
హైదరాబాద్: త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) తెలంగాన కేబినెట్ సమావేశం నిర్వహించారు.సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం అసెంబ్లీని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చించనున్నారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చలు అనంతరం దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరంపై అవతవకలపై ఏర్పాటు చేసిన కమిషన్.. తుది నివేదికను కొన్ని రోజుల క్రితం ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలో నేటి కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైనే ప్రధానంగా చర్చించారు.
మరోవైపు.. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. డిజైన్‌లో లోపాలు లేవని అంటున్నారు. అది కాంగ్రెస్ కమిసన్ అని వారు విమర్శిస్తున్నారు. వ్యాప్కో సంస్థ సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు. కాగా, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు ఈరోజు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ అందించిన నివేదికపైనే ఈ భేటీలో బీఆర్‌ఎస్ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.