అంకుర సంస్థల ఉద్యోగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా తమ న్యూ ఎకానమీ గ్రూప్ (ఎన్‌ఈజీ) విభాగం కింద క్యూరేటెడ్ కార్పొరేట్ శాలరీ ప్రోగ్రాంను ప్రవేశపెట్టినట్లు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
జీరో–బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్, సమగ్ర బీమా కవరేజీ, ఎక్స్‌క్లూజివ్ క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన రుణాలు మొదలైన ప్రయోజనాలు ఇందులో ఉంటాయని వివరించింది. అలాగే, ఖాతాను బట్టి ఉద్యోగులకు వార్షికంగా రూ. 46,000 నుంచి రూ. 2.4 లక్షల వరకు ఆదా చేసే స్విచ్ టు సేవ్ ఫీచర్ కూడా ఉంటుందని బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ విజయ్ మూల్‌బగల్ తెలిపారు. ప్రధానంగా జెన్ జెడ్, జెన్ ఆల్ఫా ఉద్యోగుల కోసం దీన్ని ఉద్దేశించినట్లు పేర్కొన్నారు.


