
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌తో పాటుగా కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్‌లో కాళేశ్వరంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. గత బీఆర్‌ఎస్ పాలనలో కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. మరోవైపు.. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. డిజైన్‌లో లోపాలు లేవని అంటున్నారు. వ్యాప్కో సంస్థ సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు.