
సాక్షి,హైదరాబాద్: ‘కాళేశ్వరం పాపం హరీష్‌రావు,సంతోష్‌రావుదేనంటూ’ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కవితకు బీఆర్‌ఎస్ శ్రేణులు షాకిచ్చారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్లను అన్ ఫాల్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ సైతం హరీష్‌రావుకు మద్దతు పలుకుతూ ‘సింహం సింగిల్‌గానే’ వస్తుందని ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది.
హరీష్‌రావు,సంతోష్‌రావుపై కవిత ఘాటు కామెంట్లు చేశారు. ఆ కామెంట్ల తర్వాత కొద్ది సేపటికే హరీష్‌రావుపై బీఆర్‌ఎస్ ట్వీట్ చేసింది. హరీష్‌రావు ఆరడుగుల బుల్లెట్టంటూ పోస్టు పెట్టింది. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ ఓ వీడియోను షేర్ చేసింది.
అదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ మీడియా గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్‌వో నవీన్‌ను తొలగించింది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి రోజువారి పార్టీ కార్యచరణను పీఆర్‌వో నవీన్ బీఆర్‌ఎస్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. హరీష్‌రావుపై వ్యాఖ్యల తరువాత కవిత పీఆర్‌వో నవీర్‌ను గ్రూప్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తొలగించింది. బీఆర్‌ఎస్ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున కవిత సోషల్ మీడియా అకౌంట్లకు అన్‌ఫాలో చెబుతున్నారు.
కవిత వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్‌రెడ్డి,పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ప్రశాంత్‌రెడ్డి ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు. వీరి భేటీలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ,ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
LIVE: Addressing media https://t.co/C9qlcEwUnc
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 1, 2025