
ఇటీవల కాలంలో సైబర్ నేరాలతో పాటు.. తప్పుడు వార్తల ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులకు ముందు ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్స్ సమయాల్లో మార్పు అంటూ ఒక న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌరులు రోజుకు రూ. 10,000 వరకు సంపాదించడానికి వీలు కల్పించే ప్రాజెక్ట్‌ను ప్రారభించారనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ తన కొత్త ప్రాజెక్టును ఆవిష్కరించిన తర్వాత ఏటీఎంల వద్ద పొడవైన క్యూలు ఏర్పడతాయని, దీని ద్వారా ప్రజలు రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చని, వేలమంది భారతీయులు ఇప్పటికే మొదటి నెలలో రూ. 80,000 నుంచి రూ. 3,50,000 వరకు సంపాదించారని ఒక తప్పుడు వార్త సంచలనం సృష్టించింది.
ఇదీ చదవండి: పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపు
దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులు రోజుకు రూ. 10,000 వరకు సంపాదించడానికి వీలు కల్పించే ప్రాజెక్ట్‌ను ప్రారభించారనే వార్తలో ఎటువంటి నిజం లేదని, ప్రజలు దీనిని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.
🕵️♂️ #Fraudulent_Website_Alert
A #FAKE website is falsely claiming that Prime Minister Narendra Modi has launched a project allowing citizens to earn up to ₹10,000 per day.
🔍 #PIBFactCheck
📣 The Government of India has NOT made any such announcement.
⚠️ Be cautious! Do NOT… pic.twitter.com/Bf1Q4BhQPb— PIB Fact Check (@PIBFactCheck) May 15, 2025