
కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల నియంత్రణ విషయంలో స్పష్టమైన విధానాన్ని కేంద్రం ఎందుకు తీసుకురాలేకపోతోంది? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా, హవాలా వ్యాపారంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాంతర మార్కెట్ కలిగి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది.
నియంత్రణల ద్వారా క్రిప్టోకరెన్సీ ట్రేడ్‌లపై దృష్టి సారించొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. గుజరాత్‌లో బిట్‌కాయిన్ ట్రేడ్ వ్యాపారానికి సంబంధించిన కేసులో నిందితుడు శైలేష్ బాబూలాల్ భట్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసింది. 2020లో ఆర్‌బీఐ సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దేశంలో బిట్‌కాయిన్ ట్రేడింగ్ చట్టవిరుద్ధం కాదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.