
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. అమాయక ప్రజలు మాత్రమే కాకుండా.. కొన్ని సంస్థలు కూడా వీరి మాయలో పడిపోతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించిన ఒక పెద్ద ఆన్‌లైన్ మోసం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో మోసగాళ్ళు ఒక కస్టమర్ మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఏకంగా రూ. 11.55 కోట్లు విత్‌డ్రా చేశారు.
మోసగాళ్ళు ఒక కస్టమర్‌ను మోసగించి మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చేశారు. దీని ద్వారా చంబా జిల్లాలోని బ్యాంక్ హల్టి బ్రాంచ్‌కు లింక్ అయిన అతని బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ లభించింది. అంతే కాకుండా బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి NEFT, RTGS లావాదేవీల ద్వారా 20 ఖాతాలకు డబ్బును బదిలీ చేశారు.
ఈ స్కాముకు సంబంధించిన లావాదేవీలు మే 11, 12 తేదీలలో జరిగాయి కానీ, మే 13 సెలవు దినం కావడంతో, బ్యాంకు అధికారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లావాదేవీ నివేదిక అందిన తర్వాత మే 14న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే సిమ్లా సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..
స్కామ్ బయటపడిన వెంటనే.. బ్యాంక్ అధికారులు సంబంధిత ఖాతాలను స్తంభింపజేశారు. దీనిపై లోతైన దర్యాప్తు నిర్వహించడానికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) బృందం సిమ్లాకు చేరుకోనుంది. హ్యాకర్లు ఎలా ప్రవేశించారు, బ్యాంక్ వ్యవస్థలకు ఇతర భద్రతా బలహీనతలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేయనున్నారు.
డిజిటల్ బ్యాంకింగ్ మోసాలను నివారించడానికి RBI మార్గదర్శకాలు
➤మీ లాగిన్ వివరాలు, పిన్, ఓటీపీ లేదా కార్డడుల సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.
➤అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం మానుకోవాలి.
➤యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి.
➤బ్యాంకులకు సంబంధించిన ఏవైనా వివరాలు కావాలనుకుంటే.. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలి.