
దేశీయ మార్కెట్లో సరికొత్త 'టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్' లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). నాలుగు ట్రిమ్‌లలో లభించే ఈ కొత్త కారు.. పెట్రోల్, డీజిల్, CNG అనే మూడు ఇంజన్ ఎంపికలను పొందుతుంది. కంపెనీ దీని కోసం జూన్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభిస్తుంది.
స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మంచి డిజైన్ పొందుతుంది. కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, కొత్త గ్రిల్, బంపర్‌లు, 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్, ఫ్లష్ ఫిట్టింగ్ ఇల్యూమినేటెడ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ లైట్ బార్, టీ షేప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ మొదలైనవి ఉన్నాయి. ఇది డ్యూన్ గ్లో, ఎంబర్ గ్లో, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచెస్ ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, 8 స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్‌లు, వైపర్‌లు, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ అనేవి మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతాయి.
1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ CNG ఇంజిన్స్ కలిగిన ఈ కారు మంచి పనితీరును అందిస్తుందని సమాచారం. ఇంజిన్ ఆటోమాటిక్ లేదా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతాయి. CNG వేరియంట్ ఫ్యూయెల్ మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది.