
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక కష్టాలు పోతాయని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడారు.
‘తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్‌ఎస్ ఉంటుంది. ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్.. బీజేపీలో కలుస్తుందని ఏదోదో మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్ ఎక్కడికి పోదు.. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్‌ఎస్ ఉంటది. ఎవ్వరితో కలిసే కర్మ మనకు లేదు. ప్రభుత్వాన్ని నడపడానికి లంకెబిందేలు, గళ్ల పెట్టెలో పైసలు కాదు..దమ్ముండాలి. ప్రభుత్వాన్ని నడిపెటోడు మొగోడైతే.. నడిపేటోనికి దమ్ముంటే పనైతది.కరోనా సమయంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు నడిపిన మొగోడు కేసీఆర్’ అని అన్నారు.