‘ఇది ఆరడుగుల బుల్లెట్టు’.. హరీష్‌రావుకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ | BRS extends support to Harish Rao over MLC Kavitha comments | Sakshi
Sakshi News home page

‘ఇది ఆరడుగుల బుల్లెట్టు’.. హరీష్‌రావుకు మద్దతుగా బీఆర్‌ఎస్‌

Sep 1 2025 5:53 PM | Updated on Sep 1 2025 6:06 PM

BRS extends support to Harish Rao over MLC Kavitha comments

సాక్షి,హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మాజీ మంత్రి హరీష్‌రావు అవినీతికి పాల్పడ్డారంటూ ఆపార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్‌ రావుకు బీఆర్‌ఎస్‌ మద్దతు పలికింది. హరీష్‌రావుకు అండగా నిలిచింది. సింహం సింగిల్‌గా వస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించిన హరీష్‌ రావు వీడియోను ట్వీట్‌ చేసింది. 

ఆ ట్వీట్‌లో ఇది ఆరడుగుల బుల్లెట్టు.. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్‌ రావు అని కామెంట్స్‌ పెట్టింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement