Business
-
ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై కేంద్రం ప్రకటన
2024 - 25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ రేటును ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సిఫార్సు చేశాయి.ఈపీఎఫ్ వడ్డీ రేటు.. దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా జీతం పొందే చందాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. 2023-24 సంవత్సరానికి అందించే రేటునే.. ఈ ఏడాది కూడా కొనసాగించారు. 2022-23 సంవత్సరంలో ఈ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉండేది.ఈపీఎఫ్‌వోలోకి 14.58 లక్షల సభ్యులుఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 14.58 లక్షల మంది సభ్యులు మార్చిలో చేరారు. వీరిలో సగం మంది (7.54 లక్షల మంది) కొత్త సభ్యులే కావడం గమనార్హం. అంటే మొదటివారి వీరు ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చారు. సంఘటిత రంగంలో పెరిగిన ఉపాధి అవకాశాలను ఇది ప్రతిఫలిస్తోంది. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా 2 శాతం వృద్ధి కనిపించింది. ఈ మేరకు మార్చి నెల పేరోల్ గణాంకాలు విడుదలయ్యాయి.పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..మిస్డ్‌కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ నెంబర్‌కు కాల్ చేయగానే ఆటోమేటిక్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎమ్ఎస్ రూపంలో వస్తుంది.ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీపీఎఫ్ బ్యాలెన్స్ మీకు ఎస్ఎమ్ఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు రావాలంటే.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. అంతే కాకుండా మీ నెంబర్ UANకు లింక్ అయి ఉండాలి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలి. ఇవన్నీ పూర్తి చేసి ఉంటేనే మీరు పీఎఫ్ బ్యాలెన్సును మెసేజ్ రూపంలో తెలుసుకోగలరు. 7738299899 నెంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు. -
ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి.. కొత్త టోల్ పాలసీపై కసరత్తు చేస్తోంది. టోల్ ప్లాజా గుండా వెళ్లిన ప్రతిసారీ టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఏడాదికి ఒకేసారి చెల్లించే విధంగా ప్లాన్ చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఏడాదికి ఒకేసారి 3000 రూపాయలు టోల్ ఫీజు(యాన్యువల్ ప్యాకేజీ)ను చెల్లించడం ద్వారా.. డ్రైవర్లు/వాహనదారులు ఏడాది పొడవునా అన్ని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, స్టేట్ ఎక్స్‌ప్రెస్‌వేలలో అపరిమిత దూరం ప్రయాణించవచ్చు. ప్రతి టోల్ గేటు దగ్గర టోల్ ఫీజును ప్రత్యేకించి చెల్లించాల్సిన అవసరం లేదు.యాన్యువల్ ప్యాకేజీ కోసం.. వాహనదారులకు లేదా డ్రైవర్లకు అదనపు డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఫాస్ట్‌ట్యాగ్(FASTag)ను రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే జీవితకాల ఫాస్ట్‌ట్యాగ్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. ఈ విధానం కింద రూ. 30,000 చెల్లిస్తే.. 15 సంవత్సరాలు రోడ్డుపై అపరిమిత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. దీనిని ప్రభుత్వం అమలుచేసే అవకాశం లేదు.ఇదీ చదవండి: కారు కొనడానికి హెలికాఫ్టర్‌లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియోవార్షిక ప్యాకేజ్ మాత్రమే కాకుండా డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్ విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఈ డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్ విధానంలో 100 కిలోమీటర్ల దూరానికి రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. -
బలపడిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మార్చి త్రైమాసికంలో రూ.26 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 138 శాతం పెరిగింది. ఆదాయం 35 శాతం పెరిగి రూ.726 కోట్లకు చేరింది. డిజిటల్ బ్యాంక్‌గా తమ స్థానం మరింత బలపడినట్టు పేర్కొంది.గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లాభం 81 శాతం పెరిగి రూ.63 కోట్లకు చేరగా, ఆదాయం 47 శాతం వృద్ధితో రూ.2,709 కోట్లుగా నమోదైంది. కస్టమర్ అకౌంట్ బ్యాలన్స్లు రూ.3,659 కోట్లకు చేరినట్టు.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 31 శాతం పెరిగినట్టు ప్రకటించింది.సురక్షితమైన రెండో ఖాతాను స్వీకరించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు.. డిజిటల్ చెల్లింపులకు ప్రత్యామ్నాయ బ్యాంక్ ఖాతాకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో అనుబ్రత బిశ్వాస్ తెలిపారు. -
X Outage: ఎక్స్ సేవల్లో అంతరాయం
ప్రపంచ కుబేరుడు.. టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఆధీనంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్, ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 5:30 గంటల నుంచి యూజర్లు సమస్యలను నివేదిస్తూనే ఉన్నారు. లాగిన్ అవ్వడంలో, టైమ్‌లైన్‌లను యాక్సెస్ చేయడంలో మాత్రమే కాకుండా ట్వీట్స్ చేయడంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.ట్రాకింగ్ సర్వీస్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. 2,100 కంటే ఎక్కువ మంది యూజర్లు సమస్యలను నివేదించారు. కంపెనీ ప్రస్తుతానికి ఈ సమస్యకు కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.శుక్రవారం కూడా భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. డేటా సెంటర్లో ఏర్పడిన టెక్నికల్ సమస్య కారణంగా.. అంతరాయం ఏర్పడిందని ఎక్స్ ఇంజినీర్లు వెల్లడించారు. అయితే ఈ రోజు అంతరాయం కలగడానికి కారణం ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది. -
కారు కొనడానికి హెలికాఫ్టర్‌లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియో
గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో ధనవంతులైన వ్యాపారవేత్తల సంఖ్య పెరిగింది. వారిలో చాలామంది భారతదేశంలో స్థిరపడ్డారు, మరికొందరు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లారు. వ్యాపారవేత్తల జీవన విధానం చాలా విలాసవంతంగా ఉంటుంది. కాబట్టి వీరు రోజువారీ వినియోగానికి సైతం ఖరీదైన కార్లు ఉపయోగిస్తుంటారు. ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ కారు కొనుగోలు చేయడానికి ఏకంగా హెలికాఫ్టర్‌లో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.కేరళలోని మలప్పురంలో ఉన్న ఫ్రాగ్రెన్స్ వరల్డ్ కంపెనీ ఓనర్.. 'మూసా హాజీ' హెలికాప్టర్లో వచ్చి.. బెంట్లీ బెంటాయెగా డెలివరీ తీసుకున్నారు. కారును మూసా హాజీ స్వయంగా డ్రైవ్ చేస్తుండగా.. కాన్వాయ్‌లో రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి కార్లు కదిలాయి.ఇక్కడ కనిపించే బెంట్లీ కారు ఈడబ్ల్యుబీ వెర్షన్ అని తెలుస్తోంది. రోజ్ గోల్డ్ షేడ్‌లో పూర్తయిన ఈ కారు ధర రూ.6 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్: నెలకు రూ.840 కంటే తక్కువే..బెంట్లీ బెంటయెగా ఈడబ్ల్యుబీ వెర్షన్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులోని 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్.. గరిష్టంగా 550 పీఎస్ పవర్, 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు అంబానీ ఫ్యామిలీ దగ్గర కూడా ఉంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్: నెలకు రూ.840 కంటే తక్కువే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారతదేశం స్టార్‌లింక్ సేవలను ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో ఇతర సంస్థలు కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను స్టార్ట్ చేయడానికి సన్నద్ధమవుతాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలు ప్రారంభంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి నెలకు 10 డాలర్లు లేదా రూ.840 కంటే తక్కువ ధరలోనే అపరిమిత డేటా అందించాలని యోచిస్తున్నాయి.తొలి దశలో కంపెనీలన్నీ యూజర్లను పెంచుకోవడంపై ద్రుష్టి సారించనున్నాయి. సుమారు 10 మిలియన్స్ కస్టమర్లను చేరుకోవడం ద్వారా స్పెక్ట్రమ్ కాస్ట్‌ను భర్తీ చేసుకోవడం సాధ్యమవుతుందని సంస్థలు భావిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) పట్టణ ప్రాంతాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు నెలకు రూ. 500 ఛార్జ్ చేయాలని ప్రతిపాదించింది. ఈ ధర సాధారణ సర్వీసులతో పోలిస్తే చాలా ఎక్కువ.ట్రాయ్ సిఫార్సులలో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయంలో 4 శాతం లెవీ, MHz స్పెక్ట్రానికి సంవత్సరానికి రూ.3500 ఫీజు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా శాటిలైట్ ఉపగ్రహ కమ్యూనికేషన్ ప్రొవైడర్లు వాణిజ్య సేవలను అందించడానికి 8 శాతం లైసెన్స్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలను అమలు చేయడానికి ముందు.. ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది.లైసెన్స్ ఫీజులు.. స్పెక్ట్రమ్ ఛార్జీలు ఉన్నప్పటికీ యూజర్లను పెంచుకునేందుకు తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా దేశంలో స్టార్‌లింక్ సేవలను ప్రారంభించడానికి టెలికాం విభాగం నుంచి అనుమతులు లభించాయి. అయితే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఆమోదం లభించాల్సి ఉంది.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకిస్టార్లింక్ మాత్రమే కాకుండా.. యూటెల్సాట్ వన్‌వెబ్ (Eutelsat OneWeb), జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ (Jio Satellite Communications) కూడా వరుసగా 2021, 2022లో టెలికాం విభాగం నుంచి అనుమతులు పొందాయి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. ఈ ఆమోదం లభించిన తరువాత శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి. -
ఇకపై ఆలా కుదరదు: శాంసంగ్‌కు ట్రంప్ వార్నింగ్
అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ 'డొనాల్డ్ ట్రంప్' పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రూల్ శాంసంగ్ సహా ఇతర అన్ని స్మార్ట్‌ఫోన్ సంస్థలకు వర్తిస్తుందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.అమెరికా విధించే సుంకాల ప్రభావం ఉండకూడదు అనుకుంటే.. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇక్కడే (అమెరికాలో) ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా భారతదేశంలో లేదా ఇతర ఏ దేశంలోనో తయారు చేసిన ఫోన్లను అమెరికాకు దిగుమతి చేసుకుంటే.. 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.సౌత్ కొరియా దిగ్గజమైన 'శాంసంగ్' అమెరికా మార్కెట్లో అత్యధిక అమ్మకాలు చేపడుతున్న రెండో మొబైల్ కంపెనీగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఈ సంస్థ ప్రతి సంవత్సరం 220 మిలియన్ ఫోన్స్ విక్రయిస్తోంది. ఇందులో సుమారు 60 శాతం ఫోన్స్.. వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచే ప్రపంచంలోనే చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇకపై ఈ విధానంతో అమెరికాకు శాంసంగ్ ఫోన్స్ తీసుకుని వస్తే.. సుంకాలు చెల్లించక తప్పదు. -
ఎల్ఐసీ గిన్నిస్ రికార్డ్: 24 గంటల్లో..
ప్రభుత్వరంగ బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC).. కేవలం 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. జనవరి 20న భారతదేశం అంతటా 4,52,839 మంది ఎల్ఐసీ ఏజెంట్లు 5,88,107 జీవిత బీమా పాలసీలను విజయవంతంగా పూర్తి చేశారు. బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలు జారీ చేయడం ఇదే మొదటిసారి.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు అమ్ముడయ్యాయని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ అనేది.. మా ఏజెంట్ల అవిశ్రాంత అంకితభావం, నైపుణ్యం, అవిశ్రాంత పనికి నిదర్శనం. కస్టమర్లు, వారి కుటుంబాలకు కీలకమైన ఆర్థిక రక్షణను అందించాలనే మా లక్ష్యం పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఎల్ఐసీ పేర్కొంది. జనవరి 20న 'మ్యాడ్ మిలియన్ డే' నాడు ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. ఎల్ఐసీ ఎండీ & సీఈఓ సిద్ధార్థ మొహంతి చేపట్టిన చొరవకు నిదర్శనమే ఈ రికార్డు అని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా సీఈఓ సిద్ధార్థ మొహంతి మాట్లాడుతూ.. 'మ్యాడ్ మిలియన్ డే'ని చారిత్రాత్మకంగా మార్చినందుకు కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.Life Insurance Corporation of India Achieves GUINNESS WORLD RECORDS™️. Most Life Insurance Policies Sold In 24 Hours.#LIC #LICInsurancePolicy #GuinnessWorldRecord pic.twitter.com/WRTwZ7UtLt— LIC India Forever (@LICIndiaForever) May 24, 2025 -
సుంకాలు విధించినా మరేం ఫర్వాలేదు
భారత్‌లో తయారయ్యే ఐఫోన్లపై అమెరికా 25 శాతం సుంకం విధించినా ఆ దేశంలో తయారీతో పోలిస్తే మొత్తం ఉత్పత్తి వ్యయం ఇండియాలో చాలా తక్కువగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక తెలిపింది. యాపిల్ ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయాలని నిర్ణయించుకుంటే ఐఫోన్లపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ మేరకు జీటీఆర్ఐ వివరాలు వెల్లడించింది.ఇండియాలో ఎందుకంత చౌక..?అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఐఫోన్ తయారీ వ్యయాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని, ప్రధానంగా కార్మికులకు అయ్యే ఖర్చుల వ్యత్యాసాలు భారీగా ఉండడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. భారతదేశంలో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేసే కార్మికులకు నెలకు సుమారు 230 అమెరికన్ డాలర్లు(సుమారు రూ.20,000) ఖర్చు అవుతుంది. అయితే కాలిఫోర్నియా వంటి యూఎస్ రాష్ట్రాల్లో కార్మికుల ఖర్చులు నెలకు 2,900 అమెరికన్ డాలర్లు(రూ.2,44,760)కు పెరుగుతాయి. భారత్‌తో పోలిస్తే ఇది 13 రెట్లు అధికంగా ఉండడం గమనార్హం.ప్రస్తుతం సుమారు 1,000 డాలర్ల(రూ.85,000)గా ఉన్న ఐఫోన్ తయారీలో యాపిల్ తన బ్రాండ్, సాఫ్ట్వేర్ ద్వారా అధికంగా 450 డాలర్ల వాటాను సమకూరుస్తుంది. మిగతాది ఇతర దేశాల నుంచి సమీకరిస్తున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌కు వెచ్చిస్తుంది.యూఎస్ కాంపోనెంట్ మేకర్స్ (క్వాల్కామ్, బ్రాడ్‌కామ్): 80 డాలర్లుతైవాన్ (చిప్ తయారీ): 150 డాలర్లుదక్షిణ కొరియా (ఓఎల్ఈడీ స్క్రీన్లు, మెమొరీ చిప్స్): 90 డాలర్లుజపాన్ (కెమెరా): 85 డాలర్లుజర్మనీ, వియత్నాం, మలేషియా (ఇతర భాగాలు): 45 డాలర్లుచైనా, ఇండియా (అసెంబ్లింగ్): 30 డాలర్లుఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌తోపాటు మరో సంస్థపై ఆర్బీఐ జరిమానాఐఫోన్ అసెంబ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న భారతదేశం, చైనా మొత్తం రిటైల్ ధరలో 3% కంటే తక్కువే సంపాదిస్తుండడం గమనార్హం. భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్ విధించినప్పటికీ దేశంలో ఐఫోన్ల తయారీ ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని నివేదిక తెలుపుతుంది. ప్రభుత్వం నుంచి యాపిల్ భారత్‌లో ఐఫోన్ తయారీపై ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) ప్రయోజనాన్ని సైతం పొందుతుంది. -
రేంజ్ రోవర్ హిమాలయన్: సరికొత్త స్పెషల్ ఎడిషన్
రేంజ్ రోవర్ రణథంబోర్ స్పెషల్ ఎడిషన్ మంచి ఆదరణ పొందటంతో.. కంపెనీ ఇప్పుడు మరో స్పెషల్ ఎడిషన్‌ను 'హిమాలయన్' పేరుతో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది లేత పెయింట్ షేడ్స్ పొందనున్నట్లు సమాచారం.రేంజ్ రోవర్ హిమాలయన్ ఎడిషన్ గురించి కంపెనీ చాలా వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది ఇప్పుడున్న అన్ని ఎడిషన్స్ కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను ఎన్ని యూనిట్లకు పరిమితం చేసింది. ఎప్పటి నుంచి విక్రయిస్తుందనే విషయాలను కూడా వెల్లడించలేదు.స్పెషల్ ఎడిషన్లకు డిమాండ్ పెరగడంతో.. హిమాలయన్ ఎడిషన్స్ లాంచ్ చేయడానికి సిద్దమైనట్లు.. జేఎల్ఆర్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ లింపెర్ట్ పేర్కొన్నారు. కస్టమర్లు మరిన్ని స్పెషల్ ఎడిషన్స్ కోరుకుంటున్నారు. కాబట్టి మేము మరో మోడల్ ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాకు సింగర్ ట్వీట్: సాయం చేయండి అంటూ..గతంతో పోలిస్తే.. రేంజ్ రోవర్ కార్లు మంచి అమ్మకాలను పొందుతున్నాయి. గడచిన ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో లగ్జరీ విభాగంలో మూడో స్థానానికి చేరింది. రేంజ్ రోవర్ & రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క స్థానిక అసెంబ్లీ మోడళ్ల అమ్మకాలు 2.5 రెట్లు పెరిగాయి. -
ఇంటికి ఫైర్ ప్రూఫ్ ఉండాల్సిందే..
నివాసం, వాణిజ్యం, కార్యాలయం.. నిర్మాణం ఏదైనా సరే అగ్ని ప్రమాద నివారణ ఉపకరణాలు తప్పనిసరి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జరిగే ప్రమాదం వెలకట్టలేనిది. ఆస్తి, ప్రాణ నష్టాన్ని భర్తీ చేయలేనిది. అందుకే ప్రతీ భవనంలోనూ ఫైర్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వాటిని నిర్వహణ చేయాలి లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు అవి పనిచేయవు. ఈమధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, సిలిండర్ పేలుళ్లు.. ఇలా కారణాలనేకం.🔸 హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యా, వైద్య సదుపాయాలు, కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక వసతులు ఇలా రకరకాల కారణాలతో నగరంలో జనాభా, వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నివాస, వాణిజ్య భవనాలలో అగ్ని ప్రమాద భద్రతా నిబంధనలు, ఉత్పత్తులు మనశ్శాంతి ఇవ్వడమే కాకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. చిన్న మంట ఒక గదిని దహించేందుకు సగటున మూడు నిమిషాల సమయం పడుతుంది. అందుకే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేగవంతమైన ప్రతిస్పందన అత్యవసరం. ప్రతిస్పందనలో సెకన్ల సమయం ఆలస్యమైనా.. విపత్తు తీవ్రత పెరుగుతుంది. – సాక్షి, సిటీబ్యూరోఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి..? అపార్ట్మెంట్లు: 🔸 ప్రతీ ఫ్లాట్ లోపల స్మోక్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలి. 🔸 మంటలను ఆర్పే పరికరం, యంత్రం ఉండాలి. ముఖ్యంగా వంట గదిలో తప్పనిసరి. 🔸 మంటలను నియంత్రించే తలుపులు, కిటికీలు ఉండాలి. కనీసం 30–60 నిమిషాల పాటుతట్టుకునే శక్తి ఉండాలి.లిఫ్ట్: 🔸 లిఫ్ట్ డోర్లకు అగ్నిని తట్టుకునే శక్తి ఉండాలి. 🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలలో ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బందిని నియమించుకోవాలి. 🔸 లిఫ్ట్ ముందు భాగంలో ‘అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్‌ను వినియోగించరాదు’, ‘మెట్ల మార్గం’.. తదితరాలను సూచించే సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి.బేస్మెంట్, పార్కింగ్ ఏరియా 🔸 ఆటోమెటిక్ స్ప్రింక్లర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 🔸 పొగను గుర్తించే పరికరాలు, అలారం ఉండాలి. 🔸 పార్కింగ్, ప్రధాన భవనం మధ్య భాగంలో మంటలను నియంత్రించే తలుపులను ఏర్పాటు చేయాలి. 🔸 ఇంధనం, రంగులు, వార్నిష్ వంటి మండే గుణం ఉన్న వస్తువులను భద్ర పర్చకూడదు. 🔸 అగ్ని ప్రమాదం జరిగే తప్పించుకునే సైన్ బోర్డులు, లైటింగ్‌లను ఏర్పాటు చేయాలి. కారిడార్లు, కామన్ ఏరియాలు: 🔸 ప్రతీ 30 మీటర్ల దూరంలో ఒక మాన్యువల్ కాల్ పాయింట్ల (ఎంసీపీ) ను ఏర్పాటు చేయాలి. 🔸 కారిడార్లలో 2 గంటల పాటు మంటలను తట్టుకునే గుణం ఉన్న గోడలు, తలుపులను ఏర్పాటు చేయాలి. 🔸 ఫైర్ అలారం స్పీకర్లు, అత్యవసర లైట్లు, మెరిసే ఎగ్జిట్ గుర్తులను పెట్టాలి. అసెంబ్లీ ఏరియా 🔸 ఓపెన్ స్పేస్, గ్రౌండ్ ఫ్లోర్లో సురక్షితమైన అసెంబ్లీ జోన్లను గుర్తించాలి. 🔸 లిఫ్ట్, మెట్ల దగ్గర అగ్నిమాపక సంకేతాలు, గుర్తులను ఏర్పాటు చేయాలి. 🔸 బేస్మెంట్, లిఫ్ట్ లాబీలలో పొగ తొలగింపు వ్యవస్థను పెట్టాలి. 🔸 సహజ, యాంత్రిక వెంటలేషన్ తప్పనిసరి. అగ్నిమాపక మౌలిక సదుపాయాలు 🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనంలో ప్రతీ అంతస్తులోనూ నీటిని సరఫరాను అందించే పైప్‌లు, హోస్ రీల్ ఉండాల్సిందే. 🔸 ఫైర్ హైడ్రంట్ సిస్టమ్ ఉండాలి. 🔸 అండర్‌గ్రౌండ్, ఓవర్‌హెడ్ ఫైర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌లను ఏర్పాటు చేయాలి. 🔸 డీజిల్ లేదా ఎలక్ట్రిక్‌తో నడిచే ఫైర్ పంప్ రూమ్ తప్పనిసరి.రూఫ్, టెర్రర్.. 🔸 అగ్నిమాపక సిబ్బంది వెళ్లేందుకు వీలుగా ఉండాలి. 🔸 మంటలను ఆర్పేందుకు ప్రత్యేకంగా వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తప్పనిసరి. 🔸 హైరైజ్ భవనాలతో ప్రతీ 24 మీటర్ల దూరంలో అత్యవసర సమయంలో ఆశ్రయం పొందేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. మెట్లు..🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు రెండు మెట్ల మార్గాలు తప్పనిసరి. 🔸 అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు ప్రత్యేకంగా మెట్ల మార్గం ఉండాలి. 🔸 మెట్ల మార్గంలోని తలుపులు కనిష్టంగా 1–2 గంటల పాటు మంటలను నియంత్రించే గుణం ఉన్న వాటినే ఏర్పాటు చేయాలి. 🔸 పొగ ప్రవేశించకుండా నిరోధించే మెట్లను నిర్మించుకోవాలి. చేయాల్సినవి.. 🔸 తప్పించుకునే మార్గాలు, మెట్ల మార్గాలు, అగ్ని ప్రమాద హెచ్చరికలు, సూచికలను గుర్తించుకోవాలి. 🔸 ఇంట్లో లేనప్పుడు విద్యుత్ మెయిన్స్‌ను ఆపివేయాలి. 🔸 ఇంట్లో అగ్ని మాపక యంత్రం ఉంచుకోవాలి. 🔸 ఇసుకతో నిండిన అగ్నిమాపక బకెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి.చేయకూడనివి🔸 అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫర్నీచర్ వెనుక లేదా టాయిలెట్లతో దాక్కోకూడదు. 🔸 ఐఎస్ఐ ప్రమాణాలు ఉన్న ఉత్పత్తులను మాత్రమే వాడాలి. 🔸 అనధికారి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దు. మీటర్‌ను ఓవర్‌లోడ్ చేయకూడదు. 🔸 ప్రమాదకర పదార్థాలు, ఉత్పత్తులను నిల్వ చేయకూడదు. 🔸 ఫైర్ ఎగ్జిట్ పాయింట్లకు అడ్డంగా ఏమీ పెట్టరాదు. 🔸 విద్యుత్ వ్యవస్థల మరమ్మతులు, నిర్వహణ తప్పనిసరి. -
యూనియన్ బ్యాంక్‌తోపాటు మరో సంస్థపై ఆర్బీఐ జరిమానా
బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడంలో విఫలమైనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్ (లెండ్‌బాక్స్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం నడుచుకోని సంస్థలపై కఠిన చర్యలుంటాయని ఆర్బీఐ పేర్కొంది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై జరిమానాబ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 నిబంధనలు, పూచీకత్తు లేని వ్యవసాయ రుణాలపై ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.63.6 లక్షల జరిమానా విధించింది. నిధుల బదిలీలో జాప్యం, పూచీకత్తు లేని రుణ విధానాల్లో ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. ముఖ్యంగా వ్యవసాయం వంటి ప్రత్యేక రక్షణ అవసరమయ్యే రంగాల్లో ఆర్థిక సంస్థలు నిర్దేశిత రుణ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూడాలని ఆర్బీఐ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా లేకపోతే పేదరికం తప్పదా?ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్(లెండ్ బాక్స్)పై పెనాల్టీఆర్బీఐ పీర్-టు-పీర్ (పీ2పీ) లెండింగ్ ప్లాట్‌ఫామ్ డైరెక్షన్స్-2017ను పాటించనందుకు లెండ్‌బాక్స్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్‌పై రూ.40 లక్షలు జరిమానా విధించింది. దేశ డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్‌లో గణనీయమైన వృద్ధిని చూసిన పీ2పీ లెండింగ్ కార్యకలాపాలకు సంబంధించిన లోపాలను సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. ఫిన్‌టెక్ కంపెనీలు పారదర్శకత పాటించాలని, వినియోగదారులు, రుణదాతలను రక్షించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని గుర్తు చేసింది. -
ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..
దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్. జారీ చేసినప్పటి నుంచి వీటిని ఇంత వరకూ అప్డేట్ చేసుకోనివారు వెంటనే చేసుకోవాలి. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్‌ను అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)అవకాశం కల్పించింది. ఇందుకోసం గతేడాది గడువును విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ 14 వరకు గడువు విధించారు. ఆ తర్వాత రూ .50 రుసుమును చెల్లించి ఆధార్ కేంద్రాల వద్ద అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి గుర్తింపు రుజువు (పీఓఐ), చిరునామా రుజువు (పీఓఏ) అప్డేట్ చేసుకోవాలి. రెగ్యులర్ అప్డేట్లు ఆధార్ లోని సమాచారం, ప్రస్తుత డాక్యుమెంటేషన్‌కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి.ఆధార్‌ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పొందేటప్పుడు, బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు లేదా ఇతర అవసరమైన కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసేటప్పుడు సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా ఆధార్ సమాచారాన్ని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవడం వల్ల డెమోగ్రాఫిక్ డేటాబేస్‌లో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అధికారులకు వీలవుతుంది. తద్వారా దుర్వినియోగాలు, మోసాలు నివారించడంతోపాటు ప్రజా సేవల్లో జాప్యాలు, తిరస్కరణలను తగ్గించడానికి ఆస్కారం కలుగుతుంది.ఆన్లైన్లో ఏమేమి అప్డేట్ చేయవచ్చు?ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని యూఐడీఏఐ అందిస్తున్నప్పటికీ, ఆధార్‌లోని కొన్ని రకాల వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. యూఐడీఏఐ ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అనుమతిస్తోంది. అవి ఏమిటంటే..🔹పేరు (చిన్న మార్పులు చేసుకోవచ్చు)🔹పుట్టిన తేదీ (కొన్ని పరిమితులున్నాయి)🔹చిరునామా🔹జెండర్🔹భాష ప్రాధాన్యతలుబయోమెట్రిక్ సమాచారం మారదుఆన్లైన్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారం అప్డేట్ చేసేందుకు వీలులేదు. ఫోటో, వేలిముద్రలు, ఐరిస్ (కనుపాప) స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే, భౌతికంగా ఆధార్ నమోదు కేంద్రంలో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే బయోమెట్రిక్ వివరాలను ధ్రువీకరించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అవసరమైన పరికరాలు కేంద్రాల వద్ద మాత్రమే ఉన్నాయి.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఇలా..👉అధికారిక పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ను సందర్శించండి.👉"లాగిన్" బటన్ పై క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.👉రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయడానికి దానిని నమోదు చేయండి.👉లాగిన్ అయిన తర్వాత పేజీ పై కుడివైపున ఉన్న 'డాక్యుమెంట్ అప్డేట్'పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ప్రస్తుత గుర్తింపు రుజువు, చిరునామా రుజువును ధ్రువీకరించి అప్డేట్ చేస్తారు.👉డ్రాప్‌డౌన్ మెనూ నుంచి తగిన డాక్యుమెంట్ రకాలను ఎంచుకుని స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఫైళ్లు JPEG, PNG లేదా PDF ఫార్మాట్ లో, 2MB కంటే తక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోండి.👉వివరాలన్నీ సరిచూసుకుని డాక్యుమెంట్ లను సబ్మిట్ చేయండి. తర్వాత మీకొక సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు (SRN) వస్తుంది. దీనితో అప్డేట్ స్థితిని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
ఆరోగ్య బీమా లేకపోతే పేదరికం తప్పదా?
మారుతున్న జీవనశైలితో అనారోగ్య పరిస్థితులు పెరుగుతున్నాయి. దాంతో ఆసుపత్రి ఖర్చులు అధికమవుతున్నాయి. వీటివల్ల మధ్య తరగతి ప్రజలు పేదరికంలోకి వెళుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ ఆరోగ్య బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునేవారికి సాధారణంగా కొన్ని అనుమానాలు, ప్రశ్నలు ఉంటాయి. వాటిలో కొన్నింటికి కింద సమాధానాలు తెలియజేశాం.ఆరోగ్య బీమా ప్రాథమిక ఉద్దేశం ఏమిటి?ఆసుపత్రిలో చేరడం, డాక్టర్ సంప్రదింపులు, చికిత్సలు, శస్త్రచికిత్సలు వంటి వైద్య ఖర్చులను కవర్ చేయడం ద్వారా ఆరోగ్య బీమా ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఇది ఊహించని ఆరోగ్య సంరక్షణ ఖర్చుల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఏమిటి?ఆరోగ్య బీమా ప్రీమియం అనేది ఆరోగ్య కవరేజీని నిర్వహించడానికి బీమా కంపెనీకి చెల్లించే మొత్తం. పాలసీ నిబంధనలను బట్టి నెలవారీగా, త్రైమాసికంగా లేదా వార్షికంగా చెల్లించవచ్చు.నెట్వర్క్ హాస్పిటల్ అంటే ఏమిటి?నెట్వర్క్ ఆసుపత్రులు నగదు రహిత చికిత్సను అందించడానికి బీమా సంస్థలతో ఒప్పందం కలిగి ఉంటాయి. అంటే పాలసీదారుడు ముందస్తుగా వైద్య ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా బీమా సంస్థ నేరుగా ఆసుపత్రితో బిల్లులను సెటిల్ చేస్తుంది.క్యాష్ లెస్ క్లెయిమ్ అంటే ఏమిటి?క్యాష్ లెస్ క్లెయిమ్ ద్వారా పాలసీదారులు ముందుగా ఖర్చులు చెల్లించకుండానే నెట్ వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. బీమా సంస్థ నేరుగా వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. ఇది వైద్య ప్రక్రియకు అంతరాయం లేకుండా చూస్తుంది.హెల్త్ ఇన్సూరెన్స్‌లో ప్రీకండిషన్ షరతులు ఏమిటి?ప్రీకండిషన్ పరిస్థితి అనేది పాలసీని కొనుగోలు చేయడానికి ముందు నిర్ధారణ అయిన ఏదైనా అనారోగ్యం లేదా వైద్య పరిస్థితిని సూచిస్తుంది. కొన్ని బీమా సంస్థలు ఈ వైద్య పరిస్థితులకు చికిత్సను కవర్ చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్లను విధిస్తాయి.హెల్త్ ఇన్సూరెన్స్‌లో వెయిటింగ్ పీరియడ్ అంటే ఏమిటి?వెయిటింగ్ పీరియడ్ అనేది కొన్ని అనారోగ్యాలు లేదా చికిత్సలు కవర్ చేయలేని సమయం. ఉదాహరణకు పాలసీదారులు తమ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ముందు ప్రసూతి కవరేజీకి 2-4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చు.ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే ఏమిటి?ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో ఓకే పాలసీ ద్వారా కుటుంబ సభ్యులకు బీమా సదుపాయం కల్పిస్తారు. దీని ప్రీమియం వ్యక్తిగత పాలసీల కంటే ఎక్కువ ఉంటుంది.ఇదీ చదవండి: పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!వ్యక్తిగత, కమ్యునిటీ ఆరోగ్య బీమా మధ్య తేడా ఏమిటి?వ్యక్తిగత ఆరోగ్య బీమా ఒక వ్యక్తికి కవర్ ఇస్తుంది. అయితే కమ్యునిటీ ఆరోగ్య బీమా విభిన్న వ్యక్తులకు కవరేజీని అందిస్తుంది. తరచుగా ఈ పాలసీలను కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు అందిస్తాయి.నో క్లెయిమ్ బోనస్ అంటే ఏమిటి?ఏడాదిలో పాలసీని క్లెయిమ్ చేయని పాలసీదారులకు నో క్లెయిమ్ బోనస్ రివార్డుగా అందిస్తారు. ఇది డిస్కౌంట్ ప్రీమియంలు లేదా తదుపరి రెన్యువల్లో బీమా పెంపు వెసులుబాటు రూపంలో ఇస్తారు.మెడికల్ హిస్టరీని బహిర్గతం చేయడం ఎందుకు ముఖ్యం?వైద్య చరిత్రను వెల్లడించడంలో విఫలమైతే క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. కవరేజీ అర్హతను నిర్ణయించడానికి బీమా సంస్థలకు కచ్చితమైన ఆరోగ్య సమాచారం అవసరం. -
హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్..
‘కొనేటప్పుడు తక్కువకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువకు పోవాలి’ అని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే రాబడి ఎక్కువగా ఉన్న చోట కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్‌మెంట్సే ఎక్కువ రాబడి వస్తుందని ఓ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి ఏటా స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తుందని పేర్కొంది. - సాక్షి, సిటీబ్యూరోస్థలాల కొరతే కారణం.. పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని ఓ సంస్థ సీఈఓ తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం,అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని ఓ సంస్థ రీసెర్చ్ హెడ్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసిక కాలంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ. 2018–21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్ చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్బల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 🔸2018–21 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
అంతకు మించి పెరిగిన బంగారం..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం రోజున మోస్తరుగా తగ్గిన పసిడి ధరలు నేడు (మే 24) అంతకుమించి దూసుకుపోయాయి. దీంతో బంగారం తగ్గిందేలే అనుకుంటే మళ్లీ పెరిగిందంటూ కొనుగోలుదారులకు నిట్టూర్పు తప్పలేదు. మే 24 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,080🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.550, రూ.500 పెరిగాయి.👉ఇది చదివారా? బంగారానికి కావాలా లాకర్? టాప్ బ్యాంకుల్లో చార్జీలివే..చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,080🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.550, రూ.500 పెరిగాయి.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,230🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.550, రూ.500 పెరిగాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,080🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.550, రూ.500 పెరిగాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,080🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.550, రూ.500 పెరిగాయి. వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.100 తగ్గి రూ.1,10,900 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 క్షీణించి రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
IPO: కొత్త షేర్లు.. కొనుక్కుంటారా?
న్యూఢిల్లీ: స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్స్, పైపుల తయారీ కంపెనీ స్కోడా ట్యూబ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 130–140 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 27న షేర్లను విక్రయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 220 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 220 కోట్లు అందుకోనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 100 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.ఇష్యూ నిధులను సీమ్‌లెస్, వెల్డెడ్ ట్యూబ్స్, పైప్స్ ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. అంతేకాకుండా వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను కేటాయించనుంది. ధరల శ్రేణి ప్రకారం కంపెనీ విలువను రూ. 840 కోట్లుగా బ్రోకరేజీలు అంచనా వేశాయి. ఈపీసీ, ఇండస్ట్రియల్ కంపెనీలకు ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, విద్యుత్ తదితర రంగాలలో వీటిని వినియోగిస్తారు.27 నుంచి బ్లూ వాటర్ లాజిస్టిక్స్ ఐపీవో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ బ్లూ వాటర్ లాజిస్టిక్స్ ప్రతిపాదిత ఐపీవో మే 27న ప్రారంభమై 29న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు మే 26 బిడ్డింగ్ తేదీగా ఉంటుంది.పబ్లిక్ ఇష్యూ కోసం ఒక్కో షేరు ధర శ్రేణి 132–135గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా రూ. 40.50 కోట్లు సమీకరించనున్న బ్లూ వాటర్ సంస్థ ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫాంలో లిస్ట్ కానుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వాహనాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించుకోనుంది. -
బెంగళూరు వద్దు బాబోయ్.. ఆఫీస్ తరలిస్తున్న టెకీ..
దేశ ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో తరచూ భాష వివాదాలు రేగుతున్నాయి. ఉద్యోగం, ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్న భాషా నేపథ్యాలున్న వారు అక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలవారికి బెంగళూరులో స్థానికుల నుంచి భాషాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ టెక్ ఫౌండర్ తన కంపెనీ కార్యాలయాన్ని పుణెకు తరలించాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు కౌశిక్ ముఖర్జీ అనే ఎంట్రప్రెన్యూర్ ఇటీవల చెలరేగిన భాష వివాదంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. భాష వివాదాలతో కన్నడ మాట్లాడలేని తమ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడని, అందుకే బెంగళూరులోని తమ కంపెనీ కార్యాలయాన్ని పుణె తరలించనున్నట్లు తెలిపారు. తమ ఉద్యోగులు లేవనెత్తిన ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, వారి అభిప్రాయాలతో తానూ ఏకీభవిస్తున్నానని చెప్పారు.‘బెంగళూరులోని మా కార్యాలయాన్ని ఆరు నెలల్లో మూసేసి పుణెకు తరలించాలని ఈ రోజే నిర్ణయం తీసుకున్నా. భాష వివాదాలు ఇలాగే కొనసాగుతుంటే కన్నడ మాట్లాడలేని మా ఉద్యోగులు బాధితులు కావడం నాకు ఇష్టం లేదు. ఈ ఆలోచన ఉద్యోగుల ఆందోళల నుంచే వచ్చింది. వారి అభిప్రాయాలతో నేను ఏకీభవించాను’ అంటూ కౌశిక్ ముఖర్జీ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.బెంగళూరులోని చందాపుర ప్రాంతంలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో ఇటీవల మేనేజర్‌కు, కస్టమర్‌కు మధ్య భాషా వివాదం తలెత్తింది. మేనేజర్ కన్నడలో మాట్లాడేందుకు నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కన్నడ సంఘాలు, రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. మేనేజర్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదంటూ బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ వీడియోను షేర్ చేయగా కౌశిక్ ముఖర్జీ దానికి స్పందిస్తూ పోస్ట్ చేశారు. -
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాక్‌కు తంటాలు తప్పడం లేదు. యుద్ధ సమయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో పాక్ తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. దాంతో ఆర్థికంగా, వాణిజ్యం పరంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ నుంచి ఓడరేవుల ద్వారా వచ్చే సరుకుల రవాణాను భారతదేశం నిషేధించింది. ఇది ఆ దేశ దిగుమతులు, ఎగుమతులను గణనీయంగా ప్రభావితం చేస్తోంది.ఈ చర్య వల్ల పాకిస్థాన్‌కు, అక్కడి నుండి ఇతర దేశాలకు వెళ్లే ప్రత్యక్ష సర్వీసులను కోర్ షిప్పింగ్ లైన్లు నిలిపివేశాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాక్ ఫీడర్ నౌకలపై ఆధారపడవలసి వస్తుంది. ఈ నిషేధం వల్ల ముఖ్యంగా ఐరోపాతో దాయాది దేశం వాణిజ్యం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. భారతదేశంలోని ముంద్రా నౌకాశ్రయం పాక్ నుంచి యూరప్ వెళ్లే ఎగుమతులకు కీలకమైన ట్రాన్స్షిప్మెంట్ కేంద్రంగా ఉంది. కానీ పాక్ ఉగ్రవాదులు భారత పర్యాటకులను దారుణంగా హతమార్చిన నేపథ్యంలో భారత్ విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ను అమలు చేసింది. ఈ సమయంలో పాక్ సరుకు రవాణాను నిషేధించింది.భారంగా బీమా ఛార్జీలుప్రస్తుతం పాకిస్థాన్ షిప్పింగ్ కంపెనీలు కొలంబో, సలాలా, జెబెల్ అలీ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్స్ ద్వారా సరుకును రవాణా చేస్తున్నాయి. దాంతో పాక్ సంస్థలకు అదనంగా బీమా ఛార్జీలు భారంగా మారాయి. దాంతోపాటు పాకిస్థానీ అమ్మకందారులతో వ్యవహరించే వ్యాపారులను బ్యాంకు గ్యారంటీలు ఇవ్వమని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇది వాణిజ్య కార్యకలాపాలను మరింత క్లిష్టతరం చేస్తుంది.ఇదీ చదవండి: ‘భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధం’పేరుకుపోతున్న నిల్వలుఇప్పటికే కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కీలక పరికరాలు, ముడిసరుకులు, యంత్రాల దిగుమతుల్లో జాప్యాన్ని ఎదుర్కొంటుందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ధాన్యాలు, వస్త్రాల ఎగుమతులు కూడా దెబ్బతింటాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల పాకిస్థాన్‌లోని వివిధ టెర్మినల్స్ వద్ద ఎగుమతి కంటైనర్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. దాంతో సరుకుల రవానా ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఆలస్యం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. -
‘భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధం’
ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోసస్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సంస్థ సీఈఓ ఫాబ్రిసియో బ్లోయిసి తెలిపారు. ఇప్పటికే భారతదేశ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లో 9 బిలియన్ డాలర్ల(సుమారు రూ.75,960 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో మరింత పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందుందని తెలిపారు.ఇదీ చదవండి: భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్‌లో వేడుకలుభారత టెక్ రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని, వచ్చే 20 నుంచి 30 ఏళ్ల పాటు భారత ఆశయాలకు మద్దతు ఇవ్వాలని ప్రోసస్ భావిస్తున్నట్లు బ్లోయిసీ చెప్పారు. సృజనాత్మకత, వ్యవస్థాపకత కీలకంగా కంపెనీ పెట్టుబడి వ్యూహం ఉంటుందని తెలిపారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎకోసిస్టమ్‌లో భారతీయ స్టార్టప్‌లు వృద్ధి చెందేందుకు కంపెనీ సహకరిస్తుందని పేర్కొన్నారు. -
విస్తరణపై హైదరాబాద్ కంపెనీ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ (ఎస్‌జీఎల్‌టీఎల్) సామర్థ్యాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఉత్పత్తి సామర్థ్యాల పెంపుపై వచ్చే 2–3 ఏళ్లలో రూ. 130 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం 60 టన్నుల క్రేన్, 60 మి.మీ. మందం ఫ్యాబ్రికేషన్ సామర్థ్యం ఉండగా .. 100 టన్నుల క్రేన్, 100 మి.మీ. మందం ఫ్యాబ్రికేషన్ స్థాయికి పెంచుకోనున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే ప్రస్తుతమున్న 5 వెల్డింగ్ రోబోల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకోనున్నట్లు పేర్కొంది. తద్వారా అంతర్జాతీయంగా హెవీ ఇంజినీరింగ్ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోనున్నట్లు వివరించింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 3 శాతం పెరిగి రూ. 16 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 171 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని కీలకాంశాల్లోనూ రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు కంపెనీ ఎండీ నాగేశ్వరరావు కందుల తెలిపారు. జీఎల్ హక్కా జపాన్, ఐపీపీ యూఎస్ఏతో భాగస్వామ్యాలు, పటిష్టమైన ఆర్డర్ బుక్, కొత్త ప్రొడక్ట్ లైన్స్‌తో ఈసారి మరింత మెరుగ్గా రాణించగలమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు 1% క్షీణించి రూ. 169 వద్ద క్లోజయ్యింది. -
అశోక్ లేలాండ్ బోనస్ షేర్లు
ముంబై: వాణిజ్య వాహన రంగ దిగ్గజం అశోక్ లేలాండ్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 33 శాతంపైగా జంప్‌చేసి రూ. 1,246 కోట్లను తాకింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 934 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 13,542 కోట్ల నుంచి రూ. 14,696 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 12,037 కోట్ల నుంచి రూ. 13,097 కోట్లకు పెరిగాయి. ఈ నెల(మే) 22న చెల్లించిన(రెండో) రూ. 4.25 డివిడెండ్‌ను తుది డివిడెండ్‌గా ప్రకటించింది. మరోవైపు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. దీంతో ప్రతీ షేరుకి మరో షేరుని ఉచితంగా జారీ చేయనుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం రూ. 2,696 కోట్ల నుంచి రూ. 3,383 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 45,703 కోట్ల నుంచి రూ. 48,535 కోట్లకు ఎగసింది. వెరసి క్యూ4తోపాటు పూర్తి ఏడాదిలో రికార్డ్ ఆదాయం సాధించినట్లు కంపెనీ చైర్మన్ ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. గతేడాది మొత్తం వాణిజ్య వాహన విక్రయాలు 1,95,093 యూనిట్లను తాకాయి. కంపెనీ ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో షేను అగర్వాల్ పేర్కొన్నారు. 2025 మార్చికల్లా రూ. 4,242 కోట్ల నగదు నిల్వలున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.4 శాతం బలపడి రూ. 240 వద్ద ముగిసింది. -
ఐదేళ్లలో వజ్రాల డిమాండ్ రెట్టింపు
ముంబై: భారత్‌లో వజ్రాల వినియోగం 2030 నాటికి రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్టు డీబీర్స్ గ్రూప్ (డైమండ్ కంపెనీ) సీఈవో అల్కుక్ తెలిపారు. భారత్‌లో ఫరెవర్‌మార్క్ బ్రాండ్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సహజ వ్రజాభరణాలకు భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద మారెŠక్ట్గా ఉన్నట్టు తెలిపారు. గతేడాది చైనాను అధిగమించినట్టు చెప్పారు. ఏటా 12 శాతం చొప్పున డిమాండ్ పెరుగుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌తో సహజ వజ్రభరణాల డిమాండ్ 10 బిలియన్ డాలర్లలోపు ఉన్నట్టు చెప్పారు. భవిష్యత్ వృద్ధి పట్ల ఆశావహంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ ముంబైలో రెండు చొప్పున మొత్తం నాలుగు ఫరెవర్‌మార్క్ స్టోర్లను తెరవనున్నట్టు.. వచ్చే ఐదేళ్లలో 100 స్టోర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. కంపెనీ సొంత స్టోర్లతోపాటు, ఫ్రాంచైజీ రూపంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల పరిధిలో ఇవి ఉంటాయన్నారు. ఫరెవర్‌మార్క్ బ్రాండ్‌కు ఓమ్నిఛానల్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్) విధానం అనుసరిస్తామని డీబీర్స్ ఇండియా ఎండీ అమిత్ ప్రతిహారి తెలిపారు. ‘‘ఈ కామర్స్‌తోపాటు స్టోర్లను కూడా తెరుస్తున్నాం. భౌతిక స్టోర్ల అందుబాటు కూడా కీలకమే’’అని చెప్పారు. ఎల్‌జీడీలకు భవిష్యత్ ల్యాబ్ గ్రోన్ వజ్రాలకు (ఎల్జీడీ) వాణిజ్య పరంగా భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు కుక్ చెప్పారు. ఎల్జీడీల టోకు ధరలు 90 శాతం వరకు పడిపోయినట్టు తెలిపారు. ‘‘సహజ వజ్రాలు–ఎల్‌జీడీలకు మధ్య వ్యత్యాసంపై వినియోగదారుల్లో అవగాహన కలి్పస్తాం. దీంతో ఈ రెండింటి మధ్య తేడా చెప్పలేరన్న అపోహ తొలగిపోతుంది. వజ్రం ధ్రువీకరణ ప్రభావం ఇక మీదట పెరిగేదే’’అని వివరించారు. భారత్‌లో సహజ వజ్రాలకున్న డిమాండ్ నేపథ్యంలో మార్కెటింగ్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కుక్ తెలిపారు. సజహ వజ్రాలను టారిఫ్ పరిధి నుంచి అమెరికా మినహాయిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో సహజ వజ్రాల గనులు లేకపోవడంతో అక్కడ ఉత్పత్తికి అవకాశం లేదన్నారు. -
టారిఫ్‌లు, వలస విధానాల ఎఫెక్ట్
న్యూఢిల్లీ: టారిఫ్‌లు, యూఎస్ వలస విధానాలు ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశమున్నట్లు ఐటీ సేవల దిగ్గజం విప్రో తాజాగా అంచనా వేసింది. భారీ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల టారిఫ్‌లు, వాణిజ్య విధానాలు కంపెనీ ఆదాయం, బిజినెస్‌లను దెబ్బతీయవచ్చని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ వాణిజ్య ఆందోళనలు, నియంత్రణల వాతావరణం కంపెనీ కార్యకలాపాలకు ప్రస్తావించదగ్గ స్థాయిలో రిస్క్ లను కల్చించే వీలున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఆదాయంలో వృద్ధికి అంతర్జాతీయ మార్కెట్లపై అధికంగా ఆధారపడే ఐటీ సేవల దిగ్గజం విప్రో 2024–25 వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది. అమెరికా, యూరప్ దేశాలలో క్లయింట్లు అధికంగా కలిగిన కంపెనీ కొన్ని రంగాల క్లయింట్ల నుంచి అధికంగా బిజినెస్ లభిస్తుందని పేర్కొంది. అయితే ఆర్థిక మందగమనం, యూఎస్ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ప్రతికూల పరిస్థితులకు కారణంకావచ్చని అభిప్రాయపడింది. కంపెనీ ఆదాయంలో 62 శాతం యూఎస్, 27 శాతం యూరప్ నుంచి లభించే సంగతి తెలిసిందే. కంపెనీ సిబ్బంది సంఖ్య 2,33,346 కాగా.. గతేడాది (2024–25)లో రూ. 89,088 కోట్ల ఆదాయం అందుకుంది. నికర లాభం 19 శాతం ఎగసి రూ. 13,135 కోట్లను దాటింది. ఈ ఏడాది (2025–26) క్యూ1(ఏప్రిల్– జూన్)లో త్రైమాసికవారీగా 250.5–255.7 కోట్ల డాలర్ల ఆదాయం అంచనా వేస్తోంది. బీఎస్ఈలో విప్రో షేరు 0.6 శాతం బలపడి రూ. 247 వద్ద ముగిసింది. -
ఈవీలకు ‘హైబ్రిడ్’ దన్ను
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలతో హైబ్రిడ్ వాహనాలు పోటీపడటం కాకుండా వాటి విక్రయాలకు ఇతోధికంగా దోహదపడుతున్నాయని హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. ఈ రెండు రకాల కస్టమర్ల సెగ్మెంట్లు వేర్వేరుగా ఉంటున్నాయని పేర్కొంది. భారత్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లే క్రమంలో.. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే హైబ్రిడ్లు, సీఎన్జీలు, బయోఇంధనాలతో నడిచే వాహనాలకు ప్రాధాన్యం కొనసాగుతుందని వివరించింది. ‘స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎస్హెచ్ఈవీ), బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ) ఒకదాని మార్కెట్‌ను మరొకటి ఆక్రమించకుండా, వేర్వేరు వర్గాల కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా ఉంటున్నాయి. ఎస్హెచ్ఈవీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న రాష్ట్రాల్లో బీఈవీల అమ్మకాలు కూడా పటిష్ట వృద్ధిని సాధించాయి. దేశంలోనే అత్యధికంగా ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్హెచ్ఈవీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచి్చనప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్ఈవీ విక్రయాలకు సరిసమాన స్థాయిలో ఈవీల అమ్మకాల వృద్ధి నమోదైంది. ఎస్హెచ్ఈవీల విక్రయాలు, బీఈవీల అమ్మకాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని ఈ ధోరణితో తెలుస్తోంది‘ అని నివేదిక వివరించింది. ఎస్హెచ్ఈవీలను ప్రోత్సహిస్తే, ఈవీల విక్రయాలు తగ్గిపోతాయనేది అపోహ మాత్రమేనని తెలిపింది. కొత్త మోడల్స్ రాకతో గత ఆరు నెలల్లో ఈవీల వినియోగం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది.మరిన్ని ముఖ్యాంశాలు.. → గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1.9 శాతంగా ఉన్న ఫోర్ వీలర్ ఈవీల విక్రయాలు, ఆఖరు త్రైమాసికంలో 2.5 శాతానికి పెరిగాయి. → మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో (పీవీ) ఎస్హెచ్ఈవీల వాటా 2025 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 2.1 శాతంగా ఉంది. → ధరకు తగ్గ విలువను అందించే విధంగా ఉంటే ఈవీలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు సుముఖంగానే ఉంటున్నారు. విండ్సర్ కస్టమర్లు 7–8 ఏళ్ల తర్వాత బ్యాటరీ రీప్లేస్మెంట్ వ్యయం గురించి ఆందోళన చెందకుండా ఎంజీ సంస్థ లీజింగ్ ఆప్షన్లను ప్రవేశపెట్టడం, రేంజి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఎంఅండ్ఎం తమ బీఈవీల్లో భారీ బ్యాటరీని అందించడం మొదలైనవి సానుకూలాంశాలుగా ఉన్నాయి. → మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్), టయోటా కిర్లోస్కర్ కంపెనీలు ప్రవేశపెట్టిన ఎస్హెచ్ఈవీలు 2023 అలాగే 2024 ఆర్థిక సంవత్సరాల్లో డీజిల్ వేరియంట్ల మార్కెట్ వాటాను ఆక్రమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో డీజిల్ వేరియంట్లు, హైబ్రిడ్ల వాటా స్థిరంగా నమోదైంది. → కొత్త మోడల్స్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సమీప భవిష్యత్తులో హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరిగేందుకు దోహదపడనున్నాయి. -
పెరిగిన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) నష్టం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 253 కోట్లకు పెరిగింది. అంతక్రితం క్యూ4లో నష్టం రూ. 168 కోట్లు. ఇక సమీక్షాకాలంలో ఆదాయం రూ. రూ. 2,570 కోట్ల నుంచి రూ. 2,977 కోట్లకు చేరింది. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నష్టం రూ. 829 కోట్ల నుంచి రూ. 817 కోట్లకు తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అభివృద్ధి చేస్తున్న విమానాశ్రయం పనులు మార్చి ఆఖరు నాటికి సుమారు 69 శాతం పూర్తయినట్లు జీఏఎల్ తెలిపింది. నియంత్రణ సంస్థ ఏఈఆర్ఏ కొత్తగా జారీ చేసిన టారిఫ్ ఆర్డరుతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆదాయం, లాభదాయకత మరింత మెరుగుపడతాయని పేర్కొంది. ఈ ఆర్డరు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచి్చంది. దీన్ని గత ఆర్థిక సంవత్సరంలోనే జారీ చేసి ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవని సంస్థ వివరించింది. జీఏఎల్ లో భాగమైన సంస్థలు హైదరాబాద్, ఢిల్లీ, మోపా (గోవా) విమానా శ్రయాలను నిర్వహిస్తున్నాయి. అటు ఇండొనేషియాలోని మెడాన్ ఎయిర్పోర్ట్, గ్రీస్‌లోని క్రెటే ఎయిర్‌పోర్టు కూడా కంపెనీ నిర్వహణలో ఉన్నాయి. శుక్రవారం బీఎస్ఈలో జీఏఎల్ షేరు రెండు శాతం పైగా క్షీణించి రూ. 86.83 వద్ద క్లోజయ్యింది. -
కేంద్రానికి బంపర్ బొనాంజా
ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ రికార్డు స్థాయిలో రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2023–24) చెల్లించిన రూ. 2.1 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 27.4 శాతం అధికం. 2022–23లో ప్రభుత్వానికి ఆర్బీఐ రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ‘రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో జరిగిన 616వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో రూ. 2,68,590.07 కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు‘ అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల వేళ రక్షణ శాఖకు కేటాయింపులు భారీగా పెంచాల్సి రావడం, అమెరికా టారిఫ్‌లపరంగా నెలకొన్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వానికి ఇది సహాయకరంగా ఉండనుంది. ఆర్బీఐ ఏటా తన పెట్టుబడులపై వచ్చే అదనపు రాబడిని, డాలర్ మారకంలో మార్పుల వల్ల వచ్చే ప్రయోజనాలు మొదలైన వాటిని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో బదలాయిస్తుంది. ఈసారి ఇది రూ. 2.5 – రూ. 3 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. తాజా బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే ఆర్బీఐ ప్రకటించిన డివిడెండు సుమారు రూ. 0.4–0.5 లక్షల కోట్లు అధికమని, పన్ను వసూళ్లు లేక డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించలేకపోయినా, లేదా లెక్కకు మించి వ్యయాలు ఎదురైనా అధిగమించేందుకు ఇది సహాయపడగలదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. రిస్క్ బఫర్ 7.50 శాతానికి పెంపు.. అంతర్జాతీయ, దేశీ పరిస్థితులు, రిసు్కలు మొదలైన అంశాలను సమావేశంలో సమీక్షించినట్లు ఆర్బీఐ పేర్కొంది. అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ పనితీరును కూడా సమీక్షించి వార్షిక నివేదికకు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన కంటింజెంట్ రిస్క్ బఫర్‌ని (సీఆర్బీ) ఆర్బీఐ బ్యాలెన్స్ షీటులో 7.50 శాతానికి పెంచాలని సెంట్రల్ బోర్డ్ నిర్ణయించింది. 2023–24లో దీన్ని 6.5 శాతానికి పెంచారు. -
ఆనంద్ మహీంద్రాకు సింగర్ ట్వీట్: సాయం చేయండి అంటూ..
ఇండియన్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. సేఫ్టీ, దృఢమైన నిర్మాణం వంటి కారణాల వల్ల ఎక్కువ మంది ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడుతుంటారు. కానీ.. పంజాబీ సింగర్ అండ్ యాక్టర్ 'గిప్పీ గ్రెవాల్' (Gippy Grewal) మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశారు.నిరాశ కలిగించే ఎక్స్పీరియన్స్ అంటూ.. ''దయచేసి సాయం చేయండి అని మహీంద్రా రైస్, ఆనంద్ మహీంద్రాలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. నా టీమ్ కోసం రెండు స్కార్పియో ఎన్ కార్లను కొనుగోలు చేసాను. అయితే వాటిలో ఎప్పుడూ టెక్నీకల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతూనే ఉన్నాయి. డీలర్షిప్ సిబ్బంది కూడా సరైన పరిష్కారం చూపించడం లేదు'' అని రెండు స్క్రీన్షాట్లను షేర్ చేశారు.నేను ఇండియన్ బ్రాండ్‌కు పెద్ద అభిమానిని. ఈ కారణం చేతనే రెండు 'స్కార్పియో ఎన్' కార్లను కొనుగోలు చేసాను. కార్లలో సమస్యలు తలెత్తినప్పుడు.. సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తే, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సర్వీస్ సెంటర్‌కు వాహనాలు ఎన్నిసార్లు వచ్చాయో చూపించడానికి డీలర్షిప్ తమ వాహనాల ఎంట్రీ & ఎగ్జిట్ లాగ్ల కాపీని ఇవ్వడానికి కూడా నిరాకరించిందని సింగర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే..మొదటి వాహనంలో.. ఎల్ఈడీ డీఆర్ఎల్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సరిగ్గా పనిచేయడం లేదు. ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ బ్లింక్ అవుతుంది, తరచుగా ఫోన్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. డీలర్షిప్ ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది. రెండవ వాహనం కూడా ఇలాంటి సమస్యలే.. బూట్ స్పేస్ కూడా సమస్య కూడా ఉంది. ఇది తయారీ లోపం కావచ్చని గిప్పీ గ్రేవాల్ మెయిల్లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందించలేదు. తప్పకుండా తగిన పరిష్కారం చూపించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.Disappointing experience @MahindraRise @anandmahindra, please help, Bought 2 Scorpio-Ns for my team, but facing persistent tech issues & poor dealership experience. Requesting immediate resolution & investigation into Raj Vehicles, Mohali. @MahindraScorpio Mail Screenshot… pic.twitter.com/TJ7ZVWDPbs— Gippy Grewal (@GippyGrewal) May 23, 2025 -
ఎయిర్టెల్ యూజర్లకు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజీ
న్యూఢిల్లీ: కస్టమర్లకు క్లౌడ్ స్టోరేజీ ప్రయోజనాలను అందించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్‌తో టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది.ఒప్పందం ప్రకారం ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లందరికీ ఆరు నెలల పాటు 100 జీబీ మేర గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్స్క్రిప్షన్ సర్వీసు ఉచితంగా లభిస్తుంది. దీన్ని మరో అయిదుగురితో షేర్ చేసుకోవచ్చు. 6 నెలల ఉచిత వ్యవధి పూర్తయిన తర్వాత నుంచి నెలకు రూ. 125 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.డివైజ్‌లలో డేటా స్టోరేజ్ పరిమితుల వల్ల మాటిమాటికీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో క్లౌడ్ స్టోరేజీ ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది. -
రెట్టింపైన ఛైర్మన్ సంపాదన: సీఈఓ కంటే తక్కువే..
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'వైభవ్ తనేజా' సంపాదన 2024లో ఏకంగా 139.5 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు ఇటీవలే తెలుసుకున్నాం. ఇప్పుడు విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 'రిషద్ ప్రేమ్‌జీ', సీఈఓ 'శ్రీనివాస్ పల్లియా' సంపాదనలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.దిగ్గజ ఐటీ కంపనీ విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ.. సంపాదన గత ఆర్ధిక సంవత్సరంలో 1.6 మిలియన్ డాలర్లు (రూ.13.66 కోట్లు). ఇది అంతకుముందు ఆర్ధిక సంవత్సరం కంటే రెట్టింపు. అయితే.. ఈ సంపాదన సీఈఓ శ్రీనివాస్ పల్లియా కంటే చాలా తక్కువ అని స్పష్టమవుతోంది.నిజానికి 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆశించిన లాభాలను పొందలేదు. దీంతో ఆ సమయంలో రిషద్ ప్రేమ్‌జీ ఎలాంటి కమీషన్ తీసుకోలేదు. అంతే కాకుండా.. తనకు వచ్చే వేతనంలో కూడా 20 శాతం కోతను విధించుకున్నారు. కాబట్టి అప్పుడు ఆయన సంపాదన రూ. 6.4 కోట్లకు పరిమితమైంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 18.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో ప్రేమ్‌జీ సంపాదన రూ.13.7 కోట్లకు చేరింది.విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సంపాదన విషయానికి వస్తే.. ఈయన గత ఆర్ధిక సంవత్సరంలో 6.2 మిలియన్ డాలర్లు (రూ.53.64 కోట్లు) సంపాదించారు. ఈ సంపాదన డెలాపోర్టేలో ఉన్నప్పటికంటే తక్కువే. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఈయన డెలాపోర్టేలో రూ.168 కోట్లు సంపాదించారు.ఇదీ చదవండి: గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?శ్రీనివాస్ పల్లియా మొత్తం సంపాదనలో వేతనం 1.7 మిలియన్ డాలర్లు మాత్రమే. అలవెన్సులు రూపేణా 1.7 మిలియన్ డాలర్లు సంపాదించారు. మిగిలిన 2.8 మిలియన్ డాలర్ల సంపాదన ఇతరత్రా ఉన్నాయి. 0.35 శాతం కమీషన్, ఇతర స్టాక్ ఆప్షన్స్ కూడా ఆయన సంపాదనలో మిళితమై ఉన్నాయి. -
యాపిల్‌కు ట్రంప్ వార్నింగ్.. భారత్‌లో ఐఫోన్ తయారు చేస్తే..
వాష్టింగ్టన్: భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో తయారు చేసిన ఐఫోన్లను అమెరికాలో అమ్ముతామంటే ఉపేక్షించబోనని ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా మినహాయించి ఇతర దేశాల్లో తయారు చేసిన ఐఫోన్లను దేశీయంగా అమ్మితే 25 శాతం టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌గా ఓ వేదికగా ఓ పోస్టును షేర్ చేశారు. అందులో ‘నేను చాలా కాలం క్రితమే నేను ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్‌కుక్ చెప్పాను. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలని, విదేశాల్లో కాదని. భారత్‌తో పాటు మరో ఇతర దేశంలోనైనా తయారు చేసిన ఐఫోన్లను ఇక్కడ అమ్మితే వాటిపై యాపిల్ కంపెనీ అమెరికాకు కనీసం 25 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే’అని పేర్కొన్నారు. Time for Apple to manufacture in America or pay the tariffs. pic.twitter.com/KOnDC8NKDr— Gunther Eagleman™ (@GuntherEagleman) May 23, 2025అయితే, ట్రంప్ విధించే టారిఫ్‌లు యాపిల్ ఒక్క కంపెనీకే పరిమితం అవుతుందా? లేదంటే అన్నీ కంపెనీలపై సుంకం విధిస్తారా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.మరోవైపు, అమెరికా,చైనా సుంకాల యుద్ధంతో అవరోధాలు తలెత్తుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ తయారీకి భారత్ ప్రత్యాహ్నాయంగా భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో భారీ ఎత్తున తయారీ రంగంలో పెట్టుపెట్టేందుకు సిద్ధమైంది. కాగా, యాపిల్ నివేదిక ప్రకారం.. జూన్ త్రైమాసికంలో అమెరికాలో అమ్మే ఫోన్లలో ఎక్కువ శాతం భారత్‌లో తయారు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. -
జొమాటో కొత్త ఛార్జీలు: దూరాన్ని బట్టి బాదుడే..
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్.. జొమాటో కొత్త ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 4 కి.మీ కంటే ఎక్కువ దూరం డెలివరీ చేసే ఫుడ్ ఆర్డర్ల కోసం ''లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు'' పేరుతో అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది.150 రూపాయల కంటే ఎక్కువ విలువైన ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. బుక్ చేసుకునే హోటల్/రెస్టారెంట్ దూరం 4 నుంచి 6 కి.మీ మధ్య ఉంటే రూ. 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ దూరం ఉంటే.. దూరాన్ని బట్టి అదనపు ఛార్జీ (రూ. 25, రూ. 35) మారుతుంది. ఈ ఛార్జీ మీరు ఎంత ధరకు ఫుడ్ బుక్ చేసుకున్నారు అనేదాని మీద ఆధారపడి ఉండదు.కోవిడ్-19 కి ముందు, జొమాటో 4-5 కి.మీ పరిధిలో ఉచిత డెలివరీని అనుమతించింది. మహమ్మారి తర్వాత, చాలా రెస్టారెంట్లు క్లోజ్ అయ్యాయి. దీంతో ఆ పరిమితిని 15 కి.మీ.లకు పొడిగించారు. తరువాత డెలివరీ ఫీజు వసూలు చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి అదనపు ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం.. కస్టమర్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచుతూ పోతుంటే.. ఫుడ్ కోసం ఖర్చు చేసే డబ్బుకంటే డెలివరీ కోసం చేసే ఖర్చు ఎక్కువవుతుందని కొందరు భావిస్తున్నారు. మొత్తం మీద జొమాటో నిర్ణయం వల్ల.. సంస్థ ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న సమయంలో చాలా కంపెనీలు సరికొత్త EVలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఏవి అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.టాటా హారియర్ ఈవీఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా సాగుతున్న.. టాటా మోటార్స్ జూన్ 3న హారియర్ ఈవీ లాంచ్ చేయనుంది. ఇది 500 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్ పొందుతుందని సమాచారం. కంపెనీకి చెందిన ఇతర కార్ల మాదిరిగానే ఇది కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. ధర, బుకింగ్స్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది.కియా క్లావిస్ ఈవీకియా మోటారు తన క్లావిస్ కారును ఈ రోజు (మే 23) రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి ఇంకా కొంచెం సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 400 నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: 24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్మహీంద్రా XUV 3ఎక్స్ఓ ఈవీఈ ఏడాది ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనున్న కంపెనీల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఉంది. ఈ కంపెనీ XUV 3ఎక్స్ఓ ఈవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు చాలా వరకు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. ఇది 456 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.మారుతి ఈ విటారామారుతి సుజుకి కూడా ఈ ఏడాది తన మొట్టమొదటి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించింది. ఇది సెప్టెంబర్ 2025 నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 48.8 కిలోవాట్ బ్యాటరీ, 61.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఆప్షన్స్ ఉండనున్నాయి. -
రూ.94 లక్షలు దాటేసిన బిట్‌కాయిన్: తొలిసారి..
బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్ విలువ కూడా అమాంతం పెరుగుతూనే ఉంది. మొదటిసారి బిట్‌కాయిన్ విలువ 1,12,000 డాలర్లకు (రూ. 94 లక్షల కంటే ఎక్కువ) చేరింది. ఓవైపు మదుపర్ల నుంచి గిరాకీ.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దీని విలువ భారీగా పెరుగుతోంది.బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. గురువారం ప్రారంభ ఆసియా ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ 3.3 శాతం పెరిగి 1,11,878 డాలర్లను దాటేసింది. రెండవ స్థానంలో ఉన్న ఈథర్ విలువ కూడా 7.3 శాతం పెరిగింది. అమెరికా సెనేట్‌లో స్టేబుల్‌కాయిన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత బిట్‌కాయిన్ విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టోకు అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే బిట్‌కాయిన్ వాల్యూ ఆల్ టైమ్ గరిష్టాలకు నెమ్మదిగా కదులుతోందని.. ఫాల్కన్ఎక్స్ లిమిటెడ్‌లోని గ్లోబల్ కో-హెడ్ ఆఫ్ మార్కెట్స్ జాషువా లిమ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..మైఖేల్ సాయిలర్ అనుబంధ సంస్థ ఇప్పటికే.. 50 బిలియన్ డాలర్ల (రూ. 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ) విలువైన బిట్కాయిన్లను కొనుగోలు చేసింది. అంతే కాకుండా.. కన్వర్టిబుల్ బాండ్స్, ప్రిఫర్డ్ స్టాక్స్ వంటి అనేక కొత్త టెక్ కంపెనీలు కూడా వివిధ మార్గాల్లో బిట్కాయిన్లను కొనుగోలు చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో బిట్‌కాయిన్ విలువ మరింత భారీగా పెరుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
ఈసారి ఆర్బీఐ డివిడెండ్ అదుర్స్..? త్వరలో నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తన డివిడెండ్ చెల్లింపుల వివరాలను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిగులు బదలాయింపులను నియంత్రించే ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్ (ఈసీఎఫ్ )ను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. రికార్డు స్థాయి అంచనాలతో ఈ ఏడాది డివిడెండ్ గత ఏడాది బదిలీ చేసిన రూ.2.1 లక్షల కోట్లను అధిగమించే అవకాశం ఉంది.రికార్డు స్థాయి డివిడెండ్ అంచనా2023-24లో ఆర్బీఐ చారిత్రాత్మకంగా రూ.2.1 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇది 2022-23లో ఇచ్చిన రూ.87,416 కోట్లతో పోలిస్తే రెట్టింపు కంటే అధికంగా ఉండడం గమనార్హం. మే 23న ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో రాబోయే చెల్లింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. గతంలో చేసిన డివిడెండ్ చెల్లింపుల కంటే ఈసారి చెల్లింపులు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు మరింత మద్దతు ఇవ్వడాన్ని హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: ప్రమోషన్స్‌పై వరుస ప్రకటనలు చేస్తున్న టాప్ ఐటీ కంపెనీకేంద్ర బడ్జెట్ 2025లో ఆర్బీఐ ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్ ఆదాయం రూ.2.56 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్ (ఈసీఎఫ్) ఆర్బీఐ నుంచి బదిలీ చేయదగిన మిగులును నిర్ణయిస్తుంది. బిమల్ జలాన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా 2019 ఆగస్టు 26న మొదటిసారి ఆమోదించబడిన ఈసీఎఫ్ ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో 6.5-5.5% వద్ద నిర్వహించే కంటింజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్‌బీఐ) ద్వారా తగినంత రిస్క్ ప్రొవిజనింగ్‌ను నిర్ధారిస్తుంది. -
స్పిరిట్ కంపెనీలో వివేక్ ఒబెరాయ్ పెట్టుబడి
ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ స్కాటిష్ బ్రాండ్ రట్ ల్యాండ్ స్క్వేర్ స్పిరిట్స్ లిమిటెడ్‌లో 21 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అందుకు ఎంతమేర డబ్బు వెచ్చించారనే విషయాలు వెల్లడికాలేదు. ఈ డీల్తోపాటు ఒబెరాయ్ ఎడిన్బర్గ్లో నెట్ జీరో ఉద్గారాలతో లగ్జరీ హోటల్‌ను అభివృద్ధి చేస్తున్నారు.ఐరోపాలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత సౌకర్యాలతో భారతీయ వారసత్వం తలిపించేలా, స్కాటిష్ సంప్రదాయాలను మిళితం చేస్తూ ఎడిన్బర్గ్లో హోటల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇది స్కాట్లాండ్లో తొలి ఆయుర్వేద వెల్నెస్ సెంటర్‌గా గుర్తింపు పొందనుందని అధికారులు చెబుతున్నారు. రట్లాండ్ స్క్వేర్ స్పిరిట్స్ లిమిటెడ్ దాని టీఇన్ఫ్యూజ్డ్ జిన్ తయారీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.ఇదీ చదవండి: ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!ఈ సందర్భంగా పెట్టుబడుల గురించి ఒబెరాయ్ మాట్లాడుతూ.. భారతదేశం, స్కాట్లాండ్ మధ్య సంబంధాలను పెంపొందించడాన్ని హైలైట్ చేశారు. యూకేలో బలమైన భారతీయ వ్యాపార కమ్యూనిటీ ఉందని నొక్కి చెప్పారు. లోతైన ఆర్థిక, సాంస్కృతిక సహకారానికి ఇరు ప్రాంతాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రమోషన్స్‌పై వరుస ప్రకటనలు చేస్తున్న టాప్ ఐటీ కంపెనీ
గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ జూన్ 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ సైకిల్‌ను ప్రకటిస్తున్నట్లు తెలిపిన రెండు రోజుల్లోనే మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే భారతదేశంలో 15,000 మందికి ప్రమోషన్ ఇస్తామని ప్రకటించింది. తాజాగా ఇండియాలోని మరో 43,000 మందికి ప్రమోషన్లు ఇస్తామని తెలిపింది. అదికూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేస్తామని పేర్కొంది.గతంలో ఐటీ కన్సల్టింగ్ డిమాండ్ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులపై పరిశీలన పెరగడంతో ఇటీవల ప్రకటించిన ప్రమోషన్లలో ఆరు నెలలపాటు జాప్యం జరిగింది. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు నిలిచిపోయిన ప్రమోషన్లను జూన్‌లో ప్రకటిస్తామని తెలిపింది.ఇదీ చదవండి: పసిడి ధర పతనం! తులం ఎంతంటే..ఈమేరకు యాక్సెంచర్ ఇండియా సీనియర్ కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ అంతర్గత నోట్లో వివరాలు వెల్లడించారు. ట్రాన్సిషన్ పీరియడ్ కారణంగా 2024 డిసెంబర్లో భారత్‌కు చెందిన 30,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరం జూన్ 1 నాటికి యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 97,000 మందికి పదోన్నతి కల్పించిందన్నారు. వీరిలో 702 మంది మేనేజింగ్ డైరెక్టర్లు, 64 మంది సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారని తెలిపారు. యాక్సెంచర్‌కు ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది ఉద్యోగులున్నారు. భారత్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. -
పసిడి ధర పతనం! తులం ఎంతంటే..
ప్రస్తుత కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లవైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో ఒడిదొడుకులకు లోనవుతోంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు కొంత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,400 (22 క్యారెట్స్), రూ.97,530 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.350, రూ.380 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,530 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.350 దిగి రూ.89,550కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.380 తగ్గి రూ.97,680 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా శుక్రవారం పడిపోయాయి. గురువారం ముగింపు ధరలతో పోలిస్తే కేజీ వెండి ధర రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
గూగుల్ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత తన జీవనశైలి మెరుగైందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి తెలిపారు. షావో చున్ చెన్(39) సింగపూర్‌లోని గూగుల్ కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు. కొన్ని కారణాలతో ఫిబ్రవరి 2024లో సంస్థ తనను తొలగించింది. చెన్ తన గూగుల్ కార్యాలయంలో వారానికి 40 గంటలకు పైగా పనిచేసేవారు.ఉద్యోగం పోయిన తర్వాత సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ లెక్చరర్‌గా చేరారు. అక్కడ వారానికి మూడు గంటలు మాత్రమే పనిచేస్తున్నాడు. థాయ్‌లాండ్‌లో ఉంటున్న 39 ఏళ్ల చెన్ ప్రతి వారం సింగపూర్‌కు విమానంలో ప్రయాణం చేస్తూ ఉద్యోగాన్ని సాగిస్తున్నాడని చెప్పాడు. తాను కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నట్లు తెలిపాడు. వారానికి మూడు గంటల పాటు డిజిటల్ మార్కెటింగ్ క్లాసు బోధిస్తూ నెలకు 2,000 నుంచి 4,000 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.1.33 లక్షల నుంచి రూ.2.6 లక్షలు) సంపాదిస్తున్నాని చెప్పాడు. ఈ డబ్బు తన ప్రయాణాలకు, థాయ్‌లాండ్‌లో తన కుటుంబ ఖర్చులకు సరిపోతుందని చెన్ చెప్పారు.ఇదీ చదవండి: సైబర్ మోసాల కట్టడికి ‘ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’2024 ఫిబ్రవరిలో గూగుల్ తనను తొలగించిన తర్వాత తాను ఆర్థికంగా స్వతంత్రుడినయ్యానని పేర్కొన్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు గూగుల్‌లో అనవసరంగా సమయం వృథా చేశానని చెప్పారు. అనుకోకుండా కంపెనీ తనను తొలగించడంతో మంచే జరిగిందన్నారు. ఇకపై ఎక్కువ కాలం జీతంపై ఆధారపడాల్సిన అవసరం లేదని గ్రహించినట్లు తెలిపారు. ఇప్పటికే చెన్ ఇతర మార్గాల ద్వారా సమకూరిన డబ్బుతో సుమారు 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.17 కోట్లు) పోర్టఫోలియోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అసిస్టెంట్ లెక్చరర్‌గా చేస్తూనే యూట్యూబ్‌లో ఎడ్యుకేషనల్ కంటెంట్, కోచింగ్ బిజినెస్ ద్వారా కూడా తాను డబ్బు సంపాదిస్తున్నానని తెలిపారు. ఆన్లైన్ కోచింగ్ ద్వారా గంటకు 500 డాలర్లు (సుమారు రూ.43,000) ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రిలీఫ్ ర్యాలీ.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
శుక్రవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 728.96 పాయింట్లు లేదా 0.90 శాతం లాభంతో.. 81,680.95 వద్ద, నిఫ్టీ 239.25 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,848.95 వద్ద నిలిచాయి.సిగ్మా సాల్వ్, ఖైతాన్ (ఇండియా), క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్, అపోలో పైప్స్, హొనస కన్స్యూమర్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, కృతి న్యూట్రియంట్స్, సంఘ్వీ మూవర్స్, ది గ్రోబ్ టీ, యూఎఫ్ఓ మూవీజ్ ఇండియా వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల భారీగా పడిన మార్కెట్లలో ఈ రోజు రిలీఫ్ ర్యాలీ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 173 పాయింట్లు పెరిగి 24,783కు చేరింది. సెన్సెక్స్(Sensex) 508 ప్లాయింట్లు ఎగబాకి 81,466 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.82 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 63.93 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌తో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.04 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం లాభపడింది.అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు గురువారం అరశాతానికిపైగా నష్టపోయాయి. అమెరికా ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు, బాండ్లపై రాబడులు పెరగడంతో ఐటీ, ఆయిల్, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా నిన్నటి మార్కెట్ సెషన్లో సెన్సెక్స్ 645 పాయింట్లు నష్టపోయి 80,952 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 204 పాయింట్లు కోల్పోయి 24,610 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1,107 పాయింట్లు క్షీణించి 80,490 వద్ద, నిఫ్టీ 351 పాయింట్లు పతనమై 24,462 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 5% మించగా, జపాన్ బాండ్ ఈల్డ్స్ 3.5 శాతానికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు డీలాపడ్డాయి.ఇదీ చదవండి: భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్‌లో వేడుకలురూపాయి 36 పైసలు క్రాష్విదేశీ బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో నిన్న రూపాయి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 36 పైసలు క్షీణించి 85.95 వద్ద స్థిరపడింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం ప్రపంచ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మధ్యప్రాచ్య దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడంతో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఈ పరిణామాలూ దేశీయ కరెన్సీపై ప్రభావాన్ని చూపాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్‌లో వేడుకలు
న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసీసీ) ఇండియా వీకెండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుంది. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు..వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకల నిర్వాహకుల వివరాల ప్రకారం.. ఈ ఉత్సవాలు ‘గ్రాండ్ స్వాగత్’ పేరుతో సెలబ్రిటీల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. ఈ హైప్రొఫైల్ ఈవెంట్లో మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇది భారతదేశం హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుంది. విజువల్ ఫీస్ట్‌కు అనుబంధంగా వికాస్ ఖన్నా తయారు చేసిన స్టార్ మెనూతో వంటకాలు ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’తో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయి. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్‌డేట్స్‌అతిథులు బాలీవుడ్ నృత్య వర్క్‌షాప్‌ల్లో పాల్గొనవచ్చు. గార్బా, దాండియా రాస్‌ను ఆస్వాదించవచ్చు. ‘ది గ్రేట్ ఇండియన్ బజార్’లో భాగంగా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఎస్‌ఎంఏసీసీ ఇండియా వీకెండ్ యూఎస్‌లో నిర్వహించే అతిపెద్ద భారతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఉండనుంది.ఈ కార్యక్రమంలో శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్, శాస్త్రీయ సంగీతకారుడు రిషబ్ శర్మ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఎడ్డీ స్టెర్నోతో మార్నింగ్ యోగా, క్రికెట్ థీమ్ ప్యానెల్స్, షియామక్ దావర్ నేతృత్వంలో బాలీవుడ్ డ్యాన్స్ వర్క్‌షాప్‌లు ఉంటాయి. ‘సంస్కృతి మనుషులను కలుపుతుంది. సహానుభూతిని పెంపొందిస్తుంది. 5,000 ఏళ్లకు సంబంధించిన భారతదేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు. -
బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్‌తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
సైబర్ మోసాల కట్టడికి ‘ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’
సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలికం శాఖ (డాట్) తాజాగా ‘ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’ (ఎఫ్ఆర్ఐ) పేరిట వినూత్న సాధనాన్ని ప్రవేశపెట్టింది. మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను రిస్కు స్థాయిని బట్టి ఇది వర్గీకరిస్తుంది. ఆ వివరాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం ద్వారా టెలికం శాఖ షేర్ చేస్తుంది.దీనిద్వారా రిస్కీ మొబైల్ నంబర్లతో ఆర్థిక లావాదేవీలను సత్వరం నిలిపివేసేందుకు ఇది ఉపయోగపడుతుందని డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణమైనవిగా కనిపించినా వాస్తవానికి సైబర్ ఫ్రాడ్ కేసులతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను గుర్తించేందుకు దీనితో అత్యధికంగా అవకాశాలు ఉంటున్నట్లు ఫోన్‌పే గణాంకాల్లో వెల్లడైందని డాట్ పేర్కొంది. సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, చక్షు ప్లాట్‌ఫాం, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లభించే వివరాల ప్రాతిపదికన మొబైల్ నంబర్లను ‘మధ్య స్థాయి’, ‘అధిక’, ‘అత్యధిక’ రిస్కుల కింద ఎఫ్ఆర్ఐ వర్గీకరిస్తుంది. ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ ఐపీవో సవాళ్లకు చెక్ఎయిర్టెల్ యూజర్లకు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజీకస్టమర్లకు క్లౌడ్ స్టోరేజీ ప్రయోజనాలను అందించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్‌తో టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లందరికీ ఆరు నెలల పాటు 100 జీబీ మేర గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌్రస్కిప్షన్ సర్వీసు ఉచితంగా లభిస్తుంది. దీన్ని మరో అయిదుగురితో షేర్ చేసుకోవచ్చు. 6 నెలల ఉచిత వ్యవధి పూర్తయిన తర్వాత నుంచి నెలకు రూ. 125 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డివైజ్‌లలో డేటా స్టోరేజ్ పరిమితుల వల్ల మాటిమాటికీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో క్లౌడ్ స్టోరేజీ ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది. -
ఎన్ఎస్ఈ ఐపీవో సవాళ్లకు చెక్
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూకి అడ్డుగా నిలుస్తున్న సమస్యలు త్వరలో పరిష్కారంకాగలవని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొన్ని అంశాల కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ఐపీవో ప్రతిపాదన సెబీ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లించిన పరిహారం, టెక్నాలజీ, క్లియరింగ్ కార్పొరేషన్లో మెజారిటీ ఓనర్షిప్ తదితరాలకు పరిష్కారం లభించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలనూ తొలగించేందుకు ఎన్ఎస్ఈ, సెబీ చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అసోచామ్ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాండే ఈ విషయాలు వెల్లడించారు. ఇందుకు గడువును ప్రకటించనప్పటికీ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలియజేశారు. ఎన్వోసీ కోసం సెబీకి ఎన్ఎస్ఈ తిరిగి దరఖాస్తు చేసిన నేపథ్యంలో పాండే వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. -
ఐటీసీ లాభం ఫ్లాట్
ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో పన్ను, అనూహ్య పద్దుకుముందు స్టాండెలోన్ నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 6,417 కోట్లకు చేరింది. సిగరెట్ల ఆదాయం పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా తోడ్పడింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 6,288 కోట్లు ఆర్జించింది. హోటళ్ల బిజినెస్ విడదీత తదుపరి ఫలితాలివి. ఐటీసీ హోటళ్ల విడదీతతో రూ. 15,179 కోట్ల వన్‌టైమ్ లాభం అందుకుంది. పట్టణాలలో వినియోగం మందగించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల డిమాండ్ అమ్మకాలకు అండగా నిలిచినట్లు ఐటీసీ పేర్కొంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 7.85 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. సిగరెట్ల బిజినెస్ ద్వారా 4 శాతం అధికంగా రూ. 5,118 కోట్ల అమ్మకాలు సాధించింది. కన్జూమర్ బిజినెస్ ఆదాయం 4 శాతం వృద్ధితో రూ. 5,495 కోట్లను తాకింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం 9 శాతం ఎగసి రూ. 18,266 కోట్లను తాకింది. పూర్తి ఏడాదికి...మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 20,092 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023–24లో లాభం రూ.19,910 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 66,657 కోట్ల నుంచి రూ. 73,465 కోట్లకు జంప్ చేసింది. ఇక హోటళ్ల బిజినెస్ తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్ 2024) రికార్డ్ నెలకొల్పుతూ రూ. 573 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించినట్లు ఐటీసీ వెల్లడించింది. అనూహ్య పద్దుతోపాటు, పన్నుకు ముందు లాభమిది. హోటళ్ల బిజినెస్‌ను 2025 జనవరిలో విడదీయడం తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 1.6 శాతం నష్టంతో రూ. 426 వద్ద ముగిసింది. -
బజాజ్ ఆటో చేతికి కేటీఎమ్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా ఆ్రస్టియన్ బైక్ తయారీ కంపెనీ కేటీఎమ్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు వీలుగా సొంత అనుబంధ సంస్థ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బీవీ ద్వారా ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న కేటీఎమ్‌కు డెట్ ఫండింగ్ ప్యాకేజీ ద్వారా 80 కోట్ల యూరోలు(సుమారు రూ. 7,765 కోట్లు) అందించనుంది. వెరసి కేటీఎమ్‌లో మైనారిటీ వాటాదారు స్థాయినుంచి మెజారిటీ (యాజమాన్య) సంస్థగా అవతరించనున్నట్లు బజాజ్ ఆటో తాజాగా వివరించింది. సంయుక్త డెవలప్మెంట్ పథకంలో భాగంగా కేటీఎమ్ బిజినెస్‌ను పట్టాలెక్కించనున్నట్లు తెలియజేసింది. అభివృద్ధి, తయారీ, అమ్మకాలు చేపట్టడం ద్వారా భారత్‌సహా 80 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించింది. డెట్ ఫండింగ్ ప్యాకేజీలో భాగంగా ఆ్రస్టియన్ కోర్టు ఆదేశాల ప్రకారం రుణదాతలకు తగినస్థాయిలో చెల్లింపులతోపాటు కంపెనీ కార్యకలాపాల పునరుద్ధరణకు నిధులు అందించనున్నట్లు వివరించింది. ఇప్పటికే 20 కోట్ల యూరోలు విడుదల చేయగా.. మిగిలిన 60 కోట్ల యూరోలను అందించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ కేటీఎమ్, హస్వానా, గస్గస్ పేరుతో సుప్రసిద్ధ మోటార్‌సైకిళ్ల బ్రాండ్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కేటీఎమ్ ఏజీ హోల్డింగ్ సంస్థ పీరర్ మొబిలిటీ ఏజీ(పీఎంఏజీ)కాగా.. తాజా లావాదేవీకి ముందు పీఎంఏజీ/కేటీఎమ్‌లో బజాజ్ ఆటో 37.5 శాతం వాటాను కలిగి ఉంది. బీఎస్ఈలో బజాజ్ ఆటో షేరు 0.5 శాతం బలపడి రూ. 8,734 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ లాభం నేలచూపు
ముంబై: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గతేడాది (2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 35% క్షీణించి రూ. 6,448 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 9,869 కోట్లు ఆర్జించింది. ముడిచమురు ఉత్పత్తి, రిఫైనరీలకు విక్రయంపై ఒక్కో బ్యారల్‌కు 73.72 డాలర్ల చొప్పున లభించినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం క్యూ4లో 80.81 డాలర్లు చొప్పున అందుకుంది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 34,982 కోట్లను తాకింది. ఈ కాలంలో యథాతథంగా 4.7 మిలియన్ టన్నుల (ఎంటీ) చమురు ఉత్పత్తి చేసింది. సహజవాయు ఉత్పత్తి సైతం 4.951 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) నుంచి 4.893 బీసీఎంకు స్వల్పంగా మందగించింది. పూర్తి ఏడాదికి చూస్తే...మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఓఎన్జీసీ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 35,610 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం యథాతథంగా రూ. 1.37 లక్షల కోట్లకు చేరింది. చమురు ధరలు 5 శాతం తక్కువగా బ్యారల్‌కు 76.9 డాలర్లు చొప్పున లభించాయి. గ్యాస్ విక్రయాలపై ఒక్కో ఎంబీటీయూకి 6.5 డాలర్లు చొప్పున అందుకుంది. స్టాండెలోన్ చమురు ఉత్పత్తి 18.558 ఎంటీకి చేరగా.. సహజవాయు ఉత్పత్తి 19.654 బీసీఎంగా నమోదైంది. గత 35ఏళ్లలోనే అత్యధికంగా 578 బావులలో తవ్వకాలు చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. 2023– 24లో 544 బావులలో తవ్వకాలు సాగించింది. ఈ కాలంలో మొత్తం రూ. 62,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో 3% నష్టంతో రూ. 242 వద్ద ముగిసింది. -
నైపుణ్యాలు, ఉద్యోగ పురోగతికే ప్రాధాన్యం
ముంబై: కంపెనీల కార్యకలాపాల్లో ఆటోమేషన్, జెనరేటివ్ ఏఐ వినియోగం విస్తరిస్తుండడంతో.. జెనరేషనల్ జెడ్, మిలీనియల్స్ తరగతి యువత నైపుణ్యాలు పెంచుకునేందుకు, ఉద్యోగంలో పురోగతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగ నిర్ణయాల్లో పురోగతి, అభ్యాసనా అవకాశాలకే తమ ప్రాధాన్యమని డెలాయిట్ సర్వేలో వారు చెప్పారు. జెన్ జెడ్, మిలీనియల్స్‌లో 85 శాతం మంది ప్రతి వారం చివర్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు, పనిచేస్తూనే నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు డెలాయిట్ ఇండియా చీఫ్ హ్యాపినెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరి రంగన్ తెలిపారు. కాకపోతే వీరికి తగినంత మార్గదర్శకత్వం లభించడం లేదని డెలాయిట్ సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ మేనేజర్ల నుంచి మార్గదర్శనం కోరుకుంటుంటే.. అది కొందరికే లభిస్తున్నట్టు తెలిపింది. 505 మంది జెనరేషన్ జెడ్, 304 మిలీనియల్స్ అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా డెలాయిట్ తెలుసుకుంది. 1981–1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్‌గా, 1997–2012 మధ్యకాలంలో జని్మంచిన వారిని జెనరేషన్ జెడ్ కింద పరిగణిస్తుంటారు. పట్టాలు కాదు.. అనుభవానికే పెద్ద పీట వేగంగా మార్పులకు గురవుతున్న ఉద్యోగ మార్కెట్లో సంప్రదాయ డిగ్రీ అర్హతల కంటే.. అనుభవానికే అగ్ర తాంబూలం లభిస్తున్న విషయాన్ని ఈ సర్వే గుర్తు చేసింది. దీంతో సంప్రదాయ విద్యా వ్యవస్థ నాణ్యతపై సందేహాలు లేవనెత్తింది. 94 శాతం జెన్ జెడ్, 97 శాతం మిలీనియల్స్ సిద్ధాంతాల కంటే అనుభవానికే విలువ ఎక్కువని చెప్పారు. ఉన్నత విద్యపై 52 శాతం జెన్ జెడ్, 45 శాతం మిలీనియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్య వ్యయాలపై 36 శాతం జెన్ జెడ్, 40 శాతం మిలీనియల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన, ఒత్తిడి విషయంలో ఉద్యోగం కారణమవుతున్నట్టు 36 శాతానికి పైనే చెప్పారు. ఉద్యోగుల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి.. ‘‘ఉద్యోగుల సంతోషం, శ్రేయస్సు విషయంలో సంస్థలు తమ విధానాలను తిరిగి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. భౌతిక, మానసిక, ఆర్థిక శ్రయస్సు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నాయకత్వం స్థాయిలో వీటిని పరిష్కరించాల్సి ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. -
బెంగళూరులో శాప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ఆర్లాండో: జర్మన్ ఐటీ దిగ్గజం శాప్ కొత్తగా బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని(సీవోఈ) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులో సుమారు 15,000 సీటింగ్ సామర్థ్యంతో దీన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. బెంగళూరులోని దేవనహళ్ళిలో 41 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానుంది. 1998 నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న శాప్ ల్యాబ్స్ ఇండియాలో ప్రస్తుతం హైదరాబాద్ సహా అయిదు నగరాల్లో 14,000 మంది సిబ్బంది ఉన్నారు. జర్మనీ వెలుపల కంపెనీకి అతి పెద్ద పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రం ఉన్నది భారత్‌లోనే. తమకు అతి పెద్ద డెవలప్మెంట్ సెంటర్స్‌లో భారత్ కూడా ఒకటని శాప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు ముహమ్మద్ ఆలం తెలిపారు. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, రిటైల్ సహా వివిధ వ్యాపార విభాగాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నట్లు వివరించారు. భారతీయ కంపెనీలు వేగవంతంగా కృత్రిమ మేథని (ఏఐ) అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఉల్లంఘనలపై దృష్టి
న్యూఢిల్లీ: ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో సీనియర్ యాజమాన్యం వైపు నుంచి ఏవైనా తీవ్రమైన ఉల్లంఘనలు చోటుచేసుకుంటే వాటిపై తప్పక దృష్టి సారిస్తామని సెబీ చైర్మన్ తుహిన్‌కాంత పాండే ప్రకటించారు. రూ.3,400 కోట్ల మేర ఖాతాల్లో మోసాలపై ఆరోపణలు రావడం తెలిసిందే. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో సమస్యలను ఆర్బీఐ చూసుకుంటుందని.. సెక్యూరిటీస్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలను సెబీ పరిశీలిస్తుందని పాండే స్పష్టం చేశారు.అసోచామ్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పాండే పై విధంగా బదులిచ్చారు. మోసంలో కొందరు ఉద్యోగుల పాత్ర ఉందన్న అనుమానాన్ని ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డు వ్యక్తం చేస్తూ.. దీనిపై దర్యాప్తు సంస్థలు, నియంత్రణ సంస్థలకు నివేదించాలని యాజమాన్యాన్ని కోరడం గమనార్హం. డెరివేటివ్‌లు, సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియోలో మోసాలు వెలుగు చూడడం తెలిసిందే. సీనియర్ ఉద్యోగుల పాత్ర ఉందంటూ అంతర్గత ఆడిట్ తేల్చడంతో ప్రస్తుతం ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది. ఖాతాల మోసాల్లో సీనియర్ యాజమాన్యం పాత్ర ఉండొచ్చంటూ బ్యాంక్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచి్చంది. ఇప్పటి వరకు ఆడిటింగ్, దర్యాప్తులో గుర్తించిన లోపాలను మార్చి త్రైమాసికం ఫలితాల్లో పేర్కొన్నట్టు ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. డెరివేటివ్‌లో అక్రమాలకు సంబంధించి రూ.1,960 కోట్లను గుర్తించడంతోపాటు, తప్పుడు లెక్కలకు సంబంధించి రూ.674 కోట్లను రివర్స్ చేయడం గమనార్హం. మార్చి త్రైమాసికానికి బ్యాంక్ రూ.2,329 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఎన్ఎస్ఈ ఐపీవో సవాళ్లకు చెక్ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూకి అడ్డుగా నిలుస్తున్న సమస్యలు త్వరలో పరిష్కారంకాగలవని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొన్ని అంశాల కారణంగా నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) ఐపీవో ప్రతిపాదన సెబీ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లించిన పరిహారం, టెక్నాలజీ, క్లియరింగ్ కార్పొరేషన్లో మెజారిటీ ఓనర్షిప్ తదితరాలకు పరిష్కారం లభించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలనూ తొలగించేందుకు ఎన్ఎస్ఈ, సెబీ చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అసోచామ్ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాండే ఈ విషయాలు వెల్లడించారు. ఇందుకు గడువును ప్రకటించనప్పటికీ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలియజేశారు. ఎన్వోసీ కోసం సెబీకి ఎన్ఎస్ఈ తిరిగి దరఖాస్తు చేసిన నేపథ్యంలో పాండే వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. -
భారత్‌పై బ్రూక్‌ఫీల్డ్ భారీ అంచనాలు
ముంబై: న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే బ్రూక్‌ఫీల్డ్ అస్సెట్ మేనేజ్మెంట్ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. తన నిర్వహణలోని ఆస్తులను (ఏయూఎం) వచ్చే మూడేళ్లలో మూడు రెట్లు పెంచుకుని 100 బిలియన్ డాలర్లకు (రూ.8.5 లక్షల కోట్లు సుమారు) చేర్చే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయంగా తమ ఏయూఎం వచ్చే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సంస్థ ప్రెసిడెంట్ కానర్ టెస్కే తెలిపారు. ఇదే సమయంలో భారత్ తదితర వర్ధమాన మార్కెట్లలో వృద్ధి మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. భారత్‌లో ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో బ్రూక్‌ఫీల్డ్ ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తుండడం గమనార్హం. వచ్చే ఐదేళ్లలో నిర్వహణ ఆస్తులను మూడు లేదా నాలుగింతలు చేసుకోగలమన్న అంచనాతో ఉన్నట్టు టెస్కే చెప్పారు. భారత జీడీపీ వృద్ధి 5.5 శాతానికి పడిపోయినా తమ ఆస్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. భారత్ మాదిరి ఆర్థిక వ్యవస్థకు అది మెరుగైన రేటే అవుతున్నారు. విలీనాలు.. కొనుగోళ్లు.. ప్రధానంగా విలీనాలు, కొనుగోళ్ల రూపంలో భారత్‌లోని తమ నిర్వహణ ఆస్తులు పెంచుకోనున్నట్టు కానర్ టెస్కే తెలిపారు. అదే సమయంలో ప్రస్తుత వ్యాపార వృద్ధిపైనా దృష్టి సారిస్తామని చెప్పారు. భారత్ వేగంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని చెబుతూ.. స్థిరమైన సరఫరా వ్యవస్థల కోసం చూసే కంపెనీలకు గమ్యస్థానం అవుతుందన్నారు. మౌలిక సదుపాయాలపై అధిక వ్యయాలు చేస్తుండడంతో ఈ రంగంలో తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో పెట్టుబడులపై రాబడులు తమ అంచనాలకు అనుగుణంగా లేదా అంతకుమించే ఉన్నట్టు టెస్కే తెలిపారు. బ్రూక్‌ఫీల్డ్ నిర్వహణ ఆస్తుల్లో 12 బిలియన్ డాలర్లు ఇన్ఫ్రాలో, మరో 12 బిలియన్ డాలర్నలు రియల్ ఎస్టేట్‌లో ఉండగా.. పునరుత్పాదక ఇంధన రంగంలో 3 బిలియన్ డాలర్లు, ప్రైవేటు ఈక్విటీలో 3.6 బిలియన్ డాలర్ల మేర నిర్వహిస్తోంది. యూఎస్ అనుసరిస్తున్న టారిఫ్‌ల విధానంతో భారత్‌కు ఎక్కువ ప్రయోజనకరమని టెస్కే అభిప్రాయపడ్డారు. -
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
ఆర్ధిక సంక్షోభం రాబోతోందని చెప్పిన.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసా'కి తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్లో గోల్డ్ రేటు గణనీయంగా పెరుగుతుంది స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుందని తెలుస్తోంది. ఆర్ధిక నిపుణులు కూడా పసిడి ధరలు అమాంతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు''ఇక్కడ ముగింపు ఉంది. లక్షలాది మంది యువకులు, వృద్ధులు ఆర్థికంగా తుడిచిపెట్టుకుపోతారు. బంగారం 25,000 డాలర్లకు చేరుతుంది. వెండి 70 డాలర్లకు చేరుతుంది. బిట్‌కాయిన్ 500000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ది బిగ్ ప్రింట్ పుస్తకాన్ని చదవండి. నేను ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న ముగింపు ఇక్కడ ఉందిని.. దేవుడు మన ఆత్మలపై దయ చూపాలి'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.THE END is HERE: WHAT if you threw a party and no one showed up?That is what happened yesterday. The Fed held an auction for US Bonds and no one showed up.So the Fed quietly bought $50 billion of its own fake money with fake money.The party is over. Hyperinflation is…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 21, 2025 -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న బంగారం: ఎందుకిలా..
భారతదేశంలో బంగారం ధరలు మళ్ళీ లక్ష రూపాయల ధర వద్దకు చేరువకు చేరుతున్నాయి. మే మొదటి వారం తరువాత తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేటు.. మళ్ళీ దూసుకెళ్తోంది. గురువారం గోల్డ్ మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగింది. దీంతో ధరలు మళ్ళీ పైపైకి పయనించాయి. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ నష్టాలను చవిచూశాయి.స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తున్న సమయంలో.. బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో రెండు రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర సుమారు 300 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు దాదాపు రూ. 98,000 వద్దకు చేరింది. ఇదిలా కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో.. తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకుంటుండటంలో ఎటువంటి సందేహం లేదు.స్టాక్ మార్కెట్లు డీలా పడుతుండటంతో.. పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇంతుకు ముందు ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు కొంత అనుకూలంగా ఉన్నట్లే అని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం ఎప్పుడూ భద్రమైన ఆస్తి, కాబట్టి పసిడి కొనుగోలు చేయడానికే ఆసతి చూపండి అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే ఉన్నారు. బంగారం కొనుగోలు చేస్తే.. పేదవారు కూడా భవిష్యత్తులో ధనవంతులవుతారని ఆయన చాలా రోజులకు ముందే వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కూడా ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, జాగ్రత్త పదండి.. అంటూ ఓ సుదీర్ఘ సందేశాన్ని వెల్లడించారు. -
24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్
ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన 'టీవీఎస్ ఎన్‌టార్క్ 125' మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ స్కూటర్ ఇటీవల 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో అనేక రికార్డులను బద్దలు కొట్టింది.2025 మే 4న నోయిడాలోని సెక్టార్-38 నుంచి ప్రారంభమైన రైడ్‌ను ప్రారంభించి 15 గంటల్లోపు దాదాపు 1000 కి.మీ. రైడ్‌ను పూర్తి చేసి, మొదటి రికార్డును బద్దలు కొట్టింది. ఆ తరువాత కొందరు రైడర్లు.. కేవలం 24 గంటల్లో 1618 కిమీ దూరాన్ని ఈ స్కూటర్‌పై ప్రయాణించి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ స్కూటర్ ఢిల్లీ-ఆగ్రా, ఆగ్రా-లక్నో & లక్నో-అజమ్గఢ్లతో సహా మల్టిపుల్ ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించింది.రైడింగ్ కోసం ఉపయోగించిన వేరియంట్స్ టాప్ ఎండ్ వేరియంట్స్ అయిన.. ఎన్‌టార్క్ రేస్ ఎక్స్పీ, డిస్క్, రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్, ఎక్స్‌టీ ఉన్నాయి. పర్ఫామెన్స్ బేస్డ్ స్కూటర్ ధరలు రూ. 87542 నుంచి రూ. 1.07 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.6.89 లక్షలకే కొత్త కారు!.. జూన్ 2 నుంచి బుకింగ్స్టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ 125 సీసీ ఇంజిన్ ద్వారా 10 Bhp పవర్ 10.9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 95 కిమీ/గం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. -
'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐలే కారణం'
టెక్నాలజీ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన క్యారెక్టర్.ఏఐ తన కొడుకు ఆత్మహత్యకు కారణమైందని ఓ తల్లి కోర్టు మెట్లెక్కింది.అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్సియా.. తన 14 ఏళ్ల కొడుకు 'సెవెల్ సెట్జర్' ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేసినట్లు పేర్కొంది. పిల్లల మానసిక బాధ లేదా ప్రవర్తన నుంచి బయట పడేయడంలో ఏఐ విఫలమైందని ఆ మహిళ ఆరోపించింది.ఏఐ చాట్‌బాట్ పట్ల ఒక యువకుడు ఎంతగానో మక్కువ పెంచుకున్నాడనే దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చాట్బాట్ల అవుట్‌పుట్ రాజ్యాంగబద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నే కాన్వే ఏకీభవించలేదు. అంతే కాకుండా కంపెనీ తప్పకుండా జవాబుదారీ తనంతో ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులుఏఐ చాట్‌బాట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అయితే అడిగే ప్రశ్న మంచిదా?, ప్రమాదాన్ని కలిగిస్తుందా? అనే విషయం ఏఐ గుర్తించడం లేదు. ఒక వ్యక్తి ఎలా చనిపోవాలి అని అడిగితే.. దానికి కూడా తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. మానసిక బాధతో ఉన్న వ్యక్తులు ఏఐను ఒక ఫ్రెండ్ లేదా అంతకంటే ఎక్కువే అనుకుంటారు. అలాంటి సమయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఎలాంటిదో.. ముందు ఏఐ దానిని తప్పకుండా గమనించేలా కంపెనీలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు
ఏఐ రాకతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతోంది. హ్యుమానాయిడ్ రోబోలు ప్రతి పనిలోనూ ఊహించినదానికంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి. మానవుల కంటే వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మనుషులు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పటికే జపాన్, చైనా వంటి దేశాల్లో రోబోలను నిర్మాణ పనులలో ఉపయోగిస్తున్నారు. ఇవి మనుషుల కంటే వేగంగా గోడ కేట్టేస్తున్నాయి, ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తున్నాయి. నిర్మాణ పరిశ్రమలో రోబోలు గణనీయమైన మార్పులు తెస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.చైనాలో కొన్ని రోబోలను రాత్రి సమయంలో గ్యాస్ స్టేషన్లలో సేవలకు నియమించారు. ఇవి కస్టమర్లకు కావాల్సిన సేవలను అందిస్తున్నాయి. రాత్రి సమయంలో మనుషులు పని చేయడం కొంత కష్టమే. కానీ రోబోలు మాత్రం విశ్రాంతి తీసుకోకుండా.. పనిచేస్తూ ముందుకు సాగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణలోనూ.. సూచిక బోర్డులను వేయడంలోనూ రోబోలు పనిచేస్తున్నాయి.ఇప్పటికే విమానాశ్రయాలు, హోటల్స్ లేదా రెస్టారెంట్లలో.. రోబోలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనుషుల స్థానంలో ఇవి పనిచేస్తూ.. నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. ఫ్యాక్టరీలో సర్వీసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ వంటి పనుల్లో కూడా రోబోల వినియోగం ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికఎలక్ట్రిక్ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా రోబోలు పాత్ర ప్రశంసనీయం. హై వోల్టేజ్ పవర్ మరమ్మత్తుల సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రంగంలో రోబోలను ఉపయోగించడం వల్ల.. ప్రాణహాని ఉండదు. అంతే కాకుండా పని కూడా వేగవంతం అవుతుంది. మొత్తం మీద ప్రతి రంగంలోనూ మాయ చేస్తున్నట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by AI researches | AI (@airesearches) -
రూ.6.89 లక్షలకే కొత్త కారు!.. జూన్ 2 నుంచి బుకింగ్స్
దేశీయ మార్కెట్లో సరికొత్త 'టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్' లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). నాలుగు ట్రిమ్‌లలో లభించే ఈ కొత్త కారు.. పెట్రోల్, డీజిల్, CNG అనే మూడు ఇంజన్ ఎంపికలను పొందుతుంది. కంపెనీ దీని కోసం జూన్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభిస్తుంది.స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మంచి డిజైన్ పొందుతుంది. కొత్త ఎల్ఈడీ హెడ్లైట్లు, కొత్త గ్రిల్, బంపర్లు, 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్, ఫ్లష్ ఫిట్టింగ్ ఇల్యూమినేటెడ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ లైట్ బార్, టీ షేప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ మొదలైనవి ఉన్నాయి. ఇది డ్యూన్ గ్లో, ఎంబర్ గ్లో, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచెస్ ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, 8 స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్లైట్లు, వైపర్లు, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ అనేవి మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతాయి.1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ CNG ఇంజిన్స్ కలిగిన ఈ కారు మంచి పనితీరును అందిస్తుందని సమాచారం. ఇంజిన్ ఆటోమాటిక్ లేదా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికలను పొందుతాయి. CNG వేరియంట్ ఫ్యూయెల్ మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. -
టెక్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'వైభవ్ తనేజా' భారీ సంపాదన పొంది వార్తల్లో నిలిచారు. 2024లో ఈయన సంపాదన ఏకంగా 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11.94 వేలకోట్ల కంటే ఎక్కువ). ఇది మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల'.. గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్'ల కంటే చాలా ఎక్కువ.2024లో సుందర్ పిచాయ్ సంపాదన 10.73 మిలియన్ డాలర్లు కాగా, సత్యనాదెళ్ళ సంపాదన 79.106 డాలర్లు. దీన్ని బట్టి చూస్తే.. వైభవ్ తనేజా సంపాదన (139.5 మిలియన్ డాలర్లు) చాలా ఎక్కువ అని స్పష్టమవుతోంది. అంతకు ముందు 2020లో నికోలాకు చెందిన కిమ్ బ్రాడీ 80.6 మిలియన్ డాలర్ల సంపాదనతో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. దీనిని వైభవ్ అధిగమించారు.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికటెస్లాలో తనేజా బేసిక్ శాలరీ 400000 డాలర్లు (రూ. 3.4 కోట్లు). అయితే స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ వంటి ఇతర ప్రయోజనాల కారణంగా ఈయన సంపాదన గణనీయంగా పెరిగింది.ఎవరీ వైభవ్ తనేజా?ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసిన వైభవ్ తనేజా.. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ అండ్ రిటైల్ రంగాలకు సంబంధించిన మల్టిపుల్ కంపెనీలలో 17 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఈయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీని కూడా పూర్తి చేశారు. 2017లో టెస్లా కంపెనీలో కార్పొరేట్ కంట్రోలర్‌గా.. చేరిన వైభవ్ తనేజా సీఎఫ్ఓ వరకు ఎదిగారు. -
జీతం పెంచలేదని ఉద్యోగం మానేసిన మహిళ.. తర్వాత..
కంపెనీలో జీతం పెంచనందుకు ఉద్యోగం మానేసిన ఓ మహిళకు తిరిగి ఆ సంస్థ యాజమాన్యం పిలుపు అందించింది. గతంలో తాను డిమాండ్ చేసిన దానికంటే అధికంగా వేతనం చెల్లిస్తామని చెప్పింది. దాంతోపాటు పదోన్నతి ఇస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ రెడ్డిట్‌లో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది.రెడ్డిట్ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. యూఎస్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్న మహిళ తన జీతం పెంచాలని మేనేజ్మెంట్కు వేడుకుంది. వేతన పెంపునకు చాలా కాలంగా వేచి చూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. జీతం కోసం అడిగిన ప్రతిసారి ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయడం లేదని, తగినంత అనుభవం లేదని, ఎదగడానికి ఇంకా సమయం పడుతుందని, ప్రస్తుతం తమకు బడ్జెట్ లేదని.. యాజమాన్యం చెబుతూ వచ్చింది. ఈ కారణాలతోనే నెలలు సాగదీశారు. దీన్ని తట్టుకోలేక ఆమె ఉద్యోగాన్ని వదిలేసింది.ఆరు నెలల తర్వాత, తాను వెళ్లిపోయినప్పటి నుంచి కంపెనీ పరిస్థితులు దిగజారాయి. దాంతో తనను తిరిగి కంపెనీలోకి రావాలని యాజమాన్యం వేడుకుంది. తాను ముందుగా డిమాండ్ చేసిన 15 శాతం కంటే అధికంగా 40 శాతం వేతనంలో పెంపు ఇస్తామని కంపెనీ పేర్కొంది. కానీ దానికి ఆమె విముఖత చూపడంతో 55 శాతం వేతన పెంపుతోపాటు పదోన్నతి ఇస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై మహిళ స్పందిస్తూ.. తాను కంపెనీలో ఎంతో కమిట్మెంట్తో పని చేశానని చెప్పారు. పనిలో మెరుగైన ఉద్యోగుల సామర్థ్యాలను సంస్థలు తక్కువ అంచనా వేయకూడదని తెలిపారు. చివరకు కంపెనీ ఆఫర్‌ను అంగీకరించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగిఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అందులో ఓ వ్యక్తి ‘ఇది చాలా సంతోషకర విషయం. ప్రతిభ కలిగిన ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి కంపెనీలు ఏమీ చేయడం లేదు. జీతాల పెంపు వల్ల కంపెనీలకు చాలా తక్కువే ఖర్చు అవుతుంది. కానీ వేతన పెంపు వల్ల ఉత్సాహంతో పని చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి’ అన్నారు. -
చమురుకు మరింత డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా చమురు వినియోగం వచ్చే దశాబ్ద కాలం పాటు గణనీయంగా పెరగనుంది. వార్షికంగా 4 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. ఎస్అండ్పీ గ్లోబల్‌లో భాగమైన ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఈ మేరకు అంచనాలు వెలువరించింది. దీని ప్రకారం 2025లో ఇప్పటివరకు ఆయిల్ వినియోగం రోజుకు 4.8 మిలియన్ బ్యారెళ్లుగా (ఎంబీపీడీ) ఉంది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.3 శాతం పెరిగింది.చమురు ఎగుమతి దేశాల నుంచి సరఫరా పెరగడం, అంతర్జాతీయంగా డిమాండ్ కాస్త మందగించడం వంటి అంశాల కారణంగా ఈ ఏడాది చమురు రేట్లు కొంత నెమ్మదించినట్లు సంస్థ హెడ్ ఆఫ్ ఇండియా కంటెంట్ (క్రాస్ కమోడిటీస్) పులకిత్ అగర్వాల్ తెలిపారు. మెరుగైన ఆర్థిక వృద్ధి వంటి సానుకూలాంశాలతో భారత్‌లో ఆయిల్‌కు డిమాండ్ పెరుగుతోందన్నారు. అంతర్జాతీయంగా భారత్‌కి మరింత ప్రాధాన్యం లభిస్తోందని వివరించారు. రష్యా నుంచి వరుసగా నాలుగో ఏడాది కూడా నిరాటంకంగా సరఫరా కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు కొనుగోళ్లకు మనకు మరిన్ని వనరులు అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. పర్యావరణహిత ఇంధనాల వ్యయాలు తగ్గాలి.. పర్యావరణహిత ఇంధనాల వ్యయాలు ఎంత తక్కువగా ఉంటే అంత వేగంగా వాటి వైపు మళ్లడం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరి జోహర్ చెప్పారు. ఈ విషయంలో వివిధ టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వ విధానాలు, నియంత్రణ సంస్థల నిబంధనలు, కార్పొరేట్ల చొరవ మొదలైన అంశాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే, హరిత ఇంధనాల వైపు మళ్లినంత మాత్రాన పాత ఇంధనాల వినియోగం పూర్తిగా నిల్చిపోతుందనడానికి లేదని తెలిపారు. బొగ్గు నుంచి చమురుకు మారినప్పటికీ ప్రపంచంలో బొగ్గు వినియోగం ఆగిపోలేదన్నారు. వాస్తవానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత పెరిగిందని గౌరి తెలిపారు. మరోవైపు, టారిఫ్‌లపై ఆందోళనలతో దేశీ మార్కెట్లలో నిల్వలు పెరగడం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోవడం వంటి అంశాలపై ఆందోళన నెలకొన్నప్పటికీ 2025–26లో జీడీపీ వృద్ధికి మించి పెట్రోకెమికల్స్‌కు డిమాండ్ ఉంటుందని అసోసియేట్ డైరెక్టర్ స్తుతి చావ్లా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెమ్మదిస్తుండటం, టారిఫ్‌లపై అనిశ్చితి, మార్జిన్లు తగ్గడం, ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగిపోవడంలాంటి అంశాలతో సతమతమవుతున్న అంతర్జాతీయ పెట్రోకెమికల్ ఉత్పత్తిదారులు భారత్‌పై ఆశలు పెట్టున్నట్లు తెలిపారు. -
బంగారానికి కావాలా లాకర్? టాప్ బ్యాంకుల్లో చార్జీలివే..
బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారమే రూ.లక్ష వరకూ పలుకుతోంది. బంగారం సాధారణంగా చాలా మంది దగ్గర ఆభరణాల రూపంలోనే ఉంటుంది. వీటిని ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో తప్ప మిగిలిన సమయాల్లో పెద్దగా ధరించరు. ఈ నగలను ఇంట్లోని బీరువాల్లోనే భద్రపరుచుకుంటుంటారు. అయితే విలువైన బంగారు ఆభరణాలను ఇలా ఇంట్లో పెట్టుకుంటే వల్ల చోరీకి గురవుతాయేమోనన్న ఆందోళన చాలా మందిలో ఉంటుంది. అందుకే అనేక బ్యాంకులు బంగారంతోపాటు విలువైన డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు సేఫ్ డిపాజిట్ లాకర్ల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.ఈ సేఫ్ డిపాజిట్ లాకర్లలో బంగారం, డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు బ్యాంకులు కొంత చార్జీలను వసూలు చేస్తాయి. లాకర్ పరిమాణం, బ్రాంచ్ లొకేషన్ (గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ లేదా మెట్రో), బ్యాంక్ అంతర్గత విధానాల ఆధారంగా ఈ లాకర్లకు అద్దె ఛార్జీలు మారవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని నాలుగు టాప్ బ్యాంకులలో సేఫ్ డిపాజిట్ లాకర్ల చార్జీలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాకర్ పరిమాణం, స్థానాన్ని బట్టి మారుతూ ఉండే అంచెల ధరల నిర్మాణాన్ని అందిస్తుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు వర్తిస్తుంది. ఇది చిన్న, మధ్యతరహా లాకర్లకు రూ .500, పెద్ద, ఎక్స్ట్రా లార్జ్ లాకర్లకు రూ .1,000. వీటికి జీఎస్టీ అదనం.వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా):చిన్న లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.1,000 అర్బన్/ మెట్రో: రూ.1,500మీడియం లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.2,000 అర్బన్/ మెట్రో: రూ.3,000పెద్ద లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.5,000అర్బన్/ మెట్రో: రూ.6,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.7,000 అర్బన్/ మెట్రో: రూ.9,000పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సేఫ్ లాకర్ల కోసం అందుబాటు చార్జీలను వసూలు చేస్తోంది. కొన్ని నిర్దిష్ట మెట్రో శాఖలలో 25% ప్రీమియం వర్తిస్తుంది. కస్టమర్లు సంవత్సరానికి 12 సార్లు ఉచితంగా తమ లాకర్‌ను సందర్శించవచ్చు. ఆ తర్వాత ప్రతి అదనపు సందర్శనకు రూ .100 వసూలు చేస్తారు.వార్షిక ఛార్జీలు ఇలా.. (జీఎస్టీ కాకుండా)చిన్న లాకర్లు: రూరల్: రూ.1,000 సెమీ అర్బన్/ అర్బన్: రూ.1,250 అర్బన్/ మెట్రో: రూ.2,000మీడియం లాకర్లు: గ్రామీణం: రూ.2,200 సెమీ అర్బన్/ అర్బన్: రూ.2,500 అర్బన్/ మెట్రో: రూ.3,500పెద్ద లాకర్లు: రూరల్, సెమీ అర్బన్: రూ.3,000 అర్బన్/ మెట్రో: రూ.5,500ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: రూరల్, సెమీ అర్బన్: రూ.6,000 అర్బన్/ మెట్రో: రూ.8,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: అన్ని ప్రాంతాల్లో: రూ.10,000ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): చిన్న లాకర్లు: గ్రామీణం: రూ.1,200 సెమీ అర్బన్: రూ.2,000 అర్బన్: రూ.3,000 మెట్రో: రూ.3,500 మెట్రో+: రూ.4,000మీడియం లాకర్లు: గ్రామీణం: రూ.2,500 సెమీ అర్బన్: రూ.5,000 అర్బన్: రూ.6,000 మెట్రో: రూ.7,500 మెట్రో+: రూ.9,000పెద్ద లాకర్లు: గ్రామీణం: రూ.4,000 సెమీ అర్బన్: రూ.7,000 అర్బన్: రూ.10,000 మెట్రో: రూ.13,000 మెట్రో+: రూ.15,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: గ్రామీణం: రూ.10 వేలు సెమీ అర్బన్: రూ.15,000 అర్బన్: రూ.16,000 మెట్రో: రూ.20,000 మెట్రో+: రూ.22,000హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): ఎక్స్ట్రా స్మాల్ లాకర్లు: మెట్రో: రూ.1,350 పట్టణ: రూ.1,100 సెమీ అర్బన్: రూ.1,100 గ్రామీణం: రూ.550చిన్న లాకర్లు: మెట్రో: రూ.2,200 పట్టణ: రూ.1,650 సెమీ అర్బన్: రూ.1,200 గ్రామీణం: రూ.850మీడియం లాకర్లు: మెట్రో: రూ.4,000 అర్బన్: రూ.3,000 సెమీ అర్బన్: రూ.1,550 గ్రామీణం: రూ.1,250ఎక్స్ట్రా మీడియం లాకర్లు: మెట్రో: రూ.4,400 పట్టణ: రూ.3,300 సెమీ అర్బన్: రూ.1,750 రూరల్: రూ.1,500పెద్ద లాకర్లు: మెట్రో: రూ.10,000 అర్బన్: రూ.7,000 సెమీ అర్బన్: రూ.4,000 గ్రామీణం: రూ.3,300ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: మెట్రో: రూ.20,000 పట్టణ: రూ.15 వేలు సెమీ అర్బన్: రూ.11,000 గ్రామీణం: రూ.9,000🔶 లాకర్ సదుపాయాన్ని ఎంచుకునేటప్పుడు ధర మాత్రమే ముఖ్యం కాదు. లభ్యత, ఎంత దగ్గరలో ఉంది, లాకర్ పరిమాణం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. ముందస్తు సరెండర్ పాలసీలు లేదా రిజిస్ట్రేషన్ ఫీజులు వంటివి ఏవైనా అదనపు నిబంధనలు ఉన్నాయేమో చూసుకోవాలి. -
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
సరైన పూచీకత్తు లేకుండా బంగారు రుణాలు మంజూరు చేసిన కేసులో ఇద్దరు ఎస్బీఐ ఉద్యోగులపై కేసు నమోదైంది. వడ్డీతో కలిసి సుమారు రూ.2.2 కోట్ల మేరకు మోసానికి పాల్పడినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని రాంనగర్ ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ డి.సునీల్ ఫిర్యాదుమేరకు పోలీసులు ఇద్దరు ఉద్యోగులతోపాటు మరో 18 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.ఫిర్యాదులోని వివరాల ప్రకారం, ఎస్బీఐలో సర్వీస్ మేనేజర్‌గా పని చేస్తున్న గుగ్లోత్ జైరాం నాయక్ క్యాష్ ఇన్ఛార్జ్ చీర్లా రుతుపవన్తో కలిసి విధులను దుర్వినియోగం చేశారు. సరైన పూచీకత్తు లేకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరుల పేరిట నకిలీ బంగారు రుణాలను మంజూరు చేశారు. ఇందులో మరో 18 మంది పాత్ర ఉంది. ప్రధాన నిందితుడు నాయక్ తన పదవిని దుర్వినియోగం చేశాడని, అంతర్గత విచారణలో నిందితుడు చేసిన మోసం బయటపడిందని ఆరోపిస్తూ మే 15న బ్రాంచి మేనేజర్ సునిల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.చెల్లుబాటయ్యే పూచీకత్తు లేకుండా, బ్యాంకు విధానాలను ఉల్లంఘించి ఈ రుణాలను ప్రాసెస్ చేసి ఆమోదించారని తెలిపారు. క్యాష్ ఆపరేషన్స్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ, అతను ఉద్దేశపూర్వకంగా ప్రామాణిక బ్యాంకు మార్గదర్శకాలను పట్టించుకోలేదని చెప్పారు. ఈ మోసంతో అక్రమంగా పోగు చేసిన రూ.2.2 కోట్ల నిధులను వివిధ వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి ఎల్లారెడ్డిగూడలోని ఓ ప్రైవేటు సంస్థకు మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగివడ్డీతో సహా రూ.2.2 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఇటీవల లిఖితపూర్వక వాంగ్మూలంలో నాయక్ అంగీకరించినట్లు బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) నిందితులపై సెక్షన్ 316(5) (ప్రభుత్వ ఉద్యోగి, లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత ఉల్లంఘన), 318(4) (మోసంతో ఆస్తి పంపిణీని ప్రేరేపించడం), ఆర్ / డబ్ల్యూ 61 (2) (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ మోసం ఇటీవల అంతర్గత ఆడిట్లో వెలుగు చూడడం గమనార్హం. ప్రధాన నిందితుడు నాయక్, రుతుపవన్ను అరెస్టు చేశారు. మిగతా నిందితుల పాత్రను పరిశీలిస్తున్నామని సీసీఎస్ అధికారి ఒకరు తెలిపారు. -
హైరేంజ్లో హైదరాబాద్
దశాబ్దాల చరిత్రను ఇముడ్చుకున్న హైదరాబాద్ చారిత్రక నగరం మరెన్నో చరిత్రలు తిరగరాస్తూ దూసుకుపోతోంది. అటు ఐటీ ఇటు రియల్టీ మరోవైపు ఫార్మా, ఇంకోవైపు సినిమా.. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురేలేదు అన్నట్టు ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఈ దూకుడు ఇలాగే కొనసాగనుందని, దేశంలోనే మన సిటీ అగ్రగామిగా అవతరించనుందని జేఎల్ఎల్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక వెల్లడించిన విశేషాల్లో కొన్ని.. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో అభివృద్ధి కేంద్రంగా నగరం స్థిరపడుతోంది. పలు రంగాల్లో ప్రగతితో పాటు ప్రణాళికా బద్ధమైన మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరించిన అంతర్జాతీయ స్థాయి జీవనశైలి కారణంగా నగరంలో నివాస, వాణిజ్య గిడ్డంగుల విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి కొనసాగుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, నగరంలో వచ్చే 3–4 సంవత్సరాల్లో లక్ష కొత్త నివాస యూనిట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధాన రిటైల్ కంపెనీలు నగరంలో తమ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.ఐటీ నుంచి స్టార్టప్స్ దాకా..నగరంలో ఐటీ/ఐటీఈఎస్ రంగం సిటీ దూకుడుకు దోహదం చేస్తున్న ప్రధానమైన డ్రైవర్‌గా నిలుస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నగరం 32 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ ఎగుమతులతో దేశంలోనే రెండో స్థానాన్ని సాధించింది. ఇక్కడ 4 వేలకు పైగా స్టార్టప్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోని మొత్తం గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాల్లో 15.6 శాతం భాగస్వామ్యంతో నగరం ముందంజలో నిలిచింది. అలాగే, దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో(జీసీసీఎస్) 17 శాతం నగరంలో ఉన్నాయి.హైదరాబాద్‌కి ఈ ఊపు ఎందుకు..?‘హైదరాబాద్‌లో 17 శాతం గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు(జీసీసీఎస్) ఉండటం దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన మలుపు కాగా ఈ కేంద్రాల నాణ్యత, పరిధి నగర స్థిరాభివృద్ధికి అండగా నిలుస్తాయి,’ అని ప్రముఖ ఆర్బర్ ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థాపకుడు చిరాగ్ మెహతా అన్నారు. జేయుఎస్‌టివో రియల్ ఫిన్ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పుష్పమిత్ర దాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రానున్న రెండేళ్లలో ఏడాదికి 17–19 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని జోడించనుందని, అలాగే, గిడ్డంగుల సామర్థ్యాన్ని మరో 4 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెంచనుందనీ తెలిపారు.ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్న అంశాల్లో ఆయన అభిప్రాయం ప్రకారం, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఒక సంతులిత ఆర్థిక వ్యవస్థను నిర్మించగలిగింది. ఇది ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్ ఇలా భిన్న రంగాల్లో వృద్ధిని చూపిస్తోంది. మెగా మాస్టర్ ప్లాన్ 2050, ముచెర్ల 4.0 ఐటీ హబ్, మెట్రో రైలు విస్తరణ వంటి ప్రణాళికలు నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా బెంగళూరుతో పోలిస్తే స్తిరాస్తి ధరలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యంగా మారిందని అన్నారు. ‘నాణ్యమైన వసతులు, తక్కువ ధరలతో వ్యాపారం నిర్వహించాలనుకునే సంస్థలకు హైదరాబాద్ గొప్ప అవకాశం. పలు రంగాల్లో సమతులిత అభివృద్ధి కనిపిస్తుండటంతో పాటు మౌలిక వసతుల పురోగతికి పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చు’ అని దాస్ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగిఆఫీస్ స్పేస్‌కి డిమాండ్.. మెరుస్తున్న మాల్స్2019 నుంచి ఇప్పటి వరకు 78.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ల గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాన్ని నగరం జోడించగా, 2024లో 7.31 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడం జరిగిందని జేఎల్ఎల్ పేర్కొంది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 6.1 శాతం అధిక వృద్ధిగా తేల్చింది. నగరంలోని గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ స్థలం 9.86 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా లెక్కించింది. ఇక నగరంలో రానురానూ ఖాళీ స్థలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన డిమాండ్‌కి సంకేతంగా భావించవచ్చు. మరోవైపు డేటా సెంటర్ల సామర్థ్యం కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో 23 మెగావాట్ల మేరకు పెరగనుంది. తద్వారా హైదరాబాద్ ఒక ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారనుంది. దీని సామర్థ్యం 2020 మొదటి అర్ధభాగంలో 32ఎం.డబ్ల్యూ నుంచి 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగి 130ఎం.డబ్ల్యూకు చేరుకుంటుంది. -
ఇవిగో కొత్త ఐపీవోలు.. కొనుక్కుంటారా షేర్లు?
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ కంపెనీ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 413–435 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. లీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బ్రాండుతో కంపెనీ ఆతిథ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2025 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 3,900 కోట్లుగా నమోదైంది. లీలా బ్రాండ్ సంస్థ 12 హోటళ్ల ద్వారా మొత్తం 3,382 గదుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఏజిస్ వొప్యాక్లాజిస్టిక్స్ రంగ సంస్థ ఏజిస్ వొప్యాక్ టెర్మినల్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 223–235 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. ప్రయివేట్ రంగ దిగ్గజం ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఇది. ఇష్యూలో భాగంగా రూ. 2,800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.తొలుత రూ. 3,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసినప్పటికీ రూ. 2,800 కోట్లకు కుదించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 63 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 2,016 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 671 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనుంది. ఈ నిధులతో మంగళూరులో క్రియోజెనిక్ ఎల్పీజీ టెర్మినల్‌ను కొనుగోలు చేయనుంది.కాగా.. కంపెనీ విలువను రూ. 26,000 కోట్లుగా బ్రోకరేజీలు మదింపు చేశాయి. 2024 జూన్‌కల్లా కంపెనీ రుణ భారం రూ. 2,584 కోట్లుగా నమోదైంది. కంపెనీ దేశవ్యాప్తంగా పెట్రోలియం, లూబ్రికెంట్స్, కెమికల్స్, ఎల్పీజీ, ప్రొపేన్ తదితర లిక్విడ్స్, గ్యాస్ సంబంధ స్టోరేజీ సౌకర్యాలను కలిగి ఉంది. కీలక పోర్టులకు సమీపంలో టెర్మినళ్లను ఏర్పాటు చేసింది.షిప్‌రాకెట్ ఐపీవో బాట Shiprocket IPO: ఈకామర్స్ సంస్థలకు సర్వీసులందించే షిప్‌రాకెట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా ప్రాస్పెక్టస్ వివరాలను తొలి దశలో రహస్యంగా ఉంచేందుకు వీలుంటుంది.కాగా.. టెమాసెక్, జొమాటో తదితర దిగ్గజాలకు పెట్టుబడులున్న కంపెనీ ఐపీవో ద్వారా రూ. 2,000–2,500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇష్యూ నిధులను ప్రొడక్ట్ డెవలప్మెంట్, వ్యూహాత్మక కొనుగోళ్లు, లాజిస్టిక్స్‌తోపాటు, వేర్‌హౌసింగ్ ఇన్ఫ్రా విస్తరణ తదితరాలకు వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాఆలు పేర్కొన్నాయి. -
కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగి
పని ప్రదేశంలో ప్రతికూల వాతావరణం కారణంగా రాజీనామా చేయవలసి వచ్చిందని మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతికా పాయ్ ఆరోపిస్తూ కంపెనీపై సివిల్ దావా వేశారు. రూ.35.3 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనను ఉద్దేశపూర్వకంగా రాజీనామా చేయించారని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు మే 7న ఈ కేసును విచారించి బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టుకు తరలించింది. దీనిపై జూన్ 9న బెంగళూరులో విచారణ జరగనుంది.స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎక్స్‌పర్ట్‌గా కంపెనీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాయ్ జులై 2024లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ పార్ట్నర్స్ కంట్రీ హెడ్‌గా పాయ్ ఉన్నారు. తాను నాయకత్వం వహించిన ఫ్లాగ్షిప్ స్టార్టప్ ఇనిషియేటివ్ ‘హైవే టు ఏ 100 యూనికార్న్స్’పై గతంలో కంపెనీ అంతర్గత దర్యాప్తు నిర్వహించింది. తరువాత ఎనిమిది నెలలపాటు తనపై బెదిరింపులకు పాల్పడినట్లు పాయ్ ఆరోపించారు. 2019లో మైక్రోసాఫ్ట్ వెంచర్ క్యాపిటల్ వ్యవహారాల్లో పక్షపాతంగా ఉంటున్నారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు పాయ్పై అభియోగాలు నమోదయ్యాయి. దాంతో దర్యాప్తు నిర్వహించి పాయ్ ఎలాంటి తప్పు చేయలేదని తేలడంతో 2021లో పదోన్నతి పొందారు.ఇదీ చదవండి: ‘రూ.కోట్లున్నా మాకొద్దీ వ్యాపారం..’ మారుతున్న దృక్పథంతర్వాత కొంత కాలానికి న్యాయ సంస్థ మోర్గాన్ లూయిస్ అండ్ బోకియస్ 2024 మార్చిలో రెండో దఫా దర్యాప్తును ప్రారంభించింది. అయితే మైక్రోసాఫ్ట్ విధానానికి విరుద్ధంగా 2024లో ఒక కీలక ఇంటర్వ్యూను రికార్డ్ చేయకుండా విచారణ నిర్వహించారని పాయ్ పేర్కొన్నారు. వీటిపై తన అభ్యంతరాలను కంపెనీ వ్యతిరేకించిందని చెప్పారు. ఆమెను కీలక పదవుల నుంచి తొలగించి ‘ట్రబుల్‌మేకర్’గా ముద్ర వేశారని తెలిపారు. 2020 సైబర్ బుల్లీయింగ్ కేసులో మైక్రోసాఫ్ట్ తగిన చర్యలు తీసుకోలేదని పాయ్ ఆరోపించారు. మైక్రోసాఫ్ట్ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సహకారం సందేహాస్పదంగా ఉందని ఆమె అన్నారు. -
పాదరసంలా పసిడి ధరలు! తులం ఇప్పుడు..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) పాదరసంలా కదులుతున్నాయి. క్రితం రోజున సర్రున ఎగిసిన పసిడి ధరలు నేడు (మే 22) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు మరింత భారం తప్పదు. మే 22 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.👉ఇది చదివారా? ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,060🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,900ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,910🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,750బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.490, రూ.450 పెరిగాయి. వెండి ధరలూ..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.1000 పెరిగి రూ.1,12,000 వద్దకు చేరింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.1000 ఎగిసి రూ. 1,01,000 లను తాకింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
గురువారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 644.64 పాయింట్లు లేదా 0.79 శాతం నష్టంతో 80,951.99 వద్ద, నిఫ్టీ 203.75 పాయింట్లు లేదా 0.82 శాతం నష్టంతో 24,609.70 వద్ద నిలిచాయి.కాస్మో ఫస్ట్, జై భారత్ మారుతి, నహర్ పాలీ ఫిల్మ్స్, రామ్‌కో సిస్టమ్, అలికాన్ కాస్టల్లాయ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్కే స్వామి, వడిలాల్ ఇండస్ట్రీస్, లింకన్ ఫార్మాస్యూటికల్స్, పారామౌంట్ కమ్యూనికేషన్స్, గీకీ వెంచర్స్ మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 225 పాయింట్లు దిగజారి 24,587కు చేరింది. సెన్సెక్స్(Sensex) 736 ప్లాయింట్లు పడిపోయి 80,813 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.51 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.89 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.58 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.61 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.41 శాతం పడిపోయింది.భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్నటి మార్కెట్లో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య అధికమవుతుంది. వారం రోజుల్లో 170కి పైగా కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లైట్ జర్నీ.. 1.43 కోట్ల మంది విమానమెక్కారు
న్యూఢిల్లీ: దేశీయంగా ఏప్రిల్‌లో 1.43 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1.32 కోట్లతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 8.45 శాతం పెరిగింది. మార్కెట్ వాటాపరంగా చూస్తే 64.1 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఎయిరిండియా గ్రూప్ (27.2 శాతం), ఆకాశ ఎయిర్ (5 శాతం), స్పైస్‌జెట్ (2.6 శాతం) ఉన్నాయి. 2025 జనవరి–ఏప్రిల్ మధ్యకాలంలో దేశీ విమానయాన సంస్థలు 5.75 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నెలవారీ రిపోర్టులో వెల్లడించింది. వార్షికంగా చూస్తే ఈ సంఖ్య 9.87 శాతం, నెలవారీగా చూస్తే 8.45 శాతం పెరిగినట్లు వివరించింది. సమయ పాలనపరంగా (ఓటీపీ) చూస్తే 80.8 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. 77.5 శాతం ఓటీపీతో ఆకాశ ఎయిర్, 72.4 శాతంతో ఎయిరిండియా గ్రూప్ .. ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. స్పైస్‌జెట్ సమయ పాలన అత్యంత కనిష్ట స్థాయిలో 60 శాతంగా నమోదైంది. -
‘రూ.కోట్లున్నా మాకొద్దీ వ్యాపారం..’ మారుతున్న దృక్పథం
భారతదేశంలో తరతరాలుగా వస్తున్న కుటుంబ వ్యాపారాల దృక్పథంలో మార్పులు వస్తున్నాయి. భారతీయ పారిశ్రామికవేత్తలు 79% మంది తమ వ్యాపారాలను వారి కుటుంబ సభ్యులకు బదిలీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ అది వెంటనే జరిగిపోవాలని అనుకోవడం లేదని హెచ్ఎస్బీసీ సర్వే తెలిపింది. అయితే అలా యోచిస్తున్న మొత్తం పారిశ్రామికవేత్తల్లో 45% మంది ప్రస్తుతం సమర్థంగా కొనసాగుతున్నవారు ఉన్నారు. 55% మంది మొదటితరం వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరిలో 35% మంది విభిన్న తరాలకు చెందినవారు ఇకపై వారి పిల్లలు తమ సంస్థలను నడపబోరేమోనని చెబుతున్నారు. వారసత్వ బాధ్యతల కంటే వారి పిల్లలు వ్యక్తిగత ఆకాంక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు.మొత్తంగా కేవలం 7 శాతం మంది భారతీయ వారసులు మాత్రమే కుటుంబ వ్యాపారాన్ని బాధ్యతగా కొనసాగించాలని భావిస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇది చైనాలో 60%గా ఉంది. భారతీయ యువత తమ ముందున్న వ్యాపార వారసత్వాలకు కట్టుబడి ఉండటం కంటే వారి అభిరుచులకు అనుగుణంగా ఉండే కెరియర్లను ఎంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలియజేస్తుంది. దేశంలో మొత్తంగా పారిశ్రామికవేత్తలు తమ వారసత్వానికి వ్యాపార బాధ్యతలు కట్టబెడితే సుమారు 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన సంపద బదిలీ జరుగుతుందని సర్వే తెలిపింది. ఇది దేశ జీడీపీలో 1/3వ వంతు ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్గ్లోబలైజేషన్, సాంకేతిక పురోగతి, వైవిధ్యమైన కెరియర్ అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నందున చాలా మంది యువ కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది వారి సొంత స్టార్టప్‌లను ప్రారంభించేందుకు దోహదం చేస్తుంది. వృత్తిపరమైన కెరియర్లను కొనసాగించడం లేదా పూర్తిగా భిన్నమైన పరిశ్రమల్లో పనిచేసేందుకు వీలు కల్పిస్తుందని కొందరు భావిస్తున్నారు. -
హోండా కొత్త స్కూటర్.. రూ.12 లక్షలు
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఎక్స్-ఎడివి మ్యాక్సీ స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ధర రూ .11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లాగా ఉంటూ మరోవైపు స్కూటర్ లాంటి సౌకర్యం ఉండేలా ఈ మ్యాక్సీ స్కూటర్ ను రూపొందించినట్లు హోండా పేర్కొంది. ఎక్స్-ఏఏడీవీ మ్యాక్సీ స్కూటర్ కోసం హోండా బిగ్ వింగ్ డీలర్ షిప్‌లలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూన్ నుండి ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.హోండా ఎక్స్-ఏడీవీ ప్రత్యేకతలుఇంజిన్& పవర్ ట్రయిన్: హోండా ఎక్స్-ఏడీవీ 745 సీసీ లిక్విడ్-కూల్డ్ ఎస్ఓహెచ్సి 8-వాల్వ్ పారలల్-ట్విన్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 6,750 ఆర్పీఎం వద్ద 57 బీహెచ్పీ శక్తిని, 4,750 ఆర్పీఎం వద్ద 69 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.డిజైన్ & హార్డ్‌వేర్: అడ్వెంచర్ అప్పీల్ వచ్చేలా ఎక్స్-ఏడీవీ మొత్తం డిజైన్‌ను రూపకల్పన చేశారు. డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, డీఆర్ఎల్ ఇచ్చారు. ముందు భాగంలో 17-అంగుళాల స్పోక్ వీల్, వెనుక భాగంలో 15-అంగుళాల స్పోక్ వీల్ ఉన్నాయి. సస్పెన్షన్ డ్యూటీ ముందు భాగంలో 41 ఎంఎం యూఎస్డీ ఫోర్కులు, వెనుక భాగంలో స్ప్రింగ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్‌లో డ్యూయల్ రేడియల్ మౌంట్ ఫోర్-పిస్టన్ కాలిపర్ ముందు భాగంలో 296 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్‌తో సింగిల్-పిస్టన్ కాలిపర్ ఉన్నాయి.ఫీచర్లు: హోండా ఎక్స్-ఏడీవీలో యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, 5-అంగుళాల ఫుల్-కలర్ టీఎఫ్టీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషషన్ , మ్యూజిక్, వాయిస్ కమాండ్ కంట్రోట్ వంటి ఫీచర్లున్న హోండా రోడ్ సింక్ యాప్‌ను ఈ స్కూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, గ్రావెల్ అనే నాలుగు డిఫాల్ట్ రైడింగ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. -
బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్‌తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగికరెన్సీ విలువ -
టీసీఎస్‌కు రూ. 2,903 కోట్ల ఆర్డర్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 2,903 కోట్ల యాడ్–ఆన్ అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డరు (ఏపీవో) దక్కించుకుంది. దీని ప్రకారం బీఎస్ఎన్ఎల్కు 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్వర్క్ ప్లానింగ్, ఇంజినీరింగ్, సరఫరా, ఇన్‌స్టాలింగ్, టెస్టింగ్, వార్షిక మెయింటెనెన్స్ మొదలైన సర్వీసులను టీసీఎస్ అందించాల్సి ఉంటుంది.ఏపీవోలో పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలకు లోబడి సవివర పర్చేజ్ ఆర్డర్లను (పీవో) బీఎస్ఎన్ఎల్ జారీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించి తాము టీసీఎస్‌కు సరఫరా చేసే రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ఆర్ఏఎన్), ఇతరత్రా పరికరాల విలువ సుమారు రూ. 1,526 కోట్లుగా ఉంటుందని తేజాస్ నెట్వర్క్స్ పేర్కొంది. నిర్దిష్ట షరతులకు లోబడి టీసీఎస్ సవివర పీవోలను జారీ చేస్తుందని వివరించింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నష్టాలు.. అవకతవకల ఎఫెక్ట్!
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో లాభాలనువీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 2,329 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఖాతాల అవకతవకలతో ప్రొవిజన్లు పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది. 2023–24 ఇదే కాలంలో రూ. 2,349 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు కొంతమంది ఉద్యోగుల పాత్రపై అనుమానాలతో బ్యాంక్ బోర్డు దర్యాప్తు ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలకు ఖాతాల మోసాలపై నివేదించమని బ్యాంక్‌ను ఆదేశించింది. ఖాతాల లోపాలు, మైక్రోఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో మోసం, బ్యాలెన్స్షీట్లో పొరపాటు అంశాలతో బ్యాంక్ సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అంతర్గత ఆడిట్‌కు ఆదేశించడం తెలిసిందే. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇండస్ఇండ్ నికర లాభం 71% పడిపోయి రూ. 2,576 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 8,977 కోట్ల లాభం సాధించింది. ప్రొవిజన్లు రూ. 3,885 కోట్ల నుంచి రూ. 7,136 కోట్లకు పెరిగాయి.ప్రొవిజనింగ్ జూమ్ క్యూ4లో ఇండస్ఇండ్ బ్యాంక్ రూ. 2,522 కోట్లమేర ప్రొవిజనింగ్ చేపట్టింది. అంతక్రితం క్యూ4లో ఈ పద్దు రూ. 950 కోట్లు మాత్రమే. 2023–24 క్యూ4లో రూ. 12,199 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో రూ. 1,979 కోట్లమేర ఖాతాలలో లోపం, మైక్రోఫైనాన్స్ బిజినెస్‌లో రూ. 674 కోట్ల వడ్డీ తప్పుగా నమోదు చేసినట్లు అంతర్గత ఆడిట్లో గుర్తించడం, బ్యాలెన్స్షీట్లో రూ. 595 కోట్ల ఇతర ఆస్తుల అక్రమ పద్దు తదితరాలను బ్యాంక్ మార్చిలో వెల్లడించింది.ఏప్రిల్ 29న సీఈవో సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా రాజీనామా చేశారు. దీంతో బ్యాంక్ బోర్డు కార్యకలాపాల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటు చేసింది. 2025 జూన్30లోగా కొత్త సీఈవో ఎంపికకు వీలుగా ప్రతిపాదనలు పంపమని బ్యాంక్‌ను ఆర్బీఐ ఆదేశించినట్లు ఇండస్ఇండ్ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు 1.4% క్షీణించి రూ. 771 వద్ద ముగిసింది. -
ఇండిగో లాభం ‘హై’జంప్
న్యూఢిల్లీ: దేశీ విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 3,067 కోట్లను అధిగమించింది. ఇది క్యూ4లో కంపెనీ సాధించిన రికార్డ్ లాభంకాగా.. ఇందుకు విమాన ప్రయాణికులు పెరగడం సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 1,895 కోట్లు ఆర్జించింది. ఇండిగో బ్రాండ్ విమాన సర్వీసుల కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 18,505 కోట్ల నుంచి రూ. 23,098 కోట్లకు ఎగసింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ప్రయాణికుల జోరు మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇండిగో నికర లాభం రూ. 7,258 కోట్లను అధిగమించింది. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే దాదాపు రూ. 8,868 కోట్ల లాభం ఆర్జించింది. గతేడాది 11.8 కోట్లమంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేసినట్లు సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. కాగా.. క్యూ4లో ఇండిగో ప్రయాణికుల టికెట్ ఆదాయం 25% జంప్‌చేసి రూ. 19,567 కోట్లను దాటింది. అనుబంధ విభాగాల ఆదాయం 25 శాతం అధికమై రూ. 2,153 కోట్లకు చేరింది. మొత్తం నగదు నిల్వలు రూ. 48,170 కోట్లను అధిగమించగా.. విమానాల సంఖ్య 400ను దాటింది. ఇండిగో షేరు బీఎస్ఈలో 0.4% లాభంతో రూ. 5,466 వద్ద ముగిసింది. -
మళ్లీ బంగారం రయ్..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలతో పసిడికి మరోసారి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,910 పెరిగి రూ.98,450 స్థాయికి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,870 లాభపడి రూ.98,000 స్థాయిని అందుకుంది.‘‘బలహీన డాలర్ పసిడి ధరలకు మద్దతునిచ్చింది. యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ డౌన్‌గ్రేడ్ చేయడంతో సావరీన్ రిస్క్‌ను సైతం ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. రేటింగ్ డౌన్‌గ్రేడ్‌తో దీర్ఘకాలంలో యూఎస్ ఆర్థిక స్థిరత్వంపై అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.మరోవైపు వెండి ధరలకు సైతం కదలిక వచ్చింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.1,660 పెరిగి రూ.99,160 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం 3,300 స్థాయిని దాటేసింది. స్పాట్ గోల్డ్ 22 డాలర్ల లాభంతో 3,312 డాలర్ల స్థాయికి చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు అమెరికా ఆర్థిక ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలతో బంగారం 3,300 డాలర్లను తిరిగి అందుకున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
ఈపీఎఫ్‌వోలోకి 14.58 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 14.58 లక్షల మంది సభ్యులు మార్చిలో నికరంగా చేరారు. వీరిలో సగం మంది (7.54 లక్షల మంది) కొత్త సభ్యులే కావడం గమనార్హం. అంటే మొదటివారి వీరు ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చారు. సంఘటిత రంగంలో పెరిగిన ఉపాధి అవకాశాలను ఇది ప్రతిఫలిస్తోంది. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా 2 శాతం వృద్ధి కనిపించింది. ఈ మేరకు మార్చి నెల పేరోల్ గణాంకాలు విడుదలయ్యాయి. → కొత్త సభ్యుల్లో 4.45 లక్షల మంది 18–25 ఏళ్ల వయసులోని వారే కావడం గమనార్హం. కొత్త సభ్యుల్లో వీరు 59 శాతంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల, గతేడాది మార్చి నెల గణాంకాలతో పోల్చి చూసుకున్నా 4 శాతానికి పైనే వృద్ధి నమోదైంది. → కొత్త సభ్యుల్లో 2.08 మంది మహిళలు ఉన్నారు. గతేడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 4.18 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరితో పోల్చి చూసుకుంటే 0.18 శాతం వృద్ధి నమోదైంది. మార్చిలో నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 2.92 లక్షలుగా ఉంది. → 13.23 లక్షల మంది ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరి తమ ఈపీఎఫ్ ఖాతాను ఆన్లైన్లో బదిలీ చేసుకున్నారు. → మార్చి నెలలో నికర సభ్యుల చేరికలో అత్యధికంగా 20.24 శాతం మంది మహారాష్ట్ర నుంచి ఉన్నారు. → తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, యూపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సభ్యులు చేరిక విడిగా 5 శాతానికి పైనే నమోదైంది. -
టారిఫ్ ప్రభావాలను భారత్ తట్టుకోగలదు
న్యూఢిల్లీ: యూఎస్ టారిఫ్‌లు, అంతర్జాతీయంగా వాణిజ్య ప్రతికూలతలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. భారత్ ఎగుమతులపై తక్కువ ఆధారపడడం.. అదే సమయంలో బలమైన సేవల రంగం అండతో అమెరికా టారిఫ్‌లను అధిగమించగలదని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనికితోడు దేశీ వృద్ధి చోదకాలు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. మరే వర్ధమాన దేశంతో పోల్చుకున్నా భారత్ మెరుగైన స్థితిలో ఉందని పేర్కొంది. ప్రైవేటు వినియోగం పెంపు, తయారీ సామర్థ్యాల విస్తరణ, మౌలిక సదుపాయలపై వ్యయాలు పెంచడం వంటివి.. అంతర్జాతీయ డిమాండ్ బలహీనతలను అధిగమించేందుకు సాయపడతాయని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నాయని.. ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతుగా నిలుస్తుందని వివరించింది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంపు డిమాండ్‌కు ఊతమిస్తుందని అంచనా వేసింది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు భారత్ కంటే పాక్‌కే ఎక్కువ నష్టం చేస్తాయని పేర్కొంది. ఆ దేశంతో భారత్‌కు పెద్దగా వాణిజ్య సంబంధాలు లేకపోవడాన్ని ప్రస్తావించింది. పైగా భారత్‌లో అధిక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి అంతా ఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉన్నట్టు తెలిపింది. కానీ, రక్షణ రంగంపై అధికంగా వెచి్చంచాల్సి వస్తే అది భారత్ ద్రవ్య పరిస్థితులపై ప్రభావం చూపిస్తుందని.. ద్రవ్య స్థిరీకరణ ఆలస్యం కావొచ్చని అభిప్రాయపడింది. భారత ఆటో రంగం మాత్రం అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. అమెరికా టారిఫ్‌ల కారణంగా ఏర్పడిన అనిశి్చతులతో 2025 సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను మూడీస్ 6.7 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఈ నెల మొదట్లో ప్రకటించడం తెలిసిందే. -
ప్రైవేట్ లేబుల్స్‌కి జై...
న్యూఢిల్లీ: దేశీయంగా వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. ప్రైవేట్ లేబుల్స్ వైపు మళ్లే వారు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం దాదాపు సగం మంది వినియోగదారులు ఇలా మొగ్గు చూపుతున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఒక సర్వే నివేదికలో తెలిపింది. ఈవై రూపొందించిన ఫ్యూచర్ కన్జూమర్ ఇండెక్స్ (ఎఫ్‌సీఐ) ఇండియా నివేదిక ప్రకారం సంప్రదాయ బ్రాండెడ్ ఉత్పత్తుల స్థానంలో స్టోర్ల సొంత బ్రాండ్లకు ప్రాచుర్యం పెరుగుతోంది. 52% మంది వినియోగదారులు ప్రైవేట్ లేబుల్స్‌కు మారారు. ప్రైవేట్ లేబుల్ బ్రాండ్లు మంచి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాయని విశ్వసిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 70% మంది తెలిపారు. అలాగే, బ్రాండెడ్ ఉత్పత్తులతో సరిసమానంగా ప్రైవేట్ లేబుల్స్ ప్రోడక్టులు తమ అవసరాలను తీర్చే విధంగా ఉంటున్నాయని భావిస్తున్నట్లు 70% మంది వినియోగదారులు పేర్కొన్నారు. ముడి సరుకులను లేదా ఫార్ములాను మార్చి, ఉత్పత్తిని మెరుగుపర్చి, వినూత్నంగా అందించేందుకు బ్రాండ్లు ప్రయత్నిస్తున్నా.. ఇవన్నీ నిఖార్సయిన ఆవిష్కరణలు కావని, కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రమేనని 34% మంది భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా వినియోగదారుల ధోరణులు మారడం సాధారణమే అయినా, ప్రస్తుత మార్పులు శాశ్వత ప్రాతిపదికన కొనసాగేలా కనిపిస్తోందని ఈవై–పారీ్థనన్ పార్ట్నర్ అంగ్షుమన్ భట్టాచార్య చెప్పారు.నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు.. → బ్రాండ్‌కు కట్టుబడి ఉండటం కన్నా డిస్కౌంట్లకే వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సేల్ పెట్టినప్పుడు మాత్రమే పెద్ద బ్రాండ్లను కొంటున్నామని 59 % మంది తెలిపారు. → రిటైల్ స్టోర్స్‌లో కూడా ప్రైవేట్ లేబుల్స్‌కి ప్రాధాన్యత పెరుగుతోంది. తాము షాపింగ్ చేసే చోట మరిన్ని ప్రైవేట్ లేబుల్ ఆప్షన్లు కనిపిస్తున్నట్లు 74 శాతం మంది చెప్పారు. స్టోర్లలోని షెల్ఫుల్లో సరిగ్గా కంటికి కనిపించే స్థాయిలో మరిన్ని ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులను డిస్ప్లే చేస్తున్నట్లు గమనించామని 70 శాతం మంది వివరించారు. స్టోర్ల సొంత బ్రాండ్లు, ప్రైవేట్ లేబుల్స్‌తో డబ్బు ఆదా అవుతోందని 69 శాతం మంది వినియోగదారులు చెప్పారు. → రిటైలర్లు మరింత ధీమాగా ప్రైవేట్ లేబుల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రధానమైన ప్రైమ్ షెల్ఫ్ స్పేస్ కూడా ఇస్తున్నారు. అలాగే, వినియోగదారులకు అపరిమిత ఆప్షన్లను, టెక్నాలజీతో ఇతర ఉత్పత్తులతో పోల్చి చూసుకునే వెసులుబాట్లను కలి్పస్తూ మెరుగైన షాపింగ్ అనుభూతిని అందిస్తున్నారు. → తాజా, కొత్త బ్రాండ్లకు భారత వినియోగదారుల్లో ప్రాచుర్యం పెరుగుతుండటాన్ని ప్రైవేట్ లేబుల్స్ వేగవంతమైన వృద్ధి సూచిస్తోంది. వినూత్న ఆవిష్కరణలతో వారికి మరింతగా చేరువయ్యేందుకు పెద్ద బ్రాండ్లు దృష్టి పెట్టాల్సిన అవసరం నెలకొంది. → అత్యుత్తమమైన రుచి, నాణ్యత లేదా పని తీరును అందిస్తే తిరిగి బ్రాండెడ్ ఉత్పత్తికి మళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని 47 శాతం మంది తెలిపారు. కట్టే డబ్బుకు మరింత మెరుగైన విలువను పొందడం కోసం తాము మళ్లీ బ్రాండెడ్ ఉత్పత్తులకు మళ్లే అవకాశం ఉందంటూ 44 శాతం మంది సూచనప్రాయంగా తెలిపారు. → కృత్రిమ మేధ(ఏఐ) కీలకమైన షాపింగ్ సాధనంగా మారింది. ఏఐ సిఫార్సుల ఆధారంగా తాము కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు 62 శాతం మంది చెప్పారు. తమ షాపింగ్ అనుభూతిని ఏఐ మరింత మెరుగుపర్చిందంటూ 58 శాతం మంది వినియోగదారులు తెలిపారు. -
జియో, ఎయిర్టెల్, వీఐ.. చవకైన రీచార్జ్ ప్లాన్లు ఇవే...
టెలికాం కంపెనీలు టారీఫ్‌లు పెంచిన తర్వాత మొబైల్ రీఛార్జ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో చవకైన రీచార్జ్ ప్లాన్ల కోసం వినియోగదారులు చూస్తుంటారు. అటువంటివారి కోసం కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటి అవసరమైన అన్ని ప్రయోజనాలను తక్కువ ధరలో అందించే రీచార్జ్ ప్లాన్లను ఇక్కడ అందిస్తున్నాం. జియో, ఎయిర్ టెల్, వీఐలు రూ.200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్, అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో, వినియోగదారులు మొత్తం 2 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), ఏ నెట్‌వర్క్‌లోనైనా లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అపరిమిత కాల్స్ పొందుతారు. ఈ ప్లాన్‌లో మొత్తం 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 2 జీబీ డేటా, మొత్తం 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అలాగే, ఈ ప్లాన్ అపరిమిత కాల్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియా రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 18 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్విఐ రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. -
తయారీలో భారత్ ముందడుగు
న్యూఢిల్లీ: తయారీ రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఎంతో ఆకర్షణీయంగా మార్చిందని ఎస్అండ్పీ గ్లోబల్ అధ్యయనం పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు దీర్ఘకాలంలో భారత్‌కు ప్రయోజనం కలిగిస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఎస్అండ్పీ గ్లోబల్ రీసెర్చ్ అధ్యయన నివేదికను విడుదల చేసింది.అభివృద్ధి చెందుతున్న పరిణామాలు, వాణిజ్య సవాళ్లకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలు మారుతున్నందున.. ఈ అవకాశాన్ని భారత్ సది్వనియోగం చేసుకుని తన తయారీ వృద్ధిని వేగవంతం చేసుకోగలదని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో మరింత బలంగా అనుసంధానం కాగలదని ఈ నివేదిక అంచనా వేసింది. స్థానికంగానే విడిభాగాల సమీకరణ, తుది మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా ఉండడం, ప్రాంతీయ అనుసంధానత పెంచుకోవడం ద్వారా భారత్ తయారీ రంగం మరిన్ని అదనపు పెట్టుబడులను ఆకర్షించొచ్చని సూచించింది.భారత్ అత్యాధునిక టెక్నాలజీ సామర్థ్యాలను, తయారీ పోటీతత్వాన్ని పెంచుకోవడం ద్వారా తయారీలో అదనపు ఉపాధి అవకాశాలను కల్పించొచ్చని పేర్కొంది. సరఫరా వ్యవస్థ వైవిధ్యంలో భాగంగా మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో భారత్‌కు ప్రయోజనం లభిస్తుందని వివరించింది. 2024–25లో భారత జీడీపీ వృద్ధి నిదానించినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్టు గుర్తు చేసింది.భారత వృద్ధిలో ఎగుమతులపై ఆధారపడడం మోస్తరుగానే ఉన్నట్టు తెలిపింది. ఈ సానుకూలత వల్లే అంతర్జాతీయ వాణిజ్యం, టారిఫ్ విధానాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న మార్పుల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని పేర్కొంది. భారత స్థూల జీడీపీలో తయారీ విలువ 17.2 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఇటీవలి తయారీ పీఎంఐ గణాంకాలు పటిష్టంగా ఉండడాన్ని ప్రస్తావించింది. -
కలరా వ్యాక్సిన్ మూడో దశ విజయవంతం
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్ బయోటెక్ కలరా వ్యాక్సిన్ పరీక్షల్లో పురోగతి సాధించింది. 1800 మందిపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ అధ్యయనంలో తమ ఓరల్ కలరా వ్యాక్సిన్ హిల్‌కోల్ విజయం సాధించందని, పెద్దలు, పిల్లలలో కలరాకు సంబంధించిన ఒగావా, ఇనాబా సెరోటైప్స్ రెండింటికీ వ్యతిరేకంగా పనిచేసిందని భారత్ బయోటెక్ తెలిపింది.కలరా అనేది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా కలిగించే అతిసార వ్యాధి. కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల ఇది సంక్రమిస్తుంది. ఏటా 28.6 లక్షల కేసులు నమోదవుతుండగా 95,000 మరణాలు సంభవిస్తున్నాయని అధ్యయనాలు అంచనా వేశాయి. ఓరల్ కలరా వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 10 కోట్ల డోసుల డిమాండ్ ఉందని, కేవలం ఒక తయారీదారు మాత్రమే వాటిని సరఫరా చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడిందన్నారు. హైదరాబాద్, భువనేశ్వర్‌లోని భారత్ బయోటెక్ కేంద్రాలు 20 కోట్ల డోసుల హిల్కోల్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది.ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని 18 ఏళ్లు పైబడిన పెద్దలు, 5 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలు, సంవత్సరం నుండి ఐదేళ్లలోపు చిన్నపిల్లలు మూడు గ్రూపులుగా విభజించి వ్యాక్సిన్ ప్రయోగించారు. అధ్యయన ఫలితాలు సైన్స్ డైరక్ట్ అనే వ్యాక్సిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. హిల్కాల్ వ్యాక్సిన్ ఒగావా, ఇనాబా సెరోటైప్లకు వ్యతిరేకంగా విబ్రియోసిడల్ యాంటీబాడీలను 4 రెట్లు అధికంగా తయారు చేసింది.ఈ అధ్యయన ఫలితాలు కఠినమైన పరిశోధన, సమగ్ర క్లినికల్ ట్రయల్స్, నమ్మదగిన క్లినికల్ డేటాతో వ్యాక్సిన్లను తీసుకొస్తున్న తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. సమర్థవంతమైన, అందుబాటు ధరల్లో వ్యాక్సిన్లను అందించడంలో తమ నిబద్ధత నిరంతరం కొనసాగుతుందన్నారు. -
యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..
దేశంలో జరిగే డిజిటల్ లావాదేవీల్లో అత్యధికం యూపీఐ (UPI) ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి అనేక యూపీఐ యాప్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో లోపాల ద్వారా వినియోగదారులు డబ్బులు పోగుట్టుకుంటున్న సంఘటనలూ అక్కడక్కడా జరగుతున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు త్వరలో రానున్నాయి.యూపీఐ లావాదేవీలో డబ్బులు అంతిమంగా ఎవరికి చేరుతున్నాయన్నది తప్పనిసరిగా ప్రదర్శించాలని యూపీఐ పేమెంట్, భారత్ బిల్ పే, రూపే కార్డ్‌లతోపాటు దేశంలోని అన్ని రిటైల్ చెల్లింపులను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.అంతిమ లబ్ధిదారు ఎవరన్నది పేయర్ యాప్‌లో అలాగే లావాదేవీ స్టేట్మెంట్, హిస్టరీలోనూ ప్రదర్శించాలని ఎన్పీసీఐ సర్క్యులర్‌లో తెలిపింది. సరైన లబ్ధిదారునికి డబ్బు పంపుతున్నామని వినియోగదారుల్లో విశ్వాసం కలిగించడానికి, సంభావ్య ప్రమాదాన్ని నివారించడానికి యూపీఐ యాప్‌లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.చేయాల్సిన మార్పులివే..యూపీఐ యాప్‌లు లావాదేవీకి ముందు వివరాల పేజీలో డబ్బు ఎవరికి వెళ్తుందో అంతిమ లబ్ధిదారుని పేరు (ధ్రువీకరించిన ఏపీఐ అడ్రెస్ ద్వారా సంగ్రహించిన లబ్ధిదారు బ్యాంకింగ్ పేరు) మాత్రమే వినియోగదారునికి కనిపించాలి. అలాకాకుండా క్యూఆర్ కోడ్ ల నుంచి సేకరించిన పేర్లు, చెల్లింపుదారు నిర్వచించిన పేర్లు లేదా మరే ఇతర పేర్లను యూపీఐ యాప్ లో పేయర్ కు ప్రదర్శించకూడదు.యాపీఐ యాప్‌లలో లావాదేవీలకు బెనిఫీషియరీ పేరును మార్చేందుకు వీలు కల్పించే ఫీచర్లు ఉంటే వాటిని తప్పనిసరిగా తొలగించాలి. ఆయా యూపీఐ యాప్‌లన్నీ జూన్ 30 నాటికి ఈ మార్పులు అమలు చేయాలి. లేకుంటే నిబంధనల ఉల్లంఘనగా భావించి చర్యలు తీసుకుంటామని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
అనుమతులు ఆలస్యం కారాదు: ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అనుమతుల్లో జాప్యం అనిశ్చితికి దారితీయడంతోపాటు, వాణిజ్యపరమైన ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కఠినమైన పర్యవేక్షణ కొనసాగిస్తూనే వేగవంతమైన, పోటీకి హాని చేయని సులభ అనుమతులు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 16వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతారామన్ పాల్గొని మాట్లాడారు.సమర్థతను పెంచే పోటీని ప్రోత్సహిస్తూ సరళీకరణ స్ఫూర్తిని కాపాడడంలో, ఆవిష్కరణలు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంలో సీసీఐ కీలక సంస్థగా అవతరించినట్టు మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ విధానాలు, చట్టాలు, నియంత్రణలు సైతం అవరోధాలుగా మారి పోటీని ప్రభావితం చేయరాదన్నారు. నేటి వేగవంతమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నియంత్రపరమైన అనుమతుల్లో జాప్యం అనిశ్చితులకు దారితీస్తాయని, సకాలంలో వాణిజ్య కార్యకలాపాలకు అవరోధం కల్పిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతిమంగా లావాదేవీల ప్రయోజనానికి నష్టం కలిగిస్తాయన్నారు.‘‘ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తున్నప్పుడు.. నియంత్రణ సంస్థల చురుకుదనం, సన్నద్ధతను ఇన్వెస్టర్లు గమనిస్తారు’’అని మంత్రి పేర్కొన్నారు. న్యాయపోరాటం, పరిష్కారానికి పట్టే సమయం లేక నియంత్రణ సంస్థలు తక్కువ పారదర్శకంగా ఉండే పరిస్థితుల్లో చర్చలు సంక్లిష్టంగా మారే అవకాశముంటుందన్నారు.అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ చర్చలు నిర్వహిస్తున్న తరుణంలో మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. స్వేచ్ఛాయుత, పారదర్శక మార్కెట్ కేవలం ఆర్థిక అవసరాల కోసమే కాకుండా, ప్రజాస్వామికంగానూ అవసరమేనన్నారు. ఎగుమతులు, ఇంధన, పర్యావరణ సవాళ్ల మధ్య దేశీ వృద్ధి చోదకాలపై ఎక్కువగా ఆధారపడుతున్నప్పుడు నియంత్రణలు, స్వేచ్ఛ మధ్య సరైన సమతూకం అవసమని అభిప్రాయపడ్డారు. -
దుబాయ్‌లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
దుబాయ్‌కు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ రాత్రికి రాత్రే గల్లంతైంది. రూ.కోట్ల కొద్దీ ఇన్వెస్టర్ల సొమ్ముతో ఆచూకీ లేకుండా మాయమైంది. దుబాయ్ లోని బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్‌లో అప్పటి వరకూ ఆ కంపెనీ ఉన్న ఆఫీస్ బయట ఒక బకెట్, అందులో ఒక మాప్, చెత్త సంచి మాత్రమే కనిపించాయి. కొన్ని వారాల క్రితం ఈ స్థలంలో గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ కార్యాలయం ఉండేదని, అదే ఇప్పుడు అదృశ్యమైనట్లు కనిపిస్తోందని ఖలీజ్ టైమ్స్ నివేదిక తెలిపింది.గల్లంతైన సంస్థ..గత నెల వరకు గల్ఫ్ ఫస్ట్ దుబాయ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్ 302, 305 సూట్ లలో సుమారు 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. ఔత్సాహిక ఇన్వెస్టర్లను సంప్రదించడం, ఫారెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించడం వారి పని.క్యాపిటల్ గోల్డెన్ టవర్లోని ఆ రెండు గదులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఫోన్ లైన్లు తెగిపోయి ఫ్లోర్లు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. తాళాలు తిరిగి ఇచ్చి, అన్నీ క్లియర్ చేసి హడావుడిగా వెళ్లిపోయారని క్యాపిటల్ గోల్డెన్ టవర్ సెక్యూరిటీ గార్డు ఒకరు మీడియాకు తెలిపారు. ఇప్పుడు రోజూ జనం వచ్చి వారి గురించి అడుగుతున్నారని చెప్పారు.నష్టపోయిన భారత ఇన్వెస్టర్లుగల్ఫ్ ఫస్ట్ బాధితుల్లో భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు బాధితులు చెబుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ పొయిల్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ బ్యాంకర్స్ ద్వారా 75,000 డాలర్లు అంటే రూ.64 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేసి మోసపోయారు.మరో భారతీయ ఇన్వెస్టర్ అయితే ఏకంగా 2,30,000 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లు నష్టపోయారు. ఇన్వెస్ట్ చేసే సయమంలో కంపెనీ రిలేషన్షిప్ మేనేజర్ తనతో తన మాతృ భాష కన్నడంలో మాట్లాడారని చెప్పుకొచ్చారు. మొదట చిన్న చిన్న లాభాలను చూపించి డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించిన కంపెనీ ఆ తర్వాత ఉపసంహరణలకు వీలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించారని బాధితుడు పేర్కొన్నారు.కంపెనీ సిబ్బంది తనతో మాట్లాడేటప్పుడు గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ పేర్లను మార్చి మార్చి చెప్పారని, అవి రెండూ ఒకే కంపెనీగా ఉన్నాయని 50,000 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్టపోయిన మహమ్మద్ అనే మరో ఇన్వెస్టర్ వివరించారు. రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు సిగ్మా-వన్ క్యాపిటల్ కు డీఎఫ్ఎస్ఏ లేదా ఎస్సీఏ అనుమతి లేదని నిర్ధారించారు. -
ఆర్బీఐ మరో విడత రేట్ల కోత.. 6.5% మించి వృద్ధి!
న్యూఢిల్లీ: ఆర్బీఐ త్వరలోనే మరో విడత రేట్ల కోతను చేపడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ అంచనా 6.5 శాతం మించి వృద్ధి రేటు నమోదవుతుందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) సెక్రటరీ జనరల్, సీఈవో రంజిత్ మెహతా అభిప్రాయపడ్డారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ) అందుబాటు ధరలపై రుణాలు, టెక్నాలజీ, మార్కెట్ అవకాశాల పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.ఈ అంశాలను ఆర్బీఐ తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. కనుక సమీప కాలంలోనే మరో విడత రేట్ల కోత ఉంటుందని అంచనా వేశారు. జూన్ 4–6 మధ్య ఆర్బీఐ ఎంపీసీ తదుపరి సమీక్ష జరగనుండడం గమనార్హం. ఎస్ఎంఈ మార్కెట్ సెంటిమెంట్ ఇండెక్స్ విడుదల కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ సూచీ మార్చితో ముగిసిన త్రైమాసికంలో సానుకూలంగా ఉండడం గమనార్హం. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉన్న 50 స్థాయిలోనే మార్చిలోనూ కొనసాగింది. ఎస్ఎంఈ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మాత్రం 57.7 పాయింట్లతో బలంగా నమోదైంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సానుకూల వాతావరణంలో స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో 82,021 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 410.19 పాయింట్లు (0.51 శాతం) పెరిగి 81,596.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 129.55 పాయింట్లు లేదా 0.52 శాతం లాభపడి 24,813.45 వద్ద ముగిసింది.బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు 1.87 శాతం వరకు నష్టపోయాయి.బీఎస్ఈలో ట్రేడైన 4,115 షేర్లలో 2,304 షేర్లు లాభాల్లో ముగియగా, 1,674 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.78 శాతం, 0.38 శాతం లాభాలతో ముగిశాయి.రంగాలవారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా ఎన్ ఎస్ ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు లాభాల్లో స్థిరపడగా, నిఫ్టీ రియాల్టీ, ఫార్మా సూచీలు వరుసగా 1.72 శాతం, 1.25 శాతం లాభపడ్డాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.93 శాతం పెరిగి 17.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఒకే కంపెనీలో 50,000 మందికి ప్రమోషన్
గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ జూన్ 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ సైకిల్‌ను ప్రకటించింది. ఇందులో భారతదేశంలో 15,000 మంది ఉన్నారు. ఐటీ కన్సల్టింగ్ డిమాండ్ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులపై పరిశీలన పెరగడంతో ఈ ప్రమోషన్లలో ఆరు నెలలపాటు జాప్యం జరిగింది. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు నిలిచిపోయిన ప్రమోషన్లను జూన్‌లో ప్రకటిస్తామని తెలిపింది. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ వివరాలు వెల్లడించింది.సాంప్రదాయంగా యాక్సెంచర్ డిసెంబరులో ప్రమోషన్లను ప్రకటించింది. కానీ క్లయింట్ డిమాండ్, బడ్జెట్‌కు అనుగుణంగా ప్రమోషన్ చెల్లింపులు లేకపోవడంతో ఆ సైకిల్‌ను జూన్‌కు మార్చారు. స్థిరమైన వార్షిక షెడ్యూల్ ప్రకారం కాకుండా వ్యాపార అవసరాల ఆధారంగా ఉద్యోగులను ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమోషన్లు భారతదేశంలో 15,000, యూరప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (ఈఎంఈఏ) దేశాల్లో 11,000, అమెరికాలో 10,000గా ఉండనున్నాయి.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!అధిక వృద్ధి రంగాల్లోని ఉద్యోగులకు మూల వేతన పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే బోనస్, ఈక్విటీ ఆధారిత పరిహార నిర్ణయాలను 2025 డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ విధానం యాక్సెంచర్ పనితీరును, ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడానికి అనుమతిస్తుందని చెబుతున్నారు. 2023లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ప్రపంచ ఆర్థిక సవాళ్లకు సమర్థంగా ప్రతిస్పందించడానికి, మారుతున్న కస్టమర్ డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ 19,000 ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఆర్థిక వివేకాన్ని పాటిస్తూ ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని పెంపొందించేలా కొత్త ప్రమోషన్ వ్యూహాన్ని రూపొందించింది. -
టెలిగ్రామ్ సీఈఓ.. ‘దేశం విడిచి వెళ్లకూడదు’
ముందస్తు అనుమతి లేకుండా టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఫ్రాన్స్ విడిచి వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌తో చర్చల కోసం అమెరికా వెళ్లాలని దురోవ్ ఇటీవల అధికారులను విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అభ్యర్థనను పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తోసిపుచ్చింది.పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం, దురోవ్ ప్రతిపాదిత యూఎస్ పర్యటనను ఉటంకిస్తూ ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు ‘ఈ పర్యటనకు కచ్చితంగా వెళ్లాలనేలా ఎలాంటి కారణాలు లేవు’ అని ఇటీవల తీర్పు ఇచ్చారు. 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో అరెస్టయినప్పటి నుంచి దురోవ్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన అడ్డంకులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అరెస్టు చేసినప్పటి నుంచి ఆయనను కఠినమైన చట్టపరమైన నియంత్రణలో ఉంచారు. దురోవ్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న టెలిగ్రామ్‌లో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన తనపై ఆరు క్రిమినల్ అభియోగాలు మోపారు.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!టెలిగ్రామ్ సీఈఓపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్‌ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటివి ఉన్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్‌కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు. ఫ్రాన్స్ అధికారులు 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో దురోవ్‌ను అరెస్టు చేశారు. -
టీవీఎస్ కొత్త ఈవీ త్రీవీలర్.. ధర ఎంతంటే..
టీవీఎస్ మోటార్ కంపెనీ ‘కింగ్ ఈవీ మ్యాక్స్’ అనే ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను తమిళనాడులో లాంచ్ చేసినట్లు తెలిపింది. ఈ ఈవీ త్రీవీలర్ ధర రూ.2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉందని చెప్పింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం వల్ల కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది.టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఫీచర్లుబ్యాటరీ: హై పెర్ఫార్మెన్స్ 51.2వోల్ట్ లిథియం-అయాన్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ.గరిష్ట వేగం: 60 కి.మీ/గం గరిష్ఠ వేగంతో మూడు డ్రైవింగ్ మోడ్లతో వస్తుంది. ఎకో (40 కి.మీ/గం), సిటీ (50 కి.మీ/గం), పవర్ (60 కి.మీ/గం) వేగాన్ని కలిగి ఉంది.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!స్మార్ట్ కనెక్టివిటీ: టీవీఎస్ స్మార్ట్ఎక్స్కనెక్ట్ స్మార్ట్ఫోన్ల ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వెహికల్ డయాగ్నస్టిక్స్ వివరాలు అందిస్తుంది. -
ఖరీదైన ఫ్లాట్ కొన్న శిఖర్ ధావన్.. ధర తెలిస్తే షాక్!
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. గురుగ్రామ్ (Gurugram)లోని విలాసవంతమైన ఈ ఇంటి కోసం దాదాపు రూ. 69 కోట్లు ఖర్చు చేశాడు. కాగా భారత జట్టు మాజీ ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శిఖర్ ధావన్.రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన ధావన్.. 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్లో కేవలం ఐదు ఇన్నింగ్స్‌లోనే 363 పరుగులతో సత్తా చాటి ధోని సేన ట్రోఫీని ముద్దాడేలా చేశాడు.జాతీయ జట్టు తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌ల రాకతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో 2022లో చివరగా భారత్‌కు ఆడిన ధావన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.రెండు చేతులా సంపాదన.. నికర ఆస్తి?మొత్తంగా టీమిండియా తరఫున 288 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 10867 పరుగులు సాధించాడు. ఇక ఫామ్‌లో ఉండగా రెండు చేతులా సంపాదించిన ధావన్.. ఐపీఎల్ ద్వారా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరించి తన నెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు.జాతీయ స్పోర్ట్స్ వెబ్సైట్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి శిఖర్ ధావన్ నికర ఆస్తుల విలువ రూ. 120 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక 39 ఏళ్ల ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లి చేసుకున్న గబ్బర్‌కు కుమారుడు జొరావర్ ఉన్నాడు.మరోసారి ప్రేమలో గబ్బర్అయితే, ఆయేషాతో విభేదాల కారణంగా 2023లో విడాకులు తీసుకున్నాడు. ఇక గత కొంతకాలంగా ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ అనే మహిళతో శిఖర్ ధావన్ డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట సహజీవనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గబ్బర్ గురుగ్రామ్‌లో కొత్త ఫ్లాట్ కొనడం విశేషం.గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ 5, సెక్టార్ 54, గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ధావన్ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర రూ. సుమారు 65.61 కోట్లు కాగా..స్టాంపు డ్యూటీగా రూ. 3.28 కోట్లు చెల్లించినట్లు సమాచారం.అద్బుత ఆట తీరుతోకాగా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్..టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్ సాధించాడు. ఇక టీమిండియా తరఫున 68 టీ20లలో 1759 పరుగులు చేసిన గబ్బర్.. ఐపీఎల్లో 221 ఇన్నింగ్స్‌లో 6769 పరుగులు సాధించాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఇప్పటికీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా తన అద్బుత ఆట తీరుతో కోట్లు గడించాడు ధావన్.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
ఐటీఆర్-యూ ఫైలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు
ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్-యూ (అప్డేటెడ్ రిటర్న్) ఫైలింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సవరించడానికి అధిక సమయం ఇస్తుందని తెలిపింది. అదే సమయంలో ఆలస్యంగా సమర్పించిన రిటర్న్‌లపై భారీ జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. పన్ను సమ్మతిని మెరుగుపరచడం, మోసపూరిత ఫైలింగ్‌లను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.సవరణలు ఇలా..అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇప్పటివరకు అసెస్మెంట్ ఇయర్ నుంచి 24 నెలలు గడువు ఉండేది. దాన్ని తాజాగా 48 నెలలు (4 సంవత్సరాలు)కు పెంచారు. ఇది వ్యక్తులు, వ్యాపారాలకు రిటర్న్‌ల సమయంలో తప్పులను సరిదిద్దుకోవడానికి, గతంలో ఫైల్ చేయని ఆదాయాన్ని నివేదించడానికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఆలస్యంగా ఐటీ రిటర్న్‌లను ఫైలింగ్ చేయడాన్ని కట్టడి చేసేందుకు భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.మదింపు సంవత్సరం ముగిసిన 12 నెలలలోపు ఐటీఆర్-యూ దాఖలు చేస్తే 25 శాతం పన్ను విధిస్తారు.12 నుంచి 24 నెలల్లోపు అయితే 50 శాతం పన్ను చెల్లించాలి.మూడో సంవత్సరంలో ఫైల్ చేస్తే అదనంగా 60 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.నాలుగో సంవత్సరంలో ఫైల్ చేస్తే 70 శాతం పన్ను వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 అసెస్మెంట్ ఇయర్) మొత్తం ఏడు ఐటీఆర్ ఫారాలను (ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు) ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫారాలకు సంబంధించిన ఈ-ఫైలింగ్ సదుపాయాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. రెగ్యులర్ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025-26) గడువు 2025 జులై 31గా ఉంది. -
ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్ సెషన్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,300 (22 క్యారెట్స్), రూ.97,420 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.2,200, రూ.2,400 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2,200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,400 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,420 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2,200 పెరిగి రూ.89,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,400 పెరిగి రూ.97,570 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో భారీగా మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 108 పాయింట్లు పెరిగి 24,792కు చేరింది. సెన్సెక్స్(Sensex) 364 ప్లాయింట్లు ఎగబాకి 81,560 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.57 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.38 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.39 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.38 శాతం పడిపోయింది.ఆపరేషన్ సిందూర్ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా ఇటీవల 4% లాభపడ్డాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్నటి మార్కెట్లో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..
విత్తనాలు వ్యవసాయ పరిశ్రమకు కీలకం. ఆహార ఉత్పత్తి, సుస్థిరత, వాణిజ్య లాభదాయకతలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. విత్తన ఉత్పత్తి రంగంలో నిత్యం విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు అతీతంగా బయోటెక్ ఆవిష్కరణలు, స్థిరమైన పద్ధతుల ద్వారా వీటిని ఉత్పత్తి చేసి రైతన్నలకు అధిక దిగుబడులు ఇవ్వాలని శాస్త్రవేత్తలు, కంపెనీలు, ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార డిమాండ్ పెరగడంతో విత్తన పరిశ్రమలో పెట్టుబడులు, పరిశోధనలు, మార్కెట్ పోటీ పెరుగుతోంది.మార్కెట్ ఇలా..అధిక దిగుబడి, వాతావరణ మార్పులు, పంటలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2030 నాటికి ప్రపంచ వ్యవసాయ విత్తన మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. బేయర్ క్రాప్ సైన్స్, సింజెంటా, కోర్టెవా అగ్రిసైన్స్, యూపీఎల్.. వంటి ప్రధాన సంస్థలు ఈ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే సేంద్రీయ, స్వదేశీ విత్తనాల ఉత్పత్తులపై అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు దృష్టి సారిస్తున్నాయి.వ్యాపార ధోరణులుబయోటెక్, జీఎం విత్తనాలు: జన్యుమార్పిడి (జెనటికల్లీ మాడిఫైడ్-జీఎం) విత్తనాలను తెగుళ్లు, కరువు, వ్యాధులను తట్టుకేనేందుకు ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి దిగుబడిని మెరుగుపరుస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. వీటి నియంత్రణ, వినియోగదారుల ప్రాధాన్యతల చుట్టూ వివాదాలు ఉన్నప్పటికీ జన్యుమార్పిడి విత్తనాలు ఏటా బిలియన్ల ఆదాయాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి.హైబ్రిడ్ విత్తనాలు: అధిక ఉత్పాదకత కోసం రూపొందించిన హైబ్రిడ్ విత్తనాలను వ్యవసాయంలో విరివిగా వాడుతున్నారు. ఇవి రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాయి.సేంద్రీయ, సుస్థిర విత్తనాలు: సుస్థిర వ్యవసాయం పెరగడంతో సేంద్రీయ విత్తనాలు ప్రజాదరణ పొందుతున్నాయి. పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారులను, నియంత్రణ సంస్థలను ఇవి ఆకర్షిస్తున్నాయి.శీతోష్ణస్థితిని తట్టుకునే విత్తనాలు: వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కీలకమైన వేడిని, వరదలను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు పరిశోధనలో పెట్టుబడులు పెడుతున్నాయి.ఈ-కామర్స్, డైరెక్ట్-టు-ఫార్మర్ సేల్స్: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రైతులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి అధిక నాణ్యత విత్తనాలను పొందడానికి వీలు కలుగుతుంది. మధ్యవర్తులపై ఆధారపడటాన్ని ఈ ప్లాట్‌ఫామ్‌లు తగ్గిస్తున్నాయి.పెట్టుబడి, లాభదాయకతవిత్తన కంపెనీలు ప్రత్యేక జన్యు పరీక్షలపై పేటెంట్లను పొందుతున్నాయి. దీని ద్వారా మేధో సంపత్తి హక్కులను అందిపుచ్చుకుంటూ దీర్ఘకాలిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అదనంగా ప్రభుత్వ సబ్సిడీలు, పరిశోధన గ్రాంట్లు, కార్పొరేట్ భాగస్వామ్యాల ద్వారా కంపెనీలు వాటి మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. వ్యవసాయ వృద్ధిని అందిపుచ్చుకోవాలని చూస్తున్న ఇన్వెస్టర్లు కృత్రిమ మేధ ఆధారిత బ్రీడింగ్ పద్ధతుల్లో నైపుణ్యం కలిగిన విత్తన ఉత్పత్తి స్టార్టప్‌లపై ఆసక్తి చూపుతున్నాయి. భారత విత్తన మార్కెట్ 2025 నాటికి 3.82 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. 2030 నాటికి ఇది 5.01 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో మొత్తం సాగు విస్తీర్ణంలో హైబ్రిడ్ విత్తనాలు 80.6%గా ఉన్నాయి.సవాళ్లురెగ్యులేటరీ ఆంక్షలు: జన్యుమార్పిడి విత్తనాల ఆమోదానికి సంబంధించి నియమాలు దేశాన్ని బట్టి మారుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది.అధిక పరిశోధన ఖర్చులు: కొత్త విత్తన వంగడాలను అభివృద్ధి చేయడానికి విస్తృతమైన పరిశోధన అవసరం అవుతుంది. ఇది విత్తన ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది.సరసమైన ధరలు: నాణ్యమైన విత్తనాలను చిన్న, సన్నకారు రైతులకు సరసమైన ధరలకు అందేలా చూడటం సవాలుగా మారుతుంది. దీనికితోడు బ్లాక్‌లో విత్తనాలు విక్రయించే మాఫియా ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లువ్యవసాయ విత్తనాలను బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా నిరోధించడానికి ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక పరిష్కారాలు, రైతుల్లో అవగాహన కల్పిచడం కీలకం. విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లకు కచ్చితమైన సర్టిఫికేషన్ ప్రమాణాలు ఉండేలా చూడాలి. నకిలీ విత్తన విక్రయాలకు కఠిన శిక్షలు అమలు చేయాలి. విత్తన ధ్రువీకరణకు క్యూఆర్ కోడ్లు, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఉపయోగించాలి. తక్కువ దిగుబడులు, తెగుళ్ల బెడద, చట్టపరమైన సమస్యలు వంటి బ్లాక్ మార్కెట్ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలి. -
ఐపీవోకు ఏడు కంపెనీలు రెడీ
దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల తిరిగి జోరందుకోవడంతో మరోసారి ప్రైమరీ మార్కెట్లకు జోష్ వస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలిగా ఏథర్ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించగా.. సుమారు 10 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌వైపు సాగుతున్నాయి. బొరానా వీవ్స్, బెల్రైజ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ బాటలో మరో 7 కంపెనీలు సన్నాహాలు ప్రారంభించనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ.3,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికలు అమలు చేయనున్నాయి. ఇవన్నీ 2024 అక్టోబర్– 2025 జనవరి మధ్య కాలంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..హెచ్డీఎఫ్సీ క్రెడిలాగతంలో హెచ్డీఎఫ్సీ క్రెడిలాగా కార్యకలాపాలు నిర్వహించిన క్రెడిలా ఫైనాన్షియల్ సరీ్వసెస్ కాన్ఫిడెన్షియల్(గోప్యత) పద్ధతిలో ప్రాస్పెక్టస్‌ను డిసెంబర్లో దాఖలు చేసింది. అంటే ప్రాస్పెక్టస్ వివరాలు గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. కంపెనీ ప్రధానంగా విద్యాసంబంధ రుణాలను అందిస్తోంది.శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియల్టీబాలీవుడ్ స్టార్స్‌తోపాటు.. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలియాకు పెట్టుబడులున్న శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియల్టీ ఐపీవో ద్వారా రూ. 792 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. ఐపీవో నిధుల ద్వారా అనుబంధ సంస్థలు రిచ్‌ఫీల్ రియల్టీ, ధ్యాన్ ప్రాజెక్ట్స్, త్రిక్షా రియల్టీలో పెట్టుబడులు సమకూర్చనుంది. మరికొన్ని నిధులను నిర్మాణంలో ఉన్న అమల్ఫి, ఆర్కేడియన్, వరుణ్ ప్రాజెక్టులపై వెచ్చించనుంది.యూరో ప్రతీక్వాల్ ప్యానల్ డెకొరేటివ్ పరిశ్రమలో కార్యకలాపాలు విస్తరించిన యూరో ప్రతీక్ ఐపీవో ద్వారా రూ. 730 కోట్లు అందుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో కొంతమేర విక్రయానికి ఉంచనున్నారు. మైనింగ్, లాజిస్టిక్స్ నాగ్‌పూర్ కంపెనీ కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, మెషీనరీ కొనుగోలు తదితరాలకు వినియోగించనుంది.జారో ఇన్స్టిట్యూట్ఐపీవోలో భాగంగా జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ రూ. 170 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 570 కోట్లు అందుకోవాలని చూస్తోంది. నిధులను బ్రాండ్ పటిష్టత, ప్రకటనలు, రుణ చెల్లింపులు తదితరాలకు వెచి్చంచనుంది. జెన్సన్స్ ఇండస్ట్రీస్ఐపీవోలో భాగంగా జెన్సన్స్ ఇండస్ట్రీస్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్ మరో 94.61 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలు.. తదితరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లుజెమ్ ఆరోమాటిక్స్స్పెషాలిటీ ఇన్‌గ్రెడియంట్స్ తయారీ ముంబై కంపెనీ జెమ్ ఆరోమాటిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 89.24 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
దానశీలురు ఈ కార్పొరేట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్.. టైమ్ మ్యాగజైన్ టాప్–100 దాతృత్వ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. విభిన్న కార్పొరేట్ వ్యవస్థాపకులు, దాతృత్వవాదులు సామాజిక అవసరాలకు నిధులు ఎలా కేటాయించిస్తున్నారో ఇది తెలియజేస్తుందని టైమ్ మ్యగజైన్ పేర్కొంది.ఇదీ చదవండి: పక్క దేశంలో స్టార్‌లింక్ పాగాదేశంలో అత్యధికంగా ముకేశ్, నీతా అంబానీ 2024లో రూ.407 కోట్లను విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ 2013లో విప్రో కంపెనీలోని 29 బిలియన్ డాలర్ల షేర్లను విరాళంగా ప్రకటించడాన్ని గుర్తు చేసింది. సంప్రదాయ విరాళానికి అదనంగా విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో సేవలు అందించే 940 సంస్థలకు ప్రేమ్‌జీ 2023–2024 సంవత్సరాల్లో 109 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. 2023లో జెరోదా నిఖిల్ కామత్, నితిన్ కామత్ తమ సంపదలో 25 శాతాన్ని సమాజం కోసం ప్రకటించడాన్ని టైమ్ మ్యాగజైన్ గుర్తుచేసింది. -
బ్లూచిప్స్‌లో లాభాల స్వీకరణ
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 873 పాయింట్లు పతనమై 81,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 261పాయింట్లు కోల్పోయి 24,684 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో, ఫైనాన్స్, రక్షణ రంగ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 906 పాయింట్లు క్షీణించి 81,154 వద్ద, నిఫ్టీ 275 పాయింట్లు కోల్పోయి 24,670 వద్ద కనిష్టాన్ని తాకాయి.⇒ భారీ పతనంతో మంగళవారం ఒక్కరోజే రూ.5.64 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. బీఎస్ఈలోని కంపెనీల మొత్తం విలువ రూ.438 లక్షల కోట్లకు దిగివచ్చింది. ⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 85.58 వద్ద స్థిరపడింది.పతనం ఎందుకంటే...⇒ ఆపరేషన్ సిందూర్ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా 4% లాభపడ్డాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ⇒ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెట్టాయి. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ⇒ వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రేతలుగా మారారు. అనూహ్యంగా మే 19న డీఐఐలూ అమ్మకాలకు పాల్పడ్డారు. మంగళవారం ఎఫ్ఐఐలు రూ.10,016 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. -
హిందాల్కో లాభం జూమ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 66 శాతం జంప్‌చేసి రూ. 5,284 కోట్లను తాకింది. దేశీ అమ్మకాలు పుంజుకోవడం, ముడివ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 55,994 కోట్ల నుంచి రూ. 64,890 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 10,155 కోట్ల నుంచి రూ. 16,002 కోట్లకు జంప్ చేసింది. మొత్తం ఆదాయం రూ. 2,15,962 కోట్ల నుంచి రూ. 2,38,496 కోట్లకు బలపడింది. ఈఎంఐఎల్ మైన్స్‌కు ఓకే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినట్లు హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ పేర్కొన్నారు. ఇందుకు నిలకడైన నిర్వహణ సామర్థ్యం, వ్యయ నియంత్రణకుతోడు అన్ని బిజినెస్‌లకు నెలకొన్న డిమాండ్ దోహదపడినట్లు తెలియజేశారు. ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ సొంత అనుబంధ సంస్థ ఈఎంఐఎల్ మైన్స్ మినరల్ రిసోర్సెస్ కొనుగోలుకి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు హిందాల్కో పేర్కొంది. బంధా కోల్ బ్లాకు లీజ్ హక్కులు కలిగిన ఈఎంఐఎల్ మైన్స్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది.హిందాల్కో షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 663 వద్ద ముగిసింది. -
మెడికల్ ఇంప్లాంట్.. ఫుల్ డిమాండ్..!
ముంబై: ఆర్థోపెడిక్, కార్డియాక్ ఇంప్లాంట్ల వ్యాపారం 2027–28 నాటికి 4.5–5 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.42,500 కోట్లు) విస్తరిస్తుందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశీయంగా బలమైన డిమాండ్‌కు తోడు, ఎగుమతులు క్రమంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. ఆర్థోపెడిక్, కార్డియాక్ ఇంప్లాంట్ల వ్యాపారం (ఎగుమతులు సహా) 2024 మార్చి నాటికి 2.4–2.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లో తలసరి ఆదాయం పెరుగుతుండడం, ఆరోగ్య సంరక్షణపై అవగాహనలో మార్పు, వృద్ధ జనాభా పెరుగుతుండడం, ఆరోగ్య సదుపాయాల విస్తరణ, ఆరోగ్య బీమా కవరేజీ విస్తృతి ఇవన్నీ ఈ రంగం వృద్ధికి సానుకూలిస్తాయని కేర్ఎడ్జ్ నివేదిక వివరించింది.ఇటీవలి సంవత్సరాల్లో బహళజాతి ఇంప్లాంట్ కంపెనీల కంటే దేశీ తయారీదారులే ఎక్కువ వృద్ధి చెందుతున్నట్టు పేర్కొంటూ.. పోటీతో కూడిన ధరలకుతోడు సామర్థ్యాలను సమకూర్చుకోవడాన్ని గుర్తు చేసింది. ఇంప్లాంట్లకు సంబంధించి బలమైన టెక్నాలజీ సామర్థ్యాలు అవసరమని.. ఈ విభాగాన్ని ప్రధానంగా విదేశీ ఎంఎన్‌సీలే శాసిస్తున్నట్టు తెలిపింది.అయితే దిగుమతులను భారత్ క్రమంగా తగ్గించుకుంటున్నట్టు.. దేశీ ఇంప్లాంట్ తయారీదారులు ఏటా 28 శాతం చొప్పున 2023–24 వరకు వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధిని సాధించినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో అమ్మకాలు ఏటా 12 శాతం పెరిగినట్టు పేర్కొంది. ప్రభుత్వ ప్రాయోజిత బీమా పథకాల్లో పాల్గొనడంతోపాటు పోటీ ధరల ఫలితంగా విదేశీ ఎంఎన్సీల కంటే భారతీయ కంపెనీలే అమ్మకాల్లో అధిక వృద్ధిని నమోదు చేస్తున్నట్టు వివరించింది.ఎగుమతుల్లోనూ సత్తా..గడిచిన కొన్నేళ్ల నుంచి భారత ఇంప్లాంట్ తయారీ కంపెనీలు విదేశీ ఎంఎన్‌సీలను స్థానిక మార్కెట్లో సవాలు చేయడమే కాకుండా ఎగుమతుల మార్కెట్లోనూ గట్టి పోటీనిస్తున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక వెల్లడించింది. ఇంప్లాంట్ మార్కెట్లో ఉన్న అవకాశాల నేపథ్యంలో జైడస్ లైఫ్ సైన్సెస్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ తదితర బడా ఫార్మా కంపెనీలు ఇంప్లాంట్ల తయారీ, పంపిణీపై పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న వాణిజ్యం, టారిఫ్‌ల అనిశ్చితులు, ధరలపై పరిమితుల విధింపు, నియంత్రణలను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. గుండెలో స్టెంట్లు, మోకాళ్ల చిప్పలు ఇవన్నీ కూడా ఇంప్లాంట్ల కిందకే వస్తాయి. -
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: భారతీయ మ్యూచువల్ ఫండ్ (MF) పరిశ్రమ 2025 ఆర్థిక సంవత్సరాన్ని అద్భుతమైన పనితీరుతో ముగించింది. మార్చి 2025 నాటికి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (AUM) రికార్డు స్థాయిలో రూ. 65.74 లక్షల కోట్లకు చేరుకుంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) సోమవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.సవాళ్లను అధిగమించి వృద్ధిమార్చి 2024లో రూ. 53.40 లక్షల కోట్లుగా ఉన్న AUM, 2025 మార్చి నాటికి 23.11 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. స్టాక్ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాల పట్ల నిబద్ధతతో ఉన్నారని ఈ వృద్ధి స్పష్టం చేస్తుంది.సానుకూల వృద్ధి అంచనాAMFI సీఈఓ వెంకట్ ఎన్ చలసాని మాట్లాడుతూ, "మార్కెట్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులు ప్రవేశిస్తుండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు సానుకూల వృద్ధి అంచనా ఉంది. మార్క్-టు-మార్కెట్ (MTM) లాభాలు, సంవత్సరమంతా స్థిరమైన నిధుల ప్రవాహం AUM పెరుగుదలకు దోహదపడ్డాయి" అని తెలిపారు.ఈక్విటీ, డెట్ పథకాలకు నిధుల ప్రవాహం2025 ఆర్థిక సంవత్సరంలో, దేశీయ మ్యూచువల్ ఫండ్లలోకి మొత్తం రూ. 8.15 లక్షల కోట్ల నిధులు వచ్చాయి. ఇందులో ఎక్కువ భాగం ఈక్విటీ-ఆధారిత పథకాలలోకి ప్రవహించాయి, రూ. 4.17 లక్షల కోట్ల నిధులు ఈ పథకాలను ఆకర్షించాయి. దీర్ఘకాలిక వృద్ధి పట్ల పెట్టుబడిదారుల ఆసక్తిని ఇది సూచిస్తుంది. గత మూడేళ్లుగా నిధుల అవుట్‌ఫ్లోను ఎదుర్కొంటున్న డెట్ పథకాలు, రూ. 1.38 లక్షల కోట్ల నిధులను ఆకర్షించాయి. తక్కువ వడ్డీ రేట్లు, భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు డెట్ ఫండ్లపై ఆసక్తిని పెంచాయని AMFI పేర్కొంది.పెరుగుతున్న రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యంరిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం గణనీయంగా పెరగడం ఈ నివేదికలో మరో ముఖ్యాంశం. మ్యూచువల్ ఫండ్ ఫోలియోల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 17.78 కోట్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 23.45 కోట్లకు 32 శాతం పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈక్విటీ-ఆధారిత పథకాలు అధిక శాతం ఫోలియోలను కలిగి ఉన్నాయి, వాటి సంఖ్య 33 శాతం పెరిగి 16.38 కోట్లకు చేరుకుంది. హైబ్రిడ్ పథకాలు కూడా ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించాయి. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు 48 శాతం ఫోలియోల వృద్ధితో అత్యంత వేగంగా వృద్ధి చెందాయి.సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (SIP) కీలక పాత్రఈ వృద్ధిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (SIP) కీలక పాత్ర పోషించాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో SIPల ద్వారా వచ్చిన విరాళాలు 45.24 శాతం పెరిగి రూ. 2.89 లక్షల కోట్లకు చేరాయి. ఇది పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రతిబింబించడమే కాకుండా, మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ AUMలో SIP ఆస్తుల వాటాను రూ. 13.35 లక్షల కోట్లకు, అంటే దాదాపు 20 శాతానికి పెంచింది. SIP ఖాతాల సంఖ్య, విరాళాలు రెండూ ఈ సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి.దీర్ఘకాలిక పెట్టుబడి ధోరణిపెట్టుబడిదారులు క్రమశిక్షణతో సంపదను సృష్టిస్తున్నారని సూచిస్తూ, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం SIP ఆస్తులను కలిగి ఉన్న వారి సంఖ్య పెరిగిందని AMFI పేర్కొంది. యువ పెట్టుబడిదారులు మరింత దూకుడుగా పెట్టుబడి విధానాన్ని ఇష్టపడగా, వృద్ధులు రిస్క్ నిర్వహణ, వైవిధ్యీకరణపై దృష్టి సారించినట్లు నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ ప్రాబల్యం ఇంకా తక్కువగా ఉన్నప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ పనితీరు పెట్టుబడిదారులలో పెరుగుతున్న అవగాహన, నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది. -
'ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి': ఎంపీ ట్వీట్
బెంగళూరులో ఆదివారం (మే 18) ఉదయం 8:30 గంటల నుంచి సోమవారం (మే 19) ఉదయం 8:30 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 105.5 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం నగరాన్ని అస్తవ్యస్తం చేసింది. ప్రయాణం ఇబ్బందిగా మారింది, ఆఫీసులకు వెళ్లలేక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో బెంగళూరులోని అన్ని కంపెనీలు రెండు రోజులు వర్క్ ఫ్రమ్ సదుపాయం అందించాలని బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ట్వీట్ చేశారు.భారీ వర్షాల కారణంగా.. కాగ్నిజెంట్ కంపెనీ ఈరోజు (మే 20) తన ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ.. బెంగళూరులో 40,000 మంది ఉద్యోగులను నియమించింది.ఇన్ఫోసిస్ ఇప్పటికే మూడు రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అనుసరిస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టెక్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారీ వర్షం కారణంగా, సిల్క్ బోర్డ్.. రూపేన అగ్రహార మధ్య హోసూర్ రోడ్డును బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు.All companies in Bengaluru, including Infosys, must declare two days of work from home due to rains.— P C Mohan (@PCMohanMP) May 19, 2025 -
మార్కెట్లోకి హోండా ‘రెబల్ 500’: బుకింగ్‌లు ప్రారంభం
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) ‘హోండా రెబల్ 500’ పేరుతో కొత్త మోటార్ సైకిల్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ.5.12 లక్షలు (ఎక్స్–షోరూమ్)గా ఉంది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూన్ నుంచి మొదలవుతాయి.గురుగ్రామ్, ముంబై, బెంగళూరులోని ఎంపిక చేసిన బిగ్‌వింగ్ డీలర్íÙప్లో బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ జూన్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. 471 సీసీ లిక్విడ్–కూల్డ్, 4–స్ట్రోక్, 8–వాల్వ్, ప్యారలల్ ట్విన్–సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగిన రెబల్ 500ను భారత్‌కు తీసుకురావడం సంతోషంగా ఉందని కంపెనీ ఎండీ, సీఈఓ సత్సుము ఒటానీ తెలిపారు. -
మొబైల్ ఫోన్ హ్యాక్: రూ.11.55 కోట్లు మాయం
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. అమాయక ప్రజలు మాత్రమే కాకుండా.. కొన్ని సంస్థలు కూడా వీరి మాయలో పడిపోతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించిన ఒక పెద్ద ఆన్లైన్ మోసం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో మోసగాళ్ళు ఒక కస్టమర్ మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఏకంగా రూ. 11.55 కోట్లు విత్‌డ్రా చేశారు.మోసగాళ్ళు ఒక కస్టమర్‌ను మోసగించి మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకునేలా చేశారు. దీని ద్వారా చంబా జిల్లాలోని బ్యాంక్ హల్టి బ్రాంచ్‌కు లింక్ అయిన అతని బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ లభించింది. అంతే కాకుండా బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి NEFT, RTGS లావాదేవీల ద్వారా 20 ఖాతాలకు డబ్బును బదిలీ చేశారు.ఈ స్కాముకు సంబంధించిన లావాదేవీలు మే 11, 12 తేదీలలో జరిగాయి కానీ, మే 13 సెలవు దినం కావడంతో, బ్యాంకు అధికారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లావాదేవీ నివేదిక అందిన తర్వాత మే 14న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే సిమ్లా సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..స్కామ్ బయటపడిన వెంటనే.. బ్యాంక్ అధికారులు సంబంధిత ఖాతాలను స్తంభింపజేశారు. దీనిపై లోతైన దర్యాప్తు నిర్వహించడానికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) బృందం సిమ్లాకు చేరుకోనుంది. హ్యాకర్లు ఎలా ప్రవేశించారు, బ్యాంక్ వ్యవస్థలకు ఇతర భద్రతా బలహీనతలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేయనున్నారు.డిజిటల్ బ్యాంకింగ్ మోసాలను నివారించడానికి RBI మార్గదర్శకాలు➤మీ లాగిన్ వివరాలు, పిన్, ఓటీపీ లేదా కార్డడుల సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.➤అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని ఫైల్‌లను డౌన్లోడ్ చేయడం మానుకోవాలి.➤యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి.➤బ్యాంకులకు సంబంధించిన ఏవైనా వివరాలు కావాలనుకుంటే.. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ లేదా అధికారిక వెబ్సైట్లను సందర్శించాలి. -
లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 886.65 పాయింట్లు లేదా 1.08 శాతం నష్టంతో.. 81,172.77 వద్ద, నిఫ్టీ 270.85 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టంతో 24,674.60 వద్ద నిలిచాయి.ఆల్కలీ మెటల్స్, తత్వ చింతన్ ఫార్మా కెమ్, కాప్స్టన్ సర్వీసెస్, హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, HLE గ్లాస్‌కోట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గణేష్ బెంజోప్లాస్ట్, క్వెస్ కార్ప్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, డీఓఎంఎస్ ఇండస్ట్రీస్, కొచ్చిన్ షిప్‌యార్డ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఆప్తమిత్రునికి రూ.588 కోట్లు!.. రతన్ టాటా వీలునామా
రతన్ టాటా పేరు వినగానే.. దిగ్గజ పారిశ్రామిక వేత్త, దాతృత్వానికే లెక్కకు మించిన డబ్బు వెచ్చించే దయాశీలి అని గుర్తొస్తుంది. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా వ్యవహరించిన ఈయన (రతన్ టాటా) కన్నుమూసిన తరువాత.. ఈయన ఆస్తి ఎవరికి చెందుతుంది?, వీలునామాలో ఎక్కువ వాటా ఎవరికి కేటాయించారు? అనేవి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారిపోయింది.ఇప్పటికి వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ కోసం ఎక్కువ మొత్తంలో.. రతన్ టాటా వెచ్చించారని తెలిసింది. అంతే కాకుండా తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుమీద కొంత ఆస్తిని.. జిమ్నీ నావల్ టాటాకు.. జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించినట్లు తెలిసింది.అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. రతన్ టాటా ఆప్తమిత్రుడు, తాజ్ హోటల్స్ గ్రూప్ మాజీ డైరెక్టర్ అయిన 77 ఏళ్ల 'మోహిని మోహన్ దత్తా'కు తన మిగిలిన మొత్తం ఎస్టేట్‌లో మూడింట ఒక వంతు వాటా (సుమారు రూ. 588 కోట్లు) ఇచ్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యురాలు కాకుండా భారీ మొత్తంలో రతన్ టాటా ఆస్తిని పొందిన ఏకైక వ్యక్తి మోహిని మోహన్ దత్తా.రతన్ టాటాకు చెందిన రూ. 3,900 కోట్ల విలువైన ఎస్టేట్‌ను సుమారు 20 మందికిపైగా పంచగా.. అందులో దత్తా వారసత్వ విలువపై కొందరు సందేహం వ్యక్తం చేశారు. అయితే వీలునామాలో ఉన్న 'నో కాంటెస్ట్' క్లాజ్ కారణంగా.. వీలునామాను ఎవరైనా వ్యతిరేకిస్తే వారి వాటా రద్దు అవుతుంది.ఎవరీ మోహినీ మోహన్ దత్తా?మోహినీ మోహన్ దత్తా జంషెడ్‌పూర్‌లో బాగా స్థిరపడిన వ్యాపారమైన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. 2013లో స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన తాజ్ సర్వీసెస్‌తో విలీనం చేశారు. స్టాలియన్‌లో దత్తా కుటుంబానికి 80 శాతం వాటా ఉండగా, మిగిలిన 20 శాతం వాటా టాటా ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది. మరో విషయం ఏమిటంటే మోహినీ దత్తా థామస్ కుక్ మాజీ అసోసియేట్ కంపెనీ అయిన టీసీ ట్రావెల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.ఇదీ చదవండి: పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపురతన్ టాటా - మోహినీ మోహన్ దత్తా సంబంధంకొన్ని నివేదికల ప్రకారం.. మోహినీ మోహన్ దత్తా, రతన్ టాటాతో దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగించారు. టాటా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధాల గురించి బహిరంగ చర్చలలో ఆయన పేరు ప్రముఖంగా లేకపోయినా, టాటా కుటుంబంతోపాటు ప్రైవేట్ సర్కిల్లోని ఎంపికచేయదగ్గ వ్యక్తులలో మోహినీ మోహన్ దత్తా ఒకరుగా ఉన్నారు. రతన్ టాటా టాటా తన జీవితంలో ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారని దత్తా స్వయంగా అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. -
పక్క దేశంలో స్టార్‌లింక్ పాగా
ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ యాజమాన్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్ లింక్ బంగ్లాదేశ్‌లో అధికారికంగా సేవలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గణనీయమైన పురోగతిని సూచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్, నెట్వర్క్ సమస్యలతో పోరాడుతున్న మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించాలనే లక్ష్యంతో ఈ సర్వీసులు ప్రారంభించిస్తున్నట్లు అధికారులు తెలిపారు.స్టార్ లింక్ విభిన్న యూజర్ అవసరాలను తీర్చడానికి బంగ్లాదేశ్‌లో వివిధ సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. స్టార్ లింక్ రెసిడెన్స్ ప్లాన్‌లో భాగంగా నెలకు 6,000 టాకా ధర(రూ.4,200)తో ప్రామాణిక గృహ వినియోగానికి ఇంటర్నెట్ అందిస్తున్నారు. రెసిడెన్సీ లైట్ ప్లాన్‌లో భాగంగా నెలకు 4,200 టాకా(రూ.2,900) ధరతో నెట్ సేవలు అందిస్తున్నారు. వన్ టైమ్ సెటప్ ఫీజు కింద 47,000 టాకాలు(రూ.32,000) చెల్లించాల్సి ఉంటుంది. స్టార్ లింక్ డిష్, రౌటర్‌తో సహా పరికరాల ఖర్చులు ఇందులో కవర్ అవుతాయి.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..స్టార్‌లింక్ ప్రత్యేకతలుఅంతరిక్షంలోని ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ నేరుగా భూమిపై ఉన్న వివిధ డివైజ్‌లకు చేరుతుంది.ఈ కనెక్షన్‌కు చందా కేబుల్ సర్వీస్ డైరెక్ట్ టు హోం (డీటీహెచ్)కు కట్టిన మాదిరిగా ఉంటుంది.ఇంటర్నెట్ కోసం ఈ కంపెనీ పోర్టబుల్ శాటిలైట్ డిష్ కిట్‌ను అందజేస్తుంది. దీనిని ఇంటిపై శాశ్వత పద్ధతిలో బిగించవచ్చు.ముందుగా ఇళ్లలో వైఫై రూటర్ ఆధారిత వైర్ కనెక్షన్ కలిగి ఉండాలి. దీనిని ఆ తర్వాత వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గాడ్జెట్స్‌కు జతచేయొచ్చు.ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సర్వీస్ అందించగలదు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. -
గతి తప్పుతున్న చైనా ఆధిపత్యం
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, మిలిటరీ అప్లికేషన్లతో సహా హై-టెక్ పరిశ్రమలకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ-స్కాండియం, యిట్రియం, లాంథనం, సీరియం, సెమారియం.. వంటి అరుదుగా దొరికే లోహాలు) కీలకం. దశాబ్దాలుగా చైనా ఎర్త్ మైనింగ్, లోహశుద్ధిలో ఆధిపత్య శక్తిగా ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో 70% వరకు దాదాపు అన్ని ప్రాసెసింగ్ కార్యకలాపాలను ఇది నియంత్రిస్తుంది. ఇటీవల పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆర్ఈఈకు సంబంధించి చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని ఇతర దేశాలు యోచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్ఈఈలను స్వతంత్రంగా ప్రాసెసింగ్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి.లైనాస్ రేర్ ఎర్త్స్అరుదైన లోహాల ఉత్పత్తిలో ‘లైనాస్ రేర్ ఎర్త్స్’ సంస్థ కీలకంగా మారుతుంది. ఇది చైనా వెలుపల భారీ అరుదైన లోహాల వాణిజ్య ఉత్పత్తిదారుగా ఉంది. ఆర్ఈఈ ప్రాసెసింగ్‌పై చైనా గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడంలో మలేషియా కేంద్రంగా ఈ ప్లాంట్ పని చేస్తుంది. ప్రపంచ అరుదైన లోహాల సరఫరాలకు వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా దాని పాత్రను బలోపేతం చేసుకుంటోంది. లైనాస్కు యూఎస్ ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోంది.ఇదీ చదవండి: ఈజ్ మై ట్రిప్ సీఈఓను విచారించిన ఈడీప్రత్యామ్నాయాలుచైనీస్ రేర్ ఎర్త్ సరఫరాలపై ఆధారపడటం వల్ల కలిగే ఆర్థిక, భద్రతా ప్రమాదాలను గుర్తించి అనేక దేశాలు తమ సొంత వనరులను అభివృద్ధి చేసుకుంటున్నాయి. స్థానికంగా మైనింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.అక్లారా రిసోర్సెస్ (బ్రెజిల్): యూఎస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సరఫరా చేయడానికి ఈ రేర్ ఎర్త్ గనిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచ ఆర్ఈఈ సరఫరా గొలుసులో లాటిన్ అమెరికా పాత్రను ఇది మరింత పెంచుతుందని భావిస్తున్నారు.యుకోర్ రేర్ మెటల్స్ (యూఎస్): అమెరికా రక్షణ శాఖ నిధులతో ఈ సంస్థ చైనా ప్రాసెసింగ్ పద్ధతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కొత్త సెపరేషన్ టెక్నాలజీపై పనిచేస్తోంది.ఆస్ట్రేలియా, కెనడా: ఈ దేశాలు తమ రేర్ ఎర్త్ మైనింగ్ సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తున్నాయి. బహుళ కంపెనీలు స్థానిక నిక్షేపాలను అన్వేషిస్తున్నాయి. -
నిస్సాన్ తయారీ ప్లాంట్ల మూసివేత? కంపెనీ క్లారిటీ
దేశంలోని కొన్ని తయారీ ప్లాంట్లను మూసివేస్తారని వస్తున్న వార్తలను నిస్సాన్ మోటార్ ఇండియా అధికారికంగా తోసిపుచ్చింది. తమ కార్యకలాపాలు, డీలర్లు, భాగస్వాములు, వినియోగదారులకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఇండియాలో తమ సర్వీసులపట్ల నిబద్ధతతో ఉన్నట్లు కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.తయారీ కార్యకలాపాలపై స్పష్టతనిస్సాన్ కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా మెక్సికోలో ఫ్రాంటియర్, నవరా పికప్స్ ఉత్పత్తి ఏకీకృతం చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ పుకార్లు వెలువడ్డాయి. అయితే ఈ మార్పుల వల్ల భారత తయారీ ప్లాంట్లు ప్రభావితం కావని నిస్సాన్ స్పష్టం చేసింది. భారతదేశంలో తమ వ్యాపార వ్యూహం బలంగా ఉందని, ఏ కర్మాగారంలో కార్యకలాపాలను నిలిపివేసే అధికారిక ప్రణాళికలు లేవని వాటాదారులకు హామీ ఇచ్చింది.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..రెనాల్ట్కు ఆర్ఎన్ఏఐపీఎల్ వాటామార్చి 2025లో రెనాల్ట్ గ్రూప్ రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎన్ఎఐపిఎల్)లో 51% వాటాను కొనుగోలు చేస్తుందని నిస్సాన్ ప్రకటించింది. ఈ చర్య రెనాల్ట్-నిస్సాన్ ప్రపంచ భాగస్వామ్యాన్ని కీలకం కానుందని కంపెనీ తెలిపింది. ఇది చెన్నై ఆధారిత ఉత్పత్తి కేంద్రంపై రెనాల్ట్ పూర్తి నియంత్రణను తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇదిలాఉండగా, నిస్సాన్ భారతదేశ వ్యాపారం పూర్తిగా పనిచేస్తుందని, కస్టమర్ నిమగ్నత, డీలర్షిప్ విస్తరణపై నిరంతరం దృష్టి పెడతామని కంపెనీ స్పష్టం చేసింది. -
ఈజ్ మై ట్రిప్ సీఈఓను విచారించిన ఈడీ
మహదేవ్ బెట్టింగ్‌యాప్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టిని విచారిస్తున్నట్లు తెలిపింది. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో పిట్టి ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఈ వ్యవహారంతో స్టాక్ మానిప్యులేషన్, మనీలాండరింగ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.నిషాంత్ పిట్టిపై ఆరోపణలు..అసోసియేట్ ల్యాప్‌టాప్ నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలు ద్వారా పిట్టిని అక్రమ బెట్టింగ్ ప్లాట్ ఫామ్ అయిన స్కై ఎక్స్ఛేంజ్కు ఏజెంట్‌గా గుర్తించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా మహదేవ్ బెట్టింగ్‌యాప్ ఆపరేటర్లతో సంబంధం ఉన్న డొల్ల కంపెనీలకు ఈజ్ మై ట్రిప్ చెల్లింపులు చేసిందని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ పిట్టి నివాసంలో సోదాలు నిర్వహించి రూ.7 లక్షలు స్వాధీనం చేసుకుంది. స్టాక్ ధరలను తారుమారు చేయడం, చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడం లక్ష్యంగా ఉన్న బిగ్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ లావాదేవీలు జరిగాయని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పెట్టుబడుల్లో బాద్షా ఈ దేవరపిట్టి ప్రతిస్పందననిషాంత్ పిట్టి ఈ ఆరోపణలను ఖండిస్తూ ఈడీ సూచించిన వ్యక్తులు, కంపెనీల గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. 2017 నుంచి ఈజ్ మై ట్రిప్ ఏ సంస్థలకు చెల్లింపులు చేయలేదని, పారదర్శకత, చట్టబద్ధమైన కార్యకలాపాలకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నానని, అన్ని ఆర్థిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తెలిపారు. -
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,100 (22 క్యారెట్స్), రూ.95,020 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 దిగి రూ.87,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 తగ్గి రూ.95,170 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినట్లే వెండి ధరల్లోనూ(Silver Price) మార్పులొచ్చాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే మంగళవారం కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పెట్టుబడుల్లో బాద్షా ఈ దేవర
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటనలో ప్రతిభ కనబరచడంతోపాటు పెట్టుబడులపై ఆసక్తి ఉన్న తెలివైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతున్నారు. వెండితెర ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టినప్పటికీ, అతడి ఆర్థిక చతురత, వ్యూహాత్మక పెట్టుబడులు వ్యాపార మొఘల్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా..డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అతీతంగా ఆకట్టుకునే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సుమారు రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం సహా ఆయన ఆస్తులు విభిన్న రంగాల్లో విస్తరించాయి. ఎన్టీఆర్ విలాసవంతమైన జీవనశైలికి, ఆర్థిక విజయానికి నిదర్శనంగా రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, పోర్షే, లంబోర్ఘిని ఉరుస్ వంటి హై-ఎండ్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు.సంపదను పెంచుకోవాలని, వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎన్టీఆర్ వ్యాపార మనస్తత్వం ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. రియల్ ఎస్టేట్, ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లగ్జరీ అసెట్స్‌లో ఎన్టీఆర్ విజయవంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్లు తమ వనరులన్నింటినీ ఒకే రంగంలో పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. అందుకు బదులుగా స్థిరమైన ఆర్థిక వృద్ధి కోసం బహుళ పరిశ్రమల్లో ఇన్వెస్ట్ చేయాలనే అందులో దాగిఉంది.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసుజూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ ఎండార్స్మెంట్లలో కొన్ని..మలబార్ గోల్డ్ & డైమండ్స్అప్పీ ఫిజ్బోరో ప్లస్ పౌడర్జాండు బామ్నవరత్న ఆయిల్ -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,956కు చేరింది. సెన్సెక్స్(Sensex) 38 ప్లాయింట్లు ఎగబాకి 82,085 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.38 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.53 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.44 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.09 శాతం లాభపడింది. నాస్డాక్ 0.02 శాతం ఎగబాకింది.2025లో అడపాదడపా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు ఇకపై జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ తలుపుతట్టనున్నాయి. మొత్తం మీద వచ్చే పది రోజుల్లో రూ.11,669 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధమైంది. టెక్స్టైల్ కంపెనీ బొరానా వీవ్స్ నేడు (20న) ప్రారంభమై 22న ముగుస్తుంది. ఇక పుణేకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇష్యూ 21న ఆరంభమై 23న క్లోజవుతుంది. మిగిలిన నాలుగు కంపెనీలు వచ్చే వారంలో పబ్లిక్ ఆఫర్ చేపట్టనున్నాయి. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు చెందిన స్లోస్ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్ వోప్యాక్ టెర్మినల్స్, అరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్, స్కోడా ట్యూబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారంలోనే ఈ నాలుగూ ప్రైస్ బ్యాండ్లను ప్రకటించనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యాపిల్ ఎయిర్‌పాడ్స్ కొత్త వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..
యాపిల్ 2025 సంవత్సరంలో కొత్త ఎయిర్‌పాడ్స్‌ను లాంచ్ చేసే అవకాశం లేదని ప్రముఖ టెక్ విశ్లేషకులు మింగ్-చి కువో తెలిపారు. యాపిల్ ఈ ఏడాదిలో మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రోను విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో కువో ఇలా ప్రకటనలు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసుఎయిర్పాడ్స్ ప్రో లైనప్‌కు తదుపరి అప్డేట్ వర్షన్ 2026 వరకు రాదని కువో అంచనా వేస్తున్నారు. ఎయిర్‌పాడ్స్ లైటర్ వర్షన్ మ్యాక్స్ వర్షన్ 2027లో వస్తుందని చెప్పారు. ఆడియోను మెరుగుపరచడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాలను అందించేందుకు ఉద్దేశించిన బిల్ట్-ఇన్ ఇన్ఫ్రారెడ్(ఐఆర్) కెమెరాలు రాబోయే ఎయిర్‌పాడ్ మోడల్లో ఉంచనున్నట్లు తెలిపారు. ఐఆర్ కెమెరాల అనుసంధానం రోజువారీ వేరబుల్స్‌లో అధునాతన సెన్సింగ్ టెక్నాలజీని తీసుకురావడానికి యాపిల్ ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రస్తుత ఎయిర్‌పాడ్స్ ప్రో 2 2022లో విడుదలైంది. -
మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసు
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2.1 కోట్లకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించకపోతే అసెట్స్‌తో పాటు బ్యాంకు ఖాతాలు కూడా అటాచ్ అవుతాయంటూ హెచ్చరించింది. గీతాంజలి జెమ్స్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల మీద 2022 జనవరిలో విధించిన జరిమానాను చోక్సీ చెల్లించకపోవడంతో ఈ నోటీసు జారీ అయింది. గీతాంజలి జెమ్స్ సీఎండీ అయిన చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14,000 కోట్లు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లో వారు దేశం నుంచి పరారయ్యారు. 2019లో బ్రిటన్‌లో అరెస్టయిన మోదీ ప్రస్తుతం అక్కడి జైల్లో ఉండగా, చోక్సీ బెల్జియంలో అరెస్టయ్యారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోతఇటీవల అరెస్ట్భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని ఇటీవల బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్‌లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి. -
ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోత
దేశంలోనే దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల (0.20 శాతం) మేర తగ్గించింది. ఈ నిర్ణయం ఈ నెల 16 నుంచే అమల్లోకి వచ్చింది. బ్యాంక్ వెబ్సైట్లో ఉంచిన సమాచారం మేరకు.. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు కాలవ్యవధి డిపాజిట్లపై గరిష్టంగా 6.7 శాతం రేటు ఇకమీదట లభించనుంది.మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై రేటు 6.55 శాతం అమల్లోకి వచ్చింది. 5–10 ఏళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 6.30 శాతానికి తగ్గింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్డీలపై 6.5 శాతం రేటు అమలవుతుంది. అమృత్ వర్ష్(444 రోజుల డిపాజిట్)పై రేటు 7.05 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గింది. ఇదీ చదవండి: యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!60 ఏళ్లు నిండిన, 80 ఏళ్లు నిండిన వృద్ధులకు ఎప్పటి మాదిరే వడ్డీ రేటులో అదనపు ప్రయోజనం కొనసాగనుంది. గత నెలలోనూ ఎస్బీఐ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10–25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం గమనార్హం. ఆర్బీఐ ఇప్పటివరకు రెండు విడతల్లో కలిపి అర శాతం మేర రెపో రేటును తగ్గించడంతో ఈ మేరకు డిపాజిట్ రేట్లను బ్యాంక్‌లు సర్దుబాటు చేస్తుండడం గమనార్హం. -
ఫండ్స్ ఆస్తులు రూ.65.74 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 23 శాతం పెరిగి రూ.65.74 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్కెట్ ర్యాలీతో పెట్టుబడుల విలువ పెరగడానికి తోడు, నికర పెట్టుబడుల రాక ఏయూఎం వృద్ధికి తోడ్పడింది. 2023–24 చివరికి మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం రూ.53.40 లక్షల కోట్లుగా ఉంది. ‘‘ఆస్తుల పరిమాణం పెరగడానికి మార్క్ టు మార్కెట్ (ఎంటీఎం) పెరుగుదల సానుకూలించింది. నిఫ్టీ 50 టీఆర్ఐ 6 శాతం, సెన్సెక్స్ టీఆర్ఐ 5.9 శాతం చొప్పున పెరగడం ఇందుకు దోహదం చేసింది. డెట్ విభాగంలోనూ ఎంటీఎం పెరగడం అనుకూలించింది’’అని యాంఫి తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల పథకాల్లోకి రూ.8.15 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ఫండ్స్ నిర్వహణ ఆస్తుల వృద్ధికి దారితీసింది. ముఖ్యంగా ఈక్విటీల్లోకి రికార్డు స్థాయిలో రూ.4.17 లక్షల కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లు, పెట్టుబడి ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా అన్నింటా వృద్ధి కనిపించింది. మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు 23.45 కోట్ల గరిష్టానికి చేరాయి. ఇన్వెస్టర్ల సంఖ్య 5.67 కోట్లకు పెరిగింది. 1.38 కోట్ల మంది మహిళా ఇన్వెస్టర్లు కావడం గమనార్హం. ముఖ్యంగా ఈక్విటీ పథకాలకు సంబంధించి ఫోలియోలు 33 శాతం పెరిగి 16.38 కోట్లుగా ఉన్నాయి. అంటే మొత్తం ఫోలియోల్లో ఈక్విటీ ఫోలియోలే 70 శాతం మేర ఉండడం గమనార్హం. హైబ్రిడ్ ఫండ్స్ ఫోలియోలు 16 శాతం పెరిగి 1.56 కోట్లుగా ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల (ప్యాసివ్ ఫండ్స్) ఫోలియోలు 48 శాతం పెరిగి 4.15 కోట్లుగా ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌వోల జోరు గత ఆర్థిక సంవత్సరంలో న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌వోలు) కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. 70 ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్ నుంచి రూ.85,244 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. 2023–24లో వచ్చిన ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు 58కాగా, అవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులు రూ.39,297 కోట్లుగానే ఉన్నాయి. డెట్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.1.38 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.సిప్ పెట్టుబడులు రూ.2.89 లక్షల కోట్లు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రికార్డు స్థాయిలో రూ.2.89 లక్షల కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 45 శాతం పెరిగాయి. సిప్ నిర్వహణ ఆస్తులు 24.6 శాతం పెరిగి రూ.13.35 లక్షల కోట్లకు చేరాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మొత్తం నిర్వహణ ఆస్తుల్లో సిప్ ఏయూఎం 20.31 శాతానికి పెరిగింది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 24 శాతం మేర పెరిగి 1.38 కోట్లుగా (ప్రతి నలుగురిలో ఒకరు) ఉంది. మహిళల్లోనూ ఆర్థిక స్వాతంత్య్రం, అవగాహన పెరుగుతోందని యాంఫి నివేదిక తెలిపింది. ఆర్థిక అక్షరాస్యతకు తోడు, ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లోకి నికరంగా రూ.4.17 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే రెట్టింపయ్యాయి. దీంతో ఈక్విటీ పథకాల నిర్వహణ ఆస్తుల విలువ 25 శాతానికి పైగా పెరిగి రూ.29.45 లక్షల కోట్లకు చేరుకుంది. -
క్యూ4లో వృద్ధి రేటు @ 6.9 శాతం
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇది 6.3 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) ఫిబ్రవరిలో ప్రకటించిన అంచనాల కన్నా ఇది తక్కువ. 2024–25లో తొలి మూడు త్రైమాసికాల్లో నమోదైన 6.5 శాతం, 5.6 శాతం, 6.2 శాతం వృద్ధి ప్రాతిపదికన పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం స్థాయిలో ఉండొచ్చంటూ ఎన్ఎస్వో ఫిబ్రవరిలో ప్రకటించింది. ఎన్ఎస్వో చెబుతున్న 6.5 శాతం స్థాయిలో వృద్ధి ఉండాలంటే మార్చి క్వార్టర్లో 7.6 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. క్యూ1 నుంచి క్యూ3 వరకు డేటాలో చెప్పుకోతగ్గ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటే తప్ప వృద్ధి రేటు 6.3 శాతానికి పరిమితం కావచ్చని ఇక్రా పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం, నాలుగో త్రైమాసికం ప్రొవిజనల్ అంచనాలను ఎన్ఎస్వో మే 31న విడుదల చేయనుంది. టారిఫ్లపరమైన అనిశ్చితి కారణంగా క్యూ4లో ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు హెచ్చుతగ్గులకు లోనైనట్లు ఇక్రా వివరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 9.2 శాతంగా నమోదైంది. -
బిట్‌కాయిన్‌పై స్పష్టమైన విధానం ఎందుకు లేదు?
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల నియంత్రణ విషయంలో స్పష్టమైన విధానాన్ని కేంద్రం ఎందుకు తీసుకురాలేకపోతోంది? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా, హవాలా వ్యాపారంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాంతర మార్కెట్ కలిగి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. నియంత్రణల ద్వారా క్రిప్టోకరెన్సీ ట్రేడ్లపై దృష్టి సారించొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. గుజరాత్లో బిట్‌కాయిన్ ట్రేడ్ వ్యాపారానికి సంబంధించిన కేసులో నిందితుడు శైలేష్ బాబూలాల్ భట్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసింది. 2020లో ఆర్బీఐ సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దేశంలో బిట్‌కాయిన్ ట్రేడింగ్ చట్టవిరుద్ధం కాదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. -
సుప్రీం కోర్టులో వొడాఫోన్ పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ: ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీల నుంచి మినహాయింపు కోరుతూ వొడాఫోన్, ఎయిర్టెల్, టాటా టెలీసరీ్వసెస్ దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చుంది. ఒక బహుళ జాతి కంపెనీ ఇలాంటి పిటీషన్ వేయడం తమను షాక్‌కి గురి చేసిందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ప్రభుత్వం తనంతట తాను ఏదైనా సహాయం చేయదల్చుకుంటే న్యాయస్థానం జోక్యం చేసుకోబోదని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. టెలికం సంస్థలు లైసెన్సింగ్, స్పెక్ట్రం వినియోగ ఫీజుల కింద నిర్దిష్ట మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం టెలికం సేవలతో పాటు టెల్కోలకు వచ్చే ఇతరత్రా వనరుల నుంచి కూడా వచ్చే ఆదాయాన్ని వాటి మొత్తం ఆదాయంగా (ఏజీఆర్) నిర్వచిస్తూ, దాని ప్రాతిపదికగా చెల్లింపులు జరపాలంటూ ప్రభుత్వం, న్యాయస్థానం గతంలో సూచించడం వివాదానికి దారి తీసింది. ఏజీఆర్‌పరమైన బకాయిలను తప్పుగా లెక్కించడం వల్ల తమపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగిపోతుందని, దీన్ని మినహాయించాలని లేదా పునఃసమీక్షించాలని న్యాయస్థానాన్ని టెల్కోలు ఆశ్రయించాయి. రూ. 30,000 కోట్ల బాకీల నుంచి మినహాయింపునివ్వాలంటూ వొడాఫోన్ కోరింది. గత ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వం సహాయం చేయలేకపోతోందన్న పిటీషనర్ వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచి్చంది. జూలై వరకు వాయిదా వేయాలని లేదా ఉపసంహరించుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్ధనలను పక్కన పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా సహాయం చేయదలిస్తే న్యాయస్థానం అడ్డుకోబోదని స్పష్టం చేసింది. -
ఎస్బీఐ లాభాలకు యోనో దన్ను
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ లాభాలకు డిజిటల్ విభాగం గణనీయంగా తోడ్పాటు అందిస్తోంది. ఈ విభాగం చిన్నదే అయినప్పటికీ భారీగా ప్రయోజనాలను చేకూర్చుతోందని మార్కెటింగ్ గురు, దేశీ ఫిలిప్ కోట్లర్గా పేరొందిన రాజేంద్ర శ్రీవాస్తవ విశ్లేషించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ రూ. 70,901 కోట్ల లాభం ప్రకటించింది. నికరలాభంపరంగా గ్లోబల్ టాప్ 100 కంపెనీల్లో మన దేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీల సరసన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిల్చింది. ఎస్బీఐ ఈ ఘనత సాధించడంలో, 2017లో బ్యాంక్ ఆవిష్కరించిన డిజిటల్ ప్లాట్‌ఫాం ’యూ ఓన్లీ నీడ్ వన్’ (యోనో) యాప్ కూడా కీలక పాత్ర పోషించిందని శ్రీవాస్తవ తెలిపారు. కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే యూజర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సేవలు అందించేందుకు లక్షల మంది ఉద్యోగులు, వేల సంఖ్యలో బ్రాంచీలను ఉపయోగించడం కన్నా డిజిటల్ విభాగాన్ని ఇంకా సమర్ధవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి పెడితే మరింత ప్రయోజనం లభించగలదని తెలిపారు. ‘ఎస్బీఐలో దాదాపు 50 కోట్ల ఖాతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఇంత మందికి సేవలందిస్తున్న అగ్రగామి బ్యాంకు. కానీ ఈ ఖాతాదారుల్లో 7.4 కోట్ల మంది మాత్రమే (సుమారు 14 శాతం మంది) యోనో యూజర్లు ఉన్నారు. ఈ చిన్న విభాగమే ఎస్బీఐ లాభాలకు దన్నుగా నిలుస్తోంది. తక్కువ మార్జిన్, అధిక సర్వీస్ వ్యయాలు ఉండే ఖాతాలు 37 కోట్ల పైగా ఉంటున్నాయి. అందరికీ ఆర్థిక సేవలు అందించాలన్న నినాదం కింద ప్రారంభించిన చాలా మటుకు ఖాతాల్లో బ్యాలెన్సులు తక్కువగా ఉంటున్నాయి. లేదా వినియోగంలోనే ఉండటం లేదు. వీటి వల్ల నిర్వహణ వ్యయాల భారం అధికంగా ఉంటోంది‘ అని శ్రీవాస్తవ వివరించారు. యోనోకు మరింత ప్రాధాన్యమివ్వాలి .. రికార్డు లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఎస్బీఐ పీబీ నిష్పత్తి (ప్రైస్–టు–బుక్) ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే తక్కువగా 1.4 స్థాయిలో ఉందని శ్రీవాస్తవ చెప్పారు. అదే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.8), ఐసీఐసీఐ బ్యాంకుల (3.3) మార్కెట్ వేల్యుయేషన్ అధిక స్థాయిలో ఉంటోందని వివరించారు. ఇవి డిజిటల్ మాధ్యమాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటూ, కార్యకలాపాల వ్యయాల భారాన్ని తక్కువ స్థాయికి పరిమితం చేసుకోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆర్థిక పనితీరు కన్నా, వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోలేకపోవడం వల్లే దేశీ మార్కెట్లో పోటీ సంస్థలతో పోలిస్తే ఎస్బీఐ పీబీ నిష్పత్తి డిస్కౌంట్లో ఉంటోందని శ్రీవాస్తవ విశ్లేíÙంచారు. ఈ నేపథ్యంలో యోనోను సమర్ధంగా వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఆధార్, యూపీఐ, ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీలాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడి, గ్రామీణ ప్రాంతాల వారు కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న పరిస్థితుల్లో భౌతిక శాఖల విషయంలో బ్యాంకు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.మరిన్ని ముఖ్యాంశాలు..→ ఫిన్‌టెక్ విప్లవానికి స్పందనగా 2017లో ప్రారంభించిన యోనో ఇప్పుడు ఎస్బీఐ వృద్ధి వ్యూహానికి మూలస్తంభంగా మారింది. ప్రైవేట్ దిగ్గజాలు, ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు దీటుగా 7.4 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ. 3.2 లక్షల కోట్ల రుణాల వితరణకు ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడింది. రోజువారీగా యోనోలో లాగిన్స్ 1 కోటి పైగా ఉంటాయి. ప్రస్తుతం ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి 65 శాతం లావాదేవీలు దీని ద్వారానే జరుగుతున్నాయి. యోనో కేవలం బ్యాంకింగ్కే పరిమితం కాకుండా వివిధ సర్వీసులు అందిస్తోంది. దీని ద్వారా ఖాతాలు తెరవొచ్చు, మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, బీమా పాలసీలు కొనుగోలు చేయొచ్చు, ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రభుత్వ సర్వీసులను కూడా పొందవచ్చు. → వ్యయ–ఆదాయ నిష్పత్తి, కస్టమర్లను దక్కించుకునేందుకు చేసే వ్యయాలు, అసెట్స్‌పై రాబడులు తదితర అంశాల విషయంలో డిజిటల్ బ్యాంకులు ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంకులకు మించి నిలకడగా రాణిస్తున్నాయి. భారత్‌లో పేటీఎం, ఫోన్‌పే, జీరోధాలాంటి ఫిన్‌టెక్ సంస్థలు ఒక్కసారిగా ఎగిశాయి. వాటికి భిన్నంగా ఎస్బీఐకి భారీ స్థాయి, విశ్వసనీయత, రెగ్యులేటరీ సంస్థ నుంచి మద్దతులాంటి సానుకూలాంశాలు ఉన్నాయి. ఆర్థిక సమ్మిళితత్వానికే కాకుండా పోటీపడి, రాణించేందుకు కూడా వీటిని బ్యాంకు ఉపయోగించుకోవాలి. → శాఖల నెట్వర్క్, ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయకుండానే మార్కెట్ క్యాపిటలైజేషన్ను రెట్టింపు చేసుకునే సామర్థ్యం ఎస్బీఐకి ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు యాప్‌ను మరింత చేరువ చేసి, యోనో యూజర్లను పెంచుకోవాలి. → కాస్తంత పెట్టుబడులు పెడితే, కస్టమర్లను డిజిటల్ యూజర్లుగా మార్చుకోవచ్చు. తద్వారా సేవల వ్యయాలను తగ్గించుకోవచ్చు. పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని శాఖలు, ఏటీఎంలువంటి ఆర్వోఐ (పెట్టుబడిపై రాబడి) తక్కువ స్థాయిలో ఉండే భౌతిక మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దశలవారీగా తగ్గించుకోవావాలి. అలాగే, నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాలు, లేదా లో–బ్యాలెన్స్ ఖాతాలకు సంబంధించి నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవాలి. యోనో ద్వారా మరిన్ని ఉత్పత్తులను విక్రయించవచ్చు. యోనోను అనుబంధ సాధనంగా కాకుండా కస్టమర్లకు చేరువయ్యేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక చోదకంగా పరిగణించాలి. -
మళ్లీ ఐపీఓల సందడి!
న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా కళతప్పిన ప్రైమరీ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది. 2025లో అడపాదడపా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు ఇకపై జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ తలుపుతట్టనున్నాయి. మొత్తం మీద వచ్చే పది రోజుల్లో రూ.11,669 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధమైంది. టెక్స్టైల్ కంపెనీ బొరానా వీవ్స్ నేడు (20న) ప్రారంభమై 22న ముగుస్తుంది. ఇక పుణేకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇష్యూ 21న ఆరంభమై 23న క్లోజవుతుంది. మిగిలిన నాలుగు కంపెనీలు వచ్చే వారంలో పబ్లిక్ ఆఫర్ చేపట్టనున్నాయి. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు చెందిన స్లోస్ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్ వోప్యాక్ టెరి్మనల్స్, అరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్, స్కోడా ట్యూబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారంలోనే ఈ నాలుగూ ప్రైస్ బ్యాండ్లను ప్రకటించనున్నాయి. ధరల శ్రేణి ఇలా... బొరానా వీవ్స్ రూ.144 కోట్ల సమీకరణ కోసం చేపడుతున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 205–216 ధరల శ్రేణి (ప్రైస్ బ్యాండ్) ప్రకటించింది. బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఈ ఇష్యూ ద్వారా రూ.2,150 కోట్లు సమీకరిస్తోంది. దీనికి ధరల శ్రేణి రూ. 85–90గా నిర్ణయించింది. స్లోస్ బెంగళూరు రూ.3,000 కోట్ల తాజా ఈక్విటీతో పాటు ఓఎఫ్ఎస్ ద్వారా రూ.2,000 కోట్ల ప్రమోటర్ షేర్లను కూడా విక్రయించనుంది. ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఏజిస్ వోప్యాక్ టెర్మినల్స్ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించనుంది. ఇక నిర్మాణ రంగ మెటీరియల్ సరఫరాదారు ఆరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ రూ.600 కోట్లు, స్కోడా ట్యూబ్స్ రూ.275 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.ఇప్పటిదాకా 10...: ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బకు ఈ ఏడాది మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో మన సూచీలు ఆల్‌టైమ్ గరిష్టం నుంచి దాదాపు 17 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. ఈ ప్రభావంతో కంపెనీలు ఐపీఓలకు ముఖం చాటేశాయి. 2024లో రికార్డు స్థాయిలో 91 పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1,6 లక్షల కోట్లు సమీకరించగలిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పొలోమంటూ వచి్చన ఇష్యూకల్లా సబ్స్క్రయిబ్ చేయడంతో ప్రైమరీ మార్కెట్ కళకళలాడింది. అయితే, 2025లో ఇప్పటిదాకా కేవలం 10 కంపెనీలు మాత్రమే ఐపీఓలకు వచ్చాయి. కాగా, టారిఫ్ యుద్ధానికి ట్రంప్ 90 రోజుల విరామం ప్రకటించడం.. ట్రేడ్ డీల్స్‌పై జోరుగా చర్చలు జరుగుతుండటంతో మార్కెట్లు మళ్లీ తాజా కనిష్టాల నుంచి బాగానే బౌన్స్ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్టానికి మరో 4 శాతం దూరంలోనే ఉన్నాయి. సెకండరీ మార్కెట్ దన్నుతో ఐపీఓలకు కంపెనీలు మళ్లీ ముందుకొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, సెబీ నుంచి దాదాపు 57 కంపెనీలకు ఐపీఓల కోసం దాదాపు లైన్ క్లియర్ కాగా.. మరో 74 కంపెనీల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. ఇందులో సోలార్/పునరుత్పాదక ఇంధనం నుంచి కో–వర్కింగ్ స్పేస్, ఫార్మా, హెల్త్‌కేర్, తయారీ, కెమికల్స్, రియల్టీ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఇష్యూగా నిలిచిన ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీ దాదాపు రూ.3,000 కోట్లు సమీకరించడం విదితమే. అయితే, పేలవంగా లిస్టయ్యి.. ఇప్పటికీ ఇష్యూ ధర (రూ.321) కంటే దిగువనే ఉండటం గమనార్హం.కోల్ ఇండియా సబ్సిడరీలు కూడా..ప్రభుత్వరంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాకు చెందిన రెండు అనుబంధ సంస్థలు.. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్), సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ (సీఎంపీడీఐ) ఐపీఓకు సన్నద్ధమవుతున్నాయి. ఈ రెండూ త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్లు కోల్ ఇండియా డైరెక్టర్ దేబశిష్ నందా వెల్లడించారు. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లను నియమించుకున్నామని, మార్కెట్ పరిస్థితులను బట్టి ఇష్యూ ఉంటుందని చెప్పారు. కోల్ ఇండియాకు 7 సబ్సిడరీలు ఉండగా. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80% వాటా దీని చేతిలోనే ఉంది. -
4 మెయిల్స్, 15 కాల్స్, 45 మెసేజస్: ఇంటర్వూ క్యాన్సిల్
సాధారణంగా ఒక ఉద్యోగానికి అప్లై చేసుకుంటే.. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేదా ఆ కంపెనీకి చెందిన రిక్రూటర్ కాల్ చేయడం జరుగుతుంది. అయితే ఓ అభ్యర్థి.. తనకు పదేపదే కాల్స్ వస్తున్నాయని, ఏకంగా ఒక గ్లోబల్ కంపెనీ ఇంటర్వ్యూనే వద్దనుకున్నాడు. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకున్నాను అనే శీర్షికతో.. ఓ రెడ్డిట్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో.. సోమవారం నుంచి బుధవారం మధ్య, రిక్రూటర్ నాలుగు ఈమెయిల్స్ పంపారు, 15 ఫోన్ కాల్స్ చేశారు. 45 టెక్స్ట్ మెసేజస్ చేశారు. కొన్ని మెసేజస్ రాత్రి 10 గంటల సమయంలో కూడా వచ్చాయి. అప్పటికే రిక్రూటర్‌తో మూడుసార్లు మాట్లాడాను, అవసరమైన మొత్తం సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా షేర్ చేశాను. నేను బిజీగా ఉన్నప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఒకసారి నాకు వచ్చిన ఫోన్ నెంబరుకు తిరిగి కాల్ చేస్తే.. మరెవరో సమాధానం ఇచ్చారు. దీంతో నాకు వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది.వాళ్ళ ప్రవర్తనతో ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకోవాలనిపించింది. ఆ తరువాత నేరుగా ఇంటర్వ్యూ చేసేవారికి ఈ మెయిల్ చేసాను. రిక్రూటర్‌ను బ్లాక్ చేయడానికి ముందు కూడా నాకు రెండు కాల్స్ వచ్చాయని ఆ ఉద్యోగార్థి (అభ్యర్థి) పేర్కొన్నారు. వల్ల ప్రవర్తన నన్ను అతిపెద్ద కంపెనీలలో ఒకదానికి పూర్తిగా దూరం చేసిందని పేర్కొన్నారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రిక్రూటర్ మోసగాడేమో అని ఒకరు సందేహపడగా.. వారు రిక్రూటర్‌గా కాకుండా టెలిమార్కెటర్గా ఉండి ఉంటే బాగుండేదని మరొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక -
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని, బంగారం ధరలు భారీగా పెరుగుతాయని చెప్పిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు తాజాగా రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.1998లో వాల్ స్ట్రీట్ కలిసి హెడ్జ్ ఫండ్ LTCM: లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ను బెయిల్ చేసింది. 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్ స్ట్రీట్‌ను బెయిల్ అవుట్ చేయడానికి కలిసి వచ్చాయి. 2025లో, చిరకాల స్నేహితుడు జిమ్ రికార్డ్స్, సెంట్రల్ బ్యాంకులను ఎవరు బెయిల్ అవుట్ చేయబోతున్నారని అడుగుతున్నాడు?, అని రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సంక్షోభానికి మాజీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కారణమని ఆయన ఆరోపించారు. ప్రతి సంక్షోభం పెద్దదిగా మారుతుంది, ఎందుకంటే అవి సమస్యను ఎప్పటికీ పరిష్కరించవు. 971లో నిక్సన్ యూఎస్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు ప్రారంభమైన సమస్య.. 1.6 ట్రిలియన్ డాలర్ల స్టూడెంట్ లోన్ ద్వారా ప్రేరేపితమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..నేను (రాబర్ట్ కియోసాకి) 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్లుగా.. ''ధనవంతులు డబ్బు కోసం పని చేయరు'', ''పొదుపు చేసేవారు ఓడిపోతారు''. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం డబ్బును ఆదా చేయడం కాదు. రాబోయే సంక్షోభం నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం.. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం మాత్రమే. ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు.2012లో రిచ్ డాడ్స్ ప్రాఫసీలో నేను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రాబోయే సంక్షోభం నుంచి కాపాడుకోండని రాబర్ట్ కియోసాకి తన సుదీర్ఘ ట్వీట్ ముగించారు.In 1998 Wall Street got together and bailed out a hedge fund LTCM: Long Term Capital Management.In 2008 the Cental Banks got together to bail out Wall Street.In 2025, long time friend, Jim Rickards is asking who is going to bail out the Central Banks?In other words each…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 18, 2025 -
ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..
ఇటీవల కాలంలో సైబర్ నేరాలతో పాటు.. తప్పుడు వార్తల ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులకు ముందు ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్స్ సమయాల్లో మార్పు అంటూ ఒక న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌరులు రోజుకు రూ. 10,000 వరకు సంపాదించడానికి వీలు కల్పించే ప్రాజెక్ట్‌ను ప్రారభించారనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ప్రధాని నరేంద్ర మోడీ తన కొత్త ప్రాజెక్టును ఆవిష్కరించిన తర్వాత ఏటీఎంల వద్ద పొడవైన క్యూలు ఏర్పడతాయని, దీని ద్వారా ప్రజలు రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చని, వేలమంది భారతీయులు ఇప్పటికే మొదటి నెలలో రూ. 80,000 నుంచి రూ. 3,50,000 వరకు సంపాదించారని ఒక తప్పుడు వార్త సంచలనం సృష్టించింది.ఇదీ చదవండి: పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపుదీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులు రోజుకు రూ. 10,000 వరకు సంపాదించడానికి వీలు కల్పించే ప్రాజెక్ట్‌ను ప్రారభించారనే వార్తలో ఎటువంటి నిజం లేదని, ప్రజలు దీనిని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.🕵️♂️ #Fraudulent_Website_AlertA #FAKE website is falsely claiming that Prime Minister Narendra Modi has launched a project allowing citizens to earn up to ₹10,000 per day.🔍 #PIBFactCheck📣 The Government of India has NOT made any such announcement.⚠️ Be cautious! Do NOT… pic.twitter.com/Bf1Q4BhQPb— PIB Fact Check (@PIBFactCheck) May 15, 2025 -
పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపు
సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా.. ఇల్లు కట్టుకోవడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం గడువును పొడిగిస్తూ 'మినిస్ట్రీ ఆఫ్ హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్' (MoHUA) నిర్ణయం తీసుకుంది.జూన్ 25, 2015న ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ గడువును.. 2025 డిసెంబర్ 30, 2025 వరకు పొడిగించారు. దీనివల్ల మంజూరైన ఇళ్లను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. లబ్ధిదారులు తమ గృహ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోగలరు. 2022 మార్చి 31 నాటికి మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఈ గడువును పెంచడం జరిగింది.పీఎంఏవై-యూ 2.0ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 (PMAY-U 2.0) అనేది.. పట్టణ ప్రాంతాల్లో అర్హులైన ప్రజలు ఇళ్లను నిర్మించుకోవడానికి కేంద్ర సహాయం అందించే స్కీమ్. ఆర్థికంగా వెనుకబడినవారు, తక్కువ ఆదాయ మార్గాలు ఉన్నవారు, దేశంలో ఎక్కడా సొంత పక్కా ఇల్లు లేని కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..PMAY 2.0 పథకానికి అర్హతను ఎలా చెక్ చేసుకోవాలంటే..➤https://pmay-urban.gov.in/ బ్సైట్ ఓపెన్ చేసి.. హోమ్‌పేజీలో కనిపించే.. అప్లై ఫర్ PMAY-U 2.0పై క్లిక్ చేయండి.➤సూచనలను పూర్తిగా చదివిన తరువాత.. క్లిక్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి➤మీ అర్హతను తెలుసుకోవడానికి ఫారమ్ ఫిల్ చేయండి. ➤చివరగా ఆధార్ నెంబర్, పేరును ఎంటర్ చేసిన తరువాత.. ఓటీపీ ఎంటర్ చేసి అర్హతను చెక్ చేసుకోవచ్చు. -
అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..
అసలే వేసవి కాలం.. భానుడి భగభగలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సాధారణంగా అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్లు జరుగుతుంటాయి. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని 'గుల్జార్‌హౌస్'లో జరిగిన అగ్ని ప్రమాదంలో.. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధీకుల ప్రాణనష్టాన్ని ఎలాగో పూడ్చలేరు. కానీ ఆస్తి నష్టాన్ని ముందుగానే తీసుకున్న ఇన్సూరెన్స్ ద్వారా కొంత భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా ఎలా క్లెయిమ్ చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలాబీమా కంపెనీకి సమాచారం అందించాలి: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మీ బీమా ప్రొవైడర్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే, అత్యవసర ఖర్చుల కోసం ముందస్తు ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ముఖ్యమైన వివరాలను అందించడంతో పాటు.. ఎంత నష్టం జరిగిందో అంచనా వేయండి.నష్టాన్ని డాక్యుమెంట్ చేయండి: అగ్నిప్రమాదం జరిగిన తరువాత.. స్థలాన్ని శుభ్రపరచడానికి ముందు.. అక్కడ పరిసరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయండి. కాలిన వస్తువులను పారవేయకూడదు. భీమా కంపెనీ స్పందించడానికి ముందే.. రిపేర్ చేయడం వంటి చేయకూడదు.క్లెయిమ్ ఫైల్ చేయండి: ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారాన్ని ఆన్లైన్లో లేదా బీమా కంపెనీ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మీ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నష్టాన్ని తెలియజేసే ఫోటోలు & వీడియోలు, పాడైపోయిన వస్తువుల జాబితా.. వాటి విలువను తెలిపే రసీదులు లేదా ఇన్వాయిస్లు, ఫైర్ బ్రిగేడ్ నివేదిక వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?సర్వేయర్‌తో సహకరించండి: ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది. సర్వేయర్‌కు పూర్తిగా సహకరించండి. వారికి అవసరమైన సమాచారం & పత్రాలను అందించండి. నష్టపోయిన ఆస్తిని పరిశీలించడానికి వారికి అనుమతి ఇవ్వండి.క్లెయిమ్ సెటిల్మెంట్: మీ క్లెయిమ్ ఆమోదం పొందిన తరువాత.. పాలసీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కంపెనీ చెల్లిస్తుంది. అయితే చెల్లింపు విధానం గురించి సంస్థ మీకు తెలియజేస్తుంది.Note: ఈ దశలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ నిర్దిష్ట పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీ విధానాలు కొద్దిగా మారవచ్చు. కాబట్టి, మీ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. -
లంచ్ బ్రేక్‌లో బ్యాంకింగ్ సర్వీసులు నిలిపేస్తారా..?
బ్యాంకింగ్ సర్వీసుల కోసం చాలామంది నిరంతరం బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్తుంటారు. మధ్యాహ్న భోజన సమయంలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయడం గమనిస్తుంటాం. అయితే బ్యాంకులు కూడా మధ్యాహ్నం భోజన సమయంలో మూసివేస్తారని లేదా తాత్కాలికంగా సేవలు నిలిపేస్తారని చాలామంది భావిస్తుంటారు. దాంతో బ్యాంకులో ఏదైనా పనులుంటే లంచ్‌బ్రేక్ తర్వాత వెళ్దామని అనుకుంటారు. కానీ నిబంధనల ప్రకారం బ్యాంకులకు ప్రత్యేకంగా లంచ్ బ్రేక్ ఉండదు. మరి బ్యాంకు సిబ్బంది ఏ సమయంలో భోజనం చేస్తారనే అనుమానం వస్తుంది కదూ. అయితే కింది వివరాలు చదవాల్సిందే.ఇదీ చదవండి: యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం మధ్యాహ్నం సమయంలో బ్యాంకు సిబ్బంది షిఫ్ట్‌లవారీగా భోజనం చేయాల్సి ఉంటుంది. అంతేగానీ పూర్తి బ్యాంకు సేవలు నిలిపేసి లంచ్‌కు వెళ్లకూడదు. కాబట్టి మధ్యాహ్నం బ్యాంకు పని ఉన్నవారు నిరభ్యంతరంగా బ్యాంకుకు వెళ్లవచ్చు. అయితే భోజన సమయం బ్యాంకు, బ్రాంచిను అనుసరించి మారుతుంది. సాధారణంగా మధ్యాహ్నం 1:00 గంటల నుంచి 3:00 గంటల మధ్య భోజన సమయం ఉంటుంది. ఈ సమయంలోనూ వినియోగదారులకు నిరంతర సేవలను అందిస్తారని గుర్తుంచుకోవాలి. -
యూకో బ్యాంక్ మాజీ సీఎండీ అరెస్ట్: కారణం ఇదే..
యూకో బ్యాంక్ మాజీ సీఎండీ 'సుబోధ్ కుమార్ గోయెల్'ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. బ్యాంకు రుణ మోసం కేసులో.. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (CSPL)కు రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సుబోధ్ కుమార్ గోయెల్‌ను అరెస్ట్ చేసి కోల్‌కతాలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కోర్టు ముందు ఏదీ హాజరుపరచింది. కాగా యూకో బ్యాంక్ మాజీ సీఎండీని మే 21 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపినట్లు ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.యూకో బ్యాంక్ సీఎండీగా గోయెల్ పనిచేసిన సమయంలో కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (CSPL)కు భారీ మొత్తంలో నిధులను మంజూరు చేశారు. ఇలా మంజూరైన రూ. 6,210.72 కోట్ల నిధులను ఆ సంస్థ దుర్వినియోగం చేసిందని.. సీబీఐ దర్యాప్తులో తెలిసింది. అంతే కాకూండా ఋణ మంజూరు విషయంలో.. సుబోధ్ కుమార్ గోయెల్‌ను ముడుపులు అందినట్లు కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.ఇదీ చదవండి: సంపన్న నటుడు.. టామ్ క్రూజ్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా? -
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తుంటారా? అందులోనూ వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారా? అయితే మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన అప్డేట్ ఒకటి ఉంది. ఇండియన్ రైల్వే తాజాగా ఒక పెద్ద మార్పు చేసింది. స్లీపర్ క్లాస్ టికెట్లు ఇకపై ఖాళీగా ఉన్నప్పటికీ ఫస్ట్ ఏసీకి అప్‌గ్రేడ్ అవ్వవు. ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు ఒక వేళ సీట్లు అందుబాటులో ఇతర క్లాస్‌లలో సీట్లు కేటాయించేవారు. ఇకపై ఆ సౌకర్యం ఉండదు.ఆటో అప్‌గ్రేడ్ విధానం ఎలా పనిచేస్తుందో తాజగా జారీ చేసిన సర్క్యులర్‌లో రైల్వే బోర్డు స్పష్టం చేసింది. మీరు ఒక నిర్దిష్ట తరగతిలో టికెట్ బుక్ చేసుకుంటే అందులో సీట్లు అందుబాటులో లేకపోతే మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. ఒకవేళ ఇతర ఉన్నత తరగతులలో లభ్యత ఉంటే మీ సీటు ఆటోమేటిక్‌గా ఆ క్లాస్‌లోకి అప్‌గ్రేడ్ అవుతుంది. అయితే ఇది రెండు తరగతులకు మాత్రమే.సీట్ల అప్‌గ్రేడ్ ఇలా..స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, అప్‌గ్రేడ్ కొత్త క్రమం ఇలా ఉంటుంది.. 2S → 3E → 3A → 2A → 1Aఅయితే 2ఏ ప్రయాణీకులను మాత్రమే 1ఏ (ఫస్ట్ ఏసీ)గా అప్ గ్రేడ్ చేయవచ్చని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. మీరు స్లీపర్ లేదా 3ఈలో ఉంటే ఇకపై ఫస్ట్ ఏసీకి అప్‌గ్రేడ్ కాలేరు.సీటింగ్ క్లాస్ కోచ్‌లతో అప్‌గ్రేడ్ క్రమం ఇలా ఉంటుంది.. 2S → VS → CC → EC → EV → EAఇక్కడ కూడా సీసీ (చైర్ కార్) టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈసీ, ఈవీ లేదా ఈఏ వంటి ప్రీమియం తరగతులకు అప్ గ్రేడ్ అయ్యేందుకు అర్హులు. అలాగే సీటింగ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌లకు మధ్య ఎలాంటి అప్‌గ్రేడ్‌కు అవకాశం ఉండదు.అప్‌గ్రేడ్ కోసం ఏమైనా చేయాలా?ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ‘ఓకే విత్ ఆటో అప్‌గ్రేడ్’ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ "యస్" క్లిక్ చేస్తే, మీ టిక్కెట్ అర్హత అప్‌గ్రేడ్‌కు పొందుతుంది. "నో" ఎంచుకుంటే, అప్‌గ్రేడ్ కాదు. ఒక వేళ మీరు ఏ ఆప్షన్‌నూ ఎంచుకోకపోతే సిస్టమ్ దానిని డిఫాల్ట్‌గా "యస్" గా తీసుకుంటుంది. -
యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!
భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే చాలానే యాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో దేని ప్రత్యేకత దానిదే. అయినప్పటికీ రైల్వేశాఖ మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసిన ‘స్వరైల్ యాప్’ ఆన్లైన్ రైల్వే సేవలను క్రమబద్ధీకరించడానికి ఆల్-ఇన్-వన్ రైల్వే సర్వీసులకు వేదికగా నిలుస్తుందని తెలిపింది. ఇది బహుళ రైల్వే సేవలను ఒకే యాప్‌లో ఏకీకృతం చేస్తుందని పేర్కొంది. స్వరైల్ యాప్‌లో అందిస్తున్న కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం.టికెట్ బుకింగ్: ప్లాట్‌ఫామ్ టికెట్లతో సహా రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లను నేరుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.పీఎన్ఆర్, ట్రైన్ స్టేటస్ ట్రాకింగ్: రైలు షెడ్యూళ్లు, ఆలస్యం, ప్లాట్‌ఫామ్ నంబర్లకు సంబంధించి రియల్ టైమ్ అప్డేట్లను పొందవచ్చు.రైళ్లలో ఫుడ్ ఆర్డర్లు: రైళ్లలో ఆన్లైన్లోనే భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నేరుగా మీ సీటు వద్దకే భోజనం డెలివరీ చేస్తారు.రైల్ మదద్ (కంప్లైంట్ మేనేజ్మెంట్): రైలు ప్రయాణంలో మీ సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. చేసిన ఫిర్యాదు, దాని పరిష్కారాన్ని రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు.ఇదీ చదవండి: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకు రిలయన్స్ ఏర్పాట్లుపార్సిల్, ఫ్రైట్ ఎంక్వైరీ: సరుకు రవాణాను నిర్వహించవచ్చు. పార్సిళ్లను ట్రాక్ చేయడం, సరుకు రవాణా ఖర్చులను లెక్కించడం.కోచ్ పొజిషన్ ఫైండర్: రైలు ఎక్కే సమయంలో కచ్చితంగా ఏ పొజిషన్లో మీరు ఎక్కబోయే కోచ్ నిలుస్తుందో తెలుసుకోవచ్చు.రీఫండ్ అభ్యర్థనలు: రద్దు అయిన, మిస్ అయిన ప్రయాణాల కోసం మీ చెల్లింపులపై సులభంగా రీఫండ్లను పొందేందుకు అభ్యర్థనలు పెట్టుకోవచ్చు.ఇతర భాషలు: ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్‌తోపాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.ఆర్-వాలెట్ ఇంటిగ్రేషన్: టికెట్లు, భోజనం, ఇతర సేవల కోసం సురక్షితమైన, నగదు రహిత చెల్లింపుల కోసం ఆర్-వాలెట్ ఉపయోగించవచ్చు. -
అలా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం మధ్య ఏ ఫండ్స్ మెరుగైనవి? – వీణారాణి దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన ఆ ఐదేళ్ల కాలంలోనూ మార్కెట్ సైకిల్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్‌క్యాప్ మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛతో ఉంటుంది. మార్కెట్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంలో పెట్టుబడుల ద్వారా దీన్ని చక్కగా అధిగమించగలరు. నేను అధిక పన్ను శ్లాబులోకి వస్తాను. ఎఫ్డీలపై ఆదాయం సైతం పన్ను పరిధిలోకి వస్తుంది. అత్యవసర నిధిని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – జగన్నాథ స్వామిమీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. అత్యవసర నిధిని మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొదటి భాగం అత్యవసర నిధిని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకోవచ్చు. లేదా వెంటనే నగదుగా మార్చుకోగలిగిన మరొక సాధనంలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగా ప్రత్యేక అనుకూలతలు ఏవీ లేవు. ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగా కాకుండా.. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ ఆదాయాన్ని పన్ను చెల్లింపుదా రు తన వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను పడుతుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ 2023 ఏప్రిల్ 1 తర్వాత చేసిన పెట్టుబడులను విక్రయిస్తే.. ఎంతకాలం అన్నదానితో సంబంధం లేకుండా లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఈ ఆదాయంపైనా మీరు గరిష్ట పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులిస్తాయి. కానీ, డెట్ ఫండ్స్‌లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి ఒక్కో ఇన్వెస్టర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల పెట్టుబడికి బీమా రక్షణ హామీ కూడా ఉండదు. లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
లేఆఫ్ తప్పు తెలిసొచ్చిందీ కంపెనీకి...
ఇప్పుడు ఎక్కడ చూసినా లేఆఫ్‌లు పెరిగిపోయాయి. అదేమంటే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేషన్ అంటున్నారు. ఖర్చు పేరు చెప్పి నైపుణ్యంతో పనిచేసే మానవ ఉద్యోగులను తొలగించి ఏఐ సిస్టమ్‌లతో భర్తీ చేసేస్తున్నాయి చాలా కంపెనీలు. ఇలా అన్నింటికీ ఏఐని నమ్ముకుని ఉన్న ఉద్యోగులను తొలగిస్తే ఏమవుతుందో తెలిసొచ్చిందీ స్వీడన్ కంపెనీకి...స్వీడిష్ ఫిన్‌టెక్ కంపెనీ క్లార్నా (Klarna) 2022లో ఏకంగా 700 ఉద్యోగులను తొలగించి, ఓపెన్ఏఐ (OpenAI) సహాయంతో ఏఐ (AI) వ్యవస్థలను ఉపయోగించడం ప్రారంభించింది. 2023 నాటికి, కంపెనీ మానవ ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేసింది.అప్పట్లో ఈ కంపెనీ లేఆఫ్‌లను అమలు చేసిన తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల తొలగింపులను ముందుగా రికార్డ్ చేసిన వీడియో ద్వారా ప్రకటించడం, వారి వ్యక్తిగత డేటా లీక్ చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.తప్పు తెలిసొచ్చింది..ఏఐ ఆధారిత కస్టమర్ సేవలు అంచనాలకు తగినట్లుగా ఫలితాలను ఇవ్వలేదు. ఇవి కస్టమర్ సంతృప్తి తగ్గడానికి దారితీశాయి. మరోవైపు ఉద్యోగుల తొలగింపును అధ్వానంగా నిర్వహించడం, వారి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయడం క్లార్నా ఇమేజ్ను ప్రభావితం చేసింది.అంతేకాకుండా ఆర్థికంగానూ కంపెనీకి పెద్ద దెబ్బే తగిలింది. 2021లో 45.6 బిలియన్ డాలర్లున్న క్లార్నా వ్యాల్యుయేషన్ 2022లో 6.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏఐ ఆధారిత విధానం పెట్టుబడిదారుల ఆందోళనలకు కారణమైంది.ఏఐ ఆధారిత కార్యకలాపాలు సేవా నాణ్యతను ప్రభావితం చేశాయని క్లార్నా అంగీకరించింది. లేఆఫ్‌కు వెళ్లడం తప్పేనని కంపెనీ సీఈవో సెబాస్టియన్ సీమియట్కోవ్‌స్కీ అంగీకరించారు. ఖర్చు తగ్గింపునకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని, కానీ ఇది సేవా ప్రమాణాలను దెబ్బతీసిందని ఒప్పుకొన్నారు.తిరిగి నియామకాల వైపు..నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తొలగించిన తర్వాత భారీ నష్టాన్ని చవిచూసిన క్లార్నా సంస్థ తన వైఖరి మార్చుకుంది. ఇప్పుడు మళ్లీ నియామకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కస్టమర్ సర్వీసు విభాగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులే లక్ష్యంగా రిమోట్ వర్క్ ఆఫర్ చేస్తోంది. -
అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకు రిలయన్స్ ఏర్పాట్లు
భూటాన్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు రిలయన్స్ పవర్ ఆ దేశానికి చెందిన గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 500 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.2,000 కోట్ల పెట్టుబడితో భూటాన్ పెట్టుబడి సంస్థ డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్(డీహెచ్ఐ)తో కలిసి జాయింట్ వెంచర్((50-50)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.క్లీన్ ఎనర్జీ విస్తరణభూటాన్ చాలాకాలంగా జలవిద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా నిలుస్తుంది. ఈ రంగం దాని ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదం చేస్తుంది. అయినప్పటికీ సౌర విద్యుత్‌ను విస్తరిస్తూ పునరుత్పాదక ఇంధన రంగాన్ని వైవిధ్యపరచడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. సౌరశక్తిని పెంచుకోవడం ద్వారా భూటాన్ మరింత స్థిరమైన ఇంధన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ప్రయత్నిస్తోంది.ఇదీ చదవండి: భూమార్గాల ద్వారా దిగుమతులపై భారత్ నిషేధంరిలయన్స్ పవర్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులను సమీకరిస్తోంది. ఈ జాయింట్ వెంచర్ ప్రాంతీయ ఇంధన భద్రతను పెంచుతుందని, సంప్రదాయ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, దక్షిణాసియాలో భూటాన్‌ను క్లీన్ ఎనర్జీ హబ్‌గా నిలుపుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భూమార్గాల ద్వారా దిగుమతులపై భారత్ నిషేధం
బంగ్లాదేశ్ నుంచి భూమార్గాల ద్వారా రెడీమేడ్ వస్త్రాల దిగుమతిపై భారత్ ఇటీవల నిషేధం విధించింది. ‘నవా షెవా’, ‘కోల్‌కతా సీపోర్ట్స్’ ద్వారా మాత్రమే దిగుమతులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ చర్య భారతదేశ టెక్స్టైల్ తయారీ రంగానికి ఊతమిస్తుందని, దేశీయ ఉత్పత్తిదారులకు రూ.1,000 కోట్లకు పైగా వ్యాపారాన్ని సృష్టించగలదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. స్థానిక తయారీని బలోపేతం చేయడం, విదేశీ కంపెనీలు అనుసరిస్తున్న వాణిజ్య లొసుగులను తగ్గించడం ఈ పాలసీ లక్ష్యంగా పెట్టుకున్నారు.మార్కెట్ ధరలపై ప్రభావంస్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్వల్పకాలిక సరఫరా గొలుసు అంతరాయాలకు దారితీయవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. లాజిస్టిక్స్‌లో సర్దుబాట్ల కారణంగా కొన్ని బ్రాండెడ్ వస్త్రాల ధరలు స్వల్పంగా పెరగవచ్చని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాలోని కొన్ని కంపెనీలు తమ వస్త్రాలను బంగ్లాదేశ్‌లోకి ఎగమతి చేసి, అక్కడి నుంచి సుంకం లేకుండా భారతదేశానికి ఎగుమతులు చేస్తున్నాయి. ఈ చర్యలను కట్టడి చేసేందుకు కూడా భారత్ తాజా నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలువాణిజ్య సంబంధాలుభారత్ నుంచి పత్తి, నూలు దిగుమతులపై బంగ్లాదేశ్ ఇటీవల ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిషేధం నిర్ణయం తీసుకున్నారు. రెండు దేశాల్లో మారుతున్న వాణిజ్య సంబంధాలను ఈ పరిణామాలు హైలైట్ చేస్తున్నాయి. తాజా విధానం భారతీయ వ్యాపారాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మరింత ఖరీదైన బంగారం.. నేడు తులం..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మళ్లీ ఎగిశాయి. రెండు రోజులు నిలకడగా ఉన్న పసిడి ధరలు నేడు (మే 19) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులు కాస్త ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. మే 19 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి.👉ఇది చదివారా? ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,660🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,700ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి.వెండి ధరలూ..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.1000 పెరిగి రూ.1,08,000 వద్దకు చేరింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.1000 ఎగిసి రూ. 98,000 లను తాకింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 271.17 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో.. 82,059.42 వద్ద, నిఫ్టీ 74.35 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో.. 24,945.45 వద్ద నిలిచాయి.ప్రోటీన్ ఈగోవ్ టెక్నాలజీస్, భారత్ బిజిలీ, ముకంద్, వోడాఫోన్ ఐడియా, గ్లోబల్ ఎడ్యుకేషన్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి. కయా, బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా), జొడియాక్ ఎనర్జీ, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, ఫుడ్స్ అండ్ ఇన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:41 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు నష్టపోయి 24,991కు చేరింది. సెన్సెక్స్(Sensex) 159 ప్లాయింట్లు దిగజారి 82,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.86 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.7 శాతం లాభపడింది. నాస్డాక్ 0.52 శాతం ఎగబాకింది.భారత్–పాకిస్థాన్ ఉద్రిక్తతలు, తెరవెనుక భౌగోళిక–రాజకీయ సంఘటనలు ప్రస్తుతం శాంతించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్లో మిగిలిన కంపెనీల పనితీరుపై దృష్టిసారించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనుకున్నదాని కంటే ముందుగానే కుదరవచ్చన్న ఆశాభావం నెలకొంటుంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై మరింత సానుకూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎగసిన కంపెనీల మార్కెట్ విలువ..
న్యూఢిల్లీ: బుల్ మళ్లీ రంకెలేస్తుండటంతో మార్కెట్ కళకళలాడుతోంది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 3.6 శాతం జంప్ చేయడంతో దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువలు కూడా భారీగా ఎగబాకాయి. మార్కెట్ క్యాప్ పరంగా అత్యంత విలువైన 10 కంపెనీల్లో 9 దిగ్గజాలు రూ.3.35 లక్షల కోట్లను జత చేసుకున్నాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు దూకుడుతో మార్కెట్ విలువ రూ.1.06 లక్షల కోట్లు ఎగసి, రూ. 19.71 లక్షల కోట్లకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.46,303 కోట్లు, టీసీఎస్ రూ.43,688 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.34,281 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.34,029 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.32,730 కోట్లు, ఐటీసీ రూ.15,142 కోట్లు, ఎస్బీఐ రూ.11,111 కోట్లు, హెచ్‌యూఎల్ రూ.11,054 కోట్లు చొప్పున మార్కెట్ విలువను పెంచుకున్నాయి.అయితే, భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ మాత్రం రూ.19,330 కోట్లు తగ్గింది. అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. తర్వాత ర్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.14.80 లక్షల కోట్లు), టీసీఎస్ (రూ.12.89 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.10.36 లక్షల కోట్లు), భారతీ ఎయిర్టెల్ (రూ. 10.34 లక్షల కోట్లు), ఎస్బీఐ (రూ.7.06 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.6.6 లక్షల కోట్లు), బజాజ్ ఫైనాన్స్ (రూ.5.69 లక్షల కోట్లు), హెచ్‌యూఎల్ (రూ.5.59 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.5.45 లక్షల కోట్లు) ఉన్నాయి. -
త్రీవీలర్ ఈవీలకు కేరాఫ్ భారత్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్ వరుసగా రెండో ఏడాది గుర్తింపును సొంతం చేసుకుంది. 2024లో వీటి అమ్మకాలు 20 శాతం పెరిగి 7 లక్షల యూనిట్లుగా ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది. ప్రపంచ ఈవీ మార్కెట్‌పై ఐఈఏ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్ మార్కెట్ గురించి కీలకంగా ప్రస్తావించింది.అంతర్జాతీయంగా త్రిచక్ర ఈవీల వృద్ధిలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా త్రిచక్ర వాహన అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలి్చతే 5 శాతం క్షీణించినప్పటికీ.. తిచక్ర ఈవీల విక్రయాలు మాత్రం 10 శాతం పెరిగి మిలియన్ యూనిట్లను దాటినట్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయ త్రిచక్ర వాహనాలతోపాటు త్రిచక్ర ఈవీల్లో 90 శాతం వాటా చైనా, భారత్ చేతుల్లోనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.‘‘చైనాలో తిచక్ర వాహన అమ్మకాల్లో గత మూడేళ్ల నుంచి ఈవీలు 15 శాతంలోపే ఉంటున్నాయి. 2023లో చైనాను వెనక్కి నెట్టేసి ప్రపంచ అతిపెద్ద తిచక్ర ఈవీ మార్కెట్‌గా భారత్ అవతరించింది. 2024లోనూ 7 లక్షల త్రిచక్ర ఈవీ అమ్మకాలతో అతిపెద్ద మార్కెట్ స్థానాన్ని కాపాడుకుంది’’అని ఈ నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్త త్రిచక్ర ఈవీల అమ్మకాల్లో భారత్ వాటా 57 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2023తో పోల్చి చూస్తే 3 శాతం వాటాను పెంచుకున్నట్టు తెలిపింది. పీఎం ఈ–డ్రైవ్ పథకం మద్దతును ప్రస్తావించింది. కేంద్ర సర్కారు ఈ పథకం ద్వారా ఈవీలకు సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తుండడం తెలిసిందే. ద్వి, త్రిచక్ర వాహనాలకు బడా మార్కెట్ అంతర్జాతీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాల్లో చైనా, భారత్, దక్షిణాసియా దేశాలు 80 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐఈఏ నివేదిక వెల్లడించింది. ప్రైవేటు ప్యాసింజర్ రవాణాకు ఇవి ప్రాథమిక వినియోగంగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఎలక్ట్రిక్ టూవీలర్లకు భారత్ చురుకైన మార్కెట్‌గా ఉంటోంది. 220కు పైగా ఓఈఎంలకు (వాహన తయారీ సంస్థలు) కేంద్రంగా ఉంది. 2023లో ఉన్న 180 కంటే పెరిగాయి. 2024లో మొత్తం ద్విచక్ర ఈవీల అమ్మకాలు 1.3 మిలియన్ యూనిట్లలో 80 శాతం వాటా టాప్–4 కంపెనీలు కలిగి ఉన్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది.అధిక ధరలు, తీవ్ర పోటీ సంప్రదాయ ద్విచక్ర వాహనలతో పోల్చి చూసినప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలు ధర అధికంగా ఉన్నట్టు.. అదే సమయంలో పోటీ పెరగడంతో ఓఈఎంలు అందుబాటు ధరలపై మోడళ్లను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఓలా ఎస్1ఎక్స్ మోడల్‌ను నిదర్శనంగా పేర్కొంది. 2కిలోవాట్‌హవర్ బ్యాటరీ, 6కిలోవాట్ పీక్ పవర్ సామర్థ్యంతో 70,000కే అందిస్తున్నట్టు గుర్తు చేసింది.విధానపరమైన మద్దతు (సబ్సిడీలు) కూడా సంప్రదాయ, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మధ్య ధరల అంతరాన్ని తగ్గిస్తున్నట్టు ఐఈఏ నివేదిక తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2024లో కేవలం 2 శాతం పెరిగి 1,00,000 యూనిట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ఇక ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు క్రితం ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి 35,000 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. -
బకాయిలు చెల్లించలేం బాబోయ్..
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల నుంచి ఉపశమనం కోరుతూ ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సమర్పించిన రూ.44,000 కోట్ల చెల్లింపులకు విరుద్ధంగా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఈ ఆర్థిక భారం కంపెనీని పోటీలో నిలపకుండా నియంత్రిస్తుందని, తదుపరి తరం టెక్నాలజీల్లో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కంపెనీ వాదిస్తోంది. ఇటీవల మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నుంచి ఇదే తరహా పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.ఏజీఆర్ బకాయిలుసర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్‌లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.లెక్కింపు ఇలా..టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్‌లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్‌ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.వివాదం ఏమిటంటే..ఏజీఆర్‌లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ చెల్లింపులకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలు పిటిషన్ దాఖలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ తయారీకి ఆసక్తి చూపడం లేదు: ట్రంప్కంపెనీ వాదన ఇలా..సుప్రీంకోర్టు విధించిన కఠినమైన 10 సంవత్సరాల రీపేమెంట్ టైమ్‌లైన్ కంపెనీపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుందని, నెట్వర్క్ విస్తరణ, స్పెక్ట్రమ్ పెట్టుబడులు, 6జీ టెక్నాలజీల అభివృద్ధి కోసం వనరులను కేటాయించడం కష్టమవుతుందని ఎయిర్టెల్ తెలుపుతోంది. తిరిగి చెల్లించే నిబంధనలను సుప్రీంకోర్టు, డాట్ పునఃపరిశీలించకపోతే కంపెనీల ఆర్థిక స్థిరత్వం, టెలికాం పరిశ్రమ దెబ్బతింటుందని కంపెనీ వాదిస్తుంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా వడ్డీ, జరిమానాల రూపంలో రూ.45,000 కోట్లు మాఫీ చేయాలని కోరింది. -
పదేళ్ల చరిత్ర.. సెక్షన్ 80Cలో ఎన్నో ఆప్షన్లు
ఈ సెక్షన్ 80Cలో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, ఖర్చులు ఇలా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్‌కు పదేళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు గరిష్ట పరిమితి రూ.1,00,000 ఉండేది. తరువాత రూ.1.50 లక్షలకి పెంచారు. అనంతరం ఎటువంటి మార్పులేదు. ఎప్పుటికప్పుడు ఈ పరిమితిని పెంచుతారని వదంతులు, పుకార్లు, ఎదురుచూపులు.. కానీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఈ లక్షన్నర లిమిట్ ప్రస్తుతానికి అక్కడే ఆగిపోయింది. కారణం ఏమిటంటే ఈ సెక్షన్ పాత పద్ధతిలో పన్ను భారాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే. కొత్త విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.పాతవిధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే 80C లో ఉన్న ఆప్షన్లు వర్తిస్తాయి. అవేమిటంటే ... 🔸 తన పేరు మీద, జీవిత భాగస్వామి .. పిల్లల పేర్ల మీద చెల్లించే జీవిత బీమా 🔸 డిఫర్డ్ యాన్యుటీ కోసం చేసిన చెల్లింపులు 🔸 ఈపీఎఫ్/జీపీఎఫ్/ సూపర్ యాన్యుయేషన్ ఫండ్‌కి చెల్లింపులు 🔸 సుకన్య సమృద్ధి అకౌంటులో డిపాజిట్లు 🔸 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో VIII, IX ఇష్యూలు 🔸 అయిదేళ్ల పైబడి కాలవ్యవధి కలిగిన డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్లు 🔸 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమలు 🔸 సీనియర్ సిటిజన్స్ స్కీము 2024లో పెట్టుబడులు 🔸 యూటీఐ యూలిప్ పాలసీ 1971కి జమలు, ఎల్ఐసీ జమలు 🔸 ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్‌కి జమలు 🔸 ఎల్ఐసీ యాన్యుటీ ప్లాన్/ ఇతర సంస్థల యాన్యుటీ ప్లాన్, కొత్త జీవన్‌ధార, కొత్త జీవన్ అక్షయ ఐఐ, ఐఐఐ ప్లాన్లు, జీవన్‌ధార అక్షయ 🔸 యూటీఐ స్కీం 1992/1999/2005కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ 🔸 నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) వారికి చేసిన చెల్లింపులు 🔸 బ్యాంకు/ఎల్ఐసీ/ఎన్‌హెచ్‌బీ/ ఇతర కంపెనీల నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులు 🔸 పిల్లల స్కూల్ ఫీజు చెల్లింపులు (ఇద్దరికి మాత్రమే) 🔸 ఈక్విటీ షేర్లు/డిబెంచర్ల కోసం చెల్లింపులు 🔸 షెడ్యూల్డ్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో అయిదేళ్ల కాలవ్యవధితో చేసిన డిపాజిట్లు 🔸 నాబార్డు వారు జారీ చేసిన బాండ్ల కొనుగోళ్లు 🔸 ఇన్యూరెన్స్ పాలసీ (డిఫర్డ్ యాన్యుటీ పాలసీ మినహా) 🔸 ఇంటి రిజిస్టేషన్ కోసం చెల్లించే రిజిస్టేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ చెల్లింపులు. ఇలా సెక్షన్ 80Cలో 20 అంశాలు ప్రతిపాదించారు. వీటిలో కొన్నింటికి షరతులు విధించారు. షరతులకు లోబడితేనే ఆయా అంశాల ప్రకారం మినహాయింపు ఇస్తారు. ఇతరత్రా విషయాలు.. 🔸 ప్రావిడెండ్ ఫండ్‌కి చేసే చెల్లింపులు, లోన్ రీపేమెంట్లకు ఎటువంటి మినహాయింపు రాదు. 🔸 ఇంటి రిజిస్ట్రేషన్ విషయంలో వాటా కోసం చెల్లింపు, డిపాజిట్, ఇంటికి మార్పులు, రెనోవేషన్, రిపేరు ఖర్చులకు మినహాయింపు ఇవ్వరు. 🔸 ట్యూషన్ ఫీజుకే మినహాయింపులు. డెవలప్మెంట్, డొనేషన్స్ నిమిత్తం చెల్లించినందుకు మినహాయింపులు ఇవ్వరు. 🔸 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల మీద ఆంక్షలున్నాయి. ఏడాది చెల్లింపులు సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం దాటకూడదు. 🔸 సుకన్య సమృద్ధి అకౌంటు డిపాజిట్ల మీద వడ్డీ మినహాయింపు ఉంది.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.