
సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా.. ఇల్లు కట్టుకోవడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం గడువును పొడిగిస్తూ 'మినిస్ట్రీ ఆఫ్ హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్' (MoHUA) నిర్ణయం తీసుకుంది.
జూన్ 25, 2015న ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ గడువును.. 2025 డిసెంబర్ 30, 2025 వరకు పొడిగించారు. దీనివల్ల మంజూరైన ఇళ్లను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. లబ్ధిదారులు తమ గృహ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోగలరు. 2022 మార్చి 31 నాటికి మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఈ గడువును పెంచడం జరిగింది.
పీఎంఏవై-యూ 2.0
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 (PMAY-U 2.0) అనేది.. పట్టణ ప్రాంతాల్లో అర్హులైన ప్రజలు ఇళ్లను నిర్మించుకోవడానికి కేంద్ర సహాయం అందించే స్కీమ్. ఆర్థికంగా వెనుకబడినవారు, తక్కువ ఆదాయ మార్గాలు ఉన్నవారు, దేశంలో ఎక్కడా సొంత పక్కా ఇల్లు లేని కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.
ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..
PMAY 2.0 పథకానికి అర్హతను ఎలా చెక్ చేసుకోవాలంటే..
➤https://pmay-urban.gov.in/ బ్‌సైట్ ఓపెన్ చేసి.. హోమ్‌పేజీలో కనిపించే.. అప్లై ఫర్ PMAY-U 2.0పై క్లిక్ చేయండి.
➤సూచనలను పూర్తిగా చదివిన తరువాత.. క్లిక్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి
➤మీ అర్హతను తెలుసుకోవడానికి ఫారమ్ ఫిల్ చేయండి.
➤చివరగా ఆధార్ నెంబర్, పేరును ఎంటర్ చేసిన తరువాత.. ఓటీపీ ఎంటర్ చేసి అర్హతను చెక్ చేసుకోవచ్చు.