
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి హరీష్‌రావును కొనియాడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీష్‌రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అని ప్రశంసలు కురిపించారు. . నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు.. కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ’ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL— KTR (@KTRBRS) September 1, 2025