breaking news
KCR
-
బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ల నియామకం చేపట్టింది. శాసనసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లుగా హరీష్‌రావు,. సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లన నియమించగా, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలను బీఆర్ఎస్ నియమించింది. ఇక మండలిలో బీఆర్ఎస్ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం మేరకే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, వికారాబాద్: రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్నారనే అనుమానం కలుగుతుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ అవినీతిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మీడియా ముందు తొండలు జోర్రగొడతా అంటూ.. అసెంబ్లీలో కేసీఆర్ ముందు దండాలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు.హిల్ట్ పాలసీపై చర్చ ఎందుకు పెట్టడం లేదు? గ్లోబల్ సమ్మిట్, విదేశీ పెట్టుబడులపై చర్చించే దమ్ము దైర్యం ఉందా?. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పోయాయి?. ప్రతి వర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై చర్చించే దమ్ము దైర్యం ప్రభుత్వానికి ఉందా?. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి సమయం లేదా?. ప్రధాన ప్రతిపక్ష నేతతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని, పాలన గాలికి వదిలేశారు’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. -
ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య
-
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్-రేవంత్ కరచలనం.. పలకరింపుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే.. కేసీఆర్‌ను తాను ముఖ్యమంత్రి హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు కదా అని రేవంత్ అంటున్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో ఈ అంశంపై స్పందించారు. ‘‘కేసీఆర్‌ను నేను సీఎం హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో ఆస్పత్రిలోనూ కలిశాను కదా. నేను సభా నాయకుడ్ని. కాబట్టి అందరినీ గౌరవిస్తా. అందుకే కేసీఆర్‌ను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. మరి సభలో నుంచి వెంటనే ఎందుకు వెల్లిపోయారే ఆయన్నే అడగాలి’’ అని రేవంత్ అన్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా.. తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లే లోపు సభలో సీఎం రేవంత్, ప్రభుత్వం విప్‌లు, మంత్రులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్ దగ్గకు వెళ్లి పలకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి మినహా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అయితే.. రాకరాక సభకు వచ్చిన కేసీఆర్ కొద్దిసేపైనా సభలో ఉంటారనుకున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా... బావుంది అని చెప్పారు. నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు.. బావుందని చెప్పా. కేసీఆర్ హాస్పిటల్ లో దీక్ష చేశారు. నేను రోడ్లపై దీక్ష చేశాను. నేను ఒరిజినల్ ఉద్యమకారుడిని. తెలంగాణ కోసం పోరాడిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానం చదివే సమయంలో కేసీఆర్ బయటకి వెళ్లారు. మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేది అని కోమటిరెడ్డి అన్నారు.పెద్ద మనిషిగా కేసీఆర్ ను కలవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కేసీఆర్ ను కలిశారు. నేనూ కేసీఆర్‌ను కలవాలి అనుకున్నా. కానీ, ఆయన చుటటూ దుర్మార్గులు ఉన్నారు. అందుకే కలవలేదు అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు. -
కేసీఆర్, రేవంత్ భేటీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
-
అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్
-
అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్
-
రేవంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్.. పట్టుమని అరగంట కూడా ఉండకుండా వెళ్లిపోయారు. అయితే ఈలోపే సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడోసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. బీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆపై శాసన సభ ప్రారంభం అయ్యి.. జాతీయ గీతం ఆలాపన దాకా ఉన్నారు. అంతకంటే కాస్త ముందు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత వద్దకు వెళ్లి పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి తప్ప అంతా నిల్చున్నారు. ఆపై మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి సహా అధికార పార్టీ విప్‌లు కూడా కేసీఆర్‌ను పలకరించారు. నూతనంగా ఎన్నికైన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్‌ను పలకరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే.. ఆ తర్వాత ఆయన సభలో కనిపించలేదు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకం చేసిన అనంతరం జీరో అవర్ ప్రారంభం కాకముందే కేసీఆర్ వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఆయన నేరుగా నందినగర్ నివాసానికి చేరుకున్నారు. కాగా, కృష్ణా జలాల పంపిణీపై జరగనున్న శీతాకాల సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్పందనతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని బట్టి చూస్తే ఈసారి అసెంబ్లీ వాడీవేడిగా జరగనుందని తెలుస్తోంది. ఈసారి కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. అయితే నేటి పరిణామం నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగనుంది. -
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అప్డేట్స్వారం రోజులు సభ నడపాలని బీఏసీ నిర్ణయంవారం తర్వాత మళ్ళీ బీఏసీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయం20 రోజులు సభ నడపాలని బీజేపీ,15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్, సీపీఐ పట్టునెక్ట్స్ బీఏసీలో నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం తెలంగాణ ఉభయ సభలు జనవరి 2కు వాయిదాకాసేపట్లో బీఏసీ సమావేశందేని మీద చర్చ పెడుతున్నారో తెల్వదు: కేటీఆర్ముఖ్యమంత్రి కృష్ణా నది ఎక్కడ ఉన్నది అని అడుగుతారుభాక్రా నంగల్ ఏ రాష్ట్రంలో ఉన్నదో తెల్వని ముఖ్యమంత్రి రేవంత్పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహా దారుడువీళ్ళు నీటిపారుదల శాఖ పై చర్చ అంటున్నారుదేనిమీద చర్చ పెడుతున్నారో తెల్వదునీటిపారుదల శాఖ పై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారుకేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు అని చర్చకు మంత్రులు ప్రిపేర్ అవుతున్నారుకౌశిక్ రెడ్డి సభలో ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని అన్నాడుబూతులు మాట్లాడాలి అంటే ఎన్ని రోజులైనా సభను పెడతారుసభ లో సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని రోజులు నడుపుతారుహుజురాబాద్ లోని చెక్ డ్యాం పేల్చివేతలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పాత్ర ఉన్నది.ఆనాడు మేడిగడ్డ ను పేల్చారు అని ఇంజనీర్లు పిర్యాదు చేశారు.. అలాంటప్పుడు ఎందుకు మీరు విచారణ చేపట్టడం లేదురష్యా ఉద్యమం లో కాకువ డ్యాంను పేల్చారు.అలానే ఇక్కడ కూడా మేడిగడ్డను పేల్చారనీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ క్లుప్తంగా వివరించి చెప్పారుకేసీఆర్ కాసేపైనా ఉండాల్సింది: కోమటిరెడ్డిసభా సమరం.. మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా? బావుంది అని చెప్పారు.నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు... బావుందని చెప్పా.మాజీ ఎమ్మెల్యే లకు సంతాపం తెలిపితే సభలో లేకుండా కేసీఆర్ వెల్లిపోవడం సరైంది కాదుమౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేదిఅధికార-ప్రతిపక్షం నడుమ బాంబుల గొడవతెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షం నడుమ బాంబుల గొడవబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారంమేడిగడ్డ ప్రాజెక్టును బాంబులు పెట్టి పేల్చేశారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిమేడిగడ్డ మాదిరిగానే తనుగుల చెక్ డ్యామ్‌ను కూడా బాంబుతో పేల్చేశారు: కౌశిక్రెడ్డికౌశిక్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల తీవ్ర అభ్యంతరంకౌశిక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు కౌంటర్ బాంబులు పెట్టి పేల్చారని అనడం ఏంటి?.: ఎమ్మెల్యే నాగరాజు కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: ఎమ్మెల్యే నాగరాజుసభలో కాసేపు ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదంశాసనమండలి వాయిదాశాసన మండలిలో ముగిసిన సంతాప ప్రకటనలుదివంగత నేతలకు సంతాపం ప్రకటించిన మండలితెలంగాణ శాసనమండలి జనవరి 2కు వాయిదాబీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.రెండేళ్ల పాలనలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, అధికారులు సమీక్ష చేయలేదు.సిద్దిపేట ఇరిగేషన్ ను మంత్రి పట్టించుకోవడం లేదు.మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ పై లక్షల ఎకరాలు ఆయకట్టు ఆధారపడి ఉంది.ప్రభుత్వం సిద్దిపేట జిల్లా ఇరిగేషన్ పై సమీక్ష చేయాలిఆ ఎమ్మెల్యేలు అలా.. ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలుట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన స్పీకర్ట్రెజరీ బెంచీలవైపు కూర్చున్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ఫిరాయింపు ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీలలో కూర్చోవడాన్ని గతంలో తప్పు పట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుభాషపై బీజేపీ అభ్యంతరం.. మంత్రి వివరణవెంకటరమణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే @ అసెంబ్లీదిగజారి భాష మాట్లాడటం సరికాదుఒకరిని మించి మరొకరు మాట్లాడితే ఎలా ?ఒకరు తప్పు మాట్లాడితే మరొకరు సరిచేయాలిబూతు లు మాట్లాడటమే రాజకీయమా ?నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ వరకు మంత్రులు కూడా దిగజారి మాట్లాడుతున్నారుహైదరాబాద్ వరల్డ్ క్లాస్ అంటున్నారు.. మాటలు మాత్రం థర్డ్ క్లాస్ గా ఉంటున్నాయిశ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రి వివరణ.. మాకు భేషజాలు లేవువెంకటరమణ రెడ్డి తన పార్టీ నేతలకు సూచించాలిగౌరవ సభ్యుల గౌరవం కాపాడే విధంగా చూస్తాంశాసనసభలో ఇంట్రెస్టింగ్ సీన్అసెంబ్లీలో కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి కరచలనంప్రతిపక్ష నేత దగ్గరకు వెళ్లి మరీ షేక్‌హ్యాండ్ ఇచ్చిన సీఎం, మంత్రులుఆశీర్వాదం తీసుకున్న జూబ్లీహిల్స్ నూతన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్వందేమాతరం తర్వాత సభలో కనిపించని ప్రతిపక్ష నేతఅసెంబ్లీ అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకం చేసిన కేసీఆర్అనంతరం.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన గులాబీ బాస్ఇటు ఫిరాయింపుల నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ సీన్అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెనక కూర్చున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పార్టీ ఫిరాయింపు కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ప్రకటించిన స్పీకర్తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలుదివంగత నేతలకు సంతాపం తెలిపిన ఉభయ సభలుఅసెంబ్లీలో జీరో అవర్ ప్రారంభంప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలుతెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభంహాజరైన సీఎం రేవంత్, ప్రతిపక్ష నేత కేసీఆర్దివంగత నేతలకు సంతాప తీర్మానం చదివి వినిపిస్తున్న గడ్డం ప్రసాద్ఇటు తెలంగాణ శాసన మండలి సమావేశాలు ప్రారంభందివంగత నేతలకు మండలిలో సంతాపంసంతాప తీర్మానం చదివి వినిపిస్తున్న చైర్మన్ గుత్తా సుఖేందర్అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డిమరికాసేపట్లో మొదలుకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుఅసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్, మంత్రులుకేసీఆర్.. అటెండెన్స్‌కే పరిమితం కావొద్దు: కాంగ్రెస్‌ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలుకేసీఆర్ కేవలం అటెండెన్స్‌కే పరిమితం కావొద్దుహరీష్, కేటీఆర్ మధ్య గొడవలు పెరిగాయని.. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని పరజలు అనుకుంటున్నారుఅందుకే అసెంబ్లీలో జరిగే చర్చలోనూ కేసీఆర్ పాల్గొనాలిఅసెంబ్లీలో కేసీఆర్ భేటీమరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేతబీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలతో సమావేశంఫిరాయింపులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలుమీడియా చిట్‌చాట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలుఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యే లు చెప్పుకోలేకపోతున్నారుఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ఆ స్థానంలో ఇక కొత్తవారికి అవకాశంగ్రౌండ్లో బీఆర్ఎస్కు మంచి పట్టు ఉందిసర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురు దెబ్బ తగిలిందిబీఆర్ఎస్కు 80 శాతం అనుకూల ఫలితాలు వచ్చాయికాంగ్రెస్కు అందుకే భయం మొదలింది.. మున్సిపల్ ఎన్నికలు పెడుతలేరుమున్సిపల్ ఎన్నికలకల్లా నన్ను లేకుండా చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోంది నేను లోపలకు పోయినా.. బయట పార్టీ చూసుకుంటదినేను ఎవరికీ.. దేనికి భయపడనుఅసెంబ్లీ వద్ద ఉద్రిక్తతఅసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణంఅసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన మాజీ సర్పంచ్లుపెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్గన్ పార్క్ వద్ద అదుపులో తీసుకున్న పోలీసులుఅసెంబ్లీకి బయల్దేరిన కేసీఆర్!మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్నందినగర్ నివాసం నుంచి బయల్దేరిన కాన్వాయ్కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్రెడ్డిఅసెంబ్లీ వద్ద 1000 మంది పోలీసులుతెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులుఅసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటుచేసిన పోలీసులు..దాదాపు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు..ఈరోజు మాజీ సర్పంచ్ లు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ముట్టడికి పిలుపుదీంతో ముందస్తుగా మాజీ సర్పంచ్ అరెస్టు చేసిన పోలీసులుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది. సమావేశాలకు ఇటు అధికార కాంగ్రెస్.. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్.. అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. ఎవరి తోలు ఎవరు తీస్తారో చూద్దామంటు సవాళ్లు విసురుకుంటున్నాయి. అయితే.. సభను హుందాగా నడుపుకుందామని అన్ని పక్షాలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు ఇవ్వడం గమనార్హం. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్‌పై ప్రతిపక్ష నేత కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తోలు తీస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దానికి కౌంటర్‌గా సీఎం రేవంత్ చేసిన ప్రతివ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే కేసీఆర్ సభకి వచ్చి చర్చలో పాల్గొని ఆ ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ ప్రతిసవాల్ విసిరింది. మరోపక్క కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డిపై కేసీఆర్ తన పదేళ్ల హయాంలో ఎందుకు పెట్టలేదని అధికార పార్టీకి చెందిన ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ తరుణంలో కేసీఆర్ తొలిసారి సమావేశాలకు హాజరవుతారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోని నిర్ణయాలను ఎండగట్టడంతో పాటు గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తామని ఒకవైపు మంత్రులు.. మరోవైపు అధికార ఎమ్మెల్యేలు, హామీల ఎగవేతతో పాటు జల వనరుల విషయంలో ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య ధోరణిని బయటపెడతామని బీఆర్ఎస్.. ఇంకోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్లు చేస్తున్న మోసాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ అంటోంది. ఈ సెషన్లోనే శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే.. ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.షెడ్యూల్ ఇలా.. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. తొలుత.. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు ఉంటుంది. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఆపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క చర్చల కోసం వివిధ పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత.. సమావేశాల ఎజెండా ఖరారు, ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.ఇరిగేషన్ ప్రధానాంశంగా..ఈసారి అసెంబ్లీ సమావేశంలో కృష్ణ గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టుల పై ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపు పై చర్చించాలని పట్టుబడుతోంది గులాబీ పార్టీ. దానికి కౌంటర్‌గా.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఇలాంటి చర్చే గనుక జరిగితే తమకూ పీపీటీ ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోలేదు.హైదరాబాద్‌కు కేసీఆర్కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారనే అంశంపై బీఆర్ఎస్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఇప్పటిదాకా ఆయన రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అయితే.. ఆయన ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోవడంతో కచ్చితంగా హాజరు కావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ ఉదయం నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యి సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. -
అసెంబ్లీకి గులాబీ బాస్! ఇక సమరమే..!!
-
కేసీఆర్.. రూ.2 వేల కోట్ల లెక్క చెప్పు
నల్లగొండ టూటౌన్: ‘అల్లుళ్లు హరీశ్‌రావు, సంతోశ్రావులు రూ.2 వేల కోట్లు దోచుకున్నారని కేసీఆర్ సొంత కూతురు కవితే చెప్పింది. వాళ్లు దోచుకున్న రూ.2 వేల కోట్లకు లెక్కలు చెప్పు కేసీఆర్’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానం నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్ద గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.గత 24 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా రూ.1.20 కోట్ల జీతం తీసుకున్నారని మంత్రి విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎవరూ భయపడరని, ఆ మొనగాడిని ఉతికి ఆరేస్తామని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ, గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఒక్క రేషన్‌కార్డు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. అమరావతికి రోడ్డు.. నల్లగొండ జిల్లా కనగల్ –గుర్రంపోడు మండలాల మధ్య నుంచి అమరావతికి ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని అమరావతి వరకు రూ.20 వేల కోట్లతో నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్‌వే రహదారి సర్వే ప్రారంభమైందని, ఈ రోడ్డు కనగల్, గుర్రంపోడు మండలాల మధ్య నుంచి అమరావతికి వెళుతుందని స్పష్టం చేశారు. కాగా, పదవులు శాశ్వతం కాదని తాను ఢిల్లీకి వెళ్లకున్నా మంత్రి పదవి వచ్చిందని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వింటర్లో వాటర్ వార్!
సాక్షి, హైదరాబాద్: నదీ జలాల పంపిణీ అంశమే ప్రధాన ఎజెండాగా సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ సమావేశాల్లో వాడీవేడి చర్చ జరగనుంది. ఇందుకోసం అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటుండగా, కాంగ్రెస్ వాదనలను సమర్థంగా తిప్పికొట్టడంతోపాటు తాము తీసుకున్న పకడ్బందీ చర్యలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ రెండు పార్టీలు నదీ జలాల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఎదురుదాడి చేస్తామని బీజేపీ చెబుతుండగా, ఈ చర్చలో తమ వంతు పాలుపంచుకునేందుకు ఎంఐఎం, సీపీఐ కూడా రెడీ అయ్యాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కూడా హాజరుకానుండటంతో చలికాలంలో అసెంబ్లీ వేదికగా నీటి మంటలు పుట్టనున్నాయి. తొలిరోజే ఆర్డినెన్సులు సభ ముందుకు శీతాకాల సమావేశాల్లో భాగంగా శాసనసభ, శాసన మండలి సోమవారం ఉదయం 10:30 గంటలకు కొలువు తీరనున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏడు ఆర్డినెన్సులను తొలిరోజే అసెంబ్లీ ముందుకు తేనున్నారు. ఈ జాబితాలో జీహెచ్ఎంసీ వివస్తరణ, సరిహద్దుల నిర్ధారణ, శివారులోని 27 మున్సిపాలిటీల విలీనం, జీఎస్టీ సవరణ, ముగ్గురు పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తదితరాలున్నాయి. సోమవారం సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వస్తు సేవల పన్ను (సవరణ)–2025 ఆర్డినెన్సును సభ ముందుంచుతారు.ఆ తర్వాత ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ)–2025, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (రెండో సవరణ)–2025, తెలంగాణ మున్సిపాలిటీస్ (రెండో సవరణ)–2025 ఆర్డినెన్సులను ప్రవేశపెడతారు. అనంతరం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సర్వ శిక్ష అభియాన్, పీఎం శ్రీ ఆడిట్ నివేదికలను ప్రవేశపెడతారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్విసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ (సవరణ)–2025, తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్విసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ (రెండో సవరణ)–2025 ఆర్డినెన్సులను సభ ముందుకు తేనున్నారు.అనంతరం పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ)–2025 ఆర్డినెన్సు, ఎంపీపీ, జెడ్పీ ఎన్నికలకు సంబందించిన గెజిట్ నోటిఫికేషన్లను సభ ముందు పెట్టనున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హారి్టకల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదిక ప్రవేశపెట్టనువ్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్యేలు ఆర్.దామోదర్ రెడ్డి (సూర్యాపేట), కొండా లక్ష్మారెడ్డి (చేవెళ్ల) మృతి పట్ల సంతాపం తెలుపుతూ స్పీకర్ తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లోనే కవి అందెశ్రీ కుమారుడి ఉద్యోగం కోసం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్సు, రెండు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను కూడా తేనున్నట్టు సమాచారం. మండలిలో ఇలా... ఇక, మండలిలో తొలి రోజు రెండు సంతాప తీర్మానాలను పెట్టనున్నారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీలుగా పనిచేసి చనిపోయిన మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్‌షబ్బీర్ మృతికి సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం మండలి వాయిదా పడుతుందని సమాచారం. అసెంబ్లీ, మండలి షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు అసెంబ్లీ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సోమవారం సమావేశంకానుంది. శీతాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ చేపట్టాలన్నది నిర్ణయిస్తారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం సభ వాయిదా పడిన తర్వాత మళ్లీ జనవరి 2న ప్రారంభం కానుంది. మూడు లేదా నాలుగు రోజులపాటు శీతాకాల సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరిగే అవకాశాలున్నట్లు తెలిసింది. రాజకీయ ‘రణరంగమే’ కృష్ణా జలాల పంపిణీపై జరగనున్న శీతాకాల సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్పందనతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని బట్టి చూస్తే ఈసారి అసెంబ్లీ వాడీవేడిగా జరగనుందని తెలుస్తోంది. ఈ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. అసెంబ్లీకి హాజరయ్యేందుకు ఆయన ఆదివారమే ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఈసారి కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది.అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాలు తమ వాదనలను సమర్థవంతంగా వినిపించడం ద్వారా ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలు చేయనున్నాయి. అందులో భాగంగా ఈనెల 1న ప్రజాభవన్‌లో అధికార పక్షం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తోంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలను వివరించడంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న పకడ్బందీ చర్యల గురించి వివరించనున్నారు. శీతాకాల సమావేశాల్లో బలమైన వాణి వినిపించేలా ఆయన కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని సిద్ధం చేయనున్నారు. సజావుగా జరిగేలా చర్యలు: స్పీకర్ సమావేశాల నిర్వహణ, వసతుల కల్పన, భద్రతా ఏర్పాట్లపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం శాసనసభ కమిటీ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మండలి, అసెంబ్లీ కార్యదర్శులు నర్సింహాచార్యులు, రెండ్ల తిరుపతి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ విజయ్‌కమార్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సజ్జనార్, అవినాశ్ మహంతి, సు«దీర్‌బాబు, కార్తికేయ (ఇంటెలిజెన్స్), కరుణాకర్ (అసెంబ్లీ చీఫ్‌మార్షల్) హాజరయ్యారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు.సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని వీలైనంత త్వరగా ఇవ్వాలని, అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు సభకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. సభ జరుగుతున్న సయంలో ధర్నాలు, ఆందోళనలకు తావు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు. నోడల్, లైజనింగ్ అధికారులను నియమించాలని, సమావేశాలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ట్రాఫిక్ అవాంతరాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రేపు అసెంబ్లీకి కేసీఆర్
సాక్షి హైదరాబాద్: సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడం కోసం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్‌లో గల తన నివాసానికి బయిలుదేరినట్లు పేర్కొంది. రేపు జరిగే అసెంబ్లీ సెషన్‌కు అక్కడి నుంచి కేసీఆర్ హాజరు కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సెషన్లకు హాజరయ్యారు. తొలిసారి గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వగా రెండోసారి బడ్జెట్ ప్రసంగానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పించింది. కాగా ఇటీవలే కేసీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చించారు. వాటితో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆరాతీశారు.అసెంబ్లీ సమావేశాల్లో నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
ఫామ్‌హౌస్‌లో ఉంటే ప్రజల సమస్యలు తెలుస్తాయా?
సాక్షి, మహబూబాబాద్: ‘ప్రజల మధ్య ఉంటేనే సమస్యలు తెలుస్తాయి.. ఫామ్‌హౌస్‌లో ఉండి ఢాంబికాలు మాట్లాడితే సమస్యలు తెలుస్తాయా.. అసెంబ్లీలో చర్చించేందుకు రావాలి’ అని రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి నూకల రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకోవడం కాదని, ఆ పరిజ్ఞానం అసెంబ్లీలో ప్రజలకోసం మాట్లాడటంలో చూపించాలని కోరారు. ఓడిపోయిన తర్వాత రెండేళ్లు ఫాంహౌస్‌లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి కారుకూతలు కూస్తే ప్రజలు నమ్మరని అన్నారు.రేవంత్‌రెడ్డి పాలనను మెచ్చి పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించారని చెప్పారు. కేవలం 25 శాతం గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ల కోసం మహబూబాబాద్ వచ్చి కేటీఆర్ గొప్పలు చెప్పకోవడం సిగ్గుచేటన్నారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టంచేశారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నాలుగుసార్లు మంత్రిగా పనిచేసి తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడిన నూకల రాంచంద్రారెడ్డి తెలంగాణ గరి్వంచదగిన నాయకుడని పొంగులేటి కొనియాడారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవిందర్‌రావు, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. జీఓలో అవసరమైతే మార్పులు ఖమ్మం రూరల్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే జర్నలిస్టులకు అత్యధికంగా అక్రిడిటేషన్ కార్డులు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శనివారం టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జీవో 252లో పొరపాట్లు ఉన్నా, మార్పులు అవసరమనిపించినా సరి చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుల విషయంలో ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే కార్డుల మధ్య ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. డెస్క్ కార్డులున్న వారికి కూడా ఫీల్డ్ మీడియా కార్డులతో సమానంగా అన్ని సౌకర్యాలు కలి్పస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. -
అసెంబ్లీ తర్వాతే 3 జిల్లాల్లో ‘పాలమూరు’ సభలు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ తలపెట్టిన పోరుబాట బహిరంగ సభల షెడ్యూల్‌ను అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాతే ఖరారు చేయాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ పథకానికి నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరి«ధిలో బహిరంగ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో కేసీఆర్ శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు.ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుతోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సి.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో సభల నిర్వహణ షెడ్యూల్‌పై చర్చించినప్పటికీ అసెంబ్లీ సమావేశాల తర్వాతే ఖరారు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే బహిరంగ సభల తేదీల ఖరారు కోసం ఎదురుచూడకుండా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.ఈ పథకంతో ప్రయోజనం చేకూరే అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో సన్నాహక సభలు, సమావేశాలు నిర్వహించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి నియో జకవర్గ స్థాయి వరకు సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సభలు, సమావేశాల పోస్టర్లు, కరపత్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మరోవైపు ఈ నెల 29న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తొలి రోజు భేటీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం.అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఏయే అంశాలను చర్చిస్తారనే ఎజెండాను చూసిన తర్వాత మిగతా రోజుల్లో సభకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై స్పష్టత రానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్‌కు సంబంధించిన అంశాలకే పరిమితం కాకుండా ప్రజాసమస్యలన్నింటిపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా ఫీజు రియింబర్స్‌మెంట్, పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు, రైతాంగ సమస్యలు, ఎరువుల కొరత వంటి అంశాలపై చర్చ కోసం పట్టుబట్టాలని ఆదేశించారు. -
అసెంబ్లీకి కేసీఆర్?.. మాస్టర్ ప్లాన్ ఇదేనా!
సాక్షి,హైదరాబాద్: వచ్చే వారంలో ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ అంశంపై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన వెలువడనుంది.శుక్రవారం పార్టీ నేతలతో కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చ జరిగింది. సమావేశంలో నేతలతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లి బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని, అసెంబ్లీ వేదికగా నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో ఈ రెండు ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలోనూ తెలంగాణకు ద్రోహం చేసిందని ఆరోపించారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు లేదని స్పష్టం చేశారు. -
సై అంటే సై.. ఎవరి వాదన కరెక్ట్?
-
మళ్లీ కేసీఆర్ మార్కు రాజకీయం!
చాలాకాలం తరువాత తెలంగాణ రాజకీయ యవనికపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన రీతిలో మెరిశారు. భాష, భావ వ్యక్తికరణ, హాహాభావాల ప్రదర్శనలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ యాసను తనదైన శైలిలో ప్రయోగిస్తూ పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటారు. ఆసక్తికరంగా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు అని చెప్పాలి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడంతో వచ్చిన ఆత్మవిశ్వాసమో ఏమో కానీ... అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌పై విరుచుకు పడుతుంటారు. గత ఆదివారం వీరిద్దరు పరస్పర విమర్శల బాణాలు ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఆశాజనకమైన ఫలితాలు రావడం కేసీఆర్‌లో ఉత్సాహం నింపి ఉండవచ్చు. పార్టీ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీలతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించి ఆ తరువాత మీడియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ద్విముఖ వ్యూహం అమలు చేసినట్లు కనిపిస్తుంది. ఒకటి నీళ్ల సెంటిమెంట్ రాజకీయం, మరొకటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడం. రేవంత్ మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి కేటాయింపులపై చర్చించాలని సవాల్ చేయడమే కాక, మొత్తం సమస్యలకు కేసీఆర్ కారణమని వాదించారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు జోలికి పోకుండా కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పరిణామాలను వాడుకోవడం ద్వారా రాజకీయం చేయడానికి యత్నించినట్లు కనబడుతోంది. కేసీఆర్ వాదనలోని బలాబలాలు చూద్దాం.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించి తట్టెడు మట్టి తీయలేదని, దీనిపై ప్రజా యుద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితోనే కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపిందని ఆరోపించారు. అంతేకాకుండా... 45 టీఎంసీల నీరు కేటాయిస్తే చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను అక్రమంగా వాడుకుంటున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో బీజేపీపై కూడా విరుచుకుపడుతూ తెలంగాణకు పట్టిన శని అని వ్యాఖ్యానించారు. బీజేపీ లోక్ సభ ఎన్నికలలో ఎనిమిది సీట్లు గెలుచుకున్నా పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీనే బాగా ముందంజలో ఉంది. దాంతో బీజేపీ ప్రభావాన్ని మరింత తగ్గించడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో సాగింది. ఈ మూడింటిలో నీళ్ల సెంటిమెంట్ ప్రజలను బాగా కదిలించింది. తెలంగాణకు రావల్సిన నీటి వాటా రావడం లేదని, ఏపీకి నీళ్లు తరలిపోతున్నాయని ఆరోపించేవారు. కేసీఆర్ చేస్తానన్న ప్రజా ఉద్యమం ఎంతమేరకు ప్రజలను ప్రభావితం చేస్తుందన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్లు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది సందేహమే. కాకపోతే ఆ పేరుతో రాజకీయంగా సభలు నిర్వహించడానికి కేసీఆర్ దీనిని ఒక అవకాశంగా వాడుకునే యోచన చేసినట్లుగా ఉంది. నీటి సమస్యను సెంటిమెంట్ కోసం ఆయన మాట్లాడినా.. అసలు లక్ష్యం రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే. తెలంగాణ, ఏపీ నేతలు నీటిని ఎంత సమర్థంగా వాడుతున్నారన్నది పక్కబెడితే, అవసరమైనప్పుడల్లా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు కూడా ఆ ధోరణినే అనుసరించినట్లు అనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికే అన్నది ఎక్కువ మంది భావన. అయినా తెలంగాణ నేతలు అలాంటి వాటిని బూచిగా చూపించే యత్నం చేస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట సర్కార్ గా కేసీఆర్ అభివర్ణించారు. తన ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ అబద్దపు వాగ్దానాలు ఇచ్చిందని చెబుతూ ఆ జాబితాను చదివారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇవ్వడమే కాకుండా, బాండ్ పత్రాలను సైతం ప్రజలకు అంద చేసింది. కాని అధికారంలోకి వచ్చాక వాటిలో కొన్నిటిని మాత్రమే చేయగలిగారు. వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలు, కళ్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం, దళిత బంధు కింద రూ.12 లక్షలు మొదలైన హామీలను ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే టైమ్ లో ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ దందా తప్ప మరొకటి కాదని, తాము తెచ్చిన ఫార్మాసిటీని వంతారా, జూ పార్కులకు కేటాయించాలన్న ఆలోచనను ఆయన తప్పుపట్టారు. అయితే.. ఈ ప్రెస్మీట్లో తోలు తీస్తా..అంటూ తన స్టైల్ లో కొన్ని పరుష పదాలను ఆయన వాడారు. గ్లోబల్ సమ్మిట్ జరిగిన తీరును ఆక్షేపించి అచ్చం గురువు చంద్రబాబు బాటలోనే రేవంత్ వెళుతున్నారని, విశాఖలో గత టర్మ్‌లో చంద్రబాబు సర్కార్ సమ్మిట్ నిర్వహించి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసిందని, ఆచరణలో పదివేల కోట్లు కూడా రాలేదని ఆయన అన్నారు. విశాఖలో హోటల్ ఉద్యోగులకు సూట్లు తొడిగి తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. నదీ జలాల ఇష్యూపైనే కేంద్రీకరించినట్లు కనిపించినా, మొత్తం రేవంత్ ప్రభుత్వాన్ని దాదాపు అన్ని అంశాలలో కడిగిపారేశారు. అయితే.. తనకు ఇబ్బంది కలిగించే కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ తదితర కొన్ని అంశాలను కేసీఆర్ ప్రస్తావించలేదు. అసెంబ్లీకి వెళ్లేది, లేనిది చెప్పలేదు. కేసీఆర్ విమర్శలకు రేవంత్ బదులు ఇస్తూ తొలుత శాసనసభకు వచ్చి నదీ జలాలపై చర్చించాలని సవాల్ చేశారు. సభలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇది కొంత అనుమానాలకు తావిస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ తదితరులు అసెంబ్లీ బహిష్కారం వంటి కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కున్నారు. ఆ నేపథ్యంలో కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒంటికాలి మీద లేచే అవకాశం లేకపోలేదు. అందువల్లే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడానికి కాస్త జంకుతున్నట్లు అనిపిస్తుంది. తాజాగా నీటి సెంటిమెంట్‌ను వాడుకోవడానికి శాసనసభకు వెళ్లవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. నదీ జలాల సమస్యకు, తెలంగాణ ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు కేసీఆర్ కారణమన్న ప్రచారాన్ని ప్రజల ముందు పెట్టడానికి రేవంత్ బృందం ప్రయత్నిస్తోంది. కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఆధారంగా కేసీఆర్ వాదనను రేవంత్ తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను ఆర్థిక ఉగ్రవాదిగా పోల్చడం కచ్చితంగా అభ్యంతరకరకమైన అంశమే. తన చావు కోరతారా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు బదులుగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులతోనే ప్రమాదం ఉందని, కేటీఆర్, హరీశ్ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు చిత్రీకరించడానికి రేవంత్ యత్నించారు. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్కు దూరమైన వైనాన్ని రేవంత్ తనకు అనుకూలంగా మలచుకోవడానికి కృషి చేస్తున్నారు. అయితే.. కేసీఆర్ వ్యాఖ్యలు వయసు తగ్గట్లు లేవని, ఆయన తమలపాకుతో కొడితే, తాను తలుపు చెక్కతో కొట్టగలనని రేవంత్ తన వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. కేసీఆర్ నిజంగానే వచ్చే రోజుల్లో బాగా యాక్టివ్ అయితే వీరిద్దరి మద్య హోరాహోరీ మాటల యుద్దం జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను, ప్రభుత్వ వైఫల్యాల అంశాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయం చేయడానికి సిద్దపడుతున్నట్లు అనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలు, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు తదితర అంశాలను అస్త్రాలుగా వాడుకుని రాజకీయం చేయడానికి రేవంత్ రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీఆర్ఎస్కు ప్రయోనం కలిగిస్తాయా?లేక గత ప్రభుత్వంలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం చేసే ప్రచారం ఫలిస్తుందా?అన్నది తెరపై చూడాలి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేసీఆర్‌పై రేవంత్ భాష కరెక్ట్ కాదు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యల చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్‌పై రేవంత్ మాట్లాడిని భాష సరికాదని వ్యాఖ్యలు చేశారు. దీంతో, బండి సంజయ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘మనం మాట్లాడే భాష ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా ఉండకూడదు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై మాట్లాడిన భాష సరికాదు. సీఎం రేవంత్ తన భాషపై పునరాలోచన చేయాలి. రేవంత్ భాషతో ఆయనకే నష్టం జరుగుతుంది. ప్రతీ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ ధర్మం కోరుకుంటుంది అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో కృష్ణా జలాలపై స్పందిస్తూ..‘కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నది కేసీఆర్. ఆ విషయాన్ని బయట పెట్టింది నేను. ముడుపుల కోసం కేసీఆర్ 575 టీఎంసీలు కావాలని అడగలేదు. కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదు. కాళేశ్వరం దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాలు అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారు. తెలంగాణకు కేసీఆర్ ద్రోహి. ఇందుకే కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఏం సరిపోతాయి. ప్రతీ గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు ఇవ్వాలి. మార్చి నాటికి మూడువేల కోట్లు ఇస్తామని రేవంత్ అంటున్నారు.. అవి కేంద్రం ఇచ్చే నిధులే. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులు వేల కోట్లు సంపాదిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించుకున్నారు. భూములు కొల్లగొడుతున్న ఇద్దరు, ముగ్గురు మంత్రులు భవిష్యత్‌లో జైలుకు వెళ్లడం ఖాయం. వారిపై నివేదిక తయారు చేస్తున్నాం. గెలిస్తే కాంగ్రెస్ పార్టీనా?పార్టీ గుర్తుపై జరిగే MPTC, ZPTC ఎన్నికలకు వెళ్లకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళను తమ వాళ్ళే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పినా స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నిజాయితీ పరులు.. వారికి స్వేచ్ఛ ఇవ్వండి. మావోయిస్టుల లిస్టులో పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఆధారాలు లేవు’ అని కామెంట్స్ చేశారు. బీజేపీ బలంగానే ఉంది.. మా పార్టీ నేతలమంతా కలిసికట్టుగానే ఉన్నాం. మేం కలిసి భోజనాలు కూడా చేశాం. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం జీవోలను దాచిపెడుతోంది. ఆరు గ్యారెంటీలు చర్చ జరగకుండా చేస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద ఎన్ని ఇళ్లు ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రంగారెడ్డి జిల్లాలో నలుగురు రోహింగ్యాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఓట్ల కోసం వారిని ప్రోత్సహిస్తున్నారు. భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ మేయర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. గతంలో కొద్ది తేడాలో మేయర్ స్థానం పోగొట్టుకున్నాం. ఈసారి సింగిల్‌గా మేయర్ పీఠం మాదే. ఎంఐఎంకు అనుకూలంగా హైదరాబాద్‌లో డివిజన్ల డీలిమిటేషన్ చేశారు.కాంగ్రెస్ పార్టీ మాయలో ఉంది. భాగ్యనగరంలో ఎంఐఎంతో సహవాసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎవరూ వేయడానికి సాహసం చేయరు. జూబ్లీహిల్స్ ఓటమితో కార్యకర్తలు ఆవేదన చెందారు. ఖైరతాబాద్‌లో కార్యకర్తలు కసితో ఉన్నారు. ఈ దేశంలో మైనార్టీ ప్రజలంతా క్షేమంగా ఉన్నారు. ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మాత్రం హిందువులను హతమారుస్తున్నారు’ అని అన్నారు. -
రేవంత్ వ్యాఖ్యలు.. జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ది కంపు నోరు.. మురుగు కాల్వ కంటే అధ్వాన్నం అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు అవసరం ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రజలకు లేదు. కేసీఆర్ స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బండ రాయి కట్టి మూసీ నదిలో పడేస్తారు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ తోలు కాదు, ప్రభుత్వం తోలు వలుస్తాం.కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే తమ బట్టలు ఇప్పుతాడనే భయంతోనే ఫ్రస్టేషన్లో రేవంత్ మాట్లాడుతున్నాడు. రేవంత్ భాషకి ప్రజాక్షేత్రంలో తప్పక శిక్ష పడుతుంది. ప్రజలే రాజకీయ సమాధి చేస్తారు. కేసీఆర్ ముందు రేవంత్ బచ్చా. ఇరిగేషన్ మంత్రి ఒక అజ్ఞానపు మంత్రి. ఉత్తమ్ కుమార్‌కు కనీస అవగాహన లేదు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత’ అని వ్యాఖ్యలు చేశారు. -
అసెంబ్లీకి కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెనక్కి వచ్చినా ఏడాదిగా ప్రభుత్వం స్పందించక పోవడం.. 45 టీఎంసీలు చాలు అంటూ లేఖ రాయడం వంటి అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఓ వైపు అధికార పక్షం సవాలు విసురుతుండగా, దీటుగా ప్రతిస్పందించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు నదీజలాల్లో తెలంగాణ వాటా, ఏపీ నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్రం వైఖరి తదితరాలను శాసనసభలో కేసీఆర్ స్వయంగా వివరించే అవకాశాలు ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ మినట్స్‌ను సేకరించే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకూ అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరేందుకు బీఆర్ఎస్ శాసనసభా పక్షం సన్నద్ధమవుతోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లోపే నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాయనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా తర్వాతే కేసీఆర్ హాజరుపై స్పష్టత వచ్చే అవకాశముంది. సంక్రాంతి తర్వాత తొలి బహిరంగ సభ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులతోపాటు నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్.. అసెంబ్లీ సమావేశాల తర్వాతే బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే నెల జనవరి మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయనే ప్రచారమున్న నేపథ్యంలో ఆ తర్వాతే సభల నిర్వహించేలా షెడ్యూలు ప్రకటించే అవకాశముంది. సభల నిర్వహణ తేదీలు, వేదికలు ఖరారు చేసేందుకు ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించే అవకాశముంది. 26న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ జరిపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మూడు ఉమ్మడి జిల్లాల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి నిర్వహించాల్సిన సన్నాహక సమావేశాలకు సంబంధించి ఈ భేటీల్లో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో చేవెళ్ల, నల్లగొండ జిల్లా పరిధిలో మల్లేపల్లిలో సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర లేదా నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో పరిధిలో నిర్వహించే సభా వేదికను ఖరారు చేయాల్సి ఉంది. జన సమీకరణ, నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు వంటి అంశాలపై కేసీఆర్‌తో జరిగే భేటీలో స్పష్టత వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. -
మళ్లీ.. అధికారం మాదే: సీఎం రేవంత్
వచ్చే ఏడాది మార్చిలో రూ.3 వేల కోట్లు పంచాయతీలకు ఇస్తాం. నూతన సంవత్సరం కానుకగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఇస్తాం. చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు,పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అదనం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నుంచి నేరుగా సర్పంచ్‌లకు ఈ నిధులు పంపించే బాధ్యత తీసుకుంటాం. గ్రామ పంచాయతీల్లో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ నిధులు వాడుకోండి. దుర్వినియోగం చేయొద్దు.విద్యతోనే రాష్ట్ర, దేశాభివృద్ధి సాధ్యం. కొడంగల్ నియోజకవర్గంలో సర్కారు బడుల్లో చదువుకుంటున్న 25 వేల మంది పిల్లలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో అల్పాహారం, భోజనం అందుబాటులోకి తెస్తాం. మంచి భోజనంతోపాటు నాణ్యమైన విద్యనూ అందిస్తాం. కావాల్సిన వసతులు కల్పిస్తాం. మీ పిల్లలను సర్కారు బడులకు తీసుకురండి.సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 119 నియోజకవర్గాలు ఉంటే 80 సీట్లతో, డీలిమిటేషన్‌తో 153 ఉంటే 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తాం’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నీ రాజకీయమేందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఓ కల. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్ లేదు. రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేదేమీ లేదు. తెలంగాణ భవిష్యత్ కాంగ్రెస్సే’అని రేవంత్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం కొడంగల్ నియోజక వర్గంలోని పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నూతన సర్పంచ్‌లకు శాలువాలు కప్పి సన్మానించిన తర్వాత సీఎం మాట్లాడారు. ఆయన మాటల్లోనే... మీరు రండి.. ముఖాముఖి చర్చిద్దాం.. ‘కేసీఆర్.. నీ వయసు, అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడిగా మీకు హోదా ఉంది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశాం. 29 నుంచి చర్చలు జరగనున్నాయి. ఆ రోజు మీరు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తాం. మీరు చెప్పినవన్నీ చర్చకు పెడతాం. ముఖాముఖి చర్చిద్దాం. వెనుక మాట్లాడి.. వెనుక ఉరుకుడు కాదు. అభివృద్ధి, రైతు భరోసా, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడుదామా చెప్పండి. లేకపోతే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి. అప్పులా, నీళ్లా, మీరు కట్టి కూలిన కాళేశ్వరమా, టెలిఫోన్ ట్యాపింగా, ఇంకా అభివృద్ధి మీదనా. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లపైనా.. దేనిపైనైనా నేను సిద్ధం. మీరు మొహం చాటేసి.. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్‌కు వచ్చి.. పది మంది చెంచాలను పెట్టుకుని వారి ముందు పొంకనాలు కొట్టుడు కాదు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ అంటూ సభ పెడతాడట. మీరు ఎక్కడైనా పెట్టుకోండి. నేను వద్దన్నానా. ఎన్నికలు ముగిసినయ్.. ఇంకా సందులకు రమ్మంటే ఎలా? చర్చ చేయడానికి సభ ఉంది. ప్రజలు అసెంబ్లీలో చర్చ చేయమని చెబుతుండ్రు. ఎవరేం మాట్లాడుతారో వారు వింటరు. ఆ తర్వాత విజు్ఞలైన ప్రజలే తీర్మానం చేస్తరు. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా.. కేసీఆర్ తన ఫామ్హౌస్నే బందీఖానా చేసుకున్నడు. ఆయన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి, చంచల్‌గూడకు పంపించినా ఇదే అయితది. ప్రభుత్వానికి తిండి బరువు. ఆయన మీద ఒక్క కేసూ పెట్టలేదు. కేసీఆర్ నా మీద 181 కేసులు పెట్టి చర్లపల్లి, చంచల్‌గూడ జైల్లో బంధించాడు. నన్ను ఎన్నో రకాలుగా సతాయించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలను ఆస్తులను గుంజుకుండ్రు. కేసులు పెట్టి హింసించిండ్రు. నాకు ఈ బాధ్యత వచ్చాక ఆలోచన చేశా. బాధను దృష్టిలో పెట్టుకుని పగ సాధించే కార్యక్రమం పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించా. పైన దేవుడు చూస్తున్నడు. వాళ్ల పాపాలన్నీ దేవుడు మిత్తితో తీరుస్తుండు. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన నడుం ఇరిగింది. అసెంబ్లీలో ఓడగొట్టినం. పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా చేసినం. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12,726 స్థానాల్లో 8,335 మందిని గెలిపించుకున్నాం. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా? నన్ను గెలక్కు.. అన్నీ చూశా.. నా తోలు తీస్తానని అంటావా.. షేక్‌పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటడు. ఆయన రోజూ మేకలు కోసి మండి నడుపుతుంటడు. కేసీఆర్ ఖాళీగా ఉన్నడు. తోలు తీస్తడు.. ఆయనకు నౌకరీ ఇవ్వమని చెప్పిన. నౌకరీ అయ్యాక ఇంటికి పోయేటప్పుడు దావత్‌కు ఉచితంగా ఇంత బోటి, కాళ్లు, తలకాయ పెట్టు పాపం.. సాయంత్రం రెండేసేటప్పుడు తీసుకుంటడని. మాజీ సీఎంగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, సీఎంగా పనిచేశానని చెప్పుకునే నువ్వు ఇలాంటి మాటలా మాట్లాడేది. మేము ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్క, తోలు అంటవా. మా సర్పంచులు వచ్చారు. నువ్వు తోలు తీసుడు కాదు. నిన్ను చీల్చి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీసి కొడ్తరు. కొడంగల్ వస్తవా.. మమ్మల్నే చింతమడకకు రమ్మంటవా. ఒక్కటైనా అక్కరకొచ్చే మాట మాట్లాడావా? నన్ను గెలక్కు. నేను అన్నీ చూసిన. నల్లమల అడవుల నుంచి వచ్చిన. కక్ష సాధింపు రాజకీయాలు చేయం.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని కేసీఆర్ కొడుకు కేటీఆర్ విమర్శిస్తడు. తండ్రి ఏమో ప్రభుత్వం రియల్ దందా చేస్తోందంటడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారం, ఆదాయం పెంచుతుంది. నేను అయ్య పేరు చెప్పి మంత్రిని కాలే. పాస్‌పోర్టు బ్రోకర్ల దందా చేయలే. ఆంధ్రలోని గుంటూరు, గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ గురించి. మీ జాతినంతా తెచ్చుకో.. మా ఊరికొస్తవా? లేదా మేమే మీ ఊరికి రావాలా? గతంలో గజ్వేల్ వచ్చి చూడు అన్నావ్. లక్షల మంది కార్యకర్తలతోపోయి తొక్కితే పాతాళానికి పోయినవ్. మేం కక్ష సాధింపు రాజకీయాలు చేయం. ఎవరి సొమ్ము గురించి ఆలోచన చేయం. మా కాళ్లలో కట్టెలు పెడితే మాత్రం ఊకోం. మా సంగతి చూపిస్తాం. ఇప్పటికైనా మారండి.. సొంత బిడ్డ అని చూడకుండా ఇంటి అల్లుడి ఫోన్లనే ట్యాపింగ్ చేసిండ్రు. ఇంతకన్న సిగ్గులేనోడు ఉంటడా అని వాళ్ల బిడ్డ వాళ్లే అంటుండ్రు. సొంత చెల్లికే బుక్కెడు బువ్వ పెట్టనోడు ఒక మనిషా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తదని మెడబెట్టి బయటకు పంపితివి. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేనోడు నాకు సవాల్ విసురుతుండు. నా సంగతి నీకు తెల్వదు. మీ నాయనను అడుగు.. నా గురించి చెబుతడు. ఇంకో ఆయన కేసీఆర్ గర్జించాడని మాట్లాడుతుండ్రు. గాండ్రింపులు, ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. మీ తోలు సంగతి ముందు తెలుసుకోండి. మేం నాటు కోడి తోలు తీసి, పసుపు పూసినట్లు పూస్తాం. అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు పోతున్నయ్. ఇప్పటికైనా మారండి. లేకపోతే దేనికీ పనికి రాకుండా పోతరు. తెలంగాణలో ప్రతిపక్షం లేదంటే సిగ్గుపోతది. -
కేసీఆర్.. నిన్ను మళ్లీ అధికారంలోకి రానివ్వం: సీఎం రేవంత్
సాక్షి, నారాయణపేట్: పదేళ్లలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని.. ఇక్కడి నుంచి ఎంపీగా నెగ్గి కూడా కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎండబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం కోస్గిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానికి హజరైన ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నూతనంగా ఎన్నికైన సర్పంచు,ఉప సర్పంచు, వార్డుసభ్యులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా పని చేయాలి. గాందీ కలలు గన్నట్టు గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధికి చిహ్నం. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు స్దానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్నికలు పూర్తి అయ్యాయి ఇక రాజకీయాలు వద్దు అభివృద్ధి ద్యేయంగా పార్టీలకు అతీతంగా పని చేయాలి. చిన్నచిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టాలి గ్రామల్లో కక్షలు పెంచుకోవద్దు. నాకు వచ్చిన ఈ అవకాశం మీ అభివృద్ధికే..రాష్ట్రంలోని 12706 గ్రామపంచాయితీలకు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నిదులు ఇస్తాం. చిన్న పంచాయితీలకు 5 లక్షలు పెద్దగ్రామ సర్పంచులకు 10 లక్షలు నూతన సంవత్సరంలో ఇస్తాం. సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబందించిన ప్రణాళికలు సిద్దం చేయండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇస్తాం. గ్రామాల్లో ఎవరికైన అర్హులకు సంక్షేమ పథకాలు రాకుంటే పేర్లు ఇస్తే వారికి ఇస్తాం. ఇందిరమ్మ చీరలు మేం ఇస్తున్న సారె లాంటిది. చదువే జీవితాల్లో వెలుగు తెస్తుంది పిల్లలకు మంచి విద్యను అందిస్తాం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పహారం,నాణ్యమైన భోజనం అందిస్తాం. మార్చి 31 లోగా కేంద్రం నుంచి 3 వేల కోట్ల నిధులు గ్రామపంచాయితీలకు తీసుకోస్తాకేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?. పదేళ్లు బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరుకు వలస వచ్చి కేసీఆర్ ఎంపీ అయ్యాడు. కానీ, నీళ్ల కూడా ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని ఎండగట్టాడు. బీఆర్ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారు. లక్షా 80 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి.. కమిషన్లు దండుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. నన్ను జైలుకు పంపారు. నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారు. కేసీఆర్ ఆయన పాపాలకు ఆయనే పోతాడని.. నేనేమీ అనలేదు. అధికారంలోకి వచ్చాక నేను పగ రాజకీయాలు చేయలేదు. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కక్ష సాధింపులకు పాల్పడలేదు. ప్రమాణస్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలిరగొట్టుకున్నాడు. రెండేళ్ల నుంచి ఫాంహౌజ్నే కేసీఆర్ జైలుగా మార్చుకున్నారు. మొన్నే బయటకు వచ్చాడు. తోలు తీస్తానంటూ ఏదో మాట్లాడారు. రెండేళ్లు ఫామ్‌హౌజ్‌లో అదే పని చేశారా?.. మా సర్పంచ్ల దగ్గరికి రా ఎవరి తోలు తీస్తారో చూద్దాం. చింతకమడకలో చీరి చింతకు కడతారు. నేకేసీఆర్ చేయని పాపం అంటూ లేదు. సొంతల్లుడి ఫోన్‌నే ట్యాపింగ చేయించాడు. సొంత బిడ్డకే చీర పెట్టలేనోడు.. మాపై మాట్లాడతారా?. ఇన్ని ఎన్నికలు జరుగుతున్నా.. జనం బండకేసి కొడుతున్నా.. సిగ్గు రావడం లేదు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదు నేను. పండక్కి చెల్లెల్ని కూడా ఇంటికి పిలవలేనోడు కేటీఆర్. తండ్రి గాలికి సంపాదించిన వాటా పంచాల్సి వస్తుందని సొంత చెల్లినే మెడలు పట్టి బయటకు పంపించావ్. సొంత చెల్లికే సమాధానాలు చెప్పలేనోడు నాకే సవాల్ విసరుతాడా?.. కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత..? నీలా అమాయకుల్ని నేను మోసం చేయలేదు. అలాంటిది నేను నీకు భయపడతానా?.. హరీష్‌రావు ఆరడుగులు పెరిగిండు.. కానీ తలకాయే లేదు. నీ కండలు కరిగి.. తొలు మిగిలింది. నీకా నేను భయపడేది. 2029లో 80 శాతంపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం. రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా.. ఇదే నా సవాల్. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. తండ్రీ కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మాట్లాడొద్దు. సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి రండి. నీళ్లు, నియామకాలు.. నిధులు.. వేటిపైన అయినా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం. కూలిన కాళేశ్వరం.. ఫోన్ ట్యాపింగ్.. ఏ అంశంపైనా అయినా సరే చర్చిద్దాం. ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చర్చ పెడతాం. మీరు సిద్ధమా? అని రేవంత్ అన్నారు. -
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా?
సత్తుపల్లి/తల్లాడ: రెండేళ్లు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి దిగజారుడు భాషతో తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రూ. 10.53 కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్స్టేషన్లకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లిలో సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాన్ని ప్రారంభించి ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందునే 85 శాతం సర్పంచ్‌లుగా తమ పార్టీ బలపరిచిన వారిని గెలిపించారన్నారు. దిగజారి మాట్లాడటం తమకు రాదని.. ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారానే బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుతామన్నారు. ‘రెండేళ్లు ఫాంహౌస్‌లో పడుకున్న ఒకాయన మీడియా ముందుకొచ్చి తోలుతీస్తాం అనడం సరికాదు. తోలు వలుస్తామంటే ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరు. ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలి’అని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడమంటే భయమెందుకో కేసీఆర్ చెప్పాలన్న భట్టి.. ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు వస్తుంటే కనుమరుగవుతాననే భయంతో కేసీఆర్ తమ ప్రభుత్వంపై విషం కక్కి తిరిగి ఫాంహౌస్‌కు వెళ్లారని విమర్శించారు. కాగా, బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలతో సింగరేణి పోటీ పడుతూనే బహుముఖంగా ఎదిగేలా చర్యలు చేపట్టామని భట్టి వివరించారు. కాపర్, గోల్డ్ మైనింగ్‌లోనూ సింగరేణి అడుగుపెట్టిందని చెప్పారు. కేంద్రం బొగ్గు బావులకు వేలం నిర్వహిస్తే తెలంగాణ నుంచి ఒక్క బొగ్గు బావి కూడా ఇతరులకు పోకుండా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పరువు తీసిన KCR.. స్ట్రాంగ్ రిప్లై..
-
బీఆర్ఎస్కు తోలు తప్ప కండ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీకి తోలు తప్ప కండ లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కండ కరిగిపోయిందని గ్రహించిన తర్వాతే కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం ఇప్పుడు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనానికి కుటుంబ రాజకీయాలే కారణమని చెప్పారు. ‘కొడుకు, అల్లుడు వ్యవహారశైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందని కేసీఆర్‌కు ఆలస్యంగా అర్ధమైంది.అందుకే పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు. రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వదిలి బయటకు వచ్చారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు. గాడిద గుడ్డు కాదు’అని అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వమే దద్దమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. బండ కూడా పగలకొట్టలేదు.. సంగంబండ ప్రాజెక్టులో బండ పగలకొడితే 20 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్న ఆలోచన కూడా పదేళ్లలో కేసీఆర్‌కు రాలేదని, కాళేశ్వరంపై ఉన్న తపన ఆయనకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని రాష్ట్ర క్రీడా, పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా చూశారని, కానీ ఆయన పాత పురాణమే చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు ప్రజలు ఏమనుకుంటారోననే స్పృహ కూడా లేకుండా ఆయన మాట్లాడారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోలు తీశారని చెప్పారు. సలహాలు సూచనలు ఇవ్వాలని అడిగాం ప్రభుత్వపరంగా ఏదైనా పొరపాటు జరిగితే ప్రతిపక్ష పార్టీగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఇప్పటికే అనేకసార్లు తాము బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని, అందుకే అన్ని ఎన్నికల్లో ఎవరి తోలు తీయాలో వారి తోలు తీశారని చెప్పారు. అయినా ప్రభుత్వం తోలు తీసే సమస్యలేవైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ సీఎం కేసీఆర్‌కు సూచించారు. -
పార్టీ నాకు కన్నతల్లిలాంటిది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రేవంత్‌పై ఆయన మండిపడ్డారు. ‘‘పార్టీ అంటే నాకు కన్నతల్లిలాంటిది. మా నాయకుడు ఆదేశిస్తూ పదవుల్ని గడ్డిపోచలా వదిలేశా. రేవంత్‌రెడ్డి పార్టీ మార్చే ఊసరవెల్లి. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర ఆయనది. ఫోర్ట్ సిటీ ఎందుకన్న కేసీఆర్ ప్రశ్నకు రేవంత్ నుంచి సమాధానమే లేదు. ఆయనవన్నీ సొల్లు మాటలు’’ అని హరీష్‌రావు అన్నారు. రేవంత్ ఏమన్నారంటే.. ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుర్చీ కోసం కుమారుడు కేటీఆర్, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందన్న భయంతోనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ ఉన్నంతకాలం హరీశ్‌రావు ఎక్కడికీ పోరు. పార్టీతో పాటు పార్టీ ఆస్తులపై ఆయన కన్నేశారు. కానీ, బీఆర్ఎస్ను కేటీఆర్ చేతిలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. నేను కోటి మంది మహిళలకు చీర, సారె ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం కవితను పార్టీ నుంచి బయటకు పంపింది అని విమర్శించారు. -
‘చంద్రబాబుపై కేసీఆర్ మాట్లాడింది వంద శాతం కరెక్ట్’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని.. అందుకే వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీలోకి భారీ చేరికల కార్యక్రమం జరిగింది. అయితే ఆ సమయంలో అనుమతులు నిరాకరణ పేరుతో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది తాళం వేశారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. అనుమతి తీసుకున్న తర్వాత చిల్డ్రన్ ఏరియా థియేటర్ ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నాం. దళితులు వైఎస్సార్సీపీలో చేరకూడదా?.. దళితులకు చిల్డ్రన్ ఏరినా ధియేటర్లో అడుగుపెట్టే అర్హత లేదా?. దళితులంటే అంత చిన్న చూపా చంద్రబాబు? అని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అంటే కూటమి నేతల భయపడుతున్నారని.. చంద్రబాబు లోకేష్, టీడీపీ బచ్చాలు ఎందుకు పనికిరారని అన్నారాయన. చంద్రబాబు కోసం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ సమర్థించారు. ‘‘కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదు. అందుకే ఆయన అంత పెద్ద నేత అయ్యారు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలి.. కొడుకు, కుటుంబం కోసం కాదు’’ అని అన్నారాయన. అంతకు ముందు.. చేరికల కార్యక్రమం సమయంలో ఆఖరి నిమిషంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది అనుమతి నిరాకరిస్తూ గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో గేటు ముందు వైఎస్సార్సీపీ నేతలు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. కూటమి నేతల ఒత్తిడితోనే అనుమతి నిరాకరించారని.. వైఎస్సార్సీపీ చేరికలను చూసి కూటమి నేతల భయపడుతున్నారని.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ నేత కేకే రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.కేసీఆర్ ఏమన్నారంటే.. చంద్రబాబు మాటలు విని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరులో చెరువులను బాగు చేయాలని కేంద్రానికి మేం అధికారంలో ఉన్నప్పుడు లేఖలు రాశాం. అయితే.. చంద్రబాబు మాటలు విని కేంద్రం అన్యాయం చేసింది. కనీసం పట్టించుకోలేదు. బీజేపీ పాలకులు శనిలా దాపురించారు. -
ఆ MOU లు అంతా బోగస్.. నిజం బయటపెట్టిన KCR
-
వంట మనుషులతో MOUలు.. ఇదేం పాడుపని బాబు
-
హీట్ పెంచిన KCR కామెంట్స్.. రేవంత్, బాబుపై సెటైర్లు
-
ఏం చేద్దాం ఎలా చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇరిగేషన్ విషయంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోమవారం మధ్యాహ్నాం మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడంతో పాటు ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అంశంపైనా వీళ్ల నుంచి సీఎం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం. అలాగే పెండింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ , పార్టీ పదవులపై భర్తీ పైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ పైనా చర్చిస్తారని సమాచారం. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా అసెంబ్లీలో చర్చ చేపట్టే అంశంపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ‘‘ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చింది. గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే.. రాష్ట్ర సర్కారులో చలనం లేదు. కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే చప్పుడు చేయట్లేదు. అందుకే నేనే రంగంలోకి దిగా. ఇవాళ్టి దాకా వేరు.. రేపట్నుంచి వేరు. మా కళ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే.. నేను ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది సర్వభ్రష్ట సర్కారు. ఈ నిష్క్రియా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం’’ అని కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇరిగేషన్ విషయంలో దమ్ముంటే ఫేస్ టూ ఫేస్‌కు రావాలంటూ సీఎం రేవంత్ ఆ వెంటనే కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై అవసరమైతే రెండేసి రోజుల చొప్పున శాసనసభలో చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో ఓ ప్రకటన చేశారు. -
కేసీఆర్‌వి 90% అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై 90 శాతం పచ్చి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని దారుణంగా, దుర్మార్గంగా నాశనం చేసింది ఆయనే అని ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తి, అవగాహన లోపం, అసమర్థత, చేతకానితనంతో 10 ఏళ్లలో ప్రాజెక్టులపై రూ.లక్షా 81 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు జీరో ప్రయోజనం చేశారని ధ్వజమెత్తారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లు కూలిపోవడానికి.. సీఎంగా, నీటిపారుదల, ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్‌దే బాధ్యత అని, కేసీఆరే ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా తేలి్చందని అన్నారు. ఆదివారం రాత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం చేపట్టకుంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి.. ‘కాళేశ్వరం అంత పెద్ద కుంభకోణం మరొకటి జరగదేదని ఘోష్ కమిషన్, విజిలెన్స్, కాగ్ ఎన్డీఎస్ఏ తేల్చాయి. ఈ విషయంలో చట్టప్రకారం ముందుకు పోతున్నాం. అంతర్జాతీయ నిపుణులతో కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణను వాటి నిర్మాణ సంస్థలతోనే పూర్తి చేయిస్తాం. రూ.38,500 కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్ల పనులు పూర్తయ్యాక అధిక కమీషన్ల కోసం అర్ధాంతరంగా వదిలేసి దాని స్థానంలో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం చేపట్టకుండా ప్రాణహిత–చేవెళ్లనే నిర్మిస్తే మిగిలిపోయే రూ.65 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి..’ అని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? ‘కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టుతో పాటు పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ సమాధానం ఇవ్వాలి. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్‌లో ఎన్నికలకు 2 ఏళ్ల ముందు శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకాలను ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్కటైనా పూర్తి చేశారా? మార్పులు చేయకుంటే రూ.4,500 కోట్లతో ఈ ప్రాజెక్టులు పూర్తయి 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. పాలమూరు కింద ఎకరా ఆయకట్టు ఇవ్వలేదు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని కేసీఆర్ అంటున్నారు. దాని కింద ఒక్క ఎకరమైనా ఆయకట్టు ఇచ్చారా? ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు గత ప్రభుత్వమే సవరించగా, రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ను 2023 ఏప్రిల్ 12న కేంద్రం తిప్పి పంపింది. అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రి కేసీఆరే..’ అని ఉత్తమ్ చెప్పారు. 45 టీఎంసీలకు తగ్గింపు అబద్ధం... ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించేందుకు కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని కేసీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే 90 టీఎంసీలతో ప్రాజెక్టుకు జీవో ఇచ్చాం. తొలి విడత ప్రాజెక్టును మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలతో చేపట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతించింది. గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచి్చన మరో 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకి కేటాయించాలని కేంద్రంతో మేము నిరంతరం కొట్లాడుతున్నాం..’ అని మంత్రి పేర్కొన్నారు. ఏపీకి కేసీఆర్ సహకరించారు ‘ఉమ్మడి ఏపీలో 2004–14 మధ్యలో ఏపీ రోజుకి 4.1 టీఎంసీల సామర్థ్యంతో కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోగా, తెలంగాణ వచ్చాక కేసీఆర్ సహకారంతో రోజుకు 9 టీఎంసీలు అక్రమంగా తరలించుకునేలా సామర్థ్యాన్ని పెంచుకుంది. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు కేసీఆర్ సహకరిస్తే మేము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులను ఆపివేయించాం. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఏపీ 2004–14 మధ్యలో 727 టీఎంసీలను అక్రమంగా తరలించగా, కేసీఆర్ సీఎం అయ్యాక 2014–23 మధ్యలో 1442 టీఎంసీలను అక్రమంగా తరలించుకుంది. పోతిరెడ్డిపాడు విస్తరణకు కేసీఆర్ సహకరించారు. ఆయన కాలంలోనే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ఉత్తమ్ తెలిపారు. -
ప్రభుత్వాన్ని ఎండగడదాం
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. నందినగర్ నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటినుంచి రాత్రి ఏడున్నరకు ఆయన తిరిగి వెళ్లేంత వరకు అక్కడ ఉత్సాహపూరిత సందడి వాతావరణం నెలకొంది. కాగా కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టేలా బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ చేపట్టడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ.. ఈ మూడు జిల్లాల్లో బహిరంగ సభల నిర్వహణ, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో దశల వారీగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాల తీరును వివరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, నల్లగొండ జిల్లా మల్లేపల్లితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో ఏదో ఒక చోట బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో సభను నిర్వహించేందుకు ఒకటి రెండు రోజుల్లో జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అవుతారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మహబూబ్‌నగర్ సభను సంక్రాంతి లోపు నిర్వహించాలని నేతలు అభిప్రాయపడ్డారు. ‘పాలమూరు’కు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదులో డంబాచారం వద్దు పార్టీ సభ్యత్వ నమోదును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో చేయాలనే అంశంపై పార్టీ నేతల నుంచి కేసీఆర్ అభిప్రాయాలు కోరారు. రెండు విధానాల్లో సభ్యత్వ నమోదు చేయాలని, సభ్యత్వ నమోదుకు ఇన్చార్జిలను నియమించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పార్టీ సభ్యత్వ నమోదు పేరిట డంబాచారాలకు పోకుండా పార్టీ పట్ల నిబద్ధత ఉండే వారికే సభ్వత్యం ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూలును సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సభ్యత్వ నమోదు ఉచితంగా కాకుండా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించేలా నిబంధనలు ఉండాలని నేతలు సూచించారు. సభ్యత్వం తీసుకునే వారికి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే కేంద్రంగా పనిచేయడంతో నష్టం! ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగడంతో కొంత మేర నష్టం జరిగిందనే అభిప్రాయాన్ని ఈ భేటీలో కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు క్షేత్ర స్తాయిలో కేడర్‌తో సమన్వయంతో చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు సాధించిన పలితాపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు. పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తాం చెక్‌డ్యామ్‌ల పేల్చివేత అంశంపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి న తర్వాత బాధ్యులు పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తామని కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ సహజ శైలిలో సాగిన ప్రసంగంలో ఆయన సీఎం రేవంత్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత 26 ఏళ్లుగా ప్రత్యర్థులు తన చావును కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఇలావుండగా కేసీఆర్ రాకమునుపే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరుల స్తూపం వద్ద నివాళి అరి్పంచారు. కేసీఆర్ రాక సందర్భంగా తోపులాట చోటు చేసుకోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డికి స్వల్ప గాయం అయ్యింది. దీంతో ఆయన ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.అజ్మీర్ దర్గా ఉర్సుకు కేసీఆర్ చాదర్ సమర్పణ సాక్షి, హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రతియేటా పార్టీ తరపున చాదర్ సమరి్పంచే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ ఆదివారం చాదర్ అందజేశారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ మైనారిటీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు వారి వైద్య విద్యకు అయ్యే ఫీజును కేసీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అందజేశారు. 15 మంది విద్యార్థులకు ఈ చెక్కులు అందజేశారు. -
ముందు అసెంబ్లీకి రండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో ఎవరేం చేశారో, ఎవరి హయాంలో ఏం జరిగిందో కూలంకశంగా మాట్లాడేందుకు వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుందామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామని తాను ప్రతిపాదిస్తున్నానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో? తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశానో? అన్ని విషయాలను మాట్లాడుకోవచ్చని చెప్పారు.ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలకు ఉపయోగపడే సూచనలు చేస్తే ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను ఏపీకి రాసిచ్చేసి పాల మూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణశాసనం రాసింది కేసీఆరేనని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..! ప్రజలు తీర్పు ఇస్తూనే ఉన్నారు ‘కలుగులో ఉన్న ఎలుకకు పొగబెడితే బయటకు వచ్చినట్టు రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చాడు. సంతోషం. ప్రజలిచి్చన తీర్పు కేసీఆర్‌కు కనువిప్పు కలిగించి స్రత్పవర్తన తెస్తుందని ఆశించాం. కానీ రెట్టించిన ఉత్సాహంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలే పెట్టుబడిగా ఆయన 75 నిమిషాల ప్రసంగం సాగింది. బీఆర్ఎస్ చేసిన నేరాలు, ఘోరాలు దృష్టిలో పెట్టుకుని 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కరడుగట్టిన నేరగాళ్లకు కూడా కనువిప్పు కలుగుతుంది కానీ కేసీఆర్ మాత్రం ఏ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నాడు. మూతి దగ్గర కాకుండా తోక దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. 811 టీఎంసీల్లో 512 ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు అని సంతకం పెట్టింది ఎవరు? ఒక్కసారి కాదు పదేపదే సంతకాలు పెట్టి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్. 2021–22లో శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను కేసీఆర్ ఏపీకి రాసిచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జూరాల దగ్గర ఒడిసిపట్టుకోవాల్సిన నీటిని శ్రీశైలంలో కలిపి ఏపీ జలదోపిడీకి రాజమార్గం ఏర్పాటు చేశాడు.మూతి దగ్గర వదిలేసి తోక దగ్గర పట్టుకోవాలని చూశాడు. లిఫ్టులు, పంపులు, కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ఇదంతా చేశాడు. అందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణాపై పూర్తికాని పరిస్థితి. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, నారాయణపేట– కొడంగల్, డిండి, ఎస్సెల్బీసీల్లో ఒక్క ప్రాజెక్టునయినా పదేళ్లలో పూర్తి చేశాడా? మేం వచి్చన తర్వాత రూ.6,800 కోట్ల విలువైన పనులను కృష్ణాపై సాగునీటి ప్రాజెక్టుల కోసం చేశాం. తేలు కుట్టిన దొంగలా.. మేం వచ్చిన తర్వాతే కృష్ణా జలాల్లో 71 శాతం వాటా అడిగాం. ఏపీకి 29 శాతం వాటా ఇవ్వాలని కొట్లాడుతున్నదే మేము. పైగా తానే నీళ్లకు నడక నేరి్పనట్టు ఏపీకి చెందిన సీఎం చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు ఎలా కట్టాలో కూడా ఆయనే చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలను ప్రజల ముందు పెడతాం. ట్రిబ్యునల్‌లో స్వయంగా మా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లి వాదనలు వినిపిస్తున్నాడు.పదేపదే జలశక్తి మంత్రిని కలుస్తున్నారు. కేంద్రం చేయకపోతే అంతా ఎడారిగా మారిపోదు. తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో చేసిన ద్రోహానికి కేసీఆర్ సమా«ధానం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పాలి. ఈ ద్రోహిని నిలదీద్దామని సభకు రమ్మంటే తేలు కుట్టిన దొంగలా తప్పించుకుంటున్నాడు. సంవత్సరంన్నర తర్వాత బయటకు వచ్చి అసలు ఊరుకునేదే లేదంటూ సుయోధనుడిలా ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే అసెంబ్లీకి రావడంలేదు.. అసెంబ్లీలో కృష్ణాకు ఒకరోజు, గోదావరి ఒకరోజు కేటాయించి చర్చ చేద్దామని నేను ప్రతిపాదిస్తున్నా... ఆయన్ను రమ్మనండి. లేదంటే రెండు రోజుల చొప్పున చర్చిద్దామన్నా ఓకే. ఆయన అబద్ధాలు చెపుతున్నాడు కాబట్టే అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి రండని అడుగుతున్నా.. రాకుండా కేసీఆర్ పారిపోవడంలో ఉద్దేశమేంటి? ఆయనకు అధికారం కోసం వ్యామోహం తప్ప తెలంగాణ ప్రజలపై అభిమానం లేదు. అందుకే జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. సభలో ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగించబోమని నేను హామీ ఇస్తున్నా. అలా ఎవరైనా భంగం కలిగించినా చర్యలు తీసుకోమని నేనే చెబుతా. ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడో అందరికీ తెలుసు. కొడుకు, అల్లుడి పంచాయతీ తీర్చేందుకు వచ్చాడు. కొడుకు దగ్గరి నుంచి అల్లుడు పార్టీని గుంజుకుంటాడేమోనని, దేనికీ చెల్లనోడు అల్లుడి చేతిలో పార్టీ పెడతాడేమోనని, కోతుల పంచాయతీ పిల్లి తీర్చినట్టు వచ్చాడు. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం. అధికారం ఉన్నప్పుడే కొడుకు కుర్చీ కోసం ప్రయతి్నంచాడు. ప్రమాణ స్వీకారానికి కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాడు. ఇప్పుడు అల్లుడు సావు కోరుకుంటున్నాడు.ఆయన పోతే అల్లుడికి పార్టీ వస్తదని అనుకుంటున్నాడు. నాకేమి వస్తుంది. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి వచ్చి అర్థవంతమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. ఆయన కింద పడి కాలువిరిగితే మొదట పరామర్శించిందే నేను. అర్ధరాత్రి ఆంబులెన్సు పెట్టి ఆసుపత్రికి తీసుకొచ్చిందే నేను. కానీ ఆయన అల్లుడు, కొడుకే పోటీలుపడి ఆయన్ను ఫామ్‌హౌజ్‌లో నిర్బంధిస్తున్నారు. కేసీఆర్‌కు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలతో ఇబ్బంది లేదు. కుటుంబసభ్యులతోనే ప్రమాదం ఉంది. నన్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వయసుకు తగ్గట్టు లేవు. ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపుచెక్కతో కొట్టగలను. అల్లుడు కాపలా కాసుకుని ఉన్నాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటున్నది మేం కాదు. ఆయన కొడుకు, అల్లుడే. కేటీఆర్ ఐరన్‌లెగ్ అని చెప్పి పార్టీని గుంజుకుంటే ఉన్న పళంగా హరీశ్‌రావుకు రూ.5వేల కోట్ల ఆస్తి వస్తుంది. రూ.1,500 కోట్ల పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు, రూ.3,500 కోట్ల విలువైన పార్టీ ఆస్తులు రాత్రికి రాత్రి ఆయన హస్తగతమవుతాయి. నేను చెప్పేది కనపడే ఆస్తుల గురించే. కనిపించని వజ్రాలు, వైఢూర్యాల గురించి కాదు. నేను కోటి మంది మహిళలకు సారె పెడితే కేటీఆర్ ఉన్న చెల్లిని ఇంటి నుంచి పంపించేశాడు. ప్రతి దగ్గర బాంబులు పెట్టారనడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పులు చేసి గుల్ల చేశారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేశాడు. 11.9 శాతం వడ్డీకి అప్పులు తెచ్చాడు. సంసారం చేసేటోడెవడైనా అంత వడ్డీకి అప్పులు తెస్తాడా? కేసీఆర్, ఆయన కుమారుడు కలిసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేశారు. కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది. మేం వచ్చిన తర్వాత ఒక్కోక్కటి సరిదిద్దుతున్నాం. ఇప్పటివరకు రూ.26 వేల కోట్లు అప్పులను రీస్ట్రక్చర్ చేశాం. మరో 85వేల కోట్ల కోసం ప్రయతి్నస్తున్నాం. ప్రధాని మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీయగానే కేసీఆర్ సంతోషపడుతున్నాడు. ఫార్ములా ఈ–రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణకు డీవోపీటీ అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఇదే’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
సర్వభ్రష్ట సర్కారు
గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంతకాలం వంచిస్తారు? మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి. సాక్షి, హైదరాబాద్: ‘క్రమ పద్ధతిలో ముందుకు సాగుతున్న రాష్ట్రంలో ప్రజలను అబద్ధపు హామీలతో మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. మాయమాటలతో అర్రాజ్ పాటలు పాడి చాంతాడంత హామీలు ఇవ్వడంతో ప్రజలు టెంప్ట్ అయ్యా రు. వంద శాతం సమ్మిళిత అభివృద్ధితో ముందుకు సాగుతున్న తెలంగాణలో బాండు పేపర్లు, గ్యారంటీ కార్డులు అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు శఠగోపం పెట్టారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలదోపిడీ, పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం జరుగుతున్నా స్పందించడం లేదు. కిరికిరి మాటలతో, కారు కూతలతో ప్రభుత్వం నడుపుతామంటే కుదరదు.మాది తెలంగాణ తెచి్చన పార్టీ. ప్రధాన ప్రతిపక్షంగా మా విధి మేము నిర్వర్తించాలి. సర్కారుకు సరిపడినంత సమయం ఇచ్చాం. ఇవాళ్టి వరకు వేరు, రేపటి నుంచి వేరే.. తోలు తీస్తాం.. అందుకోసం నేను రంగంలోకి దిగుతున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడు నాలుగు రోజుల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమై గ్రామ గ్రామాన డప్పు కొట్టి కార్యాచరణ ప్రకటిస్తాం.ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని ఎండగడ™తాం. కవులు, కళాకారులను తట్టి లేపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తాం. ఈ సభలకు నేను స్వయంగా హాజరవుతా..’ అని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, ఇతర కీలక నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రెండేళ్లుగా గమనిస్తున్నాం.. ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మట్టి తీయకుండా రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ని్రష్కియా పరత్వం, కేంద్రం వ్యతిరేకిస్తున్న తీరును రెండేళ్లుగా గమనిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదు. తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన బీఆర్ఎస్..తెలంగాణ హక్కులకు ఒక్క నొక్కు పడినా, ఒక్క చుక్క నష్టం జరిగినా సహించేది లేదు. తెలంగాణకు శనిలా బీజేపీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఒత్తిడితో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను వెనక్కి పంపారు. పర్యావరణ అనుమతులతో పాటు ఇతర ప్రధాన అనుమతులు సాధించినా బీజేపీ దిగజారి తెలంగాణకు శనిలా మారింది. మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపి ఆగం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందన లేకుండా పెదవులు మూసుకుంది.మైనర్ ఇరిగేషన్ నష్టాలు, ఏపీ పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాల తరలింపుతో కృష్ణాలో తెలంగాణకు దక్కిన 45 టీఎంసీలను కలుపుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90.81 టీఎంసీలు కేటాయించాం. కానీ నీటిపారుదల శాఖ మంత్రి 45 టీఎంసీలు చాలని లేఖ రాశారు. గోదావరి జలాల తరలింపుతో కృష్ణాలో ఏపీ వదులుకున్న జలాలను ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర వాడుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోంది. రెండేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టెడు తీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా, కమీషన్లు కొట్టడం తప్ప వేరే పనిలేదా?..’ అని కేసీఆర్ మండిపడ్డారు. మేం పెండింగు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం.. ‘సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కోలుకోలేని రీతిలో దెబ్బతింది. నాటి సీఎం చంద్రబాబు జిల్లాను దత్తత తీసుకున్నా జూరాలలో ముంపునకు గురైన కర్ణాటక భూమికి రూ.13 కోట్లు పరిహారం ఇవ్వలేదు. గోదావరి నదిపై దేవునూరు, ఇచ్చంపల్లి తదితర ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలో అన్యాయం చేసిన రీతిలోనే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు నష్టం చేశారు. 17 టీఎంసీలతో మంజూరైన జూరాల ప్రాజెక్టు దశాబ్దాల తరబడి కనీసం ఫౌండేషన్‌కు నోచుకోలేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత.. చంద్రబాబు మోకాళ్ల మీద పరుగెత్తి పరిహారం చెల్లించడంతో జూరాల ప్రాజెక్టు ఆయకట్టు సాగులోకి వచి్చంది.రాజోలిబండ మళ్లింపు పథకం కోసం ఆలంపూర్, గద్వాల వరకు పాదయాత్ర చేశా. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కిలోమీటర్ల మేర కృష్ణా ప్రవహిస్తున్నా నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి తదితర పథకాలను పెండింగులో పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 170కి పైగా టీఎంసీలు తీసుకోవాలనే వ్యూహంతో తొలుత 90.81 టీఎంసీలు కేటాయించాం. అనేక అవాంతరాలు ఎదురైనా అనుమతులు సాధించాం. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశాం..’ అని బీఆర్ఎస్ అధినేత వెల్లడించారు. హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు ‘బిజినెస్ మీట్ల పేరిట హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు. ఏపీలో చంద్రబాబు హోటల్లో పనిచేసే వంట మనుషులతో ఎంఓయూలపై సంతకాలు పెట్టించారు. ఆయన చెప్పిన లెక్కలు నిజమైతే ఈ పాటికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి. ఒప్పందాలు నిజమైతే కనీసం రూ.10 వేల కోట్లయినా రావాలి కదా. గతంలో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు భోపాల్‌కు వెళ్లిన సందర్భంలో ప్రధాని మోదీ సమక్షంలో కుదిరిన రూ.14 లక్షల కోట్ల ఎంఓయూలు బోగస్ అని ఆ రాష్ట్ర మంత్రి చెప్పారు. పెట్టుబడులపై అబద్ధపు ప్రకటనలు, ఒప్పందాలతో ప్రజలను మోసం చేయడం ఎందుకు?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా ‘ఫార్మా రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ముచ్చర్లలో మేం 14 వేల ఎకరాలు సేకరించాం. పర్యావరణ అనుమతులు కూడా సాధించి ముందుకు సాగుతున్న క్రమంలో ప్రభుత్వం మారింది. కానీ ఫ్యూచర్ సిటీ పేరిట భూములను అమ్ముకునేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాకు తెరలేపారు. గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం ఫార్మాసిటీ భూములను అమ్ముకునేందుకు ఉత్సాహం చూపుతోంది.వంతారాకు 3 వేల ఎకరాలు, జూపార్కు తరలింపు భూముల అమ్మకం కోసమేనా? గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంత కాలం వంచిస్తారు? యాప్ ద్వారా యూరియా అంటూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి. అడ్డమైన హామీలు ఇచ్చి రైతులు, పేదలు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులను ఏడిపిస్తున్నారు. సందర్భం ఏదైనా కేసీఆర్ చనిపోవాలి అంటూ మాట్లాడటం కరెక్టేనా?..’ అని కేసీఆర్ నిలదీశారు. -
కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం: సీఎం రేవంత్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, కృష్ణా జాలాలపై ఒక రోజు, గోదావరి జలాలపై మరో రోజు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21 వ తేదీ) కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆరేనన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఆయనే దెబ్బ తీశారన్నారు. కేసీఆర్ వస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను చూపిస్తామన్నారు. కృష్ణా జలాల్లో 36 శాతం వాటా అంగీకరించింది కేసీఆర్ మాత్రమేనని, 71 శాతం వాటా కోసం తాము పోరాడుతున్నామన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21వ తేదీ) బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఇదే విషయాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించామన్నారు.ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడింది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించింది. దీన్ని నిరసిస్తూ జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలని నిర్నయించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. దీనిపైనే ప్రధానంగా చర్చించాం.రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి చర్చించాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంంది. పాలమూరు గురించి గరెటడు నీళ్లు అడిగే వాడే లేడు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలప్రతిపాదిత ప్రాజెట్టులు మార్చొద్దని ఎస్ఆర్సీ స్పష్టంగా చెప్పింది.గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టు అనేది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. అయినా పాలమూరు జిల్లాలో విపరీతమైన కరువు. కేంద్రం, రాష్ట్రం కలిసి అన్యాయం చేశాయి’ అని కేసీఆర్ విమర్శించారు -
కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్
-
ఆ విషయాలే ప్రధానంగా చర్చించాం: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21వ తేదీ) బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఇదే విషయాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించామన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడింది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించింది. దీన్ని నిరసిస్తూ జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలని నిర్నయించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. దీనిపైనే ప్రధానంగా చర్చించాం. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి చర్చించాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంంది. పాలమూరు గురించి గరెటడు నీళ్లు అడిగే వాడే లేడు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలప్రతిపాదిత ప్రాజెట్టులు మార్చొద్దని ఎస్ఆర్సీ స్పష్టంగా చెప్పింది. గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టు అనేది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. అయినా పాలమూరు జిల్లాలో విపరీతమైన కరువు. కేంద్రం, రాష్ట్రం కలిసి అన్యాయం చేశాయి’ అని కేసీఆర్ విమర్శించారు. -
పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే మన సత్తా ఏమిటో తెలిసేది: కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో అధ్యక్షుడు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేసీఆర్. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తనను దూషించడం, అవమానించడమేనని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిందన్నారు. పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే మన సత్తా ఏమిటో తేలేదన్నారు కేసీఆర్.‘గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లలో ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదు. ఉన్న పథకాలు కూడా ఆపేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఈ ప్రభుత్వ పాలసీ. ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. తెలంగాణలో యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది. మా హయాంలో రైతుల ఇంటికే యూరియా వచ్చేది’ అని తెలిపారు కేసీఆర్.ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీలో దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించి, దాని వ్యయ పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాను,ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తోంది. కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేస్తోంది. బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారు. రైతుల కోసం నిర్మించిన చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఏదైనా ఉంటుందా?అని కేసీఆర్ నిలదీశారు. -
తెలంగాణ భవన్‌కు కేసీఆర్
హైదరాబాద్ సాక్షి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరికాసేపట్లో జరిగే బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలపై న్యాయ పోరాటానికి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాబోయే కాలంలో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొరకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు ఇదివరకే తెలంగాణ భవన్ చేరుకున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పార్టీ కీలక నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడున్నట్లు సమాచారం. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ భవన్లో నేడు(ఆదివారం, డిసెంబర్ 21) ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ఈ భేటీలో పాల్గొనడానికి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని నివాసానికి శనివారమే కేసీఆర్ చేరుకున్నారు. ఇవాళ జరగబోయే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు చెబుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సాగునీటి కోసం మరో జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని బీఆర్ఎస్ కీలక నేతల ద్వారా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ డౌన్ అయ్యిందని బీఆర్ఎస్ బలంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ భేటీని పార్టీ కీలకంగా భావిస్తోందని సమాచారం. -
నేడు బీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా జరిగే పార్టీ కీలక నేతల సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభా పక్షంతో పాటు పార్టీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు తదితరులు కలిపి మొత్తంగా సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి కేసీఆర్ వస్తుండటంతో ఆయన ప్రసంగంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ పార్టీ సమావేశానికి హాజరు కానుండటం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే సమావేశంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రమే కేసీఆర్ దంపతులు ఎర్రవల్లి నివాసం నుంచి నందినగర్ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరుల స్తూపం, జయశంకర్ విగ్రహానికి నివాళి అరి్పంచిన అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారు. ఏపీ జల దోపిడీపై పోరుబాట రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, ఏపీ జలదోపిడీపై పోరుబాటకు ఆదివారం జరిగే సమావేశంలో కేసీఆర్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకంపై రేవంత్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు త్వరలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన కరివెన రిజర్వాయర్ వద్ద ఈ సభ నిర్వహించే అవకాశముంది. అలాగే నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం జల దోపిడీ కోసం చేస్తున్న కుట్రలపైనా కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపైనా క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పోరాట రూపాలపైనా ఈ సమావేశంలో చర్చించి కార్యక్రమాలను ఖరారు చేసే అవకాశముందని అంటున్నారు. కవిత ఎపిసోడ్ సహా ఇతర అంశాలపై? పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘జనం బాట’పేరిట జిల్లా పర్యటనల్లో పార్టీ కీలక నేతలు లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత కుమార్తె కవిత అంశంలో కేసీఆర్ స్పందిస్తారా అనే ఆసక్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ప్రభుత్వ నిర్ణయం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి వంటి అంశాలు ఈ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశముంది.ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడం, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ తదితర అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే కోణంలోనూ దిశా నిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడంపై కూడా మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్‌పై స్పష్టత ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. -
దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: రేవంత్ సర్కార్ హానీమూన్ ముగిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన వాళ్లు ఆదారాలతో సహాదొరికారని అయినప్పటికీ వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్‌కు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో తనకు తెలియదు గానీ తాను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుతానని కేటీఆర్ అన్నారు. ఆయన ఇంట్లోని మహిళలు, పిల్లలు, మనమడి గురించి మాట్లాడి తన మాదిరి చిల్లర రాజకీయాలు చేయనని తెలిపారు. కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారని అది పెద్ద కామెడీలా అనిపిస్తుందన్నారు. కొంతమంది తనను ఐరన్ లెగ్ అంటున్నారని తాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకే 32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీ స్థానాలు గెలిచామన్నారు. రేవంత్ సీఎం అయ్యాక కనీసం సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేక పోయాడని కేటీఆర్ విమర్శించారు. కనుక తాను ఐరన్ లెగ్ కాదని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఐరన్ లెగ్ అని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ప్రజల్లోకి రానున్నారని ఆయన బహిరంగ సభలలో పాల్గొనే అంశం రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
రంగంలోకి గులాబీ బాస్.. గేరు మార్చనున్న కారు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రత్యక్షంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది.నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. తెలంగాణకు సాగునీటి విషయంలో బీజేపీ కూడా అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి బీజేపీ సహకరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎదుర్కొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు.బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో బీఆర్ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటుంది. తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీపై పోరుబాట పట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం, నదీ జలాల కేటాయింపు వంటి అంశాలపైనా ఉద్యమించాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ స్వరూపం ఏ తరహాలో ఉండాలనే అంశంపై చర్చించేందుకు విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. బీఆర్ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈ సమావేశంలో పాల్గొంటుంది. నదీ జలాల పరిరక్షణలో విఫలం కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్ర ప్రదేశ్ కొల్లగొడుతున్నా అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫ లమైందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభు త్వం 90 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 45 టీఎంసీలు చాలంటూ కేంద్రం ముందు దేబిరిస్తోంది. 45 టీఎంసీలకు అంగీకరిస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రం ముందు మోకరిల్లారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ ఎలా పూర్తవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేలా ఉంది’అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ‘కృష్ణా, గోదావరి జలాలతోపాటు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదు. రైతాంగ ప్రయోజనాలకు బీజేపీ గండికొడుతోంది. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయం, కావేరీ అనుసంధానం పేరిట ఆంధ్ర జలదోపిడీకి సహకరిస్తున్న విధానంపై ప్రజా ఉద్యమం తప్పదు’అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి.ప్రజా ఉద్యమంపై లోతైన చర్చ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై ఈ నెల 19న జరిగే విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఎప్పుడంటే?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న (శనివారం) బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం జరగనుంది. వచ్చే శనివారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. కృష్ణా,గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం,కార్యచరణపై చర్చ, రాబోయే ప్రజా ఉద్యమాలు,సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం: సీఎం రేవంత్
సాక్షి, నల్గొండ జిల్లా: రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించిందే దివంగత నేత వైఎస్సార్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన దేవరకొండ బహిరంగ సభలో మాట్లాడుతూ.. వేలాది మంది రైతులకు విద్యుత్ బిల్లులను వైఎస్సార్ మాఫీ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు అవకాశం వస్తే మంచి రోజులు కాదు.. ముంచే రోజులు వస్తాయంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ నలుగురు కలిసి పీక్కుతిన్నారంటూ ఆయన ఆరోపించారు.‘‘కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. ఎస్ఎల్బీసీని పదేళ్లలో పది కిలోమీటర్ల దూరం తవ్వలేకపోయారు. ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది చనిపోతే మామా అల్లుళ్లు డ్యాన్స్‌లు చేస్తున్నారు. పదెకరాల్లో 150 రూమ్‌లతో కేసీఆర్ గడీని నిర్మించుకున్నాడు. లంబాడీలను ఎస్టీల్లో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేసి రైతుల నెత్తిన అప్పు, చేతిలో కేసీఆర్ చిప్ప పెట్టిండు. ఓటు అనే ఆయుధంతో గడీల పాలనను కూల్చారు. గత ప్రభుత్వానికి రేషన్ కార్డు ఇవ్వాలన్న సోయి కూడా లేకుండా పోయింది...కాంగ్రెస్ హయాంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. బీజేపీ పాలనలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సన్నబియ్యం ఇస్తున్నారా?. గత పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. ఏ ఊర్లో డబుల్ బెడ్ రూమ్ ఇచ్చినవో చెప్తే ఆ ఊర్లో ఓట్లు అడగాలని కేసీఆర్‌కు సవాల్ చేశాం. పేదవాళ్ల పట్ల కేసీఆర్‌కు ఏ మాత్రం ప్రేమ, అభిమానాలు లేవు. మద్దిమడుగులో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. నమ్మించి నట్టేట ముంచినోడు.. ఒకవైపు నమ్మినోళ్ల కోసం పనిచేసేటోడు ఒకవైపు ఉన్నారు ఎవరు కావాలో జనాలు తేల్చుకోండి. దేశానికి ఆదర్శంగా నిల్చేలా తెలంగాణను రోల్ మోడల్‌గా తయారు చేస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
పల్లె ప్రగతికి పాటు పడండి: గజ్వేల్ ఏకగ్రీవ సర్పంచులతో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు. కొన్ని కష్ట సమయాలు వచ్చినప్పుడు వాటికి భయపడకూడదు. మళ్లీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తాయి. అప్పటివరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడవద్దు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలి..’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను కలిశారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కేసీఆర్ ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనను కలిసిన రెండు గ్రామాల నూతన పాలక మండళ్ల సభ్యులతో కేసీఆర్ మాట్లాడారు. ‘కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్‌లు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకుని ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసి పల్లె అభివృద్ధికి పాటు పడాలి’అని సూచించారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని అన్నారు.స్వయం సమృద్ధి కేంద్రాలుగా గ్రామాలు‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గ్రామాల అభివృద్ధి కోసం అనేకమంది గొప్ప వ్యక్తులు కృషి చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తిదాత, ప్రొఫెసర్ యూనిస్, మన దేశానికే చెందిన అన్నా హజారే లాంటి దార్శనికులు పల్లెల ప్రగతి కోసం పాటు పడ్డారు. వారిని ఆదర్శంగా తీసుకుని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో పల్లెలను సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చి దిద్దుకోవాలి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయి.దళిత, గిరిజన, బహుజన, మహిళా వర్గాలకు, కుల వృత్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందించింది. గ్రామీణ అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేసి పల్లె ప్రగతికి ఆర్థిక సహకారం అందించింది. తెలంగాణ పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటును అందించాం. బీఆర్ఎస్ సర్కారు దార్శనికతతో చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి..’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచ్ నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్, నర్సన్నపేట సర్పంచ్ గిలక బాల నర్సయ్య, వార్డు సభ్యులను కేసీఆర్ శాలువాలతో సత్కరించి మిఠాయిలు పంచారు. రెండు గ్రామాల నుంచి హాజరైన పలువురిని కేసీఆర్ పేరుపేరునా పలకరించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.గ్రామాల్లో పరిస్థితులు దిగజారాయిబీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్తులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారు. పదేళ్ల పాలనలో వర్ధిల్లిన గ్రామాల్లో పరిస్థితులు కాంగ్రెస్ పాలనలో దిగజారాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కుల వృత్తులకు ఆర్థిక సహాయం, పింఛన్లు, రైతుబంధుతో పాటు అనేక సంక్షేమ పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయన్నారు. -
‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే’
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయనను ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ మాట్లాడారు. అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని కొన్ని కష్ట సమాయాలు వస్తాయని, వాటిని తట్టుకోవాలని తెలిపారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని అప్పటి వరకూ ప్రజలు అధైర్యపడొద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని, ప్రజలు ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.ఇక 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ సీఎం పదవిని కోల్పోయారు. అనంతరం ఆయన పెద్దగా పబ్లిక్‌గా కనిపించలేదు. 2023 డిసెంబర్ 4న గజ్వెల్లో తన ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆపై 2025 జూన్ 11న, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న జ్యుడీషియల్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఇలా చాలా అరుదుగానే కేసీఆర్ బయటకొస్తున్నారు. తాజాగా తెలంగాణలో పలు గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లతో కేసీఆర్ సమావేశం అవ్వడమే కాకుండా వారిలో జోష్ నింపే యత్నం చేశారు. -
CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!
-
నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
సాక్షి, సిద్ధిపేట జిల్లా: రూ.262.78 కోట్లతో హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. 2001లో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్ ప్రజల అభిమానం మరవలేనన్నారు. ‘‘మీ ఓటుతో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడి, కాంగ్రెస్ ప్రజాపాలనను తీసుకొచ్చిన రోజు డిసెంబర్ 3. మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేశాం. మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యోచిస్తోంది’’ అని రేవంత్ చెప్పారు. ‘‘బీఆర్ఎస్ లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరమైపోయింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్సారెస్పీ ఎలా ఉంది. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో మీరే ఆలోచించండి. దేశంలో భాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ వరకూ కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులే ఇవాళ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాయి. ఇవాళ తెలంగాణా వరి దిగుబడుల్లో నంబర్ వన్ స్టేట్‌గా నిల్చింది. కేసీఆర్ హయాంలో రేషన్ కార్డు కావాలంటే దొర గడీ ముందు చేతులు కట్టి నిల్చోవాల్సిన పరిస్థితి. ఆనాడు దొడ్డుబియ్యం ఇస్తే, మనం ఈరోజు 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం...మీ పక్కన్నే గజ్వేల్, మరోవైపు సిద్ధిపేట, ఇంకోవైపు సిరిసిల్ల ఉన్నాయి. వాటిని దేవుళ్లేమైనా పాలిస్తున్నారా..?. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయిగానీ, ఇక్కడి గౌరవెల్లి ఎందుకు పూర్తి చేయలేదో మీరు ఆలోచించాలి. ఇక్కడ ఓ ఆదర్శ గ్రామం అని చెప్పి చిన్నముల్కనూరును నాడు కేసీఆర్ ఏం చేశాడో మీకు తెలుసు. మేం వాళ్లలా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయం, అభివృద్ధి చేసి చూపిస్తాం. అందుకే మంత్రి పొన్నం నా ముందు పెట్టిన అన్ని విజ్ఞప్తులకూ నిధులందిస్తామని హామీ. ఆ సర్కార్ లో ఎవ్వరికీ పదేళ్లల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు. కానీ, మేం ఇందిరమ్మ ఇళ్లు కట్టి చూపిస్తాం.ఇవాళ మంచి ప్రభుత్వముంటే అభివృద్ధి, సంక్షేమం ఎలా ముందుకెళ్తాయో, గ్రామాల్లో కూడా మంచి సర్పంచ్‌ను ఎన్నుకుంటేనే మీ గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మంచివాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. వీలైనంతగా ఏకగ్రీవం చేసుకునే యత్నం చేయాలని పిలుపునిచ్చిన సీఎం రేవంత్.. సర్పంచులు కిరికిరిగాళ్లు వస్తే గ్రామాలు తిరోగమనం పడతాయంటూ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ విలన్ కాంగ్రెస్సే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిడ్డల నెత్తురుతో కాంగ్రెస్ నేతల చేతులు తడిచాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కథలో విలన్, శాశ్వత శత్రువు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ యేనని చెప్పారు. తెలంగాణ చరిత్రలో మూడు తరాలను ముంచి రక్తం తాగిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికీ తెలియని టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’నినాదంతో ఆమరణ దీక్ష చేస్తే విరమించుకోవాలని నాడు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వేడుకున్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సందర్భాన్ని గుర్తు చేస్తూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ‘దీక్షా దివస్’లో కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ను మింగడానికి కాంగ్రెస్ అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని మండిపడ్డారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు కౌరవులు, సైంధవులు, మారీచుల్లా పన్నాగాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.మేడిగడ్డ బరాజ్‌ను పేల్చేసే దుర్మార్గం ‘తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం బరాజ్‌ను బాంబులతో పేల్చే దుర్మార్గం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద దు్రష్పచారం చేస్తూ గోదావరి జలాలు మనకు దక్కకుండా కుట్ర జరుగుతోంది. కేసీఆర్ మౌనం గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిది. కేసీఆర్ మాట్లాడినా.. మౌనంగా ఉన్నా సంచలనమే. ఎదురుదాడి ఎప్పుడు చేయాలో, వెనుకడుగు ఎక్కడ వేయాలో తెలిసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన మాయల ఫకీర్లు తెలంగాణ చరిత్రను తుడిచేస్తామని విర్రవీగుతున్నారు. పోరాటాల గడ్డ తెలంగాణలో ఢిల్లీ తోలు»ొమ్మలు, గుజరాత్ కీలు బొమ్మలు కనిపిస్తున్నారు. నెలకు మూడుమార్లు ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టి వచ్చే సామంతులను చూస్తున్నాం. ఎనిమిదేసి మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలున్నా పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించేవారు లేరు. గులాముల నుంచి తెలంగాణను కాపాడి వచ్చే కాలంలో గులాబీ జెండా ఎగురవేస్తాం. కుంభకోణాల కుంభకర్ణుల భరతం పట్టి తెలంగాణ సింహాసనం మీద కేసీఆర్‌ను మళ్లీ కూర్చోబెడతాం. మన అమ్మ తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ బొమ్మను పెట్టి బతుకమ్మను మాయం చేశారు. తెలంగాణ చేతిలో మళ్లీ బతుకమ్మను పెడదాం’అని కేటీఆర్ చెప్పారు. ఉద్యమ ఘట్టాలతో ఫొటో ప్రదర్శన దీక్షా దివస్ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతోపాటు అమరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఉద్యమ ఘట్టాలతో కూడిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. కేసీఆర్ ఉద్యమ చరిత్రపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసి వీక్షించారు. మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు ప్రసంగించారు. చరిత్రను మలుపుతిప్పిన సందర్భం ‘తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన సమున్నత సందర్భం కేసీఆర్ ఆమరణ దీక్ష. ప్రాణాలను ఫణంగా పెట్టి కేసీఆర్ చేసిన దీక్షతో పార్లమెంటు కంపించి డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసింది. ఆ తర్వాత కేంద్రం వెనక్కి తగ్గినా రాజీలేని పోరాటం, రాజీనామాలు, పదవీ త్యాగాలతో కేసీఆర్ తెలంగాణ సాధించారు. బాలనాగమ్మ కథలో తల్లిని కాపాడుకున్న బాలవర్దిరాజులా తెలంగాణ తల్లి సంకెళ్లను తెంచిన తనయుడు కేసీఆర్. తెలంగాణ ఎవడి భిక్ష కాదు, ఢిల్లీ మెడలు వంచి సాధించాం. అందుకే ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆనాటి ఉద్యమ ఘట్టాలను, దీక్షా దివస్ ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ వేదికగా సోనియా గాం«దీకి ధన్యవాదాలు చెప్పిన సంస్కారం మాది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదిరిగా ఏనాడూ తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని మేము అనలేదు’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇలా మాట్లాడితే నాకు అహంకారం అంటారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గోడకు వేలాడదిస్తే తుపాకీ కూడ మౌనంగానే ఉంటుందని.. ఎదురుదాడి విషయంలో కేసీఆర్ వైఖరి కూడా అలాగే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్(Diksha Divas) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. పీసీసీ చీఫ్ కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష అని మాట్లాడుతున్నాడు. కొందరు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే కథనే నిజం అనుకుంటారు.. .. కొందరు మూర్ఖులు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారు. గోడకు వేలాడదిస్తే తుపాకీ కూడ మౌనంగానే ఉంటుంది. కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే బయటకు వస్తారు. ఎదురుదాడి ఎలా చెయ్యాలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. నాయకుడిని నాయకుడే అంటారు, అర్భకుడిని అర్బకుడే అంటారు. ఇలా మాట్లాడితే నాకు అహంకారం అంటారు. నేను ఇలానే మాట్లాడుతాను.. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. This was the day that changed Telangana’s destiny and led to statehood 16 years ago29th November, 2009 will be etched in history Sharing a video of that day from Karimnagar when KCR Garu was arrested and emotions were running high #DeekshaDivas #KCR#Telangana pic.twitter.com/5QnrYaDzam— KTR (@KTRBRS) November 29, 2025 -
కేసీఆర్ దీక్ష... ఓ నాటకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధ న పేరుతో నాడు కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించా రు. ఇప్పుడు బీఆర్ ఎస్ ఉనికిని చాటుకు నేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో దీక్షా దివస్ పేరుతో ఆ నాటకాన్ని రక్తి కట్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మహేశ్ గౌడ్ శుక్ర వారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజున కేసీఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, సోనియాగాంధీ వల్ల రాష్ట్రం వచ్చిందన్నారు. సోనియా చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని, అమర వీరులకు నివా ళులర్పించాలని చెప్పారు.అసలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబసభ్యులు కానీ, దూరపు బంధువులు కానీ ఎవరైనా ప్రాణా లు కోల్పో యారా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేలా దీక్షా దివస్‌లు మాను కోవాలని బీఆర్ఎస్కు హితవు పలికారు. ‘ఎవరు తెలంగాణ ఇస్తే.. ఎవరు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉందన్నది వాస్తవం. పులి నోటిలో తల పెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చా డన్నది మాత్రం అవాస్తవం. కేవలం ఆయన వల్లనే తెలంగాణ రాలేదు’ అని అన్నారు.అది అటకెక్కలేదు..: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం ముగిసిపోలేదని, దాని కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటామని మహేశ్ గౌడ్ చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా సర్పంచ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెద్దఎత్తున తగ్గలేదని, కేవలం 0.5 శాతం మాత్రమే తేడా వచ్చిందన్నారు. దీనిపై త్వరలోనే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు, అయితే, బీసీ సంఘాలు గాంధీభవన్ వద్ద ధర్నాలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.‘మీరు వెళ్లాల్సింది బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగిలిన బీజేపీ నేతల ఇళ్లకు. అలాగే, పైకి మద్దతిచ్చి లోపల అడ్డుతగులుతున్న కేటీఆర్, హరీశ్‌రావుల ఇళ్లకు. కిషన్‌రెడ్డి ఇంటి తలుపులు తట్టండి’ అని బీసీ సంఘాలనుద్దేశించి మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. మంత్రి కోమటిరెడ్డిని ఉద్దేశించి నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని అన్నారు. అయితే, కోమటిరెడ్డిని కలిసి వివరణ ఇచ్చినట్లు కైలాశ్ తనకు చెప్పా రన్నారు. ఎంఐఎం విషయంలో బీజేపీ వ్యాఖ్యలు ఎప్పుడూ ఉండేవేనని, రోజుకు రెండుసార్లు ఎంఐఎంను, ఒవైసీలను తలుచుకోనిదే ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందుకు కేసీఆర్ OSD
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఓఎస్డీని ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ(Officer on Special Duty) రాజశేఖర్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది.గురువారం జూబ్లీహిల్స్ పీఎస్‌లో రాజశేఖర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. రెండు గంటలపాటు విచారణ జరిపి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు సిట్ అధికారులు. గత ఏడాది మార్చిలో ఈ కేసు నిందితుడు రాధా కిషన్(టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ) ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కేసీఆర్ ఓఎస్డీని విచారించినట్లు తెలుస్తోంది. రాధాకిషన్ తన స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పని చేశామని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే పదేళ్లపాటు కేసీఆర్‌కు ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. -
స్థానికంపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇటీవల తన సోదరి భర్త, హరీశ్‌రావు తండ్రి మరణం నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని కేసీఆర్ ఎర్రవల్లికి ఆహ్వానించినట్లు తెలిసింది. కేటీఆర్ కూడా ఎర్రవల్లికి వెళ్లడంతో ఈ కీలక భేటీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఫలితంపై వివిధ కోణాల్లో చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతను కూడా ఇప్పటి నుంచే ప్రారంభించాలని కేసీఆర్ వారిని ఆదేశించారు.రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ విధేయత, సామాజికవర్గ సమీకరణాలు, కొత్త తరాన్ని ప్రోత్సహించడం తదితరాలను అభ్యర్థుల ఎంపికలో ప్రామాణికంగా తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. పార్టీకి దూరమైన వర్గాలను గుర్తించి రాబోయే రోజుల్లో ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కేడర్‌కు శిక్షణ కార్యక్రమాలు తదితరాలు స్థానిక ఎన్నికల షెడ్యూలును దృష్టిలో పెట్టుకుని ఖరారు చేయాలని ఆదేశించారు. మరింత లోతుగా అధ్యయనం జూబ్లీహిల్స్ ఫలితాలను బూత్‌ల వారీగా మరింత లోతుగా అధ్యయనం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సన్నద్ధత, పార్టీ అభ్యర్థి ఎంపిక, ప్రచారంలో నేతల మోహరింపు, ప్రచారం తీరుతెన్నులు తదితరాలపై సమీక్షించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అనుసరించిన ఎత్తుగడలు, పోలింగ్ వ్యూహం తదితరాలను కేసీఆర్ విశ్లేíÙంచారు.కాంగ్రెస్ అనుసరించిన ప్రలోభాలు, బెదిరింపుల పర్వంతోపాటు అధికార దుర్వినియోగం మూలంగా ఫలితం ఆశించిన రీతిలో రాలేదనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైనట్లు తెలిసింది. అయితే బీఆర్ఎస్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వశక్తులూ కేంద్రీకరించడం వల్లే పార్టీ అభ్యర్థికి గణనీయమైన ఓట్లు వచ్చినట్లు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న నేతలను కేసీఆర్ అభినందించారు. త్వరలో తెలంగాణ భవన్ లేదా ఎర్రవల్లిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
బీఆర్ఎస్ ఓటమి.. అసలేం జరిగింది?
సాక్షి, సిద్దిపేట: జూబ్లీహిల్స్ రూపంలో మరో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేతలను ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌కు రప్పించుకున్నారు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌రావుతో పలువురు సీనియర్లతో శనివారం సాయంత్రం కేసీఆర్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై వీళ్లిద్దరితో కేసీఆర్ సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందని.. ఓటమికి గల కారణాలపై ఆయన వాళ్ల నుంచి ఆరా తీసినట్లు సమాచారం. అదే సమయంలో కేటీఆర్, హరీష్‌రావులపై ఆ పార్టీ మాజీ నేత, తనయ అయిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. భేటీలో ఈ వ్యాఖ్యలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.జూబ్లీహిల్స్ ఓటమితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా కేసీఆర్ వాళ్లతో చర్చించారు. వీళ్లద్దరితో పాటు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసిన మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మాగంటి గోపినాథ్ సతీమణి సునీత 25 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. అయితే రౌడీయిజంతో ఈ ఎన్నికలో గెలిచారని.. నైతిక విజయం తనదేనంటూ ఫలితాలు వెలువడ్డాక ఆమె మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరిగిందో ప్రజలు చూశారని, పోరాటాలు తమ పార్టీకి కొత్త కాదని.. ప్రతిపక్ష పాత్రను మరింత బలంగా పోషించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం కృషి చేస్తామని కేటీఆర్ ఫలితాల అనంతరం మీడియా ద్వారా తెలిపారు. -
‘కాళేశ్వరం’ పిటిషన్లలో కౌంటర్లు వేయండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి మూడు వారాల్లో పిటిషనర్లు రిప్లై కౌంటర్లు వేయాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణ జనవరి 19కి వాయిదా వేసింది. అప్పటిదాకా జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలు వద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసీఆర్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేశామని, మిగతా మూడు పిటిషన్లలో కౌంటర్లు వేసేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. సమ్మతించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు నెలలకు వాయిదా వేసింది. కేబినెట్ ఆమోదం లేకుండానే... ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కౌంటర్ వేశారు. అందులోని అంశాల మేరకు... ‘కాళేశ్వరంలో అక్రమాల నిగ్గుతేల్చేందుకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారమే చంద్రఘోష్ కమిషన్ నియమాకం జరిగింది. పిటిషన్‌ను పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోక ముందే పిటిషనర్ (కేసీఆర్) కోర్టును ఆశ్రయించారు. రామకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ ఎస్ఆర్ టెండూల్కర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన మేరకు కమిషన్ నివేదిక ఓ నిజనిర్ధారణ నివేదిక మాత్రమేనని దానికి ఎలాంటి చట్టబద్ధత లేదన్నది పిటిషనర్ వాదన. కానీ, ఆయనకు కమిషన్ చర్యలు, చట్టపరమైన అంశాలు తెలుసు. పిటిషనర్ అభ్యర్థన మేరకు కమిషన్ ఇన్‌కెమెరా విచారణ సాగించింది. పిటిషనర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో తీవ్రమైన అక్రమాలకు పాల్పడ్డారని కమిషన్ ఎత్తిచూపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ వేయగా, దాన్ని కూడా పిటిషనర్ ఈ కోర్టులో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీనిపై కేసీఆర్ సుప్రీంకు వెళ్లారు. కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంపై పిటిషనర్‌కు అవగాహన ఉన్న కారణంగానే ఆయన పిటిషన్లు వేశారు. సెక్షన్ 8బీ, 8సీ తనకు తెలియదని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎలాంటి నిరసన, అభ్యంతరం లేకుండా స్వచ్ఛందంగా కమిషన్ ముందు విచారణకు హాజరైనందున సెక్షన్ 8బీ, 8సీ కింద నోటీసులు కోరే హక్కు లేదు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ విచారణ సాగిందనడం అర్థరహితం. కమిషన్ ఏర్పాటు, నివేదిక సెక్షన్ 4(ఎఫ్) ప్రకారం చట్ట సమ్మతం. కమిషన్ ఏర్పాటు ఏకపక్షం కాదు.. అత్యంత ప్రజా ప్రాముఖ్యత అంశం. బరాజ్ కూలిపోయి ఖజానాకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాజెక్టు ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం, కాంట్రాక్టు మంజూరు, అమలు, నిర్వహణ, నాణ్యతా నియంత్రణలోనే కాకుండా ఆర్థిక దుర్వినియోగం వంటి తీవ్రమైన అవకతవకలను కమిషన్ నిర్ధారించింది. పిటిషనర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి స్థల ఎంపిక, డిజైన్ ఖరారు, ప్రారంభ కాంట్రాక్టు మంజూరు, బరాజ్‌ల నిర్మాణం, నిర్వహణ పనులను కమిషన్ పరిశీలించింది. ఇది రాజకీయ వ్యూహం అన్న పిటిషనర్ వాదన నిరాధారం. మేడిగడ్డ వద్ద నిర్మాణంపై నిపుణుల కమిటీ ముందే హెచ్చరించింది. అయినా నిర్లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మాణాలకు పరిపాలన అనుమతులు బిజినెస్ రూల్స్ ప్రకారం కేబినెట్ ముందు ఉంచాలి. కానీ, అలా చేయలేదు. కేంద్ర జల సంఘం పరిశీలనకు ముందే పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. మెస్సర్స్ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ డీపీఆర్‌ను విస్మరించారు. పిటిషనర్ రాష్ట్రానికి భారీ ఆర్థిక నష్టాన్ని సమర్థించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన ఇంజనీరింగ్ లోపాలు, ఒప్పందాల ప్రకారం నిర్వహణ లేకపోవడం పేర్కొనడం వాస్తవం. అక్రమాలను నిర్మూలించడానికి, లక్ష్యాలను అమలు చేయడానికి శాసన, పరిపాలనా చర్యలు తీసుకోవడానికి విచారణ కమిషన్ సిఫార్సులు ప్రస్తుత ప్రభుత్వానికి అవసరం. బరాజ్ నిర్మాణ స్థలాన్ని మార్చవద్దని వివిధ కమిషన్లు సిఫార్సులు చేసినా వినకుండా పిటిషనర్ రూ.7500 కోట్లు ఖజానాపై భారం పడేలా చేశారు. ఈ పిటిషన్ విచారణార్హం కాదు. కొట్టివేయండి. మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేయండి’అని కౌంటర్లో పేర్కొన్నారు. -
అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి
-
రేపు అందెశ్రీ అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం రేవంత్
ప్రజాకవి అందెశ్రీ ఇక లేరు. అస్వస్థతకు గురైన తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. -
కేసీఆర్ బాటలోనే రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేసి వివిధ కాలనీల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెబితే, రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు అంటున్నారు. ఇద్దరూ మోసం చేస్తున్నారు. ఇండ్లు ఆశ చూపి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మరచిపోవడం అలవాటైంది.ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఈ వెనకబాటుకు కారణం ఎవరు? గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దీనికి బాధ్యులు కావా? ఆ పార్టీల నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఈ దుస్థితి పట్టింది’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘మజ్లిస్ కార్పొరేటర్లు, నాయకులు దాదాగిరి చేస్తున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో వీరి ఆగడాలు మరింత పెరిగే అవకాశం ఉంది.మన బిడ్డలను మనం రక్షించుకోవాలన్నా, మనకు రక్షణ కావాలన్నా, నియోజకవర్గం బాగుపడాలన్నా బీజేపీని గెలిపించాలి’అని అన్నారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డులు, రూ.4వేల నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర సాయంపై బహిరంగ చర్చకు సిద్ధం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంపై బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ, కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందంటూ ఈ పార్టీలు కేంద్రంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయని, కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయని తెలిపారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేసిందని, 2023 జూన్ 7న తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర పేరిట బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో తాను ప్రజెంటేషన్ ఇచ్చానని వివరించారు.మరోసారి తెలంగాణ అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చ జరిగేవిధంగా సహకరించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌కు కిషన్‌రెడ్డి ఆదివారం లేఖ రాశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో బహిరంగ చర్చ జరిపేందుకు రెడీగా ఉన్నామన్నారు. బహిరంగ చర్చకు తేదీ, సమయం నిర్ణయించి వారిద్దరినీ ఆహ్వానించాలని ప్రెస్ క్లబ్‌ను కోరారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష పార్లమెంటరీ పద్ధతిలో ఉండేలా, సానుకూల చర్చ జరిగే విధంగా చూడాలని సూచించారు. -
రేవంత్, కేసీఆర్లే బ్యాడ్ బ్రదర్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బ్యాడ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆరేనని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి..అనేక ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడి, నిరుద్యోగులు, మహిళలను మోసం చేసి, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసే, మజ్లిస్‌ను పెంచి పోషించి, వారి కనుసైగల్లో నడిచే బ్యాడ్ బ్రదర్స్ వారేనని ఎద్దేవా చేశారు. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’అన్నట్టుగా కేటీఆర్, కిషన్‌రెడ్డిలను బ్యాడ్ బ్రదర్స్ అంటూ రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరు ఎవరికి బ్రదర్స్? ఎవరు ఎవరిని కాపాడుతున్నారు? కేసీఆర్‌ను కాపాడుతోంది కాంగ్రెస్ కాదా? రాహుల్‌గాం«దీకి భయపడి వారిపై చర్యలకు ఎందుకు రేవంత్ వెనుకాడుతున్నావు’అని ప్రశ్నించారు. రేవంత్‌ది ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వమని, బీఆర్ఎస్ది కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ సర్కార్ అన్నారు. గతంలో కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వం, ఇప్పుడు సోనియా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి భయంతో సీఎం రేవంత్‌రెడ్డి సోయి తప్పి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శనివారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాదని, చీమూనెత్తురు, దమ్మూధైర్యం ఉంటే ఏ విషయంలో బీజేపీ–బీఆర్ఎస్ ఒక్కటయ్యాయో చూపాలని సవాల్ విసిరారు. రానున్న రోజుల్లో అసలు ఆట మొదలుపెడతాం ‘రాష్ట్రంలో ఇంకా అసలు ఆట మొదలు కాలేదు. తెలంగాణలో బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తాం. మీరు చేసిన పనులు ఏమిటో ప్రజలు తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మా ఆట మొదలుపెడతాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల కింద ఉన్న భూమి కదులుతుంది’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం ప్రజల్లోకి వెళ్లేటప్పుడు, తాను ఏం చేశాడో చెప్పి ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాల్సి ఉండగా, అమలు కాని హామీలపై ఒక్కమాట కూడా రేవంత్ మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించే వ్యూహంలో భాగంగానే తనపై, ప్రధాని, బీజేపీపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ‘రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లకు సమయం ఉంటే, తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చే..వినే ధైర్యం మీకు ఉందా’అని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో జరిగిన లక్ష కోట్ల అవినీతి డబ్బులు కక్కిస్తానన్న రాహుల్‌గాందీ.. రూ.లక్ష కూడా బయటకు తీశాడా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇది వాస్తవం కాదా అని నిలదీశారు. ‘ఫోన్ ట్యాపింగ్, విద్యుత్, ధాన్యం, భూముల కొనుగోళ్ల కేసులు ఏమయ్యాయి? రేవంత్‌రెడ్డీ..ఒక్క బీఆర్ఎస్ నేతపైనా చర్యలు తీసుకున్నావా’అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలకు ఓటేస్తే మోసపోయినట్లే: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా శనివారం మధురానగర్ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఒక్క సీటు గెలిచినంత మాత్రాన జరిగే మార్పు ఏమీ ఉండదని అన్నారు. ‘బీజేపీకి ఓటు వేసి మోదీకి మద్దతు ఇవ్వండి. రహమత్‌నగర్, వెంగళరావునగర్, బోరబండ కాలనీల్లో కేసీఆర్ ఒక్కసారి పాదయాత్ర చేస్తే ఆయన చేసిన అభివృద్ధి ఏంటో అర్థమవుతుంది. వర్షం వస్తే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరు? కేసీఆర్ దీనికి బాధ్యుడు కాదా’అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం చేతిలో కీలు»ొమ్మలుగా మారిపోయాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కూతురే విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ పార్టీకి మనం ఓటు వేయాలా?’అని ప్రశ్నించారు. మోదీ సంక్షేమ పథకాలను తమ పథకాలంటూ రాష్ట్రంలో పాలన నడిపిస్తున్నారని విమర్శించారు. -
ఉపఎన్నికల ప్రచారంలో మారుమోగుతున్న KCR పేరు
-
‘కేసీఆర్, హరీష్‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలి?’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి కేసీఆర్, హరీష్‌రావులను ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలని తెలంగాణ బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 11లోపు కేసీఆర్, హరీష్‌లను అరెస్ట్‌చేయాలని డిమాండ్ చేశారు.తాము ఈ కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు అవుతుందని, ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇది జరుగుతుందని సీఎం రేవంత్ ఆరోపించారు. ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.మరొకవైపు బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది చీకటి ఒప్పందమని విమర్శించారు.మరొకవైపు కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొడుతుందని ధ్వజమెత్తారు.వృద్ధుడిని రైల్వే ట్రాక్‌పై తోసేసిన యువకులు -
కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేస్తోంది
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ జోరు పెంచించింది. మంగళవారం ఉత్తరాది తరహా కార్పెట్ బాంబింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏకకాలంలో 50 ప్రాంతాల్లో బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, శ్రీనగర్‌కాలనీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నియోజకవర్గవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...‘గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబపాలన, అవినీతి, దుర్మార్గపు పాలన పోవాలని, ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా కాంగ్రెస్‌కు ఓటు వేశారు. కేసీఆర్ రహదారులను అద్దంలా తయారు చేస్తా అన్నారు.బోరబండ, రహ్మత్‌నగర్, షేక్‌పేట్, శ్రీనగర్ కాలనీ, ఎక్కడైనా గంట పాదయాత్ర చేసి ఓట్లు అడగాలి’అని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. పేరుకే జూబ్లీహిల్స్ ఇక్కడ రోడ్డుపై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలదే బాధ్యత కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్పోటీ చేస్తోందన్నారు. ఎంఐఎం నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్‌ను కబ్జా చేయడానికి మజ్లిస్ పార్టీ ప్రయత్నిస్తోందని చెప్పారు.ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో దీపక్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడానికి అది నాందిగా నిలుస్తుందన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, రెండేళ్లు కావొస్తున్నా హామీల అమలులో చిత్తశుద్ధి లేదని చెప్పారు. -
సత్యనారాయణకు నివాళుల్పరించిన కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
-
గల్లా పట్టి నిలదీయండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీషీటర్‌ను పోటీలో నిలబెట్టి ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. కాంగ్రెస్ ప్రచారంలో రౌడీషీటర్లు పాల్గొంటూ కత్తులు, కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్నారు. రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇజ్జత్ (గౌరవం) ఉంటుందా? రౌడీషీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. రౌడీషీటర్ కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి నియోజకవర్గ గౌరవంతోపాటు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను ఓటర్లు కాపాడుకుంటారనే నమ్మకం ఉంది’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలనపై అవగాహన కల్పించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించేలా కష్ట పడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రవల్లి నివాసంలో గురువారం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పార్టీ అభ్యర్థి గెలుపు, భారీ మెజారిటీ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పెద్దలను గల్లా పట్టి నిలదీయాలి ఓట్ల కోసం వచ్చే ప్రభుత్వ పెద్దలను గల్లాపట్టి నిలదీయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి నిలిచిపోవడం గురించి ఇంటింటికీ తిరిగి వివరించండి. హైడ్రా పేరిట బుల్డోజర్లను పేదల గుడిసెల మీదికి పంపి నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వస్తే గల్లా పట్టి నిలదీయాలి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మానవీయ కోణంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ నుంచి కళ్యాణలక్ష్మి వరకు పథకాలు నిలిచిపోవడానికి కారకులైన కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించాలి. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం, కానీ, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిలో ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహ్యం, ఏహ్య భావం నిండివుంది. ప్రజల చేతిలో పైసలు ఆడక పరేషాన్లో ఉన్నారు. రెండేళ్లు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం చేసింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే అని తెలంగాణ సమాజం స్పష్టతతో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ప్రజలు ఎప్పుడో ఖాయం చేశారు. భారీ మెజారిటీ సాధించేలా ప్రజలతో కలిసి పనిచేయడం మీ బాధ్యత’అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్రానికైనా, కుటుంబానికైనా పతారా (పరపతి) ఉంటేనే అతార (డిమాండ్) పెరుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గురించి ప్రజలు ఆలోచించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక చార్టును తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లి, తాము అందుబాటులో ఉంటామని భరోసా ఇవ్వాలని ఆదేశించారు. ఎర్రవల్లి నివాసంలో నేతల సందడి ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వీరితోపాటు ఉప ఎన్నికలో పార్టీ తరపున డివిజన్, క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రచారం చేస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ నేపథ్యంలో ఎర్రవల్లి నివాసం సందడిగా మారింది. సమావేశానికి వచ్చిన నేతలను కేసీఆర్ పేరు పేరునా పలకరించారు. పార్టీ అభ్యర్థి వెంట ప్రచారంలో ఉండాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. -
‘జూబ్లీహిల్స్’పై నేడు కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారపర్వంపై దృష్టి కేంద్రీక రించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థితోపాటు పార్టీ డివిజన్ ఇన్ చార్జ్‌లు, స్టార్ క్యాంపెయినర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కీలక నేతలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. గురువారం జరిగే భేటీలో పార్టీ ప్రచార వ్యూహం, సమన్వయం, ప్రచార ఎజెండాపై కేసీఆర్ దిశానిర్దే శం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంతోపాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, ఓటరు మనోగతం తదితరాలపై చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో కసరత్తు జరిగినట్టు తెలిసింది.బహిరంగ సభకు విముఖత: ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ప్రచారానికి కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో విస్తృత ప్రచారానికి అవలంబించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దృష్టి సారించారు. నగరంలో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ సభలు, సమావేశాల జోలికి వెళ్లకుండా డివిజన్ల వారీగా హాల్ మీటింగ్స్, కార్నర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్లకు చేరువయ్యేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పార్టీ బృందాలు ప్రతీ ఇంటిని సందర్శించేలా షెడ్యూల్ రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రచారం చివరిదశలో జరిగే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనే అవకాశమున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు భేటీ
-
కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ కీలక భేటీ
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills By poll) ప్రచారం, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నట్టు సమాచారం. తాజా భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) బుధవారం ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే, తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇక, రేపు(గురువారం) కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఇన్‌చార్జ్‌లతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రచార వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. -
బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు రెడీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పార్టీకి చెందిన 40 మంది ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార సారథులుగా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గుప్తా ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రచార వాహనాల పాస్‌లు మంజూరు చేసింది. ఈసీ అనుమతి పొందిన స్టార్ క్యాంపెయినర్లు వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం నిర్వహించేలా అనుమతి ఇచ్చింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇంకా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, వి.ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి ఉన్నారు. అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అనిల్‌జాదవ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ముఠా గోపాల్, చింతా ప్రభాకర్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాతా మధు, ఎల్.రమణ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రచారంలో పాల్గొంటారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్దన్‌రెడ్డి, షకీల్ అమీర్ మొహమ్మద్, నేతలు రావుల శ్రీధర్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, అబ్దుల్లా సోహైల్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. -
ఇంక కేసీఆర్ ఫొటో ఎందుకు?..: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ప్రజల్లోకి వెళ్తూ నాలుగు నెలలపాటు యాత్ర చేపడుతున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల యాత్రతో తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఉద్యమకారులు,అమరవీరుల త్యాగాలకు అర్ధం ఉండాలంటే సామాజిక తెలంగాణ రావాలి. అందుకే యాత్రను చేస్తున్నాం. అయితే ఈ యాత్రలో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫొటో ఉండబోదు అని అన్నారామె. అయితే.. ఇది కేసీఆర్‌ను అగౌరవపరిచే ఉద్దేశం ఎంతమాత్రం కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం,తెలంగాణ లేదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే మనస్తత్వం నాకు లేదు. ఆ చెట్టు కింద దుర్మార్గులు ఉన్నారు. నేను నా తొవ్వను వెతుక్కుంటున్నా. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన ఫొటోతో ప్రజల్లోకి వెళ్లలేను అని స్పష్టత ఇచ్చారామె. అక్టోబర్ 25 2025 నుంచి నుంచి ఫిబ్రవరి 13 20206 వరకు నాలుగు నెలల పాటు జాగృతి జనం బాట కార్యక్రమం జరగనుందని కవిత ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటన చేస్తూ బీఆర్ఎస్ను వీడే సమయంలో కేసీఆర్ ఫొటోతోనే తాము భవిష్యత్ కార్యక్రమాలు చేపడతామంటూ కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నేడు మాగంటి సునీత నామినేషన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నా రు. హంగూఆర్భాటానికి తావు లేకుండా తొలిసెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామి నేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.కాగా మాగంటి సునీత మంగళవారం ఎర్రవల్లి నివా సంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేతుల మీదుగా సునీత బీఫామ్‌ను అందుకున్నారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున సునీతకు రూ.40 లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ కుటుంబ సభ్యులతోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు ఉన్నారు. -
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థికి కేసీఆర్ చేతుల మీదుగా బి ఫామ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్,కు పార్టీ అధినేత కేసీఆర్ బి ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల రూపాయలు చెక్కు ను అందించారు.ఈ సందర్భంగా.. దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు కుమారుడు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం.. కేసీఆర్ ఫొటో లేకుండానే..
సాక్షి,హైదరాబాద్: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక తెలంగాణ లక్క్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. తండ్రి కేసీఆర్ ఫొటో కాకుండా ప్రొఫెసర్ జయ శంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. యాత్ర పోస్టర్లను సిద్ధం చేశారని, యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం (అక్టోబర్15) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కవిత మేథావులు, విద్యావంతులతో భేటీ కానున్నారు.అక్టోబర్ చివరి వారం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర తెలంగాణలోని అన్నీ జిల్లాలను కవర్ చేస్తూ ఫిబ్రవరిలో ముగియనుంది. కవిత తెలంగాణ యాత్రపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో–9పై హైకోర్టు స్టే ఇవ్వడం, ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపేసిన నేపథ్యంలో గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు కీలక భేటీ నిర్వహించారు. తాజ పరిణామాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని.. అసెంబ్లీ లోపలా, బయటా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించినా జీవోకు చట్టబద్ధత సాధించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నద్ధతపైనా ఈ భేటీలో కేసీఆర్ సమీక్షించారు. ఐదుగురు మాజీ మంత్రుల నేతృత్వంలో ఏర్పాటైన వార్ రూమ్ పనిచేయాల్సిన తీరుపై ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపికైన నేపథ్యంలో ఆ పార్టీ అనుసరించే వ్యూహం, అభ్యర్థి బలాబలాలను విశ్లేషించి పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినందున గ్రామీణ ప్రాంత నేతలు, కేడర్‌ను కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఉపఎన్నిక ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ఒకట్రెండు రోజుల్లో పార్టీ డివిజన్ ఇన్చార్జీలు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారని సమాచారం. -
జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక(Jublihills bypoll) కోసం అభ్యర్థిని శుక్రవారం బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. మాగంటి సునీత(Maganti Sunitha) పేరును ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో కీలక నేతలతో భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) హఠాన్మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి మాగంటి సునీతే పోటీ చేస్తారని ఇది వరకే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అధినేత ఆమోదంతో పార్టీ ప్రకటన చేసింది. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.కేసీఆర్‌కు కృతజ్ఞతలుజూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై సునీత పార్టీ అధినేత కేసీఆర్(KCR)కు కృతజ్ఞతలు తెలియజేశారు. మాగంటి గోపీనాథ్ పట్ల ఉన్న విశ్వాసంతో, నాపై నమ్మకం ఉంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇందుకుగానూ పార్టీ అధినేత కేసీఆర్‌కు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతు, ఆశీర్వాదం నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారామె. ఇదీ చదవండి: ‘పవర్’ఫుల్ పోస్టులే కావాలి -
ఎన్నికలే ఎజెండా..
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఎర్రవల్లి నివాసంలో గురువారం జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కేడర్‌తో జరుగుతున్న సమావేశాల వివరాలను కేటీఆర్ వివరించారు. పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి ఓటర్ను చేరుకునేలా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి రిజర్వాయర్ ఎత్తు పెంపుతో కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగే నష్టం గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. బనకచర్ల లింకు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రానికి జరిగే నష్టంపై బీఆర్ఎస్ పోరాడక తప్పదని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సీబీఐ ప్రాథమిక సమాచార సేకరణ ప్రారంభించిందనే వార్తల నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ ఎదుట వాదన వినిపించిన తరహాలోనే ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికలపై టెలి కాన్ఫరెన్స్ రేపోమాపో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావు గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల కొరత మొదలుకుని బతుకమ్మ పండుగ ఏర్పాట్ల వరకు ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. స్థానిక ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని, ఊరూరా పార్టీ ఆధ్వ ర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు. -
కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టిందని.. నలుగురు కలిసి మహిళను అణిచివేస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ జరిపారు. కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ నడుస్తుంది.. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు, సంతోషే.. వారి కుటుంబ పంచాయితీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత కాంగ్రెస్‌లో చేరుతానంటే వ్యతిరేకిస్తానన్న రేవంత్.. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారన్నారు.‘‘ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో ఉంది. లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి ఇచ్చేవాళ్లం. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును కిషన్‌రెడ్డి ఆపుతున్నారు. కేటీఆర్ చెప్పినట్టే కిషన్‌రెడ్డి చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు వేయకపోవడమే నిదర్శనం. కిషన్‌రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవు. కేటీఆర్ నుంచే కిషన్‌రెడ్డి సలహాలు తీసుకుంటారు. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇస్తాం. కమిషన్ నివేదిక సీబీఐకి ఒక పునాదిలా ఉపయోగపడుతుంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. -
‘ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు ముడుపుల రేవంత్‌రెడ్డి’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నడపడం లేదని సర్కస్ నడుపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ జరిపారు. ఈ చిట్‌చాట్‌లో.. త్వరలోనే పాదయాత్ర ఉంటుంది. పబ్లిక్‌లోకి కేసీఆర్ ఎప్పుడు రావాలో.. అప్పుడే వస్తారు. జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు బాగా తెలుసు. సీఎం రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నారు. సుందరయ్య విజ్ఞాన వేదికలో విద్యార్థులు రౌండ్ టేబుల్ పెట్టుకుంటే పెట్టుకొనివ్వని వారు నియంత.సర్కార్ నడపడం లేదు సర్కాస్ నడుపుతున్నారు. మంత్రులది ఓమాట సీఎంది మరో మాట. కోర్ట్ చెప్పిన సీఎం వినరు. సృజన్‌రెడ్డికి సింగరేణిలో రూ.300 కోట్ల టెండర్లు ఇచ్చారు. గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. కేసీఆర్ చేసిన పనినీ చెప్పలేక పోయాం కాబట్టే ఓడిపోయాం. రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు ఇచ్చాం.. కేటీఆర్ పైన కోపం సిరిసిల్ల పైన చూపిస్తున్నారు. నేతన్నపై జీఎస్టీ వేసీని ఘనత సీఎం రేవంత్‌దే. పది నియోజక వర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నిలకు పోవాలి. బీసీ బిల్లుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఆర్ఆర్ఆర్ సౌత్ సైడ్ అలైన్ మెంట్ మార్చారు.. సీఎం రేవంత్ బంధువులు 2,500 ఎకరాల భూములు కొన్నారు. అలైన్ మెంట్ మార్చితే ఆర్ఆర్ఆర్కి డబ్బులు ఇవ్వం అని కేంద్రం చెప్పింది.సౌత్ సైడ్ ఆర్ఆర్ఆర్ మేమే కడతామని రేవంత్ కేంద్రానికి చెప్పారు. సౌత్ సైడ్ ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చడం వల్ల మిగతా ప్రాంతాల్లో కూడా అలైన్ మెంట్ మార్చే పరిస్థితి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి బంధువుల భూములు రెట్లు పెంచేందుకు ఆర్ఆర్ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు. ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, వారి బంధువుల డ్రామాలు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ముడుపుల రేవంత్ రెడ్డి. ఎల్అండ్టీ వాళ్ళని ముడుపుల కోసం సీఎం రేవంత్ ప్రయత్నించాడు. అందుకే మెట్రో నడపం అని వెళ్ళిపోతాం అంటున్నారు.ముఖ్యమంత్రి బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి L&T తప్పుకుంటుంది. ముఖ్యమంత్రి ముడుపుల కోసం వేధిస్తున్న వేధింపులు తట్టుకోలేకనే కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోతున్నది. రాష్ట్రంలోని తమ కార్యకలాపాల నుంచి ఎల్అండ్టీ తప్పుకుంటుంది. గతంలో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని జైల్లో పెడతా అన్నారు. వాళ్లని వీళ్ళని జైల్లో పెడతా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలు వస్తాయి.రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఉంటాయి. గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను ముందు పెట్టి ఆయా కంపెనీలతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు. రేవంత్ పీసీసీ పదవి కొన్నాడు.సీఎం సీట్ కొన్నాడు.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులను బీజేపీకి అమ్మారు. రేవంత్ అన్నిట్లో దిట్ట. 8మంది ఎంపీలను అమ్మాడు. హైడ్రా కాస్త హైడ్రామా అయింది. హైడ్రాకు పెద్ద వాళ్ళ ఇళ్ళు కనిపించవు. కాంగ్రెస్ పార్టీ తమ చేతి గుర్తును తీసివేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలిరేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని ఎవరూ అనుకోవడం లేదు, ఆయన ముమ్మాటికీ బీజేపీ మనిషే. రేవంత్ రెడ్డిని పొగుడాలంటే బట్టి విక్రమార్కని తొక్కేయాలా..?ప్రజా పాలనా అంటూ కోటి అప్లికేషన్లు తీసుకున్నారు. ఎంత మందికి ఇండ్లు ఇచ్చారు. రాజీవ్ యువ వికాసం లేదు కానీ ఎనుముల ఫ్యామిలీలో మాత్రం వికాసం ఉంది’ -
ఈ-ఫార్ములా రేసు సంస్థకు 44 కోట్లు విడుదలకు బాధ్యుడిని తానేనని చెప్పిన KTR
-
కేసీఆర్‌ను కలిసిన మాజీ మేయర్ కావ్య
హైదరాబాద్: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో జవహర్‌నగర్ మాజీ మేయర్ కావ్య కలిశారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌ను మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉప రాష్ట్రపతి ఎన్నిక.. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే, ఇండియా కూటమి.. రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్దంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేకపోవడంతో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, బీఆర్ఎస్కు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావ్, పార్థ సారథి రెడ్డి ఎంపీలుగా కొనసాగుతున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ..‘ఉపరాష్ట్రపతి ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుంది. మా అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా కార్యకర్తలపై దాడులకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది . అందులో భాగంగానే ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వం. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టే చర్యలకు పాల్పడుతోంది. యూరియా సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఓట్లు అక్కర్లేదని మాట్లాడిన తీరుకు వాళ్ళ అభ్యర్థికి మద్దతు ఇవ్వం. రెండు కూటముల అభ్యర్థులు సమర్థులైనప్పటికీ.. కూటములు చేసే చర్యల వల్ల ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
కేసీఆరే సుప్రీం.. తుది నిర్ణయం పార్టీదే: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు. ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. తన కూతురి అడ్మిషన్ కోసం ఆయన లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా లండన్‌లో బీఆర్ఎస్ NRI నేతల మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘బీఆర్ఎస్లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం లీడర్. కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ మాకు నేర్పించారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా హరీశ్ రావు విమర్శలు చేశారు.మరోవైపు.. ఈ క్రమంలోనే అక్కడ మీడియా ఆయనను కవిత ఇష్యూపై ప్రశ్నించింది. కానీ, ఆయన సమాధానం చెప్పలేదు. ఇండియా వెళ్లిన తరువాతనే మాట్లాడతానని చెప్పినట్టు తెలిసింది. రేపు ఆయన ఇండియాకు రాబోతున్నట్టు సమాచారం. అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తే ఏం మాట్లాడుతారు అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ హోమం.. శోభ, కేటీఆర్ సహా..
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో గణపతి హోమం చేసేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ సతీమణి శోభతో కలిసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పూజలో పాల్గొననున్నారు. అయితే, ప్రతీఏటా వినాయక చవతి నవరాత్రుల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. అందులో భాగంగానే హోమం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఐదు రోజులుగా ఫాంహౌస్‌లోనే ఉన్నారు. ఆయన కూడా ఈ పూజలో పాల్గొననున్నట్టు సమాచారం. -
ప్చ్.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు!
శత్రువులు ఎక్కడో ఉండరు.. ఇంట్లో మనచుట్టూనే తిరుగుతూంటారని ఈ మధ్య వచ్చిన ఒక సినిమా డైలాగుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఈ మాట ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుందని అనిపిస్తోంది. కేసీఆర్ కుమార్తె కవిత అంత పని చేశారు మరి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి, సీబీఐ విచారణ ప్రయత్నాలతోనే కేసీఆర్ సతమతమవుతున్న తరుణంలో ఉరుము లేని పిడుగు మాదిరి కవిత విరుచుకుపడ్డారు. నేరుగా ఏమీ అనకపోయినా, ఆమె వ్యాఖ్యలన్నిటికి కేసీఆర్ బాధ్యుడవుతారన్నది బహిరంగ రహస్యం. కవిత వైఖరి కొన్ని నెలలుగా పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. సోదరుడు పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించడమే కాకుండా.. అధినేత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ దనుమాడిన సంగతి ప్రజలందరికీ తెలుసు. వీటన్నింటినీ ఓపికగా సహించిన కేసీఆర్ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ఆయుధాన్నిచ్చేలా వ్యవహరించడంతో సహించలేకపోయారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత కూడా పార్టీకి రాజీనామా చేసి ఒక రకంగా తండ్రితో బంధాలు తెంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్రావులతోపాటు ప్రముఖ కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డిలపై కూడా కవిత ఆరోపణలు చేశారు. హరీశ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని, వీరిద్దరూ ఢిల్లీ నుంచి విమానంలో కలిసి వచ్చారని, ఆ సందర్భంలో రాజకీయాలు మాట్లాడుకున్నారని ఆమె అంటున్నారు. బీఆర్ఎస్లో కాని,ఆయా రాజకీయ వర్గాలలో కాని, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ సలహా, సంప్రదింపులతోనే కవిత తన సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. దానిని పూర్వపక్షం చేయడానికి ఆమె ప్రయత్నించినట్లు కనిపించినా, ఎవరూ పెద్దగా నమ్మకపోవచ్చు. తన తండ్రిపై సీబీఐ విచారణ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత?, పోతే ఎంత అని ప్రశ్నించడం ద్వారా ఆమె తన మనసులో మాట చెప్పారన్న భావన కలుగుతుంది. కేసీఆర్‌పై అవినీతి మరక పడిందని కవిత కూడా చెప్పడం సహజంగానే బీఆర్ఎస్లో కలకలం రేపుతుంది.పైకి హరీశ్, సంతోష్‌ల గురించి ప్రస్తావించినా, వారు కేసీఆర్‌ను దెబ్బతీస్తారని అంటున్నా, ఆమె చేసే ప్రతి వ్యాఖ్య కేసీఆర్‌కు తగులుతుంది. కాకపోతే ఆమె నేరుగా ఈ మాట చెప్పకపోవచ్చు. ఈ మధ్య కాలంలో పార్టీకి దూరమైన కవిత ఇప్పుడు ఆ పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత అని ప్రశ్నించారు. దానికి తగిన విధంగా సస్పెన్షన్ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. పార్టీపై, తండ్రిపై గౌరవం ఉంటే అలా మాట్లాడగలిగేవారా?. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం వివాదంపై మాజీ మంత్రి, కేసీఆర్ అల్లుడు హరీశ్‌రావు సమర్థంగా వాదించారన్న ఆనందం ఎంతో సేపు లేకుండా చేశారు కవిత తన వ్యాఖ్యలతో!. పోనీ ఆమె అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడారని అనుకున్నా, ఆమె పై కొంతకాలం క్రితం వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అభియోగాలు, కొద్ది నెలలపాటు జైలులో ఉన్న పరిస్థితి కూడా సహజంగానే చర్చకు వస్తాయి. కాళేశ్వరం దెబ్బతినడంతోపాటు, కవిత లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం కూడా బీఆర్ఎస్ను ఎన్నికలలో దెబ్బతీసిందన్నది చాలామంది భావన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని ఏ బీఆర్ఎస్ నేత అయినా బహిరంగంగా అంటే ఒప్పుకుంటారా? కవిత చేసిన వ్యాఖ్యల గందరగోళాన్ని తగ్గించుకోవడానికి గాను ఆమెపై చర్య తీసుకోక తప్పని స్థితి ఏర్పడిందన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. అలా చేయలేకపోతే హరీశ్ సంతోష్ వంటివారికి అసంతృప్తి కలగవచ్చు. ఇప్పటికే కవిత దూరమైన నేపథ్యంలో వీరిని వదలుకునే పరిస్థితి ఉండదు. ఆమె తిరుగుబాటుకు పార్టీలో పెద్దగా అనుకూలత వచ్చినట్లు అనిపించదు. హరీశ్‌రావుకు పార్టీ అంతా అండగా ఉన్నట్లు తేలింది. వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఒక వ్యాఖ్య చేస్తూ హరీశ్‌ను ఆరడగుల బుల్లెట్ అని, మాస్టర్ క్లాస్ అని అసెంబ్లీలో మాట్లాడిన తీరును ప్రశంసించారు. ఇవన్ని కవితకు బీఆర్ఎస్ ఇచ్చిన సమాధానాలే అవుతాయి. కవిత తొలుత తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా, ఆ తర్వాత కాలంలో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కాని ఆ గెలుపును ఆమె నిలబెట్టుకోలేకపోయారు. నిజామాబాద్ లో మరోసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు.అయినా కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వ్యవహార శైలిపై కొంతమందిలో అసంతృప్తి ఉన్నప్పటికి, ఎవరూ పైకి మాట్లాడేవారు కారు. ఇప్పుడు వారు కూడా హరీశ్‌రావు పార్టీకి మూల స్తంభాలలో ఒకరని బదులు ఇస్తున్నారు. కొద్దికాలం క్రితం కవిత పై విమర్శలు చేయడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాందీ కూడా పలికారు. కవిత సొంతంగా పార్టీ పెట్టుకుంటారా? లేక కాంగ్రెస్‌లో చేరతారా? అన్న చర్చకు ఆమె అవకాశం ఇస్తున్నారు. తనను అరెస్టు చేయించింది బీజేపీనే అన్న భావనలో ఉన్నందున ఆ పార్టీ వైపు వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సంక్షోభం వెనుక తమకు ఎలాంటి పాత్ర లేదని, అది అవినీతి సొమ్ము పంచాయతీ అని సమాధానం ఇచ్చారు. కవిత తనకు తెలిసిన అవినీతి సమాచారం అంతటిని సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ఎంపీలు అరవింద్, రఘునందన్ వంటివారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో గొడవలు ఆ రెండు పార్టీలకు సహజంగానే సంతోషం కలిగిస్తాయి. కవిత ఒకరకంగా తండ్రినే బ్లాక్ మెయిల్ చేసినట్లు కనిపిస్తోంది. పైకి ఆయనను గొప్పవాడుగా ప్రొజెక్టు చేసినట్లు అనిపించినా.. మొత్తం ఆయనను దృష్టిలో ఉంచుకుని చేశారన్న భావన కలుగుతుంది. రేవంత్ ను ఉద్దేశించి కొంత అనుచిత వ్యాఖ్య చేసినట్లు కనిపించినా, కవిత తీరు వల్ల కాంగ్రెస్ కు రాజకీయంగా లబ్ది చేకూరే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేస్తూ కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైందని వ్యాఖ్యానించారు.అందులో మామ వాటా ఎంతో అల్లుడి వాటా ఎంతో తేలాలి అని కూడా ఆయన అన్నారు. తనను కాంగ్రెస్, బీజేపీ, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఖబడ్దార్ అని కవిత హెచ్చరించారు. తాను ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదని, తనది కేసీఆర్ రక్తమని కవిత పేర్కొనడం బాగానే ఉన్నా, ఏ లక్ష్యంతో ఆమె ఈ వివాదాన్ని సృష్టించారన్న దానిపై ఎవరికి వారు ఊహించుకుంటారు. చర్చించుకుంటారు. గతంలో ఆమె కేసీఆర్‌కు ఒక లేఖ రాసి పార్టీలో అసమ్మతికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు పార్టీకి దూరం అయ్యారు. కవిత భవిష్యత్తు రాజకీయం అంత తేలికగా ఉండదు. ఒక పెద్ద పార్టీ నీడలో, అది కూడా సొంత పార్టీలో, తండ్రి చెంత ఉండడం వేరు. సొంతంగా పార్టీని పెట్టుకున్నా, మరో పార్టీలో చేరినా, అది ముళ్లబాటే అవుతుంది. వాటన్నిటిని దాటుకుని కవిత తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకుంటే అది గొప్ప విషయమే అవుతుంది. కాని చరిత్రలో అలా సఫలం అయిన ఘట్టాలు చాలా తక్కువే అని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాళేశ్వరం అవినీతి కేసీఆర్ దే!
-
CBI రంగంలోకి దిగితే.. కాంగ్రెస్ కే నష్టమా?
-
ఉప ఎన్నికపై దృష్టి పెట్టండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నాయకులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ఎర్రవల్లి నివాసంలో బుధవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ సంతోష్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ తరహా ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, దానిని పార్టీకి అనువుగా మలుచుకోవాల్సిన తీరు.. తదితరాలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు వచ్చిన మణుగూరు ప్రాంత నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌ను కలిశారు. కాగా కవిత రాజీనామా, ప్రెస్‌మీట్‌కు సంబంధించి అంశాలపై కేసీఆర్ ఎలాంటి ప్రస్తావన చేయలేదని సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, ఎల్.రమణ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు ముఠా జైసింహ, ఆజం ఆలీలు ఈ భేటీలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గం పరిధిలోని ఓటరు జాబితాను డివిజన్లు, బూత్‌ల వారీగా లోతుగా పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, డివిజన్లు, బూత్‌ల వారీగా మైనారిటీ విభాగం కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు కోరారు. త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మరోమారు సమావేశం జరుగుతుందని ముఖ్యనేతలు వెల్లడించారు. -
మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు
సాక్షి ప్రతినిధులు, భద్రాద్రి కొత్తగూడెం/మహబూబ్‌నగర్: ‘ఏమైనా సమస్యలు ఉంటే కుటుంబంలో కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోండి.. కాదంటే కుల పెద్ద దగ్గరకు వెళ్లండి.. అదీ కుదరకపోతే మంత్రగాన్ని సంప్రదించండి. అంతేతప్ప మీ గొడవల మధ్యకు మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? ఒకప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఉండకూడదని చూశారు. అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని జైళ్లకు పంపించారు. ఇప్పుడు వాళ్లకు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. నేను హరీశ్‌రావు, సంతోష్‌రావు వెనుక ఉన్నానని ఒకరు.. కవిత వెంట ఉన్నానని మరొకరు అంటున్నారు. పదేళ్లలో దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకోవడానికి వాళ్లు కొట్లాడుకుంటున్నారు. ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా? మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు. నేను నాయకుడిని.. ఉంటే ముందే ఉంటా. పాలమూరు వెనుక, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా. వారికి తోడుగా ఉంటా. ప్రజల అభివృద్ధికి కృషి చేస్తా. మీ కుటుంబ, మీ కుల పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. మాకు ఎలాంటి ఆసక్తి లేదు..’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఆయన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం నిర్వహించారు. అనంతరం దామరచర్లలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండవ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..చచ్చిన పామును నేనెందుకు చంపుతా..లక్షల కోట్లు దోచుకున్న నాయకుని ఇంట్లో ఈ రోజు నోట్ల కట్టల కోసం పొడుçచుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లకు ఫామ్‌హౌస్‌లు, టీవీ చానళ్లు, వార్తా పత్రికలు, బంగ్లాలు ఎన్నో ఆస్తులు సంపాదించి ఇచ్చాడు. కానీ ఈ రోజు ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. కుటుంబ సభ్యులే ఒకరితో ఒకరు కొట్లాట పెట్టుకుంటున్నారు. ఆ గొడవల వెనక మనం ఉన్నామంటున్నారు. 2023 డిసెంబర్లోనే ఆ కాలనాగును తెలంగాణ ప్రజలు కర్రలతో కొట్టారు. అది ప్రజలను దోచుకుంటున్న అనకొండ అని పెద్ద బండరాయితో తలమీద కొట్టి బొంద పెట్టారు. ఆ చచ్చిన పామును నేను ఎందుకు చంపుతాను.ప్రకృతి శిక్షిస్తూనే ఉంటుంది..ఒకప్పుడు జనతాపార్టీకి గొప్ప పేరు ఉండేది. అది కనుమరుగైంది. కొంతమంది కుట్రల వల్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణలో సమస్యను ఎదుర్కొంటోంది. ఇన్ని దుర్మా ర్గాలు చేసిన మీరు ఎట్లా మనుగడ సాగిస్తారు? ప్రకృతి అనేది ముందుంది.. అది శిక్షిస్తూనే ఉంటుంది. చేసిన పాపా లు వెంటాడుతూనే ఉంటాయి. అనుభవించి తీరాల్సిందే. శీనన్నపై నా అంచనాలు తప్పలేదుఈ రోజు నాయకపోడు మహిళ రమణమ్మకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆనందం చూస్తుంటే.. గతంలో జూబ్లీహిల్స్‌లో డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నప్పుడు నేను పడిన సంతోషం గుర్తుకొచ్చింది. ఆ సంతోషం డబ్బుతో వచ్చేది కాదు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు నాకు బలమైన మనిషి అవసరం పడింది. అందుకే హైకమాండ్ దగ్గర పట్టుబట్టి మరీ గృహ నిర్మాణ శాఖను పొంగులేటి శీనన్నకు కేటాయించా. నా అంచనాలు తప్పలేదు.. ఢిల్లీ ముందు తలదించుకోవాల్సిన అవసరం లేకుండా అప్పగించిన పనిని 99.99 శాతం శీనన్న నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. వైఎస్సార్ హయాంలో 2004లో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 20 లక్షల ఇళ్లు కట్టించాం. హనుమాన్‌గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదు.పాలమూరును చూడటానికి విదేశీయులు రావాలిఒకప్పుడు పాలమూరులో మన కరువును, పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని చూపించడానికి అప్పటి ముఖ్యమంత్రు లు విదేశాల నుంచి పర్యాటకులు, ప్రెసిడెంట్లను తీసుకొచ్చా రు. టోనీబ్లెయిర్ వచ్చిండంటే మన పేదరికం ఎగ్జిబిషన్‌గా ఉండే. ఇప్పుడు ప్రజలు, మన సాగునీటి ప్రాజెక్టులు, విద్యావసతులు చూడడానికి విదేశాల నుంచి రావాలి. దేవరకద్ర ఎమ్మెల్యే కోరినట్లు డ్రైపోర్టు ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటాం. విదేశాల నుంచి మేధావులు ఇక్కడి ట్రిపుల్ ఐటీని చూసేందుకు రావాలి.దత్తత గ్రామానికే న్యాయం చేయలేదు: మంత్రి పొంగులేటిదామరచర్ల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం హోదాలో కేసీఆర్ దత్తత తీసుకున్నారని, ఆ గ్రామంలో ఓ 90 ఏళ్ల అవ్వకు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి నిలుపుకోలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఆ అవ్వకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చిందని తెలిపారు. గృహ ప్రవేశం చేసి.. పట్టు వస్త్రాలు అందజేసి..సీఎం బెండాలపాడు చేరుకోగానే స్థానికులు ఆయనకు కొమ్ముకోయ నృత్యాలతో స్వాగతం పలికారు. నాయక్‌పోడు మహిళ బచ్చల రమణ ఇంటికి సీఎం వెళ్లారు. రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్లి అన్ని గదుల్లో కలియదిరిగారు. దేవుడి పటాల ముందు జ్యోతి వెలిగించి కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఇంటి ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. అనంతరం కుటుంబ సభ్యులతో గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత బచ్చల నర్సమ్మ ఇంటి గృహప్రవేశంలో సీఎం పాల్గొన్నారు. ముందు గదిలో చాపపై కూర్చుని మిఠాయిలు తిన్నారు. ఇంటి యజమానురాలి మనవరాలికి పాయసం తినిపించారు. వారికి వస్త్రాలు అందజేసి గ్రూప్ ఫొటో దిగారు. కాగా సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రి పొంగులేటిని ఇందిరమ్మ ఇంటి యజమానులు సత్కరించారు.మీ పిల్లలకు కొరియా, జపాన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఐటీ చదివిన వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరికీ ఐటీ కోర్సులు చదివే అవకాశం రాకపోవచ్చు. సాధారణ విద్యతోనే సరిపెట్టుకోవాల్సి రావొచ్చు. ఇ లాంటి వారికి కూడా ఏటీసీలతో స్కిల్స్ నేర్పించి సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉద్యోగం చేసే అవకాశాన్ని మా ప్రభుత్వం కల్పిస్తుంది’అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దామరచర్ల సభలో రేవంత్ బుధవారం మాట్లాడుతూ.. గత సీఎం ప్రజలను గొర్రెలు కాసుకోమని, చేపలు పట్టుకోమని, చెప్పులు కుట్టుకోమని చెప్పి.. ఆయన పిల్లలను రాజ్యాలు ఏలాలి, ప్రజా సంపద దోచుకోవాలని చెప్పారని విమర్శించారు. తమ ప్రభుత్వం అలా ఉండదని, పేదరికం రూపుమాపే, తలరాతను మార్చే శక్తి ఉన్న విద్యను అందించడంపై దృష్టి పెడుతోందని తెలిపారు. కొందరు నాయకులకు పేదరికం ఎక్స్కర్షన్ వంటిదని, కానీ తనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేదరికంలోనే పుట్టి, అందులోనే పెరిగామని చెప్పారు. అది తమ జీవన విధానంలో ఓ భాగమని అన్నారు. తల్లులూ సంతోషంగా ఉన్నారా?!చండ్రుగొండ: ‘తల్లులూ.. సంతోషంగా ఉన్నారా? మేం వచ్చాక రేషన్‌కార్డులు, సన్న బియ్యం ఇచ్చాం.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. మీ ఊర్లో ఎందరికి ఇళ్లు వచ్చాయి?’అని చండ్రుగొండ మండలం బెండాలపాడులో గృహప్రవేశాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మహిళలను ఆరా తీశారు. సీఎం ప్రశ్నకు మహిళలంతా ముక్తకంఠంతో 310 మందికి వచ్చాయని సమాధానం చెప్పారు. దీంతో సీఎం స్పందిస్తూ ‘మీ కళ్లల్లో సంతోషమే మీరు ఎంత ఆనందంగా ఉన్నారో చెబుతోంది’అని అన్నారు. మీ ఇంటి మంత్రి ఎవరు? అని సీఎం ప్రశ్నించగా.. ఆదివాసీ మహిళలు ‘పొంగులేటి అన్న’అని చెప్పారు. ‘దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఇళ్లు కట్టుకుంటే.. మళ్లీ ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలతో కళ కనిపిస్తోంది’అని సీఎం తెలిపారు. బెండాలపాడులో బచ్చల రమణ, బచ్చల నరసమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేయించిన సీఎం పూజ చేశారు. ఇల్లు రావడమే గొప్ప అనుకున్నాం.. ఇందిరమ్మ ఇల్లు రావడమే గొప్ప అనుకున్నా. అలాంటిది ఇంటి నిర్మాణం పూర్తి కావడం.. స్వయంగా ముఖ్యమంత్రి మాకు బట్టలు పెట్టి గృహప్రవేశం చేయించడాన్ని నమ్మలేకపోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మేలు మరిచిపోలేము. సీఎం సార్‌ను శాలువాతో సన్మానించాం. నా కూతురు ఝాన్సీ, ఆమె బిడ్డ వెన్సికతో సీఎం మాట్లాడి పేర్లు అడిగారు. – బచ్చల నరసమ్మ, లబ్దిదారు, బెండాలపాడు ఈ సంతోషం మాకెప్పటికీ పదిలం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మా ఇంటికి వచ్చి మాతో గృహప్రవేశం చేయించడం ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని జీవితకాలం పదిలంగా గుండెల్లో దాచుకుంటాం. మా ఇంట్లో సీఎం రేవంత్‌రెడ్డి పూజ చేశారు. మేము వండిపెట్టిన పాయసం, గారెలు తిన్నారు. ఇలాంటి పాలన ఉంటే పేదల బతుకులు మారినట్లే. – బచ్చల రమణ, లబి్ధదారు, బెండాలపాడు -
Kavitha: నేను చాలా మొండి దాన్ని
-
Kavitha: నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వీళ్లే కారణం
-
గులాబీ బాస్.. రిలాక్స్!
సాక్షి, హైదరాబాద్: తన తండ్రిపై ఎంతో ఒత్తిడి నెలకొని ఉండొచ్చని, అందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటారని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఒకవైపు కవిత ప్రెస్‌మీట్ పెట్టి సంచలన ఆరోపణలు, కీలక చేసిన వేళ.. ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రం రిలాక్స్‌గా గడిపారు. సెప్టెంబర్ 1వ తేదీన కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి హరీష్‌రావు, సంతోష్‌రావులే కారణమని ఆరోపించడం కలకలం రేపింది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సీనియర్లకు, పార్టీ కేడర్‌కు కోపం తెప్పించింది. దీంతో ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో ఎడతెరిపి లేకుండా బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. బుధవారం ఉదయం నుంచి కూడా భేటీ జరుగుతుండగా.. కవిత ప్రెస్‌మీట్ సమయంలో మధ్యలోనే ఆయన బయటకు వెళ్లారు. కారులోనే వ్యవసాయ క్షేత్రం చుట్టూ తిరిగి పొలాలను చూసొచ్చారు. తిరిగి ఫామ్‌హౌజ్‌కు వచ్చి నేతలతో భేటీ కొనసాగించారు. -
రామన్నా.. కేసీఆర్, పార్టీని కాపాడండి: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ కుమార్తె కవిత రాజీనామా చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్‌రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో వారి నుంచి పార్టీని కాపాడాలని కేసీఆర్, కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం కాపాడాలని ఆవేదనతో చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా కుటుంబాన్ని విచ్చిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలని కొందరు ఎదరుచూస్తున్నారు. నాపై కుట్రలు జరిగాయి. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు.బంగారు తెలంగాణ అవుతుందా?కేసీఆర్‌పై నాకెందుకు కోపం. నా తల్లితో నేను మాట్లాడలేకపోతున్నాను. అదే నా బాధ. తల్లితో మాట్లాడకుంటే ఎలా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుసు. నా తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని ఓనమాలు నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడా. స్వతంత్ర భారతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. చెప్పింది చెప్పినట్లు ఆయన చేశారు. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అది సామాజిక తెలంగాణ కాదా? నేనేమైనా తప్పు మాట్లాడానా? సామాజిక తెలంగాణ భారత రాష్ట్ర సమితి అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ అంటే హరీశ్‌రావు, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే అవుతుందా?.నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. నాకైతే అనుమానమే. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారు. హరీష్, రేవంత్ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. నాన్న.. ఇప్పటికైనా మేలుకోండి. నాన్న, రామన్నా.. జాగ్రత్తగా ఉండండి. పార్టీని కాపాడండి’ అని వ్యాఖ్యలు చేశారు. చివరగా.. జై కేసీఆర్, జై తెలంగాణ అని నినాదం ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని వర్గాలతో మాట్లాడి, భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. -
కేటీఆర్ సహా పార్టీ నేతలతో కేసీఆర్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం వేళ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌తో కేటీఆర్ సహా పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజా రాజకీయా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కవిత మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నార అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. -
బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా
ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం హైలైట్స్.. 👉పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి కవిత రాజీనామా చేశారు. ఇదే సమయంలో తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. 👉అక్రమ కేసుల్లో నేను జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను తప్ప.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నా సస్పెన్షన్ వార్తలను మీడియాలో చూశాను. సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీ వ్యతిరేకమా?. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. కోట్లలో ఒక్కరు కేసీఆర్.. 👉కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నాను. పని గట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేశారు. నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. కేసీఆర్ లాంటి తండ్రి కోట్లలో ఒక్కరు ఉంటారు. అలాంటి వ్యక్తి నాకు తండ్రిగా ఉన్నారు. అది నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా నా తల్లితో కూడా నేను మాట్లాడటం లేదు. ఆమెను కలవలేకపోతున్నారు. ఇలాంటి కష్టం ఏ బిడ్డకు రాకూడదు. ఇద్దరు వ్యక్తులు నా కుటుంబాన్ని విచ్చినం చేశారు. నాశనం చేయాలని చూశారు. విధి అనేది ఒక్కటి ఉంది. కచ్చితంగా వారికి కాలమే సమాధానం చెబుతుంది. తప్పకుండా అనుభవిస్తారు. రేవంత్‌తో కలిసి హరీష్ కుట్రలు.. 👉నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. హరీష్ రావు, సంతోష్‌రావు ఇంట్లో ఉన్న బంగారంతో సామాజిక తెలంగాణ అయితదా?. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్‌కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి నన్ను బయటపడేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్న కుట్ర ఇది. రేపటి రోజు రామన్నకు ప్రమాదమే.. 👉రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారు. హరీష్, రేవంత్ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. రేవంత్, హరీష్ కుమ్మకై నాపై కుట్రలు చేశారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చినప్పుడు మంత్రి హరీష్‌రావే కదా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లకు హరీష్ డెయిరీ నుంచి పాల పంపిణీ జరిగింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా?. 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడగరా?. నన్ను సస్పెండ్ చేసినా.. పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది. హరీష్ వల్లే ఓటములు.. 👉హరీష్ ట్రబుట్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. ట్రబుట్ క్రియెట్ చేసి దీన్ని సాల్వ్ చేసినట్టు చెప్పుకుంటారు. మీడియా మేనేజ్మెంట్లో హరీష్ సూపర్. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు. ఆయన ఫండింగ్ చేసిన వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను ఓడించడానికి సిరిసిల్లకు 60 లక్షలు పంపారు. తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి డే-1 నుంచి హరీష్ రావు లేరు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్‌రావు వద్దన్నారు. తొమ్మిది, పది నెలల తర్వాత వచ్చారు. హరీష్ రావు నక్క జిత్తులను గమనించండి. నిజామాబాద్‌లో నా ఓటమిలో కూడా కుట్రలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను కూడా ఓడించే ప్రయత్నం చేశారు. ఇందులో సంతోష్ రావు హస్తం కూడా ఉంది. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపునకు కూడా హరీషే కారణం. హరీష్ వల్లే రఘునందన్ రావు, ఇతర కీలక నేతలు బయటకు వచ్చారు. దుబ్బాకలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇలాంటివి చాలానే జరిగాయి. జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు కూడా పార్టీ వీడింది హరీష్ రావు వల్లే. ఆరడుగుల బుల్లెట్ ఇప్పుడు నాకు గాయం చేసింది. తర్వాత మీకు గాయం చేస్తుంది. గ్రీన్ ఇండియా పేరుతో సంతోష్ రావు ఓవరాక్షన్.. 👉హరితహారం కేసీఆర్ పెడితే.. గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో నకిలీ కార్యక్రమం చేపట్టాడు. సంతోష్ రావు కూరలో ఉప్పు లాంటి వాడు. చిరంజీవి, ప్రభాస్ లాంటి సినీ నటులను మోసం చేసిన గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేలా చేసి ఫార్టెస్ట్ను కొట్టేద్దామనుకున్నారు. సిరిసిల్లలో ఏడుగురు దళిత బిడ్డలను పోలీసులు ఇసుక వ్యవహారంలో కొట్టడానికి సంతోష్ రావు బాధ్యుడు. ఆయన కారణంగా కేటీఆర్, పార్టీకి నష్టం కలిగింది. సంతోష్ రావుతోనూ రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. తెలంగాణ ఆత్మగా జాగృతి పని చేసింది. బీఆర్ఎస్ పార్టీకి నేనేమీ చేయలేదా?. పార్టీలో నా కాంట్రిబ్యూషన్ లేదా?. హరీష్, సంతోష్లదే ఉందా?. వాళ్లు మేకవన్నె పులులు నాన్న. కలికాలం కాబట్టి వాళ్ల టైమ్ నడుస్తోంది. బీఆర్ఎస్ హార్డ్ వేర్ అయితే.. జాగృతి సాఫ్ట్వేర్ అని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరను.. 👉చివరగా.. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలో గానీ చేరడం లేదన్నారు. తన భవిష్యత్ గురించి జాగృతి నేతలు, బీసీ నాయకులు, అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. -
కవిత సస్పెన్షన్.. కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు.. బీఆర్ఎస్ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, తక్కెళ్లపల్లి రవీందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. కవిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్..ఆమెను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్! మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ లక్ష్యంగా కవిత చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ, సీబీఐకి అప్పగించాలనే నిర్ణయం నేపథ్యంలో కవిత చేసిన ఆరోపణలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం అర్ధరాత్రి వరకు ఎర్రవల్లి నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరికొందరు సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.. పార్టీ ప్రయోజనాలు, కేడర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కవితపై సస్పెన్షన్ వేటుకు ఆదేశించినట్లు సమాచారం. ఇకపై కవిత చేసే ఆరోపణలు, విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీని ఏకతాటిపై నడిపించడంపై దృష్టి కేంద్రీకరించాలని కేటీఆర్‌ను ఆదేశించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రజల సొత్తు అంటున్న నేతలు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన అన్ని స్థాయిల నేతలు స్వాగతించారు. కేసీఆర్ ఎవరి సొత్తూ కాదని, కవితతో పాటు పార్టీ కేడర్‌కు ఆయన తండ్రి లాంటి వాడని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. పార్టీ కోసం కన్నబిడ్డను కూడా వదులుకున్న నేత కేసీఆర్ అంటూ పలువురు నాయకులు కొనియాడారు. కేసీఆర్ ప్రతిష్టపైనే బీఆర్ఎస్ మనుగడ, 60 లక్షల మంది కేడర్ భవిష్యత్తు ఆధారపడి ఉందనే విషయాన్ని కవిత మరిచిపోయి విమర్శలు చేశారంటూ పలువురు నేతలు ప్రకటనలు విడుదల చేశారు. కేసీఆర్ ప్రతిష్టను మసకబార్చేలా ఆమెను ఎవరో మానసిక ఒత్తిడికి గురి చేసి ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కవిత చేసిన ఆరోపణలు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు ఊతమిచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. కేసీఆర్‌కు, పార్టీకి బాధ కలిగించే అంశమైనప్పటికీ సస్పెన్షన్ తప్పనిసరి అని పార్టీ అధినేత భావించారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
షాకులిచ్చిన కవితకే బిగ్ షాక్!
గీత దాటితే బహిష్కరణలే తప్ప మరొకటి ఉండని పార్టీ.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న సంచలన అభియోగం మీద గులాబీ అధినేత కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే.. గతంలో పార్టీ తీసుకున్న చర్యల దృష్ట్యా కవిత బహిష్కరణ తప్పదంటూ ఈ ఉదయం నుంచి జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అలాంటప్పుడు సస్పెన్షన్ వేటుతోనే ఎందుకు సరిపెట్టాల్సి వచ్చింది?.. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా సరే క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. విచారణలు, నోటీసులు, షోకాజ్ల్లాంటివేం లేకుండా నేరుగా కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సాగనంపుతూ వచ్చింది. గతంలో.. గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలె నరేంద్ర, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపైనా బహిష్కరణ వేటే వేసింది. 2021లో ఈటల రాజేందర్పైనా నేరుగా బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. అలాంటిది గత 12 ఏళ్లుగా పార్టీలో మూలనపడిన క్రమశిక్షణ కమిటీని తెర మీదకు తెచ్చి మరీ.. కవితను సస్పెండ్ చేయడం ఆశ్యర్యానికి కలిగిస్తోంది. కిందటి ఏడాది ఆగస్టులో.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలుకు వెళ్లొచ్చాక కవిత కొంతకాలం పాటు వ్యక్తిగత జీవితం మీదే ఫోకస్ చేశారు. అయితే.. ఈ ఏడాదిలో క్రియాశీలకంగా మారిన ఆమె 2.0 రాజకీయంతో సొంత పార్టీకే వరుస షాకులు ఇస్తూ వచ్చారు.షాక్ నెంబర్ 1..పార్టీ ఆవిర్భావ వేడుకలపై విమర్శలతో బహిరంగ లేఖ రాయడం మే నెలలో కలకలం రేపింది. రజతోత్సవ సభ(బీఆర్ఎస్ సస్లివర జూబ్లీ వేడుకలో)లో సాగిన అధినేత ప్రసంగంపై కేడర్ అసంతృప్తిగా ఉందంటూ.. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేసీఆర్ దేవుడేకానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తన తండ్రికి రాసిన లేఖను కొందరు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టారంటూ మండిపడ్డారామె.షాక్ నెంబర్ 2.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చించడం మంచిదికాదన్న సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి... కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని మే 29వ తేదీన జరిగిన మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. ఆపై రెండు రోజులుగా కొత్తగా తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బంజారాహిల్స్‌లో ప్రారంభించారు. అంతేకాదు.. ఈ ఏడాది కేటీఆర్ చేతికి కవిత రాఖీ కూడా కట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.షాక్ నెంబర్ 3..కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు విచారణ నోటీసులు ఇవ్వడంపై నిరసనగా.. జూన్ 10వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారామె. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తిగా దూరంగా ఉంది. షాక్ నెంబర్ 4..జూన్ 16వ తేదీన.. ఫార్ములా ఈకార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరైతే.. అదేరోజు అదేంపట్టనట్లు జగిత్యాలలో ఆమె పర్యటించారు. షాక్ నెంబర్ 5..జులైలో.. జహీరాబాద్‌లో జరిగిన బీసీ రిజర్వేషన్ల సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఆమె వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మండలి చైర్మన్‌కు ఆమె మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. అయితే ఇంత జరిగినా.. బీఆర్ఎస్ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది. షాక్ నెంబర్ 6..బీఆర్ఎస్ కేడర్‌ను అయోమయానికి గురిచేసిన పరిణామం ఇది. జులై 26వ తేదీన ఉప్పల్‌లో కేటీఆర్ బీఆర్ఎస్వీ సభ, కొంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కవిత నిర్వహించారు. షాక్ నెంబర్ 7..పార్టీతో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల సాధనాదీక్ష చేపట్టారు. జై బీసీ.. జై జాగృతి నినాదాలు చేశారుషాక్ నెంబర్ 7..ఆగష్టు 5వ తేదీన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ను నాశనం చేసిన లిల్లీపుట్ నేత వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. షాక్ నెంబర్ 8.. కాళేశ్వరంపై బాంబ్ పేల్చారామె. హరీష్‌రావు, సంతోష్ రావుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిపై సీబీఐ ఎంక్వైరీనా?అంటూ రగిలిపోయిన ఆమె.. ఇంతదాకా వచ్చినా పట్టనట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. ఈ వరుస షాకులిస్తున్నా.. తనపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆమె విమర్శలకు మరింత పదును పెట్టారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను అధినేత కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కవితపై కఠిన చర్యలే ఉండాలని సీనియర్లు పలువురు కేసీఆర్ వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే జాగృతి సుదీర్ఘంగా బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతుండడం.. కవిత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. కవితపై తీసుకోబోయే చర్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై తీవ్రంగా చర్చించారు. చివరాఖరికి సస్పెండ్ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు.. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా.. బీఆర్ఎస్లో 2025 ఏడాది కల్వకుంట్ల కవిత కల్లోలనామ సంవత్సరంగా మిగిలిపోనుంది. -
షోకాజ్ నోటీసు ఇస్తారా? వేటు వేస్తారా?
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కీలక భేటీ నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న చర్చల దృష్ట్యా కవితపై చర్చలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.కాళేశ్వరంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి హరీష్‌రావు, సంతోష్‌రావులే కారణమంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల తర్వాత నిన్న సాయంత్రం నుంచి కీలక నేతలతో సమావేశం జరుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు యూకే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.నిన్న అర్ధరాత్రి ఫామ్‌హౌజ్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్ ఈ ఉదయం మళ్లీ అక్కడకు చేరుకున్నారు. కేటీఆర్‌తో పాటు జగదీష్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. కవిత వ్యాఖ్యలపై పలువురు సీనియర్లతో పాటు కేడర్ కూడా గుర్రుగా ఉంది. మొన్నీమధ్యే బహిరంగ లేఖ పేరిట కేటీఆర్ పైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో కవితపై కేసీఆర్ చర్యలకు సిద్ధమవుతున్నారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే వ్యాఖ్యలకుగానూ షోకాజ్ నోటీసులు ఇస్తారా? లేదంటే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా?.. చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ.. వేటు వేస్తే తలెత్తే పరిణామాలపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఒకవేళ కవితపై వేటు పడితే.. జాగృతిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎటు వైపు ఉంటారు? అనే కోణంలోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాళేశ్వరం నివేదిక.. సీబీఐ విచారణకు ఆదేశం దరిమిలా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో హరీష్‌రావుపై వ్యాఖ్యలకు నిరసనగా కవిత దిష్టిబొమ్మను దగ్దం చేయడం గమనార్హం. -
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ
-
కాళేశ్వరం కథలో బిగ్ ట్విస్ట్ కవితపై కేసీఆర్ సీరియస్
-
కాళేశ్వరం సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేకులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్పల్ప ఊరట లభించింది. కాళేశ్వరం సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా.. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్‌రావు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సుందరం, శేషాద్రిలు తమ విజ్ఞప్తిని కోర్టుకు తెలియజేశారు. అయితే.. ఈ కేసును సీబీఐకి ఇవ్వనున్నట్లు అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ‘‘కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఆధారంగా సీబీఐకి సిఫార్సు చేశాం. మొత్తం దర్యాప్తు చేయాలని సీఐబీని కోరాం కమిషన్‌తో సంబంధం లేకుండానే సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ’’ అని ఏజీ అన్నారు. ఈ క్రమంలో సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను కోర్టుకు అందజేశారాయన.దీంతో కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే దసరా వెకేషన్ తర్వాత ఈ పిటిషన్లపై వాదనలు వింటామని పేర్కొంటూ.. అప్పటిదాకా ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని ఏజీకి స్పష్టం చేసింది. ఈ పిటిషన్ల తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం ఓ లేఖ రాసింది. కాళేశ్వరంతో పాటు అంతరాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రేమయంపైనా విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని సైతం లేఖలో వెల్లడించింది. ఇంకా ఆ లేఖలో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించిందని.. ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ కూడా విచారణ జరిపి లోపాలను గుర్తించిందని తెలిపింది. ఎన్డీఎస్ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు రాష్ట్రానికి సీబీఐ రాకుండా గతంలో ఉన్న ఆదేశాలను సడలిస్తూ జీవో విడుదల చేసింది. సీబీఐ విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈలోపు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తునకు బ్రేకులు పడ్డట్లయ్యింది. -
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్!
సాక్షి,హైదరాబాద్: ‘కాళేశ్వరం పాపం హరీష్‌రావు,సంతోష్‌రావుదేనంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు షాకిచ్చారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్లను అన్ ఫాల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సైతం హరీష్‌రావుకు మద్దతు పలుకుతూ ‘సింహం సింగిల్‌గానే’ వస్తుందని ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది. హరీష్‌రావు,సంతోష్‌రావుపై కవిత ఘాటు కామెంట్లు చేశారు. ఆ కామెంట్ల తర్వాత కొద్ది సేపటికే హరీష్‌రావుపై బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. హరీష్‌రావు ఆరడుగుల బుల్లెట్టంటూ పోస్టు పెట్టింది. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ ఓ వీడియోను షేర్ చేసింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్వో నవీన్‌ను తొలగించింది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి రోజువారి పార్టీ కార్యచరణను పీఆర్వో నవీన్ బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. హరీష్‌రావుపై వ్యాఖ్యల తరువాత కవిత పీఆర్వో నవీర్‌ను గ్రూప్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తొలగించింది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున కవిత సోషల్ మీడియా అకౌంట్లకు అన్‌ఫాలో చెబుతున్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్‌రెడ్డి,పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ప్రశాంత్‌రెడ్డి ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు. వీరి భేటీలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ,ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. LIVE: Addressing media https://t.co/C9qlcEwUnc— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 1, 2025 -
MLC Kavitha: మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు.. కడుపు రగిలిపోతోంది
-
‘ఇది ఆరడుగుల బుల్లెట్టు’.. హరీష్‌రావుకు మద్దతుగా బీఆర్ఎస్
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మాజీ మంత్రి హరీష్‌రావు అవినీతికి పాల్పడ్డారంటూ ఆపార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. హరీష్‌రావుకు అండగా నిలిచింది. సింహం సింగిల్‌గా వస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించిన హరీష్ రావు వీడియోను ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఇది ఆరడుగుల బుల్లెట్టు.. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు అని కామెంట్స్ పెట్టింది. ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish pic.twitter.com/RT0NtpsgJe— BRS Party (@BRSparty) September 1, 2025 -
కాళేశ్వరంపై బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ బద్నాం కావడానికి బీఆర్ఎస్ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్‌రావుది మేజర్ పాత్ర లేదా? హరీష్ రావు,సంతోష్ వెనక సీఎం రేవంత్ ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది.ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు. నష్టం జరిగినా సరే నేను ఇలాగే మాట్లాడతా. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్‌కు మరక అంటడానికి ఇద్దరు, ముగ్గురే కారణం. హరీష్‌రావు,సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌పై అవినీతి మరక. ఇలాంటి వారిని ఎందుకు భరించాలి. కేసీఆర్‌కు అవినీతి మరక ఇలాంటివాళ్ల వల్లనే వచ్చింది. కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ బంద్‌కు పార్టీ ఎందుకు పిలుపునివ్వలేదు?.ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి. కానీ పార్టీ ఇలా ఉండటం ఏంటి?.కేసీఆర్‌పై విచారణ వేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత?.కేసీఆర్‌కు ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఎందుకండి?’.వీళ్లు సొంత వనరులు,ఆస్తులు పెంచుకోవడం కోసం ఇలా చేశారు. దమ్ముంటే హరీష్‌రావు,సంతోష్‌రావులపై చర్యలు తీసుకోండి.ఇరిగేషన్ శాఖ అధికారుల వద్ద వందలకోట్లు దొరికాయి. ఆ అధికారుల వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయండి. ఎవరో ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాదు. పిచ్చివాగుడు వాగితే తోలుతీస్తా. కాంప్రమైజ్ అయ్యే ప్రస్తక్తిలేదు. పార్టీ ఓటమికి కారణం కేసీఆర్ వెంట ఉన్నవాళ్లే’ అని ఆవేశంతో మాట్లాడారు. -
కేసీఆర్ ఫామ్ హౌస్ కు BRS నేతలు..
-
ఎర్రవల్లికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. కేసీఆర్‌తో కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్నారు. కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక, పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం. -
కల్వకుండా చేసే కుటుంబమది!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబం రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాలు సుహృద్భావంతో కలిసిపోకుండా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించటం కల్వకుంట్ల కుటుంబానికి ఇష్టంలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ట పరిమితిని ఎత్తివేసేందుకు ప్రతిపాదించిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ చేసిన విమర్శలకు సీఎం రేవంత్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘అది కల్వకుంట్ల కాదు.. ఎవరినీ కల్వకుండ చూసే కుటుంబం. బీసీలు, ఓసీలు కలవొద్దు.. ఎస్సీలు, ఎస్టీలు కలవొద్దు.. హిందువులు, ముస్లింలు కలవకుండా చూసే కుటుంబం అది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సంతోషంగా ఉండేవారిలో మొదటి వరుసలో తాను ఉంటానని గంగుల కమలాకర్ అన్నారు. కానీ వాళ్ల నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సంతోషంగా ఉంటారని చెప్పలేదు. వాళ్ల నాయకులు కడుపునిండా విషం పెట్టుకుని ఉన్నారని చెప్పకనే చెప్పారు’అని దుయ్యబట్టారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. హైకోర్టు ఆదేశాలను అనుసరించే రాష్ట్రంలో కుల గణన నిర్వహించామని సీఎం తెలిపారు. ‘బీసీల గణన బాధ్యతను తొలుత రాష్ట్ర బీసీ కమిషన్‌కు అప్పగించగా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఆ ప్రక్రియ చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరుక్షణమే డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి కుల గణన నిర్వహించాం. ఎలాంటి అడ్డంకులు రాకూడదనే అధికారుల కమిటీని, మంత్రులను ఇతర రాష్ట్రాలకు పంపి సమాచారాన్ని సేకరించాం. న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించిన తరువాతనే డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాం. ఈ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4న పూర్తిచేశాం. 365 రోజుల్లోనే పకడ్బందీగా చట్టాన్ని చేసి స్థానిక సంస్థల్లో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మంత్రివర్గ తీర్మానం చేసి శాసనసభలో ఆమోదించుకుని.. విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్‌కు పంపించాం. గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు. 5 నెలలుగా ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. సెపె్టంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది’అని సీఎం గుర్తు చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా లాబీయింగ్ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని గత ప్రభుత్వం 2018, 2019లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు గుదిబండగా మారాయి. అందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్‌కు పంపించాం. ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ఆయన (గవర్నర్) ఆర్థిక మంత్రి. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి (ఈటల రాజేందర్)గా పనిచేసిన ఆయనతో మితృత్వం ఉంది. రాష్ట్రపతికి పంపించాలని తెరవెనుక లాబీయింగ్ చేస్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి వద్దకు పోయింది. ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు కాబట్టి అత్యవసరంగా ఆ బిల్లును సభలో ఆమోదించుకుందాం అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. బీసీ కమిషన్‌కు ఇచ్చిన జీఓనైనా, డెడికేటెడ్ కమిషన్‌కు ఇచ్చిన జీఓనైనాం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆకాంక్షతోనే ఇచ్చాం’అని సీఎం స్పష్టం చేశారు. ఐదుసార్లు కోరినా ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. పెండింగ్ బిల్లులపై సంప్రదించేందుకు ఐదుసార్లు ప్రధానికి లేఖ రాసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకే ప్రధాని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, గంగలు కమలాకర్ అటువైపు కన్నెత్తి చూడలేదని.. అంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ల పార్టీ నాయకుడు సిద్ధంగా లేరని అర్థమవుతోందని ఆరోపించారు.బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ తన పలుకుబడితో ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. ‘రాహుల్‌గాంధీ ధర్నాకు రాలేదని గంగుల అన్నారు. రాహుల్‌గాంధీ చెప్పకపోతే ఇంత ముఖ్యమైన పని నేను చేస్తానా? రాహుల్‌గాం«దీకి తెలియకుండా ఏదీ చేయను. వందేళ్లుగా చేయని పనిని మేం చేస్తే.. కేసీఆర్ సభకు వచ్చి మమ్మల్ని అభినందించి ఉంటే పెద్దరికం పెరిగి ఉండేది. వారేమో రారుం..వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు’అని సీఎం మండిపడ్డారు. -
కాళేశ్వరం నిర్ణయాలన్నీ కేసీఆర్‌వే!
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని, అందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలని తీసుకున్న నిర్ణయం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరిదేనని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఆయనదే. ప్రాజెక్టు అంకురార్పణ దశ నుంచి ప్రతి నిర్ణయాన్ని ఆయనే స్వయంగా తీసుకున్నారు.డీపీఆర్‌ల తయారీ వ్యాప్కోస్‌కు అప్పగింత, తుది డీపీఆర్ అందకముందే అంచనాలను తయారు చేసి ఆమోదించడం, బరాజ్‌లలో నీరు నిల్వ చేయాలని ఆదేశించడం, కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించేలా నిబంధనలు మార్చాలని ఆదేశించడం వెనక ఆయన నిర్ణయాలే ఉన్నాయి. మూడు బరాజ్‌ల నిర్మాణానికి ప్రణాళికలు, నిర్మాణం, నిర్వహణలో నాటి సీఎం సూక్ష్మంగా భాగస్వాములయ్యారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ మార్చాలనే నిర్ణయం ఆయనదే.రాజకీయ కార్యనిర్వాహకుడిగా వ్యవహరించాల్సిన నాటి సీఎం.. పాలనాఅధికారిగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ఆయనపై తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ సర్కారుకు ఉంది’అని కమిషన్ సిఫారసు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ఆదివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నివేదిక 665 పేజీలతో 3 సంపుటిలుగా ఉంది. నాటి ఆర్థిక మంత్రి (ఈటల) తన బాధ్యతలను ఆదమరిచి నాటి సీఎం కోరికలు తీర్చుకునేందుకు సహకరించారని తప్పుబట్టింది. నివేదికలోని ముఖ్యాంశాలుమంత్రివర్గ ఆమోదం లేకుండానే : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణానికి 2016, మార్చి 1న మూడు జీవోలు (నెం.231, 232, 233) జారీ చేశారు. ఆ తర్వాతి దశలోనూ మంత్రివర్గం నుంచి ర్యాటిఫికేషన్ పొందలేదు. నాటి సీఎం(కేసీఆర్), మాజీ నీటిపారుదల మంత్రి (హరీశ్) మాత్రమే ఆమో దించారు. ప్రభుత్వ బిజి నెస్ రూల్స్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ పరిపాలనపర అనుమతుల జారీ చేశారు. ⇒ టర్న్ కీ విధానంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని వ్యాప్కోస్ చేసిన సిఫారసులను కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కైఐపీసీఎల్) విస్మరించింది. ప్రాజెక్టు రూపకల్పన, మదింపు, ఆమోదించడం, నిధుల విడుదల, అమలు బాధ్యత, నిర్వహణ, పర్యవేక్షణ, మూల్యాంకనానికి కేఐపీసీఎల్‌ను ఏర్పాటు చేయగా, ఈ ప్రక్రియల్లో కేఐపీసీఎల్‌ను ప్రభుత్వం భాగస్వామ్యం చేయలేదు. కేవలం నిధుల సేకరణ, బ్యాంకులు, ఆర్థిక సంస్థ నుంచి రుణాల సమీకరణ, నిర్మాణ సంస్థలకు బిల్లుల చెల్లింపులకే కేఐపీసీఎల్‌ను సర్కారు పరిమితం చేసింది. ⇒ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు అనేక మార్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చారని నీటిపారు దల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి చెప్పారు. నాటి సీఎం అధ్యక్షతన నిపుణులతో నిర్వహించిన చాలా సమావేశాల్లో కట్టడాల రకం, వాటి సామర్థ్యం, లొకేషన్, ప్లాన్ అలైన్‌మెంట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి గూగు ల్ మ్యాప్‌లను విస్తృతంగా వినియోగించారు. ‘2015, ఫిబ్రవరి 4న మహారాష్ట్ర, ఏపీతో జరిగిన భేటీలో తమ్మిడిహెట్టి బరాజ్ ఎత్తు తగ్గించే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. 2016, ఆగస్టు 23న జరిగిన భేటీలో.. మేడిగడ్డ బరాజ్ ఎత్తు పెంపుపై వాస్తవ ముంపు మేరకు అంత్రరాష్ట్ర బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని నిర్ణయించారు. ⇒ 2016, మార్చి 1న మూడు బరాజ్‌ల నిర్మాణానికి జీవోలు జారీ అయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌ల నిర్మాణానికి హైపవర్ కమిటీ సిఫార్సు చేయలేదు. ⇒ తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ వద్ద బరాజ్‌ల నిర్మాణంతో లాభనష్టాలను నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం సరికాదని, ఆర్థికంగా ప్రయోజనకరం కాదని సూచించింది. ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద నిర్మాణం చేపట్టాలని ప్రత్యామ్నాయం చూపింది. ఈ నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోగా, కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. ఇది ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. ⇒ 2016, మార్చి 7న జీవో నంబర్ 655 ప్రకారం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌లకు ప్రతిపాదించలేదు. ⇒ 2015, ఏప్రిల్ 13న మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ వరకు డీపీఆర్ రూపొందించే బాధ్యతను వాప్కోస్కు అప్పగిస్తూ రూ.5.94కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేశారు. ఈ నోట్ ఫైల్‌ను నాటి సీఎం, నీటి పారుదల మంత్రి ఆమోదించారు. అదే ఏడాది జూన్ 3న దీన్ని కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే 2016 జనవరిలో అంచనాలను రూ.6.77 కోట్ల పెంచారు. ⇒ ఎల్లంపల్లి–మేడిగడ్డ మధ్య రెండు బరాజ్‌ల నిర్మాణానికి డీపీఆర్ తయారీ కోసం 2016 మార్చిలో రూ.12.96 కోట్లతో వ్యాప్కోస్‌కు పనులు అప్పగి స్తూ పరిపాలన అనుమతులిచ్చారు. వాప్కోస్ డీపీఆర్ సమర్పించిందా? లేదా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. ⇒ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, 3 విద్యుత్ కేంద్రాలకు సంబంధించి డీపీఆర్‌లోని కొంత భాగాన్ని జనవరి, 2016లో.. మార్చి 27న తుది డీపీఆర్ సమర్పించింది. ⇒ అనుమతులు జారీ చేసి తర్వాతి జూలై/ఆగస్టు నెలల్లో కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. 2017 ఫిబ్రవరిలో డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపించారు. ⇒ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు నీటిలభ్యతపై 2015 లో, కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత విషయంలో 2017లో సీడబ్ల్యూసీ రాసిన లేఖల్లో అంశాలు ఒకే లా ఉన్నాయి. 2015లో సీడబ్ల్యూసీ రాసిన లేఖ ఆధారంగా తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాధ్యం కాదని భావనకు వస్తే.. 2017లో రాసిన లేఖ ఆధారంగా మేడిగడ్డ బరాజ్ నిర్మాణం సైతం సాధ్యం కాదు. ⇒ 2018, మే 1 నాటికి సీడబ్ల్యూసీ కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక వ్యయాన్ని ఆమోదించకుండా అధ్యయనం జరుపుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2018, మార్చిలో ప్రాజెక్టు అంచనాలను రూ.30,623.72 కోట్ల నుంచి రూ.80,190.46 కోట్లకు పెంచేసింది. ⇒ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందే సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్‌తో అధ్యయనం జరిపించాల్సి ఉండగా, పనులు తు దిదశలో ఉన్నప్పుడు జరపాల్సిన అవసరం లేదని ఈ విభాగ డైరెక్టర్ 2018, మే 21న లేఖ రాశారు. ⇒ సీడబ్ల్యూసీ నుంచి అవసరమైన అనుమతులు పొందకుండానే, ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనకు దర ఖాస్తు చేసుకోకుండానే 2016, మార్చి 1న పరిపాలన అనుమతులు మంజూరు చేయడమే కాకుండా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ⇒ సవరించిన పరిపాలన అనుమతులపై సీఎం, మంత్రి ముందు నోట్‌ఫైల్ ఉంచడానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ 2018, మే 19న ఆమోదం తెలిపారు. అత్యవసర దృష్ట్యా ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. అదే నెల 27న కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ముందస్తు ఆమోదం లేకుండా అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడ్డారు.⇒ నిర్దేశిత గడువుతో పోల్చితే మేడగడ్డ నిర్మాణానికి 6 రెట్లు, అన్నారానికి 5 రెట్లు, సుందిళ్లకు 8 రెట్లు సమయం ఇచ్చారు. సైట్ అప్పగింత, డిజైన్ల కారణంగానే ఆలస్యం జరిగిందని కాంట్రాక్ట్ సంస్థల వాదనకు అధికారులు అంగీకారం తెలిపారు. ఒప్పందంలోని క్లాజ్ 26, 31లను అధికారులు ఉల్లంఘించారు. ఆలస్యమైనా ఎలాంటి జరిమానా విధించలేదు. 2017, మార్చి వరకు నిర్మాణ స్థలాన్ని అప్పగించలేదు. ⇒ ఫీల్డ్ అధ్యయనాలు, పరిశోధనలు చేపట్టకుండానే బ రాజ్‌ల డిజైన్లను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ త యారు చేసింది. డిజైన్ల తయారీకి ముందు కనీసం 3డీ, 2డీ మోడల్ స్టడీస్ కూడా నిర్వహించలేదు. ⇒ బరాజ్‌ల పేరుతో నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు/డ్యామ్స్‌గా నిర్మించారు. నీటిని మళ్లించేందుకు విని యోగించే బరాజ్‌లను నీటిని నిల్వ చేసే అవసరాలకు వాడినట్టు అధికారులు అంగీకరించారు. కాని వాటిని రిజర్వాయర్లు/డ్యామ్‌లుగా డిజైన్ చేయలేదు. ఈ కారణంతోనే అవి విఫలమయ్యాయి. ⇒ క్వాలిటీకి సంబంధించి కమిషన్‌కు సమర్పించిన రిజిస్టర్లు, పుస్తకాల్లో కొన్ని అదనంగా పేజీలు పిన్ చేయడం, కొన్ని టై చేయడం చేశారు. పేజీల సంఖ్య క్రమానుగుణంగానే లేదు. ⇒ 2019, ఆగస్టు 6న మేడిగడ్డ ‘కంప్లీషన్ సరి్టఫికెట్’ జారీ చేయమని ఏజెన్సీ కోరడం..సరి్టఫికెట్ అధికారులు జారీ చేయడం తప్పు. బాధ్యతాలోపం కా లాన్ని ఏజెన్సీ తప్పుగా ప్రస్తావించింది. ఒప్పందం ముగిసిపోయినట్టు ఎలాంటి సరి్టఫికెట్ జారీ కానందున మేడిగడ్డ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కానట్టే లెక్క. దీని కారణంగా లోపాలకు బాధ్యతాకాలం, ఆపరేషన్, నిర్వహణ కాలం నిర్ధారించలేదు. ⇒ అధికారులు, ఏజెన్సీలు ఒకరితో ఒకరు కుమ్మక్కై దురుద్దేశంతో చెడు మార్గంలో అక్రమ లబ్ధి పొందేందుకు పనిచేశారు. తద్వారా మేడిగడ్డ నిర్మాణానికి ప్రజాధనం భారీగా ఖర్చు చేశారు. ⇒ డీపీఆర్ తయారీని వాప్కోస్కు అప్పగిస్తూ జీవో జారీకి సంబంధించి నోట్‌ఫైల్‌పై నీటి పారుదల మంత్రి , ముఖ్యమంత్రి సంతకాలున్నాయి. జీవో జారీ చేసిన తర్వాత కేబినెట్ ఆమోదించింది. ⇒ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు పరిపాలన అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయగా, నోట్ ఫైల్‌పై వీరి సంతకాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థికమంత్రి సంతకం లేదు. ⇒ పరిపాలన అనుమతి (2016, మార్చి 1) తర్వాతే కేబినెట్ సబ్ కమిటీ (2016, మార్చి 15) ఏర్పాటైంది. 3సార్లు భేటీ అయ్యి నివేదిక అందజేసింది. -
చర్యలన్నీ అప్పుడే.. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. పంచాయతీరాజ్, మున్సిపల్ బిల్లుల సందర్బంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు.. కాళేశ్వరం రిపోర్టుపై ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చర్చ జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం రిపోర్టుపై సాయంత్రం చర్చ జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును హౌస్‌లో ఫ్లోర్ లీడర్లకు హార్డ్ కాపీ ఇచ్చాం. మెంబర్స్ అందరికీ సాఫ్ట్ కాపీనే ఇచ్చాం. సభలో సాయంత్రం చర్చ ఉంటుంది. ఎంత ఆలస్యం అయినా ఈ రోజు సభలో కాళేశ్వరంపై సంపూర్ణ చర్చ జరుగుతుంది. కేసీఆర్ తరఫున హరీష్ రావుకి కాపీ ఇచ్చాం. అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటాం. కోర్టు విషయాలపై మాట్లాడను. సభలోనే అన్ని మాట్లాడతాం. చర్చ తర్వాతనే తదుపరి విచారణ ఏంటి దానిపై నిర్ణయం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
కాళేశ్వరం కమిషన్ నివేదిక.. సీఎం, అధికారులపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారు. ఈ సందర్బంగా కమిషన్ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది.కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రకారం..‘ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నిర్మాణం జరిగింది. మెయింటెనెన్స్ లేకపోవడం కారణంగానే మూడు బ్యారేజీలలో భారీగా డామేజ్ జరిగింది. క్వాలిటీ కంట్రోల్ విషయంలో నిర్మాణ సంస్థలు ప్రభుత్వాన్ని ప్లేట్ చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజీ నిర్మాణాలకు బడ్జెట్ విడుదల అయింది. మూడు బ్యారేజీల ప్లానింగ్, డిజైన్స్, నిర్మాణాన్ని మినిట్ టూ మినిట్ సీఎంకు ఫాలో అప్ చేశారు. మేడిగడ్డ నిర్మాణం కోసం నిపుణుల కమిటీ సిఫార్సు చేయకపోయినా ముఖ్యమంత్రి ఆదేశాలతో మేడిగడ్డ నిర్మాణం జరిగింది. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇతర అంశాలపై క్యాబినెట్ అప్రూవల్ తీసుకోకపోవడం నిబంధనలకు విరుద్ధమే అవుతుంది అని తెలిపింది.ఇదే సమయంలో అధికారులు తప్పిదాలను కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఎత్తి చూపింది. అధికారులు తప్పు చేసినట్లు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు రిపోర్టులో పేర్కొంది. పలువురు చీఫ్ ఇంజనీర్లు కమిషన్ ముందు సరైన ఆధారాలు చూపించలేదని తెలిపింది. కమిషన్ రిపోర్టులో కేసీఆర్ పేరు కాకుండా చీప్ మినిస్టర్ పేరుతో రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలు పెంచి ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. బ్యారేజీల నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదు. అధికారులు జోషి హరిరామ్, మురళీధర్‌పై చర్యలు తీసుకోవాలి అని ఆరోపించింది. -
అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రేపటి(ఆదివారం) నుంచి కాళేశ్వరంపై చర్చ జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీతానేనని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. భయపడే కేసీఆర్ మళ్లీ కోర్టుకు వెళ్లారని కోమటిరెడ్డి అన్నారు.కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే రికార్డు స్థాయిలో కట్టారు.. ఆయన హయాంలోనే కూలింది. కాళేశ్వరంపై వేసిన కమిషన్ జడ్జి.. సుప్రీంకోర్టు జడ్జిగా పని చేశారు. మంచి పేరున్న న్యాయమూర్తి ఆయన. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దానికి భయపడే కేసీఆర్, హరీష్‌రావు కోర్టుకెళ్లారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే.. కేసీఆర్ అసెంబ్లీ వచ్చి చెప్పాలి. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు తీసుకుంటున్నాడు.. బాధ్యత ఆయనపై ఉంటది. కాళేశ్వరంపై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయకుండా మా మీద పూలు చల్లుతారా.? తప్పించుకుని పారిపోతారు.కాళేశ్వరం పూర్తి నివేదిక.. కంప్లీట్‌గా చర్చ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నా.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే.. కాళేశ్వరం విషయంలో తప్పైతే తప్పని బాధ్యతగా ఒప్పుకోవాలి. కేసీఆర్ అసెంబ్లీకి.. వస్తాడని అనుకుంటున్నాం. కాళేశ్వరంపై లక్ష కోట్లు తిన్న వాళ్లను వదిలేస్తామా.?. ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. వాళ్లను ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ 10 ఏళ్లు డిండి, పాలమూరు లాంటి ప్రాజెక్టుల మీద ఎందుకు పెట్టలేదు?’’ అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. -
కాళేశ్వరం నివేదికపై మళ్లీ హైకోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీ.. మరోమారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తోంది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన ఆ పారీ్ట.. మరోమారు మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)ను దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం హైకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది.శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పీసీ ఘోష్ కమిషన్‌పై కోర్టుకు వెళ్లే అంశంపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది.హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ విచారణకు రాకమునుపే అసెంబ్లీలో ఘోష్ కమిషన్ నివేదికను పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ఆదివారం కూడా అసెంబ్లీని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఈ భేటీలో అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ అసెంబ్లీలో నివేదికను ప్రవేశ పెడితే వినిపించాల్సిన వాదనపై ఇప్పటికే హరీశ్‌రావు పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్లు సమాచారం.అయితే, అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ హాజరు కాకపోవటమే మంచిదని పార్టీ నేతలు చెప్పినట్లు తెలిసింది. అసెంబ్లీలో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా కేసీఆర్ హాజరయ్యేదీ లేనిదీ తెలుస్తుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్! పీసీ ఘోష్ కమిషన్‌ను కొట్టేయడం లేదా స్టే కోసం బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉందన్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేవియట్ దాఖలు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆ కేవియట్‌లో కోరినట్లు సమాచారం. బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేస్తే... ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో వాదనలు వినిపిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. వారి సభ్యత్వంపై సందిగ్ధం గవర్నర్ కోటాలో గతేడాది ఆగస్టు 16న ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ప్రొ. కోదండరాం, ఆమేర్ అలీఖాన్‌లు శనివారం నుంచి మండలి సమావేశాలకు హాజరు అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి సభ్యత్వాలను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 13న మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులను పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం న్యాయశాఖకు, అడ్వొకేట్ జనరల్‌కు అప్పగించింది. ఇప్పటివరకు ఈ 2 స్థానాలు ఖాళీ అయినట్లు మండలి చైర్మన్ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అమలు చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం నివేదిక సహా ఇతర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమాచారం కానుంది. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో స్పెషల్ సెషన్‌కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే యోచనలో ప్రభుత్వం ఉంది.ఇదిలా ఉంటే.. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రూపొందించిన నివేదికను అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నివేదికపై చర్చ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో దక్కని ఊరట
-
KCR, హరీశ్ రావు పిటిషన్లు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
కేసీఆర్, హరీష్‌కు హైకోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో స్టే అవసరం లేదని పేర్కొంది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్బంగా పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్, హరీష్ ఇద్దరూ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున ఏజీ చెప్పుకొచ్చారు.హైకోర్టులో ప్రభుత్వం నిర్ణయాన్ని తెలిపిన ఏజీ..కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం వాదనల్లో భాగంగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని కాపీ రూపకంగా అందజేశారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్తామన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో కమిషన్ నివేదికను వెబ్సైట్లలో పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలో వెబ్సైట్లలో నివేదిక ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది. గురువారం జరిగింది ఇదే.. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై నేడు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ విచారణ చేపట్టారు.ఇక, వీరిద్దరి పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడియాకు అందజేశారా?. మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. -
‘కాళేశ్వరం’పై నివేదిక ఎందుకు బయటపెట్టారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడి యాకు అందజేశారా?, మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ, కమిషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో కమిషన్ ఏర్పాటు కేసీఆర్, హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘మేడిగడ్డ బరాజ్‌కు సంబందించిన ప్రతిదీ కేబినెట్, ఇంజనీర్ల సూచనలు, ఆమోదంతోనే జరిగింది. దురదృష్టవశాత్తు అసాధారణ వర్షాలతో ఓ పిల్లర్ కుంగింది. దీనికి డిజైనింగ్, ఇంజనీరింగ్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయినా ప్రభుత్వం రాజకీయ కక్షతో జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చట్ట నిబంధనలు పాటించలేదు. చట్టంలోని నిబంధనలనే కాకుండా, చట్టబద్ధతను, ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించింది. మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, నివేదిక కాపీ ఇవ్వాలని కోరినా ఇప్పటివరకు ఇవ్వకుండా.. పదేపదే మీడియా ముందు మా ప్రతిష్టను దిగజార్చేలా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానిపై అసెంబ్లీలో చర్చించాలని తీర్మానించారు. అసెంబ్లీలో చర్చించకుండానే ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో నివేదికలోని వివరాలు మీడియాకు తెలియజేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీడియా సమావేశంలో నివేదికను బహిర్గతం చేశారు. నివేదికపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సారాంశాన్ని వందలాది అధికారిక, అనధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు సీఎం, మంత్రులు పదే పదే ప్రెస్మీట్లలో బీఆర్ఎస్ పార్టీ, పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ కోసం పాకులాడుతూ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో అప్రతిష్టపాలు చేసేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పిటిషనర్లకు నోటీసులు సైతం సరైన విధానంలో ఇవ్వలేదు. చట్టంలోని సెక్షన్ 8బీ, 8సీ కింద సమన్లు జారీ చేయలేదు. కేవలం సాక్షిగానే నోటీసులిచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సాక్షులు ఇచ్చిన వివరాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటే 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వాలి. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి. ముందస్తు ప్రణాళిక ప్రకారం మా ప్రతిష్టను దెబ్బతీసేలా పక్షపాతంతో, చట్టవిరుద్ధంగా సమర్పించిన నివేదికను రద్దు చేయాలి..’ అని కోరారు. ఈ సందర్భంగా కిరణ్‌బేడీ, ఎల్కే అద్వానీపై కమిషన్లను కొట్టివేసిన కేసులకు సంబంధించిన వివరాలు ధర్మాసనానికి అందజేశారు. ఇద్దరూ శాసనసభ్యులే.. అందుకే అసెంబ్లీలో చర్చ ప్రభుత్వం, కమిషన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘నివేదికపై అసెంబ్లీలో చర్చించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. నివేదిక నేరుగా అసెంబ్లీలో బహిర్గతం చేస్తాం. పిటిషనర్లు ఇద్దరూ శాసనసభ సభ్యులు. ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేల కోట్ల రూపాయల ప్రజా ధనం వెచ్చించి ప్రాజెక్టు నిర్మించారు..’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీజే జోక్యం చేసుకున్నారు. అసెంబ్లీలో చర్చించాలని భావించినప్పుడు నివేదికను మీడియాకు ఎందుకు విడుదల చేశారని ఏజీని ప్రశ్నించారు. ‘నివేదిక ప్రతిని పబ్లిక్ డొమైన్లో పెట్టారా?, పిటిషనర్లకు 8బీ కింద నోటీసులిచ్చారా? నివేదిక ప్రస్తుత స్థితి ఏంటీ? అసెంబ్లీలో ప్రవేశపెట్టారా?’ అని అడిగారు. మీడియాకు ఇవ్వలేదు..పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు మీడియాకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, పబ్లిక్ డొమైన్‌లోనూ పెట్టలేదని ఏజీ బదులిచ్చారు. నివేదికకు కేబినెట్ ఆమోదం తర్వాత రూపొందించిన 60 పేజీల త్రిసభ్య కమిటీ నివేదికలోని వివరాలను మీడియాకు ఇచ్చామని చెప్పారు. 8బీ కిందే పిటిషనర్లకు నోటీసులిచ్చామని తెలిపారు. అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కిరణ్‌బేడీ, ఎల్కే అద్వానీ కేసులు ఇక్కడ వర్తించవని వాదించారు. కాగా, తనకు సమర్పించిన నివేదిక ప్రతి సరిగా కనిపించడం లేదంటూ కొన్ని పాయింట్లు హైలైట్ చేసి ఉండటంపై సీజే అభ్యంతరం తెలిపారు. విచారణను నిలిపివేద్దాం అని అన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తితో విచారణ కొనసాగించారు. వివరాలు స్పష్టంగా ఉన్న కాపీ ఇవ్వాలని వారికి సూచించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకుని చెప్పాలని ఏజీకి సూచిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
కేసీఆర్, హరీష్రరావు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
-
హైకోర్టు కీలక ప్రశ్న.. రేపు చెబుతామన్న ఏజీ
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సాక్షిగా విచారణకు పిలిచి రిపోర్ట్ ఇవ్వలేదని హరీష్ తరఫు లాయర్ అన్నారు. నివేదికలో అంశాలు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్నాయని.. లేఖ రాసినా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. సీఎం ప్రెస్‌మీట్ పెట్టి నివేదికను బయటకు ఇచ్చారన్నారు.కేసీఆర్ తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. పబ్లిక్ డొమైన్లో కమిషన్ రిపోర్టు ఉందని.. ప్రజెంటేషన్ ద్వారా వివరాలు బయటకు ఇచ్చారని కోర్టుకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఘోష్ కమిషన్ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో లేదన్న ఏజీ.. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సి ఉందని.. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్లో పెడతామన్నారు. కౌంటర్ మరిన్ని వివరాలు పొందుపరుస్తామని.. ఈ సమయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొదన్న ఏజీ.. అసెంబ్లీలో చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలని ఏజీ కోరారు.కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు?. నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా? అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా? ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏజీ తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అన్న హైకోర్టుకు.. రేపు సమాధానం చెబుతామంటూ ఏజీ తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు సమాచారం తెలుసుకున్న విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు తెలిపింది. రేపే సమాధానం చెబుతామంటూ ఏజీ తెలపడంతో తదుపరి విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది. -
వేములవాడ రాజన్న సన్నిధిలో కేసీఆర్ సతీమణి (ఫొటోలు)
-
పీసీ ఘోష్ నివేదిక నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను నిలిపివేయాలని కోరు తూ బీఆర్ఎస్ అధినేత కే సీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నివేదిక నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరు తూ కేసీఆర్‌తో పాటు మాజీమంత్రి హరీశ్‌రావు మంగళ వారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం–1952 ప్రకారం ప్రభుత్వం తమకు నోటీసులు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కమిషన్‌కు విచారణార్హత లేదని, నివేదికను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి, కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఘోష్‌ను ప్రతివాదులుగా చేర్చారు. కాపీ ఇవ్వకుండా పదేపదే ఆరోపణలు ‘నివేదిక కాపీని మాకు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 8న లేఖ రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నివేదిక మా పరువుకు నష్టం కలిగించేలా ఉందని ఈ నెల 4న మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించిన విషయాల ద్వారా తెలుస్తోంది. మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, కాపీని ఇవ్వకుండా.. పదేపదే మీడియా ముందు మా ప్రతిష్టను దిగజార్చేలా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఎటువంటి సమర్థనీయమైన ఆధారం లేకుండా అప్రతిష్టపాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రతివాదులు జీవో 6ను జారీ చేశారు. నిబంధనల మేరకే బరాజ్‌లు.. అన్నీ పరిశీలించాకే కేంద్రం అనుమతులు ఏడు జిల్లాలకు తాగు, సాగునీటిని అందించడానికి 160 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించి కాళేశ్వరం ఎత్తిపో తలు పథకానికి నిబంధనల మేరకు రూపకల్పన చేసి నిర్మించాం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడంతో బరాజ్ నిర్మాణాన్ని మరో చోటికి మార్చాలనే నిర్ణయం సహా ప్రతి అంశంపై కేబినెట్ ఆమోదం తర్వాతే చర్యలు చేపట్టాం. 13 జిల్లాలకు నీరందించేలా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద బరాజ్‌లకు ప్రతిపాదనల నుంచి నిర్మాణం వరకు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రం అనుమతి మంజూరు చేసింది’ అని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దురుద్దేశపూరితంగానే కమిషన్ ‘ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ కాళేశ్వరాన్ని అప్రతిష్టపాలు చేస్తూ వస్తోంది. అధిక వర్షపాతంతో మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ కుంగడం దురదృష్టకరం. దీనికి బరాజ్ రూపకల్పన, ఇంజనీరింగ్‌తో సంబంధం లేదు. అయినా బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దు్రష్పచారం ప్రారంభించింది. చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా, దురుద్దేశపూరితంగా న్యాయవిచారణ కమిషన్ నియమించింది. అయినా ప్రజాజీవితంలో సమగ్రత, నిజాయితీకి కట్టుబడి ఉన్నందున కమిషన్ ముందు హాజరయ్యాం. నివేదిక పూర్తయిన తర్వాత మాకు ఇవ్వకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో మీడియాకు విడుదల చేసింది. దీన్ని పరిశీలిస్తే.. నివేదిక ఏకపక్షమని వెల్లడవుతోంది. విచారణ కమిషన్ చట్టంలోని నిబంధనలనే కాకుండా, చట్టబద్ధత, ప్రాథమిక సూత్రాలను కమిషన్ ఉల్లంఘించింది. ఎన్నికల్లో లబ్ధి కోసం..స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి మంత్రులు మా ప్రతిష్టను కించపరిచేలా మీడియా ద్వారా దాడి ప్రారంభించారు. ‘పరిపాలనా అనుమతుల నుంచి నిర్మా ణం వరకు అక్రమాలు జరిగాయి.. అవకతవకలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారే బాధ్యులు.. ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు, వ్యక్తుల నిర్ణయం.. నాటి సీఎం సూచన మేరకే బరాజ్ స్థలాలు ఎంపిక చేశారు.. నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు.. రూ.259 కోట్ల పరిపాలనా ఆమోదాన్ని కేబినెట్ ముందుంచలేదు.. సీఎం, హరీశ్ ఆదేశాల మేరకే జారీ చేశారు.. ఖజానాపై అదనపు భారం పడింది..’ లాంటి వాక్యాలను నివేదికలో పేర్కొనడం పరిశీలిస్తే.. కమిషన్ కావాలనే మాకు వ్యతిరేకంగా విచారణ సాగించినట్లు తేటతెల్లం అవుతోంది.మాతో పాటు నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను బాధ్యుడిగా పేర్కొనడం హాస్యాస్పదం. నివేదికను పరిశీలిస్తే.. పిటిషనర్లపై తప్పుడు భావనతో, ముందస్తు ప్రణాళికతో కమిషన్ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరైన నాటి మంత్రుల వాదనను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్ష నివేదికను రద్దు చేయాలి..’అని పిటిషన్లలో కేసీఆర్, హరీశ్ కోరారు. ఇదీ నేపథ్యం.. ప్రస్తుతం స్రూ్కటినీ దశలో ఉన్న ఈ పిటిషన్లకు రిజిస్ట్రీ నంబర్ కేటాయించాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఇవి సింగిల్ జడ్జి వద్ద విచారణకొచ్చే అవకాశముంది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో నిర్లక్ష్యం, లోపాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరపాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం..2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. జూలై 31న కమిషన్ నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలకు.. కేసీఆర్, హరీశ్, ఈటల కారణమని నివేదిక తేలి్చనట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించగా.. ఈ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
అదిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌ను కలవడానికి సిద్ధం: సీఎం రేవంత్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందన్నారు సీఎం రేవంత్. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో రాష్ట్రపతి పూర్తి చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇక ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఓటింగ్ విషయంలో అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌ను కలవడానికి సిద్ధమన్నారు. మంగళవారం(ఆగస్టు 19వ తేదీ) మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన సీఎం రేవంత్.. ‘ జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఎంపిక చేసింది. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో అదిష్టానం ఆదేశిస్తే కేసిఆర్‌ను కలవడానికి సిద్దం. ఆయన అపాయింట్ మెంట్ ఇస్తడో లేదో.. ఆయనకు నా మొఖం చూడటం ఇష్టం ఉందో లేదో. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంలో నా నిర్ణయం ఏం లేదు ఇండియా కూటమి నిర్ణయం. నేను రెగ్యులర్ ఆయన్ను కలుస్తాను.. మన ఊరాయనా. నేను జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్‌కు వెళతాను’ అని పేర్కొన్నారు. -
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికను కేసీఆర్, హరీష్‌రావు సవాల్ చేశారు. వేర్వేరుగా రెండు రిట్ పిటిషన్లను వారు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో కమిషన్ నివేదిక అదేవిధంగా ఇచ్చిందని.. కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు కేసీఆర్, హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.కాగా, మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం. బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. -
ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఊరట దక్కింది. కవిత విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గతేడాది మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లోనే మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో భాగంగా ఐదు నెలల జైలు శిక్ష అనంతరం కవితకు షరతులమీద బెయిల్ మంజూరైంది. ఆ సమయంలో కవిత తన పాస్‌పోర్టును రౌస్ అవెన్యూ కోర్టులో అందించారు.తాజాగా, గ్రాడ్యుయేషన్ నిమిత్తం తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇందులో భాగంగా తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం పాస్‌పోర్టును విడుదల చేసింది. దీంతో కవిత ఇవాళ అమెరికాకు వెళ్లనున్నారు. 15రోజుల పర్యటన అనంతరం సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఇక అమెరికా పర్యటనకు ముందు కవిత..తన తండ్రి కేసీఆర్‌ను కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు కవితతో పాటు చిన్న కుమారుడు ఆర్య సైతం వెళ్లనున్నారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం, శనివారం ఉదయం అమెరికాకు బయల్దేరనున్నారు. -
కాంగ్రెస్, బీజేపీ కుట్రలను బీఆర్ఎస్ ఎదుర్కోగలదా?
తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితిని బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీలు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ల వైఖరి ఈ అనుమానానికి కారణమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యమిచ్చేందుకు సిట్ అధికారుల వద్దకు వెళ్లిన సందర్బంలో బండి సంజయ్ మీడియా వద్ద చేసిన వ్యాఖ్యలు వీటిని మరింత బలపరుస్తున్నాయి.ప్రత్యర్థులను బలహీనపరిచి తద్వారా తాము బలపడాలని కోరుకోవడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఇందుకు రకరకాల వ్యూహాలూ అమలు చేస్తూంటారు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ వ్యూహాలకు, కుట్రల బారిన పడుతున్నది భారత రాష్ట్ర సమితే. ఒక ప్రాంతీయ పార్టీగా రెండు జాతీయ స్థాయి పార్టీలను ఎదుర్కుంటూ ఉండటం దీనికి కారణం. 2014 నుంచి తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 శాసనసభ ఎన్నికలలో ఓడింది.తొలి టర్మ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య సత్సంబంధాలే ఉండేవి కానీ ఆ తరువాత ఇరువురు దూరమయ్యారు. సొంత జాతీయ పార్టీ యోచనతో కేసీఆర్ మహారాష్ట్రలో శాఖను ప్రారంభించారు. అయితే స్వరాష్ట్రం తెలంగాణలోనే ఓటమి పాలు కావడంతో ఆయన ప్లాన్లు తలకిందులయ్యాయి. దీంతో ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో ఏర్పరచుకున్న సంబంధాలను కూడా పక్కన బెట్టవలసి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా 39 అసెంబ్లీ స్థానాలతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలిగింది. కాని వీరిలో పది మంది కాంగ్రెస్‌లో చేరిపోయారు.ముఖ్యమంత్రి పదవి పొందిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను దెబ్బగొట్టే ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు లావాదేవీలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ వంటి వాటిపై దృష్టి పెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నిటిలో కెసిఆర్ ను ఇరుకున పెట్టే వ్యూహం కనిపిస్తుంది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జ్యుడిషయల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్కు పెద్ద పరీక్ష అయ్యాయి. ఆ పార్టీ పూర్తిగా పరాజయం చెందడంతో లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 సీట్ల చొప్పున విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది. అప్పటి నుంచి బీజేపీకి కూడా తెలంగాణపై ఆశలు పెరిగాయి. ఏ అవకాశం వచ్చినా బిజెపి నేతలు బీఆర్ఎస్పై విరుచుకుపడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు.తాజాగా బండి సంజయ్ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యం ఇవ్వడానికి దర్యాప్తు అధికారుల బృందం ముందుకు వెళ్లి తన అభిప్రాయాలు తెలియచేశారు. ఏమి ఆధారాలు ఇచ్చారో తెలియదు కాని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్, కేటీఆర్‌లు వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేస్తూ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, హరీష్‌రావు, కవితలతోసహా పలువురి పోన్లను టాప్ చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలలో, కేసీఆర్ కుటుంబంలో కలతలు సృష్టించడానికి సంజయ్ ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది.ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, కేటీఆర్‌లను ఈపాటికి జైలులో పెట్టేవాళ్లమని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇది మరీ సీరియస్ కామెంట్. ఎవరినైనా జైలులో పెట్టడానికి నిర్దిష్ట ఆధారాలు ఉండాలి. అవేమి చూపకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం?. సిట్ అధికారులు కూడా కేంద్రమే ఈ కేసు విచారించాలని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఫోన్లను కూడా టాప్ చేశారని అధికారులు సంజయ్ కు చెప్పారని ఒక పత్రిక రాసింది. ఇందులో వాస్తవం ఉంటే కేంద్రానికి, అందులోను హోం శాఖకు తెలియకుండా ఉండదు.కేంద్రంలోని వారి ఫోన్లు టాప్ అయి ఉంటే, దానిని కనిపెట్టడం కాని, సీబీఐకి అప్పగించడం కాని కేంద్రం చేతిలో పనే కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. కానీ బండి సంజయ్ తెలంగాణలో బీఆర్ఎస్ను వీక్ చేయడం కోసం, ఆ పార్టీ నేతలను భయపెట్టడానికి ఈ ఆరోపణలు చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుపొందినా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బాగా పుంజుకుందన్న అభిప్రాయం కూడా ఉంది. దాంతో బీఆర్ఎస్ నేతలు నైతికంగా ఇబ్బంది పడేలా సంజయ్ మాట్లాడి ఉండవచ్చు.దానికి తోడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొందరు సిటింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. మరో విషయం చెప్పాలి. ఏపీకి బీజేపీ ఎంపీ సీ.ఎం.రమేష్‌కు చెందిన కాంట్రాక్ట్ కంపెనీకి రేవంత్ రెడ్డి భారీ కాంట్రాక్టు ఇప్పించారని కేటీఆర్ ఆరోపించారు. ఆ సందర్భంలో రమేష్ రియాక్ట్ అవుతూ తనవద్ద బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదనను కేటీఆర్ చేశారని అన్నారు. కేటీఆర్ దాన్ని ఖండించినా అలాంటి ఆరోపణలు రావడం ఏ పార్టీకి అయినా కాస్త ఇబ్బందికరమైన వ్యవహారమే. సంజయ్ ప్రకటనను కూడా కేటీఆర్ తోసిపుచ్చి క్షమాపణ డిమాండ్ చేశారు.అలా చేయకపోతే లీగల్ నోటీసు ఇస్తానని అన్నారు. సంజయ్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక రూపంలో కేసీఆర్, హరీష్ రావులను చికాకు పెట్టాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. కేసీఆర్‌ను అరెస్టు చేయాలని అనుకోవడం లేదని రేవంత్ అన్నప్పటికీ, పరిణామాలు ఏ వైపు మళ్లుతాయో అప్పుడే చెప్పలేం. వీటన్నిటిని గమనిస్తే, బీఆర్ఎస్ను దెబ్బతీసి, ఆ స్థానాన్ని తాను ఆక్రమించాలని బీజేపీ వ్యూహాలు పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఆ అవకాశం బీజేపీకి రాకుండా చేసి, తనే లాభపడాలని కాంగ్రెస్ సహజంగానే యత్నిస్తుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం ముందున్న సవాలు. ఈ రెండు పార్టీలలో ఏదో ఒకదానితో బీఆర్ఎస్కు సంబంధాలు ఉండి ఉంటే ఈ సమస్యలు అంతగా ఉండేవికావు. దేశవ్యాప్తంగా స్వతంత్రంగా ఉండే ప్రాంతీయ పార్టీలను అణచి వేయడానికి జాతీయ పార్టీలు యత్నిస్తున్నాయి. అందులో బీజేపీ మరీ ముందు ఉంటోందనిపిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు బీజేపీ అమలు చేసిన వ్యూహాలు అన్నీ, ఇన్నీ కావు. ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సైతం జైలులో పెట్టింది. బీహారులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్‌తో జతకట్టి ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు.అదే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమితో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం ఎవరితో కలవడం లేదు.అక్కడ కాంగ్రెస్, సీపీఎంల స్థానాన్ని బీజేపీ ఆక్రమించేసింది. తమిళనాడులో కాంగ్రెస్‌తో డీఎంకే కూటమి కడితే, ఏఐఏడీఎంకే ఈ మధ్యనే బీజేపీతో కలిసింది. కర్ణాటకలో జేడీఎస్ కూడా కొంతకాలం కాంగ్రెస్‌తో, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామి అయింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగానే ఉండడానికి సిద్దపడడంతో, బీజేపీ నాయకత్వం తనను తీవ్రంగా దూషించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడలేదు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి తమను బతిమలాడేలా చేసుకున్నారు.దరిమిలా చంద్రబాబుపై ఎలాంటి కేసులు ముందుకు సాగలేదు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉండగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ దాదాపు జీరో స్థాయిలో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అయినప్పటికీ వైసీపీకి జనంలో పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికి కూటమి పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. తెలంగాణలో మూడు పార్టీలు ఆధిపత్య పోరులో ఉండడం వల్ల బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలతో పోటీ పడవలసి వస్తోంది. ఈ రకంగా సాగుతున్న రాజకీయంలో వచ్చే మూడేళ్లు బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుని నిలదొక్కుకోవలసి ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు జరుగుతున్న సన్నద్ధతపై ఆరా తీశారు. ఢిల్లీలో న్యాయవాదులు కోరిన విధంగా పూర్తి సమాచారాన్ని వీలైనంత త్వరగా సిద్ధం చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కేటీఆర్‌ను ఆదేశించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కేసీఆర్ సోమవారం ఎర్రవల్లి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించడంతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించిన పరిణామాలు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసిందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశముందని సమావేశంలో నేతలు అంచనా వేశారు. ఈ నెల 14న కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించే ‘బీసీల కదన భేరి’ సభ ఏర్పాట్లపైనా చర్చించారు. సభలో రిజర్వేషన్ల అంశాన్ని బలంగా ప్రస్తావించి కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు. బనకచర్లపై దిశా నిర్దేశం ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టుపై ఇటీవల ఢిల్లీలో న్యాయ నిపుణులతో హరీశ్ జరిపిన సంప్రదింపులకు సంబంధించి చర్చ జరిగినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలకు పార్టీ పరంగా చెక్ పెట్టేలా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధతపై చర్చ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు ముందే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. దీనిపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. విలీనం ప్రచారాన్ని తిప్పికొట్టాలి ‘ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి పదేళ్లు అధికారంలో కొనసాగి, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతర పోరాటం చేస్తోంది. కానీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతోందని కొందరు ఉద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లక ముందే విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి..’ అని బీఆర్ఎస్ అధినేత ఆదేశించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను రేవంత్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోంది
-
కేసీఆర్ కూతురు, అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువగా తన ఫోన్ కాల్స్‌నే ట్యాప్ చేశారన్నారు.‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలోనే నోటీస్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విచారణకు ఆలస్యం జరిగింది. అధికారులు నా ఫోన్ ట్యాపింగ్ వివరాలు చూపెట్టిన తర్వాత నేను షాక్‌కు గురయ్యాను. మావోయిస్టుల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది నా ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్‌రావు, రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వావి వరసలు లేకుండా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ కుమార్తె కవిత, అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.నా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇచ్చాను. సిట్ అధికారులు చెప్పిన విషయాలను విని షాక్‌కు గురయ్యా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ కార్యాచరణను ముందుగానే సమాచారం తెలుసుకుని భగ్నం చేసేవారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలేదు. వాట్సాప్ కాల్, సిగ్నల్ ద్వారానే మాట్లాడుకునే వారు. మావోయిస్టుల లిస్ట్‌లో మా పేర్లు పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్ చేశారు. అక్కడ లిస్ట్ అంతా ఉంది..ఎస్‌ఐబీను సొంత అవసరాలకు కేటీఆర్ వాడుకున్నారు. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సినిమా వాళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. గ్రూప్-వన్ పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో పోలీసులు ముందుగానే మా ఇంటికి పోలీసులు వచ్చారు. గ్రూప్-వన్ లీకేజీ కేసు విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఫాల్తు గాళ్ళు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది.వ్యాపార లావాదేవీలు చేసిన పెద్ద వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర పట్టుకున్న రూ.7 కోట్లు ఎక్కడ?. రూ.20 కోట్లు పట్టుకున్న దగ్గర రెండు కోట్లు మాత్రమే చూపించారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఈడీకి లేఖ రాయడం లేదు. సిట్ అధికారులు నిజాయితీ గల వారు. సిట్ అధికారుల మీద అనుమానం లేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనుమానం ఉంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరు ఒక్కటే.ముఖ్యమంత్రి ఫోన్‌ను గతంలో ట్యాప్ చేశారు కదా... ఆయనను పిలిచి విచారణ చేస్తారా?. ఒక్కో కేసుకు ఢిల్లీలో ముఠాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ ఇలా ప్రతీ కేసుకు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్ క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎవరిచ్చారు అధికారం?. ఫోన్ ట్యాపింగ్‌పై పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వాలి.. సీఎం ఎలా ఇస్తారు?. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి?. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయి. సిట్ విచారణ మీద నమ్మకం లేదు’’ అని బండి సంజయ్ అన్నారు. -
ఘోష్ కమిషన్.. కాంగ్రెస్ దారెటు.. బీజేపీ కోర్టులోకి బంతి?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘట్టంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. బ్యారేజీ దెబ్బతిన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 16 నెలలు విచారణ చేసి ఒక నివేదిక సమర్పించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావులతో పాటు పలువురు అధికారుల పాత్రను తప్పుపట్టింది.అలాగే ప్రస్తుతం బీజేపీ ఎంపీ, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కూడా ఆక్షేపించింది. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తదితర మంత్రుల సమక్షంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికలోని ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేసీఆర్ తన పార్టీ నేతల సమావేశంలో ఒక వ్యాఖ్య చేస్తూ అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. ఈ నివేదిక పేరుతో కొన్ని అరెస్టులు కూడా జరగవచ్చని ఆయన అంచనా వేశారు. తదుపరి హరీష్ రావు బీఆర్ఎస్ పక్షాన మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కమిషన్ చేసిన అబ్జర్వేషన్స్‌ను తప్పుపట్టారు. హరీష్ అలా చేయడం న్యాయ వ్యవస్థను కించపరచడమేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ వాద ప్రతివాదాలలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నదానిపై ఇప్పటికిప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము.ఈ సందర్భంలో గతంలో ఆయా ప్రభుత్వాలపై వేసిన కమిషన్లతో ఎవరికి ఇబ్బంది కలగలేదనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరూ ఈ తరహా కేసులు ఎదుర్కోలేదు. చలన చిత్రాభివృద్ది సంస్థ అవకతవకలకు సంబంధించి జరిగిన కమిషన్ విచారణకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హాజరయ్యారు. కమిషన్ నివేదికలో ఆయనను తప్పు పట్టలేదు. ఒక భూ సేకరణ స్కాంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇంకో మాజీ సీఎం స్టే పొందారు. విభజన తర్వాత ఏపీలో రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబే విచారణ సంఘాన్ని నియమించుకున్నారు. అందులో ఆయనను కమిషన్ ఆక్షేపించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఈ విచారణ సంఘం నివేదికను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. రేవంత్ ప్రభుత్వం ఆయనపై కేసు పెడుతుందా? అరెస్టు చేస్తారా?.ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కాంలపై దర్యాప్తు జరిపించి అంతకుముందు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టింది. కొన్ని కేసుల్లో ఆయన బెయిల్ తెచ్చుకోగా, ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అప్పుడే చెప్పలేం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆ అనుభవం రీత్యా కేసీఆర్‌ను కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ ఉన్నప్పటికీ తాము కక్ష రాజకీయాలు చేయబోమని అంటున్నారు. పైగా కేసీఆర్‌కు ఫాం హౌసే ఒక జైలు అని, వేరే జైలు ఎందుకు అని వ్యాఖ్యానించి అరెస్టు జరగక పోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ఇది ఒక్క కేసీఆర్‌కే వర్తిస్తుందా? హరీష్ రావు, ఇతర అధికారులకు కూడా వర్తిస్తుందా అన్నది చెప్పలేం. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు ఇచ్చి కుంగిన ఘటన కేసీఆర్, హరీష్‌రావులకు, బీఆర్ఎస్కు అప్రతిష్ట తెచ్చిందన్నది వాస్తవం.అదే సమయంలో కేసీఆర్ లక్ష్య శుద్ధితోనే కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పించారని చెప్పాలి. కాకపోతే నిర్మాణం వేగంగా చేయాలన్న తొందరపాటులో ఆయన తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారి తీసి ఉండవచ్చునని అనిపిస్తుంది. కమిషన్ పరిశీలనల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వ స్థాయిలో కాకుండా, కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నది ఒకటి. మంత్రివర్గం నుంచి పాలనాపరమైన అనుమతులు తీసుకోలేదన్నది ఇంకో పరిశీలన. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పి, బరాజ్‌ను మేడిగడ్డకు మార్చడంలో నిజాయితీ కొరవడిందన్నది మరో వ్యాఖ్య. మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వ్యతిరేకత తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే యత్నం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ తప్పుడు డిజైన్లు ఇచ్చిందన్నది వేరొక ఆరోపణ. అధిక వడ్డీకి రూ.84 వేల కోట్ల అప్పు చేయడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. శాసనసభలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.ఘోష్ కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని బీఆర్ఎస్పై కాంగ్రెస్ దాడి పెంచింది. అయితే, వెంటనే ఏం చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది. అసెంబ్లీలో ఎటూ ఈ నివేదికను పెడతారు. అందులో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ వైఖరికి అనుగుణంగానే మాట్లాడుతారు తప్ప కొత్తగా చెప్పేది ఉంటుందా అన్నది సందేహం. అయినా అసెంబ్లీలో చర్చించడం మంచిదే. ఈ నివేదికలో కొంతమంది కీలక అధికారుల పాత్ర గురించి విస్మరించారన్న వాదన ఉంది. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావు జోలికి కమిషన్ వెళ్లలేదని చెబుతున్నారు. బారేజ్ను మేడిగడ్డకు మార్చడం వల్ల ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని కమిషన్ అభిప్రాయపడిందని కథనం. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన దాదాపు లక్ష కోట్ల వ్యయం వృథా అయినట్లే అన్నట్లు ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టులో మరో రెండు బారేజీలు, కాల్వలు, టన్నెల్స్ తవ్వకం, రిజర్వాయర్ల నిర్మాణం వంటివి కూడా ఉన్న విషయాన్ని ప్రజలలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని అనిపిస్తుంది.స్థల ఎంపికపై నిపుణుల కమిటీ అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో కేసీఆర్ వివరించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లనిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. పైగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు ప్రశంసించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవీస్ స్వయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. మరో పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా, కాళేశ్వరం సబ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టును సమర్థించినట్లే కదా!. దానిపై ఏం చెబుతారు?. ప్రాణహిత-చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చిన ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మాణం చేసి ఘనత తెచ్చుకోవాలన్న క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్ని తప్పులు కూడా చేసినట్లు అర్దం అవుతుంది.అయితే, అవి పెద్ద తప్పులా? కాదా? అన్నది పరిశీలించాలి. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.. అది కూడా మంచిదే. మామూలుగా అయితే ఈ నివేదిక ఆధారంగా కేసులు పెట్టి ఉండవచ్చు. కానీ, అలా చేయకుండా అసెంబ్లీలో చర్చిస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేస్తుందా? అన్నది ఒక ప్రశ్న. తద్వారా ఈ బాల్‌ను బీజేపీ కోర్టులో వేస్తుందా? అలా జరిగితే కాంగ్రెస్ చేతిలో ఒక ఆయుధం పోయినట్లు అవుతుంది. కనుక ఆ పని చేయకపోవచ్చు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి ఇంతకాలమైనా ప్రభుత్వం మరమ్మతులకు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రాజెక్టు నిరర్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఉన్న ప్రాజెక్టును వినియోగించుకుంటూనే ప్రభుత్వం తదుపరి చర్యలకు వెళ్లితే మంచిదే.ఇక మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వాదన కూడా సమర్థంగానే ఉందని చెప్పాలి. ఇది ఏకపక్ష నిర్ణయం కాదని, అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని ఆయన అంటున్నారు. కేబినెట్ ఆమోదం కూడా ఉందన్నది ఆయన వాదన. మొత్తం 665 పేజీల రిపోర్ట్ కాకుండా సంక్షిప్త నివేదికను బహిర్గతం చేస్తే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత సరిపడా లేదని కేంద్ర జల సంఘమే చెప్పిందని హరీష్ రావు వివరిస్తున్నారు. మరి కమిషన్ తన నివేదికలో అందుకు విరుద్దంగా ఎలా పెట్టిందో తెలియదు. అలాగే మంత్రివర్గ ఆమోదం ఉందన్న హరీష్ వాదనకు కేబినెట్ తీర్మానాలు చూపించాల్సి ఉంటుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన మాట అయితే వాస్తవం. దానిని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదా అన్నది చూడాలి. ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతం బీఆర్ఎస్కు నష్టం చేసింది.ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలడం, పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిన ప్రమాదం వంటి వాటిని ఈ సందర్భంగా హరీష్, కేటీఆర్ తదితరులు ప్రస్తావిస్తున్నారు. గుజరాత్లో ఒక వంతెన కూలిన ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన ఉదంతాన్ని కూడా ఉటంకిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే దానిని ముఖ్యమంత్రికి అంటగడితే, ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు రేవంత్, ఉత్తమ్ కుమార్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైతే మరీ తీవ్రమైన చర్య తీసుకుంటుందా అన్నది సందేహమే. రాజకీయంగా తమకు ప్రయోజనం అనుకుంటేనే అలా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ మాత్రం డిఫెన్స్ నుంచి అఫెన్స్ వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.అందుకే కేసీఆర్ దీనిని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని ధ్వజమెత్తితే, కేటీఆర్ ఈ నివేదిక ఒక ట్రాష్ అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా.. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే ఆ బారేజీకి రిపేర్లు చేయించి, నీటిని ప్రజలకు అందుబాటులోకి తేవడం ఉపయుక్తం అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేసీఆర్ అరెస్ట్ అవుతారా?.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
సాక్షి,న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు,కాళేశ్వరం స్కాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆరోపణలొచ్చాయి. ఈ కేసుల్లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే ఊహాగానాలూ ఊపందుకున్నాయి. అయితే,ఈ ఊహాగానాలకు ఢిల్లీ కేంద్రం సీఎం రేవంత్ తెరదించారు. కేసీఆర్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి పార్లమెంట్లో ఒత్తిడి పెంచాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు. కేసీఆర్‌ను నేనెందుకు జైల్లో వేస్తా.. ఆయనే స్వీయ నియంత్రణగా జైల్లో ఉన్నట్లు ఫామ్ హౌస్‌లో ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు.. చర్లపల్లి జైలుకు తేడా లేదు. ఫామ్ హౌస్‌లో పోలీసుల పర్యవేక్షణ ఉంటది. జైల్లో పోలీసుల పహారా ఉంటుంది. అప్పుడప్పుడు జైలుకు విజిటర్స్ వస్తుంటారు.. అలాగే ఫామ్ హౌస్‌కి విజిటర్స్ వెళ్లి వస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించడమే పెద్ద శిక్ష. నేనెందుకు విద్వేష రాజకీయాలు చేస్తా.మేం దుప్పటి కప్పుకొని పడుకున్నా తెలంగాణ ప్రజలు రెండోసారి కాంగ్రెస్ గెలిపిస్తారు. బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక వస్తుందని అనుకుంటున్నా. బీఆర్ఎస్ నేతలు కూడా నైతిక విజయం అంటే నైతికత కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. బీఆర్ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదు . బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది మా విధానం. బీజేపీ నేతలు.. మీకు కావలసిన పద్ధతిలో చట్టం చేయండి. కిషన్ రెడ్డికి బీసీ బిల్లులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్ల కంటే ఎక్కువ రానివ్వం. 2029లో ఎన్నికలు గెలిచి చూపిస్తాం..కిషన్ రెడ్డి అడ్డుకుంటారా?’ అని అన్నారు. -
ఏకపక్షం కాదు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు లేకుండా వండి వార్చిన నివేదికను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బయట పెట్టింది. ఈ ప్రాజెక్టుకు కేబినెట్‌తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉంది. గవర్నర్ ప్రసంగంలో కాళేశ్వరం అంశం ఉండటం కేబినెట్ ఆమోదాన్ని సూచిస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం నాటి సీఎం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు. వ్యక్తుల నిర్ణయం ఆధారంగా బరాజ్‌ల నిర్మాణం జరగలేదు. వ్యాప్కోస్ నివేదిక, హై పవర్ కమిటీ సిఫారసులు, కేబినెట్ నిర్ణయం, సీడబ్ల్యూసీ ఆమోదం మేరకు జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికి వదిలి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ‘డబ్బులు దండుకునేందుకు కమీషన్లు..కక్ష సాధింపుల కోసం కమిషన్లు’ అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ టీవీ సీరియళ్ల తరహాలో కమిషన్లు, విచారణలతో కాలం గడుపుతున్నాడు. కేసీఆర్‌ను హింసించాలన్నదే ఆయన ఉద్దేశం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు’ అనే అంశంపై మంగళవారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నేతలు, రైతులు దీనిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వద్దకు బరాజ్ మార్చడంలో నాటి సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. కుట్ర పూరిత విచారణ! కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యాలూ లేవు. అన్ని అంశాలు డీపీఆర్‌లో ఉన్నాయి. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నేరుగా తరలించలేమని నిపుణులు చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ కుట్రపూరితంగా జరిగినట్లు కనిపిస్తోంది. కమిషన్ ఎదుట విచారణకు రావాలని మాకు నోటీసులు రాకమునుపే మీడియాలో లీకులు ఇచ్చారు. సంక్షిప్త నివేదిక పేరిట అవాస్తవాలు, రాజకీయ కక్ష సాధింపులతో 60 పేజీలు వండి వార్చారు. నచ్చిన పేరాల లీకులు, నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్లుగా నివేదిక తీరు ఉంది. ఒక వైపే చూసి, విని, నిలబడి ఇచ్చిన నిరాధార నివేదిక ఇది. అసెంబ్లీలో 665 పేజీల పూర్తి నివేదికను పెడితే వాస్తవాలను నిగ్గు తేల్చేలా నిలదీసి చీల్చి చెండాడతాం. అనుమతుల్లేని ‘కొడంగల్’కు ఎలా శంకుస్థాపన చేస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఈ నివేదిక తప్పు పట్టింది. 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయి. ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ గతంలో ప్రధానికి లేఖ రాశారు. ఏ అనుమతులు లేని కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రేవంత్ ఎలా శంకుస్థాపన చేశారు? దీనిపై కూడా అసెంబ్లీలో దుమ్ము దులిపి అన్ని ఆధారాలు బయట పెడతాం. కానీ మైక్ కట్ చేయకుండా, సభను వాయిదా వేసుకోకుండా వాస్తవాలు చెప్పే అవకాశం మాకు ఇవ్వాలి. గతంలో దేశంలో వేసిన అనేక కమిషన్ల తరహాలోనే ఈ కమిషన్ నివేదిక కూడా న్యాయస్థానం ముందు నిలవదు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకే మేడిగడ్డకు మార్పు తుమ్మిడిహెట్టి వద్ద ఏ ప్రాతిపదికన గతంలో బరాజ్‌ను ప్రతిపాదించారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. అక్కడ నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీనే చెప్పింది. అందుకే మేడిగడ్డకు మార్చాం. ప్రతిపాదిత 165 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా ఉంది. దాన్ని కాంగ్రెస్ దాచిపెట్టింది. ప్రాణహిత–చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతి ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్తోంది. కానీ 152 మీ. ఎత్తులో బరాజ్ నిర్మించవద్దని మహారాష్ట్ర స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే తుమ్మిడిహెట్టి నుంచి మార్చాం. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాలు చేసినా నాటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించ లేదు. అప్పట్లో ఖర్చు చేసింది రూ.3,700 కోట్లే.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11 వేల కోట్లతో 32 శాతం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పాడు. కానీ ఈ ప్రాజెక్టు కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రూ.3700 కోట్లే. అందులోనూ మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారు. కేసీఆర్ వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు. నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఏ అనుమతి ఉందని రేవంత్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టిండు. డీపీఆర్ లేకుండానే రేవంత్‌రెడ్డి పనులు ప్రారంభించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్లులు కూడా చెల్లించారు. దీనికి ఒక్క అనుమతైనా ఉంటే ఉత్తమ్ చూపించాలి. కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తున్న రేవంత్ గందమల్ల రిజర్వాయర్‌కు కొబ్బరికాయ కొట్టి, మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తానని టెండర్లు పిలుస్తున్నాడు. కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయని. ప్రజల గుండెల్లో కేసీఆర్ దేవుడిలా నిలుస్తారు. రాజకీయ కుట్రతోనే ఎన్డీఎస్ఏ నివేదిక గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు మూడుసార్లు కుప్పకూలినా స్పందించని ఎన్డీఎస్ఏ మేడిగడ్డ బరాజ్‌లో చిన్న ఘటన జరగ్గానే వచ్చింది. రాజకీయ కుట్రతోనే నివేదిక ఇచ్చింది. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే కేసీఆర్‌ను బాధ్యులుగా చేస్తున్న వారు పోలవరం కట్టిన ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? పోలవరం కట్టిన ప్రధాని మోదీపై చర్య తీసుకుంటారా? శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిన ఘటనకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ బాధ్యత వహించాలి. అధికారంలోకి రాగానే మరమ్మతులు చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో బాగుంది. ప్రాజెక్టు ద్వారా రెండు పంటలు పండాయి. సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు సురక్షితంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పాడు. మేడిగడ్డలో రెండు పియర్లు కుంగితే కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కుంగిన రెండు పియర్లను బాగు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయని అని నిరూపిస్తాం. -
కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
-
జనంలోకి వెళ్దాం.. అసెంబ్లీలో ఎండగడదాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో రెండు పియర్స్ కుంగుబాటును సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా, నేడు అధికార పార్టీగా కాంగ్రెస్ వల్లెవేస్తూ వస్తున్న అబద్ధాలకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ముసుగు వేసి బీఆర్ఎస్పై బురద చల్లే ప్రయ త్నం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అబ ద్ధాలను అసెంబ్లీతోపాటు ప్రజాక్షేత్రంలోనూ ఎండగట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో కొన్ని రోజులుగా పార్టీ కీలక నేతలు కె. తారక రామారావు, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో వరుస భేటీలు జరుపుతున్న కేసీఆర్.. సోమవారం కూడా వారితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. బీజేపీ ప్రేరేపిత జాతీయ డ్యామ్‌ల భద్రత ప్రాధికార సంస్థ (ఎన్డీఎస్ఏ)ను అడ్డుపెట్టుకొని తయారు చేయించిన నివేదికపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని కేసీఆర్ ఆదేశించినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ వేదికగానే అసలు నిజాలు చెబుదాం పీసీ ఘోష్ కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై ఈ భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గతంలో అధికారపక్షంగా రాష్ట్రంలో సాగునీటి రంగం స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజలకు వివరించినట్లుగానే కమిషన్ విచారణ నివేదికపైనా స్పందించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డట్లు తెలియవచ్చింది. ఈ అంశంపై తానే అసెంబ్లీకి స్వయంగా హాజరై వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ తప్పూ చేయనందునే పీసీ ఘోష్ కమిషన్ విచారణకు తనతోపాటు హరీశ్‌రావు హాజరై వివరణ ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారని... అదే రీతిలో అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వం వ్యవహరించే తీరునుబట్టి అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై కక్షపూరిత చర్యలకు పాల్పడితే అనుసరించాల్సిన వ్యూహంపైనా కేసీఆర్ ఈ భేటీలో చర్చించినట్లు తెలియవచ్చింది. నేడు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఎంచుకున్న అంశాలను మాత్రమే కేబినెట్లో ప్రభుత్వం చర్చించినట్లు బీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. సోమవారం కేబినెట్లో చర్చించిన కమిషన్ సంక్షిప్త నోట్లోని అంశాలను పార్టీ నేతలకు వివరించి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలకు కమిషన్ నివేదికలోని డొల్లతనాన్ని, రేవంత్ సర్కారు కుట్రలను ప్రజలకు విడమర్చి చెప్పాలని హరీశ్‌రావును కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హరీశ్‌రావు తెలంగాణ భవన్లో కమిషన్ నివేదికపై ప్రభుత్వ కార్యదర్శుల త్రిసభ్య కమిటీ ఇచ్చిన సంక్షిప్త నివేదికలో పేర్కొన్న వివరాల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్‌ను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్య నేతలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని కేడర్‌ను కేటీఆర్ ఆదేశించారు. ప్రజెంటేషన్ అనంతరం ముఖ్య నేతలు ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ తీరును ఖండించాలని నిర్దేశించారు. నేడు ఢిల్లీకి కేటీఆర్ కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో జరిగే సమావేశానికి హాజరు కానుంది. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళితోపాటు వివిధ పార్టీలు సమర్పించిన పెండింగ్ ప్రతిపాదనలపై చర్చలు జరగనున్నాయి. -
త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) తెలంగాన కేబినెట్ సమావేశం నిర్వహించారు.సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం అసెంబ్లీని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చించనున్నారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చలు అనంతరం దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరంపై అవతవకలపై ఏర్పాటు చేసిన కమిషన్.. తుది నివేదికను కొన్ని రోజుల క్రితం ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలో నేటి కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైనే ప్రధానంగా చర్చించారు.మరోవైపు.. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డిజైన్‌లో లోపాలు లేవని అంటున్నారు. అది కాంగ్రెస్ కమిసన్ అని వారు విమర్శిస్తున్నారు. వ్యాప్కో సంస్థ సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు ఈరోజు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ అందించిన నివేదికపైనే ఈ భేటీలో బీఆర్ఎస్ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.కాళేశ్వరం నివేదికపై స్పందించిన కేసీఆర్ -
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం
-
కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ.. కవిత, కాళేశ్వరంపై చర్చ!
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌తో పాటుగా కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్లో కాళేశ్వరంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. గత బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టుపై కేబినెట్లో చర్చించనున్నారు. మరోవైపు.. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డిజైన్‌లో లోపాలు లేవని అంటున్నారు. వ్యాప్కో సంస్థ సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు. -
‘కాళేశ్వరం అవకతవకలకు కేసీఆర్‌దే పూర్తి బాధ్యత’
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక మీడియాకు లీకైంది. ఈ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. ప్రాజెక్టులో విధాన, ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని వెల్లడయ్యాయి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రిపోర్టు తేల్చింది. వాప్కోస్ నివేదికను తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది.కాళేశ్వరం కమిషన్ రిపోర్టులోని కీలక విషయాలు తుమ్మిడిహట్టిలో నీటి లభ్యతలేదని సమర్థించుకొని, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చారు.నిజాయితీ, చిత్తశుద్ది చూపలేదు. టర్న్ కీ పద్దతిలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని, సీడ్ల్యూసీ సలహా ఇచ్చినా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేశారు.నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందిప్రాజెక్ట్ అంచనాలు డీపీఆర్ కేబినెట్ ముందు పెట్టలేదు. ప్రాజెక్టు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ చేయలేదు. బ్యారేజీల నిర్మాణ ప్రాథమిక అనుమతులకు కేబినెట్ ఆమోదం లేదు.కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్‌దే. కేసీఆర్ ఆదేశాల వల్లే మూడు బ్యారేజీల్లో సమస్యలు. నిపుణుల కమిటీ నివేదికను హరీష్‌రావు ఉద్దేశపూర్వకంగా పట్టించులేదు.ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త రాష్ట్ర స్థితిగతులను పట్టించుకోలేదు. కేబినెట్లో చర్చకాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపైత్రులు చర్చించనున్నారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వం వేసిన అధ్యాయనం కమిటీ షార్ట్ రిపోర్ట్ సిద్ధం చేయగా.. ఈ నివేదికపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. -
రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం ఫైనల్ రిపోర్టు..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో కమిషన్ పేర్కొంది. పూర్తిస్థాయి నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కమిషన్ సూచించింది.ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైనా కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను గుడ్డిగా ఆమోదం తెలిపారని నివేదికలో తెలిపింది. ఆర్థిక శాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదన్న కమిషన్.. ప్రాజెక్టు నిర్మాణంలో టెక్నాలజీ వ్యవహారంలో లోటుపాట్లను కమిషన్ ప్రస్తావించింది. లోకేషన్ల విషయంలో కేసీఆర్ చొరవే ఎక్కువని కమిషన్ పేర్కొంది.రేపు(సోమవారం) కేబినెట్లో రిపోర్ట్‌పై పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కేబినెట్ చర్చ తర్వాత అసెంబ్లీ సమావేశంలో ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని పార్టీల ఆలోచన తెలుసుకునే పనిలో ప్రభుత్వం ఉంది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం.బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. నాడు సీఎం హోదాలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో బరాజ్‌ల అంచనాల పెంపు (ప్రైస్ అడ్జస్ట్మెంట్), కాంట్రాక్టర్లతో ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్ గ్యారంటీల విడుదల విషయంలో అధికారులపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని నిర్ధారించినట్లు తెలిసింది.మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది. -
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం.. వాటిపైనే చర్చ
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం నివేదిక, స్థానిక ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.గత గురువారం కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కేసీఆర్.. ఎర్రవల్లి నివాసంలో ఆ పార్టీ నేతలతో సుదీర్ఘంగా భేటీ అవుతున్నారు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.మరో వైపు, ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది.టీఆర్ఎస్గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. -
నువ్వో లిల్లీపుట్.. నా గురించి మాట్లాడతావా?: బీఆర్ఎస్ నేతపై కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ, నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్తో సంబంధం లేని వ్యక్తితో తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లిల్లీపుట్ నాయకుడు తనను విమర్శించమేంటని కవిత ప్రశ్నించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వానికి, పోలీసులను అనుమతి కోరాం. ప్రభుత్వం అనుమతి విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిరాహార దీక్ష అనుమతి కోసం కోర్టుకు వెళ్ళాము.. కోర్ట్ మాకు అనుమతి ఇస్తుంది అనే నమ్మకం ఉంది. గాంధేయ మార్గంలో దీక్ష చేస్తాం. సానుకూల దృక్పథంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. 42 శాతంలో ముస్లింలు ఉన్నారో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.. ఉన్నారా లేదా స్పష్టత ఇవ్వాలి. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. దొంగనే దొంగ అన్నట్టుగా ఉంది బీజేపీ వాళ్ళ ధర్నా..ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు.. ఎన్నడు ప్రజా పోరాటాల్లో పాల్గొన లేదు. అసలు బీఆర్ఎస్తో మీకేం సంబంధం?. లిల్లీపుట్ నాయకుడు, నిన్న మొన్న వచ్చిన చోటా మోటా నాయకులు కూడా నాపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. వారి వెనక బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు ఉన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతాను. పార్టీ కూడా సమయం వచ్చినప్పుడు స్పందిస్తుంది. దీక్షకు అనుమతి రాకపోతే ఇంట్లోనే దీక్ష చేస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘కాళేశ్వరం’ వైఫల్యంలో బాధ్యులు వారే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం. బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. నాడు సీఎం హోదాలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో బరాజ్‌ల అంచనాల పెంపు (ప్రైస్ అడ్జస్ట్మెంట్), కాంట్రాక్టర్లతో ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్ గ్యారంటీల విడుదల విషయంలో అధికారులపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని నిర్ధారించినట్లు తెలిసింది. మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది. కేసీఆర్ రెండు విధాలుగా బాధ్యుడు! విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలకు నాటి సీఎం కేసీఆర్ డైరెక్ట్‌గా, వైకారియస్గా బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది. న్యాయ పరిభాషలో వైకారియస్ అంటే సేవకులు చేసే తప్పిదాలకు యజమాని (మాస్టర్) పరోక్ష బాధ్యత వహించడం. అంటే సహచర మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు చేసిన తప్పిదాలకు సీఎంగా కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఇక ప్రత్యక్షంగా కూడా కేసీఆర్ పలు అవకతవకలకు పాల్పడినట్టు తెలిపింది. ఈటల, హరీశ్‌లది బాధ్యతారాహిత్యం! నాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ బాధ్యతలను గాలికి వదిలేశారని, కేఐపీసీఎల్ బోర్డులో ఆర్థిక శాఖ ఉన్నా పూర్తి బాధ్యతలను ఆ సంస్థకే వదిలేశారని కమిషన్ తప్పుబట్టింది. ఇక హరీశ్‌రావు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా ఆదేశాలు జారీ చేశారని, పరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేశారని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల సమీకరణ కోసం గత ప్రభుత్వం కేఐపీసీఎల్‌ను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిందని కమిషన్ పేర్కొంది. దీనికి గతంలో, ప్రస్తుతం బోర్డులో సభ్యులుగా ఉన్న వారందరూ బాధ్యులేనని స్పష్టం చేసింది. నేరపూరిత విశ్వాసఘాతం, నిధుల దురి్వనియోగానికి వీరంతా బాధ్యులని పేర్కొంది. భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపింది. ఇష్టారాజ్యంగా వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు! ‘మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తికాక ముందే దాదాపుగా పూర్తైందని నిర్థారిస్తూ 2019 సెప్టెంబర్ 9న బరాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్‌స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తైందని మళ్లీ 2021 మార్చి 15న మరో సర్టిఫికెట్ ఇచ్చారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లోపాలు/లీకేజీలపై నిర్లక్ష్యం వహించి అవి సైతం పూర్తైనట్టు ఆయా బరాజ్‌ల క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సర్టిఫికెట్లు జారీ చేశారు..’ అని కమిషన్ పేర్కొంది. ఇక బరాజ్‌ల నిర్వహణ, పర్యవేక్షణలో పూర్తిగా విఫలమైనందుకు గాను మాజీ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేంద్ర రావుతో పాటు డ్యామ్ సేఫ్టీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవాలను తొక్కిపెట్టిన మాజీ ఈఎన్సీలు బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలి? లంప్సమ్ విధానంలో చేసుకోవాలా? టర్న్ కీ విధానంలోనా? అనే విషయంలో..మాజీ ఈఎన్సీ(జనరల్) సి.మురళీధర్, మాజీ సీఈ బి.హరిరామ్ వాస్తవాలను తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది. నీటి లభ్యత విషయంలో నిపుణుల కమిటీ నివేదికను విస్మరించి కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) తప్పుదోవ పట్టించారని వెల్లడించింది. ఇక కమిషన్ ముందు హాజరై తప్పుడు సాక్ష్యం ఇచ్చిన సీడీఓ మాజీ సీఈ ఎ.నరేందర్ రెడ్డి, సీఈ టి.శ్రీనివాస్, కాళేశ్వరం బరాజ్ మాజీ ఈఈ ఓంకార్ సింగ్‌లను కమిషన్ తప్పుబట్టింది. నివేదిక తొక్కిపెట్టిన జోషి..బిజినెస్ రూల్స్ ఉల్లంఘించిన స్మిత మేడిగడ్డ బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ నిపుణుల కమిటీ సమర్పించిన కీలక నివేదికను ఎస్కే జోషీ తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది. లేనిపక్షంలో బరాజ్ నిర్మాణం జరగక పోయేదని అభిప్రాయపడింది. ఇక స్మిత సభర్వాల్ బరాజ్‌ల నిర్ణయాలకు సంబంధించిన కీలకమైన ఫైళ్లను కేబినెట్ ముందుంచడంలో విఫలమయ్యారని, ఈ విషయంలో ఆమె బిబినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారని పేర్కొంది. ఎల్ అండ్ టీకి ఆ అర్హత లేదు మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తైందని నిర్ధారిస్తూ జారీ చేసిన సర్టిఫికెట్‌ను పొందడానికి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి అర్హత లేదని కమిషన్ పేర్కొంది. బరాజ్‌లో కుంగిపోయిన 7వ బ్లాక్‌ను తన సొంత ఖర్చుతో ఆ సంస్థ పునరుద్ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో ఏర్పడిన లోపాలను గుర్తించి సరిచేయడంలో విఫలమైనందుకు ఆ రెండు బరాజ్‌ల నిర్మాణ సంస్థలూ బాధ్యత వహించాలని పేర్కొంది. బాధ్యులైన ఇంజనీర్లు వీరే.. మోడల్ స్టడీస్ నిర్వహించకుండానే డిజైన్ల తయారీ, నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం, థర్డ్ పార్టీతో డిజైన్లకు వెట్టింగ్ చేయించకపోవడం, నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను నీటిపారుదల శాఖలోని పలు విభాగాల ఇంజనీర్లను కమిషన్ బాధ్యులుగా తేల్చింది. విభాగాల వారీగా వారి పేర్లను ప్రస్తావించింది.. – సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నాటి చీఫ్ ఇంజనీర్ – తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ చీఫ్ ఇంజనీర్ – కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ – సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు -
బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్‌సభలో కొట్లాడేవారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు లోక్‌సభలో డజను మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని ఆదేశించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో మూడు రోజులుగా ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్న కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం కొనసాగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు శుక్రవారం జరిగిన భేటీలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. – రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయాలి. 8న కరీంనగర్లో సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేద్దాం’అని కేసీఆర్ సూచించారు. – సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల సన్నద్ధతను ఇప్పటినుంచే ప్రారంభించాలని ఆదేశించారు. – స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా గట్టిగా కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందనే అంశంపై స్పష్టత లేదు. అయినా ఎన్నికల సన్నద్ధతకు పార్టీ నేతలు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. – స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. ప్రభుత్వ విధానాలు, తెలంగాణకు జరిగే అన్యాయాలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యేలా కార్యాచరణ ఉంటుందని ఈ భేటీల్లో కేసీఆర్ ప్రకటించారు. -
కొత్త తరానికి చేరువవుదాం! : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది. టీఆర్ఎస్గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గురువారం భేటీలో కీలక అంశాలపై చర్చించడంతోపాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ చర్చించారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్దమవుతూనే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని కేటీఆర్‌ను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థితిగతులను మధింపు చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. మరోవైపు మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో చర్చించారు. బనకచర్లతో జరిగే నష్టంపై.. నదీ జల్లాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతోపాటు ప్రత్యేకించి గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టంపై యువత, విద్యార్థులకు వివరించాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 1న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సమావేశం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోనూ త్వరలో ఈ తరహా సమావేశాలు జరుగుతాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించే బాధ్యతను బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, గాదరి కిషోర్, ఎర్రోల్ల శ్రీనివాస్‌కు అప్పగించారు. జల వనరుల నిపుణులు వి.ప్రకాశ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సదస్సుల్లో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారును టీడీపీ, బీజేపీ నడిపిస్తున్నాయనే విషయాన్ని విడమరిచి చెప్పాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా బీఆర్ఎస్ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలను విడమరిచి చెప్పాలని సూచించారు. దృష్టి మళ్లించేందుకే విచారణలు ఎన్నికల హామీల అమలు, పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనాల్సిన తీరుపై కేసీఆర్ లోతుగా విశ్లేషించినట్లు సమాచారం. కాళేశ్వరం, విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లు తదితరాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు తాను, హరీశ్ హాజరుకావడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలు పటాపంచలు అయినట్లు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏయే అంశాలు ఉండొచ్చనే కోణంలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని, బయటపడే మార్గం కోసం వెతుకుతూ మరింత లోతుగా కూరుకుపోతోందనే అభిప్రాయం కేసీఆర్ భేటీలో వ్యక్తమైంది. కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 8న కరీంనగర్లో నిర్వహించే బీసీ సభ ఏర్పాట్ల బాధ్యతను మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు. పార్టీ బీసీ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, బండా ప్రకాశ్ శుక్రవారం కరీంనగర్‌కు వెళ్లి సభ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల వారీగా సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాలకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు జిల్లాల వారీగా కీలక నేతలు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక కష్టాలు పోతాయని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్.. బీజేపీలో కలుస్తుందని ఏదోదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎక్కడికి పోదు.. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది. ఎవ్వరితో కలిసే కర్మ మనకు లేదు. ప్రభుత్వాన్ని నడపడానికి లంకెబిందేలు, గళ్ల పెట్టెలో పైసలు కాదు..దమ్ముండాలి. ప్రభుత్వాన్ని నడిపెటోడు మొగోడైతే.. నడిపేటోనికి దమ్ముంటే పనైతది.కరోనా సమయంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు నడిపిన మొగోడు కేసీఆర్’ అని అన్నారు. -
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్/పటాన్చెరు టౌన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు గురువారం తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు పోటెత్తారు. సమావేశ మందిరంలో జరిగిన వేడుకల్లో కేటీఆర్ భారీ కేక్‌ను కట్ చేశారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, లక్ష్మారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు దేవీ ప్రసాద్, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు కేటీఆర్‌కు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లో పార్టీ కేడర్ మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న కేటీఆర్.. అనంతరం సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలసి ఎర్రవల్లి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులు కేసీఆర్, శోభ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కేటీఆర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఎ స్మైల్’పేరిట రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సహకారంతో ఓ ప్రైవేటు పాఠశాలకు బెంచీలు, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం ‘తలసేమియా సికిల్‌సెల్ ఎనీమియా సొసైటీ’కి కేటీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి రూ.3 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. అలాగే కేటీఆర్ పటాన్‌చెరుకు వెళ్లి ఇటీవల అరెస్టయిన పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యకర్త నల్లబాలు అలియాస్ శశిధర్‌గౌడ్‌ను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టడంతో అరెస్టయిన విషయం తెలిసిందే. నల్లబాలు నివాసంలో ఆయన కుటుంబ సభ్యుల మధ్య కేటీఆర్ కేక్‌కట్ చేసి పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. అనంతరం వారి ఇంట్లో భోజనం చేశారు. -
కేటీఆర్ జన్మదినం.. తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ (ఫోటోలు)


