ఓటేయకుంటే బ్యాంక్‌ అకౌంట్ల నుంచి రూ.350 కట్‌! నిజమేనా?

rs 350 deducted from bank account if dont vote pib fact check - Sakshi

ఎన్నికల్లో ఓటు వేయనివారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 పెనాల్టీ కింద భారత ఎన్నికల సంఘం (ECI) కట్‌ చేస్తుందంటూ ఇంటర్నెట్‌లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి హిందీ వార్తపత్రికలో ప్రచురితమైన ఓ వార్త క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ అవుతోంది. 

ఓటు వేయడాన్ని విస్మరించినవారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 కట్‌ అవుతుందని, సదురు వ్యక్తికి ఒకవేళ బ్యాంక్‌ అకౌంట్‌ లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి ఆ మొత్తం కట్‌ చేస్తారని ఆ న్యూస్‌  క్లిప్పింగ్‌లో ఉంది. దీన్ని కొంత మంది విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. ఓటు వేయకపోతే డబ్బులు కట్‌ అవుతాయంటూ హెచ్చరిస్తున్నారు.

(అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!)

దీనిపై ప్రభుత్వ వార్తాసంస్థ పీఐబీకి చెందిన ఫ్యాక్ట్‌చెక్‌ (pib fact check) విభాగం స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్‌ న్యూస్‌ (fake news) అని తేల్చింది. గతంలోనే సర్కులేట్‌ అయిన ఈ ఫేక్‌ న్యూస్‌ మరోసారి ప్రచారంలోకి వచ్చిందని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్‌’(ట్విటర్‌) ద్వారా పేర్కొంది.

కాగా ఈ వార్త ఓ హిందీ వార్తాపత్రికలో 2019లో ప్రచురితమైంది. హోలీ ప్రాంక్‌గా దీన్ని ప్రచురించారు. అయితే ఇది అప్పటి నుంచి  అసలైన వార్తగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ 2021లోనే క్లారిటీ ఇచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top