
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందన్నారు సీఎం రేవంత్. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో రాష్ట్రపతి పూర్తి చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇక ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఓటింగ్ విషయంలో అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌ను కలవడానికి సిద్ధమన్నారు.
మంగళవారం(ఆగస్టు 19వ తేదీ) మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన సీఎం రేవంత్.. ‘ జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఎంపిక చేసింది. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో అదిష్టానం ఆదేశిస్తే కేసిఆర్‌ను కలవడానికి సిద్దం. ఆయన అపాయింట్ మెంట్ ఇస్తడో లేదో..
ఆయనకు నా మొఖం చూడటం ఇష్టం ఉందో లేదో. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంలో నా నిర్ణయం ఏం లేదు ఇండియా కూటమి నిర్ణయం. నేను రెగ్యులర్ ఆయన్ను కలుస్తాను.. మన ఊరాయనా. నేను జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్‌కు వెళతాను’ అని పేర్కొన్నారు.