‌ను ఒక భూతంలా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలూ చేశారు. మంత్రి లోకేశ్ కూడా పలు సందర్భాల్లో జగన్ మళ్లీ వస్తే ఏమిటని పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారని.. చెబతూండటం ప్రస్తావనార్హం. ఈ వ్యాఖ్యలన్నింటి ద్వారా స్పష్టమయ్యే విషయం ఒక్కటే.. ఓటమి ఎదురుదెబ్బ నుంచి జగన్ బాగా పుంజుకున్నట్లే అని! ప్రజాదరణ బాగా పెరిగిందీ అని! దీనికి కారణం ఏమిటో కూడా కూటమి నేతలకు బాగానే తెలుసు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతూండటంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. కూటమి నేతలు మాత్రం ఈ మాట చెప్పకుండా, జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అప్రమత్తంగా ఉంటామని అంటున్రాను. తాజాగా పవన్ కల్యాణ్ కూడా సరిగ్గా ఆ దారిలోనే మార్కాపురం సభలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ వారు మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారో తామూ చూస్తామని అన్నారు. అధికారంలో ఉన్న వారు తాము తిరిగి అధికారంలోకి వచ్చేలా పాలన చేస్తున్నామని, మానిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తున్నామని చెప్పగలగాలి. ఏడాది సమయంలో ఏమి సాధించారో చెప్పాలి. కాని ఈ ముగ్గురు నేతలు పెద్దగా వాటి జోలికి వెళ్లడం లేదు. పవన్ కూడా జగన్ టైమ్ లో అభివృద్ది జరగలేదని విమర్శించారు. పవన్‌కు నిజంగా అభివృద్దిపై శ్రద్ద ఉంటే మార్కాపురంలో జగన్ హయాంలో చేపట్టిన వైద్యకళాశాల భవనాలను చూసి ఉండాల్సింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భవనాల నిర్మాణం ఎందుకు ఆగిందో చెప్పి ఉండాలి.అంతేకాదు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాది కాలంగా ఎందుకు పూర్తి చేయలేదు? నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? వీటిపై మాట్లాడకుండా, వైఎస్సార్సీపీ వారు అనని మాటలను వారికి అంటకట్టి సినిమా డైలాగులు చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? పవన్ తరచు సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారట. కొత్త సినిమా ప్రచారం గురించి అప్పడప్పుడు కొన్ని సభలు పెట్టుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కుత్తుకలు కోస్తామని, గూండాగిరి చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పవన్ చెబుతున్నారు. అబద్దాలు చెప్పడంలో టీడీపీ రికార్డును దాటిపోవాలని పవన్ అనుకుంటే ఎవరం ఏమీ చేయలేం. ఈ ఏడాదిలో కూటమికి చెందిన వారు ఎన్ని దాడులు చేశారు? వైఎస్సార్సీపీ వారు ఎంతమంది హత్యలు, దాడులకు గురయ్యారు? తప్పుడు కేసులలో పెట్టి ఎందరిని అరెస్టు చేశారు? అన్నవి పవన్ కు తెలియదా! అయినా.. అధికారంలో ఉన్నప్పుడు అంతా హాపీ అనుకుంటూ పవన్ అనుకోవచ్చు. రాజకీయ విమర్శల వరకు ఓకే. కాని వైఎస్సార్సీపీ వారు అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామని అనడంలోనే అనుమానం కలుగుతుంది. బహుశా గత ఎన్నికలలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లోనూ ఈవీఎంలు తమని గట్టెక్కిస్తాయన్న ధీమానా? ఒక రకంగా ఇది పవన్ కల్యాణ్ బెదిరింపుగానే చూడాలి. రఫ్పా, రఫ్పా అనే డైలాగుకు వక్రభాష్యం చెబుతున్న పవన్ కల్యాణ్ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా దౌర్జన్య పూరితంగా మాట్లాడింది.. అభ్యంతరకరంగా మాట్లాడింది గుర్తు లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని పవన్ చేసిన ఆరోపణపై ఇంతవరకు ఎందుకు నోరు విప్పడం లేదు? ఈ సంవత్సరంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలపై పవన్ ఎన్నడైనా స్పందించారా? ఏమీ చేయక పోయినా, ప్రభుత్వం ఎంత అరాచకంగా ఉన్నా గెలవగలమని వారు భావిస్తున్నారంటే ఈవీఎంల మానిప్యులేషన్ తమ చేతిలో ఉందన్న అభిప్రాయమే కారణమా?. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు ఈవీఎంల అక్రమాలు, ఓట్ల పోలింగ్‌లో జరిగిన అవకతవకలను ఆధార సహితంగా ఎన్నికల కమిషన్‌కు వివరించి వచ్చారు. వారి లెక్కల ప్రకారం పోలింగ్ శాతంలో తేడా వల్ల 87 శాసనసభ నియోజకవర్గాలలో గెలుపు, ఓటములను నిర్దేశితమయ్యాయి. పోలింగ్ ముగిసే టైమ్ కు ఉన్న ఓట్ల శాతం, తదుపరి నమోదైన ఓట్ల శాతానికి ఉన్న తేడా ఏకంగా 12.54 శాతం ఉన్న సంగతిని వారు తెలియ చేశారు. హిందుపూర్, రాయచోటి వంటి నియోజకవర్గాలలో ఓటింగ్ సరళి వ్యత్యాసాలను వివరించారు. అనూహ్యమైన రీతిలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ మార్పులు, ఎన్నికల అధికారులు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించకుండా దాటవేసి, దగ్దం చేసిన తీరు మొదలైనవి చూసిన వారందరికి ఏదో మోసం జరిగి ఉంటుందన్న భావన ఏర్పడింది. ఎక్స్ అధిపతి ఎలన్ మస్క వంటి వారు కూడా ఈవీఎంలను టాంపర్ చేయవచ్చని చెప్పడం కూడా గమనించాలి. ఎవరో ఎందుకు. టీడీపీ ఓటమి పాలైన ప్రతి సందర్భంలోను చంద్రబాబు నాయుడు ఈవీఎంలను తప్పుపట్టారు. వాటి ద్వారా మోసం చేయవచ్చని గతంలో ఆయన స్వయంగా ప్రదర్శనలు చేయించారు.ఇప్పుడు ఆయన మాట్లాడకపోతుండవచ్చు. అది వేరే సంగతి.ఒంగోలు లో వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని అప్పట్లో వైఎస్సార్సీపీలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు చేసిన ప్రయత్నాలను ఎన్నికల సంఘం, అధికారులు అంగీకరించకుండా డ్రామా నడపడం, వీవీప్యాట్ స్లిప్ లను పది, పదిహేను రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి పలు సందేహాలకు అవకాశం ఇచ్చాయి. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కూడా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించాయి. సీపీఎం నేత వి.శ్రీనివాసరావు కూడా ఏపీలో 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు, తాజాగా పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ఎలా గెలుస్తుందో తామూ చూస్తామంటూ చేసిన ప్రకటనలపై కూడా సందేహాలు కలుగుతాయి. ఈవీఓంల మహిమను తక్కువ అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే బాలెట్ పత్రాలనే వాడాలని వైఎస్సార్సీపీతో సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ఎన్నికల సంఘం అంగీకరించకపోతే ప్రజలలో ఈవీఎంలపై అనుమానాలు మరింతగా బలపడతాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు.. ఆన్సర్ ఉందా బాబూ?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎవరివల్ల చెడ్డ పేరు వస్తోంది? అధినేతల లోపాల వల్ల ఎమ్మెల్యేలకు డ్యామేజ్ అవుతోందా? లేక ఎమ్మెల్యేల అక్రమాలు, అలసత్వాలు ప్రభుత్వం పరువును దిగజారుస్తున్నాయా? రెండూ కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే...ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కీలక మంత్రి లోకేశ్‌లు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేసిన భ్రమ కల్పించాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆగ్రహం పెరిగేందుకు కారణమవుతున్నాయి.అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపివ్వడం మంచిదే. ప్రజల్లో తిరిగితే కదా వారి మనోభావాలు, ప్రభుత్వం పనితీరు, రెడ్‌బుక్ హడావుడి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? లేదా? అన్నది తెలిసేది? విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వేధింపులు, అక్రమ అరెస్ట్, నిర్బంధాలతో సామాన్యులకు ఒరిగిందేమిటని కూడా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఏడాది కాలంలో తామోన్నో ఎన్నో విజయాలు సాధించేశామని చంద్రబాబు అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అన్ని విషయాలు తెలిసినా ఆయన చెప్పినదానికి ఊ కొట్టడం తప్ప మరో గత్యంతరం ఉండదు. ముందుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకుని ఆ తర్వాత తొలి అడుగో, మలి అడుగో వేస్తే అదో పద్దతి కాని, అదేమీ లేకుండా తాము బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చిందని, లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి ఎమ్మెల్యేలవే అన్నట్లుగా మాట్లాడితే ఆశ్చర్యం పోవడం తప్ప వేరే ఏమి ఉంటుంది?. 👉ఏడాది కాలం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైనదే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం ఒక ఏడాదిలోనే నెరవేర్చిన హామీలెన్ని? తెచ్చిన సంస్కరణలు ఏమిటి? ప్రజలకు ఎలా ఇళ్ల వద్దే ప్రభుత్వ సేవలు అందించింది అందరికి తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసి ప్రజలను రోడ్లపైకి తెచ్చిందన్నదీ పలువురు ఎమ్మెల్యేల భావన. ఉదాహరణకు జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని చంద్రబాబు ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తాము ఎవరి పొట్టగొట్టబోమని ఊదరగొట్టారు. కానీ.. 👉.. అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారా? లేదా? రేషన్ సరుకులను ప్రజల ఇళ్లవద్దకే చేర్చే వ్యవస్థ గతంలో ఉంటే, ఇప్పుడు దానిని ఎత్తివేశారా? లేదా? ప్రభుత్వ పరంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ రైతు భరోసా కేంద్రాలు వంటివాటిని గ్రామ, గ్రామానా, పట్టణాలలో వార్డు, వార్డులో జగన్ ప్రభుత్వం నెలకొల్పితే వాటన్నిటిని నీరు కార్చుతున్నారా? లేదా ?వారికి ఈ వ్యవస్థలపై నమ్మకం లేకపోతే, మంచివి కావని భావిస్తే ఎన్నికల ముందే ఆ విషయం చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా, అవన్నీ యథాతథంగా కొనసాగుతాయని ప్రచారం చేసి, తీరా పవర్ లోకి వచ్చాక అన్నిటిని నిర్వీర్యం చేస్తే ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందా? లేక చెడ్డ ప్రభుత్వం అవుతుందా?. హామీలపై ప్రజలకు బాండ్లు ఇచ్చారు కదా?. వాటిలో పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మొదటి ఏడాదిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదే! గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చి సరిపెట్టారే. తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఏబై ఏళ్లకే బలహీన వర్గాలకు పెన్షన్ మొదలైన వాటన్నిటికి తొలి ఏడాది ఎగనామం పెట్టారా? లేదా? ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారికి ఇచ్చిన బాండ్ల గురించి ,ఆయా వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే వారందరిని వైఎస్సార్సీపీ వారి కింద జమకట్టి కేసులు పెడతామని బెదిరిస్తారా? ముఖ్యమంత్రే స్వయంగా వైఎస్సార్సీపీ వారు నిలదీయడానికి లేదని, అలా చేస్తే తాట తీస్తామని అనడం దేనికి సంకేతం. రెండో ఏడాదిలో తల్లికి వందనం కొంతవరకు అమలు చేసినా, మొదటి ఏడాది బకాయిల మాటేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పాలి? తల్లికి వందనం ఈ మాత్రం అయినా అమలు అయిందంటే అది జగన్ ప్రభావం వల్లే అన్న సంగతి అందరికి తెలుసు. జగన్ ఎప్పటికప్పుడు దీని గురించి నిలదీస్తున్న ఫలితంగా ఈ స్కీమ్ ఈ మాత్రం అయినా ఇవ్వక తప్పలేదు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలలో వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేసి, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తెగ బాదుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందమని ఎమ్మెల్యేలు అనగలరా? ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారో, లేక ఆయన కుమారుడు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి గురించి ఎవరైనా అడిగితే జవాబు ఏమని చెబుతారు?. 👉మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తూ కాలం గడపాలని చంద్రబాబు సర్కార్ చేస్తున్న యత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరా? జగన్ టైమ్‌లో అప్పుల గురించి అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదిలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించింది కదా! అప్పట్లో 'దాన్ని తనఖా పెట్టారు.. దీన్ని తనఖా పెట్టార"ని ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఏకంగా అప్పులు ఇచ్చేవారికి ట్రెజరీనే తాకట్టు పెట్టి ఘన చరిత్ర నెలకొల్పారే. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అంగీకరిస్తారా? లేక వారిని కోప్పడతారా? వైసీపీ వారు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు అవేమిటో వివరించాలి కదా?. 👉నిత్యం విధ్వంసం అంటూ నిందలు వేసే చంద్రబాబు అదేమిటో ఎన్నడైనా చెప్పారా? కేవలం సినిమా డైలాగులు చెప్పి ప్రజలను మభ్య పెట్టే యోచన కాకుండా వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటారు.అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని ఎమ్మెల్యేలపైకి నెట్టేసి తప్పుకోవాలని చూస్తే వారు గుసగుసలాడు కోకుండా ఉంటారా? 1995 లొ ముఖ్యమంత్రి అయింది మొదలు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేలపై అసంతృప్తి అంటూ లీకులు ఇవ్వడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల వైఫల్యాలు లేవా అంటే చాలానే ఉన్నాయి. అనేక చోట్ల ఇసుక, మద్యం, గనులు, పరిశ్రమలు తదితర లావాదేవీలలో ఎమ్మెల్యేల దందా పై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. వెరసి అటు ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యేలు రెండువైపులా సాగుతున్న దందాల వల్ల ప్రజలు నలిగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలలోకి వెళ్లాలంటే భయం ఏర్పడిన మాట నిజం. కొనమెరుపు ఏమిటంటే కీలకమైన తొలి అడుగు సన్నాహక సమావేశానికి 56 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వారు దుండగులు కాదా?.. టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ల చేసిన ఒక ప్రకటనను అంతా స్వాగతించాలి. హైదరాబాద్ లో ఒక న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని వారు ఖండించారు. కూటమి పెద్దల భావజాలంలో మార్పు వచ్చి ఉంటే సంతోషించాలి. కాని వారు అన్ని విషయాలలో మాదిరి ఇక్కడ కూడా డబుల్ గేమ్ ఆడడం బాగోలేదని చెప్పాలి. చంద్రబాబు చేసిన ప్రకటనను గమనించండి. హైదరాబాద్ లో ఒక టీవీ చానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విద్వంసం సృష్టించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు,సమాజం దీనిని ఆమోదించదని అంటూ,ఆ ఛానల్ యాజమాన్యానికి ,సిబ్బందికి ఆయన సంఘీభావం తెలియచేశారు. 👉చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే అందరికి గుర్తుకు వస్తున్నది ఏపీలో ఉన్న పరిస్థితి గురించే. ఏపీలో తనకు నచ్చని మీడియాపై ప్రభుత్వం చేస్తున్న దాడి, ప్రత్యేకించి సాక్షి మీడియాపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు చూస్తున్న ఎవరికి అయినా చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించదు. తమకు మద్దతు ఇస్తే ఒక రకంగాను, లేకుంటే మరో రకంగాను టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది.👉ఈ మధ్య సాక్షి టీవీ డిబేట్ కు సంబందించి ఒక వివాదాన్ని సృష్టించి కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయించిన తీరు,ఆ తర్వాత కేసులు పెట్టడమే కాకుండా.. జర్నలిస్టులను అరెస్టు చేసిన వైనం, అక్కడితో ఆగకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీకి చెందినవారు చేసిన దాడులు,వీరంగం వేసి విధ్వంసం సాగించిన పద్దతి గురించి కూడా కూటమి నేతలు మాట్లాడి వాటిని ఖండించి ఉండాలి కదా!. పైగా అనని మాటలు అన్నట్లుగా, ఒక ప్రాంతానికి ఆపాదించి సాగించిన రచ్చ అందరిని ఆశ్చర్యపరచింది. సాక్షి సంస్థలపై దాడులకు పాల్పడినవారిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు లు చేయలేదు? అలా చేసినవారు దుండగులు కాదా?వారు టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?ప్రజాస్వామ్యంలో బెదిరింపులు ,దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చెబుతున్న చంద్రబాబుకు ఏపీ విషయంలో అదే సూత్రం వర్తించదా?.. దీనికి ఆయన ఏమి జవాబిస్తారు. నిత్యం సాక్షిపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, ఆ మీడియాను ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచన సాగించే ఆయన తనకు మద్దతు ఇచ్చే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రమే స్వేచ్చ ఉండాలని చెప్పడం సహేతుకమే అవుతుందా?. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.👉సాక్షి డిబేట్లో ఒక పదం అభ్యంతరకరం అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. దానిపై వివరణ కోరవచ్చు. కాని అసలు ఆ పదం పలకని జర్నలిస్టునే అరెస్టు చేశారే!. విచిత్రం ఏమిటంటే డిబేట్లో ఒక విశ్లేషకుడు ఒకసారి ఆ పదాన్ని ఉచ్చరిస్తే, తెలుగుదేశం మీడియా సంస్థలు వందల సార్లు ప్రచారం చేశాయి. అలాగే లక్షల పత్రికలలో దానిని యధాతధంగా ప్రచురించాయి. ఆ విశ్లేషకుడు మాట్లాడింది అభ్యంతరకర పదమే అనుకుంటే దానిని ఎల్లో మీడియా ప్రచారం చేయకూడదు కదా?. కాని ఎందుకు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. వారు చేసింది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా!, మరి వారిపై కేసులు పెట్టరా?దీనిపై ప్రభుత్వంకాని, పోలీసు కాని, న్యాయ వ్యవస్థకాని ఎందుకు స్పందించలేదంటే ఏమి చెబుతాం. హైదరాబాద్ లో దాడికి గురైన టీవీ చానల్ కొన్ని వీడియాలకు పెట్టిన తంబ్ నెయిల్ చాలా దారుణంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు. ఈ అంశాలను టీడీపీ, జనసేన పెద్దలు కనీసం ఖండించలేదు. అయినా ఆ సంస్థపై దాడి చేయాలని ఎవరం చెప్పం. చట్టప్రకారం పోవాల్సిందే. ఏపీలో సాక్షి మీడియా వివరణ ఇచ్చినా అన్యాయంగా దాడులు చేశారే!. సాక్షిపై దాడులు జరుగుతున్నప్పుడు , ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఇష్టారీతిన విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పుడు టీడీపీ మీడియా చంకలు గుద్దుకుంటూ మరింత రెచ్చిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలోప్రభుత్వం.. వాళ్లకు బంధించిన మీడియా కలిసి మరీ నానా బీభత్సం సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యం, బెదిరింపులు, మీడియాను కట్టడి చేయడం వంటి అంశాలు.. చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకదు!!.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రం అంతా గంజాయి కేంద్రం అయిపోయిందని చంద్రబాబు,ఇతర కూటమి నేతలుతీవ్ర విమర్శలు చేసేవారు. అంటే అప్పుడు ఏపీలో ఉన్నవారంతా గంజాయి తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నట్లు భావించాలా?. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు 30 వేల మంది మహిళలు ఏపీలో మిస్ అయిపోయారని ప్రచారం చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా?. అంతెందుకు తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఆరోపించినప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినలేదా?. అయినా ఎవరిపైన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని తమకు అధికారం ఉంది కదా అని విషయాన్ని వక్రీకరించి సాక్షిపై దాడి చేయడం ,కేసులు పెట్టి వేధించడం మాత్రం ప్రజాస్వామ్యబద్దం అని వారు భావిస్తున్నట్లా?. సాక్షిని మాత్రమే కట్టడి చేయాలన్నది వారి అభిమతమా?. అంతెందుకు.. సాక్షి టీవీ చానల్ ప్రజలలోకి వెళ్లరాదన్న ఉద్దేశంతో ఆయా నగరాలలో ,పట్టణాలలో కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి సాక్షి ప్రసారం కాకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మీడియా స్వేచ్చ గురించి నీతులు చెబితే ఎవరైనా నమ్ముతారా?.. చంద్రబాబు కు ఇది కొత్తేమి కాదు. 2014 టైమ్‌లో కూడా కూడా సాక్షితో పాటు మరికొన్ని చానళ్లపై కూడా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో నిషేధం పెట్టారు. అప్పట్లో కాపుల రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే,ఆ వార్తలు ప్రచారం కాకుండా ఎన్నిరకాల ఆటంకాలు కలిగించారో అందరికి తెలుసు. ఈసారి కూడా సాక్షి టీవీతో మరో రెండు చానళ్లపై కూడా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. ఇదీ చంద్రబాబుకు మీడియా స్వేచ్చపై ఉన్న విశ్వాసం. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్న సూత్రం బాగా వర్తిస్తుందా?ఇక పవన్, లోకేష్ లు కూడా టీవీ చానల్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రం మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదని వీరు భావిస్తున్నారన్నమాట.ఏపీలో జర్నలిస్టులను అరెస్టు చేయించి,అదేదో గొప్పపనిగా ఛాతి విరుచుకున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు గుండెలు బాదుకుంటున్నారు. దీనినే హిపోక్రసి అంటారు.అలా అని హైదరాబాద్ లో దాడి ఘటనను సమర్ధించడం లేదు.కాని ఏపీలో కూటమి నేతల తీరుతెన్నులు మాత్రం ఇలా రెండుకళ్ల సిద్దాంతంతో సాగుతుండడమే బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నేటి మాటేమిటి?
వలసానంతర భారత చరిత్రలో అత్యంత ప్రాధాన్యత గల పరిణామమైన ఎమర్జెన్సీకి ఈ జూన్ 25 అర్ధరాత్రికి యాబై ఏళ్లు నిండాయి. ప్రాథమిక హక్కులను రద్దు చేసి ప్రజల హక్కులను కొల్లగొట్టడం, అక్రమంగా నిర్బంధించడం, బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల వంటి ఇష్టారాజ్యపు విధానాలను రుద్దడం, నగర సుందరీకరణ పేరుతో నివాస స్థలాలను కూల్చి వేయడం, అధికార, న్యాయ వ్యవస్థలను సొంత ప్రయోజనాల కోసం దుర్విని యోగం చేయడం భారత రాజ్యానికి కొత్తేమీ కాదు గానీ, ఆ పనులన్నీ జరిగిన ఎమర్జెన్సీకి ఆ స్థాయిలో అపకీర్తి రావడానికి ఒక కారణం ఉంది. అప్పటివరకూ ఆ దమనకాండ అంతా సాధారణ ప్రజల మీద అమలవుతుండినప్పటికీ, ఎమర్జెన్సీయే మొదటిసారిగా మధ్యతరగతికి, తెల్లబట్టలవాళ్లకు, పార్లమెంటరీ రాజకీయ ప్రత్యర్థులకు కూడా భారత రాజ్యపు దెబ్బల రుచి చూపింది. పాఠాలు నేర్చుకున్నామా?ఆ ఎమర్జెన్సీ కాళరాత్రి గడిచిపోయి ఐదు దశాబ్దాలు గడిచింది. ఇందిరా గాంధీతో సహా ఆ కాళ రాత్రికి కారకులైనవారిలో అత్యధికులు మరణించారు. బాధితులలో కూడా చాలా మంది మరణించారు, లేదా తమ జీవితపు చరమాంకంలో ఉన్నారు. ఇప్పుడు ఆ పాత ఎమర్జెన్సీ గురించి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం, విమర్శించడం కేవలం అకడమిక్ ఆసక్తే తప్ప వర్తమాన ఆచరణ కాదు. కాకపోతే ఆ ఎమర్జెన్సీ అనుభవం తర్వాత ఈ దేశం మరెప్పుడూ అటువంటి పరిస్థితి రాగూడదని ఆకాంక్షించింది గనుక వర్తమాన పాలనలను విమర్శనాత్మకంగా చూడటం అవసరం, సముచితం కూడా!ఎమర్జెన్సీ అనంతరం వేలాది పేజీల వివరణలు, విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. బాధితులు ఎవరైనప్పటికీ ఎమర్జెన్సీ అత్యాచారాలకు అటువంటి నిరసన రావడం సముచితమే. ఆ నిరసన వ్యాప్తి వల్లనే 1977 మార్చ్ ఎన్నికలలో ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు ఓటమికి గుర య్యారు. ఆ ఎన్నికల్లో గెలిచిన జనతా పార్టీ ప్రభుత్వం ఎమ ర్జెన్సీ అత్యాచారాలను పరిశో ధించడానికి, విచారణ జరపడా నికి మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ జయంతిలాల్ ఛోటాలాల్ షా నేతృత్వాన 1977 మేలో ఒక కమిషన్‌ను నియమించింది. షా కమిషన్‌గా సుప్రసిద్ధమైన ఈ కమిషన్ అనేకమంది సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలు సేకరించి 1978 మార్చ్, ఏప్రిల్, ఆగస్ట్ లలో మూడు భాగాల నివేదిక సమర్పించింది. వర్తమాన వాస్తవంఆ 543 పేజీల నివేదికను ఇప్పుడు చదువుతుంటే అదేదో గడిచిపోయిన దుర్ఘటనల మీద చారిత్రక పత్రం అనిపించదు. నామవాచకాలు మారిస్తే, గత పదకొండు సంవత్సరాల పాలనా వ్యవహారాల మీద నివేదిక కావ చ్చునని అనిపిస్తుంది. ఈ పాల కులు ఆ ఎమర్జెన్సీ బాధితులు కావడం, ఇప్పటికీ ఆ ఎమర్జెన్సీని నిరంతరం విమర్శిస్తుండటం, తమ పాలనలో పదకొండు సంవత్సరాలుగా అవే ఎమర్జెన్సీ విధానాలను ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అమలు చేస్తుండటం క్రూరమైన పరిహాసం. ‘‘ఆచరణలో, ప్రభుత్వానికి అనుకూలంగా లేని వార్తలను తొక్కిపట్టడానికి, ప్రభుత్వానికి అనుకూ లమైన వార్తలను పైకెత్తడానికి, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు అనుకూలంగా లేని వార్తలను తొక్కి పట్టడానికి సెన్సార్షిప్ విధానాన్ని దుర్వినియోగం చేశారు’’ అని అప్పుడు షా కమిషన్ నివేదిక రాసింది. ఇప్పుడు అధికారికంగా సెన్సార్షిప్ విధానం ఏమీ లేదు. కానీ ప్రభుత్వానికి, అధికార పార్టీకి అనుకూలంగా లేని వార్తలను తొక్కిపెట్టే విధానాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అప్పుడు ఎమర్జెన్సీలో ఆంతరంగిక భద్రతా చట్టం (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్– మీసా), డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ అనే ముందస్తు నిర్బంధ చట్టాలను వినియోగించుకుని, కారణాలు చూపకుండా, విచారణ జరపకుండా లక్ష మందిని ఇరవై ఒక్క నెలల పాటు నిర్బంధించారు. ఇప్పుడు బెయిల్ ఇవ్వడాన్ని కఠినతరం చేసే సవరణలతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఆన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద వేలాది మందిని నిర్బంధించి, అబద్ధపు ఆరోపణలతో, విచారణ లేకుండా ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు. అప్పుడు ఒక్క తుర్క్‌మన్ గేట్ మురికివాడ కూల్చివేత జరిగితే, ఇప్పుడు కనీసం అర డజను రాష్ట్రాల నుంచి కూల్చివేతల వార్తలు నిరంతరం వస్తున్నాయి. ‘‘ప్రభుత్వంలోనో, ప్రభుత్వానికి దగ్గరగానో ఉన్న ఒక వ్యక్తి, లేదా ఒక బృందం వ్యక్తిగత ప్రయో జనాలు నెరవేర్చడం కోసం అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం భవిష్యత్తులో జరగకుండా ఉండే చర్యలను చేపట్టడం వర్తమాన, భావి తరాల కోసం జాతి చేయవలసిన పని’’ అని జస్టిస్ షా 1978లో రాశారు. ఆ హితవచనంలో ప్రస్తావించిన వ్యక్తీ, బృందమూ మారి ఉండవచ్చు గాని నేటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. యాభై ఏళ్లు నిండిన సందర్భంగా చాలా మంది నాటి ఎమర్జెన్సీని సరిగ్గానే తలచు కున్నారు. కానీ కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ సంగతి ఏమిటి? ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు -
ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవే టురంగ శ్రామికుల పని గంటల్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికులు రోజుకు గరిష్ఠంగా 8 గంటలు పని చేసేవారు. కొత్త ఆంధ్ర ప్రదేశ్‌లో దాన్ని 9 గంటలకు పెంచారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 10 గంటలకు పెంచారు. పెట్టుబడుల్ని భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కార్మిక శక్తి చౌకగా లభిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పని గంటల్ని కూడా పెంచితే పరిశ్రమలు నెలకొల్పేందుకు కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ సంస్థల అధినేతలు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని కోరు తున్నారు. వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు, కార్మిక చట్టాలను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.ఇక్కడో విచిత్రం ఉంది. 10 గంటల పనిదినం అనేది ప్రైవేటు రంగ శ్రామికులకు మాత్రమే! ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పనివేళలు 10 నుండి 6 గంటల వరకు 8 గంటల పనిదినంగానే కొనసాగు తాయి. ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది మధ్య వివక్ష చూపడానికి సిద్ధపడింది. ఈ వివక్ష పని గంటలతో మాత్రమే ఆగడం లేదు. జీత భత్యాల్లోనూ అసాధారణ వ్యత్యాసం రూపంలో ఉంది. ప్రైవేటు శ్రామికుల పని గంటలు పెంచిన ప్రభుత్వం కనీస వేతనాలను పెంచాలనే కనీస ఆలోచన చేయలేదు.వారానికి ఆరు రోజులు, రోజుకు 8 గంటలు అనే ప్రమాణానికి అనేక చారిత్రక, సామాజిక, శారీరక ధర్మాల కారణాలున్నాయి. యుక్త వయస్సు దాటిన ప్రతి మనిషి మొదటగా, ఆహారం, నిద్ర, మైథునాల వంటి శరీర ధర్మాల్ని పాటించాల్సి ఉంటుంది. ఆ పిదప కుటుంబం, బంధుమిత్రులు, కళాసాహిత్య, రాజకీయ ఆసక్తుల వంటి సామాజిక ధర్మాలను పాటించాల్సి ఉంటుంది. ఆ తరువాత, బతుకు తెరువు కోసం ఓ వృత్తిని ఎంచుకుని పనిచేయాల్సి ఉంటుంది. వీటిల్లో ప్రతీదీ ముఖ్యమైనదే కనుక ఒక రోజులో ఉండే 24 గంటల్లో ఈ మూడు ధర్మాలకు సమానంగా చెరో 8 గంటలు కేటాయించాలనే ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అయితే, అత్యాశాపరులుగా మారిన కార్పొరేట్ సంస్థల్ని సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు కార్మికుల్ని వేధించడానికి సిద్ధపడు తున్నాయి. ఇదొక అమాన వీయ పరిణామం.ప్రజల సౌకర్యాలను పెంచడానికి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యా, ఆరోగ్య సదుపాయాలు, అల్పా దాయ వర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి సంక్షేమ పథకాలు వగైరాలను ప్రభుత్వాలు నిరంతరం అభివృద్ధి చేస్తుండాలి. వీటికయ్యే ఖర్చును కూడా ప్రభు త్వాలు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తాయి. ఈ వ్యవస్థను నిర్వహించడానికి ఒక కార్య నిర్వాహక వర్గం కూడా కావాలి. దానినే మనం సామాన్య భాషలో ‘ప్రభుత్వ ఉద్యోగులు’ అంటున్నాం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఇది ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల రెవెన్యూ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చుపెట్టేస్తున్నారు. ఏపీ ఎన్జీవో సంఘం 20వ మహాసభలు 2017 నవంబరు 4న తిరుపతిలో జరిగాయి. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ఆర్థిక మంత్రి యన మల రామకృష్ణుడు ఆ వేదిక మీద నుండే ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభు త్వానికి ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న మొత్తం ఆదాయంలో 94 శాతం ప్రభుత్వ ఉద్యోగ జీత భత్యాలు, పెన్షన్లకు సరి పోతున్నదన్నారు.ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రజల నుండి పన్నుల్ని వసూలు చేస్తుంది. అందులో ఓ నాలుగో వంతు (25 శాతం) నిర్వహణ ఖర్చులకు కేటా యించినా 75 శాతం రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చించాలి. కానీ అలా జరగడం లేదు. వసూలు చేస్తున్న పన్నుల్లో 94 శాతం ఉద్యోగుల జీత భత్యాల కోసం పోతోంది. దానితో, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు చేయాల్సి వస్తున్నది.ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత అమ రావతిలో రాజధాని నిర్మాణం మొదలెట్టినపుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌ను వదిలి రావ డానికి సిద్ధపడలేదు. వారి విషయంలో ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని ప్రదర్శించింది. పని దినాల్ని వారా నికి 5 రోజులకు తగ్గించింది. పనివేళల్ని రోజుకు అరగంట తగ్గించింది. వారు రోజూ హైదరాబాద్ నుండి వచ్చిపోవడానికి వీలుగా ఒక ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. 12796 నంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మంగళగిరి వస్తుంది. 12795 నంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5 గంటల 46 నిమిషాలకు మంగళగిరి రైల్వేస్టేషన్లో బయలు దేరు తుంది. మంగళగిరిలో రైలు దిగి 10 గంటల లోపు సచివాలయానికి చేరుకోవడం, అలాగే, ఆఫీసులో 5.30 నిమిషాలకు బయలుదేరి మంగళ గిరిలో ట్రైన్ ఎక్కడమూ అసాధ్యం. కనీసం ఉదయం, సాయంత్రాల్లో అర గంట పని సమయాన్ని తగ్గించా ల్సిందే!సచివాలయ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కలుగ జేసి పదేళ్ళు దాటుతోంది. ఈ సౌకర్యాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ జూన్ 20న కొత్త జీవో ఒకటి జారీ చేశారు. ప్రభుత్వానికి తన ఉద్యోగులంటే ఎందుకింత ప్రేమ, ప్రైవేటు శ్రామికులంటే ఎందుకింత ద్వేషం? ఎవరికయినా రావలసిన సందేహమే!డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులుమొబైల్: 90107 57776 -
సేనాని @20ఏళ్ల పాలేరు.. జన సైనికులకు అరుపులే మిగిలాయా?
శిఖరం ఒకరి ముందు తలవంచదు.. సముద్రం ఎవరి కాళ్లకు సలాం చేయదు అంటూ పెద్ద పెద్ద డైలాగులు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికారం రుచి మరిగి ఇప్పుడు పాలేరుగా పనిచేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ప్రజల తరఫున ప్రశ్నిస్తాను అని చెప్పిన జనసేనని.. ఇప్పుడు ఇంకో 20 ఏళ్లు కూటమిని, ప్రభుత్వాన్ని మోయడానికి తనకి ఎలాంటి భేషజాలు, నామోషి, సిగ్గు లేదని తేల్చేశారు.వైఎస్ జగన్ మీద కడుపుమంట కావచ్చు.. అక్కసు కావచ్చు... ఈర్ష్య.. అసూయ కావచ్చు ఏదైనా కానీ జనసేనాని మాత్రం ఆజన్మాంతం చంద్రబాబుకు, లోకేష్‌కు సేవకుడిగా బతకడానికి తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు రాజకీయంగా ఎలాంటి విజన్, దార్శనికత.. ముందుచూపు, పార్టీ బలోపేతంపై నిబద్ధత లేదని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ ఇచ్చే మూటలు తీసుకుంటూ ఆ పార్టీని గెలిపించడానికి తాను రాజకీయంగా ఎంత నీచనికైనా దిగజారతానని తేల్చి చెప్పేశారు. దీంతో సీఎం అంటూ ఆయన సభల్లో గొంతు వాచిపోయేలా అరిచే ఆయన అనుచరులకు మాత్రం నైరాశ్యం మిగిలింది. నిన్ను గెలిపించడానికి.. సీఎంగా చూడడానికి మేము ఎన్నిసార్లు తెలుగుదేశం వారికి ఊడిగించేయాలి అంటూ వారు తమలో తాము కుమిలిపోతున్నారు.వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ఉన్నంతకాలం లేదా ఆయనకు ఆసక్తి ఉన్నంతకాలం బాబుకే ప్రాధాన్యం ఉంటుంది. అంతే తప్ప కొద్దిపాటి సీట్లు తీసుకుని పోటీ చేసే పవన్ కల్యాణ్‌కు ఎప్పటికీ ముఖ్యపాత్ర దక్కదు. ఢిల్లీ బీజేపీ పెద్దల ఒత్తిడి పుణ్యమా అని ఆయనకు డిప్యూటీ సీఎం అనే నామమాత్రపు పదవిని కట్టబెట్టి కాపుల్లో ఆయనకు ఉన్న పరపతి, ఓటు బ్యాంకును చంద్రబాబు విజయవంతంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం దక్కలేదని.. ప్రోటోకాల్ తగ్గిందని పవన్‌కు ఉన్నంత ఇంపార్టెన్స్ లేదని ఇబ్బంది పడుతున్న లోకేష్ అనధికారికంగా సీఎంగానే వ్యవహరిస్తూ అన్ని పనులు చేస్తున్నారు.మరోవైపు, ఆయనకు ఎలాగైనా డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నాయకుల నుంచి డిమాండ్లు కూడా తెర వెనుక నుంచి చేయిస్తున్నారు. ఇక, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తే వచ్చే ఎలక్షన్ల నాటికి లోకేష్‌ను సీఎం అభ్యర్థిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు పల్లకి మోస్తున్న పవన్ వచ్చే ఎన్నికల్లో లోకేష్ తరఫున పనిచేయాల్సి ఉంటుంది. అంటే లోకేష్ సీఎం కావడానికి కూడా పవన్ బేషరతుగా ఒప్పుకున్నట్లుగా లెక్క.. అంటే తండ్రి కొడుకులకు సేవ చేయడానికి పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినట్లుగా ఇటు కాపు సామాజిక వర్గం ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు. చంద్రబాబు లేకపోతే ఆయన కొడుకు లోకేష్‌కు అయినా సరే ఆయన అడుగులకు మడుగులు నొక్కడానికి పవన్ రెడీగా ఉన్నట్లు మొన్నటి ప్రకటనలతో అర్థమైంది.ఇంకో 20 ఏళ్ల పాటు తెలుగుదేశానికి తాను పాలేరుగా ఉంటానని ఆయన స్పష్టంగా చెప్పేశారు. చంద్రబాబు, లోకేష్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వడానికి అంగీకరించరు. ఎన్నటికీ పవన్ వారి తాబేదారిగా మాత్రమే ఉండాలి అన్నది వారి అభిమతం. నిన్ను సీఎంగా చూడాలని నేను తాపత్రయపడుతుంటే నువ్వు తెలుగుదేశానికి 20 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ తీసుకుని మరి పాలేరుగా పనిచేయడానికి సిద్ధం అవుతున్నప్పుడు ఇక మేమేం చేస్తాం.. అంటూ జన సైనికులు లోలోన కుమిలిపోతున్నారు. -సిమ్మాదిరప్పన్న. -
Israel-Iran: అణుయుద్ధం.. నిజమెంత?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా మెరుపుదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ అర గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పై 22 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అని!. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవేంటో.. ఒక్కటొక్కటిగా చూద్దాం.1.ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి దౌత్యవర్గాల్లో అణుయుద్ధంపై చర్చ జరుగుతూనే ఉంది. దశాబ్దాల తరువాత మధ్యప్రాచ్య పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినపిస్తున్నాయి. అయితే ఆ దారుణం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వాధినేతలు చాలామంది తమవంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. 2.‘‘అణుస్థావరాలపై అమెరికా దాడి యుద్ధం ప్రకటించడమే!’’ అని ఇరాన్ చెప్పడమే కాకుండా.. అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగే ఆలోచన కూడా చేస్తోంది. 1970 నుంచి అమల్లో ఉన్న ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగడం అంటే.. ఇరాన్ తనకు నచ్చినట్టుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలదు. అణ్వాస్త్రాలూ తయారు చేసుకోగలదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) వంటి ఐరాస సంస్థల పర్యవేక్షణను అనుమతించదన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.3. ఇదిలా ఉంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఏ దేశం ఎటువైపున ఉన్నదన్నది కూడా అణుదాడులు జరిగే అవకాశాలను నిర్ణయిస్తుంది. ఇరాన్‌పై అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాలూ ఇరాన్‌కు నేరుగా మిలటరీ సాయం చేసే స్థితికి చేరలేదు. టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరోవైపు భారత్‌సహా అనేక ఆసియా దేశాలు ఇరు పక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరుదేశాలకు సూచిస్తున్నాయి. 4. అమెరికా నిన్న ఇరాన్ అణు స్థావరాలపై బంకర్ బాంబులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఐఏఈఏ ఒక హెచ్చరిక చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇరాన్-ఇజ్రాయెల్ ప్రాంతంలో రేడియోధార్మిక ప్రభావం పెరిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణుస్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలేవీ లేవని ఇరాన్ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా దాడులు జరిగే ముందే ఇరాన్ ఫర్డో స్థావరం నుంచి సుమారు 400 కిలోల యురేనియం (60 శాతం శుద్ధత కలిగినది. ఆయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధమైన యురేనియం 235 అవసరం.)ను అక్కడి నుంచి తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇంకోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్ తన వైఖరిని సమర్థించుకోగా.. వాటిని సార్వభౌమత్వంపై దాడులుగా ఇరాన్ అభివర్ణించింది. మొత్తమ్మీద చూస్తే ప్రపంచం అణుయుద్ధపు అంచుల్లో ఉందని చెప్పలేము. ఇప్పటివరకూ యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలకే పరిమితమై ఉంది. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా, చైనా వంటి అభివృద్ది చెందిన దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో మార్పు లేనంత వరకూ అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువే!. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
ఇంకా బాల కార్మికులా?
ఇప్పటికీ వెట్టి చాకిరీ వలలో చిక్కుకు పోయిన బాల కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, ఇళ్ళలో పని చేస్తున్న నిస్సహాయ బాలల ఆర్తనాదాలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి రక్షించిన వందలాది మంది బాలలు 1998లో నా చుట్టూ అల్లు కున్న సంగతి గుర్తుకొస్తోంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 103 దేశాలను చుట్టి వచ్చిన గ్లోబల్ మార్చ్‌లో నా వెంట వచ్చిన బాలలు నిర్భయంగా చేసిన నినాదాలు కూడా గుర్తున్నాయి. యాత్ర ముగింపులో జెనీవా లోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ప్రధాన కార్యాలయంలో ప్రసంగించవలసిందిగా మమ్మల్ని కోరారు. అక్కడ మేం తక్షణం అమలుపరచవలసిన సరళమైన డిమాండును వినిపించాం: ‘‘చిట్టి చేతుల్లో ఇక ఎంతమాత్రం పనిముట్లు ఉండకూడదు. మాకు పుస్త కాలు, బొమ్మలు కావాలి!’’ నెరవేరని లక్ష్యంఆ యాత్ర చరిత్ర సృష్టించింది. ఫలితంగా, ఐఎల్ఓ 1999లో (182వ) తీర్మానాన్ని ఆమోదించింది. అది బానిసత్వం, మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా వచ్చిన మొదటి అంతర్జా తీయ చట్టం. ఆ తీర్మానాన్ని ఆమోదించిన మొదటి 16 ఏళ్ళలో గణనీయమైన ప్రగతి కనిపించడంతో ఎన్నో ఆశలు చిగురించాయి. బాల కార్మికుల సంఖ్య 2000–2016 సంవత్సరాల మధ్యలో గణనీయంగా 25 కోట్ల నుంచి 15 కోట్ల 20 లక్షలకు తగ్గింది. దాంతో మార్పు తేగలం అనిపించింది. కానీ, అది సరిపోదు. బాలల విష యంలో ప్రతి క్షణమూ విలువైనదే. స్కూలుకు వెళ్ళలేకపోయిన ప్రతి రోజూ ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే లెక్క. ఒక్క నిమిషం బాని సత్వంలో మగ్గినా బాల్యాన్ని కోల్పోయినట్లే లెక్క.ఐరాస 2016లో సతత వికాస లక్ష్యా (ఎస్.డి.జి.)లను నిర్దేశించుకున్నపుడు ఉద్యమాన్ని పునర్జీవింపజేసే అవకాశం వచ్చింది. బాల కార్మికుల నిర్మూలనను ఒక ఎస్.డి.జి.గా చేర్చేట్లు చూసేందుకు మేం ఉద్యమాన్ని చేపట్టాం. అంతర్జాతీయ అభివృద్ధి అజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చితే ఎంతో ఊతం లభిస్తుందని భావించాం. మా కృషి ఫలించింది. ప్రపంచం 2025 కల్లా బాల కార్మిక వ్యవస్థ ఏ రూపంలోనూ లేకుండా చూస్తామని వాగ్దానం చేసింది.గ్లోబల్ మార్చ్‌లో పాల్గొన్నవారిలో పిన్న వయస్కుడు బసు రాయ్. ఆ ఎనిమిదేళ్ళ పిల్లాడిని నా భుజాల మీదకు ఎక్కించుకుని నడిచాను. వాడిది కంచు కంఠం. ‘‘బాల కార్మికులను ఎవరు నిరో ధిస్తారు? మేమే’’ అని నినదించేవాడు. మనం పెట్టుకున్న 2025 గడువు ఇంక కొద్ది నెలల్లో ముగుస్తుందనగా, బసు లాంటి లక్షలాది మంది నుంచి అదే రకమైన గొంతు ఇప్పటికీ వినిపిస్తోందని బరువెక్కిన హృదయంతో చెప్పాల్సి వస్తోంది.ఎస్.డి.జి.లు చేపట్టిన మొదటి నాలుగేళ్ళలో, 2020 వరకు బాల కార్మికుల సంఖ్య 16 కోట్లకు పెరిగింది. అప్పటికి 20 ఏళ్ళలో బాల కార్మికుల సంఖ్య పెరగడం అదే మొదటిసారి. ఒక్క ఆఫ్రికాలోనే రోజూ 10,000 మంది బాలలు బలవంతపు చాకిరీలోకి దిగు తున్నారు. అదే కాలంలో, ప్రపంచం 10 ట్రిలియన్ డాలర్లకు సంప దను పెంచుకుంది. మరో రకంగా చెప్పాలంటే, కనీసం వారానికొక కోటీశ్వరుడు తయారయ్యాడు. ఇది దయారాహిత్యానికి సంకేతం. దీన్ని నిజంగా మనం అభివృద్ధి అనగలమా? కొన్నేళ్ళ క్రితం నేను ఐరాసలో మాట్లాడుతూ, 2025 నాటికి ప్రపంచంలో బాల కార్మికులు లేకుండా చూడగలమని చెప్పాను. కానీ, ‘‘అయ్యా! బాల కార్మిక వ్యవస్థకు అంతం ఎన్నడు?’’ అని ఈ మధ్య ఎవరో నన్ను అడిగి నపుడు నాకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అది హక్కుల సమస్యబాల కార్మికులు లేకుండా చేసే ఉద్యమాన్ని ప్రభావవంతంగా ఎలా మలచాలనే విషయంలో 2016కు ముందు మనం కొన్ని విలు వైన పాఠాలు నేర్చుకున్నాం. ప్రజా ఉద్యమ స్ఫూర్తి, రాజకీయ సంకల్ప బలంతో కూడిన నైతిక నాయకత్వం ప్రగతిని సాధించేందుకు తోడ్పడ్డాయి. చాలా దేశాలు విద్యా రంగంపై భారీగా పెట్టుబ డులు పెట్టాయి. నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన బ్రెజిల్, భారత్, కెన్యా, దక్షిణాఫ్రికా సత్ఫలితాలు చూశాయి. ఎక్కడి నుంచి కూడా బాల కార్మికులు వ్యవస్థలోకి రాకుండా చూడాలని రాజ కీయంగా బలమైన వాణి (ముఖ్యంగా యూరప్, అమెరికా నుంచి) వినిపించడంతో పరిశ్రమలు కూడా తలొగ్గక తప్పలేదు.నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆ రకమైన ఉద్యమ స్ఫూర్తి కొరవడింది. మనం కూడా బాల కార్మికులను ఒక ఉప అంశంగా చూడటం మొదలెట్టాం. దాన్నొక కార్మిక సమస్యగా పరిగణిస్తున్నాం తప్పించి న్యాయాన్ని, మానవ హక్కులను కాలరాస్తున్న సంక్షోభంగా చూడటం లేదు. లోతైన సమస్యలు మరికొన్ని ఉన్నాయి. అనేక పేద దేశాలు (ముఖ్యంగా ఆఫ్రికాలోనివి) అసమంజస పన్నుల వ్యవస్థల్లో, కునారి ల్లజేస్తున్న అప్పుల ఊబిలో, అవినీతి, అవకతవకల పాలనలో, వివిధ వర్గాల మధ్య ఘర్షణల్లో చిక్కుకుపోయాయి. దాంతో ఈ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మరో ప్రమాదకరమైన ధోరణిని గమనించాను. అమెరికాలో 30కి పైగా రాష్ట్రాలు బాల కార్మికుల సంరక్షణ చట్టాలను నిర్వీర్యం చేస్తూ కొత్త సవరణలు తీసుకొచ్చాయి. సభ్యులుగా ఉన్న దేశాల నుంచి నిరసన ఎదురవడంతో, బాల కార్మి కులకు కంపెనీలను బాధ్యులను చేసే చట్టాన్ని యూరోపియన్ యూనియన్ సడలింపజేసింది. బ్రెజిల్‌లోనూ ఆ దిశగా చర్చలు సాగుతున్నాయి. మన పిల్లలు అనుకుంటేనే!అయితే, చిన్నవే అయినా, కొన్ని అర్థవంతమైన చర్యలూ కని పించకపోలేదు. ‘యునిసెఫ్’ ఇటీవల ప్రపంచ బాలల సంరక్షక నిధిని ఏర్పాటు చేసింది. కానీ, ఆ సాయం సరిపోదు. లక్ష్యంలో సుమారు 30 శాతాన్నే ఆ నిధి అందుకోగలిగింది. ప్రపంచ దేశాలు కూడా మునుపెన్నడూ లేనంత ఘర్షణలను చూస్తున్నాయి. యుద్ధ మండలాల్లో జీవిస్తున్న బాలల శాతం 1990ల నుంచి రెండింతలైంది. నేనిది రాస్తున్న సమయానికి 47 కోట్ల 30 లక్షల మంది బాలలు ఘర్షణలు సాగుతున్న చోట్ల నలిగిపోతున్నారు. వాతావరణ సంక్షోభం బడుగు వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇది బాల కార్మి కుల సంఖ్యను పెంచుతూ, పేదరిక, అన్యాయాల వలయాన్ని కొనసాగిస్తోంది. చాలా దేశాలు బాల కార్మికుల సంఖ్యను తగ్గించు కోగలగడం ఒక్కటే ఆశలు మోడువారకుండా చూస్తోంది. బాల కార్మి కులకు వ్యతిరేకంగా ప్రజా గొంతుకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించగల సత్తా భారత్‌కు ఉంది. మనకు పటిష్ఠమైన చట్టాలు, చక్కని సంక్షేమ పథకాలు, రాజ కీయంగా ఏకాభిప్రాయం ఉన్నాయి. పరిశ్రమల నుంచి కూడా ప్రతి ఘటన నామమాత్రంగానే ఉంది. అన్నీ అనువైన పరిస్థితులున్నాయి. కనుక, సత్వర కార్యాచరణకు నడుం బిగించాలి. మొదట చట్టాలను అమలుపరచాలి. కాగితాలకు మాత్రమే పరిమితమైన చట్టాల వల్ల ఉపయోగం లేదు. బాల కార్మికులను వివిధ (విద్య, ఆరోగ్యం, పేదరికం) రంగాలతో ముడిపడిన సమస్యగా చూడాలి. అలాగే, విద్యా రంగంలో పెట్టుబడులు కీలకం. ప్రమాణాలతో కూడిన పాఠ శాల విద్య బాల కార్మికులను చాకిరీ నుంచి విముక్తులను చేయ గలదు. అన్నింటికన్నా ముఖ్యంగా బాల కార్మికులుగా పని చేస్తున్న వారందరూ మన పిల్లలేననే భావన అంకురించాలి. అప్పుడే సమస్య పరిష్కారానికి త్వరపడగలుగుతాం. బాలలకు మెరుగైన ప్రపంచాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.కైలాశ్ సత్యార్థి వ్యాసకర్త నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, సామాజిక కార్యకర్త (‘హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో) -
ధృతరాష్ట్ర పాలన.. ‘మమ్మల్ని ఎవడ్రా ఆపేది!’
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనపాలన ఎలా ఉందో అర్థమవుతోందా? సూచాయిగా బాబుకు రాష్ట్రంలో సీను అర్థమైందా?.. తమ్ముళ్ల అరాచకాలు కనిపిస్తున్నాయా?.. వారిని కంట్రోల్ చేయలేక తమలపాకుతో కొడుతున్నారా? అసలిది ఆయన ప్రభుత్వమేనా.. లేక లోకేష్ మొత్తం పాలనను.. ప్రభుత్వాన్ని హైజాక్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చేస్తున్న పరిపాలనా ?..రాష్ట్రంలో పరిపాలన కన్నా కక్షలు.. కార్పణ్యాలు తీర్చుకోవడమే లక్ష్యంగా పడుతున్న తప్పుబడుగులను బాబు సరిదిద్దే పని చేయడం లేదా? దుర్యోధనుడి మాదిరిగా లోకేష్ అరాచకాలు సాగిస్తుంటే చంద్రబాబు కూడా పుత్రవాత్సల్యంతో దృతరాష్ట్రుడిలా చూడలేకపోతున్నారా ? ఇలాంటి సందేహాలు రాష్ట్రప్రజలను చుట్టుముడుతున్నాయి. గెలిచింది మొదలు లోకేష్ చేస్తున్న ప్రకటనలు, ప్రతిపక్ష నేతలు.. సోషల్‌మీడియా కార్యకర్తలమీద చట్టాన్ని అడ్డంపెట్టుకుని చేస్తున్న దాడులు .. కేసులు బాబుకు లీలగా కనిపిస్తున్నాయా ? వినిపిస్తున్నాయా ? అదే అనిపిస్తోంది.బాబుపాలనకు వచ్చి ఏడాదైన సందర్భంగా పలు ప్రయివేటు జిల్లాల్లో చేపట్టిన సర్వేల్లో ఘోరమైన ప్రజాభిప్రాయం వెల్లడవుతోంది. టీడీపీ నేతల అరాచకాలు.. దొమ్మీలు .. దోపిడీలు బాబు ప్రభుత్వ ప్రతిష్టను ఎలా దిగజారుస్తున్నదీ ఆ సర్వేలో వెల్లడింది.. ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యేలు సైతం పెచ్చుమీరిన అవినీతిలో మునిగితేలియాడుతున్నారు. ఇదంతా ఇంటెలిజెన్స్ .. ఇతర సర్వే సంస్థల ద్వారా బాబు చెవిన పడిందా ?. ఇసుక.. గనులు.. వ్యాపారాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఎమ్మెల్యేలు కార్యకర్తల రుబాబు ఆకాశాన్ని తాకింది. ఈ వ్యతిరేకత అంతా తాజా సర్వేల్లో వెల్లడైంది. అయితే ఇది బాబు దృష్టికి వెళ్లిందని.. అందుకే విశాఖలో యోగా కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అయన కార్యకర్త్తలను సున్నితంగా హెచ్చరించారని అంటున్నారు. గట్టిగా వార్ణింగ్ ఇవ్వలేక సుతిమెత్తగా తమలపాకుతో .. నెమలీకతో కొట్టినట్లుగా మెత్తని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే అయన 'ఎమ్మెల్యేల పని తీరుపై మొన్న సర్వే చేయించా.. ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్.. లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా.. కార్యకర్తలే అధినేత.. ఇది సాధ్యం కావడం కోసం ఎమ్మెల్యేలు పని చేయాలి.. కార్యకర్తల నుంచి నివేదిక తెప్పించుకుంటా.. వాళ్ల మద్దతు లేకపోతే పక్కన పెడతా' అంటూ హెచ్చరికలు చేసారు. ఇలా చెబితే ఎవరు వింటారు.. మళ్ళా ఎవరి దందాల్లో వాళ్ళుంటారు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ టీడీపీ నాయకులు... కార్యకర్తలు తల ఎగరేస్తున్నారు. ::: సిమ్మాదిరప్పన్న -
సీమలోనూ సీను సితారే!
గెలిచి సరిగ్గా ఏడాది కాలేదు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు పదవుల్లో కూర్చుని గట్టిగా సమచ్చరం కాలేదు. అప్పుడే జనాలకు ప్రభుత్వం మీద ఏవగింపు మొదలైంది . వచ్చిన కొత్తల్లోనే ఎక్కడికక్కడ దందాలు.. రౌడీయిజం వంటివి మొదలెట్టి ఇదీ మా బ్రాండ్.. ఇదీ మా స్టైల్ అని చెప్పుకునే విధంగా అడుగులు మొదలెట్టారు. దీంతో ప్రజల్లో వీళ్ళు ఏదో చేస్తారు?.. అనుకుంటే చివరకు రౌడీయిజం చేస్తున్నారా అనే అభిప్రాయాలూ మొదలయ్యాయి. తెలుగుదేశానికి మొదట్నుంచి పట్టున్న జిల్లాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా ప్రజలకు ఏదో చేస్తాం.. పథకాలిస్తాం.. ఉద్యోగాలిస్తాం.. పారిశ్రామిక ప్రగతి చేసి చూపిస్తాం అంటూ ఘనంగా చెప్పుకుని వచ్చిన ఈ నాయకులు. వస్తూనే రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక్కో పేజీలో ఎవరి పేర్లు ఉన్నాయి.. వారిలో అధికారులు ఎవరు ? వైఎస్సార్సీపీ నాయకులూ ఎవరన్నది ఏరుకుని మరీ టార్గెట్ చేసి కేసులు పెట్టడం.. లొంగనివారిపై.. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించడం వంటి పనులు తప్ప ప్రజలకు పనికొచ్చేది ఏమీ చేయలేదన్న అభిప్రాయం మొదలైంది. దీంతోబాటు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు చేయడం.. ఆలయాల్లో విధ్వంసాలు.. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇంకా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు.. ఇలాంటి అవలక్షణాలు తప్ప కాన్ఫిడెంట్ గా ప్రభుత్వాన్ని నడిపే పనిలో లేకపోవడాన్ని ప్రజలు గ్రహించారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత లోలోన నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. బయటకు అందరూ ఆహా.. ఓహో అని అంటున్నా.. ప్రజల్లో మాత్రం ఇది ఉత్త డబ్బారాయుడి ప్రభుత్వం అనే అభిప్రాయం గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో.. మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన స్థానాల్లో సైతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్ల అబ్బే.. ఏదో అనుకున్నాం.. ఏం లేదు అనే భావన వినిపిస్తోందని అంటున్నారు. బాబు పాలన ఏడాదైన సందర్భంగా కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవానికి వైయస్ జగన్‌కు గట్టిపట్టున్న రాయలసీమలో కూడా 2024 ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 52 సీట్లున్న పూర్వపు రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూటమికి 45 స్థానాలు దక్కాయి. వైఎస్సార్సీపీ కడపలో 3, చిత్తూరు.. కర్నూలులో రెండేసి చొప్పున మొత్తం ఏడు స్థానాల్లోనే గెలిచింది. అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది సర్వేలు చెబుతున్నాయి. సీమలో గెలిచినా 45 మందిలో పట్టుమని పదిమందికి కూడా ప్రజల్లో పట్టు చిక్కలేదు. అందుకే ఏకంగా 33 మందిమీద తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందులో 29 మంది ఎమ్మెల్యేలకు అయితే అనవసరంగా వీళ్ళను ఎందుకు గెలిపించామురా దేవుడా అని ప్రజలు లోలోన బాధపడుతున్నారట. వాళ్ళు మళ్ళీ గెలవడం అసాధ్యమని ప్రజలు చెబుతున్నారు. ఇక ఇటు వైసిపి నేతలు.. ఓడిపోయినా ఎమ్మెల్యేలమీద ప్రజలకు గురికుదిరిందని.. వాళ్ళుంటేనే బావుణ్ణని ప్రజలు అనుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. మొత్తానికి చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలుగా నిలిచిపోతారని అంటున్నారు. అధికారం వచ్చింది సొంత ఆస్తులు పెంచుకోవడానికి అనే భావనలో ఉన్న నాయకులకు గడ్డుకాలమే అని అంటున్నారు.- సిమ్మాదిరప్పన్న -
ఈ అశక్తతలు దేనికి చిహ్నం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వరుసగా కనిపిస్తున్న అశక్తతలు దేనికి చిహ్నం? ఆయన జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ 140 రోజులలో ప్రకటించిన విధానాలను, తీసు కున్న చర్యలను, వాటి పర్యవసానాలను పరిశీలించినప్పుడు, వాటిలో దాదాపు అన్నింటా తన అశక్తతలే కనిపిస్తాయి. మరొక మాటలో వైఫల్యాలు. అయితే ఆ అశక్తతలు, వైఫల్యాలు వ్యక్తిగతంగా ట్రంప్‌కు పరిమితమైనవా, లేక అమెరికా మహా సామ్రాజ్యమే క్రమంగా బలహీనపడుతున్న స్థితికి సంకేతాలా అన్నది ఆలోచించవలసిన విషయం. ఒకవేళ ట్రంప్‌కు పరిమితమైన స్థితి అయితే ఇంకా మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అందుకు సవరణలు చేసుకోగల అవకాశం ఉంటుంది. అవి ఆ వ్యవస్థకే మౌలిక బలహీనతలు అయ్యే పక్షంలో సవరణలు తన కాలంలో సాధ్యపడకపోగా, ఆ తర్వాత రాగల అధ్యక్షులకు కూడా అతి పెద్ద పరీక్షలు ఎదురవుతాయి.తగిన భావజాలం ఏది?విధానాలు, చర్యలలో అంతర్గతం, విదేశీయం అని రెండు ఉంటాయి. ఎప్పుడైనా విదేశాంగ విధానాలు అంతర్గత ప్రయోజనాల కోసమేనన్నది తెలిసిందే. ఆ విధంగా చూసినపుడు ట్రంప్ విధానాలకు ఆధారమైనవి ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు. వీటిలో ప్రతిఫలించే ఆలోచన అమెరికా తన ఒకప్పటి గొప్పతనాన్ని కోల్పోయిందని! అందుకు బాధ్యత డెమోక్రాట్ల పరిపాలన అని! అమెరికా విధానాల వల్ల అమెరికన్ ధనిక వర్గాలు, ఇతర దేశాలు విపరీతంగా లాభపడుతుండగా సామాన్యులు నష్టపోతూ అమెరికా వెనుకబడుతున్నదనీ; సామాన్యులు, అలాగే తమ దేశం బాగుపడే విధానాల వల్లనే తిరిగి ‘అమెరికా ఫస్ట్’ కాగల దన్నది ఆయన తర్కం.ఇది యథాతథంగా సహేతుకమైన, ఆహ్వానించదగిన తర్కంగానే కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా అనుసరిస్తూ వచ్చిన పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విధానాలను, వాటి ఆధారంగా నిర్మితమైన వ్యవస్థను రద్దు చేయటం కాకున్నా ఒక మేర సవరించాలన్నా మామూలు విషయం కాదు. రద్దు చేయాలన్నది ట్రంప్ ఆలోచన ఎంతమాత్రం కాదు. అంతర్గతంగా, విదేశీయంగా కొన్ని మార్పులు చేయాలని మాత్రం అనుకున్నట్లు ఆయన మాటలు, చేతలు సూచించాయి. ఆ కొద్దిపాటి మార్పులకైనా తగిన ఫిలసాఫికల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. కానీ ట్రంప్ ప్రధానంగా ఉద్వేగాల వ్యక్తి. ఉద్వేగతలకు లోతు ఉండదు, చంచలత ఉంటుంది.అమెరికా మహా సామ్రాజ్యపు శక్తి ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడటం ఈ 21వ శతాబ్దపు ఆరంభం నుంచే నెమ్మదిగా మొదలై, 2008 నాటి ఆర్థిక సంక్షోభంతో వేగం అందుకున్నది. అమెరికా ‘గ్రేట్‌నెస్’ పోవటమని ట్రంప్ అన్నదానికి ఆరంభాలు అప్పటి దశాబ్దం నుంచే కనిపిస్తాయి. అమెరికా బలాలు నాలుగింటిలో ఆర్థికం, రాజకీయం రెండు గాక, సైనికం, శాస్త్ర – సాంకేతికం మరొక రెండు. ఈ చివరి రెండింటిలో అమెరికా శక్తి ఆర్థిక, రాజ కీయాలవలె తగ్గలేదు గానీ, ఆ రెండు రంగాలలో ఇతరుల నుంచి పోటీలు పెరగసాగాయి. అనగా అమెరికాకు అవి పరోక్ష బలహీనత లన్నమాట. దెబ్బకొట్టిన నిర్ణయాలుట్రంప్ తమ దేశాన్ని మళ్లీ ‘గొప్పది’ చేయదలచుకుంటే, ఈ నాలుగు బలహీనతలను ఆపటం ఏ విధంగాననే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. ఒకవేళ ఉన్నా కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఎదుర వుతాయి. వాటిలో మొదటిది–చరిత్రలో ఏ సామ్రాజ్యాలూ శాశ్వతంగా నిలవనపుడు అమెరికా అందుకు భిన్నం కాగలదా అన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వాలకు స్వీయ ప్రయోజ నాల స్పృహలు పెరుగుతూ, ఎవరి దారులు వారు వెతుక్కుంటూ, వాటిలో కొన్ని గణనీయంగా అభివృద్ధి చెందుతూ, అమెరికా, యూరప్‌ల పట్ల గత విధేయతలు బలహీనపడుతూ, బహుళ ధ్రువ ప్రపంచం క్రమంగా ఆవిష్కారమవుతున్నపుడు, అమెరికాకు గానీ, అమెరికన్ కూటమికి గానీ ఒకప్పటి ‘గొప్పతనం’ తిరిగి ఎట్లా సాధ్యమన్నది మరొక ప్రశ్న. అంతెందుకు, ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాము అధికారానికి వచ్చిన కొత్తలోనే, ‘ఏకధ్రువ ప్రపంచమన్నది గతించిన విషయ’మన్నారు.ఈ విధమైన బలహీనతలు అర్థమవుతూ, అదే సమయంలో అమెరికాను కనీసం ఉన్న స్థాయిలో నిలబెట్టాలని, అట్లాగే అక్కడి సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా రూపొందించాలని కొత్త అధ్యక్షుడు భావించితే, అందులో ప్రశంసించదగినదే తప్ప కొట్టివేయ వలసింది ఉండదు. ఆ విధంగా ఆయన ఒక వాస్తవవాది అను కోవాలి. అందుకు తగిన ఆచరణ ఏమిటన్నది అసలు ప్రశ్న. దిగుమతి సుంకాలను అన్ని దేశాలపై పెంచితే ఆదాయం భారీగా పెరిగి వాణిజ్య లోటు, ద్రవ్యలోటు, అప్పులు తగ్గుతాయనీ, ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చుననీ భావించారు. అందుకు తోడుగా అనేక రూపాలలో వ్యయ నియంత్రణ చేయ బూనారు. ఉద్యోగాల కోత, విదేశీ సహాయాల ఆపివేత వంటివి అందులో ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యమైన సుంకాల హెచ్చింపు వెంటనే గందరగోళంలో పడింది. ఉద్యోగాల కోత తీవ్రమైన వ్యతి రేకతను తెచ్చిపెట్టింది. స్టాక్ మార్కెట్లు వరుసగా దెబ్బతినగా,బాండ్ల మార్కెట్ ఎదురుతిరిగి, డాలర్ విలువ పడిపోవటం మొదలైంది. అమెరికా ప్రజలకు, పరిశ్రమలకు అవసరమైన వాటిపై ఇతర దేశాలు ఎదురు సుంకాలు విధించటంతో ధరలు పెరగ సాగాయి. ఈ పరిణామాలతో జంకిన ప్రభుత్వం సుంకాల వాయిదాలు, తగ్గింపులు, చర్చల మార్గానికి మళ్లింది. ఇదే ఇప్పటికీ కొనసా గుతున్నది. ఉద్యోగాల కోత, అక్రమ వలసదారులను భయపెట్టి వేలకు వేలుగా పంపివేయటం వల్ల ఉత్పత్తి, సర్వీస్ రంగాలు దెబ్బ తినటం వెంటనే కనిపించింది. అది గ్రహించి యజమానులకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వబూనినా ఉపయోగం లేకపోయింది. ఉక్రెయిన్ వైఫల్యంఆ విధంగా కొన్ని వారాలు గడిచేసరికి ఆ గందరగోళం స్వదేశంలో, విదేశాలలో కూడా అందరికీ అర్థమై ట్రంప్ పట్ల గౌరవం, భయం తగ్గాయి. పరిపాలనా వ్యవహరణలు అస్తవ్యస్తంగా మారటంతో సన్నిహిత సలహాదారులను తొలగించటం కూడా మొదలైంది. ఎలాన్ మస్క్ ఉదంతం తాజా ఉదాహరణ. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు కొత్తగా వినవస్తున్నది. యూనివర్సిటీలు, విద్యా శాఖ, పరిశోధనా సంస్థలు, ఆరోగ్య రంగాలను వేధిస్తూ అమెరికాను తిరిగి గొప్పదిగా ఎట్లా చేయగలరన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి వేసేందుకు నిజంగానే ప్రయత్నించినా అది ఆగకపోగా తీవ్రమవుతున్నది. దానితో ఆయన చేతులెత్తేశారు. గాజా పట్ల గందరగోళం. నెతన్యాహూ తనను ఏ విషయంలోనూ లెక్క చేయటం లేదు. ఉక్రెయిన్, యూరప్ తమ దారి తాము చూసు కుంటున్నాయి. ఇరాన్ లొంగి రావటం లేదు. సిరియా, లెబనాన్‌పై దాడుల నిలిపివేతకు నెతన్యాహూ అంగీకరించటం లేదు. చైనాతో పాటు ‘బ్రిక్స్’ దేశాలు ట్రంప్ ఎంత భయపెట్టినా తమ కూటమిని మరింతగా విస్తరిస్తూ, డాలర్‌కు బదులు తమ స్థానిక కరెన్సీలలో చెల్లింపులను పెంచుతూనే ఉన్నాయి. మౌలిక స్థాయిలో, విస్తృత స్థాయిలో ఈ అమెరికన్ సామ్రాజ్యవాద బలహీనతలు ట్రంప్ ధోరణి వల్ల మరింత పెరుగుతున్నాయి. తన అశక్తతలు ఈ మౌలిక స్థితికి చిహ్నాలవుతున్నాయి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
తప్పు చేసినా అడగొద్దంటే ఎలా?
ఆరోపణలు ఉంటే విచారించి కోర్టుకు హాజరుపరచడం.. శిక్ష పడేలా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ బాధ్యతను మరచినట్టున్నారు. తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలు ఝళిపించిన ఘటన గురించే ఈ ప్రస్తావన. పోలీసుల తీరు ఎలా ఉందంటే.. ‘‘దౌర్జన్యం చేసినా మమ్మలను ఎవరూ ప్రశ్నించకూడదు!.. రోడ్లపై ఎవరినైనా కొట్టే అధికారం మాకుంది’’ అన్నట్టుగా ఉంది!!. ఇప్పటికే.. టీడీపీ నేత, మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో మసకబారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట తెనాలి ఘటనతో మరింత దిగజారింది! పోలీసుల దౌర్జన్యానికి బలైన యువకులపై ఉన్న నేరాభియోగాలను సమర్ధించడం లేదు కానీ.. నిందితులను ఇలా నడిరోడ్డుపైనే కొట్టడం మొదలుపెడితే అది వారితో మాత్రమే ఆగదు. సామాన్యులపై కూడా ఇష్టారీతిన దౌర్జన్యానికి దారితీస్తుందన్నది గుర్తించాలి. 👉తెనాలిలో మానవ హక్కులను ఉల్లంఘించి(Tenali Incident Human Rights Violation) మరీ జరిగిన దాష్టీకంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నలు సంధిస్తే తట్టుకోలేని అధికారపక్షం, ఎల్లోమీడియా.. జగన్ నేరస్తులకు అండ అంటూ వక్రీకరిస్తోంది. పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. తప్పు చేసిన పోలీసులపై చర్య తీసుకోవల్సిన హోం మంత్రి అనిత వారి దుశ్చర్యలకు మద్దతిస్తూ మాట్లాడడం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్న పాలనకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 👉చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని పర్యటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సొంతపార్టీలో ఒకవర్గమే ఇంకో వర్గం నేత వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినా మృతుడి అంత్యక్రియలకు హాజరవడం వీటిల్లో ఒకటి. హత్యకు కారణం కూడా అక్రమ దందాలే!. అలాంటి పలు ఆరోపణలు ఉన్న వ్యక్తి హత్యకు గురైతే చంద్రబాబు, ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేశ్, హోంమంత్రి వారి ఇంటికి పరామర్శకు వెళ్లారు. అది దేనికి సంకేతం? నేరాభియోగాలకు గురైన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి నేత మద్దతు ఇచ్చినట్లు కాదా?. 👉తెనాలిలో పోలీసులు కొట్టిన ముగ్గురు యువకులపై కేసులు ఉంటే ఉండొచ్చు. వాటిల్లో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయనీ వార్తలున్నాయి. ఒక యువకుడిపై కేసులే లేవు. అయినా ఒక కానిస్టేబుల్ పై దాడి చేశారన్న కేసులో వీరిని నడిరోడ్డుపై హింసించారు. ఇదెక్కడి పద్ధతి?. విపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా హత్యకు గురైన చంద్రయ్య అనే కార్యకర్త పాడెను చంద్రబాబు మోశారు. వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టి లబ్ది పొందే యత్నం చేశారు. మరి అది సరైనదేనా?. ఈ చర్య ఫ్యాక్షనిస్టులకు మద్దతు ఇచ్చినట్లా కాదా? పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తల రౌడీయిజానికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీస్ వ్యాన్ దగ్ధమైంది. అక్కడే ఉన్న చంద్రబాబు టీడీపీ వారిని వారించారా? కనీసం ఆ కానిస్టేబుల్ పట్ల సానుభూతి చూపారా? అదేమీ చేయలేదే. అంటే రౌడీయిజంకు అండగా చంద్రబాబు నిలబడ్డారని ఒప్పుకుంటారా?. 👉2014-19 మధ్యకాలంలో ఇసుక అక్రమ తవ్వకాన్ని అడ్డుకున్నందుకు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వనజాక్షి అనే ఎమ్మార్వోపై దౌర్జన్యం చేశారు. అప్పుడు చింతమనేనిని మందలించకపోగా, వనజాక్షిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసి రాజీ పడాలని చెప్పారు. అంటే చంద్రబాబు అప్పుడు ఇసుక మాఫియాకు అండగా నిలబడినట్లే కదా?. ఇటీవలికాలంలో ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్షంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గురజాల వద్ద హరికృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను స్థానిక సీఐ, టీడీపీ నేత వాహనంలో తరలించడమే కాకుండా, అతనిని తీవ్రంగా హింసించారు. ఇలా అనేక ఘటనలలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోంది. అలాంటప్పుడు జగన్ వాటిపై స్పందించకుండా ఎలా ఉంటారు? పోనీ ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకుంటున్నారా? అదేమీ లేదు. పైగా వారికి అండగా ఉంటున్నారు. 👉బలం లేకపోయినా పలు మున్సిపాల్టీలలో, కార్పొరేషన్లలో బలవంతంగా తమ అధీనంలోకి తీసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ కిడ్నాప్ వంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు వారిని వారించలేదు. పైగా వారికి అండగా కనిపించారు. విశాఖపట్నం, తిరువూరు, తిరుపతిలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.ఇక ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నా, ఎవరిపై పోలీసులు చర్య తీసుకోవడం లేదు. జమ్మలమడుగు, పిడుగురాళ్లల వద్ద సిమెంట్ కంపెనీలు మూతపడేలా ఎమ్మెల్యేలే ప్రవర్తిస్తే పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా?. శ్రీకాకుళం వద్ద తమకు రెడీమిక్స్ ఉచితంగా సరఫరా చేయాలని, నిర్దిష్ట మొత్తం లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలు జరిగాయి. జమ్మలమడుగు వద్ద ఇద్దరు నేతలు బహిరంగంగా గొడవపడితే నో కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 👉జగన్ ప్రభుత్వ కాలంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చంద్రబాబు, ఎల్లో మీడియా విపరీతమైన హడావుడి చేసేవి. విశాఖలో మద్యం తాగి రోడ్డుపై నానా రగడ చేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేతులు వెనక్కి పెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళితే.. ‘‘దళితుడిపై అఘాయిత్యమా?’’ అని ప్రచారం చేశారు. తెనాలిలో ఇంత బహిరంగంగా దళిత, ముస్లిం యువకులను పోలీసులు కొడితే మాత్రం తప్పు కాదట!. రాజమండ్రి వద్ద ఏదో ఒక అభియోగంపై ఒక వ్యక్తికి శిరోముండనం చేయించిన పోలీసును అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. అయినా టీడీపీ దీనిపై నానా యాగీ చేసింది. తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో ఉండగా... ఎంపీడీవోతో దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగానే జగన్ ప్రభుత్వం ఆయనపై కేసుకు ఆదేశించింది. అప్పట్లో ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కోటంరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం గత టర్మ్‌లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఆయనపై చంద్రబాబు, లోకేశ్‌లు పలు నిందారోపణలు చేశారు. క్లబ్‌లు నడుపుతున్నారని, భూ కబ్జాలు చేశారని ఇలా అనేకం చెప్పారు. తీరా ఎన్నికల సమయానికి కోటంరెడ్డిని, గుమ్మనూరును తమ పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చారు. ప్రస్తుత డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా తెనాలి ఘటనలో పోలీసుల చర్యను సమర్థించడం విస్మయం కలిగిస్తుంది. ఒకపక్క తనపై వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు అరెస్టు చేసి 125 సార్లు కొట్టారని చెబుతూ, మరో పక్క తెనాలిలో నిందితులను పోలీసులు కొట్టడాన్ని ఎలా సమర్థిస్తారు?. తెనాలి యువకులు నేరం చేసి ఉంటే అది ఆ ఊరికే పరిమితం. కానీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ అంటూ రోజూ టీవీల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఇందులో ఎవరిది పెద్ద తప్పు, ఎవరిది చిన్న తప్పు అన్నది ఆలోచించుకోవాలి. ఎవరినైనా పోలీసులు కొట్టడాన్ని సమర్థించరాదు. నిజానికి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలీసులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారనే అభిప్రాయం ఉంది. అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శ ఉంది. తిరుమల శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే ఒక్క పోలీసుపై కూడా చర్య తీసుకోలేదు. రాజమండ్రిలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందితే ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. ఒకరిపై చర్య తీసుకుంటే అది తన మెడకు కూడా చుట్టుకుంటుందన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. చంద్రబాబు పాలనలో అయితే ప్రలోభాలు పెట్టడం, లేకపోతే పోలీసులను ప్రయోగించి అరాచకంగా పాలించడం సర్వ సాధారణమేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ తెనాలి వెళ్లడంపై విమర్శలు చేస్తున్న హోం మంత్రి అనిత తన ధర్మం ఏమిటో విస్మరించి పోలీసులు చేసిన హింసను సమర్ధిస్తూ మాట్లాడడం అంటే ఈమె చేతిలో ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అంతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్ కల్యాణ్‌లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్‌కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్‌ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోర్టులోనూ అమెరికాది అదే పాట!
భారత్–పాకిస్తాన్లను ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరింపజేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టముకు వేసుకోవడంపై ఏర్పడిన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఆయన మాటల్లో వాస్తవం లేదని భారత్ చెబుతున్నా, ట్రంప్ మాత్రం తాను శాంతి దూతగా వ్యవహరించినట్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ‘‘ఈ ఒప్పందం కుదర్చగలగడం నాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే, బులెట్లకు బదులు వాణిజ్యం ద్వారా భారత్–పాకిస్తాన్లను దారికి తేగలిగాను. ఆ రెండింటి మధ్య ఘర్షణ అణ్వస్త్ర యుద్ధంగా పరిణమించకుండా ఆపగలిగాను’’ అని ట్రంప్ మే 30న ప్రకటించారు. నేనే శాంతిదూతను!మే 10న ప్రకటించిన కాల్పుల విరమణ సందర్భంగా ఆయన చెప్పిన మూడు అంశాల సారాంశంగా ఈ వ్యాఖ్య నిలుస్తోంది. ఒకటి – తానే పెద్దమనిషిగా వ్యవహరించినట్లు చెప్పుకోవడం. రెండు – ఘర్షణ అణు యుద్ధంగా మారగల అవకాశం ఎంతైనా ఉందని భావించడం. మూడు – రెండు దేశాలతోను వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటానని తాను హెచ్చరించినట్లు చెప్పడం. ఆ విధంగా రెండు దేశాలను కాల్పుల విరమణకు అంగీకరించేట్లు చేయడం. పాకిస్తాన్‌కు చెందిన సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) భారత్‌లోని తన సహచరునికి మే 10న ఫోన్ చేసిన తర్వాతనే దాడి ప్రతిదాడులు ఆగాయని భారత్ ప్రకటించింది. ఘర్షణ సంప్రదాయ చట్రం లోపలికే పరిమితమైందనీ, అణ్వస్త్రాన్ని బయటకు తీస్తాననే సంకేతం పాక్ నుంచి ఏమీ రాలేదనీ కూడా భారత్ తేటతెల్లం చేసింది. ‘‘ఆపరేషన్ సిందూర్ మే 7న మొదలైనప్పటి నుంచి, కాల్పులు, సైనిక చర్యను నిలిపివేయాలని మే 10న ఒక అవగాహనకు వచ్చేంత వరకు, మారుతూ వస్తున్న సైనిక పరిస్థితులపై భారత్–అమెరికా నాయకుల మధ్య సంభాషణలు కొనసాగుతూ వచ్చాయి. ఈ మాటల్లో వాణిజ్య అంశం ప్రస్తావనకు రానేలేదు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మే 13న చెప్పిన సంగతి గమనార్హం. కాల్పుల విరమణ కుదిర్చేందుకు ట్రంప్ వాణిజ్య అంశాన్ని లేవనెత్తారని అమెరికా వాణిజ్య మంత్రి హవర్డ్ లట్నిక్ ఒక అమెరికన్ కోర్టులో వాఙ్మూలం ఇచ్చిన సంగతిని మే 29న జైస్వాల్ దృష్టికి తెచ్చినపుడు, ‘‘కోర్టు ఉత్తర్వును కూడా మీరు చూసే ఉంటారు’’ అని ఆయన జవాబిచ్చారు. తర్వాత, జైస్వాల్ తాను మే13న చేసిన వ్యాఖ్యలనే పునరుద్ఘాటించారు. కోర్టు ఉత్తర్వు గురించి ప్రస్తావించడంలో ఆయన తొందరపడ్డారనిపించింది. ఎందుకంటే, అమెరికాలోని మరో పైకోర్టు అదే రోజు (మే 29)న దిగువ కోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. ఆ అధికార ప్రతినిధి భారత్ వైఖరిలోని సత్యసంధతను నిరూపించేందుకు దిగువ కోర్టు నిర్ణయంపై ఆధారపడకుండా ఉండాల్సింది. ఇంకో ఆరు దేశాలు!వివిధ దేశాలు జోక్యం చేసుకున్న ఫలితంగా కాల్పుల విరమణ సాధ్యమైందని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్ సైనిక దళాల సంయుక్త కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా, గత వారం సింగపూర్‌లో సాగిన షాంగ్రి–లా డైలాగ్ సందర్భంగా, ఆరు దేశాల పేర్లను ప్రస్తావించారు. అవి – అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, తుర్కియే, చైనా. తాను కుదిర్చిన ఉత్తమ ‘ఒప్పందానికి’ మొత్తం ఘనత తనదేనని చెప్పుకుంటున్న ట్రంప్‌కు ఆ మాటలు ఇంపైనవి కావని వేరే చెప్పనవసరం లేదు. ఈ ఘర్షణ సంప్రదాయ చట్రం పరిధిని మించగల ప్రమాదం ఉందని ఇస్లామాబాద్ అనలేదు. జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులు తగినంత సమయాన్ని వెచ్చించకపోతే, భారత్ చలన శక్తి, పరస్పర అణ్వాయుధ ప్రయోగాలకు దారితీయగల అవకాశముందని తనకున్న సాధారణ ఆందోళనను పాక్ ఈ సందర్భంగా పునరు ద్ఘాటించింది. ఘర్షణలను నిలిపివేయకపోతే వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తానని బెదిరించినట్లు ట్రంప్ చెప్పుకోవడంపై పాకిస్తాన్ ఏ విధమైన వ్యాఖ్యా చేయలేదు. మరోవైపు పాకిస్తాన్–అమెరికాల మధ్య వాణిజ్య చర్చలకు రంగం సిద్ధమైంది. వాణిజ్యానికి సంబంధించి భారత్ సంవేదనలపై ట్రంప్ ప్రభుత్వం ఎందుకంత ఉపేక్ష వహించినట్లు? పైగా, లట్నిక్ ఒక అమెరికా కోర్టుకు మే 23న సమర్పించిన అఫిడవిట్లో కూడా దాన్ని ఎందుకు చేర్చినట్లు? ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానాలకు ఎదురవుతున్న చట్టపరమైన సవాల్‌కు సంబంధించిన కేసు అది.అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐ.ఇ.ఇ.పి.ఏ.) అని అమెరికాలో ఓ చట్టం ఉంది. దానికింద, ట్రంప్ సుంకాల విధా నాలను సమర్థించుకుంటున్నారు. సాంకేతికంగా చూస్తే, లట్నిక్ ఒక డిక్లరేషన్ ఇచ్చినట్లే లెక్క. ‘‘అంతకుముందు పేర్కొన్న మాటలు సత్యమైనవి, సరైనవి’’ అని ఆయన ప్రకటించారు. కాల్పుల విరమణను అమలులోకి తెచ్చేందుకు వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నట్లు ట్రంప్ చేసిన లాంటి రాజకీయ ప్రకటనను ఒక దేశం లీగల్ డాక్యుమెంట్‌గా మార్చడం కనివిని ఎరుగనిదని నా దౌత్యపరమైన అనుభవం సూచిస్తోంది. దీని వల్ల ట్రంప్ చెప్పుకుంటున్న గొప్పను అమెరికా కాదనలేని అనివార్య స్థితి ఏర్పడుతోంది. ట్రంప్ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. తరచూ తన ప్రకటనలకు తానే విరుద్ధంగా మాట్లాడు తూంటారు. కానీ, లీగల్ డాక్యుమెంట్‌ను తారుమారు చేయడం కుదరదు. పైగా, భారత్–అమెరికాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగిస్తున్న సమయంలో, అమెరికా అలాంటి వాఙ్మూలం ఇవ్వడం ఈ అంశంపై భారత్ వైఖరికి విరుద్ధంగా ఉంది. స్నేహం ఉన్నట్టేనా?‘‘పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించేందుకు అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని అమెరికాతో వాణిజ్య సౌలభ్యాన్ని రెండు దేశాలకు ఇవ్వచూపబట్టే కాల్పుల విరమణ సాధ్యమైంది. ఈ కేసులో, అధ్య క్షుడి అధికారాన్ని నిరోధించే విధంగా ఎటువంటి ప్రతికూల తీర్పు నిచ్చినా, ట్రంప్ ఇచ్చిన ఆఫర్ చట్టబద్ధతను భారత్–పాకిస్తాన్‌లు ప్రశ్నించగల స్థితి తలెత్తుతుంది. అది ఒక మొత్తం ప్రాంత భద్రతకు, కోట్లాది మంది జీవితాలకు ముప్పుగా పరిణమిస్తుంది’’ అని కూడా లట్నిక్ పేర్కొన్నారు. లట్నిక్ డిక్లరేషన్‌పై మే 29న అడిగిన మరో ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహం ముటకరించుకుని ‘‘నేను నా వైపు నుంచి పరిస్థితిని వివరించాను. రెండు వైపుల దేశ పతాకాలను పెట్టుకుని, భారతదేశ ప్రభుత్వ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా నేను ఆ పని చేసినట్లు లెక్క. దానికి పర్యవసానాలుంటాయి. అవి చాలా పెద్దవిగా ఉంటాయని అర్థం చేసుకోవాలి’’ అన్నారు.నిజమే! అమెరికా వాణిజ్య మంత్రి ఒక అమెరికన్ కోర్టులో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రక టిస్తే, వ్యవహారం మరింత పెద్దదవుతుంది. భారత్ విషయానికి వస్తే – ఆపరేషన్ సిందూర్ నుంచి ట్రంప్ చర్యలు, ప్రకటనలు చూసి, నమ్మక ద్రోహానికి గురయ్యామనిభావించడం తప్ప చేయగలిగింది లేదు. హిందీ సినిమా ‘సంగమ్’ లోని ‘దోస్త్ దోస్త్ న రహా...’ పాట నేటి భారత్ స్థితికి అద్దంపడుతుంది. ‘హోడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ అంటూ జబ్బలు చరుచు కున్న ఘట్టాల రోజులు ఇపుడు సుదూర జ్ఞాపకాలుగానే ఉంటాయి. వివేక్ కాట్జూ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఆ ధైర్యం బాబు, పవన్‌తో సహా ఎవరికీ లేదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రి కావడంతో ఆ రంగానికి విశేష ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశించారు. విప్లవాత్మక మార్పులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ శెభాష్ అనిపించుకున్నట్లే.. లోకేశ్ కూడా విద్యాశాఖను ముందు తీసుకెళతారని అనుకున్నారు. కానీ ఏడాది తిరక్కుండానే ప్రశంసల మాటెలా ఉన్నా.. తీవ్ర నిరాశకైతే గురి చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్రవ్యాప్తంగా వెల్లడవుతున్న అభిప్రాయం ఇది. ఉపాధ్యాయులు పరీక్ష పత్రాలు దిద్దిన తీరు, ఫెయిల్ అయిన వారిలో అరవై శాతం మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తున్న చేసుకోవడం, ఏకంగా 11 వేల పత్రాల వాల్యుయేషన్‌లో తప్పులు దొర్లినట్లు స్పష్టం కావడం చూస్తూంటే.. మంత్రిగా లోకేశ్ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యావేత్తలే వ్యాఖ్యానిస్తున్నారు. హడావుడిగా పరీక్ష పత్రాలు దిద్దాల్సి రావడం వల్ల ఉపాధ్యాయులు ఒత్తిడికి గురయ్యారని.. నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ తోడవడంతోనే ఇంత స్థాయిలో తప్పులు దొర్లాయని వీరు విశ్లేషిస్తున్నారు. విద్యా వ్యవస్థలో తానేదో రికార్డు సృష్టించానని చెప్పుకునేందుకు లోకేశ్ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించడంతో ఈ గందరగోళం ఏర్పడిందని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి తన కుమారుడు కాకపోయి ఉంటే ఈపాటికి చంద్రబాబు నాయుడు ఆ మంత్రికి ఎంత స్థాయిలో క్లాస్ పీకి ఉండేవారు చెప్పలేం. కొడుకు కావడంతో ఏమీ అనలేని పరిస్థితి. పైగా లోకేశ్ ఇప్పుడు సర్వశాఖల మంత్రిగా పెత్తనం కూడా చెలాయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ‘రెడ్‌బుక్’ అంటూ వైఎస్సార్సీపీ నేతలను, టీడీపీ విధానాలను వ్యతిరేకించేవారిని వేధించి, జైళ్లలో పెట్టేందుకు లోకేశ్ చూపుతున్న శ్రద్ధలో ఏ కొంచెం తన మంత్రిత్వ శాఖపై చూపి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడిది కాదేమో!. లోకేశ్ బహుశా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖను ఎంచుకుని ఉండవచ్చు కానీ.. వచ్చిన అవకాశాన్ని ఆయన ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారన్నది వాస్తవం. పైగా గత ప్రభుత్వంలో జగన్ ఈ రంగంలో చేసిన మంచిని కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తూండటం వల్ల విద్యా రంగం సమస్యలు ఎదుర్కొంటోంది. 👉విపక్షంలో ఉండగా టీడీపీ ఉపాధ్యాయులను రకరకాలుగా రెచ్చగొట్టింది. ప్రభుత్వ టీచర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని అపార్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే తమకు మేలని భావించారు. కానీ.. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంగ్లీషు మీడియంను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ మాధ్యమం ఉనికినే ప్రశ్నార్థకం చేసేశారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించాలనుకున్న జగన్ సంకల్పానికి గండికొట్టేశారు. కింది తరగతుల నుంచే ప్రవేశపెట్టిన ఐబీ కరిక్యులమ్, టోఫెల్ తదితరాలను తీసేశారు. 👉విశేషం ఏమిటంటే ఇదే చంద్రబాబు, పవన్ , లోకేశ్‌లు తమ పర్యటనలలో కొన్నిసార్లు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి జగన్ టైమ్ లో జరిగిన మార్పులు చూసి ఆశ్చర్యపోవడం!. ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్దుల తల్లులకు రూ.15 వేలు చొప్పున ఇచ్చి అందులో రూ.వెయ్యి టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తే టీడీపీ, జనసేనలు తప్పు పట్టాయి. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న పిల్లలు ఒకొక్కరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని బీరాలు పలికాయి కూడా. అధికారమైతే వచ్చింది కాని ‘అమ్మ ఒడి’ పథకం అసలుకే మోసం వచ్చింది. ఇవన్ని ఒక ఎత్తు.. టెన్త్ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడేలా వాల్యుయేషన్ జరగడం మాత్రం ఇంకో ఎత్తు. లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అది కరెక్టా? కాదా? అనేదానిపై లోకేశ్ వివరణ ఇవ్వాలి. నిజమైతే.. తప్పు చేసిన టీచర్లు ఎంత బాధ్యులో, మంత్రిగా లోకేశ్ కూడా అంతే బాద్యుడు అవుతారు!. 👉గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా ఉండగా కొన్నిచోట్ల పశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దాని కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. లోకేశ్‌ను రాజీనామా చేయాలని అడిగే ధైర్యం చంద్రబాబు, పవన్‌తోసహా కూటమి నేతలలో ఎవరికి ఉండకపోవచ్చు. అంతమాత్రాన తన తప్పు ఏమిటో తెలుసుకుని సరిదిద్దుకోవడం పోయి గత ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తే తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్దులకు ఉపశమనం కలుగుతుందా?. 👉ఎంతసేపు రెడ్ బుక్ గోలే కాదు.. తన శాఖలో జరుగుతున్న పరిణామాలను నారా లోకేష్ అర్థం చేసుకోవాలి. కొద్దికాలం క్రితం తమకు విద్యా శాఖకు సంబందించి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు. తప్పు లేదు. ఎందుకంటే.. ఎప్పుడూ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వ్యక్తి కాదు కాబట్టి. పేద విద్యార్దుల బాధలు తెలిసిన వారు కాదు కాబట్టి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన లోకేష్ ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుకున్నారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అయినా లోతుగా అధ్యయనం చేసి ఉండాల్సింది. 👉టెన్త్ లో 66 వేల మంది మార్కుల వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రతి ఏటా ఎంతో కొంతమంది ఇలా దరఖాస్తులు పెట్టుకుంటారు. కొన్ని తప్పులు జరిగితే సరి చేస్తారు. కాని ఈసారి విద్యార్ధులు విభ్రాంతి చెందేలా పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు.. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్‌కు చెందిన గంగిరెడ్డి మోక్షిత పదో తరగతిలో ఫెయిల్ అయినట్లు ఫలితాలలో తెలిపారు. ఆమె తల్లిదండ్రులు వెరిఫికేషన్ పెడితే ఆమెకు సోషల్‌లో 84 మార్కులు వచ్చినట్లు తేలింది. అంతకుముందు సోషల్ సబ్జెక్టులో 21 మార్కులే వచ్చాయని ప్రకటించారు. ఇంత దారుణంగా వ్యత్యాసం ఉంటే విద్యార్ధుల భవిష్యత్తు ఏమి కావాలి. మరో విద్యార్ధికి వెరిఫికేషన్‌లో హిందీలో నాలుగు ప్రశ్నలకు రాసిన జవాబులకు సున్నా మార్కులు వేసేశారట. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మరో విద్యార్ధికి ఇంగ్లీష్‌లో తొలుత 34 మార్కులు వచ్చాయని షీట్ లో తెలిపారు. తీరా వెరిఫికేషన్ కు వెళితే 93 మార్కులు వచ్చాయని వెల్లడైంది. 👉గతంలో ఏదో ఒకటి, రెండు మార్కులు, లేదంటే ఓ పది మార్కుల వరకు తేడా వస్తే వచ్చేవేమో! కాని ఈసారి ఇలా ఇంత తేడాతో ఉంటే ఆ విద్యార్ధుల భవిష్యత్తు ఏమవ్వాలి? ఎవరైనా తొందరపడి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులవుతారు?. విశేషం ఏమిటంటే గతంలో జగన్ టైమ్ లో ఏ చిన్న తప్పు జరిగినా జగన్ రాజ్యంలో.. జగన్ ఇలాకాలో ఘోరాలు అంటూ రాసినా.. ఇప్పటికీ అదే పద్దతిలో దౌర్బాగ్యకర రీతిలో వార్తలు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు దినపత్రిక ఇప్పుడు ఈ వాల్యుయేషన్ అవతకతవకల విషయంలో మాత్రం ఎక్కడా అసలు మంత్రి లోకేశ్ ప్రస్తావన కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యంలో ఇలా జరుగుతోందని కాని రాయకుండా జాగ్రత్తపడింది. అంతవరకు అయితే ఒక రకం. .. ప్రభుత్వ తప్పులను కూడా వెనకేసుకు వచ్చేలా వార్తలు ఇచ్చే నీచానికి ఈ ఎల్లో మీడియా పాల్పడుతుండడం దురదృష్టకరం. 2022లో జవాబు పత్రాలలో వత్యాసం 20 శాతం ఉండగా, ఇప్పుడు 16.8 శాతం మాత్రమేనని నిస్పిగ్గుగా సమర్దించుకునే యత్నం చేశారు. ఇలాంటి వార్తల విషయంలో వాస్తవాలకు అనుగుణంగా కథనాలు ఇస్తే విద్యార్దులకు ఉపయోగం. కాని, ఇలాంటి వాటిలోకూడా దిక్కుమాలిన రాజకీయం చేయడం వల్ల ఏమి ఉపయోగం?. చంద్రబాబు పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయందని జగన్ వ్యాఖ్యానించారు. దీనికి జగనే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, దానిని గాడిన పెడుతున్నామని లోకేశ్ ఎదురు దాడి చేశారు. ఏ రకంగా జగన్ పాడు చేసింది..తాను ఏ విధంగా బాగు చేసింది చెప్పుకోకుండా, ఏవో శాతాల అంకెలు చెబితే అందులోని డొల్లతనం బయటపడుతూనే ఉంది. ఎంత సేపు రెడ్ బుక్‌తో గుండెపోటు తెప్పించానని, వారిని జైల్లో వేశా, వీరిని జైల్లో వేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు. తన శాఖలో ఏమి జరుగుతోంది?. ఏ రకంగా పిల్లలకు మేలు చేయవచ్చు?. అంశాలపై లోకేశ్ దృష్టి పెడితే మంచిది. వెరిఫికేషన్, రీవ్యాల్యుయేషన్‌కు వెళ్లిన వారంతా వైఎస్సార్సీపీ వారనో, మరొకటనో చెప్పి, వారిని కూడా రెడ్ బుక్ పేరుతో భయపెట్టకుండా ఉంటే అదే పదివేలు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జగన్ అడిగిందేంటి? బాబు చెప్పేదేంటి!!
అమరావతి రాజధానైతే జగన్‌కు వచ్చే నష్టమేమటి?.. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్న ఇది. అయితే తనకు నష్టమని జగన్ ఏనాడూ చెప్పలేదు. భారీ స్కాములతో.. వేల కోట్ల రూపాయల అప్పులతో నిర్మాణాలు చేపడితే ఆ నష్టాన్ని భరించాల్సింది ఏపీ ప్రజలు మాత్రమేనని అన్నారాయన. నాగార్జున యూనివర్శిటీ సమీపంలోనో ఇంకో చోటో.. 500 ఎకరాలలో నిర్మిస్తే సరిపోయే దానికి లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపాయలంటూ ప్రజల నెత్తిన పెద్ద అప్పుల కొండ పెట్టడం ఎందుకు? అని జగన్ అడిగారు. దీంతోపాటు రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి కొన్ని ప్రశ్నలు నేరుగానే అడిగారు. కానీ.. చంద్రబాబు వీటికి నేరుగా సమాధానం ఇవ్వలేక దబాయింపులకు దిగినట్లు స్పష్టమవుతుంది ఆయన స్పందన చూస్తే. పైగా ఆయన తప్పు చేస్తూ దానిని కవర్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నారని తెలిసిపోతుంది. అమరావతి(Amaravati) పేరుతో చేపడుతున్న నిర్మాణాల వ్యయం గురించి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) నిలదీస్తే, దానికి జవాబు ఇవ్వకుండా, అసూయ అని, ఇంకొకటని చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? చదరపు అడుగుకు రూ.పదివేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి అమరావతిలో నిర్మాణాలు చేస్తున్న మాట నిజమే కదా?. దేశంలో ఎక్కడ కూడా నిర్మాణ వ్యవయం ఎంత ఎక్కువ లేదు. ఢిల్లీ, ముంబై వంటి నగరాలు కాదు.. అమెరికాలోనూ ఉండవు. పైగా అమరావతిలో భూమి ఖర్చు లేనే లేదు. 👉గతంతో.. పోలిస్తే సిమెంటు, ఉక్కు ధరలు తగ్గాయి. ఇసుకేమో ఉచితం! అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 2018 నాటి ధరల కంటే ఎక్కువ ఎందుకు చెల్లించేందుకు సిద్ధపడుతోందని జగన్ అడిగితే.. రైతులు భూములు రాజధానికి ఇస్తే మీకెందుకు అసూయ? అనడం అసలు విషయాన్ని దాచివేయడం కాదా! మంత్రులు,హైకోర్టు జడ్జీల బంగ్లాలకు నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10418, ఐఎఎస్ అధికారుల బంగ్లాలకు రూ.9771, ఐదు టవర్ల నిర్మాణానికి రూ.8981 వ్యయం చేయడం నిధుల దుర్వినియోగమా కాదా? హైదరాబాద్ వంటి నగరంలోనే చదరపు అడుగుకు మహా అయితే రూ.నాలుగు వేలు అవుతుంది. భూమి, ఇసుక ఉచితంగా వస్తున్నా, అంతకు రెట్టింపు కంటే ఎక్కువ రేట్లు ఇస్తున్నారంటే, అందులో అవినీతి ఏ స్థాయిదో అని చర్చ జరుగుతోంది. ఇప్పటికే రూ.31 వేల కోట్ల రుణం చేసిన అంశాన్ని, ఆర్థిక సంఘానికి రూ.77 వేల కోట్లు అవసరం అని చంద్రబాబు స్వయంగా చెప్పిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. లక్ష కోట్లు పెట్టి ఏమి చేస్తావు? అంటే అలా అడగకూడదని జగన్ కు చెప్పే హక్కు చంద్రబాబుకు ఉంటుందా? అమరావతి ఏమైనా చంద్రబాబు సొంత సామ్రాజ్యమా? లేక చంద్రబాబేమైనా ఏపీకి నియంత? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌పై ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు? జగన్ ఇప్పుడు ఆధార సహితంగా ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్పలేక ఎదురుదాడి చేస్తే సరిపోతుందా! నిజానికి అమరావతి కోసం ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పు సమీకరించారట. 👉గతంలో తీసుకున్న 33 వేల ఎకరాలు, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలలోనే ఇంతవరకు అభివృద్ది జరగకపోతే, ఇంకో 44 వేల ఎకరాలు తీసుకుని ఏమి చేస్తారు? ఆ భూముల యజమానులు అక్కడ పంటలు పండించుకోకుండా ఉండడం, వారికి ప్రభుత్వం కౌలుగా రూ.వందల కోట్లు చెల్లించడం.. చివరికి ఏమి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడడం. ఇదంతా ఏపీకి అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. గతంలో అమరావతికి అసలు ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వ్యయం చేయనవసరం లేదని చంద్రబాబే అన్నారు. ప్రభుత్వానికి మిగిలే ఎనిమిదివేల ఎకరాలు అమ్మితే లక్ష కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికారు. ఆ డబ్బు ఎలా వస్తుందో తెలియదు. కాని, ముందుగా రూ.లక్ష కోట్ల అప్పయితే పడబోతోంది. అసలు, వడ్డీ కలిసి తడిసి మోపెడు అయితే దాన్ని రాష్ట్రంలోని ప్రజలంతా చెల్లిస్తారా? లేక కేవలం అమరావతిలోని భూములు కలిగిన వారే చెల్లిస్తారా? దీనిని అసలు రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్ గా చేయడం ప్రభుత్వానికి తగునా!. 👉అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చడం లేదని చంద్రబాబు(Chandrababu) ఢిల్లీలో చెప్పిన దానిని ఎవరైనా నమ్ముతారా?. బడ్జెట్లోనే రూ.6,000 వేల కోట్లు కేటాయించారు కదా? అందులో నుంచి సుమారు రూ.2,800 కోట్లు సీఆర్డీఏకి విడుదల చేసింది అసత్యమా?. ప్రపంచ బ్యాంక్, జర్మని సంస్థ, హడ్కోల నుంచి తీసుకుంటున్న అప్పు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం చెల్లిస్తుందా?.. లేదు కదా!. హైదరాబాద్ వంటి రాజధాని ఏపీకి అవసరం లేదా? అని చంద్రబాబు అంటున్నారు. నిజంగా చిత్తశుద్దితో అలాంటి భావన ఉండి ఉంటే పది పల్లెటూళ్ల మధ్య లక్షల కోట్లు వ్యయం చేయవలసిన అవసరం ఏమి ఉంది? ఇప్పటికే పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది కదా? అప్పుడీ భారమే ఉండదు కదా! ఈ పల్లెల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు తమ ప్రాంతానికి కూడా అంత పెద్ద మొత్తం చొప్పున ఖర్చు చేయండని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు డిమాండ్ చేస్తే అంగీకరిస్తారా?. 👉బెంగుళూరును మించిన విమానాశ్రయం ఏపీకి కావాలట. అందుకోసం మరొకటి కడతారట. విజయవాడకు సమీపంలోని గన్నవరం వద్ద ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. అంటే ఇంతకాలం గన్నవరం వద్ద సమీకరించిన భూములు, అక్కడి బడాబాబులు కొందరికి అమరావతిలో ప్లాట్లు కేటాయించడం, వేల కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్టులో నిర్మాణాలు చేయడం..అదంతా వృథాయేనా?. శంషాబాద్ విమానాశ్రయం వచ్చాక బేగంపేట ఎయిర్ పోర్టు మూసివేసినట్లు గన్నవరం ఎయిర్ పోర్టును నిలిపివేయక తప్పదు కదా! పోనీ ఇప్పుడు ప్రతిపాదించిన ఎయిర్ పోర్టు విజయవాడ, గుంటూరులకు కూడా నలభై, ఏభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి రోడ్డు సదుపాయం కూడా కల్పించవలసి ఉంటుంది. దీనిని కట్టడానికి ముందుకు వచ్చే పెట్టుబడిదారుడు ఎన్ని షరతులు పెడతారో? ప్రపంచంలో అతి రద్దీ ఉన్న విమానాశ్రయలు ఏవీ కూడా ఇంత విస్తీర్ణంలో లేవట. భారత్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభించిన పలు ఎయిర్ పోర్టులు రద్దీ లేక కార్యకలాపాలు నిర్వహించలేక పోయాయని చెబుతున్నారు. విశాఖపట్నం-విజయవాడ మధ్యే విమానాలు నడపలేమని ప్రైవేటు సంస్థలు చేతులెత్తేశాయే!. వీటన్నిటిని కప్పిపుచ్చి ప్రజలను మభ్య పెట్టడం అవసరమా?. నిజంగానే గన్నవరం వద్ద అంత భారీగా రద్దీ పెరిగితే కొత్త ఎయిర్ పోర్టు కట్టినా ఫర్వాలేదు.అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఈ కబుర్లు అన్నీ దేనికి! 👉కేవలం సూపర్ సిక్స్(Super Six Promises) తదితర హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం కోసం వారిని మభ్యపెట్టే రీతిలో డైలాగులు చంద్రబాబు చెప్పడం,వాటిని గొప్ప సంగతులుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం..ఇదే ఏపీలో జరుగుతున్న తంతు.ఇప్పటికే సెక్రటేరియట్, అసెంబ్లీల కోసం కట్టిన భవనాలను ఏమి చేస్తారు.అవి వృథాయేనా? ఒక్కొక్కటి నలభై, ఏభై అంతస్తుల టవర్లు కడితే అసలు ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు అవసరం? రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి, ఎవరి భూములో తీసుకుని ప్రభుత్వం వేల కోట్లతో అభివృద్ది చేయవలసిన అవసరం ఏమిటి? వీటికి జవాబు లేక జగన్ ను నిందిస్తే కధ నడిచిపోతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. ఏపీ ప్రజలు వీటిని అర్థం చేసుకోలేరన్నది ఆయన నమ్మకం కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పెరుగుతున్న చైనా ప్రాబల్యం
పహల్గామ్లో ఉగ్రదాడిపై భారత్ స్పందించిన తీరు, తదనంతర పరిణా మాలు ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మౌలికంగా తీసుకొచ్చిన మార్పులేమీ లేకపోవచ్చు. కానీ, దక్షిణాసియాలో రూపు దిద్దుకుంటున్న ప్రాబల్య సమతూకానికి సంబంధించి అవి కొన్ని ముఖ్యమైన దృక్కోణాలను బయటపెట్టాయి. ఈసారి భారత్–పాకిస్తాన్ల మధ్య నెలకొన్న తాజా సైనిక ప్రతిష్టంభన మునుపటి దృష్టాంతాలకు భిన్నమైంది. భారత్ –పాక్‌ల మధ్య సైనిక ఘర్షణ పరస్పరం అణ్వాయుధాలను ప్రయో గించుకోగల స్థితికి చేరుతోందని అమెరికా పొరపడింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా రెండు దేశాల నాయకులకూ రాత్రికి రాత్రి అమె రికా ఫోన్లు చేసి ఉండవచ్చు. కానీ, ఒకటి మాత్రం స్పష్టం. ఇది ప్రాంతీయ ఆధిపత్య సమతూకపు స్థితిగతులను మార్చి వేసింది. సూటిగా చెప్పాలంటే, దక్షిణాసియాను అత్యంత ప్రభావితం చేయగలి గిన శక్తిగా అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించిందని చెప్పడం సబబు.ఇండియాకు గట్టి మద్దతివ్వని రష్యాప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన సైనిక శక్తిగా అమెరికా ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయాలను ప్రభా వితం చేయగల అవకాశం సదరు దేశపు శక్తితోపాటు అభిమతంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించి స్పష్టమైన వ్యూహాత్మక ప్రయోజనం అమెరికాకు కొరవడినట్లుగా కని పిస్తోంది. ఫలితంగా, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శాసించగల శక్తిగా ఉన్న అమెరికా ఇపుడు నామమాత్రపు పాత్రధారి స్థాయికి కుంచించుకుపోయింది. అటూఇటూగా వాషింగ్టన్ స్థానాన్ని బీజింగ్ ఆక్ర మించింది. ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న చైనా దౌత్యపరమైన యుక్తిని ప్రదర్శిస్తూ ఆయుధాల సరఫరాదారుగా, మధ్యవర్తిగా ఈ ప్రాంతపు పరిణామాలను నిర్దేశించగల స్థితిలో ఉంది. ప్రాంతీయ సైనిక ఘర్షణలు, దౌత్యపరమైన ప్రతిష్టంభనలు, రాజకీయ వాద వివాదాలకు తీర్పరిగా వ్యవహరించాలని చైనా కోరు కుంటోంది. ఇటీవల పాక్‌కు అందించినట్లుగానే హైటెక్ ఆయుధాల సరఫరా ద్వారా, లేదా దౌత్యపరంగా ప్రత్యక్షంగా జోక్యం చేసు కోవడం, ఆర్థికపరమైన ఒత్తిడిని తీసుకురావడంతో అది ఆ యా పను లను చక్కబెట్టాలని భావిస్తోంది. దక్షిణాసియా, ఇండో–పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం ఇప్పటికే కనిపిస్తోంది. కానీ, అది సైనికపరంగా వత్తాసు ఇస్తానని పాక్‌కు చెప్పడం, తాజా భారత–పాక్ ఘర్షణలో ప్రధానాంశం.అలాగే, భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామిగా అండగా నిలవడంలో రష్యా సామర్థ్యం తగ్గిన సంగతిని గమనించవలసిఉంది. ఇటీవలి ప్రతిష్టంభనలో రష్యా వైఖరి సాధారణంగా ఇతర దేశాలు చూపే మాదిరిగానే ఉంది. అది భారతదేశానికి బాహాటంగా మద్దతు ప్రకటించలేదు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు సరికదా, భారత సైనిక చర్యలకు ఆమోదం కూడా తెలుపలేదు. ‘‘ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. అవి ఏ రూపంలో వ్యక్తమైనా వ్యతిరేకిస్తోంది. ఈ రాక్షసత్వంపై సమర్థంగా పోరాడటా నికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏకోన్ముఖంగా ప్రయత్నాలు సాగించవలసిన అవసరం ఉందని భావిస్తోంది’’ అని రష్యా విదేశీ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘర్షణలు మరింత ముదరకుండా సంయమనం పాటించవలసిందని రష్యా రెండు పక్షాలనూ కోరింది. ఒక రకంగా, రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఘర్షణ సందర్భంలో భారత్ ఏం చెప్పిందో, భారత్–పాక్ ఘర్షణపై రష్యా అదే చెప్పింది. రష్యా–పాశ్చాత్య దేశాల మధ్య భారత్ సమతూకం పాటించినట్లు గానే, భారత్–చైనాల మధ్య సమతూకం పాటించేందుకు రష్యా ప్రయత్నించింది. దక్షిణాసియాలో రష్యాకున్న ప్రయోజనాలు పరిమితమే కావచ్చు. కానీ, ఇస్లామాబాద్‌తో బీజింగ్ అంటకాగుతోంది. బీజింగ్‌తో సన్నిహితంగా మెలిగే మాస్కో, తీరా చైనా ప్రయోజనాలు పణంగా ఉన్నపుడు భారతదేశానికి వీలైనంత తక్కువ సహాయాన్నే అందిస్తుంది. దానర్థం – భారత్ ప్రాంతీయ ప్రయోజనాలకు భంగం కలిగించాలని రష్యా కోరుకుంటోందని కాదు. చైనా ప్రయోజనాలను తక్కువ చేసేదిగా కనబడటం రష్యాకు ఇష్టం లేదు. ఏమైతేనేం, అది పాకిస్తాన్‌కే ప్రయోజనకారి అవుతుంది. రష్యాతో ఉన్న దోస్తీని ఉపయోగించుకుని చైనా నడవడికలో మార్పు తేగలమని మనం ఒకప్పుడు అనుకున్న రోజులున్నాయి. బహుశా ఇప్పుడు భారత దేశంతో రష్యాకున్న మైత్రిని నిగ్రహించగల శక్తి తనకుందని చైనా చాటుకోవడాన్ని మనం చూస్తున్నాం. రష్యా పట్ల భారత ఆసక్తి సన్నగిల్లుతున్నట్లుగానే, భారత్ పట్ల రష్యా ఆసక్తి కూడా రంగు, రుచి కోల్పోతోంది. ఇది మనం అంగీకరించక తప్పని వాస్తవం. క్షీణిస్తున్న ఈ స్నేహ బంధాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఉన్న మార్గాలను మనం గుర్తించవలసి ఉంది. ఒంటరిగానే పోరాడగలగాలి!ఇక భారతదేశానికున్న బాహ్య సమతూక (అంటే ఇతర దేశాలతో చెప్పించడం లేదా వాటిని పావులుగా వాడుకునేందుకు ఉన్న) అవకాశాలు అంతర్నిహితంగా పరిమితంగానే ఉండటం ఇటీ వలి ప్రతిష్టంభనలో వెలుగు చూసిన మరో గణనీయమైన అంశం. దక్షిణాసియాలో అణు యుద్ధం సంభవించవచ్చనే (అటువంటి అవకాశం లేశ మాత్రంగానే ఉన్నప్పటికీ) భయాలు అంతర్జాతీయంగా భారతదేశంతో స్నేహంగా మెలిగే చాలా దేశాలకున్నాయి. ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మనం ఉక్రెయిన్ విషయంలో చెబుతూ వస్తున్నాం. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు అదే పల్లవి అందుకుంటున్నాయి. ఇతరుల సంక్షోభ సమయాల్లో మనం ఎలా వ్యవహరిస్తామో వారూ మన పట్ల అలానే వ్యవహరిస్తారని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎటువంటి సైనిక కూటమిలోనూ చేరకూడదని మనం ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకుని ఉండవచ్చు. బహుశా, అది సక్రమమైన నిర్ణయమే కావచ్చు కూడా! కానీ, దాని పర్యవసానాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన యుద్ధాలను మనమే చేయాలి. అందుకు అనుసరించవలసిన విధానం స్పష్టమవుతూనే ఉంది. జాతీయ భద్రత సన్నద్ధతకు గణనీయమైన మొత్తాలను వెచ్చించడం ద్వారా మనం మొదట అంతర్గత సమతూకానికి ప్రయత్నించాలి. ప్రైవేటు సంస్థలు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత ప్రోత్సాహం, అనువైన వాతావరణం అవసరం. స్థానిక, అంతర్జాతీయ భాగస్వాముల ద్వారా రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేసుకోవాలి.ఉగ్రవాదంపై మనం స్పందించే తీరు ఇకపై ఇదే మాదిరిగా ఉండబోతోందని లిఖితపూర్వకంగా కాకపోయినా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది కనుక, ఆపరేషన్ సిందూర్‌ను వివిధ కోణాల నుంచి నిష్పక్షపాతంగా మదింపు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కర్తవ్య నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో పాటించవలసిన రక్షణ సన్నద్ధత, నిఘా, వ్యూహ్మాతక కమ్యూనికేషన్లు, ఇతర కీలక అంశాలపై ఈ బృందం అవసరమైన చర్యలను సూచిస్తుంది. ఇటీవలి పరిణామాలను నిష్పాక్షికంగా పరిశీ లించి, భవిష్యత్తుకు వ్యూహాత్మక దిశా నిర్దేశాలు చేసేందుకు కార్గిల్ సమీక్షా కమిటీ తరహాలో పహల్గామ్ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసేందుకు సమయం ఆసన్నమైంది. చివరగా, ఇంత తీవ్రతతో కూడిన ఈ తరహా సైనిక ప్రతిష్టంభనలు దేశపు విశాల వ్యూహాత్మక లక్ష్యాలను కూడా పక్కనపెట్టేవిధంగా మన దృష్టిని మళ్ళించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేటి భారతదేశం దక్షిణాసియాకు మాత్రమే పరిమితమై ఉండలేదు. కేవలం పాక్ పైనే మన దృష్టినంతటినీ నిలిపి ఉండలేం. ఇప్పటికే పరిమితంగా ఉన్న రాజకీయ, దౌత్య, సైనిక వనరులను ఇతర విశాల లక్ష్యాల వైపు మళ్ళించడానికి లేకుండా సతమతమవుతున్నాం. పాక్‌నే బూచిగా చూస్తూ కూర్చుంటే ఆ సామర్థ్యాలు మరింత పరిమిత మవుతాయి. పాక్ నుంచి తరచూ ఎదురుకాగల ఉద్రిక్తతల వలయంలో చిక్కుకుపోకుండా నిలవడమే భారత్ ముందున్న అతి పెద్ద వ్యూహాత్మక సవాల్!హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా విదేశాంగ విధాన బోధకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
షాడో సీఎం లోకేష్.. సకల శాఖ మంత్రిగా నియామకం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీలో ఒకప్పటి క్రియాశీలక నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబే తీసుకుంటున్నారా? లేక ఆయన ఇంకెవరైనా ఉన్నారా? అనే సందేహమూ వ్యక్తమైంది ఆయన్నుంచి!. అలాగే.. అమరావతి కోసం మరిన్ని భూములు సేకరించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్నీ తీవ్రంగా తప్పుపట్టారు ఆయన. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం.. అదే సందర్భంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం!. వాస్తవానికి వడ్డే టీడీపీకి పెద్ద వ్యతిరేకి కాదు.. వైఎస్సార్సీపీ మద్దతుదారు కూడా కాదు. వయసు కారణంగా సీరియస్ రాజకీయాలు చేయని ఈయన అప్పుడప్పుడు కొన్ని అంశాలపై మాత్రం స్పందిస్తున్నారు. తాజాగా ఆయనకు చంద్రబాబు తెలివిపై అనుమానం వచ్చింది. ఆయనతో సంబంధం లేకుండా ఎవరో నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు. అదెవరో చెప్పడానికి ఆయన సిద్ధపడలేదు కానీ.. బాబుగారి సుపుత్రుడు, మంత్రి లోకేశ్ అన్నది బహిరంగ రహస్యమే!. ఇటీవలి పరిణామాలు, మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి!. చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని నడుపుతున్నది నారా లోకేశ్(Nara Lokesh) అన్నది తాజా కథనాల సారాంశం. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచకం మొదలైంది కూడా లోకేశ్ నేతృత్వంలోనే అనేది అందరికీ తెలిసిన విషయం. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో పేరుతో చెత్త ఏరివేత వంటివి ముఖ్యమంత్రి చూసుకుంటుంటే.. లోకేశ్ ఏమో తన శాఖతో సంబంధం లేని కార్యక్రమాలకూ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం వడ్డే వంటి వారికి అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి!. గుంతకల్లు సమీపంలోని బేతేపల్లి వద్ద 22 వేల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ రెన్యుబల్ ఎనర్జీ ప్రాజెక్టుకు లోకేశ్ శంకుస్థాపన చేయడం పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉండగా ఆమోదం పొందింది. ఇప్పుడు శంకుస్థాపన దశకు చేరుకుంది. అది వేరే సంగతి. ఈ ఇంధన ప్రాజెక్టుకు లోకేష్ మంత్రిత్వ శాఖలకు సంబంధం లేదు. అయినా ఇంత భారీ పెట్టుబడి పెట్టే ప్రాజెక్టుకు సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో శంకుస్థాపన జరుగుతుంది. అందులోను చంద్రబాబు ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు. కాని అక్కడకు ఆయన వెళ్లలేదు. అదే టైమ్ లో కర్నూలు వద్ద స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ పేరుతో జరిగిన ఒక చిన్న ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ఉపన్యాసం చేశారు. ఊళ్లలో చెత్త ఎత్తుతున్నారా? అన్న ప్రశ్నలతోపాటు రోడ్లపై కూరగాయలు అమ్మే వారిని, బడ్డీ కొట్ల వారిని పలకరిస్తూ కాలక్షేపం చేయడం అందరిని విస్తుపరచింది. కొద్దిరోజుల క్రితం తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమ యూనిట్‌కు కూడా లోకేశే భూమి పూజ చేశారు. ఈ మధ్యకాలంలో లోకేశ్ తన ఇంటిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారట!. ఇందులో రాష్ట్రం అంతటి నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలను తీసుకుంటున్నారట. మంగళగిరిలో తన పేరు మీద ‘‘మన ఇల్లు- మన లోకేశ్’’ ఒక కార్యక్రమాన్ని కూడా నడుపుతున్నారు. ఆర్థిక శాఖ విషయాల్లోనూ లోకేశ్ జోక్యం పెరుగుతోందని, నిధుల విడుదల వంటివి కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో టెండర్ల ఖరారు, ఇతర వ్యవహారాలు కూడా లోకేశే చూసుకుంటున్నారని సచివాలయం వెళ్లివచ్చిన ఒక ప్రముఖుడు చెప్పారు. సచివాలయంలో, పార్టీ కార్యాలయంలోనూ లోకేశ్ హవానే నడుస్తోందంటున్నారు. ఇక ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భార్య నారా బ్రాహ్మణితో ప్రత్యేకంగా కలవడం తెలిసిందే.చంద్రబాబు మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పరిస్థితి కూడా ఏమీ భిన్నంగా లేదు. డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి హోదాలోని పవన్ కల్యాణ్ సైతం పన్నెత్తు మాట అనలేకపోతున్నట్లు ప్రచారం. తాను ఉప ముఖ్యమంత్రి కాకుండా పవన్ అడ్డుపడ్డారని లోకేశ్ భావిస్తున్నారు. మరోవైపు పవన్ చంద్రబాబు 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కొన్ని సందర్భాల్లో చెప్పినా అది మొక్కుబడి మాట మాత్రమే. చంద్రబాబు తన కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడితో లోకేశ్‌ను డిప్యూటీ చేసినా పవన్ చేసేదేమీ ఉండదు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ఎవరైనా తనను కలిసేందుకు వస్తే చినబాబు (మంత్రి లోకేశ్)ను కలవమని చెబుతుండే వారు. విపక్షంలో ఉండగా లోకేశ్ ‘యువగళం’ యాత్రలో పార్టీ అధ్యక్షుడితో సంబంధం లేకుండా సొంతం పలు హామీలు గుప్పించారు కూడా. అయితే.. 2024లో అనూహ్యంగా అధికారం దక్కడంతో ఆయన రెడ్ బుక్ అమలుకు ఒక ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. లోకేష్ హోం మంత్రి కాకపోయినా ఆ శాఖ మొత్తం ఆయన అధీనంలోనే ఉందని అంటారు. లోకేశ్‌ను ఇప్పటికే కొంతమంది సకల శాఖల మంత్రిగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజా మహానాడులో లోకేష్‌ను పార్టీ వర్కింగ్ అధ్యక్షుడిగా చేయవచ్చన్నది ఒక టాక్. అదే జరిగితే ప్రభుత్వంతో పాటు, పార్టీ కూడా పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబే ఒక బ్రాండ్ అని లోకేశ్ చెబుతుండొచ్చు. కానీ.. ఆ పేరుతో ఆయన తన సొంత బ్రాండ్‌ను నిర్మించుకుంటున్నారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో చంద్రబాబుపై కుటుంబపరమైన ఒత్తిడి ఉందని అంటారు. కానీ ఆయన ఎందువల్లో ఆ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనే భయమూ ఉండి ఉండవచ్చు. పవన్ కల్యాణ్‌ను గుడ్ హ్యూమర్లో ఉంచడానికి చంద్రబాబు,లోకేష్ లు ప్రయత్నిస్తున్నారు. దానికి పవన్ కూడా సంతృప్తి చెంది.. ప్రభుత్వపరంగా ఏ అరాచకం జరుగుతున్నా, ఎన్ని తప్పులు చోటు చేసుకుంటున్నా నోరు మెదపడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు అధికారికంగా పట్టాభిషేకం జరగలేదు కాని, అటు ప్రభుత్వం, ఇటు పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని చంద్రబాబును నామమాత్రంగా చేశారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడడం విశేషం.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ ప్రకటన.. బలమా? లేక భయమా?
‘‘ఒక్కసారి మంత్రి పదవి ఇచ్చి చూడు గణనాథ’’ అని ఓ పాట ఉంది. ఇప్పుడు ఈ పాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటారా?. ఆయన ఇప్పుడు తన పదవిని ప్రజాసేవకంటే తన అహంకార ప్రదర్శనకు, వ్యక్తులు, సినీ పరిశ్రమను బెదిరించేందుకే ఎక్కువగా వాడుతున్నట్లు స్పష్టమవుతోంది. కానీ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఆయన స్వయానా ముఖ్యమంత్రి కాదు. ఉప ముఖ్యమంత్రి మాత్రమే. రెండోది.. సినిమాటోగ్రఫీ ఆయన పరిధిలోకి రాదు. కాకపోతే ఆ శాఖ జనసేనకే చెందిన కందుల దుర్గేశ్‌ది. అంటే.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకుని తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులను హెచ్చరించారన్నమాట. ఈ అభ్యంతరకరమైన పని చేస్తున్నప్పుడు కూడా గత ప్రభుత్వం ఏదో సినీ పరిశ్రమను వేధించిందన్న అబద్ధాలను ప్రకటనలో జొప్పించారు. సినీ పరిశ్రమ వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవలేదన్నది ఆయన అభ్యంతరాల్లో ఒకటి. నిజానికి.. పరిశ్రమలో పలువురు ప్రముఖులతో (Cine Industry Biggies) చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. వారి సేవలను టీడీపీ బాగానే వాడుకుంటోంది. కానీ కొందరు కీలకమైన వ్యక్తులు పవన్‌ను మాత్రమే కలసివెళ్లారు. అయినా ఆయనలో ఏదో అసంతృప్తి! కృతజ్ఞత చూపడం లేదని ఇంకో మాట అన్నారు పవన్. ఇది అడిగి సన్మానం చేయించుకున్నట్లుగా ఉంది! తనకు తెలియకుండా ఎవరూ సినిమాలు తీయరాదన్నది పవన్ ఉద్దేశమా? లేక సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా తన చెప్పు చేతలలో ఉండాలని కోరుకుంటున్నారా? ఏది ఏమైనా... సినీ పరిశ్రమ మొత్తాన్ని బెదిరిస్తూ పవన్ బహిరంగ ప్రకటన జారీ చేయడం వారిని అవమానించడమే!. 👉వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా సినీ పరిశ్రమ తన వద్దకు వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సహా అందరినీ సాదరంగా ఆహ్వానించి, చర్చలు జరిపి, వారి కోర్కెలు తీర్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు పవన్ మాత్రం థియేటర్లలో సదుపాయాలు తనిఖీ చేస్తాం.. టిక్కెట్ రేట్ల పెంపుదల గురించి ఎవరూ తమ వద్దకు వ్యక్తులుగా రావద్దు.. ధరలు పెంచాక దానికి తగ్టట్లే ఆదాయం ప్రభుత్వానికి వస్తోందా? లేదా? అన్నది చూస్తాం.. అంటూ బెదిరిస్తున్నారు. ఏది కరెక్ట్? పైగా.. పవన్ ఏ అధికారంతో ఇలాంటి ప్రకటనలు చేశారు? ప్రభుత్వ విధానాన్ని ఆయన చెప్పి ఉంటే.. వచ్చే నెలలో విడుదల కానున్న ఆయన సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)కు సంబంధించి రేట్ల పెంపుదల వ్యక్తిగతంగా కోరకుండా ఉంటారా?. ఇకపై ఆయా సినిమా విభాగాలతోనే మాట్లాడతామని పవన్ చెప్పిన మాట తనకు, తన సినిమాలకు కూడా వర్తిస్తుందా? లేదా?. తన సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా చేస్తున్నారా?. థియేటర్ల వారు, డిస్ట్రిబ్యూటర్లు పర్సెంటేజ్ పద్దతి పెట్టాలని, అద్దె ప్రాతిపదికన అయితే తమకు నష్టం వస్తోందని అంటున్నారు. అందులో హేతుబద్దత ఎంత? సమస్యలుంటే పరిష్కరించాలి కాని ఎవరినో దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ ఎందుకు ఈ రకంగా ప్రకటనలు చేస్తున్నారు? సినిమా జయాపజయాలపై ఆందోళనతోనా?. 👉వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఇప్పటికే పవన్ కల్యాణ్ సినిమా ఫ్లాఫ్ అన్నారు. రాజకీయం, సినిమా కలిసినప్పుడు సహజంగానే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీని నోటికి వచ్చినట్లు దూషించి, పలు ఆరోపణలు గుప్పించినప్పుడు వారు చూస్తూ ఉండలేరు కదా!. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పుకోవాలి. మంత్రిగా ఉంటూ పూర్తిస్థాయిలో సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి ఒక్క పవన్ కల్యాణే!. కొన్నేళ్ల క్రితమే భారీ అడ్వాన్స్ లు తీసుకుని కొన్ని సినిమాలు చేయడానికి ఆయన ఒప్పుకున్నారట. కానీ పవన్ ధోరణితో ఆ నిర్మాతలు నిస్సహాయంగా మిగిలిపోయారని అంటారు. కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టిన నిర్మాతలు.. పవన్ రాజకీయాల కోసం ఏళ్ల తరబడి షూటింగ్‌లు చేయకుండా ఉండిపోవాల్సి రావడంతో వారు గగ్గోలు పెడుతూ ఉండొచ్చు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతం అవుతుండొచ్చు. వీటికి తోడు.. ఇటీవల సినిమా ఫంక్షన్లలో రాజకీయ ఉపన్యాసాలు జరుగుతుండడం.. దానిపై విమర్శలు, బాయ్‌కాట్ పిలుపులు వస్తుండడంతో నిర్మాతలూ నష్టపోయారు. ఆ మధ్య నటుడు పృథ్వీ వ్యాఖ్యలతో మరో నటుడి సినిమా ఆర్థికంగా నష్టపోయింది. తాజాగా భైరవం సినిమా డైరెక్టర్ వైఎస్సార్సీపీని పరోక్షంగా విమర్శిస్తూ.. పవన్‌ను పొగుడుతూ చేసిన వ్యాఖ్య కూడా ఆ సినిమాపై వ్యతిరేక ప్రభావం చూపించేలా ఉంది. నిజానికి పార్టీలకు, కులాలకు అతీతంగా ఉండవలసిన సినిమా రంగం వివాదాస్పద వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నారనిపిస్తోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపనతో.. సినిమాలు, రాజకీయం కలసిపోవడం ప్రారంభమైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పతాక స్థాయికి చేరిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశంతో కలిసిన తర్వాత అది మరింత చికాకుగా మారింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రాల్లో నటించారు. అవి అంతగా సక్సెస్ కాలేదు. కానీ ప్రతిపక్షంలో ఉండగా నటించిన మేజర్ చంద్రకాంత్ సూపర్ హిట్! అధికారాన్ని అనుభవిస్తున్న పవన్‌కూ ఈ భయం (Pawan Cinema Fear) కూడా పట్టుకుని ఉండాలి!!.ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ పనితీరు అంత సంతృప్తికరంగా లేదని చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన రేటింగ్ చెబుతోంది. ఇప్పుడు సినిమాలు బాగా నడిస్తే ఫర్వాలేదు. లేదంటే తన విలువ బాగా తగ్గే అవకాశం ఉంది. పవన్ ఎంత విధేయుడిగా ఉన్నా.. టీడీపీ వారు ఎక్కువమంది ఈయన వైఫల్యాన్నే కోరుకుంటూ ఉంటారు. అలాగైతేనే పవన్ తమకు అణగిమణగి ఉంటారన్నది వారి ఆలోచన. పవన్ దూషణల కారణంగా వైఎస్సార్సీపీ వాళ్లు ఆయన సినిమాను ఆదరించడం కష్టమే. బహుశా పవన్‌ను ఈ భయాలన్నీ వెంటాడుతున్నాయేమో!. ఈ దశలో సినిమా థియేటర్ల బంద్ చేస్తామని హెచ్చరించడం వెనుక ఏదో ఉందని భావించినట్లు ఉన్నారు. వెంటనే తన పార్టీకి చెందిన మంత్రి దుర్గేశ్‌తో ఒక ఆదేశం ఇప్పించారు. ఈ బంద్ పిలుపు వెనుక ఎవరు ఉన్నారో? కనిపెట్టాలని ఆయన హోంశాఖను కోరారట. బహుశా ఇలా బెదిరింపు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నాం. అక్కడితో ఆగకుండా పవన్ కల్యాణ్ తొందరపడి ఒక భారీ ప్రకటన జారీ చేశారు. ఎవరిమీద కోపం ఉందో నేరుగా చెప్పలేదు కానీ... పరోక్షంగా కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. 👉ప్రముఖ నిర్మాత ఆయన బంధువైన అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, దిల్ రాజు వంటి కొద్ది మంది చేతిలోనే అత్యధిక థియేటర్లు ఉన్నాయని చెబుతారు. అల్లు అరవింద్, ఆయన కుమారుడు అల్లు అర్జున్‌లతో పవన్‌కు అంత మంచి సంబంధాలు లేవన్న చర్చ కూడా ఉంది. అందువల్లే భయపడో? మరే కారణమో తెలియదు కాని అరవింద్ ఒక్కరే పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. తనకు ఇప్పుడు థియేటర్లు లేవని చెప్పు కోవచ్చు కాని, పవన్ సినిమా విడుదలకు ముందు బంద్ అంటూ దుస్సాహసం చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది మరో నటనగా కనిపిస్తుంది. సినీ రంగంపై ఆధిపత్యం కలిగిన ఈ ముగ్గురు, నలుగురు థియేటర్లను లీజ్ కు తీసుకుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ లీజు అంశాలను కూడా ప్రస్తావించి వారు పన్నులు కడుతున్నారా? లేదా? థియేటర్లలో సదుపాయాలు ఉన్నాయా? లేదా? తదితర అంశాలను తనిఖీ చేయాలని ఆదేశించారట. ఇంత బహిరంగంగా సినిమా వారిని అదే రంగానికి చెందిన మంత్రి బెదిరించడం ఇప్పుడే చూస్తున్నాం. అంటే పవన్ తన సినిమా విడుదల టైమ్‌లో ఈ వివాదం రాకపోతే.. థియేటర్లు పన్ను కట్టకపోయినా, సదుపాయాలు కల్పించకపోయినా, తినుబండారాలు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మినా ఫర్వాలేదన్న మాట!. 👉వైఎస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో ‘‘సినిమా వాళ్ల గురించి మాట్లాడడానికి, రేట్లు నిర్ణయించడానికి, మా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకోవడానికి అనుతించకపోవడానికి నువ్వు ఎవరికి?’’ అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్... ఇప్పుడు వాటన్నిటినపై తనకే అధికారం ఉన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు?. గతంలో బ్లాక్ టిక్కెట్ల విక్రయం లేకుండా చూడడాన్ని కూడా ఆక్షేపించించడం విడ్డూరమే అనిపిస్తోంది. ప్రస్తుతం కౌంటర్లలో టిక్కెట్లు ఎంతకు అమ్ముతున్నారో కూడా చూడాలని అధికారులకు ఈయన చెప్పారట. పవన్ మరో విచిత్రమైన వాదన చేస్తున్నారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా కోసం ఆయన ఆలోచన చేస్తున్నారట. దాన్ని కూడా పట్టించుకోకుండా సినిమా వారు తనకు బంద్ అంటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారట. నిజానికి సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఎందుకంటే ఇదేమీ రెగ్యులర్‌గా పనిచేసే రంగం కాదు. పర్మెనెంట్ స్టాఫ్ కూడా ఉండరు. వీరి రెమ్యునరేషన్లపై ఎవరి కంట్రోల్ ఉండదు. పరిశ్రమ హోదా ఇస్తే ప్రభుత్వం నుంచి తమకు కావల్సినవారికి నిధులు ఇచ్చుకోవచ్చని ఎవరైనా చెప్పారేమో తెలియదు. ఏపీలో షూటింగ్ చేస్తే రాయితీలు ఇస్తామని జగన్ చెబితే తప్పని ప్రచారం చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దికి ఏమీ చేయకపోగా.. వారి అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం ఏమిటో?. బంద్ ఆలోచన చేయడం లేదని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ ప్రకటించినా, పవన్‌లో ఏదో ఆందోళన ఉన్నట్లే కనిపిస్తోంది. అందుకే అధికార దుర్వినియోగం చేస్తున్నారా?. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వామ్మో ఈనాడు.. పైత్యం పరాకాష్టకు!
ఈనాడుకు పచ్చపైత్యం పెరిగిపోతోంది!. నిస్సిగ్గుగా పాఠకులను మోసం చేసేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈనాడు కథనాలు వండి వారుస్తోంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌పై విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఈ పత్రిక యాజమాన్యం విచక్షణ కూడా కోల్పోయిందని స్పష్టమవుతోంది. జగన్ టిష్యూ పేపర్‌తో పోల్చినప్పటికీ ఈ పత్రిక తీరు మార్చుకోకపోగా మరింత దిగజారిపోతోంది. సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర ప్రసాద్ గుప్తాను కేంద్రం పదవి నుంచి తొలగించడానికీ.. ఆయన నియామకానికి ముందే ఆంధ్రప్రదేశ్, సెకీల మధ్య కుదిరిన ఒప్పందాలకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. యాజమాన్యాన్ని సంతోషపెట్టడానికి ఈనాడు జర్నలిస్టు బృందం రాసిన దరిద్రపు గొట్టు వార్తపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. ఈనాడు(Eenadu)ది జర్నలిజమా? బ్రోకరిజమా అని ప్రశ్నించింది. జవాబు ఇవ్వలేని ఈనాడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో దిక్కుమాలిన కథనాన్ని రాయడం ఆ పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రస్తుతం ఈనాడు పత్రిక రాసే అబద్దాల మధ్యలో ఎక్కడైనా నిజాలేమైనా ఉన్నాయా అని వెతుక్కోవలసిన పరిస్థితి. ఏపీ ఎడిషన్‌లో రాసే, ప్రసారం చేసే కథనాలలో అత్యధికం ఈ బాపతే. చంద్రబాబు సర్కార్‌కు భజన , వైఎస్సార్సీపీ, జగన్‌పై వ్యతిరేక కథనాలు, అసత్యాలు!. ‘‘సెకీ(SECI) ఒప్పందానికి సన్మానం జరిగింది’’..అంటూ హెడింగ్ పెట్టి ఒక వార్తను ప్రముఖంగా అచ్చేసింది. ఆ సంస్థ సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందని, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని ఈ మీడియా తేల్చింది. అందులో తన ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు గుప్పించింది. 👉వైఎస్ జగన్(YS Jgan)తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు.. పదవీ గండం తప్పదని మరోసారి నిరూపితమైనట్లు ఈనాడు ఎంతో ఘోరంగా రాసింది. తెలుగుదేశం కరపత్రిక కన్నా హీనంగా రాయడానికి ఈనాడు సిగ్గుపడలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం లు కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టిన వైనం, వారికి మద్దతుగా ఈనాడు, తదితర ఎల్లో మీడియా దుష్ప్రచారం 15 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇదే టైమ్ లో చంద్రబాబు పై వచ్చిన కేసులు, ఆ కేసుల్లో అధికారులు సస్పెండ్ అవడమో, లేదంటే విదేశాలకు పారిపోవడమో జరిగిన ఘటనలు ఈనాడు మీడియా మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. 👉స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన వారిలో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంస్థల ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్న సంగతిని కప్పిపుచ్చితే సరిపోతుందా?. చంద్రబాబు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న విషయం ప్రజలకు తెలియదా?. ఆయన పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ రైడ్ చేసి.. రూ.రెండు వేల కోట్ల అక్రమాలు గుర్తించినట్లు ప్రకటించిన సంగతి ఎవరికి తెలియదు!. ఆ తర్వాత స్కిల్ స్కామ్ కేసులో విచారణకు రాకుండా తప్పించుకునేందుకు ఆ పీఏని హుటాహుటిన అమెరికాకు పంపించడాన్ని ఏమంటారో ఈనాడు మీడియానే చెప్పాలి. ఈ సంగతి ఇలా ఉంచితే.. సెకీ సీఎండీ గుప్తాని తొలగించడానికి కారణం ఒక టెండర్లో అనిల్ అంబానీ సంస్థ సమర్పించినవి నకిలీ డాక్యుమెంట్లు అని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దానిని విస్మరించి గతంలో సెకీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అని రాసిపడేసి ఈనాడు తన పాఠకులను మోసం చేసింది. విశేషం ఏమిటంటే.. జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడు గుప్తా ఆ సంస్థకు ఎండీనే కాదు. సెకీతో ఒప్పందం 2021 డిసెంబర్ లో కుదిరితే గుప్తా పదవిలోకి వచ్చింది 2023 జూన్‌లో. అలాంటప్పుడు ఇందులో ఆయన ప్రమేయం ఏమి ఉంటుంది?. అమెరికాలో దాఖలైన ఒక కేసులో గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు పేర్కొన్న తీరుపై అమెరికాలోనే విమర్శలు వస్తే.. దానిని ఈనాడు భుజాన వేసుకుని జగన్ పై తప్పుడు ప్రచారానికి దిగింది. అసలు సెకీతో అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంటే దానికి జగన్ ప్రభుత్వానికి ఏమి సంబంధం అంటే జవాబు చెప్పదు!. పైగా అదానీ సరఫరా చేస్తున్నట్లు.. ‘జగన్ ప్రభుత్వానికి తెలుసు’ అంటూ అడ్డగోలు వాదన. అదానీ తక్కువ ధరకు సెకీ ద్వారా విద్యుత్ ఇస్తే ఏపీ తీసుకోరాదని ఈనాడు అసలు ఎలా చెబుతుంది?. నిజంగానే ఈ విద్యుత్‌ను తీసుకోకపోతే అప్పుడు ఏమని రాసేవారు?. లంచాలు రావడం లేదని, తక్కువ ధరకు కరెంటు వస్తుంటే తీసుకోలేదని ఇదే మీడియా తప్పుడు రాతలు రాసేదా? లేదా?. యూనిట్ విద్యుత్ రూ.2.49లకు కొంటే లంచాలు వచ్చేటట్లయితే.. ఈనాడు రాసినట్లు లక్ష కోట్ల భారం అయితే.. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 4.60 పైసలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒక ప్రైవేటు కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది కదా!. దానికి ఎంత లంచం తీసుకుని ఉండాలి? ఇప్పుడు రాష్ట్రంపై ఎన్ని లక్షల కోట్ల భారం పడి ఉండాలి?. దానిపై ఈనాడు మీడియా ఎందుకు నోరు మెదపదు. పోనీ నిజంగానే సెకీ సంస్థ అదాని నుంచి విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఏపీకి నష్టం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదో కూడా ఈనాడు మీడియానే చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీపై చర్య తీసుకుని ఉండాలి కదా. అంటే చంద్రబాబు, మోదీ, అదానీ అంతా మంచివాళ్లే. జగన్ మాత్రమే కాదా?. 👉ఇలాంటి పిచ్చి రాతలు రాసే ఈనాడు మీడియా పరువు పోగొట్టుకుంటోంది. నిజంగానే జగన్ అప్పట్లో చెప్పినట్లు యూనిట్ రూ.2.49లకే ఏపీకి విద్యుత్ వచ్చేలా చేసినందుకు, లక్షకోట్ల రూపాయల మేర ఆదా చేసినందుకు ఆయనకు సన్మానం చేసినా తప్పేమీ లేదు. కానీ ఈనాడు సిద్దాంతం ప్రకారం ఆయనకు కాకుండా యూనిట్ విద్యుత్ రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నందుకు చంద్రబాబుకు సన్మానం చేయాలన్న మాట. జగన్ అప్పట్లో ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఈనాడు కథనంపై సాక్షి ‘‘బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికే తీరని అవమానం’’ శీర్షికన కథనాన్ని ఇచ్చింది. అలాగే వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు తదితరులు ఈనాడు మీడియా తీరుపై విరుచుకుపడ్డారు. దాంతో ఈనాడు మీడియా మరుసటి రోజు గుప్తా హయాంలోనే ఆదానీ గుట్టు వీడిందని మరో పిచ్చి వార్తను ఇచ్చింది. అందులో మాటమార్చేసి.. గుప్తా వచ్చాక అనుబంధ ఒప్పందాలు కుదిరాయంటూ ఏదేదో రాసింది. గుప్తా తొలగింపునకు ఈ అంశంతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని ఇప్పుడు చెబుతోంది. సెకీ సంస్థ అదానీ ప్లాంట్ల నుంచి సరఫరా చేస్తారని తెలిపిందట. అది తప్పట. అసలు ఏపీ ప్రభుత్వానికి తక్కువ ధరకు విద్యుత్ రావడం ముఖ్యమా? కాదా?. ఏపీలో జగన్ టైమ్‌లో గ్రీన్ కో, తదితర సంస్థలతో పాటు అదానీ గ్రూప్ కూడా రెన్యుబుల్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి ఇప్పుడు అదానీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది?. అదంతా ఎందుకు.. ఈనాడు మీడియాకు దమ్ముంటే, ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు ప్రభుత్వంతో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయించమనండి.. తక్కువ ధరకు అదానీ ఇచ్చినా అక్కర్లేదు.. మేము రూ.2.49కి కాకుండా రూ.4.60లకే విద్యుత్ కొంటామని, అదే రైట్ అని చంద్రబాబు ప్రభుత్వంతో చెప్పించమనండి!!. రామోజీరావు జీవిత చరమాంకంలో అబద్దపు తప్పుడు వార్తలతో అప్రతిష్ట పాలైతే.. ఆయన కుమారుడు కిరణ్(Eenadu MD Kiran) ఇప్పుడే ఇలాంటి తప్పుడు వార్తలతో పరువు పోగొట్టుకుంటున్నారు. వేరేవారి మీద కోపం, ద్వేషంతో ఎవరైనా తమ బట్టలూడదీసుకుని నడి బజారులో తిరుగుతారా! మా ఇష్టం! మేం తిరుగుతాం అన్నట్లుగా ఈనాడు మీడియా పిచ్చి పరాకాష్టకు చేరుతోందా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ఏదైనా వస్తువు కొన్నాక కొన్నాళ్ళు వాడిన తరువాత దానిమీద.. దాని పనితీరు మీద అసంతృప్తి మొదలవుతుంది. అయ్యో బోలెడు డబ్బు పోసి కొన్నాను ఇది సరిగా పనిచేయడం లేదు. బాగుంది తీసుకెళ్లండి అంటూ షాపువాడు నన్ను మోసం చేసాడు అని తిట్టుకోవడం సహజం. కానీ చంద్రబాబు అనే నాసిరకం సరుకును తెచ్చుకున్న జనం దాన్ని ప్యాకింగ్ విప్పిన క్షణం నుంచీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో బయట మాటలు.. కలరింగ్.. మార్కెటింగ్ వాడి మాయ కబుర్లు నమ్మేసి ఈ దారిద్య్రాన్ని ఇంటికి తెచ్చుకున్నామే అన్నట్లుగా ప్రతి ఇంట్లోనూ తిట్టడం మొదలైంది. దుకాణంలో కౌంటర్లో చూపించేది ఒక రకం సరుకు.. మనకు పార్సిల్ చేసి ఇచ్చేది ఇంకో రకం సరుకు అన్నట్లుగా ఎన్నికల సభల్లో చంద్రబాబు.. లోకేష్.. పవన్ చెప్పింది ఒకటి. గెలిచాక చేస్తున్నది ఇంకోటి అని ఏడాది లోపే తేలిపోయింది. దీంతో పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి అనుకుని ఉన్న కాకినాడ ఎంపీ సెగ్మెంట్లోని తుని, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఇటీవల జరిపిన సర్వేలో చేదు నిజాలు వెలుగుచూశాయి. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ జనంలో వ్యతిరేకత ఎక్కువే ఉంది.ఎన్నికల సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు.. అత్యుత్సాహంతో విరిసిన డైలాగులు.. ఊపిన చేతులు.. హావభావాలని గుర్తు చేసుకుంటున్న జనం ఏదీ ఆ జోరు ఇప్పుడు కనిపించదేమి అని ప్రశ్నిస్తున్నారు. పైగా తెలుగుదేశం నాయకుల రౌడీయిజం.. రుబాబు.. దోపిడీ వంటి వాటిని పవన్ ఏమాత్రం ప్రశ్నించకపోవడంతో జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైనట్లు భావిస్తున్నారు. దీంతో ఇది కూడా నాసిరకం సరుకు.. ప్యాకింగ్ చూసి కోనేసాం.. లోపలంతా తాలు సరుకు అని తిట్టిపోస్తున్నారు. పైగా పవన్ కూడా పార్టీని గాలికి వదిలేసి తన అన్న నాగబాబుకు పదవి ఇప్పించుకోవడంతో సంతృప్తి చెంది ఇతర నాయకుల పొలిటికల్ కెరీర్ గురించి పూర్తిగా ఇగ్నోర్ చేయడంతో వారిలో అసంతృప్తి మొదలైంది.పైగా గ్రామాల్లో జనసేన కార్యకర్తల రౌడీయిజం వంటివి జనాల్లో చర్చకు వస్తున్నాయి. ఈ విషయాన్నే వైఎస్ జగన్ కూడా తాజాగా పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు. ఏడాదిలోపే ప్రభుత్వం మీద వ్యతిరేకత కమ్ముకొచ్చిందని.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టాలని కేడర్‌కు సూచించారు. ఆయన చెప్పడం అని కాదు కానీ గ్రామాల్లో ఇప్పటికే చంద్రబాబు పాలనమీద పెదవి విరుపు మొదలైంది. ఇసుక ధరలు పెంపు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు.. రౌడీయిజం వంటివి జనంలో వ్యతిరేకతని పోగుచేస్తున్నాయి. -సిమ్మాదిరప్పన్న. -
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
తమిళ యాక్షన్ స్టార్ విశాల్( Vishal,), యువ నటి సాయి ధన్షిక(Sai Dhanshika)లు తమ పెళ్లి ప్రకటన విడుదల చేశారు. కాబట్టి ఇక వారి గురించి రూమర్స్ మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. కానీ..పుష్కరకాలం దాటిన ఈ జంట స్నేహం, ప్రేమగా విడదీయరాని బంధంగా మార్చిన సందర్భాలేమిటి? అంటే ఓ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. దీని గురించి వివరాలు తెలియాలంటే.. దాదాపు ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లాలి.నటుడు–దర్శకుడు టి రాజేందర్ (టిఆర్ అని కూడా పిలుస్తారు) తమిళనాట సీనియర్ సినీ ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందారు. ప్రేమసాగరం వంటి చిత్రాల ద్వారా మనకూ గుర్తోస్తారు. వయసు, అనుభవం ఎంత ఉంటే ఏం లాభం? పరిణితి లేనప్పుడు అన్నట్టుగా ఆయన గతంలో నటి సాయి దన్షిక విషయంలో ప్రవర్తించిన తీరు పూర్తిగా ఆక్షేపణకు గురైంది.తమిళనటులు కృష్ణ, విధర్త్ ప్రధాన పాత్రల్లో నటించిన సాయి ధన్షిక కీలక పాత్ర పోషించిన విజితిరు తమిళ చిత్రం 2017లో థియేటర్లలో వచ్చింది. ఈ చిత్రంలో టి రాజేందర్ అతిధి పాత్రలో నటించారు. విడుదలకు ముందు చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మాట్లాడిన సాయి ధన్సిక తన ప్రసంగంలో వేదికపై ఉన్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పింది. అయితే నటి సాయి ధన్షిక తన పేరు మర్చిపోవడం టి.రాజేందర్‌ను తీవ్ర ఆగ్రహావేశాలకు అసహనానికి గురి చేసింది. దాంతో ఆమెను అదే వేదికపైనే చెడామెడా తిట్టిపోశాడు. ఆమె అప్పట్లో రజనీకాంత్ సినిమాలో (కబాలి) నటిస్తోంది కాబట్టి పొగరు పట్టిందంటూ తీవ్రంగా దుర్భాషలాడాడు. అయితే ధన్షిక తాను టి రాజేందర్‌ను గౌరవిస్తానని పొరపాటున పేరు మర్చిపోయానని అందుకు క్షమించాలని కోరడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే, టిఆర్ మాత్రం ఆగలేదు. తన తిట్ల పరంపరను కొనసాగించాడు పైగా సారీ అంటూ ధన్సిక చెప్పడాన్ని కూడా హేళన చేస్తూ ఆమె శారీ కట్టుకోలేదు కానీ సారీ చెబుతోంది అంటూ వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశాడు. విషాదం ఏమిటంటే ఈ మాటలకు ఆమె సహనటులు సహా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టడం..అవమానాన్ని తట్టుకోవడానికి ప్రయత్నించిన సాయి ధన్సిక, దీంతో తీవ్రంగా చలించిపోయింది. కన్నీటి పర్యంతమైపోతూ దానిని దాచడానికి విఫలయత్నం చేసింది. ఈ ప్రెస్ మీట్ ట్విట్టర్లో వైరల్ అయింది.ఈ కార్యక్రమంలో టి రాజేందర్ విచక్షణా రహిత ప్రవర్తన విషయంలో ధన్షికకు తన సహనటుల నుంచి ఎటువంటి మద్దతు లభించకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. వేదికపై టిఆర్ ప్రవర్తనను ఖండించకుండా ఆస్వాదించిన మిగిలిన నటులు దర్శకుడు వెంకట్ ప్రభులపై కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.ఇది తెలుసుకున్న తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టిఎఫ్‌పిసి) అధ్యక్షుడు విశాల్ టి రాజేందర్ ప్రవర్తనను స్పష్టంగా ఖండించాడు ‘ధన్షిక క్షమాపణలు చెప్పినా, మిస్టర్ టిఆర్ ఆమెను లక్ష్యంగా చేసుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను‘ అని విశాల్ అన్నాడు. అప్పటికే క్లోజ్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్న సాయి ధన్షిక, విశాల్‌లను ఆ సంఘటన మరింత దగ్గర చేసిందని, వారి బంధం మరింత బలపడిందని అంటారు. -
ఈ కరవులో ఊళ్ళు బతికేదెట్లా?
ఆంధ్రదేశం నదులతో, కొండలతో, సముద్ర తీరంతో సుసంపన్నమైనది. గోదా వరి, కృష్ణ, పెన్నా వంటి నదులు, ఉప నదు లతో ఒకనాడు సస్యశ్యామలంగా వర్ధిల్లింది. ఆంధ్రదేశ భౌగోళిక, సాంస్కృతిక, తాత్విక సాంకేతిక సంపద ప్రసిద్ధమైనది. చరిత్రకా రుల ప్రకారం మొత్తం భారతదేశంలోనే ఇన్ని భౌగోళిక వనరులున్న ప్రాంతం మరొకటి లేదు. 974 కిలోమీటర్ల సముద్ర తీరం దీనికి ఆయువు. నదులు, చెరువులు, కాలువలు, గడ్డి మైదానాలతో; పండ్ల, ఫల, వృక్షాలతో ఆంధ్రదేశం సుసంపన్నమైనది. అంతేకాదు, దక్షిణాపథంలో ఆంధ్రదేశం కీలక స్థానంలో ఉంది. దానికితోడు తూర్పు తీరమైదానం సారవంతమైన పంట భూమి. అచటి రేవు పట్టణాలు దూరదేశాలతో వాణిజ్యం సాగించి ఐశ్వర్యవంతమైనాయి. కాకతీయులు విజృంభించే వరకు తీరాంధ్రమే ఆంధ్రదేశ రాజకీయా ధికారానికి కేంద్రమై, సాంస్కృతిక ఉద్యమాలకు పుట్టినిల్లయింది. దక్షిణాపథంలో పశ్చిమ ప్రాంతంలో విజృంభించిన రాజవంశాలు తీరాంధ్రాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాయి. ఆంధ్రదేశాన్ని ఆక్రమించినవారు సులభంగా దక్షిణాపథ ఆధిపత్యం సాధించగలరు. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్రా నదుల అంతర్వేదిపై ప్రతి రాజవంశం దృష్టి ఉండేది. అందుకే దాన్ని వశపరచుకోడానికై పల్లవులు, చాళు క్యులు, రాష్ట్రకూటులు, చోళులు, కల్యాణి చాళుక్యులు, విజయనగర రాజులు, బహుమనీ సుల్తానుల సంఘర్షణలు యావద్భారత చరిత్ర లోనే ఆసక్తిదాయకమైనవి. తత్ఫలితంగా ఈ రాజ వంశాలకు యుద్ధ రంగమై ఆంధ్రదేశం అశాంతికి, బాధలకు గురైంది. ఈదండ యాత్రల ద్వారా ద్రావిడులు, కన్నడిగులు, మరాఠీలు (కాయస్థులు), కాళింగులు అధిక సంఖ్యలో ఆంధ్ర దేశానికి వచ్చి నిలిచిపోయినారు. అందుచేతనే భారతజాతిలో వలెనే ఆంధ్రజాతిలో భౌతికమైన వైవిధ్యం కనిపిస్తుంది. ఒకప్పుడు వర్ధిల్లిన ప్రాంతంభారతదేశాన్ని పాలించిన శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు మన వ్యవ సాయ సంస్కృతిని విస్తృతపరిచారు. అంతేగాకుండా మన సంపద బంగారు, వెండి, రాగి ధనాగారాలతో ఎలా వర్ధిల్లిందో చూడండి: విజయనగరంలో బంగారు, వెండి, రాగి నాణేలు అమలులో ఉండేవి. గద్యాణం బంగారు నాణెం. దాన్నే ‘వరాహ’ అనేవారు. ఇది చాళు క్యుల కాలం నుండి వస్తున్న నాణెం. బహుశా వరాహ పదమే ‘వరహా’ అయివుంటుంది.కృష్ణరాయల గద్యాణం 119.7 వడ్ల గింజల ఎత్తు ఉండేది. ఘట్టి వరాహ, దొడ్డ వరాహ అనే ప్రత్యేక గద్యా ణాలు కూడ ఇచ్చేవారు. గద్యాణంలో సగం ‘ప్రతాప’. తరువాతవి ‘పణం’, ‘చిన్నం’. ఇవి అన్నీ బంగారు నాణేలే. ఎక్కువ వాడుకలో ఉన్న నాణెం పణం. ‘తార్’ అనేది వెండి నాణెం. ఇది పణంలో ఆరో వంతు. జిటలు, కాసు అనేవి రాగి నాణాలు. ఇవిగాక రాజ్యం పశ్చిమ ప్రాంతాల్లో పోర్చుగీస్, ఈజిప్షియన్ నాణేలు వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనారం ఈజిప్షియన్ నాణెం. ప్రౌఢరాయలు ‘దీనార టంకాల’తో శ్రీనాథుని తీర్థమాడించినాడు. ప్రభుత్వమేగాక రాష్ట్రపాలకులు నగరాధిపతులు (వర్తక శ్రేష్ఠులు) గూడా నాణేలు ముద్రించేవారు. ‘ప్రతి సంస్థానానికీ టంక శాల గుత్త చేసుకొని వారి వారి పేరటను ముద్రలు కల్పించుతూ వచ్చిరి’ అని అట్టవన తంత్రం చెబుతున్నది. నాణేల నాణ్యతను కంసాలులు ఒరపు రాతినుపయోగించి నిర్ణయించేవారు. గ్రామాల్లో దుర్భర పరిస్థితులుఇకపోతే ఇప్పుడున్న ఆంధ్రదేశ పరిస్థితి చరిత్రతో పోల్చుకుని చూస్తే దారుణంగా ఉంది. ముఖ్యంగా గ్రామాలు త్రాగునీరు లేక, సాగునీరు అందక, చివరకు పశుగ్రాసం కూడా అందక విలవిల్లాడు తున్నాయి. ఆంధ్రదేశంలో జీవించే పరిస్థితులు లేక దళితులు, బడుగు వర్గాలు విలవిలలాడుతున్నాయి. ఈ పరిస్థితి కరవును తలపిస్తూ ఉంది. కరవు రాష్ట్రజీవన వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రధా నంగా గ్రామాల్లో వృద్ధులు అన్నం లేక, గంజి లేక, సూరుల క్రింద ఉసూరుమంటూ జీవిస్తున్నారు. సామాజిక కార్యకర్తలుగా గ్రామాలకు వెళితే గుండెలు తరుక్కు పోయే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మూడుతాళ్ళ పాడులో దళిత స్త్రీలను ప్రశ్నిస్తే, ‘అన్నం వండుకొని మూడు రోజు లైంది’ అని చెప్పారు.ఒకవేళ అన్నం వండుకున్నా చింతపండు పచ్చడి తప్ప కూర వండుకోలేని దశలో ఉన్నామనీ, ఇటువంటి దయ నీయమైన పరిస్థితి మా జీవిత కాలంలో ఎప్పుడూ చూడలేదనీ వారు అన్నారు. అంటే ఒక కూర వండుకునే పరిస్థితిలో కూడా ఇవ్వాళ్టి గ్రామాలు లేవు. ఈ పరిస్థితుల్లో కూడా భర్తలకు ఏదైనా పని దొరికితే వారు తాగే వస్తున్నారని చెప్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా రోడ్డులోని గోవిందాపురం మాదిగవాడలో కొందరు స్త్రీలతో మాట్లాడితే, కనీసం పని దొరికి వారం రోజులైందనీ, దొరికినా వచ్చే తక్కువ కూలీకి బియ్యం, ఇతర వస్తువులు రాక పస్తులుంటున్నామనీ, తలకు నూనె కూడా పెట్టుకోక నెలలు అయ్యిందనీ, పిల్లలను బడికి పంపలేక పనికి తీసుకెళుతున్నామనీ చెప్పారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలో కూలీ లేక ఊళ్ళకు ఊళ్ళు తరలి వెళ్ళిపోతున్నాయి. వ్యవసాయ కూలీలే కాదు, చేనేత కార్మికులైతే దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట దేవాంగులు, పద్మశాలీలు... ఒక్కొక్క ఇంట్లో నాలుగైదు కుటుంబాలు జీవిస్తున్నామనీ, సరైన మజూరు లేక, ఇండ్లస్థలాలు లేక ఎమ్మార్వో చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయామనీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చేనేతవారికి ప్రకటించిన లోన్లు అడిగితే... ‘ప్రకటనలు అలాగే ఉంటాయి, మాకు ఏమీ ఆర్డర్స్ రాలే’దని చెపుతున్నా రనీ, ఇటువంటి ఆర్థిక దుఃస్థితి మేము గత 30 ఏళ్ళుగా ఎప్పుడూ చూడలేదనీ అంటు న్నారు. విజయవాడలో ఒక బ్రాహ్మణ వీధిలో ఉంటున్న 200 కుటుంబాల్లో కనీసం 50 కుటుంబాలైనా పస్తులు ఉంటా యనీ, పట్టణాలలో పనిలేదనీ, ఇండ్ల స్థలాలు లేవనీ చెప్పారు. పోరాటమే మార్గం!ఆకలికి కులం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కరవు వలన నిరాసక్తత, నిర్వీర్యత అలుముకొని ఉన్నాయి. అటు పొలం పనులైన నాట్లు, కోతలు, కలుపులు లేవు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పనిచేసు కోవాలంటే, బిల్డింగ్ కట్టే పనులే కాని వ్యవసాయ కూలీ పనులు లేవు. ఆంధ్ర దేశానికి గుండెకాయగా చెబుతున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపల చెరువులు, రొయ్యల చెరువుల వలన వ్యవసాయ పనులు పూర్తిగా మృగ్యమయ్యాయి. పశువుల పరిస్థితి దారుణంగా ఉంది. పశువుల దాహార్తి, పశుగ్రాస లేమి సామాజిక, ఆర్థికవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏటా వేసవి సీజన్లో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉన్నా అధికారులు సకాలంలో స్పందించ లేదు. వేసవిలో పశుగ్రాసం కొరత, వాతావరణ పరిస్థితుల కారణంగా పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఎండు గడ్డి, పచ్చగడ్డి సమ పరిమాణంలో అందించడంతోపాటు వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణకు సరైన చర్యలు తీసుకోవాలి. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో భూమి ఎందుకు పంచటం లేదనేది, కార్పొరేట్ వ్యవస్థలకే భూమి ఎందుకు చవక రేట్లకు ఇస్తున్నారనేది నగ్న సత్యం. ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి కూలీలు మండుటెండల్లో ఎండుతున్నా వారికి మంచినీళ్ళు లేవు. వారికి కూలీ నెలలు తరబడి ఆపుతున్నారు. వారు దిక్కులేని పక్షుల్లా బతుకుతున్నారు. నిరాశా నిస్పృహలతో ప్రజలు జీవిస్తున్నారు. ఇది మంచిది కాదు. పాలక వర్గాలు రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించాలి. దేశానికి ఆయువైన గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నిండాలి. రైతులు, రైతు కూలీలు, వృత్తిదారుల ముఖాలలో నవ్వు వికసించాలి. అందుకు పోరాటాలే మార్గం. ప్రజలు చైతన్యవంతులై అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి. దళిత బహుజనులు తమ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడినప్పుడే నిజమైన విముక్తి కలుగుతుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
నాజిల్ సమస్యే!.. నాలుగో దశను కూల్చివేసిన ఇస్రో
పీఎస్ఎల్వీ.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది నాలుగు అంచెల రాకెట్. ఈ రాకెట్లో తొలి, మూడో దశల్లో ఘన ఇంధనం వాడతారు. ఇక రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం వినియోగిస్తారు. 101వ ఉపగ్రహం ‘రీశాట్-1బి’ని రోదసికి పంపేందుకు నేటి ‘శతాధిక’ ప్రయోగంతో కలిపి పీఎస్ఎల్వీతో ఇస్రో 63 ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో ఈ రాకెట్ విఫలమైన సందర్భాలు మూడు. 2017 తర్వాత రాకెట్లో లోపం కనిపించడం ఇదే తొలిసారి. నిజానికి మూడో దశలో రాకెట్ ఫెయిల్ కావడం అరుదు. 114 సెకండ్లపాటు సాగే ఈ మూడో దశలో హెచ్టీపీబీ (హైడ్రాక్సిల్-టర్మినేటెడ్ పాలీబ్యూటడీన్) ఘన ఇంధన మోటార్ వాడతారు. ఈ ఇంధనం ఆదర్శ స్థితిలో 240 కిలో న్యూటన్ల చోదకశక్తి ఇస్తుంది. తాజా ప్రయోగ వైఫల్య కారణాలను నిగ్గుతేల్చేందుకు ఇస్రో నుంచి ఒకటి, ప్రభుత్వం నుంచి మరొకటి వంతున రెండు కమిటీలు రంగంలోకి దిగాయి. రాకెట్ వేగం, ఎత్తు, ఇంజిన్ల పనితీరు అంశాలపై అవి అధ్యయనం చేస్తాయి. మోటారులో ఇంధన ప్రవాహం సరిగా లేదా? నాజిల్ సమస్యలు తలెత్తాయా? మోటారు డిజైన్/తయారీపరమైన లోపాలున్నాయా? ఇలా పలు కోణాల్లో విశ్లేషణ కొనసాగనుంది. కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ... రాకెట్ మూడో దశలో మోటార్ కేస్ లోపలి చాంబర్ ప్రెజర్లో అకస్మాత్తుగా పీడనం తగ్గడానికి ఫ్లెక్స్ నాజిల్ నియంత్రణ వ్యవస్థలో తలెత్తిన లోపమే కారణమని ఇస్రో ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. రాకెట్ వేగం, చోదక దిశలను నిర్దేశించేది ఈ కీలక భాగమే. ‘కంబశ్చన్ చాంబర్’లో ఇంధనం దహనమై విపరీత పీడనంతో వేడి వాయువులు నాజిల్ గుండా వెలుపలికి తన్నుకొస్తేనే రాకెట్ ప్రయాణం ముందుకు (పైకి) సాగుతుంది. ఈ ‘చర్యకు ప్రతిచర్య’ అనే మౌలిక సూత్రం ఆధారంగానే రాకెట్ పనిచేస్తుంది. రబ్బరు లాంటి స్థితిస్థాపక గుణం (లేయర్డ్ ఎలాస్టోమెరిక్) గల పదార్థాల పొరలతో ఫ్లెక్సిబుల్ నాజిల్స్ తయారవుతాయి. హైడ్రాలిక్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి తద్వారా వాల్వులను కదిలిస్తూ ద్రవ/వాయు ప్రవాహాలను నియంత్రించేందుకు సాధారణంగా హైడ్రాలిక్ యాక్చువేటర్లను వినియోగిస్తుంటారు. వీటి పనితీరు సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే పీఎస్ఎల్వీ రాకెట్ మూడో దశ మోటారులో హైడ్రాలిక్ యాక్చువేటర్లు కాకుండా… పరిమిత కోణాల్లోనే అయినప్పటికీ అన్ని దిశల్లో కదులుతూ కచ్చితమైన చోదకశక్తిని అందించేందుకు ఫ్లెక్సిబుల్ బేరింగ్ గల ఫ్లెక్స్ నాజిల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థలో ఉత్పన్నమైన సమస్య వల్లనే తాజా ప్రయోగం విఫలమైనట్టు అనుమానిస్తున్నారు. నాజిల్ యాక్చువేటర్లు, ఫ్లెక్సిబుల్ జాయింట్, కంట్రోల్ సిగ్నల్స్... వీటిలో ఏదో ఒక సమస్య ఏర్పడి చాంబర్ ప్రెజర్లో పీడనం తగ్గి, మరింత ఎత్తుకు ప్రయాణించడానికి చాలినంత చోదకశక్తి లభించక రాకెట్ గతి తప్పడం ఆరంభించింది. దాన్ని అలాగే వదిలేస్తే జనావాసాలపై కూలి ప్రాణ-ఆస్తి నష్టం సంభవించే అవకాశముంది. అందుకే భద్రతా నిబంధనల ప్రకారం ఇస్రో దాన్ని ‘మిడ్ ఎయిర్-అబార్ట్’ చేసింది. అంటే... రాకెట్లో పేలోడ్ (ఉపగ్రహం) ఉన్న చివరిదైన నాలుగో దశను వేరే దారి లేక ఇస్రో కూల్చివేయాల్సి వచ్చింది.-జమ్ముల శ్రీకాంత్.. -
బాలయ్యా, నీ హీరోయిన్ మద్యం ప్రచారంపై ఏమందో విన్నావా?
ఆయన ఓ ప్రముఖ సినీనటుడు,అంతేకాదు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు.. అంతవరకు అయినా పర్లేదేమో కానీ నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కార గ్రహీత కూడా. అలాంటి నేపథ్యం వున్న బాలకృష్ణ(Nandamuri Balakrishna ) మాన్షన్ హౌస్ మద్యం ద్వారా పేరొందిన బ్రాండ్ కు సంబంధించిన ప్రకటనలో నటించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న బాలకృష్ణ, అలాంటి గౌరవనీయమైన పురస్కారం పొందిన తర్వాత మద్యం ప్రకటనలో పాల్గొనడం అనుచితమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. “పద్మ భూషణ్ పొందిన వ్యక్తి ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చేయడం ఎలా అనుమతిస్తారు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారుఇదిలా ఉండగా, బాలకృష్ణ నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ వివాదం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఇలాంటి ప్రకటనల్లో నటించడం బాధ్యత లేనితనమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ మద్యం యాడ్ వివాదం సామాజిక మాధ్యమాల్లో చర్చలకు గతం లో ని కొన్ని విషయాల ప్రస్తావనకు దారి తీసిందిబాలకృష్ణ ఆ మద్యం బ్రాండ్ పై తన అభిమానాన్ని పదే పదే చాటు కోవడం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి, అవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడo బాలకృష్ణ బరితెగింపు కి నిదర్శనం గా అనిపిస్తోంది. గతంలో ఈ తరహా మద్యం బ్రాండ్ల ప్రచారంలో సెలబ్రిటీలు పాల్గొనడం పై ఉవ్వెత్తున విమర్శలు రావడం దాంతో అనేకమంది స్టార్స్ ఇక తాము అలాంటి ప్రకటనల్లో కనిపించం అని నిర్ణయం తీసుకోవడాన్నీ పలువురు గుర్తు చేసుకుంటున్నారు.ఓ కూల్ డ్రింక్ బ్రాండ్ ప్రచారం చేసినందుకే చిరంజీవి పై విమర్శలు రావడం దాంతో అయన వెనక్కి తగ్గడం కూడా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఒకనాటి బాలకృష్ణ హీరోయిన్, బంగారు బుల్లోడు సినిమా లో అయన సరసన నటించిన రవీనాటండన్(Raveena Tandon) తారల మద్యం ప్రచారం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం. సెలబ్రిటీలుగా తమపై ఎక్కువ సామాజిక బాధ్యత ఉంటుందనీ, ఆల్కహాల్ ఉత్పత్తులకు తాము ప్రచారం చేయడం అంటే యువత ను తప్పుదారి పట్టించడమే అవుతుంది అని ఆమె వ్యాఖ్యనించారు.. మరి బాలయ్య కి ఇలాంటి మంచి మాటలు చెవికెక్కుతాయా... లేక మంచి చెడూ జాంతానై.. మా బ్లడ్డు బ్రీడు సపరేట్ హై.. అంటూ ఇలాగే కంటిన్యూ అయిపోతారా.. దీనికి ఆన్సర్ కోసం జనం మాత్రమే కాదు ఆయన్ను వరించిన పద్మ భూషణ్ కూడా ఆశగా ఎదురు చూస్తోంది. -
వారెన్ బఫెట్ (బిజినెస్ టైకూన్) రాయని డైరీ
వృద్ధాప్యం అన్నది మంచి విషయం కాక పోవచ్చు. అయితే, అంతకంటే కూడా మంచిది కాని విషయం... ఊరికే వృద్ధాప్యాన్ని వెంటేసు కుని తిరగటం! నెరుపో, మరుపో కాదు. తలపు మనవృద్ధాప్యం. వెనక ఇన్నిన్ని జ్ఞాపకాలు ఉన్నాక, ఎన్నెన్ని జన్మలకైనా వృద్ధ కపోతాలు వచ్చి వాలటానికి చోటుంటుందా భుజాల పైన?! 94 ఏళ్ల వయసులోనూ నేనింకా ఆరేళ్ల పిల్లవాడిలా ఔన్సుల కొద్దీ కోకాకోలా తాగుతూ, మెక్‌డొనాల్డ్స్ నుంచి తెప్పించుకున్న బేకన్, ఇంకా.. చీజ్ బిస్కెట్లు ఇష్టంగా తింటూ ఉంటానంటే నా వయసు ఆరేళ్లన్నట్లా? లేక, తొంభై నాలుగేళ్లన్నట్లా?!‘‘డిసెంబరులో కంపెనీ సీఈవో బాధ్యతల నుండి తప్పుకుంటాను..’’ అని ఈ నెల మొదట్లో ఓమాహాలో జరిగిన ‘బెర్క్‌షైర్ హాథ్‌వే’ వార్షిక సమావేశంలో నేను ప్రకటించినప్పుడు కూడా నా వయసు ఆరేళ్లుగానే ఉంది, తొంభై నాలుగేళ్లుగా కాదు! ‘‘మిస్టర్ వారెన్! ఫస్ట్ టైమ్ మీకు ఎప్పుడు అనిపించింది వయసు పైబడినట్లు?’’ అని – వాల్‌స్ట్రీట్ జర్నల్ నుంచి మిస్ క్యారెన్ లాంగ్లీ!తన వైపు బ్లాంక్‌గా చూశాను. ప్రపంచంలోని టాప్–10 కంపెనీలలో ఒకటైన 1.08 ట్రిలియన్ డాలర్ల ‘బెర్క్‌షైర్ హాథ్‌వే’ గురించి కానీ, నా తర్వాత సీఈవోగా ఉంటారని నేను ప్రకటించిన 62 ఏళ్ల గ్రెగ్ అడెల్ గురించి కానీ అడగటానికి తన దగ్గర ఒక్క ప్రశ్నా లేనట్లుంది! ‘‘లుక్... మిస్ క్యారెన్! ఎవరికైనా ఎలా తెలుస్తుంది ఫలానా తేదీ నుంచి తమకు వయసు పైబడినట్లు! జన్మదినంలా, ఒక వృద్ధాప్య దినం ఎందుకు ఉంటుంది?!’’ అన్నాను... నవ్వుతూ. బహుశా ఈ జర్నలిస్టులు మానవ జీవిత యుగాంతానికి ప్రారంభ సంకేతాలుగా, ఒక కంపెనీ సీఈవో నుండి ఆశిస్తుండేది... అడు గులు తడబడటం, బాడీ బ్యాలెన్ ్స తప్పటం, తూలి పడబోవటం... ఇలాంటివి కావచ్చు.కానీ, అవేవీ అడల్ట్‌హుడ్ ఆరంభ ఛాయలు కాదు. భుజాల మీది జ్ఞాపకాలు ఒకటొకటిగా మసక ‘జారి’పోతూ ఉంటే, వాటి స్థానంలోకి మెల్లిగా వచ్చి వాలుతుండే మతిమరపులే ఈ ఓపలేని వయో భారాలు. ఓమాహాలో మేముండే చోట బెట్టీ గాలఘార్ అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాన్నేను. అప్పుడు నా వయసు 18 ఏళ్లు. అయితే ఆ అమ్మాయికి అప్పటికే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి నా గుండె బద్దలైపోయింది. ఆ బాయ్‌ఫ్రెండ్‌కు రాని విద్య ఏదో కనిపెట్టి, బెట్టీకి దగ్గరయ్యేందుకు ‘యూకలేలీ’ హవాయ్ గిటార్‌ను ప్లే చేయటం నేర్చుకున్నాను. తను చూస్తూ ఉండగా శ్రావ్యంగా ప్లే చేశాను. బెట్టీ నన్ను మెచ్చుకోలుగా చూసింది కానీ, తన బాయ్‌ఫ్రెండ్‌ని మాత్రం విడిచిపెట్టలేదు!ఇంకో జ్ఞాపకం – నా 20 ఏళ్ల వయసప్పుడు నా చెల్లెలి రూమ్మేట్ సూజన్‌ను పెళ్లి చేసుకుంటానని నేను వెళ్లి ఆమె తండ్రిని అడగటం. ‘‘నా కూతుర్ని పస్తులుంచి చంపే స్తావా ఏంటి నువ్వు!’’ అనేశారాయన!! ఆ వెంటనే మెత్తబడి...‘‘నీ మీద నమ్మకం ఉన్నా ఈ డెమొక్రాట్లు, కమ్యూనిస్టుల మీద నమ్మకం లేదు...’’ అన్నారు. ఆ మాట ఎప్పుడు గుర్తొచ్చినా పెద్దగా నవ్వేస్తుంటాను నేను. తొలినాళ్ల ప్రేమలు, నవ్వులు నూరేళ్లకైనా వయసును మీద పడనివ్వవు. ‘‘మిస్టర్ వారెన్! మిస్టర్ వారెన్! ఎక్కడికి వెళ్లిపోయారు మీరు? గతంలోకా, భవిష్యత్తులోకా?’’ అని నవ్వుతోంది మిస్ క్యారెన్ లాంగ్లీ.‘‘చెప్పండి సర్! ఏజ్ కారణం కాకుంటే మరెందుకు సీఈవోగా స్టెప్ డౌన్ అవాలని అనుకున్నారు?’’ అంటోంది తనింకా! ‘‘న్యూస్ పేపర్స్ చదవటానికి టైమ్ సరిపోవటం లేదు మిస్ క్యారెన్...’’ అని చెబితే ఆశ్చర్యపోనంత వయసు తనకు వచ్చి ఉండొచ్చని నాకైతే అనిపించటం లేదు. న్యూస్ పేపర్సే కాదు, మళ్లీ మళ్లీ అదే పనిగా ‘బ్రేకింగ్ బ్యాడ్’ క్రైమ్ డ్రామా సీరీస్‌ని చూడాలని కూడా ఉంది నాకు! -
స్టార్ హీరోతో వాన పాట చేశాక, గదిలోకెళ్లి భోరుమన్న నటి...
ఇప్పుడంటే పెద్ద విషయం కాదు కానీ.. అంత ఆసక్తి కూడా లేదు కానీ ఒకప్పుడు సినిమాల్లో రెయిన్ సాంగ్స్ అంటే ఫుల్ క్రేజ్. అప్పట్లో ఓ దశాబ్ధం పాటు వానపాటలు లేకుండా మాస్ హీరోల సినిమాలు రాలేదంటే అతిశయోక్తి కాదేమో... ఎన్టీయార్ తరం నుంచి చిరంజీవి తరం దాకా కొన్నేళ్ల పాటు ఈ వానపాటల్తో ప్రేక్షకుల్ని తడిపి ముద్దచేసేశారు. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు అటు బాలీవుడ్‌లోనూ వీటి సందడి ఎక్కువే కనపడేది.ఇప్పుడు లిప్‌లాక్, మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాల్లో చేయడం గురించి ఎలాగైతే హీరోయిన్లు కొందరు తమ ఇబ్బందులు బయటపెడుతున్నారో...అప్పుడు వానపాటల గురించి అలాగే చెప్పుకునేవారు. తడిసి ముద్దయిన చీరలో హీరోయిన్ హీరోతో డ్యాన్సు చేస్తుంటే ప్రేక్షకులు కళ్లప్పగించేసేవారు కానీ అలా తెరకు ఒళ్లప్పగించేసినందుకు అందరూ కాకపోయినా కొందరు హీరోయిన్లు మాత్రం తెగ బాధపడేవారు. అప్పట్లో బాలీవుడ్ సినిమా వానపాటల్లో సూపర్ హిట్ సాంగ్‌లో నటించిన ఓ హీరోయిన్ అదే విధంగా విపరీతంగా బాధపడింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిందీ విషయం.కళ్లు తిప్పుకోనివ్వనంత అందం ఉన్నా, గ్లామర్‌తో కాకుండా బాలీవుడ్లో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసుకున్న అతి కొద్ది మంది తారల్లో ఒకరు స్మితా పాటిల్(Smita Patil), గ్లామర్‌కు కాకుండా, గంభీరతకు గుర్తుపెట్టుకునే పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ఆమె తిరుగులేని స్థానం సంపాదించారు. స్వతంత్ర భావజాలంతో ఉండే స్మితాపాటిల్ కు సామాజిక విలువలపై ఉన్న నమ్మకం ఆమె నటనలో పాత్రల ఎంపికలో స్పష్టంగా కనిపించేది.సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి, నిజాయితీతో నిండిన పాత్రలు పోషించిన స్మితా పాటిల్‌కు, మొదటి నుంచీ వాణిజ్య చిత్రాల మీద ఆసక్తి పెద్దగా లేదు. అందుకేనేమో ఆమె మొదటి మాస్టర్హిట్ కమర్షియల్ సినిమా ‘‘నమక్ హలాల్’’(Namak Halaal) విజయం గురించి ఆమె ఎప్పుడూ సంతృప్తి చెందలేదు. మరీ ముఖ్యంగా ఆ సినిమా అద్భుత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ‘ఆజ్ రఫత్ జాయేతో...‘ పాట ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. కుండపోత వర్షంలో తెల్ల చీరలో తడిసి ముద్దవుతూ అందాలన్నీ బహిర్గత పరుస్తూ.. నాటి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan)తో చేసిన ఆ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిందేమో కానీ..స్మితా పాటిల్‌ను మాత్రం ఉస్సురుమనిపించింది. తను ఎప్పుడూ ఊహించని రీతిలో కనిపించాల్సి రావడం ఆమె మనస్సుకు తీవ్రమైన బాధ కలిగించింది. ఆ రోజు వాన పాట షూటింగ్ పూర్తయిన తరువాత ఆమె తిన్నగా తన గదిలోకి వెళ్లిపోయిందని, భోరుమంటూ ఏడ్చిందని సాక్షాత్తూ ఆ పాటలో ఆమె సహనటుడు, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే వెల్లడించారు. మరి అలాంటి పాటకు ఆమె ఎందుకు అంగీకరించింది? ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఉంది.ఇది అంతా జరిగినదానికి మూలం సిల్సిలా అనే సినిమా. ఆ సినిమాలో మొదట స్మితా పాటిల్ పర్వీన్ బాబీ ఉండాల్సింది. కానీ వారికి బదులుగా చివరికి జయ బచ్చన్ రేఖ ఎంపికయ్యారు. ఈ విషయం దర్శకుడు యశ్ చోప్రా నుంచి కాకుండా, శశికపూర్ ద్వారా తెలియడం స్మితా పాటిల్ మనోభావాలను తీవ్రంగా గాయపరచిందని సమాచారం. ఆ గాయం పచ్చిగా ఉండగానే నమక్ హలాల్ సినిమాలో అవకాశం వచ్చిందట. ఆవేదనలోనో, ఒక నిర్వేదంలోనో నమక్ హలాల్కి ఓకే చెప్పేసిందట. అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించినా, తనకు మరిన్ని సినిమా అవకాశాలు అందించానా... సినిమా రంగంలో తన విలువలకు భిన్నంగా చేశాననే భావన ఆమెను వెంటాడింది.విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందినా.. తనను ఆ పాటలో హీరోయిన్గా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం ఆమెకు ఎప్పటికీ ముళ్లులా గుచ్చుకుంటూనే ఉంది. ఆ తర్వాత స్మితా పాటిల్ ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు. అయితే చాలా చిన్న వయసులోనే ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించడంతో బాలీవుడ్ ఉన్నంత కాలం గుర్తుంచుకోదగ్గ గొప్ప నటిని కోల్పోయింది. సదరు నమక్ హలాల్ సినిమాను భలేరాముడు పేరుతో మోహన్‌బాబు హీరోగా తెలుగులోనూ తీశారు. ఆ సినిమాలోనూ వానపాట ఉంది అంతే స్థాయిలో ఇంకా చెప్పాలంటే మరింత ఘాటుగా తెలుగు పాటను చిత్రీకరించారు. ఆ వానపాటలో ఒకనాటి హీరోయిన్ మాధవి మోహన్‌బాబుకు జోడీగా నర్తించింది. -
40ప్లస్ క్లబ్లో అనసూయ.. ఇదే గ్లామర్‌తో ఇంకెన్నాళ్లు?
దాదాపు ఓ పన్నెండేళ్ల క్రితం టీవీ చానెల్లో న్యూస్ ప్రెజెంటర్‌గా తన ప్రస్తానం ప్రారంభమైనప్పుడు తానే కాదు ఎవరూ ఊహించి ఉండరు.. ఇంతగా, ఇన్ని విధాలుగా అనసూయ(Anasuya Bharadwaj) తెలుగు వారికి దగ్గరవుతుందని. కేవలం పుష్కర కాలంలో పుష్కలమైన అవకాశాలు అందుకుంటూ అంతకంతకూ ఎదుగుతూ వచ్చిన అనసూయ...స్టార్ యాంకర్ నుంచి సిల్వర్ స్క్రీన్ స్టార్ దాకా దూసుకుపోయింది. తెలుగులో చిన్నితెర మీద యాంకర్, ప్రోగ్రామ్ హోస్ట్‌గా చేసిన ఎవరూ సాధించలేకపోయిన క్రేజ్‌ను ఆమె స్వంతం చేసుకుంది. ఓ వైపు యాంకర్‌గా పలు టీవీ షోస్‌లో కనిపిస్తూనే, మరోవైపు వెండితెర మీద కూడా తనదైన ముద్ర వేస్తోంది. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాల్లోని ఆమె పాత్రలు సినీరంగంలో ఆమె అవకాశాలను విస్త్రుతం చేశాయి. ప్రస్తుతం అనసూయ చిన్నితెర మీద కావచ్చు, వెండితెర మీద కావచ్చు, పబ్లిక్ ఈవెంట్స్ లో కావచ్చు... ఫుల్ క్రే జ్ ఉన్న సెలబ్రిటీ అనడంలో అతిశయోక్తి లేదు అయితే ప్రస్తుతం సెలబ్రిటీల ఇమేజ్, పాప్యులారిటీని సరైన రీతిలో అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. గతంలో ఒక నటి/నటుడు, యాంకర్ ఎవరైనా సరే తమ ప్రతిభ ద్వారా మాత్రమే అత్యున్నత స్థానాన్ని సాధించారని చెప్పేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్స్టాలు, రీల్స్...వగైరాలు వెల్లువెత్తుతూ సినీ విమర్శకుల్ని సైతం సెలబ్రిటీల స్థాయిపై విశ్లేషణలకు వీలు లేకుండా చేస్తూన్నాయి. మరోవైపు అనసూయ సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ. ఆమెను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంచిన వాటిలో ఆమె గ్లామర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందనేది నిర్వివాదం. ఆ విషయం ఆమె కూడా గుర్తించింది కాబట్టే సినిమాల్లో కాకున్నా, సోషల్ మీడియాలో గ్లామరస్ పోస్టులు, వీడియోల ద్వారా మెరిపిస్తూ ఉంటుంది. తన దుస్తులు, వస్త్రధారణ విషయంలో వచ్చే విమర్శలకు ఘాటుగా బదులిస్తూ ప్రతి విమర్శలు చేస్తూ వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. వీటన్నింటి నడుమ... ఆమె దురదృష్టమో అదృష్టమో కానీ.. ఎన్ని వైవిధ్యభరిత చిత్రాల్లో నటించినా, అనసూయ అనగానే ఓ అందమైన అమ్మాయి అనే భావనే సినీ అభిమానుల్లో స్థిరపడిపోయింది.ఏదేమైనా దాదాపు పాతికేళ్లు పైబడిన వయసులో ‘షో’ బిజినెస్‌లోకి ఆరంగేట్రం చేసిన అనసూయ నిన్నటి(మే 15)తో ఫార్టీ ప్లస్ వయస్కుల క్లబ్‌లోకి చేరుతోంది. ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా ఈ గ్లామర్ ఇకపై ఎంతకాలం నిలుస్తుందో తెలీదు. కాబట్టి ఇకపై నటనలో కూడా తనేంటో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా ఎంచుకున్నట్టే వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ.. గ్లామర్ డోస్‌ను తగ్గిస్తూ... అందమైన మహిళ అనే అభిప్రాయాన్ని మరిపిస్తూ.. అభినయ ప్రావీణ్యమున్న నటిగా కూడా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేయగలిగితే మరికొన్ని దశాబ్ధాల పాటు ఆమెకు తిరుగు ఉండకపోవచ్చు. -
మేపలేక ‘తెల్ల ఏనుగు’.. ట్రంప్ ముఖాన డంప్!
ప్రపంచంలో సొంతంగా అతి పెద్ద ప్రైవేట్ జెట్స్ శ్రేణి కలిగిన యజమానుల్లో ఖతార్ రాజకుటుంబం ఒకటి. తమకు ఆర్థిక భారంగా పరిణమించిన కొన్ని భారీ విమానాలను అది తాపీగా వదిలించుకుంటోంది. ప్రయోజనం లేని, నిర్వహణ భారం మితిమీరిన ‘తెల్ల ఏనుగు’ లాంటి తమ ‘బోయింగ్ 747 జంబో’ను అచ్చం రాజకుటుంబం లాగే పోషించగల డొనాల్డ్ ట్రంప్ లాంటి సరైన వ్యక్తిని ఖతార్ రాజకుటుంబం ఎట్టకేలకు పట్టుకోగలిగింది!. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి లబ్ధి పొందడానికే ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తోందని ఊహాగానాలు వినిపించినా ఈ వ్యవహారం వెనక అసలు కారణం.. ఖతార్ రాజవంశీయులకు ఆ విమానంతో అవసరం తీరిపోవడం!. నిజానికి వారు 2020లోనే ఆ విమానాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ, కొనుగోలుదారు దొరక్క విక్రయంలో విఫలమయ్యారు. తమకు అవసరం లేని ఆ ‘చెత్త’ విమానాన్ని ఇప్పుడు ట్రంప్ ముఖాన ‘డంప్’ చేస్తున్నారు కనుక వారికి నిర్వహణ ఖర్చులు, స్టోరేజి వ్యయం బాగానే తగ్గుతాయని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు.. అలా అటు ఖతార్ రాజకుటుంబానికి ఖర్చూ తగ్గింది, ఇటు ట్రంప్ కూడా ఫ్రీ గిఫ్టుతో ఉబ్పితబ్బిబ్బవుతున్నారు. మొత్తానికి ఖతార్ ఒక బోయింగ్ 747 జంబో పీడను ఇలా వదిలించుకుంది.ఇంకా ఇలాంటివే మరో రెండు విమానాలు దాని దగ్గరున్నాయి. పరిమాణంలో పెద్దవైన, సుందరంగా అలంకరించిన, వాడకపోయినా నిరంతరం సరైన స్థితిలో (కండిషన్లో) ఉంచాల్సిన, ఇంధనం విపరీతంగా తాగే, పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇలాంటి విమానాలకు డిమాండ్ పడిపోయిందని తాజా ఉదంతం చాటుతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఈ విమానాలను కొనేవారు లేరు. అందుకే రాజకుటుంబాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా ఈ ‘తెల్ల ఏనుగు’లను వదిలించుకునే పనిలో ఉన్నాయి.Qatar gifted this Boeing 747 Jumbo Jet to the US defence department during the visit of Presidnet Donald Trump. pic.twitter.com/d5ad0k2Q0M— Aftab Chaudhry (@AftabCh81) May 15, 2025ఇతర ఆధునిక దేశాల మాదిరిగానే ఖతార్ కూడా ప్రస్తుతం నాజూకైన, బహుళ ప్రయోజనకర, ఆర్థిక అంశాలు కలిసొచ్చే, అధికారిక ప్రయాణాలకు అనువుగా ఉండే విమానాల వైపు మొగ్గు చూపుతోందని దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ ‘బీఏఏ & పార్టనర్స్’ మేనేజింగ్ డైరెక్టర్ లైనస్ బాయర్ ‘ఫోర్బ్స్’కు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-8 విమానాన్ని ఖతార్ అప్పగించడాన్ని ఓ ‘సృజనాత్మక పరిష్కార వ్యూహం’గా, ‘ఆకాశంలో పోటాపోటీ బలప్రదర్శన అనే గతించిన నమూనాకు వీడ్కోలు’గా బాయర్ అభివర్ణించారు.అంతా ‘ఆయిల్ అండ్ గ్యాస్’ మహిమ!సౌదీ అరేబియా పక్కనే పర్షియన్ సింధుశాఖలో సుమారుగా అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర భూభాగం సైజులో ఉంటుంది ఖతార్ ద్వీపకల్పం. చమురు, సహజ వాయువు నిక్షేపాలు తెచ్చిపెట్టిన సంపద ఈ దేశాన్ని తలసరి జీడీపీ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలబెట్టింది. అటు ఖతార్ పాలకులనూ ఆగర్భ శ్రీమంతులను చేసింది. అలా ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని కుటుంబం సిరి సంపదలతో అలరారుతోంది. దీంతో దాదాపు డజను ఎయిర్ బస్, బోయింగ్ విమానాల శ్రేణిని థాని కుటుంబం సమకూర్చుకుంది. కొద్దిమంది వ్యక్తులు విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి వీలుగా ఆ విమానాలకు మార్పులు చేయించారు.ఇవి కాకుండా రాజ కుటుంబానికి చిన్నపాటి బంబార్డియర్, డసాల్ట్ బిజినెస్ జెట్స్ ఎలాగూ ఉన్నాయి. ట్రంప్ కు బహూకరించిన 747 విమానం తోకపై ‘ఏ7-హెచ్బీజే’ (A7-HBJ) అని ఉంటుంది. 2007 నుంచి 2013 వరకు ఖతార్ ప్రధానమంత్రిగా వ్యవహరించిన హమద్ బిన్ జసిమ్ బిన్ జబర్ అల్ థాని పేరులోని తొలి మూడు పదాల ప్రధమ అక్షరాలను ‘హెచ్బీజే’ (HBJ) స్ఫురింపజేస్తుంది.ప్రస్తుతం ఖతార్ ‘రాజ’ విమానాల శ్రేణిలో ఉన్న మూడు 747-8 విమానాల్లో ఈ విమానం ఒకటి. ‘ఖతార్ అమీరీ ఫ్లైట్’ సంస్థ దీని నిర్వహణను చూస్తోంది. 13 ఏళ్ల కిందట 2012లో కొనుగోలు చేసినప్పుడు ఈ విమానం ఖరీదు 367 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,130 కోట్లు. కొన్న తర్వాత మూడేళ్లపాటు వందల కోట్లు కుమ్మరించి విమానం లోపలి స్వరూపాన్ని (ఇంటీరియర్) సుందరంగా తీర్చిదిద్దారు. సాధారణ బోయింగ్ 747-8 విమానంలో 467 మంది ప్రయాణించవచ్చు. కానీ ‘ఎగిరే ప్యాలెస్’గా అభివర్ణిస్తున్న ‘హెచ్బీజే’లో 89 మంది మాత్రమే ప్రయాణించేలా మార్పులు చేసి హంగులు అద్దారు. రెండు పడక గదులు, వినోద గది, సమావేశ గదులు అందులో ఉన్నాయి.ఎగిరితే గంటకు రూ.20 లక్షల ఖర్చు!బోయింగ్ తయారుచేసే 747 సిరీస్ విమానాలు 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. వైమానిక దూర ప్రయాణాలను అవి ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. అయితే పెరుగుతున్న ఇంధనం ధర ఆకాశవీధిలో ఈ నాలుగు భారీ ఇంజిన్ల విమానం ప్రయాణాన్ని వ్యయభరితంగా మార్చింది. ‘కార్పొరేట్ జెట్ ఇన్వెస్టర్’ అంచనా ప్రకారం 747-8 వీఐపీ వెర్షన్ విమానాన్ని ఆపరేట్ చేయడానికి గంటకు 23 వేల డాలర్లు (రూ.20 లక్షలు) ఖర్చవుతుంది. వ్యయభారం తట్టుకోలేక గత దశాబ్ద కాలంగా పలు విమానయాన సంస్థలు బోయింగ్ 747, నాలుగు ఇంజిన్ల ఎయిర్ బస్ ఏ340 విమానాలను సేవల నుంచి తప్పిస్తున్నాయి. వీటి బదులుగా రెండు ఇంజిన్లు గల వెడల్పాటి బోయింగ్ 787, ఎయిర్ బస్ ఏ350 విమానాలపై ఆధారపడుతున్నాయి. నాలుగు ఇంజిన్ల 747 సిరీస్ విమానాలు ఇంధనాన్ని విపరీతంగా తాగుతాయి!.ఈ ‘ఎగిరే భవనాలు’ను ఒక్క ఖతారే కాదు.. సౌదీ అరేబియా, బ్రూనై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ కూడా క్రమంగా వదిలించుకుంటున్నాయి. తక్కువ ఇంధన సామర్థ్యం అటుంచి పెద్ద విమానాలతో భద్రతాపరమైన సమస్యలున్నాయని, వాటిని పెద్ద లక్ష్యాలుగా ఎంచుకునే ప్రమాదం ఉందని ఏరోడైనమిక్ అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ అబౌలాఫియా చెప్పారు. పెద్ద విమానాలు దిగాలంటే పొడవైన రన్ వేలు కావాలని, దాంతో ఆ విమానాల వినియోగం పరిమితమేనని వివరించారు. సన్నటి విమానాలకైతే చాలా ఎయిర్ పోర్టులు, సంప్రదాయ బిజినెస్ జెట్స్ అయితే మరిన్ని విమానాశ్రాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. 2020లో మార్కెట్లో అమ్మకానికి పెట్టడానికి ముందు ఐదేళ్లలో ఖతారీ విమానం ప్రయాణించింది మొత్తం కలిపి 1,059 గంటలే.ఇక ఖతార్ దగ్గరున్న మిగతా రెండు వీఐపీ 747-8 విమానాల్లో ఒకదాన్ని పూర్తిగా క్రియాశీల సేవల తప్పించారని లైనస్ బాయర్ తెలిపారు. 2018లో ఖతార్ ఇలాంటి 747-8 విమానాన్నే తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు కూడా ఇచ్చింది. మరో పాత 747-ఎస్పీ విమానాన్ని ఓ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించగా దాన్ని ఆ సంస్థ స్టోరేజికి తరలించింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడు. సౌదీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ 2011లో మరణించాడు. అతడి మరణానికి ముందు ఓ విలాసవంతమైన 747-8 విమానాన్ని అతడి కోసం సేవల్లోకి తీసుకున్నారు. కేవలం 42 గంటలే ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి 2022లో తుక్కు కింద ముక్కలు చేశారు. ప్రస్తుతం సౌదీలో రాజకుటుంబ ఉపయోగంలో ఉన్న 747 విమానాల శ్రేణిని ఒకే ఒక విమానానికి కుదించారు. సౌదీ యువరాజు మఃహమ్మద్ బిన్ సాల్మన్ ప్రస్తుతం బోయింగ్ 737, 787-8 వంటి చిన్న విమానాలు వినియోగిస్తున్నారు.అయితే లోపల ఖాళీ ప్రదేశం అధికం కనుక బోయింగ్ 747-8లకు సరకు రవాణా (కార్గో) రంగంలో మంచి డిమాండ్ ఉంది. 2023లో కర్మాగారం నుంచి బయటికొచ్చిన చివరి 747-8తో కలిపి బోయింగ్ ఇప్పటివరకు మొత్తం 155 విమానాలను విక్రయించగా వాటిలో రెండొంతులు సరకు రవాణాలోనే నిమగ్నమయ్యాయి. కేవలం కొద్దిమంది దూర ప్రయాణాల కోసమని స్వరూపం పరంగా, యాంత్రికంగా, కస్టమ్ ఇంటీరియర్స్ పరంగా మార్పులు చేసిన ఖతారీ 747-8 విమానాలను కార్గో విమానాల రూపంలోకి తేవడం కష్టమని బాయర్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక బహుమతిగా ట్రంప్ స్వీకరిస్తున్న ఖతార్ విమానాన్ని పరికిస్తే... భద్రతపరమైన నిబంధనలను సడలిస్తే తప్ప... ఆ విమానాన్ని విడదీసి పునర్నిర్మించడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని రిచర్డ్ అబౌలాఫియా అంచనా. అంటే అప్పటికి అధ్యక్షుడిగా ట్రంప్ రెండో విడత పుణ్యకాలం... ఆ విమానంలో తిరగాలనే ఆయన బులపాటం తీరకుండానే ముగిసిపోతుంది! - జమ్ముల శ్రీకాంత్ Source: Forbes -
బాలీవుడ్లో ప్రభాస్‌ని కొట్టేదెవరు?
ఇప్పుడు బాలీవుడ్‌కి టాలీవుడ్ సత్తా తెలిసివచ్చింది. ఒకనాటి హీరోల్లా ఏదో వచ్చాం అంటే వచ్చాం చేశాం అంటే చేశాం అన్నట్టు ఒకటీ అరా చేసి పోయే రకం కాదని, ఒకసారి కాలు పెడితే కార్చిచ్చులా వ్యాపించే నేటి తరం తెలుగు హీరోలను ఆపడం తమ తరం కాదని హిందీ బెల్ట్‌కి ఇప్పుడు బాగా అర్ధమవుతోంది. నిజానికి బాలీవుడ్ కి ఒకప్పుడు తెలుగు సినిమా అంటే శతకోటి ఇండస్ట్రీల్లో అదొకటి. తెలుగు ఫిలిం మేకర్స్ ను చాలా తక్కువ చేసి చూసేవారు. దీన్ని మార్చాలని తామూ తక్కువేం కాదని నాటి సీనియర్ హీరోలు చాలా ప్రయత్నించారు. ఒకానొక దశలో అమితాబ్‌ను కూడా దాటేసి చిరంజీవి దేశంలోనే హైపెయిడ్ ఆర్టిస్ట్‌గా నిలిచి తన సత్తా చాటారు. అయినా ఇవేవీ బాలీవుడ్ బుర్రకెక్కలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లు డైరెక్ట్ హిందీ చిత్రాల్లో నటించి అప్పుడప్పుడు అక్కడ మెరుపులు మెరిపించినా పెద్దగా ఒరిగింది అంటూ ఏమీ లేదు. (చదవండి: సమంత డేటింగ్ రూమర్స్.. డైరెక్టర్ రాజ్ సతీమణి పోస్ట్ వైరల్!)అదంతా ఒకెత్తయితే ‘బాహుబలి’ఒక్కటీ ఒకెత్తయింది. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్లూ తనవైపు తలెత్తి చూసే రేంజ్ కు మన తెలుగు సినిమా ఎదిగింది. ఓ వైపు బాలీవుడ్లో ప్రభాస్(Prabhas) ప్రభంజనం కొనసాగుతుండగానే దూసుకొచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్(Ram Charan)లు, ‘పుష్ప’, ‘పుష్ప 2’ల తో అల్లు అర్జున్(Allu Arjun) కూడా నార్త్ లో బాలీవుడ్ హీరోలకు థీటుగా కలెక్షన్లు, ఫాలోయింగ్‌ను అందుకుంటూ ఇండియన్ సినిమాపై బాలీవుడ్ ఆధిపత్యాన్ని కుప్పకూల్చారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి ఎదిగిన మన హీరోల్లో అక్కడ అగ్రపీఠం కోసం ఇంటర్నల్ వార్ మొదలైంది. ప్రస్తుతం వీరిలో ఎవరికి వారే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ... అందరిలో ప్రభాస్ కాస్త ముందున్నాడని చెప్పక తప్పదు. ముఖ్యంగా హైట్, వెయిట్ సహా కటౌట్లో బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ప్రభాస్‌ను నార్త్ జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత విడుదలైన ప్రభాస్ సినిమాలు కూడా బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ సాధించడానికి అదే కారణం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ టాలీవుడ్లో ఫ్లాప్ కాగా, అక్కడ సూపర్ హిట్ గా ‘ఆదిపురుష్’ కి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ‘సలార్’ ‘కల్కి’ లు బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాయి. మరోవైపు ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత దేశవ్యాప్తంగా విడుదలై ఎన్టీఆర్ , రాంచరణ్..ల సినిమాలకు నార్త్‌లో అంతగా కలెక్షన్స్ రాలేదు. హైప్ కూడా క్రియేట్ కాలేదు. ఇక అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా కనపడింది కానీ.. అది తర్వాతి సినిమా వరకు ఎంత వరకూ కొనసాగుతుందనేది అప్పుడే ఏమీ చెప్పలేము. పుష్ప రాజ్ పాత్ర ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న స్థాయిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడా? అంటే అవునని అప్పుడే చెప్పడం సరికాదు. ఈ నేపధ్యంలోనే ప్రభాస్‌ని ఢీ కొట్టడానికి మిగిలిన హీరోలు నార్త్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడి సినిమాల ద్వారా అక్కడకు వెళ్లడం కాకుండా..నేరుగా బాలీవుడ్ సినిమాలు చేయడం మీద దృష్టి పెట్టారు. ‘వార్ 2’ లో హృతిక్ రోషన్‌తో పాటు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఆమిర్ ఖాన్ తీస్తున్న‘ ‘మహాభారతం’లో అర్జునుడి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అలాగే రాంచరణ్ కూడా సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. మరి ఈ మల్టీస్టారర్ సినిమాల ద్వారా ప్రభాస్‌ను ఎంత వరకూ దాటగలరో...బాలీవుడ్లో సౌతిండియా సూపర్‌స్టార్ ఎవరు కానున్నారో.. -
జా.ఎన్టీయార్, హృతిక్‌ల వార్2 వసూళ్లు.. రూ.100కోట్లు..
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్, స్టార్ హీరో ఎన్టీఆర్(Jr NTR) జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2‘(War 2) విడుదల కాకముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీయార్ ల అనూహ్య కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైన నాటి నుంచే సంచలనంగా మారింది. ఈ చిత్రం ద్వారా హృతిక్ రోషన్ మళ్లీ తన స్పై క్యారెక్టర్ ’కబీర్’గానే స్క్రీన్ మీదకి రానుండగా, మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలియడం మరింత ఆసక్తిని పెంచింది. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్రహీరోలు పరస్పరం తెరపై తలపడడం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అడ్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానూ బాలీవుడ్, టాలీవుడ్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ‘వార్ 2‘ పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి దక్షిణాది వ్యాప్తంగా ఈ సినిమా హైప్‌కి ప్రధాన కారణం జూ.ఎన్టీఆర్ కి ఇటీవలి కాలంలో అమాంతం పెరిగిన క్రేజ్ అనేది నిస్సందేహం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీఆర్ హవా ఇటీవల రెట్టింపైంది. ఆర్ఆర్ఆర్, దేవర...ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడమే సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఎగబడడానికి కారణంగా చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో విడుదలకి ముందే ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైపోవడం ఓ రికార్డ్‌గా చెప్పాలి. తద్వారా ఈ సినిమా భారత మూవీ మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్‌కి కొబ్బరికాయ కొట్టినట్టయింది. భాషా అంతరాలను దాటి స్టార్ హిరోల క్రేజ్, మల్టీ లాంగ్వేజ్ సినిమాలకి పెరిగిన ఆదరణ కారణంగా ఇటువంటి డీల్స్ ముందుగానే ఖరారవడం ఇక షురూ కావచ్చు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగా వంశీ, సునీల్ నారంగ్ ఈ లాభదాయకమైన డీల్‌ను చేజిక్కించుకున్నారు. విడుదలకి మూడేళ్లు ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి నేపధ్యంలో ఆగస్టు 14, 2025న విడుదల కానున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
హీరో ఆఫర్లు వద్దని.. స్టార్‌గా మారిన శోభన్ బాబు మనవడు ...
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నట భూషణుడు శోభన్ బాబు(Sobhan Babu).. ఎన్టీయార్, కృష్ణ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రేక్షకవర్గాన్ని సృష్టించుకున్నారు. ముఖ్యంగా మహిళాదరణలో ఆయనకు సాటిలేదు. తన సమకాలీకులైన మిగిలిన హీరోల్లా కాకుండా సినీరంగానికి దూరమైన తర్వాత ఆయన కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు పబ్లిక్ లైఫ్ నుంచే అదృశ్యం అయిపోయారు. అంతేకాదు ఆయన వారసులను కూడా ఎవరినీ సినీ రంగంలోకి పరిచయం చేయలేదు. దాంతో ఆయన దివంగతులయాక ఆయన వారసులకు సంబంధించిన విశేషాలు కూడా ఎక్కడా పెద్దగా వెలుగు చూడలేదు. ఈ నేపధ్యంలో తాజాగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారంటూ వచ్చిన వార్తలు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి రేకెత్తించాయి. అలనాటి అందాల నటుడి రూపాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు... పలు సినిమా ఆఫర్లు వచ్చినా తిరస్కరించిన సురక్షిత్...సార్ధక నామధేయుడిగా మారి ఎంచుకున్న రంగంలో స్టార్ అనిపించుకుంటున్నారు.(చదవండి: రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?)తమిళనాడులో స్థిరపడ్డ ఆయన సినిమా రంగంలో కాకుండా వైద్య రంగంలో తాతకు తగ్గ మనవడుగా రాణిస్తుండడం అందర్నీ ఆకర్షిస్తోంది. దాదాపు 4.5 కిలోల గర్భాశయాన్ని అత్యాధునిక సాంకేతికత ద్వారా తొలగించి డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల మహిళకు గర్భాశయంలో భారీ కణితి ఏర్పడింది. ఇతర ఆస్పత్రులు ఓపెన్ సర్జరీ తప్ప మార్గం లేదని సూచించగా, డాక్టర్ సురక్షిత్ 3డీ ల్యాపరోస్కోపిక్ సాంకేతికతను ఉపయోగించి 8 గంటల పాటు శ్రమించి ఆ గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించారు. అంతేకాదు 2019లో డాక్టర్ సురక్షిత్ గురువైన డాక్టర్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ ద్వారా తొలగించి సాధించిన గిన్నిస్ రికార్డును బద్దులు కొట్టి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు.సేవాస్టార్..డాక్టర్ సురక్షిత్ చెన్నైలోని అన్నా నగర్లో 2016లో ఇండిగో ఉమెన్స్ సెంటర్‌ను స్థాపించారు. తన కెరీర్లో ఇప్పటివరకు 10,000కు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించి, 40కి పైగా అవార్డులు అందుకున్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు శోభన్ బాబు పేరుతో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. టెడెక్స్ స్పీకర్, ఫిట్నెస్ ఫ్రీక్ డిజిటల్ విద్యావేత్త అయిన డాక్టర్ సురక్షిత్ బత్తినకు సెలబ్రిటీల స్థాయిలో 1.65లక్షలకు పైగా ఇన్‌స్ట్రాగామ్ ఫాలోయర్స్ ఉండడం విశేషం. ఆయన శాస్త్రీయ విధానాలను సలహాలను వ్యాప్తి చేస్తున్నారు. ‘భారతదేశ సంతానోత్పత్తి రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్న ఐవీఎఫ్ లాంటి కార్పొరేట్ సంస్కృతికి వ్యతిరేకం అయినప్పటికీ... వంధ్యత్వానికి మూల కారణాలకు చికిత్స చేయడం సహజ గర్భధారణను ప్రోత్సహించడం కోసం ప్రత్యేంగా కృషి చేస్తున్నాను‘ అని డాక్టర్ బత్తిన చెబుతున్నారు. -
పాన్ ఇండియా హీరో..పబ్లిక్ లైఫ్‌లో జీరో...
ఎర్రచందనం స్మగ్లింగ్.. నీకేం తెలుసు? అని పుష్ప సినిమా చూసిన ప్రేక్షకుడ్ని అడిగితే?.. కల్కి సినిమా స్టోరీ లైన్ ఏమిటంటే ఆ సినిమా చూసిన వారిలో ఎంతమంది ప్రేక్షకులు ఠక్కున చెప్పగలరు? ఆర్ఆర్ఆర్ సినిమా సన్నివేశాలకు మన ఇంటి చుట్టుపక్కల పరిస్థితులకు ఏమన్నా సంబంధం ఉందా? దేవర మూవీలో హీరోని చూస్తూ అతనితో మనకు తెలిసిన వారిని ఎవరినైనా పోల్చుకోగలమా? హిట్ 3లో చూపించిన డార్క్ వెబ్ గురించి తెలియడం అటుంటి అసలు ఆ పదం మనలో ఎందరు విని ఉంటాం?ఛత్..ఇవన్నీ ఎందుకు బాస్... ఆ సినిమాలన్నీ జనం జేబులు కొల్లగొట్టి మనకు కలెక్షన్ల మూటలు కొట్టుకొచ్చాయి కదా. అది చాలు అంటోంది టాలీవుడ్. పాన్ ఇండియా పేరుతో ప్రజలకు పరిచయం లేని సంబంధం లేని అక్కర్లేని, రంగుల హంగుల విచిత్రాల్ని కళ్ల ముందుకు తెస్తోంది. అయితేనేం అవి హిట్ అవడం లేదా అంటే అవుతున్నాయి. బ్రహ్మాండంగా కలెక్షన్లు తెస్తున్నాయి. కానీ అదొక్కటే చాలా? ఏమీ అర్ధం కాకపోయినా జురాసిక్ పార్క్, అవతార్..వగైరా చిత్రాలు మన దగ్గర కూడా భారీ కలెక్షన్లు కురిపించాయి. అంతమాత్రాన అలాంటివే మనమూ తీయాలని అనుకుంటామా? విదేశీ చిత్రాలకు ఇక్కడ మనుషులతో, ఇక్కడి మనస్తత్వాలతో, ఇక్కడి పరిస్థితులతో పనిలేదు.. అవసరం లేదు. కానీ ఇక్కడి సినిమాలు ఇక్కడి మనుషులతో పెనవేసుకున్నాయి. ఇక్కడి ప్రజల కష్టంతో తయారవుతున్నాయి. వారి కష్టంతోనే దర్జాగా బ్రతుకుతున్నాయి. కాబట్టి జనం చూస్తున్నారు మేం తీస్తున్నాం అనేది ప్రాంతీయ సినిమాల వరకూ సరైన విధానం కాదు.(చదవండి: భారత్‌పై ప్రశంసలు.. హీరోయిన్‌కి బెదిరింపులు!)పెద్ద ఎన్టీయార్ తరం చూస్తే నాటి హీరోలు ఎన్ని రకాల సినిమాలు చూపించారు? దైవ భక్తి నుంచి దేశభక్తి దాకా బోధించేవి...అవినీతి అరికట్టమని అన్యాయాన్ని ఎదరించమని రక్త సంబంధాలకు విలువీయమని...రాజకీయాలను బాగు చేయమని...సందేశాలిచ్చేవి ఇలా సామాజిక అంశాలతో ముడిపడిన సినిమాలు ఎన్నో వచ్చాయి... మంచి చెడు రెండింటినీ జనానికి విడమరిచాయి. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి సినిమాలు సృష్టించాడు కాబట్టే ఎన్టీయార్ అనే వ్యక్తిని జనం తమ అన్నగా గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు. పార్టీ పెట్టిన ఆర్నెళ్లలోనే సిఎంని చేసి నెత్తిన పెట్టుకున్నారు.(చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!)ఆ తర్వాత డ్యాన్సులు, ఫైట్లకు పెద్ద పీట వేసిన చిరంజీవి తరం కూడా జనరంజక సినిమాలనే అది కూడా జనజీవన స్రవంతికి దూరం కాకుండానే అందించింది. తొలిదశలో చేసిన అభిలాష, స్వయంకృషి, ఛాలెంజ్‌ల నుంచి రాజకీయాలకు ముందు చేసిన ఠాగూర్,స్టాలిన్... దాకా మన సమాజంతో ముడిపడిన కధాంశాలతో చేశాడు కాబట్టే చిరంజీవి ఒక పార్టీ పెట్టి 19 సీట్లు, 70లక్షల ఓట్లు దక్కించుకోగలిగాడు. అయితే ఇక్కడ సినిమా నటులు అందరూ రాజకీయాల్లోకి రావాలని ఈ విషయాలు చెప్పడం లేదు. వారి వృత్తికి, ఎంచుకున్న రంగానికి, చేసే పనికి ప్రజలతో మమేకమైతే అది ఎంతగా ప్రజల్లో వారిపై ఆదరణ పెంచుతుందో సోదాహరణగా చెప్పడమే ఉద్ధేశ్యం. ప్రజల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపే శక్తి సినిమాలకి ఉంది అనడం నిస్సందేహం. అలాంటి సినిమాలను ప్రజల దైనందిన జీవితాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా తెరకెక్కించడం అంటే వారి జేబులు కొల్లగొట్టడం తో తప్ప వారి కష్టనష్టాలతో తమకేమీ సంబంధం లేదని నిస్సిగ్గుగా తేల్చి చెప్పడమే.(చదవండి : ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక)అంటే జనం కోసం సినిమా తీసి మమ్మల్ని డబ్బులు పోగొట్టుకోమంటావా? అని నిర్మాతలు, ఫ్లాప్ సినిమాలతో ఫ్యాన్స్‌ని దూరం చేసుకోమంటావా? అని ప్రశ్నించే హీరోలు ఉంటారు. అయితే సందేశాత్మక చిత్రాలకు కలెక్షన్లు రావనేది అర్ధసత్యం మాత్రమే. వాటిలోనూ హిట్స్, ఫ్లాప్స్ అవుతుంటాయి. గేమ్ ఛేంజర్ లాగా అవాస్తవిక చిత్రణతో తీస్తే ఫ్లాప్‌లు అదే ‘కోర్ట్’ లాగా వాస్తవ పరిస్థితులకు అద్దం పడితే కలెక్షన్లు వస్తాయని తెలుస్తూనే ఉంది. అలాగని భారీ చిత్రాలు కాల్పనిక కధాంశాలు వద్దనడం లేదు అవి కూడా తీయవచ్చు, సదరు గ్రాఫిక్ ఆధారిత చిత్రాలతో అంతర్జాతీయంగా మన సినిమాల పేరు ప్రతిష్టలు పెంచవచ్చు. కానీ అవి మాత్రమే తీయాలని అనుకోకూడదు. ప్రజలతో సంబంధం ఉన్నవి కూడా తీయాలి. వారి కష్టనష్టాలకు ఊరటనిచ్చేవి, వారి రేపటికి బాటలు పరిచేవి, వారి బాగుకి దిక్సూచిగా నిలిచేవి కూడా చేయాలి. కనీసం రెండేళ్లకు ఒకటైనా లో బడ్జెట్లో అయినా సామాజిక అంశాలతో సినిమా చేస్తామని పెద్ద హీరోలు తమకు తాము మాట ఇచ్చుకోవాలి. తమకెన్నో ఇచ్చిన సమాజం రుణం తీర్చుకోవాలి. అలా కాదు..అవన్నీ చిన్న హీరోలకు వదిలేస్తాం...మేం మాత్రం ఇలాగే వీడియో గేమ్స్ తరహా చిత్రాలు చేసుకుంటూ ప్రజల కళ్లు విప్పార్చుకునేలా చేస్తూ డబ్బు చేసుకుంటాం...అంటే..ఖచ్చితంగా అది అన్యాయమే, సామాజిక బాధ్యత లేకపోవడమే.. అప్పుడు పెద్ద హీరోల దగ్గర డబ్బులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు..కానీ ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. అలా లేనప్పుడు పేరుకి పెద్ద హీరో అయినా చివరకు జీరోగానే మిగులుతాడు. -
అమెరికన్లకు కొత్త కష్టాలు.. లిప్ స్టిక్ ముద్దు.. చెడ్డీలు వద్దు!
దేశంలో .. కాదు కాదు.. అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ ఏం బాలేదు. పెద్ద పెద్ద సంస్థలే వేలల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఉన్న వాళ్ళతో సర్దుకోండి కొత్త స్టాఫ్‌ను ఇచ్చేది లేదంటున్నాయి. హైక్స్ .. ఇంక్రిమెంట్స్ గురించి పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. ఉన్న ఉద్యోగం ఊడిపోకుండా చూసుకోండి.. అదే పదివేలు అంటూ సూచనలు చేస్తున్నాయి. అమెరికా ఐటీలో వచ్చిన పెనుమార్పు ఆయా రంగాల్లోని పనిచేస్తున్న వాళ్ల జీవితాలనే కాదు మొత్తం అమెరికా జీవితాల్లో పెనుమార్పులు తెచ్చిందట. అసలు పొదుపు.. ప్లానింగ్. డబ్బంటేనే లెక్కలేకుండా జీవించే అమెరికన్లు ఈ ఆర్థిక మాంద్యం పరిస్థితులను ముందే ఊహించి.. కుటుంబ ఖర్చులను భారీగా తగ్గిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.ఖరీదైన ఆహారం తినడం తగ్గించారట. అంటే లంచ్ టైములో స్టాఫ్‌తో పాటు అలా వెళ్లి రెస్టారెంట్లో తినే అలవాటున్న వాళ్ళు సైతం ఇప్పుడు ఆ పద్ధతి మానుకుని పద్ధతిగా ఇంటి నుంచి డబ్బా తీసుకువెళ్తున్నారట. బుద్ధిగా ఇంటి భోజనం చేస్తూ.. దిసీజ్ హెల్దీ యూ నో అంటున్నారట. దీంతోబాటు జెంట్స్ కూడా సెలూన్లలో ఖర్చు తక్కువ.. అంటే చావకరకం మసాజులు.. క్రాఫ్ స్టైల్స్ వంటివి కోరుతున్నారు తప్ప అప్పట్లా ఖరీదైన సేవలకు నో అంటున్నారట. అంటే ఓ నాలుగువేల ఖరీదుండే మసాజ్ ఎందుకులే గురూ ఓ. వెయ్యితో ముగించు.. అసలే రోజులు బాలేవు అంటున్నారట. దీంతోబాటు గోళ్ళ సంరక్షణ కు ఎక్కువ ఖర్చు చేయడం ఎందుకని ఏకంగా కృత్రిమ గోళ్లు రకరకాల డిజైన్లలో రెడీమేడ్ కొనుక్కుని పెట్టుకుంటున్నారట. పెడిక్యూర్.. మానిక్యూర్ వంటివి చేయించాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద ఖర్చుతో టూర్లు తగ్గిస్తున్నారు.లిప్ స్టిక్ కొందాం.. చెడ్డీలు వద్దులే ఇదంతా ఒకెత్తు అయితే .. ఆర్థిక మాంద్యం ప్రభావమో.. భయం కారణంగానో కానీ రెండు అంశాల్లో మాత్రం చిత్రమైన తేడా కనిపిస్తోంది. దేశంలో లిప్ స్టిక్ కొనుగోళ్లు భారీగా పెరిగాయట. ఇదే తరుణంలో పురుషుల లో దుస్తులు.. ముఖ్యంగా డ్రాయర్లు కొనుగోళ్లు తగ్గినాయి అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఖరీదైన సౌందర్య సాధనాలు.. క్రీములు కొనడానికి మహిళలు వెనుకాడుతున్నారు. వేలకువేలు పెట్టి పార్లర్లకు వెళ్ళడానికి ఇష్టపడని మహిళలు.. పోనీ మంచి లిప్ స్టిక్ అయినా కొనుక్కుందాం అని నిర్ణయించుకుని వాటితో సర్దుకుంటున్నారట. అందంగా ఉండాలంటే పార్లర్ కు మాత్రమే వెళ్లాలా ఏంటి వదినా.. ఇదిగో ఈ లిప్ స్టిక్ వేసుకున్నాక నేను చాలా అందంగా ఉన్నానని మీ అన్నయ్యగారు మెచ్చుకున్నారు అంటూ ఒకరికోరు చెప్పుకుంటున్నారట.దీంతో మహిళలు జస్ట్ లిప్ స్టిక్ కొనుక్కుంటో సంతృప్తి చెందుతూ ఖర్చులు తగ్గిస్తున్నారట. అందుకే లిప్ స్టిక్ అమ్మకాలు పదిశాతం పెరిగాయట. మరోవైపు పురుషులు కూడా ప్యాంట్ షర్ట్. వంటివి బావుంటే చాలు లోపల వేసుకునే చెడ్డీలకు అంత ఖర్చు ఎందుకు ఉన్నవాటినే ఏదోలా సర్దుబాటు చేసుకుందాం.. వాటికోసం మళ్ళీ డాలర్లు ఎందుకు తగలెయ్యాలి.. లోపల వేసేది ఎవరు చూస్తారు అంటున్నారట. మొత్తానికి మాంద్యం ప్రభావం చెడ్డీల మీద కూడా పడింది. -సిమ్మాదిరప్పన్న. -
రజనీ,నాగార్జున... ఎన్టీయార్ , హృతిక్ ‘వార్’ తప్పదా?
భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో... అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కూలీ(Coolie) పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్లో రిలీజ్ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్‌కు మారింది. లోకేష్ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్‌ల సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్ 2(War 2) కూడా అదే సమయంలో రిలీజ్ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో వార్ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా ఇప్పటికే ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్ తప్పదు. రెండు సినిమాల జోనర్ వేరువేరు..అయినప్పటికీ... ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్ 14న వస్తే, బాక్సాఫీస్ వద్ద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్ హీరోలు మరోవైపు ఎన్టీఆర్, హృతిక్‌ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్ టాపిక్స్ అవుతుంది అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. -
భారతీయ తొలి ఐటమ్ గాళ్ ఓ పాకిస్తానీ..
భారతీయ సినిమా చరిత్రలో ఐటమ్ సాంగ్స్ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇటీవలి కాలంలో అయితే బాలీవుడ్ చిత్రాలు ఐటమ్ సాంగ్ లేకుండా పూర్తి కాదన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. మలైకా అరోరా ‘హోత్ రసిలే’, కరీనా కపూర్ ‘ఫేవికోల్ సే’, సమంతా ‘ఊ అంటావా’, నోరా ఫతేహి ‘దిల్బర్ దిల్బర్’ వంటి పాటలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా తమన్నా భాటియా ఆజ్‌కీ రాత్ ద్వారా ఐటమ్ క్వీన్‌గా మారిపోయిన సంగతీ తెలిసిందే. ఇంతగా భారతీయ సినిమా చరిత్రలో మమేకం అయిపోయిన ఈ ఐటమ్ నంబర్ల చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా?సినిమా పరిజ్ఞానం బాగా ఉన్నవారు కూడా ఈ ఐటమ్ నంబర్ల ట్రెండ్‌ను హెలెన్, బిందు లేదా జీనత్ అమెన్ మొదలుపెట్టారని అనుకుంటారు. కానీ నిజానికి వీళ్లందరి కన్నా ముందుగానే శృంగార నర్తకిగా తెరపై చిందేసిన ఇండియా ఫస్ట్ ఐటమ్ గర్ల్ ఎవరో తెలుసా? ఆ గౌరవం ‘మేడమ్ అజురీ‘(Madame Azurie)కి దక్కింది.అన్నా మేరీ గ్వీజెలర్...ఉరఫ్ మేడమ్ అజురీ... బాలీవుడ్లో తొలి ఐటమ్ డాన్సర్ ఎలా అయింది? అనే ప్రశ్నలు కలిగితే... ఒకసారి చరిత్ర తవ్వి తీయాలి. దాదాపు వందేళ్ల క్రితం... అంటే 1930లలో హీరోయిన్లకు భిన్నంగా ప్రత్యేక డాన్సర్ పాత్రలను సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టిన పేరే మేడమ్ అజురీ అని చెప్పాలి. బెంగళూరులో జన్మించిన ఆమె తల్లి హిందూ బ్రాహ్మణ నర్స్ కాగా, తండ్రి జర్మన్ జ్యూయిష్ డాక్టర్. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఆమె తండ్రితో నివసించింది. ఆ సమయంలో ఆమె తండ్రి ఆమెను బాలే నృత్యం నేర్చుకోవడానికి ప్రోత్సహించారు, కానీ భారతీయ నృత్యాలను అభ్యసించేందుకు మాత్రం అంగీకరించలేదు. అజురీ యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం బొంబాయికి తరలివెళ్లింది. ఆమె తండ్రి త్రీ ఆర్ట్స్ సర్కిల్లో సభ్యుడయ్యాడు, ఆ సమయంలో అజురీకి త్రీ ఆర్ట్స్ సర్కిల్ నిర్వాహకురాలు బేగం అతియా ఫైజీ–రహమిన్తో సంభాషించడానికి వీలు కలిగింది.అలా అజురీ అతియా సహకారంతో మరికొన్ని మనవైన కళలు నృత్యాలనుు అభ్యసించగలిగింది. అలా అజురీ పలు నృత్య శైలులను నేర్చుకుని నదిరా సినిమా తో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘పర్దేసీ సయ్యాన్’, ‘క్వత్ల్–ఎ–ఆమ్’, ‘ది బాంబే టాకీస్’, ‘నయా సంసార్’ వంటి చిత్రాలతో సహా 700కి పైగా సినిమాల్లో నటించి, తన డాన్సులతో ఎంతో పాప్యులర్ అయ్యింది.తమ ప్యాలెస్‌లో నృత్యం చేయాలంటూ మేడమ్ అజురీకి బ్రిటన్ లోని బకింగ్ హ్యామ్ ప్యాలెస్ నుంచి ఆహ్వానం అందింది అంటేనే ఆమె పాప్యులారిటీ ఏ స్థాయిలో వెలిగేదో తెలుస్తుంది. దేశ విభజన అనంతరం అజూరీ ఓ ముస్లింను నిఖా చేసుకుని పాకిస్తాన్ లోని రావల్పిండీలో స్థిరపడి, పాకిస్తాన్లో కూడా కొన్ని స్థానిక చిత్రాల్లో నటించిన తర్వాత ఎందుకనో గానీ నటనకు గుడ్‌బై చెప్పేసింది. ఆ తర్వాత అక్కడ ఒక క్లాసికల్ డాన్స్ అకాడమీని ప్రారంభించి, ఏళ్ల తరబడి నృత్యాన్ని బోధించింది. అలా భారతీయ చిత్రాల్లో ఐటమ్ డ్యాన్సులకు ఊపిరిపోసిన అజురీ ఆగస్టు 1998లో మరణించింది. -
రూ.4.5 కోట్లు, రూ.75లక్షలు.. బాలీవుడ్ తారల వస్త్రధారణ ఖరీదు
బాలీవుడ్ సినిమాలు అంటేనే రిచ్‌నెస్‌కి కేరాఫ్ అన్నట్టుగా ఉంటాయి. ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకైనా సరే రెడీ అన్నట్టుగా ఉండే బాలీవుడ్ నిర్మాతలు, కేవలం హీరో, హీరోయిన్ల దుస్తుల కోసం రూ.లక్షల నుంచి రూ.కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. గత కొంత కాలంగా పలు బాలీవుడ్ చిత్రాల్లో తారలు ధరించిన అత్యంత ఖరీదైన దుస్తుల వివరాలివే...–షారూఖ్ ఖాన్ నటించిన వన్ సినిమాలో ఆయన ధరించిన రోబో పాత్రకు తగినట్టుగా రోబోటిక్ వస్త్రధారణలో కనిపిస్తారు. సినిమాలో ఈ గెటప్ చాలా కీలకం కావడంతో దీని కోసం రూ.4.5 కోట్లను నిర్మాతలు ఖర్చు పెట్టారట. ఇప్పటి దాకా అత్యధిక వ్యయం చేసిన కాస్ట్యూమ్ ఇదేనని చెప్పొచ్చు. ఈ కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పాటు విదేశీ డిజైనర్లు రాబర్ట్ లీవర్ వంటివాళ్లు కూడా పాలు పంచుకున్నారు.–రాధా నాచేగీ అనే పాట కోసం నటి సోనాక్షి సిన్హా అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన ఘనత దక్కించుకుంది. తేవార్ సినిమాలోని ఓ పాట కోసం రూపొందించిన డ్రెస్ విలువ ఏకంగా రూ.75లక్షలని సమాచారం.–సింగ్ ఈజ్ బ్లింగ్‌లో హీరో అక్షయ్ కుమార్ ధరించిన టర్బాన్ పూర్తిగా స్వఛ్చమైన ప్లెయిన్ గోల్డ్‌తో తయారు చేశారు. దీని ఖరీదు రూ.65లక్షలు పైనే ఉంటుందట. టర్బాన్ ధరించడాన్ని బాలీవుడ్లో ట్రెండ్‌గా మార్చింది ఈ సినిమా.–బాజీరావ్ మస్తానీ సినిమాలో చారిత్రక వస్త్ర వైభవాన్ని తెరపై ఆవిష్కరించడానికి డిజైనర్ అంజుమోన్ స్వయంగా చేతితో డిజైన్ చేయగా, దీపిక పదుకునే ధరించిన దుస్తులకు రూ.50లక్షలకు పైనే ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఈ డ్రెస్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం అచ్చంగా బంగారంతో చేయడం విశేషం.–కంబక్త్ ఇష్క్ సినిమాలో కరీనా కపూర్ ధరించిన సెక్విన్ మినీ డ్రెస్ ను పారిస్ నుంచి తెప్పించారట. అందుకోసం రూ.8లక్షలు ఖర్చు పెట్టారు. టైటిల్ సాంగ్‌లో ఈ డ్రెస్ ధరించి మెరిసిన కరీనా..కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను సృష్టించింది.–జోథా అక్బర్‌లో మొఘల్ దర్పాన్ని ఒలికించేలా హృతిక్ రోషన్ దుస్తుల్ని డిజైన్ చేయడం కోసం దాదాపుగా 18నెలల పాటు డిజైనర్ నీతాలుల్లా శ్రమించారు. అందులో ఒక కాస్ట్యూమ్ కోసం అత్యధికంగా రూ.12లక్షలు ఖర్చు పెట్టారు. ఇదే సినిమాలో ఐశ్వర్యారాయ్ అందంతో పాటు ఆమె వస్త్ర సోయగం కూడా ఇమిడిపోయేలా రూపొందిన ఐశ్వర్య దుస్తుల కోసం రూ.2లక్షలపైనే ఖర్చు చేశారు.–మార్ డాలా అనే పాట దేవదాస్ సినిమాలో సూపర్‌హిట్. ఆ పాట లో జీవించిన బాలీవుడ్ స్టార్ మాధురీదీక్షిత్ ధరించిన రెడ్ కలర్ దుస్తులు కూడా అంతే హిట్. వీటి ఖరీదు రూ.15లక్షల పైమాటే.–పద్మావతి సినిమా కోసం దీపిక పదుకునే ధరించిన లెహంగా ఏకంగా 30 కిలోల బరువు ఉంటుందట. పూర్తిగా కళాకృతులను ఇముడ్చుకున్న ఈ డ్రెస్... తయారీలో 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారట. కిలోల కొద్దీ బంగారాన్ని వినియోగించిన ఈ దుస్తుల కోసం రూ.30లక్షలు ఖర్చు పెట్టారట.–క్రిష్ 3 సినిమా లో కంగనా రనౌత్ ధరించిన దుస్తుల ఖరీదు రూ. కోటి రూపాయలట.. పారిస్ నుంచి ఒక్కోటి రూ.10లక్షల ఖరీదు లాటెక్స్ సూట్స్ ను తెప్పించారు. అలాంటివి 10 సూట్స్ ఈ సినిమాలో ఆమె ధరించింది.–చారిత్రక యుద్ధాల నేపధ్యంలో తీసిన వీర్ సినిమాలో సల్మాన్ ఖాన్ వారియర్‌గా చూపించే డ్రెస్ ఖరీదు రూ.20లక్షలు. ఈ సినిమాలో యుద్ధవీరునిగా కనిపించే సమయంలో సల్మాన్ ధరించిన దుస్తుల్ని రాజస్థాన్‌కు చెందిన లెదర్ వర్క్ నిపుణులు తయారు చేశారు. ఒక్కోటి రూ.20లక్షల విలువైన అలాంటి 6 వారియర్ కాస్ట్యూమ్స్‌ను ఈ సినిమాలో సల్మాన్ ధరించాడు. -
హైదరాబాద్ పబ్‌లో టాప్ హీరోయిన్... ఊపేస్తోందిగా..
గత ఏడాది లండన్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో అతిధులకు అనుకోని షాక్.. అప్పటి దాకా సంగీతం అందిస్తున్న లోకల్ బ్యాండ్ బృందం మధ్యలోకి అనూహ్యంగా దూసుకొచ్చిందో అందమైన యువతి. హఠాత్తుగా మైక్ తీసుకుని పాడడం ప్రారంభించింది. కాసేపట్లోనే అతిధుల హర్షధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయింది. అప్పట్లో అది అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. ఆమె సాదా సీదా యువతి కాదు మరి...భారత చలనచిత్ర రంగంలో టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన శృతి హాసన్.ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ నటి సరికా ఠాకూర్ కుమార్తె శృతి హాసన్, తెలుగు, తమిళం హిందీ చిత్రాల ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఆమె రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఏడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇటీవల రజనీకాంత్ నటించి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన రాబోయే చిత్రం కూలీ షూటింగ్‌ను శ్రుతి హాసన్ పూర్తి చేసింది. ఆమె అంతర్జాతీయ చిత్రం ‘ది ఐ’ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇటీవల భారతదేశంలో వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు నోచుకుంది కూడా. సానుకూల సమీక్షలను అందుకుంటోంది.ఇలా నటనా పరంగా అనేక రకాల సంచనాలను సృష్టిస్తోన్న శృతి...తన పేరును సార్ధకం చేసుకోవాలని అనుకుంటోంది. ఆమె పాటల ప్రపంచంలోనూ తన సత్తా చాటుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిన్నతనంలోనే సంగీత శిక్షణ పొంది పాడటం ప్రారంభించింది తరువాత తన సొంత బ్యాండ్‌ను సైతం ఏర్పాటు చేసుకుంది. నటీమణులలో పాడే వారే తక్కువ అంటే స్వంత బ్యాండ్ కూడా ఉన్న ఏకైక హీరోయిన్ ఆమె మాత్రమే ఆమె పలు చిత్రాలకు సైతం పాడింది. ఈ సంవత్సరంలో రాబోయే కూలీ చిత్రంలో ఆమె పాత్రతో పాటు, మిస్కిన్ దర్శకత్వం వహించి సంగీతం అందించిన విజయ్ సేతుపతి రాబోయే చిత్రం ‘ట్రెయిన్‘ కు కూడా ఆమె తన గాత్రాన్ని అందించింది. ‘ఇట్స్ ఎ బ్రేక్ అప్ డా‘ పాట కోసం రెహమాన్ తో కలిసి పనిచేసింది. నటన గానం కాకుండా, శ్రుతి ఒక పాటల రచయిత కూడా. ఆమె ‘ఎడ్జ్,‘ ‘మాన్స్టర్ మెషిన్,‘ ‘ఇనిమెల్‘ వంటి ప్రసిద్ధ సింగిల్స్‌తో ఇండీ సంగీత రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది.శ్రుతి తన స్పష్టమైన వ్యక్తిత్వం ప్రత్యేకమైన ఫ్యాషన్సెక్షన్కు ప్రసిద్ధి చెందింది.గాయని శ్రుతి హాసన్ మార్చి 28న హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్ కమ్ క్లబ్‌గా పేరున్న ఓడియం బై ప్రిజంలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. వయసు 21 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అనే నిబంధనతో ఈ కన్సర్ట్ రాత్రి 8:00 గంటలకు ప్రారంభమై 4 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. టిక్కెట్లు ధరలు 1,000 నుంచి ఆపైన...బుక్‌మై షో ద్వారా విక్రయించారు కూడా అయితే ఏమైంతో ఏమో కానీ... ఆ షో వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ 28న శృతి హాసన్ ప్రదర్శన ఉంటుందని తిరిగి అనౌన్స్ చేశారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి మే 3న శృతి రానున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌కు రానున్న శ్రుతి, తన అభిమానులను ఆకట్టుకోవడానికి రాక్, సోల్ భారతీయ ప్రభావాల మిశ్రమాన్ని తీసుకువస్తోంది.ఈ నేపధ్యంలోనే శ్రుతి హాసన్ తాజాగా తన రాబోయే ప్రత్యక్ష ప్రదర్శన సన్నాహాల రిహార్సల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె బ్యాండ్ సహచరులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో మునిగిపోతున్న ఈ వీడియో, తెరవెనుక సంగీతం పట్ల ఉన్న ఆమె మక్కువను చూడటానికి అభిమానులకు వీలు కల్పిస్తుంది. తన ఇన్ స్ట్రాగామ్ పోస్ట్‌లో, శ్రుతి తన తోటి సంగీతకారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారిని ’నేరంలో సోదరులు’ అని పేర్కొంది. ఆమె ఇలా రాసింది, ‘మనం ఆ షో చేసి ఉంటే బాగుండేది కానీ చేయలేక పోయాం (మా తప్పు కాదు) కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడటానికి మేం ఇంకా వేచి ఉండలేం. త్వరలో మీ అందమైన ముఖాలన్నీ చూడాలనుకుంటున్నాను. నా అద్భుతమైన సంగీతకారులకు, నేరంలో ఉన్న నా సోదరులకు ఈ సంగీతం ప్రతిధ్వనించే ధైర్యం ఉన్న కొద్దిమంది ఆత్మలకు ధన్యవాదాలు. త్వరలో హైదరాబాద్‌లో కలుద్దాం, మీకు నా హృదయంలో చోటు ఉందని మీకు తెలుసు‘ అంటూ ఆమె అభిమానులను తన పోస్ట్ ద్వారా ఊరడించింది.ఎప్పుడూ సంగీతం పట్ల మక్కువ కలిగి ఉండే శ్రుతి హాసన్ ఈ సంవత్సరం తన సినిమా కమిట్మెంట్లను నిర్వహిస్తూనే మరిన్ని స్వతంత్ర పాటలను విడుదల చేయనుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యక్ష ప్రదర్శనలకు ఆమె సిద్ధమవుతున్నందున, ఆమె సంగీత ప్రయాణం ఎలా సాగుతుందో చూడటానికి ఆమె అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతానికి, హైదరాబాద్‌లో ఆమె తొలి షో ఆమె శృతి మ్యూజికల్ జర్నీకి మలుపు కానుంది. -
OTT: రాధికా ఆప్టే బోల్డ్ మూవీ ‘ది వెడ్డింగ్ గెస్ట్’ రివ్యూ
రాధికా ఆప్టే.. అందం, నటనతో ఆకట్టుకునే నటి. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో తన ప్రతిభను చాటుతూ, 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2019లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ఫ్రెండ్ కోసం పెళ్లికూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే హీరోలు తెలుగు తెర మీద చాలా మందినే చూశాం. ఈ సినిమాలో హీరో మాత్రం పెళ్లికూతురిని కిడ్నాప్ చేసేది ఫ్రెండ్ కోసం కాదు డబ్బు కోసం. జై (దేవ్ పటేల్) అనే లండన్ వాసి పాకిస్తాన్ లోని లాహోర్ సమీపంలో ఉన్న యోంగానాబాద్ అనే గ్రామానికి చేరుకుంటాడు. అంతకు ముందే తనను ఎవరూ గుర్తించకుండా, సిమ్ కార్డులు, కార్లు మార్చుకుంటూ అక్కడ దాకా వస్తాడు. ఆ తర్వాత రెండు గన్స్ ను కొనుగోలు చేస్తాడు. ఆ గ్రామానికి వచ్చాక పెళ్లికి రెడీ అవుతున్న సమీరా (రాధికా ఆప్టే) అనే యువతిని కిడ్నాప్ చేస్తాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్ని హత్య చేయాల్సి వస్తుంది. ఆమెను దేశం దాటించి తీసుకువెళ్లడానికి ముందు...ఆమె ప్రేమికుడు దీపేశ్ (జిమ్ సర్భ్) తనతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఈ పనిచేయించాడనే విషయం జై బయటపెడతాడు.ఆ తర్వాత ఇద్దరూ కలిసి మారుపేర్లతో , దొంగ పాస్‌పోర్ట్‌లతో ఇండియాకు వస్తారు. అయితే సెక్యూరిటీ గార్డ్ హత్య కారణంగా ఈ కిడ్నాప్ రెండు దేశాల మీడియాలో వైరల్ అవుతుంది, దాంతో సమీరా ప్రేమికుడు దీపేశ్ భయపడతాడు, సమీరాను తిరిగి పాకిస్తాన్ కు పంపేయమని దేవ్‌ని కోరతాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు సన్నిహితంగా గడిపిన జై, సమీరా మధ్య అనుబంధం పెరుగుతుంది. ముఖ్యంగా సమీరా అతనిపై మోజుపడుతుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అదే సమయంలో దీపేశ్ దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్న జై, వాటిని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రకరకాల మలుపుల మధ్య సాగే ఈ లవ్–క్రైమ్–రొమాంటిక్ కథ చివరికి ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.జై పాత్రలో మిస్టీరియస్ ప్రొఫెషనల్ కిల్లర్‌గా జై పూర్తి గా మెప్పిస్తాడు. బోల్డ్ సీన్లకు పెట్టింది పేరైన రాధికా ఆప్టే(తెలుగులో లెజెండ్‌లో బాలకృష్ణ సరసన హీరోయిన్) ఈ సినిమా హాలీవుడ్ రూపకర్తల సమర్పణలో రావడంతో...పూర్తి స్థాయి హాలీవుడ్ హీరోయిన్లా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్లలో ఆమె దాదాపు పూర్తి న్యూడ్‌గా కనిపించడం విశేషం.హాలీవుడ్ చిత్రం చేసినప్పటికీ మన ఇండియన్ హీరోయిన్లు మరెవ్వరూ ఈ స్థాయిలో బోల్డ్ సీన్స్ చేసి ఉండరు... సమీరా పాత్ర భావోద్వేగాలను కూడా బాగా ప్రదర్శించింది. ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణ. పాకిస్తాన్, ఇండియా మధ్య ప్రయాణం, మారుమూల ప్రాంతాల చిత్రీకరణ బాగా చూపించారు. సంగీత పరంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ మూమెంట్లను ఎలివేట్ చేస్తుంది. అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించినా.. ఆ ఫీలింగ్ ముదరకముందే ఆసక్తికరమైన మలుపులు పేర్చుకుంటూ రావడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఐఎమ్‌డిబి 6.0 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా ఓ కాలక్షేపం యాక్షన్, థ్రిల్లర్, లవ్, రొమాంటిక్ సీన్లను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. చూడాలనుకున్నవారు నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. -
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
కెరీర్‌ను అందుకునే క్రమంలో బహుశా అతను సాధించినన్న రికార్డ్స్ మరే హీరో సాధించి ఉండడు. అత్యంత పిన్న వయసులో నటుడు, అత్యంత పిన్న వయసు హీరో, అత్యంత పిన్న వయసు స్టార్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తొలి సినిమా హీరో... హిందీ, తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ..అన్ని భాషల్లోనూ స్వల్ప వ్యవధిలోనే 280 చిత్రాలు చేసిన హీరో...పాతికేళ్ల వయసులోనే ఇన్ని సాధించాడంటే ఇప్పుడెలా ఉండాలి? ఏభై ఏళ్ల వయసులో ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి? ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి? కానీ అడ్రెస్ కూడా లేకుండా పోవడం ఏమిటి?అది 90వ దశకం.. భారతీయ సినీ పరిశ్రమకు ఒక మార్పు కాలం. ప్రధాన సినిమాలల్లో స్థిరపడిన తారల వయసు ముదిరిపోతుండగా, వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువ నటీనటులను పెద్ద సంఖ్యలో పరిచయం చేసిన కాలం. అలా తెరపైకి వచ్చిన యువతలో, అప్పుడే 15ఏళ్ల వయసులో హీరోగా అడుగుపెట్టిన ఒక యువ నటుడు ప్రత్యేకంగా నిలిచాడు అతడే హరీష్ కుమార్ (Harish Kumar), తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన హరీష్. బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన హరీష్, కొన్ని హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించాడు. ఆ తర్వాత 1988లో, కేవలం 13ఏళ్ల వయసులోనే హీరో పాత్రలు పోషించడం మొదలుపెట్టాడు. దివంగత నిర్మాత రామానాయుడు 1990లో తీసిన ‘ప్రేమ ఖైదీ‘ తెలుగు సినిమాతో అప్పటి యూత్‌ని ఒక ఊపు ఊపాడు. తరువాతి ఏడాది, ఈ సినిమా హిందీ రీమేక్ లో కూడా నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ తొలి సినిమా విజయం సాధించింది. హరీష్–కరిష్మా కపూర్ (అప్పుడు ఇద్దరికీ 16ఏళ్లు) జోడీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.తర్వాతి కాలంలో, ‘తిరంగా‘, ‘కాలేజ్ బుల్లోడు‘ వంటి విజయవంతమైన చిత్రాల్లో హరీష్ నటించాడు. ఆ సమయానికి, హరీష్‌ను హిందీ తెలుగు సినిమాల్లో ఉన్న అత్యుత్తమ యువ నటుల్లో ఒకరిగా గుర్తించారు. కొందరు ఆయనను షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదనంతర స్టార్‌గా కూడా భావించారు. కానీ తర్వాత తర్వాత హరీష్‌కు పూర్తిస్థాయి హీరోగా అవకాశాలు రాకున్నా మంచి పాత్రలే వచ్చాయి. టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నానా పాటేకర్, గోవిందా ల చిత్రాల్లో హరీష్ రెండవ హీరో, చిన్న పాత్రలకే పరిమితం అయ్యాడు.‘ద జెంటిల్మన్‘, ‘కూలీ నం.1‘, ‘హీరో నం.1‘ వంటి హిట్ చిత్రాల్లో నటించాక, 2001 ప్రాంతంలో అకస్మాత్తుగా తెరమరుగైన హరీష్... తిరిగి పదేళ్ల తర్వాత తెరపై కనిపించాడు. ఓ పుష్కర కాలం క్రితం ‘నాటీ ః 40‘, ‘చార్ దిన్ కి చాంద్ని‘ వంటి ఫ్లాప్ చిత్రాలతో తిరిగి సినిమాల్లో ప్రయత్నించాడు.ఆ తర్వాత ఏడేళ్ల క్రితం‘ఆ గయా హీరో‘ అనే చిత్రంలో గోవిందాతో కలిసి చివరిసారి తెరపై కనిపించాడు. ఏమైందో తెలీదు గానీ హరీష్ సినిమా జర్నీ ఎంత ఉధృతంగా మొదలైందో అంతే అకస్మాత్తుగా ముగిసింది.అందగాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అని, డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేస్తాడని మంచి పేరు తెచ్చుకున్న హరీష్..సినిమా కెరీర్‌ను వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులే నాశనం చేశాయని అంటారు. ఆయన ప్రేమ, పెళ్లి కూడా ఆయన సమస్యలకు కారణం అని కూడా కొందరు చెబుతారు.అయితే కొంత కాలం క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ రంగం విడిచిపెట్టడానికి గల అసలు కారణం గురించి మాట్లాడాడు. చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో గాయపడిన తాను సంవత్సరాల తరబడి చికిత్స చేయించుకోకపోవడం వల్ల, సీరియస్ బ్యాక్ ప్రాబ్లెమ్‌కి గురయ్యాడని చెప్పారు. ‘ లంబార్ వెరిబ్రా ఎల్3 ఎల్5 ప్రాంతాల్లో స్లిప్డ్ డిస్క్ ఏర్పడింది. దీనివల్ల నడక కూడా కష్టమైంది. ఆ సమయంలో నేను చాలా నిర్లక్ష్యంగా ఉండి, గాయాన్ని గుర్తించలేకపోయాను. ఆపరేషన్ కూడా చేయించుకోవాలనుకోలేదు,‘ అని హరీష్ చెప్పాడు.చివరికి చికిత్స తీసుకున్న తరువాత, నెలల తరబడి మంచం మీద ఉండాల్సి వచ్చిందని, ఆ లోపు పరిశ్రమ తనను దాటి వెళ్లిపోయిందని హరీష్ తెలిపారు. ‘డాక్టర్ మొదట రెండేళ్ల పాటు పని చేయకూడదని చెప్పాడు. ఆ తర్వాత అలా అలా తెలియకుండానే పరిశ్రమ నుంచి మాయం అయ్యాను,‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హరీష్ ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ‘నేను ఇంకా భారత్‌లోనే ఉన్నాను – చెన్నై, హైదరాబాద్, ముంబైలలో ఎక్కువగా ఉంటాను. సినిమా రంగం విడిచిన విషయం చాలా వ్యక్తిగతమైనది. దీనిపై ఎక్కువగా మాట్లాడాలని ఇష్టం లేదు,‘ అని హరీష్ స్పష్టం చేశాడు. -
గూడు కట్టుకుందాం గువ్వల చెన్నా
మనిషన్నాక బాధ్యత ఉండాలి.. సిగ్గుండాలి.. పిల్లలు పెరుగుతున్నారు.. ఒక గూడు ఉండాలన్న భయం... ఒక అది.. ఒక ఇది లేదు.. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేలా ఉంటే ఎలా.. చుట్టూ ఉన్నోళ్లు ఎలా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం.. వాళ్ళ కుటుంబాలు చూడు ఎంత కంఫర్ట్ ఉన్నాయి.. నువ్వూ ఉన్నావు.. సిగ్గులేని మనిషి... సిగ్గులేని జన్మ అంటూ భార్య నోరాపకుండా తిడుతూనే ఉంది. ఒసేయ్.. నేను మనిషిని అని ఎవరన్నారు.. కాదు.. ఐన ఒకరితో నన్ను పోల్చకు.. ఇన్నేళ్ళకాపురంలో నిన్ను బిడ్డల్ని సరిగా చూశానా లేదా.. మీ అమ్మానాన్నను కాదని నన్ను నువ్వు ప్రేమించి ఎగిరిపోయి వచ్చినపుడే నిన్ను గుండెల్లో గూడు కట్టి చూసుకున్నాను అన్నాడు భర్త. ఓరి నా తింగరి మొగుడా.. గుండెల్లో కాదురా.. బయట కట్టాలి గూడు.. ముందు ఆ పని చూడు అని మళ్ళీ మురిపెంగా కసిరింది ముద్దులుపెళ్ళాం.. సరే రెండ్రోజుల్లో సైట్ చూసి మెటీరియల్ డంప్ చేసేద్దాం.. వారంలో ఇల్లు రెడీ అన్నాడు.. మొత్తానికి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ప్లాట్ ఫిక్స్ చేసారు..గూటి కోసం ప్లాట్ ఫిక్స్ చేస్తామని చెప్పిన మొగుడుగారు.. ఏకంగా మా స్కూటీని తీసుకొచ్చి పెళ్ళానికి చూపించినట్లున్నాడు.. బయటెక్కడినా ఐతే ఎండ. పైగా శత్రుభయం .. ఈ స్కూటీ డిక్కీ ఐతే నీడ.. పైగా సేఫ్.. అందుకే ఇక్కడకు ఇద్దరూ ఫిక్షయారు .. అయ్యో.. పనికిమాలిన మొగుడు అనుకున్నాను కానీ తెలివైనవాడే.. మంచి సైట్ చూసాడు అని కిచకిచలాడింది.. పెళ్ళాం పిచ్చుక.. మొత్తానికి రెండ్రోజుల్లో కొన్ని చిన్న పుల్లలు. ఎండుగడ్డివంటిది తెచ్చి పెట్టారు.. ఇదేంటి అనుకుంటి తీసేసి పక్కన పడేసినా మళ్ళీ రెండ్రోజుల్లో ఇద్దరూ కలిపి మొత్తం డిక్కీ సగం నింపేశారు. పోన్లే ఏమవుతుందో అని జాలితో డిక్కీని. బండికి ముట్టుకోకుండా వదిలేశాం. నెలరోజులు బండి ముట్టుకోకపోతే బ్యాటరీ పోతుందేమో. మళ్ళా స్టార్ట్ అవ్వదేమో అనే చర్చ వచ్చినా.. పోన్లే ఒక పక్షి కుటుంబానికి ఆసరాగా నిలిచాం చాలు అనే భావనతో బండి అలాగే వదిలేశాం...నాలుగు రోజుల్లో దానిలో రెండు గుడ్లు పెట్టింది.. దానికి కాపలాగా తల్లి అక్కడే స్కూటీ దగ్గర్లో ఉంటే తండ్రి ఎక్కడెక్కడికో తిరిగి ఏదేదో తెచ్చిపెట్టేవాడు. అన్యోన్య దాంపత్యం.. ఒక్కోరోజు రెండూ ఆ స్కూటీ దగ్గర్లోనే కూర్చు బహుశా పిల్లల భవిష్యత్ గురించి కావచ్చు కిచకిచలతో చర్చలు పెట్టేవి.. అరుదైన నల్ల పిచ్చుకలు. కంఠం వద్ద ఎర్రని జీర.. చూస్తుంటే ముచ్చటేస్తుంది.. అపురూపమైన కాపురాన్ని చూడాలనిపించి నెలరోజులు స్కూటీ కదపలేదు.. నాలుగురోజుల తరువాత డిక్కీ చూస్తే కళ్ళు తెరవని రెండు చిన్న జీవులు వచ్చి చేరాయి.. ఆ చిన్న దంపతుల ఆనందానికి అంతులేదు.. రోజూ ఆ స్కూటీ దారిలోనే తిరుగుతూ ఎవరైనా అక్కడికి వస్తే చాలు భయంతో అరిచేవి.. జీవి చిన్నదే కావచ్చు.. తల్లిదండ్రుల ప్రేమ అనంతం కదా.. అందుకే బిడ్డల కోసం వాటి ఆరాటం.. రోజూ తిరిగి ఏదేదో పురుగులు. నీళ్లు తెచ్చి బిడ్డలకు పోస్తుండేది తల్లి.. అలా పదిరోజులు గడిచాక చిన్నగా రెక్కలొచ్చి పిచ్చుకలు ఎగిరిపోయాయి.. తల్లి పిచ్చుక మళ్ళీ అక్కడే తిరుగుతోంది... ఇక మీ గెస్ట్ హౌస్ వదలండి.. అన్నట్లుగా నేను బండి తీసి స్టార్ట్ చేయబోతే ..ఉహు.. మొరాయించింది.. షెడ్డుకు తీసుకెళ్తే వెయ్యి వదిలింది.. పొతే పోనీ.. ఒక గువ్వల జంటకు నెలకు ఫ్రీగా ఆశ్రయం ఇచ్చాను అనిపించింది. :::సిమ్మాదిరప్పన్న -
బన్నీ,చెర్రీ ఫైట్..ఫ్యాన్స్ ‘కోలా’హలం తప్పదా?
ఇది వేసవి సూర్యుడు ప్రచండ భానుడై ప్రతాపం చూపే సమయం. దాంతో జనమంతా చల్లని పానీయాలకు జై కొట్టే సమయం. సాధారణంగానే కూల్ డ్రింక్స్ అమ్మకాలు పీక్స్‌లో ఉండే ఈ టైమ్‌లో అత్యధిక వ్యాపారాన్ని దక్కించుకోవాలని కోలా బ్రాండ్స్ తహతహలాడుతాయి. రకరకాల ప్రకటనల ద్వారా దాహార్తి నిండిన గొంతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. దాంతో ఈ సీజన్ ఆసాంతం ప్రకటనల ‘కోలా’హలంతో నిండిపోతుంది.వేసవి వచ్చినప్పుడల్లా కూల్ డ్రింక్స్ బ్రాండ్స్ మధ్య ఆధిపత్య పోరు ఆటోమేటిక్‌గా వేడెక్కడం కోలా కంపెనీల్లో రివాజు. అది ఈ సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ సారి ఆధిపత్య పోరు బ్రాండ్స్‌తో ఆగేటట్టుగా లేదు. ఇప్పటికే ఇద్దరు టాలీవుడ్ అగ్రనటుల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు దీనికి జతయ్యేట్టుగా ఉంది. దానికి కారణం పుష్ప, పెద్దిలే...అదేనండీ.. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లే.పుష్ప తో ఆల్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవాలని ఎన్నో కంపెనీలు ఉవ్విళ్లూరాయి. అదే క్రమంలో ప్రముఖ కూల్ డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్ తన దక్షిణాది బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ ని ఎంచుకుంది. పుష్పరాజ్‌తో... చాలా ఉత్తేజకరమైన ఎనర్జిటిక్ వీడియోలను తయారు చేసి విడుదల చేసింది. అవి బాగా జనంలోకి దూసుకెళ్లాయి కూడా. అయితే ఇప్పుడు థమ్స్ అప్‌కి ప్రత్యర్ధిగా ఉన్న క్యాంపా కోలా...బన్నీకి ధీటైన మరో నటుడి గురించి సాగించిన అన్వేషణ మరో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఆగింది. తాజా ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఈ కోలా బ్రాండ్ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది.ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్‌చరణ్ (Ram Charan) ను క్యాంపాకోలా తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం కూల్‌గా మాట్లాడుకోవాల్సిన కూల్ టాపిక్‌ను వేడి వేడిచర్చలకు కేంద్ర బిందువైన హాట్ టాపిక్‌గా మార్చింది.ప్రస్తుతం మెగా , అల్లు కుటుంబాల బంధం మధ్య బన్నీ, చెర్రీలనే అడ్డుగీతలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. రామ్ చరణ్, అల్లు అర్జున్ పరస్పరం ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అనడం చాలా చిన్నమాట. బయటకు చెప్పకున్నా, సోషల్ మీడియాలో అన్‌ఫాలోల దగ్గర నుంచి ఫాలోయర్స్, ఫ్యాన్స్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం వరకూ బన్నీ, చెర్రీల వార్... గట్టిగా నడుస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో రెండు బలమైన కూల్ డ్రింక్ బ్రాండ్స్ కాంపా కోలా, థమ్స్ అప్ లకు వారు అంబాసిడర్లుగా ఎంపిక కావడంతో ఈ వైరం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ రెండు బ్రాండ్స్ భవిష్యత్తులో రూపొందించే ప్రకటనలు ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తాయో.. ఎంత హీట్ తెస్తాయో.....చూడాలి.మరోవైపు క్యాంపా కోలా ప్రకటనలు రామ్ చరణ్ స్టార్ స్టేటస్‌పై ఎక్కువగా ఆధారపడి రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మగధీర, ఆర్ఆర్ఆర్ లలోని ప్రసిద్ధ సినిమా సన్నివేశాలను ఇవి వాడుకుంటున్నాయి. -
ఐటమ్ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్లు.. అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికంటే..?
పాటలు నృత్యాలు. అలాగే డ్యాన్స్ నంబర్లు 30వ దశకంలో టాకీల రోజుల నుంచే భారతీయ చలనచిత్రంలో భాగమయ్యాయి . వ్యాంప్ కేరెక్టర్లకు పరిమిమైన వారు మాత్రమే కాకుండా ఏకంగా హీరోయిన్లు ఈ తరహా నృత్యాలు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి వీటిని కాస్త హుందాగా ఐటెమ్/స్పెషల్ సాంగ్స్ లేదా ప్రత్యేక నృత్యాలుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్(Item Song)లు సినిమాల విజయాలకు చాలా కీలకమైనవిగా మారాయి. దాంతో పాటే ఈ తరహా నృత్యాల కోసం డ్యాన్సర్లు, హీరోయిన్లు వసూలు చేసే రెమ్యూనరేషన్ కూడా ఆకాశాన్ని అంటింది.బాలీవుడ్‌కి చెందిన నోరా ఫతేహి వంటి ప్రముఖ డ్యాన్సర్లు ఒక్కో పాటకు 2 కోట్ల రూపాయల చొప్పున, సన్నీ లియోన్ కూడా అంతే మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక అంటూ కేక పెట్టించిన మలైకా అరోరా పాటకు రూ. 50 లక్షల నుంచి 1కోటి వరకు వసూలు చేస్తూ ఇప్పుడు కాస్త వెనకడుగులో ఉంది.ప్రముఖ నటీమణులు ఈ డ్యాన్స్ నంబర్లకు వసూలు చేస్తున్న మొత్తాలు వారి డ్యాన్స్ సామర్థ్యాల కంటే చాలా ఎక్కువ అనేది వాస్తవం. అయితే డ్యాన్స్ ప్రతిభ కన్నా తమ స్టార్ పవర్‌ను వీరు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరీనా కపూర్ ఐటెం సాంగ్ చేసేటప్పుడు రూ. 1.5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసేదట. , కత్రినా కైఫ్ ఒక్కో పాటకు 2 కోట్ల రూపాయలకు పైగా అందుకుందట. ఈ తరహా పాటలకు పేరొంది అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రతి పాటకు రూ. 3 కోట్లు తీసుకుంటుంది. దబిడి దిబిడి భామ ఊర్వశి రౌతాలా కూడా అంతే మొత్తం అడిగేది..ఇప్పుడు మరింత ఎక్కువ డిమాండ్ చేస్తోంది. సినీ పండితుల సమాచారం ప్రకారం, తమన్నా భాటియా, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, తాప్సీ పన్ను వంటి వారు ఇప్పుడు ఐటమ్ నెంబర్స్‌లో డిమాండ్‌లో ఉన్నారు.ఈ కోవలో నిన్నా మొన్నటి దాకా అత్యధిక పారితోషికం అందుకున్న రికార్డ్ నటి సమంత పేరిట ఉంది. ఆమె పుష్ప ది రైజ్‌లో ఊ అంటావా పాట కోసం అత్యధిక మొత్తం వసూలు చేసినట్లు సమాచారం. ఒక సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ చేయడం ద్వారా ఆ సినిమా మొత్తం కనిపించిన హీరోయిన్ కన్నా ఎక్కువ మొత్తం అందుకుందీమె. పుష్పలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్న మొత్తం సినిమాకి కేవలం రూ. 2 కోట్లు మాత్రమే తీసుకుంటే. అయితే ఊ అంటావా పాట కోసం సమంత రూ. 5 కోట్ల పారితోషికాన్ని రాబట్టిందట.ఇటీవలి కాలంలో తమన్నా ఐటమ్ ట్రెండ్స్‌లోకి అనూహ్యంగా దూసుకొచ్చింది. తెలుగులో స్వింగ్ జర స్వింగ్ జర అంటూ జూనియర్ ఎన్టీయార్ పక్కన మెలికలు తిరిగిన ఈ మిల్కీ బ్యూటీ అలా మొదట్లో రూ.కోటిలోపే తీసుకుంటూ అప్పుడప్పుడు ఐటమ్‌గాళ్ గా కనిపించినా...ఇప్పుడు స్పెషల్ సాంగ్ అంటే తానే గుర్తొచ్చేంతగా ఎదిగిపోయింది. దీనికి వరుసగా ఆమె ఐటమ్ సాంగ్స్ హిట్ కావడమే కారణం. రూ.3కోట్లు తీసుకుని జైలర్ లో ‘నువ్వు కావాలయ్యా..దా’ పాటలో ఊపేసిన తమన్నా సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోలకు బోలెడంత ఫీడ్ అందించింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా స్త్రీ 2 ఆమెని మరింత అందనంత ఎత్తుకి తీసుకెళ్లింది. ఆ సినిమాలోని ఆజ్‌కి రాత్... పాట ఉత్తరాది ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవడంతో తాజాగా రైడ్ 2లో చేసిన ఐటమ్ సాంగ్ కోసం రూ.5కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్లలో తమన్నా భాటియా అత్యధిక మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్‌గా నిలిచింది. -
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ ‘జీలం ఝలక్’ ఇచ్చింది. మున్ముందు సినిమా ఎలా ఉంటుందో తెలిపేలా ఓ ట్రైలర్ చూపించింది. పాకిస్థాన్ అధికార వర్గాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ శనివారం హఠాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేసింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్ వద్ద ఒక్కసారిగా నదిలో నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది.నది పొంగి పొర్లుతుండటంతో హతియన్ బాలా వద్ద ‘నీటి అత్యయిక పరిస్థితి’ (ఎమర్జెన్సీ) ప్రకటించారు. హతియన్ బాలా ప్రాంతం ముజాఫరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో జీలం ఒడ్డున ఉంటుంది. నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ స్థానిక మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఘరీ దుపట్టా, మజ్హాయ్ వంటి జీలం నది ఒడ్డు ప్రాంతాల గ్రామాల్లో నివసించే ప్రజలు అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో భీతి చెందారు. Flood alert in PoK's Muzaffarabad as Jhelum River water levels surge. Locals allege India released water w/o informing Pak. auth. Sharp rise in water from Chakothi to Muzaffarabad sparks flood fears. Pak. claims India's move aims to suspend IWT post-Pahalgam attack. #Pakistan pic.twitter.com/Y9v4HwJQUD— Epic Pravin (@EpicPravin) April 27, 2025మన కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని చకోతీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కాగా, భారత్ చర్య అంతర్జాతీయ నిబంధనలను, జల ఒప్పందాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పాక్ ఆరోపించింది. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం విశేషం!. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.Major Flooding in Jhelum: #Pakistan Declares EmergencyAfter stopping the water, now India releases excess water in the Jhelum River, allegedly without warning.Muzafrabad in Pok flooded.This is just a glimpse!#PakistanBehindPahalgam pic.twitter.com/QdIjf1v2oj— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) April 26, 2025అయితే కరువు... లేకపోతే వరద!పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు విడనాడే వరకు ఒప్పందం అమలు సస్పెన్షన్‌లో ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో భారత్, పాక్ నడుమ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్‌లో 90% సేద్యం సింధు జలాలపై ఆధారపడుతుంది. హైడ్రలాజికల్ డేటాను ఎప్పటికప్పుడు సరైన సమయంలో పాకిస్తాన్‌కు అందజేయాలనేది ఈ ఒప్పందంలో మన దేశం నెరవేర్చాల్సిన ఓ కీలక బాధ్యత. వరద హెచ్చరికలను ముందుగానే తెలియజేయడం, నీటి వినియోగ వివరాలు, హిమనీనదాలు (గ్లేసియర్స్) కరిగే తీరుతెన్నుల సమాచారాన్ని పొరుగుదేశంతో పంచుకోవడం భారత్ విధి. ఒప్పందం అమలును భారత్ తాజాగా నిలిపివేయడంతో ఇప్పుడిక ఈ బాధ్యతలకు బ్రేక్ పడింది. సింధు నది, దాని ఉపనదుల్లో ఏయే సమయాల్లో ఏమేరకు నీటి నిల్వలున్నాయనే సమాచారాన్ని భారత్ ఇవ్వకపోతే పాక్ పరిస్థితి... నీరు లేక నేల ఎండిపోయి... ‘పడితే కరువు బారిన పడటం లేదంటే వరద ముంచెత్తడం’ అన్నట్టు తయారవుతుంది. Floods in Muzaffarabad, POK today after India released waterpic.twitter.com/vF4ClKxVgW— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2025ఇక, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘యుద్ధ చర్య’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముజఫరాబాద్‌లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా స్పందిస్తూ.. భారత ఆక్రమిత కాశ్మీర్‌లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్‌వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.-జమ్ముల శ్రీకాంత్.BREAKING🇮🇳🇵🇰 Local sources report that flooding in the Jhelum River, located in northern India and eastern Pakistan, occurred after India released water without prior notification. pic.twitter.com/vD4VPlsyr5— The Global Beacon (@globalbeaconn) April 26, 2025 -
నాన్సెన్స్ అంటున్నా... కుర్రహీరోయిన్లతో ఆగని సీనియర్ హీరోల రొమాన్స్..!
‘‘అవును రష్మికతో చేస్తున్నా..తర్వాత ఆమె కుమార్తెతో కూడా నటిస్తా..మీకేంటి ప్రాబ్లమ్?’’ అంటూ తీవ్ర స్వరంతో అడిగిన సల్మాన్‌ఖాన్ ప్రశ్నలో విసుగును గమనించారా? మన దేశంలో అనేక భాషలకు చెందిన వయసు పైబడిన హీరోలు అందరిలో పైకి కనపడని చిరాకులకు అది ప్రతిరూపంగా చెప్పొచ్చు. కొంత కాలంగా సీనియర్ హీరోలు తమకు జోడీ కడుతున్న హీరోయిన్ల విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు గురవుతున్నారు.వృధ్ధాప్యానికి చేరువలో ఉన్న నటులు తమకన్నా చాలా తక్కువ వయస్సు గల మహిళా కథానాయకులతో జతకట్టడం అనేది ఇటీవల తరచూ వివాదాలు విమర్శలకు కారణమవుతోంది. కొందరు దీనిని దీనిని వృత్తి పరమైన అంశంగా సమర్థిస్తున్నారు. మరికొందరు, ఇది హానికరమైన మూస పద్ధతులను కొనసాగిస్తుందని వయసు పెరిగిన నటీమణులకు అవకాశాలను పరిమితం చేస్తుందని వాదిస్తున్నారు.తమ కన్నా బాగా తక్కువ వయసు ఉన్న వారితో రొమాంటిక్ పాత్రలలో పెద్ద వయసున్న మగవాళ్లు నటించడం అనేది ఈనాటిది కాదు ఇది ఎప్పటి నుంచో సర్వసాధారణంగా మారింది.. అయితే చర్చా వేదికలు పెరగడం, భావ వ్యక్తీకరణ మార్గాలు విస్త్రుతం కావడంతో ఇప్పుడు ఈ తరహా రొమాన్స్‌ను నాన్సెన్స్గా తిట్టిపోయడం కూడా పెరుగుతోంది.ఒకప్పుడు సీనియర్ హీరోలుగా ఉన్న ఎన్టీయార్, ఏయన్నార్‌లు తమ కన్నా చాలా చిన్న వయసు అమ్మాయిల పక్కన నటించినా...ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనపడవు. అదేపని ఇప్పుడు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలు చేస్తే మాత్రం విమర్శకులు నోళ్లకు పదను పెడుతున్నారు. అందుకే బాలకృష్ణ గత కొంత కాలంగా హీరోయిన్లతో రొమాన్స్ చేసే పాత్రలకు బదులు తన వయసుకు తగ్గ పాత్రలతో సరిపెట్టుకుంటున్నాడు. వయసు కనపడనీయని నాగార్జున మన్మధుడు 2లో రకుల్‌కి ముద్దొచ్చాడేమో కానీ... మరోవైపు విమర్శకుల నోటికి బాగా పనిచెప్పాడు. అలాగే హీరో రవితేజ కూడా గత కొంత కాలంగా ఇదే విషయంలో విమర్శలు ఎదుర్కుంటున్నాడు.హీరోలు తమకన్నా కనీసం 20 ఏళ్ల వయసు తక్కువ ఉన్న యువతులతో నటించడం బాలీవుడ్లో సర్వసాధారణం. ఎప్పుడో 1980లలోనే దయావన్ లో వినోద్ ఖన్నా తనకన్నా 21 ఏళ్ల చిన్నదైన మాధురి దీక్షిత్‌తో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేశాడు. నిశ్శబ్ద్లో, సీనియర్ అమితాబ్ బచ్చన్ తన కంటే 46 ఏళ్లు చిన్న వయస్సులో ఉన్న జియాఖాన్ తో కలిసి నటించాడు. ఇక దీపికా పదుకొణె ఓం శాంతి ఓం చిత్రంలో తనకన్నా 20 ఏళ్ల సీనియర్ షారూఖ్ ఖాన్ పక్కన తెరంగేట్రం చేసింది. కాగా, రబ్ నే బనా ది జోడిలో అరంగేట్రం చేసిన అనుష్క శర్మ షారూఖ్ కంటే 23 ఏళ్లు చిన్నది. గజినిలో అమీర్ ఖాన్, సహ నటి కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. 44 ఏళ్ల అజయ్ దేవగన్ 23 ఏళ్ల తమన్నాతో కలిసి హిమ్మత్వాలా చేశాడు.ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో సినిమాలు కనిపిస్తాయి. అయితే ఈ ట్రెండ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోన్నట్టు కనిపిస్తోంది. సల్మాన్‌ఖాన్ ఏక్ థా టైగర్‌లో తనకన్నా 19 ఏళ్లు చిన్నదైన కత్రినా కైఫ్‌తో నటించాడు. దబాంగ్‌లో 20 ఏళ్ల చిన్నదైన సోనాక్షి సిన్హా తో నటించాడు. ఇప్పుడు ఏకంగా తనకన్నా 32ఏళ్ల చిన్నదైన రష్మిక మందన్నతో జోడీ కట్టాడు. మరోవైపు మన మెగాస్టార్ చిరంజీవి కూడా తన సమకాలీకుడైన కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్‌తో స్టెప్స్ వేయడం చూశాం.ఈ పరిస్థితి మారాలని, హీరోలు వయసుకు తగినట్టుగా తమ జోడీలను ఎంచుకోవాలనే డిమాండ్ ఎప్పుడూ లేనంత స్థాయిలో వినిపిస్తోంది. పాత చింతకాయ పచ్చడి లాంటి రొడ్డకొట్టుడు ధోరణికి చెక్ పెట్టాలని, వయసు పెరుగుతున్న నటీమణులకు అవకాశాలను పరిమితం చేయడం సరైంది కాదని అంటున్నారు. ఇప్పటికీ మాధురీ దీక్షిత్ నటిస్తున్నా ఆమె సల్మాన్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాల్లేవు అలాగే సుహాసిని, రాధిక తదితరులు ఉన్నా వారు చిరంజీవి, బాలకృష్ణల పక్కన హీరోయిన్స్‌గా ఎంపిక కాలేదు.. ఈ పరిస్థితి హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాళ్ అనే పాత కాలపు ధోరణికి బలం చేకూరుస్తోందనే వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. ఏదేమైనా ఎప్పుడూ లేనంత బలంగా వినిపిస్తున్న విమర్శలు... సీనియర్ హీరోల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో...చూడాలి. -
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
బాలీవుడ్ సినిమా ప్రేక్షకలోకానికి ఆషికి అనే సినిమా ఓ గొప్ప ప్రేమ కావ్యం. ఆ సినిమా విజయం ఎంత గొప్పది అంటే.. ఆ సినిమా పేరు గుర్తుకురాగానే ఆ సినిమాలో జీవించిన నటీనటులు కళ్ల ముందు సిసలైన ప్రేమ చిహ్నాల్లా మెరుస్తారు. ఆ సినిమా, ఆడియో ఆల్బమ్ వయసు పాతికేళ్లు కానీ... ఇప్పటికీ ఆ పాటల్ని వినకుండా ఉండలేని ప్రేక్షక–ప్రేమాభిమానులు ఎందరో..నటీ నటులు అనుఅగర్వాల్, రాహుల్ రాయ్‌లతో సహా ఆ చిత్రంలో పాలు పంచుకున్న ఎందరికో ఆషికి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది.అంత చరిత్ర ఉన్న ఆషికికి ఇప్పటికే ఒక సీక్వెల్ వచ్చి విజయవంతం అయింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకి సీక్వెల్ తయారవుతోంది. ఈ ఆషికి 3(Aashiqui 3 Movie )లో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి ఎదిగిన శ్రీలీల(sreeleela) నటిస్తోంది. ఈ నేపధ్యంలోనే తొలి ఆషికి సినిమా కధానాయిక నటి అను అగర్వాల్(Anu Agarwal), తన ఆలోచనలను పంచుకున్నారు. తనకు ఆషికి లో పాత్ర ఎంతగా మనసుకు హత్తుకు పోయిందో వెల్లడించారు. ఆషికి అనేది కేవలం తెరపై నటించిన మరో పాత్ర మాత్రమే కాదని– అది తన హృదయ స్పందన అని ఆమె పేర్కొన్నారు.తాను ఆషికీలో తొలిసారి భాగంగా మారినప్పుడు ఆ సమయంలో అది అంత గొప్ప చిత్రం కాదనీ. అప్పటికి దర్శకుడు మహేష్ భట్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకోలేదనీ, తన మొదటి మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టిన ఒక ఆర్ట్ హౌస్ డైరెక్టర్. మాత్రమే నని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆషికి నేను పనిచేసిన ఓ చిత్రం మాత్రమే కాదు, ఇది నన్ను నేను రూపొందించడంలో నన్ను నేను నిర్మించుకోవడంలో సహాయపడింది. అది నా వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.‘ అంటూ ఉద్విగ్నంగా చెప్పారు.అటువంటి ఐకానిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంపికైనందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆషికి 3 నటీనటులకు ఆమె సూచించారు. ‘ఇది అహంకారంతో చెబుతున్నది కాదు, ఆషికీ సిరీస్‌లో చేరిన ఎవరైనా ఓ ఘనమైన వారసత్వంలో భాగమవుతున్నారు. ఆ వారసత్వంలోకి అడుగుపెట్టిన మరు క్షణమే, సగం విజయం సాధిస్తారు. ప్రేక్షకులు మిమ్మల్ని ఆషికి వారసులుగా చూసేందుకు వస్తారు. అందుకే నటీనటులు తమకు లభించిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ వారసత్వాన్ని గొప్ప గౌరవంగా భావించాలి.‘ అంటూ ఆమె ఉద్భోధించారు. ప్రేమ అనేది విశ్వవ్యాప్తం కాలాతీతం అని అను అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రేమ చిత్రణ సమకాలీన సున్నితత్వాలకు అనుగుణంగా ఉండవచ్చు, అయితే ప్రేమను నిర్వచించే ప్రాథమిక భావోద్వేగాలు అనుభవాలు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయని తాను నమ్ముతానంది.ఆషికి తర్వాత పొడగరి సుందరి, డస్కీ బ్యూటీగా 1990 ప్రాంతంలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న అనుఅగర్వాల్ 1999 ప్రాంతంలో అనూహ్యంగా ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వెండితెరకు దూరమయ్యారు. కొన్నేళ్లపాటు చికిత్స తర్వాత ప్రస్తుతం కోలుకున్నప్పటికీ..సినిమాల్లో ఇంకా అవకాశాలు రావడం లేదు. ఆమె తమిళ దర్శకుడు మణిరత్నం దొంగ దొంగ చిత్రంలో కొంచెం నీరు కొంచెం నిప్పు పాట ద్వారా దక్షిణాది ప్రేక్షకులకూ చిరపరిచితమయ్యారు. -
సింహానికి చిట్టెలుకకు పోలికా?.. భారత్, పాక్ బలాబలాలు ఇలా..
డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట.. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు మిలిటరీ వాహనాలకు డీజిల్ పోయలేరు.. ఒకసారి ఫైటర్ జెట్లను ట్రయల్ రన్ తీయాలంటే లక్షలు ఖర్చు.. దానికి చేతగాదు.. యుద్ధ ట్రయాంకర్లకు ఆయుధాలు.. వంటివి ఫిక్స్ చేయాలంటే నట్లు .. బోల్టులు కరువే.. అసలు సైనికులకు యూనిఫారాలు. బూట్లు కూడా కొత్తవి ఇవ్వాలంటే పాతవాటికి మాసికాలు వేసుకుని రోజులీడుస్తున్న దారుణం. భారత్ నుంచి గోధుమపిండి ఇస్తే తప్ప మూడుపూటలూ ముద్దకు ఠికాణాలేని కరువు బతుకులు.. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్ కు సవాల్ విసురుతోంది. అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న విలువ, గౌరవం.. మార్కెట్ వాల్యూ.. సైనిక.. ఆర్థిక సంపత్తితో పోలిస్తే పాకిస్తాన్ ఒక పిపీలికం.. కానీ ఏదో తెగింపు.. దేశంలో పోతున్న పరువును కాపాడుకునేందుకు ఏదో ఒక బిల్డప్ ఇస్తూ అక్కడి సైనిక పాలకులు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.. ఈ తరుణంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సైనిక బలాలు.. బలగాల మధ్య ఏపాటి వ్యత్యాసం ఉందో చూద్దాం. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 తాజా నివేదిక ప్రకారం ఇరు దేశాల మిలిటరీ శక్తి ఇలా ఉందిసమగ్ర మిలిటరీ ర్యాంకింగ్:భారతదేశం: ప్రపంచంలో 4వ ర్యాంక్, పవర్ ఇండెక్స్: 0.1184పాకిస్తాన్: ప్రపంచంలో 12వ ర్యాంక్, పవర్ ఇండెక్స్: 0.2513మానవ వనరులు:మొత్తం జనాభా: భారతదేశం – 1.4 బిలియన్ | పాకిస్తాన్ – 252 మిలియన్యాక్టివ్ సైన్యం : భారతదేశం – 14,55,550 | పాకిస్తాన్ – 6,54,000రిజర్వ్ సిబ్బంది: భారతదేశం – 11,55,000 | పాకిస్తాన్ – 5,50,000పారా మిలిటరీ దళాలు: భారతదేశం – 25,27,000 | పాకిస్తాన్ – 5,00,000వాయుసేన బలాబలాలు.. మొత్తం విమానాలు: భారతదేశం – 2,229 | పాకిస్తాన్ – 1,399యుద్ధ విమానాలు: భారతదేశం – 513 | పాకిస్తాన్ – 328ఎటాక్ హెలికాఫ్టర్లు : భారతదేశం – 80 | పాకిస్తాన్ – 57 పదాతిదళం బలాబలాలు :ట్యాంకులు: భారతదేశం – 4,201 | పాకిస్తాన్ – 2,627ఆర్మర్డ్ వెహికల్స్: భారతదేశం – 1,48,594 | పాకిస్తాన్ – 17,516మొబైల్ రాకెట్ వ్యవస్థలు: భారతదేశం – 264 | పాకిస్తాన్ – 600నావికాబలం :మొత్తం నేవీ స్థావరాలు.. కేంద్రాలు : 293 | పాకిస్తాన్ – 121ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు: భారతదేశం – 2 | పాకిస్తాన్ – 0జలాంతర్గాములు : భారతదేశం – 18 | పాకిస్తాన్ – 8డిస్ట్రాయర్స్: భారతదేశం – 13 | పాకిస్తాన్ – 0రక్షణ ఖర్చు:భారతదేశం: $75 బిలియన్పాకిస్తాన్: $7.64 బిలియన్ఇప్పుడు చెప్పండమ్మా.. ఎవరిది బలం.. ఎవరిది బలుపు.. గతంలో ఎన్నోసార్లు భారత్ మీదకు తెగబడి వారంరోజుల్లోనే చేతులెత్తేసి. మోకాళ్ళమీద నిలబడి శరణు వేడిన సందర్భాలు ఉన్నాయ్. బతికితే చాలు దేవుడా అంటూ పలాయనం చిత్తగించిన పాకీ సేనలు ఇప్పుడు మళ్ళీ ఏం చూసుకుని బోర్డర్లో సైనిక సన్నాహాలు చేస్తున్నాయో. తెగింపా.. తెంపరితనమా.. దేశంలో పరువుకాపాడుకునే క్రమంలో ఈ ఓవర్ యాక్టింగ్ అనివార్యమా.. ఏదైనా సరే.. భారత్ సేన ఒకసారి అడుగు ముందుకు వేస్తె అది పాక్ అంతు చూసేవరకూ ఆగేది లేదని భారత్ ప్రభుత్వం మరోసారి గట్టిగ్గా స్పష్టం చేసింది.- సిమ్మాద్రిప్పన్న -
బాలకృష్ణ, నాగార్జున, బన్నీ..అందరికీ అదే పిచ్చి!
సినిమా తారలంటే చాలా మందికి డెమీ గాడ్స్ లెక్క. మరీ ముఖ్యంగా హీరోలనైతే ఆరాధ్యదైవాలగానే కొలుస్తారు. వారి కోసం తన్నడానికి , తన్నించుకోవడానికి, వాళ్ల సినిమాలకు ప్రచారం చేయడానికి మాత్రమే కాదు వాళ్ల కోసం ప్రాణాలిచ్చేయడానికి కూడా సై అంటారు. అంతటి ఆదరణ అభిమానాలు పొందినప్పుడు సహజంగానే పేరు ప్రఖ్యాతులతో పాటు దండిగా డబ్బు, సంపద వస్తుంది. దాంతో సెంటిమెంట్స్ కూడా బాగా ఎక్కువే ఉంటాయి.జ్యోతిష్యాన్ని, వాస్తును, ముహుర్తాలను విపరీతంగా నమ్మే హీరోలు మనకు ఎందరో ఉన్నారు. వీరిలో పలువురు సంఖ్యాశాస్త్రాన్ని కూడా బాగా విశ్వసిస్తారు. ఆ విశ్వాసంతోనే తమ వాహనాల నెంబర్ల విషయంలో రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన వాహనం కోసం అత్యంత డిమాండ్ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్‌ను రూ.7.75 లక్షలకు దక్కించుకుని బాలకృష్ణ వార్తల్లో నిలిచారు. అదే విధంగా గ్లోబల్ స్టార్ హీరో జూ.ఎన్.టి.ఆర్ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారు. ఆయన తన లంబోర్గిని ఉరూస్ వాహనం కు టిఎస్09ఎఫ్ఎస్ 9999 నెంబర్ ను రూ.17లక్షలు ఖర్చు పెట్టారు. ఎన్టీయార్ దాదాపుగా తన అన్ని కార్లకూ 9999 నెంబర్‌నే ఎంచుకుంటారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు తన వాహనాలైన రేంజ్ రోవర్, మెర్సిడెస్ జిఎల్ ఎస్ ల కోసం Výటిఎస్09 ఇకె 600, టిఎస్09జిఒ600 లను కొనుగోలు చేశారు. నాగార్జున బిఎండబ్ల్యూ 7 సిరీస్ కోసం ఎపి 09బిడబ్ల్యు 9000ను వేలంలో దక్కించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రేంజ్‌రోవర్, వోల్వో ఎక్స్‌సి 90ల కోసం టిఎస్07 జిఇ9999 నెంబర్ లపై రూ.10లక్షలు పైనే ఖర్చు చేశారు. సీనియర్ హీరో రవితేజ కూడా తన ఎలక్ట్రిక్ వాహనం బివైడి అట్టో 3 నెంబరు టిఎస్09జిబి 2628 కోసం రూ.17,628 వెచ్చించారు.అమితాబ్ ఆద్యుడు అనుకోవాలేమో...స్టార్డమ్ కి దేశంలోనే అందరికీ బిగ్ బి అని పేర్కొనదగ్గ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కు కూడా నెంబర్ సెంటిమెంట్ ఎక్కువే. ఆయన తన వాహనాలన్నింటికీ 11 నెంబర్ వచ్చేలా చూస్తారు. ఆయన పుట్టిన రోజు కూడా అదే కావడం విశేషం. అలాగే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కి ఇష్టమైన నెంబర్ 2222, ధనుష్ 106 నెంబర్ని ఇష్టపడతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 2727 నెంబర్ని ఎంచుకుంటారు. షారూఖ్ ఖాన్ 555, సంజయ్ దత్ 4545 తమ వాహనాలకి తరచూ కోరే నెంబర్స్. ఈ తరహా సెంటిమెంట్స్ హీరోయిన్స్‌కు పెద్దగా లేకపోవడం ఆసక్తికరం. హీరోలు నెంబర్ల వేటలో రూ.లక్షలు వెచ్చిస్తున్నప్పటికీ.. వారితో ధీటుగా ఫాలోయింగ్ అందుకుంటున్న హీరోయిన్లు మాత్రం ఈ నెంబర్ల పిచ్చికి దూరంగా ఉండడం విశేషం. -
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన దరిమిలా సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా చారిత్రక సిమ్లా ఒప్పందం(Shimla Agreement) నుంచి వైదొలిగే అంశం ప్రస్తుతం పాకిస్థాన్ పరిశీలనలో ఉంది. 1971లో భారత్-పాక్ యుద్ధం అనంతరం 1972 జులై 2న ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం (సిమ్లా అగ్రిమెంట్/సిమ్లా ట్రీటీ) కుదిరింది. నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా... సమస్యాత్మక అంశాల్ని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేది ఆ సంధి సారాంశం. నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ(Indira Gandhi), పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సమస్యల పరిష్కారంలో రెండు దేశాల మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సిమ్లా ఒప్పందం ఇండియాకు ఇన్నాళ్లూ ఓ కవచంలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పాక్ తప్పుకుంటే.. కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో తృతీయ పక్షం జోక్యానికి తలుపులు తెరచినట్టవుతుంది. 1999 అనంతరం ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగకుండా నిరోధించిన ద్వైపాక్షిక యంత్రాంగం కుప్పకూలినట్టవుతుంది. వ్యవసాయం, ఇంధన అవసరాల కోసం సీమాంతర నదులపై ఆధారపడిన రెండు దేశాలు ప్రాంతీయ నీటి లభ్యత విషయంలో అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి ‘స్వీయ ఉపసంహరణ’ మార్గాన్ని పాక్ ఎంచుకునే పక్షంలో ఆ చర్య ఆ దేశానికే నష్టం కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే అప్పుడిక ద్వైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండదు కనుక ఏదైనా చర్చల ప్రతిపాదన వచ్చినా భారత్ తోసిపుచ్చవచ్చు.:::జమ్ముల శ్రీకాంత్ఇదీ చదవండి: ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం? -
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
దేశవ్యాప్తంగా తన అందం, నృత్యాల ద్వారా పేరు తెచ్చుకున్న ఊర్వశి రౌతాలా తన పేరును జనం మర్చిపోకుండా చేయడాన్ని కూడా తన దినచర్యలో భాగం చేసుకుంది. ‘ఢిల్లీ యూనివర్శిటీలోని విద్యార్థులు తన ఫోటోలపై దండలు వేసి ‘‘దమ్దమమై’’ అని పిలుస్తారని ఆమె చెప్పింది. అంతేనా...నా పేరు మీద ఒక ఆలయం ఉంది భక్తులు నా ఆలయంలో పూజలు చేస్తున్నారు’’అంటూ ప్రకటించడంతో ఆమె తనను తాను వార్తల్లో వ్యక్తిగా మరోసారి దిగ్విజయంగా నిలబెట్టుకున్నారు. భక్తులు నిజంగా ఆమె ఆశీర్వాదాలు కోరుకుంటున్నారా? అని అడిగినప్పుడు, ఊర్వశి, ‘అబ్ మందిర్ హై తో వో హాయ్ తో కరేంగే (ఇది దేవాలయం, వారు మాత్రమే చేస్తారు)‘ అని చెప్పింది. అంతేకాదు దక్షిణాదిలో కూడా నా పేరిట ఓ ఆలయం రావాలి, చిరంజీవితో, బాలకృష్ణతో కూడా పనిచేశా.విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారితో కలిసి పనిచేశాను కాబట్టి దక్షిణాదిలో కూడా, నా ఆలయం త్వరలో వస్తుంది, అంటూ ఊహాలోకాల్లో తేలిపోయింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని ప్రస్తావించిన ఊర్వశి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం సమీపంలో తన పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మించారని, బద్రీనాథ్‌ని సందర్శిస్తే, దాని పక్కనే ’ఊర్వశి ఆలయం’ ఉంది అని చెప్పడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీంతో అక్కడి ఆలయ అర్చకులు ఆమెపై మండిపడుతున్నారు. ఆమెపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఈ నేపధ్యంలోనే మరోసారి దేశవ్యాప్తంగా తారల ఆలయాలు చర్చనీయాంశంగా మారాయి. హిందూ మతంలో అసంఖ్యాకమైన దేవతలను పూజిస్తారు. అలాగే తమకు నచ్చిన మనిషిని కూడా దేవుడు/దేవతగా పూజిస్తారు. అంతేకాదు తమ ప్రేమ అభిమానాన్ని చూపించడానికి వారికి గుడులు కూడా నిర్మిస్తారు. ఆ క్రమంలో దేశం నలుమూలల ఆలయాలున్న వేలకొద్దీ దేవతలే కాకుండా, సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు మొదలైన ప్రముఖుల కోసం కూడా ఆలయాలను వారి అభిమానులు నిర్మించి నిర్వహిస్తున్నారు. అలాంటి ఆలయాలలో కొన్నింటి గురించి...అమితాబ్ ఆలయం– ‘షాహెన్షా ఆఫ్ బాలీవుడ్‘ అని పిలుచుకునే అమితాబ్‌కు, కోల్‌కతాలో ఒక ఆలయం నిర్మించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన ప్రభావవంతమైన సేవలను కీర్తిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.–తమిళ లెజెండరీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు తమిళనాడులోనే కాకుండా భారతదేశం అంతటా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. కర్నాటకలోని కోలార్ లో రజనీకాంత్ ఆలయం ఉంది.–ఖుష్బూ సుందర్ తమిళనాడులో అభిమానులు తన పేరు మీద దేవాలయాన్ని నిర్మించిన మొదటి భారతీయ నటిగా గుర్తింపు పొందింది, అయితే. వివాహానికి ముందు సాన్నిహిత్యంపై ఆమె వివాదాస్పద ప్రకటన తర్వాత ఈ ఆలయం తొలగించారు.–దివంగత నటి శ్రీదేవి, తరచుగా భారతీయ సినిమా మొదటి మహిళా సూపర్‌స్టార్, ఆమె జ్ఞాపకార్థం ముంబైలో ఒక ఆలయం ఉంది.–ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ఒక దేవాలయం ఉంది.–భారతదేశం వెలుపల, ప్రత్యేకించి సోవియట్ యూనియన్ ఇతర తూర్పు యూరోపియన్ రాష్ట్రాల్లో భారతీయ సినిమాని తీసుకెళ్లిన దివంగత నటశిఖరం రాజ్ కపూర్‌కి జైపూర్‌లో దేవాలయం ఉంది.–అందం, తెలివితేటలతో పాటు నటనా ప్రతిభకు ప్రసిద్ధి చెందిన ఐశ్వర్య రాయ్ కు కూడా ఆలయం ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో దీనిని నిర్మించారు.–‘కింగ్ ఖాన్‘ లేదా ‘ది లాస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా‘ అని పేర్కొనే ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్‘ షారుఖ్ ఖాన్ కు కోల్‌కతాలో ఆలయం ఉంది.–కోవిడ్ సమయంలో అత్యంత ఉదారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాడు నటుడు సోనూసూద్. దాంతో ఆయన పేరిట తెలంగాణలోని సిద్ధిపేటలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ప్రదర్శించిన నటనకు కాకుండా చూపించిన మంచితనానికి బదులుగా ఆలయం కట్టించుకున్న ఏకైక నటుడు సోనూసూద్ మాత్రమే. అలాగే సినిమాల్లో ప్రతినాయక పాత్రధారుల్లో కూడా మరెవరికీ ఆ ఘనత దక్కలేదు.–తాజా అందాల బ్యూటీ నిధి అగర్వాల్ రెండేళ్ల క్రితమే తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే స్వల్పకాలంలోనే అపారమైన క్రేజ్ అందుకుంది. చెన్నైలోని ఆమె అభిమానులు ఆమెకు ఆలయాన్ని నిర్మించి, ఫిబ్రవరి 14న, ప్రత్యేక పూజలు చేశారు.– ఆమె 36వ పుట్టినరోజున, నటి సమంతా రుత్ ప్రభు కు ఆంధ్రప్రదేశ్‌లో ఆలయం నిర్మించారు. సందీప్ అనే ఆమె అభిమాని ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలోని తన ఇంట్లోనే ఆమెకు గుడి కట్టించాడు.– ఒకప్పటి అగ్రనటి నమిత పాపులారిటీ ఎంతలా ఉండేదంటే...ఆమె అభిమానులు తమిళనాడు అంతటా ఆమె గౌరవార్థం ఒకటి కాదు ఏకంగా మూడు ఆలయాలను నిర్మించారు.– ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం సమీపంలో తన పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మించారని ఇటీవల ఊర్వశి రౌతాలా వెల్లడించింది.అంతేకాదు దక్షిణాదిలో కూడా నా పేరిట ఓ ఆలయం రావాలి, చిరంజీవితో, బాలకృష్ణతో కూడా పనిచేశా.విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారితో కలిసి పనిచేశాను కాబట్టి దక్షిణాదిలో కూడా, నా ఆలయం త్వరలో వస్తుంది, అంటూ ఊహాలోకాల్లో తేలిపోయింది.వద్దన్నవారూ ఉన్నారు...గత పదేళ్లుగా, హన్సిక మోత్వానికి సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. పడికథవన్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత హన్సికను నటి ఖుష్బు సుందర్‌తో పోల్చడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆమె మద్దతుదారులు మదురైలో ఆలయాన్ని నిర్మించాలని భావించారు. ఖుష్భూ, నమిత తర్వాత గుడిలో దేవతగా మారే అవకాశం ఈ ఆలోచనను హన్సిక తిరస్కరించినందున కోల్పోయింది. అలాగే లేడీ సూపర్‌స్టార్ నయనతార గౌరవార్థం ఆమెకు గుడి కట్టడానికి అనుమతి కోసం నటిని అభిమానులు సంప్రదించినప్పుడు. ఆమె ఆఫర్‌ను ఉదారంగా తిరస్కరించింది. ఆమె గత సంవత్సరం తమిళ చిత్రం మూకుతి అమ్మన్లో దేవతగా నటించడం విశేషం.సచిన్ టెండూల్కర్ టెంపుల్, పూణేభారతదేశంలో క్రికెట్ ఒక మతం, మరియు సచిన్ టెండూల్కర్ దాని అత్యంత గౌరవనీయమైన దేవుళ్ళలో ఒకరు. ఇది భారతదేశంలోని భావోద్వేగ క్రికెట్ అభిమానులచే మరొక నినాదంగా కొట్టివేయబడి ఉండవచ్చు, అయితే పూణేలోని ఒక దేవాలయం ఈ క్రికెట్ లెజెండ్‌కు అంకితం చేయబడింది, ఇక్కడ అభిమానులు ‘మాస్టర్ బ్లాస్టర్‘కి నివాళులర్పించడానికి గుమిగూడారు, భారత క్రికెట్ అభిమానులు తమ క్రికెట్ విగ్రహాన్ని తమ దష్టిలో ఎంత ఉన్నతంగా ఉంచుకుంటారో చెప్పడానికి ఇది నిదర్శనం.ఎం.ఎస్. ధోని టెంపుల్, రాంచీభారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన మరియు ఆకర్షణీయమైన క్రికెటర్లలో ఒకడు మాత్రమే కాదు, ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు దేశం యొక్క చక్కని కెప్టెన్ కూడా. అందువల్ల, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. అతను జార్ఖండ్ నుండి మొదటి మరియు అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకడు, మరియు అతని అభిమానులు M. . అతని స్వస్థలమైన రాంచీలో ధోనీ ఆలయం. అతని నాయకత్వం మరియు క్రికెట్ విజయాల పట్ల అతని అభిమానులు కలిగి ఉన్న ఆరాధనకు ఈ ఆలయం ఒక అభివ్యక్తి. -
హృతిక్‌తో ఎన్టీయార్, హృతిక్ మాజీ భార్యతో రామ్‌చరణ్...
ఇటీవలి కాలంలో బాలీవుడ్, టాలీవుడ్ల మధ్య సంబంధాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు అల్లుకుపోతున్నాయి.గతంలో ఎన్నడూ లేనంతగా బాలీవుడ్ తెలుగు సినిమా పరిశ్రమపై ప్రేమను కురిపిస్తోంది. రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు నిర్మాణం నుంచి నటన దాకా భాగం పంచుకుంటున్నారు. అదే క్రమంలో తాజాగా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీయార్‌లు కలిసి వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ రకంగా ఆర్ఆర్ఆర్ చిత్రమే దీనికి కారణంగా చెప్పొచ్చు. తన నటన ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగానూ పేరు సాధించిన జూనియర్ ఎన్టీయార్..క్రేజ్‌ను వాడుకోవడానికే వార్ 2 చిత్ర నిర్మాతలు హృతిక్‌తో ఎన్టీయార్ ని కలిపి అరుదైన కాంబోని ప్లాన్ చేశారనుకోవచ్చు. ఈ నేపధ్యంలో బాలీవుడ్లో ఎన్టీయార్ హవా మొదలయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్‌లో నటించిన రామ్ చరణ్ గతంలోనే స్ట్రెయిట్ హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్లో తన ముద్ర వేద్దామని ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టి.. ఇక ఆపై ఎప్పుడూ బాలీవుడ్లో కాలు మోపలేదు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ కు కూడా జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో.. బాలీవుడ్‌కు ఆప్తుడిగా మారాడు.ఈ నేపధ్యంలో హృతిక్ రోషన్ మాజీ భార్య ఇంటీరియర్ డిజైనర్ అయిన సుస్సానే ఖాన్ ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో చార్కోల్ పేరిట ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఆ స్టోర్‌ని సతీ సమేతంగా సందర్శించారు. దీంతో సుస్సానే ఖాన్ సంతోషాన్ని పట్టలేకపోయారు. రామ్‌చరణ్, ఉపాసన తమ స్టోర్‌కి వచ్చి మాకు అత్యంత అపురూపమైన ప్రత్యేకమైన అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఆమె సోదరుడు జాయెద్ ఖాన్ కూడా తమ సోదరి స్టోర్‌ను గ్లోబల్ సూపర్ స్టార్ అంతేకాక అద్భుతమైన వ్యక్తి అయిన రామ్‌చరణ్ సందర్శించడం ఎంతో సంతోషం కలిగిస్తోందంటూ తన స్పందన వ్యక్తం చేశాడు.హృతిక్ రోషన్‌తో పెళ్లి బంధం విఛ్చిన్నమైనప్పటికీ సుస్సానే ఖాన్ వ్యక్తిగతంగా ఎంచుకున్న కెరీర్లో రాణిస్తోంది. అంతేకాకుండా ఆమె తన మాజీ భర్తతో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఆమె హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్టోర్‌ను హృతిక్ సైతం సందర్శించడం ఆమె బిజినెస్‌కు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. వార్2లో హృతిక్ సహనటుడైన ఎన్టీయార్ ఇప్పటికీ తమ సిటీలోనే ఉన్న సుస్సానే స్టోర్‌ను సందర్శించనప్పటికీ, రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో ముందుండడం ఆసక్తి కలిగిస్తోంది. View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) -
బిచ్చగాళ్లకు ఫోన్ నంబర్ ఇచ్చి ఏటీఎం లా మారిన హీరో!
ప్రస్తుత స్టార్ హీరోల్లో ఎందరో అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చినవారే అయి ఉంటారు. కానీ అప్పటి తమ పరిస్థితులు ఇప్పటికీ గుర్తుంచుకుని అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆపన్నులను ఆదుకునే మనసున్నవాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటివారిలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్(Jackie Shroff) ముందున్నాడు. తన మానవతా సేవలతో నిరుపేదల మనసులను గెలుచుకుంటున్నాడు. ఇటీవల, జాకీ ష్రాఫ్ తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంటూ, ముంబైలోని చవల్లో 33 సంవత్సరాలు గడిపిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఏడు భవనాలకు మూడే బాత్రూమ్స్ ఉన్న ఓ కాంప్లెక్స్‌లోని ఒకటే గదిలో తమ కుటుంబం మొత్తం నివసించిన రోజుల్ని తలచుకుంటూ...రాత్రుళ్లు ఎలకలు తమ వేళ్లనే ఆహారంగా మార్చుకునేవన్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా పరిస్థితులు అనుకూలించక తన చదువు కొనసాగించలేకపోయానని చెప్పారు. అర్ధాకలితో గడిపిన రోజులు మర్చిపోలేనంటున్న ఆయన అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా వారికి నేనున్నా అంటున్నారు. ఏదో ఇంటర్వ్యూ కోసం మాత్రమే ఆయన మాట్లాడడం లేదు. ఇప్పటికే ముంబైలోని దాదాపు 100 కుటుంబాల బాగోగులు చూస్తున్నారు. అది కూడా కొన్నేళ్లుగా. అంతేకాకుండా, వీధుల్లో ఉన్న ప్రతి బిచ్చగాడికి ఆయన తన ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచారు, తద్వారా వారు అవసరమైనప్పుడు ఎంత అర్ధరాత్రయినా, అపరాత్రయినా సాయం పొందగలుగుతారు.తిండికి లేని స్థితి నుంచి వందలాది మందికి తిండి పెట్టగలిగే పరిస్థితి వరకూ సాగిన ప్రయాణంలో పల్లీలు అమ్ముకోవడంతో మొదలై ఎన్నో చిరుద్యోగాలు, చిరు వ్యాపారాలు... అయిపోయాయి. చివరకు ఒక బస్టాండ్‌లో నిలబడి ఉండగా తనని గమనించిన సుభాష్ ఘయ్ కి జాకీలో తన కొత్త చిత్రంలో కధానాయకుడు కనిపించడంతో ఆయన జీవితం మారిపోయింది. హీరో పేరుతో రూపొందిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దానిని తెలుగులో నాగార్జున ఆరంగేట్రంగా కూడా రీమేక్ చేసి విక్రమ్ తీశారు.అలా బస్టాండ్ బతుకు నుంచి బాలీవుడ్ హీరోగా మారిన జాకీ ష్రాఫ్ అక్కడ నుంచి అంచలంచెలుగా టాప్ స్టార్‌గా ఎదిగాడు. అయితే ఎప్పుడూ తన గతాన్ని మర్చిపోలేదు. ఇపుడేదో స్థితి మంతుడయ్యాడు కాబట్టి చేయడం కాకుండా...తాను ఆర్ధికంగా లేని పరిస్థితుల నుంచే ఆయన సేవను ఒక దినచర్యగా మార్చుకున్నాడు. ప్రతీ యాచకునికీ , ఫుట్‌పాత్‌పై నివసించే ప్రతీ చిన్నారికీ తన కాంటాక్ట్నెంబర్ అందేలా ఏర్పాటు చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, సామూహిక భోజనాలు, పేద పిల్లలకు పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల పుట్టినరోజుల సందర్భాలలో కూడా ఆయన ఇదే విధమైన సేవా కార్యక్రమాలను చేస్తాడు. వయసు పై బడిన జాకీష్రాఫ్ ఇప్పడు తెరపై హీరో కాకపోవచ్చు కానీ వందలాది మంది మనసుల్లో ఆయన ఎప్పటికీ హీరోనే... -
పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక
చారిత్రకంగా చూస్తే... పోప్స్ మృతదేహాలను వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయడం రివాజు. ఈ సంప్రదాయాన్ని కాదని 1903లో పోప్ లియో-13 మృతదేహాన్ని ఆయన కోరిక మేరకు సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో పూడ్చిపెట్టారు. ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) ఆఖరి కోరిక ఏంటో తెలుసా? తన భౌతిక కాయాన్ని వాటికన్ వెలుపల సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి(రోమ్)లో ఖననం చేయాలనేది ఆయన మనోవాంఛ. 2023 డిసెంబరు 12న మెక్సికన్ వార్తా సంస్థ ‘ఎన్+’కు కు ఇంటర్వ్యూ ఇస్తూ ఫ్రాన్సిస్ తన అంత్యక్రియలకు సంబంధించి మనసులోని మాట బయటపెట్టారు. అంత్యక్రియల ఏర్పాట్ల గురించి ఆర్చ్ బిషప్ డీగో జియోవని రవేలీతో అంతకుముందే చర్చించినట్టు తెలిపారు. సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి విషయానికొస్తే... ఆరుగురు పోప్స్ మృతదేహాలను అక్కడ ఖననం చేశారు. చివరిసారిగా 1669లో పోప్ క్లెమెంట్-9 అంత్యక్రియలు అక్కడ నిర్వహించారు. శిశువైన జీసస్ ను కన్య మేరీ ఎత్తుకున్న ‘సేలస్ పోపులి రోమని’ (రోమ్ ప్రజలకు రక్షణ) పెయింటింగ్ ఆ చర్చిలో ఉంది. ఆ చిత్రంతో పోప్ ఫ్రాన్సిస్ ది ప్రత్యేక అనుబంధం. పోప్ హోదాలో పర్యటనలు చేసి తిరిగొచ్చాక ఆయన దాని ఎదుట ప్రార్థనలు చేసేవారు.:::జమ్ముల శ్రీకాంత్(Source: AmoMama.com. Photo Credit: The Catholic Weekly). -
Talking Tree: చెట్టుకే మాటలొస్తే.. వినాలని ఉందా?
దాదాపు వందేళ్లక్రితం జగదీశ్ చంద్రబోస్ అనే వృక్షశాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించారు. అవి ఎండనుంచి శక్తిని. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సయిడ్ ను తీసుకుని ఆకులతో శ్వాసించి మనకు ప్రాణాలు నిలిపే ఆమ్లజనిని విడుదల చేస్తాయని నిరూపించారు. అంతేకాకుండా మొక్కలు తమకు హానికారక రసాయనాలను చూసి ఎలర్జీ ఫీలవుతాయని.. వాటిలోనూ మనుషులకు ఉన్నట్లే నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. ఆ తరువాత కొంతమంది శాస్త్రవేత్తలు మొక్కలు తమలోతాము సంభాషించుకుంటాయని.. భావాలు కూడా షేర్ చేసుకుంటాయని పరిశోధించి వివరించారు.. అంటే కొంపదీసి మొక్కలు కూడా మనలా మాట్లాడతాయా ఏందీ అంటూ కొంతమంది అత్యుత్సాహకులు ఆనాడే కామెంట్లు చేసారు.. అయితే అవును మొక్కాలు మాట్లాడతాయి.. ఇదిగో కావాలంటే వినండి అంటూ డబ్లిన్(Dublin)లోని శాస్త్రవేత్తలు మనకు వినిపిస్తున్నారు.మాట్లాడే చెట్టు (టాకింగ్ ట్రీ ) అంటూ ట్రినిటీ కాలేజీలో రూపొందించిన ఈ సరికొత్త ప్రయోగం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అసలు చెట్లు.. వృక్షాలు మొక్కలు తీగలు మనతో మాట్లాడితే బావుణ్ణు.. అసలివి మనతో ఏం మాట్లాడతాయి అంటారు.. ఏమో.. అసలు మనతో మాట్లాడితే కదా... ఇలాంటి ఉత్సుకత మనలో చాలామందిలో ఉంటుంది. మన ఉత్సాహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ కాలేజీ ప్రాంగణంలోని ఓ చెట్టుతో సంభాషించే అవకాశాన్ని.. కలిగించారు.. దీనికి అధునాతన సాంకేతికతను జోడించారు.కాలేజీలోని ఇరవయ్యేళ్ళ వయసున్న లండన్ ప్లేన్ చెట్టుతో ముఖాముఖి సంభాషించే అవకాశం కలిగించారు. డ్రోగా5 టెక్నాలజీ సంస్థ మరియు బ్రిటన్‌లోని ఏజెన్సీ ఫర్ నేచర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును రూపొందించాయి. శాస్త్రవేత్తలు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ... కృత్రిమ మేధస్సు ఇంకా సెన్సర్లను చెట్టుకు అనుసంధానించి చెట్టుకు గొంతును ఇచ్చారు. ఈ సెన్సార్లు చెట్టు అడుగున ఉన్న మట్టి .. దానిలోని తేమ, వాతావరణ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి లోని తీవ్రత.. గాలి స్వచ్ఛత వంటివి అంచనావేసి ఆర్టిఫీషియల్ భాషా నమూనాకు అనుసంధానిస్తారు. అవి చెట్టుకు లింక్ చేస్తారు.. అప్పుడు చెట్టు ఎలా ఫీలవుతుందన్నది అట్నుంచి మళ్ళీ మాటల రూపంలో మనకు వినిపిస్తారు. అంటే చెట్టుకు నీళ్లు లేకపోతె.. వేళ్ళు దాహంతో అల్లాడే పరిస్థితి ఉంటే బహుశా.. దాహం.. దాహం.. కాసిన్ని నీళ్లు పోయండర్రా అంటుందేమో చెట్టు! ఆకలేస్తోంది.. ఎవరైనా ఓ గంపెడు ఎరువు తెచ్చి వేసి పుణ్యం కట్టుకోండర్రా అని చెట్టు మ్రాన్పడిపోతుందేమో!.అంతేకాకుండా చెట్లకు కాలజ్ఞానం ఉంటుందని విశ్వసిస్తున్న శాస్త్రవేత్తలు.. అడవుల్లో ప్రజ్వరిల్లే కార్చిచ్చు వంటివాటిని ముందుగానే మనకు తెలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెట్టుతో సంభాషన అనంతరం కొందమంది విద్యార్థులు మాట్లాడుతూ.. మనం సహచరులతో మాట్లాడడం సహజం.. కానీ ఇలా ప్రకృతితో సంభాషణ అనేది వింతగా ఉంది.. చెట్టు చెబుతున్న భావాలు వింటుంటే అద్భుతంగా ఉందని అబ్బురపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ మరింత పదునుపెట్టారు!. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐతో రూపొందించిన ఓ ఫేక్ ఫోటోను ‘హాయ్ హైదరాబాద్’ అనే హాండిల్ గత మార్చి 31న సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేయగా, ఈ పోస్టును స్విత సబర్వాల్ షేర్ చేశారు.హెచ్‌సీయూలో ఉన్న మష్రూమ్ రాక్, దాని ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు నెమలి, రెండు జింకలతో ‘గిబీ్ల ఆర్ట్’ తరహాలో ఏఐతో రూపొందించిన ఆ చిత్రానికి ‘సేవ్ హెచ్‌సీయూ..సేవ్ హైదరాబాద్ బయోడైవర్సిటీ’ వంటి నినాదాలను జోడించి ‘హాయ్ హైదరాబాద్’ పోస్టు చేయగా, బాధ్యతయుతమైన పదవిలో ఉండి స్మిత సబర్వాల్ పోస్టు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఈ వ్యవహారంలో గచ్చిబౌలి పోలీసులు ఆమె నుంచి వివరణ కోరుతూ ఈ నెల 12న నోటిసులు జారీ చేయగా, ఆమె తగ్గేదే లే అంటూ తన సోషల్ మీడియా యాక్టివిజాన్ని కొనసాగిస్తున్నారు. ‘చట్టానికి కట్టుబడి ఉండే పౌరురాలిగా గచ్చిబౌలి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాను. భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్) చట్టం కింద ఇచి్చన నోటిసులకు నా స్టేట్మెంట్ను ఈ రోజు ఇచ్చారు.ఆ పోస్టును 2వేల మంది షేర్ చేశారు. వారందరిపై ఇదే తరహాలో చర్యలకు ఉపక్రమించారా? అని స్పష్టత సైతం కోరిన. ఒక వేళ చర్యలు తీసుకోకుంటే, కొందరిని లక్ష్యంగా చేసుకోడం ఆందోళనకలిగించే అంశం. చట్టం ముందు సమానత్వం, తటస్థట వంటి సూత్రాల విషయంలో రాజీపడినట్టు అర్థం అవుతుంది.’ అని ఆమె శనివారం ‘ఎక్స్’ వేదికగా కొత్త పోస్టు పెట్టడంతో మరింత వేడి రాజుకుంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలకు సంబంధించిన వార్తను సైతం కొన్ని రోజుల ముందు షేర్ చేశారు.‘ప్రభుత్వం ధ్వంసం చేసిన 100 ఎకరాల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి ప్రణాళికతో రండి. లేకుంటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదు’ అని సుప్రీం కోర్టు చేసిన తీవ్రమైన వాఖ్యాలు ఆ వార్తలో ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంలో తనకు పోలీసులు నోటిసులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ‘ఎక్స్’ వేదికగా కొందరు చేసిన పోస్టులను సైతం ఆమె షేర్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో ఓ వృద్ధుడు దూషిస్తున్న వీడియో పోస్టు చేసినందుకు గాను ఇటీవల అరెస్టై విడుదలైన ‘యూట్యూబ్’ మహిళా జర్నలిసు్ట రేవతి సైతం స్మిత సబర్వాల్‌కు మద్దతుగా ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టగా, దానిని సైతం ఆమె షేర్ చేశారు. ఈ మొత్తానికి ఈ వ్యవహారంలో స్మిత సబర్వాల్ పంతం వీడకుండా తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండడం గమనార్హం. ఆమెకు బీఆర్ఎస్ మద్ధతుదారులు మద్దతు తెలుపుతుండగా, కాంగ్రెస్ మద్దతుదారులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.వివాదాలు కొత్త కాదు... స్మితా సబర్వాల్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాక్టివిజంతో తరుచూ వార్తల్లో ఉంటున్నారు. బిల్కీస్ బాను సామూహిక అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆమె చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. బీజేపీ మద్ధతుదారులు ఆమెకు వ్యతిరకంగా అప్పట్లో తీవ్రంగా ట్రోల్ చేశారు. ఇక నకిలీ వికలాంగ సర్టిఫికేట్‌తో పూజా ఖేద్కర్ అని యువతి ఐఏఎస్ కావడం ఇటీవల తీవ్ర వివాదస్పదమైంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల నియామకాల్లో వికలాంగుల కోటాను వ్యతిరేకిస్తూ ఆమె పెట్టిన పోస్టులను చాలా మంది తప్పుబట్టారు. ఐఏఎస్‌లు కఠోర శ్రమ చేయాల్సి ఉంటుందని, వికలాంగులతో సాధ్యం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయగా, వికలాంగ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆమెకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టులో కేసు వేయగా, ఆమె వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యాలకు చర్యలు తీసుకోలేమని కోర్టు కొటి్టవేసింది.ఓడిన వారి కోసమేనా ఏడ్పు..? : సీఎం సీపీఆర్వో ప్రశ్నస్మిత సబర్వాల్ వ్యవహారంపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యప్రజాసంబంధాల అధికారి(సీపీఆర్వో) బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. స్మిత సబర్వాల్ పేరును ప్రస్తావించకుండా ఆమె వైఖరీని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. ‘ఆ ఐఏఎస్ అధికారి ‘దృష్టికోణం’లో మార్పు ఎందుకు వచ్చినట్టు? అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారోచ్చా? అప్పుడు(బీఆర్ఎస్ హయాంలో) ముఖ్యమంత్రి కార్యాలయంలో నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించినప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికించి, వన్యప్రాణులను తరమింది వీరే.ఇప్పుడు తప్పుబట్టడంలో మర్మం ఏందో ?. అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన(బీఆర్ఎస్) వారి కోసమా?’ అని బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ జరిగిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 25లక్షల చెట్టను నరికివేశారని, పర్యావరణ అనుమతులు లేకుండా మిషన్ భగీరథ పనులు చేపట్టారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలను ఈ సందర్భంగా షేర్ చేస్తూ ఆమె ద్వంద వైఖరీని ప్రశ్నించారు. ఆమె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.-మహమ్మద్ ఫసియుద్దీన్, సీనియర్ జర్నలిస్ట్, సాక్షి -
పెళ్లిని నమ్మనన్న త్రిష.. రెండు పెళ్లిళ్లు అందుకే నన్న కమల్
నిస్సందేహంగా మన దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్(Kamal Haasan) ఒకరు. నటనాపరంగా ఆయన పోషించని పాత్రల గురించి వెదుక్కోవాల్సిందే. నిజజీవితంలోనూ ఆయన భిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా నటీమణులతో ఆయన సంబంధాలు, ఆయన పెళ్లిళ్లు, విడాకులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. ఎందుకంటే అత్యాధునిక తరం అని చెప్పుకునే ఈ తరం నటులు ఫాలో అవుతన్న లివ్ ఇన్ రిలేషన్ షిప్స్, పెళ్లి కాకుండా పిల్లలు వగైరాలన్నీ దాదాపు 2, 3 దశాబ్ధాల క్రితమే కమల్ చేసేశాడు..ఒక్కసారి కమల్ అనుబంధాలను పరిశీలిస్తే... 1975లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్ చిత్రంలో కమల్ తనతో కలిసి నటించిన తర్వాత 1978లో డ్యాన్సర్ వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. ఒక దశాబ్దం తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, కమల్ హాసన్ సహ నటి సారికతో సహజీవనం చేశాడు. ఆ అనుబంధం వల్ల వారికి 1986లో తమ మొదటి సంతానం శ్రుతి హాసన్ (ప్రస్తుతం టాప్ హీరోయిన్) జన్మించింది. ఆ తర్వాత వారు 1988లో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత 1991లో వారికి రెండవ కుమార్తె అక్షర హాసన్ పుట్టింది. ఈ అనుబంధం మరో పదేళ్లు పైనే కొనసాగి 2002లో, వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు, అది 2004లో మంజూరు అయ్యాయి. ఆ తర్వాత 2005 నుంచి 2016 వరకు నటి గౌతమితో కమల్ సహజీవనం చేశాడు. అందుకే తమ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాను వివాహానికి సరిపోతానని తాను భావించడం లేదని ఇంటర్వ్యూలలో తరచుగా కమల్ చెబుతుంటాడు. ప్రస్తుతం 7 పదుల వయస్సులో కూడా కమల్ పెళ్లిళ్లు ప్రస్తావనకు నోచుకుంటున్నాయంటే... అందుకు ఆయన గత చరిత్రలో ఉన్న మలుపులే కారణం.ఈ నేపధ్యంలో సీనియర్ స్టార్ కమల్ హాసన్, నటి త్రిష కృష్ణన్(Trisha), సిలంబరసన్ టిఆర్, శింబులు నటించిన, మణిరత్నం చిత్రం థగ్ లైఫ్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నటీనటులంతా బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ సందర్భంగా మరోసారి కమల్ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది.ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా ఓ యాంకర్ పెళ్లి గురించి నటీనటులను వారి అభిప్రాయాలను అడిగారు. దీనికి 3 పదుల వయసు దాటినా, ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా సినిమాల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న త్రిష....బదులిస్తూ..‘‘ పెళ్లిపై తనకు నమ్మకం లేదు’’ అంటూ స్పష్టం చేసింది. ‘‘తనకు పెళ్లి జరిగే పరిస్థితి ఉండి అది జరిగినా ఓకే’’ అని అలా కాకుండా పెళ్లి జరగకపోయినా సరే తనకు ఓకే అని త్రిష సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి విషయమై కమల్‌ను ప్రశ్నించగా.. దశాబ్దం క్రితం ఎంపీ జాన్ బ్రిటాస్‌కు తనకు జరిగిన ఓ సంభాషణను ఆయన వివరించాడు.‘‘ఇది 10–15 ఏళ్ల క్రితం జరిగింది. ఎంపీ బ్రిటాస్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ముందు నన్ను ‘‘ నువ్వు మంచి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడివి, మరి రెండు పెళ్లిళ్లు ఎలా చేసుకున్నావు? అని ప్రశ్నించాడు. దానికి మంచి కుటుంబం నుంచి రావడానికి పెళ్లికి సంబంధం ఏంటి? అని నేను ఎదురు ప్రశ్నించా. అది కాదు నువ్వు రాముడిని పూజిస్తావు అంటే ఆయన్ను అనుసరించాలి కదా అని అడిగాడు. దానికి నేనేం చెప్పానంటే..నేను ఏ దేవుడ్నీ పూజించను. అంతేకాదు నేను రాముడి జీవనశైలిని అనుసరించను. బహుశా నేను అతని తండ్రి (దశరథ) మార్గాన్ని (ముగ్గురు భార్యలు కలిగి ఉన్న) మార్గాన్ని అనుసరిస్తాను’’ అంటూ కమల్ హాసన్ బదులిచ్చాడు. విక్రమ్ సినిమా సూపర్ హిట్‌తో మరోసారి ఊపందుకుంది కమల్ హాసన్ కెరీర్... తదుపరి చిత్రం, థగ్ లైఫ్, జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. -
అమ్మాయిలూ మీ కోసం కష్టపడండి: అనసూయ
చిన్నితెర మీద యాంకర్‌గా అనసూయ(Anasuya Bharadwaj ) ప్రయాణం ఓ స్పెషల్. అటు చిన్నితెర మీదా ఇటు వెండితెర మీద కూడా గుర్తుంచుకోదగిన పాత్రలు పోషించే అవకాశం ఆమెకు మాత్రమే దక్కిందని చెప్పవచ్చు. కేవలం యాంకర్, యాక్ట్రెస్‌గా మాత్రమే కాకుండా సోషల్ మీడియా సెలబ్రిటీగా కూడా అనసూయ ముందంజలో ఉంది. యాక్టింగ్, యాంకరింగ్ టాలెంట్‌తో పాటు తనదైన శైలిలో గ్లామర్ కూడా పండించడంతో ఆమె తరచుగా వార్తల్లో వ్యక్తి అవుతుంటారనేది వాస్తవం. ప్రస్తుతం మిడిల్ ఏజ్‌లో ఉన్న ఈ బ్యూటీ మధ్యలో కాస్త ఓవర్ వెయిట్ అనిపించినా.. ఇప్పుడు మళ్లీ మంచి శరీరాకృతి సాధించి అభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాదు వారితో ఆమె తరచుగా తన ఫిట్నెస్ జర్నీ విశేషాలు కూడా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె అమ్మాయిలకు అందించిన ఓ సందేశం ఆసక్తికరంగా ఉంది.మహిళలు, ఉద్యోగినులు అయినా గృహిణులు అయినా, తమ కోసం తాము టైమ్ కేటాయించుకోలేక ఒత్తిడికి గురవుతారు; వారి షెడ్యూల్ ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్ అయిపోయి ఉంటుంది. పిల్లలని స్కూల్‌కి రెడీ చేయడంతో మొదలుపెడితే.. భర్తలు అత్తమామలకు టిఫిన్లు ప్యాక్ చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, ఆపై నేరుగా వంట లేదా ఇతర పనుల్లోకి తలమునకలవడం... తో రోజు గడచిపోతుంటుంది. ఇటువంటి దినచర్య మధ్య, తరచుగా చాలా మంది మహిళలకు ఫిట్నెస్ అనేది ఓ టైమ్ వేస్ట్ పనిలా అనిపిస్తుంది.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ యాంకర్ అనసూయ భరద్వాజ్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంది. ఆమె మహిళలకు కొన్ని ఆచరణీయ సలహాలను కూడా అందించింది, తనకు కూడా ఒకప్పుడు జిమ్‌కి వెళ్లడానికి ఆసక్తి ఉండేది కాదని ఇప్పుడు జిమ్ వర్కువట్స్ ప్రారంభించిన తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని చెప్పిందామె. ఇన్ స్ట్రాగామ్‌లో తన జిమ్ వర్కౌట్ల వీడియోను పోస్ట్ చేస్తూ, అనసూయ ఇలా వివరించింది‘‘వంశపారంపర్యంగా నేను ఫిట్‌గా పుట్టాను. అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడతాను ఇక జిమ్‌కి ఎందుకు వెళ్లాలి?’ అని నేను అనుకున్నాను. ఓ ఇంటర్వ్యూలో అదే విషయం చెప్పాను కూడా. కానీ క్రమం తప్పకుండా రెండేళ్ల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామం చేశాక.. దాని ప్రాముఖ్యతను నేను ఇప్పుడు గ్రహించాను.. అంతేకాదు 30 ఏళ్ళ వయసు నుంచి 40కి చేరువవుతున్నప్పుడు నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం మొదలయ్యాక.. అప్పుడు అనిపించింది ఈ వ్యాయామాలను ముందుగానే ప్రారంభించి ఉండాల్సింది అని. కాబట్టి ‘అమ్మాయిలూ మీరు ఎంత త్వరగా జిమ్‌కి వెళ్లడం ప్రారంభిస్తే అంత మంచిది. ఇది మీ కోసం, మీ కుటుంబం కోసం కాదు. నాకు తెలుసు మీరు మూడు పూటలా వంట చేయాలి. మీ భర్త పిల్లల అత్తమామల బాగోగులు చూసుకోవాలి. కానీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ కుటుంబాన్ని కూడా కొంత భారం పంచుకోమని చెప్పండి. ఓ గంట మీకోసం మీరు కేటాయించుకోండి. అప్పుడు మార్పు చూసి మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు. జిమ్‌కి వెళ్లడం ఒక అవసరం, విలాసం కాదు’’ అంటూ ఇన్‌స్టా ద్వారా అనసూయ అందించిన సందేశం ఎంతైనా అనుసరణీయం. ఇంటి పనిభారం మోసే మహిళలు, అమ్మాయిలను తమ కోసం కూడా సమయాన్ని వెచ్చించమని ప్రోత్సహిస్తోంచే ఈ సలహాను అమ్మాయిలు పాటిస్తారనే ఆశిద్దాం. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
మరో శ్రీదేవి కావాలంటే తమన్నా ఇంకో జన్మ ఎత్తాలి: ఖుషి కపూర్
దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి ఒక ఊపు ఊపిన కధానాయికల్లో నెం.1 స్థానంలో ఉంటారు శ్రీదేవి (Sridevi). భారతీయ సినిమాకు ‘మొదటి మహిళా సూపర్ స్టార్‘గా శ్రీదేవి మూస పద్ధతులను బద్దలు కొట్టారు. కామెడీ నుంచి ట్రాజెడీ వరకు వైవిధ్యమైన శైలిలో విస్తృతమైన పాత్రలను పోషించారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం కన్నడ భాషా చిత్రాలతో ఆమె కెరీర్ నలుదిశలా విస్తరించింది.సౌత్.. నార్త్.. అన్నింటా తనదే హవాదక్షిణాదిలో అన్ని భాషా చిత్రాల్లో విజయాలు ఒకెత్తయితే బాలీవుడ్లో మరో ఎత్తు. ‘మిస్టర్ ఇండియా,‘ ‘సద్మా,‘ ‘హిమ్మత్వాలా,‘ ‘ఖుదా గవా,‘ ‘‘లాడ్లా,‘ ‘జుదాయి,‘ ‘ఇంగ్లీష్ వింగ్లీష్‘ వంటి సూపర్ హిట్స్‌తో ఆమె బాలీవుడ్ ప్రేక్షకుల కలలరాణిగా కళకళలాడారు. ఆమె చివరి చిత్రం క్రైమ్ థ్రిల్లర్ ‘మామ్' 2017లో విడుదలైంది. ఇది అందరికీ తెలిసిన శ్రీదేవి.. అయితే తెలియని శ్రీదేవి గురించి ఎలా తెలుస్తుంది?శ్రీదేవి బయోపిక్‌లో నటించాలనుంది: తమన్నాఇప్పుడు బయోపిక్‌ల శకం నడుస్తోంది. సిల్క్ స్మిత నుంచి శ్రీదేవి దాకా తారల జీవితాలను తెరకెక్కించాలని సినిమా పరిశ్రమ ఉవ్విళ్లూరుతోంది. గత కొంత కాలంగా శ్రీదేవి జీవిత కథను సినిమాగా రూపొందించాలన్న చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో ఆ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది? అనే చర్చ కూడా వస్తోంది. ఈ నేపధ్యంలో దివంగత తార శ్రీదేవి ‘‘సూపర్ ఐకానిక్’’ కాబట్టి తెరపై ఆమె పాత్రను పోషించాలనుకుంటున్నట్లు నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘శ్రీదేవి, మేడమ్. సూపర్ ఐకానిక్ ఆమె నాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచీ ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను.. నేను ఎప్పుడూ మెచ్చుకునే వ్యక్తి ఆమె‘ అని తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరుమరి నిజంగా తమన్నాకు శ్రీదేవి పాత్ర పోషించి మెప్పించే స్థాయి ఉందా? ఈ ప్రశ్నకు సినీ పండితుల నుంచి ఇంకా సరైన సమాధానం రాలేదు కానీ.. శ్రీదేవి చిన్న కుమార్తె నుంచి పదునైన సమాధానమే వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుషి కపూర్ (Kushi Kapoor)... తన తల్లిలా మరెవరూ కాలేరని, ఆమె స్థానాన్ని మరొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరని కుండ బద్ధలు కొట్టారు. ఆమెలా చిన్నప్పటి నుంచి నటనపై అంతటి అంకితభావం. అద్వితీయమైన ప్రతిభను ఎవరూ ప్రతిబింబించలేరని ఆమె స్పష్టం చేశారు.తను ప్రత్యేకమైన సృష్టిఇతరులకే కాదు తమకి కూడా అమ్మ స్థానం అసాధ్యమని ఆమె పరోక్షంగా తేల్చేశారు. తనపై ఆమె సోదరి జాన్వీపై శ్రీదేవి చూపిన ప్రభావం సాధారణమైనది కాదన్నారు. అయినప్పటికీ ‘రాబోయే 100 ఏళ్లలో కూడా నేను మా అమ్మలా కాలేను. ఆమె వేరే... ప్రత్యేకమైన సృష్టి‘ అంటూ తన తల్లిలా కావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే అంటూ ఓ ఇంటర్వ్యూ లో పరోక్షంగా స్పష్టం చేశారు.చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్ -
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేనట్లు, అదేదో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ల బాధ్యత అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను రాజకీయంగా మోయడానికి, తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ. దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ, గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వలంటీర్లు పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నిలదీసే యత్నం చేశారు. ఇప్పటికే ఆయా చోట్ల వలంటీర్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో వలంటీర్లు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి వీరే కాదు. సూపర్ సిక్స్ తదితర హామీలు ఏమయ్యాయంటూ మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాలు నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది.వలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. గత ప్రభుత్వం వలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు, లోకేశ్‌లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని, వారికి ఇచ్చేది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమేనని, అందుకే ఏమీ చేయలేదని తెలియ చేశారని పవన్ అన్నట్లుగా మీడియాలో కథనం వచ్చింది. లక్షన్నర మంది జీవితాలను నట్టేట ముంచేసి, అదేదో స్వల్ప విషయమన్నట్లుగా పవన్ వ్యవహరించడం శోచనీయం. 👉ఎన్నికల ప్రణాళికలో వలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని, వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా? పలు ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వలంటీర్ల అంశం ప్రస్తావించారో గుర్తు లేదా? వలంటీర్ల కడుపు కొట్టబోమని, అందులోను లక్షమంది యువతులకు అన్యాయం చేస్తానా? అని ప్రసంగించారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండే వారు. కాని ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతలలోకి తీసుకునే వారు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీనామా చేయని వలంటీర్లు ఆశపడ్డారు. తీరా చూస్తే కూటమి ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది. 👉వలంటీర్లు(Volunteers) అంటే స్వచ్ఛందంగా సేవలందించే వారని, వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఆ విషయం తెలియకుండానే, గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారని నమ్మాలా? అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతారా? పైగా క్యాబినెట్లో చంద్రబాబు, లోకేశ్‌లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా? ప్రభుత్వంలో వారు ఏమి చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా?. వలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనం కనుక ,వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు, లోకేశ్ లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారా?మనం హామీ ఇచ్చాం కదా! ఎందుకు చేయలేం. ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యా?అ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా? ఉగాది పర్వదినానా పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వలంటీర్లకు హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా? అలా అడగలేదంటే ఏమిటి దాని అర్థం? వలంటీర్లు సామాన్యులు కనుక, వారిని ఏమి చేసినా ఏమీ కాదన్న భావనే కదా?. 👉జగన్ ప్రభుత్వం(Jagan Govt) విజయవంతంగా నిర్వహించిన వలంటీర్లు అంటే చంద్రబాబు, లేదా పవన్ కళ్యాణ్‌లకు ఎప్పుడూ గౌరవం లేదు. వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు వీరిని మూటలు మోసే వారని, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్లి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వలంటీర్లను కిడ్పాపర్లతో పోల్చారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేశారు. కాని ప్రజలలో వలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్సార్సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందోనన్న భయంతో, మాట మార్చి తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడమే కాకుండా, గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని ప్రకటించారు. అప్పటికి వారికి అధికారం వస్తుందన్న నమ్మం లేదు. కాని అనూహ్యంగా గెలిచేసరికి, ఇప్పుడు సూపర్ సిక్స్‌తో సహా అనేక అంశాలపై స్వరం మార్చుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నేత. సినిమాలలో వకీల్ సాబ్‌గా ఆయన నటన అభిమానులను మెప్పించింది. కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వకీల్‌సాబ్ పాత్రకు భిన్నంగా ఉంది. ఈ సంగతిని ప్రజలూ గుర్తిస్తున్నారు. కరడుకట్టిన, గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్ కళ్యాణ్ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడిపోతోంది. 👉అబద్దాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానా అంటే తందానా అని తబలా వాయిస్తున్న చందంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పోటీ పడి అసత్యాలు చెబుతున్నారు. తాము మాట మార్చుతున్నామని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్‌గా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లదే తప్పు అన్నట్లు, తనకేమీ సంబంధం లేదన్నట్లు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలను పిచ్చివాళ్లను చేసినట్లు కాదా? వలంటీర్లను మోసం చేయడం కాదా? 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దం అని తేలింది కదా! కేవలం 47 మంది మాత్రమే మిస్ అయ్యారని, వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వమే కదా? పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా? అవ్వదా?.చంద్రబాబు, లోకేశ్‌ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేయుడిగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు కదా! వకీల్ సాబ్ పాత్రను సినిమాలలో పోషించడం కాదు.. ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ఆంక్షలు విధించడం, తత్పలితంగా సుమారు 30 మంది జెఈఈ పరీక్షలు రాయలేకపోయిన ఘటన కూడా కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్ధుల భవిష్యత్తును కూడా దెబ్బతీశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఏది ఏమైనా వలంటీర్లను చంద్రబాబు, లోకేశ్‌లే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్లే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజయసాయి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా?
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ(New Liquor Policy) తీసుకురావడం ద్వారా.. విక్రయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. విక్రయాలు ప్రభుత్వం చేతిలోనే ఉండడం వల్ల, బెల్టు షాపులను నూరుశాతం కట్టడి చేయడం అప్పట్లో సాధ్యం అయింది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయం నుంచి కూడా.. లిక్కర్ అమ్మకాల్లో పెద్ద స్కామ్ జరుగుతున్నట్టుగా దుష్ప్రచారం ప్రారంభించారు. .. దాదాపు 50వేల కోట్ల దాకా స్వాహా పర్వం జరిగినట్టుగా పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చారు. తీరా గద్దె ఎక్కిన తర్వాత.. అన్ని ఆరోపణలు చేసిన లిక్కరు విక్రయాల విషయంలో ఏదో ఒకటిచేయకపోతే పరువు పోతుందనే భయంతో.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 50వేల కోట్ల అవినీతి అనే ఆరోపణల స్థానంలో.. 3వేల కోట్ల అవినీతి జరిగిందని ఆ సిట్ గణాంకాలను తయారుచేసింది. ఇక విచారణలు ప్రారంభించారు. జగన్ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఆయనను విచారించాలంటే నోటీసులు ఇవ్వడానికి అందుబాటులో లేరని తేల్చారు. ఐటీ సలహాదారుగా అప్పట్లో ఉన్న తనను మద్యం స్కామ్ లో ఎందుకు విచారణకు పిలుస్తారంటూ ఆయన ఇచ్చిన మెయిల్ కు జవాబు లేదు. ఈలోగా.. వైఎస్సార్సీపీ రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy)ని సాక్ష్యంగా విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో.. అసలు విజయసాయిరెడ్డి సాక్ష్యం చెప్పడానికి ఏ రకంగా అర్హుడు? ఆయన సాక్ష్యానికి చట్టబద్ధత ఉంటుందా? చెల్లుబాటు అవుతుందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. సాధారణంగా ఒక కుంభకోణం(Scam) జరిగిందని ప్రభుత్వం భావిస్తే దానితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారినే విచారణకు పిలవాలి. ఎవరైతే నేరం చేశారని అనుకుంటున్నారో వారిని విచారించడానికి నోటీసులు ఇచ్చే తరహాలోనే.. దానితో సంబంధం ఉందనిపించిన వారిని సాక్షిగా పిలిచి ధ్రువీకరించుకోవచ్చు. మద్యం డిస్టిలరీల నుంచి భారీగా సొమ్ములు తీసుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డారనేది ఇక్కడ ఆరోపణ. మహా అయితే డిస్టిలరీల యజమానులను పిలిచి విచారించడానికి అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డిని ఏ కారణం చేత సాక్షిగా వివరాలు చెప్పాలని పిలుస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ(YSRCP)కి రాజీనామా చేశారు. బయటకు వెళ్లిన తర్వాత పార్టీ మీద ఇప్పుడు రకరకాల నిందలు వేస్తున్నారు. ఇటీవల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆయన ధ్రువీకరిస్తూ.. ఆ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఎవరో మూడో వ్యక్తి.. హఠాత్తుగా తెరమీదకు వచ్చి. ‘ఫలానా స్కామ్ లో ఫలానావాళ్లు అవినీతి చేశారు.. నేను చెబుతున్నాను’ అని చెబితే అది చెల్లుబాటు అవుతుందా? ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిన నాయకులు ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ అధికార కూటమి ప్రలోభపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి ఏదో ఒక విధంగా.. వైఎస్సార్సీపీ నేతల మీద బనాయించిన రకరకాల కేసుల్లో సాక్షులుగా మార్చేస్తే దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి కదా అనేది పలువురు అభ్యంతరంగా ఉంది. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చిన వారిని, ఏమాత్రం సంబంధం లేని కేసుల్లో కూడా సాక్షులుగా మార్చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారిందంటే గనుక.. అది అనేక విపరిణామాలకు దారితీస్తుంది. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ తమ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఒక అడ్డదారిని ఎంచుకున్నట్టుగా అవుతుంది. విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరైనా సరే.. ఎవరిమీదనైనా నిందలు వేయగలరు. కానీ..ఆ సమాచారం తనకు ఎలా తెలిసిందో సహేతుకంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన చెప్పే సాక్ష్యం మూలాలను కూడా నిర్ధారించుకుంటే తప్ప సిట్ పోలీసులు సమర్థంగా వ్యవహరించినట్టు కాదు.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.:::ఎం. రాజ్యలక్ష్మి -
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
సినిమా రెమ్యునరేషన్ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది కానీ దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం... ఇప్పుడు రెమ్యునరేషన్స్ విషయంలో సినిమా దర్శకులు హీరోలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కొందరు దర్శకులైతే టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకుల పారితోషికాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.నెం.1 ప్లేస్‌లో జక్కన్నప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీపరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది.. డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్ అని నిరూపించుకుంటోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్ మెగా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) నెం1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి 1, 2లతో పాటు RRRల ద్వారా వందలు, వేల కోట్ల కలెక్షన్లతో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్... దాదాపుగా రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. దశాబ్ధానికిపైగా హిట్స్ ఇస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే... మిగిలిన టాప్ 5లో కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాకడం గమనార్హం.రెండో ప్లేస్ కూడా మనదే..అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగుదర్శకుడైన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఉండడం విశేషం. తెలుగు అర్జున్‌రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్‌కి ఎదిగిపోయిన సందీప్... అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్ సినిమాలతో రూ.100 నుంచి రూ.150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లాడు. ఏకంగా నెం. 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. కేవలం మూడే సినిమాలతో ఆయన ఈ ఘనత సాధించడం చెప్పుకోదగ్గది. అదే రకంగా దేశం అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ది సైతం అనూహ్యమైన విజయయాత్రే. 100% సక్సెస్ రేటుఈ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ (Atlee Kumar) కేవలం ఆరు చిత్రాలతో 100 శాతం సక్సెస్ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. తమిళ చిత్రాలైన మెర్సల్, బిగిల్‌లతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వంటి బ్లాక్ బస్టర్లతో అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం తాత్కాలిక టైటిల్ ఎఎ22ఎక్స్ఎ6 పేరుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అట్లీని అమాంతం 3వస్థానంలోకి చేర్చింది. 233% రెమ్యునరేషన్ పెంచిన డైరెక్టర్జవాన్ కోసం రూ. 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి రూ. 100 కోట్లకు అంటే.. దాదాపుగా 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్‌గా అట్లీని మూడవ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత రూ.80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, రూ.75 కోట్లతో 5వస్థానంలో సుకుమార్, రూ. 55–65 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు.చదవండి: ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్ -
యాడ్స్‌లో అగ్రహీరోల హవా..రోజుకి అన్ని కోట్లా?
హైదరాబాద్ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్‌లో ఆ నలుగురూ కనపడుతుంటారు. అరవై లో ఇరవైలాగా యాడ్స్‌లోనూ కుర్రహీరోలకు పోటీగా అదరగొడుతుంటారు. తెలుగు సీనియర్ హీరోలు వయసు పెరుగుతున్నా తగ్గేదేలే అన్నట్టుగా ప్రకటనల ప్రపంచంలో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) తన కెరీర్లో ఫిలిప్స్ ఇతర బ్రాండ్లకు ఎండార్స్మెంట్లతో సహా అనేక ప్రకటనలలో పాలుపంచుకున్నారు ఆయన చాలా కాలం క్రితమే ప్రముఖ బ్రాండ్స్‌కు పనిచేశారు. ఆయన చేసిన థమ్సప్ యాడ్ సంచలం సృష్టించడంతో పాటు వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. ఆ యాడ్‌లో ఆయన ప్రస్తుత యువ కధానాయకుడు శర్వానంద్‌తో కలిసి కనిపించడం విశేషం. సమకాలీకులతో పోలిస్తే ఒకప్పుడు యాడ్ వరల్డ్‌లోనూ ముందున్న చిరంజీవి ప్రస్తుతం ఈ విషయంలో కొంత వెనుబడ్డారు. ఆయన కంట్రీ డిలైట్ ప్రకటనల్లో కనిపిస్తున్నారు.కింగ్ నాగార్జున(Nagarjuna Akkineni) ఒకప్పుడు ప్రకటనల విషయంలో చాలా దూసుకుపోయారని చెప్పాలి. సమకాలీకుల కంటే బాగా ముందుండేవారు. ఐదు పదుల వయస్సు దాటిన హీరోల్లో మిగిలిన వారితో పోలిస్తే ఆయన ఎక్కువగా ప్రకటనల్లో ఆయన కనిపించారు. నాగార్జున అక్కినేని డాబర్ మెస్వాక్ టూత్‌పేస్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు, అలాగే కేరళకు చెందిన కళ్యాణ్ జ్యువెలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్. ఈ బ్రాండ్‌కి సంబంధించిన నాగ్ పోస్టర్లు ప్రకటనలు కళ్యాణ్ జ్యువెలర్స్‌కు మంచి గుర్తింపునిచ్చాయి. ఘడి డిటర్జెంట్‌తో సహా ఇతర ఉత్పత్తుల ప్రకటనలలో కూడా కనిపించిన నాగార్జున అమితాబ్ బచ్చన్ తో కలిసి యాడ్స్ కోసం స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం విశేషం.విక్టరీ వెంకటేష్(Venkatesh) దగ్గుబాటి మణప్పురం జనరల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ లిమిటెడ్ , రామ్రాజ్ కాటన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు అదే విధంగా బైక్ వొ మార్కెటింగ్ బ్రాండ్ ప్రమోషన్ కార్యకలాపాలలో కూడా పాల్గొన్నారు. మూవీ ఈవెంట్స్ ప్రమోషన్స్ కంపెనీ అయిన శ్రేయాస్ మీడియా విక్టరీ వెంకటేష్ మెడ్‌ప్లస్ ప్రకటనతోనే ప్రకటనల రంగంలోకి అడుగు పెట్టింది. బైక్ వోలో వ్యూహాత్మక పెట్టుబడిదారు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వెంకటేష్.. మార్కెటింగ్, ఔట్రీచ్ బ్రాండ్ ప్రమోషన్ కార్యకలాపాలకు సహకరిస్తున్నారు. ఈ భాగస్వామ్యం 2025 నాటికి భారతదేశం అంతటా 20,000 ఇవి ఛార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయాలనే లక్ష్యంతో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.తాజాగా అగ్రగామి రియల్ ఎస్టేట్ బ్రాండ్ కాసా గ్రాండ్ వెంకటేష్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. తాజాగా బాక్సాఫీస్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం తో...వెంకటేష్ ను మరింత మంది యాడ్ మేకర్స్ సంప్రదిస్తున్నట్టు సమాచారం.సమకాలీకులతో పోలిస్తే ఒకప్పుడు ప్రకటనల ప్రపంచంలో పూర్తిగా వెనుకపడిన మాస్ హీరో బాలకృష్ణ అరవై ఐదేళ్ల వయసులో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కు టాప్ అడ్రెస్‌గా మారారు. తొలిసారి సౌత్ ఇండియా ఆధారిత కన్స్ట్రక్షన్ అండ్ ప్లాటింగ్ సర్వీసెస్ కంపెనీ సాయి ప్రియా గ్రూప్‌తో ప్రకటనల ప్రపంచంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం మాల్స్ దగ్గర నుంచి నగల బ్రాండ్ల దాకా ప్రమోట్ చేస్తున్నారు. రెండు రోజుల వర్క్‌కి గాను ఆయన రూ. 3 కోట్ల నుంచి ఆపైన దక్కించుకుంటారని యాడ్ నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు, ఆయన ఓ రిటైల్ బ్రాండ్ ప్రచారంలో నటి ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి కనిపించాడు. ‘అఖండ‘, ‘భగవంత్ కేసరి’ ‘వీరసింహారెడ్డి‘ వంటి హ్యాట్రిక్ హిట్లతో, నటుడిగా అతని స్థాయి పెరిగింది. ‘వరుసగా మూడు బ్లాక్బస్టర్లు కొట్టడంతో టాలీవుడ్లో తన సమకాలికుల కంటే యాడ్ వరల్డ్‌లో ముందున్నాడు -
విజయాల శ్రీ‘లీల’వెనుక రహస్యాలివే...
యువ నటి శ్రీలీల(sreeleela) నిస్సందేహంగా భారతీయ సినీరంగంలో తదుపరి పెద్ద స్టార్ కానుంది అంటున్నాయి సినీజోస్యాలు. తన అందం, ఆకర్షణ, ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అసాధారణమైన ఇతర నైపుణ్యాలతో, ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. పుష్ప2లోని కిస్సిక్ పాటతో ఆమె ఉత్తరాది ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపారు. నిజానికి పుష్ప తొలి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ అయినా కూడా సమంతకు రానంత పాప్యురారిటీ శ్రీలీలకు వచ్చింది. ఆ పాట ఆమె హిందీ చిత్రసీమలోకి రెడ్‌కార్పెట్ వేసింది. దాంతో సౌత్‌లోనూ ఆమె క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది, ఇక ఆమె బాలీవుడ్లో మెరిసిపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే...శ్రీలీల తాజా హిందీ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇటీవల, ఈ చిత్రం సెట్ నుంచి అనేక వీడియోలు ఫొటోలు ఆనలైన్ లో ప్రత్యక్షమయ్యాయి. మరుసటి తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎరుపు రంగులో వదులుగా ఉండే దుస్తులు ధరించిన శ్రీలీల లుక్ ని, ఆమె రూపాన్ని మెచ్చుకుంటూ ఆమె పాత్ర గురించి ఊహాగానాలు చేస్తూ, అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు. ఓ రకంగా ఈ చిత్రానికి దక్షిణాదిలో విపరీతమైన టాక్ రావడానికి కారణం శ్రీలీలే అని చెప్పాలి. అందం, ప్రతిభ ఆత్మవిశ్వాసాల కలయికగా శ్రీలీల బాలీవుడ్లో రంగప్రవేశం చేస్తోంది. ఖచ్చితంగా కొన్నేళ్ల పాటు భారతీయ సినీరంగాన్ని ఊపే సత్తా ఆమెకు ఉందని బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీలను ఈ స్థాయిలో నిలబెట్టిన కొన్ని ముఖ్యమైను అంశాలను పరిశీలించాలి..కన్నడ చిత్రం కిస్ (2019)తో శ్రీలీల మరపురాని అరంగేట్రం చేసింది, ఆమె సహజమైన సౌందర్యం, ప్రకాశవంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయం ఆమెకు కొత్త అవార్డులను సంపాదించిపెట్టింది, ఇది భారతీయ చలనచిత్రంలో ఆమె మంచి జర్నీకి నాంది పలికింది.రెండో విషయంగా చెప్పాల్సి వస్తే ఆమె నృత్య,నటనా ప్రతిభ గురించే చెప్పాలి. ధమాకా (2022)లో, జింతాక్ పాటలో చురుకైన రిథమ్, గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ లతో శ్రీలీల తెలుగు సినిమాకి డాన్స్ డార్లింగ్‌గా మారింది.పెళ్లి సందడి (2021)లో సాంప్రదాయంగా కనపడి, భగవంత్ కేసరి (2023)లో యాక్షన్ సీన్స్ వరకు శ్రీలీల తనలోని షేడ్స్ స్కిల్స్ బాగా పండించింది. స్కంద (2023), ఆదికేశవ (2023), గుంటూరు కారం (2024) చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో తన స్కిల్స్‌కు సానబట్టింది.భాషపై పట్టు కూడా శ్రీలలకు అచ్చొచ్చిన మరో అంశం. కన్నడ, తెలుగు, తమిళం ఇంగ్లీషు భాషలపై ఆమెకున్న పట్టు ఆమెని విభిన్న భాషా చిత్రాల్లో, భిన్న పరిశ్రమల్లో బలంగా నిలబెట్టింది. వివిధ భాషా నేపథ్యాలకు చెందిన అభిమానులతో ఆమె సులభంగా మమేకం కాగలుగుతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ఒడిసిపట్టగల శ్రీలీల ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా ఆకట్టుకోగలుగుతోంది. ఆమె వార్డ్రోబ్ ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ గా పేరొందింది.అధిక ఫ్యాషన్‌తో యువత కు మరింత దగ్గర కాగలుగుతోంది. ఆమె ఫ్యాషన్ లుక్స్ ఆమెను మ్యాగజైన్లపై, వెబ్‌సైట్స్‌లో తళుక్కుమనేలా చేస్తున్నాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (2023) వంటి చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు, శ్రీలీల తన వైద్య విద్య పరిజ్ఞానం గురించి ఆమె స్వచ్ఛంద సేవల గురించి బాగా వెలుగులోకి వచ్చింది. ఆమె సహకారం అందిస్తున్న గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు మహిళల విద్యకు మద్దతు అందించడం వంటివి ఆమెను నటిగా మాత్రమే కాక అంతకు మించి భారతీయ సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన రోల్ మోడల్‌గా అవతరించేందుకు అవకాశం అందిస్తున్నాయి. -
26 ఏళ్ల నాటి అత్యంత ఖరీదైన సినిమా...ఇంకా విడుదల కాలేదు..!
ప్రస్తుతం అంతా భారీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించకపోతే వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల బుర్రలోకెక్కించలేం అన్నట్టుగా ఉంది పరిస్థితి. కధ, కధనాలను బట్టి బడ్జెట్ అనడం కన్నా బడ్జెట్‌ను బట్టి కధ అన్నట్టు మారిపోయింది. ఐదూ, పది కోట్లతో తీసే సినిమాల గురించి మాట్లాడుకోవడం కూడా దండగ అన్నట్టుగా నోరెత్తితే భారీ సినిమాలే చర్చకు నోచుకుంటున్నాయి. అయితే భారీ చిత్రాలు అనేవి ఇప్పుడే కాదు ఒకప్పుడూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలు దశాబ్ధాల క్రితమే తలపెట్టారు. అలాంటి ఒక సినిమా, ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే చరిత్రలోనే నెం1 భారీ చిత్రం అని పేర్కొనదగ్గ సినిమా... పాతికేళ్ల క్రితమే ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా పేరు మరుదనాయగం (Marudhanayagam).‘మరుదనాయగం‘ అనేది 18వ శతాబ్దపు యోధుడు మహ్మద్ యూసుఫ్ ఖాన్ గురించిన చారిత్రక నాటకం స్ఫూర్తితో తలపెట్టారు. హిందీ, తమిళం, తెలుగు ఆంగ్లంతో సహా పలు భాషలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్(Kamal Haasan) ను ఎంతో ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మక కాలపు చిత్రం మరుధనాయగం సినిమా 1997లో, తన స్వీయ దర్శకత్వంలో ప్రారంభించారు. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ అతిధిగా ఇది భారీ స్థాయిలో షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సుజాత స్క్రిప్ట్ రాశారు. నాజర్, సత్యరాజ్, విష్ణువర్ధన్ తదితర నటులు కూడా ఈ సినిమాకు ఎంపికయ్యారు.(చదవండి: ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల)ప్రత్యేక పాత్రల కోసం అమితాబ్, రజనీకాంత్‌లను కూడా సంప్రదించినప్పటికీ వాళ్లు తిరస్కరించారు. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు కీలకపాత్రలో హాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ కేట్ విన్స్లెట్ ని కూడా అనుకున్నారు. సినిమా టెస్ట్ షూట్ కోసం, కమల్ హాసన్ మాజీ భార్య, నటి సారిక బ్రిటీష్ ఫ్రెంచ్ సైన్యం అధికారులతో పాటు హిందూ ముస్లిం యోధులను ప్రతిబింబించేలా 7,400 వరకు దుస్తులు ఉపకరణాలను తయారు చేయించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూ.1 కోటి ఖర్చుతో టెస్ట్ షూట్ చేశారు. అప్పట్లోనే ఈ సినిమాకు రూ.80 నుంచి 90 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు..అంటే ప్రస్తుతం లెక్కల ప్రకారం చూస్తే...ఇది రూ..650 కోట్ల వరకూ ఉండొచ్చు.(చదవండి: ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్)అట్టహాసంగా అతిరధుల సమక్షంలో ప్రారంభమైన ఈ సినిమా,30 నిమిషాల రన్ టైమ్ పూర్తయిన తర్వాత 1998 చివరలో షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని సహ–నిర్మాతగా నిర్మించాలని అనుకున్న ఒక బ్రిటిష్ కంపెనీ, అర్ధంతరంగా వెనక్కి తగ్గడంతో, మరుధనాయగం పనులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. బ్రిటీష్ నిర్మాణ సంస్థ ఉపసంహరణ కారణంగా ఏర్పడిన ఆర్థిక పరిమితులు అడ్డంకిగా మారాయి. ఈ సినిమా పూర్తి కాలేదు... ఇప్పటికీ విడుదల కాలేదు, ప్రాజెక్ట్ ఎక్కడిది అక్కడే ఉండిపోయింది. ఆ బ్రిటిష్ కంపెనీ ఉపసంహరించుకోకుంటే ఈ సినిమా ఖచ్చితంగా పూర్తయి విడుదలై ఉండేది ఎన్నో సంచలనాలు నమోదు చేసేది.ఆ బ్రిటిష్ కంపెనీ సినిమా నిర్మాణం నుంచి ఉపసంహరించుకోవడానికి కారణం భారతదేశంలో జరిగిన పోఖ్రాన్ అణు బాంబు పరీక్ష . అంటే కమల్ సినిమా ఆగిపోవడానికి మన భారతరత్న నాటి అణు పరీక్షల సారధి అబ్ధుల్ కలాం పరోక్షంగా కారణం అయ్యారన్నమాట. అయితే అది తన కలల ప్రాజెక్ట్ అని కమల్ హాసన్ చెబుతుంటారు. కానీ ఇప్పుడు గానీ ఆ సినిమా స్క్రిప్ట్‌ను పునరుద్ధరించాలంటే గణనీయమైన మార్పులతో పాటు, దీనికి ఓ యువ కథానాయకుడు అవసరమని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికైనా తెరకెక్కుతుందో లేదో.... -
మొదటి పెళ్లి దుస్తుల్ని వేలంలో అమ్మేశా, రెండో పెళ్లి దుస్తులు..వెల్లడించిన నటి
నటి దియా మీర్జా మన హైదరాబాదీ అమ్మాయే. మిస్ ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్‌గా అందాల సుందరిగా కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత వరుసగా విభిన్న భాషల్లో సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తెలుగులో ఆమె చివరగా నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలో చేసింది. సినిమాలతో పాటు పలు రకాల వ్యాపారాలు కూడా చేస్తూ స్థిరపడిన దియా మీర్జా... వ్యక్తిగత జీవితంలో ప్రేమ పెళ్లి మాత్రం విఫలమైంది. ఆమె గత 2014లో తన వ్యాపార భాగస్వామి సాహిల్ సంఘాని పెళ్లాడింది. అయితే ఐదేళ్లలోనే ఆ పెళ్లి పెటాకులైందని ఆమే స్వయంగా ప్రకటించింది. అనంతరం రెండేళ్లు గ్యాప్ ఇచ్చి అప్పటికే వివాహితుడు, ఒక బిడ్డకు తండ్రి అయిన వైభవ్ రేఖిని పెళ్లి చేసుకుని దియా మీర్జా రేఖిగా మారింది. అయితే విడాకుల తర్వాత కూడా ఎప్పుడూ తన మొదటి పెళ్లి గురించి దియామీర్జా మాట్లాడింది లేదు. ఇటీవల మాత్రం ఒక ఇంటర్వ్యూలో, దియా మీర్జా తన పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఆ తరహా ఆలోచనల వెనుక ఉన్న పలు అంశాల్ని గురించి మాట్లాడుతూ తన రెండవ పెళ్లిని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ తరహాలో చేసుకున్నట్టు వివరించింది.తమ ఇంటి తోటలోనే అత్యంత నిరాడబంరంగా సహజమైన పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. చేతితో తయారు చేసిన వ్యక్తిగతీకరించిన బహుమతులు స్థానిక సహజమైన అలంకరణ ఉత్పత్తులనే వివాహం కోసం వాడినట్టు తెలిపారు. ఆహార వ్యర్థాలను తగ్గించడానికి అతిథులకు శాకాహార మాంసాహార వంటకాల ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారిస్తూ, భోజనాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేశామన్నారు. కేవలం ఓ మహిళా పూజారితో దంపతులు సాదాసీదాగా వేడుక పూర్తి చేశామన్నారు. వధువుగా ధరించడానికి బాలీవుడ్ వధువులకు సాధారణమైన లెహెంగాకు బదులుగా ఎరుపు రంగు బనారసీ చీరను దియా ఎంపిక చేసుకోవడం విశేషం.ఇదే సందర్భంగా ఆమె తన మొదటి పెళ్లి గురించి కూడా గుర్తు చేసుకుంది. ఆ పెళ్లి ఒక ఫార్మ్ హౌజ్‌లో జరిగింది. ఆడంబరంగా జరిగిన ఆ పెళ్లిలో ఆమె ఖరీదైన దుస్తులను ఎంచుకుంది. ఆ పెళ్లిలో ఆమె బాలీవుడ్ వధువుల తరహాలోనే లెహంగానూ ధరించింది. అయితే వివాహాల తర్వాత బ్రైడల్ లెహంగాలు తరచు నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది. వాటిని పారవేయలేక, ఇటు ధరించనూ లేక వార్డ్‌రోబ్స్‌లో ఉంచుతారంది. ఒక పర్యావరణ అనుకూల మనస్తత్వంతో తాను దాన్ని ఇష్టపడలేదని చెప్పింది. దాంతో ఆమె తన మొదటి పెళ్లిలో తాను ధరించిన తన వివాహ లెహంగాను వేలం వేయాలని అనుకుంది. అనుకున్నట్టుగానే దాన్ని మంచి ధరకు వేలం వేశానని వెల్లడించింది. నిరుపయోగంగా పడి ఉండకూడదనే తాను తన రెండవ పెళ్లికి సాధారణ చీరను ఎంచుకున్నానని తన భర్త వైభవ్ రేఖీ సైతం అదే పనిచేశారని తెలిపింది. పెళ్లి తర్వాత అలమారాలో ఉపయోగించకుండా కూర్చోకుండా జీవితాంతం ధరించగలిగే దుస్తులను ఆయన కూడా ఎంచుకున్నట్లు కూడా ఆమె పేర్కొంది. ఆమె పెళ్లి రోజున, దియా మీర్జా సాంప్రదాయ ఎరుపు రంగుకు దూరంగా డిజైనర్ రీతూ కుమార్ తయారు చేసిన ఆకుపచ్చ జర్దోసీ ఘరారాను ఎంచుకుంది. -
రోజుకి రూ.లక్ష..అయినా ఊటీలో సినిమా షూటింగ్స్ బంద్...ఎందుకంటే?
దక్షిణాది ఉత్తరాది తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషా చిత్రాల షూటింగ్ లకు స్వర్గధామం లాంటిది తమిళనాడులోని ఉదకమండలం...అదే ఊటీ(Ooty) . మన రోజా, గీతాంజలి తదితర దక్షిణాది చిత్రాలతో పాటు నాటి ‘ఖయామత్ సే ఖయామత్ తక్ నుంచి నిన్నా మొన్నటి బర్ఫీ దాకా ఊటీ అంటే సినిమా షూటింగ్‌లకు అచ్చొచ్చిన బ్యూటీగా నిలిచింది. ‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ,‘ ‘అందాజ్ అప్నా అప్నా,‘ ‘బర్ఫీ,‘ ‘దిల్ సే,‘ ‘జో జీతా వోహీ సికందర్,‘ ‘రాజా హిందుస్తానీ,‘ వంటి బాలీవుడ్ సినిమాలు ఊటీ అందాలకు అద్దం పట్టాయి.ఏళ్లు గడుస్తున్నా, అనేక రకాల షూటింగ్ స్పాట్స్ అందుబాటులోకి వస్తున్నా ఊటీకి మాత్రం షూటింగ్స్ తాకిడి తగ్గడం లేదు. ఇటీవల ‘రివర్‌డేల్‘ అనే కాల్పనిక పట్టణానికి నేపథ్యంగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘ది ఆర్చీస్‘ కూడా ఊటీలో చిత్రీకరించారు. అలాగే ది లారెన్స్ స్కూల్, లవ్‌డేల్‌తో సహా ‘రాజ్‘ చిత్రం కూడా ఊటీలో తీసినవే. ఏటా వందలాదిగా షూటింగ్స్ కు ఊటీ కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఊటీలోని బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్, టాయ్ ట్రైన్ తదితర ప్రాంతాలతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న తేయాకు తోటలు కూడా సినిమా కెమెరాలకు పని చెబుతూనే ఉంటాయి.ఈ నేపధ్యంలో ప్రస్తుతం పర్యాటకుల తాకిడితో ఊటి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా గత ఏడాది కనీ విని ఎరుగని స్థాయిలో భారీ సంఖ్యలో పర్యాటకులు ఊటీకి వెల్లువెత్తారు. ఊటీకి వెళ్లేదారిలో భారీగా ట్రాఫిక్ జామ్స్ సైతం ఏర్పడ్డాయి. ఇక గత వేసవిలో ఊటీలో కాలుష్యం ఎన్నడూ లేనంత స్థాయిలో నమోదైంది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఇ పాస్ వంటి నిబంధనలతో పర్యాటకుల రాకను నియంత్రించింది. రాకపోకలను కట్టుదిట్టం చేసింది. అయితే గత ఏడాది అనుభవాలతో ఈ సారి ప్రభుత్వం మరింత ముందుగా మేల్కొంది. ముందస్తుగానే అంటే ఏప్రిల్ నెల రాకుండానే ఇ పాస్ నిబంధన విధించడంతో పాటు ఊటీలోకి 6వేల వాహనాలకు మాత్రమే ఎంట్రీ వంటి పలు ఆదేశాలు జారీ చేసింది. అదే క్రమంలో సినిమా షూటింగ్స్ పైనా నిషేధం విధించింది. ఈ ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ప్రభుత్వ బొటానికల్ గార్డెన్, గవర్నమెంట్ రోజ్ గార్డెన్ సహా ఎనిమిది పార్కులలో సినిమా షూటింగ్‌లను అక్కడి ఉద్యానవన శాఖ తాత్కాలికంగా నిషేధించింది. వందల, వేల సంఖ్యలో పర్యాటకులు తమ సెలవులను ఆస్వాదించేందుకు ఈ పార్కులను సందర్శిస్తుండటంతో వారికి ఇబ్బందులు ఎదురవకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యానవన శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ‘‘మేము చెన్నైలోని మా ఉద్యానవన శాఖ డైరెక్టర్ నుంచి సరైన అనుమతి పొందిన తర్వాత మాత్రమే చిత్ర యూనిట్లను అనుమతిస్తున్నాం. సినిమా నిర్మాతలు ఒక రోజు షూటింగ్ కోసం కనీసం 25,000 నుంచి గరిష్టంగా 1 లక్ష వరకు చెల్లించాలి. అయితే, వేసవి సెలవుల కారణంగా ఈ ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊటీలోని పలు పార్కులలో అన్ని సినిమా షూటింగ్‌లను తాత్కాలికంగా నిషేధించాం’’ అని చెప్పారు. -
రహస్య సంభాషణల కోసం కొరియన్ భాష.. మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దక్షిణాది నటుడిగా తన ప్రయాణం ప్రారంభించిన ఆర్ మాధవన్ (R Madhavan ) ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రముఖ నటుడిగా మారారు. కేవలం అభినయానికే ప్రాధాన్యతను ఇస్తూ టాప్ నటులుగా మారిన అతి తక్కువ మందిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. గత ధోరణికి భిన్నంగా ఆయన ఇటీవల కాస్త ఎక్కువగానే ఇస్తున్న ఇంటర్వ్యూల్లో అనేక సమకాలీన, సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నారు. తాజాగా చాలా మంది తల్లిదండ్రులకు సమకాలీన పాప్ సంస్కృతి పరిశీలకులకు సుపరిచితం అయిన ఓ అంశాన్ని ప్రస్తావించాడు, ప్రస్తుతం భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కె.పాప్ పట్ల ఆయన తొలిసారిగా స్పందించాడు.ప్రస్తుత ఓటీటీ యుగం పుణ్యమా అని అనేక దేశాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలు మన యువతకు చేరువయ్యాయి. అందులో అత్యంత వేగంగా పిల్లల్ని ఆకట్టుకుంటోంది కొరియన్ పాప్ (K Pop) సంగీతం, కొరియన్ సినిమా, సిరీస్‌లు. ఈ కొరియన్ సంస్కృతి పట్ల భారతీయ పిల్లలు పెంపొందించుకున్న గాఢమైన ఆకర్షణపై మాధవన్ ఆశ్చర్యంతో పాటు తన ఆందోళనను సైతం వ్యక్తం చేశారు, ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన ఊపందుకుంటున్న ధోరణిపై తన ఆలోచనలను ఆందోళననను పంచుకున్నాడు.‘దక్షిణాదిలో–ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో–కె–పాప్ సరికొత్త సంస్కృతిగా అవతరిస్తోంది‘ అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. యువత లో కె–పాప్ సంస్కృతి ఊహలకు అందనంత లోతుగా అల్లుకుపోతోందని వారి కథా కథనాలలో భారతీయ సినిమా తో పోలిస్తే అంత వైవిధ్యం ఏం ఉందో? అదెందుకు వారిని అంతగా ఆకట్టుకుంటుందో తెలియడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే వీటన్నింటి కన్నా తల్లిదండ్రులకు మరింత ఆందోళనను కలిగించే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదేమిటంటే... అనేకమంది భారతీయ యువత కొరియన్ భాషను నేర్చుకుంటున్నారు అనేది. నిజానికి అన్యభాషా చిత్రాలను ఆదరించడం, వారి సంగీతాన్ని ఎంజాయ్ చేయడం ఎప్పుడూ ఉండేదే. అయితే ఏకంగా కొరియన్ భాషను నేర్చుకుని మరీ ఆ సంగీతం, వినోదాన్ని ఆస్వాదించాలనే వారి బలమైన ఆసక్తి పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆయన మరో రహస్యాన్ని కూడా బహిర్గత పరిచాడు. కొరియన్ భాషను నేర్చుకుంటున్న పిల్లలు వారి తల్లిదండ్రులకు అర్థం కాని రహస్య సంభాషణల కోసం కోడ్ లాంగ్వేజ్ గా కూడా ఉపయోగిస్తున్నారనే చేదైన వాస్తవాన్ని ఆయన తెలియజేశాడు. సాంకేతిక విప్లవం కారణంగా ఇప్పటికే టీనేజర్లు రకరకాల మాయాజాలాల్లో ఇరుక్కుపోతున్న పరిస్థితుల్లో కొరియన్ భాషలో వారు సాధించే పట్టు ద్వారా పొందే ప్రయోజనం కేవలం సినిమా, పాప్ సంగీత వినోదానికే పరిమితం కాగా...దాని వల్ల తల్లిదండ్రులకు కలిగే నష్టం అంతకు మించి ఉండబోతోందని ఒక టీనేజర్ తండ్రి కూడా అయిన మాధవన్ చెబుతున్న విషయం ప్రతీ ఒక్క పేరెంట్ గుర్తు పెట్టుకోవాల్సిందే అనడంలో సందేహం లేదు. -
అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
అక్కినేని వారి ఇంటికి కోడలు అనే కేరాఫ్ శోభితా ధూళిపాలా (Sobhita Dhulipala)ను ఇటీవలే వరించి ఉండొచ్చు గానీ... ఆమె పేరుకు ముందు అత్యంత ప్రాచుర్యం కలిగిన జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్ చేరడం మాత్రం చాలా రోజుల నుంచే ఉంది. అందాల సుందరి కిరీటం దక్కించుకోవడం దగ్గర నుంచి మొదలుపెడితే... ఒకటొకటిగా ఈ తెలుగమ్మాయి దక్కించుకున్న విజయాలు అంత చిన్నవేమీ కావు. బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాల నుంచి మంకీ మ్యాన్ వంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లకు కూడా విస్తరించింది ఓ వైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో రాణిస్తూనే మరోవైపు కమర్షియల్ బ్రాండ్స్ రూపొందించే ప్రకటనల యాడ్ వరల్డ్ కి కూడా హాట్ ఫేవరెట్‌గా మారింది శోభిత. ఆమె భీమా జ్యువెల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్, అలాగే జాక్వార్ ఇండియా హర్ స్టోరీ ప్రచారాలలో కూడా తళుక్కుమన్నారు.యాడ్ గల్లీ డాట్ కామ్ ప్రకారం...ఆమె ఇండో–ఫ్యూజన్ ఫ్యాషన్ డిజైనర్ లేబుల్ అయిన క్యుబిక్ ప్రచారాలలో కూడా కనిపించింది. అంతేకాక ఆమె దాసోస్ క్యాబినెట్ల ప్రచారాలలో కూడా పాల్గొన్నారు. ఐశ్వర్య, సుష్మితాసేన్, ప్రియాంకచోప్రాలను మినహాయిస్తే.. అందాల సుందరి కిరీటం దక్కించుకున్నవారిలో శోభిత స్థాయి విజయాలు మరెవరూ సాధించలేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ప్రకటనల్లో , యాడ్ వరల్డ్ అయితే ఆమెకి తిరుగేలేదు. నటిగా సరే, ప్రకనటల్లోనూ యాడ్ క్వీన్‌గా ఆమె రాణించడానికి ఏయే అంశాలు దోహదం చేశాయి? దీని గురించి మోడలింగ్, యాడ్ రూపకల్పన నిపుణులు ఏమంటున్నారంటే... అందం...విలక్షణం... ఆమె అందం కళాత్మక సున్నితత్వంల విలక్షణ సమ్మేళనం, అందుకే శోభితా ధూళిపాళ క్లాస్, మాస్‌లకు ఇష్టమైన సెలబ్రిటీగా ఉద్భవించింది, ఒక ప్రత్యేకమైన అద్భుతమైన అందం ఆమె స్వంతం.డస్కీ కలర్ క్లాసిక్ ఛార్మ్ సాంప్రదాయ మోడల్స్, సెలబ్రిటీల నుంచి శోభితను ప్రత్యేకంగా నిలబెడుతోంది. లగ్జరీ బ్రాండ్లు ఆమె విలక్షణమైన రూపాన్ని ఇష్టపడతాయి, ఆమె హై–ఎండ్ ఫ్యాషన్, అందం ఆభరణాల బ్రాండ్లకు అనువైన ఎంపికగా మారింది. భారతీయతను ప్రతిబింబిస్తూనే.. ఆమె గ్లోబల్ అప్పీల్ ఆమెను వేర్వేరు ప్రాంతాలలోని వైవిధ్యభరిత అభిరుచులు కలిగిన విభిన్న రకాల వినియోగదారులతో కనెక్ట్ కావాలనుకునే బ్రాండ్లకు అనువైన, విలువైన అంబాసిడర్‌గా మార్చింది. ఫ్యాషన్...ఓ స్టోరీ టెల్లింగ్... వ్యక్తిగతంగా ఆమె పాతకాలపు చీరలు, టైలర్డ్ సూట్లు లేదా మినిమలిస్టిక్ సిల్హౌట్‌లు లాంటి కాండిడ్ ఫ్యాషన్ సె¯Œ ్సకు ప్రసిద్ధి చెందింది.ఆమె ఫ్యాషన్‌ను కేవలం ధరించదు దాని ద్వారా ఓ చక్కని కథ చెబుతుంది ఆమె రెడ్ కార్పెట్ ఎడిటోరియల్ లుక్స్ జాగ్రత్తగా క్యూరేట్ చేయబడినట్లు అనిపిస్తుంది, తద్వారా హస్తకళను ప్రదర్శించే హెరిటేజ్ బ్రాండ్లకు ఆమె సరైన ప్రతినిధిగా మారింది. ఆమెకు ఇంటెలక్చ్యువల్ లుక్స్ ఓ వరం. ఆమె తరచుగా సాహిత్యం, కళ చరిత్ర గురించి అనర్గళంగా మాట్లాడుతుంది, ఇవి ఆమెను కేవలం ఒక గ్లామర్ క్వీన్‌గా మాత్రమే కాకుండా ఆలోచనా పటిమ కలిగిన శక్తివంతమైన మహిళగా చూపిస్తోంది. ఈ మేధోపరమైన ఆకర్షణ ఆమెను సంస్కారవంతమైన, వివేకం గల వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే బ్రాండ్లు ఎంచుకోవడానికి కారణమవుతోంది. శోభితా ధూళిపాలా ఆధునిక అందపు స్టైలిష్ లుక్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుతుందని నిరూపితం కావడమే ఆమె మరిన్ని బ్రాండ్స్‌తో పనిచేసేందుకు ఉపకరిస్తోంది. -
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సీక్వెల్స్ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే అదే లైన్‌తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్‌తో కొత్త ట్రెండ్‌ని సెట్ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్.నేచురల్ స్టార్ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్లు రెండూ కమర్షియల్ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.నిజానికి హిట్ ‘హిట్ 2’లో నాని కనిపించినట్టే హిట్ 3లో హీరో అడివి శేష్, విశ్వక్సేన్ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్ మాత్రం స్పెషల్ రోల్ చేస్తున్నాడు కానీ, విశ్వక్సేన్ మాత్రం లేకపోవడానికి కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్ సేన్ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట. అయితే హిట్ 2లో చేసినట్టే... క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్ 4’లో హీరో గా చేయనున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన తమిళ హీరో కార్తీ ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్ చేసే విధంగా ‘హిట్ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్ప్రైజ్ కోసం సీక్రెసీ మెయిన్టైన్ చేస్తుందా? చూడాలి.


